Health Tips : నిత్యం ఏయే హెల్త్ చెకప్స్ ముఖ్యం.. నిర్లక్ష్యం చేస్తే ఏమవుతుందంటే?
కొందరు చాలా యాక్టివ్గా ఉంటారు.కానీ ఉన్నట్టుండి అనారోగ్య సమస్యలకు గురవుతుంటారు. ప్రాబ్లమ్ మీదకు వచ్చేంతవరకు వారి శరీరంలో ఏం జరుగుతుందో వారికి తెలియదు. అందుకే ప్రతి ఆరు నెలలకు ఒకసారి రక్తపరీక్షలు చేసుకోవాలని వైద్యులు సూచిస్తున్నారు.ఏదైనా పెద్ద సమస్య వచ్చేవరకు చాలా వ్యాధులు బయటకు లక్షణాలను చూపించవు. అందుకే వాటిని "సైలెంట్ కిల్లర్స్" అని పిలుస్తుంటారు. వ్యాధులు ముదరకముందే గుర్తించడానికి క్రమం తప్పకుండా హెల్త్ చెకప్స్ అవసరం. నిర్లక్ష్యం చేస్తే ప్రాణాంతకం కావొచ్చు. బీపీ పరీక్ష తప్పకుండా చేయించుకోవాలి. 25 సంవత్సరాలు పైబడిన వారు శరీరంలో రక్త ప్రసరణ వేగం సరిగ్గా ఉందో చెక్ చేసుకోవడానికి ఈ టెస్టు ఎంతో ఉపయోగపడుతుంది. నిర్లక్ష్యం చేయడం మూలంగా అధిక రక్తపోటు (High BP) రావొచ్చు. చాలా వరకు ఎలాంటి లక్షణాలు లేకుండానే పెరుగుతుంది. దీనిని గుర్తించకపోతే గుండెపోటు (Heart Attack), పక్షవాతం (Stroke), కిడ్నీ వైఫల్యం సంభవించే ప్రమాదం ఉంటుందని నిపుణులు హెచ్చరిస్తున్నారు.
