తెలంగాణ

Inter board exams : ఇంటర్ ఫస్టియర్‌‌కు బోర్డు ఎగ్జామ్స్ ఉంటాయా? ఉండవా?

తెలంగాణలో ఇంటర్మీడియట్‌(Intermediate)‌ను విద్యాశాఖలో విలీనం చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకున్న విషయం తెలిసిందే. అయితే,వచ్చే ఏడాది అకడమిక్ నుంచి ఈ విధానం అమలులోకి రానుంది. గ్రామీణ ప్రాంతాల్లో పదో తరగతి తర్వాత చాలా మంది విద్యార్థినీవిద్యార్థులు పట్టణ ప్రాంతాలకు వెళ్లలేక మధ్యలోనే చదువు మానేస్తున్నారని, డ్రపౌట్స్ తగ్గించేందుకే ఈ నిర్ణయం తీసుకున్నట్టు రేవంత్ ప్రభుత్వం ప్రకటించింది.అయితే, ఇంటర్, విద్యాశాఖలో విలీనం అయ్యాక బోర్డు ఎగ్జామ్స్ ఉంటాయా? లేదా? అనే విషయంపై ప్రస్తుతం తీవ్ర చర్చ జరుగుతోంది.ప్రస్తుతం పదో తరగతి(SSC)కి బోర్డు పరీక్షలు జరుగుతున్నాయి. అనంతరం ఇంటర్ ఫస్టియర్, సెకండియర్‌కు సైతం బోర్డు పరీక్షలు జరుగుతున్నాయి. వచ్చే ఏడాది విద్యాశాఖలో ఇంటర్ విలీనం అయితే బోర్డు ఎగ్జామ్స్ ఉంటాయా? లేదా? అనేది తీవ్రచర్చనీయాంశంగా మారింది.పది, 12వ తరగతికి బోర్డు పరీక్షలు నిర్వహించి, 11వ తరగతికి బోర్డు పరీక్షలు నిర్వహించకుండా మినహాయిస్తారని ప్రచారం జరుగుతోంది.దీనిని పలువురు విద్యావేత్తలు తప్పుబడుతున్నారు.