తెలంగాణ

Inter board exams : ఇంటర్ ఫస్టియర్‌‌కు బోర్డు ఎగ్జామ్స్ ఉంటాయా? ఉండవా?

తెలంగాణలో ఇంటర్మీడియట్‌(Intermediate)‌ను విద్యాశాఖలో విలీనం చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకున్న విషయం తెలిసిందే. అయితే,వచ్చే ఏడాది అకడమిక్ నుంచి ఈ విధానం అమలులోకి రానుంది. గ్రామీణ ప్రాంతాల్లో పదో తరగతి తర్వాత చాలా మంది విద్యార్థినీవిద్యార్థులు పట్టణ ప్రాంతాలకు వెళ్లలేక మధ్యలోనే చదువు మానేస్తున్నారని, డ్రపౌట్స్ తగ్గించేందుకే ఈ నిర్ణయం తీసుకున్నట్టు రేవంత్ ప్రభుత్వం ప్రకటించింది.

తెలంగాణలో ఇంటర్మీడియట్‌(Intermediate)‌ను విద్యాశాఖలో విలీనం చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకున్న విషయం తెలిసిందే. అయితే,వచ్చే ఏడాది అకడమిక్ నుంచి ఈ విధానం అమలులోకి రానుంది. గ్రామీణ ప్రాంతాల్లో పదో తరగతి తర్వాత చాలా మంది విద్యార్థినీవిద్యార్థులు పట్టణ ప్రాంతాలకు వెళ్లలేక మధ్యలోనే చదువు మానేస్తున్నారని, డ్రపౌట్స్ తగ్గించేందుకే ఈ నిర్ణయం తీసుకున్నట్టు రేవంత్ ప్రభుత్వం ప్రకటించింది.అయితే, ఇంటర్, విద్యాశాఖలో విలీనం అయ్యాక బోర్డు ఎగ్జామ్స్ ఉంటాయా? లేదా? అనే విషయంపై ప్రస్తుతం తీవ్ర చర్చ జరుగుతోంది.

పది, 12లో బోర్డు పరీక్షలు..!

ప్రస్తుతం పదో తరగతి(SSC)కి బోర్డు పరీక్షలు జరుగుతున్నాయి. అనంతరం ఇంటర్ ఫస్టియర్, సెకండియర్‌కు సైతం బోర్డు పరీక్షలు జరుగుతున్నాయి. వచ్చే ఏడాది విద్యాశాఖలో ఇంటర్ విలీనం అయితే బోర్డు ఎగ్జామ్స్ ఉంటాయా? లేదా? అనేది తీవ్రచర్చనీయాంశంగా మారింది.పది, 12వ తరగతికి బోర్డు పరీక్షలు నిర్వహించి, 11వ తరగతికి బోర్డు పరీక్షలు నిర్వహించకుండా మినహాయిస్తారని ప్రచారం జరుగుతోంది.దీనిని పలువురు విద్యావేత్తలు తప్పుబడుతున్నారు.

ఇంటర్మీడియట్ విలీనం అయ్యాక 11వ తరగతికి బోర్డు పరీక్షలు వద్దని చాలా మంది అభిప్రాయపడుతున్నారని విద్యాశాఖలోని ఓ ఉన్నతాధికారి తెలిపారు. కానీ, వారి అభిప్రాయాలను ఆయన తప్పుబట్టారు. ఎందుకంటే జూనియర్ కాలేజీల్లో విద్యార్థుల హాజరు సగటున 65 శాతానికి మించడం లేదని, ఇప్పుడు 11వ తరగతి బోర్డు పరీక్షలు రద్దయితే ఈ హాజరు శాతం మరింత తగ్గే అవకాశం ఉంటుందని పేర్కొన్నారు.ఇంటర్ మొదటి సంవత్సరం ఉత్తీర్ణత శాతం 66.94 ఉండగా, బోర్డు పరీక్షలు రద్దు అయితే విద్యార్థులు పరీక్షలను తేలికగా తీసుకుంటే ఈ ఉత్తీర్ణత శాతం మరింత తగ్గుతుందని అంచనా వేశారు.

11వ తరగతి పాఠ్యాంశాలను తేలికగా తీసుకుంటే 12వ తరగతి పాఠ్యాంశాలు అర్థం కావని, ఈ రెండేళ్ల సిలబస్ ఆధారంగానే JEE మెయిన్, అడ్వాన్స్డ్, నీట్, CUET ప్రవేశ పరీక్షలు ఉంటాయని వివరించారు.అందుకే 11వ తరగతి పరీక్షలు రద్దు చేస్తే విద్యార్థులు ఆ సంవత్సరాన్ని తేలికగా తీసుకుని 12వ తరగతిలో ఎక్కువ ఒత్తిడికి లోనవుతారని వెల్లడించారు.కాగా, దీనిపై విద్యాశాఖ ఏ నిర్ణయం తీసుకోనుందో తెలియాల్సి ఉంది.

తర్వాత చదవండి