వ్యాపారం

Gold loans : వడ్డీ చెల్లిస్తారా? లోన్ మొత్తం చెల్లిస్తారా? కస్టమర్లకు బ్యాంకుల ఫోన్ కాల్స్..ఎందుకంటే?

బంగారం, వెండి ధరలు తగ్గుముఖం పట్టడంతో వాటి మీద రుణాలు తీసుకున్న వారికి బ్యాంకులు, ప్రయివేటు ఫైనాన్స్ కంపెనీలు వరుసగా కాల్స్ చేస్తున్నట్టు తెలుస్తోంది. దేశవ్యాప్తంగా ఈ వ్యవహారం హాట్ టాపిక్ అవుతోంది. గతంలో బంగారం ధర రూ.2 లక్షలకు పైగా ఎగబాకింది. వెండి సైతం కిలో రూ.4 లక్షల వరకు వెళ్లింది. అయితే, గత కొంతకాలంగా బంగారం, వెండి ధరలు క్రాష్ అవుతూ వచ్చాయి. ప్రస్తుతం బంగారం ధర 10 గ్రాములకు రూ.1.28వేల వరకు ఉండగా, వెండి కిలో రూ.1.60వేలకు పైగా కొనసాగుతోంది.అయితే, బంగారం ధర రూ.2 లక్షల వరకు ఉన్న సమయంలో బ్యాంకులు, ప్రయివేటు ఫైనాన్స్ సంస్థల్లో తాకట్టు పెట్టి రుణాలు తీసుకున్నవారికి ప్రస్తుతం వరుసగా కాల్స్ వస్తున్నట్టు సమాచారం. వడ్డీ మొత్తం ఒకేసారి చెల్లించాలని లేదా ప్రస్తుతం బంగారం ధర ఉన్న ప్రకారం లోన్లు రీషెడ్యూల్ చేసుకోవాలని బ్యాంకు అధికారులు, ఫైనాన్స్ సంస్థలు కోరుతున్నట్టు తెలిసింది.