స్వేచ్ఛ షార్ట్స్ — తాజా తెలుగు వార్తలు

TG: రూ.1,000 కోట్ల బీసీ స్టడీ సర్కిల్ భూమి ప్రైవేట్ పరం.. రేవంత్ సర్కార్‌పై దాసోజు శ్రవణ్ ధ్వజం!తెలంగాణSwechaa11 Nov 2026, 09:28 PM

TG: రూ.1,000 కోట్ల బీసీ స్టడీ సర్కిల్ భూమి ప్రైవేట్ పరం.. రేవంత్ సర్కార్‌పై దాసోజు శ్రవణ్ ధ్వజం!

TG: తెలంగాణలో బీసీ విద్యార్థుల ఉజ్వల భవిష్యత్తు కోసం ఉద్దేశించిన వేల కోట్ల విలువైన ప్రభుత్వ భూమిని రేవంత్ రెడ్డి ప్రభుత్వం అడ్డగోలుగా బడా ప్రైవేట్ సంస్థలకు కట్టబెట్టిందని బీఆర్ఎస్ సీనియర్ నేత, ఎమ్మెల్సీ డాక్టర్ దాసోజు శ్రవణ్ తీవ్రస్థాయిలో మండిపడ్డారు. పేద బహుజన బిడ్డల ఆత్మగౌరవాన్ని, వారి విద్యావకాశాలను తుంగలో తొక్కుతూ కార్పొరేట్ శక్తులకు మేలు చేస్తున్నారని ధ్వజమెత్తారు. బుధవారం హైదరాబాద్‌లో బీఆర్ఎస్ అధికార ప్రతినిధి కురువ విజయ్ కుమార్‌తో కలిసి ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన ఈ కుంభకోణానికి సంబంధించిన వివరాలను బయటపెట్టారు.హైదరాబాద్ నగరంలోని అత్యంత ఖరీదైన ప్రాంతమైన శేరిలింగంపల్లి మండలం ఖాజాగూడలోని సర్వే నెంబర్ 20/1 లో ఉన్న 3 ఎకరాల 17 గుంటల విలువైన స్థలాన్ని ‘ఎస్ఏఎస్ ఇన్‌ఫ్రా’ (SAS Infra) సంస్థకు దారాదత్తం చేశారని శ్రవణ్ ఆరోపించారు.

January 12 Vidudala: ఊహించని ప్లాన్ చేసిన అనిల్ రావిపూడి..ఏకంగా అమెరికాలో సినిమా ప్రమోషన్స్సినిమాSwechaa11 Nov 2026, 09:00 PM

January 12 Vidudala: ఊహించని ప్లాన్ చేసిన అనిల్ రావిపూడి..ఏకంగా అమెరికాలో సినిమా ప్రమోషన్స్

January 12 Vidudala: టాలీవుడ్‌లో సినిమా ప్రమోషన్స్‌కు కొత్త ఒరవడి సృష్టించిన దర్శకుడు అనిల్ రావిపూడి. తన సినిమాలను ప్రేక్షకుల్లోకి తీసుకెళ్లడంలో ఆయన ఎప్పుడూ ప్రత్యేకమైన శైలిని ఏర్పరచుకున్నారు. సాధారణంగా సినిమా విడుదలకు ముందు హైదరాబాద్, ఇతర ప్రధాన నగరాల్లో ప్రమోషన్స్ నిర్వహించడం చూశాం. కానీ, అనిల్ రావిపూడి మాత్రం ఈసారి తన ప్లాన్‌ను మరింత విస్తరించబోతున్నారు. ఏకంగా అమెరికాలోనూ సినిమా ప్రమోషన్స్ నిర్వహించాలనే ఆలోచన ప్రేక్షకుల్లో ఆసక్తిని పెంచుతోంది.

TG: భూ రీసర్వేపై సర్కార్ కీలక ఆదేశాలు.. కలెక్టర్లు ఫీల్డ్‌లోకి దిగాల్సిందే!తెలంగాణSwechaa11 Nov 2026, 08:51 PM

TG: భూ రీసర్వేపై సర్కార్ కీలక ఆదేశాలు.. కలెక్టర్లు ఫీల్డ్‌లోకి దిగాల్సిందే!

TG: తెలంగాణలో భూ సమస్యలకు శాశ్వత పరిష్కారం చూపేందుకు చేపట్టిన సమగ్ర భూ రీసర్వే ప్రక్రియపై రేవంత్ రెడ్డి ప్రభుత్వం దూకుడు పెంచింది. ఉన్నతాధికారులు కేవలం సచివాలయం, కలెక్టరేట్లలోని ఏసీ గదులకే పరిమితం కాకుండా నేరుగా రైతుల వద్దకు క్షేత్రస్థాయిలోకి వెళ్లాల్సిందేనని ప్రభుత్వం తేల్చిచెప్పింది. రాష్ట్రంలో జరుగుతున్న భూ రీసర్వే ప్రక్రియను జిల్లా కలెక్టర్లు నిరంతరం పర్యవేక్షించాలని, స్వయంగా గ్రామాల్లో పర్యటించి రైతుల సందేహాలను నివృత్తి చేయాలని రెవెన్యూ, సమాచార, గృహనిర్మాణ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి కఠిన ఆదేశాలు జారీ చేశారు. బుధవారం డాక్టర్ బీఆర్ అంబేద్కర్ సచివాలయం నుంచి జిల్లా కలెక్టర్లు, అదనపు కలెక్టర్లు, ఆర్డీవోలతో రీసర్వే, హౌసింగ్ అంశాలపై మంత్రి సుదీర్ఘ వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు.

Jagga Reddy: సోనియాగాంధీ ఆత్మకథపై సినిమా తీస్తాడట.. అవసరమా జగ్గారెడ్డి?తెలంగాణSwechaa11 Nov 2026, 08:38 PM

Jagga Reddy: సోనియాగాంధీ ఆత్మకథపై సినిమా తీస్తాడట.. అవసరమా జగ్గారెడ్డి?

Jagga Reddy: రాజకీయాల్లో హైలైట్ అవ్వడానికి నేతలు రకరకాల వేషాలు వేస్తుంటారు, లేనిపోని స్టేట్‌మెంట్లు ఇస్తుంటారు. అయితే సంగారెడ్డి మాజీ ఎమ్మెల్యే జగ్గారెడ్డి చేసిన తాజా ప్రకటన చూస్తే మాత్రం కాంగ్రెస్ శ్రేణులే అవాక్కవుతున్నాయి. కాంగ్రెస్ అగ్రనేత సోనియా గాంధీ రాసిన ఆత్మకథ ‘బిలాంగింగ్: ఎ జర్నీ ఆఫ్ లవ్’ ఆధారంగా తాను తెలుగులో ఒక భారీ సినిమా తీయబోతున్నట్లు జగ్గారెడ్డి ప్రకటించారు. అంతేకాదు, సంగారెడ్డి కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలే దీనికి నిర్మాతలని, నాయకులంతా డబ్బులు రెడీ చేసుకోవాలని హుకుం జారీ చేశారు. సీఎం రేవంత్ రెడ్డి, పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ చేతుల మీదుగా షూటింగ్ ప్రారంభిస్తామని చెప్పుకొచ్చారు. పైకి ఇది అధినేత్రిపై ఉన్న అభిమానంలా కనిపిస్తున్నా.. అసలు విషయం హైకమాండ్ మెప్పు పొంది మైలేజ్ సాధించడమేనని పార్టీ వర్గాల్లోనే గుసగుసలు వినిపిస్తున్నాయి. కానీ, ఈ టైమ్‌లో ఇలాంటి ప్రకటనలు జగ్గారెడ్డికి అవసరమా అన్నదే ఇప్పుడు మిలియన్ డాలర్ల ప్రశ్న.

ఈసారి వచ్చేది బీజేపీ ప్రభుత్వమే- డీకే అరుణతెలంగాణSwechaa11 Nov 2026, 07:26 PM

ఈసారి వచ్చేది బీజేపీ ప్రభుత్వమే- డీకే అరుణ

DK Aruna: పార్లమెంట్ ఎన్నికల్లో ఎంత ఒత్తిడి ఉన్నా సీఎం నియోజకవర్గంతో పాటు ఏడుగురు కాంగ్రెస్ ఎమ్మెల్యేలు ఉన్నప్పటికీ ప్రజలు బీజేపీని గెలిపించారని ఎంపీ డీకే అరుణ అన్నారు. వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో ప్రతి నియోజకవర్గంలో బీజేపీ గెలుపే లక్ష్యంగా ఇప్పటి నుంచే పని చేయాలని పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు. హామీల అమలులో కాంగ్రెస్ సర్కార్ పూర్తిగా వైఫల్యం చెందిందని ఆమె మండిపడ్డారు. క్షేత్రస్థాయిలో కాంగ్రెస్ వైఫల్యాలపై పోరాటం చేయాలన్నారు. కేంద్రం నిధులతోనే గ్రామాలలో అభివృద్ధి జరుగుతుందని డీకే అరుణ స్పష్టం చేశారు. కేంద్రం అమలు చేస్తున్న సంక్షేమ, అభివృద్ధి పథకాలను ప్రజలకు వివరించాలని పార్టీ శ్రేణులతో చెప్పారు.

TG:తెలంగాణలో వచ్చే ఏడాది నుంచే 10+2 విధానం.. రేవంత్‌ ఆదేశాలుతెలంగాణSwechaa11 Nov 2026, 07:02 PM

TG:తెలంగాణలో వచ్చే ఏడాది నుంచే 10+2 విధానం.. రేవంత్‌ ఆదేశాలు

TG: తెలంగాణలో ఏళ్ల తరబడి కొనసాగుతున్న ఇంటర్మీడియట్ విద్యావిధానానికి ప్రభుత్వం స్వస్తి పలకబోతోందా? అంటే అవుననే సంకేతాలే బలంగా కనిపిస్తున్నాయి. రాష్ట్ర విద్యావ్యవస్థలో పెనుమార్పులకు శ్రీకారం చుట్టిన రేవంత్ సర్కార్, ప్రత్యేక జూనియర్ కాలేజీల వ్యవస్థ స్థానంలో పాఠశాలల్లోనే ‘10+2’ విధానాన్ని తీసుకొచ్చేందుకు పక్కా కార్యాచరణ సిద్ధం చేసింది. వచ్చే విద్యా సంవత్సరం నుంచే ఈ సరికొత్త 10+2 విధానాన్ని అమలు చేసేందుకు అవసరమైన అన్ని చర్యలు తీసుకోవాలని సీఎం రేవంత్ రెడ్డి విద్యాశాఖ అధికారులను ఆదేశించారు. బుధవారం సచివాలయంలో విద్యాశాఖపై నిర్వహించిన ఉన్నత స్థాయి సమీక్షలో సీఎం ఈ కీలక ఆదేశాలు జారీ చేశారు.

Tollywood: మేకా రోషన్ ఇప్పుడు సూపర్ హీరో..ఇంద్రగంటి ప్లాన్ ఏంటీ.!సినిమాSwechaa11 Nov 2026, 06:57 PM

Tollywood: మేకా రోషన్ ఇప్పుడు సూపర్ హీరో..ఇంద్రగంటి ప్లాన్ ఏంటీ.!

Tollywood: ఈ మధ్య కాలంలో మన టాలీవుడ్‌లో సూపర్ హీరో సినిమాల ట్రెండ్ మంచి ఊపు మీదుంది. ఈ జానర్‌లో వస్తున్న సినిమాలు బాక్సాఫీస్ వద్ద మంచి విజయాలను అందుకుంటున్నాయి. ఇప్పటికే యువ హీరో తేజ సజ్జా నటించిన హనుమాన్, మిరాయ్ వంటి సినిమాలు భారీ సక్సెస్ సాధించాయి. దీంతో, ఈ జానర్‌పై ప్రేక్షకుల్లో ఆసక్తి బాగా పెరిగింది. ఇప్పుడు మరో యంగ్ హీరో సూపర్ హీరోగా ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధమవుతున్నాడు. అతనెవరో కాదు శ్రీకాంత్ తనయుడు రోషన్ మేకా.

TG: రూ.400 కోట్లతో రెసిడెన్షియల్‌ స్కూళ్లు.. ప్రపంచంతో పోటీ పడేలా క్లాసులు : భట్టి విక్రమార్కతెలంగాణSwechaa11 Nov 2026, 06:39 PM

TG: రూ.400 కోట్లతో రెసిడెన్షియల్‌ స్కూళ్లు.. ప్రపంచంతో పోటీ పడేలా క్లాసులు : భట్టి విక్రమార్క

G: తెలంగాణలోని ప్రతి పేద విద్యార్థి ప్రపంచంలోని అగ్రదేశాల పిల్లలతో సమానంగా పోటీపడేలా విద్యావ్యవస్థను సమూలంగా మారుస్తున్నామని డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క స్పష్టం చేశారు. సీఎం రేవంత్‌రెడ్డి నేతృత్వంలోని ప్రభుత్వం విద్యారంగానికి అత్యంత ప్రాధాన్యతనిస్తోందని, అందులో భాగంగానే రాష్ట్రవ్యాప్తంగా రూ.400 కోట్ల భారీ వ్యయంతో సకల సౌకర్యాలతో కూడిన ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ పాఠశాలలను నిర్మిస్తున్నామని వెల్లడించారు.హనుమకొండ జిల్లా పశ్చిమ నియోజకవర్గ పరిధిలోని కాజీపేట విద్యానగర్‌లో రూ.10 కోట్ల వ్యయంతో నిర్మించనున్న 'తెలంగాణ పబ్లిక్ స్కూల్' నిర్మాణానికి బుధవారం డిప్యూటీ సీఎం శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా జరిగిన సభలో భట్టి మాట్లాడుతూ.. 'యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ స్కూల్స్' ప్రాజెక్టులో భాగంగా నియోజకవర్గానికి ఒకటి చొప్పున అత్యాధునిక రెసిడెన్షియల్ పాఠశాలలను సర్కారు ఏర్పాటు చేస్తోందన్నారు. ప్రపంచంలోని మొదటి పది అగ్రదేశాలతో ఇక్కడి విద్యా ప్రమాణాలు పోటీపడేలా వీటిని తీర్చిదిద్దుతున్నట్లు చెప్పారు.

Tollywood: విశ్వంభర ఆగిపోలేదు..ఇదుగో ప్రూఫ్సినిమాSwechaa11 Nov 2026, 06:31 PM

Tollywood: విశ్వంభర ఆగిపోలేదు..ఇదుగో ప్రూఫ్

Tollywood: మెగాస్టార్ చిరంజీవి నటిస్తున్న భారీ సోషియో ఫాంటసీ చిత్రం విశ్వంభర. ఈ సినిమా గురించి గత కొంతకాలంగా రకరకాల వార్తలు ఫిల్మ్ నగర్‌లో వినిపిస్తున్న సంగతి తెలిసిందే. సినిమా షూటింగ్ పూర్తి కాకుండానే ఆగిపోయిందని, విడుదల విషయంలో స్పష్టత లేదని, అసలు ఈ ప్రాజెక్ట్ ముందుకు వెళ్తుందా లేదా అనే సందేహాలు కూడా వ్యక్తమవుతున్నాయి. అయితే, ఈ వార్తలకు చెక్ పెట్టేలా డబ్బింగ్ వర్క్ జరుగుతున్నట్టుగా అప్‌డేట్ వచ్చి షాకిచ్చింది.

Parliament Session: పార్లమెంట్ ఇంకా నడుస్తూనే ఉందా? తెరపైకి ‘ఆర్టికల్ 85(1)’ పవర్..NationalSwechaa11 Nov 2026, 05:40 PM

Parliament Session: పార్లమెంట్ ఇంకా నడుస్తూనే ఉందా? తెరపైకి ‘ఆర్టికల్ 85(1)’ పవర్..

Parliament Session: సాధారణంగా పార్లమెంట్ సమావేశాలను ఉభయ సభాపతులు నిరవధికంగా వాయిదా వేసిన రెండు, మూడు రోజుల్లోనే రాష్ట్రపతి భవన్ నుంచి ‘ప్రోరోగ్‌’ (సమావేశాల ముగింపు) నోటిఫికేషన్ విడుదలవుతుంది. కానీ, ఈసారి ఢిల్లీ వేదికగా దేశ పార్లమెంటరీ చరిత్రలోనే ఎన్నడూ చూడని విచిత్ర పరిణామం తెరపైకి వచ్చింది. వర్షాకాల సమావేశాలు ఆగస్టు 13న నిరవధికంగా వాయిదా పడి దాదాపు మూడు నెలలు గడిచినా, ఇంతవరకు రాష్ట్రపతి నుంచి ముగింపు ప్రకటన వెలువడలేదు. ఫలితంగా గత 89 రోజులుగా పార్లమెంట్ అధికారికంగా ముగియకుండా కొనసాగుతూనే ఉందన్న వార్త దేశ రాజకీయ వర్గాల్లో తీవ్ర ఉత్కంఠ రేపుతోంది.గతంలో 2008లో నాటి యూపీఏ ప్రభుత్వంపై వచ్చిన అవిశ్వాస తీర్మానంపై చర్చించేందుకు జూలై 21, 22 తేదీల్లో లోక్‌సభ సమావేశమైంది. ఆ తర్వాత సభ నిరవధికంగా వాయిదా పడినప్పటికీ, ప్రోరోగ్ కాకుండా ఏకంగా 87 రోజుల పాటు కొనసాగిన రికార్డు నమోదైంది.

AnnaLezhneva: పవన్ కోసం సర్వస్వం వదిలేస్తే.. అన్నా లెజినోవాకు దక్కిందేంటి?ఏపీSwechaa11 Nov 2026, 04:49 PM

AnnaLezhneva: పవన్ కోసం సర్వస్వం వదిలేస్తే.. అన్నా లెజినోవాకు దక్కిందేంటి?

AnnaLezhneva: పుట్టిన గడ్డను వదిలింది.. అలవాటైన జీవనశైలిని పక్కన పెట్టింది.. కట్టుబాట్లు, సంస్కృతి వేరైనా ఒక మనిషిపై ప్రేమతో అచ్చమైన తెలుగింటి కోడలిగా మారిపోయింది. పవన్ కల్యాణ్ కోసం తన దేశం, మతం సైతం మార్చుకుని సనాతన ధర్మాన్ని నిష్టగా పాటించిన ఒక విదేశీ మహిళకు 13 ఏళ్ల కాపురం తర్వాత చివరకు మిగిలింది కేవలం ఒక విడాకుల ప్రెస్ నోట్ మాత్రమేనా? సోమవారం అర్ధరాత్రి పవన్ కల్యాణ్, అన్నా కొణిదెల పేర్లతో బయటకు వచ్చిన జాయింట్ స్టేట్‌మెంట్ ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ పెద్ద చర్చకు తెరలేపింది.ఒక రష్యన్ మహిళగా భారత్‌కు వచ్చి, పవన్ కల్యాణ్ జీవిత భాగస్వామిగా మారిన తర్వాత అన్నా లెజినోవా ప్రవర్తించిన తీరు కోట్లాది మంది అభిమానులను ఆశ్చర్యపరిచింది. పవన్ భావజాలానికి తగ్గట్టుగా ఆమె పూర్తిగా రూపాంతరం చెందారు. రెండుసార్లు కాలిబాటన తిరుమల కొండకు నడిచివెళ్లి, శ్రీవారికి తలనీలాలు సమర్పించుకుని తన భక్తిని చాటుకున్నారు.

Tollywood: సుకుమార్ టీమ్ నుంచి మరో దర్శకుడు..!సినిమాSwechaa11 Nov 2026, 04:37 PM

Tollywood: సుకుమార్ టీమ్ నుంచి మరో దర్శకుడు..!

Tollywood: టాలీవుడ్‌లో దర్శకుడు సుకుమార్ శిష్యులకు మంచి గుర్తింపు దక్కుతోంది. ఆయన దగ్గర దర్శకత్వం శాఖలో పని చేసిన పలువురు దర్శకులు ఇండస్ట్రీలో తమకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు. ఇప్పుడు ఇదే టీమ్ నుంచి మరో దర్శకుడు స్టార్ బాయ్ సిద్ధు జొన్నలగడ్డతో సినిమా చేయబోతున్నాడు. తాజాగా, ఈ ప్రాజెక్ట్ అధికారికంగా ప్రారంభమైంది.

Telangana Politics: హస్తంలో కుర్చీలాట.. ఎంపీకి చెక్ పెట్టేలా మంత్రుల స్కెచ్?తెలంగాణSwechaa11 Nov 2026, 03:57 PM

Telangana Politics: హస్తంలో కుర్చీలాట.. ఎంపీకి చెక్ పెట్టేలా మంత్రుల స్కెచ్?

Telangana Politics: తెలంగాణలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చి రెండు మూడేళ్లు గడుస్తున్నా.. నేతల మధ్య ఆధిపత్య పోరు మాత్రం చల్లారడం లేదు. ముఖ్యంగా ఉమ్మడి కరీంనగర్, పెద్దపల్లి పరిధిలో సీనియర్ మంత్రులు, స్థానిక ఎంపీ మధ్య సాగుతున్న ప్రచ్ఛన్న యుద్ధం ఇప్పుడు పతాక స్థాయికి చేరింది. పెద్దపల్లి ఎంపీ గడ్డం వంశీకృష్ణ దూకుడుకు కళ్లెం వేసి, లోక్‌సభ సెగ్మెంట్‌పై ఆయన పట్టును బలహీనపరిచేలా మంత్రులు, ఎమ్మెల్యేలు ఉమ్మడిగా వ్యూహాత్మక స్కెచ్ వేశారన్న చర్చ రాజకీయ వర్గాల్లో తీవ్ర కలకలం రేపుతోంది.పెద్దపల్లి పార్లమెంట్ పరిధిలో మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు, విప్ అడ్లూరి లక్ష్మణ్ కుమార్‌లతో పాటు కీలక ఎమ్మెల్యేలు ఏకతాటిపైకి వచ్చి ఎంపీని క్రమంగా ఐసోలేట్ చేసే వ్యూహాన్ని అమలు చేస్తున్నారన్న ఆరోపణలు వస్తున్నాయి. ఎంపీ వంశీకృష్ణ తండ్రి, మంత్రి వివేక్ వెంకటస్వామి కుటుంబానికి జిల్లాలో బలమైన కేడర్, పట్టు ఉండటం ఇతర మంత్రులకు మింగుడుపడటం లేదన్నది బహిరంగ రహస్యమే.

మైనార్టీల ఓటు హక్కు తొలగించేందుకు కేంద్రం కుట్ర : సీఎం రేవంత్ రెడ్డితెలంగాణSwechaa11 Nov 2026, 03:34 PM

మైనార్టీల ఓటు హక్కు తొలగించేందుకు కేంద్రం కుట్ర : సీఎం రేవంత్ రెడ్డి

మైనార్టీల ఓట్లు తొలగించేందుకు కేంద్రం కుట్ర చేస్తోందని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. అంతేకాకుండా, మైనార్టీల స్కారల్స్‌షిప్స్ విషయంలోనూ బీజేపీ పాలిటిక్స్ చేస్తోందని సీఎం ఎద్దేవాచేశారు. బుధవారం బంజారా హిల్స్‌లోని బంజారా భవన్‌లో జాతీయ విద్యా, మైనారిటీ సంక్షేమ దినోత్సవాన్ని అట్టహాసంగా నిర్వహించారు. ఈ సందర్భంగా సీఎం రేవంత్ మాట్లాడుతూ.. తమ ప్రభుత్వం మైనారిటీలకు అన్ని వేళలా, అన్ని రకాలుగా పూర్తి అండగా ఉంటుందని పేర్కొన్నారు. దేశంలో విద్యా, నీటిపారుదల రంగాలకు భారత ప్రధాని పండిట్ జవహర్‌లాల్ నెహ్రూ అత్యధిక ప్రాధాన్యత ఇచ్చారని గుర్తుచేశారు. నెహ్రూ వేసిన బలమైన పునాదుల వల్లే నేడు విద్యా, ఇరిగేషన్ రంగాల్లో దేశం గొప్ప వృద్ధిని సాధించిందని కొనియాడారు. మౌలానా అబుల్ కలాం ఆజాద్‌ను తొలి విద్యాశాఖ మంత్రిగా నియమించి, దేశవ్యాప్తంగా వర్సిటీలు, ఐఐటీలను కాంగ్రెస్ ప్రభుత్వమే నెలకొల్పిందని పేర్కొన్నారు.

Aqwan Cyclone: ‘అర్నబ్’, ‘మొరుసు’ ముంచేశాయి.. ఇప్పుడు ఏపీని వణికించడానికి వస్తున్న మరో రక్కసి!ఏపీSwechaa11 Nov 2026, 03:16 PM

Aqwan Cyclone: ‘అర్నబ్’, ‘మొరుసు’ ముంచేశాయి.. ఇప్పుడు ఏపీని వణికించడానికి వస్తున్న మరో రక్కసి!

ఆంధ్రప్రదేశ్‌ను వరుస ప్రకృతి విపత్తులు వెంటాడుతున్నాయి. మొన్నటికి మొన్న తీరాన్ని వణికించిన అర్నబ్ తుఫాన్ సృష్టించిన బీభత్సం నుంచి తేరుకోకముందే, ‘మొరుసు’ తుఫాన్ పంట పొలాలను ముంచెత్తి తీవ్ర నష్టాన్ని మిగిల్చింది. కేవలం రెండు మూడు రోజుల వ్యవధిలోనే విరుచుకుపడిన ఈ జంట తుఫాన్ల దెబ్బతో కోలుకోలేక విలవిలలాడుతున్న అన్నదాతలకు, తీరప్రాంత ప్రజలకు వాతావరణ శాఖ మరో పిడుగులాంటి వార్త చెప్పింది. బంగాళాఖాతంలో మరో పెను తుఫాన్ పురుడుపోసుకుంటోంది.

Congress : ఎంపీ చామల ఎపిసోడ్.. ఆగ్రహంతో ఢిల్లీకి వెళ్లిన పీసీసీ చీఫ్!తెలంగాణSwechaa11 Nov 2026, 02:26 PM

Congress : ఎంపీ చామల ఎపిసోడ్.. ఆగ్రహంతో ఢిల్లీకి వెళ్లిన పీసీసీ చీఫ్!

కాంగ్రెస్ పార్టీలో భువనగిరి ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి, టీపీసీసీ చీఫ్ మహేశ్ కుమార్ గౌడ్ మధ్య వివాదం మరింత ముదిరినట్టు తెలుస్తోంది. ఇటీవల కాంగ్రెస్ పార్టీ తరపున టీవీ డిబేట్లలో పాల్గొనే మీడియా ప్యానలిస్టులు, మీడియా కో ఆర్డినేటర్లు, సీనియర్ అధికార ప్రతినిధులు, అధికార ప్రతినిధుల జాబితాను మీడియా & పబ్లిసిటీ డిపార్ట్‌మెంట్ చైర్మన్, ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి విడుదల చేసిన విషయం తెలిసిందే. అయితే, చామల ఇచ్చిన ఈ నియామకాల జాబితాను వెంటనే నిలిపివేయాలని టీపీసీసీ అధ్యక్షుడు మహేష్ గౌడ్ ఆదేశాలు జారీ చేశారు.అయితే, చామల కిరణ్ కుమార్ రెడ్డి విడుదల చేసిన జాబితా సరైనదేనని, తాము పదవుల్లో కొనసాగుతామని, వెనక్కి తగ్గేది లేదని జాబితాలోని సభ్యులు హంగామా సృష్టించినట్టు సమాచరాం. అయితే, తనకు అధికారాలు ఉన్నాయని ఎంపీ చామల వాదించినట్టు సమాచారం. ఈ క్రమంలోనే ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డిపై అధిష్ఠానానికి ఫిర్యాదు చేసేందుకు మహేష్ కుమార్ గౌడ్ ఢిల్లీకి వెళ్లినట్టు తెలిసింది.

MILK rates :  దెబ్బ మీద దెబ్బ.. మళ్లీ పెరిగిన పాల ధరలు!తెలంగాణSwechaa11 Nov 2026, 01:54 PM

MILK rates : దెబ్బ మీద దెబ్బ.. మళ్లీ పెరిగిన పాల ధరలు!

కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు సామాన్యుడి నడ్డి విరుస్తున్నాయి. ఇప్పటికే నిత్యావసర ధరలు ఆకాశన్నంటుతున్నాయి. ఈ క్రమంలోనే పాల ధరలను మరోసారి పెంచుతూ 'మదర్ డెయిరీ' ప్రకటించింది. లిక్విడ్ పాల ధరలను లీటరుకు రూ. 2 నుండి రూ. 4 వరకు పెంచుతూ నిర్ణయం తీసుకుంది. ఈ పెరిగిన కొత్త ధరలు రేపు (గురువారం) నుండి అమలులోకి రానున్నాయి. పాలను సేకరణ ఖర్చులు , ఇతర ఉత్పత్తి వ్యయాలు పెరగడం వల్లే ధరలను పెంచాల్సి వచ్చిందని మదర్ డెయిరీ వర్గాలు వెల్లడించాయి.తాజా పెంపుదలతో దేశవ్యాప్తంగా ధరలు పెరిగినట్టు సమాచారం. మదర్ డెయిరీకి అత్యంత ప్రధాన మార్కెట్ అయిన ఢిల్లీ-ఎన్‌సీఆర్ రీజియన్‌లో పాల ఉత్పత్తి ధరలు ఈ విధంగా ఉన్నాయి. ఫుల్ క్రీమ్ పాలు లీటరుపై రూ. 4 పెరిగింది. అనగా పాత ధర రూ. 72 ఉండగా.. ఇప్పుడు రూ. 76కి చేరింది.

కొత్త రాజకీయ పార్టీ పేరు ప్రకటించిన విజయ సాయి రెడ్డిఏపీSwechaa11 Nov 2026, 01:27 PM

కొత్త రాజకీయ పార్టీ పేరు ప్రకటించిన విజయ సాయి రెడ్డి

ఏపీ రాజకీయాల్లో కీలక పరిణామం చోటుచేసుకుంది. ‘పరివర్తన రాజనీతి పార్టీ’ పేరిట మరో కొత్త పొలిటికల్ పార్టీ ఉద్భవించింది. మాజీ రాజ్యసభ సభ్యులు విజయసాయి రెడ్డి కొత్త పార్టీని ప్రకటించారు. ‘దేశం కోసం.. ధర్మం కోసం’ పార్టీని స్థాపించినట్టు విజయసాయిరెడ్డి తెలిపారు. ‘జనం కోసం.. జనం హితం’ కోసం అనే నినాదంతో ప్రజల మధ్యకు వెళ్లి పనిచేస్తామని ప్రకటించారు. కొత్త తరం, కొత్త ఆంధ్రప్రదేశ్ అనే లక్ష్యంతో ‘పరివర్తన రాజనీతి పార్టీ’ ముందుకు వెళ్తుందని చెప్పారు.ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో కొత్త తరహా రాజకీయాలకు నాంది పలకడమే తమ లక్ష్యమని పార్టీ ప్రకటన సందర్భంగా విజయసాయి రెడ్డి చెప్పారు. పరివర్తన రాజకీయ పార్టీ పేరులోని మొదటి అక్షరాలతో ‘PRP’గా దానికి నామకరణం చేశారు. ఏపీలో అధికార కూటమి (టీడీపీ, జనసేన, బీజేపీ), ప్రతిపక్ష వైసీపీ మధ్య రాజకీయ వైరం కొనసాగుతున్న క్రమంలో విజయసాయిరెడ్డి కొత్త పార్టీ ప్రకటన రాజకీయ వర్గాల్లో తీవ్ర చర్చనీయాంశంగా మారింది.

Tollywood: మెగా ఛాన్స్ మిస్ చేసుకుంటున్న యంగ్ డైరెక్టర్స్?సినిమాSwechaa11 Nov 2026, 12:51 PM

Tollywood: మెగా ఛాన్స్ మిస్ చేసుకుంటున్న యంగ్ డైరెక్టర్స్?

Tollywood: టాలీవుడ్‌లో మెగాస్టార్ చిరంజీవితో ఒక్క సినిమా చేసే అవకాశం వస్తే చాలనుకునే దర్శకులు ఎంతోమంది ఉన్నారు. ఇప్పటికీ, పూరి జగన్నాధ్ లాంటి సీనియర్ డైరెక్టర్స్ అవకాశాన్ని దక్కించుకోలేపోతున్నారు. ఠాగూర్ లాంటి భారీ హిట్ ఇచ్చిన వినాయక్ లాంటి వాళ్ళు కొత్త తరహా కథలతో చిరును చేరలేకపోతున్నారు.

Tollywood: బోర్ కొట్టిన థమన్ మ్యూజిక్..అందుకే GVకి తెలుగులో వరుస ఆఫర్స్..సినిమాSwechaa11 Nov 2026, 12:35 PM

Tollywood: బోర్ కొట్టిన థమన్ మ్యూజిక్..అందుకే GVకి తెలుగులో వరుస ఆఫర్స్..

Tollywood: టాలీవుడ్‌లో ఒకప్పుడు సంగీత దర్శకుడు అంటే ముందుగా గుర్తొచ్చే పేర్లలో మలోడి బ్రహ్మ మణి శర్మ..ఆ తర్వాత జనరేషన్‌లో రాక్ స్టార్ దేవిశ్రీ ప్రసాద్, తమన్ ఉండేవారు. స్టార్ హీరోల సినిమాల నుంచి చిన్న సినిమాల వరకు వీరిద్దరే సంగీతం అందించేవారు. కొన్నేళ్ళపాటు ఈ ఇద్దరి హవానే కొనసాగింది. ముఖ్యంగా, తమన్ బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ సినిమాలకు ప్రత్యేకమైన బలంగా నిలిచేది. కానీ, వీరద్దు ఇప్పుడు వెనకబడ్డారు. లైన్‌లోకి జీవీ ప్రకాష్ కుమార్ వచ్చాడు.

86 వాహనాలు ఢీ..  12 మందిని బలిగొన్న పొగమంచు!InternationalSwechaa11 Nov 2026, 12:27 PM

86 వాహనాలు ఢీ.. 12 మందిని బలిగొన్న పొగమంచు!

బల్గేరియా దేశ రాజధాని సోఫియాను బుర్గాస్ ఓడరేవుతో కలిపే రహదారిపై ఘోర రోడ్డు ప్రమాదం సంభవించింది. మంగళవారం ఉదయం దట్టమైన పొగమంచు కమ్ముకోవడంతో యాంబోల్ సమీపంలో ఈ వాహనాలు ఢీకొన్నట్టు స్థానిక అధికారులు వెల్లడించారు.ఈ ఘటనలో 86 వాహనాలు ఒకదానికొకటి ఢీకొనగా 10 మంది ప్రయాణికులు అక్కడికక్కడే మృతి చెందగా.. మరో ఇద్దరు ఆస్పత్రికి తరలిస్తుండగా మృతి చెందారు.రోడ్డు సరిగ్గా కనిపించకపోవడం వల్లే ఇరువైపులా ఒకే ప్రదేశంలో ఒకదాంతో మరొకటి 86 వాహనాలు ఢీకొట్టుకున్నట్టు తెలిసింది. వెంటనే సమాచారం అందుకున్న పోలీసులు, సహాయక బృందాలు అక్కడకు చేరుకుని రెస్క్యూ ఆపరేషన్స్ చేపట్టాయి. ఈ ప్రమాదంలో మరో 46 మంది గాయపడగా వారిని చికిత్స కోసం ఆసుపత్రికి తరలించారు.దీనికి సంబంధించి వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది

ఈవీ వెహికిల్స్‌కు పెద్దపీట.. కేంద్రం కీలక నిర్ణయంNationalSwechaa11 Nov 2026, 12:17 PM

ఈవీ వెహికిల్స్‌కు పెద్దపీట.. కేంద్రం కీలక నిర్ణయం

పెట్రోల్, డీజిల్ వాహనాల వాడకం విషయంలో కేంద్రం ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. కేంద్ర ప్రభుత్వ పరిధిలోని వివిధ మంత్రిత్వ శాఖల్లో ఉపయోగించే అధికారిక వాహనాల కొనుగోలు విషయంలో కేంద్ర ఆర్థిక శాఖ విప్లవాత్మక మార్పులకు నాంది పలికింది. పర్యావరణ పరిరక్షణ, గ్రీన్ ట్రాన్స్‌పోర్టును ప్రోత్సహించడంతో పాటు ఇంధన దిగుమతి భారాన్ని తగ్గించేందుకు సంచలన నిర్ణయం తీసుకుంది.ఇకమీదట ఎలక్ట్రిక్ వాహనాలకు ప్రథమ ప్రాధాన్యం ఇవ్వాలని స్పష్టంచేసింది. ఈ మేరకు కేంద్ర ఆర్థిక శాఖలోని వ్యయ విభాగం అధికారిక ఉత్తర్వులను జారీ చేసింది. కొత్త నిబంధనల ప్రకారం.. పాత పెట్రోల్, డీజిల్ వాహనాలను తొలగించి కొత్తవి కొనుగోలు చేసే టైంలో కేవలం ఎలక్ట్రిక్ వాహనాలకే ప్రాధాన్యత కల్పించాలని నిర్ణయించారు. అందుకే ఈవీ కార్ల కొనుగోలు ధర పరిమితిని రూ.20 లక్షల వరకు పెంచినట్టు తెలిసింది.

Tollywood: వరుస హిట్స్‌తో ఉన్న వెంకీ..బ్రేక్ వేసిన ఆదర్శకుటుంబం..సినిమాSwechaa11 Nov 2026, 11:31 AM

Tollywood: వరుస హిట్స్‌తో ఉన్న వెంకీ..బ్రేక్ వేసిన ఆదర్శకుటుంబం..

Tollywood: విక్టరీ వెంకటేష్ అంటే ఫ్యామిలీ ఆడియన్స్‌లో ఒక ప్రత్యేకమైన క్రేజ్ ఉంటుంది. ఆయన సినిమా వస్తుందంటే ఫ్యామిలీ ఆడియన్స్‌ థియేటర్లకు క్యూ కడతారు. గత కొంతకాలంగా వరుస విజయాలతో మంచి ఫామ్‌లో ఉన్న వెంకటేష్‌కు ఇటీవల వచ్చిన 'ఆదర్శ కుటుంబం' సినిమా బ్రేక్ వేసినట్టయింది. త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా మీద విడుదలకు ముందు భారీ అంచనాలు ఉన్నాయి. కానీ, బాక్సాఫీస్ దగ్గర మాత్రం ఆ అంచనాలను అందుకోవడంలో ఫెయిల్ అయింది.

TG : రెండు నెలల్లో 9 మంది ఔట్ సోర్సింగ్ ఉద్యోగుల మృతితెలంగాణSwechaa11 Nov 2026, 11:03 AM

TG : రెండు నెలల్లో 9 మంది ఔట్ సోర్సింగ్ ఉద్యోగుల మృతి

జలమండలిలో ఔట్ సోర్సింగ్ సిబ్బంది పరిస్థితి అత్యంత దారుణంగా తయారైనట్టు తెలుస్తోంది. రెండు నెలల్లో 9 మంది ఔట్‌సోర్సింగ్ ఉద్యోగుల మృతి చెందడం ప్రస్తుతం తీవ్ర చర్చనీయాంశంగా మారింది. జలమండలిలో ఉద్యోగుల వరుస మరణాలు సంభవిస్తున్నా ఉన్నతాధికారులు స్పందించడం లేదని ఉద్యోగులు మండిపడుతున్నారు. తాజాగా మౌలాలి సర్కిల్‌లో మీటర్ రీడర్‌గా పనిచేస్తున్న ఔట్‌సోర్సింగ్ ఉద్యోగి మల్లేష్ బ్రెయిన్ స్ట్రోక్‌తో మరణించడం హాట్ టాపిక్ అయ్యింది. ఔట్‌సోర్సింగ్ ఉద్యోగుల జీవితాలను ఆగం చేసేలా ఇటీవల జారీ చేసిన టెండర్ ప్రక్రియపై ఉద్యోగులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. 675 మంది మీటర్ రీడర్ల కుటుంబాలపై ఈ టెండర్ ప్రక్రియ తీవ్ర ప్రభావం చూపుతుందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

Tollywood: వారణాసి, రాజమౌళిపై ప్రకాష్ రాజ్ హాట్ కామెంట్స్!సినిమాSwechaa11 Nov 2026, 10:58 AM

Tollywood: వారణాసి, రాజమౌళిపై ప్రకాష్ రాజ్ హాట్ కామెంట్స్!

Tollywood: వారణాసి, రాజమౌళిపై ప్రకాష్ రాజ్ హాట్ కామెంట్స్ చేయడం ఇప్పుడు అంతటా వైరల్ న్యూస్ అవుతోంది. మన సౌత్ సినిమా ఇండస్ట్రీలలో విలక్షణ నటుడిగా ఆయనకి ఎలాంటి పేరుందో అందరికీ తెలిసిందే. కనైఇ, ఎప్పుడూ ప్రకాష్ మీద ఆరోపణలు వస్తూనే ఉన్నాయి. ఆయన కూడా ఏమాత్రం తగ్గకుండా కౌంటర్స్ ఇస్తూనే ఉన్నారు. మరోసారి, ప్రకాష్ రాక్ గ్లోబల్ సినిమా వారణాసి..ఈ సినిమాను రూపొందిస్తున్న దర్శకుడు రాజమౌళిపై చేసిన కామెంట్స్ ఇండస్ట్రీలో చర్చకు దారితీశాయి.

ఎన్విడియా చుట్టూ స్పై వలయం.. ఒక పరిచయం వెనుక 7.5 బిలియన్ డాలర్ల చిప్స్ కథ!వ్యాపారంSwechaa11 Nov 2026, 10:56 AM

ఎన్విడియా చుట్టూ స్పై వలయం.. ఒక పరిచయం వెనుక 7.5 బిలియన్ డాలర్ల చిప్స్ కథ!

కార్పొరేట్ ప్రపంచంలో ఇప్పుడు పోటీ కంపెనీల మధ్యే కాదు.. తెరవెనుక స్పై నెట్‌వర్క్‌ల మధ్య కూడా సాగుతోంది. సీఈఓల పరిచయాల నుంచి కంపెనీల రహస్యాల వరకు.. కార్పొరేట్ వరల్డ్‌ను కుదిపేస్తున్న కొత్త స్పై టెన్షన్ ఇది!

Ramayana: రామాయణకి ఆస్కార్ వస్తుందా..ఎంట్రీకి వెళ్ళొచ్చా?సినిమాSwechaa11 Nov 2026, 10:35 AM

Ramayana: రామాయణకి ఆస్కార్ వస్తుందా..ఎంట్రీకి వెళ్ళొచ్చా?

Ramayana: రామాయణకి ఆస్కార్ వస్తుందా..ఎంట్రీకి వెళ్ళొచ్చా? అనే సందేహాలు ఇప్పుడు అటు బాలీవుడ్ ఇటు టాలీవుడ్ సినిమా ఇండస్ట్రీలలో విరివిగా కలుగుతున్నాయి. మన టాలీవుడ్ దర్శకధీరుడు ఎస్.ఎస్.రాజమౌళి ఆయన రూపొందించిన ఆర్ఆర్ఆర్ సినిమాతో ఆస్కార్ అందుకున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాలో ఉన్న నాటు నాటు సాంగ్‌కి ఆస్కార్ దక్కింది. అయితే, ఇప్పుడు అందరూ 99వ ఆస్కార్ అవార్డ్స్‌కి రామాయాణ ఎంట్రీ ఉటుందా?.

History today in 11 November 2026 :  ది గ్రేట్ సించులా అగ్రిమెంట్.. చరిత్రలో ఈ రోజు ఏం జరిగిందంటే?అభిప్రాయంSwechaa11 Nov 2026, 10:15 AM

History today in 11 November 2026 : ది గ్రేట్ సించులా అగ్రిమెంట్.. చరిత్రలో ఈ రోజు ఏం జరిగిందంటే?

11 నవంబర్ 2026 అనగా ఇదే రోజున కొన్ని శతాబ్దాలు, దశాబ్దాల కింద కొన్ని కీలక ఘట్టాలు చోటుచేసుకున్నాయి. యుద్ధాలు జరిగాయి, ముగిశాయి. ప్రముఖులు జన్మించారు, మరణించారు. వలస పాలకులైన బ్రిటిష్ రూలింగ్ టైంలో ఇండియా, భూటాన్ మధ్య ది గ్రేట్ ‘సించులా ఒప్పందం’ కుదిరింది.

ప్రత్యేక దినోత్సవం

1.భారత జాతీయ విద్యా దినోత్సవం (National Education Day).

-మౌలానా అబుల్ కలాం ఆజాద్ జయంతిని పురస్కరించుకుని ఈ రోజును జాతీయ విద్యా దినోత్సవంగా నిర్వహిస్తారు.

2.మొదటి ప్రపంచ యుద్ధం ముగిసిన సందర్భంగా పలు దేశాల్లో ఆర్మిస్టిస్ డే (Armistice Day) నిర్వహిస్తారు.

Horoscope : నేటి పంచాంగం (11 నవంబర్ 2026) శుభగడియలుSpiritualitySwechaa11 Nov 2026, 09:47 AM

Horoscope : నేటి పంచాంగం (11 నవంబర్ 2026) శుభగడియలు

11 నవంబర్ 2026 నేటి పంచాంగంలో తిథి, నక్షత్రం, యోగం, కరణం, రాహుకాలం, యమగండం, దుర్ముహూర్తం, సూర్యోదయం, సూర్యాస్తమయం వివరాలు చాలా ముఖ్యమైనవి. ఏదైనా శుభకార్యం చేపట్టాలనుకునే వారు ఈ టైమింగ్స్ ఆధారంగా ముందుకు వెళితే చాలా బెటర్ అని పండితులు చెబుతున్నారు.

నేటి పంచాంగ వివరాలు :

తెలుగు మాసం : కార్తీక మాసం

సంవత్సరం : పరాభవ నామ సంవత్సరం

పక్షం : శుక్ల పక్షం

తిథి : విదియ – మధ్యాహ్నం 3:53 వరకు

నక్షత్రం : అనూరాధ – ఉదయం 11:38 వరకు

తమ్మిడికుంట చెరువుకు జీవం.. మాదాపూర్‌కు కొత్త కళ!తెలంగాణSwechaa11 Nov 2026, 12:48 AM

తమ్మిడికుంట చెరువుకు జీవం.. మాదాపూర్‌కు కొత్త కళ!

మళ్లీ జలకళను సంతరించుకున్న తమ్మిడికుంటను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నేడు ప్రారంభించనున్నారు. ఈ కార్యక్రమానికి సినీనటుడు అక్కినేని నాగార్జున ముఖ్య అతిథిగా హాజరుకానున్నారు. హైడ్రా చర్యల వల్ల ఈ చెరువుకు మహర్దశ వచ్చింది.