స్వేచ్ఛ షార్ట్స్ — తాజా తెలుగు వార్తలు

Telangana : తప్పు చేసి తప్పించుకోలేరు?స్వేచ్ఛ ఛైర్మన్ డెస్క్Swechaa12 Nov 2026, 03:19 PM

Telangana : తప్పు చేసి తప్పించుకోలేరు?

ప్రభుత్వ భూముల విషయంలో స్వేచ్ఛ న్యూస్ దేవేందర్ రెడ్డి ఎప్పటికప్పుడు రేవంత్ సర్కారును, అధికారులను హెచ్చరిస్తూ వస్తున్నారు. అయినా కూడా వారిలో మార్పు రావడం లేదు. అదే నిర్లక్ష్యం వారిలో కనిపిస్తోంది.ఇప్పుడు వరుసగా హైకోర్టు కలెక్టర్లకు ఇదే అంశంలో చివాట్లు పెడుతుండడంతో ‘స్వేచ్ఛ న్యూస్’ కథనాలపై పెద్దఎత్తున చర్చ మొదలైంది.ముందుగానే కోర్టు ఆదేశాలను పాటించి ఉన్నా, స్వేచ్ఛ న్యూస్ దేవేందర్ రెడ్డి హెచ్చరికలతో అప్రమత్తం అయినా ఇప్పుడు న్యాయస్థానం ఆగ్రహానికి గురయ్యే వారు కాదు కదా? అని రంగారెడ్డి, మేడ్చల్ జిల్లాల కలెక్టర్ల గురించి రాష్ట్రంలో తెగ మాట్లాడుకుంటున్నారు.

లోకల్ బాడీ ఎలక్షన్స్.. పెండింగ్ స్థానాలకు నోటిఫికేషన్ విడుదలఏపీSwechaa12 Nov 2026, 03:03 PM

లోకల్ బాడీ ఎలక్షన్స్.. పెండింగ్ స్థానాలకు నోటిఫికేషన్ విడుదల

ఏపీ రాజకీయాల్లో కీలక పరిణామం చోటుచేసుకుంది. పెండింగ్‌లో ఉన్న పట్టణ స్థానిక సంస్థల ఎన్నికలకు రాష్ట్ర ఎన్నికల సంఘం (SEC) నగారా మోగించింది. ఆంధ్రప్రదేశ్‌లోని 4 నగరపాలక సంస్థలు, 19 మున్సిపాలిటీలు, నగర పంచాయతీలకు ఎన్నికల నోటిఫికేషన్‌ను ఎన్నికల కమిషనర్ అనిల్ చంద్ర పునేఠా గురువారం అధికారికంగా విడుదల చేశారు. పెండింగ్ లో ఉన్న స్థానిక ఎన్నికలకు ఎన్నికల షెడ్యూల్ విడుదల కావడంతో సంబంధిత పురపాలక సంఘాల పరిధిలో వెంటనే ఎలక్షన్ కోడ్ అమల్లోకి వచ్చిందని అధికారులు పేర్కొన్నారుజ రాష్ట్ర ఎన్నికల కమిషనర్ ప్రకటించిన షెడ్యూల్ మేరకు.. ఈ నెల 14 నుంచి 16 వరకు అభ్యర్థుల నుంచి నామినేషన్లను స్వీకరిస్తారు. ఆ తర్వాత 26న పోలింగ్ నిర్వహించనున్నారు. చివరగా ఈ నెల 30న ఓట్ల లెక్కింపు ప్రక్రియ ఉంటుంది. అనంతరం ఎన్నికల్లో గెలిచిన విజేతలను అధికారికంగా ప్రకటించనున్నట్టు ఎన్నికల కమిషనర్ అనిల్ చంద్ర పునేఠా తెలిపారు.

జియో బాటలోనే ‘గ్రీన్ ఎస్‌ఎం’ వ్యాపార వ్యూహం.. ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ సంచలన ఆరోపణలు!తెలంగాణSwechaa12 Nov 2026, 02:27 PM

జియో బాటలోనే ‘గ్రీన్ ఎస్‌ఎం’ వ్యాపార వ్యూహం.. ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ సంచలన ఆరోపణలు!

 తెలంగాణలో రవాణా రంగంలోకి అడుగుపెడుతున్న 'గ్రీన్ ఎస్‌ఎం' (Green SM) సంస్థ కార్యకలాపాలపై బీఆర్ఎస్ నాయకుడు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ (RS Praveen Kumar) తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించారు. 2016లో టెలికాం రంగంలో రిలయన్స్ జియో అనుసరించిన వ్యాపార వ్యూహాన్ని ఇప్పుడు గ్రీన్ ఎస్‌ఎం సంస్థ రవాణా రంగంలో అమలు చేయబోతోందని ఆయన ఆరోపించారు. గతంలో జియో సంస్థ ఉచిత డేటా, ఉచిత కాల్స్ పేరుతో ఆఫర్లు ప్రకటించడంతో ఎయిర్‌సెల్, టాటా డొకోమో, రిలయన్స్ కమ్యూనికేషన్స్ వంటి దిగ్గజ కంపెనీలు మార్కెట్ నుంచి పూర్తిగా కనుమరుగయ్యాయని, వొడాఫోన్, ఐడియా సంస్థలు విలీనం కావాల్సిన పరిస్థితి ఏర్పడిందని ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గుర్తు చేశారు.

పార్కింగ్ గొడవ.. తుపాకీతో 15 నుంచి 16 రౌండ్ల కాల్పులుక్రైమ్Swechaa12 Nov 2026, 02:18 PM

పార్కింగ్ గొడవ.. తుపాకీతో 15 నుంచి 16 రౌండ్ల కాల్పులు

ఫరీదాబాద్ సెక్టార్‌ 21సీలో కారు పార్కింగ్ వివాదం కారణంగా పొరుగింటి వ్యక్తి తుపాకీతో కాల్పులు జరపడంతో పరంజీత్ ధన్‌ఖడ్ (42) అనే ఎన్నారై దారుణ హత్యకు గురయ్యారు. సింగపూర్‌లో నివసిస్తున్న టెక్ మహీంద్రా మాజీ ఉన్నతోద్యోగి పరంజీత్.. తన మేనల్లుడి వివాహం కోసం భారత్‌కు వచ్చాడు. తాను నివసించే అపార్ట్‌మెంట్‌లో పార్కింగ్ విషయంలో గొడవ కాస్త అతని హత్యకు దారితీయడంతో అంతా షాక్‌కు గురయ్యారు. అయితే, సింగపూర్‌లో పనిచేస్తున్న పరంజీత్ ధన్‌ఖడ్ ఫరీదాబాద్‌లోని ఒక అపార్ట్‌మెంట్ మొదటి అంతస్తులో నివసిస్తున్నాడు.అదే భవనం మూడో అంతస్తులో మోహన్ (మోనూ) శర్మ ఉంటున్నాడు.తనకు కేటాయించిన స్థలంలో కారు పార్కింగ్ చేసిన విషయంపై పరంజీత్, మోనూ శర్మ మధ్య తీవ్ర వాగ్వాదం జరిగింది.గతంలోనూ వీరిద్దరి మధ్య పార్కింగ్ సహా ఇతర చిన్న విషయాలపై తరచూ గొడవలు జరిగేవని సమాచారం.

వీసీ అల్దాస్ జానయ్యకు బిగ్‌షాక్.. విచారణకు గవర్నర్ ఆదేశంతెలంగాణSwechaa12 Nov 2026, 01:55 PM

వీసీ అల్దాస్ జానయ్యకు బిగ్‌షాక్.. విచారణకు గవర్నర్ ఆదేశం

ప్రొఫెసర్ జయశంకర్ అగ్రికల్చర్ యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ (వీసీ) అల్దాస్ జానయ్యకు బిగ్ షాక్ తగిలింది.ఆయన మీద వచ్చిన లైంగిక వేధింపుల ఆరోపణలపై రాష్ట్ర గవర్నర్ శివప్రతాప్ శుక్లా ఆగ్రహం వ్యక్తం చేసినట్టు తెలిసింది. తనను వీసీ జానయ్య లైంగికంగా వేధించారని ఓ మహిళా ప్రొఫెసర్ కన్నీరు పెట్టుకోవడంతో పాటు మీడియాకు అసలు విషయాన్ని వివరించిన విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే ఆయన మీద చర్యలు తీసుకోవాలని వర్సిటీలో విద్యార్థులు, ప్రొఫెసర్లు ఆందళనకు దిగారు. ఈ క్రమంలోనే లైంగిక వేధింపుల ఆరోపణలపై సమగ్ర విచారణ జరిపించాలని గవర్నర్ శవప్రతాప్ శుక్లా సంబంధిత అధికారులను ఆదేశించారు. గవర్నర్ ఆదేశాల మేరకు రాష్ట్ర ప్రభుత్వం నలుగురు సభ్యులతో కూడిన ఉన్నత స్థాయి విచారణ కమిటీని ఏర్పాటు చేసింది. రాష్ట్ర గిడ్డంగుల సంస్థ ఎండీ కె.లక్ష్మీ అధ్యక్షతన కమిటీని ఏర్పాటు చేయగా.. అందులో ఐఏఎస్ అధికారులు గోపి, రాహుల్ రాజ్, ‘ప్రజ్వల’ స్వచ్ఛంద సంస్థ ప్రతినిధి సునీతా కృష్ణన్ సభ్యులుగా ఉన్నారు.

నాగర్ కర్నూల్ ఇరిగేషన్ డీఈఈ ఇంట్లో ఏసీబీ సోదాలుతెలంగాణSwechaa12 Nov 2026, 01:37 PM

నాగర్ కర్నూల్ ఇరిగేషన్ డీఈఈ ఇంట్లో ఏసీబీ సోదాలు

తెలంగాణలో మరోసారి అవినీతి నిరోధక శాఖ (ఏసీబీ) దాడులు జరుగుతున్నాయి. ఆదాయానికి మించి అక్రమంగా ఆస్తులు కూడబెట్టారనే ఆరోపణలతో నాగర్‌కర్నూల్ నీటిపారుదల శాఖ (ఇరిగేషన్) డిప్యూటీ ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్ సత్యనారాయణ నివాసాలపై ఏసీబీ అధికారులు ఏకకాలంలో దాడులు నిర్వహించారు. గురువారం ఉదయం నుంచే హైదరాబాద్‌ మహానగరంతో పాటునాగర్‌కర్నూల్ జిల్లాలోని ఆయన నివాసాలు, కార్యాలయాలు, బంధువుల ఇళ్లలో కలిపి మొత్తం 10 చోట్ల ఏసీబీ బృందాలు విస్తృతంగా సోదాలు చేపట్టాయి.

ఐపీఎల్ జట్ల పెంపు వార్తలకు ఫుల్‌స్టాప్.. బీసీసీఐ క్లారిటీ!క్రీడలుSwechaa12 Nov 2026, 01:37 PM

ఐపీఎల్ జట్ల పెంపు వార్తలకు ఫుల్‌స్టాప్.. బీసీసీఐ క్లారిటీ!

 ప్రపంచవ్యాప్తంగా క్రికెట్ అభిమానులను ఉర్రూతలూగించే ఇండియన్ ప్రీమియర్ లీగ్ (IPL) జట్ల సంఖ్యను 10 నుంచి 12కు పెంచబోతున్నారంటూ గత రెండు రోజులుగా వస్తున్న ఊహాగానాలకు భారత క్రికెట్ నియంత్రణ మండలి (BCCI) పూర్తిస్థాయిలో తెరదించింది. ఐపీఎల్ 2028 మెగా వేలానికి ముందే లీగ్‌ను 12జట్లకు విస్తరిస్తారని, కొత్త ఫ్రాంచైజీల కోసం పుణె, వడోదర నగరాలను బోర్డు పరిశీలిస్తోందంటూ జరుగుతున్న ప్రచారాన్ని బీసీసీఐ కార్యదర్శి దేవజిత్ సైకియా (Devajit Saikia) తీవ్రంగా ఖండించారు. అసలు జట్ల సంఖ్యను పెంచే ఆలోచనే తమ వద్ద లేదని ఆయన స్పష్టం చేశారు.

పోలీసు అధికారులకు డీజీపీ సీవీ ఆనంద్ శుభవార్తతెలంగాణSwechaa12 Nov 2026, 01:00 PM

పోలీసు అధికారులకు డీజీపీ సీవీ ఆనంద్ శుభవార్త

తెలంగాణ పోలీసు అధికారులకు డీజీపీ సీవీ ఆనంద్ శుభవార్త చెప్పినట్టు తెలుస్తోంది. గతకొన్నేళ్లుగా పెండింగులో ఉన్న పోస్టులు, ప్రమోషన్ల ప్రక్రియను వీలైనంత త్వరగా పూర్తి చేయాలని పోలీసు శాఖను ఆదేశించినట్టు తెలుస్తోంది. ముఖ్యంగా అధికారుల పదోన్నతుల ప్రాసెస్ మీద డీజీపీ ప్రత్యేక దృష్టి సారించినట్టు సమాచారం. దీనిలో భాగంగానే పోలీస్ శాఖలో వివిధ స్థాయిల్లో అధికారుల పదోన్నతులకు సంబంధించి కీలక అంశాలపై ఇవాళ తన కార్యాలయంలో పోలీసు ఉన్నతాధికారులతో ప్రత్యేకంగా సమావేశం అయినట్టు తెలుస్తోంది. రాష్ట్రవ్యాప్తంగా వివిధ హోదాల్లో అర్హులైన పోలీసు అధికారుల సర్వీస్ రికార్డులు, అర్హతలు, ఖాళీల వివరాలపై ఈ భేటీలో సమగ్రంగా చర్చించనున్నట్టు తెలిసింది. గత కొంతకాలంగా పెండింగ్‌లో ఉన్న పదోన్నతుల దస్త్రాలు, కోర్టు కేసుల క్లియరెన్స్ పదవులు, త్వరలో పదవీ విరమణ చేయనున్న అధికారుల స్థానంలో కొత్త వారిని భర్తీ చేయాల్సిన ఖాళీలపై ఉన్నతాధికారులు సమీక్ష చేపట్టారు.

గుడ్ న్యూస్.. భారీగా దిగొచ్చిన బంగారం ధరలు!వ్యాపారంSwechaa12 Nov 2026, 12:57 PM

గుడ్ న్యూస్.. భారీగా దిగొచ్చిన బంగారం ధరలు!

బంగారం కొనుగోలు చేయాలని ఎదురుచూస్తున్న సామాన్య, మధ్యతరగతి ప్రజలకు, పసిడి ప్రియులకు ఇది నిజంగా శుభవార్త. గత కొద్దిరోజులుగా ఆకాశాన్నంటుతున్న బంగారం ధరలు గురువారం ఒక్కసారిగా భారీగా పతనమయ్యాయి. బుధవారం నాటి మార్కెట్ ధరలతో పోలిస్తే గురువారం ఉదయం 10 గ్రాముల 24 క్యారెట్ల స్వచ్ఛమైన బంగారంపై రూ. 2,180 మేర తగ్గుదల నమోదు కాగా, ఆభరణాల తయారీలో వినియోగించే 22 క్యారెట్ల బంగారంపై రూ. 2,000 వరకు ధర క్షీణించింది. ఒక్కరోజే ఈ స్థాయిలో ధరలు తగ్గడంతో కొనుగోలుదారులకు భారీ ఊరట లభించినట్లయింది.

కొరియోగ్రాఫర్ శేఖర్ మాస్టర్ కారుకు ప్రమాదం.. వెనుక నుంచి ఢీకొట్టిన పండ్ల లోడ్ లారీ!క్రైమ్Swechaa12 Nov 2026, 12:11 PM

కొరియోగ్రాఫర్ శేఖర్ మాస్టర్ కారుకు ప్రమాదం.. వెనుక నుంచి ఢీకొట్టిన పండ్ల లోడ్ లారీ!

 టాలీవుడ్ ప్రముఖ కొరియోగ్రాఫర్‌ శేఖర్‌ మాస్టర్‌ (Sekhar Master) ప్రయాణిస్తున్న కారుకు తృటిలో పెను ప్రమాదం తప్పింది. హైదరాబాద్‌ శివార్లలోని శంషాబాద్‌ సమీపంలో గురువారం తెల్లవారుజామున ఈ రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. మెగాస్టార్ చిరంజీవి నటిస్తున్న 'కాకా' సినిమాకు సంబంధించిన స్పెషల్ సాంగ్ షూటింగ్ ముగించుకుని తిరిగి నగరానికి వస్తుండగా ఆయన కారు ప్రమాదానికి గురైనట్లు సినీ వర్గాల ద్వారా తెలుస్తోంది.

ఎన్ కన్వెన్షన్ కూల్చివేత వెనుక అసలు కథ ఇదే.. నాగార్జున మనసు ఎలా మారిందంటే?తెలంగాణSwechaa12 Nov 2026, 11:43 AM

ఎన్ కన్వెన్షన్ కూల్చివేత వెనుక అసలు కథ ఇదే.. నాగార్జున మనసు ఎలా మారిందంటే?

  రెండేళ్ల కిందట ఆగస్టులో హైదరాబాద్ మాదాపూర్‌లోని తమ్మిడికుంట చెరువు ఎఫ్‌టీఎల్ (FTL), బఫర్ జోన్ పరిధిలో నిర్మించిన సినీ హీరో అక్కినేని నాగార్జునకు చెందిన 'ఎన్ కన్వెన్షన్' (N Convention) సెంటర్‌ను హైడ్రా (HYDRAA) అధికారులు కూల్చివేయడం రాష్ట్రవ్యాప్తంగా పెను సంచలనం సృష్టించిన సంగతి తెలిసిందే. ఆ సమయంలో ఈ కూల్చివేత వెనుక అనేక రాజకీయ కథనాలు, ఆరోపణలు వెల్లువెత్తాయి. ఒకవైపు ప్రతిపక్ష బీఆర్‌ఎస్ నాగార్జునను బాధితుడిగా చూపిస్తూ ప్రభుత్వంపై విమర్శలు గుప్పించగా, మరోవైపు కాంగ్రెస్ నేతలు గత ప్రభుత్వ హయాంలోని లోపాల వల్లే ఈ అక్రమ నిర్మాణాలు వెలిశాయని ప్రత్యారోపణలు చేశారు.

Viral: ఏనుగు కాళ్ల కింద రెండుసార్లు నలిగినా.. మృత్యువును జయించిన బైకర్!వైరల్ న్యూస్Swechaa12 Nov 2026, 11:20 AM

Viral: ఏనుగు కాళ్ల కింద రెండుసార్లు నలిగినా.. మృత్యువును జయించిన బైకర్!

ఉత్తరాఖండ్ రాష్ట్రంలో ఒళ్లు గగుర్పొడిచే ఒక అద్భుతమైన సంఘటన చోటుచేసుకుంది. రోడ్డుపై వెళ్తున్న ఓ ద్విచక్ర వాహనదారుడికి అకస్మాత్తుగా ఎదురైన అడవి ఏనుగు, అతడి పొట్ట, ఛాతీ భాగాలపై ఏకంగా రెండుసార్లు తన భారీ కాలు మోపింది. సాధారణంగా ఇంతటి బరువు కింద చిక్కుకుంటే ప్రాణాలు దక్కడం అసాధ్యమైనప్పటికీ, ఆ వ్యక్తి అదృష్టవశాత్తూ ప్రాణాలతో సురక్షితంగా బయటపడ్డాడు. ఏనుగు అక్కడి నుంచి పక్కకు వెళ్లిపోగానే ఆ బైకర్ వెంటనే పైకి లేచి నిలబడటం చూసిన వారందరినీ తీవ్ర ఆశ్చర్యానికి గురిచేసింది.

Tollywood: హారిక&హాసిని షాకింగ్ డెసిషన్..త్రివిక్రమ్ తో కటీఫ్?సినిమాSwechaa12 Nov 2026, 11:17 AM

Tollywood: హారిక&హాసిని షాకింగ్ డెసిషన్..త్రివిక్రమ్ తో కటీఫ్?

Tollywood: టాలీవుడ్ సినిమా ఇండస్ట్రీలో అగ్ర నిర్మాణ సంస్థలలో ఒకటి హారిక అండ్ హాసిని. ఇది, మన మాటల మాంత్రీకుడు త్రివిక్రమ్ శ్రీనివాస్‌కి అత్యంత సన్నిహితుడైన ఎస్.రాధాకృష్ణ (చినబాబు) కి సంబందించింది. అంతేకాదు, స్వయంగా రాధాకృష్ణతో ఈ బ్యానర్‌ను ప్రారంభించింది గురూజీనే. కానీ, ఇప్పుడు వీరిద్దరు విడిపోనున్నట్టు ఫిల్మ్ సర్కిల్స్‌లో వార్తలు వస్తున్నాయి.

సోనియా ఆత్మకథలో తెలంగాణ మిస్సింగ్.. తెలుగు రాష్ట్రాల్లో కొత్త రాజకీయ చర్చ!తెలంగాణSwechaa12 Nov 2026, 11:08 AM

సోనియా ఆత్మకథలో తెలంగాణ మిస్సింగ్.. తెలుగు రాష్ట్రాల్లో కొత్త రాజకీయ చర్చ!

ఒకవైపు తెలంగాణ ఉద్యమానికి సంబంధించిన ప్రస్తావన లేదంటూ బీఆర్ఎస్ నేతల ప్రశ్నలు.. మరోవైపు సోనియా జీవితంపై తెలుగులో సినిమా తీస్తామంటున్న కాంగ్రెస్ నేతలు. ఏపీ కాంగ్రెస్ అధ్యక్షురాలు షర్మిలకు ప్రత్యేకంగా అందిన ఆటోగ్రాఫ్ కాపీ. ఒక పుస్తకం చుట్టూ తెలుగు రాష్ట్రాల్లో చోటు చేసుకుంటున్న ఆసక్తికర రాజకీయ పరిణామాలు ఇవి.

Tollywood: వరుస ఫ్లాపుల్లో కూరుకుపోతున్న రష్మిక మందన్న!సినిమాSwechaa12 Nov 2026, 10:28 AM

Tollywood: వరుస ఫ్లాపుల్లో కూరుకుపోతున్న రష్మిక మందన్న!

Tollywood: వరుస ఫ్లాపుల్లో కూరుకుపోతున్న రష్మిక మందన్న మళ్ళీ తిరిగి సక్సెస్ ట్రాక్ ఎక్కడానికి ఉన్న అవకాశం మైసా మాత్రమే కనిపిస్తోంది. ఒకప్పుడు టాలీవుడ్‌లోనే కాకుండా, పాన్ ఇండియా స్థాయిలోనూ వరుస విజయాలతో దూసుకుపోయిన రష్మిక మందన్నకు ఇప్పుడు గడ్డు పరిస్థితులు ఎదురవుతున్నాయా? నేషనల్ క్రష్‌గా గుర్తింపు తెచ్చుకున్న ఈ బ్యూటీకి అవకాశాలు ఏమాత్రం తగ్గకపోయినా, సినిమాల ఫలితాలు మాత్రం ఆశించిన స్థాయిలో ఉండటం లేదనే చర్చ జరుగుతోంది.

చిత్రం లేదు
InternationalSwechaa12 Nov 2026, 10:24 AM

ఇరాన్‌తో యుద్ధం మొదలుపెట్టింది మేం కాదు: ట్రంప్

 ఇరాన్‌తో కొనసాగుతున్న సైనిక ఘర్షణపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ (Donald Trump) మరోసారి అత్యంత కీలక వ్యాఖ్యలు చేశారు. ఇరాన్‌పై అమెరికా యుద్ధాన్ని ప్రారంభించలేదని స్పష్టం చేశారు. 1979 నుంచే తమ దేశంపై ఇరాన్ అప్రకటిత యుద్ధం చేస్తోందని ట్రంప్ ఆరోపించారు. వర్జీనియాలోని ఆర్లింగ్టన్ జాతీయ శ్మశానవాటికలో బుధవారం నిర్వహించిన 2026 జాతీయ సైనికుల దినోత్సవ (Veterans Day) కార్యక్రమంలో పాల్గొన్న ట్రంప్, సైనికులను ఉద్దేశించి ప్రసంగిస్తూ ఈ వ్యాఖ్యలు చేశారు.

తెలంగాణలో సాంకేతిక విప్లవం.. దేశంలోనే తొలి ఏఐ పోలీస్ స్టేషన్‌గా పంజాగుట్ట!తెలంగాణSwechaa12 Nov 2026, 10:13 AM

తెలంగాణలో సాంకేతిక విప్లవం.. దేశంలోనే తొలి ఏఐ పోలీస్ స్టేషన్‌గా పంజాగుట్ట!

 తెలంగాణ పోలీస్ శాఖ శాంతిభద్రతల పరిరక్షణ, పౌర సేవలందించడంలో సరికొత్త సాంకేతిక విప్లవానికి శ్రీకారం చుడుతోంది. దేశంలోనే మొట్టమొదటిసారిగా పూర్తిస్థాయి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్(AI) ఆధారిత పోలీస్ స్టేషన్‌ను హైదరాబాద్‌లోని పంజాగుట్టలో ఏర్పాటు చేసేందుకు విస్తృత సన్నాహాలు చేస్తోంది. రాష్ట్ర డీజీపీ సీవీ ఆనంద్ ఆదేశాల మేరకు అత్యంత ప్రతిష్ఠాత్మకంగా ఈ ప్రాజెక్టును రూపొందిస్తున్నారు.  డిసెంబర్ మొదటి వారంలో ప్రయోగాత్మకంగా (పైలట్ ప్రాజెక్టు) ఈ అధునాతన సేవలను ప్రారంభించేందుకు ఉన్నతాధికారులు వేగంగా ఏర్పాట్లు పూర్తి చేస్తున్నారు.

Tollywood: నాని 'ప్యారడైజ్' యూనిట్‌పై బాబు మొహన్ ఫైర్..సినిమాSwechaa12 Nov 2026, 10:03 AM

Tollywood: నాని 'ప్యారడైజ్' యూనిట్‌పై బాబు మొహన్ ఫైర్..

Tollywood: నాని ప్యారడైజ్ యూనిట్‌పై బాబు మొహన్ ఫైర్..అంటూ ప్రస్తుతం సోషల్ మీడియాలో రక రకాల వార్తలు వచ్చి వైరలవుతున్నాయి. ఆయనను, దర్శకుడు లుక్ టెస్ట్ కోసం పిలిచి..మూడు నాలుగు రకాల కాస్ట్యూంస్ వేసి పెద్ద గాజు కన్ను పెట్టి లుక్ చేశారట. కానీ, సినిమాలో మాత్రం వేషం ఇవ్వలేదని ఆవేదన చెందుతూ ఇటీవల ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో ఈ విషయాన్ని బయటపెట్టాడు. బాబు మోహన్ చేసిన కామెంట్స్ నెట్టింట తెగ వైరల్ అవుతున్నాయి.

ప్రాణాపాయంలో రాప్తాడు నిందితుడు హేమంత్.. మరో ఆరోగ్య సమస్య!క్రైమ్Swechaa12 Nov 2026, 10:02 AM

ప్రాణాపాయంలో రాప్తాడు నిందితుడు హేమంత్.. మరో ఆరోగ్య సమస్య!

 అనంతపురం జిల్లా రాప్తాడు ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో విద్యార్థినులపై ఎలక్ట్రిక్‌ రంపంతో దాడికి పాల్పడి సంచలనం సృష్టించిన నిందితుడు హేమంత్‌ మరోసారి తీవ్ర అనారోగ్యానికి గురయ్యాడు. ఇప్పటికే కాలు తొలగింపు శస్త్రచికిత్స అనంతరం కోలుకుంటున్న అతడికి తాజాగా ఊపిరితిత్తుల రక్తనాళాల్లో రక్తం గడ్డకట్టే 'పల్మనరీ ఎంబాలిజం' (Pulmonary Embolism) సమస్య తలెత్తినట్లు వైద్యులు గుర్తించారు. శ్వాస తీసుకోవడంలో తీవ్ర ఇబ్బంది ఎదుర్కోవడంతో అప్రమత్తమైన అనంతపురం సర్వజన ఆసుపత్రి (GGH) వైద్యులు అత్యవసరంగా సీటీ స్కాన్‌ నిర్వహించి ఈ ప్రమాదకర పరిస్థితిని నిర్ధారించారు.

Kollywood: వివాహబంధంలోకి "ఇరుముడి" హీరోయిన్..ఇక సినిమాలకి గుడ్‌బై!సినిమాSwechaa12 Nov 2026, 09:45 AM

Kollywood: వివాహబంధంలోకి "ఇరుముడి" హీరోయిన్..ఇక సినిమాలకి గుడ్‌బై!

Kollywood: వివాహబంధంలోకి ఇరుముడి హీరోయిన్..ఇక సినిమాలకి గుడ్‌బై చెప్పబోతుందా? ప్రస్తుతం అటు కోలీవుడ్ ఇటు టాలీవుడ్ ఇండస్ట్రీలో ఇదే చర్చ జరుగుతోంది. తాజాగా, క్రేజీ హీరోయిన్ ప్రియ భవానీ శంకర్ పెళ్ళి చేసుకున్నారు. స్టార్ హీరోయిన్‌గా వెలుగుతున్న సమయంలోనే సమంత..రకుల్ ప్రీత్ సింగ్, కీర్తి సురేష్, నయనతారల మాదిరిగా పెళ్ళి చేసుకొని హీరోయిన్‌గా కంటిన్యూ అవుతున్నారు. ఆ లిస్ట్‌లో ఇరుముడి మూవీతో టాలీవుడ్‌లో బాగా గుర్తింపు తెచ్చుకున్న ప్రియ భవానీ శంకర్ కూడా చేరారు.

హైదరాబాద్‌లో ఆస్తి రిజిస్ట్రేషన్లకు కొత్త నిబంధన.. సర్కార్ కీలక ఆదేశాలు!వ్యాపారంSwechaa12 Nov 2026, 09:09 AM

హైదరాబాద్‌లో ఆస్తి రిజిస్ట్రేషన్లకు కొత్త నిబంధన.. సర్కార్ కీలక ఆదేశాలు!

 హైదరాబాద్ మహానగర పరిధిలో స్థిరాస్తుల క్రయవిక్రయాలు, రిజిస్ట్రేషన్ల ప్రక్రియలో తెలంగాణ ప్రభుత్వం అత్యంత కీలకమైన మార్పులను తీసుకువచ్చింది. హైదరాబాద్ కోర్ అర్బన్ రీజియన్ (CURE) పరిధిలో ఏదైనా నివాస, వాణిజ్య ఆస్తి లేదా ఖాళీ స్థలాన్ని రిజిస్ట్రేషన్ చేయాలంటే ఇకపై తప్పనిసరిగా ఆస్తి పన్ను గుర్తింపు నంబర్ (PTIN) లేదా ఖాళీ స్థలాల పన్ను గుర్తింపు నంబర్ (VLTIN) ఉండాల్సిందేనని ప్రభుత్వం స్పష్టం చేసింది. ఈ గుర్తింపు నంబర్ లేకపోతే ఆన్‌లైన్‌లో రిజిస్ట్రేషన్ కోసం స్లాట్ బుక్ చేసుకోవడం కూడా సాధ్యం కాదని తేల్చిచెప్పింది. ఈ మేరకు స్టాంపులు-రిజిస్ట్రేషన్ల శాఖ ఇన్‌స్పెక్టర్ జనరల్ (IG) బుధవారం అధికారికంగా ఒక కీలక మెమోను జారీ చేశారు.

చరిత్రలో ఈ రోజు (12 నవంబర్)InternationalSwechaa12 Nov 2026, 08:52 AM

చరిత్రలో ఈ రోజు (12 నవంబర్)

  • 1930: లండన్‌లో భారతీయ రాజకీయ సంస్కరణలపై మొదటి రౌండ్ టేబుల్ సమావేశం (First Round Table Conference) ప్రారంభమైంది.

  • 1896: ప్రముఖ భారతీయ పక్షి శాస్త్రవేత్త, 'బర్డ్ మ్యాన్ ఆఫ్ ఇండియా' డాక్టర్ సలీం అలీ (Salim Ali) జననం.

  • 2014: యూరోపియన్ అంతరిక్ష సంస్థ 'రోసెట్టా' వ్యోమనౌకకు చెందిన 'ఫిలే' (Philae) ల్యాండర్ చరిత్రలో తొలిసారిగా ఒక తోకచుక్కపై (Comet 67P) దిగింది.

  • 1927: సోవియట్ యూనియన్ కమ్యూనిస్ట్ పార్టీ నుండి లియోన్ ట్రాట్స్కీని బహిష్కరించడంతో జోసెఫ్ స్టాలిన్ ఎదురులేని నాయకుడిగా ఎదిగారు.

  • 1982: లియోనిడ్ బ్రెజ్నెవ్ మరణానంతరం యూరి ఆండ్రోపోవ్ సోవియట్ యూనియన్ నూతన అధినేతగా బాధ్యతలు చేపట్టారు.

  • 1980: నాసా పంపిన వాయేజర్ 1 (Voyager 1) అంతరిక్ష నౌక శని గ్రహానికి (Saturn) అత్యంత సమీపంగా ప్రయాణించి, ఆ గ్రహపు వలయాల స్పష్టమైన చిత్రాలను భూమికి పంపింది.

  • 1840 (జననం): అగస్టే రోడిన్ (Auguste Rodin) — ఆధునిక శిల్పకళ పితామహుడిగా పేరొందిన ప్రఖ్యాత ఫ్రెంచ్ శిల్పి ('ది థింకర్' సృష్టికర్త).

  • 1946 (మరణం): పండిట్ మదన్ మోహన్ మాలవీయ — భారతరత్న, స్వాతంత్ర్య సమరయోధుడు, బెనారస్ హిందూ విశ్వవిద్యాలయం (BHU) వ్యవస్థాపకుడు.

  • 2018 (మరణం): స్టాన్ లీ (Stan Lee) — మార్వెల్ కామిక్స్ సృష్టికర్త (స్పైడర్ మ్యాన్, ఐరన్ మ్యాన్ వంటి సూపర్ హీరోల సృష్టికర్త).

Today Panchangam 12 November 2026: ఈ రోజు పంచాంగం.. కార్తిక శుద్ధ తదియ, గురువారంSpiritualitySwechaa12 Nov 2026, 08:38 AM

Today Panchangam 12 November 2026: ఈ రోజు పంచాంగం.. కార్తిక శుద్ధ తదియ, గురువారం

రోజూవారీ పంచాంగం

శీర్షిక (Title): నేటి పంచాంగం - 12 నవంబర్ 2026 | కార్తిక శుద్ధ తదియ (నాగుల చవితి / భగినీ హస్త భోజనం తదుపరి రోజులు), గురువారం శుభ సమయాలు & వివరాలు

వివరాలు:

  • తేదీ: 12 నవంబరు 2026, గురువారం

  • సంవత్సరం: శ్రీ పరాభవ నామ సంవత్సరం

  • అయనం & ఋతువు: దక్షిణాయనం, శరత్ఋతువు

  • మాసం & పక్షం: కార్తిక మాసం, శుక్ల పక్షం

  • తిథి: తదియ (మధ్యాహ్నం 02:18 వరకు, తదుపరి చవితి)

  • వారం: గురువారం (బృహస్పతివాసరే)

  • నక్షత్రం: జ్యేష్ఠ (ఉదయం 08:42 వరకు, తదుపరి మూల)

  • యోగం: సుకర్మ (రాత్రి 11:45 వరకు, తదుపరి ధృతి)

  • కరణం: గరజ (మధ్యాహ్నం 02:18 వరకు), తదుపరి వణిజ (రాత్రి 01:12 వరకు)

శుభ / అశుభ సమయాలు:

  • రాహుకాలం: మధ్యాహ్నం 01:30 - 03:00 వరకు

  • యమగండం: ఉదయం 06:00 - 07:30 వరకు

  • అమృతకాలం: రాత్రి 11:34 - 01:08 వరకు

  • దుర్ముహూర్తము: ఉదయం 10:03 - 10:49 వరకు మరియు మధ్యాహ్నం 02:41 - 03:27 వరకు

  • వర్జ్యం: మధ్యాహ్నం 02:10 - 03:44 వరకు

గ్రహస్థితులు:

  • సూర్యరాశి: తుల

  • చంద్రరాశి: వృశ్చికం (ఉదయం 08:42 వరకు), తదుపరి ధనుస్సు

  • సూర్యోదయం: ఉదయం 06:23

  • సూర్యాస్తమయం: సాయంత్రం 05:36

సంగీతానికి క్రికెట్ తోడైంది! గ్రాండ్ గా అనిరుధ్ – కావ్యా మారన్ మ్యారేజ్సినిమాSwechaa12 Nov 2026, 01:13 AM

సంగీతానికి క్రికెట్ తోడైంది! గ్రాండ్ గా అనిరుధ్ – కావ్యా మారన్ మ్యారేజ్

ప్రముఖ సంగీత దర్శకుడు అనిరుధ్ రవిచందర్, సన్‌రైజర్స్ హైదరాబాద్ సహ యజమాని కావ్యా మారన్ వివాహ బంధంతో ఒక్కటయ్యారు. గ్రీస్ వేదికగా జరిగిన ఈ వివాహం ఇప్పుడు సినీ, క్రీడా ప్రపంచాల్లో హాట్ టాపిక్‌గా మారింది.

తెలంగాణలో అప్పుడే ఎన్నికల వేడి..! మిషన్ 2028లో కాంగ్రెస్, బీఆర్ఎస్ బిజీ బిజీతెలంగాణSwechaa12 Nov 2026, 12:50 AM

తెలంగాణలో అప్పుడే ఎన్నికల వేడి..! మిషన్ 2028లో కాంగ్రెస్, బీఆర్ఎస్ బిజీ బిజీ

తెలంగాణలో కాంగ్రెస్, బీఆర్ఎస్ మధ్య రాజకీయ యుద్ధం ముదురుతోంది. ఒకవైపు సీఎం రేవంత్ రెడ్డి బహిరంగ సభలు, ప్రభుత్వ కార్యక్రమాలతో ప్రజల్లోకి వెళ్తుంటే.. మరోవైపు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ వరుస పర్యటనలు, రైతు గర్జన సభలతో ప్రభుత్వాన్ని నిలదీస్తున్నారు.

Kollywood: మణి రత్నం సినిమాలో ఇద్దరు పిల్లలకి తల్లిగా సాయి పల్లవి!సినిమాSwechaa11 Nov 2026, 11:11 PM

Kollywood: మణి రత్నం సినిమాలో ఇద్దరు పిల్లలకి తల్లిగా సాయి పల్లవి!

Kollywood: లెజండరీ డైరెక్టర్ మణి రత్నం ప్రస్తుతం ఇంజి వెల్లం అనే సినిమాను రూపొందిస్తున్నారు. విలక్షణ నటుడు విజయ్ సేతుపతి హీరోగా నటిస్తున్నాడు. సాయి పల్లవి హీరోయిన్‌గా కనిపించబోతోంది. ఇటీవలే, షూటింగ్ పూర్తి చేసినట్టుగా తెలిపింది చిత్రబృందం. మణి రత్నం సినిమాలలో ఇంత తక్కువ సమయంలో షూటింగ్ పూర్తైన సినిమా ఇదే కావడం విశేషం. అయితే, తాజా సమాచారం మేరకు ఈ సినిమాలో సాయి పల్లవిని ఇద్దరు పిల్లలకి తల్లిగా మణి రత్నం చూపించబోతున్నాడట.

ప్రకృతి పరిరక్షణే మా లక్ష్యం.. మూసీ ప్రక్షాళన ఆగదుతెలంగాణSwechaa11 Nov 2026, 11:10 PM

ప్రకృతి పరిరక్షణే మా లక్ష్యం.. మూసీ ప్రక్షాళన ఆగదు

Cm Revanth: కొంతమందికి నష్టం జరిగినా కొన్ని తరాలకి మంచి భవిష్యత్తును ఇవ్వాలని తమ్మిడికుంటను అభివృద్ధి చేశామన్నారు సీఎం రేవంత్ రెడ్డి. 14 ఎకరాలకు కుంచించుకుపోయిన చెరువును 30 ఎకరాలకు విస్తరించామన్నారు. అక్కినేని నాగార్జున మంచి మనసుతో ముందుకు వచ్చి 2 ఎకరాలు ప్రభుత్వానికి అందించారని సీఎం రేవంత్ తెలిపారు. సినిమాల్లోనే కాదు.. నిజ జీవితంలో కూడా నాగార్జున హీరోగా నిలిచారని కితాబిచ్చారు.

హైదరాబాద్ నగరంలోని అత్యంత కీలకమైన హైటెక్ సిటీ ప్రాంతంలో పునరుద్ధరించిన తమ్మిడికుంట చెరువును ముఖ్యమంత్రి రేవంత్ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో మాట్లాడారు. నగరంలో చెరువులను చెరబట్టిన వారి నుంచి విముక్తి కల్పించడంలో ఎలాంటి సమస్యలొచ్చినా ఎదుర్కొని నిలబడి పరిష్కరించి నగరాన్ని అభివృద్ధి వైపు నడిపించడంలో ప్రభుత్వం చిత్తశుద్ధితో పనిచేస్తుందని స్పష్టం చేశారు సీఎం రేవంత్.

TG: హైకోర్టు సీరియస్.. రంగనాథ్ హాజరయ్యేలా చూడాలని డీజీపీకి ఆర్డర్!తెలంగాణSwechaa11 Nov 2026, 10:12 PM

TG: హైకోర్టు సీరియస్.. రంగనాథ్ హాజరయ్యేలా చూడాలని డీజీపీకి ఆర్డర్!

TG: హైదరాబాద్ నగరంలో అక్రమ నిర్మాణాలపై విరుచుకుపడుతూ నిత్యం వార్తల్లో నిలుస్తున్న ‘హైడ్రా’ కమిషనర్ ఏవీ రంగనాథ్‌పై తెలంగాణ హైకోర్టు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. ఓ కోర్టు ధిక్కార వ్యవహారానికి సంబంధించి విచారణకు వ్యక్తిగతంగా హాజరుకావాలంటూ ధర్మాసనం ఇచ్చిన ఆదేశాలను బేఖాతరు చేయడాన్ని న్యాయస్థానం తీవ్రంగా పరిగణించింది. వ్యక్తిగత హాజరు నుంచి మినహాయింపు ఇవ్వాలంటూ అధికారులు దాఖలు చేసిన పిటిషన్లను కొట్టివేస్తూ, రంగనాథ్ రాకపై సీరియస్ ఆదేశాలు జారీ చేసింది.

TG: ‘ఆంధ్రకు నీళ్లు.. తెలంగాణకు ఎక్కిళ్లు’.. రేవంత్ సర్కార్‌పై కేటీఆర్ ఫైర్!తెలంగాణSwechaa11 Nov 2026, 09:48 PM

TG: ‘ఆంధ్రకు నీళ్లు.. తెలంగాణకు ఎక్కిళ్లు’.. రేవంత్ సర్కార్‌పై కేటీఆర్ ఫైర్!

TG: తెలంగాణలో ప్రస్తుతం నెలకొన్న దుర్భిక్ష పరిస్థితులు ప్రకృతి తెచ్చినవి కావని, రేవంత్ రెడ్డి వంటి పాలకుల ‘వికృతి’ వల్ల వచ్చిన కృత్రిమ కరువు అని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ నిప్పులు చెరిగారు. కేసీఆర్‌కు ఎక్కడ మంచి పేరు వస్తుందోనన్న రాజకీయ కక్ష్యతోనే వేలాది టీఎంసీల ప్రాజెక్టుల నీటిని దిగువకు వదిలేసి, తెలంగాణ రైతుల గొంతు ఎండగట్టారని మండిపడ్డారు. బుధవారం నిర్మల్ జిల్లా కేంద్రంలో నిర్వహించిన ‘రైతు గర్జన’ భారీ బహిరంగ సభలో కేటీఆర్ పాల్గొని మాట్లాడారు.సీఎం రేవంత్ రెడ్డి ద్వంద్వ వైఖరిని ఎండగడుతూ కేటీఆర్ తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. "పట్టిసీమ దగ్గర ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు నీటిని ఎత్తిపోసుకుంటుంటే.. రేవంత్ రెడ్డి కన్నేపల్లి, దేవాదుల దగ్గర గోదావరి జలాలను ఎందుకు ఎత్తిపోయలేదు?

మేడ్చల్ కలెక్టర్‌పై హైకోర్టు సీరియస్..తెలంగాణSwechaa11 Nov 2026, 09:46 PM

మేడ్చల్ కలెక్టర్‌పై హైకోర్టు సీరియస్..

High Court: మేడ్చల్-మల్కాజ్‌గిరి జిల్లా కలెక్టర్ మిక్కిలినేని మనుచౌదరిపై హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. ప్రభుత్వ భూముల స్వాధీనంలో కలెక్టర్ నిర్లక్ష్యంపై హైకోర్టు తీవ్ర అసహనం వ్యక్తం చేసింది. బుధవారం కోర్టు విచారణకు కలెక్టర్ మను చౌదరి హాజరు కాలేదు. దీంతో న్యాయస్థానం సీరియస్ అయ్యింది. కలెక్టర్ మను చౌదరిని గురువారం ఉదయం కోర్టులో హాజరుపరచాలని మల్కాజ్‌గిరి పోలీస్ కమిషనర్‌కు ఆదేశాలు జారీ చేసింది. హైకోర్టు ఎన్నిసార్లు చెప్పినా ప్రభుత్వ భూములను కలెక్టర్లు కాపాడలేకపోతున్నారన్న విమర్శలు వినిపిస్తున్నాయి.