స్వేచ్ఛ షార్ట్స్ — తాజా తెలుగు వార్తలు

నాపై కుట్ర జరుగుతోంది- డీజీపీకి వీసీ జానయ్య సంచలన లేఖతెలంగాణSwechaa10 Nov 2026, 11:31 PM

నాపై కుట్ర జరుగుతోంది- డీజీపీకి వీసీ జానయ్య సంచలన లేఖ

Aldas Janaiah: ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ వ్యవసాయ విశ్వవిద్యాలయం (PJTAU) వైస్ ఛాన్సలర్ ప్రొఫెసర్ అల్దాస్ జానయ్యపై వచ్చిన లైంగిక వేధింపుల ఆరోపణలు సంచలనం రేపుతున్నాయి. జానయ్య తనను లైంగికంగా వేధించాడని అసిస్టెంట్ ప్రొఫెసర్ తీవ్ర ఆరోపణలు చేశారు. ఈ వ్యవహారంపై వీసీ జానయ్య స్పందించారు. డీజీపీ సీవీ ఆనంద్ కు లేఖ రాశారు. తనపై మహిళా ఫ్యాకల్టీ చేసిన ఆరోపణల వెనకున్న కుట్ర కోణాన్ని వెలికితీసి, నిష్పక్షపాతంగా విచారణ జరపాలని డీజీపీ సీవీ ఆనంద్‌ను కోరారు వీసీ జానయ్య. ఈ ఆరోపణల వెనుకున్న నిజానిజాలను నిగ్గుతేల్చాలన్నారు.

మహిళా భద్రతకు ''భరోసా కేంద్రం'' అండ..అభిప్రాయంSwechaa10 Nov 2026, 11:05 PM

మహిళా భద్రతకు ''భరోసా కేంద్రం'' అండ..

మహిళలు, బాలికల భద్రతకు మరింత భరోసా కల్పించే లక్ష్యంతో సైబరాబాద్‌లో నూతనంగా నిర్మించిన భరోసా కేంద్రం అందుబాటులోకి వచ్చింది. ఈ కేంద్రం పూర్తి కావడానికి ఏడేళ్ల సమయం పట్టిందని, ఇన్నాళ్ల నిరీక్షణ తర్వాత కేంద్రం ప్రారంభం కావడం సంతోషంగా ఉందన్నారు డీజీపీ సీవీ ఆనంద్‌. లైంగిక దాడులు, ఇతర నేరాల్లో బాధితులకు వైద్య పరీక్షలు, మానసిక కౌన్సెలింగ్‌, న్యాయపరమైన సహాయం, అవసరమైన సంప్రదింపులను ఒకే వేదికపై అందించడం భరోసా కేంద్రాల ప్రత్యేకత అని వివరించారు.

డ్యూటీకి రాకుండానే సంతకాలు.. హరీశ్ రావు ఆకస్మిక తనిఖీలో బయటపడ్డ డాక్టర్ల బాగోతంతెలంగాణSwechaa10 Nov 2026, 10:42 PM

డ్యూటీకి రాకుండానే సంతకాలు.. హరీశ్ రావు ఆకస్మిక తనిఖీలో బయటపడ్డ డాక్టర్ల బాగోతం

మాజీమంత్రి హరీశ్ రావు సిద్ధిపేట ప్రభుత్వ ఆసుపత్రిలో ఆకస్మిక తనిఖీ చేశారు. ఈ క్రమంలో విస్తుపోయే విషయాలు వెలుగుచూశాయి. డాక్టర్ల బాగోతం బయటపడింది. డ్యూటీ రిజిస్ట్రర్ లో సంతకాలు చేసిన డాక్టర్లు.. డ్యూటీలో మాత్రం లేరు. దీంతో వైద్యుల విధుల నిర్వహణపై హరీశ్ రావు ఆగ్రహం వ్యక్తం చేశారు. డ్యూటీ రిజిస్టర్ లో సంతకాలు ఉన్నప్పటికీ పలువురు ఎమర్జెన్సీ విభాగాల డాక్టర్లు అందుబాటులో లేకపోవడంపై అసహనాన్ని వ్యక్తం చేశారు. 318 మంది డాక్టర్లు ఉన్న చోట 301 మందే ఇన్-పేషెంట్లా? అని విస్తుపోయారు. మధ్యాహ్నం 2:30 గంటలకే ఆర్థోపెడిక్, జనరల్ సర్జరీ, మెడిసిన్, రేడియాలజీ, కంటి విభాగాల్లో ఒక్క డాక్టరూ లేకపోవడంపై హరీశ్ రావు ఆగ్రహం వ్యక్తం చేశారు.

ఎట్టకేలకు ప్రభుత్వ పాఠశాల నిర్మాణానికి భూమి..తెలంగాణSwechaa10 Nov 2026, 09:34 PM

ఎట్టకేలకు ప్రభుత్వ పాఠశాల నిర్మాణానికి భూమి..

KPHB: హైదరాబాద్ కూకట్‌పల్లి నియోజకవర్గంలోని కేపీహెచ్‌బీ డివిజన్ రమ్యా గ్రౌండ్ వద్ద ప్రభుత్వ పాఠశాల నిర్మాణం కోసం గతంలో కేటాయించిన 2.39 ఎకరాల స్థలాన్ని ఎట్టకేలకు హౌసింగ్ బోర్డు నుంచి విద్యాశాఖకు బదిలీ చేయడం పట్ల కూకట్‌పల్లి ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు హర్షం వ్యక్తం చేశారు. కలెక్టర్ మనూ చౌదరిని మర్యాదపూర్వకంగా కలిసి ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారాయన.

మూడేళ్ల క్రితమే పునాదులు

సుమారు మూడేళ్ల క్రితం రమ్యా గ్రౌండ్ వద్ద ప్రభుత్వ పాఠశాల నిర్మాణానికి చర్యలు చేపట్టి పాఠశాల పునాదులు కూడా వేయడం జరిగింది. అయితే ప్రభుత్వం మారడంతో హౌసింగ్ బోర్డ్ స్థలాలను అమ్మకాలకు పెట్టడంతో పాఠశాల నిర్మాణ ప్రక్రియ ముందుకు సాగలేదు. ఈ నేపథ్యంలో హౌసింగ్ బోర్డ్ స్థలాలు అమ్మొద్దంటూ ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు ప్రజా మద్దతుతో పోరాటం చేశారు. ముఖ్యంగా హౌసింగ్ బోర్డు పరిధిలో ఉన్న 2.39 ఎకరాల స్థలాన్ని విద్యాశాఖకు బదిలీ చేయడంలో జాప్యం జరగడంతో పాఠశాల నిర్మాణానికి ఆటంకం ఏర్పడింది.

ప్రజలకు పోలీసులే మొదటి నమ్మకం- సీఎం రేవంత్తెలంగాణSwechaa10 Nov 2026, 09:19 PM

ప్రజలకు పోలీసులే మొదటి నమ్మకం- సీఎం రేవంత్

Cm Revanth: టెక్నాలజీ వాడుకుంటూ నేరాల నియంత్రణకు యువ అధికారులు పని చేయాలని కొత్త డీఎస్పీలకు సందేశం ఇచ్చారు సీఎం రేవంత్ రెడ్డి. ప్రజలకు ఏ సమస్య వచ్చినా మొదట గుర్తుకొచ్చేది పోలీస్ అని చెప్పారు. పారదర్శక పోలీసింగ్ ద్వారా ప్రజల నమ్మకాన్ని సంపాదించాలని సూచించారు. హైదరాబాద్‌లోని ఎంసీఆర్ హెచ్‌ఆర్‌డీ ఇన్‌స్టిట్యూట్‌లో డిప్యూటీ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ (డీఎస్పీ) -2025 రెండో బ్యాచ్ శిక్షణ ముగింపు కార్యక్రమంలో ముఖ్యమంత్రి రేవంత్ పాల్గొన్నారు.

Tollywood: క్రేజీ కాంబో..సిద్ధు జొన్నలగడ్డను సుకుమార్ నిలబెట్టగలడా..సినిమాSwechaa10 Nov 2026, 09:02 PM

Tollywood: క్రేజీ కాంబో..సిద్ధు జొన్నలగడ్డను సుకుమార్ నిలబెట్టగలడా..

Tollywood: వరుస ఫ్లాపుల్లో ఉన్న స్టార్ బాయ్ సిద్ధు జొన్నలగడ్డతో లెక్కల మాస్టారు సుకుమార్ ఓ సినిమాను చేస్తున్నాడు. తాజాగా, ఈ ప్రాజెక్ట్‌ను ప్రకటించారు. దీంతో, క్రేజీ కాంబో..సిద్ధు జొన్నలగడ్డను సుకుమార్ నిలబెట్టగలడా..అంటూ ఫిల్మ్ సర్కిల్స్‌లో చర్చలు మొదలయ్యాయి. గుంటూరు టాకీస్ లాంటి సినిమాలతో టాలీవుడ్‌లో స్టార్ బాయ్‌గా గుర్తింపు తెచ్చుకున్న సిద్ధు జొన్నలగడ్డకు ఇప్పుడు ఒక సాలీడ్ హిట్ చాలా అవసరం.

Tollywood: అల్లు అర్జున్ మాస్టర్ ప్లాన్..హైదరాబాద్‌కి రాకా షిఫ్ట్!సినిమాSwechaa10 Nov 2026, 08:38 PM

Tollywood: అల్లు అర్జున్ మాస్టర్ ప్లాన్..హైదరాబాద్‌కి రాకా షిఫ్ట్!

Tollywood: ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా రూపొందుతోన్న పాన్ వరల్డ్ సినిమా రాకా. కోలీవుడ్ స్టార్ డైరెక్టర్ అట్లీ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ భారీ ప్రాజెక్ట్ షూటింగ్ ప్రస్తుతం ముంబైలో జరుగుతోంది. అయితే, తాజా సమాచారన్ మేరకు..త్వరలో రాకా బృందం హైదరాబాద్‌కి షిఫ్ట్ కాబోతోందట. పుష్ప 2 తర్వాత అల్లు అర్జున్ నటిస్తున్న సినిమా కావడంతో రాకా చిత్రంపై అంచనాలు భారీగా నెలకొన్నాయి.

వంట గదుల్లో బొద్దింకలు, ఎక్స్‌పైరీ పదార్ధాలు.. క్లౌడ్ కిచెన్లలో దారుణాలుతెలంగాణSwechaa10 Nov 2026, 07:56 PM

వంట గదుల్లో బొద్దింకలు, ఎక్స్‌పైరీ పదార్ధాలు.. క్లౌడ్ కిచెన్లలో దారుణాలు

TG Safe: హైదరాబాద్‌లోని క్యూర్ ప్రాంతంలో క్లౌడ్ కిచెన్లపై TG SAFE FOOD WING, ఎన్‌ఫోర్స్‌మెంట్ అధికారులు మెరుపు దాడులు చేశారు. మొత్తం 25 ప్రత్యేక బృందాలు రంగంలోకి దిగాయి. పలు క్లౌడ్ కిచెన్లలో ఏకకాలంలో తనిఖీలు నిర్వహించాయి. ఈ తనిఖీల్లో ఆహార భద్రతకు సంబంధించిన పలు ఆందోళనకరమైన అంశాలు వెలుగులోకి వచ్చాయి.

వంట గదుల్లో బొద్దింకలు, కీటకాలు

తనిఖీల సందర్భంగా ఒక కిచెన్‌లో సుమారు 15 బాక్సుల ఫుడ్ కలర్స్‌ అధికారులు గుర్తించారు. గడువు ముగిసిన సగ్గుబియ్యం నిల్వలను కూడా కనుగొన్నారు. అంతేకాకుండా వంట గదుల్లో బొద్దింకలు, ఇతర కీటకాలు ఉండటం చూసి షాక్ అయ్యారు. కూరగాయలు కట్ చేసేందుకు ప్లాస్టిక్ చాపింగ్ బోర్డులను ఉపయోగిస్తున్నట్లు తనిఖీల్లో బయటపడింది. మరోవైపు బొంబాయి రవ్వలో కూడా కొన్ని రకాల కీటకాలను గుర్తించడం కలకలం రేపింది.

సైబరాబాద్, లక్డీకాపూల్‌లో కొత్త వన్‌వే రూట్లుతెలంగాణSwechaa10 Nov 2026, 07:39 PM

సైబరాబాద్, లక్డీకాపూల్‌లో కొత్త వన్‌వే రూట్లు

One Way: కేబీఆర్ పార్క్ వద్ద వన్‌వే విధానం అమలుతో ట్రాఫిక్ కదలికలు మెరుగుపడ్డాయి. ఈ నేపథ్యంలో సైబరాబాద్ ఐటీ కారిడార్‌తో పాటు లక్డీకాపూల్‌లోనూ ఇలాంటి మార్పులకు ట్రాఫిక్ పోలీసులు కసరత్తు చేస్తున్నారు. రద్దీ తగ్గించడం, జంక్షన్ల వద్ద వెయిటింగ్ టైమ్‌ను తగ్గించడం లక్ష్యంగా ఈ ప్రతిపాదనలు రూపొందించారు.

మై హోమ్ భూజా వరకు వన్‌వే లూప్‌

సైబరాబాద్ ఐటీ కారిడార్‌లో బయోడైవర్సిటీ జంక్షన్, ఐకియా రోటరీ, రహేజా మైండ్‌స్పేస్ సీ-గేట్, నాలెడ్జ్ సిటీ, డల్లాస్ సెంటర్ మీదుగా మై హోమ్ భూజా వరకు వన్‌వే లూప్‌ను ప్రతిపాదించారు. ట్రాఫిక్ సిమ్యులేషన్లు నిర్వహించి, ఐటీ కంపెనీలు, ఇతర వర్గాలతో చర్చించిన తర్వాత దశలవారీగా అమలు చేయనున్నారు.

Tollywood: మైత్రీ దక్కించుకున్న వారణాసి థియేట్రికల్ రైట్స్..సినిమాSwechaa10 Nov 2026, 06:37 PM

Tollywood: మైత్రీ దక్కించుకున్న వారణాసి థియేట్రికల్ రైట్స్..

Tollywood: దర్శకధీరుడు ఎస్.ఎస్. రాజమౌళి అత్యంత ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిస్తున్న సినిమా వారణాసి. ఈ గ్లోబల్ మూవీపై రోజురోజుకీ అంచనాలు రెట్టింపవుతున్నాయి. సూపర్‌స్టార్ మహేష్ బాబు హీరోగా నటిస్తున్న ఈ సినిమాలో గ్లోబల్ బ్యూటీ ప్రియాంక చోప్రా హీరోయిన్‌గా నటిస్తున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో దేశవ్యాప్తంగా భారీ క్రేజ్ ఏర్పడింది. ఇప్పుడు ఈ సినిమా థియేట్రికల్ బిజినెస్‌కు సంబంధించిన వార్తలు ఇండస్ట్రీలో హాట్ టాపిక్‌గా మారాయి.

జీవో నెంబర్ 259ను సవరించాలి, బోరుబావుల రంగాన్ని సంక్షోభం నుంచి కాపాడాలితెలంగాణSwechaa10 Nov 2026, 06:28 PM

జీవో నెంబర్ 259ను సవరించాలి, బోరుబావుల రంగాన్ని సంక్షోభం నుంచి కాపాడాలి

Telangana: బోరుబావుల తవ్వకాల రంగం ఎదుర్కొంటున్న సంక్షోభాన్ని నివారించి, ఈ రంగంపై ఆధారపడి జీవిస్తున్న వేలాది మంది కార్మికులు, డ్రైవర్లు, వ్యాపారుల ఉపాధిని కాపాడాలని తెలంగాణ రిగ్ ఓనర్స్ అసోసియేషన్ ప్రభుత్వాన్ని కోరింది. ప్రభుత్వం జారీ చేసిన జీవో నంబర్ 259ను తక్షణమే సవరించి, ఆచరణ సాధ్యమైన నిబంధనలు అమలు చేయాలని అసోసియేషన్ అధ్యక్షుడు ముస్కు అంజిరెడ్డి, ప్రధాన కార్యదర్శి నర్సిరెడ్డి విజ్ఞప్తి చేశారు.

సోమవారం సోమాజిగూడ ప్రెస్ క్లబ్‌లో అసోసియేషన్ ప్రతినిధులు మీడియాతో మాట్లాడారు. బోరుబావుల తవ్వకాలపై విధించిన ఆంక్షల కారణంగా రిగ్ కార్మికులు, ఇతర రాష్ట్రాల నుంచి వలస వచ్చి పనిచేస్తున్న డ్రైవర్లు, వాల్వ్ కార్మికులు, నిర్మాణ రంగంపై ఆధారపడిన మేసన్లు ఉపాధి కోల్పోయే పరిస్థితి ఏర్పడిందని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ రంగం స్తంభిస్తే నిర్మాణ రంగంపైనా తీవ్ర ప్రభావం పడుతుందని హెచ్చరించారు.

సీఎం రేవంత్.. వెయ్యి కోట్ల హామీ ఏమైంది?తెలంగాణSwechaa10 Nov 2026, 06:10 PM

సీఎం రేవంత్.. వెయ్యి కోట్ల హామీ ఏమైంది?

Rs Praveen Kumar: దేశవ్యాప్తంగా పేరొందిన, వందేళ్ల చరిత్ర కలిగిన ఉస్మానియా యూనివర్సిటీలో ఏళ్లుగా పని చేస్తున్న నాన్ టీచింగ్ ఉద్యోగులు ఇప్పటికీ హెల్త్ కార్డుల కోసం పోరాడాల్సి రావడం బాధాకరమన్నారు బీఆర్ఎస్ నేత ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్. నాన్ టీచింగ్ ఉద్యోగ జేఏసీ ఆధ్వర్యంలో జరిగిన మహా ధర్నాకు హాజరై హాజరై వారి పోరాటానికి సంఘీభావం తెలిపారాయన. తెలంగాణలో ముఖ్యమంత్రే విద్యాశాఖ మంత్రి, ఆయన తలుచుకుంటే ఒక్క నిమిషంలో ఈ ఉద్యోగుల సమస్యలు నెరవేరుతాయి. కానీ వారికి చిత్తశుద్ధి లేదు అని విమర్శించారు.

పాలమూరుకు సీఎం రేవంత్ చేసింది గుండు సున్నాతెలంగాణSwechaa10 Nov 2026, 05:32 PM

పాలమూరుకు సీఎం రేవంత్ చేసింది గుండు సున్నా

Niranjan Reddy: సీఎం రేవంత్ రెడ్డిపై ఆగ్రహం వ్యక్తం చేశారు మాజీమంత్రి నిరంజన్ రెడ్డి. పాలమూరుకు సీఎం రేవంత్ చేసింది గుండు సున్నా అని ఆయన విమర్శించారు. పాలమూరుకు ఏం చేశారో చెప్పాలని ముఖ్యమంత్రిని నిలదీశారు. కేసీఆర్, కేటీఆర్ ను తిట్టడమే రేవంత్ రెడ్డి పని మండిపడ్డారు. తిట్లతో రైతులకు నీళ్లు రావని విషయాన్ని రేవంత్ రెడ్డి గ్రహించాలన్నారు. ఈ మూడేళ్లలో కొత్తగా ఒక ఎకరానికైనా నీళ్లు ఇచ్చారా? ఒక్క చెక్ డ్యామ్ అయినా కట్టారా? అని సీఎం రేవంత్ ను ప్రశ్నించారు నిరంజన్ రెడ్డి. పాలమూరు-రంగారెడ్డి పనులు ఎందుకు పూర్తి చేయలేదని నిలదీశారు. 10 నుంచి 15శాతం పనులే మిగిలి ఉన్నాయన్నారు. ఈ మూడేళ్లలో పాలమూరు మెయిన్ కెనాల్ లో కనీసం మట్టి తీయలేకపోయారని ధ్వజమెత్తారు.

Tollywood: టాలీవుడ్ డైరెక్టర్స్‌ను చిరంజీవి పక్కన పెట్టారా?సినిమాSwechaa10 Nov 2026, 05:31 PM

Tollywood: టాలీవుడ్ డైరెక్టర్స్‌ను చిరంజీవి పక్కన పెట్టారా?

Tollywood: టాలీవుడ్ డైరెక్టర్స్‌ను చిరంజీవి పక్కన పెట్టారా? ప్రస్తుతం సోషల్ మీడియాలో, ఫిలిం సర్కిల్స్‌లో వస్తున్న వార్తలను చూస్తుంటే అదే అనిపిస్తోంది. ప్రస్తుతం, చేస్తున్న సినిమాలను పూర్తి చేసిన తర్వాత దాదాపుగా తమిళ, మలయాళ దర్శకులకే గ్రీన్ సిగ్నల్ ఇచ్చేలా చిరు లైనప్ చూస్తుంటే అర్థమవుతోంది. సంక్రాంతికి కాకా చిత్రాన్ని రిలీజ్ చేస్తున్న చిరు, విశ్వంభర కూడా మార్చి లోపు రిలీజ్ చేసేలా ప్లాన్ చేస్తున్నారు.

ఉద్యమకారుడి కుటుంబానికి అండగా బీఆర్ఎస్.. 10లక్షల ఆర్థిక సాయంతెలంగాణSwechaa10 Nov 2026, 03:42 PM

ఉద్యమకారుడి కుటుంబానికి అండగా బీఆర్ఎస్.. 10లక్షల ఆర్థిక సాయం

Harish Rao: తెలంగాణ ఉద్యమకారుడు వేముల లక్ష్మణ్ గౌడ్ మృతి బాధాకరమని మాజీమంత్రి హరీశ్ రావు అన్నారు. లక్ష్మణ్ గౌడ్ కుటుంబసభ్యులను హరీశ్ రావు పరామర్శించారు. లక్ష్మణ్ గౌడ్ చిత్రపటానికి పూలమాల వేసి నివాళి అర్పించారు. బీఆర్ఎస్ పార్టీ తరపున లక్ష్మణ్ గౌడ్ కుటుంబానికి 10 లక్షల ఆర్థిక సాయం అందజేశారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్ రెడ్డి, ఎర్రోళ్ల శ్రీనివాస్ పాల్గొన్నారు. జనగామ జిల్లా బచ్చన్నపేట మండలం కొన్నే గ్రామానికి చెందిన లక్ష్మణ్ గౌడ్ ఇటీవల ఆత్మహత్య చేసుకున్నారు.

Crime : ఏకాంతంగా ఉన్నప్పుడు చూశాడని బాలుడిపై కిరాతకం!తెలంగాణSwechaa10 Nov 2026, 03:37 PM

Crime : ఏకాంతంగా ఉన్నప్పుడు చూశాడని బాలుడిపై కిరాతకం!

వివాహేతర సంబంధాల ముసుగులో కొందరు దారుణాలకు తెగబడుతున్నారు. చంపడానికి లేదా చావడానికైనా సిద్ధపడుతున్నారు. ఈ క్రమంలోనే ఓ వివాహిత ఆమె ప్రియుడితో కలిసి ఓ బాలుడిని దారుణంగా హత్యచేశారు. అనంతరం ఏమీ తెలియనట్టు అక్కడి నుంచి జారుకునేందుకు ప్లాన్ చేశారు. పోలీసులు రంగప్రవేశం చేయడంతో వారి గుట్టు రట్టయింది. ఈఘటన ఖమ్మం జిల్లా కల్లూరు మండలం చిన్నకొరుకొండలో మంగళవారం ఆలస్యంగా వెలుగుచూసింది.వివరాల్లోకివెళితే.. అపర్ణ అనే మహిళ భర్తతో విడిపోయి తన అమ్మమ్మ ఇంట్లో ఉంటోంది.ఈ క్రమంలోనే అదే గ్రామానికి చెందిన అజయ్‌తో ఆమెకు వివాహేతర సంబంధం ఏర్పడింది.వీరిద్దరు ఏకాంతంగా ఉన్నప్పుడు రవి (15) అనే బాలుడు చూశాడు. కుటుంబ సభ్యులకు ఈ విషయం చెప్తానని హెచ్చరించడంతో అతని హత్యకు అపర్ణ తన ప్రియుడితో కలిసి ప్లాన్ చేసింది. ఈ నేపథ్యంలోనే గత నెల 24వ తేదీన మాయమాటలు చెప్పి బాలుడిని ఊరి బయటకు తీసుకెళ్లారు ఇద్దరు. అక్కడ కూల్‌డ్రింక్‌లో గడ్డి మందు కలిపి అతనితో తాగించారు.

ఇంటర్నెట్ అవసరం లేని వాతావరణ పరికరం.. హైదరాబాద్ విద్యార్థి సరికొత్త ఆవిష్కరణ!తెలంగాణSwechaa10 Nov 2026, 03:15 PM

ఇంటర్నెట్ అవసరం లేని వాతావరణ పరికరం.. హైదరాబాద్ విద్యార్థి సరికొత్త ఆవిష్కరణ!

 ప్రకృతి వైపరీత్యాలు సంభవించినప్పుడు కనీసం వాతావరణ సమాచారం కూడా అందని విపత్కర పరిస్థితుల్లో ఉపగ్రహాల సాయంతో ఆ లోటును భర్తీ చేసేందుకు హైదరాబాద్‌కు చెందిన 12వ తరగతి విద్యార్థి ఆగమ్‌ జైన్‌ అద్భుత ఆవిష్కరణ చేశాడు. ఇంటర్నెట్ లేదా మొబైల్ నెట్‌వర్క్ కనెక్షన్ లేకుండానే వాతావరణ ఉపగ్రహాల నుంచి నేరుగా మేఘాలకు సంబంధించిన చిత్రాలను అందుకునే వినూత్న పరికరాన్ని రూపొందించి తన అసాధారణ ప్రతిభను చాటుకున్నాడు.

సిమ్ లేకపోతే నిలిచిపోనున్న వాట్సాప్.. కేంద్రం కీలక నిబంధనలు!వ్యాపారంSwechaa10 Nov 2026, 03:01 PM

సిమ్ లేకపోతే నిలిచిపోనున్న వాట్సాప్.. కేంద్రం కీలక నిబంధనలు!

 దేశవ్యాప్తంగా విపరీతంగా పెరిగిపోతున్న డిజిటల్ అరెస్ట్ స్కామ్‌లు, ఫిషింగ్ మోసాలు, సైబర్ నేరాలకు అడ్డుకట్ట వేసే లక్ష్యంతో కేంద్ర ప్రభుత్వ టెలికాం శాఖ (DoT) అత్యంత సంచలనాత్మక నిర్ణయం తీసుకుంది. ఇకపై వాట్సాప్, టెలిగ్రామ్ వంటి ప్రముఖ మెసేజింగ్ యాప్‌లను ఉపయోగించాలంటే, సదరు ఖాతాకు లింక్ అయిన యాక్టివ్ సిమ్ కార్డ్ (SIM Card) తప్పనిసరిగా అదే స్మార్ట్‌ఫోన్ పరికరంలో అమర్చి ఉండాలనే ‘సిమ్ బైండింగ్’ (SIM Binding) విధానాన్ని కేంద్రం అమల్లోకి తీసుకువస్తోంది.

సంపాదన మంత్రులది..  ఖర్చేమో మాదా?తెలంగాణSwechaa10 Nov 2026, 02:57 PM

సంపాదన మంత్రులది.. ఖర్చేమో మాదా?

తెలంగాణ కాంగ్రెస్‌లో మరోసారి విభేదాలు బయటపడ్డాయి.వచ్చే ఏడాది మార్చిలో ఖాళీ ఏర్పడిన రెండు పట్టభద్రుల ఎమ్మెల్సీ స్థానాలకు ఎన్నికలు జరగనున్న విషయం తెలిసిందే. అయితే, ఈ ఎన్నికల్లో ఎలాగైనా గెలవాలని అధికార కాంగ్రెస్ ప్రయత్నిస్తోంది. సీఎం రేవంత్ రెడ్డి ఈ మేరకు ఇప్పటికే పార్టీ నేతలకు ఆదేశాలు జారీ చేశారు. జిల్లాల వారీగా ఇన్‌చార్జీలను సైతం నియమించారు.కానీ, వారి నుంచి ఆశించిన స్థాయిలో గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ అభ్యర్థులకు సహకారం అందడం లేదని తెలుస్తోంది. ఎందుకంటే మంత్రుల తీరుపై స్థానిక ఎమ్మెల్యేలు పెదవి విరుస్తున్నారు.

మ్యాచ్ రద్దైనా.. ధోనీ రికార్డును చెరిపేసిన విరాట్ కోహ్లీ!క్రీడలుSwechaa10 Nov 2026, 02:27 PM

మ్యాచ్ రద్దైనా.. ధోనీ రికార్డును చెరిపేసిన విరాట్ కోహ్లీ!

 టీమిండియా స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ ఖాతాలో మరో అరుదైన మైలురాయి చేరింది. భారత్, న్యూజిలాండ్ మధ్య హామిల్టన్‌లోని సెడ్డన్ పార్క్ వేదికగా జరగాల్సిన మూడో వన్డే మ్యాచ్ వర్షం కారణంగా ఒక్క బంతి కూడా పడకుండానే పూర్తిగా రద్దయింది. అయినప్పటికీ, టాస్ ముగిసి భారత తుది జట్టును ప్రకటించడంతో విరాట్ కోహ్లీ ఈ మ్యాచ్‌ ద్వారా ఒక విశిష్ట రికార్డును సొంతం చేసుకున్నాడు. న్యూజిలాండ్ గడ్డపై అత్యధిక వన్డే మ్యాచ్‌లు ఆడిన భారత ఆటగాళ్ల జాబితాలో మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీని అధిగమించి కోహ్లీ రెండో స్థానానికి చేరుకున్నాడు.

పవన్ కల్యాణ్ విడాకులపై స్పందించిన టీడీపీ, వైసీపీ.. షాకింగ్ నిర్ణయం!వైరల్ న్యూస్Swechaa10 Nov 2026, 01:29 PM

పవన్ కల్యాణ్ విడాకులపై స్పందించిన టీడీపీ, వైసీపీ.. షాకింగ్ నిర్ణయం!

 ఏపీ డిప్యూటీ సీఎం, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్, ఆయన సతీమణి అన్నా లెజినోవా తమ 13ఏళ్ల వైవాహిక బంధానికి ముగింపు పలుకుతున్నట్లు ప్రకటించిన విషయం తెలిసిందే. ఈ విషయం ఇప్పుడు తెలుగు రాష్ట్రాల్లో తీవ్ర చర్చనీయాంశమైంది. పరస్పర అంగీకారంతో విడిపోతున్నామని, తమ వ్యక్తిగత గోప్యతను గౌరవించాలని వారు కోరిన నేపథ్యంలో, రాష్ట్రంలోని ప్రధాన రాజకీయ పార్టీలైన తెలుగుదేశం (TDP), వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ (YSRCP) అప్రమత్తమై కీలక నిర్ణయం తీసుకున్నాయి.   ఈ మేరకు రాజకీయాలకు అతీతంగా నాయకుల వ్యక్తిగత జీవితాలను టార్గెట్ చేయవద్దంటూ తమ పార్టీ శ్రేణులు, సోషల్ మీడియా కార్యకర్తలకు రెండు పార్టీల అధిస్థానాలు స్పష్టమైన, కఠినమైన మార్గదర్శకాలను జారీ చేశాయి.

Prabhas: RFCలో జాయిన్ అయిన ప్రభాస్.. మళ్లీ స్పిరిట్‌కు బ్రేకేనా?సినిమాSwechaa10 Nov 2026, 01:28 PM

Prabhas: RFCలో జాయిన్ అయిన ప్రభాస్.. మళ్లీ స్పిరిట్‌కు బ్రేకేనా?

Prabhas: పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ ప్రస్తుతం భారీ ప్రాజెక్టులు చేస్తున్న సంగతి తెలిసిందే. అయితే, ఆయన సినిమాల షూటింగ్ షెడ్యూల్స్, విడుదల తేదీల విషయంలో మార్పులు చోటు చేసుకుంటుండటంతో అభిమానులకు ఎప్పటికప్పుడు కొత్త సందేహాలు కలుగుతున్నాయి. ముఖ్యంగా, హను రాఘవపూడి దర్శకత్వంలో రూపొందుతున్న ఫౌజీ, సందీప్ రెడ్డి వంగా దర్శకత్వంలో తెరకెక్కుతోన్న స్పిరిట్ సినిమాలపై ఆసక్తి ఎక్కువగా ఉంది. తాజాగా, ప్రభాస్ మళ్లీ ఫౌజీ షూటింగ్‌లో జాయిన్ కావడంతో స్పిరిట్ పరిస్థితి ఏంటనే సందేహాలు మొదలైయ్యాయి.

Crime : లోన్ యాప్ వేధింపులు.. కానిస్టేబుల్  ఆత్మహత్యక్రైమ్Swechaa10 Nov 2026, 01:08 PM

Crime : లోన్ యాప్ వేధింపులు.. కానిస్టేబుల్ ఆత్మహత్య

ఆన్లైన్ లోన్‌యాప్ నిర్వాహకుల వేధింపులకు ఓ కానిస్టేబుల్‌ బలయ్యాడు. ఈ ఘటన హైదరాబాద్‌లోని పహాడీషరీఫ్‌ పోలీస్‌‌‌స్టేషన్‌ పరిధిలో మంగళవారం ఆలస్యంగా వెలుగుచూసింది. వివరాల్లోకివెళితే.. నాలుగు నెలల కిందట ఓ లోన్ యాప్‌ ద్వారా శ్రీను అనే కానిస్టేబుల్ రూ.40 వేల రుణం తీసుకున్నాడు. అప్పు సకాలంలో చెల్లించకపోవడంతో అతనికి వేధింపులు మొదలయ్యాయి.గంటకోసారి ఫోన్లు చేసి డబ్బులు చెల్లించాలని లోన్ యాప్ నిర్వాహకులు ఒత్తిడి చేయసాగారు. డబ్బులు చెల్లిస్తానని, కొంత గడువు ఇవ్వాలని చెబుతున్నా వినకుండా నగ్న చిత్రాలను కుటుంబ సభ్యులు, గ్రామస్థులకు పంపిస్తామంటూ బెదిరింపులకు గురిచేసినట్టు తెలిసింది.అంతటితో ఆగకుండా అతని భార్యకు సంబంధించిన నగ్న చిత్రాలు పంపిస్తామంటూ హెచ్చరించారు.రోజురోజుకూ వేధింపులు తీవ్రతరం కావడంతో తీవ్ర మనస్తాపం చెందిన కానిస్టేబుల్ శ్రీను.. ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఉరివేసుకుని బలవన్మరణానికి పాల్పడ్డాడ

Janhvi Kapoor: ముక్కుకి సర్జరీ చేయించుకున్న తర్వాతే అమ్మ సినిమాలకి ఒప్పుకుంది..సినిమాSwechaa10 Nov 2026, 01:05 PM

Janhvi Kapoor: ముక్కుకి సర్జరీ చేయించుకున్న తర్వాతే అమ్మ సినిమాలకి ఒప్పుకుంది..

Janhvi Kapoor: అతిలోకసుందరి శ్రీదేవి కుమార్తెలలో ఒకరైన జాన్వీ కపూర్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ధడక్ మూవీతో బాలీవుడ్‌లో హీరోయిన్‌గా కెరీర్ ప్రారంభించిన ఈ బ్యూటీ, ఇప్పుడు సౌత్ ఇండస్ట్రీలోనూ వరుస అవకాశాలతో దూసుకెళ్తోంది. ముఖ్యంగా, తెలుగులో ఎన్టీఆర్‌తో కలిసి దేవర, రామ్ చరణ్‌తో చేసిన పెద్ది సినిమాలలో నటించిన తర్వాత ఇక్కడ కూడా మంచి గుర్తింపు తెచ్చుకుంది. కానీ, మొదట్లో మాత్రం ఇండస్ట్రీలోకి వెళ్తానంటే తల్లి శ్రీదేవి ఒప్పుకోలేదని సీక్రెట్ రివీల్ చేసింది.

ప్రధాని పదవిని అందుకే స్వీకరించలేదు.. సోనియాగాంధీ సంచలన వ్యాఖ్యలు!NationalSwechaa10 Nov 2026, 01:05 PM

ప్రధాని పదవిని అందుకే స్వీకరించలేదు.. సోనియాగాంధీ సంచలన వ్యాఖ్యలు!

 కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీ తాను 2004లో దేశ రథసారధిగా ప్రధానమంత్రి బాధ్యతలు స్వీకరించకపోవడానికి గల అసలు కారణాలను వెల్లడిస్తూ సంచలన వ్యాఖ్యలు చేశారు. తాజా ఆత్మకథలో ‘బిలాంగింగ్: ఏ జర్నీ ఆఫ్ లవ్’ (Belonging: A Journey of Love) పేరిట మంగళవారం విడుదలైన ఈ పుస్తకంలో తన రాజకీయ జీవితంలోని అత్యంత కీలక ఘట్టాలు, నిర్ణయాల వెనుక ఉన్న అంతర్గత రహస్యాలను ఆమె పంచుకున్నారు. 2004 లోక్‌సభ ఎన్నికల్లో అధికార ఎన్‌డీఏ కూటమి ఓటమిపాలై కాంగ్రెస్ నాయకత్వంలోని యూపీఏ విజయం సాధించిన వేళ, ప్రధాని పీఠం వద్దని, తాను ఎందుకు తప్పుకోవాల్సి వచ్చిందో స్పష్టంగా వివరించారు.

అమెరికా పోలీసులపై టపాసులతో దాడి.. దేశం పరువు తీస్తున్నారంటూ?NationalSwechaa10 Nov 2026, 12:50 PM

అమెరికా పోలీసులపై టపాసులతో దాడి.. దేశం పరువు తీస్తున్నారంటూ?

ఉద్యోగం, ఉన్నత చదువుల కోసం అమెరికాకు వెళ్లిన భారతీయుల ఆగడాలు శృతి మించుతున్నాయా? అందుకే ఆ దేశ అధ్యక్షుడు ట్రంప్ భారతీయులను టార్గెట్ చేశాడా? చదువు, ఉద్యోగం కోసం వచ్చి అక్కడే సెటిల్ అయ్యి అమెరికన్స్‌ను డామినేట్ చేస్తున్నారనే భారతీయుల మీద ద్వేషం పెరిగి లోకల్స్ దాడులకు తెగబడుతున్నారా? అంటే అవుననే సమాధానాలు వినిపిస్తున్నాయి. దీపావళి రోజున అమెరికాలోని న్యూయార్క్‌లో భారతీయులు రోడ్డుపై టపాసులు కాల్చడం కలకలం రేపింది.దీంతో వాహన దారులు, స్థానికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. దీంతో పరిస్థితిని అదుపు చేయడం కోసం పోలీసులు అక్కడికి వెళ్లగా వారిపైనే టపాసులు విసిరి హ్యాపీ దీపావళి అంటూ సందడి చేశారు. అక్కడే ఉన్న ఇతర భారతీయులు వాళ్లను అడ్డుకోకుండా నవ్వుతూ చోద్యం చూస్తూ ఉండిపోయారు.దీంతో ఇండియన్స్ బిహేవియర్ మీద విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.

కార్తీక మాసోత్సవాలు.. భక్తులతో కిటకిటలాడుతున్న శ్రీశైలక్షేత్రం!SpiritualitySwechaa10 Nov 2026, 12:46 PM

కార్తీక మాసోత్సవాలు.. భక్తులతో కిటకిటలాడుతున్న శ్రీశైలక్షేత్రం!

 శ్రీభ్రమరాంబ మల్లికార్జున స్వామివార్ల దివ్యక్షేత్రమైన శ్రీశైల మహాక్షేత్రంలో పరమ పవిత్రమైన కార్తీక మాసోత్సవాలు మంగళవారం నుంచి అత్యంత వైభవంగా ప్రారంభమయ్యాయి. తెలుగు రాష్ట్రాలతో పాటు పొరుగు రాష్ట్రాల నుంచి లక్షలాది మంది భక్తులు స్వామి, అమ్మవార్ల దర్శనార్థం శ్రీశైలానికి తరలివస్తున్నారు. ఈ పవిత్ర ఉత్సవాలు డిసెంబర్ 9 వరకు నెల రోజుల పాటు నిరంతరం కొనసాగనున్నాయి. ఈ నేపథ్యంలో క్షేత్రానికి విచ్చేసే భక్తజన సందోహానికి ఎలాంటి అసౌకర్యాలు కలగకుండా శ్రీశైల జగద్గురు పీఠం, దేవస్థానం అధికారులు విస్తృతమైన ఏర్పాట్లు పూర్తి చేశారు.

Viral: రూ. 6.5 కిలోల బంగారం, 380 క్యారెట్ల వజ్రాలతో దీపావళి ముగ్గు!వైరల్ న్యూస్Swechaa10 Nov 2026, 12:31 PM

Viral: రూ. 6.5 కిలోల బంగారం, 380 క్యారెట్ల వజ్రాలతో దీపావళి ముగ్గు!

దీపావళి పండుగ సందర్భంగా సాధారణంగా ఇళ్ల ముందు రంగురంగుల ముగ్గులు, పూలతో తీర్చిదిద్దిన అలంకరణలు, వెలిగే ప్రమిదలు కనిపించడం సహజం. అయితే, దుబాయ్ నగరం ఈ శతాబ్దాల నాటి భారతీయ సంప్రదాయానికి అత్యంత ఖరీదైన కొత్త మెరుపులు అద్దింది. రంగులు, పూల స్థానంలో ఏకంగా 6.5 కిలోల బరువున్న నిజమైన బంగారు ఆభరణాలు, వజ్రాలతో అతి భారీ రంగోలీని రూపొందించారు. దుబాయ్‌లోని ప్రముఖ 'సిటీ సెంటర్ డీరా' (City Centre Deira) షాపింగ్ మాల్‌లో ప్రదర్శించిన ఈ అరుదైన అలంకరణకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది.

రేవంత్ సర్కార్‌కు మరో బిగ్‌షాక్.. సమ్మక్కసాగర్ డీపీఆర్ రిటర్న్తెలంగాణSwechaa10 Nov 2026, 12:29 PM

రేవంత్ సర్కార్‌కు మరో బిగ్‌షాక్.. సమ్మక్కసాగర్ డీపీఆర్ రిటర్న్

తెలంగాణ ప్రభుత్వానికి మరో బిగ్ షాక్ తగిలింది. ములుగు జిల్లా తుపాకులగూడెం వద్ద నిర్మిస్తున్న సమ్మక్క సాగర్ ప్రాజెక్ట్ (తుపాకులగూడెం బ్యారేజీ) సమగ్ర ప్రాజెక్టు నివేదిక (DPR)ను కేంద్ర జలసంఘం (CWC) వెనక్కి పంపింది. ప్రాజెక్టుకు సంబంధించిన కమాండ్ ఏరియా (ఆయకట్టు) వివరాలు, 2011 నాటి ప్రమాణాలకు సంబంధించి పూర్తిస్థాయి సమాచారం నివేదికలో స్పష్టంగా లేదని పేర్కొంది.ఇదిలాఉండగా, కాంగ్రెస్ ప్రభుత్వం అసమర్థత వల్ల మరో ఇరిగేషన్ ప్రాజెక్టు డీపీఆర్ వెనక్కి వచ్చిందని ప్రతిపక్ష బీఆర్ఎస్ తీవ్ర విమర్శలు గుప్పిస్తోంది.ఏపీకి మేలు చేసేందుకే తెలంగాణకు అన్యాయం చేస్తున్నారంటూ మండిపడింది. సమ్మక్క సాగర్ ప్రాజెక్టు కింద ఎంత భూమి సాగులోకి వస్తుందనే వివరాలు పొందుపరచకపోవడం, ఇతర వివరాలు కూడా సరిగ్గా చెప్పకపోవడంతో డీపీఆర్‌ను కేంద్ర జలవనరుల శాఖవెనక్కి పంపిందని వెల్లడించింది.

సిద్దిపేటలో దారుణం.. బతికే ఉన్న 22 మందికి డెత్ సర్టిఫికెట్స్!తెలంగాణSwechaa10 Nov 2026, 12:04 PM

సిద్దిపేటలో దారుణం.. బతికే ఉన్న 22 మందికి డెత్ సర్టిఫికెట్స్!

రాష్ట్రంలో మరో ఘరానా మోసం వెలుగుచూసింది. సిద్దిపేట జిల్లాకు చెందిన 22 మంది వ్యక్తులను చనిపోయినట్టు చిత్రీకరించి వారి పేరిట ఉన్న బీమా సొమ్మును క్లెయిమ్ చేసినట్టు తెలిసింది. ఈ ఘటన ప్రస్తుతం జిల్లాలో సంచలనంగా మారింది. ఈ విషయం తెలిసి బాధిత వ్యక్తులు లబోదిబోమంటున్నారు. దీంతో వెంటనే చేర్యాల పోలీసులకు ఫిర్యాదు చేయగా.. రంగంలోకి దిగిన అధికారులు దర్యాప్తు ప్రారంభించి నిందితులను అదుపులోకి తీసుకున్నట్టు తెలిసింది. సిద్దిపేట జిల్లా చేర్యాల మండలం రాంపూర్ గ్రామానికి చెందిన 22 మంది పేర్లపై నకిలీ మరణ ధ్రువపత్రాలు జారీ అయ్యాయి. వారంతా బతికే ఉన్నా డెత్ సర్టిఫికెట్లు జారీ అవ్వడం కలకలం రేపింది. రాంపూర్ గ్రామ పంచాయతీ కార్యదర్శిగా పనిచేస్తున్న భూక్య మధు తన అధికారిక ఈ-సైన్ (e-Sign) డాంగిల్‌ను దుర్వినియోగం చేసినట్టు తెలిసింది.