స్వేచ్ఛ షార్ట్స్ — తాజా తెలుగు వార్తలు

ఆర్టీసీ బస్సుల్లో సీసీ కెమెరాలు.. మంత్రి పొన్నం క్లారిటీతెలంగాణSwechaa10 Sep 2026, 11:41 AM

ఆర్టీసీ బస్సుల్లో సీసీ కెమెరాలు.. మంత్రి పొన్నం క్లారిటీ

రాష్ట్రంలోని ఆర్టీసీ బస్సుల్లో సీసీ కెమెరాలు ఏర్పాట్లు చేయాలని గతంతో అనేక ఫిర్యాదులు వచ్చాయి. రద్దీ సమయాల్లో దొంగతనాలు, కొందరు పోకిరీలు మహిళలు, యువతుల పట్ల అసభ్యంగా ప్రవర్తించడం, వేధించడం వంటివి చేసేవారు. అక్కడ ఇక్కడ తాకుతూ వారిని తీవ్ర ఇబ్బందులకు గురిచేసేవారు. దీనికితోడు ఇటీవలి కాలంలో ఆర్టీసీ సిబ్బందిపై కొందరు దాడులకు పాల్పడటం వంటి ఘటనలు చోటుచేసుకుంటున్నాయి. ఇలాంటి వాటి నుంచి బాధితులను రక్షించానికి సీసీ కెమెరాలు ఉపయోగపడుతాయని ప్యాసింజర్స్ అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. అయితే, బస్సుల్లో సీసీ కెమెరాల ఏర్పాటుపై తాజాగా మంత్రి పొన్నం ప్రభాకర్ అసెంబ్లీ వేదికగా క్లారిటీ ఇచ్చారు. సాధారణ ఆర్టీసీ బస్సుల్లో సీసీ టీవీ నిఘా వ్యవస్థను ఏర్పాటు చేయడం లేదని స్పష్టంచేశారు.కేవలం కార్పొరేషన్ అండర్‌లో నడుపుతున్న ప్రీమియం, ఎలక్ట్రిక్ బస్సుల్లో మాత్రమే ప్రస్తుతం సీసీటీవీలను అందుబాటులోకి తెచ్చామని రవాణా శాఖ మంత్రి వెల్లడించారు.

బోడుప్పల్‌లో అర్ధరాత్రి భారీ అగ్నిప్రమాదం.. మూడు ఫుడ్ కోర్టులు దగ్ధం!క్రైమ్Swechaa10 Sep 2026, 11:36 AM

బోడుప్పల్‌లో అర్ధరాత్రి భారీ అగ్నిప్రమాదం.. మూడు ఫుడ్ కోర్టులు దగ్ధం!

మేడ్చల్‌-మల్కాజిగిరి జిల్లా బోడుప్పల్‌లో గురువారం అర్ధరాత్రి భారీ అగ్నిప్రమాదం చోటు చేసుకుంది. ఎన్టీఆర్‌ విగ్రహం సమీపంలోని ఓ టిఫిన్‌ సెంటర్‌లో ఒక్కసారిగా మంటలు చెలరేగడంతో దట్టమైన పొగ అలుముకుంది. విద్యుత్‌ షార్ట్‌సర్క్యూట్‌ కారణంగానే ప్రమాదం జరిగినట్లు ప్రాథమికంగా తెలుస్తోంది. మంటల తీవ్రతకు టిఫిన్‌ సెంటర్‌లోని సుమారు రెండు గ్యాస్‌ సిలిండర్లు పేలినట్లు సమాచారం. దీంతో మంటలు పక్కనే ఉన్న మరో రెండు ఫుడ్‌ కోర్టులకు వ్యాపించడంతో అవి కూడా పూర్తిగా దగ్ధమైనట్లు తెలుస్తోంది.

రూ.8,000 కోట్లతో యుద్ధనౌకల తయారీ.. ఏపీకి మరో భారీ ప్రాజెక్ట్!ఏపీSwechaa10 Sep 2026, 11:24 AM

రూ.8,000 కోట్లతో యుద్ధనౌకల తయారీ.. ఏపీకి మరో భారీ ప్రాజెక్ట్!

ఆంధ్రప్రదేశ్ పారిశ్రామికాభివృద్ధి, రక్షణ రంగానికి సంబంధించి ఒక కీలక మలుపు చోటుచేసుకుంది. కృష్ణా జిల్లా మచిలీపట్నంలో అత్యాధునిక రక్షణ, యుద్ధనౌకల తయారీ కేంద్రాన్ని (Warship Manufacturing Unit) ఏర్పాటు చేసేందుకు గోవా షిప్‌యార్డ్ లిమిటెడ్ (GSL) సన్నాహాలు చేస్తోంది. ఈ మెగా ప్రాజెక్ట్ కోసం ఏకంగా రూ. 8,000 కోట్ల భారీ పెట్టుబడి పెట్టేందుకు గోవా షిప్‌యార్డ్ ముందుకు రాగా, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నుంచి అవసరమైన అనుమతులు మంజూరయ్యాయి. ఈ ప్రాజెక్ట్‌కు సోమవారం నిర్వహించిన ఆంధ్రప్రదేశ్ స్టేట్ ఇన్వెస్ట్‌మెంట్ ప్రమోషన్ కమిటీ (SIPC) సమావేశంలో అధికారిక ఆమోదం లభించింది.

వేధిస్తున్నాడని యువతి ఫిర్యాదు..యువకుడి దారుణంక్రైమ్Swechaa10 Sep 2026, 11:23 AM

వేధిస్తున్నాడని యువతి ఫిర్యాదు..యువకుడి దారుణం

మెదక్ జిల్లా రామాయంపేటలో తీవ్ర విషాదం నెలకొంది. తన తల్లిని దూషించడంతో పాటు తనను కొట్టారని ఆవేదన చెందిన ఓ యువకుడు ఆత్మహత్యయత్నానికి పాల్పడ్డగా.. ఆస్పత్రిలో చికిత్స పొందుతూ కన్నుమూశాడు. వివరాల్లోకివెళితే.. ప్రేమ పేరుతో వేధిస్తున్నాడంటూ వారం రోజుల క్రితం ఓ యువతి, ఆమె కుటుంబ సభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో దుర్గా ప్రసాద్ (30) అనే వ్యక్తిని విచారణ నిమిత్తం పోలీసులు స్టేషన్‌కు పిలిపించారు. అయితే, తన తల్లిని దూషించడంతో పాటు తనపై అమ్మాయి కుటుంబీకులు తీవ్రంగా దాడి చేశారని, అంతటితో ఆగకుండా పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారని మనస్తాపం చెందిన ఆ యువకుడు.. తన వెంట తెచ్చుకున్న పెట్రోల్ మీద పోసుకుని నిప్పంటించుకున్నాడు. అనంతరం పోలీస్ స్టేషన్‌లోకి చొరబడ్డాడు. మంటల్లో కాలిపోతున్న అతన్ని పోలీసులు రక్షించే ప్రయత్నం చేశారు. వెంటనే స్థానిక ఆస్పత్రికి తరలించారు. అక్కడ వైద్యులు చేతులెత్తేయడంతో సికింద్రాబాద్‌లోని గాంధీ ఆస్పత్రికి తరలించగా..చికిత్స పొందుతూ ఇవాళ కన్నుమూశాడు.

ఇరాన్ రహస్య స్థావరం.. ఉపగ్రహ చిత్రాలతో వెలుగులోకి కీలక ఆధారాలు!InternationalSwechaa10 Sep 2026, 11:16 AM

ఇరాన్ రహస్య స్థావరం.. ఉపగ్రహ చిత్రాలతో వెలుగులోకి కీలక ఆధారాలు!

 ఇరాన్ తన అణు కార్యక్రమాలను రహస్యంగా వేగవంతం చేస్తోందనే అంతర్జాతీయ అనుమానాలకు బలం చేకూర్చేలా కీలక ఆధారాలు బయటపడ్డాయి. ఆ దేశంలోని ప్రముఖ 'నటాంజ్' అణు సముదాయానికి సమీపంలో ఉన్న పికాక్స్ పర్వత శ్రేణుల కింద భారీ ఎత్తున రహస్య భూగర్భ నిర్మాణ కార్యకలాపాలు సాగుతున్నట్లు ఇటీవల సేకరించిన అధునాతన ఉపగ్రహ చిత్రాల ద్వారా వెల్లడైంది. ప్రసిద్ధ పరిశోధనా సంస్థ 'సెంటర్ ఫర్ స్ట్రాటజిక్ అండ్ ఇంటర్నేషనల్ స్టడీస్' (CSIS) గత ఆరేళ్ల ఉపగ్రహ డేటాను సమగ్రంగా విశ్లేషించి, 2026లో ఈ పనులు ఊహించని రీతిలో వేగవంతమయ్యాయని అధికారికంగా ధ్రువీకరించింది.

అవినీతికి అడ్డాగా గురుకులాలు.. అధికారుల తీరుపై ప్రిన్సిపాళ్ల ఆవేదన!!..తెలంగాణSwechaa10 Sep 2026, 10:49 AM

అవినీతికి అడ్డాగా గురుకులాలు.. అధికారుల తీరుపై ప్రిన్సిపాళ్ల ఆవేదన!!..

రాష్ట్రంలోని తెలంగాణ సాంఘిక సంక్షేమ గురుకుల విద్యాసంస్థల సొసైటీ ప్రతిష్ట కొందరు అవినీతి అధికారుల కారణంగా మసకబారుతోందనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. ముఖ్యంగా జోనల్, రీజినల్ ఆఫీసులు వసూళ్లకు అడ్డాగా మారాయనే విమర్శలు రోజురోజుకూ పెరుగుతున్నాయి. ఈ కార్యాలయాల్లో ప్రతీ పనికీ ఓ రేటు ఫిక్స్ చేసి వసూళ్లకు తెగబడుతున్నారు. కొందరు అధికారులు తమ సామాజికవర్గానికి చెందిన వారిని కిందిస్థాయిలో నియమించుకొని దందా కొనసాగిస్తున్నారు. వారు చెప్పినంత ఇస్తే ఓకే.. లేకపోతే వేధింపులకు దిగుతున్నారు. ఫలితంగా గురుకులాల ప్రిన్సిపాళ్లు నరకం చూస్తున్నారనే ప్రచారం జరుగుతుంది.

మద్రాస్ రెజిమెంట్ ఆయుధాల చోరీ కేసులో కీలక మలుపు..క్రైమ్Swechaa10 Sep 2026, 10:19 AM

మద్రాస్ రెజిమెంట్ ఆయుధాల చోరీ కేసులో కీలక మలుపు..

సికింద్రాబాద్ పరిధిలోని బొల్లారం మద్రాస్ రెజిమెంట్‌‌లో భారీగా ఆర్మీ ఆయుధాలు చోరికి గురైన విషయం తెలిసిందే.ఘటన జరిగి రెండు వారాలు దాటింది. ఈ కేసులో ఆర్మీ ఇంటెలిజెన్స్ అధికారులు, రాష్ట్ర పోలీసులు ఉమ్మడిగా విచారణ జరుపుతున్నారు.దీంతో ఈ కేసు కీలక ములుపు తిరిగింది. ముగ్గురు సీనియర్‌ ఆర్మీ అధికారులను అదుపులోకి తీసుకున్నట్లు సమాచారం. అంతకుముందు నలుగురు గార్డులను సైతం ఉన్నతాధికారులు విచారించారు. వారు అందించిన సమాచారం మేరకు తాజాగా ముగ్గురు సీనియర్‌ అధికారులను అదుపులోకి తీసుకున్నారు. విచారణ నిమిత్తం వారిని ఢిల్లీలోని ఆర్మీ ప్రధాన కార్యాలయానికి తరలించినట్టు తెలిసింది. ఆర్మీ రెజిమెంట్‌ శిక్షణా కేంద్రంలో వినియోగించే ఆయుధాలు, బుల్లెట్లకు ఎలాంటి ప్రత్యేక కోడింగ్‌ నంబర్లు ఉండవని సమాచారం.

Shocking: రీల్స్ చూస్తుండగా నెట్‌వర్క్ సరిగా లేదని ఆత్మహత్య!క్రైమ్Swechaa10 Sep 2026, 10:13 AM

Shocking: రీల్స్ చూస్తుండగా నెట్‌వర్క్ సరిగా లేదని ఆత్మహత్య!

 సోషల్ మీడియా, స్మార్ట్‌ఫోన్ వినియోగానికి బానిసలవుతున్న వారి ప్రవర్తన ఎంత ప్రమాదకరంగా మారుతోందో చెప్పే విషాదకర ఘటన ఛత్తీస్‌గఢ్‌లోని కోర్బా జిల్లాలో వెలుగుచూసింది. భోజనం చేస్తూ ఫోన్‌లో రీల్స్ చూస్తున్న సమయంలో పదేపదే ఇంటర్నెట్ నెట్‌వర్క్ నిలిచిపోవడంతో తీవ్ర ఆగ్రహానికి గురైన ఓ మహిళ పురుగుల మందు తాగి ప్రాణాలు కోల్పోయింది. ఈ షాకింగ్ ఉదంతం ప్రస్తుత సమాజంలో పెరుగుతున్న డిజిటల్ అడిక్షన్, కోపాన్ని అదుపు చేసుకోలేకపోవడం, మానసిక ఆరోగ్య సమస్యల తీవ్రతపై తీవ్రమైన చర్చకు దారితీస్తోంది.

మధుయాష్కీకి కీలక పదవి.. తెలంగాణ కాంగ్రెస్ పోస్టు వైరల్!తెలంగాణSwechaa10 Sep 2026, 10:02 AM

మధుయాష్కీకి కీలక పదవి.. తెలంగాణ కాంగ్రెస్ పోస్టు వైరల్!

తెలంగాణ కాంగ్రెస్ సీనియర్ నేత, మాజీ ఎంపీ మధుయాష్కీ గౌడ్‌కు జాతీయ స్థాయిలో కీలక పదవి దక్కింది. ఆయనను ఆల్ ఇండియా ప్రొఫెషనల్స్ కాంగ్రెస్ (AIPC) చైర్మన్‌గా కాంగ్రెస్ అధిష్టానం నియమించింది.కాంగ్రెస్ పార్టీ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే ఈ నియామకానికి ఆమోదం తెలపగా.. ఈ విషయాన్ని కాంగ్రెస్ జాతీయ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్ ప్రకటించారు. ఇంతకుముందు ఈ పదవిలో ఉన్న ప్రవీణ్ చక్రవర్తి తమిళనాడు నుంచి రాజ్యసభకు ఎన్నికవ్వడంతో, ఆయన స్థానంలో మధుయాష్కీ గౌడ్‌కు ఏఐసీసీ ఈ బాధ్యతలను అప్పగించినట్టు తెలిసింది. ఈ విషయాన్ని తెలియజేస్తూ తెలంగాణ కాంగ్రెస్ ఆసక్తికర పోస్టు పెట్టింది.‘

ఇషాన్ కిషన్ విధ్వంసం.. ఒకే మ్యాచ్‌లో 350రన్స్ బాది ఆల్‌టైమ్ రికార్డ్!క్రీడలుSwechaa10 Sep 2026, 09:57 AM

ఇషాన్ కిషన్ విధ్వంసం.. ఒకే మ్యాచ్‌లో 350రన్స్ బాది ఆల్‌టైమ్ రికార్డ్!

 టీమిండియా వికెట్ కీపర్, బ్యాటర్ ఇషాన్ కిషన్ దేశవాళీ క్రికెట్‌లో అరుదైన ఘనతను సాధించాడు. చెన్నైలోని ఎంఏ చిదంబరం స్టేడియంలో సౌత్ జోన్‌తో జరుగుతున్న దులీప్ ట్రోఫీ 2026 ఫైనల్ మ్యాచ్‌లో ఈస్ట్ జోన్ తరఫున బరిలోకి దిగిన ఇషాన్, ఒకే మ్యాచ్‌లో ఏకంగా 350 పరుగులు చేసి దులీప్ ట్రోఫీ చరిత్రలోనే సరికొత్త రికార్డు సృష్టించాడు. ఈ మ్యాచ్ తొలి ఇన్నింగ్స్‌లో 344బంతుల్లో 270 పరుగుల విద్వాంసకర ఇన్నింగ్స్ ఆడిన ఆయన, రెండో ఇన్నింగ్స్‌లోనూ వేగంగా 98 బంతుల్లో 80 పరుగులు సాధించాడు.

సీఎం రేవంత్, పీసీసీ చీఫ్‌‌పై చర్యలు తీసుకోండి.. డీజీపీకి ఎన్‌హెచ్‌ఆర్సీ ఆదేశంతెలంగాణSwechaa10 Sep 2026, 09:46 AM

సీఎం రేవంత్, పీసీసీ చీఫ్‌‌పై చర్యలు తీసుకోండి.. డీజీపీకి ఎన్‌హెచ్‌ఆర్సీ ఆదేశం

రాష్ట్రంలో కాంగ్రెస ప్రభుత్వం పడిపోవడానికి, వర్షాలు కురవకుండా ఉండేందుకు బీఆర్ఎస్ డిప్యూటీ ఫ్లోర్ లీడర్ హరీశ్ రావు క్షుద్రపూజలు చేస్తున్నారంటూ తెలంగాణ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు మహేశ్ కుమార్ గౌడ్ ఆరోపించిన విషయం తెలిసిందే. ఆ తర్వాత సీఎం రేవంత్ రెడ్డి సైతం ఓ సభలో మాట్లాడుతూ.. హరీశ్ రావు క్షుద్రపూజలు చేస్తున్నారని ఆరోపించారు. హరీశ్ రావు కర్ణాటక ఎందుకు వెళ్లారని, ఆ విషయం బహిర్గతం చేయాలని ప్రశ్నించారు. మాజీమంత్రి హరీష్ రావుపై బహిరంగంగా “బ్లాక్ మేజిక్”, “క్షుద్ర పూజలు” ఆరోపణలు చేసిన వ్యవహారంలో ఎఫ్‌ఐఆర్ నమోదు కాకపోవడంపై జాతీయ మానవ హక్కుల కమిషన్‌కు న్యాయవాది, సామాజికవేత్త కారుపోతుల రేవంత్ ఫిర్యాదు చేశారు. హరీశ్ రావు క్షుద్రపూజలు చేస్తున్నారని నిరాధార ఆరోపణలు చేసిన వారిపై చర్యలు తీసుకోవాలని తెలంగాణ డీజీపీ సీవీ ఆనంద్‌కు జాతీయ మానవ హక్కుల కమిషన్ (NHRC) ఆదేశించింది.

యూపీలో బీజేపీ మాస్టర్ ప్లాన్.. ఆ 115 సీట్లే అసలు టార్గెట్!NationalSwechaa10 Sep 2026, 09:12 AM

యూపీలో బీజేపీ మాస్టర్ ప్లాన్.. ఆ 115 సీట్లే అసలు టార్గెట్!

ఉత్తరప్రదేశ్‌ అసెంబ్లీ ఎన్నికలకు ఇంకా సమయం ఉన్నా.. బీజేపీ మాత్రం ఇప్పటి నుంచే ఎన్నికల మోడ్‌లోకి వెళ్లిపోయింది. ముఖ్యంగా గత ఎన్నికల్లో బలహీనంగా కనిపించిన, 2024 లోక్‌సభ ఎన్నికల్లో ప్రతిపక్షం ఆధిక్యం సాధించిన అసెంబ్లీ నియోజకవర్గాలపై కమలం పార్టీ ప్రత్యేకంగా ఫోకస్ పెట్టింది.

ట్రంప్ ఉదారత.. సిబ్బందికి రూ.42లక్షల విలువైన కానుకలు!InternationalSwechaa10 Sep 2026, 09:11 AM

ట్రంప్ ఉదారత.. సిబ్బందికి రూ.42లక్షల విలువైన కానుకలు!

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తన వద్ద పనిచేసే అత్యంత సన్నిహిత శ్వేతసౌధ సిబ్బంది పట్ల అసాధారణ ఉదారతను చాటుకున్నారు. క్రిస్మస్ పండుగ సందర్భాన్ని పురస్కరించుకుని తనతో నిరంతరం ఉండే నలుగురు కీలక సహాయకులకు లక్షల డాలర్ల విలువైన ఖరీదైన కానుకలను అందజేశారు. అమెరికా పరిపాలనా విభాగం ఇటీవల విడుదల చేసిన వ్యయ నివేదికల (Financial Disclosure Reports) ద్వారా ట్రంప్ అందించిన ఈ భారీ బహుమతుల వ్యవహారం అధికారికంగా వెలుగులోకి వచ్చింది.

ఈడీ పై సంచలన వ్యాఖ్యలు చేసిన కేరళం మాజీ సీఎం!!..NationalSwechaa10 Sep 2026, 07:58 AM

ఈడీ పై సంచలన వ్యాఖ్యలు చేసిన కేరళం మాజీ సీఎం!!..

కొచ్చిన్ మినరల్స్ అండ్ రుటైల్ లిమిటెడ్ లంచం ఆరోపణల వ్యవహారంలో ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) తనను టార్గెట్ చేసుకొని దాడులకు దిగుతోందని కేరళం మాజీ సీఎం పినరయి విజయన్ ఆరోపించారు. ఈడీ వ్యవహరిస్తున్న తీరు సిగ్గుచేటని, ఇలాంటి చర్యలు తన వ్యక్తిగత జీవితాన్ని గానీ, ప్రజల్లో తనకున్న ప్రతిష్టను గానీ ఏమాత్రమూ దెబ్బతీయలేవని అన్నారు.

చిగుళ్ల నుంచి రక్తం వస్తోందా? కారణం ఏంటంటే?.. .HealthSwechaa10 Sep 2026, 07:35 AM

చిగుళ్ల నుంచి రక్తం వస్తోందా? కారణం ఏంటంటే?.. .

చిగుళ్ల నుంచి రక్తం కారడం అనేది సాధారణంగా చాలామంది ఎదుర్కొనే సమస్య.. అయితే బ్రష్ గట్టిగా చేశాంలే అని దీనిని తేలిగ్గా తీసుకుంటారు. కానీ, తరచూ ఇలా జరుగుతుంటే మాత్రం ఖచ్చితంగా శ్రద్ధ వహించాల్సిందే అని ఆరోగ్యనిపుణులు సూచిస్తున్నారు.. సరైన ఓరల్ హైజీన్ పాటించకపోవడం వల్ల పళ్లపై 'ప్లేక్' (పాచి) పేరుకుపోతుంది. దీనివల్ల చిగుళ్ల వాపు, రక్తస్రావం మొదలవుతాయి. దీనిని ఆరంభంలోనే నివారించకపోతే, అది 'పెరియోడాంటైటిస్' అనే తీవ్రమైన చిగుళ్ల వ్యాధికి దారితీస్తుంది. ఇది పళ్ల పునాదిని బలహీనపరిచి, అవి ఊడిపోయేలా చేస్తుందని హెచ్చరిస్తున్నారు..

తిరుమల శ్రీవారి ఆలయాన్ని ఎవరు నిర్మించారు?.. చరిత్ర చెప్పే ఆసక్తికర నిజం!..SpiritualitySwechaa10 Sep 2026, 07:23 AM

తిరుమల శ్రీవారి ఆలయాన్ని ఎవరు నిర్మించారు?.. చరిత్ర చెప్పే ఆసక్తికర నిజం!..

కలియుగ వైకుంఠమైన తిరుమల శ్రీ వేంకటేశ్వరస్వామి వారి దివ్యక్షేత్రం. సప్తగిరుల నడుమ వెలసిన స్వామివారి రూపాన్ని, నిత్యకల్యాణం పచ్చతోరణంగా విరాజిల్లే ఆలయ శోభను తిలకించడం జన్మధన్యం. ఇక్కడ నెలకొన్న ప్రశాంతమైన వాతావరణం, ప్రతీ భక్తుడికి దివ్యానుభూతిని ఇస్తాయి. వేలాది ఏళ్లుగా అశేష జనవాహినిని ఆకర్షిస్తూ, సమస్త మానవాళికి ఆధ్యాత్మిక వెలుగునిచ్చే అద్భుతమైన క్షేత్రం మన తిరుమల అని చెప్పడంలో సందేహం లేదు..

ఇంతటి విశేషమైన తిరుమల ఆలయాన్ని మొదట ఎవరు కట్టారు? అనే సందేహం ప్రతి ఒక్కరిలో ఎప్పుడో ఒకప్పుడు కలుగుతుంది. అయితే ఈ ప్రశ్నకు సమాధానం తెలుసుకోవాలంటే.. మనం చరిత్రను మాత్రమే కాదు.. తిరుమల క్షేత్ర మహిమను కూడా తెలుసుకోవాలని పండితులు చెబుతున్నారు..

Technology: మరో పదేళ్లలో AI మనుషుల ప్రాణాలకు ముప్పుగా మారుతుందా?వైరల్ న్యూస్Swechaa10 Sep 2026, 07:13 AM

Technology: మరో పదేళ్లలో AI మనుషుల ప్రాణాలకు ముప్పుగా మారుతుందా?

ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్.. ప్రపంచాన్ని మార్చేస్తున్న టెక్నాలజీ. మనం ఆలోచించే విధానం నుంచి ఉద్యోగాలు, వైద్యం, విద్య, రక్షణ, సైబర్ సెక్యూరిటీ వరకు దాదాపు ప్రతి రంగంలోనూ AI ప్రభావం వేగంగా పెరుగుతోంది. అయితే ఇదే టెక్నాలజీ భవిష్యత్తులో మానవాళికి తీవ్ర ముప్పుగా మారే అవకాశం ఉందా? ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా ఈ ప్రశ్నపై పెద్ద చర్చే జరుగుతోంది.. ఇలాంటి సమయంలో AI రంగంలో పనిచేసిన పరిశోధకుడు జాకబ్ కాక్సన్ చేసిన వ్యాఖ్యలు తీవ్ర చర్చకు దారితీశాయి. మూడేళ్లపాటు AI పరిశోధనలో పనిచేసిన ఆయన.. ప్రస్తుత అభివృద్ధిపై ఆందోళన వ్యక్తం చేస్తూ సంచలన హెచ్చరిక చేశారు. ఈ దశాబ్దం చివరి నాటికి అత్యంత శక్తివంతమైన AI వ్యవస్థలు మనుషుల నియంత్రణకు అందకుండా వెళ్లే ప్రమాదం ఉందని ఆయన అభిప్రాయపడ్డారు.

అన్నం పరబ్రహ్మ స్వరూపం.. మన పెద్దలు చెప్పిన ఈ భోజన నియమాలు తెలుసా?..SpiritualitySwechaa10 Sep 2026, 06:58 AM

అన్నం పరబ్రహ్మ స్వరూపం.. మన పెద్దలు చెప్పిన ఈ భోజన నియమాలు తెలుసా?..

మన పెద్దలు అన్నాన్ని పరబ్రహ్మ స్వరూపంగా భావించారు. భోజనానికి ముందు శుచిత్వం పాటించడం, భగవంతుడిని స్మరించడం, అన్నాన్ని నిందించకుండా గౌరవించడం, ఆహారాన్ని వృథా చేయకపోవడం.. ఇవన్నీ మన భోజన సంస్కారంలోని గొప్ప ఆధ్యాత్మిక విలువలు. వంటలో శుచిత్వం.. వడ్డించడంలో ప్రేమ.. తినేటప్పుడు కృతజ్ఞత.. తిన్న తర్వాత పరిశుభ్రత పాటించాలని చెబుతారు.. అందుకే ప్రతి ముద్దను దైవ ప్రసాదంగా భావిద్దాం.. మన సంప్రదాయాన్ని గౌరవిద్దాం..

బంగారం, వెండి, రాగి.. ఒకేసారి ఎందుకు దూసుకెళ్తున్నాయి?వ్యాపారంSwechaa09 Sep 2026, 11:28 PM

బంగారం, వెండి, రాగి.. ఒకేసారి ఎందుకు దూసుకెళ్తున్నాయి?

బంగారం పెరుగుతుంటే పెద్దగా ఆశ్చర్యపడాల్సిన అవసరం లేదు. వెండి పెరిగినా పెద్దగా పట్టించుకోం. కానీ బంగారం, వెండి, రాగి.. ఈ మూడు ఒకేసారి పరుగులు పెడితే..? అలాంటి స‌మ‌యంలో మాత్రం ఒకసారి ఆలోచించాల్సిందే.

ఆధార్‌కు AI పవర్..! ఇక‌పై రోజుకు 30 కోట్ల వెరిఫికేషన్లుNationalSwechaa09 Sep 2026, 11:02 PM

ఆధార్‌కు AI పవర్..! ఇక‌పై రోజుకు 30 కోట్ల వెరిఫికేషన్లు

దేశంలో ప్రతి కీలక సేవతో ముడిపడిపోయిన ఆధార్ వ్యవస్థ ఇప్పుడు మరో భారీ మార్పు దిశగా అడుగులు వేస్తోంది. ఇప్పటివరకు గుర్తింపు ధ్రువీకరణకు కీలకంగా ఉన్న ఆధార్‌కు ఇక ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, అధునాతన భద్రతా సాంకేతికతలు మరింత బలం ఇవ్వనున్నాయి.

పెట్రోల్, డీజిల్ రేట్లు పెరుగుతాయా?NationalSwechaa09 Sep 2026, 10:24 PM

పెట్రోల్, డీజిల్ రేట్లు పెరుగుతాయా?

Petrol-Diesel Price : పశ్చిమాసియాలో పరిస్థితులు మరోసారి ఉద్రిక్తంగా మారాయి. అగ్రరాజ్యం అమెరికా - ఇరాన్ మధ్య దాడులు మరోసారి తీవ్రరూపం దాల్చడంతో వ్యూహాత్మకంగా కీలకమైన హార్ముజ్ జలసంధి పరిధిలో వాణిజ్య నౌకల రాకపోకలపై ప్రభావం పడుతోంది. చమురు ట్యాంకర్లు, ఇతర సరుకు రవాణా నౌకలపై దాడుల వార్తలు అంతర్జాతీయ ఇంధన మార్కెట్లలో మరోసారి ఆందోళన పెంచుతున్నాయి. ఈ పరిణామాల ప్రభావంతో ముడి చమురు ధరలు భారీగా పెరిగాయి. బ్రెంట్ క్రూడ్ బ్యారెల్‌కు 100 డాలర్ల మార్కును దాటింది.హార్ముజ్ ప్రాంతంలో ఉద్రిక్తతలు పెరగడంతో అంతర్జాతీయంగా చమురు సరఫరాపై ఆందోళనలు తీవ్రమవుతున్నాయి. అమెరికా ఐదు ఇరాన్ చమురు ట్యాంకర్లను ధ్వంసం చేసినట్లు ప్రకటించిన తర్వాత, ఇరాన్ కూడా పలు నౌకలపై దాడులు చేసినట్లు వెల్లడించింది. ఇరుపక్షాల మధ్య ఈ దాడులు, ప్రతి దాడులు సముద్ర రవాణాపై మరింత ఒత్తిడి పెంచుతున్నాయని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.

TG :  కొండా సురేఖ మాజీ OSD సుమంత్‌కు ముందస్తు బెయిల్..తెలంగాణSwechaa09 Sep 2026, 09:54 PM

TG : కొండా సురేఖ మాజీ OSD సుమంత్‌కు ముందస్తు బెయిల్..

TG : మాజీ మంత్రి కొండా సురేఖ మాజీ OSD సుమంత్‌కు నాంపల్లి కోర్టులో బిగ్ రిలీఫ్ దొరికింది. ఆయనకు కోర్టు షరతులతో కూడిన ముందస్తు బెయిల్ మంజూరు చేసింది. రూ.25 వేల చొప్పున రెండు వ్యక్తిగత పూచీకత్తులు సమర్పించాలని ఆదేశించింది. షూరిటీలు సమర్పించిన తర్వాత సుమంత్‌ను ముందస్తు బెయిల్‌పై రిలీజ్ చేయాలని దర్యాప్తు అధికారికి సూచించింది. అలాగే కేసులోని ప్రత్యక్ష, పరోక్ష సాక్షులను ప్రభావితం చేయడం, వారిని ప్రలోభపెట్టడం లేదా బెదిరించడం వంటి చర్యలకు దూరంగా ఉండాలని కోర్టు షరతు విధించింది. దర్యాప్తు పూర్తయ్యే వరకు కేసుకు సంబంధించిన అంశాల్లో జోక్యం చేసుకోకూడదని స్పష్టం చేసింది.

మరో కీలక నిబంధనగా.. కోర్టు ముందస్తు అనుమతి లేకుండా సుమంత్ దేశం విడిచి వెళ్లకూడదని ఆదేశించింది. తన మొబైల్ నంబర్, ఇంటి అడ్రస్ వంటి వివరాలను దర్యాప్తు అధికారికి అందించాలని సూచించింది. అడ్రస్ లేదా తనను అప్రోచ్ అయ్యే వివరాల్లో ఏదైనా మార్పు జరిగితే అధికారులకు సమాచారం ఇవ్వాల్సి ఉంటుంది.

ప్రైవేట్ ఆసుపత్రుల దోపిడీపై రాములమ్మ ఫైర్..తెలంగాణSwechaa09 Sep 2026, 09:50 PM

ప్రైవేట్ ఆసుపత్రుల దోపిడీపై రాములమ్మ ఫైర్..

MLC Vijayashanthi: హైదరాబాద్ నగరంలో ప్రైవేట్ ఆసుపత్రుల్లో దోపిడీపై ఎమ్మెల్సీ విజయశాంతి ఫైర్ అయ్యారు. శాసనమండలిలో మాట్లాడిన ఆమె.. ప్రైవేట్, కార్పొరేట్ ఆసుపత్రుల్లో జరుగుతున్న దోపిడీ గురించి ప్రస్తావించారు. జ్వరం వస్తే టెస్టులు, చికిత్స పేరుతో ఒక్కో వ్యక్తి నుంచి రూ.30 వేల వరకు వసూలు చేస్తున్నారని విజయశాంతి ఆరోపించారు. ప్రైవేట్ ఆసుపత్రికి వెళ్లాలంటేనే ప్రజలు భయపడిపోతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రైవేట్ హాస్పిటల్స్ ఫీజుల దందాపై కాంగ్రెస్ ప్రభుత్వం స్పందించాలని, ఈ దోపిడీకి అడ్డుకట్ట వేసేలా కఠిన చర్యలు తీసుకోవాలని విజయశాంతి కోరారు.

PF : డబ్బు ఎన్ని సార్లు తీసుకోవచ్చు? కొత్త రూల్స్ ఇవే!NationalSwechaa09 Sep 2026, 09:16 PM

PF : డబ్బు ఎన్ని సార్లు తీసుకోవచ్చు? కొత్త రూల్స్ ఇవే!

PF: ఉద్యోగులకు ఉపయోగపడేలా ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్ (EPF) నుంచి డబ్బు తీసుకునే నిబంధనలను తాజాగా EPFO మరింత సింపుల్ చేసింది. గతంలో వివిధ అవసరాలకు వేర్వేరు రూల్స్ ఉండటంతో ఉద్యోగులు క్లెయిమ్ చేసే టైంలో ఇబ్బందులు ఎదుర్కొనేవారు. ఇప్పుడు 13 రకాల రూల్స్‌ను మూడు ప్రధాన కేటగిరీలుగా మార్చారు. దీంతో హెల్త్, స్టడీ, మ్యారేజ్, హోమ్ వంటి అవసరాలకు PF అడ్వాన్స్ తీసుకోవడం మరింత సింపుల్‌గా మారింది.ఎంప్లాయ్ లేదా కుటుంబ సభ్యుల స్టడీ అవసరాల కోసం మొత్తం 10 సార్లు PF అడ్వాన్స్ తీసుకునే అవకాశం కల్పించారు.

పెళ్లి ఖర్చులకు 5 సార్లు

తన వివాహం లేదా కుటుంబ సభ్యుల వివాహ అవసరాల కోసం మొత్తం 5 సార్లు PF నుంచి అడ్వాన్స్ తీసుకోవచ్చు. ఇంతకుముందు మ్యారేజ్, స్టడీ కలిపి ఉన్న పరిమితిని ఇప్పుడు వేర్వేరుగా మార్చారు.

ఇల్లు కొనాలన్నా.. కట్టుకోవాలన్నా

ఇల్లు లేదా స్థలం కొనుగోలు, ఇంటి నిర్మాణం, హోమ్ లోన్ చెల్లింపు, ఇంటి మరమ్మతులు వంటి అవసరాల కోసం కూడా PF అడ్వాన్స్ తీసుకోవచ్చు. ఈ కేటగిరీలో మొత్తం 5 సార్లు డబ్బులు డ్రా చేసుకునే అవకాశం ఉంటుంది.

శుద్ధి రాజకీయాలు.. కేసీఆర్‌ మౌనంతో మరింత డ్యామేజ్‌..?తెలంగాణSwechaa09 Sep 2026, 08:39 PM

శుద్ధి రాజకీయాలు.. కేసీఆర్‌ మౌనంతో మరింత డ్యామేజ్‌..?

TG: తెలంగాణ అసెంబ్లీ సమావేశాల ప్రారంభం రోజే కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఇరుకున పెట్టేలా బీఆర్‌ఎస్‌ పక్కా వ్యూహ రచనతో ముందుకు వెళ్లింది. బ్లాక్ టీషర్టులు వేసుకొని అసెంబ్లీకి రావడంతో నిరసనకు శ్రీకారం చుట్టింది గులాబీ దళం. ప్రభుత్వం ఇచ్చిన హామీలు, ప్రజా సమస్యలను ప్రస్తావిస్తూ అధికార పక్షాన్ని నిలదీయాలన్నది ఆ పార్టీ వ్యూహంగా కనిపించింది. అయితే ఆ తర్వాత చోటుచేసుకున్న పరిణామాలు గులాబీ క్యాంపు‌కు అనూహ్యమైన ఇబ్బందులను తీసుకొచ్చాయి.ఈ మొత్తం వ్యవహారంలో ఇప్పుడు అందరి దృష్టి గులాబీ బాస్ కేసీఆర్‌ వైపు మళ్లింది. పార్టీ అధినేతగా ఆయన నుంచి స్పష్టమైన స్పందన వస్తుందా? తాతా మధు వ్యాఖ్యలపై ఏదైనా వివరణ ఇస్తారా? ఎర్రవల్లి ఘటనపై పార్టీ వైఖరిని వెల్లడిస్తారా? అన్నది ఇప్పుడు రాష్ట్ర రాజకీయాల్లో ఆసక్తికరంగా మారింది. మరోవైపు బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యేల సస్పెన్షన్‌తో అసెంబ్లీ పోరు మరింత తీవ్ర రూపం దాల్చింది.

Ranabaali Teaser: సింగనమల బొబ్బిలి 'రణబాలి' గా విజయ్ విశ్వరూపంసినిమాSwechaa09 Sep 2026, 07:56 PM

Ranabaali Teaser: సింగనమల బొబ్బిలి 'రణబాలి' గా విజయ్ విశ్వరూపం

Ranabaali Teaser: కొన్ని సినిమాల ప్రమోషనల్ కంటెట్ చూస్తేనే ఇదేదో బాక్సాఫీస్ వద్ద సరికొత్త రికార్డ్స్ నమోదు చేయడం ఖాయమని కళ్ళు మూసుకొని డిసైడైపోవచ్చు. అలా, ఇప్పుడు ఫుల్ క్లారిటీగా డిసైయ్యే సినిమా విజయ్ దేవరకొండ నటిస్తున్న రణబాలి. తాజాగా, ఈ సినిమా నుంచి టీజర్ రిలీజై..అమాంతం అంచనాలను పెంచేసింది. హీరోయిన్‌గా రష్మిక మందన్న నటిస్తున్న ఈ సినిమాను రాహుల్ సాంకృత్యన్ తెరకెక్కిస్తున్నాడు. తాజాగా విడుదలైన టీజర్‌తో బాక్సాఫీస్ వద్ద సునామీ రాబోతుందని ఫ్యాన్స్ చెప్పుకుంటున్నారు.

ఏపీ, తెలంగాణకు కేంద్రం గుడ్‌న్యూస్..తెలంగాణSwechaa09 Sep 2026, 07:54 PM

ఏపీ, తెలంగాణకు కేంద్రం గుడ్‌న్యూస్..

Railway Multitracking Projects: తెలుగు రాష్ట్రాలకు కేంద్రం శుభవార్త చెప్పింది. ఆంధ్రప్రదేశ్, తెలంగాణలోని రద్దీ మార్గాలతో సహా దేశవ్యాప్తంగా పలు మల్టీ ట్రాకింగ్ రైల్వే ప్రాజెక్టులకు కేంద్ర క్యాబినెట్ ఆమోదం తెలిపింది. కేంద్ర రైల్వే శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ ఈ వివరాలు వెల్లడించారు.

తెలంగాణలోని ఘట్‌కేసర్-కాజీపేట మధ్య నాలుగో లైను నిర్మాణానికి ఆమోదం లభించింది. 110 కిలోమీటర్ల ఈ ప్రాజెక్టుకు రూ. 2,419 కోట్లు కేటాయించింది. ఇప్పటికే సికింద్రాబాద్-వాడి మధ్య 4 లేన్ల నిర్మాణ పనులు వేగంగా జరుగుతున్నాయి. ఇక ఆంధ్రప్రదేశ్‌ మీదుగా సాగే అరక్కోణం-రేణిగుంట మార్గంలో 3వ, 4వ లైన్ల నిర్మాణానికీ కేంద్రం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది.

Alleti Maheshwar Reddy: రేవంత్‌ రెడ్డి కొత్తగా "రూల్‌ బుక్‌" ఏమైనా పెట్టుకున్నారా?’.. మహేశ్వర్‌ రెడ్డి ప్రశ్న..తెలంగాణSwechaa09 Sep 2026, 07:40 PM

Alleti Maheshwar Reddy: రేవంత్‌ రెడ్డి కొత్తగా "రూల్‌ బుక్‌" ఏమైనా పెట్టుకున్నారా?’.. మహేశ్వర్‌ రెడ్డి ప్రశ్న..

Alleti Maheshwar Reddy: తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు అధికార, ప్రతిపక్షాల మధ్య తీవ్ర వాగ్వాదాలకు వేదికగా మారుతున్నాయి. బీఆర్ఎస్ ఎమ్మెల్యేలను ఈ సెషన్ ముగిసే వరకు సస్పెండ్ చేయడంపై బీజేపీ శాసనసభా పక్ష నేత ఏలేటి మహేశ్వర్ రెడ్డి తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. సభలో లేని సభ్యులను సైతం సస్పెండ్ చేయడం గతంలో ఎన్నడూ లేని పరిణామమని ఆయన వ్యాఖ్యానించారు.ఈ సందర్భంగా శాసనసభలో మాట్లాడిన ఏలేటి మహేశ్వర్ రెడ్డి .. సభా నిబంధనల ఉల్లంఘన జరిగితే ప్రశ్నించాల్సిన బాధ్యత తమపై ఉందన్నారు. అయితే, కొందరు సభ్యులను ఇష్టానుసారంగా సస్పెండ్ చేయడం సరైన విధానం కాదని విమర్శించారు. “ఏ పుస్తకం ప్రకారం ఈ నిర్ణయం తీసుకున్నారు? కొత్తగా రేవంత్ రెడ్డి రూల్ బుక్ ఏమైనా ఏర్పాటు చేసుకున్నారా?” అంటూ ఆయన ప్రభుత్వాన్ని ప్రశ్నించారు.

శ్రీవారి భక్తులకు ఎల్‌ఐసీతో బీమా.. గుడ్‌న్యూస్ చెప్పిన తితిదే!ఏపీSwechaa09 Sep 2026, 07:00 PM

శ్రీవారి భక్తులకు ఎల్‌ఐసీతో బీమా.. గుడ్‌న్యూస్ చెప్పిన తితిదే!

TTD: తిరుమల తిరుపతి దేవస్థానం (తితిదే) పాలక మండలి భక్తులు, సిబ్బంది సంక్షేమానికి సంబంధించి పలు కీలక నిర్ణయాలు తీసుకుంది. దేశంలోనే తొలిసారిగా తిరుమలకు వచ్చే భక్తులకు ఎల్‌ఐసీ ద్వారా బీమా కల్పించేందుకు నిర్ణయం తీసుకుంది. అలాగే ఉద్యోగుల బీమా పరిధిని పెంచడంతో పాటు పెన్షనర్లు, వారి కుటుంబాలకు ఆరోగ్య సేవలు అందించే అంశానికీ ఆమోదం తెలిపింది. ఈ వివరాలను తితిదే ఛైర్మన్‌ బీఆర్‌ నాయుడు, ఈవో ముద్దాడ రవిచంద్ర వెల్లడించారు.నారాయణవనం శ్రీ పద్మావతి సమేత కల్యాణ వేంకటేశ్వరస్వామి ఆలయంలో అమ్మవారి పద్మపీఠానికి బంగారు తాపడం చేయించేందుకు అనుమతి ఇచ్చారు. అలాగే చెన్నైలోని శ్రీ పద్మావతి అమ్మవారి ఆలయ ధ్వజస్తంభం, బలిపీఠానికి స్వర్ణ తాపడం కోసం రూ.17.05 కోట్ల ప్రతిపాదనకు పాలక మండలి ఆమోదం తెలిపింది. భక్తుల సౌకర్యాలు, ఉద్యోగుల సంక్షేమం, ఆలయాల అభివృద్ధికి ప్రాధాన్యం ఇస్తూ నిర్ణయాలు తీసుకున్నట్లు తితిదే వెల్లడించింది.

Suriya: నవంబర్ లో 'సీన్' చూపించబోతున్న సూర్య..సినిమాSwechaa09 Sep 2026, 06:59 PM

Suriya: నవంబర్ లో 'సీన్' చూపించబోతున్న సూర్య..

Suriya: కోలీవుడ్ స్టార్ హీరో సూర్య కొత్త ప్రాజెక్ట్‌తో రాబోతున్నాడు. జిత్తు మాధవన్ ఈ సినిమాను రూపొందిస్తున్నాడు. నజ్రియా నజీమ్ హీరోయిన్‌గా నటిస్తోంది. తాజాగా, ఈ సినిమా నుంచి టీజర్ తో పాటు విడుదల తేదీని కూడా అధికారికంగా ప్రకటించారు. అంతేకాదు, ఓ వెరైటీ టైటిల్ కూడా రివీల్ చేయడం విశేషం. 'సీన్' అనే టైటిల్ ని ఫిక్స్ చేసిన మేకర్స్ నవంబర్ లో రిలీజ్ చేయనున్నట్టుగా వెల్లడించారు.