స్వేచ్ఛ షార్ట్స్ — తాజా తెలుగు వార్తలు

ఇది కాలం తెచ్చిన కరవు కాదు.. రేవంత్ తెచ్చిన కరవుతెలంగాణSwechaa10 Sep 2026, 06:19 PM

ఇది కాలం తెచ్చిన కరవు కాదు.. రేవంత్ తెచ్చిన కరవు

Harish Rao: కాంగ్రెస్ సర్కార్ పై మాజీ మంత్రి హరీశ్ రావు మండిపడ్డారు. పంట పొలాల్లో ఉండాల్సిన రైతులు కరెంటు కోసం, నీళ్ల కోసం రోడ్డెక్కాల్సిన దుస్థితి వచ్చిందని హరీశ్ రావు ఆవేదన వ్యక్తం చేశారు. తెలంగాణకు రావాల్సిన నీళ్లు ఆంధ్రప్రదేశ్ కు పోతున్నాయని ఆరోపించారు. తెలంగాణలో పంటలు ఎండిపోతుంటే కృష్ణా జలాలను ఏపీకి వదులుతున్నారని చెప్పారు. కళ్ల ముందు నీళ్లు పారుతున్నా పొలాలకు నీళ్లు ఇవ్వలేని పాలన రాష్ట్రంలో సాగుతోందన్నారు. కల్వకుర్తిలో 3 మోటార్లు ఎందుకు బంద్ పెట్టారు? అని ప్రభుత్వాన్ని ప్రశ్నించారు హరీశ్ రావు.

చెరువుల్లో నిమజ్జనాలపై హైడ్రా క్లారిటీ.. ఏం చెప్పారంటే?తెలంగాణSwechaa10 Sep 2026, 05:57 PM

చెరువుల్లో నిమజ్జనాలపై హైడ్రా క్లారిటీ.. ఏం చెప్పారంటే?

TG : హైదరాబాద్‌లో గణేశ్ నిమజ్జనాలపై తాజాగా హైడ్రా కమిషనర్ రంగనాథ్ కీలక కామెంట్స్ చేశారు. చెరువుల్లో వినాయక విగ్రహాల నిమజ్జనాలకు హైడ్రా వ్యతిరేకం కాదని ఈ సందర్భంగా ఆయన స్పష్టం చేశారు. సోషల్ మీడియాలో హైడ్రాపై కొందరు కావాలనే తప్పుడు ప్రచారం చేస్తున్నారని ఆయన పేర్కొన్నారు.మొత్తంగా గణేశ్ నిమజ్జనాల విషయంలో హైడ్రా వ్యతిరేకంగా వ్యవహరిస్తుందనే ప్రచారంలో వాస్తవం లేదని ఆయన స్పష్టం చేశారు. పర్యావరణ పరిరక్షణతో పాటు భక్తులకు ఇబ్బందులు లేకుండా నిమజ్జన కార్యక్రమాలు జరిగేలా ఏర్పాట్లు చేస్తున్నట్లు హైడ్రా కమిషనర్ వెల్లడించారు.

ఖాతాదారులకు అలర్ట్.. దేశవ్యాప్త సమ్మెకు సిద్దమైన బ్యాంక్ ఉద్యోగులు!..NationalSwechaa10 Sep 2026, 05:49 PM

ఖాతాదారులకు అలర్ట్.. దేశవ్యాప్త సమ్మెకు సిద్దమైన బ్యాంక్ ఉద్యోగులు!..

దేశవ్యాప్తంగా బ్యాంకింగ్ ఉద్యోగులు సెప్టెంబర్ 11న సమ్మెకు పిలుపునిచ్చారు. యునైటెడ్ ఫోరమ్ ఆఫ్ బ్యాంక్ యూనియన్స్ ఆధ్వర్యంలో జరగనున్న ఈ సమ్మె వల్ల ముఖ్యంగా ప్రభుత్వ రంగ బ్యాంకుల్లో సేవలపై తీవ్ర ప్రభావం పడే అవకాశం ఉంది. ఇక వారానికి 5 రోజుల పనిదినాల విధానాన్ని వెంటనే అమలు చేయాలని బ్యాంక్ ఉద్యోగులు డిమాండ్ చేస్తున్నారు.స్కేల్ IV, అంతకంటే ఎక్కువ కేడర్ అధికారుల కోసం తెచ్చిన పర్ఫార్మెన్స్ లింక్డ్ ఇన్సెంటివ్ విధానంపై అభ్యంతరాలు.. పెన్షన్ సవరణలతో పాటు దీర్ఘకాలంగా పెండింగ్‌లో ఉన్న పలు డిమాండ్లను పరిష్కరించాలని కోరుతున్నారు.

Kiara Advani: టాక్సిక్ ఎఫెక్ట్..సౌత్‌లో కియారా చాప్టర్ క్లోజ్?సినిమాSwechaa10 Sep 2026, 05:40 PM

Kiara Advani: టాక్సిక్ ఎఫెక్ట్..సౌత్‌లో కియారా చాప్టర్ క్లోజ్?

Kiara Advani: కియారా అద్వానీ చాప్టర్ సౌత్ సినిమా ఇండస్ట్రీలలో క్లోజ్ అయిందా? దీనికి, టాక్సిక్ సినిమానే కారణా? అవుననే మాట ఇప్పుడు ఫిల్మ్ సర్కిల్స్‌లో వినిపిస్తోంది. మన సినిమా ఇండస్ట్రీలలో హీరోయిన్‌కి గనక ఫ్లాప్స్ పడుతుంటే మెల్లగా ఆ హీరోయిన్‌ని అవైడ్ చేస్తుంటారు. కన్నడ రాకింగ్ స్టార్ యష్ నటించిన టాక్సిక్ సినిమాలో కియారా అద్వానీ చేసిన పాత్ర ఏమాత్రం ప్రభావం చూపలేదు. ఇప్పటికే, సౌత్‌లో చేసిన ఎక్కువ సినిమాలు ఫ్లాపయ్యాయి. అందుకే, మేకర్స్ ఈ బ్యూటీని పక్కన పెట్టినట్టు తెలుస్తోంది.

Ticket Price Hike: స్టార్ హీరో సినిమా అంటే టికెట్ రేట్లు పెంచాల్సిందేనా? ఇది నిజంగా అవసరమేనా?సినిమాSwechaa10 Sep 2026, 05:08 PM

Ticket Price Hike: స్టార్ హీరో సినిమా అంటే టికెట్ రేట్లు పెంచాల్సిందేనా? ఇది నిజంగా అవసరమేనా?

Ticket Price Hike : స్టార్ హీరో సినిమా వస్తుందంటే టికెట్ రేట్లు పెరగడం ఇప్పుడు చాలా కామాన్ అయ్యింది. భారీ బడ్జెట్, స్టార్ కాస్టింగ్, పాన్ ఇండియా మార్కెట్ అంటూ టికెట్ ధరలకు రెక్కలు వస్తున్నాయి. అయితే వందల కోట్లు ఖర్చు చేస్తున్నామనే కారణంతో ప్రేక్షకులపై టికెట్ ధరల భారం మోపడం ఎంతవరకు కరెక్ట్? అసలు పెద్ద సినిమాలకు టికెట్ రేట్ల పెంపు నిజంగా అవసరమేనా? అనే ప్రశ్న ఇప్పుడు మరోసారి హాట్ టాపిక్‌గా మారింది.ఈ నేపథ్యంలో సెప్టెంబర్ 24న ప్రపంచవ్యాప్తంగా విడుదలకు రెడీ అవుతున్న ‘ది ప్యారడైజ్’పై ఆసక్తి నెలకొంది. న్యాచురల్ స్టార్ నాని నటిస్తున్న ఈ పాన్ ఇండియా సినిమాకు టికెట్ హైక్స్ ఉంటాయా? లేదంటే నార్మల్ టికెట్ ధరలతోనే ప్రేక్షకుల ముందుకు వస్తుందా? అన్నది ఇప్పడు ఆసక్తికరంగా మారింది.ఇదే సమయంలో ప్రేక్షకుల నుంచి ఒక వాదన వినిపిస్తోంది. సినిమా ఎంత పెద్దదైనా సరే టికెట్ ధర అందుబాటులో ఉంటేనే కుటుంబంతో కలిసి థియేటర్‌కు వచ్చే ఆడియన్స్ సంఖ్య పెరుగుతుందని.. మంచి కంటెంట్ ఉంటే వసూళ్లు ఆటోమేటిక్‌గా పెరుగుతాయని ఇటీవల రిలీజ్ అయ్యి హిట్లు, సూపర్ హిట్లు కొట్టిన కొన్ని సినిమాలు నిరూపించాయని చెబుతున్నారు.

ప్రజా నాయకుడు.. మంత్రి తుమ్మలపై బీజేపీ ఎమ్మెల్యే ప్రశంసల వర్షంతెలంగాణSwechaa10 Sep 2026, 05:04 PM

ప్రజా నాయకుడు.. మంత్రి తుమ్మలపై బీజేపీ ఎమ్మెల్యే ప్రశంసల వర్షం

Tummala Nageswara Rao: ప్రస్తుతం రాజకీయాలు భ్రష్టుపట్టిపోయాయన్న విమర్శలు ఎక్కువగా ఉన్నాయి. దీనికి కారణం నాయకులే. నేతలు ఒకరిపై మరొకరు చేసుకుంటున్న విమర్శలు జుగుప్సాకరంగా ఉంటున్నాయి. వ్యక్తిగతంగా విమర్శలు చేసుకోవడమే కాదు బూతులు కూడా తిట్టుకుంటున్నారు. వ్యక్తిత్వ హననానికి పాల్పడుతున్నారు. దీంతో రాజకీయాలన్నా, నాయకులన్నా అసహ్యించుకునే పరిస్థితి ప్రజల్లో ఉంది.

లీడర్లు ప్రత్యర్థి పార్టీ నాయకులను దారుణంగా తిట్టడం కామన్ గా మారింది. ఇలాంటి పరిస్థితుల్లో ఇందుకు పూర్తి భిన్నమైన ఘటన ఒకటి జరిగింది. ఒక పార్టీకి చెందిన నాయకుడు మరో పార్టీకి చెందిన నేతపై ప్రశంసల వర్షం కురిపించారు. నాయకుడు అంటే ఇలా ఉండాలి అంటూ కితాబిచ్చారు. తెలంగాణ అసెంబ్లీ సమావేశాల్లో ఈ అరుదైన ఘటన జరిగింది.

కాఫీ టేబుల్‌పై తెలంగాణ పాలిటిక్స్.. బీజేపీ ఎమ్మెల్యేల బ్రేక్‌ఫాస్ట్ రచ్చ!తెలంగాణSwechaa10 Sep 2026, 04:19 PM

కాఫీ టేబుల్‌పై తెలంగాణ పాలిటిక్స్.. బీజేపీ ఎమ్మెల్యేల బ్రేక్‌ఫాస్ట్ రచ్చ!

BJP: తెలంగాణ అసెంబ్లీలో జరిగిన ఓ కార్యక్రమం ఇప్పుడు తెలంగాణ రాజకీయాల్లో సరికొత్త చర్చకు దారితీస్తోంది. సాధారణంగా రాజకీయ నాయకులు కలిసి మాట్లాడుకోవడం, కార్యక్రమాల సందర్భంగా ఒకే టేబుల్ వద్ద కూర్చొని టిఫిన్ చేయడం సర్వసాధారణం. కానీ ఈ సోషల్ మీడియా యుగంలో ఇలాంటి దృశ్యాలు కూడా రాజకీయ విమర్శలకు కారణమవుతున్నాయి. తాజాగా అసెంబ్లీ సెంట్రల్ హాల్ ప్రారంభోత్సవం సందర్భంగా జరిగిన బ్రేక్‌ఫాస్ట్ వ్యవహారం ఇదే పరిస్థితిని తెచ్చిపెట్టింది.తెలంగాణ అసెంబ్లీ సెంట్రల్ హాల్‌ను సోమవారం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో వివిధ పార్టీలకు చెందిన ఎమ్మెల్యేలు పాల్గొన్నారు. బీజేపీకి చెందిన కొందరు ఎమ్మెల్యేలు కూడా ఈ ఈవెంట్‌లో పాల్గొన్నారు. ప్రారంభోత్సవం అనంతరం అక్కడే అందరికీ టిఫిన్ ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా కొందరు బీజేపీ ఎమ్మెల్యేలు సీఎం రేవంత్ రెడ్డితో కలిసి బ్రేక్‌ఫాస్ట్ చేయడం ఇప్పుడు రాజకీయంగా చర్చనీయాంశమైంది.

ఏఐ మాయాజాలం.. మీ  ఫోటోలను 80s వింటేజ్ లుక్‌లోకి మార్చుకోండిలా!వైరల్ న్యూస్Swechaa10 Sep 2026, 04:11 PM

ఏఐ మాయాజాలం.. మీ  ఫోటోలను 80s వింటేజ్ లుక్‌లోకి మార్చుకోండిలా!

సోషల్ మీడియాలో ప్రస్తుతం 80ల నాటి వింటేజ్ ఫోటోల ట్రెండ్ విపరీతంగా దూసుకుపోతోంది. నాటి సినిమా తారల శైలిని, ఆ కాలం నాటి రంగులు, వాతావరణాన్ని ప్రతిబింబించేలా తమ ఫోటోలను మార్చుకోవడానికి నెటిజన్లు విశేష ఆసక్తి చూపుతున్నారు. కృత్రిమ మేధస్సు (AI) సాంకేతికత అందుబాటులోకి వచ్చాక, కావలసిన శైలిలో ఫొటోలను రీ-క్రియేట్ చేయడం చాలా సులభంగా మారింది. ఈ తరహా 80s రెట్రో ఫోటోలను రూపొందించడానికి ప్రధానంగా Remini, Epik, Lensa, Midjourney వంటి అనేక AI ఫొటో ఎడిటింగ్ యాప్‌లు అందుబాటులో ఉన్నాయి.

తెలంగాణ సచివాలయంలో అవినీతి బాగోతం.. ACBకి రెడ్‌హ్యాండెడ్‌గా దొరికిన ఉద్యోగులు!..తెలంగాణSwechaa10 Sep 2026, 03:59 PM

తెలంగాణ సచివాలయంలో అవినీతి బాగోతం.. ACBకి రెడ్‌హ్యాండెడ్‌గా దొరికిన ఉద్యోగులు!..

తెలంగాణ సచివాలయంలో ఏసీబీ సోదాలు కలకలం రేపుతున్నాయి. సచివాలయ ప్రాంగణంలోని టెంపుల్ దగ్గర లక్ష రూపాయల లంచం తీసుకుంటుండగా ఔట్‌సోర్సింగ్ ఉద్యోగి రాఘవేంద్రను ఏసీబీ అధికారులు రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. సీఎం రిలీఫ్ ఫండ్‌కు సంబంధించిన రెండు లక్షల రూపాయల చెక్కు కోసం ఏకంగా లక్ష రూపాయలు లంచం డిమాండ్ చేసినట్లు తెలుస్తోంది. ఈ వ్యవహారంలో సెక్షన్ ఆఫీసర్ వినోద్ పేరు కూడా వెలుగులోకి రావడంతో ఆయనను నాంపల్లి ఏసీబీ కార్యాలయానికి తరలించి విచారిస్తున్నారు. మరో అధికారి పాత్రపైనా అనుమానాలు ఉండటంతో సచివాలయంలో ఏసీబీ సోదాలు కొనసాగుతున్నాయి.

Tirumala: తిరుమలలో నీటి కష్టాలు..! మరో 4 నెలలు మాత్రమే..!ఏపీSwechaa10 Sep 2026, 03:30 PM

Tirumala: తిరుమలలో నీటి కష్టాలు..! మరో 4 నెలలు మాత్రమే..!

Tirumala: ఎల్ నినో (Elnino) తీవ్రమైన ప్రభావమే చూపిస్తోంది. ఎల్ నినో కారణంగా సకాలంలో వర్షాలు కురవకుండా పోయాయి. దీంతో చాలా ప్రాంతాల్లో నీటి కష్టాలు మొదలయ్యాయి. తాగునీటి కోసం ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. ఎల్ నినో ఎఫెక్ట్ పవిత్ర పుణ్యక్షేత్రం తిరుమలపైనా పడింది. తిరుమలలో నీటి కష్టాలు తప్పడం లేదు. జలాశయాల్లో నీటి నిల్వలు తగ్గిపోయాయి. దీంతో టీటీడీ అధికారులు అలర్ట్ అయ్యారు. నీటి పొదుపు చర్యలు చేపట్టారు.

ఇందిరమ్మ ఇంటికి రూ.5లక్షలు చాలట్లేదు.. సొంత ప్రభుత్వంపై ఎమ్మెల్యే కామెంట్స్!తెలంగాణSwechaa10 Sep 2026, 03:13 PM

ఇందిరమ్మ ఇంటికి రూ.5లక్షలు చాలట్లేదు.. సొంత ప్రభుత్వంపై ఎమ్మెల్యే కామెంట్స్!

 తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వంలో అత్యంత ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణ పథకంపై భువనగిరి/మునుగోడు శాసనసభ్యుడు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. పేదలకు ఇల్లు నిర్మించుకోవడానికి ప్రభుత్వం అందిస్తున్న రూ.5లక్షల ఆర్థిక సహాయం ఏమాత్రం సరిపోవడం లేదని ఆయన బాహాటంగానే అసంతృప్తి వ్యక్తం చేశారు. ప్రస్తుతం మార్కెట్‌లో నిర్మాణ సామగ్రి (సిమెంట్, ఐరన్) ధరలు విపరీతంగా పెరిగిపోవడమే కాకుండా మేస్త్రీల కూలీల వ్యయం కూడా ఊహించని విధంగా పెరిగిందని ఆవేదన వ్యక్తం చేశారు.

ఎమ్మెల్సీలపై అనర్హత వేటు.. చట్టాలు ఏం చెప్తున్నాయ్..?తెలంగాణSwechaa10 Sep 2026, 02:49 PM

ఎమ్మెల్సీలపై అనర్హత వేటు.. చట్టాలు ఏం చెప్తున్నాయ్..?

తెలంగాణ రాజకీయాల్లో గత రెండు రోజులుగా పరిణామాలు వేగంగా మారుతున్నాయి. అసెంబ్లీ వర్షాకాల సమావేశాల తొలిరోజు విపక్షాల నిరసనలతో సభలో తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. బీఆర్ఎస్‌ ప్రజాప్రతినిధులు ఎన్నికల హామీల అమలుపై ప్రభుత్వాన్ని నిలదీస్తున్న సమయంలో చోటుచేసుకున్న కొన్ని పరిణామాలు ఒక్కసారిగా రాజకీయ సమీకరణాలను మాలాబీ పార్టీకి చెందిన ఇ

బీఆర్ఎస్ ఎమ్మెల్సీలకు నో కవరేజీ.. శంభీపూర్ రాజు ఏం చేశారంటే?తెలంగాణSwechaa10 Sep 2026, 02:45 PM

బీఆర్ఎస్ ఎమ్మెల్సీలకు నో కవరేజీ.. శంభీపూర్ రాజు ఏం చేశారంటే?

ప్రస్తుత అసెంబ్లీ సమావేశాలు రాజకీయాలకు వేదికగా మారినట్టు తెలుస్తోంది. సాధారణంగా అసెంబ్లీలో ప్రజాసమస్యలపై అర్థవంతమైన చర్చ జరగాలి.కానీ,అధికార, ప్రతిపక్ష పార్టీలు కేవలం రాజకీయమే ఎజెండాగా ముందుకు వెళ్తున్నట్టు తెలుస్తోంది. ప్రధాన ప్రతిపక్ష పార్టీ అయిన బీఆర్ఎస్ సభ్యులను స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ శాసనసభ నుంచి సస్పెండ్ చేశారు.ఇక మండలిలోనూ గులాబీ పార్టీకి చెందిన ఇద్దరు ఎమ్మెల్సీలను చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి సస్పెండ్ చేశారు. మండలిలో బీఆర్ఎస్‌కు మరికొందరు ఎమ్మెల్సీలు ఉన్నా వారికి మాట్లాడే అవకాశం ఇవ్వడం లేదని, కెమెరా ఫోకస్ వారి మీద ఉండటం లేదని తెలిసింది. తమను కెమెరాలో చూపించడం లేదని భావించిన బీఆర్ఎస్ ఎమ్మెల్సీ శంభీపూర్ రాజు వినూత్న ఆలోచన చేశారు. తీన్మార్ మల్లన్న శాసన మండలిలో మాట్లాడేటప్పుడు ఆయన పక్కన కూర్చొని జేబులో ఉన్న పేపర్‌ను చూపిస్తూ ‘బామ్మర్దికి అమృత్ టెండర్లు.. తమ్ముడికి రావిర్యాల భూములు.. రైజింగ్ అనుముల ఫ్యామిలీ’ అంటూ నిరసన తెలిపారు. గమనించిన మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు.

Vijay-Rashmika: ‘రణబాలి’లో సోషియో ఫాంటసీ ఎలిమెంట్స్ కూడా!సినిమాSwechaa10 Sep 2026, 02:45 PM

Vijay-Rashmika: ‘రణబాలి’లో సోషియో ఫాంటసీ ఎలిమెంట్స్ కూడా!

Vijay-Rashmika: టాలీవుడ్ క్రేజీ కపుల్ విజయ్ దేవరకొండ, రష్మిక మందన జంటగా నటిస్తున్న లేటెస్ట్ పీరియాడికల్ సినిమా రణబాలి. తాజాగా ఈ సినిమా నుంచి టీజర్ వచ్చి చాలామంది అనుకుంటున్న నెగిటివ్ టాక్‌కి గట్టి కౌంటర్ ఇచ్చింది. ఈ సినిమాను రాహుల్ రాహుల్ సాంకృత్యన్ ఎంతో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిస్తున్నాడు. పీరియాడికల్ మూవీ అని ఇన్ని రోజులు అనుకున్నా, తాజా టీజర్‌లో సోషియో ఫాంటసీ కూడా మిక్స్ చేసినట్టు అర్థమవుతోంది.

వాతావరణ శాఖ అలర్ట్.. ఆ జిల్లాల్లో మూడ్రోజులు భారీ వర్షాలు!ఏపీSwechaa10 Sep 2026, 02:23 PM

వాతావరణ శాఖ అలర్ట్.. ఆ జిల్లాల్లో మూడ్రోజులు భారీ వర్షాలు!

 ఉత్తర బంగాళాఖాతం, దానికి ఆనుకుని ఉన్న పరిసర ప్రాంతాల్లో ఏర్పడిన ఉపరితల ఆవర్తన ప్రభావంతో గురువారం అల్పపీడనం రూపుదిద్దుకుంది. దీని ప్రభావంతో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రవ్యాప్తంగా రాబోయే మూడు రోజుల పాటు విస్తారంగా వర్షాలు కురిసే అవకాశముందని విపత్తుల నిర్వహణ సంస్థ (APSDMA), వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేశాయి. ముఖ్యంగా ఉత్తరాంధ్ర తీరప్రాంతం వెంబడి గంటకు 40నుంచి 60 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీచే అవకాశం ఉండటంతో సముద్రం అలజడిగా ఉంటుందని తెలిపారు.

కేటీఆర్‌‌కు దెబ్బ మీద దెబ్బ.. పీఆర్వో, పీఏ మీద కేసుతెలంగాణSwechaa10 Sep 2026, 02:19 PM

కేటీఆర్‌‌కు దెబ్బ మీద దెబ్బ.. పీఆర్వో, పీఏ మీద కేసు

బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌కు మరో బిగ్‌షాక్ తగిలింది. అసెంబ్లీ వర్షాకాల సమావేశాల ప్రారంభం రోజున జరిగిన తీవ్ర ఉద్రిక్తతే ఇందుకు కారణంగా తెలుస్తోంది. ఇప్పటికే బీఆర్ఎస్ పార్టీకి చెందిన ఇద్దరు ఎమ్మెల్సీలు మండలి నుంచి సస్పెండ్ అయ్యారు. అలాగే శాసనసభ నుంచి బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు సైతం సస్పెన్షన్‌కు గురయ్యారు. కాసేపటి క్రితం మాజీ మంత్రులు కేటీఆర్, హరీష్ రావు సహా మరో ఇద్దరు ఎమ్మెల్యేల మీద లైంగిక వేధింపుల కేసు నమోదైంది. ఓ మహిళా కానిస్టేబుల్ ఫిర్యాదు మేరకు సైఫాబాద్ పోలీసులు కేసు ఫైల్ చేసినట్టు సమాచారం. ఇదిలాఉండగా, తాజాగా కేటీఆర్ పీఆర్ఓ, పీఏ మీద కూడా కేసు నమోదైంది.

బీఎస్పీలో సంచలనం.. మేనల్లుడు ఆకాష్ ఆనంద్‌ను పార్టీ నుంచి తొలగించిన మాయావతి!NationalSwechaa10 Sep 2026, 02:15 PM

బీఎస్పీలో సంచలనం.. మేనల్లుడు ఆకాష్ ఆనంద్‌ను పార్టీ నుంచి తొలగించిన మాయావతి!

 బహుజన్ సమాజ్ పార్టీ (BSP) అధినేత్రి మాయావతి పార్టీ అంతర్గత వ్యవహారాల్లో అత్యంత సంచలనాత్మక నిర్ణయం తీసుకున్నారు. తన సొంత మేనల్లుడు, ఒకప్పుడు పార్టీ రాజకీయ వారసుడిగా ప్రచారం పొందిన ఆకాష్ ఆనంద్‌ను బీఎస్పీకి సంబంధించిన అన్ని బాధ్యతల నుంచి తొలగిస్తూ, చివరకు పార్టీ నుంచి కూడా బహిష్కరిస్తున్నట్లు ప్రకటించారు. ఉత్తరప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో మాయావతి తీసుకున్న ఈ ఊహించని నిర్ణయం రాష్ట్ర రాజకీయాల్లో సంచలనంగా మారింది.

Karthi Sardhar 2: సర్ధార్ 2 ఊహించుకున్నంత లేదే!సినిమాSwechaa10 Sep 2026, 02:13 PM

Karthi Sardhar 2: సర్ధార్ 2 ఊహించుకున్నంత లేదే!

Karthi Sardhar 2: తాజాగా థియేటర్స్‌లోకి వచ్చింది కోలీవుడ్ స్టార్ కార్తి నటించిన సర్దార్ 2. టైటిల్ చూడగానే ఇది సీక్వెల్ అని ప్రత్యేకించి చెప్పాల్సిన పనిలేదు. సర్ధార్ చిత్రానికి రెండవ భాగంగా దర్శకుడు పీఎస్ మిత్రన్ రూపొందించాడు. ఆషిక రంగనాథ్, మాళవిక మోహనన్ హీరోయిన్స్‌గా నటించారు. అయితే, భారీ అంచనాల మధ్య వచ్చిన ఈ సీక్వెల్ మూవీ ఆశించిన స్థాయిలో లేదంటున్నారు.

అన్నదమ్ములతోనే రేవంత్ ఒప్పందాలు.. ఫ్యూచర్ సిటీకి భవిష్యత్ లేదు : కేటీఆర్తెలంగాణSwechaa10 Sep 2026, 01:53 PM

అన్నదమ్ములతోనే రేవంత్ ఒప్పందాలు.. ఫ్యూచర్ సిటీకి భవిష్యత్ లేదు : కేటీఆర్

సీఎం రేవంత్ రెడ్డి మీద బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మరోసారి తీవ్ర విమర్శలు చేశారు.గురువారం ముఖ్యమంత్రి తమ్ముడు కొండల్ రెడ్డి కంపెనీ ‘టెసెరాక్ట్ అడ్వాన్స్‌డ్ సిస్టమ్స్‌’కు ఫోర్త్ సిటీలో అక్రమంగా కట్టబెట్టిన భూమి వద్దకు కేటీఆర్, హరీష్ రావు, బీఆర్ఎస్ నేతలు చేరుకొని పరిశీలించారు. అనంతరం మీడియాతో కేటీఆర్ మాట్లాడుతూ.. అమెరికా పర్యటనలో సొంత సోదరులతోనే రేవంత్ రెడ్డి ఒప్పందాలు చేసుకొని పెట్టుబడులు తెస్తున్నాడని ఎద్దేవాచేశారు. ‘ది గ్రేట్ అనుముల రేవంత్ రెడ్డితో ది గ్రేట్ పారిశ్రామికవేత్త అనుముల జగదీశ్వర్ రెడ్డితో రూ.1000 కోట్ల పెట్టుబడులు తీసుకొచ్చాడు. ఇలా అనుముల జగదీశ్వర్ రెడ్డికి రూ.1000 కోట్లు, అనుముల కొండల్ రెడ్డికి రూ.250 కోట్లు ఇవ్వడమేనా ప్రజాపాలన.అనుముల అన్నదమ్ముల దోపిడీ గురించి బీజేపీ ఎందుకు మాట్లాడటం లేదు. కాంగ్రెస్ పార్టీకి తెలంగాణ ఏటీఎంగా మారిందని బీజేపీ వాళ్ళు అంటారు.. మరి దొంగని పట్టుకోవాల్సిన కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఎక్కడ ఉన్నాడు’ అని ప్రశ్నించారు.

రేషన్ దందా.. సిరిసిల్లలో  250 క్వింటాళ్ల  బియ్యం పట్టివేతతెలంగాణSwechaa10 Sep 2026, 01:38 PM

రేషన్ దందా.. సిరిసిల్లలో 250 క్వింటాళ్ల బియ్యం పట్టివేత

రాజన్న సిరిసిల్ల జిల్లాలో భారీగా రేషన్ బియ్యాన్ని అధికారులు పట్టుకున్నారు.అక్రమంగా నిల్వ చేసిన 250 క్వింటాళ్ల రేషన్ బియ్యాన్ని స్వాధీనం చేసుకున్నారు. కనకదుర్గ ట్రేడర్స్ రైస్ మిల్లుపై సివిల్ సప్లైస్ అధికారులు ఇవాళ ఉదయం ఆకస్మిక దాడులు నిర్వహించినట్టు తెలిసింది. నిబంధనలకు విరుద్ధంగా బియ్యం నిల్వ చేసినందుకు కనకదుర్గ ట్రేడర్స్ లైసెన్స్ సీజ్ చేసినట్టు సమాచారం.పట్టుబడిన రేషన్ బియ్యాన్ని సేఫ్ కస్టడీ కోసం వాసవి ట్రేడర్స్‌కు తరలించినట్టు అధికారులు వెల్లడించారు. ప్రభుత్వ రేషన్ బియ్యాన్ని అక్రమంగా నిల్వ చేస్తే కఠిన చర్యలు తప్పవని డీఎస్ఓ బుచ్చిబాబు హెచ్చరించారు.

The Paradise-North America Sales: జడల్ జమానా షురూ..నార్త్ అమెరికా మోత మోగుతోంది..సినిమాSwechaa10 Sep 2026, 01:34 PM

The Paradise-North America Sales: జడల్ జమానా షురూ..నార్త్ అమెరికా మోత మోగుతోంది..

The Paradise: నాని నటించిన 'ది ప్యారడైజ్' సినిమా రిలీజ్ డేట్ దగ్గరపడుతోంది. ఈ నేపథ్యంలో ప్రమోషన్స్ లో జోరు చూపిస్తున్నారు మేకర్స్. ఇదిలా ఉంటే టికెట్స్ ప్రీ సేల్స్ లో జడల్ జమనా షురూ అయింది. ఏకంగా 5000 వేలకి పైగా టికెట్స్ అమ్ముడయ్యాయి. ఈ విషయాన్ని మేకర్స్ తాజాగా పోస్టర్ ద్వారా ప్రకటించారు. ఈ సినిమా 7 భాషలలో సెప్టెంబర్ 24న రిలీజ్ కానుండగా, 23న ప్రీమియర్స్ పడబోతున్నాయి.

బీఆర్ఎస్‌కు షాక్.. కేటీఆర్, హరీశ్ రావుపై లైంగిక వేధింపుల కేసుతెలంగాణSwechaa10 Sep 2026, 01:26 PM

బీఆర్ఎస్‌కు షాక్.. కేటీఆర్, హరీశ్ రావుపై లైంగిక వేధింపుల కేసు

రాష్ట్ర రాజకీయాల్లో ఎవరూ ఊహించని పరిణామం చోటుచేసుకుంది. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, శాసనసభ డిప్యూటీ ఫ్లోర్ లీడర్ హరీశ్ రావు సహా మరో ఇద్దరు బీఆర్ఎస్ నేతలపై లైంగిక వేధింపుల కేసు నమోదు అయ్యింది. ఓ మహిళా కానిస్టేబుల్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు సైఫాబాద్ పీఎస్‌లో పోలీసులు కేసు నమోదు చేశారు. అసెంబ్లీ సమావేశాల ప్రారంభం రోజున పోలీసులు, బీఆర్ఎస్ ఎమ్మెల్యేలకు మధ్య తీవ్ర వాగ్వాదం చోటుచేసుకున్న విషయం తెలిసిందే. తోపులాట సైతం నెలకొనడంతో అక్కడ విధి నిర్వహణలో ఉన్న తన పట్ల సదరు నేతలు అసభ్యకరంగా ప్రవర్తించారని, లైంగికంగా వేధించారని ఓ మహిళా కానిస్టేబుల్ పోలీసులకు ఫిర్యాదు చేసినట్టు తెలిసింది. ఈ మేరకు కేటీఆర్, హరీశ్ రావుతో పాటు ఎమ్మెల్యే దేవిరెడ్డి సుధీర్ రెడ్డి,ఎమ్మెల్సీ నవీన్ రెడ్డిలపై భారతీయ న్యాయ సంహిత (BNS) సెక్షన్ల కింద సైఫాబాద్ పోలీసులు లైంగిక వేధింపుల కింద కేసు నమోదు చేసినట్టు సమాచారం.

సోషల్ మీడియాను షేక్ చేస్తున్న 1980 నాటి ట్రెండ్.. సీఎం రేవంత్ రెడ్డి క్లాస్ లుక్!వైరల్ న్యూస్Swechaa10 Sep 2026, 01:03 PM

సోషల్ మీడియాను షేక్ చేస్తున్న 1980 నాటి ట్రెండ్.. సీఎం రేవంత్ రెడ్డి క్లాస్ లుక్!

నెట్టింట రోజుకో కొత్త ట్రెండ్ ఊపందుకుంటోంది. ఈ క్రమంలోనే తాజాగా సామాజిక మాధ్యమాలను ఏలేస్తున్న '1980స్ రెట్రో ఏఐ ఆర్ట్' ట్రెండ్ అందరినీ విపరీతంగా ఆకట్టుకుంటోంది. సాధారణ నెటిజన్ల నుంచి డిజిటల్ క్రియేటర్ల వరకు ప్రతీ ఒక్కరు వింటేజ్ లుక్‌లోకి మారిపోతుండగా, తాజాగా తెలంగాణ రాజకీయ ప్రముఖులు కూడా ఈ వైరల్ చాంబర్‌లో అడుగుపెట్టడం విశేషం.  తెలంగాణ ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి స్వయంగా ఈ 1980ల నాటి డిజిటల్ ఫ్యాషన్ సంస్కృతిలో భాగమయ్యారు. సీఎం ఏఐ రూపంలో ఉన్న పాతకాలపు ఫొటోలు ప్రస్తుతం ఇంటర్నెట్‌లో తెగ హల్‌చల్ చేస్తున్నాయి.

'418'-Censor Report: ఈ హారర్ థ్రిల్లర్ పెద్దలకి మాత్రమే!సినిమాSwechaa10 Sep 2026, 01:00 PM

'418'-Censor Report: ఈ హారర్ థ్రిల్లర్ పెద్దలకి మాత్రమే!

'418'-Censor Report: కీర్తన్ నందగౌడ దర్శకత్వంలో సూర్య రాజ్, చరణ్ లక్కరాజు, ప్రీతీ పగడాల ప్రధాన పాత్రల్లో రూపొందుతోన్న సినిమా 418. తాజాగా ఈ సినిమాకి సెన్సార్ కార్యక్రమాలు పూర్తయ్యాయి. హర్రర్ థ్రిల్లర్ గా తెరకెక్కుతున్న ఈ సినిమాకి సెన్సార్ బోర్డ్ ఎ సర్టిఫికెట్‌ను జారి చేసింది. మైత్రీ మూవీ మేకర్స్‌తో కలిసి దర్శకుడు ప్రశాంత్ నీల్ ఈ సినిమాను అందిస్తున్నాడు. ఇక, ఈ సినిమాను సెప్టెంబర్ 18న రిలీజ్ చేయబోతున్నారు.

గణేశ్ నిమజ్జనం వేళ నగరవాసులకు బిగ్ రిలీఫ్.. అర్ధరాత్రి దాటినా మెట్రో సేవలు!NationalSwechaa10 Sep 2026, 12:42 PM

గణేశ్ నిమజ్జనం వేళ నగరవాసులకు బిగ్ రిలీఫ్.. అర్ధరాత్రి దాటినా మెట్రో సేవలు!

 హైదరాబాద్‌లో గణేశ్ నవరాత్రి ఉత్సవాలు, శోభాయాత్ర నిమజ్జనోత్సవానికి నగర అధికార యంత్రాంగం విస్తృత ఏర్పాట్లు చేస్తోంది. నిమజ్జనం రోజున లక్షలాదిగా తరలివచ్చే భక్తుల రవాణా సౌకర్యార్థం నగరంలో ప్రజారవాణా వ్యవస్థను అర్ధరాత్రి దాటిన తర్వాత కూడా అందుబాటులో ఉంచాలని అధికారులు నిర్ణయించారు. ఇందులో భాగంగా వచ్చే సెప్టెంబర్ 25న జరగనున్న వినాయక నిమజ్జనం సందర్భంగా హైదరాబాద్ మెట్రో రైళ్లను అర్ధరాత్రి దాటి ఒంటి గంట వరకు, ఎంఎంటీఎస్ (MMTS) రైళ్లను రాత్రంతా నడిపించనున్నట్లు అధికారులు తెలిపారు.

సీఎం స్వగ్రామంలో రైతుల మెరుపు ధర్నా!తెలంగాణSwechaa10 Sep 2026, 12:38 PM

సీఎం స్వగ్రామంలో రైతుల మెరుపు ధర్నా!

 సీఎం రేవంత్‌రెడ్డి స్వగ్రామమైన నాగర్‌కర్నూల్ జిల్లా కొండారెడ్డిపల్లి సమీపంలో శ్రీశైలం-హైదరాబాద్ జాతీయ రహదారిపై రైతులు అకస్మాత్తుగా మెరుపు ధర్నా చేపట్టారు. తమ పొలాలకు సరిపడా విద్యుత్, సాగునీరు అందక పంటలు ఎండిపోతున్నాయని రైతన్నలు తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. ‘పంటలన్నీ ఎండిపోయే’ అంటూ పాటలు పాడుతూ రోడ్డుపై బైఠాయించి ప్రభుత్వంపై తమ తీవ్ర నిరసనను వ్యక్తం చేశారు. రైతుల ఆందోళన కారణంగా జాతీయ రహదారిపై ఇరువైపులా కిలోమీటర్ల మేర వాహనాలు నిలిచిపోయి తీవ్ర ట్రాఫిక్ జాం ఏర్పడింది.

NBK 112: కొరటాల కోసం బాలయ్య 100 రోజులు డేట్స్!సినిమాSwechaa10 Sep 2026, 12:37 PM

NBK 112: కొరటాల కోసం బాలయ్య 100 రోజులు డేట్స్!

NBK 112: మిర్చి సినిమాతో దర్శకుడిగా టాలీవుడ్ ఇండస్ట్రీలో మంచి పాపులారిటీని తెచ్చుకున్నాడు రచయిత కొరటాల శివ. ఆ తర్వాత సూపర్ స్టార్ మహేష్ బాబు, ఎన్‌టిర్, మెగాస్టార్, రామ్ చరణ్ లతోనూ సినిమాలు చేశాడు. అయితే, చిరు-చరణ్‌లతో చేసిన ఆచార్య నుంచి మళ్ళీ కొరటాల సాలీడ్ హిట్ అందుకోలేకపోయాడు. ఇక, బాలయ్యతో ఇప్పుడు మాస్ ఎంటర్‌టైనర్‌ను పట్టాలెక్కించబోతున్నాడు. ఈ సినిమా కోసం బాలయ్య ఏకంగా 100 రోజుల క్వాల్ షీట్స్ ఇచ్చినట్టుగా తెలుస్తోంది.

Assembly Sessions: 22ఏ భూములపై పొలిటికల్ వార్‌.. అసెంబ్లీ నుండి బీఆర్‌ఎస్ వాకౌట్!..తెలంగాణSwechaa10 Sep 2026, 12:15 PM

Assembly Sessions: 22ఏ భూములపై పొలిటికల్ వార్‌.. అసెంబ్లీ నుండి బీఆర్‌ఎస్ వాకౌట్!..

తెలంగాణ శాసనమండలిలో 22ఏ నిషేధిత భూముల వివాదంపై గందరగోళం నెలకొంది. సభ ప్రారంభం కాగానే 22ఏ భూములకు సంబంధించిన సమస్యలపై తక్షణమే చర్చ జరపాలని బీఆర్ఎస్ సభ్యులు డిమాండ్ చేస్తూ వాయిదా తీర్మానాన్ని ప్రతిపాదించారు. అయితే మండలి చైర్మన్ ఈ వాయిదా తీర్మానాన్ని తిరస్కరించి, ప్రశ్నోత్తరాల కార్యక్రమాన్ని చేపట్టారు. దీంతో సభ జరుగుతున్న తీరుకు నిరసనగా బీఆర్ఎస్ మండలి నుంచి వాకౌట్ చేసి బయటకు వెళ్లిపోయింది.

Swayambhu: నవంబర్ లో నిఖిల్ సిద్ధార్థ్ కూడా..ఇంత పోటీలో అవసరమా?సినిమాSwechaa10 Sep 2026, 12:13 PM

Swayambhu: నవంబర్ లో నిఖిల్ సిద్ధార్థ్ కూడా..ఇంత పోటీలో అవసరమా?

Swayambhu: టాలీవుడ్ యంగ్ హీరోలలో నిఖిల్ సిద్ధార్థ్ కి మంచి క్రేజ్ ఉంది. ఒక రకంగా, చెప్పాలంటే మాస్ మహారాజ్ రవితేజ లాంటి ఎనర్జీతో మంచి క్రేజ్ తెచ్చుకున్నాడు. ఇప్పుడు, ఈ యంగ్ హీరో కూడా పీరియాడికల్ సినిమాను చేశాడు. అదే స్వయంభు. చాలా నెలల నుంచి ఈ సినిమా రిలీజ్ విషయంలో రక రకాల వార్తలు వచ్చాయి. ఎట్టకేలకి నవంబర్ లో రిలీజ్ ప్లాన్ చేస్తున్నట్టుగా తాజా సమాచారం.

సీఎం రేవంత్‌కు ‘టెస్సరాక్ట్’ దెబ్బ..బిగ్‌షాక్ ఇచ్చిన కేటీఆర్, హరీశ్ రావుతెలంగాణSwechaa10 Sep 2026, 12:10 PM

సీఎం రేవంత్‌కు ‘టెస్సరాక్ట్’ దెబ్బ..బిగ్‌షాక్ ఇచ్చిన కేటీఆర్, హరీశ్ రావు

సీఎం రేవంత్ రెడ్డికి బీఆర్ఎస్ పార్టీ బిగ్‌షాక్ ఇచ్చింది. అసెంబ్లీ నుంచి బీఆర్ఎస్ శాసనసభా సభ్యులను సస్పెండ్ చేయించిన ప్రభుత్వం.. ప్రధాన ప్రతిపక్షం లేకుండానే సమావేశాలను కొనసాగిస్తున్నది. ప్రజాసమస్యలపై తాము ప్రశ్నిస్తున్నామనే మమ్మల్ని సస్పెండ్ చేశారని బీఆర్ఎస్ డిప్యూటీ ఫ్లోర్ లీడర్ హరీశ్ రావు నిన్నకీలక వ్యాఖ్యలు చేశారు. 22ఏ,ఫీజు రీయింబర్స్‌మెంట్, జీవో 97, యూరియా, సాగు నీరు, గోదావరి కృష్ణా జలాల దోపిడీ అంశంలో ప్రశ్నిస్తామనే భయంతో తమ పార్టీ ఎమ్మెల్యేలను ఈ సెషన్ పూర్తయ్యేవరకు సస్పెండ్ చేశారని మండిపడ్డారు. ఈ క్రమంలోనే బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, మాజీ మంత్రి హరీశ్ రావు, పలువురు బీఆర్ఎస్ నేతలు కలిసి సీఎం రేవంత్.. తన తమ్ముడు కొండల్ రెడ్డికి ఫోర్త్ సిటీలో కేటాయించిన టెస్సరాక్ట్ భూముల పరిశీలనకు వెళ్లారు. కాంగ్రెస్ ప్రభుత్వంలో జరుగుతున్న ఆర్థిక, భూ దోపిడీని ప్రజల కళ్లకు కట్టినట్టు చూపించడానికే వెళ్లామని బీఆర్ఎస్ నేతలు చెబుతున్నారు.