స్వేచ్ఛ షార్ట్స్ — తాజా తెలుగు వార్తలు

కాసాని అండ్ సన్స్ గ్యాంగ్.. లక్కీ అట్లూరి ఫేక్ అమ్మకాలు?స్వేచ్ఛ ఛైర్మన్ డెస్క్Swechaa09 Sep 2026, 09:37 AM

కాసాని అండ్ సన్స్ గ్యాంగ్.. లక్కీ అట్లూరి ఫేక్ అమ్మకాలు?

కొన్ని సార్లు తండ్రులను చూసి పిల్లలు నేర్చుకుంటారు. అలానే లక్కీ భాస్కర్ సినిమా ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంది. ఆయన తండ్రి చేసిన మోసాలకు ఇప్పటికీ మధ్యతరగతి కటుంబాలకు కొన్నిసార్లు మరణ శాసనం కూడా అవతోంది. అమ్మిన భూమియే అమ్మకం జరపడం. కోర్టుల్లో వాటితో కేసులు వేయడం ఆ తర్వాత కాంప్రమైజింగ్ పేరుతో నాటకాలు ఆడడం తరుచూ బాచుపల్లిలో అలవాటుగా మారింది. బాచుపల్లిలో కాసాని జ్ఞానేశ్వర్ బడా భూములన్నింటినీ సాదాబైనామాతో కొట్టేశారనే ఆరోపణలు ఉన్నాయి.

Good News: ఇందిరమ్మ ఇల్లు దక్కలేదా? అయితే రూ.10వేల డిపాజిట్ వాపస్!తెలంగాణSwechaa09 Sep 2026, 09:09 AM

Good News: ఇందిరమ్మ ఇల్లు దక్కలేదా? అయితే రూ.10వేల డిపాజిట్ వాపస్!

తెలంగాణ ఇందిరమ్మ ఇళ్ల టవర్స్ పథకానికి దరఖాస్తు చేసుకుని లాటరీలో ఇళ్లు దక్కించుకోని వేలాది మంది దరఖాస్తుదారులకు రాష్ట్ర హౌసింగ్ బోర్డు తీపి కబురు అందించింది. లాటరీ ప్రక్రియ ద్వారా ఇల్లు పొందని బాధితులకు వారు ప్రారంభంలో చెల్లించిన రూ.10వేల ధరావతు (ఈఎండీ) డిపాజిట్ మొత్తాన్ని బుధవారం(నేడు) నుంచి తిరిగి చెల్లించనున్నట్లు హౌసింగ్ బోర్డు వైస్ చైర్మన్ వీపీ.గౌతమ్ అధికారికంగా వెల్లడించారు. నిధుల వాపస్(Refund) ప్రక్రియ మొత్తాన్ని వారం రోజుల్లోగా సమర్థవంతంగా పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు ఆయన స్పష్టం చేశారు.

కంపించిన హిమాలయ ప్రాంతం.. టిబెట్‌లో 5.3 తీవ్రతతో భారీ భూకంపం!NationalSwechaa09 Sep 2026, 08:40 AM

కంపించిన హిమాలయ ప్రాంతం.. టిబెట్‌లో 5.3 తీవ్రతతో భారీ భూకంపం!

హిమాలయ పర్వత ప్రాంతమైన టిబెట్‌లో బుధవారం మరోసారి బలమైన భూకంపం సంభవించి స్థానికులను భయాందోళనలకు గురిచేసింది. దీని ప్రభావంతో పొరుగు దేశమైన నేపాల్‌లోని పలు ప్రాంతాల్లో కూడా తీవ్ర భూప్రకంపనలు చోటుచేసుకున్నాయి. రిక్టర్ స్కేలుపై ఈ భూకంప తీవ్రత 5.3గా నమోదైనట్లు యూరోపియన్-మెడిటరేనియన్ సిస్మోలాజికల్ సెంటర్ (EMSC) అధికారికంగా వెల్లడించింది. భూమి అంతర్భాగంలో సుమారు 35కిలోమీటర్ల లోతులో ఈ భూకంప కేంద్రం కేంద్రీకృతమై ఉన్నట్లు భౌగోళిక శాస్త్రవేత్తలు గుర్తించారు.

భారత్‌లో బ్రిక్స్‌ సమ్మిట్.. ప్రపంచాన్ని శాసించబోతున్నారా?InternationalSwechaa09 Sep 2026, 12:17 AM

భారత్‌లో బ్రిక్స్‌ సమ్మిట్.. ప్రపంచాన్ని శాసించబోతున్నారా?

ప్రపంచ రాజకీయాల్లో ఇప్పుడు అందరి చూపు భారత్‌వైపు ఉంది. సెప్టెంబర్ 12, 13 తేదీల్లో న్యూఢిల్లీలో 18వ బ్రిక్స్‌ శిఖరాగ్ర సదస్సు జరగనుంది. భారత్‌ ఈ ఏడాది బ్రిక్స్‌ అధ్యక్ష బాధ్యతలు నిర్వహిస్తోంది. అంతేకాదు.. బ్రిక్స్‌ ఏర్పడి 20 ఏళ్లు పూర్తవుతున్న సమయంలో ఈ సదస్సు జరగడం ప్రత్యేకతను సంతరించుకుంది.

తెలంగాణలో పొలిటికల్ హైడ్రామా.. గెలిచింది ఎవరు?తెలంగాణSwechaa08 Sep 2026, 11:52 PM

తెలంగాణలో పొలిటికల్ హైడ్రామా.. గెలిచింది ఎవరు?

తెలంగాణ రాజకీయాలు ఒక్కసారిగా వేడెక్కాయి. బీఆర్ఎస్ ఎమ్మెల్సీల అరెస్టు నుంచి విడుదల వరకు.. స్పీకర్‌పై బీఆర్ఎస్ ఎమ్మెల్సీ వ్యాఖ్యలపై వివాదం నుంచి కాంగ్రెస్ నేతలు కేసీఆర్ నివాసం ముట్టడికి చేసిన ప్రయత్నాల వరకు.. వరుస పరిణామాలతో రాష్ట్రంలో పొలిటికల్ టెన్షన్ పెరిగింది.

YouTuber Rama Nandu : నా తప్పేం లేదు.. అంతా ఆయనే చేశాడు : యూట్యూబర్ నందనసినిమాSwechaa08 Sep 2026, 10:01 PM

YouTuber Rama Nandu : నా తప్పేం లేదు.. అంతా ఆయనే చేశాడు : యూట్యూబర్ నందన

వివాదాస్పద యూట్యూబర్‌ రమా నందనను పోలీసులు సుదీర్ఘంగా విచారించారు. కన్సల్టెన్సీ పేరుతో సాగినట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న వ్యవహారంపై ఆమెను అధికారులు దాదాపు మూడు గంటల పాటు ప్రశ్నించినట్లు సమాచారం. అయితే విచారణ సమయంలో ఆమె ఇచ్చిన సమాధానాలపై పోలీసులు అసంతృప్తి వ్యక్తం చేసినట్లు తెలుస్తోంది. కన్సల్టెన్సీకి సంబంధించిన ఆర్థిక లావాదేవీలు, ఇతర కార్యకలాపాలను తన భర్త మధుకర్‌ మాత్రమే పర్యవేక్షిస్తారని రమా నందన చెప్పినట్లు సమాచారం. తనకు వాటితో ఎలాంటి ప్రత్యక్ష సంబంధం లేదని పేర్కొంటూ, తాను కేవలం యూట్యూబ్‌ వీడియోలకే పరిమితమవుతానని వివరించినట్లు తెలుస్తోంది.

Flight Ticket Prices : ఫ్లైట్ టికెట్ ధరలకు రెక్కలు.. పండుగ సీజన్‌లో 300% వరకు పెంపు!తెలంగాణSwechaa08 Sep 2026, 09:50 PM

Flight Ticket Prices : ఫ్లైట్ టికెట్ ధరలకు రెక్కలు.. పండుగ సీజన్‌లో 300% వరకు పెంపు!

దేశంలో వరుసగా వినాయక చవితి, దసరా, దీపావళి, దుర్గాపూజ వంటి ఫెస్టివల్స్ రానుండటంతో విమాన ప్రయాణాలకు డిమాండ్ భారీగా పెరిగింది. సొంతూళ్లకు వెళ్లేందుకు ప్రయాణికులు ముందుగానే బుకింగ్స్ చేసుకుంటుండటంతో పలు దేశీయ మార్గాల్లో టికెట్ ధరలు గణనీయంగా పెరిగాయి. సీట్లు తక్కువగా దొరకడం, పరిమిత విమానాలు, డైనమిక్ ప్రైసింగ్‌ కారణంగా కొన్ని రూట్లలో సాధారణ ఛార్జీలతో పోలిస్తే 50 నుంచి 150 శాతానికి పైగా రేట్లు పెరిగినట్లు తాజా ట్రావెల్ మార్కెట్ రికార్డ్‌లు సూచిస్తున్నాయి. ఈ దీపావళి సమయంలో ఢిల్లీ–పాట్నా రూట్‌లో నార్మల్‌గా రూ.3,500–4,500గా ఉండే నాన్‌స్టాప్ ఎకానమీ టికెట్ ధర రూ.12,500 దాటింది. చివరి నిమిషంలో బుకింగ్ చేస్తే రూ.13,500కుపైగా చెల్లించాల్సి వస్తోంది.

చీర లాగుతారా?  సీఎం రేవంత్ క్షమాపణ చెప్పాలితెలంగాణSwechaa08 Sep 2026, 09:41 PM

చీర లాగుతారా? సీఎం రేవంత్ క్షమాపణ చెప్పాలి

DK Aruna: అసెంబ్లీ అవరణలో మాజీ మంత్రులు, బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు సబితా ఇంద్రారెడ్డి, సునీత లక్ష్మారెడ్డి పట్ల పోలీసులు వ్యవహరించిన తీరు చాలా హేయమైందని బీజేపీ ఎంపీ డీకే అరుణ అన్నారు. మహిళా శాసనసభ్యులపై ఎవరి ఆదేశాల ప్రకారం పోలీసులు అనుచితంగా ప్రవర్తించారని ఆమె ప్రశ్నించారు. అసెంబ్లీ స్పీకర్ పై బీఆర్ఎస్ ఎమ్మెల్సీలు చేసిన వ్యాఖ్యలు అనుచితంగా ఉన్నాయంటూ వారిపై చర్యలు తీసుకోవాలని సభలో చర్చించారు. అలాగే మహిళా శాసనసభ్యులతో పోలీసులు వ్యవహరించిన తీరుపైనా చర్చ పెట్టాలని రేవంత్ సర్కార్ ను డీకే అరుణ డిమాండ్ చేశారు.

TG : రూ.90 వేలు లంచం తీసుకుంటూ పట్టుబడ్డ సబ్ రిజిస్ట్రార్తెలంగాణSwechaa08 Sep 2026, 09:40 PM

TG : రూ.90 వేలు లంచం తీసుకుంటూ పట్టుబడ్డ సబ్ రిజిస్ట్రార్

నారాయణపేట జిల్లా సబ్‌ రిజిస్ట్రార్‌, వివాహాల కార్యాలయంలో ఏసీబీ అధికారులు మంగళవారం ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. డీఎస్పీ బాలకృష్ణ ఆధ్వర్యంలో జరిగిన ఈ రైడ్‌లో ఇద్దరు అరెస్ట్ అయ్యారు. ఓ రిజిస్ట్రేషన్‌ వ్యవహారంలో లంచం డిమాండ్‌ చేసినట్లు అందిన కంప్లైంట్‌తో ఈ తనిఖీలు నిర్వహించినట్లు అధికారులు వెల్లడించారు. అధికారుల వివరాల ప్రకారం.. జూలైలో జరిగిన ఓ రిజిస్ట్రేషన్‌ ప్రక్రియకు సంబంధించి సబ్‌ రిజిస్ట్రార్‌ లగిశెట్టి వెంకటస్వామి రూ.90 వేల లంచం అడిగినట్లు బాధితులు తమని ఆశ్రయించినట్లు ఏసీబీ డీఎస్పీ తెలిపారు. ఇందులో భాగంగా ఇప్పటికే రూ.50 వేలు చెల్లించిన ఆయన.. మిగిలిన మొత్తాన్ని ఈ రోజు ఇవ్వాల్సి ఉంది. ఆయన ఫిర్యాదుతో రంగంలోకి దిగి నిందితులను అరెస్ట్ చేసినట్లు తెలిపారు.

ప్రొఫెసర్ అవతారంలో ఉద్యోగాల దందా.. పోలీసులకు చిక్కిన కేటుగాడు!..క్రైమ్Swechaa08 Sep 2026, 09:11 PM

ప్రొఫెసర్ అవతారంలో ఉద్యోగాల దందా.. పోలీసులకు చిక్కిన కేటుగాడు!..

ఉద్యోగం ఇప్పిస్తానంటూ నిరుద్యోగులను నమ్మించి లక్షల రూపాయలు వసూలు చేసిన మోసగాడిని కరీంనగర్ పోలీసులు అరెస్ట్ చేశారు. శాతవాహన యూనివర్సిటీలో బోటనీ ప్రొఫెసర్‌గా పరిచయం చేసుకున్న దుడపాక తిరుపతి.. ప్రభుత్వ ఉద్యోగాలు ఇప్పిస్తానంటూ ఏకంగా 21 మంది నుంచి రూ.44 లక్షలు తీసుకున్నట్లు పోలీసులు గుర్తించారు. నకిలీ పరీక్షలు నిర్వహించడంతో పాటు ఫేక్ అపాయింట్‌మెంట్ ఆర్డర్లు, OMR షీట్లు తయారు చేసి అభ్యర్థులను బురిడీ కొట్టించినట్లు విచారణలో తేలింది. ఈ వ్యవహారంలో మరో ఏడుగురు నిందితులు పరారీలో ఉన్నట్లు పోలీసులు తెలిపారు.

జన్వాడలో అక్రమ వెంచర్‌పై చర్యలు సరే.. ఇప్పుడు అసలు ప్రశ్న ఇదేతెలంగాణSwechaa08 Sep 2026, 09:02 PM

జన్వాడలో అక్రమ వెంచర్‌పై చర్యలు సరే.. ఇప్పుడు అసలు ప్రశ్న ఇదే

Janwada Venture Demolish: ఎట్టకేలకు అధికారుల్లో చలనం వచ్చింది. రంగంలోకి దిగారు. కొరడా ఝళిపించారు. అక్రమ వెంచర్‌పై ఉక్కుపాదం మోపారు. హైదరాబాద్ శివారులోని రంగారెడ్డి జిల్లా శంకర్‌పల్లి మండలం జన్వాడలో అక్రమ వెంచర్ పై అధికారులు జేసీబీలతో వచ్చి మరీ చర్యలు తీసుకున్నారు. అక్రమ నిర్మాణాలను నేలమట్టం చేశారు.

కాస్త ఆలస్యమైనా వారి చర్యను స్వాగతించాల్సిందే. అయితే ఇప్పుడు అసలు ప్రశ్న ఒక్కటే. జీవోలకు, నిబంధనలకు విరుద్ధంగా ఏర్పడిన ఒక్క వెంచర్‌పైనే ఈ చర్యలా..? లేక జన్వాడలో ఉన్న అన్ని అక్రమ వెంచర్లపైనా ఇదే తరహా ఉక్కుపాదం మోపుతారా..? అనే ప్రశ్నకు సమాధానం రావాల్సి ఉంది.

Vikramarka  : ఆ గొడవ అంతా ఫామ్ హౌస్‌లో చేసిన కుట్ర: భట్టి విక్రమార్కతెలంగాణSwechaa08 Sep 2026, 08:56 PM

Vikramarka : ఆ గొడవ అంతా ఫామ్ హౌస్‌లో చేసిన కుట్ర: భట్టి విక్రమార్క

Bhatti Vikramarka :తెలంగాణ అసెంబ్లీ వద్ద సోమవారం చోటుచేసుకున్న ఘటనపై డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క తీవ్రంగా స్పందించారు. అసెంబ్లీ పరిసరాల్లో జరిగిన పరిణామాలు కాకతాళీయంగా చోటుచేసుకున్నవి కావని, ఫామ్‌హౌస్‌లో చేసిన కుట్రలో భాగమని ఆరోపించారు. స్పీకర్ గడ్డం ప్రసాద్‌కుమార్‌ను అవమానించడం ఒక వ్యక్తిని కించపరచడం కాదని, యావత్ శాసనసభను అవమానించినట్లేనని వ్యాఖ్యానించారు. స్పీకర్‌పై బీఆర్‌ఎస్ ఎమ్మెల్సీలు తాతా మధు, నవీన్‌రెడ్డి చేసినట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న అనుచిత వ్యాఖ్యలను భట్టి తీవ్రంగా ఖండించారు. ఇద్దరి ప్రవర్తన అత్యంత జుగుప్సాకరంగా ఉందని పేర్కొంటూ.. బీఆర్‌ఎస్ ఇంకా ఫ్యూడల్ ధోరణి నుంచి బయటపడలేదని విమర్శించారు. స్పీకర్ స్థానంలో ఉన్న వ్యక్తికి గౌరవం ఇవ్వడం ప్రతి సభ్యుడి బాధ్యత అని స్పష్టం చేశారు.

తెలంగాణ పాలిటిక్స్‌లోకి మరో వారసురాలు ఎంట్రీ!తెలంగాణSwechaa08 Sep 2026, 08:43 PM

తెలంగాణ పాలిటిక్స్‌లోకి మరో వారసురాలు ఎంట్రీ!

ఉమ్మడి కరీంనగర్ జిల్లా రాజకీయాల్లో ఇప్పుడు ఓ కొత్త చర్చ హాట్ టాపిక్‌గా మారింది. సీనియర్ నేత జీవన్ రెడ్డి తన రాజకీయ వారసురాలిగా చిన్న కోడలు ఛరిష్మా రెడ్డిని జగిత్యాల బరిలో దించబోతున్నారనే ప్రచారం జోరందుకుంది. ఇప్పటికే మామ వెంట రాజకీయ కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొంటున్న ఛరిష్మా.. క్యాడర్‌తోనూ మమేకమవుతున్నారట. బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ నుంచి కూడా టికెట్ విషయంలో సానుకూల సంకేతాలు వచ్చాయనే టాక్ వినిపిస్తోంది. మరి 2029లో జగిత్యాల నుంచి బరిలోకి దిగేది ఛరిష్మానేనా? అనేది ఆసక్తికరంగా మారింది.

అసెంబ్లీ గేట్ ముందు గొడవపై వీడియో రిలీజ్ చేసిన ప్రభుత్వంతెలంగాణSwechaa08 Sep 2026, 08:14 PM

అసెంబ్లీ గేట్ ముందు గొడవపై వీడియో రిలీజ్ చేసిన ప్రభుత్వం

TG: తెలంగాణ ప్రభుత్వం సోమవారం అసెంబ్లీలోకి బీఆర్ఎస్ ఎమ్మెల్సీలు ప్రవేశించే సమయంలో పోలీసులతో చోటుచేసుకున్న పరిణామాలపై తీవ్రంగా స్పందించింది. సభకు వెళ్లకుండా అడ్డుకున్న పోలీసుల పట్ల బీఆర్‌ఎస్ ప్రజాప్రతినిధులు వ్యవహరించిన తీరు సరికాదని ప్రభుత్వం తప్పుపట్టింది. ఈ ఘటనకు సంబంధించిన దృశ్యాలను తాజాగా మీడియాకు రిలీజ్ చేసింది.మరోవైపు ఇదే అంశానికి సంబంధించిన కొన్ని ఫొటోలను ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ శాసనసభలో బయట పెట్టారు. ఇందుకోసం స్పీకర్ గడ్డం ప్రసాద్‌కుమార్ నుంచి ఆయన అనుమతి తీసుకున్నట్లు తెలిపారు. సభా ప్రాంగణంలో చోటుచేసుకున్న పరిణామాలపై సభ్యులకు వివరాలు తెలియజేసే క్రమంలో ఈ చిత్రాలను చూపించినట్లు తెలిపారు. అసెంబ్లీకి ప్రజాప్రతినిధులు హాజరయ్యే సమయంలో భద్రతా నిబంధనలు పాటించడం తప్పనిసరి అని అధికార పక్షం పేర్కొంటోంది. ఈ ఘటనపై అధికార, ప్రతిపక్షాల మధ్య ఇప్పటికే మాటల యుద్ధం కొనసాగుతుండగా.. తాజాగా వీడియోలు, ఫొటోలు విడుదల కావడం రాజకీయ వేడిని మరింత పెంచింది.

బీఆర్‌ఎస్ ఎమ్మెల్సీలకు రిలీఫ్..తెలంగాణSwechaa08 Sep 2026, 07:18 PM

బీఆర్‌ఎస్ ఎమ్మెల్సీలకు రిలీఫ్..

TG: శాసనసభ స్పీకర్ గడ్డం ప్రసాద్‌కుమార్‌పై అనుచిత కామెంట్స్ చేశారన్న కేసులో బీఆర్‌ఎస్ ఎమ్మెల్సీలు తాతా మధు, నవీన్‌కుమార్‌రెడ్డికి కోర్టులో ఊరట లభించింది. వీరిని రిమాండ్‌కు పంపాలన్న పోలీసుల అభ్యర్థనను నాంపల్లి కోర్టు తిరస్కరించింది. వ్యక్తిగత పూచీకత్తుపై రిలీజ్ చేయాలని న్యాయస్థానం ఆదేశించింది. రూ.10 వేల చొప్పున పూచీకత్తుతో పాటు ఇద్దరు షూరిటీలను సమర్పించాలని సూచించింది.

స్పీకర్‌ను కులం పేరుతో దూషించడంతో పాటు అసభ్య పదజాలం ఉపయోగించారంటూ స్పీకర్ ఓఎస్డీ పొల్లెపల్లి వెంకటేశం ఫిర్యాదు మేరకు సైఫాబాద్ పోలీస్ స్టేషన్‌లో ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ చట్టం కింద కేసు వారిద్దరిపై కేసు నమోదైంది.ఈ కేసు విచారణలో భాగంగా ఈ రోజు ఉదయం పోలీసులు తాతా మధు, నవీన్‌కుమార్‌రెడ్డిని అరెస్టు చేసి కోర్టులో హాజరుపరిచారు. విచారణ అనంతరం వారి రిమాండ్‌ను తిరస్కరిస్తూ న్యాయస్థానం బెయిల్‌ తరహా వ్యక్తిగత పూచీకత్తుపై రిలీజ్‌కి ఆదేశించింది

కేసీఆర్ ఎందుకు చనిపోవాలి?తెలంగాణSwechaa08 Sep 2026, 07:11 PM

కేసీఆర్ ఎందుకు చనిపోవాలి?

KTR: సీఎం రేవంత్ పై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఫైర్ అయ్యారు. అసెంబ్లీ స్పీకర్ కులాన్ని అడ్డం పెట్టుకుని సీఎం రేవంత్ నీచమైన రాజకీయం చేస్తున్నారని మండిపడ్డారు. స్పీకర్ పై తాను ఎలాంటి వ్యాఖ్యలు చేయలేదని తమ పార్టీ ఎమ్మెల్సీ తాతా మధు చెప్పారని కేటీఆర్ తెలిపారు. అయినప్పటికి కేసీఆర్ ఆదేశాలతో తన వ్యాఖ్యలపై తాతా మధు విచారం వ్యక్తం చేశారని చెప్పారు. హైదరాబాద్ బోయిన్ పల్లి పోలీస్ స్టేషన్ నుంచి విడుదలైన తర్వాత కేటీఆర్ మీడియాతో మాట్లాడారు.

కాంగ్రెస్ గూండాలను కేసీఆర్ ఇంటిపైకి పంపించారని ముఖ్యమంత్రి రేవంత్ పై మండిపడ్డారు కేటీఆర్. కాంగ్రెస్ ను ప్రజలు తరిమికొట్టే రోజు దగ్గరలోనే ఉందని హెచ్చరించారు. ఓ కాంగ్రెస్ సభ్యుడు కేసీఆర్ చనిపోవాలని అంటున్నారు... తెలంగాణ తెచ్చినందుకు కేసీఆర్ చనిపోవాలా? అనేక సంక్షేమ పథకాలు అమలు చేసినందుకు కేసీఆర్ చనిపోవాలా? అని కేటీఆర్ ధ్వజమెత్తారు.

తాతా మధు, నవీన్‌పై సస్పెన్షన్ వేటుSwechaa08 Sep 2026, 06:02 PM

తాతా మధు, నవీన్‌పై సస్పెన్షన్ వేటు

బీఆర్ఎస్ ఎమ్మెల్సీలు తాతా మధు, నవీన్ కుమార్ రెడ్డిలపై మండలిలో సస్పెన్షన్ వేటు పడింది. వారిద్దని మండలి ఛైర్మన్ సస్పెండ్ చేశారు. స్పీకర్ పై అనుచిత వ్యాఖ్యలు చేసిన తాతా మధు, నవీన్ కుమార్ రెడ్డిని సస్పెండ్ చేయాలని మంత్రి శ్రీధర్ బాబు మండలిలో తీర్మానం ప్రవేశపెట్టారు. ఈ తీర్మానంపై మండలి చైర్మన్ మూజువాణి పద్ధతిలో ఓటింగ్ నిర్వహించారు. అనంతరం సెషన్ మొత్తానికి ఇద్దరు ఎమ్మెల్సీలను సస్పెండ్ చేసినట్లు మండలి ఛైర్మన్ ప్రకటించారు. ఆ ఇద్దరి సస్పెన్షన్ తర్వాత మండలిని వాయిదా వేశారు.

బీఆర్ఎస్ ఇద్దరు ఎమ్మెల్సీలపై చర్యల తీర్మానానికి అసెంబ్లీ ఆమోదంSwechaa08 Sep 2026, 05:48 PM

బీఆర్ఎస్ ఇద్దరు ఎమ్మెల్సీలపై చర్యల తీర్మానానికి అసెంబ్లీ ఆమోదం

తెలంగాణ అసెంబ్లీ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ పై వ్యాఖ్యల వివాదంలో కీలక పరిణామం చోటు చేసుకుంది. బీఆర్ఎస్ ఎమ్మెల్సీలు తాతా మధు, నవీన్ కుమార్ రెడ్డిలపై చర్యలు తీసుకోవాలనే తీర్మానానికి అసెంబ్లీ ఆమోదం తెలిపింది. మధు, నవీన్ లు స్పీకర్ పై అనుచిత వ్యాఖ్యలు చేశారని, వారిపై చర్యలు తీసుకోవాలని శాసనసభలో మంత్రి దామోదర రాజనర్సింహ తీర్మానం చేశారు. ఈ తీర్మానానికి అసెంబ్లీ ఏకగ్రీవంగా ఆమోదం లిపింది. అనంతరం శాసనసభ రేపటికి వాయిదా పడింది. తీర్మానం కాపీని శాసనమండలి చైర్మన్ కి పంపాలని నిర్ణయించారు. ఇది మండలిలో ఆమోదం పొందితే వారిద్దరిపై వేటు పటే అవకాశం ఉంది. ప్రజా జీవితంలో ఉన్న వ్యక్తులు బాధ్యతగా ఉండాలని మంత్రి దామోదర రాజనర్సింహ అన్నారు.

Vaishnavi Chaitanya-Epic: ఎపిక్-ఫస్ట్ సెమిస్టర్‌లో బోల్డ్ సీన్స్..అందరూ చూడొచ్చా!సినిమాSwechaa08 Sep 2026, 05:42 PM

Vaishnavi Chaitanya-Epic: ఎపిక్-ఫస్ట్ సెమిస్టర్‌లో బోల్డ్ సీన్స్..అందరూ చూడొచ్చా!

Vaishnavi Chaitanya: తెలుగమ్మాయి వైష్ణవి చైతన్య హీరోయిన్‌గా నటించిన లేటెస్ట్ సినిమా ఎపిక్-ఫస్ట్ సెమిస్టర్. ఈ సినిమాకి ఆదిత్య హాసన్ దర్శకత్వం వహించాడు. సూపర్ హిట్ వెబ్ సిరీస్ 90స్ కి సీక్వెల్‌గా ఇప్పుడు ఫ్యూచర్ ఫిల్మ్ రూపొందింది. సెప్టెంబర్ 11న థియేటర్స్‌లో రిలీజ్ కాబోతున్న ఈ సినిమా ప్రమోషన్స్ జరుగుతున్నాయి. ఈ సందర్భంగా హీరోయిన్ వైష్ణవి చైతన్య..లివ్ ఇన్ రిలేషన్ షిప్‌లో కపుల్ ఉంటారని..కాలేజ్ బ్యాక్ డ్రాప్‌లో తెరకెక్కిన సినిమా అని రివీల్ చేసింది.

Tollywood vs Kollywood : తెలుగులో తమిళ హీరోల హవా.. అక్కడ మన మూవీలకు తిప్పలుసినిమాSwechaa08 Sep 2026, 05:33 PM

Tollywood vs Kollywood : తెలుగులో తమిళ హీరోల హవా.. అక్కడ మన మూవీలకు తిప్పలు

Tollywood vs Kollywood : సినిమాకు భాషా సరిహద్దులు ఉండవని ఎప్పటి నుంచో చెబుతుంటారు. మంచి కథ, బలమైన నటన, ఆకట్టుకునే మేకింగ్ ఉంటే ఏ ప్రాంతం ప్రేక్షకులైనా ఆదరిస్తారనేది ఎన్నో సందర్భాల్లో రుజువైంది. ముఖ్యంగా తెలుగు రాష్ట్రాల్లో తమిళ హీరోలకు లభిస్తున్న క్రేజ్ చూస్తే ఈ విషయం మరింత స్పష్టంగా కనిపిస్తోంది. కోలీవుడ్‌కు చెందిన పలువురు స్టార్ హీరోలు తమ సొంత మార్కెట్‌తో పాటు టాలీవుడ్‌లోనూ అదిరిపోయే వసూళ్లు సాధిస్తున్నారు. డబ్బింగ్ చిత్రాలకు సరిపడా థియేటర్లు దక్కడం, అభిమానుల నుంచి ఆ మూవీస్‌కి అదిరిపోయే రెస్పాన్స్ రావడం ఇప్పుడు చాలా కామన్‌గా అయ్యింది. మొత్తంగా చూస్తే.. తెలుగు ప్రేక్షకులు సూర్య, కార్తీ, అజిత్, విజయ్ వంటి తమిళ హీరోలను తమ హీరోల్లాగే ఆదరిస్తున్నప్పుడు.. తమిళ ప్రేక్షకులు తెలుగు హీరోలకు అదే స్థాయి అవకాశాలు ఇస్తున్నారా? అన్న ప్రశ్నకు భవిష్యత్ సినిమాల వసూళ్లు, థియేటర్ కేటాయింపులు, ప్రేక్షకుల రెస్పాన్స్ సమాధానం చెప్పాల్సి ఉంటుందని అంటున్నారు. రెండు పరిశ్రమల మధ్య హెల్తీ కాంపిటీషన్‌తో పాటు పరస్పర ఆదరణ పెరిగితే దాని ప్రయోజనం చివరకు ప్రేక్షకులకే దక్కుతుందని అంటున్నారు. చూడాలి మరి తెలుగులో తమిళ హీరోలకు దక్కుతున్న ఆదరణ కోలీవుడ్‌లో టాలీవుడ్ హీరోలకు ఎప్పుడు దక్కుతుందనేది

తెలంగాణలో రాష్ట్రపతి పాలన పెట్టాలి- హరీశ్ రావు సంచలన డిమాండ్Swechaa08 Sep 2026, 04:41 PM

తెలంగాణలో రాష్ట్రపతి పాలన పెట్టాలి- హరీశ్ రావు సంచలన డిమాండ్

Harish Rao: మాజీ మంత్రి హరీశ్ రావు సంచలన డిమాండ్ చేశారు. తెలంగాణలో రాష్ట్రపతి పాలన విధించాలని కేంద్ర ప్రభుత్వాన్ని ఆయన డిమాండ్ చేశారు. రాష్ట్రంలో శాంతి భద్రతలు అదుపు తప్పాయని.. అసెంబ్లీ సాక్షిగా ఎమ్మెల్యేలు, విద్యార్థులపై దాడులు జరుగుతున్నాయని హరీశ్ రావు ఆరోపించారు. వెంటనే కేంద్ర ప్రభుత్వం, గవర్నర్ జోక్యం చేసుకోవాలన్నారు. హైదరాబాద్ జవహర్ నగర్ లో హరీశ్ రావు మీడియాతో మాట్లాడారు.

''మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ ఇంటి మీద దాడికి ఉసిగొల్పినందుకు కేంద్రాన్ని, గవర్నర్ ను కోరుతున్నాం. రాష్ట్రంలో శాంతి భద్రతలు లేకుండా పోయాయి. రోజూ ఈ రాష్ట్రంలో ఏదో ఒక చోట అత్యాచారాలు జరుగుతున్నాయి. ప్రతిరోజూ మర్డర్లు జరుగుతున్నాయి. లా అండ్ ఆర్డర్ కంట్రోల్ లో లేదు. అసెంబ్లీ సాక్షిగా ఎమ్మెల్యేల మీద దాడి జరుగుతోంది. విద్యార్థుల మీద దాడి జరుగుతోంది. ప్రశ్నించే గొంతుల మీద కేసులు పెడుతున్నారు. కాంగ్రెస్ ప్రభుత్వాన్ని నిలదీస్తే అక్రమ నిర్బంధాలు పెడుతున్నారు. ప్రజాస్వామ్యం మంట కలిసింది. కేంద్ర ప్రభుత్వం వెంటనే జోక్యం చేసుకోవాలి. రాష్ట్రంలో రాష్ట్రపతి పాలన పెట్టాలి'' అని హరీశ్ రావు డిమాండ్ చేశారు.

అలర్ట్‌.. పోలీసు ఉద్యోగాలకు దరఖాస్తు గడువు పొడిగింపుతెలంగాణSwechaa08 Sep 2026, 04:39 PM

అలర్ట్‌.. పోలీసు ఉద్యోగాలకు దరఖాస్తు గడువు పొడిగింపు

TG : తెలంగాణలో పోలీస్ ఉద్యోగాల కోసం ఎదురుచూస్తున్న నిరుద్యోగ అభ్యర్థులకు కాంగ్రెస్ ప్రభుత్వం కీలక ప్రకటన చేసింది. 7,437 పోలీస్ పోస్టుల భర్తీకి దరఖాస్తు గడువును పొడిగించింది. సెప్టెంబర్‌ 9తో ముగియాల్సిన అప్లికేషన్‌ ప్రక్రియను మరో వారం రోజుల పాటు కొనసాగిస్తూ తాజాగా నిర్ణయం తీసుకుంది. అభ్యర్థులు సెప్టెంబర్‌ 16 సాయంత్రం 5 గంటల వరకు దరఖాస్తు చేసుకోవచ్చని తెలంగాణ స్టేట్‌ లెవల్‌ పోలీస్‌ రిక్రూట్‌మెంట్‌ బోర్డు (TSLPRB) మంగళవారం వెల్లడించింది.

క్షమాపణ చెప్పించి ఉంటే కేసీఆర్ హుందాతనం పెరిగేదితెలంగాణSwechaa08 Sep 2026, 04:30 PM

క్షమాపణ చెప్పించి ఉంటే కేసీఆర్ హుందాతనం పెరిగేది

Kunamneni: అసెంబ్లీ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ పై బీఆర్ఎస్ ఎమ్మెల్సీ తాతా మధు చేసిన వ్యాఖ్యలను సీపీఐ ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు తీవ్రంగా ఖండించారు. స్పీకర్ పై తాతా మధు వాడిన భాష అభ్యంతరకరంగా ఉందన్నారు. వ్యక్తిత్వ హననం చాలా దురదృష్టకరమన్నారు. నిన్నటి ఘటన తనకు బాధ కలిగించిందన్నారు. స్పీకర్ కన్నీళ్లు పెట్టుకోవడం కలచివేసిందన్నారు కూనంనేని సాంబశివరావు. ఎంత కోపం ఉన్నా అలాంటి వ్యాఖ్యలు చేయడం కరెక్ట్ కాదన్నారు. బీఆర్ఎస్ సీనియర్ నేత, మాజీ మంత్రి హరీశ్ రావు లాంటి వాళ్లు చొక్కా విప్పడం సరికాదన్నారు. బీఆర్ఎస్ ఎమ్మెల్సీ తాతా మధు వ్యాఖ్యలను ఖండిస్తూ అసెంబ్లీలో జరిగిన చర్చలో కూనంనేని మాట్లాడారు.

NTR-NEEL-RFC: హైదరాబాద్ రామోజీ ఫిల్మ్ సిటీలో "డ్రాగన్" ఎంట్రీ..సినిమాSwechaa08 Sep 2026, 04:08 PM

NTR-NEEL-RFC: హైదరాబాద్ రామోజీ ఫిల్మ్ సిటీలో "డ్రాగన్" ఎంట్రీ..

NTR-NEEL: మాన్ ఆఫ్ మాసెస్ యంగ్ టైగర్ ఎన్‌టిర్ తాజాగా డ్రాగన్ మూవీ సెట్స్‌లో ఎంటరైనట్టు తెలుస్తోంది. ఇటీవల, ఆయన ఈ సినిమా షూటింగ్ సమయంలోనే భుజానికి గాయమై సర్జరీ చేయించుకున్నారు. డాక్టర్ల సూచనల మేరకు ఇన్నిరోజులు రెస్ట్ తీసుకున్న తారక్..తిరిగి సెట్స్ లో జాయిన్ అయ్యాడట. ఇప్పటికే, షూటింగ్ ఆలస్యం కావడంతో ఇక, ఆలస్యం చేయకూడనే డ్రాగన్ కి మళ్ళీ డేట్స్ ఇచ్చాడని తెలుస్తోంది.

కేసీఆర్‌ ఫామ్ హౌస్ వైపు దూసుకెళ్లిన కాంగ్రెస్ లీడర్లుతెలంగాణSwechaa08 Sep 2026, 03:34 PM

కేసీఆర్‌ ఫామ్ హౌస్ వైపు దూసుకెళ్లిన కాంగ్రెస్ లీడర్లు

Politics : సిద్దిపేట జిల్లా ఎర్రవల్లిలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. మాజీ సీఎం, బీఆర్‌ఎస్‌ అధినేత కేసీఆర్‌ ఫామ్‌హౌస్‌ వద్ద డప్పుల మోత కార్యక్రమానికి కాంగ్రెస్‌ పార్టీ పిలుపునివ్వడంతో భారీ సంఖ్యలో ఆ పార్టీ కార్యకర్తలు అక్కడికి చేరుకున్నారు. నిరసనలో భాగంగా డప్పులు మోగిస్తూ ఫామ్‌హౌస్‌ వైపు వెళ్లేందుకు ప్రయత్నించడంతో అక్కడ పరిస్థితి ఒక్కసారిగా ఉద్రిక్తంగా మారింది. వరదరాజపూర్‌ మీదుగా నర్సారెడ్డి ఆధ్వర్యంలో హస్తం పార్టీ శ్రేణులు ఎర్రవల్లి ఫామ్‌హౌస్‌ సమీపానికి చేరుకునే ప్రయత్నం చేశాయి. వెంటనే అప్రమత్తమైన పోలీసులు మార్గమధ్యంలో బారికేడ్లు ఏర్పాటు చేసి, రోప్‌ పార్టీతో వారిని అడ్డుకున్నారు. దీంతో ఆందోళనకారులు, పోలీసుల మధ్య కొద్దిసేపు తోపులాట చోటుచేసుకుంది.

క్షమాపణ చెప్తారనుకుంటే పక్కదోవ పట్టిస్తున్నారు: స్పీకర్  ప్రసాద్‌ కుమార్తెలంగాణSwechaa08 Sep 2026, 03:26 PM

క్షమాపణ చెప్తారనుకుంటే పక్కదోవ పట్టిస్తున్నారు: స్పీకర్ ప్రసాద్‌ కుమార్

శాసనసభలో జరిగిన అనూహ్య ఘటనలపై ప్రతిపక్ష నేతలు కనీసం క్షమాపణలు చెబుతారని భావించానని, కానీ విషయాలను పక్కదోవ పట్టించేలా వ్యవహరించడం వల్లే తనకు కోపం రావాల్సి వచ్చిందని తెలంగాణ శాసనసభ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ ఆవేదన వ్యక్తం చేశారు. అసెంబ్లీలో చోటుచేసుకున్న ఉద్రిక్త పరిణామాలు, సభా సంప్రదాయాలపై పాత్రికేయులతో నిర్వహించిన అనధికారిక 'చిట్ చాట్' లో ఆయన పలు కీలక అంశాలను వెల్లడించారు.

డబ్బు సంపాదించడానికి ఈ ఐదేళ్లే ఆఖరి అవకాశమా..? ఎలాన్ మస్క్ వ్యాఖ్యలపై చర్చ!తెలంగాణSwechaa08 Sep 2026, 02:52 PM

డబ్బు సంపాదించడానికి ఈ ఐదేళ్లే ఆఖరి అవకాశమా..? ఎలాన్ మస్క్ వ్యాఖ్యలపై చర్చ!

 ప్రపంచవ్యాప్తంగా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్(AI) సాంకేతికత విస్తరిస్తున్నకొద్దీ ఉపాధి రంగం తీవ్రమైన ఒడుదొడుకులను ఎదుర్కొంటోంది. వివిధ నివేదికల గణాంకాల ప్రకారం ఇప్పటికే మార్కెట్లో ఉన్న ప్రతి ఐదు ఉద్యోగాల్లో ఒకదానిపై ఏఐ తీవ్ర ప్రతికూల ప్రభావాన్ని చూపించింది. అనేక బహుళ జాతీయ సంస్థలు వ్యయ నియంత్రణ పేరుతో ఉద్యోగులపై లేఆఫ్‌ల బాణాన్ని ఉపయోగిస్తుండటంతో వేలాది మంది నిరుద్యోగులుగా మారుతున్నారు. ప్రస్తుతం ఉన్న పరిస్థితులే గందరగోళంగా ఉంటే, రాబోయే రోజుల్లో ఈ పరిస్థితి మరింత దిగజారే అవకాశం ఉందనే ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి.

Assembly Debate: చట్టసభలు ప్రజల గొంతుకల కోసమా? రాజకీయ పార్టీల రణరంగం కోసమా?తెలంగాణSwechaa08 Sep 2026, 02:41 PM

Assembly Debate: చట్టసభలు ప్రజల గొంతుకల కోసమా? రాజకీయ పార్టీల రణరంగం కోసమా?

Assembly Debate: ప్రజాస్వామ్యంలో చట్టసభలకు అత్యంత కీలక స్థానం ఉంది. ప్రజల జీవితాలను ప్రభావితం చేసే నిర్ణయాలు, విధానాలు, చట్టాలపై విస్తృతంగా చర్చించి పరిష్కార మార్గాలను అన్వేషించాల్సిన వేదికలుగా అసెంబ్లీలు, శాసన మండళ్లు పని చేయాలి. అయితే ప్రస్తుతం దేశంలోని అనేక రాష్ట్రాల చట్టసభల్లో ఇందుకు భిన్నమైన పరిస్థితులు కనిపిస్తున్నాయనే విమర్శలు రాజకీయ విశ్లేషకుల నుంచి సాధారణ పౌరుల వరకు వెల్లువెత్తుతున్నాయి.

తాజాగా తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు స్టార్ట్ అయిన నేపథ్యంలో అసెంబ్లీ ప్రాంగణంలో చోటు చేసుకున్న పరిణామాల కారణంగా చట్టసభల నిర్వహణ.. ప్రతిపక్ష, అధికార పక్ష సభ్యుల వ్యవహార శైలిపై ప్రజల్లో భిన్న అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి. ప్రజా సమస్యల కంటే రాజకీయ ఆధిపత్యమే పార్టీల ప్రధాన లక్ష్యంగా మారుతోందనే అభిప్రాయాలు సామాన్య జనం నుంచి వస్తున్నాయి.

దళితులను  తొక్కేందుకు కేసీఆర్ కుట్రతెలంగాణSwechaa08 Sep 2026, 02:36 PM

దళితులను తొక్కేందుకు కేసీఆర్ కుట్ర

అసెంబ్లీ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ మీద బీఆర్ఎస్ ఎమ్మెల్సీ తాత మధు చేసిన అసభ్యకర వ్యాఖ్యలపై దళిత సంఘాలు భగ్గుమన్నాయి. దళితులంటే బీఆర్ఎస్ పార్టీ నేతలకు ఏమాత్రం గౌరవం లేదని, తమ ఆత్మగౌరవాన్ని దెబ్బతీసేలా మాట్లాడితే ఊరుకునేది లేదని స్పష్టంచేశాయి. కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో గులాబీ నేతలకు తగిన గుణపాఠం చెబుతామని హెచ్చరించాయి. దళితుల ఆత్మగౌరవాన్ని కించపరిచేలా వ్యవహరిస్తే ఎంతటి వారినైనా ఎదురిస్తామని హెచ్చరించాయి. దళితుల హక్కుల పరిరక్షణ కోసం ఎంత దూరమైనా పోరాడతామని వెల్లడించాయి. ఈ క్రమంలోనే అసెంబ్లీ స్పీకర్‌ మీద బీఆర్ఎస్‌ పార్టీ వైఖరిని, మాజీ సీఎం కేసీఆర్‌ తీరును నిరసిస్తూ దళిత సంఘాలు, కాంగ్రెస్‌ నాయకులు తుర్కపల్లి మండల కేంద్రంలో చేపట్టిన ఆందోళన కార్యక్రమంలో అధికార పార్టీ ప్రభుత్వ విప్‌లు బీర్ల అయిలయ్య, వేముల వీరేశం, భువనగిరి ఎమ్మెల్యే కుంభం అనిల్‌కుమార్‌రెడ్డిలు పాల్గొన్నారు. వారి నిరసనలకు మద్దతు తెలిపారు.

Naga Vamshi: హీరోలు, డైరెక్టర్స్ కంటే హీరోయిన్లే బిజీ..!సినిమాSwechaa08 Sep 2026, 02:17 PM

Naga Vamshi: హీరోలు, డైరెక్టర్స్ కంటే హీరోయిన్లే బిజీ..!

Naga Vamshi: టాలీవుడ్ అగ్ర నిర్మాతలలో నాగ వంశీ ఇప్పుడు బాగా వైరల్ అవుతున్నాడు. సినిమా ఈవెంట్స్‌లో ఆయన మాట్లాడే మాటలు సోషల్ మీడియాలో తెగ చక్కర్లు కొడుతున్నాయి. ఈ మధ్య కాలంలో టాలీవుడ్‌లో ఏ నిర్మాత ఇంతగా వైరల్ అవలేదు. ఈ క్రమంలోనే మరోసారి హీరోయిన్సే చాలా బిజీగా ఉంటారని కామెంట్స్ చేసిన నాగవంశీ స్పై గా వెళ్ళి వాళ్ళ జీవితాలలో ఏం జరుగుతుందో తెలుసుకోవాలని ఉందన్నాడు.