స్వేచ్ఛ షార్ట్స్ — తాజా తెలుగు వార్తలు

ఏడాదిలో నాలుగోసారి బదిలీ.. ఐఏఎస్ అధికారిణి తీవ్ర ఆవేదన!NationalSwechaa08 Sep 2026, 02:13 PM

ఏడాదిలో నాలుగోసారి బదిలీ.. ఐఏఎస్ అధికారిణి తీవ్ర ఆవేదన!

పాలనా వ్యవస్థలో కట్టుదిట్టంగా పనిచేసే నిష్పాక్షిక అధికారులపై వేధింపులకు అద్దం పట్టే సంచలన సంఘటన మధ్యప్రదేశ్ రాష్ట్రంలో వెలుగుచూసింది. మధ్యప్రదేశ్‌కు చెందిన 2011 బ్యాచ్‌ సీనియర్ ఐఏఎస్ అధికారిణి నేహా మార్వ్య తనకు జరుగుతున్న తీవ్ర అన్యాయంపై బహిరంగంగా గళమెత్తారు. కేవలం ఒకే ఒక్క సంవత్సరంలో ఏకంగా నాలుగోసారి బదిలీ కావడం, అదీ కొత్త పోస్టింగ్‌లో బాధ్యతలు స్వీకరించి 50రోజులు కూడా నిండకముందే బదిలీ జాబితాలో తన పేరుండటంతో ఆమె తీవ్ర దిగ్భ్రాంతికి, ఆవేదనకు గురయ్యారు.

కాలినడకన ఎర్రవల్లికి కేటీఆర్, హరీశ్ రావు.. అరెస్టు!తెలంగాణSwechaa08 Sep 2026, 01:45 PM

కాలినడకన ఎర్రవల్లికి కేటీఆర్, హరీశ్ రావు.. అరెస్టు!

రాష్ట్రంలో ఓవైపు హాట్‌హాట్‌గా అసెంబ్లీ సమావేశాలు కొనసాగుతుండగా మరోవైపు ఎర్రవల్లిలోని కేసీఆర్ నివాసం వద్ద తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. అక్కడ భారీగా పోలీసులు మొహరించారు. స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ మీద బీఆర్ఎస్ ఎమ్మెల్సీ తాతా మధు అసభ్యకర వ్యాఖ్యలు చేయడంపై కాంగ్రెస్ తీవ్రంగా మండిపడుతోంది.ఈ క్రమంలోనే‘దండోరా’ పేరిట కాంగ్రెస్ శ్రేణులు ఎర్రవల్లికి పెద్ద ఎత్తున తరలి వెళ్తున్నారు. పార్టీకి చెందిన కొందరు ఎమ్మెల్యేల సారధ్యంలో హస్తం నేతలు డప్పు కొట్టుకుంటూ నిరసన ప్రదర్శనలు చేపట్టారు. ఎర్రవల్లిలో ఉద్రిక్త పరిస్థితులు చోటుచేసుకున్నాయని తెలిసి అసెంబ్లీ నుంచి కేసీఆర్ ఇంటికి బయల్దేరిన కేటీఆర్, హరీష్ రావు కాన్వాయ్‌లతో పాటు బీఆర్ఎస్ నేతలను పోలీసులు అడ్డుకున్నారు. హకీంపేట వద్ద వారి వాహనాలను అడ్డుకోవడంతో తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. తాము కేసీఆర్‌ను కలిసేందుకు వెళ్తున్నామని, నిరసనలకు కాదని చెప్పినా పోలీసులు వాహనాలను అనుమతించలేదు. దీంతో కేటీఆర్, హరీష్ రావు, తలసాని శ్రీనివాస్ తదితరులు నడుచుకుంటూనే ఫాంహౌస్ వైపు పయనమయ్యారు. దీంతో వారిని అరెస్టు చేసినట్టు సమాచారం.

Tollywood-Prabhas-Balayya: ప్రభాస్, బాలయ్య..అయితే ఏంటీ అంటున్న OTT లుసినిమాSwechaa08 Sep 2026, 01:36 PM

Tollywood-Prabhas-Balayya: ప్రభాస్, బాలయ్య..అయితే ఏంటీ అంటున్న OTT లు

Tollywood: సినిమా రంగంలో ఇప్పుడు వ్యాపార ధృక్పథం మొత్తం మారిపోయింది. ఒకప్పుడు సినిమా రిలీజైయ్యాక గానీ శాటిలైట్ బిజినెస్ జరిగేది కాదు. కానీ, రాను రానూ ముందుగానే ప్రీ రిలీజ్ బిజినెస్ అని థియేట్రికల్..శాటిలైట్..ఓటీటీ పార్ట్నర్స్ ని ముందే ఫిక్స్ చేసుకుంటున్నారు. సినిమా రిలీజ్ కి చాలా నెలల ముందుగానే ఒప్పందాలు పూర్తవుతున్నాయి.

తాతా మధు కామెంట్స్..  స్పీకర్‌కు సీఎం రేవంత్ రెడ్డి కీలక హామీతెలంగాణSwechaa08 Sep 2026, 01:24 PM

తాతా మధు కామెంట్స్.. స్పీకర్‌కు సీఎం రేవంత్ రెడ్డి కీలక హామీ

రాష్ట్ర రాజకీయాల్లో గందరగోళ పరిస్థితులు నెలకొన్నాయి. అధికార, ప్రతిపక్ష పార్టీల నడుమ మాటల యుద్దం నడుస్తోంది. నల్లటి దుస్తులు వేసుకుని వస్తే అసెంబ్లీలోకి అనుమతించలేదని, పోలీసుల చేత దాడులు చేయించడంతో పాటు తిరిగి మాపైనే కేసులు పెట్టారని బీఆర్ఎస్ ప్రధానంగా ఆరోపిస్తున్నది. అయితే, బాధ్యతాయుతమైన పదవిలో ఉన్న వ్యక్తిని అసభ్యపదజాలంతో దూషిస్తారా? అంటూ మండపడుతోంది. ఈ క్రమంలోనే నిన్న స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్‌ను దూషించిన బీఆర్ఎస్ ఎమ్మెల్సీ తాతా మధును ఇవాళ ఉదయం పోలీసులు అరెస్టు చేశారు. ఈ క్రమంలోనే మంగళవారం ఉదయం స్పీకర్ చాంబర్‌లో గడ్డం ప్రసాద్ కుమార్‌‌ను సీఎం రేవంత్ రెడ్డి , డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క మర్యాద పూర్వకంగా కలిశారు. అసెంబ్లీ ఎదుట జరిగిన పరిణామాలు, ఎమ్మెల్సీ తాతా మధు చేసిన అభ్యంతరకర వ్యాఖ్యలపై సీఎం రేవంత్ రెడ్డి తీవ్ర విచారం, ఆవేదనను వ్యక్తం చేశారు. అనంతరం స్పీకర్‌ గడ్డం ప్రసాద్‌ను ఓదార్చిన సీఎం.. ప్రభుత్వ పరంగా అండగా ఉంటామని, బాధ్యులపై చట్టపరంగా తగిన తీసుకుంటామని హామీ ఇచ్చినట్టు సమాచారం.

చావు చుట్టూ చిల్లర రాజకీయాలు.. పోరుగడ్డపై దిగజారిన పార్టీలు!!..తెలంగాణSwechaa08 Sep 2026, 01:05 PM

చావు చుట్టూ చిల్లర రాజకీయాలు.. పోరుగడ్డపై దిగజారిన పార్టీలు!!..

కేసీఆర్‌పై కాంగ్రెస్ ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్ చేసిన వ్యాఖ్యలు తెలంగాణ రాజకీయాల్లో తీవ్ర దుమారం రేపుతున్నాయి.కేసీఆర్ మరణాన్ని కోరుకుంటున్నట్టుగా మాట్లాడటంతో పాటు.. ఆయన ఇంటి వద్ద వెయ్యి డప్పులు కాదు.. ఇంకా ఎక్కువ డప్పులు తీసుకెళ్లి చావు డప్పు కొడతామని శంకర్ వ్యాఖ్యానించారు.రాజకీయ ప్రత్యర్థులపై విమర్శలు చేయడం సహజమే. కానీ.. మరణాన్ని కోరుకునే స్థాయికి రాజకీయాలు దిగజారడం మాత్రం సరైన పద్ధతి కాదనే విమర్శలు వస్తున్నాయి.గతంలో తెలంగాణ రాజకీయాల్లో విమర్శలు ప్రతివిమర్శలు ఉన్నప్పటికీ, ఒక పరిమితి ఉండేది. సిద్ధాంత పరమైన విభేదాలు ఎంత ఉన్నా, వ్యక్తిగత విద్వేషాలకు తావుండేది కాదు. కానీ నేటి పరిణామాలు ఆ సరిహద్దులను చెరిపేస్తున్నాయి. అధికారం కోసం, పార్టీ మైలేజ్ కోసం ఎంతటి నీచమైన ఎత్తుగడలైనా వేయడానికి వెనుకాడటం లేదనే ఆరోపణలున్నాయి..

Anaswara Rajan: "కాకా" కూతురు ఫస్ట్ లుక్ రివీల్..సినిమాSwechaa08 Sep 2026, 01:03 PM

Anaswara Rajan: "కాకా" కూతురు ఫస్ట్ లుక్ రివీల్..

Anaswara Rajan: మెగాస్టార్ చిరంజీవి నటుస్తున్న లేటెస్ట్ సినిమా 'కాకా'. తాజాగా ఈ సినిమా నుంచి యంగ్ బ్యూటీ అనస్వర రాజన్ ఫస్ట్ లుక్ పోస్టర్ ని మేకర్స్ రిలీజ్ చేశారు. దీన్ని బట్టి ఈ మూవీ షూటింగ్ ఎంత స్పీడ్‌గా జరుగుతుందో అర్థం అవుతోంది. వాల్తేరు వీరయ్య లాంటి భారీ మాసివ్ హిట్ ని మెగాస్టార్ చిరంజీవికి ఇచ్చిన బాబీ దర్శకత్వంలో

తప్పు పోలీసులదే.. బీఆర్ఎస్ ఎమ్మెల్సీల అరెస్ట్ అక్రమం : నిరంజన్ రెడ్డితెలంగాణSwechaa08 Sep 2026, 12:56 PM

తప్పు పోలీసులదే.. బీఆర్ఎస్ ఎమ్మెల్సీల అరెస్ట్ అక్రమం : నిరంజన్ రెడ్డి

రాష్ట్రంలో రివేంజ్ పాలిటిక్స్ నడుస్తున్నాయి. అధికార కాంగ్రెస్, ప్రతిపక్ష బీఆర్ఎస్ పార్టీల నడుమ వైరం ముదురుతోంది. నిన్న అసెంబ్లీ మెయిన్ గేటు వద్ద జరిగిన తీవ్ర ఉద్రిక్తతలపై, తమ పార్టీ మహిళా ఎమ్మెల్యేల పట్ల పోలీసులు జరిపిన దాడిపై చర్చ జరపాలని బీఆర్ఎస్ డిమాండ్ చేస్తున్నది. అయితే, స్పీకర్ గడ్డం ప్రసాద్ పట్ల బీఆర్ఎస్ ఎమ్మెల్సీ తాతా మధు వివాదాస్పద వ్యాఖ్యలు చేయడంపై సమాధానం చెప్పాలని అధికార కాంగ్రెస్ పార్టీలో అసెంబ్లీ వేదికగా బీఆర్ఎస్ పార్టీని ప్రశ్నించింది. ఈ క్రమంలోనే బీఆర్ఎస్ ఎమ్మెల్సీ తాతా మధు, నవీన్ రెడ్డి అరెస్టుపై తాజాగా మాజీ మంత్రి నిరంజన్ రెడ్డి స్పందించారు. ‘బీఆర్ఎస్ ఎమ్మెల్సీల అరెస్ట్ అక్రమం. శాసనసభ సమావేశాలకు హాజరవుతున్న బీఆర్ఎస్ ప్రజాప్రతినిధులను అడ్డుకుని అవమానించింది పోలీసులు, ప్రభుత్వమే.మగ ప్రజా ప్రతినిధులకు అడ్డుగా మహిళా పోలీసులను, మహిళా ప్రజాప్రతినిధులకు అడ్డుగా మగ పోలీసులను మోహరించి అడ్డుకోవడం వెనక కుట్ర దాగి ఉంది’ అని ఒక ప్రకటనలో ఆయన పేర్కొన్నారు.

Mani Ratnam: సాయి పల్లవి కొత్త సినిమా టైటిల్ "అల్లం నీరు"సినిమాSwechaa08 Sep 2026, 12:32 PM

Mani Ratnam: సాయి పల్లవి కొత్త సినిమా టైటిల్ "అల్లం నీరు"

Mani Ratnam: ఫిదా బ్యూటీ సాయి పల్లవి, విజయ్ సేతుపతి జంటగా నటిస్తున్న తాజా చిత్రానికి టైటిల్ ని ప్రకటించారు మేకర్స్. లెజండరీ డైరెక్టర్ మణి రత్నం ఈ సినిమాను తెరకెక్కిస్తున్నాడు. గత కొన్ని రోజుల నుంచి ఈ సినిమాకి ఓ వెరైటీ టైటిల్ ని పరిశీలిస్తున్నారని సోషల్ మీడియాలో వార్తలు వచ్చాయి. తాజాగా ప్రకటించిన "అల్లం నీరు" (ఇంజివెల్లం-తమిళంలో) టైటిల్ పోస్టర్ చూస్తే, ఇది నిజంగానే వెరైటీ టైటిల్ అని నవ్వుకోవచ్చు. ఈ సినిమాను మద్రాస్ టాకీస్, లైకా ప్రొడఖన్స్ కలిసి నిర్మిస్తున్నాయి.

చీర నిజంగా లాగారా? మహిళా ఎమ్మెల్యేలు ఆత్మపరిశీలన చేసుకోవాలి: సీతక్కతెలంగాణSwechaa08 Sep 2026, 12:31 PM

చీర నిజంగా లాగారా? మహిళా ఎమ్మెల్యేలు ఆత్మపరిశీలన చేసుకోవాలి: సీతక్క

 తెలంగాణ శాసనసభ వర్షాకాల సమావేశాల్లో బీఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీల మధ్య రాజకీయ రాజకీయం తీవ్ర స్థాయికి చేరింది. అసెంబ్లీ ప్రాంగణంలో చోటుచేసుకున్న నిరసనలపై రాష్ట్ర పంచాయతీరాజ్, మహిళా సంక్షేమ శాఖ మంత్రి సీతక్క తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. పోలీసులు చీర లాగారంటూ మహిళా ఎమ్మెల్యేలు చేసిన ఆరోపణలపై స్పందిస్తూ.. మహిళా ఎమ్మెల్యేల చీర నిజంగా లాగారా? కొట్టారా? అని మంత్రి సీతక్క ప్రశ్నించారు. మహిళా ఎమ్మెల్యేలు ఆత్మపరిశీలన చేసుకోవాలని అన్నారు.

కేసీఆర్  ఇంటికి హుటాహుటిన కేటీఆర్, హరీశ్ రావు.. ఏం జరిగింది?తెలంగాణSwechaa08 Sep 2026, 12:22 PM

కేసీఆర్ ఇంటికి హుటాహుటిన కేటీఆర్, హరీశ్ రావు.. ఏం జరిగింది?

రాష్ట్ర రాజకీయాలు ఒక్కసారిగా వేడెక్కాయి. రీవెంజ్ పాలిటిక్స్ దిశగా నడుస్తున్నట్టు సమాచారం. నిన్న అసెంబ్లీ వద్ద జరిగిన ఉద్రిక్త పరిస్థితులకు మాస్టర్ మైండ్ మాజీ సీఎం కేసీఆర్ అని కాంగ్రెస్ నేతలు ఆరోపిస్తున్నారు. సీఎం రేవంత్ రెడ్డి సైతం ఇదే విషయాన్ని ప్రస్తావించారు. మొన్నజరిగిన బీఆర్ఎస్ ఎల్పీ సమావేశంలో అధికార పార్టీని రెచ్చగొట్టాలని, సమావేశాలు సజావుగా సాగకుండా చేయాలని కేసీఆర్ తన పార్టీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలకు దిశానిర్దేశం చేశారని కాంగ్రెస్ నేతలు ఆరోపిస్తున్నారు. ఈ క్రమంలోనే కేసీఆర్ ఇంటి ముట్టడికి కాంగ్రెస్ నేతలు వివిధ ప్రాంతాల నుంచి బయలుదేరినట్టు సమాచారం.కాగా, కేసీఆర్ మీద హత్యాయత్నానికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్లాన్ చేశారని బీఆర్ఎస్ నేతలు ఆరోపిస్తున్నారు.ఈ క్రమంలోనే ‘కేసీఆర్ చనిపోవాలి.. ఆయన చావును కోరుకుంటున్నాం’ అంటూ కాంగ్రెస్ ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్ చేసిన కామెంట్స్ వివాదాస్పదంగా మారాయి. విషయం తెలియడంతో కేటీఆర్,హరీష్ రావు ఇతర బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు అసెంబ్లీ నుంచి నేరుగా కేసీఆర్ ఎర్రవల్లి నివాసానికి బయలుదేరినట్టు సమాచారం.

స్పీకర్‌పై దూషణలు వీడియోల్లో స్పష్టంగా ఉన్నాయి.. ఆధారాలతో బయటపెట్టిన మంత్రి శ్రీధర్ బాబు!తెలంగాణSwechaa08 Sep 2026, 12:10 PM

స్పీకర్‌పై దూషణలు వీడియోల్లో స్పష్టంగా ఉన్నాయి.. ఆధారాలతో బయటపెట్టిన మంత్రి శ్రీధర్ బాబు!

 తెలంగాణ శాసనసభలో చోటుచేసుకుంటున్న పరిణామాలపై రాష్ట్ర శాసనసభ వ్యవహారాల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు తీవ్రస్థాయిలో మండిపడ్డారు. అత్యున్నత రాజ్యాంగబద్ధమైన స్థానంలో ఉన్న స్పీకర్‌ను ఉద్దేశించి బీఆర్ఎస్ సీనియర్ నేత తన్నీరు హరీశ్‌రావు బెదిరింపు ధోరణిలో మాట్లాడటం ప్రజాస్వామ్య వ్యవస్థలకే తీవ్ర ప్రమాదకరమని హెచ్చరించారు. సభను ఏ రకంగా నడపాలి, ఏ అంశాలపై నిర్ణయాలు తీసుకోవాలి అనే దానిపై స్పీకర్‌కు ఆదేశాలు ఇవ్వడానికి లేదా ఇలా చేయొద్దు.. అలా చేయొద్దని శాసించడానికి ప్రతిపక్ష నేతలకు ఎలాంటి హక్కు లేదని సభా వేదికగా సూటిగా నిలదీశారు.

The Paradise-Anirudh: రిలీజ్ డేట్ కన్‌ఫర్మ్ చేసినా అనిరుధ్ పట్టించుకోడా?సినిమాSwechaa08 Sep 2026, 11:58 AM

The Paradise-Anirudh: రిలీజ్ డేట్ కన్‌ఫర్మ్ చేసినా అనిరుధ్ పట్టించుకోడా?

The Paradise: నాని నటిస్తున్న ప్యారడైజ్ సినిమా విషయంలో ముందు నుంచి రక రకాల రూమర్స్ చుట్టు ముడుతూనే ఉన్నాయి. ప్రారంభంలో నాని మేకోవర్ చూసి..ఈ గెటప్ ఏంటి..ఆ జడలేంటీ..గ్లింప్స్ లో ఆ బూతులేంటీ..ఇదసలు నాని సినిమానా కాదా? అని మాట్లాడుకున్నారు. దీని, కారణం నాని గెటప్ అందరికీ నచ్చకపోవడమే. ఆ టాక్ నుంచి జనాలలో మంచి ఆసక్తిని రగిలించాడు దర్శకుడు శ్రీకాంత్ ఓదెల.

కుప్పకూలిన ఐఏఎస్ నవీన్ మిట్టల్ పర్సనల్ సెక్రెటరీ.. మంత్రి సీపీఆర్ చేసినా..!తెలంగాణSwechaa08 Sep 2026, 11:55 AM

కుప్పకూలిన ఐఏఎస్ నవీన్ మిట్టల్ పర్సనల్ సెక్రెటరీ.. మంత్రి సీపీఆర్ చేసినా..!

రాష్ట్రంలో ఓ వైపు అసెంబ్లీ సమావేశాలు హాట్ హాట్‌గా కొనసాగుతున్నాయి. ఈ క్రమంలో తీవ్ర విషాదం నెలకొంది. ఐఏఎస్ నవీన్ మిట్టల్ పర్సనల్ సెక్రెటరీ రాజు ఆకస్మాత్తుగా ఉన్నట్టుండి కుప్పకూలారు.అసెంబ్లీ ఆవరణలో ఉన్నట్టుండి కింద పడిపోవడంతో మంత్రి వాకిటి శ్రీహరి ఆయనకు సీపీఆర్ చేశారు. అనంతరం చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించగా, అప్పటికే మృతిచెందినట్లు వైద్యులు వెల్లడించారు. రాజు మృతికి కార్డియాక్ అరెస్టు కారణమని తెలుస్తోంది. అసెంబ్లీ ఆవరణలో ఆయన విధుల్లో ఉండగా ఉన్నట్టుండి కుప్పకూలడంతో ఆయన్ను రక్షించడానికి మంత్రి వాకిటి శ్రీహరి తీవ్రంగా ప్రయత్నించారు. సీపీఆర్ చేసినా ఆయన ప్రాణాలతో బయటపడకపోవడంతో అధికారులు, మంత్రి సైతం నిరాశకు లోనైనట్టు తెలుస్తోంది.

‘నా తల్లిని అవమానించడంపై ఏం చెబుతారు?’.. హరీశ్‌రావును సూటిగా నిలదీసిన స్పీకర్!తెలంగాణSwechaa08 Sep 2026, 11:52 AM

‘నా తల్లిని అవమానించడంపై ఏం చెబుతారు?’.. హరీశ్‌రావును సూటిగా నిలదీసిన స్పీకర్!

 తెలంగాణ శాసనసభ వర్షాకాల సమావేశాలు రెండో రోజు కూడా అత్యంత ఉద్రిక్తంగా, వాడీవేడిగా సాగుతున్నాయి. స్పీకర్ గడ్డం ప్రసాద్‌ను ఉద్దేశించి బీఆర్ఎస్ ఎమ్మెల్సీ తాతా మధు తీవ్ర అనుచిత వ్యాఖ్యలు చేశారనే ఆరోపణల వ్యవహారం సభలో ప్రకంపనలు సృష్టిస్తోంది. ఈ అంశంపై అసెంబ్లీలో తీవ్రస్థాయి చర్చ జరుగుతున్న సమయంలో, బీఆర్ఎస్ ముఖ్య నేత, మాజీ మంత్రి తన్నీరు హరీశ్‌రావుకు, స్పీకర్ గడ్డం ప్రసాద్‌ కుమార్‌కు మధ్య తీవ్ర వాగ్వాదం చోటుచేసుకుంది.

అసెంబ్లీ వద్ద బీఆర్ఎస్ ఎమ్మెల్యేల ఆగ్రహం.. రేవంత్ ప్రభుత్వంపై కౌశిక్ రెడ్డి, డాక్టర్ సంజయ్ నిప్పులు!తెలంగాణSwechaa08 Sep 2026, 11:35 AM

అసెంబ్లీ వద్ద బీఆర్ఎస్ ఎమ్మెల్యేల ఆగ్రహం.. రేవంత్ ప్రభుత్వంపై కౌశిక్ రెడ్డి, డాక్టర్ సంజయ్ నిప్పులు!

 తెలంగాణ శాసనసభ ప్రాంగణంలో ప్రతిపక్ష బీఆర్ఎస్ అధికార కాంగ్రెస్ మధ్య తీవ్రస్థాయిలో వాగ్వాదం కొనసాగుతోంది. అసెంబ్లీ మీడియా పాయింట్‌లో బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు పాడి కౌశిక్ రెడ్డి, డాక్టర్ కల్వకుంట్ల సంజయ్‌లు విలేకరుల సమావేశంలో మాట్లాడారు. తమ 20ఏళ్ల రాజకీయ జీవితంలో ఇలాంటి అసభ్యకర భాష ఎప్పుడూ వినలేదని చెబుతున్న సీఎం రేవంత్ రెడ్డి.. గతంలో స్వయంగా తానేం మాట్లాడారో, ఎలాంటి పదజాలం ఉపయోగించారో తెలంగాణ సమాజం మొత్తానికి తెలుసని పాడి కౌశిక్ రెడ్డి ధ్వజమెత్తారు.

కేసీఆర్ ఫాంహౌస్ ముట్టడికి కాంగ్రెస్ పిలుపు.. ఎర్రవల్లిలో  టెన్షన్ టెన్షన్తెలంగాణSwechaa08 Sep 2026, 11:30 AM

కేసీఆర్ ఫాంహౌస్ ముట్టడికి కాంగ్రెస్ పిలుపు.. ఎర్రవల్లిలో టెన్షన్ టెన్షన్

మాజీ సీఎం,బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ఫాంహౌస్ ముట్టడికి కాంగ్రెస్ నేతలు పిలుపునివ్వడంతో ఎర్రవల్లిలో టెన్షన్ వాతావరణం నెలకొంది. అసెంబ్లీకి రాకుండా రూ.కోటికి పైగా వేతనం తీసుకున్నారని, అలెవెన్సులు పొందుతున్నారని ఆరోపిస్తూ కేసీఆర్ రాజీనామా చేయాలని కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తున్నది. ఈ మేరకు కాంగ్రెస్ నేతలు ఆయన ఫామ్‌హౌస్‌ను ముట్టడికి పిలుపునిచ్చారు. దీంతో మార్కుక్ మండలంలో తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ఎర్రవల్లి పరిసరాల్లో భారీగా పోలీసులు మోహరించారు.వెయ్యి మందికిపైగా పోలీసులతో కట్టుదిట్టమైన భద్రత ఏర్పాటు చేసినట్టు సమాచారం. కేసీఆర్ ఫాంహౌస్ పరిసరాల్లో కంచెను ఏర్పాటు చేశారు. అటుగా వెళ్లే మార్గాలను దిగ్బంధించి,ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటుచేసుకోకుండా చర్యలు చేపట్టారు. డీఐజీ చంద్రశేఖర్ ఆధ్వర్యంలో పోలీసులు బలగాలు మోహరించాయి. ఫామ్‌హౌస్‌కు చుట్టపక్కల మూడు కిలోమీటర్ల మేర వాహనాల రాకపోకలను పూర్తిగా నిలిపివేశారు.

ద‌ళ‌ప‌తి విజ‌య్ విశ్వ‌రూపం! డీఎంకేనే మెయిన్ టార్గెట్‌?NationalSwechaa08 Sep 2026, 11:22 AM

ద‌ళ‌ప‌తి విజ‌య్ విశ్వ‌రూపం! డీఎంకేనే మెయిన్ టార్గెట్‌?

తమిళనాడు అసెంబ్లీలో విజయ్‌ వేసిన తాజా అడుగు చూస్తే.. ఇది కేవలం ఒక సీఎం ప్రసంగంలా కనిపించడం లేదు. ప్రధాన ప్రత్యర్థి డీఎంకేపై నేరుగా దాడి చేయడానికి ఆయన సిద్ధమయ్యారన్న సంకేతాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి.

ప్రశ్నించే గొంతులను అణగదొక్కడానికే కేసులు, అరెస్టులు : హరీశ్ రావుతెలంగాణSwechaa08 Sep 2026, 11:06 AM

ప్రశ్నించే గొంతులను అణగదొక్కడానికే కేసులు, అరెస్టులు : హరీశ్ రావు

రాష్ట్రంలో నెలకొన్న తాజా పరిస్థితులపై బీఆర్ఎస్ డిప్యూటీ ఫ్లోర్ లీడర్ హరీశ్ రావు ఘాటుగా స్పందించారు. ఎమ్మెల్సీలు తాతా మధు, నవీన్ రెడ్డిలను అరెస్ట్ చేయడంపై మాజీ మంత్రి మండిపడ్డారు. ప్రశ్నించే గొంతులను అణచివేసేందుకు అక్రమ కేసులు బనాయిస్తున్నారని,ఆపై అరెస్టు చేస్తున్నారని ఫైర్ అయ్యారు.ఈ మేరకు మంగళవారం ఉదయం ‘ఎక్స్’ వేదికగా తీవ్ర విమర్శలు గుప్పించారు. ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలను సభలోకి రానివ్వకుండా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆదేశాల ప్రకారం పోలీసులు క్రూరంగా వ్యవహారించారని, బీఆర్ఎస్ ప్రజాప్రతినిధుల మీద దాడి చేసి సభా హక్కులను కబళించార్నారు. ఆ పోలీసులే నేడు ‘ఉల్టా చోర్ కొత్వాల్ కో డాంటే’ అన్నట్లు తాత మధు, నవీన్ రెడ్డిలను అరెస్ట్ చేయడం దురదృష్టకరమన్నారు. హైకోర్టు చెప్పినా వినకుండా కేసులు పెట్టి అరెస్ట్ చేయడమంటే చట్టాన్ని, న్యాయస్థానాలను ధిక్కరించడమేనని అభిప్రాయం వ్యక్తంచేశారు.

VIRAL VIDEO: వైరల్.. దుబాయ్‌లో రూ.30వేలకు అద్దెగది ఇంతే మరి!వైరల్ న్యూస్Swechaa08 Sep 2026, 11:05 AM

VIRAL VIDEO: వైరల్.. దుబాయ్‌లో రూ.30వేలకు అద్దెగది ఇంతే మరి!

 విలాసవంతమైన భవనాలు, ఖరీదైన షాపింగ్ మాల్స్, ఆకర్షణీయమైన జీతాలకు చిరునామా అయిన దుబాయ్‌లో సామాన్య ప్రవాసుల బతుకుచిత్రం ఎంత కష్టతరంగా ఉంటుందో తెలిపే దృశ్యమిది. దుబాయ్‌లో తక్కువ, మధ్యస్థ ఆదాయ వర్గాలు చెల్లించే భారీ అద్దెలు, వారు నివసించే చిన్నపాటి గదులకు సంబంధించిన ఆసక్తికర విషయాలను ఓ భారతీయ మహిళ వీడియో ద్వారా వెల్లడించింది. తాను దుబాయ్‌లో నివాసముంటున్న అతి చిన్న అద్దె గదిని చూపిస్తూ ఆమె తీసిన షార్ట్ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.

కాంగ్రెస్ పై బీఆర్‌ఎస్ వ్యూహం వర్కౌట్ అవుతుందా!?..తెలంగాణSwechaa08 Sep 2026, 10:56 AM

కాంగ్రెస్ పై బీఆర్‌ఎస్ వ్యూహం వర్కౌట్ అవుతుందా!?..

బీఆర్ఎస్ ఎమ్మెల్సీలు తాతా మధు, నవీన్ రెడ్డిలను పోలీసులు అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే. స్పీకర్ గడ్డం ప్రసాద్ ను అసభ్య పదజాలంతో దూషించిన క్రమంలో.. వారిపై పలు కేసులు నమోదు చేసిన పోలీసులు.. మంగళవారం ఉదయం ఎమ్మెల్యే క్వార్టర్స్ లో అదుపులోకి తీసుకున్నారు. ఇద్దరినీ నారాయణగూడ పీఎస్ కు తరలించి.. స్టేట్మెంట్ కూడా రికార్డు చేశారు. ఈ విషయం తెలుసుకున్న బీఆర్ఎస్ కార్యకర్తలు పెద్దఎత్తున పీఎస్ కు చేరుకున్నారు. తాతా మధు, నవీన్ రెడ్డిని వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ.. పీఎస్ ఎదుట రోడ్డుపై బైఠాయించారు. దొంగల రాజ్యం.. దోపిడీ రాజ్యం.. సీఎం డౌన్ డౌన్ అంటూ పెద్దఎత్తున నినాదాలు చేశారు. పరిస్థితి అదుపుతప్పేలా ఉండటంతో బీఆర్ఎస్ కార్యకర్తలను పోలీసులు అడ్డుకోవడంతో.. తోపులాట జరిగింది. దీంతో పలువురు కార్యకర్లను పోలీసులు అరెస్ట్ చేయడంతో.. పీఎస్ వద్ద హైటెన్షన్ పరిస్థితి నెలకొంది.

చిత్రం లేదు
తెలంగాణSwechaa08 Sep 2026, 10:24 AM

మంత్రి ఇలాకాలో దారుణ దుస్థితి.. నీళ్లు లేవని అడిగినందుకు విద్యార్థినులను కొట్టిన ప్రిన్సిపాల్!

 తెలంగాణ పంచాయతీరాజ్, గిరిజన సంక్షేమ శాఖ మంత్రి సీతక్క సొంత జిల్లాలో ప్రభుత్వ గిరిజన పాఠశాలల స్థితిగతులు అత్యంత అధ్వానంగా ఉన్నాయని నిరూపించే విచారకర ఘటన వెలుగుచూసింది. ములుగు జిల్లా వెంకటాపురం మండల కేంద్రంలోని ఐటీడీఏ కాలేజీ పక్కనే ఉన్న గిరిజన బాలికల రెసిడెన్షియల్ పాఠశాలలో కనీస వసతులు లేక విద్యార్థినులు తీవ్ర అవస్థలు పడుతున్నారు. తాగడానికి మంచినీళ్లు లేవని, దుస్తులు ఉతికే నీళ్లనే తాగాల్సి వస్తోందని విద్యార్థినులు కంటతడి పెడుతూ తమ ఆవేదనను మీడియా ముందు వెళ్లగక్కారు.

Sai Pallavi-Tollywood: "తండేల్" తర్వాత తెలుగులో గ్యాప్ ఎందుకు వచ్చింది?సినిమాSwechaa08 Sep 2026, 10:21 AM

Sai Pallavi-Tollywood: "తండేల్" తర్వాత తెలుగులో గ్యాప్ ఎందుకు వచ్చింది?

Sai Pallavi: సాయి పల్లవి నుంచి కొత్త సినిమా ప్రకటన ఏదీ తెలుగులో రాలేదు. గత ఏడాది(2025) లో వచ్చిన తండేల్ పెద్ద కమర్షియల్ హిట్‌గా నిలిచింది. చందు మొండేటి దర్శకత్వం వహించిన ఈ సినిమాలో హీరోగా నాగ చైతన్య నటించాడు. ఇందులో, సాయి పల్లవి-నాగ చైతన్య కెరీర్ బెస్ట్ పర్ఫార్మెన్స్ ఇచ్చారని అందరూ చెప్పుకున్నారు. 100 కోట్ల క్లబ్‌లో చేరిన దీని తర్వాత సాయి పల్లవి బాలీవుడ్‌కి వెళ్ళింది. కానీ, తెలుగు సినిమాను ప్రకటించలేదు.

బీఆర్ఎస్ ఎమ్మెల్యేల అడ్డగింత.. అసెంబ్లీలో వాయిదా తీర్మానంతెలంగాణSwechaa08 Sep 2026, 10:11 AM

బీఆర్ఎస్ ఎమ్మెల్యేల అడ్డగింత.. అసెంబ్లీలో వాయిదా తీర్మానం

అసెంబ్లీ సమావేశాలకు హాజరయ్యేందుకు వచ్చిన తమ పార్టీ శాసనసభ సభ్యులను పోలీసులు అడ్డుకోవడంపై బీఆర్ఎస్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. పోలీసులకు ఆ అధికారం ఎక్కడిదని ప్రశ్నించింది. ప్రజలు ఎన్నుకున్న ప్రతినిధులను అలా ఎలా అడ్డుకుంటారని, ఇది ప్రజాస్వామ్యానికి వ్యతిరేకమని బీఆర్ఎస్ ఆరోపిస్తున్నది.రేవంత్ ప్రభుత్వం కావాలనే కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతోందని బీఆర్ఎస్ నేతలు ఆరోపిస్తున్నారు. ప్రభుత్వ వైఫల్యాలను గుర్తుచేసేందుకు నల్ల దుస్తులు ధరించి అసెంబ్లీకి వచ్చామని పేర్కొంటున్నారు. నల్లదుస్తులు ధరించి అసెంబ్లీకి రానివ్వకుండా పోలీసులు అడ్డుకోవడం, అందుకు స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ ఆదేశాలు ఇవ్వడంపై తీవ్ర విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఈ క్రమంలోనే నిన్నటి ఘటనపై బీఆర్‌ఎస్ వాయిదా తీర్మానం ఇచ్చినట్టు తెలుస్తోంది. అసెంబ్లీకి హాజరయ్యేందుకు వచ్చిన ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలను పోలీసులు అడ్డుకున్నందుకు.. దీనిపై చర్చ జరపాలని బీఆర్ఎస్ డిమాండ్ చేస్తోంది.

Paris: పారిస్‌లో లింగ వివక్ష.. ఈఫిల్ టవర్ వద్ద ఉద్యోగుల ఆందోళన!!..InternationalSwechaa08 Sep 2026, 09:59 AM

Paris: పారిస్‌లో లింగ వివక్ష.. ఈఫిల్ టవర్ వద్ద ఉద్యోగుల ఆందోళన!!..

ప్రపంచవ్యాప్తంగా మహిళలు అన్ని రంగాల్లో దూసుకెళ్తూ.. లింగ వివక్షకు తావులేదని నిరూపిస్తున్న వేళ.. పారిస్‌లోని ఈఫిల్ టవర్ ఘటన చర్చనీయాంశంగా మారింది. బీఏపీఎస్ ప్రతినిధుల పర్యటన సందర్భంగా మహిళా సిబ్బందిని దూరంగా ఉంచారన్న ఆరోపణలతో ఉద్యోగులు నిరసనకు దిగారు. దీంతో ఈఫిల్ టవర్ఒకరోజు మూతపడింది. మహిళలతో పరస్పర చర్యలను పరిమితం చేయాలన్న అభ్యర్థన వచ్చిందని నిర్వహణ సంస్థ అంగీకరించి.. క్షమాపణలు చెప్పింది. మత విశ్వాసాలకు గౌరవం ఎంత ముఖ్యమో.. మహిళల సమానత్వం, గౌరవం కూడా అంతే ముఖ్యమని ఈ ఘటన మరోసారి గుర్తుచేస్తోంది.

SS.Rajamouli-Varanasi: వారణాసి చిత్రానికి వాళ్ళిద్దరే హైలెట్..సినిమాSwechaa08 Sep 2026, 09:43 AM

SS.Rajamouli-Varanasi: వారణాసి చిత్రానికి వాళ్ళిద్దరే హైలెట్..

SS.Rajamouli: దర్శక ధీరుడు ఎస్.ఎస్.రాజమౌళి ఎంతటి భారీ విజువల్ వండర్స్‌ను తీస్తున్నప్పటికీ కథలో ఎక్కడా కూడా హ్యూమన్ ఎమోషన్స్‌ని మిస్ చేయడు. బాహుబలి, ఆర్ఆర్ఆర్ సినిమాలే ఇందుకు ఉదాహరణ. భారీ వీఎఫెక్స్, గ్రాఫిక్స్ ఉన్నా కూడా ఈ రెండు సినిమాలలో బంధాల గురించి కూడా అద్భుతంగా చూపించాడు. సంఘర్షణలు కూడా పాత్రల మధ్య కన్నీళ్ళు తెప్పిస్తాయి. అలాంటి, బలమైన ఎమోషన్స్ వారణాసి మూవీలో కూడా ఉన్నాయని ఆయన స్పష్టం చేశారు.

BRS : కేటీఆర్, హరీశ్ సహా 14 మందిపై కేసుతెలంగాణSwechaa08 Sep 2026, 09:35 AM

BRS : కేటీఆర్, హరీశ్ సహా 14 మందిపై కేసు

రాష్ట్ర రాజకీయాలు మరోసారి హీటెక్కాయి. నిన్న ఉదయం అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం సమయంలో మెయిన్ గేటు వద్ద జరిగిన తోపులాటలో బీఆర్ఎస్ నేతలు పలువురి గాయాలు అయిన విషయం తెలిసిందే.మహిళా ఎమ్మెల్యేల పట్ల పోలీసులు వ్యవహరించిన తీరుపై బీఆర్ఎస్ నేతలు సైతం ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. నల్లదుస్తులు ధరించి, ప్లకార్డులు ప్రదర్శిస్తూ అసెంబ్లీలోనికి వెళ్లరాదని బీఆర్ఎస్ సభ్యులను పోలీసులు అడ్డుకోగా.. ఎమ్మెల్సీ తాతా మధు స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ మీద అనుచిత వ్యాఖ్యలు చేశారని.. ఆ కామెంట్స్‌కు గాను స్పీకర్ నిన్న శాసనసభలో కన్నీళ్లు పెట్టుకున్నారని తెలిసింది. ఈ విషయంలో సీఎం రేవంత్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. స్పీకర్‌ను అవమానించినందుకు ఎమ్మెల్సీ తాతా మధును మండలికి రాకుండా ఆయన సభ్యత్వాన్ని బర్తరఫ్ చేయాలని చైర్మన్‌కు విజ్ఞప్తి చేశారు. ఈ క్రమంలోనే ఇవాళ ఉదయం సీఎం ఆదేశాల మేరకు ఎమ్మెల్సీ తాతా మధు,నవీన్ రెడ్డిలను పోలీసులు అరెస్టు చేశారు. దీనికి తోడు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, హరీశ్ రావు సహా మరో 14 మంది నేతలపై పోలీసులు 5 కేసులు నమోదు చేసినట్టు సమాచారం.

Priyanka Mohan: పవన్ OG వల్ల కెరీర్ గ్రాఫ్ పడిపోయిందా..ఇందులో నిజమెంత!సినిమాSwechaa08 Sep 2026, 09:12 AM

Priyanka Mohan: పవన్ OG వల్ల కెరీర్ గ్రాఫ్ పడిపోయిందా..ఇందులో నిజమెంత!

Priyanka Mohan: కొంతమంది హీరోయిన్స్‌కి పెద్ద హీరోల పక్కన హీరోయిన్‌గా అవకాశాలైతే వస్తాయి గానీ..వాటి వల్ల కెరీర్ గ్రాఫ్ పెరగకపోగా..అమాంతం పడిపోతుంది. దీనికి కారణం స్టార్ హీరో సినిమా అయినా, అందులో ప్రాధాన్యం లేని పాత్ర అయితే..భిన్న అభిప్రాయాలతో కెరీర్ ఆశించినట్టుగా కాకుండా తిరగబడుతుంది. OG వల్ల ప్రియాంక అరుళ్ మోహన్ పరిస్థితి కూడా ఇలాగే అయిందని ప్రచారం జరుగుతోంది.

తిరుమల భక్తులకు గుడ్‌న్యూస్.. ఎస్వీ మ్యూజియం ప్రారంభానికి ముహూర్తం ఖరారు!..ఏపీSwechaa08 Sep 2026, 08:58 AM

తిరుమల భక్తులకు గుడ్‌న్యూస్.. ఎస్వీ మ్యూజియం ప్రారంభానికి ముహూర్తం ఖరారు!..

తిరుమలలో భక్తులు ఎంతోకాలంగా ఎదురుచూస్తున్న ఎస్వీ మ్యూజియం ప్రారంభోత్సవానికి ముహూర్తం ఖరారైంది. సీఎం చంద్రబాబు నాయుడు చేతుల మీదుగా ప్రారంభించేందుకు టీటీడీ ఏర్పాట్లు ముమ్మరం చేస్తోంది. ప్రపంచ స్థాయి ప్రమాణాలతో సిద్ధమవుతున్న మ్యూజియం పనులను అదనపు ఈవో వెంకయ్య చౌదరి పరిశీలించారు. మరోవైపు ఈ నెల 15 నుంచి ప్రారంభమయ్యే శ్రీవారి బ్రహ్మోత్సవాలకు భారీ ఏర్పాట్లు జరుగుతున్నాయి. గరుడసేవ సందర్భంగా భారీగా భక్తులు తరలిరానుండటంతో మొబైల్ నెట్‌వర్క్, సిగ్నల్ వ్యవస్థను మరింత పటిష్టం చేయాలని టీటీడీ ఆదేశించింది.

స్వీట్ షాపుల్లో ధరల సెగ.. రూ.780కి చేరిన కిలో ధూద్ పేడా!వ్యాపారంSwechaa08 Sep 2026, 08:58 AM

స్వీట్ షాపుల్లో ధరల సెగ.. రూ.780కి చేరిన కిలో ధూద్ పేడా!

 దసరా, దీపావళి వంటి ప్రధాన పండుగలు సమీపిస్తున్న తరుణంలో సామాన్య, మధ్యతరగతి వినియోగదారులకు తీవ్ర నిరాశ ఎదురైంది. పండుగ పూట బంధుమిత్రులకు స్వీట్లు పంచి నోరు తీపి చేసుకుందామనుకునే వారికి మిఠాయిల ధరలు విపరీతంగా పెరిగి చుక్కలు చూపిస్తున్నాయి. స్వీట్ల తయారీలో అత్యంత కీలకమైన ప్రధాన ముడిసరుకుల ధరలు మార్కెట్‌లో ఆకాశాన్నంటడమే ఈ పరిస్థితికి ప్రధాన కారణమైంది. పెరిగిన ఉత్పత్తి ఖర్చుల భారాన్ని తట్టుకునేందుకు వ్యాపారులు స్వీట్ల ధరలను ఏకంగా 30శాతం వరకు పెంచాల్సి వచ్చిందని వెల్లడిస్తున్నారు.

Manchu Manoj: బాలయ్య "దాదా" మూవీలో మంచు మనోజ్..సినిమాSwechaa08 Sep 2026, 08:39 AM

Manchu Manoj: బాలయ్య "దాదా" మూవీలో మంచు మనోజ్..

Manchu Manoj: నందమూరి బాలకృష్ణ హీరోగా నటిస్తున్న లేటెస్ట్ సినిమాలలో ఒకటి 'దాదా'. ఇటీవల ఈ సినిమా నుంచి గ్లింప్స్ వచ్చి అభిమానుల్లో భారీ అంచనాలను పెంచేసింది. గోపీచంద్ మలినేని దర్శకత్వం వహిస్తున్నాడు. అయితే, ఈ మధ్య 'దాదా' చిత్రంలో మంచు మనోజ్ నటిస్తున్నట్టుగా వార్తలు వచ్చాయి. ఇప్పుడు మేకర్స్ ఈ విషయాన్ని కన్‌ఫర్మ్ చేశారు. నెగిటివ్ షేడ్స్ ఉన్న పాత్రలో మనోజ్ కనిపించబోతున్నాడట.