స్వేచ్ఛ షార్ట్స్ — తాజా తెలుగు వార్తలు

బాసర ట్రిపుల్ ఐటీలో కలుషిత నీటితో వంటలు.. విద్యార్థులకు చర్మవ్యాధులు!తెలంగాణSwechaa10 Nov 2026, 11:47 AM

బాసర ట్రిపుల్ ఐటీలో కలుషిత నీటితో వంటలు.. విద్యార్థులకు చర్మవ్యాధులు!

తెలంగాణలోని ప్రతిష్టాత్మక బాసర ట్రిపుల్ ఐటీ(basara IIIT) సమస్యలకు నెలవుగా మారింది. ఎప్పుడూ ఏదో ఒక సమస్య ట్రిపుల్ ఐటీని వేధిస్తున్నది.మొన్నటివరకు నీటి సమస్యతో విద్యార్థులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. తాజాగా కలుషిత నీటి కారణంగా అనారోగ్య సమస్యలు, చర్మ వ్యాధులను ఎదుర్కొంటున్నట్టు తెలుస్తోంది. అంతపెద్ద విద్యాలయంలో మెయింటెన్స్ సరిగా లేకపోవడం, అధికారులు పట్టించుకోకపోవడం, నిధుల సమస్య కూడా వెంటాడుతోందని సమాచారం.మౌలిక వసతుల లేమితో విద్యార్థులు చదువు మీద దృష్టి సారించలేకపోతున్నట్టు సమాచారం. నిత్యం అనారోగ్య సమస్యలు, నీటి సమస్యలు వేధిస్తుంటే ఇక వారు చదువు మీద ఎలా దృష్టిసారిస్తారని విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.అసలు అధికారులు ఏం చేస్తున్నారనే ప్రశ్నలు ఉత్పన్నం అవుతున్నాయి. బాసర ట్రిపుల్ ఐటీ అధికారులు విద్యార్థుల ప్రాణాలతో చెలగాటం ఆడుతున్నారని తల్లిదండ్రులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

రాజధాని ఢిల్లీలో ఊపిరి తీసుకోవడమే కష్టం.. హైదరాబాద్‌కూ ఆ ప్రమాదం ఉందా?తెలంగాణSwechaa10 Nov 2026, 11:35 AM

రాజధాని ఢిల్లీలో ఊపిరి తీసుకోవడమే కష్టం.. హైదరాబాద్‌కూ ఆ ప్రమాదం ఉందా?

దేశ రాజధాని ఢిల్లీలో కాలుష్యం భయపెడుతోంది. మరి వేగంగా విస్తరిస్తున్న హైదరాబాద్ పరిస్థితి ఏంటి? మన నగరంలోనూ రేపు ఇలాంటి రోజులు వస్తాయా? ఇప్పుడే మేల్కోకపోతే మన పిల్లలకు మిగిలేది స్వచ్ఛమైన గాలా? విషపూరితమైన వాతావరణమా?

Bollywood: రామాయణకి ఊహించని కలెక్షన్స్...ధురంధర్ రికార్డ్స్ బ్రేక్!సినిమాSwechaa10 Nov 2026, 11:35 AM

Bollywood: రామాయణకి ఊహించని కలెక్షన్స్...ధురంధర్ రికార్డ్స్ బ్రేక్!

Bollywood: మన భారతీయ సినీ చరిత్రలోనే అత్యంత ప్రతిష్టాత్మకమైన ప్రాజెక్టుల్లో ఒకటిగా తెరకెక్కిన రామాయణ సినిమాపై అంచనాలు ఏ స్థాయిలో పెరిగాయో అందరికీ తెలిసిందే. బాలీవుడ్ స్టార్ రణ్‌బీర్ కపూర్ రాముడిగా, కన్నడ స్టార్ యష్ రావణుడిగా నటించిన ఈ సినిమాపై ఇప్పటికే దేశవ్యాప్తంగా భారీ క్రేజ్ నెలకొంది. ముఖ్యంగా, ఈ సినిమా బాక్సాఫీస్ దగ్గర ఎలాంటి సంచలనాలు సృష్టించబోతోందనే చర్చ విడుదలకి ముందు నెలకొంది.

TG : గురుకులంలో ఘోరం.. బాలికలను బాత్రూంలోకి తీసుకెళ్లి!తెలంగాణSwechaa10 Nov 2026, 11:30 AM

TG : గురుకులంలో ఘోరం.. బాలికలను బాత్రూంలోకి తీసుకెళ్లి!

రాష్ట్రంలోని గురుకుల పాఠశాలల్లో మైనర్ బాలికలపై అఘాయిత్యాలు పెరుగుతూనే ఉన్నాయి. వారిని కంటికి రెప్పలా కాపాడాల్సిన వారే వారిమీద కన్నేస్తున్నారు. టీచర్లు, వార్డెన్ల ముసుగులో ఎక్కడపడితే అక్కడ టచ్ చేస్తూ వారిని తీవ్ర ఇబ్బందులకు గురిచేస్తున్నట్టు కథనాలు వస్తూనే ఉన్నాయి. తాజాగా నల్గొండ జిల్లాలోని గురుకుల పాఠశాలలో చదువుతున్న మైనర్ బాలికలతో అక్కడే విధులు నిర్వహిస్తున్న పారిశుద్ధ్య కార్మికుడు అసభ్యంగా ప్రవర్తిస్తున్నట్టు సమాచారం. వారిని బాత్రూమ్‌లోకి తీసుకెళ్లి అసభ్యంగా ప్రవర్తిస్తున్నట్టు బాలికలు ఆరోపించారు. తమను అసభ్యకరంగా తాకుతున్నాడని చిన్నారులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. జిల్లాలోని నిడమనూరు సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాలలో పారిశుద్ధ్య కార్మికుడు తమను తాకరాని చోట తాకుతున్నాడని, బాత్రూమ్‌లోకి తీసుకెళ్లి డోర్ వేస్తున్నాడని చిన్నారులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

ఆ ఆలోచన లేదు: పొలిటికల్ ఎంట్రీపై హీరో సూర్య కీలక వ్యాఖ్యలు !వైరల్ న్యూస్Swechaa10 Nov 2026, 11:18 AM

ఆ ఆలోచన లేదు: పొలిటికల్ ఎంట్రీపై హీరో సూర్య కీలక వ్యాఖ్యలు !

తమిళ సినీ రంగంలో అగ్ర కథానాయకుడిగా వెలుగొందుతోన్న హీరో సూర్య (Suriya) తన రాజకీయ ప్రవేశంపై (Political Entry) జరుగుతోన్న విస్తృత ప్రచారానికి చెక్ పెడుతూ సంచలన వ్యాఖ్యలు చేశారు. తమిళనాడు రాజకీయాల్లో ప్రముఖ నటుడు విజయ్ సొంత పార్టీ స్థాపించి క్రియాశీలకంగా ముందడుగు వేసిన నేపథ్యంలో, సూర్య కూడా విజయ్ బాటలోనే రాజకీయాల్లోకి వస్తారా అనే ఆసక్తికర చర్చ కోలీవుడ్‌తో పాటు తెలుగు చిత్రసీమలోనూ జోరందుకుంది. ఈ క్రమంలో తన పొలిటికల్ ఎంట్రీపై స్పందించిన సూర్య.. ప్రస్తుతానికి తనకు రాజకీయాల్లోకి ప్రవేశించే ఆలోచన ఏమాత్రం లేదని స్పష్టంగా ప్రకటించారు.

పవన్ జాతకంలో నాలుగు పెళ్లిళ్లు.. వేణుస్వామి జోస్యం నిజం కానుందా?సినిమాSwechaa10 Nov 2026, 10:57 AM

పవన్ జాతకంలో నాలుగు పెళ్లిళ్లు.. వేణుస్వామి జోస్యం నిజం కానుందా?

ఏపీ డిప్యూటీ సీఎం, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ మరోసారి తన వివాహ బంధానికి ముగింపు పలికారు. తన మూడో భార్య అన్నా లెజినోవాతో 13 సంవత్సరాల వివాహా బంధానికి పరస్పర అంగీకారంతో ఎండ్ కార్డ్ వేశారు.ఇకమీదట ఇద్దరం మంచి ఫ్రెండ్స్‌గా ఉంటామని, బాధ్యతాయుతంగా పిల్లల బాగోగులు చూసుకుంటామని చెప్పారు. సోషల్ మీడియా వేదికగా పవన్ కళ్యాణ్ నిన్న రాత్రి ఈ సంచలన ప్రకటన చేశారు. ఈ విషయం అటు జనసైనికులను,పవన్ కళ్యాణ్‌ను దేవుడిలా ఆరాధించే అభిమానులకు తేరుకోకుండా చేసింది.

ఫ్యూచర్ సిటీ మాస్టర్ ప్లాన్ సిద్ధం.. 1.80లక్షల ఎకరాల్లో నగరాభివృద్ధి!తెలంగాణSwechaa10 Nov 2026, 10:27 AM

ఫ్యూచర్ సిటీ మాస్టర్ ప్లాన్ సిద్ధం.. 1.80లక్షల ఎకరాల్లో నగరాభివృద్ధి!

 తెలంగాణ ప్రభుత్వం అత్యంత ప్రతిష్ఠాత్మకంగా తలపెట్టిన ‘ఫ్యూచర్ సిటీ’ (Future City) మాస్టర్ ప్లాన్ పూర్తిస్థాయిలో రూపుదిద్దుకుంది. సింగపూర్‌కు చెందిన ప్రఖ్యాత ‘డీపీ ఆర్కిటెక్ట్స్’ (DP Architects) సంస్థ అంతర్జాతీయ ప్రామాణికాలతో ఈ ప్రణాళికను సిద్ధం చేసింది. రంగారెడ్డి జిల్లా పరిధిలోని శ్రీశైలం, నాగార్జునసాగర్ రహదారుల మధ్య మొత్తం 1.80లక్షల ఎకరాల విస్తీర్ణంలో రూపుదిద్దుకోనున్న ఈ నగరం మాస్టర్ ప్లాన్‌ను త్వరలో నిర్వహించనున్న తెలంగాణ గ్లోబల్ సమ్మిట్‌లో ప్రభుత్వం అధికారికంగా ఆవిష్కరించనుంది. ఫ్యూచర్ సిటీ డెవలప్‌మెంట్ అథారిటీ (FCDA) పరిధిలోని 7 మండలాలు, 71 రెవెన్యూ గ్రామాల సమగ్ర వికాసం లక్ష్యంగా ఈ ప్లాన్ తయారు చేశారు.

TG : తెలంగాణలో  చల్లగాలులు.. 29 జిల్లాలకు ఎల్లో అలర్ట్తెలంగాణSwechaa10 Nov 2026, 09:59 AM

TG : తెలంగాణలో చల్లగాలులు.. 29 జిల్లాలకు ఎల్లో అలర్ట్

రాష్ట్రంలో ఉన్నట్టుండి ఉష్ణోగ్రతలు పడిపోతున్నాయి.దీంతో చలి తీవ్రత పెరిగింది.ఉదయం లేవాలంటేనే ప్రజలు జంకుతున్నారు.రానున్న రోజుల్లో రాష్ట్రంలో ఉష్ణోగ్రతలు మరింత పడిపోతాయని తెలుస్తోంది. ఈ క్రమంలోనే రానున్న 3 రోజుల పాటు చలిగాలుల తీవ్రత మరింత ఎక్కువగా ఉండే అవకాశముందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం ప్రకటించింది. ఈ నేపథ్యంలో రాష్ట్రంలోని 29 జిల్లాలకు వాతావరణ శాఖ ఎల్లో అలర్ట్ జారీ చేసింది.వాతావరణ శాఖ వెల్లడించిన వివరాల ప్రకారం.. సూర్యాపేట, జోగులాంబ గద్వాల, ఖమ్మం, జనగామ జిల్లాలు మినహా రాష్ట్రవ్యాప్తంగా ఉన్న అన్ని జిల్లాల్లోనూ రాత్రి వేళల్లో కనిష్ఠ ఉష్ణోగ్రతలు 15 డిగ్రీల కంటే తక్కువకు పడిపోయే అవకాశం ఉంది.

చరిత్రలో ఈ రోజు (10 నవంబర్)SpiritualitySwechaa10 Nov 2026, 09:25 AM

చరిత్రలో ఈ రోజు (10 నవంబర్)

  • 1983: మైక్రోసాఫ్ట్ వ్యవస్థాపకుడు బిల్ గేట్స్ విండోస్ ఆపరేటింగ్ సిస్టమ్ (Windows OS)ను ప్రపంచానికి అధికారికంగా పరిచయం చేశారు.

  • 1970: మానవరహిత సోవియట్ లూనార్ రోవర్ 'లూనాఖోడ్ 1' (Lunokhod 1)ను మోసుకెళ్లిన ప్రయాణం ప్రారంభమైంది.

  • 1938: టర్కీ రిపబ్లిక్ పితామహుడు, తొలి అధ్యక్షుడు ముస్తఫా కెమాల్ అటాతుర్క్ (Mustafa Kemal Ataturk) వర్ధంతి.

  • 1938: టర్కీ ఆధునీకరణకు మూలకారకుడైన ముస్తఫా కెమాల్ అటాతుర్క్ ఇస్తాంబుల్‌లో మరణించారు (ఈ రోజును టర్కీలో సంతాప దినంగా పాటిస్తారు).

  • 1975: యునైటెడ్ నేషన్స్ జనరల్ అసెంబ్లీ తీర్మానం 3379ని ఆమోదించింది (జియోనిజాన్ని జాతి వివక్షతో పోల్చిన వివాదాస్పద తీర్మానం).

  • 1989: బల్గేరియాలో 33 ఏళ్ల కమ్యూనిస్ట్ పాలన ముగిసింది — దేశ నాయకుడు టోడోర్ ఝివ్‌కోవ్ రాజీనామా చేశారు.

  • 1983: న్యూయార్క్ నగరంలో మైక్రోసాఫ్ట్ గ్రాఫికల్ యూజర్ ఇంటర్‌ఫేస్‌తో కూడిన 'విండోస్ 1.0'ను ఆవిష్కరించింది.

  • 1970: సోవియట్ యూనియన్ అపోలో ప్రయోగాలకు పోటీగా లూనా-17 వ్యోమనావ ద్వారా లూనాఖోడ్-1 అనే లూనార్ రోవర్‌ను చంద్రుడి వైపు పంపింది.

  • 1483 (జననం): మార్టిన్ లూథర్ — జర్మన్ దైవశాస్త్రవేత్త, ప్రొటెస్టెంట్ సంస్కరణల పితామహుడు.

  • 1644 (జననం): సమర్థ రామ్‌దాస్ — ఛత్రపతి శివాజీ మహారాజ్ ఆధ్యాత్మిక గురువు.

  • 1938 (మరణం): ముస్తఫా కెమాల్ అటాతుర్క్ — టర్కీ దేశపు మొదటి అధ్యక్షుడు మరియు వ్యవస్థాపకుడు.

  • 2013 (మరణం): విజయసింహ రెడ్డి లేదా ఇతర భారతీయ విద్యావేత్తలు / నాయకులు.

నేటి పంచాంగం - 10 నవంబర్ 2026 | కార్తిక శుద్ధ పాడ్యమి (బలిపాడ్యమి)SpiritualitySwechaa10 Nov 2026, 09:06 AM

నేటి పంచాంగం - 10 నవంబర్ 2026 | కార్తిక శుద్ధ పాడ్యమి (బలిపాడ్యమి)

  • తేదీ: 10 నవంబరు 2026, మంగళవారం

  • సంవత్సరం: శ్రీ పరాభవ నామ సంవత్సరం

  • అయనం & ఋతువు: దక్షిణాయనం, శరత్ఋతువు

  • మాసం & పక్షం: కార్తిక మాసం, శుక్ల పక్షం

  • తిథి: పాడ్యమి (సాయంత్రం 05:42 వరకు, తదుపరి విధియ)

  • వారం: మంగళవారం (భౌమవాసరే)

  • నక్షత్రం: అనూరాధ (మధ్యాహ్నం 11:28 వరకు, తదుపరి జ్యేష్ఠ)

  • యోగం: శోభన (ఉదయం 06:12 వరకు), తదుపరి అతిగండ

  • కరణం: కింస్తుఘ్న (ఉదయం 07:10 వరకు), తదుపరి బవ (సాయంత్రం 05:42 వరకు)

శుభ / అశుభ సమయాలు:

  • రాహుకాలం: మధ్యాహ్నం 03:00 - 04:30 వరకు

  • యమగండం: ఉదయం 09:00 - 10:30 వరకు

  • అమృతకాలం: రాత్రి 02:15 - 03:48 వరకు (తెల్లవారుజామున)

  • దుర్ముహూర్తము: ఉదయం 08:34 - 09:20 వరకు మరియు రాత్రి 10:44 - 11:34 వరకు

  • వర్జ్యం: మధ్యాహ్నం 03:45 - 05:18 వరకు

గ్రహస్థితులు:

  • సూర్యరాశి: తుల

  • చంద్రరాశి: వృశ్చికం

  • సూర్యోదయం: ఉదయం 06:22

  • సూర్యాస్తమయం: సాయంత్రం 05:37

పవన్ కల్యాణ్, అన్నా లెజినోవా విడాకులు.. 13ఏళ్ల వైవాహిక బంధానికి స్వస్తి!వైరల్ న్యూస్Swechaa10 Nov 2026, 08:33 AM

పవన్ కల్యాణ్, అన్నా లెజినోవా విడాకులు.. 13ఏళ్ల వైవాహిక బంధానికి స్వస్తి!

ఏపీ డిప్యూటీ సీఎం, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్, ఆయన భార్య అన్నా లెజినోవా తమ 13 ఏళ్ల వైవాహిక బంధానికి ముగింపు పలుకుతున్నట్లు అనూహ్య ప్రకటన చేశారు. పరస్పర అవగాహన, గౌరవంతో విడిపోవాలని నిర్ణయించుకున్నట్లు ప్రకటించారు. ఈ మేరకు సోమవారం అర్ధరాత్రి జనసేన అధికారిక మీడియా గ్రూప్ ద్వారా ఒక సంయుక్త ప్రకటనను విడుదల చేశారు. ఈ వార్త తెలుగు రాష్ట్రాల్లోనే కాకుండా రాజకీయ, సినీ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది.

కీసర పీఎస్‌లో అవినీతి కలకలం.. ఒకే స్టేషన్‌లో ముగ్గురు అధికారులు ఏసీబీకి చిక్కడమేంటి..?క్రైమ్Swechaa10 Nov 2026, 12:42 AM

కీసర పీఎస్‌లో అవినీతి కలకలం.. ఒకే స్టేషన్‌లో ముగ్గురు అధికారులు ఏసీబీకి చిక్కడమేంటి..?

కీసర పోలీస్‌ స్టేషన్‌లో ఏం జరుగుతోంది? ఇక్కడ బయటపడినవి కొన్ని ఘటనలేనా? ఇంకా పరిశీలించాల్సిన అంశాలున్నాయా? ఉన్నతాధికారులు ఈ స్టేషన్‌పై ప్రత్యేక దృష్టి పెట్టాల్సిన అవసరం లేదా?

ట్రంప్ కు షాక్.. నెతన్యాహుకు సవాల్! యుద్ధోన్మాదులకు ఎన్నికల్లో ఎదురుదెబ్బInternationalSwechaa10 Nov 2026, 12:04 AM

ట్రంప్ కు షాక్.. నెతన్యాహుకు సవాల్! యుద్ధోన్మాదులకు ఎన్నికల్లో ఎదురుదెబ్బ

ఇరాన్‌పై అమెరికా, ఇజ్రాయెల్ చేపట్టిన యుద్ధం ఎలాంటి ఫలితాలను ఇచ్చింది? శత్రు దేశంపై దాడులతో రాజకీయంగా బలపడాలనుకున్న నాయకులకు సొంత దేశాల్లోనే ప్రజలు షాక్ ఇచ్చారా? అమెరికాలో ట్రంప్ పార్టీకి ఎదురైన ఘోర పరాజయం, ఇజ్రాయెల్‌లో నెతన్యాహూకు ఎదురైన రాజకీయ సవాళ్లు ఇప్పుడు అంతర్జాతీయ రాజకీయాల్లో చర్చనీయాంశంగా మారాయి.

రంగారెడ్డి జిల్లా కలెక్టర్‌కు 6 నెలల జైలుశిక్ష.. హైకోర్టు సంచలన తీర్పుతెలంగాణSwechaa09 Nov 2026, 10:50 PM

రంగారెడ్డి జిల్లా కలెక్టర్‌కు 6 నెలల జైలుశిక్ష.. హైకోర్టు సంచలన తీర్పు

TG: న్యాయస్థానం ఇచ్చిన స్పష్టమైన ఉత్తర్వులను బేఖాతరు చేసిన వ్యవహారంలో తెలంగాణ హైకోర్టు సంచలన తీర్పునిచ్చింది. కోర్టు ఆదేశాలను ఉల్లంఘించిన కేసులో కోర్టు ధిక్కరణకు పాల్పడినట్లు నిర్ధారించింది జస్టిస్ కె.లక్ష్మణ్ నేతృత్వంలోని ధర్మాసనం. రంగారెడ్డి జిల్లా కలెక్టర్ సి.నారాయణరెడ్డికి 6 నెలల సాధారణ జైలుశిక్షతో పాటు 6 వేల రూపాయల జరిమానా విధిస్తూ తీర్పునిచ్చింది. కాగా, అప్పీలు చేసుకునేందుకు అవకాశం కల్పిస్తూ శిక్ష అమలును నాలుగు వారాల పాటు నిలిపివేసింది.

Zodiac Predictions: ఈ ఏడాది ముగిసేలోగా ఆ రాశులకు డేంజర్ బెల్స్! వారు జర భద్రం..SpiritualitySwechaa09 Nov 2026, 10:15 PM

Zodiac Predictions: ఈ ఏడాది ముగిసేలోగా ఆ రాశులకు డేంజర్ బెల్స్! వారు జర భద్రం..

Zodiac Predictions: మరో యాభై రోజుల్లో ఈ సంవత్సరం ముగియనుంది. అయితే గ్రహాల కదలికల ప్రకారం ఈ మిగిలిన సమయం కొన్ని రాశుల వారికి తీవ్ర గడ్డుకాలంగా మారబోతోంది. వివాదాలు, ఆస్తి తగాదాలు, శత్రుత్వాలు, కోర్టు కేసులను సూచించే 'షష్ట స్థానం' (6వ ఇల్లు), ఆ స్థానాధిపతుల గోచార ప్రభావం ఏమాత్రం అనుకూలంగా లేదు. దీనివల్ల ఆరు రాశుల జాతకులకు ప్రమాద ఘంటికలు మోగుతున్నాయని జ్యోతిష్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఏమాత్రం ఏమరపాటుగా ఉన్నా నష్టాల ఊబిలో కూరుకుపోయే ప్రమాదం ఉందని హెచ్చరిస్తున్నారు.

Abhijeet Deepke: తమ చావును తామే కొనితెచ్చుకుంటున్నారు.. ఢిల్లీ జనంపై అభిజీత్ దీప్కే ఫైర్!NationalSwechaa09 Nov 2026, 09:34 PM

Abhijeet Deepke: తమ చావును తామే కొనితెచ్చుకుంటున్నారు.. ఢిల్లీ జనంపై అభిజీత్ దీప్కే ఫైర్!

Abhijeet Deepke: దీపావళి వేడుకల అనంతరం దేశ రాజధాని ఢిల్లీ, ఆర్థిక రాజధాని ముంబై నగరాలు తీవ్ర విషవాయువుల కోరల్లో చిక్కుకున్నాయి. రూల్స్ బేఖాతరు చేస్తూ అర్ధరాత్రి దాటిన తర్వాత కూడా విచ్చలవిడిగా బాణసంచా పేల్చడంతో రెండు మహానగరాలు గ్యాస్ ఛాంబర్లుగా మారిపోయాయి. గాలి నాణ్యత పూర్తిగా ప్రమాదకర స్థాయికి పడిపోవడంతో నగరవాసులు శ్వాస తీసుకోలేక, కళ్లు మండి ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు. ఈ దారుణ పరిస్థితులపై కాక్రోచ్ జనతా పార్టీ వ్యవస్థాపకుడు అభిజీత్ దీప్కే సోషల్ మీడియా వేదికగా నిప్పులు చెరిగారు. ప్రజల విచక్షణారహిత ప్రవర్తనను ఎండగడుతూ ఆయన చేసిన కామెంట్స్ ఇప్పుడు తీవ్ర దుమారం రేపుతున్నాయి.

TG: కేసీఆర్‌ పాలమూరు ప్రజల గుండెల మీద తన్నాడు.. సీఎం రేవంత్‌ ఆగ్రహంతెలంగాణSwechaa09 Nov 2026, 09:25 PM

TG: కేసీఆర్‌ పాలమూరు ప్రజల గుండెల మీద తన్నాడు.. సీఎం రేవంత్‌ ఆగ్రహం

TG: పాలమూరు ఎంపీగా గెలిచి, తెలంగాణ ఉద్యమానికి ఊపిరిపోసిన ఈ నేల రుణం తీర్చుకుంటాడని నమ్మితే.. కేసీఆర్ పాలమూరు ప్రజల గుండెలపై తన్ని గజ్వేల్‌కు పారిపోయాడని సీఎం రేవంత్‌రెడ్డి నిప్పులు చెరిగారు. వికారాబాద్ జిల్లా హకీంపేట్‌లో నిర్వహించిన ‘రైతన్నతో ఆత్మీయ సభ’ వేదికగా బీఆర్‌ఎస్ అధినేతపై తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. పాలమూరు గడ్డ నుంచి పోటీ చేసి కేసీఆర్ సీఎంగా గెలవాలని ఇక్కడి ప్రజలు ఆశపడితే, ఆయన మాత్రం జిల్లాను నిలువునా మోసం చేశారని మండిపడ్డారు.పాలమూరు బిడ్డల వలసల గోసపై రేవంత్‌రెడ్డి భావోద్వేగంగా స్పందించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఈ ప్రాంతం నుంచి ఎందరో మంత్రులు వచ్చినా పాలమూరు నుంచి వలసలు మాత్రం ఆగలేదని, 75 ఏళ్లలో ఈ ప్రాంతానికి న్యాయం చేసిన నాథుడే కరువయ్యారని ఆవేదన వ్యక్తం చేశారు. నాడు ఉద్యమ సమయంలో మక్తల్-నారాయణపేట ప్రాజెక్టును తెరపైకి తెచ్చి, అధికారంలోకి వచ్చాక దాన్ని అటకెక్కించారని కేసీఆర్‌పై విరుచుకుపడ్డారు.

దేశంలోనే తెలంగాణ రాష్ట్రాన్ని అగ్రస్థానంలో నిలుపుదాంరాజకీయాలుSwechaa09 Nov 2026, 09:13 PM

దేశంలోనే తెలంగాణ రాష్ట్రాన్ని అగ్రస్థానంలో నిలుపుదాం

Gaddam Prasad Kumar: కొడంగల్ గడ్డపై 9వేల 500కోట్ల రూపాయలతో వివిధ అభివృద్ధి పనులకు ప్రారంభోత్సవాలు జరగడం చాలా ఆనందంగా ఉందన్నారు అసెంబ్లీ స్పీకర్, వికారాబాద్ ఎమ్మెల్యే గడ్డం ప్రసాద్ కుమార్. ఇది క‌దా అభివృద్ధి అంటే అని ఆయన అన్నారు. ఇది కొడంగల్ చరిత్రలో నిలిచిపోయే ఘట్టం అని అభివర్ణించారు. వికారాబాద్ జిల్లా కొడంగల్ నియోజకవర్గం లగచర్ల ఇండస్ట్రియల్ కారిడార్‌లో ఎకో-పామ్ ఫ్యాక్టరీకి శ్రీకారం చుట్టారు సీఎం రేవంత్ రెడ్డి. అనంతరం రైతు బహిరంగ సభలో పాల్గొన్నారు. సీఎం రేవంత్ వెంట స్పీకర్ గడ్డం ప్రసాద్ ఉన్నారు.

జోగులాంబ గద్వాల జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం..క్రైమ్Swechaa09 Nov 2026, 08:36 PM

జోగులాంబ గద్వాల జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం..

Road Accident: జోగులాంబ గద్వాల జిల్లా ఇటిక్యాల మండలం వేముల స్టేజి సమీపంలో జాతీయ రహదారిపై ఘోర రోడ్డు ప్రమాదం సంభవించింది. ఎర్టిగా కారు వేముల స్టేజి వద్దకు రాగానే అదుపు తప్పి రహదారి పక్కనే ఉన్న ఇనుప రైలింగ్‌ను బలంగా ఢీకొట్టింది. నేపాల్ నుండి బెంగళూరుకు వెళ్తుండగా ఈ ప్రమాదం చోటుచేసుకుంది. ఈ ప్రమాదంలో కారులో ప్రయాణిస్తున్న వారిలో ఐదుగురికి తీవ్ర గాయాలయ్యాయి.

TG: తెలంగాణలో జనగణన 2027 షెడ్యూల్ ఇదే..తెలంగాణSwechaa09 Nov 2026, 08:32 PM

TG: తెలంగాణలో జనగణన 2027 షెడ్యూల్ ఇదే..

TG: తెలంగాణలో అధికారికంగా జనాభా లెక్కల సేకరణకు రంగం సిద్ధమైంది. రాష్ట్రవ్యాప్తంగా ‘జనగణన-2027’ నిర్వహణకు సంబంధించి ప్రభుత్వం తాజాగా కీలక ఉత్తర్వులు జారీ చేయడంతో పాటు సమగ్ర షెడ్యూల్‌ను ఖరారు చేసింది. కేంద్ర హోం శాఖ జారీ చేసిన మార్గదర్శకాల ప్రకారం రూపొందించిన ఈ నోటిఫికేషన్‌ను తెలంగాణ గెజిట్‌లో పునఃప్రచురించారు. ఎలాంటి పొరపాట్లకు తావులేకుండా క్షేత్రస్థాయిలో ఈ భారీ కసరత్తును పకడ్బందీగా పూర్తి చేయాలని ప్రభుత్వం అన్ని విభాగాల అధికారులను ఆదేశించింది.ఈసారి సాంకేతికతను జోడించి, ప్రజల భాగస్వామ్యంతో మూడు దశల్లో ఈ ప్రక్రియను చేపట్టనున్నారు. ఈ జనగణన ప్రక్రియను ప్రభుత్వం మూడు దశల్లో పూర్తి చేయనుంది. ఇందులో భాగంగా ముందుగా 2027 జనవరి 10 నుంచి 24 వరకు ప్రజలు తమ ఫోన్ లేదా కంప్యూటర్ ద్వారా కుటుంబ వివరాలను సొంతంగా ఆన్‌లైన్‌లో నమోదు చేసుకునే 'స్వీయ గణన'కు అవకాశం కల్పించారు.

TG: కాలం చెల్లిన ఏపీఐలను పీకేయండి: సీపీ సజ్జనార్తెలంగాణSwechaa09 Nov 2026, 08:23 PM

TG: కాలం చెల్లిన ఏపీఐలను పీకేయండి: సీపీ సజ్జనార్

TG: బ్యాంకులు, ఆర్థిక సంస్థలు, క్విక్ కామర్స్ ప్లాట్‌ఫామ్‌లలో యూజ్‌లో లేని పాత ఏపీఐలను (Application Programming Interface), కాలం చెల్లిన సాఫ్ట్‌వేర్లను తక్షణమే తొలగించాలని హైదరాబాద్ పోలీస్ కమిషనర్ వీసీ సజ్జనార్ ఆదేశించారు. ఆధునిక ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ) ఆధారిత సైబర్ దాడులు పెరుగుతున్న నేపథ్యంలో సంస్థల భద్రతా వ్యవస్థల్లోని లోపాలే నేరగాళ్లకు ప్రధాన ఆయుధాలుగా మారుతున్నాయని ఆయన హెచ్చరించారు. పాత ఏపీఐల గుండానే హ్యాకర్లు వ్యవస్థల్లోకి చొరబడుతున్నారని, వెంటనే వాటిని తొలగించకపోతే భారీ మూల్యం చెల్లించుకోక తప్పదని స్పష్టం చేశారు.సైబర్ ముఠాలు అత్యాధునిక ‘ఏఐ ఏజెంట్ల’ను ప్రయోగించి ఆర్థిక సంస్థల నెట్‌వర్క్‌లను జల్లెడ పడుతున్నాయని సీపీ వివరించారు. చాలా సంస్థలు పాత ఏపీఐ సర్వీసులను, అన్‌సెక్యూర్డ్ థర్డ్ పార్టీ మాడ్యూళ్లను అలాగే వదిలేస్తుండటంతో.. హ్యాకర్లు ఆ లోపాలను క్షణాల్లో పసిగడుతున్నారు.

Movie Updates: రామాయణం పోటీని తట్టుకొని దూసుకెళ్తున్న సూర్య 'సీన్'!సినిమాSwechaa09 Nov 2026, 07:18 PM

Movie Updates: రామాయణం పోటీని తట్టుకొని దూసుకెళ్తున్న సూర్య 'సీన్'!

Movie Updates: భారీ అంచనాలు.. వేల కోట్ల బడ్జెట్ ప్రచారం.. ఇదంతా పాన్ ఇండియా స్థాయిలో విడుదలైన 'రామాయణ' సినిమా గురించి చెప్పాలంటే. ఈ సినిమా ఒకవైపు ఉంటే, మరోవైపు కోలీవుడ్ స్టార్ హీరో సూర్య నటించిన 'సీన్' సినిమా పోటీలో నిలిచింది. సూర్య కూడా తనదైన శైలిలో బాక్సాఫీస్ వద్ద దూసుకెళుతున్నాడు. ఇంకా, రజినీకాంత్ జైలర్ 2 సినిమా థియేటర్స్‌లో సందడి చేస్తోంది. రామాయణ..ఇలా భారీ చిత్రాల పోటీ ఉన్నప్పటికీ ప్రేక్షకులను థియేటర్లకు రప్పిస్తూ సూర్య తన స్టార్‌డమ్‌ను మరోసారి నిరూపించుకుంటున్నారు.

Gold Rate India: గ్లోబల్ మార్కెట్‌లో పసిడి పతనం.. భారత్‌లో మాత్రం తగ్గని ధర!NationalSwechaa09 Nov 2026, 07:15 PM

Gold Rate India: గ్లోబల్ మార్కెట్‌లో పసిడి పతనం.. భారత్‌లో మాత్రం తగ్గని ధర!

Gold Rate India: అంతర్జాతీయ మార్కెట్‌లో బంగారం పరుగుకు ఊహించని బ్రేకులు పడ్డాయి. ప్రపంచవ్యాప్తంగా పసిడి ధరలు భారీగా కుప్పకూలుతున్నా.. భారత్‌లో మాత్రం బంగారం తన ‘రాయల్ లుక్’ను ఏమాత్రం తగ్గించుకోవడం లేదు. గ్లోబల్ మార్కెట్‌లో బంగారం విలువ ఏకంగా 24 శాతం మేర పతనమైనప్పటికీ, మన దేశంలో ఆ స్థాయిలో తగ్గుదల నమోదు కాకపోవడం ఆశ్చర్యానికి గురిచేస్తోంది. ప్రపంచ మార్కెట్లలో ధరలు నేలచూపులు చూస్తున్నా, భారతీయ కొనుగోలుదారుడికి మాత్రం పసిడి చౌకగా మారకపోవడం వెనుక పెద్ద ఆర్థిక సమీకరణాలే దాగున్నాయని అంటున్నారు. అవి ఏంటో ఈ స్పెషల్ స్టోరీలో తెలుసుకుందాం.

TG: మూసీ పేరుతో రూ.1,108 కోట్ల మళ్లింపు.. రేవంత్ సర్కార్‌పై గుడ్ గవర్నెన్స్ ఫైర్!తెలంగాణSwechaa09 Nov 2026, 06:39 PM

TG: మూసీ పేరుతో రూ.1,108 కోట్ల మళ్లింపు.. రేవంత్ సర్కార్‌పై గుడ్ గవర్నెన్స్ ఫైర్!

TG: మూసీ ప్రక్షాళన, సుందరీకరణ ప్రాజెక్టు పేరుతో తెలంగాణ ప్రభుత్వం తీసుకున్న ఓ నిర్ణయం ఇప్పుడు తీవ్ర దుమారం రేపుతోంది. మూసీ పునరుజ్జీవనం ముసుగులో ఏకంగా రూ.1,108.27 కోట్ల ప్రజాధనాన్ని ఓ దేవాలయ కాంప్లెక్స్ నిర్మాణానికి మళ్లించారంటూ ‘ఫోరం ఫర్ గుడ్ గవర్నెన్స్’ రేవంత్ రెడ్డి సర్కార్‌పై తీవ్రస్థాయిలో విరుచుకుపడింది. రాష్ట్ర ఖజానా ఆర్థిక సంక్షోభంలో కొట్టుమిట్టాడుతుంటే, ప్రజాధనాన్ని ఇలా దారి మళ్లించడం దారుణమంటూ నిలదీసింది. ఈ నిధుల కేటాయింపును తక్షణమే రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ మూసీ రివర్‌ఫ్రంట్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ లిమిటెడ్ బోర్డుకు లేఖ రాయడంతో సచివాలయ వర్గాల్లో ఒక్కసారిగా అలజడి రేగింది.

2లక్షలు లంచం తీసుకుంటూ ఏసీబీకి చిక్కిన ఎస్ఐక్రైమ్Swechaa09 Nov 2026, 06:14 PM

2లక్షలు లంచం తీసుకుంటూ ఏసీబీకి చిక్కిన ఎస్ఐ

ACB: మేడ్చల్ జిల్లా కీసర పోలీస్ స్టేషన్ అవినీతికి కేరాఫ్ గా మారింది. కీసర పోలీస్ స్టేషన్ లో మరో అవినీతి ఘటన వెలుగులోకి వచ్చింది. మొన్న సీఐ లంచం తీసుకుంటూ దొరికిపోయాడు. అది మరువక ముందే ఇప్పుడు ఎస్ఐ చేయి చాచి దొరికిపోయాడు. 2లక్షల లంచం తీసుకుంటూ ఏసీబీకి రెడ్ హ్యాండెడ్ గా దొరికిపోయాడు ఎస్ఐ శ్రీనివాస్.

చీటింగ్, వరకట్నం వేధింపుల కేసులో బాధితుల నుంచి ఎస్ఐ 5లక్షలు లంచం డిమాండ్ చేసినట్లు ఆరోపణలు ఉన్నాయి. ఇక, తొందరగా ఛార్జిషీట్ దాఖలు చేసేందుకు కూడా లంచం అడిగినట్లు శ్రీనివాస్ పై ఆరోపణలు వచ్చాయి. అంత డబ్బు ఇచ్చుకోలేనని బాధితుడు చెప్పడంతో.. 2లక్షలకు బేరం కుదుర్చుకున్నాడు ఎస్ఐ శ్రీనివాస్. లంచం ఇవ్వాలని పదే పదే కాల్స్ చేసి డిమాండ్ చేశాడు. ఎస్ఐ వేధింపులు తాళలేకపోయిన బాధితుడు ఏసీబీని ఆశ్రయించాడు.

American Politics: చరిత్రలో ఎన్నడూ లేనంత వెనక్కి అమెరికా?InternationalSwechaa09 Nov 2026, 06:06 PM

American Politics: చరిత్రలో ఎన్నడూ లేనంత వెనక్కి అమెరికా?

merican Politics: అగ్రరాజ్యం అమెరికా రాజకీయాల్లో మిడ్‌టర్మ్ ఎన్నికల ఫలితాలు సరికొత్త ప్రకంపనలు సృష్టిస్తున్నాయి. ఈ ఎన్నికల తీర్పుపై మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ చేసిన కామెంట్స్ ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా దుమారానికి దారితీశాయి. తాజా ఫలితాలు యావత్ అమెరికాను చరిత్రలో ఎన్నడూ లేనంతగా దశాబ్దాల వెనక్కి నెట్టేశాయని ఆయన తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. తన సొంత సోషల్ మీడియా వేదికైన ‘ట్రూత్ సోషల్’ వేదికగా ఆయన పెట్టిన సుదీర్ఘ పోస్ట్ ప్రస్తుతం అమెరికా రాజకీయాలను, ఆర్థిక వర్గాలను కుదిపేస్తోంది.మిడ్‌టర్మ్ ఎన్నికల ఫలితాలు వెలువడిన వెంటనే అమెరికన్ స్టాక్ మార్కెట్లు ఒక్కసారిగా కుప్పకూలడం తీవ్ర చర్చనీయాంశంగా మారింది. ఇన్వెస్టర్లలో నెలకొన్న భయాలు, అనిశ్చితి వల్లే వాల్‌స్ట్రీట్ మార్కెట్లలో భారీ పతనం నమోదైందని ట్రంప్ నేరుగా వేలెత్తి చూపారు.

Tollywood: సుబ్రహ్మణ్య స్వామి కథ లో మార్పులు చేస్తున్న త్రివిక్రమ్..సినిమాSwechaa09 Nov 2026, 05:27 PM

Tollywood: సుబ్రహ్మణ్య స్వామి కథ లో మార్పులు చేస్తున్న త్రివిక్రమ్..

Tollywood: టాలీవుడ్‌లో తనదైన మాటల మాయాజాలంతో, విభిన్నమైన కథా రచనతో ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకున్న దర్శకుడు త్రివిక్రమ్ శ్రీనివాస్. ఇటీవలే, ఆయన వెంకటేష్ హీరోగా ఆదర్శకుటుంబం సినిమాను రూపొందించారు. ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద ఆశించిన విజయాన్ని అందుకోలేదు. ఈ నేపథ్యంలో నెక్స్ట్ ప్రాజెక్ట్ మీద గురూజీ ఫోకస్ చెశాడు.

ఎండుతున్న పంటలు.. మంచిర్యాలలో సాగునీటి కోసం రోడ్డెక్కిన రైతులుతెలంగాణSwechaa09 Nov 2026, 05:12 PM

ఎండుతున్న పంటలు.. మంచిర్యాలలో సాగునీటి కోసం రోడ్డెక్కిన రైతులు

Farmers Protest: తెలంగాణలో సాగునీటి కష్టాలు పెరుగుతున్నాయి. సాగునీటి కోసం అన్నదాతలు తీవ్ర ఆందోళన చెందుతున్నారు. చేతికి అందివచ్చిన పంట.. నీరు లేక ఎండిపోయే పరిస్థితి వచ్చిందని వాపోతున్నారు. మంచిర్యాల జిల్లాలో రైతులు సాగునీటి కోసం రోడ్డెక్కారు. జన్నారం మండలం తపాలాపూర్ అటవీ చెక్ పోస్ట్ సమీపంలో ప్రధాన రహదారిపై రాస్తారోకో నిర్వహించారు. రాంపూర్, తపాలాపూర్, తిమ్మాపూర్, తాలపేట రైతులు ఈ ధర్నాలో పాల్గొన్నారు. దాదాపు 3 గంటల పాటు ధర్నా చేశారు. రైతుల ఆందోళనతో రహదారిపై భారీగా వాహనాలు నిలిచిపోయాయి.

విచారణకు రండి.. వీసీ అల్డాస్ జానయ్యకు మహిళా కమిషన్ నోటీసులుతెలంగాణSwechaa09 Nov 2026, 03:58 PM

విచారణకు రండి.. వీసీ అల్డాస్ జానయ్యకు మహిళా కమిషన్ నోటీసులు

మహిళా ప్రొఫెసర్లను లైంగికంగా వేధించారని ఆరోపణలు ఎదుర్కొంటున్న ఘటనలో రాజేంద్రనగర్ అగ్రికల్చర్ యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్‌ అల్డాస్ జానయ్యకు మహిళా కమిషన్ నోటీసులు ఇచ్చింది. విచారణకు రావాలని అందులో పేర్కొంది. అల్డాస్ జానయ్య లైంగికంగా వేధించాడని మహిళా ప్రొఫెసర్ చేసిన ఫిర్యాదు మేరకు తెలంగాణ స్టేట్ ఉమెన్ కమిషన్ నోటీసులు జారీ చేసినట్టు తెలిసింది. కాగా, ప్రొఫెసర్ ఆచార్య జయశంకర్ వ్యవసాయ విశ్వవిద్యాలయం వీసీ ప్రొఫెసర్ అల్తాస్ జానయ్య తనను లైంగికంగా వేధిస్తున్నాడని అసిస్టెంట్ ప్రొఫెసర్ తేజశ్రీ ఆరోపించిన విషయం తెలిసిందే. పీహెచ్‌డీ డిప్యూటేషన్ పొడిగింపు అనుమతి కోసం వీసీ వద్దకు వెళ్తే అనుచితంగా ప్రవర్తించడమే కాకుండా లైంగిక వేధింపులకు గురిచేశారని శనివారం ఆమె సొమాజిగూడ ప్రెస్‌క్లబ్‌లో సంచలన ఆరోపణలు చేశారు. అర్ధరాత్రి ఫోన్ కాల్స్ చేసేవారని, వ్యక్తిగతంగా తనను కలవాలని, భర్తను వదిలి తనతో ఉండాలని ఒత్తిడి చేస్తున్నారని కంటతడి పెట్టారు.

నల్లగా ఉన్నావని భర్త వేధింపులు.. భార్య ఏం చేసిందంటే?క్రైమ్Swechaa09 Nov 2026, 03:35 PM

నల్లగా ఉన్నావని భర్త వేధింపులు.. భార్య ఏం చేసిందంటే?

దాంపత్య జీవితంలో వేధింపులు, అవమానాలు తాళలేక మరో వివాహిత షాకింగ్ నిర్ణయం తీసుకుంది. పెళ్లయిన నాటి నుంచి అటు భర్త అండగా లేకపోవడంతో పాటు పదే పదే రంగు గురించి అవహేళన చేయడం, అవమానించడం, అత్తమామలు సైతం కేర్ చేయకపోవడంతో ఆ వివాహిత ఎవరూ ఊహించని నిర్ణయం తీసుకుంది. ఫలితంగా ఆమె కుటుంబసభ్యులు పోలీసులను ఆశ్రయించారు. వివరాల్లోకివెళితే.. ఈ ఏడాది ఫిబ్రవరి నెలలో గోపాల్ మిశ్రా అనే వ్యక్తితో రుచి మిశ్రాకు వివాహం జరిగింది. అయితే, పెళ్లయిన నాటి నుంచి నల్లగా ఉన్నావని ఆమె భర్త వేధింపులకు గురిచేయసాగాడు.దీనికి తోడు వరకట్న వేధింపులకు సైతం గురిచేసినట్టు సమాచారం.మొదటి నుంచి భర్త వ్యవహారం, అత్తింటి వారి వేధింపులను ఓపికగా భర్తిస్తూ వచ్చిన రుచి... టార్చర్ ఎక్కువ కావడంతో అత్తింటిలోనే ఉరివేసుకుని బలవన్మరణానికి పాల్పడింది.