స్వేచ్ఛ షార్ట్స్ — తాజా తెలుగు వార్తలు

కొడంగల్‌ అభివృద్ధిపై సీఎం రేవంత్‌ స్పెషల్‌ ఫోకస్‌.. అధికారులకు కీలక ఆదేశాలు!..తెలంగాణSwechaa04 Sep 2026, 10:24 PM

కొడంగల్‌ అభివృద్ధిపై సీఎం రేవంత్‌ స్పెషల్‌ ఫోకస్‌.. అధికారులకు కీలక ఆదేశాలు!..

కొడంగల్‌ అభివృద్ధిపై సీఎం రేవంత్‌రెడ్డి స్పెషల్‌ ఫోకస్‌ పెట్టారు. తన సొంత నియోజకవర్గంలో రెండు రోజుల పాటు విస్తృతంగా పర్యటిస్తున్న ముఖ్యమంత్రి.. అభివృద్ధి పనులను స్వయంగా పరిశీలిస్తూ.. వాటి పురోగతి, నాణ్యత, పూర్తయ్యే గడువుపై అధికారులను ఆరా తీస్తున్నారు.. రెండు రోజుల పర్యటనలో భాగంగా తొలిరోజు మద్దూరు, దౌలతాబాద్‌, దుద్యాల మండలాల్లో సీఎం పర్యటించారు.

అసెంబ్లీ ఎన్నికలే లక్ష్యంగా కేసీఆర్ బిగ్ ప్లాన్!!..తెలంగాణSwechaa04 Sep 2026, 10:00 PM

అసెంబ్లీ ఎన్నికలే లక్ష్యంగా కేసీఆర్ బిగ్ ప్లాన్!!..

తెలంగాణ రాజకీయాల్లో ఏర్పడుతున్న ఘటనలను తమకు అనుకూలంగా మలచుకొనేందుకు ప్రతిపక్షాలు వ్యూహాలు సిద్దం చేస్తున్నాయి. ఒకవైపు సీఎం రేవంత్ రెడ్డి ప్రతిపక్షాల ను టార్గెట్ చేస్తున్నారు. మరోవైపు బీజేపీ నాయకత్వం తెలంగాణ కేంద్రంగా కొత్త వ్యూహాల అమలుకు ప్రణాళికలు సిద్దం చేసినట్టు తెలుస్తుంది.. ఇదే సమయంలో కోన ఊపిరితో ఉన్న బీఆర్ఎస్ కు ప్రాణం పోయాడానికి కేసీఆర్ అనూహ్య నిర్ణయం తీసుకున్నట్టు వార్తలు వస్తున్నాయి..

Deepika: రియల్ లైఫ్ బేబీ బంప్‌తో రాకా షూట్‌లో దీపిక!సినిమాSwechaa04 Sep 2026, 09:58 PM

Deepika: రియల్ లైఫ్ బేబీ బంప్‌తో రాకా షూట్‌లో దీపిక!

Deepika Padukone: సినిమాలో హీరోయిన్స్ గనక గర్భిణిగా నటించాల్సి వస్తే ఆర్టిఫిషియల్ పెగ్నెన్సీ బంప్(బేబీ బంప్) తో నటిస్తారు. ఇలాంటి సన్నివేశాలలో పర్ఫార్మ్ చేయడం కూడా పెద్ద ఛాలెంజ్. పెళ్లి కాకుండా గర్భవతిగా ఫీలై నటించాల్సి వస్తే మహిళలకి పెద్ద టాస్క్ అని చెప్పాలి. కానీ, ఇలాంటి సీన్స్‌లో మన హీరోయిన్స్ చాలామంది జీవించారు.

Megastar-Kaaka: "కాకా" అప్‌డేట్..హైదరాబాద్‌లో లాంగ్ షెడ్యూల్సినిమాSwechaa04 Sep 2026, 09:35 PM

Megastar-Kaaka: "కాకా" అప్‌డేట్..హైదరాబాద్‌లో లాంగ్ షెడ్యూల్

Megastar-Kaaka: మెగాస్టార్ చిరజీవి నటిస్తున్న సినిమాలలో "కాకా" ఒకటి. బాబీ దర్శకత్వంలో ఈ సినిమా ఎంతో ప్రతిష్టాత్మకంగా రూపొందుతోంది. అగ్ర నిర్మాణ సంస్థ కేవీఎన్ ప్రొడక్షన్ భారీ బడ్జెట్‌తో నిర్మిస్తోంది. వెంకట్ కె నారాయణ నిర్మిస్తున్నారు. తాజా సమాచారం మేరకు ఈ సినిమాకి సంబందించిన లేటెస్ట్ షెడ్యూల్ హైదరాబాద్‌లో ప్రారంభం కాబోతోంది. ఇది, లాంగ్ షెడ్యూల్ అని తెలుస్తోంది.

కొండా సురేఖ స్థానంలో.. తెలంగాణ కేబినెట్‌లో లేడీ ఫైర్ బ్రాండ్?!..తెలంగాణSwechaa04 Sep 2026, 09:21 PM

కొండా సురేఖ స్థానంలో.. తెలంగాణ కేబినెట్‌లో లేడీ ఫైర్ బ్రాండ్?!..

తెలంగాణ కాంగ్రెస్ రాజకీయాలు కొత్త మలుపు తీసుకున్నాయి. కొండా సురేఖ ను కేబినెట్ నుంచి బర్తరఫ్ చేసిన తరువాత కొత్త లెక్కలు తెర మీదకు వస్తున్నాయి. సురేఖ స్థానంలో మంత్రిగా మహిళకే అవకాశం ఇవ్వాలనే ఆలోచనలో హైకమాండ్ ఉన్నట్టు వార్తలు వస్తున్నాయి.. మరోవైపు కేబినెట్ విస్తరణకు గ్రీన్ సిగ్నల్ ఇస్తూనే హైకమాండ్ కొన్ని సూచనలు చేసినట్లు సమాచారం. సురేఖ పైన వేటు వేస్తూనే.. ఒకే సారి ముగ్గురు మహిళలకు పదవులు కట్టబెట్టడం వెనుక రాజకీయ వ్యూహం ఉన్నట్టు చర్చించుకుంటున్నారు.

కేసీఆర్ పై సంచలన వ్యాఖ్యలు చేసిన మంత్రి వివేక్!..తెలంగాణSwechaa04 Sep 2026, 08:25 PM

కేసీఆర్ పై సంచలన వ్యాఖ్యలు చేసిన మంత్రి వివేక్!..

తెలంగాణ రాజకీయాల్లో మరోసారి కేటీఆర్ నాయకత్వంపై విమర్శలు హాట్‌టాపిక్‌గా మారుతున్నాయి. ఈ నేపథ్యంలో రాష్ట్ర మంత్రి వివేక్ వెంకటస్వామి ఆయనపై నిప్పులు చెరిగారు. కేటీఆర్ ఒక ఫెయిల్డ్ లీడర్ అని.. ఆయన అసమర్థత వల్లే అసెంబ్లీ, పార్లమెంట్, పంచాయతీ, మున్సిపల్ ఎన్నికల్లో బీఆర్ఎస్ ఘోరంగా ఓడిపోయిందని ధ్వజమెత్తారు. పదేండ్ల కేసీఆర్ పాలన అంతా అవినీతిమయమైందని విమర్శించారు. మంచిర్యాల జిల్లా పర్యటనలో ఉన్న మంత్రి వివేక్ మీడియాతో మాట్లాడుతూ.. కాంగ్రెస్ పార్టీలో ఎలాంటి విభేదాలు లేవని, అందరం కలిసికట్టుగా పనిచేస్తున్నామని స్పష్టం చేశారు.

6న కాంగ్రెస్ మహా ధర్నా.. కేసీఆర్ రాజీనామా చేయాలని డిమాండ్Swechaa04 Sep 2026, 08:15 PM

6న కాంగ్రెస్ మహా ధర్నా.. కేసీఆర్ రాజీనామా చేయాలని డిమాండ్

తెలంగాణలో రాజకీయాలు వేడెక్కాయి. అధికార కాంగ్రెస్, బీఆర్ఎస్ నేతలు ఒకరినొకరు టార్గెట్ చేసుకుంటున్నారు. కాంగ్రెస్ వెయ్యి రోజుల పాలనపై బీఆర్ఎస్ నిరసన కార్యక్రమాలు చేస్తుంటే.. అందుకు కౌంటర్ గా కాంగ్రెస్.. కేసీఆర్ ను టార్గెట్ చేసింది. కేసీఆర్ ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయాలనే డిమాండ్ ను తెరపైకి తెచ్చారు సీఎం రేవంత్ రెడ్డి. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన ఈ వెయ్యి రోజుల్లో.. కేసీఆర్ ఫామ్ హౌస్ కే పరిమితం అయ్యారని, ప్రజా సమస్యలపై ఒక్క రోజు కూడా మాట్లాడలేదని, అసెంబ్లీ సమావేశాలకు కూడా రావడం లేదని రేవంత్ రెడ్డి మండిపడ్డారు. ఈ క్రమంలో మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ తన ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయాలని కాంగ్రెస్ డిమాండ్ చేస్తోంది. ఈ మేరకు ఈ నెల 6న హైదరాబాద్‌ ఇందిరాపార్క్ ధర్నా చౌక్ వద్ద తెలంగాణ కాంగ్రెస్‌ ఆధ్వర్యంలో మహా ధర్నా నిర్వహించనున్నారు.

అసెంబ్లీ సమావేశాలు.. ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలకు కేసీఆర్ కీలక ఆదేశాలుSwechaa04 Sep 2026, 07:50 PM

అసెంబ్లీ సమావేశాలు.. ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలకు కేసీఆర్ కీలక ఆదేశాలు

సెప్టెంబర్ 7 నుండి శాసన సభా సమావేశాలు ప్రారంభం కానున్నాయి. ఈ నేపథ్యంలో బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ కీలక నిర్ణయం తీసుకున్నారు. బీఆర్ఎస్ పార్టీ శాసనసభా పక్ష సమావేశం నిర్వహించాలని నిర్ణయించారు. సెప్టెంబర్ 6న ఎర్రవెల్లి నివాసంలో కేసీఆర్ అధ్యక్షతన పార్టీ శాసన సభ్యులు, శాసన మండలి సభ్యులతో సంయుక్త సమావేశం నిర్వహించనున్నారు. మధ్యాహ్నం 1గంటకు లంచ్ అనంతరం మధ్యాహ్నం 2 గంటలకు సమావేశం ప్రారంభం అవుతుంది. ఈ సమావేశానికి హాజరుకావాలని బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలకు కేసీఆర్ ఆదేశాలు జారీ చేశారు. అసెంబ్లీ సమావేశాల్లో అనుసరించాల్సిన వ్యూహాలపై నేతలతో చర్చించనున్నారు గులాబీ బాస్. అసెంబ్లీ సమావేశాల్లో ఏ విధంగా ముందుకు వెళ్లాలి అనేదానిపై దిశానిర్దేశం చేయనున్నారు.

కొండా సురేఖకు కచ్చితంగా అవకాశం ఇస్తాంతెలంగాణSwechaa04 Sep 2026, 04:46 PM

కొండా సురేఖకు కచ్చితంగా అవకాశం ఇస్తాం

Mahesh Kumar Goud: కొండా సురేఖ బర్తరఫ్ అంశంపై టీపీసీసీ అధ్యక్షుడు మహేశ్ కుమార్ గౌడ్ స్పందించారు. కీలక వ్యాఖ్యలు చేశారు. కొండా సురేఖ బర్తరఫ్ కొంత బాధాకరమే అయినప్పటికీ.. కాంగ్రెస్ పార్టీలో క్రమశిక్షణ ఉల్లంఘిస్తే ఎంతటి వారైనా కఠిన చర్యలు ఉంటాయని మహేశ్ కుమార్ గౌడ్ స్పష్టం చేశారు. కొండా సురేఖ తీరు ఆక్షేపణీయంగా ఉన్నందునే ఆమెపై చర్యలు తీసుకోవడం జరిగిందన్నారు. తాను కాంగ్రెస్ లోనే కొనసాగుతానని కొండా సురేఖ చెప్పారన్న మహేశ్ కుమార్ గౌడ్.. కాంగ్రెస్ లో కంటిన్యూ అయితే ఆమెకు అవకాశం ఇస్తామన్నారు. నిన్న కొండా సురేఖ కొంత ఆవేశం, ఆవేదనతో మాట్లాడారన్న మహేశ్ కుమార్ గౌడ్.. ఇకపై కొండా సురేఖ అలా మాట్లాడకూడదని సూచించారు.

కొండా సురేఖ సరే.. పొంగులేటి బర్తరఫ్ ఎప్పుడు?- హరీశ్ రావుతెలంగాణSwechaa04 Sep 2026, 03:59 PM

కొండా సురేఖ సరే.. పొంగులేటి బర్తరఫ్ ఎప్పుడు?- హరీశ్ రావు

Harish Rao: బీఆర్ఎస్ అధినేత, మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ భూములు ఇస్తే.. ఇప్పటి సీఎం రేవంత్ రెడ్డి వాటిని లాక్కుంటున్నారని మాజీ మంత్రి హరీశ్ రావు మండిపడ్డారు. రైతుల జీవితాలతో రేవంత్ రెడ్డి ఆడుకుంటున్నారని హరీశ్ రావు ధ్వజమెత్తారు. అసెంబ్లీ వేదికగా 22ఏపై పోరాటం చేస్తామని ప్రకటించారు. సిర్పూర్ బీఆర్ఎస్ సభలో హరీశ్ రావు మాట్లాడారు.

కొండా సురేఖ బర్తరఫ్ అంశంపైనా హరీశ్ రావు స్పందించారు. సీఎం రేవంత్ ను తిట్టారని కొండా సురేఖ పై చర్యలు తీసుకున్నారని చెప్పారు. మరి నిషేధిత భూముల పేరుతో ప్రజలను పట్టిపీడిస్తున్న పొంగులేటిపై చర్యలు ఏవి? అని హరీశ్ రావు నిలదీశారు. రేవంత్ తో పొంగులేటికి ఏం పొత్తుందో చెప్పాలన్నారు.

మంత్రి పొంగులేటి కమీషన్ దందా : ఆర్ఎస్‌పీతెలంగాణSwechaa04 Sep 2026, 03:24 PM

మంత్రి పొంగులేటి కమీషన్ దందా : ఆర్ఎస్‌పీ

రాష్ట్రంలో 22 ఏ నిషేధిత జాబితా గురించి వివాదం నెలకొన్న నేపథ్యంలో ప్రతిపక్ష బీఆర్ఎస్.. అధికార కాంగ్రెస్ పార్టీ మీద మరోసారి తీవ్ర విమర్శలు గుప్పించింది. కమీషన్ల కోసమే రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి రాష్ట్రంలోని భూములను నిషేధిత జాబితాలో పెట్టించారని బీఆర్ఎస్ ప్రధాన కార్యదర్శి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ఆరోపించారు. రాష్ట్రంలో కమీషన్ల పాలన నడుస్తోందని తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. ‘మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి 22 A ద్వారా భూములను నిషేధిత జాబితాలో పెట్టి, సిగ్గులేకుండా టోల్‌ఫ్రీ నంబర్ పెట్టామని చెప్తున్నాడు. టోల్‌ఫ్రీ నంబర్‌కు ఫోన్ చేస్తే బాధితుల నంబర్లు తీసుకుని, ఒక వారం రోజులకు వాళ్లకు బ్రోకర్‌ గాళ్లు ఫోన్ చేస్తారు. నీకున్న భూమిలో కొంత మాకు రాసిస్తే, నీ భూమిని నిషేధిత జాబితా నుంచి తీసేస్తామని చెప్తారు. ప్రభుత్వ అధికారులకు కూడా తెలియకుండానే పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి భూభారతి ద్వారా మన భూములను వేరే వాళ్ల పేరిట రిజిస్ట్రేషన్ చేశాడు’అని ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ఆరోపించారు.

ప్రియురాలు ఐఫోన్ అడిగిందని అడ్డంగా బుక్కైన ప్రియుడుతెలంగాణSwechaa04 Sep 2026, 02:35 PM

ప్రియురాలు ఐఫోన్ అడిగిందని అడ్డంగా బుక్కైన ప్రియుడు

రాష్ట్రంలో ఓ వింత ఘటన చోటుచేసుకుంది. ప్రియురాలి కోరిక తీర్చడం కోసం ఓ యువకుడు తన జీవితాన్ని రిస్కులో పడేసుకున్నాడు. ఫలితంగా జైలు ఊచలు లెక్కబెట్టాల్సిన పరిస్థితి నెలకొంది. కొందరు తెలిసి తెలియని వయసులో చేసే చిన్న తప్పులు వారిపై నేరస్తుడు అనే ముద్ర పడేలా చేస్తున్నది. ఈ మధ్యకాలంలో రాష్ట్రంలో మత్తు వినియోగం భారీగా పెరిగింది. విద్యార్థులే అత్యధికంగా మత్తుకు బానిస అవుతున్నారని పలువురు సోషల్ మీడియా వేదికగా ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కొందరు మత్తుకు బానిసలుగా మారుతుంటే.. మరికొందరు ఈజీ మనీ కోసం మాదకద్రవ్యాలు సరఫరా చేసే వృత్తిని ఎంచుకుంటున్నట్టు తెలుస్తోంది.ప్రియురాలు ఐఫోన్ కావాలని కోరడంతో ఆమె కోరిక తీర్చేందుకు ఓ యువకుడు గంజాయి సప్లయర్‌గా అవతారమెత్తాడు. వివరాల్లోకి వెళితే.. పెద్దపల్లి జిల్లాకు చెందిన మిత్ర చైతన్య.. హేమలత ఇద్దరూ ప్రేమించుకుంటున్నారు. అయితే, ప్రియురాలు ఐఫోన్ కావాలని కోరడంతో ఒడిశాకు వెళ్లి రూ.16 వేలకు 12 కేజీల గంజాయి కొనుగోలు చేసిన చైతన్య.. హైదరాబాద్‌కు వస్తున్న క్రమంలో పోలీసులకు చిక్కాడు. ఆ సమయంలో అతని ప్రియురాలు కూడా ఉన్నట్టు సమాచారం.

నిరీక్షణ ముగిసింది..  బాంబ్‌పేల్చిన కొండా సురేఖరాజకీయాలుSwechaa04 Sep 2026, 02:13 PM

నిరీక్షణ ముగిసింది.. బాంబ్‌పేల్చిన కొండా సురేఖ

మంత్రి పదవి నుంచి బర్తరఫ్‌కు గురైన కొండా సురేఖ వరుసగా మాటల తూటాలు పేలుస్తూనే ఉన్నారు. సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉంటూ మీడియాకు సైతం ఇంటర్వ్యూలు ఇస్తున్నారు. మంత్రి పదవి నుంచి బర్తరఫ్ అయ్యాక ఆమె కొంతకాలం పాటు మౌనంగా ఉండిపోతారని అంతా భావించారు. కానీ, అందుకు భిన్నంగా కొండా సురేఖ దూకుడుగా వ్యవహరిస్తున్నారు. మంత్రి పదవి పోయినందుకు బాధగా ఉన్నా దానిని ఎక్కడా కనిపించకుండా జాగ్రత్త పడుతున్నారు. తాజాగా మాజీ మంత్రి కొండా సురేఖ సోష‌ల్ మీడియా (ఫేస్‌బుక్‌)లో ఆస‌క్తిక‌ర పోస్టు పెట్టారు. ‘ఇక నిరీక్ష‌ణ ముగిసింది’ రాసుకొచ్చారు.త్వరలోనే బిగ్ అప్డేట్ ఉంటుందని, తెలంగాణ వేచి చూడాల‌ని పేర్కొన్నారు. అయితే, ముందస్తు సమాచారం ఇవ్వకుండా నిర్దాక్షిణ్యంగా పదవి నుంచి తొలగించడంతో కొండా సురేఖ తీవ్రంగా హర్ట్ అయినట్టు తెలిసింది. దాంతో కాంగ్రెస్ పార్టీలో కొనసాగాలా? వద్దా? అనే నిర్ణయం తీసుకోనున్నారని జోరుగా ప్రచారం సాగుతోంది..

అలా తగ్గి ఇలా పెరిగి.. మళ్లీ షాకిచ్చిన బంగారం ధరలువ్యాపారంSwechaa04 Sep 2026, 01:17 PM

అలా తగ్గి ఇలా పెరిగి.. మళ్లీ షాకిచ్చిన బంగారం ధరలు

పసిడి ధరలు దోబూచులాడుతున్నాయి. ఓ రోజు పెరగడం, మరోసారి తగ్గడం జరుగుతోంది. వినియోగదారులు సైతం ధరలు తగ్గినప్పుడు చూద్దాంలే అని అనుకునేలోపు మళ్లీ పెరుగుతున్నాయి. ప్రస్తుతం పెళ్లిళ్ల సీజన్ కావడంతో దేశవ్యాప్తంగా బంగారానికి భారీ డిమాండ్ ఏర్పడినట్టు సమాచారం. శుభాకార్యల సమయం కావడంతో ధరలు ఎక్కువైనా బంగారం కొనుగోలు చేసేందుకు కస్టమర్లు వెనుకాడటం లేదని తెలుస్తోంది. ఫలితంగా డిమాండ్‌కు తగ్గ సప్లయ్ లేకపోవడం వల్లే పసిడి ధరలు పెరుగుతున్నట్టు సమాచారం.ఇదిలాఉండగా, గత వారం రోజులు బంగారం ధరలు తగ్గడం, పెరగడం జరుగుతోంది. అయితే, హైదరాబాద్ బులియన్ మార్కెట్‌లో వరుసగా బంగారం ధరలు భారీగా పెరుగుతుండటంతో కొనుగోలుదారులు ఆందోళన చెందుతున్నట్టు తెలుస్తోంది.

కేసీఆర్ మంచి వారు.. ఆయన మాటంటే మాటే : కొండా సురేఖతెలంగాణSwechaa04 Sep 2026, 01:06 PM

కేసీఆర్ మంచి వారు.. ఆయన మాటంటే మాటే : కొండా సురేఖ

బీఆర్ఎస్ అధినేత, మాజీ సీఎం కేసీఆర్ గురించి మాజీ మంత్రి కొండా సురేఖ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.మంత్రి పదవి నుంచి ఆమెను సీఎం రేవంత్ రెడ్డి బర్తరఫ్ చేయడంతో పలు మీడియా సంస్థలకు వరుస ఇంటర్య్యూలు ఇస్తున్నారు. ఈ క్రమంలోనే కొండా సురేఖ మాజీ సీఎం కేసీఆర్ మీద చేసిన వ్యాఖ్యలు హాట్ టాపిక్ అయ్యాయి. తాజాగా ఓ మీడియా సంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూలో గతంలో జరిగిన రాజకీయ అనుభవాలు, ప్రస్తుతం ఎదుర్కొంటున్న విపత్కర పరిస్థితులపై కీలక వ్యాఖ్యలు చేస్తున్నారు. బీఆర్ఎస్ పార్టీలో ఉన్నప్పుడు కేసీఆర్ మీతో ఎలా ఉన్నారని ప్రశ్నించగా.. ఆయన చాలా మంచోడని సురేఖ పేర్కొన్నారు. ఎప్పుడైనా మంచిగా రిసీవ్ చేసుకునేవారని, చాలా హుందాగా వ్యవహరించేవారని వెల్లడించారు. ఎప్పుడు వెళ్లినా తమను ఎంతో గౌరవించారని, తమకు కేసీఆర్‌తో ఎప్పుడూ విభేదాలు రాలేదని స్పష్టంచేశారు.

సీఎంను ప్రశ్నించిందని.. మహిళా జర్నలిస్టుపై ఘోరంNationalSwechaa04 Sep 2026, 12:24 PM

సీఎంను ప్రశ్నించిందని.. మహిళా జర్నలిస్టుపై ఘోరం

దేశరాజధాని ఢిల్లీలో దారుణం చోటుచేసుకుంది.ఓ మహిళా జర్నలిస్టుపై ఢిల్లీ పోలీసులు తమ ప్రతాపం చూపించారు. బాధితురాలు తన విధినిర్వహణలో భాగంగా ఢిల్లీ సీఎం రేఖాగుప్తాను ప్రశ్నించడమే ఇందుకు కారణంగా తెలుస్తోంది. అయితే, ప్రశ్నించిన జర్నలిస్టు మీద పోలీసులు దాడి చేసిన ఘటన దేశరాజధానిలో హాట్ టాపిక్ అయ్యింది. పోలీసులు దాడి చేయడంతో మహిళా జర్నలిస్టు కింద పడిపోయినట్టు తెలిసింది.దీనికి సంబంధించిన విజువల్స్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. వివరాల్లోకివెళితే.. ఢిల్లీ సీఎం రేఖా గుప్తాను ‘4PM’ న్యూస్‌కి చెందిన షాహీన్ ఖాన్ అనే జర్నలిస్ట్ ప్రశ్నించడానికి ప్రయత్నించినట్టు సమాచారం. దాంతో ‘సీఎంనే ప్రశ్నించే స్థాయా నీది?’ అంటూ ఢిల్లీ పోలీసులు సదరు మహిళా జర్నలిస్ట్‌పై దాడికి పాల్పడినట్టు తెలుస్తోంది.

అక్కకు ఆస్తి రాదేమోనని..బావపై కిరాతకంక్రైమ్Swechaa04 Sep 2026, 12:01 PM

అక్కకు ఆస్తి రాదేమోనని..బావపై కిరాతకం

ఆస్తిలో తన అక్కకు ఎక్కడ వాటా రాకుండా పోతుందో అని సొంత బావను..బావమరిది సుపారీ ఇచ్చి మరీ హత్య చేయించాడు. ఈ ఘటన ఏపీలోని గుంటూరు జిల్లా తెనాలీలో చోటుచేసుకుంది. వివరాల్లోకివెళితే.. కోటి వీరనాగయ్య అనే వ్యక్తికి వివాహం జరిగింది. పిల్లలు కూడా ఉన్నారు. ఆయన వ్యాపారం చేస్తుంటాడు. అయితే, వేరే మహిళతో వివాహేతర సంబంధం కొనసాగిస్తున్నాడు. ఈ విషయం కాస్త ఆయన భార్య, బావమరిదికి తెలిసింది. పద్ధతి మార్చుకోవాలని పలుమార్లు వీరనాగయ్యను హెచ్చరించారు. బావ పేరిట ఉన్న ఆస్తి తన అక్క, పిల్లలకు ఎక్కడా దక్కకుండా పోతుందోనని భావించిన బావమరిది రాజేశ్.. బావ వీర నాగయ్య హత్యకు కుట్ర పన్నాడు. ఇందుకోసం రూ.4 లక్షలకు సుపారీ గ్యాంగ్‌తో ఒప్పందం కుదుర్చుకున్నాడు. ప్లాన్ ప్రకారం బావను కిడ్నాప్ చేయించి హత్య చేయించాడు.

అమెరికా తర్వాత బ్రిటన్‌కు మోహన్‌ భగవత్‌.. RSSపై రచ్చ ఎందుకు?InternationalSwechaa04 Sep 2026, 11:55 AM

అమెరికా తర్వాత బ్రిటన్‌కు మోహన్‌ భగవత్‌.. RSSపై రచ్చ ఎందుకు?

RSS ఇప్పుడు శతాబ్ది దశలోకి అడుగుపెడుతోంది. ఈ సమయంలో సంస్థ కార్యకలాపాలను భారత్‌ దాటి ప్రపంచవ్యాప్తంగా ఉన్న భారతీయ సమాజానికి మరింత చేరువ చేయాలనే ప్రయత్నం కనిపిస్తోంది. అమెరికా, కెనడా, బ్రిటన్‌ పర్యటనలు కూడా ఈ గ్లోబల్‌ ఔట్‌రీచ్‌లో భాగంగానే జరుగుతున్నాయి.

సీఎం రేవంత్‌ వద్దే ‘కొండా’ మంత్రిత్వ శాఖలుతెలంగాణSwechaa04 Sep 2026, 11:25 AM

సీఎం రేవంత్‌ వద్దే ‘కొండా’ మంత్రిత్వ శాఖలు

రాష్ట్ర రాజకీయాల్లో ‘కొండా సురేఖ’ఎపిసోడ్‌కు నిన్నటితో ఎండ్ కార్డు పడింది. గత కొంతకాలంగా ప్రచారం జరుగుతున్న విధంగానే కాంగ్రెస్ హైకమాండ్ కొండా సురేఖను మంత్రి పదవి నుంచి తప్పించాలని నిర్ణయించింది. సీఎం రేవంత్.. ఢిల్లీ నుంచి హైదరాబాద్‌కు వచ్చే క్రమంలోనే కొండాను కేబినెట్ నుంచి తప్పిస్తూ లోక్‌భవన్‌కు లేఖ రాశారు. హైదరాబాద్ వచ్చాక పలు కార్యక్రమాల్లో పాల్గొన్న అనంతరం సీఎం రేవంత్ .. గవర్నర్‌ శివప్రతాప్ శుక్లాను కలిసి కొండాను తప్పించడానికి గల కారణాలను వివరించడంతో గవర్నర్ ఆమోదం తెలిపారు. రాజ్యాంగంలోని ఆర్టికల్ 164(1) ప్రకారం సంక్రమించిన అధికారాలతో కొండా సురేఖను మంత్రివర్గం నుంచి తొలగిస్తూ లోక్‌భవన్ ఉత్తర్వులు జారీ చేసింది.కొండా బర్తరఫ్‌ నేపథ్యంలో ఆమె మొన్నటివరకు నిర్వహించిన అటవీ, దేవాదాయ శాఖలను సీఎం రేవంత్‌‌కు కేటాయిస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.

Prashanth Neel-Dragon: 'డ్రాగన్' లో మరో బాలీవుడ్ స్టార్స్..నీల్ టార్గెట్ అక్కడేనా?సినిమాSwechaa04 Sep 2026, 11:10 AM

Prashanth Neel-Dragon: 'డ్రాగన్' లో మరో బాలీవుడ్ స్టార్స్..నీల్ టార్గెట్ అక్కడేనా?

Prashanth Neel: మాన్ ఆఫ్ మాసెస్ ఎన్‌టిర్ నటిస్తున్న భారీ యాక్షన్ సినిమా డ్రాగన్ (ఇది వర్కింగ్ టైటిల్ మాత్రమే). కేజీఎఫ్, సలార్ చిత్రాల దర్శకుడు ప్రశాంత్ నీల్ ఈ సినిమాను ఎంతో ప్రతిష్ఠాత్మకంగా తెరకెక్కిస్తున్నాడు. హీరోయిన్‌గా రుక్మిణి వసంత్, బాలీవుడ్ సీనియర్ నటుడు అనిల్ కపూర్ కీలక పాత్రలో నటిస్తున్నారు. తాజా సమాచారం మేరకు ఇప్పుడు ఆలియా భట్, షాహిద్ కపూర్ కూడా కనిపించబోతున్నారట.

మళ్లీ ఢిల్లీకి రేవంత్‌.. కేబినెట్‌లో ‘బిగ్ ఛేంజ్‌’కు రంగం సిద్ధమా?తెలంగాణSwechaa04 Sep 2026, 10:43 AM

మళ్లీ ఢిల్లీకి రేవంత్‌.. కేబినెట్‌లో ‘బిగ్ ఛేంజ్‌’కు రంగం సిద్ధమా?

కొండా సురేఖ ఎపిసోడ్ తర్వాత తెలంగాణ రాజ‌కీయాలు ఒక్క‌సారిగా వేడెక్కాయి. సీఎం రేవంత్‌రెడ్డి మరోసారి ఢిల్లీకి వెళ్లనున్నారన్న సమాచారంతో మరింత ఆసక్తి ఏర్పడింది. కేబినెట్‌లో భారీ మార్పులు త‌ప్ప‌వా అనే టాక్ న‌డుస్తోంది.

‘తీజ్’ వేడుకల్లో ఘర్షణ.. JNTUలో కొట్టుకున్న విద్యార్థులుతెలంగాణSwechaa04 Sep 2026, 10:15 AM

‘తీజ్’ వేడుకల్లో ఘర్షణ.. JNTUలో కొట్టుకున్న విద్యార్థులు

హైదరాబాద్‌లోని జేఎన్‌టీయూ యూనివర్సిటీలో నిన్న రాత్రి ఉద్రిక్త వాతావరణం నెలకొంది. తీజ్ పండుగ వేడుకల నేపథ్యంలో విద్యార్థుల మధ్య ఘర్షణ నెలకొంది.ఈ క్రమంలోనే ఓ విద్యార్థిపై పలువురు విద్యార్థులు దాడులు చేయగా.. ఆ తర్వాత రెండు గ్రూపులుగా ఏర్పడి కొట్టుకున్నట్టు సమాచారం. ఇటీవలి కాలంలో జేఎన్‌టీయూ వర్సిటీ వరుస వివాదాలకు నిలయంగా మారుతోంది. నిన్న రాత్రి యూనివర్సిటీలో ‘తీజ్’ పండుగ వేడుకలు నిర్వహించేందుకు విద్యార్థులు ఏర్పాట్లు చేశారు. ఏర్పాట్లు పూర్తయ్యాక విద్యార్థులు ఆటపాటలతో సరదాగా గడిపినట్టు సమాచారం.ఈ క్రమంలోనే ఓ విద్యార్థితో పలువురు విద్యార్థులు వాగ్వాదానికి దిగినట్టు తెలుస్తోంది.వీరి గొడవకు ప్రేమ వ్యవహారమే కారణమని టాక్ వినిపిస్తోంది. అయితే, ముందుగా ఓ విద్యార్థిపై పలువురు విద్యార్థులు దాడికి పాల్పడ్డారు.

కొండా తీరు మారలేదు?.. బర్తరఫ్ చేసినా సింపతీ రాలేదు?టాప్ న్యూస్Swechaa04 Sep 2026, 09:40 AM

కొండా తీరు మారలేదు?.. బర్తరఫ్ చేసినా సింపతీ రాలేదు?

ముఖ్యమంత్రికి ఎదురు తిరిగితే అంతే సంగతులు అన్నట్లుగా రాష్ట్రంలో ఒకేసారి వాతవరణం మారిపోయింది. కొండా సురేఖ మొదటి నుంచి ఇంతే అన్నట్లుగా చిత్రీకరించడంతో ఆమెకు సానుభూతి రాలేదన్నట్లుగా కనిపిస్తుంది. ఆనాడు జగన్‌ను నమ్ముకుని రాజీనామా చేసినా పెద్దగా ప్రయోజనం పొందలేదు. ఆస్తుల విషయంలో ఇద్దరికి చెడిందనే ఆరోపణలు ఉన్నాయి. గతంలో పెద్దఎత్తున వైఎస్ బినామీగా ఉన్నారని టాక్. అందుకు జగన్ రూ.200 కోట్ల ఆస్తిని తీసేసుకోవడంతో అక్కడ లింకులు పోయాయని తెలిసింది.ఎంతో ఉండాల్సిన ఆప్యాయత కనిపించలేదు. ఇక కేసీఆర్ చేరదీసినా అక్కడ ఇంటి పోరుతో ఉక్కిరిబిక్కిరి అయ్యారు. దయాకర్ రావు రాగానే పూర్తిగా వ్యతిరేకంగా మారిపోయారు.

పోరాడితే పోయేదేముంది.. పొంగులేటి ప్రొహిబిటెడ్ తప్ప!..తెలంగాణSwechaa04 Sep 2026, 09:35 AM

పోరాడితే పోయేదేముంది.. పొంగులేటి ప్రొహిబిటెడ్ తప్ప!..

తెలంగాణలో భూ వివాదాలు ఓ పట్టున అర్ధం కావు. రాత్రికి రాత్రే కోటీశ్వరులు అవుతారు. ఇరుక్కుంటే దివాలా తీస్తారు. అలాంటి భూములపై నేరుగా సర్కారే ప్రజలను భయాందోళనకు గురి చేసి ఎలాంటి తప్పులు దొర్లని 14 లక్షల 25 వేల ఎకరాల భూములను ప్రొహిబిటెడ్‌లో పెట్టింది. దీంతో ప్రతి జిల్లాలో 40 వేల నుంచి 60 వేల ఎకరాల వరకు నిషేధంలోకి వెళ్లాయి. ఒక్క పటాన్ చెరులోనే 50 వేల ఎకరాలు ఉండడంతో హరీశ్ రావు పెద్ద ఎత్తున వెంటనే రియాక్ట్ అయ్యారు.

నియోజకవర్గాల వారీగా బాధితుల గోడు వినేందుకు రంగంలోకి దిగారు.

Trivikram Srinivas: సెకండ్ లీడ్‌కి అన్యాయం చేస్తున్నాడా?సినిమాSwechaa04 Sep 2026, 09:17 AM

Trivikram Srinivas: సెకండ్ లీడ్‌కి అన్యాయం చేస్తున్నాడా?

Trivikram: మాటల మాంత్రీకుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ తీస్తున్న సినిమాలలో పేరుకు రెండో హీరోయిన్ ఉంటుంది. కానీ, ఆమెకి ఎలాంటి ప్రాధాన్యం ఉండదని ఇప్పటికే చాలా సినిమాలలో ప్రూవ్ అయింది. సెకండ్ లీడ్ అని చెప్పే హీరోయిన్‌కి అసలు గురూజీ సినిమా వల్ల ఆశించిన సక్సెస్ గానీ, అవకాశాలు గానీ దక్కడం లేదు. కానీ, ఆయన మాత్రం పేరున్న హీరోయిన్‌నే తీసుకుంటున్నాడు.

భారత్ చేతిలో సూపర్ ఐ.. GSLV-F17 ప్రయోగం సక్సెస్!..NationalSwechaa04 Sep 2026, 08:42 AM

భారత్ చేతిలో సూపర్ ఐ.. GSLV-F17 ప్రయోగం సక్సెస్!..

భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ ఇస్రో ఖాతాలో మరొక సంచలనాత్మక విజయం నమోదైంది.. అంతరిక్షంలో జీఎస్‌ఎల్‌వీ-ఎఫ్17 (GSLV-F17) రాకెట్ ప్రయోగం విజయవంతంగా పూర్తయింది. ఈ ప్రయోగం ద్వారా 2,232 కిలోల బరువు కలిగిన అత్యాధునిక 'ఎర్త్ అబ్జర్వేషన్ శాటిలైట్' (EOS-09)ను మన శాస్త్రవేత్తలు కక్ష్యలోకి ప్రవేశపెట్టారు. జీఎస్‌ఎల్‌వీ సిరీస్‌లో ఇది ఇస్రోకు 17వ విజయవంతమైన మైలురాయి కావడం విశేషం.

Vishwambhara 2027: ఒక సంక్రాంతి కాదు ఇంకో సంక్రాంతి!సినిమాSwechaa04 Sep 2026, 08:36 AM

Vishwambhara 2027: ఒక సంక్రాంతి కాదు ఇంకో సంక్రాంతి!

Vishwambhara: మెగాస్టార్ చిరంజీవి సినిమా ఆలస్యం అవుతుందంటే అభిమానుల్లో విపరీతమైన అసహనం కలుగుతుంది. అప్‌డేట్స్ రాకపోతే కోపాలు కట్టలు తెంచుకుంటుంటాయి. కానీ, ఆ ఛాన్స్ ఇవ్వకుండా..నెక్స్ట్ సినిమాతో ఆయన అభిమానులను బ్యాలెన్స్ చేస్తున్నారు చిరు. పక్కా మాస్ అండ్ కమర్షియల్స్ చేస్తూ వస్తున్న మెగాస్టార్, సోషియో ఫాంటసీ మూవీ విశ్వంభర కి గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు.

Weather Warning: వేడెక్కుతున్న భూగోళం.. మానవాళికి ఐరాస హెచ్చరిక!InternationalSwechaa04 Sep 2026, 08:20 AM

Weather Warning: వేడెక్కుతున్న భూగోళం.. మానవాళికి ఐరాస హెచ్చరిక!

మన భూగోళం ఊహకందని రీతిలో వేడెక్కిపోతోంది. మానవాళి మనుగడకే ప్రమాద ఘంటికలు మోగుతున్నాయి. ఈ వేసవిలో మన కళ్లముందే కనిపించిన విపరీతమైన వేడి, ఊపిరాడని ఉక్కపోత, భయానకమైన అడవుల కార్చిచ్చులు, అనూహ్యంగా ముంచెత్తిన ఆకస్మిక వరదలు.. ఇవన్నీ రాబోయే రోజుల్లో భూమి ఎంత ప్రమాదకరంగా మారబోతోందో చెప్పే చిన్న శాంపిల్ మాత్రమే అని పర్యావరణ నిపుణులు అంటున్నారు..

చిత్రం లేదు
తెలంగాణSwechaa04 Sep 2026, 08:06 AM

ఇదీ పదేళ్ల దొరల పాలనలో జరిగిన అరాచకం!?..

తెలంగాణలో ఇటీవల ఏసీబీ దాడుల్లో బయటపడుతున్న అక్రమాస్తులు, రాజకీయ అవినీతి, అధికారుల తీరు చూస్తుంటే సభ్య సమాజం తలదించుకునేలా ఉందనే ఆరోపణలు వినిపిస్తున్నాయి.. ఏసీబీ ఎవరిని పట్టినా మినిమం వంద కోట్ల రాలుతున్న ఘటనలు మనం చూస్తూనే ఉన్నాం.. ఒక పేద వాడికి పూటగడవడమే కష్టమైన ఈ రోజుల్లో ప్రభుత్వ ఉద్యోగాలు చేస్తూ, రాజకీయాలు ఏలుతూ వందల కోట్లు వెనుక వేయడం అంటే ఆషామాషీ వ్యవహారం కాదని అంటున్నారు..

Ravi Teja-Prabhas: ప్రభాస్‌లా డేరింగ్ స్టెప్..వర్కౌట్ అయ్యేనా?సినిమాSwechaa04 Sep 2026, 08:01 AM

Ravi Teja-Prabhas: ప్రభాస్‌లా డేరింగ్ స్టెప్..వర్కౌట్ అయ్యేనా?

Ravi Teja: మాస్ మహారాజ్..తాజాగా వచ్చిన ఇరుముడి సినిమాతో ఫుల్ ఫాంలోకి వచ్చేశాడు. బ్యాక్ టు బ్యాక్ సినిమాలను లైన్‌లో పెడుతున్నాడు. అంతేకాదు, మునుపెన్నడూ లేని విధంగా తన మాస్ ఇమేజ్‌ని పక్కన పెట్టి మరీ రిస్క్ చేయడానికి రెడీ అవుతున్నాడు. దీంతో, వచ్చిన సాలీడ్ సక్సెస్ మైలేజ్‌ను మళ్ళీ మన మాస్ రాజా కంటిన్యూ చేయగలడా? అనే సందేహాలు మొదలయ్యాయి. దీనికి, కారణం ఇలా ప్రయోగం చేసే ప్రభాస్ గట్టిగా దెబ్బతిన్నాడు.