స్వేచ్ఛ షార్ట్స్ — తాజా తెలుగు వార్తలు

22A Row: కుట్రపూరితంగానే 22ఏ నిషేధిత జాబితాలోకి భూములు..తెలంగాణSwechaa05 Sep 2026, 05:03 PM

22A Row: కుట్రపూరితంగానే 22ఏ నిషేధిత జాబితాలోకి భూములు..

Ramchander Rao: రేవంత్ సర్కార్ పై తెలంగాణ బీజేపీ నేతలు నిప్పులు చెరిగారు. బీఆర్ఎస్.. ధరణి తెచ్చి ప్రజలను వేధిస్తే.. ఇప్పటి కాంగ్రెస్ ప్రభుత్వం భూ భారతి పేరుతో ప్రజలను దోచుకుంటోందని ఆరోపించారు. 22ఏ నిషేధిత భూముల జాబితా పేరిట పెద్ద ఎత్తున భూ దోపిడీ జరుగుతోందన్నారు.

రైతులు, పేదల భూములను కుట్రపూరితంగానే 22ఏ నిషేధిత జాబితాలో చేర్చారని తెలంగాణ బీజేపీ చీఫ్ రామచంద్రరావు ఆరోపించారు. నిషేధిత జాబితా నుంచి భూమిని తీసేయాలంటే 30శాతం కమీషన్ అడుగుతున్నారని చెప్పారు. ఈ మొత్తం వివాదంపై హైకోర్టు సిట్టింగ్ జడ్జితో విచారణ చేయించాలని ఆయన డిమాండ్ చేశారు. హైదరాబాద్ లోని ఇందిరాపార్క్ ధర్నా చౌక్ దగ్గర భూ భారతి, 22ఏకు నిరసనగా బీజేఎల్పీ ఆధ్వర్వంలో మహాధర్నా నిర్వహించారు. బీజేపీ ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, పార్టీ సీనియర్లు ఈ ధర్నాలో పాల్గొన్నారు.

తెలంగాణ గవర్నర్ కోటాలో ఎమ్మెల్సీ అభ్యర్థులెవరు..?తెలంగాణSwechaa05 Sep 2026, 04:48 PM

తెలంగాణ గవర్నర్ కోటాలో ఎమ్మెల్సీ అభ్యర్థులెవరు..?

తెలంగాణ రాజకీయాల్లో మరోసారి ఎమ్మెల్సీ పదవుల చుట్టూ హీట్ పెరుగుతోంది. గవర్నర్ కోటాలో నవంబర్ 14, 2026న మూడు ఎమ్మెల్సీ స్థానాలు ఖాళీ కానుండటంతో అధికార కాంగ్రెస్‌లో ఆశావహుల లాబీయింగ్ జోరందుకుంది. గోరటి వెంకన్న, బొగ్గారపు దయానంద్, బస్వరాజు సారయ్య పదవీకాలం ముగియనున్న నేపథ్యంలో.. ఈ మూడు స్థానాల్లో ఎవరికి అవకాశం దక్కుతుందన్నది

తెలంగాణ క్యాబినెట్ విస్తరణ..! మహేశ్ గౌడ్ కీలక వ్యాఖ్యలుతెలంగాణSwechaa05 Sep 2026, 03:41 PM

తెలంగాణ క్యాబినెట్ విస్తరణ..! మహేశ్ గౌడ్ కీలక వ్యాఖ్యలు

Mahesh Goud: తెలంగాణ క్యాబినెట్ విస్తరణ గురించి కాంగ్రెస్ శ్రేణుల్లో విస్తృతంగా చర్చ జరుగుతోంది. త్వరలోనే మంత్రివర్గ విస్తరణ ఉంటుందని జోరుగా ప్రచారం నడిచింది. మంత్రి పదవులపై ఆశావహులు అనేక ఆశలు పెట్టుకున్నారు. ఈసారి విస్తరణ జరిగితే తమకు అమాత్య పదవులు ఖాయం అని ఎంతో ధీమాగా ఉన్నారు. అయితే, క్యాబినెట్ విస్తరణపై టీపీసీసీ చీఫ్ మహేశ్ కుమార్ గౌడ్ బాంబు పేల్చారు. ఆశాశహుల ఆశలపై ఆయన నీళ్లు చల్లారు. కేబినెట్ విస్తరణ ఇప్పట్లో లేనట్లే అని మహేశ్ కుమార్ గౌడ్ చెప్పడం కాంగ్రెస్ వర్గాల్లో హాట్ టాపిక్ గా మారింది.

సీఎం పర్యటన నేపథ్యంలో ఉద్రిక్తత.. నకిరేకల్‌లో మాజీ ఎమ్మెల్యే హౌస్ అరెస్ట్!..తెలంగాణSwechaa05 Sep 2026, 03:13 PM

సీఎం పర్యటన నేపథ్యంలో ఉద్రిక్తత.. నకిరేకల్‌లో మాజీ ఎమ్మెల్యే హౌస్ అరెస్ట్!..

సీఎం రేవంత్‌రెడ్డి పర్యటన నేపథ్యంలో నకిరేకల్‌లో.. పొలిటికల్ హీట్ పెరిగినంది. మాజీ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్యను పోలీసులు హౌస్ అరెస్ట్ చేయడం నియోజకవర్గంలో చర్చనీయాంశంగా మారింది.. ఈ క్రమంలో ఆయన తన నివాసంలోనే విలేకరుల సమావేశం ఏర్పాటు చేసి కాంగ్రెస్ ప్రభుత్వంపై తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించారు. నకిరేకల్ నియోజకవర్గంలో అరాచక పాలన కొనసాగుతోందని ఆరోపించారు..

రెండేళ్లు టైమివ్వండి.. అప్పుడు ‘నా పనికి మీరే మార్కులు వేయండి’ : సీఎం రేవంత్తెలంగాణSwechaa05 Sep 2026, 02:52 PM

రెండేళ్లు టైమివ్వండి.. అప్పుడు ‘నా పనికి మీరే మార్కులు వేయండి’ : సీఎం రేవంత్

రెండేళ్లు సమయం ఇచ్చి సహకరిస్తే.. పీఆర్సీ, ఇంక్రిమెంట్ల వంటి సమస్యలన్నింటినీ పరిష్కరిస్తానని ఉపాధ్యాయులకు సీఎం రేవంత్ రెడ్డి హామీ ఇచ్చారు. నిరుపేదల భవిష్యత్‌ను తీర్చిదిద్దడానికి విద్యా రంగంలో సంస్కరణలు చేపట్టిన ఈ దశలో రాష్ట్ర విద్యా వ్యవస్థను దేశానికి ఒక దిక్సూచిలా నిలబెట్టడానికి టీచర్లంతా సహకరించాలని విజ్ఞప్తి చేశారు.శనివారం కొడంగల్‌లోని ప్రభుత్వ జూనియర్ కాలేజీలో నిర్వహించిన ఉపాధ్యాయ దినోత్సవంలో సీఎం పాల్గొన్నారు. మాజీ రాష్ట్రపతి డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్ జయంతిని పురస్కరించుకుని ఆయన చిత్రపటానికి సీఎం పుష్పాంజలి ఘటించి ఉపాధ్యాయులందరికీ ‘టీచర్స్ డే’ శుభాకాంక్షలు తెలిపారు. సీఎం మాట్లాడుతూ.. “ఆర్థిక వెసులుబాటును బట్టి ఉద్యోగుల సమస్యలన్నింటినీ పరిష్కరిస్తాం. మిగతా శాఖలతో పోల్చితే విద్యా శాఖ ఆదర్శంగా నిలబడాలి. పిల్లల భవిష్యత్‌కు మార్గదర్శకులు మీరే. రెండేండ్లు టైం ఇవ్వండి. ప్రతి ఉపాధ్యాయుడికి విజ్ఞప్తి చేస్తున్నా.రెండేళ్లలో సమస్యలన్నింటినీ మీరు అడక్కుండానే పరిష్కరించే బాధ్యత నాది” అని స్పష్టంచేశారు.

Ramchander Rao : బీజేపీ అభ్యర్థుల ఆశలకు షాక్! గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ బరిలోకి రామచంద్రరావు?తెలంగాణSwechaa05 Sep 2026, 02:44 PM

Ramchander Rao : బీజేపీ అభ్యర్థుల ఆశలకు షాక్! గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ బరిలోకి రామచంద్రరావు?

తెలంగాణలో వచ్చే ఏడాది ప్రారంభంలో రెండు గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ స్థానాలకు ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో రాజకీయ వర్గాల్లో అప్పుడే హీట్ మొదలైంది. ముఖ్యంగా హైదరాబాద్ - రంగారెడ్డి - మహబూబ్‌నగర్ గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ స్థానంపై ప్రధాన పార్టీల్లో ప్రత్యేక ఆసక్తి నెలకొంది. ఎవరికి వారు టికెట్ కోసం ప్రయత్నాలు ముమ్మరం చేస్తున్న సమయంలో.. గతంలో ఇదే స్థానం నుంచి విజయం సాధించిన ప్రస్తుత బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్రరావును మరోసారి బరిలోకి దింపే అంశంపై పార్టీ పెద్దలు అంతర్గతంగా చర్చలు జరుపుతున్నట్లు సమాచారం.

పాలిటెక్నిక్ పిల్లల మీద కేసులు పెడితే ఖబడ్దార్ : హరీశ్ రావుతెలంగాణSwechaa05 Sep 2026, 02:34 PM

పాలిటెక్నిక్ పిల్లల మీద కేసులు పెడితే ఖబడ్దార్ : హరీశ్ రావు

తమ డిమాండ్లను పరిష్కరించాలని పాలిటెక్నిక్ విద్యార్థినులు శనివారం సికింద్రాబాద్ పరిధిలోని సంగీత్ జంక్షన్ వద్ద నిరసన ప్రదర్శన చేపట్టారు. అయితే, ట్రాఫిక్‌కు అంతరాయం కలుగుతోందని పేర్కొంటూ పాలిటెక్నిక్ విద్యార్థినులను పోలీసులు అరెస్ట్ చేశారు. అనంతరం అక్కడి నుంచి వాహనాల్లో తరలించారు. విద్యార్థులను పోలీసు వాహనాల్లో తరలిస్తున్న దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. విద్యార్థినులను అరెస్టు చేసిన విషయం తెలియడంతో మాజీ మంత్రి హరీశ్ రావు ఓ పబ్లిక్ మీటింగులో విద్యార్థినులకు మద్దతుగా మాట్లాడారు. పాలిటెక్నిక్ విద్యార్థుల మీద కేసులు పెడుతున్న పోలీసులను హెచ్చరించారు. ‘మీ పోలీసులకు కూడా డీఏలు, సరెండర్ లీవులు, పీఆర్సీలు రావడం లేదు.. మీకు కూడా రేవంత్ రెడ్డి చేసింది ఏమీ లేదు. మా పిల్లలను ఒక్క దెబ్బ కొట్టినా హరీష్ రావు అడ్డంగా ఉంటాడు.. ఖబర్దార్..!.కేసు పెట్టాల్సి వస్తే మీరు పెట్టాల్సింది రేవంత్ రెడ్డి మీద. ఫీజ్ రీయింబర్స్‌మెంట్ ఇవ్వకుండా పిల్లల చదువు ఆగం చేసిన రేవంత్ రెడ్డి మీద కేసు పెట్టాలి. రెండు లక్షల ఉద్యోగాలు ఇస్తానని బాండ్ పేపర్లు పంపి మోసం చేసినందుకు రేవంత్ రెడ్డి మీద చీటింగ్ కేసు పెట్టాలి’ అని మండిపడ్డారు.

మైనర్ డ్రైవింగ్.. రెండు కార్ల మధ్య ఇరుకున్న స్కూటీ..!క్రైమ్Swechaa05 Sep 2026, 02:10 PM

మైనర్ డ్రైవింగ్.. రెండు కార్ల మధ్య ఇరుకున్న స్కూటీ..!

మైనర్ బాలురు స్కూటీని రోడ్డు మీదకు తీసుకుని రావడం, వారి డ్రైవింగ్ మూలనా రెండు కార్లు ఢీకొన్నాయి. ఫలితంగా ఇద్దరు బాలురు రెండు కార్ల మధ్య ఇరుక్కున్న ఘటనలో ఒకరు మృతి చెందినట్టు సమాచారం. ఈ ఘటన కామారెడ్డిలో చోటుచేసుకుంది. వివరాల్లోకివెళితే.. కామారెడ్డి పాత జాతీయ రహదారిపై జరిగిన రోడ్డు ప్రమాదంలో రెండు కార్ల మధ్య స్కూటీ ఇరుక్కుపోయింది. ఆ సమయంలో మైనర్ వాహనం నడిపినట్టు తెలుస్తోంది. స్కూటీపై వెళ్తున్న ఇద్దరు బాలురు 9వ తరగతి చదువుతున్న లోకేశ్, హేమంత్‌గా గుర్తించారు. వీరిద్దరూ ప్రాణ స్నేహితులుగా తెలిసింది. అయితే, ఈ ప్రమాదంలో హేమంత్ అనే బాలుడు అక్కడికక్కడే మృతి చెందాడు. లోకేష్‌కు తీవ్ర గాయాలు అవ్వగా.. చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించినట్టు తెలిసింది.

Bhagyashri-MohanLal: "లెనిన్" హిట్‌తో మలయాళంలో ఎంట్రీ ఇస్తున్న భాగ్యశ్రీ!సినిమాSwechaa05 Sep 2026, 02:07 PM

Bhagyashri-MohanLal: "లెనిన్" హిట్‌తో మలయాళంలో ఎంట్రీ ఇస్తున్న భాగ్యశ్రీ!

Bhagya Shree Borse: లెనిన్ హిట్‌తో మలయాళంలో ఎంట్రీ ఇస్తోంది హీరోయిన్ భాగ్యశ్రీ బోర్సే. ఎంతో కాలంగా ఎదురుచూస్తున్న సాలీడ్ హిట్ అఖిల్ అక్కినేని నటించిన లెనిన్ సినిమాతో ఇద్దరికీ దక్కింది. ఈ సినిమా తర్వాత భాగ్యశ్రీకి తెలుగులో వరుసగా ఆఫర్స్ వస్తాయనుకున్నారు. కానీ, తెలుగు కంటే ముందు మలయాళం సినిమాలో ముఖ్య పాత్రను దక్కించుకుంది. ఇందులో, మోహన్ లాల్ హీరోగా నటిస్తుండటం విశేషం.

ఎమ్మెల్సీ పోరుపై హస్తం మార్క్ స్కెచ్.. తెరపైకి కొత్త అభ్యర్థులు!..తెలంగాణSwechaa05 Sep 2026, 01:38 PM

ఎమ్మెల్సీ పోరుపై హస్తం మార్క్ స్కెచ్.. తెరపైకి కొత్త అభ్యర్థులు!..

రాష్ట్రంలో ఎమ్మెల్సీ ఎన్నికల నగారా ఇంకా మోగలేదు.. నోటిఫికేషన్‌కు మరో నాలుగు నెలల సమయం ఉంది.. కానీ కాంగ్రెస్ పార్టీలో మాత్రం ఇప్పటి నుంచే రాజకీయ వ్యూహాలకు పదును పెడుతున్నారు.. ఎమ్మెల్సీ పదవుల కోసం ఆశావహుల లాబీయింగ్‌తో హస్తం శిబిరంలో సందడి మొదలైంది. ఎవరికి అవకాశం దక్కుతుంది? ఎవరిని అధిష్టానం పక్కన పెడుతుంది? అన్న చర్చలు పార్టీ వర్గాల్లో జోరుగా సాగుతున్నాయి.ముఖ్యంగా రెండు గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ స్థానాలపై కాంగ్రెస్‌లో ఉత్కంఠ నెలకొంది.

రేవంత్ ఓటుకు నోటు దొంగ.. జాక్‌పాట్ సీఎం : కేటీఆర్తెలంగాణSwechaa05 Sep 2026, 01:16 PM

రేవంత్ ఓటుకు నోటు దొంగ.. జాక్‌పాట్ సీఎం : కేటీఆర్

రాష్ట్ర ప్రభుత్వం, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మీద బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మరోసారి తీవ్ర విమర్శలు గుప్పించారు. అమలుకు సాధ్యం కాని హామీలు ఇచ్చి అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీ.. హామీల అమలుపై ప్రశ్నిస్తే దౌర్జన్యం చేస్తుందంటూ కేటీఆర్ మండిపడ్డారు. శనివారం కరీంనగర్‌లోని అంబేడ్కర్ మినీ స్టేడియంలో నిర్వహించిన ‘జెన్ జీ’ సభకు హాజరైన కేటీఆర్..రేవంత్ సర్కారు ప్రభుత్వ విధానాలు, పాలన తీరుపై విరుచుకపడ్డారు. ఈ సందర్భంగా కేటీఆర్ మాట్లాడుతూ.. ఎన్నికల ముందు యూత్ డిక్లరేషన్ పేరిట 24 హామీలు ఇచ్చి ఒక్కటి కూడా అమలు చేయలేదని ఫైర్ అయ్యారు. అధికారంలోకి రాగానే 100 రోజుల్లో యూత్ డిక్లరేషన్ అమలు చేస్తామని అన్నారని, 1000 రోజులు అయింది ఏం చేశారని ప్రశ్నించారు. బకాసురులులాగా తింటున్నారు, కుంభకర్ణుల్లా పండుకుంటున్నారు, పంది కొక్కుల్లా తింటున్నారు.. అది తప్ప కాంగ్రెస్ వాళ్లు చేసింది ఏమీ లేదన్నారు.

Vishwambhara: చిరు సినిమాకి కూడా OTT కష్టాలా?సినిమాSwechaa05 Sep 2026, 01:10 PM

Vishwambhara: చిరు సినిమాకి కూడా OTT కష్టాలా?

Vishwambhara: చిన్న సినిమా పెద్ద సినిమా..ఏదైనా పదే పదే గనక విడుదల వాయిదా పడితే, ఆ సినిమాపై చాలామందికి సందేహాలు మొదలవుతాయి. సినిమా ఆడేది కాదులే అనే నెగిటివ్ టాక్ మొదలవుతుంది. దీంతో, ఆటోమేటిక్‌గా బిజినెస్ పరంగానూ లెక్కలు, అంచనాలు మారిపోతాయి. ఇలాంటివన్నీ పెద్ద హీరోల సినిమాలకి కూడా వర్తిస్తాయి. మెగాస్టార్ సినిమాకి ఇప్పుడు ఇలాంటి ఇబ్బందులే తలెత్తినట్టుగా తెలుస్తోంది.

రోడ్డుపైనే రెచ్చిపోయిన కామాంధుడు.. తరిమిన శునకం!క్రైమ్Swechaa05 Sep 2026, 12:50 PM

రోడ్డుపైనే రెచ్చిపోయిన కామాంధుడు.. తరిమిన శునకం!

మానవ రూపంలో ఉన్న కొన్ని మృగాలు రోడ్ల మీద సంచరిస్తున్న, ఒంటరిగా ఉండే మహిళలు, మైనర్ బాలికలను టార్గెట్‌గా చేసుకుంటాయి. ఎవరూలేని సమయంలో వారి మీద అఘాయిత్యాలకు పాల్పడంతో పాటు ఎక్కడ పోలీసులకు దొరికిపోతామనే భయంతో అమాయకులను బలిగొంటున్నారు. ఇలాంటి ఘటనలు దేశ వ్యాప్తంగా వెలుగుచూస్తున్నాయి. తమిళనాడులో ఓ దారుణం చోటుచేసుకుంది. రోడ్డుపై ఒంటరిగా వెళ్తున్న మహిళపై ఓ కామాంధుడి కన్ను పడింది. చుట్టుపక్కల ఎవరూ లేరని గమనించిన మనిషి రూపంలో ఉన్న మృగం.. ఒక్కసారిగా ఆ మహిళపై తన కామ కోరికలు తీర్చుకోవడానికి ప్రయత్నించింది. బాధితురాలు వదిలిపెట్టాలని వేడుకున్నా వినిపించుకోలేదు. అక్కడే సంచరిస్తున్న ఓ శునకం మాత్రం ఆ మహిళను రక్షించేందుకు ప్రయత్నించింది.

Shriya Reddy: మహాకాళి కోసం కత్తిసాము..లేటెస్ట్ ఫొటోస్ వైరల్!సినిమాSwechaa05 Sep 2026, 12:11 PM

Shriya Reddy: మహాకాళి కోసం కత్తిసాము..లేటెస్ట్ ఫొటోస్ వైరల్!

Shriya Reddy: కథ డిమాండ్ చేస్తే బెగ్గర్‌గా, అపర కోటీశ్వరుడిగానైనా, భక్తుడిగా అయినా, దేవుడిగా అయినా ఆన్ స్క్రీన్‌పై కనిపించి అలరించాల్సిందే. కథ-కథనాలకి తగ్గట్టు పాత్ర డిమాండ్ చేస్తే ఎలాంటి గెటప్ అయినా వెయ్యాల్సిందే. ఎంతటి కఠోర శ్రమైనా తట్టుకోవాల్సిందే. సినిమా కోసం హీరోలే కాదు, హీరోయిన్స్ కూడా రోజుల తరబడి కష్టపడుతున్నారు.

రైతు బీమా బంద్..అన్నదాత ఆగం?టాప్ న్యూస్Swechaa05 Sep 2026, 12:10 PM

రైతు బీమా బంద్..అన్నదాత ఆగం?

అన్నదాత మరణిస్తే బాధిత కుటుంబానికి భరోసాగా గత ప్రభుత్వం చెల్లించిన రెతు బీమా రూ.5 లక్షలు ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వంలో నిలిచిపోయినట్టు తెలుస్తోంది. గత ఎన్నికల సమయంలో రైతు భరోసా, రైతుభీమా కొనసాగిస్తామని ప్రకటించిన కాంగ్రెస్ పార్టీ.. అధికారంలోకి రాగానే రైతు బీమా నిలిపి వేయడంపై తీవ్ర విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఎనిమిదేళ్లుగా అన్నదాత కుటుంబాలకు అండగా నిలిచిన రూ.5 లక్షల భరోసాను తాజాగా కాంగ్రెస్ ప్రభుత్వం నిలిపివేసినట్టు తెలిసింది.నాగర్‌కర్నూల్ జిల్లా వెల్దండ మండలం బర్కత్‌పల్లి గ్రామానికి చెందిన 45 ఏళ్ల దళిత రైతు ఒర్సు రాంచందర్ గత నెల 29న గుండెపోటుతో మృతి చెందాడు. ఆయనకు అర ఎకరం భూమి, భార్య, ముగ్గురు పిల్లలు ఉన్నారు. కుటుంబపెద్ద మరణంతో రాంచందర్ మిత్రులు రూ.5 లక్షల రైతుబీమా కోసం స్థానిక ఏఈఓను కలవగా.. రైతుబీమా పథకం ఆగస్టు 14 నుంచి నిలిచిపోయిందని, బీమా క్లెయిమ్ కాదని చెప్పడంతో రాంచందర్ కుటుంబం ఒక్కసారిగా కుంగిపోయినట్టు సమాచారం.

కాంగ్రెస్‌ను ఓడించేందుకు బీజేపీకి బీఆర్ఎస్ సపోర్టు : సీఎం రేవంత్ రెడ్డితెలంగాణSwechaa05 Sep 2026, 11:46 AM

కాంగ్రెస్‌ను ఓడించేందుకు బీజేపీకి బీఆర్ఎస్ సపోర్టు : సీఎం రేవంత్ రెడ్డి

రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీని ఓడించేందుకు కేంద్రంలోని బీజేపీ, రాష్ట్రంలో ప్రతిపక్ష బీఆర్ఎస్ పార్టీలు కుట్ర చేస్తున్నాయని సీఎం రేవంత్ రెడ్డి ఆరోపించారు. వచ్చే ఎన్నికల్లో లబ్ది పొందేందుకు ‘ఎస్ఐఆర్’ పావుగా వాడుకుంటున్నారని చెప్పారు. శనివారం కొడంగల్‌లోని తన నివాసంలో స్థానిక నాయకులు, కార్యకర్తలతో భేటీ అయిన సీఎం రేవంత్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. నియోజకవర్గ ప్రజలు తనను గుండెల్లో పెట్టుకోవడం వల్లే జాతీయ స్థాయిలో కొడంగల్‌‌కు గుర్తింపు వచ్చిందన్నారు. ఇక్కడి ప్రజల అభిమానమే తన బలమని ముఖ్యమంత్రి వెల్లడించారు. మోడీ సర్కార్ SIR పేరుతో నాటకాలు ఆడుతోందని, కాంగ్రెస్ అనుకూల ఓట్లను తొలగించే కుట్ర చేస్తోందని ఆరోపించారు. మహారాష్ట్ర, బిహార్, బెంగాల్ ఎన్నికల్లో ఇదే వ్యూహాన్ని అమలు చేసి గెలిచారన్నారు. ఇప్పుడు తెలంగాణలోనూ దొంగదెబ్బ తీయాలని చూస్తున్నారని ఫైర్ అయ్యారు.

'Kalki 2898 AD Part 2': క్రేజీ సీక్వెల్‌లో దీపికను రీప్లేస్ చేస్తున్న ఆలియా!సినిమాSwechaa05 Sep 2026, 11:16 AM

'Kalki 2898 AD Part 2': క్రేజీ సీక్వెల్‌లో దీపికను రీప్లేస్ చేస్తున్న ఆలియా!

'Kalki 2898 AD Part 2': పాన్ ఇండియన్ స్టార్ ప్రభాస్ నటిస్తున్న సినిమాలలో కల్కీ పార్ట్ 2 కూడా ఒకటి. యంగ్ డైరెక్టర్ నాగ్ అశ్విన్ రూపొందిస్తున్న ఈ సినిమా షూటింగ్ మొదలై కొన్నాళ్ళు చిత్రీకరణ జరిగిన తర్వాత మళ్ళీ నిలిచిపోయింది. అయితే, తాజా సమాచారం మేరకు త్వరలో, ఈ సినిమా కొత్త షెడ్యూల్ ప్రారంభం కాబోతుందని తెలుస్తోంది. అంతేకాదు, కీలక పాత్ర కోసం బాలీవుడ్ బ్యూటీ ఆలియా భట్‌ను మేకర్స్ ఎంపిక చేసినట్టుగా తెలుస్తోంది.

హైకోర్టు వార్నింగ్.. ఇన్ స్టా మిస్డ్‌కాల్‌తో దొరికిన బాలిక ఆచూకీ!ఏపీSwechaa05 Sep 2026, 11:16 AM

హైకోర్టు వార్నింగ్.. ఇన్ స్టా మిస్డ్‌కాల్‌తో దొరికిన బాలిక ఆచూకీ!

జూన్ 9వ తేదీన కనిపించకుండా పోయిన బాలికను ఎట్టకేలకు ఏపీ పోలీసులు కనిపెట్టారు. తన కూతురు కనిపించడం లేదని పోలీసులకు ఫిర్యాదు చేసి మూడు నెలలు గడిచిందని అయినా ఆచూకీ కనిపెట్టలేకపోయారని బాలిక తండ్రి హైకోర్టును ఆశ్రయించిన విషయం తెలిసిందే. దీంతో ఆగ్రహించిన కోర్టు.. గుంటూరు జిల్లా పోలీసుల పనితీరుపై మండిపడింది. తెల్లవారే సరికి బాలికను న్యాయస్థానం ముందు హాజరు పరచాలని ఆదేశాలు ఇవ్వడంతో .. బాలిక ఆచూకీని కనిపెట్టేందుకు ప్రత్యేకంగా ‘సిట్’ వేసిన ఏపీ డీజీపీ.. విచారణ చేపట్టగా.. హర్యానాలో బాలిక ఆచూకీని గుర్తించారు. ఇన్‌స్టా మిస్డ్‌కాల్‌ ద్వారా గుంటూరులో కనిపించకుండా పోయిన బాలిక కేసును పోలీసులు చేధించినట్టు తెలిసింది. బాలిక మిస్సింగ్ కేసులో షేక్‌ జాన్‌సైదాను నిందితుడిగా గుర్తించి అరెస్ట్‌ చేశారు.

నేడు కరీంనగర్‌కు కేటీఆర్.. ‘జెన్ జీ’తో భారీ సభతెలంగాణSwechaa05 Sep 2026, 10:55 AM

నేడు కరీంనగర్‌కు కేటీఆర్.. ‘జెన్ జీ’తో భారీ సభ

కాంగ్రెస్ పార్టీ తీరు,వైఫల్యాలను ఎక్కడికక్కడ ఎండగడుతున్న బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ నేడు కరీంనగర్‌కు వెళ్లనున్నారు.రానున్న రోజుల్లో ప్రభుత్వ తలరాతను డిసైడ్ చేసేది యువతరం అని గుర్తించిన కేటీఆర్.. వారితో ఇటీవల తరచూ ఇంటరాక్ట్ అవుతున్నారు.వచ్చే ఎన్నికల్లో యువతరమే టార్గెట్‌గా బీఆర్ఎస్ పార్టీ విధివిధానాలు సైతం ఖరారు చేయనున్నట్టు ప్రచారం జరుగుతోంది. ఇక నోటిఫికేషన్లు ఇవ్వకుండా, నిరుద్యోగ భృతి ఇవ్వకుండా యువతను సర్కార్ మోసం చేసిందని విమర్శిస్తున్న కేటీఆర్.. నేడు కరీంనగర్‌లో ‘జెన్ జీ’తో భారీ సభను నిర్వహిస్తున్నట్టు సమాచారం. అంబేద్కర్‌ మినీ స్టేడియంలో జెన్‌ జీ సభ కోసం ఏర్పాట్లు చేశారు. మధ్యాహ్నాం సభ ప్రారంభంకానుందని సమాచారం. ఈ క్రమంలోనే విద్యార్థులు, యువతతో కేటీఆర్‌ సమావేశం అవుతారని, ఉద్యోగ అవకాశాలు, ఫీజు రీయింబర్స్‌మెంట్‌పై చర్చ జరగనుందని తెలుస్తోంది.

మిలటరీ బ్యారక్స్‌లో మృత్యుఘోష.. 10 మందికి పైగా మృతి-60 మందికి గాయాలు!..InternationalSwechaa05 Sep 2026, 10:13 AM

మిలటరీ బ్యారక్స్‌లో మృత్యుఘోష.. 10 మందికి పైగా మృతి-60 మందికి గాయాలు!..

దక్షిణ అమెరికా దేశమైన బొలీవియా లో ఘోర ప్రమాదం సంభవించింది. దేశ రాజధాని లాపాజ్ సమీపంలోని ఓ మిలటరీ బ్యారక్స్‌లో జరిగిన భారీ పేలుడులో కనీసం 10 మంది ప్రాణాలు కోల్పోయారు. ఈ ఘటనలో మరో 60 మందికి పైగా తీవ్రంగా గాయపడ్డారు. లాపాజ్‌కు సుమారు 30 కిలోమీటర్ల దూరంలో ఉన్న వియాచా మున్సిపాలిటీలోని సైనిక స్థావరంలో ఈ పేలుడు సంభవించింది.

డేంజర్స్ బెల్స్..  నేపాల్‌లో భారీగా విరిగిపడిన కొండచరియలుప్రపంచంSwechaa05 Sep 2026, 10:07 AM

డేంజర్స్ బెల్స్.. నేపాల్‌లో భారీగా విరిగిపడిన కొండచరియలు

నేపాల్‌లో గతనెల 26న భారీ వరదలు సంభవించిన విషయం తెలిసిందే. వరదల కారణంగా భోటే కోషి (Bhote Koshi) నది పెద్దఎత్తున ఉప్పొగింది. నేపాల్–చైనా సరిహద్దు వద్ద గల ఈ నదిలోకి టిబెట్ వైపు నుంచి ఒక్కసారిగా భారీగా నీరు, మంచు, రాళ్లు, మట్టి చేరడంతో వరద తీవ్ర రూపం దాల్చింది. ఫలితంగా లోతట్టు ప్రాంతాలు మొత్తం జలమయం అయ్యాయి. భారీగా ఆస్తినష్టంతో పాటు ప్రాణనష్టం కూడా వాటిల్లింది. ఇదిలాఉండగా, నేపాల్‌కు మరో భారీ ముప్పు పొంచి ఉందని తెలుస్తోంది. దార్చులా జిల్లా అపి హిమల్ రూరల్ ప్రాంతంలో భట్టార్‌లో భారీగా కొండచరియలు విరిగిపడ్డాయి.అవి చౌలానీ నది ప్రవాహాన్ని పాక్షికంగా అడ్డుకోవడంతో అధికారులు అప్రమత్తమయ్యారు. వరద పోటెత్తే ప్రమాదం ఉండటంతో దిగువ ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరికలు జారీ చేశారు. కొండచరియలు విరిగిపడిన ప్రాంతంలో వరద ప్రవాహానికి ఆటంకం లేకుండా ఉండేందుకు అధికారులు సహాయక చర్యలు చేపట్టారు.

Rajinikanth: జెట్ స్పీడ్ లో ‘ధర్మన్’ షూటింగ్..ఎన్ని కెమెరాలు వాడుతున్నారంటే!సినిమాSwechaa05 Sep 2026, 10:05 AM

Rajinikanth: జెట్ స్పీడ్ లో ‘ధర్మన్’ షూటింగ్..ఎన్ని కెమెరాలు వాడుతున్నారంటే!

Rajinikanth: ఇద్దరు సీనియర్ స్టార్ హీరోలు కలిసి సినిమా చేస్తున్నారంటే, అది భారీ మల్టీస్టారర్ అవుతుంది. కానీ, ఇది మల్టీస్టారర్ అనుకోవాలా లేక మల్టీ బిగ్ ప్రాజెక్ట్ అనుకోవాలా అనేది ఇప్పుడు ఇండస్ట్రీలో హాట్ టాపిక్. కారణం ఉలగనాయగన్ కమల్ హాసన్ సొంత నిర్మాణ సంస్థ రాజ్ కమల్ ఇంటర్నేషనల్ ఫిల్స్ బ్యానర్‌లో సూపర్ స్టార్ రజినీకాంత్ సినిమా చేస్తున్నాడు. ఈ సినిమాకి "ధర్మన్: ది డెడ్లీ డాక్టర్" అనే పేరు పెట్టారు. ఇక, తాజా సమాచారం మేరకు ఈ సినిమాకి దాదాపు 8 భారీ కెమెరాలను ఉపయోగిస్తున్నారట.

నిత్యం రక్తసిక్తమవుతున్న రహదారులు..రోడ్డు ప్రమాదంలో మరో వ్యక్తి మృతి!..క్రైమ్Swechaa05 Sep 2026, 09:55 AM

నిత్యం రక్తసిక్తమవుతున్న రహదారులు..రోడ్డు ప్రమాదంలో మరో వ్యక్తి మృతి!..

నాగార్జునసాగర్–హైదరాబాద్ ప్రధాన రహదారిపై నేటి ఉదయం ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. నెల్లికల్ ఎక్స్‌ రోడ్ సమీపంలోని దయ్యాల గండి వద్ద ద్విచక్ర వాహనంపైకి కారు దూసుకెళ్లింది. ఈ ప్రమాదంలో బైక్‌పై ప్రయాణిస్తున్న వ్యక్తి అక్కడికక్కడే మృతి చెందినట్లు సమాచారం. మృతుడు నాగార్జునసాగర్ పైలాన్‌కు చెందిన వ్యక్తిగా స్థానికులు గుర్తించారు. కారు అతివేగంగా రావడమే ప్రమాదానికి కారణమని స్థానికులు ఆరోపిస్తున్నారు. లేదు.

మూడు నెలల రేషన్ కోటా.. నేటితో గడువు ముగింపుతెలంగాణSwechaa05 Sep 2026, 09:48 AM

మూడు నెలల రేషన్ కోటా.. నేటితో గడువు ముగింపు

రేషన్ కార్డు లబ్దిదారులకు ముఖ్యగమనిక. ఎవరైతే మూడు నెలల రేషన్ కోటా తీసుకోలేదో త్వరగా తీసుకోవాలని రాష్ట్ర పౌరసరఫరాల శాఖ పేర్కొంది. ఎందుకంటే ఈ కోటా పంపిణీకి నేటి సాయంత్రంతో గడువు ముగియనుంది.ఆగస్టు, సెప్టెంబర్, అక్టోబర్ నెలలకు సంబంధించి కోటా మొత్తాన్ని ప్రభుత్వం గత నెల పంపిణీ చేసిన విషయం తెలిసిందే. కొందరు లబ్దిదారులు రేషన్ తీసుకోలేదని తెలిసి ఈనెల 5 వరకు పంపిణీ గడువు తేదీని పొడగించింది. కాగా,నేటి సాయంత్రం గడువు ముగియనుంది. రేషన్ తీసుకోనివారు వెంటనే వెళ్లితీసుకోవాలని లేదంటే మళ్లీ నవంబర్ నెలలోనే రేషన్ బియ్యం ఇవ్వనున్నట్టు ప్రకటించింది.

Rashmika-Epic Event: ఎపిక్ ప్రీమియర్స్..నిర్మాతల కంటే ముందే రివీల్ చేసిన రష్మికసినిమాSwechaa05 Sep 2026, 09:33 AM

Rashmika-Epic Event: ఎపిక్ ప్రీమియర్స్..నిర్మాతల కంటే ముందే రివీల్ చేసిన రష్మిక

Rashmika Mandanna: టాలీవుడ్ రౌడీ హీరో విజయ్ దేవరకొండ తమ్ముడు ఆనంద్ దేవర కొండ, క్యూట్ బ్యూటీ..తెలుగమ్మాయి వైష్ణవి చైతన్య జంటగా నటించిన లేటెస్ట్ రొమాంటిక్ లవ్ స్టోరీ ఎపిక్. ఈ సినిమా విడుదల తేదీ దగ్గరపడుతున్న నేపథ్యంలో మేకర్స్ తాజాగా గ్రాండ్ ప్రీ రిలీజ్ ఈవెంట్‌ను నిర్వహించారు. ఈ ఈవెంట్‌కి ఆనంద్ దేవరకొండ వదిన, స్టార్ హీరోయిన్ రష్మిక మందన్న ఎపిక్ సినిమా ప్రీమియర్స్‌ను (సెప్టెంబర్ 10) నిర్మాతల కంటే ముందే రివీల్ చేసింది.

భూమి కోసం తిరగబడుతున్న తెలంగాణ?టాప్ న్యూస్Swechaa05 Sep 2026, 09:31 AM

భూమి కోసం తిరగబడుతున్న తెలంగాణ?

ఇండియాలో భూమి అంటే భక్తికాదు, అదో జీవిత భరోసా.. దాన్నే మింగేసిన నిజాం నుంచి నేటి కాంగ్రెస్ చరిత్ర ఇదే? 1909లో నిజాం రాజు తన భూములు అంటూ చేసిన సర్వేలు, 1925లో రెవెన్యూ పట్టాలుగా మారాయి. గోదావరి, సింగూర్ ప్రాంతాల్లో మాత్రమే పంటలు పండే భూములు పట్టాలుగా ఉండేవి. వాళ్లు మాత్రమే పన్నులు కట్టేవారు. కాని లక్షల ఎకరాల భూమి ఉన్నా, పన్నులు కట్టకుండా నిజాం దేశంలో ప్రజలంతా బతికేస్తున్నారు అంటూ పట్టాలుగా ఇచ్చేశారు. సర్వే నెంబర్స్ కేటాయించారు. ఆనాడు ఈనాటి టెక్నాలజీ లేదు. ఒక ఎకరం కుటుంబం దున్నుకుంటే ఎక్కువ. కానీ, పన్ను మాత్రం అంతటికి చెల్లించాలనే ఉద్దేశంతో 1935 వరకు ఎవరూ చెల్లించలేదు. దీంతో మాజీ పట్టా అని, ఖరీజు ఖాతా అంటూ మార్చారు.

యాత్రికులతో కిక్కిరిసిన శేషాచలం.. స్వామి వారి దర్శనానికి ఎన్ని గంటలు అంటే?ఏపీSwechaa05 Sep 2026, 09:25 AM

యాత్రికులతో కిక్కిరిసిన శేషాచలం.. స్వామి వారి దర్శనానికి ఎన్ని గంటలు అంటే?

గోవింద నామస్మరణతో ఏడుకొండలు మారుమోగిపోతున్నాయి. ఆపదమొక్కులవాడు, అనాథ రక్షకుడైన ఆ శ్రీవేంకటేశ్వరస్వామి దివ్య దర్శనం కోసం తిరుమల పుణ్యక్షేత్రానికి భక్తులు భారీగా పోటెత్తారు. వీకెండ్ కావడంతో దేశంలోని నలుమూలల నుంచి వచ్చిన యాత్రికులతో శేషాచలం కిక్కిరిసిపోయింది. ప్రస్తుతం వైకుంఠం క్యూ కాంప్లెక్స్ లోని అన్ని కంపార్ట్‌మెంట్లు పూర్తిగా నిండిపోయాయి.

దీంతో భక్తులు కాలినడక మార్గాలు, బయట ఏర్పాటు చేసిన రింగు రోడ్డు క్యూలైన్లలో గంటల తరబడి వేచివుండాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఎలాంటి ప్రత్యేక టైమ్ స్లాట్ టోకెన్లు లేకుండా, సాధారణ సర్వదర్శనానికి వస్తున్న భక్తులకు శ్రీవారి దివ్య మంగళ రూపాన్ని దర్శించేందుకు దాదాపు 20 గంటల సుదీర్ఘ సమయం పడుతోందని సమాచారం.. ఇప్పటికే ఈ రద్దీని దృష్టిలో ఉంచుకుని తిరుమల తిరుపతి దేవస్థానం అధికారులు విస్తృత ఏర్పాట్లు చేశారు.

హాజరు లేకుండానే హాల్‌టికెట్లు.. యూనివర్శిటీల్లో బయోమెట్రిక్ స్కాం!..తెలంగాణSwechaa05 Sep 2026, 09:07 AM

హాజరు లేకుండానే హాల్‌టికెట్లు.. యూనివర్శిటీల్లో బయోమెట్రిక్ స్కాం!..

తెలంగాణలో విద్యా వ్యవస్థ గాడితప్పుతుందనే ఆరోపణలు వినిపిస్తున్నాయి.. ఇందుకు పలుకారాణాలున్న తాజాగా రాష్ట్రంలోని వివిధ యూనివర్శిటీల పరిధిలోని కాలేజీల్లో విద్యార్థుల నుంచి వసూలు చేస్తున్న బయోమెట్రిక్ హాజరు ఫీజుల వ్యవహారం సంచలనంగా మారింది. పలు కాలేజీల్లో బయోమెట్రిక్ ఫీజు పేరిట ఒక్కో సెమిస్టర్‌కు ప్రతి విద్యార్థి దగ్గర నుంచి రూ. 100 వసూలు చేస్తున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి.. గత ఆరేళ్ల బయోమెట్రిక్ వివరాలను పరిశీలిస్తే ఇలాంటి విస్తుపోయే నిజాలు వెలుగులోకి వస్తాయని అంటున్నారు.. దాదాపు సగానికి పైగా ఓయూ పరిధిలో ఉన్న ఎంబీఏ కాలేజీల్లో అసలు అధ్యాపకులుండరు. మౌలిక వసతులుండవు. కాలేజీలకు తాళాలు వేసి ఉంటాయనే విమర్శలున్నాయి. ఈ క్రమంలో విద్యార్థులు కాలేజీలకు రాకుండా పరీక్షల సమయంలో మాత్రమే హాజరవుతున్నారని తెలుస్తుంది.

తెలంగాణ కౌలు రైతులకు గుడ్‌న్యూస్‌.. కీలక నిర్ణయం దిశగా రేవంత్ సర్కార్!..తెలంగాణSwechaa05 Sep 2026, 08:33 AM

తెలంగాణ కౌలు రైతులకు గుడ్‌న్యూస్‌.. కీలక నిర్ణయం దిశగా రేవంత్ సర్కార్!..

తెలంగాణలో కౌలు రైతుల సమస్య మరోసారి తెరపైకి వచ్చింది. భూమిని సాగు చేస్తున్నా.. రైతుగా గుర్తింపు లేకపోవడంతో ప్రభుత్వ పథకాలకు దూరమవుతున్న పరిస్థితి. రైతు భరోసా, రైతు బీమా, పంట రుణాలు మాత్రమే కాదు.. పంటకు అవసరమైన ఇన్‌పుట్ సబ్సిడీలు పొందడంలోనూ కౌలు రైతులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఇలా కౌలు రైతులకు ఈ సమస్య రావడానికి కారణం.. భూమిని కౌలుకు తీసుకున్న రైతు దగ్గర సాధారణంగా భూమికి సంబంధించిన హక్కు పత్రాలు ఉండవు. ఆ పత్రాలు భూ యజమాని దగ్గరే ఉంటాయి. అయితే కౌలుదారుడికి పత్రాలు ఇస్తే.. భవిష్యత్తులో తన భూమిపై హక్కులు కోల్పోయే ప్రమాదం ఉందనే భయం కొందరు పట్టాదారుల్లో ఉంది. పాత కౌలు చట్టాలపై ఉన్న అపోహలు, సరైన అవగాహన లేకపోవడం ఈ సమస్య తలెత్తుతుంది..

ఢిల్లీకి రెడ్ అలర్ట్.. వరద ముప్పుతో దేశ రాజధాని విలవిల!NationalSwechaa04 Sep 2026, 11:47 PM

ఢిల్లీకి రెడ్ అలర్ట్.. వరద ముప్పుతో దేశ రాజధాని విలవిల!

ఒకవైపు కుండపోత.. మరోవైపు ఉగ్రరూపం దాల్చుతున్న నదులు.. ఇంకోవైపు రోడ్లపై నిలిచిపోయిన వరద నీరు. దేశ రాజధాని ఢిల్లీకి వాన ముప్పు మరింత తీవ్రమైంది. భారీ వర్షాలతో ఢిల్లీ-ఎన్‌సీఆర్‌ ప్రాంతాలు ఉక్కిరిబిక్కిరి అవుతున్న వేళ.. భారత వాతావరణ శాఖ రెడ్ అల‌ర్ట్ జారీ చేసింది.