స్వేచ్ఛ షార్ట్స్ — తాజా తెలుగు వార్తలు

భారత్ చేతిలో సూపర్ ఐ.. GSLV-F17 ప్రయోగం సక్సెస్!..NationalSwechaa04 Sep 2026, 08:42 AM

భారత్ చేతిలో సూపర్ ఐ.. GSLV-F17 ప్రయోగం సక్సెస్!..

భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ ఇస్రో ఖాతాలో మరొక సంచలనాత్మక విజయం నమోదైంది.. అంతరిక్షంలో జీఎస్‌ఎల్‌వీ-ఎఫ్17 (GSLV-F17) రాకెట్ ప్రయోగం విజయవంతంగా పూర్తయింది. ఈ ప్రయోగం ద్వారా 2,232 కిలోల బరువు కలిగిన అత్యాధునిక 'ఎర్త్ అబ్జర్వేషన్ శాటిలైట్' (EOS-09)ను మన శాస్త్రవేత్తలు కక్ష్యలోకి ప్రవేశపెట్టారు. జీఎస్‌ఎల్‌వీ సిరీస్‌లో ఇది ఇస్రోకు 17వ విజయవంతమైన మైలురాయి కావడం విశేషం.

Vishwambhara 2027: ఒక సంక్రాంతి కాదు ఇంకో సంక్రాంతి!సినిమాSwechaa04 Sep 2026, 08:36 AM

Vishwambhara 2027: ఒక సంక్రాంతి కాదు ఇంకో సంక్రాంతి!

Vishwambhara: మెగాస్టార్ చిరంజీవి సినిమా ఆలస్యం అవుతుందంటే అభిమానుల్లో విపరీతమైన అసహనం కలుగుతుంది. అప్‌డేట్స్ రాకపోతే కోపాలు కట్టలు తెంచుకుంటుంటాయి. కానీ, ఆ ఛాన్స్ ఇవ్వకుండా..నెక్స్ట్ సినిమాతో ఆయన అభిమానులను బ్యాలెన్స్ చేస్తున్నారు చిరు. పక్కా మాస్ అండ్ కమర్షియల్స్ చేస్తూ వస్తున్న మెగాస్టార్, సోషియో ఫాంటసీ మూవీ విశ్వంభర కి గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు.

Weather Warning: వేడెక్కుతున్న భూగోళం.. మానవాళికి ఐరాస హెచ్చరిక!InternationalSwechaa04 Sep 2026, 08:20 AM

Weather Warning: వేడెక్కుతున్న భూగోళం.. మానవాళికి ఐరాస హెచ్చరిక!

మన భూగోళం ఊహకందని రీతిలో వేడెక్కిపోతోంది. మానవాళి మనుగడకే ప్రమాద ఘంటికలు మోగుతున్నాయి. ఈ వేసవిలో మన కళ్లముందే కనిపించిన విపరీతమైన వేడి, ఊపిరాడని ఉక్కపోత, భయానకమైన అడవుల కార్చిచ్చులు, అనూహ్యంగా ముంచెత్తిన ఆకస్మిక వరదలు.. ఇవన్నీ రాబోయే రోజుల్లో భూమి ఎంత ప్రమాదకరంగా మారబోతోందో చెప్పే చిన్న శాంపిల్ మాత్రమే అని పర్యావరణ నిపుణులు అంటున్నారు..

చిత్రం లేదు
తెలంగాణSwechaa04 Sep 2026, 08:06 AM

ఇదీ పదేళ్ల దొరల పాలనలో జరిగిన అరాచకం!?..

తెలంగాణలో ఇటీవల ఏసీబీ దాడుల్లో బయటపడుతున్న అక్రమాస్తులు, రాజకీయ అవినీతి, అధికారుల తీరు చూస్తుంటే సభ్య సమాజం తలదించుకునేలా ఉందనే ఆరోపణలు వినిపిస్తున్నాయి.. ఏసీబీ ఎవరిని పట్టినా మినిమం వంద కోట్ల రాలుతున్న ఘటనలు మనం చూస్తూనే ఉన్నాం.. ఒక పేద వాడికి పూటగడవడమే కష్టమైన ఈ రోజుల్లో ప్రభుత్వ ఉద్యోగాలు చేస్తూ, రాజకీయాలు ఏలుతూ వందల కోట్లు వెనుక వేయడం అంటే ఆషామాషీ వ్యవహారం కాదని అంటున్నారు..

Ravi Teja-Prabhas: ప్రభాస్‌లా డేరింగ్ స్టెప్..వర్కౌట్ అయ్యేనా?సినిమాSwechaa04 Sep 2026, 08:01 AM

Ravi Teja-Prabhas: ప్రభాస్‌లా డేరింగ్ స్టెప్..వర్కౌట్ అయ్యేనా?

Ravi Teja: మాస్ మహారాజ్..తాజాగా వచ్చిన ఇరుముడి సినిమాతో ఫుల్ ఫాంలోకి వచ్చేశాడు. బ్యాక్ టు బ్యాక్ సినిమాలను లైన్‌లో పెడుతున్నాడు. అంతేకాదు, మునుపెన్నడూ లేని విధంగా తన మాస్ ఇమేజ్‌ని పక్కన పెట్టి మరీ రిస్క్ చేయడానికి రెడీ అవుతున్నాడు. దీంతో, వచ్చిన సాలీడ్ సక్సెస్ మైలేజ్‌ను మళ్ళీ మన మాస్ రాజా కంటిన్యూ చేయగలడా? అనే సందేహాలు మొదలయ్యాయి. దీనికి, కారణం ఇలా ప్రయోగం చేసే ప్రభాస్ గట్టిగా దెబ్బతిన్నాడు.

చిత్రం లేదు
SpiritualitySwechaa04 Sep 2026, 07:20 AM

హనుమంతుడికి తమలపాకుల మాల ఎందుకు సమర్పిస్తారు?

హనుమంతుడు అంటే అపారమైన బలవంతుడు మాత్రమే కాదు.. అచంచలమైన భక్తి, వినయం, ధైర్యం, శ్రీరామునిపై సంపూర్ణ శరణాగతి ఉన్న భక్తుడు.. అందుకే ఆంజనేయస్వామికి వివిధ పుష్పాలు, ఆకులతో చేసే అలంకరణలకు భక్తి సంప్రదాయంలో ప్రత్యేక స్థానం ఉందని శాస్త్రాలు చెబుతాయి.. ఇక ఏ భక్తజన హృదయంలో రామనామం పలికినా, అక్కడ ముందుగా ప్రత్యక్షమయ్యే దివ్యరూపం... మన హనుమంతులవారు.

మానవాళికి నిత్య మార్గదర్శి... శ్రీకృష్ణుడి జీవితంలో దాగిన ఆధ్యాత్మిక రహస్యం ఇదే!.SpiritualitySwechaa04 Sep 2026, 07:06 AM

మానవాళికి నిత్య మార్గదర్శి... శ్రీకృష్ణుడి జీవితంలో దాగిన ఆధ్యాత్మిక రహస్యం ఇదే!.

ఈ విశ్వం ఒక లీల అయితే, ఆ లీలలకు మూలమైన పరమాత్మ స్వరూపం శ్రీకృష్ణతత్వం. మానవుడిగా భూమిపై అవతరించి, జీవితంలో ఎదురయ్యే ప్రతి సంఘర్షణను చిరునవ్వుతో స్వీకరించి, సకల మానవాళికి ఆత్మజ్ఞానాన్ని అందించిన పూర్ణావతారమే కృష్ణావతారం అని మన పురాణాలు, శాస్త్రాలు చెబుతున్నాయి.. ఆ జగన్నాథుని అవతరణ సాధారణమైనది కాదు. సరిగ్గా 5,252 సంవత్సరాల క్రితం, సాధారణ పూర్వ శకం (B.C.E) 3228 జులై 18న, శ్రావణ మాసంలో, కృష్ణ పక్ష అష్టమి తిథి నాడు, రోహిణీ నక్షత్రంలో, బుధవారం అర్థరాత్రి 12 గంటలకు ఆ పరమాత్మ మధురలో దేవకీ వసుదేవుల కడుపున జన్మించారు

సొంత నియోజకవర్గంపై సీఎం రేవంత్ ఫోకస్..తెలంగాణSwechaa03 Sep 2026, 11:58 PM

సొంత నియోజకవర్గంపై సీఎం రేవంత్ ఫోకస్..

Cm Revanth: సీఎం రేవంత్ రెడ్డి తన సొంత నియోజకవర్గంపై ఫోకస్ పెట్టారు. తన ఇలాకాలో అభివృద్ధి పనుల్లో వేగం పెంచనున్నారు. ఇందులో భాగంగా కొడంగల్ లో పర్యటించనున్నారు. రేపు, ఎల్లుండి రెండు రోజులపాటు కొడంగల్ నియోజకవర్గంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పర్యటిస్తారు. అక్కడ జరుగుతున్న పలు అభివృద్ధి కార్యక్రమాలను ఆయన స్వయంగా పరిశీలించనున్నారు.

కొండా సురేఖ ఉప ఎన్నికకు సిద్ధమవుతున్నారా..? సుస్మిత సెన్సేషనల్ కామెంట్స్..!తెలంగాణSwechaa03 Sep 2026, 11:56 PM

కొండా సురేఖ ఉప ఎన్నికకు సిద్ధమవుతున్నారా..? సుస్మిత సెన్సేషనల్ కామెంట్స్..!

మంత్రి పదవి పోయింది.. కానీ కొండా కుటుంబం పోరాటం మాత్రం ఆగలేదు. పైగా ఇప్పుడు ఆ పోరాటం కాంగ్రెస్‌లో ఉంటూనా.. లేక ప్రజాక్షేత్రానికి వస్తుందా అనే చర్చ మొదలైంది. కొండా సురేఖ కూతురు సుస్మిత నేష‌న‌ల్ మీడియాతో చేసిన వ్యాఖ్యలు ఈ అనుమానాలకు మరింత బలం చేకూర్చాయి. ఇంత‌కీ ఆమె ఏమ‌న్నారు..? కొండా ఫ్యామిలీ నెక్స్ట్ టార్గెట్ ఏంటి..?

మీ వైఖరి మారాలి, లేదంటే మీ పదవులు మారతాయితెలంగాణSwechaa03 Sep 2026, 11:39 PM

మీ వైఖరి మారాలి, లేదంటే మీ పదవులు మారతాయి

Ponguleti Srinivas Reddy: రెవెన్యూ శాఖలో ప్రజలకు ఇబ్బందులు కలిగించే అధికారుల వైఖరి మారాలని, లేకపోతే వారి పదవులు మారే పరిస్థితి వస్తుందని రాష్ట్ర రెవెన్యూ, హౌసింగ్, సమాచార శాఖల మంత్రి పొంగులేటి శ్రీనివాస రెడ్డి తీవ్రస్థాయిలో హెచ్చరించారు.

ప్రజల సమస్యలను పరిష్కరించేందుకే ప్రభుత్వం భూ భారతి చట్టం ద్వారా అధికారాలను క్షేత్రస్థాయికి వికేంద్రీకరించిందని మంత్రి పొంగులేటి తెలిపారు. ఆ అధికారాలను స్వప్రయోజనాలకు వినియోగిస్తే ఎంతటి వారినైనా ఉపేక్షించబోమని స్పష్టం చేశారు. ధరణి వ్యవస్థలో అత్యధిక అధికారాలు కలెక్టర్ వద్దే ఉండేవని, అయినప్పటికీ ప్రజల సమస్యలు పరిష్కారం కాలేదన్నారు. అందుకే భూ భారతి చట్టం ద్వారా అధికారాలను తహసీల్దార్ స్థాయి వరకు వికేంద్రీకరించామని తెలిపారు. అయితే క్షేత్రస్థాయి అధికారులు ఆ అధికారాలను ప్రజల సమస్యల పరిష్కారానికి కాకుండా స్వప్రయోజనాలకు ఉపయోగిస్తుండటంతో ఆశించిన ఫలితాలు రావడం లేదని మంత్రి ఆగ్రహం వ్యక్తం చేశారు.

కేసీఆర్‌కి ముందే చెప్పా.. రేవంత్ దూకుడు ఆపకపోతే మీరు ఇంటికే అనిSwechaa03 Sep 2026, 11:08 PM

కేసీఆర్‌కి ముందే చెప్పా.. రేవంత్ దూకుడు ఆపకపోతే మీరు ఇంటికే అని

సైదాబాద్ స్టీల్ బ్రిడ్జి ప్రారంభోత్సవ సభలో హైదరాబాద్ ఎంపీ, ఎంఐఎం చీఫ్ అసదుద్దీన్ ఒవైసీ సీఎం రేవంత్ ను ఉద్దేశించి ఎంపీ అసదుద్దీన్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. రేవంత్ రెడ్డిది చాలా దూకుడు స్వభావం అని అన్నారు. రేవంత్ దూకుడును ఆపమని కేసీఆర్ కి ముందే చెప్పాను.. ఆపకపోతే మీరందరూ ఇంటికే అని కూడా చెప్పా అని అసద్ అన్నారు.

''రేవంత్ రెడ్డి దూకుడును కంట్రోల్ చేయండి.. లేదంటే మీరంతా ఇంటికే పరిమితం కావాల్సి వస్తుందని నేను కేసీఆర్‌కు చాలాసార్లు చెప్పాను. సరిగ్గా అదే జరిగింది. కానీ ఇప్పుడు ముఖ్యమంత్రి రేవంత్ తన దూకుడు స్వభావానికి భిన్నంగా చాలా సంయమనంతో ఉంటున్నారు. మిమ్మల్ని ఏది ఆపుతుందో నాకు తెలియదు. మళ్లీ మీ దూకుడును ప్రదర్శించండి, ప్రజల్లోకి రండి. ప్రజలు మీకు సంపూర్ణ మద్దతు ఇస్తారు'' అని అసద్ అన్నారు.

https://x.com/LutyensMediaIN/status/2095544564702671098

నన్ను ఎవరూ బెదిరించలేరు, ధమ్మీ ఇచ్చి భయపెట్టలేరుతెలంగాణSwechaa03 Sep 2026, 10:59 PM

నన్ను ఎవరూ బెదిరించలేరు, ధమ్మీ ఇచ్చి భయపెట్టలేరు

Cm Revanth: నేను ఎవరికీ గులాంను కాను అని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. కేవలం స్నేహానికి మాత్రమే గులాంనని చెప్పారు. తనను ఎవరూ బెదిరించలేరని, ధమ్మీ ఇచ్చి భయపెట్టలేరని ఆయన స్పష్టం చేశారు. కేవలం ప్రేమ, స్నేహంతోనే తనను గెలవగలరని వ్యాఖ్యానించారు. స్నేహం కోసం ఎంతవరకైనా వెళ్తానని, ఎంతైనా చేస్తానని రేవంత్ అన్నారు. రూ.620 కోట్లతో నిర్మించిన సైదాబాద్ స్టీల్ బ్రిడ్జి ప్రారంభోత్సవంలో సీఎం రేవంత్ ఈ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.

Rashmika Mandanna: నేషనల్ క్రష్ ఇప్పుడు నంబర్ 1..దీపిక కూడా వెనక్కే!సినిమాSwechaa03 Sep 2026, 09:43 PM

Rashmika Mandanna: నేషనల్ క్రష్ ఇప్పుడు నంబర్ 1..దీపిక కూడా వెనక్కే!

Rashmika Mandanna: ఛలో సినిమాతో తెలుగు చిత్ర సీమకి పరిచయమైన కన్నడ బ్యూటీ రష్మిక మందన్న..ఆ తర్వాత కమర్షియల్ హీరోయిన్‌గా మారింది. ఇక, అల్లు అర్జున్ సరసన నటించిన పుష్ప ఫ్రాంఛైజీస్‌తో పాన్ ఇండియా హీరోయిన్‌గా పాపులారిటీ తెచ్చుకుంది. అప్పటి నుంచి రష్మికకి పాన్ ఇండియా ప్రాజెక్ట్సే వస్తున్నాయి. ఇలా క్రేజీ మూవీస్‌తో వరుస విజయాలను అందుకుంటున్న నేషనల్ క్రష్..అరుదైన ఘనతను సాధించింది.

KTR:పాదయాత్ర చేస్తా- కేటీఆర్ కీలక ప్రకటన.. ప్రభుత్వానికి 10రోజుల డెడ్‌లైన్తెలంగాణSwechaa03 Sep 2026, 09:25 PM

KTR:పాదయాత్ర చేస్తా- కేటీఆర్ కీలక ప్రకటన.. ప్రభుత్వానికి 10రోజుల డెడ్‌లైన్

KTR: రైతన్నల పంటలను కాపాడేందుకు మరోసారి పోరాటానికి సిద్ధమని బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ప్రకటించారు. నాగార్జునసాగర్ ఎడమ కాలువ కింద పంటలు ఎండిపోతుంటే కాంగ్రెస్ ప్రభుత్వం నీటిని విడుదల చేయకుండా నిర్లక్ష్యం చేస్తోందని మండిపడ్డారు. సెప్టెంబర్ 14లోపు ఎడమ కాలువకు నీటిని ఎప్పుడు, ఎంత మేరకు విడుదల చేస్తారో స్పష్టమైన షెడ్యూల్ ప్రకటించాలని ప్రభుత్వానికి అల్టిమేటం ఇచ్చారు. గడువులోగా స్పందించకపోతే వేలాది మంది రైతులతో కలిసి కోదాడ నుంచి హాలియా వరకు స్వయంగా పాదయాత్ర చేపడతానని ప్రకటించారు.

కష్టపడి ఈ స్థాయికి వచ్చా, ఒక్క పోటుతో కూల్చేశారు-చిన్నారెడ్డితెలంగాణSwechaa03 Sep 2026, 08:58 PM

కష్టపడి ఈ స్థాయికి వచ్చా, ఒక్క పోటుతో కూల్చేశారు-చిన్నారెడ్డి

Chinna Reddy: తెలంగాణ ప్లానింగ్ కమిషన్ వైస్ చైర్మన్ పదవి నుంచి తనను తప్పిస్తూ కాంగ్రెస్ హైకమాండ్ తీసుకున్న నిర్ణయంపై చిన్నారెడ్డి స్పందించారు. నాకు పదవులపై సోకు లేదని ఆయన అన్నారు. కష్టపడి ఈ స్థాయికి వచ్చానని, ఒక్క పోటుతో కూల్చేశారని వాపోయారు. ఇందిరాగాంధీ పార్టీ పెట్టినప్పటి నుండి కాంగ్రెస్ పార్టీలోనే ఉన్నానని తెలిపారు. తనకు ప్లానింగ్ కమిషన్ పదవిని ‘టిల్ ఫర్దర్ ఆర్డర్స్’ పేరుతో ఇచ్చారని, ఈరోజే ఆ ఉత్తర్వులు వచ్చాయన్నారు. పదవులు ఉన్నా లేకున్నా నా గౌరవం నాకు ఉంటుందన్నారు చిన్నారెడ్డి. పదవి కోసం రేవంత్ రెడ్డిని కలిసే ప్రయత్నం కూడా చేయలేదన్నారు.

S.S.Rajamouli: సూర్య-అల్లు అర్జున్‌లలో రాజమౌళి హీరో ఎవరు?సినిమాSwechaa03 Sep 2026, 08:27 PM

S.S.Rajamouli: సూర్య-అల్లు అర్జున్‌లలో రాజమౌళి హీరో ఎవరు?

సూర్య కొన్నేళ్ళ నుంచి రాజమౌళి దర్శకత్వంలో సినిమా చేయడానికి ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నాడు. ఒకసారి ఛాన్స్ వచ్చినట్టే వచ్చి మిస్ అయిందని చాలా సందర్భాలలో చెప్పాడు. ఇక, పుష్ప సిరీస్ తర్వాత ఐకాన్ స్టార్ అల్లు అర్జున్‌కి గ్లోబల్ వైడ్‌గా పెరిగిన క్రేజ్ అసాధారణం. ప్రస్తుతం విజయేంద్ర ప్రసాద్ సూర్య, అల్లు అర్జున్‌ల కోసం కథలు సిద్ధం చేస్తున్నారట. వారణాసి రిలీజ్ తర్వాత గ్యారెంటీగా వీరిలో ఒకరు జక్కన్నతో సినిమాను చేయడానికి రెడీ అవుతారని తెలుస్తోంది.

Yeshanagula: చరిత్ర సృష్టించిన తెలంగాణ ఫోక్ సాంగ్ ‘ఏషనాగుల’..సినిమాSwechaa03 Sep 2026, 07:54 PM

Yeshanagula: చరిత్ర సృష్టించిన తెలంగాణ ఫోక్ సాంగ్ ‘ఏషనాగుల’..

The Paradise: మన తెలంగాణా సంసృతి, సాంప్రదాయాలకి ఇప్పుడు, ప్రతీ ప్రాంత ప్రజలు ఆకర్శితులవుతున్నారు. జానపద కాళారులు కోకొల్లలున్న రాష్ట్రం తెలంగాణ. ఫోక్ సాంగ్స్‌కి పెట్టింది పేరు. గత కొంతకాలం నుంచి తెలంగాణ నేపథ్యంలో సినిమాలు, పాటలు వచ్చి రెండు తెలుగు రాష్ట్రాలలోని ప్రజలనే కాకుండా ఇతర దేశాలలోని ప్రేక్షకులను ఆకట్టుకుంటున్నాయి. ఈ క్రమంలోనే వచ్చిన తెలంగాణ ఫోక్ సాంగ్ ‘ఏషనాగుల’ తెలుగు చిత్ర పరిశ్రమలో అతివేగంగా 50 మిలియన్లకి పైగా వ్యాస్ రాబట్టి సరికొత్త చరిత్ర సృష్ఠించింది.

భూదందాల నుంచి ఇసుక అక్రమ రవాణ వరకు.. ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి అవినీతి చిట్టా ఇదే?తెలంగాణSwechaa03 Sep 2026, 07:25 PM

భూదందాల నుంచి ఇసుక అక్రమ రవాణ వరకు.. ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి అవినీతి చిట్టా ఇదే?

Buyyani Manohar Reddy: తాండూరు ఎమ్మెల్యే బుయ్యని మనోహర్ రెడ్డి వ్యవహారశైలిపై బీఆర్‌ఎస్ సీనియర్ నాయకులు తీవ్ర ఆరోపణలు చేశారు. ప్రజా సమస్యల పరిష్కారం కంటే భూముల వ్యవహారాలపైనే ఎమ్మెల్యే కుటుంబానికి ఆసక్తి ఎక్కువగా ఉందని విమర్శించారు. ఇటీవల ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలను ప్రస్తావిస్తూ.. ఎమ్మెల్యే వ్యవహారాలపై సీఎం స్థాయిలోనే ప్రస్తావనలు రావడం ఆయన తీరుపై ప్రశ్నలు తలెత్తేలా చేస్తోందన్నారు. గురువారం మాజీ ఎమ్మెల్యే రోహిత్ రెడ్డి నివాసం లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో వికారాబాద్ జిల్లా మాజీ గ్రంథాలయ చైర్మన్ రాజు గౌడ్, నాయకులు నర్సింహులు, నరేందర్ గౌడ్, మాజీ కౌన్సిలర్లు పరిమళ, శోభారాణి మాట్లాడారు.

మళ్లీ పాదయాత్ర- కేటీఆర్ కీలక ప్రకటనతెలంగాణSwechaa03 Sep 2026, 07:02 PM

మళ్లీ పాదయాత్ర- కేటీఆర్ కీలక ప్రకటన

''కాంగ్రెస్ ప్రభుత్వానికి, ఎడమ కాలువ కింద నీళ్లు ఇవ్వాల్సిన నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డికి ఒకటే హెచ్చరిక జారీ చేస్తున్నా. మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి 14 సెప్టెంబర్ లోపు వినాయక చవితి లోపల నీళ్లు ఇచ్చే షెడ్యూల్ విడుదల చేయకపోతే వేలాది మంది రైతులతో కోదాడ నుంచి హాలియా దాకా మళ్లీ తిరిగి పాదయాత్ర నేనే చేస్తా. ఉత్తమ్ కుమార్ రెడ్డి వెంటనే స్పందించాలి, షెడ్యూల్ విడుదల చేయాలి. ఎన్ని తడులకు నీళ్లు ఇస్తారు? ఎప్పుడెప్పుడు ఇస్తారు? తెలియజేయాలి'' అని మిర్యాలగూడలో రైతు సదస్సులో కేటీఆర్ డిమాండ్ చేశారు.

ఈ నెల ఫౌజీ నుంచి వచ్చే ప్రతీ అప్‌డేట్ ఒక సెన్షేషనే!సినిమాSwechaa03 Sep 2026, 06:43 PM

ఈ నెల ఫౌజీ నుంచి వచ్చే ప్రతీ అప్‌డేట్ ఒక సెన్షేషనే!

Prabhas-Fauzi-Updates: పాన్ ఇండియన్ స్టార్ ప్రభాస్ నటిస్తున్న లేటెస్ట్ సినిమా ఫౌజీ. హను రాఘవపూడి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాలో హీరోయిన్‌గా ఇమాన్వీ నటిస్తోంది. మైత్రీ మూవీ మేకర్స్ భారీ బడ్జెట్‌తో నిర్మిస్తోంది. ఇటీవల హైదరాబాద్ కోకాపేట్ లో వేసిన భారీ సెట్స్‌లో చిత్రీకరణ జరిపారు. దీనికోసం భారీ స్థాయిలో చార్మినార్ సెట్‌ని నిర్మించారు. దాదాపు, షూటింగ్ కంప్లీట్ అయిన నేపథ్యంలో ఈ నెల నుంచి వరుస అప్‌డేట్స్ రానున్నాయి.

RC 17: దసరాకి సుకుమార్-రామ్ చరణ్‌ల సినిమా ప్రారంభం..సినిమాSwechaa03 Sep 2026, 06:14 PM

RC 17: దసరాకి సుకుమార్-రామ్ చరణ్‌ల సినిమా ప్రారంభం..

పెద్ది తర్వాత మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ నటించబోతున్న సినిమా త్వరలో మొదలవబోతుందని వార్తలు వస్తున్నాయి గానీ, అదెప్పుడు అనేది ఇన్నాళ్ళు ఓ క్లారిటీ మాత్రం లేదు. చరణ్ కెరీర్‌లో నటించబోతున్న 17వ సినిమా ఇది. ఆర్సీ 17గా ప్రస్తుతం పిలుస్తున్న ఈ ప్రాజెక్ట్‌ను సుకుమార్ దర్శకత్వంలో చేయనున్నాడు. తాజాగా వచ్చిన కన్‌ఫర్మేషన్ ప్రకారం దసరా పండుగ రోజు (అక్టోబర్ 20న) ఈ క్రేజీ ప్రాజెక్ట్ మొదలవబోతోంది.

కాంగ్రెస్ పార్టీకి రాజీనామాపై కొండా సురేఖ కీలక ప్రకటనతెలంగాణSwechaa03 Sep 2026, 06:06 PM

కాంగ్రెస్ పార్టీకి రాజీనామాపై కొండా సురేఖ కీలక ప్రకటన

Konda Surekha: కాంగ్రెస్ పార్టీకి రాజీనామాపై కొండా సురేఖ క్లారిటీ ఇచ్చారు. కాంగ్రెస్ కు తాను రాజీనామా చేయడం లేదని ప్రకటించారు. కాంగ్రెస్ లోనే కొనసాగుతానని స్పష్టం చేశారు. మంత్రి పదవి లేకపోయినా ఎమ్మెల్యేగా కొనసాగుతానని వెల్లడించారు. మంత్రి పదవి నుంచి బర్తరఫ్ చేస్తే కొండా సురేఖ ఎమ్మెల్యే పదవితో పాటు కాంగ్రెస్ పార్టీకి కూడా రాజీనామా చేస్తారనే వార్తలు వచ్చాయి. మరో పార్టీలోకి కొండా సురేఖ వెళ్తారనే ప్రచారం జరిగింది. ఈ ప్రచారానికి కొండా సురేఖ తెరదించారు. తాను కాంగ్రెస్ లోనే కొనసాగుతానని ప్రకటించారు.

రేవంత్ రెడ్డి బ్లాక్ మెయిల్ చేశారు- కొండా సురేఖ సంచలన ఆరోపణలుతెలంగాణSwechaa03 Sep 2026, 05:02 PM

రేవంత్ రెడ్డి బ్లాక్ మెయిల్ చేశారు- కొండా సురేఖ సంచలన ఆరోపణలు

Konda Surekha: తనను బర్తరఫ్ చేస్తూ హైకమాండ్ తీసుకున్న నిర్ణయంపై కొండా సురేఖ తీవ్రంగా స్పందించారు. సీఎం రేవంత్ రెడ్డి సంచలన ఆరోపణలు చేశారు. తనను బర్తరఫ్ చేసేలా హైకమాండ్ ను రేవంత్ రెడ్డి బ్లాక్ మెయిల్ చేశారని ఆరోపించారు. నన్ను తొలగించకపోతే తాను వెళ్లిపోతానని రేవంత్ రెడ్డి పార్టీ పెద్దలను బెదిరించారని చెప్పారు. రేవంత్ రెడ్డి బ్లాక్ మెయిల్ తోనే హైకమాండ్ బర్తరఫ్ నిర్ణయం తీసుకుందన్నారు.

రేవంత్ బ్రదర్స్, పొంగులేటి కుట్ర

తన బర్తరఫ్ కుట్ర వెనుక రేవంత్ రెడ్డి సోదరులు, మంత్రి పొంగులేటి శ్రీనివాస రెడ్డి ఉన్నారని ఆరోపించారు. నాకు తెలియకుండానే నా ఓఎస్ డీ సుమంత్ ను తప్పించారని, సుమంత్ అరెస్ట్ కూడా కక్షపూరిత చర్యే అని కొండా సురేఖ చెప్పారు. ఈ సందర్భంగా ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే, కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీకి రాసిన లేఖలను కొండా సురేఖ విడుదల చేశారు.

కాంగ్రెస్ పాలనపై బీఆర్ఎస్ బిగ్ అటాక్.. సంచలన ఆరోపణలు చేసిన హరీశ్‌రావు!..తెలంగాణSwechaa03 Sep 2026, 04:55 PM

కాంగ్రెస్ పాలనపై బీఆర్ఎస్ బిగ్ అటాక్.. సంచలన ఆరోపణలు చేసిన హరీశ్‌రావు!..

కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి వెయ్యి రోజులు పూర్తయినా ప్రజలకు ఇచ్చిన హామీల్లో ఏ ఒక్కటీ పూర్తిస్థాయిలో అమలు కాలేదని బీఆర్ఎస్ అసెంబ్లీ డిప్యూటీ ఫ్లోర్ లీడర్, మాజీ మంత్రి తన్నీరు హరీశ్‌రావు విమర్శించారు. వంద రోజుల్లో ఆరు గ్యారెంటీలు అమలు చేస్తామని బాండ్ పేపర్లు రాసిచ్చారు.. ఇప్పుడు వెయ్యి రోజులు దాటినా హామీలకు అతీగతి లేదని మండిపడ్డారు. కాంగ్రెస్ ప్రభుత్వ వెయ్యి రోజుల వైఫల్యాలను ఎండగడుతూ నర్సాపూర్ ఎమ్మెల్యే వాకిటి సునీతా లక్ష్మారెడ్డి ఆధ్వర్యంలో గురువారం కౌడిపల్లి మండల కేంద్రంలో భారీ నిరసన కార్యక్రమం నిర్వహించారు.

కొండా సురేఖ బీసీ కార్డుకు రేవంత్ సర్కార్ కౌంటర్.. ముగ్గురు బీసీ మహిళలకు కీలక పదవులుతెలంగాణSwechaa03 Sep 2026, 04:33 PM

కొండా సురేఖ బీసీ కార్డుకు రేవంత్ సర్కార్ కౌంటర్.. ముగ్గురు బీసీ మహిళలకు కీలక పదవులు

BC Women: కాంగ్రెస్ లో కలకలం రేపిన కొండా సురేఖ ఎసిసోడ్ కు ఎండ్ కార్డ్ పడింది. కొండా సురేఖపై వేటు వేసింది హైకమాండ్. మంత్రివర్గం నుంచి ఆమెను బర్తరఫ్ చేస్తూ నిర్ణయం తీసుకుంది. మరోవైపు చిన్నారెడ్డిపైనా వేటు వేసింది హైకమాండ్. తెలంగాణ ప్రణాళికా బోర్డు వైస్ చైర్మన్ పదవి నుంచి చిన్నారెడ్డిని తొలగించింది.

తనపై చర్యలు తీసుకుంటే బీసీలంతా ఏకమవుతారని కొండా సురేఖ కాంగ్రెస్ పెద్దలకు వార్నింగ్ ఇచ్చిన సంగతి తెలిసిందే. తనపై చర్యలను నిలువరించేలా ఆమె బీసీ మహిళ కార్డును ప్లే చేశారు. అయితే, కొండా సురేఖపై వేటు పడేలా చూడటంతో పాటు ఆమె బీసీ కార్డుకు కౌంటర్ కూడా ఇచ్చింది రాష్ట్ర నాయకత్వం. ముగ్గురు బీసీ మహిళలకు అగ్ర తాంబూలం ఇచ్చింది. వారికి కీలక పదవులు అప్పగించింది. ఒక బీసీ పదవి బర్తరఫ్ తో ముగ్గురు బీసీ మహిళలకు పదవుల్లో చోటు ఇచ్చింది.

బర్తరఫ్ పై స్పందించిన కొండా సురేఖ.. సంచలన వ్యాఖ్యలుతెలంగాణSwechaa03 Sep 2026, 04:03 PM

బర్తరఫ్ పై స్పందించిన కొండా సురేఖ.. సంచలన వ్యాఖ్యలు

Konda Surekha: క్యాబినెట్ నుంచి తనను బర్తరఫ్ చేస్తూ కాంగ్రెస్ హైకమాండ్ తీసుకున్న నిర్ణయంపై కొండా సురేఖ స్పందించారు. బర్తరఫ్ చేయడాన్ని ఆమె ఖండించారు. ముందస్తు సమాచారం ఇవ్వకుండా తనను బర్తరఫ్ చేశారని వాపోయారు. నిర్ణయానికి ముందు నా వివరణ తీసుకోవాల్సిందన్నారు. నా కుమార్తె వ్యాఖ్యలకు నన్ను ఎలా బాధ్యురాలిని చేస్తారని మరోసారి కొండా సురేఖ ప్రశ్నించారు. నా కూతురు స్వతంత్ర మహిళ, ఆమె వ్యాఖ్యలు ఆమెవే అని తేల్చి చెప్పారు. నా కూతురు వ్యాఖ్యలను నేను ఖండించాల్సిన అవసరం లేదన్నారు. తన కుమార్తె వ్యక్తిగత అభిప్రాయాన్ని తప్పుపట్టే అధికారం తనకు లేదని కొండా సురేఖ స్పష్టం చేశారు. కుటుంబసభ్యులతో మాట్లాడి భవిష్యత్ కార్యాచరణపై నిర్ణయం ప్రకటిస్తానన్నారు కొండా సురేఖ.

INDIA: ఎస్‌బీఐ ఖాతాదారులు అలర్ట్.. అక్టోబర్ 1 నుంచి మారనున్న ఏటీఎం రూల్స్!..NationalSwechaa03 Sep 2026, 03:52 PM

INDIA: ఎస్‌బీఐ ఖాతాదారులు అలర్ట్.. అక్టోబర్ 1 నుంచి మారనున్న ఏటీఎం రూల్స్!..

ప్రభుత్వ రంగ బ్యాంకింగ్‌ దిగ్గజం స్టేట్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా (SBI) శాలరీ ప్యాకేజీ ఖాతాదారులకు షాకిచ్చింది.. ఎస్‌బీఐ డెబిట్‌ కార్డును ఉపయోగించి ఇతర బ్యాంకుల ఏటీఎంల నుంచి చేసుకునే ఉచిత నగదు ఉపసంహరణల పరిమితిని సవరించింది. దీన్ని 10 నుంచి 5కు తగ్గించింది. ఈ కొత్త నిబంధనలు అక్టోబర్‌ 1 నుంచే అమల్లోకి రానున్నాయి. ఇక అదనంగా చేసే ప్రతి ఫైనాన్షియల్‌ ట్రాన్సాక్షన్స్‌పై రూ.23 వసూలు చేయనుంది. దీనికి జీఎస్‌టీ అదనం. నాన్‌ ఫైనాన్షియల్‌ ట్రాన్సాక్షన్లపై రూ.11+ జీఎస్‌టీ ఛార్జీలు ఉండనున్నాయి. ఈ కొత్త నిబంధనలు కేవలం ఎస్‌బీఐ శాలరీ ప్యాకేజీ ఖాతాదారులకు మాత్రమే.

సురేఖను పదవి నుంచి తొలగించడానికి కారణమిదే : రాజాసింగ్తెలంగాణSwechaa03 Sep 2026, 03:39 PM

సురేఖను పదవి నుంచి తొలగించడానికి కారణమిదే : రాజాసింగ్

రాష్ట్ర రాజకీయాల్లో గత కొంతకాలంగా చర్చనీయాంశంగా మారిన కొండా సురేఖ ఎపిసోడ్‌కు ఎట్టకేలకు ఎండ్ కార్డ్ పడింది. తన కూతురు కొండా సుస్మిత కాంగ్రెస్ పార్టీ, సీఎం రేవంత్ రెడ్డి మీద చేసిన వివాదాస్పద వ్యాఖ్యల నేపథ్యంలో కొండా సురేఖను మంత్రివర్గం నుంచి బర్తరఫ్ చేస్తూ కాంగ్రెస్ అధిష్టానం, ముఖ్యమంత్రి సంచలన నిర్ణయం తీసుకున్నారు. సురేఖను మంత్రి వర్గం నుంచి తక్షణమే తొలగించాలని కోరుతూ సీఎం పంపిన లేఖ లోక్‌భవన్‌కు చేరింది. కొండా సురేఖ పదవి పోవడానికి గల అసలు కారణాలను గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్ వెల్లడించారు. మంత్రి కొండా సురేఖ ఓఎస్డీ అరెస్టు నుంచే ఈ కథ మొదలైందని పేర్కొన్నారు. డబ్బుల వాటా విషయంలో కమ్యూనికేషన్ గ్యాప్ రావడంతోనే ఈ వివాదం ముదిరిందని.. సురేఖను సస్పెండ్ చేయాలని కాంగ్రెస్ పెద్దలు ఢిల్లీలో కూర్చున్నారని ఎమ్మెల్యే రాజాసింగ్ ఆరోపించారు. కాంగ్రెస్ ప్రభుత్వంలో అవినీతి పెరిగిపోయిందని విమర్శించిన రాజాసింగ్.. డబ్బుల వివాదమే కొండా సురేఖ మంత్రి పదవి పోవడానికి కారణమని ఆరోపించారు.

కొండా సురేఖ, చిన్నారెడ్డిపై వేటు.. ఆ ముగ్గురు మహిళలకు కీలక పదవులుతెలంగాణSwechaa03 Sep 2026, 03:19 PM

కొండా సురేఖ, చిన్నారెడ్డిపై వేటు.. ఆ ముగ్గురు మహిళలకు కీలక పదవులు

Konda Surekha: కొండా సురేఖ ఎపిసోడ్ లో ఢిల్లీ కేంద్రంగా రెండు రోజుల పాటు చోటు చేసుకున్న నాటకీయ పరిణామాలకు కాంగ్రెస్ హైకమాండ్ తెరదించింది. కొండా సురేఖతో పాటు చిన్నారెడ్డిపై చర్యలు తీసుకుంది. వారిద్దరిపై వేటు వేసింది. తద్వారా నాటకీయ పరిణామాలకు తెరదించింది. మంత్రి పదవికి రాజీనామా చేయాలని హైకమాండ్ కోరినా.. అందుకు కొండా సురేఖ ససేమిరా అన్నారు. దాంతో ఆమెను బర్తరఫ్ చేస్తూ హైకమాండ్ నిర్ణయం తీసుకుంది. పార్టీ అధిష్టానం నుంచి గ్రీన్ సిగ్నల్ రావడంతో వెంటనే కొండా సురేఖను క్యాబినెట్ నుంచి బర్తరఫ్ చేయాలంటూ గవర్నర్ కు లేఖ పంపారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి.

మరోవైపు చిన్నారెడ్డిపైనా వేటు వేసింది కాంగ్రెస్ హైకమాండ్. తెలంగాణ ప్రణాళికా బోర్డు ఉపాధ్యక్షుడిగా చిన్నారెడ్డిని తొలగించింది. ఈ ఇద్దరి పై వేటు వేసి.. ముగ్గురు బీసీ మహిళలకు కీలక పదవులు ఇచ్చింది రేవంత్ ప్రభుత్వం. చిన్నారెడ్డి స్థానంలో జీహెచ్ఎంసీ మాజీ మేయర్ గద్వాల విజయలక్ష్మిని నియమించింది. రాష్ట్ర మహిళా కమిషన్ చైర్ పర్సన్ గా నేరెళ్ల శారదను, కాకతీయ అర్బన్ డెవలప్ మెంట్ అథారిటీ(KUDA) చైర్ పర్సన్ గా మాజీ రాజ్యసభ ఎంపీ గుండు సుధారాణిని అపాయింట్ చేసింది ప్రభుత్వం.

కొండా సురేఖ బర్తరఫ్.. చిన్నారెడ్డిపై వేటు.. గద్వాల విజయలక్ష్మికి పదవితెలంగాణSwechaa03 Sep 2026, 03:04 PM

కొండా సురేఖ బర్తరఫ్.. చిన్నారెడ్డిపై వేటు.. గద్వాల విజయలక్ష్మికి పదవి

Konda Surekha: తెలంగాణ కాంగ్రెస్ లో మంత్రి కొండా సురేఖ ఎసిసోడ్ కు ఎండ్ కార్డ్ పడింది. ఆమెతో రాజీనామా చేయిస్తారా? బర్తరఫ్ చేస్తారా? అన్న ఉత్కంఠకు తెర దించింది కాంగ్రెస్ హైకమాండ్. కొండా సురేఖను బర్తరఫ్ చేయాలని హైకమాండ్ నిర్ణయం తీసుకుంది. హైకమాండ్ నుంచి గ్రీన్ సిగ్నల్ రావడంతో.. మంత్రివర్గం నుంచి కొండా సురేఖను బర్తరఫ్ చేయాలని గవర్నర్ కు సిఫారసు లేఖ పంపారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. దీనిపై గవర్నర్ నిర్ణయం తీసుకోనున్నారు. అనంతరం లోక్ భవన్ నుంచి అధికారిక ఉత్వర్వులు వెలువడనున్నాయి. రాజీనామా చేసేందుకు కొండా సురేఖ అంగీకరించకపోవడంతో బర్తరఫ్ చేయాలని హైకమాండ్ డెసిషన్ తీసుకుంది.