స్వేచ్ఛ షార్ట్స్ — తాజా తెలుగు వార్తలు

కొండా సురేఖ బర్తరఫ్Swechaa03 Sep 2026, 02:31 PM

కొండా సురేఖ బర్తరఫ్

తెలంగాణ కాంగ్రెస్ లో మంత్రి కొండా సురేఖ వ్యవహారంలో ఉత్కంఠకు తెరపడింది. కొండా సురేఖను బర్తరఫ్ చేయాలని హైకమాండ్ నిర్ణయం తీసుకుంది. హైకమాండ్ నుంచి గ్రీన్ సిగ్నల్ రావడంతో.. మంత్రివర్గం నుంచి కొండా సురేఖను బర్తరఫ్ చేయాలని గవర్నర్ కు లేఖ పంపారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. దీనిపై గవర్నర్ నిర్ణయం తీసుకోనున్నారు.

అటు చిన్నారెడ్డిపైనా చర్యలు తీసుకుంది కాంగ్రెస్ హైకమాండ్. ఆయనపై వేటు వేసింది. ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడిగా చిన్నారెడ్డిని తొలగించింది. చిన్నారెడ్డి స్థానంలో జీహెచ్ ఎంసీ మాజీ మేయర్ గద్వాల విజయలక్ష్మిని నియామకం చేసింది కాంగ్రెస్ అధిష్టానం. ఇక, మహిళా కమిషన్ ఛైర్ పర్సన్ గా నేరెళ్ల శారదను అపాయింట్ చేశారు.

భారత్ కు మరో షాకిచ్చిన అమెరికా!..InternationalSwechaa03 Sep 2026, 02:07 PM

భారత్ కు మరో షాకిచ్చిన అమెరికా!..

వీసాల జారీలో కఠిన వైఖరి ప్రదర్శిస్తోన్న అమెరికా.. ఇప్పుడు భారత్‌కు మరో షాక్ ఇచ్చింది. అగ్రరాజ్యంలో శాశ్వత నివాసం కోసం ప్రయత్నిస్తున్న భారతీయులకు కీలక హెచ్చరికలు జారీ చేసింది. ఉపాధి ఆధారిత EB-1 గ్రీన్‌ కార్డ్‌ లు భారత దరఖాస్తుదారులకు రాబోయే కొన్నివారాల్లో అందుబాటులో ఉండకపోవచ్చని హెచ్చరించింది. భారతీయుల నుంచి భారీ డిమాండ్‌ ఉండటమే ఇందుకు కారణమని పేర్కొంది.

Kollywood - Trisha: లండన్‌లో త్రిష కొత్త చిత్రం ప్రారంభం!సినిమాSwechaa03 Sep 2026, 02:02 PM

Kollywood - Trisha: లండన్‌లో త్రిష కొత్త చిత్రం ప్రారంభం!

Kollywood: సీనియర్ స్టార్ హీరోయిన్ త్రిష ప్రధాన పాత్రలో కొత్త తమిళ సైకలాజికల్ థ్రిల్లర్ ప్రారంభమైంది. ఈ సినిమాకి దర్శకుడు రాజా కృష్ణ మేనన్. ఆయన దర్శకత్వంలో తెరకెక్కిస్తున్న ఈ చిత్రాన్ని మేకర్స్ 2026-09-03న అఫీషియల్‌గా ప్రకటించారు. మొదటిసారి పనోరమా స్టూడియోస్ కోలీవుడ్ ఇండస్ట్రీలోకి అడుగుపెట్టి, లోకోమోటివ్ గ్లోబల్ తో కలిసి నిర్మిస్తుండటం విశేషం. ఇక, ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ లండన్‌లో మొదలైంది.

వ్యక్తి దారుణ హత్య.. చిక్కుముడి విప్పిన మద్యం బాటిల్ మూతక్రైమ్Swechaa03 Sep 2026, 02:01 PM

వ్యక్తి దారుణ హత్య.. చిక్కుముడి విప్పిన మద్యం బాటిల్ మూత

ఓ మర్డర్ కేసును పోలీసులు చాలా చాకచక్యంగా ఛేదించారు. ఓ వ్యక్తిని హత్య చేసిన నిందితులు అక్కడి నుంచి పరార్ అయ్యారు.అయితే, కేసు నమోదు చేసుకున్న పోలీసులు కేవలం 24 గంటల వ్యవధిలోనే ఛేదించారు. ఈ ఘటన ఏపీలోని నంద్యాల జిల్లా ఆళ్లగడ్డలో చోటుచేసుకోగా ఆలస్యంగా వెలుగుచూసింది.అయితే, మద్యం బాటిల్ మూత పోలీసుల పనిని మరింత సులభతరం చేసింది. విచారణలో భాగంగా మృతుడి భార్య సుబ్బులు..నిందితుడు గురుప్రసాద్‌కు మధ్య వివాహేతర సంబంధం ఉందని పోలీసులు తేల్చారు. వారి ఏకాంతానికి అడ్డుగా ఉన్నాడని భర్తను అడ్డు తొలగించుకోవాలని నిర్ణయించుకున్న భార్య సుబ్బులు.. తన ప్రియుడితో కలిసి స్కెచ్ వేసింది. ప్లాన్ ప్రకారం గురుప్రసాద్ తలపై మద్యం సీసా, బండరాయితో కొట్టి హత్య చేశాడు. ఈ నేరంలో గురు ప్రసాద్‌తో పాటు షరీఫ్‌ కూడా పాలుపంచుకున్నాడు. అనంతరం ద్విచక్ర వాహనంపై నిందితులు పరార్ అయ్యారు.

కాలువల్లో తుమ్మచెట్లు.. నా సెల్ఫీనే సజీవసాక్ష్యం : హరీశ్ రావుతెలంగాణSwechaa03 Sep 2026, 01:35 PM

కాలువల్లో తుమ్మచెట్లు.. నా సెల్ఫీనే సజీవసాక్ష్యం : హరీశ్ రావు

రాష్ట్ర ప్రభుత్వం తీరుపై మాజీ మంత్రి, బీఆర్ఎస్ డిప్యూటీ ఫ్లోర్ లీడర్ హరీశ్ రావు మరోసారి విమర్శలు గుప్పించారు.తెలంగాణ రైతాంగాన్ని కాంగ్రెస్ ప్రభుత్వం పట్టించుకోవడం లేదని, గతంలో జళ సిరులతో ప్రవహించిన కాలువలు ఇప్పుడు పడావు పడ్డాయని విమర్శించారు. రేవంత్ ప్రభుత్వంలో అన్నదాతలు అల్లాడుతున్నారని, ప్రాజెక్టులు పడావు పడ్డాయని ఆరోపించారు. గురువారం నర్సాపూర్ రెడ్డిపల్లి కాలువ పరిసరాల్లో బీఆర్ఎస్ నేతలు పర్యటించారు. ఈ సందర్బంగా హరీశ్ రావు బీఆర్ఎస్ నేతలతో కలిసి సెల్ఫీ దిగి సోషల్ మీడియాలో పోస్టు చేశారు. ‘నీళ్లు పారాల్సిన కాలువల్లో తుమ్మ చెట్లు మొలిచాయి. కేసీఆర్ హయాంలో పరుగులు పెట్టిన ప్రాజెక్టులు మీ నిర్లక్ష్యానికి ఇలా పడావు పడ్డాయి. నర్సాపూర్ రెడ్డిపల్లి వద్ద ఆగిపోయిన కాలువ పనుల దగ్గర నేను దిగిన ఈ సెల్ఫీనే.. మీ చేతకాని పాలనకు సజీవ సాక్ష్యం. ఉమ్మడి మెదక్ జిల్లా రైతులంటే మీకెందుకంత కక్ష?’ అని ప్రశ్నించారు. బీఆర్ఎస్ పార్టీ తరఫున ప్రభుత్వం ఎదుట పలు డిమాండ్లను హరీశ్ రావు ఉంచారు.

Official: "జైలర్ 2" రిలీజ్ డేట్ కన్‌ఫర్మ్..అక్టోబర్ 15న విధ్వంశమేసినిమాSwechaa03 Sep 2026, 01:31 PM

Official: "జైలర్ 2" రిలీజ్ డేట్ కన్‌ఫర్మ్..అక్టోబర్ 15న విధ్వంశమే

Official: సూపర్ స్టార్ రజినీకాంత్ అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్న సినిమా 'జైలర్ 2'. తాజాగా ఈ సినిమా విడుదల తేదీని (అక్టోబర్ 15) మేకర్స్ అధికారికంగా కన్‌ఫర్మ్ చేశారు. ఈ సినిమాకి నెల్సన్ దిలీప్‌కుమార్ దర్శకత్వం వహిస్తున్న సంగతి తెలిసిందే. 2023లో రజినీ-నెల్సన్ కాంబోలో వచ్చిన బ్లాక్ బస్టర్ మూవీ 'జైలర్' కి సీక్వెల్ గా రూపొందుతోంది. అయితే, ఈ మధ్య ఈ సినిమాకి సంబందించి ఆశించిన అప్‌డేట్స్ రాకపోవడంతో విడుదల వాయిదా పడిందని వార్తలు ప్రసారం కాగా, వాటికి మేకర్స్ (సన్ పిక్చర్స్) చెక్ పెట్టారు.

ఆర్బీఐ చర్యలు.. మరింత బలపడిన రూపాయి!వ్యాపారంSwechaa03 Sep 2026, 01:11 PM

ఆర్బీఐ చర్యలు.. మరింత బలపడిన రూపాయి!

మొన్నటివరకు భారీ పతనాన్ని చవిచూసిన దేశీయ కరెన్సీ రూపీ విలువ నెమ్మదిగా పుంజుకుంటోంది. అంతర్జాతీయ మార్కెట్‌లో సానుకూల పరిస్థితులు, విదేశీ మారకం ద్రవ్యలోటు కూడా తగ్గుముఖం పట్టడంతో మార్కెట్‌లో భారత రూపాయి బలంగా పుంజుకుంది. గురువారం ప్రారంభ ట్రేడింగ్‌లోనే అమెరికా డాలర్‌తో పోలిస్తే ఇండియన్ కరెన్సీ రూపీ మారకం విలువ ఏకంగా 47 పైసలు ఎగబాకింది. దీంతో ప్రస్తుతం ఒక అమెరికన్ డాలర్‌తో పోలిస్తే భారతీ రూపాయి విలువ 94.26 వద్ద కొనసాగుతోంది. ఇంటర్‌ బ్యాంక్ ఫారిన్ ఎక్స్‌చేంజ్ మార్కెట్ ప్రారంభంలో 94.30 వద్ద ప్రారంభమైన రూపాయి.. కొనుగోళ్ల మద్దతుతో మరింత బలపడి 94.26 వద్దకు చేరుకుని లాభాలబాట పట్టింది. అంతకుముందు రోజు ముగింపు సమయానికి రూపాయి విలువ 22 పైసలు లాభపడి 94.73 వద్ద స్థిరపడగా, తాజా సెషన్‌లోనూ అదే సానుకూల జోరును కొనసాగించి బలాన్ని పుంజుకుంది.

వేటు పడితే వాట్ నెక్స్ట్..! కొండా ఇష్యూ విపక్షాలకు ఆయుధమా?తెలంగాణSwechaa03 Sep 2026, 12:48 PM

వేటు పడితే వాట్ నెక్స్ట్..! కొండా ఇష్యూ విపక్షాలకు ఆయుధమా?

సురేఖను కేబినెట్‌ నుంచి తప్పిస్తే.. ఆమె రాజకీయంగా సైలెంట్‌గా ఉండే అవకాశాలు తక్కువనే చర్చ జరుగుతోంది. ప్రస్తుతం ఆమె వైఖరిని చూస్తే, రాజీనామా చేసి నిష్క్రమించడం కంటే తన వాదనను ప్రజల్లోకి తీసుకెళ్లే ప్రయత్నం చేసే అవకాశం కనిపిస్తోంది. తనపై కుట్ర జరుగుతోందని, తనకు అన్యాయం జరుగుతోందని ఇప్పటికే ఆమె అధిష్ఠానం ముందు వాదించారు.

బొల్లారం ఆర్మీ ఆయుధాల చోరీ కేసులో హనీట్రాప్?తెలంగాణSwechaa03 Sep 2026, 12:32 PM

బొల్లారం ఆర్మీ ఆయుధాల చోరీ కేసులో హనీట్రాప్?

సికింద్రాబాద్ పరిధిలోని బొల్లారంల మద్రాస్ ఆర్మీ రెజిమెంట్‌లో భారీగా ఆయుధాలు మాయమైన విషయం తెలిసిందే. ఈ కేసులో ఆర్మీ అధికారుల ఫిర్యాదు మేరకు బొల్లారం పోలీసులు దొంగల కోసం గాలింపు చర్యలు చేపట్టారు. మరోవైపు పెద్దఎత్తున వెపన్స్, బుల్లెట్స్ మిస్ కావడంతో ఆర్మీ ఇంటెలిజెన్స్ సైతం రంగంలోకి దిగింది.ఈ మేరకు అధికారులు విచారణ చేపట్టగా.. ఇంతవరకు ఈ కేసులో ఎలాంటి పురోగతి కనిపించలేదు. అయితే, బొల్లారం ఆర్మీ ఆయుధాల చోరీ కేసులో కొత్త కోణం వెలుగుచూసినట్టు సమాచారం. ఆర్మీ ఆయుధాల చోరీ వెనుక హనీట్రాప్ ? జరిగి ఉండొచ్చని ఇంటెలిజెన్స్ అధికారులు అనుమానం వ్యక్తం చేస్తున్నట్టు తెలుస్తోంది. ఆర్మీ సిబ్బందిని హనీట్రాప్‌లోకి దించి కీలక సమాచారం సేకరించారా? అనే కోణంలో విచారణ చేయాలని భావిస్తున్నట్టు సమాచారం. రెజిమెంట్‌లో పనిచేస్తున్న సిబ్బంది మొబైల్ ఫోన్లు, సోషల్ మీడియా ఖాతాలపై కేంద్ర నిఘా బృందం ఆరా తీస్తున్నట్టు తెలిసింది.

రాజీనామాకు కొండా సిద్దం!.. పార్టీని వీడుతారా?రాజకీయాలుSwechaa03 Sep 2026, 12:13 PM

రాజీనామాకు కొండా సిద్దం!.. పార్టీని వీడుతారా?

మంత్రి కొండా సురేఖ అంశం మొత్తానికి కొలిక్కి వచ్చింది.ఇన్నిరోజులుగా జరుగుతున్న ప్రచారానికి తెరపడినట్టు అయ్యింది. కొండా విషయంలో అధిష్టానం ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదని పలు కథనాలు వచ్చాయి. నిన్న ఢిల్లీలో జరిగిన పరిణామాలతో అవన్నీ కట్టుకథలే అని తేలిపోయింది.సురేఖకు ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి వేణుగోపాల్ కావాలనే అపాయింట్‌మెంట్ ఇవ్వలేదని ప్రచారం జరుగుతుండగా.. ఖర్గే సైతం చేతులెత్తేసినట్టు తెలిసింది. దీంతో కొండా మంత్రి పదవి పోవడం ఖాయమని తేలిపోయింది. తాము తొలగించక ముందే మంత్రి పదవి నుంచి పక్కకు తప్పుకోవాలని సురేఖకు పార్టీ అధిష్టానం సూచించినట్టు సమాచారం.అయితే, మంత్రి పదవితో పాటు పార్టీని కూడా వీడాలా? అనే ఆలోచనలో సురేఖ ఉన్నట్టు ప్రచారం జరుగుతోంది. లేదా మంత్రి పదవికి రాజీనామా చేసి ఎమ్మెల్యేగా కొనసాగాలా? అనే ఆలోచన సైతం చేస్తున్నట్టు సమాచారం.

ED : డీఎస్పీ భీమ్ రెడ్డికి మరో షాక్..తెలంగాణSwechaa03 Sep 2026, 11:49 AM

ED : డీఎస్పీ భీమ్ రెడ్డికి మరో షాక్..

అక్రమాస్తుల కేసులో సస్పెండ్ అయిన పోలీస్ కంప్యూటర్ సర్వీసెస్ (PCS) డీఎస్పీ సంకిరెడ్డి భీమ్‌రెడ్డిపై మనీలాండరింగ్ ఆరోపణల కింద ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) కేసు ఫైల్ చేసింది. దీంతో నాలుగు రోజుల క్రితమే బెయిల్ పై విడుదలైన భీమ్ రెడ్డికి కొత్త కష్టాలు మొదలయ్యాయి. అవినీతి నిరోధక శాఖ (ACB) దర్యాప్తు ఆధారంగా ఈడీ అధికారులు పీఎంఎల్‌ఏ (PMLA) చట్టం కింద ఈసీఐఆర్ ఫైల్ చేసినట్టు సమాచారం. ఇటీవల ఏసీబీ అధికారులు నమోదు చేసిన ప్రాథమిక ఎఫ్‌ఐఆర్‌లో కేవలం రూ.2.4 కోట్ల అక్రమాస్తులను గుర్తించినట్టు పేర్కొన్నారు. ఆ తర్వాత మరోసారి జరిపిన సోదాల్లో సుమారు రూ. 150 కోట్ల నుంచి రూ.300 కోట్ల మార్కెట్ విలువ గల ఆదాయానికి మించి అక్రమాస్తులను గుర్తించారు.ఏసీబీ పేర్కొన్న వివరాల ఆధారంగా ఈడీ రంగంలోకి దిగింది. ఏసీబీ లెక్కతెల్చిన ఆస్తుల ఆధారంగా ఈడీ దర్యాప్తు చేపట్టనున్నట్టు సమాచారం.

Venky Atluri-Megastar: మెగాస్టార్‌తో సినిమా..అదెలా ఉంటుందో చెప్పిన వెంకీ!సినిమాSwechaa03 Sep 2026, 11:23 AM

Venky Atluri-Megastar: మెగాస్టార్‌తో సినిమా..అదెలా ఉంటుందో చెప్పిన వెంకీ!

Venky Atluri: వెంకీ అట్లూరి..తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఉన్న టాలెంటెడ్ డైరెక్టర్స్‌లో ఒకరు. నటుడిగా ఇండస్ట్రీకొచ్చిన వెంకీ, సినిమాలలో చిన్న చిన్న పాత్రలను చేస్తూనే, రచనా, దర్శకత్వం వైపు కూడా ఆసక్తి చూపించాడు. అలా, మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ హీరోగా వచ్చిన తొలిప్రేమ సినిమాతో దర్శకుడిగా మారాడు. మొదటి సినిమాతో డీసెంట్ హిట్ అందుకున్న వెంకీ, ఆ తర్వాత అక్కినేని అఖిల్ తో మిస్టర్ మజ్ను, నితిన్-కీర్తి సురేష్‌లతో రంగ్ దే సినిమాలను రూపొందించాడు.

గంజాయి క్వీన్ నీతూబాయి నివాసలపై ఈడీ రైడ్స్.. ఇంట్లో సీక్రెట్ టన్నెల్!..తెలంగాణSwechaa03 Sep 2026, 11:22 AM

గంజాయి క్వీన్ నీతూబాయి నివాసలపై ఈడీ రైడ్స్.. ఇంట్లో సీక్రెట్ టన్నెల్!..

గంజాయి కేటుగాళ్లకు అడ్డాగా మారిన హైదరాబాద్‌లో మరో సంచలనం వెలుగులోకి వచ్చింది.. ఇటీవల అరెస్టయిన అంగూరీబాయి, శుభంసింగ్‌ల విచారణతో గంజాయి క్వీన్ నీతూబాయి అక్రమ సామ్రాజ్యం బట్టబయలైంది. ఈ నేపథ్యంలో హైదరాబాద్‌లో డ్రగ్స్ సామ్రాజ్యానికి, హవా మార్గాల ద్వారా సాగుతున్న అక్రమ దందాకు చెక్ పెట్టేందుకు ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) రంగంలోకి దిగింది..

నగరంలో కలకలం రేపుతున్న గంజాయి డాన్ రీతు భాయ్ అలియాస్ నీతు భాయ్ అడ్డాపై ఈడీ అధికారులు సోదాలు నిర్వహించారు.. గురువారం తెల్లవారుజాము నుంచే ఈడీ బృందాలు ఏకకాలంలో దాడులు ప్రారంభించాయి. హైదరాబాద్ వ్యాప్తంగా ఉన్న రీతు భాయ్ నివాసాలు, వ్యాపార సంస్థలతో పాటు ఆమె ప్రధాన అనుచరుల ఇళ్లే లక్ష్యంగా మొత్తం ఎనిమిది చోట్ల ఈ సోదాలు జరిగాయి.

వారాంతపు సంతలా మారిన టీ హబ్.. వీడియో వైరల్తెలంగాణSwechaa03 Sep 2026, 11:13 AM

వారాంతపు సంతలా మారిన టీ హబ్.. వీడియో వైరల్

ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు పొందిన టీ హబ్ రూపు రేఖలు మారిపోతున్నాయి. అంకుర సంస్థలకు బూస్టప్ కోసం స్థాపించిన టీ హబ్ .. ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో దాని ప్రభావాన్ని కోల్పోతున్నదని ఆరోపణలు వినిపిస్తున్నాయి.ఆ మధ్య సీఎం రేవంత్ చేతుల మీదుగానే టీ హబ్‌లో.. ‘గూగుల్ ఫర్ స్టార్టప్స్‌’ కేంద్రాన్ని ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే. అయితే, అంతర్జాతీయ ప్రమాణాలతో నిర్మించిన టీ హబ్ ప్రస్తుతం వారాంతపు సంతలా మారిందని కొందరు విమర్శలు చేస్తున్నారు.దీనికి సంబంధించిన ఓ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. టీ-హబ్‌‌ను ఎదుట స్ట్రీట్ మార్కెట్ దర్శనమిస్తోంది.

నిండా ముంచిన ఎల్‌నినో.. సెప్టెంబ‌ర్‌లోనూ లోటు వ‌ర్షాలే!NationalSwechaa03 Sep 2026, 10:58 AM

నిండా ముంచిన ఎల్‌నినో.. సెప్టెంబ‌ర్‌లోనూ లోటు వ‌ర్షాలే!

ఎల్‌నినో ఎఫెక్ట్‌తో ఈసారి నైరుతి రుతుపవనాలు దక్షిణాదిని తీవ్రంగా నిరాశపరిచాయి. ఆగస్టులో భారీ వర్షపాత లోటు నమోదవగా.. సెప్టెంబర్‌లోనూ వర్షాలు తగ్గే అవకాశాలున్నాయని IMD అంచనా వేస్తోంది.

NTR - Dragon: ఎన్టీఆర్-నీల్ సినిమాపై ఉన్న డౌట్స్ అన్నీ క్లియర్!సినిమాSwechaa03 Sep 2026, 10:51 AM

NTR - Dragon: ఎన్టీఆర్-నీల్ సినిమాపై ఉన్న డౌట్స్ అన్నీ క్లియర్!

NTR - Dragon: మాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్-ప్రశాంత్ నీల్ కాంబినేషన్‌లో తెరకెక్కుతోన్న డ్రాగన్ (వర్కింగ్ టైటిల్) సినిమాకి సంబందించి ఇటీవల వస్తోన్న రూమర్స్ అన్నిటికీ నిర్మాతలు క్లారిటీ ఇచ్చారు. రుక్మిణి వసంత్ హీరోయిన్‌గా నటిస్తున్న ఈ సినిమా ఎన్టీఆర్ కి గాయం కావడం మూలంగా షూటింగ్ కి బ్రేక్ పడింది. దీంతో, ఈ సినిమా అనుకున్న సమయానికి రిలీజ్ కాదని వార్తలు ప్రచారం కాగా, దీనిపై మేకర్స్ సాలీడ్ అప్‌డేట్ ఇచ్చారు. చెప్పిన తేదీకే డ్రాగన్ రిలీజ్ అని కన్‌ఫర్మ్ చేశారు.

I Am Game: తెలుగులో దుల్కర్ సల్మాన్ సినిమా షోస్ క్యాన్సిల్..కారణం ఏంటంటే!సినిమాSwechaa03 Sep 2026, 10:17 AM

I Am Game: తెలుగులో దుల్కర్ సల్మాన్ సినిమా షోస్ క్యాన్సిల్..కారణం ఏంటంటే!

I Am Game: తెలుగులో బాగా క్రేజ్ ఉన్న మలయాళ హీరో దుల్కర్ సల్మాన్. మమ్ముట్టి తనయుడిగా మలయాళ సినిమా ఇండస్ట్రీకి పరిచయం అయినప్పటికీ, ఆ తర్వాత సోలో హీరోగా అక్కడ మంచి మార్కెట్‌ని సంపాదించుకున్నాడు. ఇక, దుల్కర్ నటించిన లేటేస్ట్ సినిమా ఐ యామ్ గేమ్. ఈ రోజు ప్రేక్షకుల ముదుకు రావాల్సిన ఈ మూవీ తెలుగులో మార్నింగ్ షోస్ అన్నీ క్యాన్సిల్ అయ్యాయి. దీనికి, కారణం కంటెంట్ అప్‌లోడ్ అవలేదని తెలుస్తోంది.

200ఏళ్లు 5 తరాల సుదీర్ఘ నిరీక్షణకు తెరదించిన చిన్నారి!..వైరల్ న్యూస్Swechaa03 Sep 2026, 10:16 AM

200ఏళ్లు 5 తరాల సుదీర్ఘ నిరీక్షణకు తెరదించిన చిన్నారి!..

ఆడపిల్ల పుడుతుంది అని తెలియగానే ఆందోళన పడుతున్న నేటి రోజుల్లో.. ఆడపిల్ల పుట్టుకను భారంలా కాకుండా, ఇంటికి వచ్చిన గొప్ప అదృష్టంగా భావించిన కుటుంబం గురించి తెలిస్తే ఆశ్చర్యం అనిపిస్తుంది. అందులో ఏకంగా 200 ఏళ్లు 5 తరాల సుదీర్ఘ నిరీక్షణ తర్వాత ఆ వంశంలో తొలిసారిగా ఓ ఆడబిడ్డ జన్మించడంతో వారి ఆనందానికి హద్దులు లేకుండా పోయాయి..

మహారాష్ట్రలోని బీడ్ జిల్లా పర్లీకి చెందిన దహిఫలే కుటుంబంలో ఆ అరుదైన, భావోద్వేగ ఘట్టం ఆవిష్కృతమైంది. వందల సంవత్సరాల నిరీక్షణకు ముగింపు పలుకుతూ వారింటిలో ఆడపిల్ల పుట్టింది. ఆనంద భాష్పాల నడుమ ఆ చంటిపాపను చేతుల్లోకి తీసుకుంటూ, ఆ కుటుంబం పరవశించిపోయింది. అలాగే ఆ పసిపాపాకు కుటుంబ సభ్యులు గార్గి అని నామకరణం చేసి, రాజకుమారిలా ఘనంగా స్వాగతం పలకడం వైరల్ గా మారింది.

బొల్లారంలో హైఅలర్ట్.. ఆర్మీ బేస్ వద్ద భారీగా పేలుడు పదార్థాలుతెలంగాణSwechaa03 Sep 2026, 10:09 AM

బొల్లారంలో హైఅలర్ట్.. ఆర్మీ బేస్ వద్ద భారీగా పేలుడు పదార్థాలు

హైదరాబాద్ మహానగరంలో భారీ పెనుప్రమాదం తప్పినట్టు తెలుస్తోంది. బొల్లారం పరిధిలో పెద్దమొత్తంలో పేలుడు పదార్థాలు కలకలం రేపాయి. బొల్లారం పీఎస్ పరిధిలోని మద్రాస్ రెజిమెంట్ ఆర్మీ క్యాంప్ సమీపంలో గల ఫైరింగ్ రేంజ్ వద్ద గుర్తుతెలియని వ్యక్తులు ఓ బకెట్‌లో 160కు పైగా డిటోనేటర్లు పెట్టగా అధికారులు వాటిని గుర్తించినట్టు తెలిసింది. వెంటనే బాంబ్ డిటెక్షన్ అండ్ డిస్పోజల్ స్క్వాడ్, స్థానిక పోలీసులు హుటాహుటిన ఘటనా స్థలికి చేరుకుని తనిఖీలు చేపట్టినట్టు సమాచారం. బకెట్‌ను క్షుణ్ణంగా పరిశీలించిన బాంబ్ స్క్వాడ్.. ఒక్కో బండిల్‌లో 20 చొప్పున మొత్తం 8 బండిళ్లలో భద్రపరిచిన డిటోనేటర్లను స్వాధీనం చేసుకుని.. దూరంగా తీసుకెళ్లి నిర్వీర్యం చేసే ప్రక్రియ ప్రారంభించిట్టు సమాచారం.

బాలిక మిస్సింగ్ కేసు.. పోలీసులకు హైకోర్టు చివాట్లుఏపీSwechaa03 Sep 2026, 09:51 AM

బాలిక మిస్సింగ్ కేసు.. పోలీసులకు హైకోర్టు చివాట్లు

ఏపీలో బాలిక మిస్సింగ్ కేసును పోలీసులు ఇంకా కనిపెట్టకపోవడంపై ఏపీ హైకోర్టు సీరియస్ అయ్యింది. మూడు నెలలు అయినా బాలిక ఆచూకీ ఎందుకు కనిపెట్టలేకపోయారని..అసలు ఏం చేస్తున్నారని గుంటూరు పోలీసులపై ఆగ్రహం వ్యక్తం చేసింది. పోలీసుల నిర్లక్ష్యంపై మండిపడిన ధర్మాసనం.. "గుంటూరు జిల్లా పోలీసులు చాలా గ్రేట్" అంటూ వ్యంగ్యాస్త్రాలు సంధించినట్టు తెలిసింది. పూర్తి వివరాల్లోకి వెళితే.. గుంటూరు జిల్లా పట్టాభిపురం పోలీస్‌స్టేషన్ పరిధిలో గత జూన్ నెలలో ఓ బాలిక ట్యూషన్‌కు వెళ్లి కనిపించకుండా పోయింది. బాధితురాలి తండ్రి మిస్సింగ్ కేసు నమోదు చేశారు. దర్యాప్తు ప్రారంభించిన పోలీసులు..మూడు నెలలు గడిచినా బాలిక ఆచూకీ కనిపెట్టలేకపోయారు. దీంతో బాలిక తండ్రి హైకోర్టులో హెబియస్ కార్పస్ పిటిషన్ దాఖలు చేయగా.. విచారణ జరిపిన న్యాయస్థానం పై వ్యాఖ్యలు చేయడం గమనార్హం.

మిర్యాలగూడకు కేటీఆర్.. రైతు సమస్యలపై పోరాటంతెలంగాణSwechaa03 Sep 2026, 09:36 AM

మిర్యాలగూడకు కేటీఆర్.. రైతు సమస్యలపై పోరాటం

బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ నేడు మిర్యాలగూడకు వెళ్లనున్నారు. అక్కడ బీఆర్ఎస్ ఆధ్వర్యంలో నిర్వహించే రైతు మహాధర్నా కార్యక్రమంలో పాల్గొననున్నారని తెలుస్తోంది. ఈ మేరకు మధ్యాహ్నం మూడు గంటలకు ఎన్ఎస్‌పీ క్యాంప్ మైదానంలో కార్యక్రమం ఉంటుందని బీఆర్ఎస్ శ్రేణులు తెలిపాయి. తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం అమలు చేస్తున్న విధానాలు, పాలనలో వైఫల్యం, అన్నదాతలు ఎదుర్కొంటున్న ఇబ్బందులపై కేటీఆర్ ప్రసంగించనున్నారు. సాగర్ ఎడమ కాలువకు నీటి విడుదల చేయాలని డిమాండ్ చేయడంతో పాటు యూరియా కొరత, రైతు భరోసా, సాగునీరు, విద్యుత్ సమస్యలపై మాట్లాడుతున్నారని తెలుస్తోంది. కాంగ్రెస్ ప్రభుత్వ 1,000 రోజుల పాలన, హామీల అమలుపైనూ ప్రభుత్వాన్ని నిలదీయనున్నట్టు తెలుస్తోంది.

రాజకీయ పార్టీలకు పరీక్షగా మారిన హామీలు.. దేశంలో ఉచిత విద్య-వైద్యం సాధ్యమేనా?NationalSwechaa03 Sep 2026, 09:20 AM

రాజకీయ పార్టీలకు పరీక్షగా మారిన హామీలు.. దేశంలో ఉచిత విద్య-వైద్యం సాధ్యమేనా?

ఎన్నికలు వస్తే చాలు.. రాజకీయ పార్టీల హామీల జాబితాలో విద్య, వైద్యం తప్పనిసరిగా ఉంటాయి. అందరికీ ఉచిత విద్య.. ఉచిత వైద్యం అంటూ నాయకులు హామీలు ఇస్తారు. పేద, మధ్యతరగతి కుటుంబాలకు ఈ రెండు అంశాలు నేరుగా జీవితంతో ముడిపడి ఉండటంతో.. ఇలాంటి హామీలు ఓటర్లను బలంగా ఆకర్షిస్తాయి. కానీ ఎన్నికలు ముగిసిన తర్వాత వీటి ఊసే ఉండదు.. ఇక సందు దొరికితే చాలు ఉచితం కోసం మాట్లాడే నాయకుల్లో ఈ హామీ పట్ల చిత్తశుద్ధి ఉండటం లేదనే ఆరోపణలున్నాయి..

ఈ క్రమంలో ప్రతి సామాన్యుడి అంతరంగంలో నాయకులు ఎన్నికల ముందు ఉచిత విద్య, ఉచిత వైద్యం అని హామీలు ఇస్తారు.. కానీ గెలిచాక ఎందుకు నిలబెట్టుకోరు? అసలు ఇవి అందరికీ ఉచితంగా ఇవ్వడం నిజంగా సాధ్యమేనా? అనే సందేహాలు పుడుతాయి.. అయితే దీనికి సమాధానం సాధ్యమే అని విశ్లేషకులు చెబుతున్నారు..

రైజింగ్ స్టేట్‌లో రసవత్తరంగా కాంగ్రెస్ రాజకీయం!..తెలంగాణSwechaa03 Sep 2026, 09:00 AM

రైజింగ్ స్టేట్‌లో రసవత్తరంగా కాంగ్రెస్ రాజకీయం!..

ప్రజల కోసం పని చేయాలంటే ప్రభుత్వ పెద్దగా ముఖ్యమంత్రి కఠిన నిర్ణయాలు తీసుకోవాలి. కానీ, తోటి మంత్రిని తొలగించేందుకు రేవంత్ రెడ్డి నానాయాతన పడుతున్నారు. గతంలో కేసీఆర్ బలమైన బీసీ లీడర్ అయిన ఈటల రాజేందర్‌ను చిటికలో తీసివేశారు. కబ్జాకోరు అంటూ ముద్ర వేశారు. హరీశ్ రావుని కొన్నాళ్లు దగ్గరకు రానివ్వలేదు. ప్రభుత్వంలో ఉంటే సీఎంకి వీటి పరిణామాలు తర్వాత గుణపాఠంలా కనిపిస్తాయి.

నకిలీ ఆస్తులు-కోట్ల రుణాలు.. వెలుగులోకి సబ్‌ రిజిస్ట్రార్ లీలలు!..తెలంగాణSwechaa03 Sep 2026, 08:28 AM

నకిలీ ఆస్తులు-కోట్ల రుణాలు.. వెలుగులోకి సబ్‌ రిజిస్ట్రార్ లీలలు!..

భారీస్థాయిలో ఆస్తులపై అక్రమ రిజిస్ట్రేషన్లు చేసిన చంపాపేట సబ్‌ రిజిస్ట్రార్‌ మహ్మద్‌ యూసుఫ్‌ ఉర్‌ రెహ్మాన్‌ పోలీసులకు చిక్కారు. లేని ఆస్తులు ఉన్నట్లుగా చూపించి బ్యాంకు రుణాలు తీసుకుని ఎగ్గొడుతున్న ముఠాతో చేతులు కలిపి రూ.4.11 కోట్లు మోసం చేసిన కేసులో కీసర పోలీసులు బుధవారం అరెస్టు చేశారు. గతంలో ఆయన కీసర సబ్‌ రిజిస్ట్రార్‌గా పనిచేసిన సమయంలో ఈ అక్రమాలకు పాల్పడ్డట్లు దర్యాప్తులో వెలుగులోకి వచ్చింది. ఉనికిలోలేని 11 ఆస్తుల్ని కాగితాల్లో చూపించి రూ.4.11 కోట్ల రుణాల్ని వివిధ బ్యాంకుల నుంచి తీసుకున్నారు. కొన్ని నెలలు రుణాలు కట్టి ఆ తర్వాత ఎగ్గొట్టేశారు. నకిలీ పత్రాలతో రుణాలు పొందినట్లు గుర్తించిన బ్యాంకు అధికారులు కీసర పోలీసులకు ఫిర్యాదు చేయగా కేసు నమోదైంది.

కామం-క్రోధం దుర్గుణాలా?.. దైవశక్తులా?..SpiritualitySwechaa03 Sep 2026, 07:54 AM

కామం-క్రోధం దుర్గుణాలా?.. దైవశక్తులా?..

మన ధర్మగ్రంథాలలో ఉన్న అంతర్యాన్ని లోతుగా గమనిస్తే.. ఒక అద్భుతమైన సత్యం బోధపడుతుంది. కామక్రోధాలు కేవలం మనల్ని పతనం చేసే శత్రువులు మాత్రమే కావు.. అవి మన అంతరంగంలో దాగివున్న అపరిమితమైన ప్రచండ శక్తులు.. సృష్టిలోని ప్రతి భావన వెనుక ఒక దివ్యమైన ప్రయోజనం దాగి ఉంది. ఆ శక్తిని ఎలా నియంత్రిస్తున్నాం, ఏ దిశగా నడిపిస్తున్నాం అనేదే మన జీవిత పరమార్థాన్ని నిర్దేశిస్తుందని ఇవి తెలియజేస్తాయి.. కామం అంటే కేవలం ఇంద్రియ కోరిక కాదు. ఏదైనా సాధించాలనే ఆకాంక్ష కూడా కామమే.. జ్ఞానం పొందాలనే కోరిక కావచ్చు.. ధర్మాన్ని ఆచరించాలనే తపన కావచ్చు.. సమాజానికి మేలు చేయాలనే సంకల్పం కావచ్చు.. అందుకే కోరికకు వివేకం తోడైతే అది లక్ష్యంగా కూడా మారుతుందని చెబుతారు..

శంఖం మనకు చెప్పే ఆధ్యాత్మిక సందేశం ఏమిటి?..SpiritualitySwechaa03 Sep 2026, 07:45 AM

శంఖం మనకు చెప్పే ఆధ్యాత్మిక సందేశం ఏమిటి?..

శంఖం సనాతన సంస్కృతికి నాద స్వరూపం, సృష్టి సంకేతం, మానవ జీవితానికి మహోన్నత ఆధ్యాత్మిక మార్గదర్శి. క్షీరసాగర మధనంలో లక్ష్మీదేవితో పాటు ఉద్భవించిన శంఖాన్ని శ్రీమహావిష్ణువు స్వీకరించి, తన హస్తంలో అలంకరించుకున్నాడు. అందుకే ఎక్కడైతే శంఖం ఉంటుందో, ఎక్కడైతే దాని ధ్వని ప్రతిధ్వనిస్తుందో అక్కడ లక్ష్మీనారాయణుల అనుగ్రహంతో పాటు సకల వ్యతిరేక శక్తులు నశించి, ధర్మం, శాంతి, మంగళకరమైన వాతావరణం నెలకొంటాయని శాస్త్రాలు చెబుతాయి..

Vijay Devarakonda-Dil Raju: శ్రీకృష్ణుడి పాత్రలో విజయ్ దేవరకొండ..?సినిమాSwechaa02 Sep 2026, 11:49 PM

Vijay Devarakonda-Dil Raju: శ్రీకృష్ణుడి పాత్రలో విజయ్ దేవరకొండ..?

Vijay Devarakonda: శ్రీకృష్ణుడి పాత్రలో విజయ్ దేవరకొండ నటించబోతున్నాడా..? ప్రస్తుతం ఇదే వార్త సోషల్ మీడియాను షేక్ చేస్తోంది. ఇప్పటి వరకూ ఫ్యామిలీ చిత్రాలతో..అర్జున్ రెడ్డి లాంటి వైలెంట్ మూవీస్ తో రౌడీ హీరోగా తనకంటూ ఓ ప్రత్యేకమైన క్రేజ్ తెచ్చుకున్నాడు విజయ్ దేవరకొండ. అలాంటి, ఇమేజ్ ఉన్న ఈ హీరో పౌరాణిక సినిమాలో శ్రీకృష్ణుడి పాత్రలో నటించబోతున్నాడనేది ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారింది.

ఒకరికి బెయిల్, మరొకరు అరెస్ట్ కూడా కాలేదు.. కారుతో గుద్ది చంపినా.. శిక్షలు పడవా?క్రైమ్Swechaa02 Sep 2026, 11:20 PM

ఒకరికి బెయిల్, మరొకరు అరెస్ట్ కూడా కాలేదు.. కారుతో గుద్ది చంపినా.. శిక్షలు పడవా?

Hit And Run Case: తండ్రులు బాగా డబ్బున్నోళ్లు.. ఖరీదైన కార్లు కొన్చిచారు.. ఇంకేముంది వారి పుత్రరత్నాలు రెచ్చిపోయారు. రద్దీ రోడ్లపై ర్యాష్ డ్రైవింగ్ తో చెలరేగిపోయారు. అమాయకుల ప్రాణాలు గాల్లో కలిపేశారు. వారి కుటుంబాల్లో అంతులేని శోకం మిగిలించారు. ఇంత జరిగినా.. కారుతో గుద్ది చంపేసినా.. వారికి మాత్రం శిక్షలు పడలేదు. ఎందుకంటే వారు బడా బాబుల పుత్రరత్నాలు మరి.

మొన్న మాదాపూర్ లో.. నిన్న రాయదుర్గంలో.. సేమ్ అదే సీన్.. ర్యాష్ డ్రైవింగ్.. ఫలితంగా రెండు నిండు ప్రాణాలు గాల్లో కలిసిపోయాయి. ఇంత ఘోరం జరిగినా.. ఇద్దరి ప్రాణాలు పోయినా.. చర్యలు మాత్రం శూన్యం.

Shiva Nirvana-Ram Charan: రామ్ చరణ్ కోసం సీక్వెల్ రాయలేను..పాత్రలో సరిపోతేనే!సినిమాSwechaa02 Sep 2026, 11:18 PM

Shiva Nirvana-Ram Charan: రామ్ చరణ్ కోసం సీక్వెల్ రాయలేను..పాత్రలో సరిపోతేనే!

Shiva Nirvana: "ఇరుముడి" సినిమాతో సాలీడ్ కంబ్యాక్ ఇచ్చాడు దర్శకుడు శివ నిర్వాణ. ఆగస్టు 21న ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమా 200 కోట్ల క్లబ్ లో చేరిన నేపథ్యంలో మేకర్స్ మీడియా సమావేశాన్ని నిర్వహించారు. ఈ సమావేశంలో దర్శకుడు శివ నిర్వాణ పలు ఆసక్తికరమైన విషయాలను..సోషల్ మీడియాలో వస్తోన్న రూమర్స్ కి క్లారిటీ ఇచ్చారు. ఈ సందర్భంగా "ఇరుముడి" సీక్వెల్‌లో రామ్ చరణ్ నటించడం లేదని క్లారిటీ ఇచ్చాడు.

వైఎస్ రాజశేఖర్ రెడ్డి చివరి కోరిక ఇదే.. ఇంకా నెరవేరలేదుతెలంగాణSwechaa02 Sep 2026, 09:52 PM

వైఎస్ రాజశేఖర్ రెడ్డి చివరి కోరిక ఇదే.. ఇంకా నెరవేరలేదు

''దేశ ప్రజలు కష్టాల్లో ఉన్నారు. కష్టాల్లో ఉన్నప్పుడు నాయకుడు అండగా నిలబడాలి. అండగా నిలబడాల్సిన చారిత్రక సందర్భం ఈరోజు ఈ దేశానికి అవసరం. దేశానికి బలమైన నాయకుడు రాహుల్ గాంధీ. రాహుల్ గాంధీని దేశానికి ప్రధాని చేయడమే వైఎస్ కు నిజమైన నివాళి. ఆయన చివరి కోరిక నెరవేర్చాలంటే రాబోయే ఎన్నికల్లో రాహుల్ గాంధీని ప్రధానిని చేయాలి. ఇందుకు మీ అందరి మద్దతు అవసరం. మల్లికార్జున ఖర్గే నేతృత్వంలో మనమంతా కలిసి కష్టపడి రాహుల్ గాంధీని ప్రధాని చేసుకుందాం'' అని సీఎం రేవంత్ రెడ్డి పిలుపునిచ్చారు.