International
09 Nov 2026, 03:33 PMDelhi Air Pollution: పటాకుల దెబ్బకు ఊపిరాడని ఢిల్లీ..!
Delhi Air Pollution: దీపావళి సంబరాల వేళ దేశ రాజధాని ఢిల్లీని విషపూరితమైన దట్టమైన పొగ కమ్మేసింది. పండుగ రాత్రి నిబంధనలను బేఖాతరు చేస్తూ రాత్రంతా భారీగా బాణసంచా కాల్చడంతో నగరం ఒక్కసారిగా 'గ్యాస్ చాంబర్'గా మారిపోయింది. గాల్లో కాలిన మందుగుండు ఘాటు వ్యాపించి, రోడ్లపై కనీసం వీధి దీపాలు కూడా స్పష్టంగా కనిపించనంతగా పొగమంచు అలుముకుంది. తీవ్ర వాయు కాలుష్యంతో కంటిచూపు మందగించడమే కాకుండా, ఊపిరి పీల్చుకోవడం కూడా కష్టంగా మారడంతో ప్రజలు అల్లాడిపోతున్నారు. పరిస్థితి తీవ్రతను గమనించిన ప్రభుత్వం తక్షణమే 1 నుంచి 5వ తరగతి వరకు ప్రైమరీ స్కూళ్లను బంద్ చేసి, ఆన్‌లైన్ మోడ్‌లోకి మారుస్తూ కీలక నిర్ణయం తీసుకుంది.





























