స్వేచ్ఛ షార్ట్స్ — తాజా తెలుగు వార్తలు

Bollywood: రామాయణతో రకుల్ కంబ్యాక్..శూర్పణఖ పాత్రకి ప్రశంసలు..సినిమాSwechaa08 Nov 2026, 07:24 PM

Bollywood: రామాయణతో రకుల్ కంబ్యాక్..శూర్పణఖ పాత్రకి ప్రశంసలు..

Bollywood: గత కొంతకాలంగా రకుల్ ప్రీత్‌సింగ్ సౌత్‌లో మరీ ముఖ్యంగా మన టాలీవుడ్‌లో కనిపించడం లేదు. చెక్, కొండపొలం సినిమాలు డిజాస్టర్ తర్వాత మళ్ళీ, తెలుగు సినిమాలలో అవకాశాలు దక్కలేదు. బాలీవుడ్‌లో అడపాదడపా చేస్తోంది. దీంతో, దాదాపుగా రకుల్ ప్రీత్‌సింగ్ ఫేడవుట్ అయిందని మాట్లాడుకున్నారు. సరిగ్గా ఇలాంటి సమయంలో వచ్చిన అవకాశమే రామాయణ సినిమాలో శూర్పణఖ పాత్ర. సాలీడ్ కంబ్యాక్ ఇవ్వడమే కాదు, తాను పోషించిన ఈ పాత్రకి ప్రశంసలు అందుకుంటోంది.

Nagarjuna: కింగ్ 100 నుంచి క్రేజీ అప్‌డేట్..కర్ణగా అశోక్ సెల్వన్.!సినిమాSwechaa08 Nov 2026, 06:57 PM

Nagarjuna: కింగ్ 100 నుంచి క్రేజీ అప్‌డేట్..కర్ణగా అశోక్ సెల్వన్.!

Nagarjuna: అక్కినేని నాగార్జున కెరీర్‌లో ఎంతో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కుతున్న చిత్రం కింగ్ 100. ఇది నాగార్జున 100వ సినిమాగా రూపొందుతున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాను తమిళ యువ దర్శకుడు రా. కార్తీక్ భారీ స్థాయిలో తెరకెక్కిస్తున్నారు. ఇప్పటికే టబు పాత్రకు సంబంధించిన గ్లింప్స్ వచ్చి ప్రేక్షకుల్లో ఆసక్తిని పెంచగా.. తాజాగా మరో క్రేజీ అప్‌డేట్‌తో చిత్రబృందం దీపావళి పండుగ సందర్భంగా సర్‌ప్రైజ్ చేసింది. తమిళ నటుడు అశోక్ సెల్వన్ ఈ సినిమాలో కీలక పాత్రలో కనిపించబోతున్నారు.

దేశమంతా దీపావళి సందడి.. రూ.7 లక్షల కోట్ల వ్యాపారం!NationalSwechaa08 Nov 2026, 06:56 PM

దేశమంతా దీపావళి సందడి.. రూ.7 లక్షల కోట్ల వ్యాపారం!

దీపావళి వెనుక ఎంత పెద్ద ఆర్థిక వ్యవస్థ నడుస్తుందో ఎప్పుడైనా ఆలోచించారా? దేశవ్యాప్తంగా కోట్లాది మంది కొనుగోళ్లు చేస్తే.. లక్షలాది వ్యాపార సంస్థలకు పండుగ సీజన్ ఎంత పెద్ద అవకాశంగా మారుతుంది? ఈ ఏడాది దీపావళి వ్యాపారం ఏకంగా రూ.7 లక్షల కోట్ల మార్కును దాటింది. అవును.. దీపాల పండుగ వెనుక ఇంత పెద్ద ఆర్థిక సందడి ఉంది.

Gold Buying Tips: తులానికి 9 గ్రాములేనా? కస్టమర్లు తెలుసుకోవాల్సిన అసలు లెక్క ఇదే!వ్యాపారంSwechaa08 Nov 2026, 06:45 PM

Gold Buying Tips: తులానికి 9 గ్రాములేనా? కస్టమర్లు తెలుసుకోవాల్సిన అసలు లెక్క ఇదే!

బంగారం కొనడమంటే మన దగ్గర కేవలం ఆభరణం తీసుకోవడం మాత్రమే కాదు.. అదొక సెంటిమెంట్, ఆపత్కాలంలో ఆదుకునే బలమైన ఆస్తి. అందుకే పెళ్లిళ్లు వచ్చినా, పండుగలు వచ్చినా నగల దుకాణాలకు జనం క్యూ కడతారు. పాత నగలు ఇచ్చి కొత్తవి చేయించుకోవడమో లేక కొత్తగా తులం బంగారంతో గొలుసో, గాజులో చేయించడమో చేస్తుంటారు. కానీ ఇక్కడే చాలామందికి తెలియని ఒక మతలబు దాగుంది. మీరు పూర్తి తులం (10 గ్రాములు) బంగారం ఇచ్చినా లేదా చేయించినా.. చేతికి వచ్చేసరికి అది 9 గ్రాములే ఉండొచ్చు. మరి మిగిలిన ఆ ఒక్క గ్రాము బంగారం ఎక్కడికి పోతుంది? ఆ మాయ ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం.

చిత్రం లేదు
తెలంగాణSwechaa08 Nov 2026, 06:40 PM

AP LocalBody Elections: కంచుకోటలు బద్దలు.. నిజంగానే రిగ్గింగ్ జరిగిందా?

సాంకేతికత పుణ్యమా అని గుండె కొట్టుకునే వేగం నుంచి శరీరంలోని ఆక్సిజన్ స్థాయిల వరకు అన్నింటినీ చేతి గడియారాలు, స్మార్ట్ రింగులతో కొలుస్తున్న కాలమిది. అయితే ఇప్పుడు ఏకంగా మనిషి మెదడు పనితీరును అంచనా వేస్తామంటూ ఒక సరికొత్త గ్యాడ్జెట్ మార్కెట్లోకి అడుగుపెట్టింది. జొమాటో సహ వ్యవస్థాపకుడు దీపిందర్ గోయల్ రూపొందించిన ‘టెంపుల్’ అనే పరికరం ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా పెద్ద చర్చకు దారితీస్తోంది. ఇది నిజంగా విప్లవాత్మక ఆవిష్కరణా? లేక మార్కెటింగ్ జిమ్మిక్కులతో కూడిన భ్రమా? అనే సందేహాలు వెల్లువెత్తుతున్నాయి.

Crime : భర్త చేసిన తప్పుకు బలైన భార్యా పిల్లలు!క్రైమ్Swechaa08 Nov 2026, 06:40 PM

Crime : భర్త చేసిన తప్పుకు బలైన భార్యా పిల్లలు!

భర్త వివాహేతర సంబంధం పెట్టుకున్నాడనే ఆవేదనతో ఇద్దరు పిల్లలతో కలిసి చెరువులో దూకి భార్య ఆత్మహత్యకు పాల్పడింది. వివరాల్లోకివెళితే.. వరంగల్ జిల్లా ఎలుకుర్తి హవేలీ గ్రామానికి చెందిన ఈరెల్లి సుమన్ అనే వ్యక్తి.. హన్మకొండ జిల్లా బైరాన్‌పల్లి గ్రామానికి చెందిన మమత (30) అనే యువతిని ఆరేళ్ల క్రితం ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు. సుమన్ ఊరిలో కూలీ పనులు చేస్తుండగా.. మమత నర్సంపేటలోని ప్రైవేట్ కంటి ఆసుపత్రిలో ఉద్యోగం చేస్తోంది. వీరికి ఇద్దరు ఆడ పిల్లలు హరిణి (4), కావ్యశ్రీ (3). ఈ క్రమంలోనే సుమన్.. కొంతకాలంగా అదే గ్రామానికి చెందిన పెళ్లయిన మహిళతో వివాహేతర సంబంధం పెట్టుకున్నాడు. 20 రోజుల క్రితం ఆమెతో కలిసి వెళ్లిపోయాడు. విషయం తెలిసి పెద్దమనుషుల సమక్షంలో పంచాయితీ పెట్టగా, సుమన్ తన భార్యతోనే ఉండాలని తీర్మానించారు. దీంతో అవమానం తట్టుకోలేక ఉద్యోగానికి వెళ్తున్నానని చెప్పి పిల్లలతో సహా బయలుదేరిన మమత.. పాకాల చెరువు వద్దకు చేరుకుని, హైదరాబాద్‌లో ఉండే బంధువులకు చనిపోతున్నానని చెప్పి లొకేషన్ షేర్ చేసింది.

అనంతరం పిల్లలను నడుముకు కట్టుకుని చెరువులోకి దూకింది.

TG : ఇందిరమ్మ ఇల్లు కట్టిస్తామన్నారు.. చివరకు!తెలంగాణSwechaa08 Nov 2026, 06:11 PM

TG : ఇందిరమ్మ ఇల్లు కట్టిస్తామన్నారు.. చివరకు!

ఓ నిరుపేద మహిళకు ఇందిరమ్మ ఇళ్లు మంజూరు అయ్యింది. ఆమె స్థలం కాస్త రోడ్డుకు ఆనుకుని ఉన్నట్టు సమాచారం. అయితే,ఇందిరమ్మ ఇల్లు మంజూరైందన్న ఆశతో అప్పులు చేసి మరి సదరు మహిళ ఇల్లు నిర్మించుకుంది. ఇల్లు నిర్మాణం పూర్తయ్యాక రోడ్డుపైకి మెట్లు వచ్చాయంటూ అధికారులు వాటిని కూల్చివేశారు. ఈ ఘటన సంగారెడ్డి జిల్లా మునిపల్లి మండలం మేళసంఘం గ్రామంలో వెలుగుచూసింది.వివరాల్లోకివెళితే.. గ్రామానికి చెందిన క్యాతం శోభారాణికి ఇందిరమ్మ ఇల్లు మంజూరైంది. నిధులు విడుదల కావాలంటే ముందుగా ఇల్లు కట్టుకోమని అధికారులు చెప్పారు. దీంతో పాత ఇంటిని కూల్చివేసి మరీ కొత్త ఇంటి నిర్మాణం చేపట్టింది. అయితే, రోడ్డుపై మెట్లు ఉన్నాయంటూ పంచాయతీ కార్యదర్శికి సర్పంచ్ భర్త ఫిర్యాదు చేసినట్టు సమాచారం. దీంతో అధికారులు ఇంటి మెట్లను కూల్చివేయించారు. ముందు అనుమతులు ఇచ్చి ఇప్పుడు కూల్చడం ఏంటని బాధిత మహిళా ఆవేదన వ్యక్తం చేశారు.

Kollywood: భారీ తారాగణం..రజినీ ధర్మన్‌కు ఊహించని క్రేజ్..సినిమాSwechaa08 Nov 2026, 05:58 PM

Kollywood: భారీ తారాగణం..రజినీ ధర్మన్‌కు ఊహించని క్రేజ్..

Kollywood: మన సినిమా ఇండస్ట్రీలో స్టార్ హీరోల సినిమాలకు ఉండే క్రేజ్ వేరు. అందులోనూ రజనీకాంత్ లాంటి సూపర్‌స్టార్ పేరు వినిపిస్తే అంచనాలు ఏ స్థాయిలో ఉంటాయో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. అయితే, ఇప్పుడు రజినీ ధర్మన్ చుట్టూ వినిపిస్తున్న చర్చ ఆసక్తికరంగా మారింది. భారీ తారాగణం, పేరున్న నటీనటులు, క్రేజీ కాంబినేషన్లతో ఈ ప్రాజెక్ట్‌పై అంచనాలు పెరుగుతున్నాయి.

సికింద్రాబాద్‌లో బాణాసంచా దుకాణంలో అగ్నిప్రమాదంక్రైమ్Swechaa08 Nov 2026, 04:56 PM

సికింద్రాబాద్‌లో బాణాసంచా దుకాణంలో అగ్నిప్రమాదం

సికింద్రాబాద్‌లోని బాణాసంచా దుకాణంలో ఒక్కసారిగా పేలుళ్లు సంభవించాయి. దీంతో అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. దీపావళి పండుగ సందర్భంగా ఏర్పాటు చేసిన క్రాకర్స్ షాపు ఉన్నట్టుండి మంటల్లో చిక్కుకుపోయింది. వెంటనే స్పందించిన స్థానికులు మంటలు ఆర్పేందుకు ప్రయత్నించినా ఫలితం లేకుండా పోయింది.చిలకలగూడ పోలీస్ స్టేషన్ పరిధిలో ఈ అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. వివరాల్లోకివెళితే.. సికింద్రాబాద్‌ చిలకలగూడలోని డీబీఆర్ షోరూం పక్కనే ఏర్పాటు చేసిన బాణసంచా దుకాణంలో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. చూస్తుండగానే దుకాణం మొత్తం అగ్నికీలలు వ్యాపించాయి. మంటల ధాటికి భారీ శబ్దాలతో బాణసంచా మొత్తం పేలిపోయింది. పేలుళ్ల శబ్దాలతో పరిసర ప్రాంత ప్రజలు ఉలిక్కిపడ్డారు. ఈ ప్రమాదంలో బాణసంచా దుకాణంలోని క్రాకర్స్ పూర్తిగా కాలిపోయాయి.జనావాసాలు, రద్దీ ప్రాంతాల్లో క్రాకర్ షాపుల ఏర్పాటుపై స్థానిక ప్రజలు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

3.5 లక్షల మంది మహిళలు, వితంతువులకు పింఛన్లు : సీఎం రేవంత్ రెడ్డితెలంగాణSwechaa08 Nov 2026, 04:33 PM

3.5 లక్షల మంది మహిళలు, వితంతువులకు పింఛన్లు : సీఎం రేవంత్ రెడ్డి

రాష్ట్రంలో కొత్త చేయూత పింఛన్ల లబ్దిదారులు మొత్తంగా 4.5 లక్షలు ఉంటే అందులో 3.5 లక్షలు ఒంటరి మహిళలు, వితంతువులకు కేటాయించినట్టు సీఎం రేవంత్ రెడ్డి ప్రకటించారు.అదేవిధంగా నేత, గీత కార్మికులకు కూడా కొత్త పింఛన్లు మంజూరు చేశామని వెల్లడించారు. ఇందిరమ్మ ఇళ్లు, 200 యూనిట్ల ఉచిత విద్యుత్, మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం వంటి పథకాలు వారి కుటుంబాలకు అండగా నిలుస్తున్నాయని తెలిపారు. ప్రతిరోజూ 37 లక్షల మంది మహిళలు ఆర్టీసీ బస్సుల్లో ఉచితంగా ప్రయాణిస్తున్నారన్నారు.

AP LocalBody Elections: కంచుకోటలు బద్దలు.. నిజంగానే రిగ్గింగ్ జరిగిందా?ఏపీSwechaa08 Nov 2026, 04:23 PM

AP LocalBody Elections: కంచుకోటలు బద్దలు.. నిజంగానే రిగ్గింగ్ జరిగిందా?

AP LocalBody Elections: ఆంధ్రప్రదేశ్ పరిషత్ ఎన్నికల ఫలితాలు రాజకీయ వర్గాలను తీవ్ర దిగ్భ్రాంతికి గురిచేస్తున్నాయి. మొన్నటి మున్సిపల్ ఎన్నికల ఊపును కొనసాగిస్తూ కూటమి భారీగా స్థానాలను చేజిక్కించుకోగా, వైఎస్సార్‌సీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి సొంత ఇలాకా అయిన పులివెందుల జెడ్పీటీసీ స్థానాన్ని సైతం టీడీపీ కైవసం చేసుకోవడం రాష్ట్రాన్నే కుదిపేసింది. అయితే, దశాబ్దాలుగా తిరుగులేని కంచుకోటగా ఉన్న పులివెందులలోనే ఫ్యాన్ పార్టీ కుప్పకూలిపోవడం వెనుక ఉన్నది నిజమైన ప్రజా తీర్పేనా లేక అధికార బలంతో నడిచిన భారీ రిగ్గింగ్ మాయాజాలమా అనే సరికొత్త అనుమానాలు ఇప్పుడు తీవ్ర చర్చకు దారితీస్తున్నాయి.

Crime : కర్రీ గొడవ.. భర్తను కత్తితో పొడిచి చంపేసిన భార్యక్రైమ్Swechaa08 Nov 2026, 04:09 PM

Crime : కర్రీ గొడవ.. భర్తను కత్తితో పొడిచి చంపేసిన భార్య

రాత్రి భోజనంలో వండిన కూర విషయంలో వివాదం కాస్త భర్త హత్యకు దారి తీసింది. ఈ షాకింగ్ ఘటన గుజరాత్‌లోని అహ్మదాబాద్‌లో చోటుచేసుకోగా ఆలస్యంగా వెలుగుచూసింది. వివరాల్లోకివెళితే.. నరోడా స్మార్ట్ సిటీలో నివాసముంటున్న మాజీ ఆర్మీ జవాన్ దిలీప్‌.. ప్రస్తుతం జీఎండీసీలో డ్రైవర్‌గా పనిచేస్తున్నాడు. వీరికి ఇద్దరు పిల్లలు ఉన్నారు. గత కొంతకాలంగా ఆర్థిక ఇబ్బందుల విషయంలో దంపతుల మధ్య గొడవలు జరుగుతున్నాయి. అయితే, గురువారం రాత్రి సమయంలో కూర విషయంలో భార్యాభర్తల మధ్య తీవ్ర వాగ్వాదం చెలరేగింది. ఇద్దరూ పరస్పరం దూషించుకున్నారు. ఈ క్రమంలోనే తీవ్ర ఆగ్రహానికి గురైన నిర్మల వంటగదిలోని కత్తి తెచ్చి దిలీప్ ఛాతీ ఎడమ భాగంలో గుండె పైభాగంలో బలంగా పొడిచింది. తీవ్ర రక్తస్రావమైన దిలీప్‌ను వెంటనే ఆసుపత్రికి తరలించగా, అప్పటికే అతను మృతి చెందినట్లు వైద్యులు ధ్రువీకరించారు.

విమాన చార్జీల మోతతో రైలెక్కిన కంపెనీ సీఈవో.. చివరికి..!వైరల్ న్యూస్Swechaa08 Nov 2026, 03:45 PM

విమాన చార్జీల మోతతో రైలెక్కిన కంపెనీ సీఈవో.. చివరికి..!

 దీపావళి పండుగ వేళ విమాన టికెట్ల ధరలు ఆకాశాన్నంటాయి. దీంతో డబ్బులు ఆదా చేసుకునేందుకు రైలు ప్రయాణాన్ని ఎంచుకున్న ఒక ప్రముఖ కంపెనీ సీఈవోకు తీవ్ర చేదు అనుభవం ఎదురైంది. 'క్యాపిటల్ క్విల్', 'వైభవ్ జైన్ క్లాసెస్' సంస్థల వ్యవస్థాపకుడైన వైభవ్ జైన్ మధ్యప్రదేశ్ లోని ఇండోర్ నుంచి ఉత్తరప్రదేశ్ లోని లక్నోకు కుటుంబ సమేతంగా వెళ్లేందుకు ముందుగా విమాన టికెట్లు బుక్ చేసుకునేందుకు ప్రయత్నించాడు. అయితే ధరలు అమాంతం పెరిగిపోవడంతో రైలులో ప్రయాణించడం ద్వారా తక్కువ ఖర్చవుతుందని భావించాడు.

భాష అర్థం కాక మానసిక వేదనకు గురయ్యా: రాధికా ఆప్టేసినిమాSwechaa08 Nov 2026, 03:16 PM

భాష అర్థం కాక మానసిక వేదనకు గురయ్యా: రాధికా ఆప్టే

 బాలీవుడ్, దక్షిణాది చిత్రాల్లో నటించి గుర్తింపు పొందిన రాధికా ఆప్టే సౌత్ ఫిల్మ్ ఇండస్ట్రీపై మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు. గతంలో దక్షిణాదికి చెందిన ఒక సీనియర్ హీరోతో రొమాంటిక్ సన్నివేశాల్లో నటించడంపై ఆమె చేసిన వ్యాఖ్యలు తీవ్ర వివాదాస్పదమైన విషయం తెలిసిందే. కాగా, తాజాగా నటి కీర్తి సురేశ్‌తో కలిసి తాను నటించిన 'అక్క' అనే చిత్రం ప్రమోషన్ల కార్యక్రమంలో భాగంగా ఇచ్చిన ఓ ప్రత్యేక ఇంటర్వ్యూలో దక్షిణాది సినీ రంగంలో తాను ఎదుర్కొన్న చేదు అనుభవాలను, ఎదురైన ఇబ్బందులను బహిరంగంగా పంచుకుంది.

Telangana Politics: సొంత నేతకా? బయటి వ్యక్తికా? బీజేపీలో ముదిరిన టికెట్ వార్..తెలంగాణSwechaa08 Nov 2026, 03:15 PM

Telangana Politics: సొంత నేతకా? బయటి వ్యక్తికా? బీజేపీలో ముదిరిన టికెట్ వార్..

తెలంగాణలో జరగనున్న పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికలు కాషాయ పార్టీలో ఆధిపత్య పోరుకు తెరలేపాయి. వచ్చే ఏడాది ప్రారంభంలో రెండు స్థానాలకు పోలింగ్ జరగనుండగా, ఉమ్మడి హైదరాబాద్-రంగారెడ్డి-మహబూబ్‌నగర్ స్థానంపై బీజేపీ శ్రేణుల్లో ముందే స్పష్టత వచ్చింది. అక్కడ మాజీ ఎమ్మెల్సీ ఎన్.రామచంద్రరావు బరిలోకి దిగడం దాదాపు ఖాయమైపోయింది. కానీ, ఉమ్మడి నల్గొండ-వరంగల్-ఖమ్మం స్థానమే ఇప్పుడు పార్టీలో ముఠా తగాదాలు, తీవ్ర అసంతృప్తికి కేంద్ర బిందువుగా మారింది.

నక్సలిజంపై విజయం తర్వాత ఇదే తొలి దీపావళి: ప్రధాని మోదీNationalSwechaa08 Nov 2026, 01:56 PM

నక్సలిజంపై విజయం తర్వాత ఇదే తొలి దీపావళి: ప్రధాని మోదీ

 అనేక దశాబ్దాలుగా దేశ భద్రతకు తీవ్ర ముప్పుగా మారిన నక్సలిజం, మావోయిస్టు ఉగ్రవాదంపై విజయం సాధించిన తర్వాత జరుపుకుంటున్న తొలి పండుగ ఇదేనని ప్రధాని మోదీ అన్నారు. ఈ ఏడాది దీపావళి పర్వదినాన్ని ఛత్తీస్‌గఢ్‌లోని బస్తర్ ప్రాంతంలో భద్రతా బలగాలతో కలిసి అత్యంత ఉత్సాహంగా జరుపుకున్నారు. 2014 నుంచి నిరంతరాయంగా వరుసగా 13వ ఏడాది ఆయన సరిహద్దుల్లో, అంతర్గత భద్రతలో విధులు నిర్వర్తించే సైనికులు, సీఆర్‌పీఎఫ్ కోబ్రా జవాన్లతో కలిసి ఈ పండుగ వేడుకల్లో పాల్గొన్నారు. దశాబ్దాల పాటు తీవ్ర నక్సలైట్ల ప్రభావంలో ఉన్న బస్తర్ ప్రాంతం, దేశంలో నక్సలిజం పూర్తిగా తుడిచిపెట్టుకుపోయిన తర్వాత జరుపుకుంటున్న తొలి దీపావళి కావడంతో ప్రధాని పర్యటనకు చారిత్రక ప్రాధాన్యత సంతరించుకుంది.

పండుగ పూట విషాదం.. ఒకే కుటుంబంలో ముగ్గురి బలవన్మరణం!క్రైమ్Swechaa08 Nov 2026, 01:35 PM

పండుగ పూట విషాదం.. ఒకే కుటుంబంలో ముగ్గురి బలవన్మరణం!

 హైదరాబాద్ మహానగరంలోని ప్రసిద్ధ ఐటీ కారిడార్ పరిధిలోని గచ్చిబౌలి పోలీస్ స్టేషన్ సరిహద్దుల్లో ఘోర విషాదకర ఘటన వెలుగు చూసింది. గౌలిదొడ్డి ప్రాంతంలోని ఒక నివాస అపార్ట్‌మెంట్‌లో ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు వ్యక్తులు అనుమానాస్పద రీతిలో ఉరివేసుకుని బలవన్మరణానికి పాల్పడటం స్థానికంగా కలకలం రేపింది. వృద్ధ దంపతులతో పాటు వారి కుమారుడు ఒకే ఫ్లాట్‌లో విగతజీవులుగా మారడం విషాదాన్ని కలిగిస్తోంది.

మూడేళ్ల కష్టం ప్రజల కోసమా? కమీషన్ల కోసమా?: సీఎం రేవంత్‌ను నిలదీసిన హరీశ్‌రావు!తెలంగాణSwechaa08 Nov 2026, 01:24 PM

మూడేళ్ల కష్టం ప్రజల కోసమా? కమీషన్ల కోసమా?: సీఎం రేవంత్‌ను నిలదీసిన హరీశ్‌రావు!

 తెలంగాణ రాజకీయాల్లో కొడంగల్ పర్యటన సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు బీఆర్ఎస్, కాంగ్రెస్ మధ్య తీవ్రస్థాయి విమర్శలు దుమారం రేపాయి. తమ మూడేళ్ల పాలనలో ఒక్క రోజు కూడా సెలవు తీసుకోకుండా రాత్రింబవళ్లు కష్టపడుతున్నానని రేవంత్ పేర్కొనడంపై బీఆర్ఎస్ సీనియర్ నేత, మాజీ మంత్రి హరీశ్‌రావు తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. "ముఖ్యమంత్రి పడుతున్న ఆ కష్టం రాష్ట్ర ప్రజల సంక్షేమం కోసమా? లేక కమీషన్లు దండుకోవడం కోసమా?" అని హరీశ్‌రావు నేరుగా ప్రశ్నించారు.

దీపావళి వేళ ఊరట.. భారీగా తగ్గుతున్న బంగారం, వెండి ధరలు!వ్యాపారంSwechaa08 Nov 2026, 10:50 AM

దీపావళి వేళ ఊరట.. భారీగా తగ్గుతున్న బంగారం, వెండి ధరలు!

 అంతర్జాతీయ, దేశీయ బులియన్ మార్కెట్లలో గత కొన్ని రోజులుగా పసిడి, వెండి ధరలు క్రమంగా తగ్గుముఖం పడుతున్నాయి. ముఖ్యంగా గత రెండు రోజులుగా బంగారం ధరల్లో గణనీయమైన పతనం కనిపించింది. ఒక దశలో తులం (10 గ్రాములు) బంగారం ధర రూ.1.46 లక్షలకు పైగా నమోదు కాగా, తాజాగా నవంబర్ 8 నాటికి భారీగా తగ్గుముఖం పట్టింది. దీపావళి, ధన్‌తేరాస్ పర్వదినాల సందర్భంగా బంగారం, వెండి ఆభరణాలు కొనుగోలు చేయడం ఆనవాయితీగా భావించే వినియోగదారులకు ఈ ధరల తగ్గుదల తీవ్ర ఊరటను, ఆనందాన్ని కలిగిస్తోంది.  గత నెలలో అంతర్జాతీయంగా బంగారం ధరలు 6.3శాతం మేర పతనం కావడంతో దేశీయ మార్కెట్లలో ధరలు గరిష్ఠ స్థాయిల నుంచి దిగువకు చేరాయి.

లక్ష్మీపూజతో వ్యాపారులకు లాభాల పంట! ఆ చరిత్ర ఏంటో తెలుసా..?NationalSwechaa08 Nov 2026, 10:35 AM

లక్ష్మీపూజతో వ్యాపారులకు లాభాల పంట! ఆ చరిత్ర ఏంటో తెలుసా..?

ఇళ్ల ముందు దీపాల వరుసలు.. గుమ్మాలకు మామిడి తోరణాలు.. రంగురంగుల ముగ్గులు.. ఆకాశంలో బాణసంచా వెలుగులు. కొత్త బట్టలు, పిండి వంటలు, బంధుమిత్రుల సందడి. ఎటుచూసినా దీపావళి కళ కనిపిస్తుంది. కానీ ఈ పండుగలో అందరి దృష్టినీ ఆకర్షించే ఒక ప్రత్యేక ఘట్టం ఉంది. అదే లక్ష్మీ పూజ!

International : నెతన్యాహుకు బిగ్‌షాక్.. ఇజ్రాయెల్ కొత్త ప్రధానిగా ఐసన్ కోట్!InternationalSwechaa08 Nov 2026, 10:35 AM

International : నెతన్యాహుకు బిగ్‌షాక్.. ఇజ్రాయెల్ కొత్త ప్రధానిగా ఐసన్ కోట్!

ఇజ్రాయెల్ మాజీ ప్రధాని బెంజిమెన్ నెతన్యాహకు బిగ్ షాక్ తగిలింది. అక్టోబర్ 27న ఆ దేశ పార్లమెంటుకు జరిగిన ఎన్నికల్లో అధికార లీకుడ్ పార్టీకి గానీ, ప్రతిపక్ష పార్టీకి స్పష్టమైన మెజార్టీ రాలేదు. ఎన్నికల్లో హంగ్ ఏర్పడింది. ఇజ్రాయెల్ పార్లమెంట్ (నెస్సెట్)లోని మొత్తం 120 స్థానాల్లో ప్రభుత్వ ఏర్పాటుకు 61 సీట్లు అవసరం. అయితే, నెతన్యాహు నేతృత్వంలోని రైట్-వింగ్ కూటమికి -53 స్థానాలు దక్కాయి.

నెతన్యాహుకు చెందిన లికుడ్ పార్టీ ఒంటరిగా 27 సీట్లు సాధించి అతిపెద్ద పార్టీగా అవతరించినప్పటికీ, మిత్రపక్షాలతో కలిసి మెజారిటీ మార్క్‌ను అందుకోలేకపోయింది.ప్రతిపక్ష నేతల గాడి ఐసెన్‌కోట్ నేతృత్వంలోని నాలుగు పార్టీల ప్రతిపక్ష కూటమికి -48 స్థానాలు వచ్చాయి. అరబ్ పార్టీలు రికార్డు స్థాయిలో 19 స్థానాలు సాధించి కీలక శక్తిగా మారాయి. అటు అధికార పార్టీ లేదా ప్రతిపక్ష కూటమి అధికారం ఏర్పాటు చేయాలంటే అరబ్ పార్టీల మద్దతు కీలకంగా మారింది. అయితే, తాము ఎట్టిపరిస్థితుల్లోనూ అరబ్ పార్టీల మద్దతు కోరబోమని నెతన్యాహు బలంగా చెప్పారు.

దీపావళి పర్వదినం వేళ ఏం చేయాలి? పాటించాల్సిన ప్రధాన నియమాలు తెలుసా?SpiritualitySwechaa08 Nov 2026, 10:23 AM

దీపావళి పర్వదినం వేళ ఏం చేయాలి? పాటించాల్సిన ప్రధాన నియమాలు తెలుసా?

 హిందూ సంప్రదాయంలో అత్యంత పవిత్రమైన పండుగ అయిన దీపావళికి ప్రత్యేక ఆధ్యాత్మిక విశిష్టత ఉంది. చెడుపై మంచి సాధించిన విజయానికి ప్రతీకగా జరుపుకునే ఈ పర్వదినం వెనుక అనేక పురాణ గాథలు ప్రచారంలో ఉన్నాయి. శ్రీకృష్ణుడు, సత్యభామ సమేతుడై నరకాసురుడిని సంహరించిన ఘట్టాన్ని స్మరించుకుంటూ నరకచతుర్దశిగా, అదేవిధంగా శ్రీరాముడు రావణాసురుడిని అంతమొందించి 14ఏళ్ల వనవాసం ముగించుకుని అయోధ్యకు తిరిగి వచ్చిన వేళ ప్రజలు దివ్యమైన దీపాలతో స్వాగతం పలికిన జ్ఞాపకంగా దీపావళిని ఆనవాయితీగా జరుపుకుంటారు.

నల్ల జెండాలతో రాహుల్‌కు స్వాగతం  పలుకుతాం : బీజేపీ చీఫ్ రాంచందర్ రావుతెలంగాణSwechaa08 Nov 2026, 10:06 AM

నల్ల జెండాలతో రాహుల్‌కు స్వాగతం పలుకుతాం : బీజేపీ చీఫ్ రాంచందర్ రావు

కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ ఈనెల 14న తెలంగాణలో పర్యటించనున్న విషయం తెలిసిందే. హైదరాబాద్‌లో నిర్వహించే భారత్ సమ్మిట్ కార్యక్రమంలో పాల్గొనేందుకు ఆయన విచ్చేస్తున్నారు. ఈ ప్రొగ్రామ్ రాష్ట్ర ప్రభుత్వ ఆధ్వర్యంలో జరుగుతోంది. దేశవిదేశాల నుంచి ఇన్వెస్టర్స్, ఎంటర్ ప్రెన్యూర్స్ ఈ కార్యక్రమంలో పాల్గొననున్నారు. అయితే, రాహుల్ గాంధీని రాకను తెలంగాణ బీజేపీ తీవ్రంగా వ్యతిరేకిస్తోంది.గత ఎన్నికల సమయంలో మోసపూరిత ఆరు గ్యారెంటీలు ఇచ్చారని, వాటిని అమలు చేయకుండా ప్రజలను మోసం చేశారని ఆరోపిస్తున్నది. ఈ క్రమంలోనే కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీని తెలంగాణ ప్రజల తరఫున నిరసన ప్రదర్శనలు చేపట్టాలని నిర్ణయించింది. నవంబర్ 14న 'భారత్ సమ్మిట్ లో రాహుల్ గాంధీ పాల్గొనడాన్ని భారతీయ జనతా పార్టీ తీవ్రంగా వ్యతిరేకిస్తోందని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు ఎన్. రాంచందర్ రావు స్పష్టంచేశారు.

సరయూ తీరంలో సరికొత్త ప్రపంచ రికార్డు.. 36లక్షల ప్రమిదల వెలుగుల్లో అయోధ్య!SpiritualitySwechaa08 Nov 2026, 09:18 AM

సరయూ తీరంలో సరికొత్త ప్రపంచ రికార్డు.. 36లక్షల ప్రమిదల వెలుగుల్లో అయోధ్య!

దీపావళి పర్వదినాన్ని పురస్కరించుకుని పవిత్ర పుణ్యక్షేత్రం అయోధ్యలో నిర్వహించిన 10వ విడత 'దీపోత్సవం' కనులపండువగా, అత్యంత వైభవంగా ముగిసింది. చారిత్రాత్మక సరయూ నదీ తీరంలోని 56 ఘాట్లలో ఏకంగా 36లక్షలకు పైగా మట్టి ప్రమిదలను వెలిగించి నిర్వాహకులు సరికొత్త ప్రపంచ రికార్డును నెలకొల్పారు. వీటితో పాటు భవ్యమైన శ్రీరామ జన్మభూమి ఆలయ ప్రాంగణంలో సైతం ప్రత్యేకంగా లక్ష దీపాలను వెలిగించారు. ఈ ఆధ్యాత్మిక ఘట్టం కోసం సుమారు 35వేల మందికి పైగా స్వచ్ఛంద వలంటీర్లు అహోరాత్రులు శ్రమించి ప్రమిదలను క్రమపద్ధతిలో పేర్చి వెలుగులు నింపడం విశేషం.

చరిత్రలో ఈ రోజు (08 నవంబర్)InternationalSwechaa08 Nov 2026, 09:05 AM

చరిత్రలో ఈ రోజు (08 నవంబర్)

  • నోట్ల రద్దుకు పదేళ్లు: 2016: భారతదేశంలో నల్లధనం అరికట్టే నిమిత్తం కేంద్ర ప్రభుత్వం రూ.500, రూ.1000 నోట్ల రద్దును (పెద్ద నోట్ల రద్దు / Demonetization) ప్రకటించింది.

  • అంతర్జాతీయ రేడియాలజీ దినోత్సవం: 1895: జర్మనీకి చెందిన భౌతిక శాస్త్రవేత్త విల్హెల్మ్ రోంట్‌జెన్ ఎక్స్-రే (X-rays) కిరణాలను కనుగొన్నారు.

  • 1674: ఆధునిక ఆంగ్ల కవిత్వానికి , సాహిత్య విమర్శకునికి ఆద్యుడైన జాన్ మిల్టన్ మరణం.

  • 1969 (జననం): తెలంగాణ ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డి జన్మదినం

  • 1927 (జననం): ఎల్.కె. అద్వానీ (లాల్ కృష్ణ అద్వానీ) — ప్రముఖ భారతీయ రాజకీయ నాయకుడు, మాజీ ఉప ప్రధాని.

నేటి పంచాంగం - 08 నవంబర్ 2026 | కార్తిక కృష్ణ చతుర్దశి, ఆదివారం శుభ సమయాలు & వివరాలుSpiritualitySwechaa08 Nov 2026, 08:49 AM

నేటి పంచాంగం - 08 నవంబర్ 2026 | కార్తిక కృష్ణ చతుర్దశి, ఆదివారం శుభ సమయాలు & వివరాలు

  • తేదీ: 08 నవంబరు 2026, ఆదివారం

  • సంవత్సరం: శ్రీ పరాభవ నామ సంవత్సరం

  • అయనం & ఋతువు: దక్షిణాయనం, శరత్ఋతువు

  • మాసం & పక్షం: కార్తిక మాసం, కృష్ణ పక్షం

  • తిథి: చతుర్దశి (రాత్రి 10:18 వరకు, తదుపరి అమావాస్య)

  • వారం: ఆదివారం (భానువాసరే)

  • నక్షత్రం: స్వాతి (మధ్యాహ్నం 03:05 వరకు, తదుపరి విశాఖ)

  • యోగం: ఆయుష్మాన్ (ఉదయం 10:12 వరకు, తదుపరి సౌభాగ్య)

  • కరణం: భద్ర/విష్టి (ఉదయం 11:22 వరకు), తదుపరి బవ (రాత్రి 10:18 వరకు)

శుభ / అశుభ సమయాలు:

  • రాహుకాలం: సాయంత్రం 04:30 - 06:00 వరకు

  • యమగండం: మధ్యాహ్నం 12:00 - 01:30 వరకు

  • అమృతకాలం: ఉదయం 10:15 - 11:48 వరకు

  • దుర్ముహూర్తము:సాయంత్రం 04:10 - 04:55 వరకు

  • వర్జ్యం: రాత్రి 09:12 - 10:45 వరకు

గ్రహస్థితులు:

  • సూర్యరాశి: తుల

  • చంద్రరాశి: తుల

  • సూర్యోదయం: ఉదయం 06:21

  • సూర్యాస్తమయం: సాయంత్రం 05:37

‘స్వేచ్ఛ’ పాఠకులకు దీపావళి శుభాకాంక్షలుస్వేచ్ఛ ఛైర్మన్ డెస్క్Swechaa08 Nov 2026, 08:42 AM

‘స్వేచ్ఛ’ పాఠకులకు దీపావళి శుభాకాంక్షలు

సంతోషం వస్తే చిరునవ్వులా..

చిమ్మటి చీకట్లో మిరుగుడు పువ్వు లా..

సమస్య ఉంటే స్వేచ్ఛ గా చెప్పుకునేలా..

నిప్పు రవ్వ ఎమైనా చేయగలదనేలా..

పేదల కుటుంబల్లో వెలుగును ఇచ్చేలా..

సన్నగిళ్ళిన ఆశలకు మంటలు పుట్టించేలా..

అగ్గిపుల్లలా ! అంటించేలా..

కుట్రలు కుయుక్తులు ఎన్ని చేసినా, చేరవేసాలా..

ఈ స్వేచ్ఛ న్యూస్, ప్రజ్వాల జ్యోతిలా..

దీపం కింద చీకటిని పసిగట్టి నిలదీసేలా..

ఉంటుందని స్వేచ్చ మేనేజ్మెంట్ తరుపున

పాఠకులకు దీపావళి శుభాకాంక్షలు.

దేవేందర్ రెడ్డి చింతకుంట్ల,

స్వేచ్ఛ ఛైర్మన్,

9848070809.

Ramayana: రావణాసురుడిగా ప్రభాస్..'No' ఛాన్స్!సినిమాSwechaa08 Nov 2026, 08:32 AM

Ramayana: రావణాసురుడిగా ప్రభాస్..'No' ఛాన్స్!

Ramayana: నందమూరి తారకరామారావు అప్పట్లో ఏ పాత్ర చేయాలన్నా వెనకడుగు వేసేవారు కాదు. ఆయనే రాముడు..ఆయనే రావణాసుడు..ఆయనే భీముడు..ఆయనే పోతులూరి వీరబ్రహ్మేంద్రస్వామీ. ఇలా ఎన్నో విభిన్నమైన పాత్రల్లో నటించి ఆబాలగోపాలాన్ని అలరించారు. కానీ, ఆ తర్వాత జనరేషన్‌లో అలాంటి సాహసం ఏ హీరో చేయడం లేదు. ప్రభాస్‌కి రావణాసుడి పాత్ర అవకాశం వచ్చిన సున్నితంగా తిరస్కరించాడు.

Kollywood: నయనతారకు దెబ్బ మీద దెబ్బ..2027 అయినా కలిసొచ్చేనా?సినిమాSwechaa08 Nov 2026, 07:49 AM

Kollywood: నయనతారకు దెబ్బ మీద దెబ్బ..2027 అయినా కలిసొచ్చేనా?

Kollywood: లేడీ సూపర్ స్టార్‌గా సౌత్ అండ్ నార్త్‌లో విపరీతమైన పాపులారిటీని తెచ్చుకున్న నయనతారకి ఈ ఏడాది వరుస ఫ్లాపులు వచ్చి దెబ్బ మీద దెబ్బ తగిలింది. 2026 ప్రారంభంలో మెగాస్టార్ చిరంజీవి నటించిన మన శంకరవరప్రసాద్‌గారు మూవీతో బ్లాక్ బస్టర్ అందుకుని నూతన సంవత్సరాన్ని ప్రారంభించిన నయన్..ఆ తర్వాత మాత్రం ఆ స్వాగ్‌ను కంటిన్యూ చేయలేకపోయింది.

Kollywood: సైలెంట్‌గా సాయి పల్లవి-విజయ్ సేతుపతిల సినిమా పూర్తి!సినిమాSwechaa08 Nov 2026, 07:24 AM

Kollywood: సైలెంట్‌గా సాయి పల్లవి-విజయ్ సేతుపతిల సినిమా పూర్తి!

Kollywood: సాయి పల్లవి అంటేనే సహజమైన నటనకు కేరాఫ్ అడ్రస్. గ్లామర్ పాత్రల కంటే నటనకు ప్రాధాన్యతను ఇచ్చే ఈ నేచురల్ బ్యూటీ, వరుసగా ఆసక్తికరమైన ప్రాజెక్టులతో ప్రేక్షకులను అలరిస్తోంది. ఈ క్రమంలోనే తాజాగా మణిరత్నం దర్శకత్వంలో తెరకెక్కుతున్న సినిమాలో సాయి పల్లవి తన పాత్రకు సంబంధించిన షూటింగ్‌ను ఎలాంటి హడావుడి లేకుండా పూర్తి చేసిందనే వార్త ఆసక్తికరంగా మారింది.