స్వేచ్ఛ షార్ట్స్ — తాజా తెలుగు వార్తలు

Tollywood: ఎన్టీఆర్, త్రివిక్రమ్‌ల "గాడ్ ఆఫ్ వార్" ప్రాజెక్ట్‌ను ఆపేస్తారా?సినిమాSwechaa08 Nov 2026, 07:01 AM

Tollywood: ఎన్టీఆర్, త్రివిక్రమ్‌ల "గాడ్ ఆఫ్ వార్" ప్రాజెక్ట్‌ను ఆపేస్తారా?

Tollywood: ఎన్టీఆర్, త్రివిక్రమ్‌ల గాడ్ ఆఫ్ వార్ ప్రాజెక్ట్‌ను ఆపేస్తారా? అవును..ప్రస్తుతం ఫిలిం సర్కిల్స్‌లో ఇదే మాట బలంగా వినిపిస్తోంది. దీనికి, కారణాలు చాలానే కనిపిస్తున్నాయి. ఇటీవల త్రివిక్రమ్‌ శ్రీనివాస్ దర్శకత్వంలో వచ్చిన ఆదర్శకుటుంబం సినిమా భారీ నష్టాలపాలవడం ఒకటైటే..ఇదే కాన్సెప్ట్‌తో ఇతర భాషల్లో ఇప్పటికే కొన్ని సినిమాలు వచ్చి ఉండటం. అందుకే, ఇప్పుడు ఈ భారీ ప్రాజెక్ట్ ఉండనే మాట వినిపిస్తోంది.

Deepavali Puja Vidhanam: దీపావళి రోజు ఎప్పుడు దీపాలు వెలిగించాలి? పూజ ఇలా చేస్తేనే అసలైన ఫలితం!తెలంగాణSwechaa07 Nov 2026, 10:24 PM

Deepavali Puja Vidhanam: దీపావళి రోజు ఎప్పుడు దీపాలు వెలిగించాలి? పూజ ఇలా చేస్తేనే అసలైన ఫలితం!

Deepavali Puja Vidhanam: దీపావళి వచ్చిందంటే చాలు.. ఇల్లంతా పండుగ కళ వచ్చేస్తుంది. అయితే ఈసారి నరక చతుర్దశి, దీపావళి అమావాస్య రెండూ ఒకే రోజు రావడంతో.. అసలు దీపాలు ఎప్పుడు వెలిగించాలి? పూజ ఏ టైంలో ఎలా చేస్తే మంచిది? అనే సందేహం చాలామందిలో ఉంది. దీపావళి నాడు దీపాలు పెట్టడానికి ఒక పద్ధతి ఉంది. సరైన సమయంలో, సరైన రీతిలో దీపాలు వెలిగించి పూజ చేసుకుంటేనే ఆ లక్ష్మీదేవి కటాక్షం మన ఇంట్లో నిలుస్తుంది.దీపావళి రోజు దీపాలు పెట్టడానికి బెస్ట్ టైమ్ సాయంత్రం సంధ్యా సమయం. అంటే సూర్యుడు అస్తమించి చీకటి పడే వేళ. సరిగ్గా ఆ సమయంలోనే లక్ష్మీదేవి భూమిపై సంచరిస్తూ ఉంటుందని చెబుతారు. సాయంత్రం దీపాలు పెట్టే ముందు ఇంటి వెనుక వైపు తలుపులు మూసి ఉంచి, ముందు గుమ్మాలు వెడల్పుగా తెరిచి ఉంచాలి. ప్లాస్టిక్, పింగాణీ లాంటివి కాకుండా శుభ్రమైన మట్టి ప్రమిదల్లో నువ్వుల నూనె పోసి దీపాలు వెలిగించాలి.

Tube vs Tubeless Tyres: ట్యూబ్‌ టైరా లేదంటే ట్యూబ్ లెస్ టైరా.. ఏది వేయిస్తే బెటర్‌?వైరల్ న్యూస్Swechaa07 Nov 2026, 10:21 PM

Tube vs Tubeless Tyres: ట్యూబ్‌ టైరా లేదంటే ట్యూబ్ లెస్ టైరా.. ఏది వేయిస్తే బెటర్‌?

\Tube vs Tubeless Tyres: కొత్త వాహనం కొంటున్నప్పుడైనా, లేదా పాత బండికి టైర్లు మార్చే టైంలో చాలామందిని వేధించేది ఒక్కటే ట్యూబ్ టైర్ వేయించాలా? లేక ట్యూబ్‌లెస్ టైర్ వేయించాలా? బండి మైలేజ్, మెయింటెనెన్స్ ఖర్చులతో పాటు రోడ్డుపై ప్రయాణించేటప్పుడు మీ ప్రాణాల భద్రత కూడా ఈ టైర్ల ఎంపికపైనే ఆధారపడి ఉంటుంది. అసలు ఈ రెండింటిలో ఏది బెస్ట్? దేనివల్ల ఎలాంటి లాభాలు, నష్టాలు ఉన్నాయో ఒక్కసారి తెలుసుకుందాం.రోడ్డుపై వెళ్లేటప్పుడు ఏదైనా మేకు లేదా పదునైన వస్తువు గుచ్చుకుంటే ఈ రెండింటి రియాక్షన్ పూర్తిగా భిన్నంగా ఉంటుంది. ట్యూబ్‌లెస్ టైర్‌లో ప్రత్యేకంగా లోపల రబ్బరు గొట్టం ఉండదు. టైరు లోపలి పొరే వీల్ రిమ్‌కు గట్టిగా లాక్ అయి గాలిని నిలుపుతుంది. మేకు గుచ్చుకున్నప్పటికీ అది టైరులోనే ఇరుక్కుపోయి గాలిని చాలా నిదానంగా మాత్రమే బయటకు పోనిస్తుంది. దీనివల్ల డ్రైవర్‌కు వెహికల్‌పై పూర్తి కంట్రోల్ ఉంటుంది. హైవేలపై వంద స్పీడ్‌లో ఉన్నా ఒక్కసారిగా బండి అదుపు తప్పే ప్రమాదం ఉండదు. పైగా టైరును విప్పాల్సిన పనిలేకుండా బయట నుంచే రెండు నిమిషాల్లో పంక్చర్ వేయించుకోవచ్చు.

Regina Cassandra: మీరేమన్నా తోపు హీరోయిన్లా.. రాధికా ఆప్టేపై రెజీనా ఫైర్సినిమాSwechaa07 Nov 2026, 10:17 PM

Regina Cassandra: మీరేమన్నా తోపు హీరోయిన్లా.. రాధికా ఆప్టేపై రెజీనా ఫైర్

Regina Cassandra: సౌత్ సినిమా పరిశ్రమను, ఇక్కడి మేకర్లను తక్కువ చేసి మాట్లాడే నార్త్ హీరోయిన్స్ తీరుపై నటి రెజీనా కాసాండ్రా తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. ఇటీవల నటి రాధికా ఆప్టే దక్షిణాది సినీ పరిశ్రమపై వివాదాస్పద కామెంట్స్ చేస్తూ వార్తల్లో నిలవగా.. దానికి ఏమాత్రం మొహమాటం లేకుండా రెజీనా కౌంటర్ ఇచ్చారు. "సౌత్ ఇండస్ట్రీపై అవాకులు చవాకులు పేలడానికి మీరేమన్నా తోపు హీరోయిన్లా?" అన్న రీతిలో రెజీనా నిలదీసిన తీరు ఇప్పుడు సినీ వర్గాల్లో తీవ్ర సంచలనంగా మారింది. తెలుగు, తమిళ భాషల్లో మంచి గుర్తింపు తెచ్చుకుని, ఇటీవల నయనతార చిత్రం 'మహాశక్తి'లో నెగెటివ్ రోల్‌తో ప్రశంసలు అందుకున్న రెజీనా.. ఉత్తరాది నటీనటులు సౌత్ సినిమాపై చూపిస్తున్న కపట వైఖరిని బాహాటంగానే ఎండగట్టారు.

ప్రభుత్వం గుడ్‌న్యూస్.. కొత్తగా 4.5లక్షల పెన్షన్లుతెలంగాణSwechaa07 Nov 2026, 09:48 PM

ప్రభుత్వం గుడ్‌న్యూస్.. కొత్తగా 4.5లక్షల పెన్షన్లు

Danasari Seethakka: తెలంగాణ ప్రభుత్వం శుభవార్త చెప్పింది. దీపావళి పండుగ కానుకగా కొత్తగా 4.5 లక్షల మందికి చేయూత పెన్షన్లు ఇవ్వనుంది. ఈ మేరకు రాష్ట్ర పంచాయతీ రాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి సీతక్క ప్రకటించారు. ఆదివారం కొడంగల్‌లో సీఎం రేవంత్‌రెడ్డి చేతుల మీదుగా పెన్షన్ల పంపిణీ కార్యక్రమానికి శ్రీకారం చుట్టనున్నట్లు మంత్రి వెల్లడించారు. సీఎం రేవంత్ కొంతమంది లబ్దిదారులకు స్వయంగా మంజూరు పత్రాలు అందించనున్నారు. అనంతరం అన్ని జిల్లాల్లో మంత్రులు, ప్రజాప్రతినిధులు ద్వారా లబ్దిదారులకు పత్రాల పంపిణీ ఉంటుందన్నారు.

TG: మొత్తానికి దొరికిన గంజాయి లేడీ డాన్‌.. రెండేండ్లుగా ఎలా తప్పించుకుందంటే?తెలంగాణSwechaa07 Nov 2026, 08:59 PM

TG: మొత్తానికి దొరికిన గంజాయి లేడీ డాన్‌.. రెండేండ్లుగా ఎలా తప్పించుకుందంటే?

TG: హైదరాబాద్ ఐటీ కారిడార్‌ను కేంద్రంగా చేసుకుని ఏకంగా తొమ్మిదేళ్లుగా మత్తు సామ్రాజ్యాన్ని నడిపిస్తున్న గంజాయి లేడీ డాన్ ఎట్టకేలకు ఖాకీల వలలో చిక్కింది. నానక్‌రామ్‌గూడకు చెందిన 51 ఏళ్ల కలాపతి నీతూ బాయిని తెలంగాణ ఈగల్ ఫోర్స్ అత్యంత చాకచక్యంగా పట్టుకుంది. 30 కేసులు, అందులో 13 కేసుల్లో నాన్-బెయిలబుల్ వారెంట్లతో వాంటెడ్‌గా ఉంటూ.. పోలీసుల కళ్లుగప్పి ఏకంగా రెండేళ్లుగా అజ్ఞాతంలో గడిపిన ఈ కిలాడీ మహిళ వ్యవహారం ఇప్పుడు సంచలనంగా మారింది. సాఫ్ట్‌వేర్ ఇంజినీర్లు, కాలేజీ కుర్రాళ్లే టార్గెట్‌గా వేల కోట్ల విలువైన గంజాయి దందాను నడిపించిన ఈ మత్తు రాణి.. ఇన్నాళ్లూ పోలీసుల రాడార్ నుంచి ఎలా తప్పించుకుంది? ఆమె లగ్జరీ సామ్రాజ్యం ఎలా కూలిపోయిందనే అంశాలు వెన్నులో వణుకు పుట్టిస్తున్నాయి.

బెంగుళూరు ఏడుగురి హత్య.. అసలు సూత్రదారి కూతురేనా.. ఎలా హెల్ప్‌ చేసిందంటే?NationalSwechaa07 Nov 2026, 08:41 PM

బెంగుళూరు ఏడుగురి హత్య.. అసలు సూత్రదారి కూతురేనా.. ఎలా హెల్ప్‌ చేసిందంటే?

Bengaluru Seven Murders: బెంగళూరులో ఒకే కుటుంబానికి చెందిన ఏడుగురిని అత్యంత పాశవికంగా నరికి చంపిన సామూహిక హత్యాకాండలో దర్యాప్తు అధికారులు సైతం నోరెళ్లబెట్టే దిగ్భ్రాంతికర నిజాలు వెలుగులోకి వస్తున్నాయి. ఇప్పటివరకు క్యాబ్ డ్రైవర్ ఇందుశేఖర్ మాత్రమే ఈ ఘాతుకానికి పాల్పడ్డాడని భావించగా.. పోలీసుల విచారణలో తెరపైకి వచ్చిన కోణం ఒళ్లు గగుర్పొడిచేలా చేస్తోంది. ఈ కిరాతక నరమేధంలో నిందితుడి 17 ఏళ్ల మైనర్ కుమార్తె కేవలం మూగ ప్రేక్షక పాత్రకే పరిమితం కాలేదని, హత్యలకు పక్కాగా పథక రచన చేయడంలో, ఒక్కొక్కరినీ ఉచ్చులోకి లాగడంలో అసలు సూత్రధారిలా వ్యవహరించిందన్న బలమైన అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. కన్నతల్లితో సహా ఏడుగురు బంధువులను చంపడంలో ఆమె తండ్రికి ఏ మేరకు సహకరించిందనే వివరాలు ఇప్పుడు సంచలనంగా మారాయి.

Bollywood: "వెంటిలేటర్ 2"పై ప్రియాంక చోప్రా ఆసక్తి ఎందుకు?సినిమాSwechaa07 Nov 2026, 08:20 PM

Bollywood: "వెంటిలేటర్ 2"పై ప్రియాంక చోప్రా ఆసక్తి ఎందుకు?

Bollywood: గ్లోబల్ స్టార్ ప్రియాంక చోప్రా మరోసారి భారతీయ సినిమా ప్రేక్షకుల దృష్టిని ఆకర్షించారు. పదేళ్ల క్రితం ప్రేక్షకుల ముందుకు వచ్చిన మరాఠీ చిత్రం ‘వెంటిలేటర్’కు సీక్వెల్ ప్రకటించి అందరినీ ఆశ్చర్యపరిచారు. ‘వెంటిలేటర్ 2’ పేరుతో తెరకెక్కనున్న ఈ సినిమాపై ఇప్పుడు బాలీవుడ్ లో ఆసక్తికరమైన చర్చ జరుగుతోంది. అయితే, ఈ ప్రాజెక్ట్‌పై ప్రియాంకకు ఇంత ప్రత్యేకమైన ఆసక్తి ఎందుకు? దీని వెనుక కేవలం నిర్మాతగా ఉన్న అనుబంధమే కాకుండా, తన తండ్రితో ముడిపడిన ఒక ఎమోషనల్ కారణం కూడా ఉంది.

Sonia Gandhi: ఇందిరాగాంధీ ఎమర్జెన్సీ నిర్ణయం తప్పే.. సోనియా గాంధీ సంచలన వ్యాఖ్యలుNationalSwechaa07 Nov 2026, 07:37 PM

Sonia Gandhi: ఇందిరాగాంధీ ఎమర్జెన్సీ నిర్ణయం తప్పే.. సోనియా గాంధీ సంచలన వ్యాఖ్యలు

Sonia Gandhi: భారత రాజకీయ యవనికపై ఇప్పటికీ చెరగని మచ్చగా మిగిలిపోయిన 'ఎమర్జెన్సీ' వ్యవహారంపై కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీ తొలిసారిగా నోరు విప్పారు. తన అత్తగారు, నాటి ప్రధాని ఇందిరా గాంధీ తీసుకున్న ఆ వివాదాస్పద నిర్ణయం ముమ్మాటికీ "ఓ చారిత్రక పొరపాటే" అంటూ సంచలన కామెంట్స్ చేశారు. అంతటితో ఆగకుండా.. దేశాన్ని అతలాకుతలం చేసిన ఆ అంధకార కాలానికి తెరవెనుక అసలు సూత్రధారి ఎవరు? గాంధీ కుటుంబంలో డిన్నర్ టేబుల్ వద్ద నడిచిన తీవ్ర ఘర్షణలేంటి? అనే విస్తుపోయే రహస్యాలను ఆమె బహిర్గతం చేశారు. త్వరలో రాబోతున్న తన ఆత్మకథ నేపథ్యంలో ఓ అంతర్జాతీయ మీడియా సంస్థతో పాటు 'ది హిందూ' పత్రికకు ఇచ్చిన ప్రత్యేక ఇంటర్వ్యూలో సోనియా గాంధీ ఈ నిజాలను బయటపెట్టారు.ఎమర్జెన్సీ విధించే అంశంపై నాటి గాంధీ కుటుంబంలో తీవ్రస్థాయిలో వాగ్వాదాలు, అంతర్గత కుమ్ములాటలు జరిగాయని సోనియా స్పష్టం చేశారు. ఈ కఠిన నిర్ణయాన్ని రాజీవ్ గాంధీ ఆది నుంచే తీవ్రంగా వ్యతిరేకించారని ఆమె గుర్తు చేసుకున్నారు. "వచ్చే సార్వత్రిక ఎన్నికల వరకు ఓపిక పట్టండి.. తొందరపడి ఇలాంటి నిర్ణయాలు తీసుకోవద్దు" అని రాజీవ్ గాంధీ తన తల్లి ఇందిరకు పదేపదే మొరపెట్టుకున్నారు. అయితే ఇందిర చిన్న కుమారుడు సంజయ్ గాంధీ మాత్రం ఎమర్జెన్సీ విధించాల్సిందేనని మొండిపట్టు పట్టారు.

పదేళ్లలో లక్ష కోట్ల దోపిడీ- కేసీఆర్ కుటుంబంపై సీఎం రేవంత్ ఫైర్తెలంగాణSwechaa07 Nov 2026, 07:19 PM

పదేళ్లలో లక్ష కోట్ల దోపిడీ- కేసీఆర్ కుటుంబంపై సీఎం రేవంత్ ఫైర్

Cm Revanth: పదేళ్ల బీఆర్ఎస్ పాలనలో కేసీఆర్ కుటుంబం లక్ష కోట్ల దోపిడీకి పాల్పడిందని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆరోపించారు. లక్ష కోట్లు దోచుకున్న కేసీఆర్ కుటుంబాన్ని ప్రజలు ఎప్పటికీ నమ్మరని వ్యాఖ్యానించారు. తెలంగాణ ప్రజలు ఎప్పటికీ క్షమించని తప్పులను కేసీఆర్ కుటుంబం చేసిందని ధ్వజమెత్తారు. కొడంగల్ లో నిర్వహించిన సభలో సీఎం రేవంత్ మాట్లాడారు.

''సారాయి నుంచి మొదలుపెడితే లిక్కర్, నీళ్లు, పాలు, భూములు, గనులు... ఇలా ఒక్కొక్కరు ఒక్కో దాన్ని.. ఇంటిల్లిపాదిగా తెలంగాణను కొల్లగొట్టి లక్ష కోట్లు సంపాదించారు. లిక్కర్ వ్యాపారం సంతోష్ రావు తీసుకున్నారు. ఆంధ్రోళ్ల కంపెనీలకు పాలు అమ్మి, బ్లాక్ మెయిల్ చేసి హరీశ్ రావు వందల కోట్లు సంపాదించారు. భూములను కేటీఆర్, నీళ్లను కేసీఆర్ చెరబట్టారు. భూమి, ఆకాశం, గనులు, ఇసుక దేన్నీ వదల్లేదు. మిమ్మల్ని తెలంగాణ ప్రజలు క్షమించరు. నేరెళ్ల బాధితులను లారీ కింద వేసి తొక్కించారు, ఖమ్మం జిల్లాలో గిట్టుబాటు ధర అడిగిన రైతులకే బేడీలు వేయించారు. వరి వేస్తే ఉరేసుకున్నట్లే అని రైతులను అవమానించారు. ఇవన్నీ అప్పుడే మర్చిపోయారని అనుకుంటున్నారా?'' అంటూ నిప్పులు చెరిగారు సీఎం రేవంత్.

Bollywood: రామాయణ బడ్జెట్ గురించి మాట్లాడొద్దు..సల్మాన్ కామెంట్స్ వైరల్సినిమాSwechaa07 Nov 2026, 06:32 PM

Bollywood: రామాయణ బడ్జెట్ గురించి మాట్లాడొద్దు..సల్మాన్ కామెంట్స్ వైరల్

Bollywood: కొన్నిసార్లు సినిమా కంటే కూడా కాంబినేషన్..బడ్జెట్ గురించే ఎక్కువగా చర్చలు జరుగుతుంటాయి. అలా, ఇప్పుడు అంతటా చర్చలు జరుగుతున్నది బాలీవుడ్‌లో రూపొందిన తాజా చిత్రం రామాయణ సినిమా బడ్జెట్ విహ్స్యంలో..ఈ సినిమాకి ఉపయోగించిన వీఎఫెక్స్ విషయంలో. దీనిపై, తాజాగా బాలీవుడ్ స్టార్..కండల వీరుడు సల్మాన్ ఖాన్ స్ట్రాంగ్‌గా రియాక్ట్ అయ్యాడు. రామాయణ గురించి మాట్లాడండి..ఆ సినిమా బడ్జెట్ గురించి కాదంటూ చెప్పుకొచ్చాడు.

RSS: సంఘ్ నయా రూట్.. ఆపరేషన్ 'జెన్-జీ' వెనుక అసలు ప్లాన్ ఇదే!NationalSwechaa07 Nov 2026, 06:28 PM

RSS: సంఘ్ నయా రూట్.. ఆపరేషన్ 'జెన్-జీ' వెనుక అసలు ప్లాన్ ఇదే!

RSS: సాంప్రదాయ మైదానాలు, కాషాయ ధ్వజాలు, క్రమశిక్షణతో కూడిన శాఖలు.. శతాబ్ది ఉత్సవాల ముంగిట ఉన్న రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ (ఆర్ఎస్ఎస్) రూపురేఖలను గుర్తుచేసుకుంటే సాధారణంగా కనిపించే దృశ్యాలివి. కానీ కాలం మారింది. రాజకీయ సమీకరణాల కంటే వేగంగా తరం మారింది. చేతిలోని స్మార్ట్‌ఫోన్, వేలికొనలపై తిరిగే ఇన్‌స్టాగ్రామ్ రీల్స్, ఎక్స్ ట్రెండ్స్ కేంద్రంగా దేశంలో సరికొత్త ఆలోచనా ధోరణి పుట్టుకొస్తోంది. కేంద్రంలో మోదీ ప్రభుత్వం పటిష్టంగానే ఉన్నప్పటికీ, నవతరం ఆలోచనలు పాత పంథాకు సరిపడటం లేదన్న వాస్తవాన్ని సంఘ్ పరివార్ గ్రహించింది. ఈ నేపథ్యంలోనే మధ్యప్రదేశ్‌లోని ఇండోర్ వేదికగా మూడు రోజుల పాటు సాగిన మేధోమథనం ఒక సంచలన వ్యూహానికి వేదికైంది.

వాళ్ల మాటలు నమ్మి రైతులు మోసపోవద్దుతెలంగాణSwechaa07 Nov 2026, 06:09 PM

వాళ్ల మాటలు నమ్మి రైతులు మోసపోవద్దు

Cm Revanth: రాష్ట్రంలోని రైతాంగానికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కీలక సూచన చేశారు. యాసంగిలో ఆరుతడి పంటలు మాత్రమే వేయాలని కోరారు. విపక్ష నేతల తప్పుడు మాటలు విని మోసపోవద్దని హెచ్చరించారు. రాబోయే రోజుల్లో ఎండలు మరింత తీవ్రం అవుతాయని.. జూలై వరకు వర్షాలు రావని, ఉన్న నీటిని పొదుపుగా వాడుకోవాలని సీఎం రేవంత్ సూచించారు. అందరం కలిసికట్టుగా ఉండి ఎల్ నినోను ఎదుర్కోవాలని పిలుపునిచ్చారు.

''ఎల్‌నినో ప్రభావంతో రాష్ట్రంలో వర్షాభావ పరిస్థితులు ఎదురయ్యే అవకాశముంది. ప్రాజెక్టుల్లో ప్రస్తుతం ఉన్న నీళ్లు తాగునీటి అవసరాలకే సరిపోతాయి. ముందు ముందు ఎండల తీవ్రత మరింత పెరిగే అవకాశం ఉంది. రైతులు ఆరుతడి పంటలే సాగు చేయాలి. ఎల్‌నినోపై బీఆర్ఎస్ నేతల ప్రచారాన్ని నమ్మి మోసపోవద్దు. కష్టకాలంలో ప్రజలకు అండగా ఉండాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉంది. అందరం కలిసికట్టుగా పరిస్థితులను ఎదుర్కొందాం'' అని సీఎం రేవంత్ అన్నారు.

Tollywood: "కాకా" సంక్రాంతికే.."విశ్వంభర" సంగతేంటీ?సినిమాSwechaa07 Nov 2026, 06:09 PM

Tollywood: "కాకా" సంక్రాంతికే.."విశ్వంభర" సంగతేంటీ?

Tollywood: ప్రతీ ఏడాది సంక్రాంతి సీజన్‌ను టార్గెట్ చేస్తూ మన తెలుగు స్టార్స్ నటించిన సినిమాల విడుదల తేదీలపై టాలీవుడ్‌లో ఆసక్తికరమైన చర్చ నడుస్తోంది. అలాగే, ఈ సారి 2027 సంక్రాంతికి కూడా మెగాస్టార్ చిరంజీవి నటిస్తున్న భారీ సోషియో ఫాంటసీ చిత్రం విశ్వంభర విడుదల విషయంలో నిన్నా మొన్నటి వరకూ కాకా చిత్రం పోస్ట్ పోన్ అవుతుందని..ఆ తేదీకి విశ్వంభర రిలీజ్ ఉంటుందని ప్రచారం జరిగింది. కానీ, మేకర్స్ నుంచి మాత్రం ఇంకా స్పష్టత రావాల్సి ఉంది.

కొనుగోలు కేంద్రాలు ప్రారంభం కాక రైతుల ఇబ్బందులు- హరీశ్ రావుతెలంగాణSwechaa07 Nov 2026, 05:37 PM

కొనుగోలు కేంద్రాలు ప్రారంభం కాక రైతుల ఇబ్బందులు- హరీశ్ రావు

Harish Rao: రేవంత్ సర్కార్ పై మండిపడ్డారు మాజీమంత్రి హరీశ్ రావు. కాంగ్రెస్ ప్రభుత్వం రైతుల పట్ల నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఓవైపు కరువు పరిస్థితులతో రాష్ట్రంలో 25 లక్షల ఎకరాల్లో పంటలు ఎండిపోయి రైతులు ఆవేదన చెందుతుంటే.. మరోవైపు పండిన కాస్త పంటను అమ్ముకుందామంటే ప్రభుత్వం కొనుగోలు కేంద్రాలు ప్రారంభించకపోవడం దారుణం అన్నారు. చాలా చోట్ల కొనుగోలు కేంద్రాలు ప్రారంభం కాక దొడ్డు వడ్లు పండించిన రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని చెప్పారు. పౌరసరఫరాల శాఖ మంత్రి, మార్కెటింగ్ శాఖ మంత్రి ఏం చేస్తున్నారని హరీశ్ రావు ప్రశ్నించారు.

MaheshKumar Goud: సౌమ్యుడైన పీసీసీ చీఫ్‌కు ఎందుకు కోపమొచ్చింది?తెలంగాణSwechaa07 Nov 2026, 05:08 PM

MaheshKumar Goud: సౌమ్యుడైన పీసీసీ చీఫ్‌కు ఎందుకు కోపమొచ్చింది?

MaheshKumar Goud: తెలంగాణలో కాంగ్రెస్‌కి అధికారం దక్కిన వేళ కన్పించిన ఐక్యత.. రోజులు గడిచేకొద్దీ అంతర్గత ఆధిపత్య పోరుగా రూపాంతరం చెందుతోంది. జిల్లాల వారీగా మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎంపీలు తమ పట్టు నిలుపుకునేందుకు వేస్తున్న ఎత్తులు, పైఎత్తులు చివరకు గాంధీభవన్ చుట్టూ ముసురుకుంటున్నాయి. ఇప్పటివరకు ఇలాంటి వివాదాలు ఎన్ని ఎదురైనా సంయమనంతో వ్యవహరిస్తూ, అందరితో సౌమ్యంగా ఉంటారనే గుర్తింపు తెచ్చుకున్న టీపీసీసీ అధ్యక్షుడు బి. మహేష్ కుమార్ గౌడ్ ఇప్పుడు అనూహ్యంగా దూకుడు పెంచారు. పార్టీలో తారస్థాయికి చేరిన గ్రూపు తగాదాలు, బాహాటంగా నేతలు చేస్తున్న వివాదాస్పద వ్యాఖ్యలపై ఆయన ఏకంగా ఏఐసీసీ పెద్దలకే ప్రాథమిక నివేదికను పంపడం హస్తం వర్గాల్లో ప్రకంపనలు సృష్టిస్తోంది.

Delhi Air Pollution: ఢిల్లీని కమ్మేసిన విషపు పొగ.. పండుగకు ముందే డేంజర్ బెల్స్!NationalSwechaa07 Nov 2026, 04:33 PM

Delhi Air Pollution: ఢిల్లీని కమ్మేసిన విషపు పొగ.. పండుగకు ముందే డేంజర్ బెల్స్!

Delhi Air Pollution: దీపావళి పటాకుల శబ్దం ఇంకా మొదలుకాలేదు.. టపాసుల వెలుగులు అసలు చూడనేలేదు.. కానీ దేశ రాజధాని ఢిల్లీని మాత్రం అప్పుడే దట్టమైన విషపు పొగ చుట్టేసింది. ఏటా చలికాలం మొదట్లో నగరాన్ని భయపెట్టే వాయు కాలుష్యం ఈసారి పండుగ రాకముందే డేంజర్ బెల్స్ మోగిస్తోంది. నిజానికి ఈ రోజు తెల్లవారుజాము నుంచే రోడ్లపై కమ్ముకుంటున్నది మామూలు పొగమంచు కాదని, ప్రాణాలకే ఎసరు పెట్టే విషవాయువులని తెలిసి ఢిల్లీ జనం వణికిపోతున్నారు.ప్రస్తుతం ఢిల్లీలో పరిస్థితి చూస్తే అచ్చం ఒక 'గ్యాస్ ఛాంబర్'లో ఉన్నట్లే ఉంది. సెంట్రల్ పొల్యూషన్ కంట్రోల్ బోర్డు లెక్కల ప్రకారం.. నగరంలో ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్ (AQI) ఏకంగా 391 పాయింట్లకు పడిపోయి ‘వెరీ పూర్’ కేటగిరీకి చేరింది. ద్వారక, రోహిణి, ఐటీవో, పంజాబీ బాగ్, జహంగీర్‌పురి లాంటి కీలక ప్రాంతాల్లో గాలి నాణ్యత దారుణంగా పడిపోయింది. ఒక్క ఢిల్లీలోనే కాదు.. పక్కనే ఉన్న నోయిడా, గురుగ్రామ్, ఫరీదాబాద్ లాంటి నగరాల్లోనూ పరిస్థితి ఇంతే దారుణంగా మారింది.

దీపావళికి నో ‘స్పెషల్’.. చార్జీల బాంబులు పేల్చిన ఆర్టీసీ!తెలంగాణSwechaa07 Nov 2026, 03:38 PM

దీపావళికి నో ‘స్పెషల్’.. చార్జీల బాంబులు పేల్చిన ఆర్టీసీ!

తెలంగాణ ఆర్టీసీ దోపిడీ మాములుగా లేదని ప్రయాణికులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. పండుగలు వస్తే చాలు పూనకం వచ్చినట్టు ఇష్టానుసారంగా చార్జీలు పెంచుకుంటూ పోతోందని మండిపడుతున్నారు. ఇటీవల దసరా పండుగకు సుమారు వారం రోజుల పాటు అసలు చార్జీలపై 50 శాతం అదనంగా వసూలు చేసిన ఆర్టీసీ.. తాజాగా దీపావళి పండుగకు ఊరెళ్లే ప్రయాణికుల నుంచి కూడా వసూలు చేస్తోందని విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. టీజీఎస్ ఆర్టీసీ తీరుతో ప్రయాణికుల జేబులకు చిల్లు పడుతోంది.పండుగ పూట కుటుంబంతో కలిసి సొంతూరుకు వెళ్లేందుకు ప్రయాణికులు జంకుతున్నారు. ఆర్టీసీలో భద్రత ఉంటుందని బస్ ఎక్కితే సాధారణ టికెట్ మీద 50 శాతం అదనంగా వసూలు చేస్తుండటంతో ఇంట్లో ముగ్గురు ఉంటే ‘వన్ వే’ ప్రయాణానికే సుమారు రూ.2 వేలు అవుతున్నాయని ప్యాసింజర్స్ వాపోతున్నారు.

Telangana Politics : తెలంగాణలో బీజేపీ దూకుడు వర్కౌట్ అవుతుందా?తెలంగాణSwechaa07 Nov 2026, 03:00 PM

Telangana Politics : తెలంగాణలో బీజేపీ దూకుడు వర్కౌట్ అవుతుందా?

దక్షిణాదిలో కర్ణాటక తర్వాత బీజేపీ పార్టీకి బలమైన రాజకీయ పునాది ఉన్న రాష్ట్రం తెలంగాణ. అందుకే ఎప్పటినుంచో ఇక్కడ అధికార పీఠాన్ని దక్కించుకోవడమే ఏకైక లక్ష్యంగా కాషాయ దళం పావులు కదుపుతోంది. అయితే ఎన్నికల సమయంలో హడావుడి చేయడం, ఆ తర్వాత సైలెంట్ అయిపోవడం అనే పాత పద్ధతికి స్వస్తి పలుకుతూ.. ఈసారి కమలనాథులు పూర్తి భిన్నమైన క్షేత్రస్థాయి వ్యూహంతో రంగంలోకి దిగారు. తాజాగా అధిష్టానం నియమించిన ఇన్‌ఛార్జ్‌లు తీసుకుంటున్న దూకుడు నిర్ణయాలు ఇప్పుడు రాష్ట్ర రాజకీయాల్లో సరికొత్త చర్చకు దారితీస్తున్నాయి.

నా వెనుక ఉన్నది రాజకీయ పార్టీ కాదు: హీరో ధనుష్ సంచలన ప్రకటన!రాజకీయాలుSwechaa07 Nov 2026, 02:55 PM

నా వెనుక ఉన్నది రాజకీయ పార్టీ కాదు: హీరో ధనుష్ సంచలన ప్రకటన!

తమిళ చిత్ర పరిశ్రమలో ప్రముఖ నటుడిగా కొనసాగుతున్న ధనుష్ తన రాజకీయ ప్రవేశంపై గత కొంతకాలంగా జరుగుతోన్న ఊహాగానాలకు ఎట్టకేలకు స్పష్టతనిచ్చారు. చెన్నై వేదికగా జరిగిన తన తాజా భారీ పాన్-ఇండియా చిత్రం ‘ఓమ్’ (OM) ఆడియో విడుదల వేడుకలో ఆయన రాజకీయ రంగప్రవేశంపై క్లారిటీ ఇస్తూ కీలక వ్యాఖ్యలు చేశారు. తన వెనుక ఎలాంటి రాజకీయ పార్టీల మద్దతు లేదని, కేవలం భగవంతుని ఆశీస్సులు, తనపై అపారమైన ప్రేమను కురిపించే అభిమానులు, ప్రజలే తనకు అసలైన బలమని ఆయన స్పష్టం చేశారు.

రేవంత్ రెడ్డి  బర్త్ డే వేడుకల ఖర్చు రూ.150 కోట్లు?తెలంగాణSwechaa07 Nov 2026, 02:39 PM

రేవంత్ రెడ్డి బర్త్ డే వేడుకల ఖర్చు రూ.150 కోట్లు?

తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పుట్టిన రోజు వేడుకలకు రూ.150 కోట్ల ఖర్చు చేస్తున్నారనే వార్త ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ట్యాక్సులు కట్టే జనాలు తీవ్ర ఇబ్బందులు పడుతూ అల్లాడుతుంటే రేవంత్ రెడ్డి ప్రజాధనాన్ని తన స్వార్థం కోసం వినియోగిస్తున్నారని తీవ్ర ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. తెలంగాణలో ఒక పక్క కరెంట్, నీళ్లు లేక రైతులు, ప్రజలు అల్లాడుతుంటే.. మరోవైపు పుట్టినరోజు సంబురాల్లో రేవంత్ సర్కార్ మునిగి తేలుతోందని విమర్శలు వినిపిస్తున్నాయి. ప్రజల సొమ్ముతో భారీగా హోర్డింగ్‌లు, ఫ్లెక్సీలు, పత్రికల్లో, టీవీల్లో, సోషల్ మీడియాలో ప్రచారాలు చేయిస్తున్నారని పలువురు ఆరోపిస్తున్నారు. నవంబర్ 8 (దీపావళి పండుగ)నాడు తన పుట్టినరోజు వేడుకలను సీఎం రేవంత్ రెడ్డి సొంత నియోజకవర్గం కొడంగల్‌లో జరుపుకోనున్నారు. ఈ క్రమంలోనే ఇవాళ, రేపు, ఎల్లుండి మూడు రోజులు మంత్రులు, అధికారులందరూ కొడంగల్లోనే ఉండేలా ముఖ్యమంత్రి ప్లాన్ చేశారని ప్రచారం జరుగుతోంది.

నీట్ అభ్యర్థులకు గుడ్‌న్యూస్.. మెడికల్ సీట్లు భారీగా పెంపు!తెలంగాణSwechaa07 Nov 2026, 02:23 PM

నీట్ అభ్యర్థులకు గుడ్‌న్యూస్.. మెడికల్ సీట్లు భారీగా పెంపు!

ఎంబీబీఎస్ విద్యార్థులకు జాతీయ వైద్య కమిషన్ (ఎన్‌ఎంసీ) గుడ్‌న్యూస్ చెప్పింది. దేశవ్యాప్తంగా మొత్తం 9,839 పీజీ సీట్లు కొత్తగా అందుబాటులోకి రాగా, తెలుగు రాష్ట్రాల్లోనూ మెడికల్ సీట్లు గణనీయంగా పెరగనున్నాయి. రాష్ట్రంలో గతేడాది 3,721గా ఉన్న మొత్తం పీజీ సీట్ల సంఖ్య ప్రస్తుత విద్యా సంవత్సరానికి 4,417కు చేరింది.అనగా 696 సీట్లు అదనంగా పెరిగాయి. ఏపీలో 3,908 నుంచి 4,316 చేరగా.. 408 సీట్లు అదనంగా పెరిగాయి. ఇదిలాఉండగా, గతంలో కేవలం పది కాలేజీల్లోనే పోస్టుగ్రాడ్యుయేషన్ కోర్సులు ఉండగా.. ఇప్పుడు మరో 13 కాలేజీలకు ఆ సౌకర్యం పెరిగింది. నాగర్‌కర్నూల్, మహబూబాబాద్, వనపర్తి, మంచిర్యాల, కామారెడ్డి, రాజన్న సిరిసిల్ల, ఖమ్మం, కరీంనగర్, జయశంకర్ భూపాలపల్లి, జనగాం, నిర్మల్, సంగారెడ్డి, నర్సంపేట కాలేజీలకు తొలిసారిగా పీజీ సీట్లను పెంచనున్నట్టు సమాచారం.

దీపావళికి ఇజ్రాయెల్ ఎంబసీ వినూత్న శుభాకాంక్షలు!వైరల్ న్యూస్Swechaa07 Nov 2026, 01:44 PM

దీపావళికి ఇజ్రాయెల్ ఎంబసీ వినూత్న శుభాకాంక్షలు!

 పండుగల వేళ శుభాకాంక్షలు తెలపడంలో వివిధ దేశాల రాయబార కార్యాలయాలు విభిన్న పద్ధతులను అనుసరిస్తుంటాయి. ఈ క్రమంలో భారత్‌లోని ఇజ్రాయెల్ రాయబార కార్యాలయం (Israel Embassy in India) దీపావళి పండుగను పురస్కరించుకుని అత్యంత సృజనాత్మకమైన, సరదాగా సాగే ఒక వీడియోను రూపొందించి అందరినీ ఆకట్టుకుంది. ప్రసిద్ధ 'చైనీస్ విస్పర్' (Chinese Whisper) గేమ్ ఆధారంగా దౌత్యవేత్తలు సరదాగా ఆడిన ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతూ నెటిజన్లను కడుపుబ్బా నవ్విస్తోంది.

Bollywood: రామాయణతో యష్ కి మళ్ళీ నష్టాలేనా?సినిమాSwechaa07 Nov 2026, 01:39 PM

Bollywood: రామాయణతో యష్ కి మళ్ళీ నష్టాలేనా?

Bollywood: కన్నడ చిత్ర పరిశ్రమ నుంచి వచ్చి పాన్ ఇండియా స్టార్‌గా ఎదిగిన హీరో యష్. 'కేజీఎఫ్' సినిమాలతో దేశవ్యాప్తంగా రాకింగ్ స్టార్ అంటూ తిరుగులేని గుర్తింపు తెచ్చుకున్న ఈ హీరో ఇప్పుడు 'రామాయణ'తో అంతర్జాతీయ స్థాయిలో తన అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నాడు. నితీష్ తివారీ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ భారీ చిత్రంలో యష్ రావణుడిగా నటించడం విశేషం. నటుడిగానే కాకుండా ఈ సినిమా నిర్మాణంలో కూడా భాగమయ్యాడు. అయితే, ఈ సినిమా యష్ కెరీర్‌కు ఎంతవరకు ప్లస్ అవుతుంది? భారీ లాభాలు తెచ్చిపెడుతుందా?

‘ప్రైవసీని దెబ్బతీయొద్దు..’ ప్రైవేట్ వీడియో లీక్‌పై సురేఖ వాణి స్పందన!సినిమాSwechaa07 Nov 2026, 01:24 PM

‘ప్రైవసీని దెబ్బతీయొద్దు..’ ప్రైవేట్ వీడియో లీక్‌పై సురేఖ వాణి స్పందన!

 టాలీవుడ్ ప్రముఖ క్యారెక్టర్ ఆర్టిస్ట్ సురేఖ వాణికి సంబంధించిన ఓ ప్రైవేట్ వీడియో నెట్టింట తెగ వైరల్ అవుతోంది. ఓ యువకుడితో సురేఖ వాణి అత్యంత సన్నిహితంగా ఉన్న ఆ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాను షేక్ చేస్తోంది. ఈ నేపథ్యంలో ఆ వీడియోపై సురేఖ వాణి స్పందించారు. తన సోషల్ మీడియా ఖాతా హ్యాకింగ్‌కు గురైందని తెలుపుతూ ఆందోళన వ్యక్తం చేసింది. తన ఇన్‌స్టాగ్రామ్ అకౌంట్‌ను గుర్తుతెలియని వ్యక్తులు హ్యాక్ చేసి, తనకు సంబంధించిన వ్యక్తిగత, ప్రైవేట్ వీడియోలను, కంటెంట్‌ను సోషల్ మీడియా వేదికల్లోకి లీక్ చేసి ప్రచారం చేస్తున్నారని వాపోయింది.

ఎన్నికల ఫలితాల వేళ తీవ్ర విషాదం.. ఓట్ల లెక్కింపునకు ముందే జనసేన అభ్యర్థి మృతి!క్రైమ్Swechaa07 Nov 2026, 01:06 PM

ఎన్నికల ఫలితాల వేళ తీవ్ర విషాదం.. ఓట్ల లెక్కింపునకు ముందే జనసేన అభ్యర్థి మృతి!

 ఏపీలోని తూర్పుగోదావరి జిల్లా దేవరపల్లి మండలంలో అత్యంత విషాదకర ఘటన చోటుచేసుకుంది. స్థానిక సంస్థల ఎన్నికల ఫలితాలు వెలువడే కొద్ది గంటల సమయాని కంటే ముందే జనసేన పార్టీ ఎంపీటీసీ అభ్యర్థి గారపాటి దివ్య(26) అనారోగ్యంతో హఠాన్మరణం చెందింది. ధుమంతునిగూడెం ఎంపీటీసీ స్థానం నుంచి జనసేన అభ్యర్థిగా బరిలోకి దిగిన ఆమె, పోలింగ్ ప్రక్రియ ముగిసిన అనంతరం తీవ్ర అనారోగ్యానికి గురయ్యారు. ఆరంభంలో తీవ్రమైన గ్యాస్ట్రిక్ సంబంధిత సమస్య తలెత్తడంతో కుటుంబ సభ్యులు ఆమెను తక్షణమే రాజమండ్రిలోని ప్రైవేటు ఆసుపత్రికి తరలించగా చికిత్స పొందుతూ మృతిచెందినట్లు కుటుంబసభ్యులు తెలిపారు. దీంతో దేవరపల్లిలో విషాదఛాయలు అలుముకున్నాయి.

Tollywood: మెగావర్స్‌లో "మనం" హీరోలు..సినిమాSwechaa07 Nov 2026, 12:59 PM

Tollywood: మెగావర్స్‌లో "మనం" హీరోలు..

Tollywood: ఇంతకాలం మన టాలీవుడ్ సినిమా ఇండస్ట్రీలో అక్కినేని నాగార్జున బిగ్ రియాలిటీ షో బిగ్ బాస్‌కి మూడవ సీజన్ నుంచి హోస్ట్‌గా వ్యవహరిస్తున్నారు. ప్రస్తుతం సీజన్ 10తో నాగ్ బిజీగా ఉన్నాడు. నందమూరి బాలకృష్ణ కూడా సినిమాలు చేస్తూనే ఆహా కోసం అన్‌స్టాపబుల్ షోకి హోస్ట్‌గా వ్యవహరిస్తున్నాడు. ఇప్పుడు మెగాస్టార్ దిగ్గజ ఓటీ కోసం 'మెగావర్స్' పేరుతో 15 ఎపిసోడ్స్‌కి హోస్ట్‌గా వ్యవహరిస్తున్నారు. ఇప్పటికే, కొన్ని ఎపిసోడ్స్ షూట్ కూడా పూర్తైనట్టు తెలుస్తోంది.

రెవెన్యూశాఖలో పందికొక్కులు.. భూభారతి మాటున ఎకరాలకు ఎకరాలే మాయం?తెలంగాణSwechaa07 Nov 2026, 12:58 PM

రెవెన్యూశాఖలో పందికొక్కులు.. భూభారతి మాటున ఎకరాలకు ఎకరాలే మాయం?

22ఏ ను అడ్డంపెట్టుకుని రాష్ట్రంలోని రెవెన్యూ అధికారులు అక్రమాలకు పాల్పడుతున్నారని పెద్దఎత్తున ఆరోపణలు వినిపిస్తున్నాయి. కొందరు అధికార పార్టీ నేతలతో చేతులు కలిపి రూ. లక్షల నుంచి కోట్లల్లో దోపిడీకి పాల్పడుతున్నారని ఆరోపణలు వస్తున్నాయి.తాజాగా ఉదాహరణ రెవెన్యూ అధికారుల భూ దాహాం, దోపిడీకి నిలువుటద్దంలా నిలుస్తోంది. వివరాల్లోకివెళితే.. రంగారెడ్డి జిల్లా మహేశ్వరం మండలం రావిర్యాల గ్రామంలోని సర్వే నంబర్ 8లో నిషేధిత జాబితాలో ఉన్న 11.33 ఎకరాలను నిషేధిత జాబితా నుంచి తొలగించి, ఒక్కొక్కరి పేరిట 2.31 ఎకరాలు రిజిస్ట్రేషన్ చేసిన రెవెన్యూ అధికారులు పాస్‌బుక్కులు కూడా జారీ చేసినట్టు సమాచారం. సర్వే నంబర్ 8/5లోని 2.31 ఎకరాలను ఒక్కో ఎకరా రూ.91 లక్షలకు కావాల్సిన వారి పేరిట రిజిస్ట్రేషన్ చేసి, వెంటనే భూమిని తిరిగి నిషేధిత జాబితాలోకి మార్చి, భూమి విలువను రూ.35.29 కోట్లకు పెంచినట్టు జోరుగా ప్రచారం జరుగుతోంది.

గచ్చిబౌలి స్టార్ హోటల్‌లో అమెరికా పౌరుడి అనుమానాస్పద మృతి!క్రైమ్Swechaa07 Nov 2026, 12:38 PM

గచ్చిబౌలి స్టార్ హోటల్‌లో అమెరికా పౌరుడి అనుమానాస్పద మృతి!

 హైదరాబాద్ మహానగరంలోని ఐటీ కారిడార్ ప్రాంతమైన గచ్చిబౌలిలో అత్యంత దిగ్భ్రాంతికి గురిచేసే ఘటన వెలుగుచూసింది. వ్యాపార పనుల నిమిత్తం నగరానికి వచ్చిన 41ఏళ్ల అమెరికా పౌరుడు తాను బస చేసిన స్టార్ హోటల్ గదిలోనే అనుమానాస్పద స్థితిలో విగతజీవిగా కనిపించడం స్థానికంగా తీవ్ర కలకలం రేపింది. గచ్చిబౌలి పరిధిలోని ఎస్ఎల్‌ఎన్ (SLN) టెర్మినస్‌లో ఉన్న మారియట్ ఎగ్జిక్యూటివ్ అపార్ట్‌మెంట్స్‌లో శనివారం ఈ విషాద పరిణామం చోటుచేసుకుంది.

ఉద్యోగులందరికీ ఊహించని సర్‌ప్రైజ్.. యూఏఈ సంస్థ సంచలనం!వైరల్ న్యూస్Swechaa07 Nov 2026, 12:37 PM

ఉద్యోగులందరికీ ఊహించని సర్‌ప్రైజ్.. యూఏఈ సంస్థ సంచలనం!

 ఉద్యోగుల కష్టాన్ని గుర్తించి వారిని ప్రోత్సహించడంలో కొన్ని సంస్థలు అంతర్జాతీయ స్థాయిలో ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకుంటున్నాయి. ఈ క్రమంలో యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ (UAE) వేదికగా పనిచేస్తున్న ప్రముఖ ‘వరల్డ్ స్టార్ హోల్డింగ్’ సంస్థ తన మహిళా ఉద్యోగులకు అత్యంత ఖరీదైన 'ఐఫోన్ డ్యూయో' (iPhone Duo) ఫోన్లను బహుమతిగా అందించి వార్తల్లో నిలిచింది. కేరళకు చెందిన ఆ సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ హసీనా నిషాద్ తమ సంస్థలోని మహిళా ఉద్యోగులకు ఊహించని సర్‌ప్రైజ్ ఇచ్చారు.