స్వేచ్ఛ షార్ట్స్ — తాజా తెలుగు వార్తలు

22A Scam: ‘పొంగులేటిని బర్తరఫ్ చేయాలి..’ రాహుల్ గాంధీకి హరీశ్ రావు లేఖ!తెలంగాణSwechaa20 Aug 2026, 11:21 AM

22A Scam: ‘పొంగులేటిని బర్తరఫ్ చేయాలి..’ రాహుల్ గాంధీకి హరీశ్ రావు లేఖ!

తెలంగాణ రెవెన్యూ శాఖలో నిషేధిత భూముల (22A) చట్టాన్ని అడ్డుపెట్టుకుని అధికార పార్టీ పెద్దలు, దళారులు బరితెగించి సాగిస్తున్న వేల కోట్ల రూపాయల దోపిడీ, 30శాతం కమీషన్ల దందాపై మాజీ మంత్రి హరీశ్ రావు కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీకి లేఖ రాస్తూ తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. ప్రజల ఆస్తులను కృత్రిమ వివాదాల్లోకి నెట్టి వేధింపులకు గురిచేస్తున్న రెవెన్యూ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డిని తక్షణమే కేబినెట్ నుంచి బర్తరఫ్ చేయాలని, అక్రమాలపై సిట్టింగ్ జడ్జితో ఫోరెన్సిక్ ఆడిట్ జరిపించాలని ఆయన డిమాండ్ చేశారు.

సీనియర్ నటి షావుకారు జానకికి తీవ్ర అస్వస్థత: ఐసీయూలో చికిత్స!సినిమాSwechaa20 Aug 2026, 10:54 AM

సీనియర్ నటి షావుకారు జానకికి తీవ్ర అస్వస్థత: ఐసీయూలో చికిత్స!

ప్రముఖ సీనియర్ నటి, దాదాసాహెబ్ ఫాల్కే పురస్కార గ్రహీత షావుకారు జానకి (95) తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. గత వారం రోజులుగా శ్వాసకోశ సంబంధిత ఇబ్బందులతో పాటు వయోభారంతో తలెత్తిన ఇతర ఆరోగ్య సమస్యల కారణంగా ఆమె చెన్నైలోని ఓ ప్రముఖ ప్రైవేటు ఆసుపత్రిలో చేరి చికిత్స పొందుతున్నారు. అయితే, బుధవారం రాత్రి ఆమె ఆరోగ్యం మరింత విషమించడంతో వైద్యులు వెంటనే ఆమెను ఇంటెన్సివ్ కేర్ యూనిట్ (ఐసీయూ)కు తరలించారు.

రూ.40.96 కోట్ల పీడీఎస్ రైస్ మాయం.. విజిలెన్స్ తనిఖీల్లో షాకింగ్ నిజాలుతెలంగాణSwechaa20 Aug 2026, 10:53 AM

రూ.40.96 కోట్ల పీడీఎస్ రైస్ మాయం.. విజిలెన్స్ తనిఖీల్లో షాకింగ్ నిజాలు

రాష్ట్రంలో మరోసారి భారీ స్కామ్ వెలుగుచూసింది. ఒకటి కాదు రెండు కాదు ఏకంగా రూ.40.96 కోట్ల ప్రభుత్వ ధాన్యం (పీడీఎస్ రైస్) పక్కదారి పట్టింది. మిల్లింగ్ కోసం అని ప్రభుత్వం రైస్ మిల్లర్‌కు అప్పగించగా..ప్రస్తుతం ఆ ధాన్యం కనిపించకుండా పోయినట్టు తేలింది.ఈ ఘటన నిర్మల్ జిల్లాలోని ఖానాపూర్ మండలం సత్తనపల్లిలోని ఏఆర్ఎస్ రైలు మిల్లులో గురువారం ఉదయం ఆలస్యంగా వెలుగుచూసింది. విషయం తెలుసుకున్న సర్కారు.. విజిలెన్స్ అండ్ ఎన్‌ఫోర్స్‌మెంట్ అధికారులకు విచారణ బాధ్యతలు అప్పగించినట్టు సమాచారం.దీంతో అధికారులు ఈ నెల 18న సదరు రైస్ మిల్లులో దాడులు నిర్వహించారు. అయితే, విజిలెన్స్ దర్యాప్తులో మరిన్ని అక్రమాలు వెలుగుచూసినట్టు తెలుస్తోంది. ప్రభుత్వం కేటాయించిన ధాన్యంలో 9,639.962 మెట్రిక్ టన్నుల కొరతను గుర్తించారు.

ఒక్కసారి ఫోన్ చేసి పలకరిస్తే చాలు.. బ్రహ్మానందం సోదరుడి కన్నీటి ఆవేదన!వైరల్ న్యూస్Swechaa20 Aug 2026, 10:42 AM

ఒక్కసారి ఫోన్ చేసి పలకరిస్తే చాలు.. బ్రహ్మానందం సోదరుడి కన్నీటి ఆవేదన!

కోట్లాది మంది తెలుగు ప్రేక్షకులను తన అద్భుతమైన నటన, హాస్యంతో కడుపుబ్బా నవ్వించే ప్రముఖ హాస్యనటుడు బ్రహ్మానందం స్వంత సోదరుడు శ్రీవదన్ చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం సర్వత్రా చర్చనీయాంశంగా మారాయి. తన తోబుట్టువు నుంచి ఓ చిన్న పలకరింపు కోసం ఏళ్ల తరబడి ఎదురుచూస్తున్నానంటూ ఆయన తీవ్ర భావోద్వేగానికి గురయ్యారు. తమ కుటుంబంలో మొత్తం ఆరుగురు సంతానం కాగా, వారిలో నలుగురు ఇప్పటికే కన్నుమూశారని, ప్రస్తుతం తామిద్దరమే మిగిలామని గుర్తుచేసుకుంటూ స్వగ్రామంలో తాను ఒంటరిగా గడుపుతున్నానని ఆవేదన వ్యక్తం చేశారు.

సిద్దిపేటలో తీవ్ర విషాదం..ఒకే  కుటుంబంలో నలుగురి దుర్మరణంక్రైమ్Swechaa20 Aug 2026, 10:29 AM

సిద్దిపేటలో తీవ్ర విషాదం..ఒకే కుటుంబంలో నలుగురి దుర్మరణం

రాష్ట్రంలో తీవ్ర విషాదం నెలకొన్నది.ఎవరూ ఊహించని విధంగా ప్రమాదవశాత్తు ఒకే కుటుంబంలో నలుగురు మృతి చెందారు. సిద్ధిపేట జిల్లాలో ఈ విషాదం చోటుచేసుకోగా.. ఒక్కసారిగా జిల్లా ప్రజలు షాక్‌కు గురైనట్టు తెలుస్తోంది.కుటుంబం ప్రయాణిస్తున్న కారు ప్రమాదవశాత్తు బావిలోకి దూసుకెళ్లినట్టు సమాచారం. ఈ ప్రమాదంలో అందులోని వారంతా మరణించినట్టు తెలిసింది. వివరాల్లోకివెళితే.. సిద్ధిపేట దుబ్బాక మండలం బల్వంతాపూర్ గ్రామానికి చెందిన దండుగుల రాజు (30), అతని భార్య భాగ్య (25), కొడుకు నిహాన్ష్ (4), కూతురు శాన్విక (2)తో కలిసి కారులో సిద్దిపేట నుంచి ఇంటికి వెళ్తున్నారు.అయితే, మార్గంమధ్యలో అప్పనపల్లి శివారులో ప్రమాదవశాత్తు కారు వ్యవసాయ బావిలోకి దూసుకెళ్లినట్టు సమాచారం.ఈ ప్రమాదంలో కుటుంబంలోని వారంతా మృతి చెందినట్టు తెలిసింది.

విజయ్‌తో రష్మిక ఫన్నీ కామెంట్స్!సినిమాSwechaa20 Aug 2026, 10:27 AM

విజయ్‌తో రష్మిక ఫన్నీ కామెంట్స్!

టాలీవుడ్ స్టార్ జంట విజయ్ దేవరకొండ, రష్మిక మందన్నల మధ్య సోషల్ మీడియా వేదికగా జరిగిన సరదా ముచ్చట్లు అభిమానులను విశేషంగా ఆకట్టుకుంటున్నాయి. ఇటీవల కురిసిన వర్షాల కారణంగా సినిమా షూటింగ్ తాత్కాలికంగా రద్దు కావడంతో విజయ్ తన నివాసంలో తల్లిదండ్రులతో కలిసి సేదతీరారు. తన తల్లిదండ్రులైన గోవర్ధన్ రావు, మాధవిల మధ్య పడుకుని విశ్రాంతి తీసుకుంటున్న ఓ ఆత్మీయమైన ఫొటోను అభిమానులతో పంచుకుంటూ, చిన్ననాటి తన ఫేవరెట్ ప్రదేశంలో మధ్యాహ్నం నిద్ర దొరికిందంటూ మురిసిపోయారు.

వృద్ధురాలికి గుండెపోటు  తెప్పించిన ఎయిర్ లైన్స్ స్టాఫ్!తెలంగాణSwechaa20 Aug 2026, 10:05 AM

వృద్ధురాలికి గుండెపోటు తెప్పించిన ఎయిర్ లైన్స్ స్టాఫ్!

ఎయిర్ లైన్స్ సిబ్బంది నిర్లక్ష్యంగా వ్యవహరించడంతో ఓ ఓల్డ్ ఏజ్ మహిళా ప్యాసింజర్ గుండెపోటుకు గురైంది. ప్రస్తుతం ఆమె పరిస్థితి విషమంగా ఉన్నట్టు తెలుస్తోంది. దీంతో కుటుంబ సభ్యులు ఎయిర్ లైన్స్ సిబ్బంది మీద కేసు ఫైల్ చేసినట్టు సమాచారం. మహిళా ప్యాసింజర్ పేషెంట్ అని చెప్పినా సిబ్బంది వినిపించుకోకుండా ఆమె వీల్ చైర్ లాక్కున్నారని కుటుంబ సభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేసినట్టు తెలిసింది.ఈ ఘటన హైదరాబాద్‌లోని రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్ పోర్టులో వెలుగుచూసింది.

NRI News: న్యూయార్క్ అటార్నీ జనరల్ రేసులో తెలంగాణ తేజం..!!InternationalSwechaa20 Aug 2026, 09:47 AM

NRI News: న్యూయార్క్ అటార్నీ జనరల్ రేసులో తెలంగాణ తేజం..!!

అమెరికా రాజకీయాల్లో భారతీయ సంతతి వ్యక్తులు, ముఖ్యంగా తెలుగు వారి ప్రాబల్యం రోజురోజుకూ విస్తరిస్తోంది. తాజాగా తెలంగాణ మూలాలున్న న్యాయ నిపుణురాలు సరిత కోమటిరెడ్డి న్యూయార్క్ అటార్నీ జనరల్(ఏజీ) పదవికి పోటీపడుతుండడం అంతర్జాతీయంగా ఆసక్తి రేకెత్తిస్తోంది. గతంలో ఫెడరల్ ప్రాసిక్యూటర్‌గా సేవలందించిన ఆమె, ఇప్పుడు కీలక రాజ్యాంగ పదవి రేసులో నిలవడం ప్రవాస భారతీయుల్లో గర్వకారణంగా మారింది. ఈ ఎన్నికల పోటీలో సరిత అభ్యర్థిత్వానికి అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ పూర్తి మద్దతు ప్రకటించడం ప్రాధాన్యత సంతరించుకుంది.

అస్ట్రేలియాలో భారత విద్యార్థినికి షాక్!వైరల్ న్యూస్Swechaa20 Aug 2026, 09:35 AM

అస్ట్రేలియాలో భారత విద్యార్థినికి షాక్!

ఉన్నత చదువుల కోసం ఆస్ట్రేలియా వెళ్లిన ఓ భారతీయ విద్యార్థినికి ఊహించని చేదు అనుభవం ఎదురైంది. కేవలం కొద్ది నిమిషాల పాటు వేడినీటితో స్నానం చేసినందుకు స్థానిక అగ్నిమాపక నిబంధనల ప్రకారం ఏకంగా 1,900 ఆస్ట్రేలియన్ డాలర్లు (భారత కరెన్సీలో సుమారు రూ.1.3లక్షలు) జరిమానా రూపంలో చెల్లించాల్సి వచ్చింది. తనతో పాటు విదేశాల్లో ఉండే విద్యార్థులను అప్రమత్తం చేసేందుకు ఆమె స్వయంగా ఈ వింత అనుభవాన్ని సోషల్ మీడియా వేదికగా పంచుకోవడంతో ఈ వార్త నెట్టింట తీవ్ర చర్చనీయాంశమైంది. సిడ్నీ నగరంలోని ఓ అపార్ట్‌మెంట్‌లో నివాసముంటున్న వమిక అనే భారతీయ విద్యార్థిని ఇటీవల తన గదిలో వేడినీటితో స్నానం చేసింది.

పని ఏదైనా.. మేఘా లూటీ  ఆగలేదు?స్వేచ్ఛ ఛైర్మన్ డెస్క్Swechaa20 Aug 2026, 09:20 AM

పని ఏదైనా.. మేఘా లూటీ ఆగలేదు?

మేఘా.. బాలానగర్‌లో 20 ఏండ్ల క్రితం చిన్న ఏరియాలో పేరు మాత్రమే గొప్పగా పెట్టుకున్న కంపెనీ. చిన్నప్పుడు నెల్లూరు నీళ్లు తాగిన అలవాటుతో పెద్ద పెద్ద కాంట్రాక్టర్స్ వదిలివేసిన మెటీరియల్‌ను తక్కువకు తెచ్చుకొని వెల్డింగ్ చేసుకుంటూ కమీషన్లతో భారీగా బతికేశారు. అందుకు సాక్ష్యాలను ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి ఎప్పటికీ చెబుతుంటారు. ప్రభుత్వ కాంట్రాక్టుల పని ఎలా చేజిక్కించుకోవాలి, ఆ తర్వాత ఏమైనా చేయ్యొచ్చు అనే భావనలో ఉంటారు. అధికారులు, ప్రభుత్వ పెద్దలు వారు అనుకున్న దాని కంటే ఒక్క శాతం ఎక్కువ డబ్బులు ఇస్తే ఏదైనా చేస్తారనే భావనతో పని చేశారు.

స్వేచ్ఛ న్యూస్ ఎఫెక్ట్.. ఆ మంత్రి పీఆర్వో ఔట్? డబుల్ జీతం తీసుకున్నట్లు గుర్తింపు?..స్వేచ్ఛ ఛైర్మన్ డెస్క్Swechaa20 Aug 2026, 08:44 AM

స్వేచ్ఛ న్యూస్ ఎఫెక్ట్.. ఆ మంత్రి పీఆర్వో ఔట్? డబుల్ జీతం తీసుకున్నట్లు గుర్తింపు?..

ఏ ప్రభుత్వంలోనైనా కష్టపడి పని చేస్తేనే మంచి గుర్తింపు ఉంటుంది. కులాలు, మతాలు అంటూ ఎన్ని రోజులు నెట్టుకురాలేమని మరోసారి రుజువైంది. దక్షణ తెలంగాణలో ఓ మంత్రి వద్ద పని చేస్తున్న పీఆర్వో వ్యవహారంపై స్వేచ్ఛ ఛైర్మన్ దేవేందర్ రెడ్డి చింతకుంట్ల ఇన్వెస్టిగేషన్ కథనాన్ని ఇచ్చారు. ప్రత్యేక క్యాబిన్‌తో ఎవరికీ లేని విధంగా సకల సౌకర్యాలు కల్పించడంపై నిలదీశారు.

సదరు పీఆర్వో తాను చేస్తున్న ఉద్యోగానికి కనీస న్యాయం కూడా చేయలేదు. పైగా మంత్రి భార్య పేరు చెప్పుకొని మేడమ్‌తో అన్ని పనులు చేయిస్తానని పైరవీలు చేయడం గుర్తించారు. ప్రభుత్వ ఉన్నత ఉద్యోగులను సైతం ఏకవచనంతో మాట్లాడటం, తోటి ఉద్యోగులను వేధించటం బహిరంగంగానే జరిగాయి. మహిళా ఉద్యోగుల ముందు వాటర్ బాటిల్స్ కాళ్ల మధ్యలో పెట్టుకుని ఆటలాడుతూ మాట్లాడేతత్వంతో చాలామంది ఉద్యోగులు చీదరించుకున్నారు.

విషాదంగా మారిన ప్రయాణం..  కొండ ప్రాంతంలో కూలిన హెలికాప్టర్ ఏడుగురు దుర్మరణం!..InternationalSwechaa20 Aug 2026, 08:13 AM

విషాదంగా మారిన ప్రయాణం.. కొండ ప్రాంతంలో కూలిన హెలికాప్టర్ ఏడుగురు దుర్మరణం!..

సఫారీ టూర్ కోసం బయలుదేరిన హెలికాప్టర్.. కొండల మధ్య కుప్పకూలడంతో ఏడుగురి ప్రాణాలు గాల్లో కలిసిపోయాయి. కెన్యాలోని సాంబూరు కౌంటీలో మౌంట్ ఒలోలోక్వే సమీపంలో ఈ ఘోర ప్రమాదం జరిగింది. లోయిసాబా కన్సర్వెన్సీ నుంచి ఈవాసో న్యిరో ప్రాంతానికి వెళ్తున్న హెలికాప్టర్‌లో పైలట్‌తో పాటు ఆరుగురు పర్యాటకులు ఉన్నారు. ప్రమాదంలో అందరూ మృతి చెందారు. మృతుల్లో ఐదుగురు అమెరికా పౌరులు, ఈక్వెడార్ జాతీయ నిఘా విభాగం అధిపతి మిచెల్ సెన్సీ-కంట్యూగీ కూడా ఉన్నారు. ప్రమాదానికి కారణం ఇంకా తెలియరాలేదు. కెన్యా అధికారులు దర్యాప్తు ప్రారంభించారు.

SBI కస్టమర్లకు బిగ్ అలర్ట్.. అక్టోబర్ 1 నుంచి కొత్త ఛార్జీలు!NationalSwechaa20 Aug 2026, 07:52 AM

SBI కస్టమర్లకు బిగ్ అలర్ట్.. అక్టోబర్ 1 నుంచి కొత్త ఛార్జీలు!

స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వినియోగదారులకు మరో షాక్ ఇవ్వడానికి సిద్దపడింది. SBI బేసిక్ సేవింగ్స్ బ్యాంక్ డిపాజిట్ ఖాతాలకు సంబంధించిన రూల్స్ లో కీలక మార్పులు చేసినట్టు వార్తలు వస్తున్నాయి.. ఈ నేపథ్యంలో అక్టోబర్ ఒకటో తేదీ నుంచిబ్యాంకు కస్టమర్లు నెలలో నాలుగు సార్లు మాత్రమే ఫ్రీగా క్యాష్ విత్ డ్రా చేసుకోవాలని తెలిపింది. ఆ పరిమితి దాటితే ఒక్కో ట్రాన్సాక్షన్ పై రూ. 15 ఛార్జ్ తో పాటు జీఎస్టీ కూడా వసూలు చేయనున్నట్టు ప్రచారం జరుగుతుంది.

కాగా ఇందులో బ్రాంచ్, ఏటీఎం, విత్ డ్రాస్ తో పాటు ఏఈపీఎస్ ట్రాన్సాక్షన్ కూడా కౌంట్ అవుతాయని అంటున్నారు. అయితే ఇదివరకు నాలుగు ఉచిత లావాదేవీలు చేసిన తర్వాత రూ.15 ఛార్జ్ విధించేవారు. కానీ డిజిటల్ ట్రాన్సాక్షన్ దీని పరిధిలో లేదు. ఇప్పుడు ఆ మినహాయింపు కూడా లేదని అధికారులు అంటున్నారు.

ఇంద్రియాలలో పరమాత్మ స్వరూపం ఎలా ఉంటుంది!..SpiritualitySwechaa20 Aug 2026, 07:26 AM

ఇంద్రియాలలో పరమాత్మ స్వరూపం ఎలా ఉంటుంది!..

మానవ దేహం పంచభూతాలతో నిర్మితమైన ఒక దివ్య దేవాలయం. మన కన్ను, ముక్కు, చెవి, నాలుక, చర్మం అనే పంచేంద్రియాలు కేవలం భౌతిక ప్రపంచాన్ని అనుభవించే సాధనాలు మాత్రమే కావు. వాటి వెనుక చైతన్యరూపంలో ప్రకాశించేది ఆ పరమాత్మే!.. కృష్ణ యజుర్వేదానికి చెందిన కఠోపనిషత్తులో నచికేతుడు, యమధర్మరాజుల సంభాషణ ద్వారా ఈ సత్యం వెల్లడవుతుంది. భగవంతుడు ఇంద్రియాలను బయటి ప్రపంచాన్ని చూడటానికే సృష్టించినప్పటికీ, జ్ఞాని అయినవాడు ఆ ఇంద్రియాల వెనుక ఉన్న అంతర్యామిని దర్శిస్తాడు. ఆత్మజ్ఞానమే మోక్షానికి మార్గం అని ఈ ఉపనిషత్తు ప్రభోధిస్తుంది.

పంచభూతాల్లో దాగి ఉన్న ఆధ్యాత్మిక రహస్యం గురించి తెలుసా?..SpiritualitySwechaa20 Aug 2026, 07:16 AM

పంచభూతాల్లో దాగి ఉన్న ఆధ్యాత్మిక రహస్యం గురించి తెలుసా?..

బాహ్య ప్రపంచంలో కొండలుగా, నదులుగా, అగ్నిగా, గాలిగా, శూన్యంగా కనిపించే ఈ పంచభూతాలు బయట ఎక్కడో లేవు.. మన దేహంలోనే నిక్షిప్తమై ఉన్నాయి. "యథా పిండే తథా బ్రహ్మాండే" అంటే ఈ విశ్వంలో ఏముందో, మన శరీరంలోనూ అదే ఉంది. ఈ సత్య గ్రహింపే పంచభూతాల వెనుక ఉన్న ఆధ్యాత్మిక రహస్యం అని శాస్త్రాలు చెబుతున్నాయి. ఉపనిషత్తుల ప్రకారం ఈ ఐదు భూతాలు కేవలం భౌతిక పదార్థాలు కావు, ఆధ్యాత్మిక ప్రయాణంలో మనల్ని ఊర్ధ్వ లోకాలకు తీసుకెళ్లే సోపానాలు..

800 నగరాల్లో ‘స్టూడెంట్స్ గర్జన’.. మోదీ సర్కార్‌పై కాంగ్రెస్ పోరుబాట‌!NationalSwechaa20 Aug 2026, 12:04 AM

800 నగరాల్లో ‘స్టూడెంట్స్ గర్జన’.. మోదీ సర్కార్‌పై కాంగ్రెస్ పోరుబాట‌!

కాంగ్రెస్ ఒకే అంశంపై కాకుండా మల్టీ-ఫ్రంట్ పొలిటికల్ క్యాంపెయిన్ ప్రారంభించేందుకు సిద్ధమవుతున్నట్లు కనిపిస్తోంది. అంటే కేంద్ర ప్రభుత్వాన్ని ఒకే సమస్యపై కాకుండా.. యువత నుంచి విదేశాంగం వరకు, ఆర్థిక వ్యవహారాల నుంచి ఎన్నికల వ్యవస్థ వరకు వివిధ అంశాల్లో ప్రశ్నించే ప్రయత్నం చేస్తోంది.

జూరాల డ్యామ్‌పై రోడ్డు ప్రమాదం.. ముగ్గురికి తీవ్ర గాయాలుతెలంగాణSwechaa19 Aug 2026, 10:35 PM

జూరాల డ్యామ్‌పై రోడ్డు ప్రమాదం.. ముగ్గురికి తీవ్ర గాయాలు

Jurala Dam Road Accident: ప్రియదర్శిని జూరాల ప్రాజెక్టు బ్రిడ్జిపై బుధవారం రాత్రి రోడ్డు ప్రమాదం సంభవించింది. ప్రాజెక్టుకు సమీపంలోని నందిమల్ల నుంచి డ్యాం మీదుగా ద్విచక్ర వాహనంపై ముగ్గురు యువకులు గద్వాలకు ప్రయాణిస్తున్నారు. జూరాల డ్యామ్ పై ఉన్న భారీ స్పీడ్ బ్రేకర్ ను గమనించకపోవడంతో ద్విచక్ర వాహనం అదుపుతప్పి కింద పడింది. ఈ ఘటనలో ముగ్గురు యువకులకు తీవ్ర గాయాలయ్యాయి. గాయపడిన వారిని షాద్ నగర్ వాసులుగా గుర్తించారు. గమనించిన స్థానికులు 108 కు ఫోన్ చేశారు. 108 సిబ్బంది బాధితులకు ప్రాథమిక చికిత్స అందించిన అనంతరం మెరుగైన చికిత్స నిమిత్తం గద్వాల జిల్లా ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.

Krishna Basin: కృష్ణా బేసిన్‌లో పెరుగుతున్న వరద ప్రవాహం..తెలంగాణSwechaa19 Aug 2026, 10:22 PM

Krishna Basin: కృష్ణా బేసిన్‌లో పెరుగుతున్న వరద ప్రవాహం..

Krishna Basin: కృష్ణా నది పరివాహక ప్రాంతంలో కొద్ది రోజులుగా నిలిచిన ప్రవాహం ప్రస్తుతం ఆశాజనకంగా మారింది. సిడబ్ల్యూసి అంచనాల మేరకు హిప్పర్గికి 62వేల క్యూసెక్కులు, ఆల్మట్టికి 60వేల క్యూసెక్కులు, నారాయణపూర్ కు 58వేల క్యూసెక్కుల నీరు వస్తోంది. ఎగువ ప్రాజెక్టులో పూర్తి స్థాయికి నీరు చేరడంతో నిల్వ సామర్థ్యం దాదాపు నిండింది.

యూట్యూబ్‌లో చూసి చోరీ, హత్య చేసిన టెన్త్ విద్యార్థులు..క్రైమ్Swechaa19 Aug 2026, 09:01 PM

యూట్యూబ్‌లో చూసి చోరీ, హత్య చేసిన టెన్త్ విద్యార్థులు..

చోరీ ఎలా చేయాలో, అడ్డొస్తే ఎలా హత్య చేయాలో యూట్యూబ్ లో సెర్చ్ చేశారు. పధకం అమలు చేశారు. ముందుగా కొండమల్లేపల్లిలో కత్తి, గ్లౌజులు, మాస్కులు కొనుగోలు చేశారు. ఇద్దరు విద్యార్థులు రూపారెడ్డి ఇంట్లో చోరీకి వెళ్లారు. ఆగస్టు 11వ తేదీన సాయంత్రం 5 గంటల సమయంలో గోడ దూకి కిచెన్ నుంచి ఇంట్లోకి ప్రవేశించాడు ఓ విద్యార్థి. మరో విద్యార్ది బయట కాపలా ఉన్నాడు. ప్రతిఘటించిన రూపారెడ్డిపై ఒకడు కత్తితో ఎటాక్ చేశాడు. కడుపులో 27 పోట్లు పొడిచాడు.

ప్రిన్సిపాల్ రూపారెడ్డిని చంపింది టెన్త్ విద్యార్థులే.. హత్యకు కారణం ఇదేక్రైమ్Swechaa19 Aug 2026, 08:38 PM

ప్రిన్సిపాల్ రూపారెడ్డిని చంపింది టెన్త్ విద్యార్థులే.. హత్యకు కారణం ఇదే

రాష్ట్రవ్యాప్తంగా సంచలనం రేపిన ప్రిన్సిపాల్ రూపారెడ్డి హత్య కేసులో మిస్టరీ వీడింది. ఈ కేసు విచారణలో విస్తుగొలిపే వాస్తవాలు వెలుగులోకి వచ్చాయి. ప్రిన్సిపాల్ ని చంపింది అదే స్కూల్ కు చెందిన టెన్త్ విద్యార్థులే అని పోలీసులు నిర్ధారించారు.. డబ్బు కోసమే వారు ఈ ఘాతుకానికి పాల్పడినట్లు వెల్లడించారు. ఈ కేసు వివరాలను నల్గొండ జిల్లా ఎస్పీ శరత్ చంద్ర పవార్ వెల్లడించారు.

ప్రజాధనాన్ని వృథా చేస్తే ఎలా? ఉచిత పథకాలపై హైకోర్టు కీలక వ్యాఖ్యలుతెలంగాణSwechaa19 Aug 2026, 07:08 PM

ప్రజాధనాన్ని వృథా చేస్తే ఎలా? ఉచిత పథకాలపై హైకోర్టు కీలక వ్యాఖ్యలు

Telangana High Court: తెలంగాణ రాష్ట్రంలో ప్రభుత్వం అమలు చేస్తున్న ఉచిత పథకాలపై హైకోర్టు మరోసారి కీలక వ్యాఖ్యలు చేసింది. ఉచిత పథకాలకు ప్రజా ధనం వృథా చేస్తే ఎలా అని ప్రభుత్వాన్ని ప్రశ్నించింది న్యాయస్థానం. అసలు చట్టబద్ధత లేని స్కీమ్ లకు ప్రజాధనాన్ని ఎలా ఖర్చు చేస్తారని రేవంత్ సర్కార్ ను కోర్టు అడిగింది. అంతేకాదు ప్రభుత్వ రంగ సంస్థలను లాభాల్లోకి తెచ్చి ఆ డబ్బును ఉచిత పథకాలకు ఖర్చు చేయొచ్చు కదా అని న్యాయస్థానం అభిప్రాయపడింది.

సారూ ఇదేనా "సర్"? ఒకే ఇంటి చిరునామాతో 44 ఓట్లు..తెలంగాణSwechaa19 Aug 2026, 05:55 PM

సారూ ఇదేనా "సర్"? ఒకే ఇంటి చిరునామాతో 44 ఓట్లు..

తెలంగాణలో ఇటీవల చేపట్టిన ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ (సర్) ప్రక్రియలో లోపాలు బయటపడుతున్నాయి. ఎస్ఐఆర్ చేపట్టక ముందు, చేపట్టిన తర్వాత ఓట్లలో వ్యత్యాసాలు కనిపిస్తున్నాయి. ఒకే ఇంటి చిరునామాతో ఎస్ఐఆర్ కు ముందు 19 ఓట్లు.. ఎస్ఐఆర్ ప్రక్రియ తర్వాత ఓట్ల సంఖ్య 44కి పెరగడం ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. హైదరాబాద్ ఖైరతాబాద్ నియోజకవర్గం బంజారాహిల్స్ రోడ్ నెంబర్ 12 ఎమ్మెల్యే కాలనీలో ఈ ఘటన జరిగింది. అక్కడ G ప్లస్ 2 ఆఫీస్ బిల్డింగ్ చిరునామాతో 44 ఓట్లు తేలాయి. దీంతో రాజకీయ పార్టీల కార్యకర్తలు అవాక్కవుతున్నారు.

Group-1: కార్మికులు, డ్రైవర్లు, ప్లంబర్లతో గ్రూప్ 1 పేపర్లు దిద్దించారుఏపీSwechaa19 Aug 2026, 05:21 PM

Group-1: కార్మికులు, డ్రైవర్లు, ప్లంబర్లతో గ్రూప్ 1 పేపర్లు దిద్దించారు

వైసీపీ హయాంలో గ్రూప్-1 నిర్వహణ అతి పెద్ద స్కామ్ అని సీఎం చంద్రబాబు అన్నారు. వైసీపీ ప్రభుత్వంలో గ్రూప్-1 పేపర్లు దిద్దడంలో ప్రతి దశలో నిబంధనలు ఉల్లంఘించారని చెప్పారు. గ్రూప్-1 పేపర్లను పూర్తిగా అనర్హులతో దిద్దించారని ఆరోపించారు. నివేదికలు చూస్తే భయంకర పరిస్థితులు కనిపిస్తున్నాయన్నారు. భవన నిర్మాణ కార్మికులు, డ్రైవర్లు, ప్లంబర్లతో గ్రూప్-1 పేపర్లు దిద్దించారని సీఎం చంద్రబాబు సంచలన ఆరోపణలు చేశారు. ఇలాంటి పనులు చేస్తే ప్రతిభావంతులైన పిల్లలు నష్టపోతారని ఆవేదన వ్యక్తం చేశారు. అసెంబ్లీలో గ్రూప్-1 అక్రమాలపై చర్చలో సీఎం చంద్రబాబు మాట్లాడారు.

Telangana: 22 ఏ వివాదం పై హరీష్ రావు సంచలన వ్యాఖ్యలు!..తెలంగాణSwechaa19 Aug 2026, 05:11 PM

Telangana: 22 ఏ వివాదం పై హరీష్ రావు సంచలన వ్యాఖ్యలు!..

తెలంగాణలో 22ఏ భూముల వివాదం రాజకీయ దుమారం రేపుతోంది. నిషేధిత జాబితాలో తమ భూములు చేరడంతో రిజిస్ట్రేషన్లు ఆగిపోయి నష్టపోతున్నామని బాధితులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈ అంశంపై మంత్రి పొంగులేటి ఇప్పటికే స్పందించి, ప్రజలకు ఎదురైన ఇబ్బందులకు క్షమాపణలు చెప్పారు. అయితే తాజాగా మాజీ మంత్రి హరీశ్‌రావు తీవ్ర ఆరోపణలు చేశారు. పది రోజులకే మంత్రి మాట మార్చారని విమర్శించారు. నాలుగు నెలల క్రితమే కోమటిరెడ్డి సీఎంకు చెప్పారన్న అంశాన్ని ప్రస్తావిస్తూ.. సీఎంకు తెలియకపోతే పొంగులేటిని భర్తరఫ్ చేయాలని డిమాండ్ చేశారు.

జీతాలు అడిగితే లంచాలు తీసుకోమంటారా? రేవంత్ ప్రభుత్వాన్ని నిలదీసిన హరీశ్ రావుతెలంగాణSwechaa19 Aug 2026, 04:24 PM

జీతాలు అడిగితే లంచాలు తీసుకోమంటారా? రేవంత్ ప్రభుత్వాన్ని నిలదీసిన హరీశ్ రావు

తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక 70వేల కొలువులు ఇచ్చామంటూ చేస్తున్న ప్రచారంలో అసలు నిజం లేదని బీఆర్ఎస్ ఎమ్మెల్యే, మాజీ మంత్రి హరీశ్‌రావు తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి చెప్తున్న ఆ ఉద్యోగాల జాబితాలోనే 6వేల మంది లైసెన్స్‌డ్ సర్వేయర్ పోస్టులు కూడా భాగమేనని గుర్తుచేసిన ఆయన, కనీసం ఒక్క రూపాయి కూడా వేతనం అందించకుండా వాటిని ఉద్యోగాలని ఏ ముఖం పెట్టుకుని చెప్పుకుంటారని నిలదీశారు. సరైన ఆదరణ లేక, ఆర్థిక భారం పెరిగిపోవడంతో ఇప్పటికే ఇద్దరు యువ సర్వేయర్లు తీవ్ర మనస్తాపానికి గురై బలవన్మరణానికి పాల్పడ్డారని హరీశ్‌రావు ఆవేదన వ్యక్తం చేశారు.

Mobile Blast: బాబోయ్.. బాంబులా పేలిన ఫోన్.. వ్యక్తికి తీవ్రగాయాలుNationalSwechaa19 Aug 2026, 04:17 PM

Mobile Blast: బాబోయ్.. బాంబులా పేలిన ఫోన్.. వ్యక్తికి తీవ్రగాయాలు

ఫోన్లు కొన్ని సందర్భాల్లో ప్రాణాంతకంగా మారుతున్నాయి. సడెన్ గా బాంబుల్లా పేలిపోతున్నాయి. తాజాగా అటువంటి ఘటన ఒకట ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో చోటు చేసుకుంది. అలీగఢ్ లో ఘోరం జరిగింది. ఓ వ్యక్తి చేతిలో ఫోన్ ఒక్కసారిగా పేలిపోయింది. ఈ ఘటనలో ఆ వ్యక్తికి తీవ్ర గాయాలయ్యాయి.

బాధితుడి పేరు సచిన్. ప్లిప్ కార్ట్ డెలివరీ బాయ్ గా పని చేస్తున్నాడు. అతడికి కాల్ వచ్చింది. దాంతో జేబులో నుంచి ఫోన్ బయటకు తీస్తుండగా అది ఒక్కసారిగా బ్లాస్ట్ అయ్యింది. ఈ ఘటనలో అతడి ముఖం, చేతికి తీవ్ర గాయాలయ్యాయి. పేలిన ఫోన్ మోటరోలా కంపెనీకి చెందినదిగా బాధితుడి కుటుంబసభ్యులు తెలిపారు. అయితే, ఆ ఫోన్ అలా పేలిపోవడానికి కారణాలు తెలియాల్సి ఉంది.

ప్రభుత్వ స్కూల్‌లో కలకలం.. 36 మంది విద్యార్థులకు అస్వస్థత!..NationalSwechaa19 Aug 2026, 04:00 PM

ప్రభుత్వ స్కూల్‌లో కలకలం.. 36 మంది విద్యార్థులకు అస్వస్థత!..

బిహార్‌లోని నలంద జిల్లాలో మిడ్ డే మీల్ ఘటన కలకలం రేపింది. పరసి ప్రభుత్వ మిడిల్ స్కూల్‌లో ఉప్పుకు బదులుగా పొరపాటున డిటర్జెంట్ పౌడర్‌ను ఆహారంలో కలిపారు. ఈ భోజనం తిన్న 36 మంది విద్యార్థులు తల తిరగడం, వాంతులతో అస్వస్థతకు గురయ్యారు. వెంటనే వారిని నలంద సదర్ ఆసుపత్రికి తరలించి చికిత్స అందించారు. ప్రస్తుతం విద్యార్థులంతా ప్రమాదం నుంచి బయటపడ్డారని వైద్యులు తెలిపారు. ఘటనపై బిహార్ గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి శ్రవణ్ కుమార్ ఆరా తీశారు. మిడ్ డే మీల్ తయారీ నుంచి వడ్డించే వరకు జరిగిన పరిణామాలపై సమగ్ర విచారణకు అధికారులు ఆదేశించారు.

India vs Sri Lanka: గాలే టెస్టులో భారత్ చారిత్రక విజయం.. ‘స్పిన్’తో లంక చిత్తు!క్రీడలుSwechaa19 Aug 2026, 03:32 PM

India vs Sri Lanka: గాలే టెస్టులో భారత్ చారిత్రక విజయం.. ‘స్పిన్’తో లంక చిత్తు!

శ్రీలంక పర్యటనలో ఉన్న భారత జట్టు గాలే వేదికగా జరిగిన తొలి టెస్టు మ్యాచ్‌లో 165పరుగుల భారీ వ్యత్యాసంతో ఘన విజయం సాధించింది. యువ స్పిన్నర్ మానవ్ సుతార్ తన లెఫ్ట్ ఆర్మ్ స్పిన్ మాయాజాలంతో ప్రత్యర్థి బ్యాటర్లకు కంటిమీద కునుకు లేకుండా చేశాడు. రెండో ఇన్నింగ్స్‌లో కేవలం 55పరుగులిచ్చి 6 వికెట్లు పడగొట్టిన సుతార్, లంక పతనాన్ని శాసించాడు. ఈ విజయంతో రెండు మ్యాచ్‌ల టెస్టు సిరీస్‌లో భారత్ 1-0 ఆధిక్యంలోకి దూసుకెళ్లడమే కాకుండా, ప్రపంచ టెస్టు ఛాంపియన్‌షిప్ (డబ్ల్యూటీసీ) పాయింట్ల పట్టికలో కీలకమైన 12 పాయింట్లను తన ఖాతాలో వేసుకుంది. తమ 600వ చారిత్రక టెస్టులో ఈ రకమైన విజయం సాధించడం గమనార్హం.

సెలబ్రిటీల చుట్టూ ఈడీ ఉచ్చు.. జాబితాలో ప్రముఖులు!..తెలంగాణSwechaa19 Aug 2026, 02:41 PM

సెలబ్రిటీల చుట్టూ ఈడీ ఉచ్చు.. జాబితాలో ప్రముఖులు!..

హైదరాబాద్‌లో ఆన్‌లైన్ బెట్టింగ్ యాప్స్ వ్యవహారం మరోసారి హాట్ టాపిక్‌గా మారింది. అక్రమ ఆన్‌లైన్ బెట్టింగ్, గేమింగ్ యాప్స్ ప్రమోషన్లకు సంబంధించిన మనీలాండరింగ్ దర్యాప్తులో భాగంగా టాలీవుడ్ నటి నిధి అగర్వాల్ బుధవారం హైదరాబాద్‌లోని ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ కార్యాలయానికి హాజరయ్యారు. ఈడీ అధికారులు ఆమె స్టేట్‌మెంట్‌ను నమోదు చేస్తున్నారు. మరోవైపు బెట్టింగ్, గేమింగ్ ప్లాట్‌ఫారమ్‌ల ప్రమోషన్‌కు సంబంధించిన ఆర్థిక లావాదేవీలపై ఈడీ ప్రధానంగా దృష్టి సారించినట్టు సమాచారం. ముఖ్యంగా ప్రచారాల ద్వారా జరిగిన చెల్లింపులు, వాటి ఆర్థిక మార్గాలు, హవాలా కోణం వంటి అంశాలను అధికారులు పరిశీలిస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి. ఇక ఈ వ్యవహారంలో సినీ ప్రముఖులు, సోషల్ మీడియా ఇన్‌ఫ్లుయెన్సర్ల ప్రమోషన్లపై కూడా దర్యాప్తు జరుగుతోందని సమాచారం.

వీడిన ప్రిన్సిపాల్ మర్డర్ మిస్టరీ..  27సార్లు పొడిచి చంపిన పదో తరగతి విద్యార్థులు!క్రైమ్Swechaa19 Aug 2026, 02:29 PM

వీడిన ప్రిన్సిపాల్ మర్డర్ మిస్టరీ.. 27సార్లు పొడిచి చంపిన పదో తరగతి విద్యార్థులు!

తెలంగాణ రాష్ట్రంలో అత్యంత దారుణ ఘటన చోటుచేసుకుంది. నల్గొండ జిల్లా కొండమల్లేపల్లి పట్టణంలో నాగార్జున పబ్లిక్ స్కూల్ ప్రిన్సిపాల్ రూపారెడ్డి(45) దారుణ హత్య కేసు తీవ్ర దిగ్భ్రాంతిని కలిగిస్తోంది. జేబీ కాలనీలోని ఆమె నివాసంలో ఈనెల 11వ తేదీ రాత్రి భర్త హైదరాబాద్ వెళ్లిన సమయాన్ని ఆసరాగా చేసుకుని పాఠశాల విద్యార్థులే ఈ దారుణానికి ఒడిగట్టారు. బాధితురాలిని ఏకంగా 27సార్లు కత్తితో పొడిచి అత్యంత ఘాతుకానికి పాల్పడటం స్థానికంగా కలకలం రేపింది. ఈ కేసును సవాలుగా తీసుకున్న పోలీసులు దాదాపు 80మందిని సుదీర్ఘంగా విచారించిన అనంతరం సంచలన విషయాలను గుర్తించారు.