స్వేచ్ఛ షార్ట్స్ — తాజా తెలుగు వార్తలు

DK Aruna: రైల్వే అభివృద్ధి పనుల వేగం పెంచండి- ఎంపీ డీకే అరుణతెలంగాణSwechaa20 Aug 2026, 10:51 PM

DK Aruna: రైల్వే అభివృద్ధి పనుల వేగం పెంచండి- ఎంపీ డీకే అరుణ

DK Aruna: గురువారం సికింద్రాబాద్ రైల్ నిలయంలో తెలంగాణ పార్లమెంట్ సభ్యులతో రైల్వే ఉన్నతాధికారుల సమావేశం జరిగింది. మహబూబ్ నగర్ ఉమ్మడి జిల్లాలోని రైల్వే అభివృద్ధి పనుల పురోగతిపై ఎంపీ డీకే అరుణ అధికారులను అడిగి తెలుసుకున్నారు. గత సమావేశంలో ఇచ్చిన ప్రపోజల్స్ లో ఎన్ని మంజూరయ్యాయి, ఏ స్టేజ్ లో ఉన్నాయి అనే వివరాలు ఆరా తీశారు. వాటిని త్వరితగతిన ముందుకు తీసుకెళ్లేందుకు అధికారులు కృషి చేయాలని అన్నారు. ఇప్పటివరకు సెంట్రల్ రైల్వే బోర్డుకు పంపిన ప్రతిపాదనలు ఏ స్టేజ్ లో ఉన్నాయని ఎంపీ డీకే అరుణ అధికారులను అడిగి తెలుసుకున్నారు.

జిల్లాల వారీగా రెవెన్యూ సమీక్షలు.. భూ సమస్యల పరిష్కారమే ల‌క్ష్యంతెలంగాణSwechaa20 Aug 2026, 10:33 PM

జిల్లాల వారీగా రెవెన్యూ సమీక్షలు.. భూ సమస్యల పరిష్కారమే ల‌క్ష్యం

హైదరాబాద్‌ చుట్టుపక్కల జిల్లాల సమీక్షలను హైదరాబాద్‌ కేంద్రంగా నిర్వహించడంతో పాటు, దూర ప్రాంత జిల్లాలకు మంత్రి స్వయంగా వెళ్లి అక్కడే సమీక్షలు నిర్వహించనున్నారు. కలెక్టర్లు, అదనపు కలెక్టర్లు, ఆర్డీవోలు, తహశీల్దార్లు, ఇతర రెవెన్యూ అధికారులు, సబ్‌ రిజిస్ట్రార్లతో సహా సంబంధిత శాఖల అధికారులందరూ ఈ సమీక్షల్లో పాల్గొంటారు.

Prohibited Lands: 22ఏ సమస్యను ప్రత్యేక టాస్క్‌గా తీసుకుని పని చేయాలితెలంగాణSwechaa20 Aug 2026, 08:39 PM

Prohibited Lands: 22ఏ సమస్యను ప్రత్యేక టాస్క్‌గా తీసుకుని పని చేయాలి

22A Lands Row: 22ఏ ఫిర్యాదులకు సంబంధించి ఏర్పాటు చేసిన కాల్ సెంటర్‌కు వస్తున్న కాల్స్, వాటి పరిష్కారం, ఏయే సమస్యలపై ఎక్కువగా ఫిర్యాదులు వస్తున్నాయి, వచ్చిన కాల్స్‌కు ఎలాంటి సమాచారం అందిస్తున్నారు తదితర అంశాలపై బుధవారం అధికారులతో టెలికాన్ఫరెన్స్‌లో సమీక్షించారు మంత్రి పొంగులేటి. నాలుగు జిల్లాల్లో 22ఏ అంశంపై ప్రస్తుత పరిస్థితి, దరఖాస్తుల వివరాలను అధికారులను అడిగి తెలుసుకున్నారు. ఇప్పటివరకు సుమారు 400 కాల్స్ వచ్చినట్లు ఈ సందర్భంగా అధికారులు మంత్రి దృష్టికి తీసుకెళ్లారు.

భయంతో ఆగిన చిన్నారి గుండె.. స్కూల్‌లో భద్రత ఎక్కడ?ఏపీSwechaa20 Aug 2026, 08:22 PM

భయంతో ఆగిన చిన్నారి గుండె.. స్కూల్‌లో భద్రత ఎక్కడ?

విశాఖలోని లిటిల్ గార్డెన్ స్కూల్ లో ఎల్ కేజీ విద్యార్థి క్లాస్ రూమ్ లోనే కుప్పకూలి చనిపోయాడు. బాలుడిని ప్రణయ్ తేజ్ (6) గా గుర్తించారు. లిటిల్ గార్డెన్ స్కూల్ లో ఎల్ కేజీ చదువుతున్నాడు. హోంవర్క్ చేయలేదని క్లాస్ టీచర్ ప్రణయ్ ని మందలించి కొట్టింది. దీంతో ప్రణయ్ తీవ్ర భయాందోళనకు గురయ్యాడు. గుక్క పెట్టి ఏడ్చాడు. కొట్టొద్దు కొట్టొద్దు అని వేడుకున్నాడు. అలా ఏడుస్తూ, భయపడుతూనే టీచర్ పైనే కుప్పకూలాడు. వెంటనే స్కూల్ సిబ్బంది బాబును కేజీహెచ్ కు తరలించారు. అయితే, అప్పటికే ప్రణయ్ చనిపోయినట్లు డాక్టర్లు నిర్ధారించారు.

Bhatti Vikramarka: సమస్యల పరిష్కారమే అసలైన సమాఖ్యవాదం.. భట్టి విక్రమార్క!..తెలంగాణSwechaa20 Aug 2026, 07:37 PM

Bhatti Vikramarka: సమస్యల పరిష్కారమే అసలైన సమాఖ్యవాదం.. భట్టి విక్రమార్క!..

సమస్యల పరిష్కారమే అసలైన సమాఖ్యవాదమని తెలంగాణ ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క అన్నారు. మహాబలిపురంలో జరిగిన 31వ దక్షిణ ప్రాంతీయ మండలి సమావేశంలో తెలంగాణ ప్రయోజనాలను ఆయన స్పష్టంగా వినిపించారు. కృష్ణా జలాల్లో తెలంగాణకు న్యాయమైన వాటా దక్కాలని, కాళేశ్వరం, పాలమూరు–రంగారెడ్డి ఎత్తిపోతల పథకాలకు కేంద్రం ఆర్థిక సహాయం అందించాలని కోరారు. రెండు తెలుగు రాష్ట్రాల మధ్య పెండింగ్ సమస్యలకు చట్టబద్ధమైన, శాశ్వత పరిష్కారం చూపాలని విజ్ఞప్తి చేశారు. దక్షిణాది రాష్ట్రాలు కలిసి అభివృద్ధి చెందితేనే దేశం మరింత వేగంగా అభివృద్ధి చెందుతుందని భట్టి అన్నారు. 32వ దక్షిణ ప్రాంతీయ మండలి సమావేశాన్ని హైదరాబాద్‌లో నిర్వహించేందుకు తెలంగాణ సిద్ధంగా ఉందని ప్రకటించారు.

మంత్రి కొండా సురేఖ మాజీ ఓఎస్డీపై హత్యాయత్నం కేసు..క్రైమ్Swechaa20 Aug 2026, 07:18 PM

మంత్రి కొండా సురేఖ మాజీ ఓఎస్డీపై హత్యాయత్నం కేసు..

Case On Sumanth: దేవాదాయశాఖ మంత్రి కొండా సురేఖ మాజీ ఓఎస్డీ నార్ల సుమంత్ గూండాగిరి బయటపడింది. సుమంత్ మరో వివాదంలో చిక్కుకున్నాడు. సుమంత్ పై జూబ్లీహిల్స్ పోలీసులు హత్యాయత్నం కేసు నమోదు చేశారు. వ్యాపారి గొంగిడి హరికృష్ణను(36) 10 కోట్ల రూపాయలు ఇవ్వాలని సుమంత్ డిమాండ్ చేశాడని ఆరోపణలు వచ్చాయి. ఆ డబ్బులు ఇవ్వకపోవడంతో తనపై ఇనుప రాడ్లతో దాడి చేశారని బాధితుడు పోలీసులకు ఫిర్యాదు చేశాడు.

cancer-vaccine: వైద్యరంగంలో మరో కీలక అడుగు.. క్యాన్సర్‌ వ్యాక్సిన్ ఫేజ్-3 ట్రయల్స్‌ సక్సెస్!..InternationalSwechaa20 Aug 2026, 05:56 PM

cancer-vaccine: వైద్యరంగంలో మరో కీలక అడుగు.. క్యాన్సర్‌ వ్యాక్సిన్ ఫేజ్-3 ట్రయల్స్‌ సక్సెస్!..

క్యాన్సర్ మహమ్మారిపై పోరాటంలో వైద్యరంగంలో మరో కీలక అడుగుపడింది.. ప్రముఖ ఫార్మాదిగ్గజాలు మోడెర్నా, మెర్క్‌ సంస్థలు సంయుక్తంగా అభివృద్ధి చేసిన ఎమ్‌ఆర్ఎన్ఏ క్యాన్సర్ వ్యాక్సిన్ తుదిదశ క్లినికల్ ప్రయోగాల్లో ఆశించిన ఫలితాలు సాధించింది. అత్యంత ప్రమాదకరంగా భావించే చర్మ క్యాన్సర్ మెలనోమా రోగుల్లో శస్త్రచికిత్స అనంతరం క్యాన్సర్ మళ్లీ తిరగబెట్టకుండా, శరీరంలో ఇతర భాగాలకు వ్యాపించకుండా అడ్డుకోవడంలో ఈ వ్యాక్సిన్ విజయవంతమైనట్లు పరిశోధకులు ప్రకటించారు.

Konda Surekha: నా కూతురు చేసిన వ్యాఖ్యలకు నాకెందుకు నోటీసులుతెలంగాణSwechaa20 Aug 2026, 05:55 PM

Konda Surekha: నా కూతురు చేసిన వ్యాఖ్యలకు నాకెందుకు నోటీసులు

Konda Surekha: టీపీసీసీ క్రమశిక్షణ కమిటీ ఇచ్చిన షోకాజ్ నోటీసులకు మంత్రి కొండా సురేఖ వివరణ ఇచ్చారు. ఈ మేరకు టీపీసీసీ క్రమశిక్షణ కమిటీకి కొండా సురేఖ లేఖ రాశారు. అందులో ఘాటుగా స్పందించారు. తన కూతురు సుస్మిత చేసిన వ్యాఖ్యలు పూర్తిగా ఆమె వ్యక్తిగత అభిప్రాయాలు అని తేల్చి చెప్పారు. ఒకరి అభిప్రాయాలకు మరొకరు బాధ్యత వహించాలనడం సరికాదన్నారు. నా కూతురు చేసిన వ్యాఖ్యలకు నన్ను బాధ్యురాలిని చేయటం సమంజసం కాదన్నారు.

Visakha: విశాఖలో ఘోరం.. టీచర్ కొట్టడంతో క్లాస్ రూమ్‌లోనే ఆరేళ్ల బాబు మృతిక్రైమ్Swechaa20 Aug 2026, 05:03 PM

Visakha: విశాఖలో ఘోరం.. టీచర్ కొట్టడంతో క్లాస్ రూమ్‌లోనే ఆరేళ్ల బాబు మృతి

Visakha: విశాఖలోని లిటిల్ గార్డెన్ స్కూల్ లో ఘోరం జరిగింది. ఎల్ కేజీ విద్యార్థి క్లాస్ రూమ్ లోనే కుప్పకూలాడు. వెంటనే ఆసుపత్రికి తరలించగా అప్పటికే చనిపోయినట్లు డాక్టర్లు నిర్ధారించారు. ప్రణయ్ తేజ్ (6) లిటిల్ గార్డెన్ స్కూల్ లో ఎల్ కేజీ చదువుతున్నాడు. హోంవర్క్ చేయలేదని క్లాస్ టీచర్ ప్రణయ్ ని మందలించి కొట్టింది. దీంతో ప్రణయ్ తీవ్ర భయాందోళనకు గురయ్యాడు. గుక్క పెట్టి ఏడ్చాడు. అలానే టీచర్ పైనే కుప్పకూలాడు.

రేవంత్ సర్కార్‌కు హైకోర్టు షాక్.. కల్యాణలక్ష్మి, షాదీముబారక్ పథకాలపై తీవ్ర వ్యాఖ్యలుతెలంగాణSwechaa20 Aug 2026, 04:26 PM

రేవంత్ సర్కార్‌కు హైకోర్టు షాక్.. కల్యాణలక్ష్మి, షాదీముబారక్ పథకాలపై తీవ్ర వ్యాఖ్యలు

Telangana High Court: రేవంత్ సర్కార్ కు తెలంగాణ హైకోర్టులో ఎదురుదెబ్బ తగిలింది. కల్యాణలక్ష్మి, షాదీముబారక్ పథకాలపై స్టే ఎత్తివేతకు కోర్టు నిరాకరించింది. ఈ పథకాల చట్టబద్ధతపై దాఖలైన పిటిషన్ పై విచారణ సందర్భంగా న్యాయస్థానం తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. ఉచిత పథకాల వల్ల ప్రజాధనం వృథా అవుతోందని, ఆర్థిక ప్రమాద ఘంటికలు మోగుతున్నాయని కీలక వ్యాఖ్యలు చేసింది.

India: E20 ఎఫెక్ట్.. పేద మధ్యతరగతి నెత్తిన మరో పిడుగు!..NationalSwechaa20 Aug 2026, 04:08 PM

India: E20 ఎఫెక్ట్.. పేద మధ్యతరగతి నెత్తిన మరో పిడుగు!..

దేశవ్యాప్తంగా పెట్రోల్ లో ఇథనాల్ కలిపి ఈ 20 పేరుతో ఆ మిశ్రమాన్ని వాహనదారులకు అందించేందుకు కేంద్రం చేస్తున్న ప్రయత్నాల ప్రతికూల ప్రభావాలు ఇప్పటికే కనిపిస్తున్నాయి. వాహనాల మైలేజ్ లు తగ్గిపోవడం, ఇంజన్లు చెడిపోవడం వంటి దుష్పరిణామాలు ఎదురవుతున్నాయి. ఇప్పుడు వీటికి కొనసాగింపుగా ఇథనాల్ తరలింపు ప్రభావం చక్కెర ధరలపైనా పడుతోంది. దీంతో దేశంలో చక్కెర ధరలు రికార్డు స్ధాయికి పెరిగిపోయాయి.

ఇబ్రహీంపట్నంలో ఏసీబీ కలకలం.. ఏవో శ్రీనివాస్ రెడ్డి నివాసాల్లో సోదాలు!..తెలంగాణSwechaa20 Aug 2026, 03:28 PM

ఇబ్రహీంపట్నంలో ఏసీబీ కలకలం.. ఏవో శ్రీనివాస్ రెడ్డి నివాసాల్లో సోదాలు!..

రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నం ఆర్డిఓ కార్యాలయంలో ఏసీబీ అధికారులు రైడ్స్ జరిపారు. ఏఓగా పనిచేస్తున్న శ్రీనివాస్ రెడ్డిపై  అవినీతి ఆరోపణలతో ఆయనను ప్రశ్నిస్తున్నారు. శ్రీనివాస్ రెడ్డికి సంబంధించిన 15 చోట్ల ఏకకాలంలో తనిఖీలు చేస్తున్నారు. ఆదాయానికి మించిన ఆస్తులు కలిగి ఉన్నారన్న ఆరోపణలతో ఆయన ఇళ్లల్లో సోదాలు నిర్వహిస్తున్నారు. 

Kiren Rijiju: చైనా చొరబాట్లపై అసత్య ప్రచారాలు వద్దు.. సరిహద్దు భద్రతపై కిరణ్ రిజిజు కీలక వ్యాఖ్యలు!NationalSwechaa20 Aug 2026, 02:31 PM

Kiren Rijiju: చైనా చొరబాట్లపై అసత్య ప్రచారాలు వద్దు.. సరిహద్దు భద్రతపై కిరణ్ రిజిజు కీలక వ్యాఖ్యలు!

దేశ సరిహద్దుల భద్రత, మౌలిక వసతుల కల్పనకు ప్రధాని నరేంద్ర మోదీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వం అత్యధిక ప్రాధాన్యం ఇస్తోందని కేంద్ర మంత్రి కిరణ్ రిజిజు స్పష్టం చేశారు. అరుణాచల్ ప్రదేశ్‌లోని మాజా, గలేమో, తక్సింగ్ వంటి క్లిష్టమైన సరిహద్దు ప్రాంతాల్లో ఆయన స్వయంగా పర్యటించి రహదారులు, ఇతర అభివృద్ధి పనులను సమీక్షించారు. అరుణాచల్‌లో సరిహద్దు సమస్య దశాబ్దాలుగా ఉందని, ఇరు దేశాల మధ్య సరిహద్దుపై స్పష్టమైన గుర్తింపు, స్తంభాలు లేకపోవడం వల్లే కొన్ని చిక్కులు వస్తున్నాయని వివరించారు.

దక్షిణాది రాష్ట్రాలపై కేంద్రం ఫోకస్.. 31వ జోనల్ కౌన్సిల్ సమావేశం!..NationalSwechaa20 Aug 2026, 02:30 PM

దక్షిణాది రాష్ట్రాలపై కేంద్రం ఫోకస్.. 31వ జోనల్ కౌన్సిల్ సమావేశం!..

తమిళనాడులోని మహాబలిపురం వేదికగా 31వ దక్షిణ ప్రాంతీయ మండలి సమావేశం ప్రారంభమైంది. ఈ భేటీకి కేంద్ర హోంమంత్రి అమిత్ షా హాజరై అధ్యక్షత వహిస్తున్నారు. అదేవిధంగా దక్షిణాది రాష్ట్రాలైన ఆంధ్రప్రదేశ్, కర్ణాటక, కేరళ, తమిళనాడు, తెలంగాణల ముఖ్యమంత్రులతో పాటు కేంద్రపాలిత ప్రాంతాలైన పుదుచ్చేరి, అండమాన్ నికోబార్, లక్షద్వీప్ ఈ భేటీలో పాల్గొంటున్నారు.

మేం ‘జెన్ జీ’ అంటూ ఆర్మీ జవాన్‌కు యువతి ధమ్కీ (వీడియో)వైరల్ న్యూస్Swechaa20 Aug 2026, 02:21 PM

మేం ‘జెన్ జీ’ అంటూ ఆర్మీ జవాన్‌కు యువతి ధమ్కీ (వీడియో)

నేటి తరం యువతులు ఏం చేస్తున్నారో వారికే తెలియడం లేదు. ఎవరితో ఎలా మాట్లాడాలి? ఎలా ప్రవర్తించాలి? అధికారుల ముందు ఎలా బిహేవ్ చేయాలి? పోలీసులు, భద్రతా బలగాలతో ఎలా నడుచుకోవాలో తెలియడం లేదంటూ కొందరు సోషల్ మీడియాలో స్పందిస్తున్నారు. ఇటీవల ఢిల్లీ జంతర్ మంతర్ వేదికగా నీట్ పేపర్ లీకేజీకి వ్యతిరేకంగా నేటితరం విద్యార్థులు (జెన్ జీ) పెద్దఎత్తున నిరసన తెలిపిన విషయం తెలిసిందే. అయితే, ఆ ఒక్క జెన్ జీ అనే పదాన్ని పట్టుకుని ఓ యువతి ఏకంగా భద్రతా బలగాలను బెదిరించే ప్రయత్నం చేసింది.ఈ వీడియో కాస్త సోషల్ మీడియాలో వైరల్ కావడంతో సదరు యువతి ప్రవర్తనపై నెటిజన్లు విరుచుకపడుతున్నారు. వివరాల్లోకివెళితే.. జమ్మూకాశ్మీర్‌ పర్యటనకు వెళ్లిన ఓ యువతి ఆర్మీ అధికారులతో వాగ్వాదం పెట్టుకుంది. భద్రత కారణాల దృష్ట్యా ఓ చెక్ పోస్ట్ వద్ద రోడ్డును భద్రతా బలగాలు బ్లాక్ చేశాయి. సమయం గడుస్తున్నా రోడ్డు బ్లాక్ తీయడం లేదని ఓ యువతి రెచ్చిపోయింది.

మాకే టికెట్ దిక్కులేదు.. నీకు కావాలా?  :ఇందిరా శోభన్రాజకీయాలుSwechaa20 Aug 2026, 01:54 PM

మాకే టికెట్ దిక్కులేదు.. నీకు కావాలా? :ఇందిరా శోభన్

సీఎం రేవంత్ రెడ్డి అవినీతి చిట్టా బయటపెడతానని మంత్రి కొండా సురేఖ కూతురు కొండా సుస్మిత చేసిన వ్యాఖ్యలపై కాంగ్రెస్ మహిళా నాయకురాలు ఇందిరా శోభన్ కౌంటర్ ఇచ్చారు. గురువారం గాంధీభవన్‌లో ఆమె మీడియాతో మాట్లాడుతూ.. సుస్మిత వ్యాఖ్యలపై తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. కొండా సుష్మిత చేసిన వ్యాఖ్యల వల్ల పక్క పార్టీ వాళ్లు మమ్మల్ని ట్రోల్ చేస్తున్నారని, మేము 10, 15 ఏళ్ల నుంచి దొబ్బించుకుంటున్నా.. తమకే ఎమ్మెల్యే టికెట్ రాలేదని, నిన్న గాక మొన్న వచ్చి టికెట్ కావాలంటే ఎలా? అని ప్రశ్నించారు. సీఎం రేవంత్ అవినీతి మీద బాంబులు పేలుస్తానని కొండా సుస్మిత చేసిన వ్యాఖ్యలపై స్పందిస్తూ.. ‘దమ్ముంటే రేవంత్ రెడ్డి అవినీతి బయటపెట్టు.నీ దగ్గర ఆధారాలు ఉంటే చూపించు.. నువ్వు చేసే వ్యాఖ్యలకు మీ అమ్మ తల దించుకుంటుంది. బీజేపీ,బీఆర్ఎస్ కలిసి నీతో ఇలా మాట్లాడిస్తున్నారని అర్థం అవుతోంది’ అని ఇందిరా శోభన్ ఘాటు వ్యాఖ్యలు చేశారు.

యువతి స్కెచ్‌కు బలైన యువకుడు!వైరల్ న్యూస్Swechaa20 Aug 2026, 01:34 PM

యువతి స్కెచ్‌కు బలైన యువకుడు!

ఏపీలో మరో ఘరానా మోసం వెలుగుచూసింది. పెళ్లి చేసుకుంటానని నమ్మించి ఓ యువకుడిని నిండా ముంచిన ఘటన ఆలస్యంగా వెలుగుచూడటంతో ప్రస్తుతం సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతోంది. పెళ్లివరకు తీసుకువచ్చిన సదరు యువతి..లాస్ట్ మినిట్‌లో పెళ్లి రద్దు చేసుకుని ఫోన్ స్విచ్ఛాఫ్ చేయడంతో బాధిత యువకుడు కంగుతిన్నాడు. ఈ ఘటన ఏపీలోని వైఎస్సార్ కడప జిల్లాలో చోటుచేసుకున్నట్టు సమాచారం. వివరాల్లోకివెళితే.. వైఎస్ఆర్ కడప జిల్లా పులివెందుల పశుసంవర్ధక శాఖలో కడపకు చెందిన ఓ యువతి ఉద్యోగం చేస్తున్నది.అయితే, అదే జిల్లా వేంపల్లె మండలంలోని ఓ గ్రామానికి చెందిన ప్రసాద్ అనే వ్యక్తితో సదరు యువతికి ఏడాది క్రితం పరిచయం ఏర్పడింది. తనకంటే వయసులో చిన్న వాడైన ప్రసాద్‌ను ప్రేమించి, పెళ్లి చేసుకునేందుకు యువతి సిద్ధపడింది.

bjp: 22A కుట్రదారులెవరో తేల్చాల్సిందే!..తెలంగాణSwechaa20 Aug 2026, 01:33 PM

bjp: 22A కుట్రదారులెవరో తేల్చాల్సిందే!..

రాష్ట్రంలో 22ఏ  జాబితా పేరుతో లక్షల కోట్ల రూపాయల భూ కుంభకోణం జరుగుతోందని బీజేపీఎల్పీ నేత ఏలేటి మహేశ్వర్ రెడ్డి ఆరోపించారు.  దాదాపు కోటి ఎకరాలను ఈ జాబితాలో చేర్చి రైతులను, రియల్టర్లను భయపెట్టి బేరసారాలు జరుపుతున్నారని అన్నారు. ఈ భారీ స్కామ్ వెనుక ఉన్న కుట్రదారులెవరో తేలాలంటే వెంటనే సీబీఐ విచారణకు ఆదేశించాలని డిమాండ్ చేశారు. 

రేవంత్‌కు షాకిచ్చిన పీసీసీ చీఫ్.. ‘రేవూరి’ అభ్యర్థిత్వ ప్రకటన చెల్లదురాజకీయాలుSwechaa20 Aug 2026, 01:18 PM

రేవంత్‌కు షాకిచ్చిన పీసీసీ చీఫ్.. ‘రేవూరి’ అభ్యర్థిత్వ ప్రకటన చెల్లదు

వచ్చే ఎన్నికల్లో పరకాల నియోజకవర్గం నుంచి రేవూరి ప్రకాశ్ రెడ్డి నిలబడతారని సీఎం రేవంత్ చేసిన వ్యాఖ్యలపై తాజాగా టీపీసీసీ చీఫ్ మహేశ్ కుమార్ గౌడ్ స్పందించారు. గురువారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ‘ఎమ్మెల్యే అభ్యర్థిని సీఎం రేవంత్ రెడ్డే కాదు.. ఎవరూ ప్రకటించినా చెల్లదు’ అని కుండబద్ధలు కొట్టారు. ఎమ్మెల్యేల అభ్యర్థులను నిర్ణయించేది కాంగ్రెస్ అధిష్టానం మాత్రమే అని అన్నారు. ఓ ఎమ్మెల్యే అభ్యర్థిని ఎంపిక చేయాలంటే.. స్టేట్ ఎలక్షన్ కమిటీ, ఆ తర్వాత ఢిల్లీలోని సెంట్రల్ ఎలక్షన్ కమిటీ, చివరగా సీడబ్ల్యూసీ చేతిలో నిర్ణయం ఉంటుందన్నారు. ఎవరికి వారు ఎమ్మెల్యే అభ్యర్థులను ప్రకటించుకుంటే చెల్లదని టీపీసీసీ చీఫ్ స్పష్టంచేశారు.

మారిన నేరాల రూపురేఖలు.. పోలీస్ శాఖలో భారీ ప్రక్షాళన.. 513 మందికి కీలక పోస్టింగ్‌లు!తెలంగాణSwechaa20 Aug 2026, 01:10 PM

మారిన నేరాల రూపురేఖలు.. పోలీస్ శాఖలో భారీ ప్రక్షాళన.. 513 మందికి కీలక పోస్టింగ్‌లు!

రాష్ట్రంలో మారుతున్న నేరాల స్వభావానికి అనుగుణంగా తెలంగాణ పోలీస్ శాఖ సమూల మార్పులకు శ్రీకారం చుట్టింది. ఒకప్పుడు నక్సలిజం, ఉగ్రవాదం ప్రధాన సవాళ్లుగా ఉండగా, ప్రస్తుత కాలంలో సైబర్ క్రైమ్స్, డ్రగ్స్, ఆన్‌లైన్ బెట్టింగ్, ఇన్వెస్ట్‌మెంట్ మోసాలు సమాజానికి పెద్ద ముప్పుగా పరిణమించాయి. ఈ సరికొత్త సవాళ్లను సమర్థంగా తిప్పికొట్టేందుకు గ్రేహౌండ్స్, ఆక్టోపస్, ఎస్ఐబీ విభాగాల నుంచి 513 మంది సిబ్బందిని ఎంపిక చేసి ప్రత్యేకంగా శిక్షణ ఇచ్చారు.

హైదరాబాద్‌లో కొత్త సమస్య.. రాత్రి వేళల్లో భయాందోళనలో నగరవాసులు!వైరల్ న్యూస్Swechaa20 Aug 2026, 12:43 PM

హైదరాబాద్‌లో కొత్త సమస్య.. రాత్రి వేళల్లో భయాందోళనలో నగరవాసులు!

హైదరాబాద్ నగరంలో దోమల బెడద మునుపెన్నడూ చూడని రీతిలో కొత్త రూపం దాల్చింది. లంగర్‌హౌస్ పరిసర ప్రాంతాల్లో వేలాది దోమలు ఒక్కచోట గుమిగూడి భూమి నుంచి ఆకాశం వైపు వలయాకారంలో సుడిగాలిలా (మస్కిటో టోర్నడో) ఎగురుతున్న వింత దృశ్యాలు స్థానికులను తీవ్ర భయాందోళనకు గురిచేస్తున్నాయి. ఈ అసాధారణ దృశ్యాలకు సంబంధించిన వీడియోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతున్నాయి. లంగర్‌హౌస్ మాత్రమే కాకుండా టోలిచౌకి, మెహదీపట్నం, గోల్కొండ, షేక్‌పేట్, జూబ్లీహిల్స్ వరకు ప్రధాన రహదారులపై దోమల గుంపులు భారీగా సంచరిస్తున్నాయి.

రేవంత్‌పై కూతురి వివాదాస్పద వ్యాఖ్యలు.. కాసేపట్లో విచారణకు కొండా సురేఖ!రాజకీయాలుSwechaa20 Aug 2026, 12:34 PM

రేవంత్‌పై కూతురి వివాదాస్పద వ్యాఖ్యలు.. కాసేపట్లో విచారణకు కొండా సురేఖ!

అధికార కాంగ్రెస్ పార్టీలో అసంతృప్తి జ్వాలలు ఎగడిపడుతూనే ఉన్నాయి. మొన్న మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి, మరో ఎమ్మెల్యే అనిరుధ్ రెడ్డి, ప్రణాళికసంఘం ఉపాధ్యక్షుడు చిన్నారెడ్డి వంటి వారు సీఎం రేవంత్ రెడ్డి, కాంగ్రెస్ పార్టీ అధిష్టానం మీద ధిక్కార స్వరం వినిపించిన విషయం తెలిసిందే.తాజాగా రేవంత్ రెడ్డి మంత్రివర్గంలోని మినిస్టర్ కొండా సురేఖ కూతురు కొండా సుస్మిత నిన్ని సీఎం రేవంత్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేసింది. అయితే,కొండా సుస్మిత వ్యాఖ్యలపై పార్టీ అధిష్టానం సీరియస్ అయినట్టు తెలుస్తోంది. ఈ క్రమంలోనే కొండా సుస్మిత వ్యాఖ్యలపై వివరణ ఇవ్వాలని మంత్రి సురేఖకు పీసీసీ క్రమశిక్షణ కమిటీ నోటీసులు ఇచ్చినట్టు సమాచారం.వాటిని మంత్రి కూడా అందుకున్నట్టు తెలిసింది. గురువారం గాంధీ భవన్‌లో నిర్వహించే పీసీసీ క్రమశిక్షణా కమిటీ భేటీకి ఆమె హాజరై తనకూతురు చేసిన వ్యాఖ్యలకు వివరణ ఇస్తారని ప్రచారం జరుగుతోంది.

మోదీ తర్వాత ఎవరు? రాహుల్ కామెంట్స్‌తో ఢిల్లీలో కొత్త చర్చNationalSwechaa20 Aug 2026, 12:32 PM

మోదీ తర్వాత ఎవరు? రాహుల్ కామెంట్స్‌తో ఢిల్లీలో కొత్త చర్చ

రాహుల్ వ్యాఖ్యల వెనుక మరో వ్యూహం కూడా ఉండొచ్చనే చర్చ జరుగుతోంది. మోదీని కేంద్రంగా చేసుకుని 2024 ఎన్నికల్లో బీజేపీపై ఎదురుదాడి చేసిన కాంగ్రెస్.. ఇప్పుడు మోదీ తర్వాత ఎవ‌ర‌నే దానిపై చర్చను ముందుకు తీసుకొచ్చింది. దీని ద్వారా బీజేపీ నాయకత్వంపై ప్రశ్నలు లేవనెత్తాలని కాంగ్రెస్ ప్రయత్నిస్తోందా? అనే ప్రశ్నలు వినిపిస్తున్నాయి.

శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాలు.. భక్తులకు టీటీడీ కీలక సూచనలు!ఏపీSwechaa20 Aug 2026, 12:15 PM

శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాలు.. భక్తులకు టీటీడీ కీలక సూచనలు!

తిరుమల శ్రీ వేంకటేశ్వరస్వామి వార్షిక సాలకట్ల బ్రహ్మోత్సవాలకు తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) విస్తృత ఏర్పాట్లు చేస్తోంది. సెప్టెంబర్ 14న శాస్త్రోక్తంగా అంకురార్పణ జరగనుండగా, సెప్టెంబర్ 15 నుంచి 23 వరకు ఉత్సవాలు అత్యంత వైభవంగా సాగనున్నాయి. బ్రహ్మోత్సవాల మొదటి రోజైన సెప్టెంబర్ 15న రాష్ట్ర ప్రభుత్వం తరఫున ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు దంపతులు శ్రీవారికి పట్టు వస్త్రాలు సమర్పించనున్నారు. ఈ ఏడాది అధికమాసం కారణంగా టీటీడీ రెండు బ్రహ్మోత్సవాలను నిర్వహించనుంది.

ఐఫోన్ కోసం మనవరాలి ఘాతుకం..తాతను హత్య చేయించి..!క్రైమ్Swechaa20 Aug 2026, 12:12 PM

ఐఫోన్ కోసం మనవరాలి ఘాతుకం..తాతను హత్య చేయించి..!

డబ్బుల మాయలో పడి కొందరు మానవతా విలువలు మర్చిపోతున్నారు. బంధువులు, కుటుంబసభ్యులు అని చూడకుండా దారుణాలకు పాల్పడుతున్నారు.డబ్బులు వచ్చాయా?లేదా?అని మాత్రమే ఆలోచన చేస్తున్నట్టు ఆరోపణలు వినిపిస్తున్నాయి. తల్లిదండ్రులు, తోడబుట్టిన వారు, పెద్దలు అని ఏమాత్రం ఆలోచించకుండా ఘాతుకాలకు పాల్పడుతున్న ఘటనలు నానాటికీ పెరిగిపోతున్నాయి. ఆస్తి కోసం రక్తం పంచుకుని పుట్టిన వారిని,కన్నవారిని సైతం నేటితరంలోని కొందరు వదలడం లేదు. ఏమాత్రం కనికరించకుండా కడతేరుస్తున్నారు. తాజాగా ఐఫోన్ కోసం తాతను హతమార్చిన ఘటన ఒకటి వెలుగచూసింది. ప్రస్తుతం ఇది దేశవ్యాప్తంగా సంచలనానికి తెరతీసింది. వివరాల్లోకివెళితే.. ఐఫోన్ కోసం ప్రియుడితో కలిసి ఓ 13 ఏళ్ల బాలిక తాతను చంపించింది.ఈ ఘటన కేరళం - అలప్పుజలో చోటుచేసుకోగా.. ఆలస్యంగా వెలుగుచూసింది.

లోక‌ల్ ఫైట్‌కు జ‌గ‌న్ సై.. కూట‌మికి తొలి ప‌రీక్ష‌!ఏపీSwechaa20 Aug 2026, 12:05 PM

లోక‌ల్ ఫైట్‌కు జ‌గ‌న్ సై.. కూట‌మికి తొలి ప‌రీక్ష‌!

ఈ ఎన్నికలు కేవలం సర్పంచ్‌, ఎంపీటీసీ, జెడ్పీటీసీ, కౌన్సిలర్‌, కార్పొరేటర్‌ పదవుల కోసం జరిగే పోరు మాత్రమే కాదు. ఏపీలో ఏ పార్టీకి క్షేత్రస్థాయిలో భవిష్యత్తు ఉందో చెప్పే రాజకీయ సంకేతంగా మారే అవకాశం ఉంది.

సముద్రాలు దాటిన ప్రేమ.. కేరళలో భారతీయ మహిళను పెళ్లాడిన స్కాటిష్ ఎంపీ!వైరల్ న్యూస్Swechaa20 Aug 2026, 11:57 AM

సముద్రాలు దాటిన ప్రేమ.. కేరళలో భారతీయ మహిళను పెళ్లాడిన స్కాటిష్ ఎంపీ!

దేశాలు, సంస్కృతులు వేరైనా ప్రేమ ముందు సరిహద్దులు చెరిగిపోయాయి. స్కాట్లాండ్‌కు చెందిన పార్లమెంట్ సభ్యుడు మార్టిన్ డే, కేరళకు చెందిన నిధిన్ చంద్‌ను ప్రసిద్ధ గురువాయూర్ శ్రీకృష్ణ ఆలయంలో హిందూ సంప్రదాయ పద్ధతిలో వివాహం చేసుకున్నారు. తొమ్మిదేళ్ల క్రితమే యూకేలో చట్టబద్ధంగా రిజిస్టర్ మ్యారేజ్ చేసుకున్న ఈ జంట, ఇరు కుటుంబ సభ్యులు, నిధిన్ 22 ఏళ్ల కుమారుడు వేదిక్ శంకర్ సమక్షంలో వేద మంత్రోచ్ఛారణల నడుమ ఒక్కటయ్యారు.

Kuldeep Yadav: ఒక్క మ్యాచ్‌కే పక్కనపెడతారా?.. కుల్దీప్ స్థానంలో కొత్త స్పిన్నర్ అరంగేట్రం!క్రీడలుSwechaa20 Aug 2026, 11:47 AM

Kuldeep Yadav: ఒక్క మ్యాచ్‌కే పక్కనపెడతారా?.. కుల్దీప్ స్థానంలో కొత్త స్పిన్నర్ అరంగేట్రం!

శ్రీలంకతో జరిగిన తొలి టెస్టులో 165 పరుగుల ఘన విజయం సాధించి సిరీస్‌లో శుభారంభం చేసిన భారత జట్టు, ఇప్పుడు కొలంబో వేదికగా జరిగే రెండో టెస్టుపై పూర్తి దృష్టి సారించింది. తొలి మ్యాచ్‌లో గెలిచినప్పటికీ జట్టు కూర్పులో కీలక మార్పు చేయాలని కెప్టెన్ శుభ్‌మన్ గిల్, హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్ భావిస్తున్నట్లు సమాచారం. మొదటి టెస్టులో ఆశించిన స్థాయిలో ప్రభావం చూపలేకపోయిన చైనామన్ స్పిన్నర్ కుల్దీప్ యాదవ్‌ను పక్కనపెట్టే యోచనలో యాజమాన్యం ఉన్నట్లు తెలుస్తోంది.

Silver : రూ.10 వేలు పెరిగిన ‘సిల్వర్’.. భగ్గుమన్న బంగారం!వ్యాపారంSwechaa20 Aug 2026, 11:22 AM

Silver : రూ.10 వేలు పెరిగిన ‘సిల్వర్’.. భగ్గుమన్న బంగారం!

పసిడి, వెండి ధరలు మరోసారి వినియోగదారులకు షాక్ ఇచ్చాయి. ఎవరూ ఊహించని విధంగా ఒక్కసారిగా భారీగా ధరలు పెరిగాయి. పెళ్లిళ్ల సీజన్ కావడంతో వెండి, పసిడి కొనుగోలు చేసేందుకు కస్టమర్లు జంకుతున్నారు. అయితే, గ్లోబల్ వైడ్‌గా ఉన్న డిమాండ్ నేపథ్యంలో దేశీయ బులియన్ మార్కెట్లో వెండి, బంగారం ధరలు ఒక్కసారిగా ఆకాశాన్నితాకాయి. కేవలం సిల్వర్ ఒకే రోజు రూ.10 వేల వరకు ధర పెరగడం గమనార్హం. పసిడి సైతం వినియోగదారులకు చుక్కలు చూపిస్తున్నాయి. మునుపెన్నడూ లేనివిధంగా వెండి, గోల్డ్ ధరలు పోటీపడి మరీ పెరుగుతున్నాయి.ఆషాఢమాసం సేల్ అయిపోయింది.దీంతో బంగారం వ్యాపారులు, షోరూమ్స్ యజమానులు వినియోగదారులను ఆకట్టుకునేందుకు ప్రయత్నాలు చేస్తుండగా.. ఒక్కసారిగా ధరలు అమాంతం పెరగడంతో కస్టమర్లు పెద్దగా ఆసక్తి చూపించడం లేదని సమాచారం.

22A Scam: ‘పొంగులేటిని బర్తరఫ్ చేయాలి..’ రాహుల్ గాంధీకి హరీశ్ రావు లేఖ!తెలంగాణSwechaa20 Aug 2026, 11:21 AM

22A Scam: ‘పొంగులేటిని బర్తరఫ్ చేయాలి..’ రాహుల్ గాంధీకి హరీశ్ రావు లేఖ!

తెలంగాణ రెవెన్యూ శాఖలో నిషేధిత భూముల (22A) చట్టాన్ని అడ్డుపెట్టుకుని అధికార పార్టీ పెద్దలు, దళారులు బరితెగించి సాగిస్తున్న వేల కోట్ల రూపాయల దోపిడీ, 30శాతం కమీషన్ల దందాపై మాజీ మంత్రి హరీశ్ రావు కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీకి లేఖ రాస్తూ తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. ప్రజల ఆస్తులను కృత్రిమ వివాదాల్లోకి నెట్టి వేధింపులకు గురిచేస్తున్న రెవెన్యూ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డిని తక్షణమే కేబినెట్ నుంచి బర్తరఫ్ చేయాలని, అక్రమాలపై సిట్టింగ్ జడ్జితో ఫోరెన్సిక్ ఆడిట్ జరిపించాలని ఆయన డిమాండ్ చేశారు.