స్వేచ్ఛ షార్ట్స్ — తాజా తెలుగు వార్తలు

వీడిన ప్రిన్సిపాల్ మర్డర్ మిస్టరీ..  27సార్లు పొడిచి చంపిన పదో తరగతి విద్యార్థులు!క్రైమ్Swechaa19 Aug 2026, 02:29 PM

వీడిన ప్రిన్సిపాల్ మర్డర్ మిస్టరీ.. 27సార్లు పొడిచి చంపిన పదో తరగతి విద్యార్థులు!

తెలంగాణ రాష్ట్రంలో అత్యంత దారుణ ఘటన చోటుచేసుకుంది. నల్గొండ జిల్లా కొండమల్లేపల్లి పట్టణంలో నాగార్జున పబ్లిక్ స్కూల్ ప్రిన్సిపాల్ రూపారెడ్డి(45) దారుణ హత్య కేసు తీవ్ర దిగ్భ్రాంతిని కలిగిస్తోంది. జేబీ కాలనీలోని ఆమె నివాసంలో ఈనెల 11వ తేదీ రాత్రి భర్త హైదరాబాద్ వెళ్లిన సమయాన్ని ఆసరాగా చేసుకుని పాఠశాల విద్యార్థులే ఈ దారుణానికి ఒడిగట్టారు. బాధితురాలిని ఏకంగా 27సార్లు కత్తితో పొడిచి అత్యంత ఘాతుకానికి పాల్పడటం స్థానికంగా కలకలం రేపింది. ఈ కేసును సవాలుగా తీసుకున్న పోలీసులు దాదాపు 80మందిని సుదీర్ఘంగా విచారించిన అనంతరం సంచలన విషయాలను గుర్తించారు.

పొంగులేటి అక్రమాలపై బహిరంగ చర్చకు సిద్ధం.. బీజేపీ ఎమ్మెల్యే సవాల్!తెలంగాణSwechaa19 Aug 2026, 01:48 PM

పొంగులేటి అక్రమాలపై బహిరంగ చర్చకు సిద్ధం.. బీజేపీ ఎమ్మెల్యే సవాల్!

రాష్ట్ర మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి అక్రమాలపై తన వద్ద అన్ని రకాల ఆధారాలు ఉన్నాయని బీజేపీ శాసనసభా పక్ష నేత ఏలేటి మహేశ్వర్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. రేపు(గురువారం) మధ్యాహ్నం 12 గంటలకు అసెంబ్లీ మీడియా పాయింట్ వద్ద ఈ విషయమై బహిరంగ చర్చకు తాను సిద్ధంగా ఉన్నానని, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి చర్చకు రాగలరా అని సవాల్ విసిరారు. పొంగులేటి అక్రమాలకు సంబంధించిన అన్ని సాక్ష్యాధారాలను ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ), కేంద్ర దర్యాప్తు సంస్థ (సీబీఐ)లకు త్వరలోనే అప్పగిస్తానని స్పష్టం చేశారు.

అమెరికా గ్రీన్ కార్డ్ నిబంధనలు మరింత కఠినతరం.. కొత్త మార్గదర్శకాలు!InternationalSwechaa19 Aug 2026, 01:39 PM

అమెరికా గ్రీన్ కార్డ్ నిబంధనలు మరింత కఠినతరం.. కొత్త మార్గదర్శకాలు!

అమెరికాలో శాశ్వత నివాస హోదా(గ్రీన్ కార్డ్) కోసం నిరీక్షిస్తున్న వేలాది మంది భారతీయులకు ఊహించని షాక్ తగిలింది. 'పబ్లిక్ ఛార్జ్' నిబంధనలను పునరుద్ధరిస్తూ కొత్త మార్గదర్శకాలు సెప్టెంబర్ 18 నుంచి అమల్లోకి రానున్నట్లు యూఎస్ సిటిజన్‌షిప్ అండ్ ఇమ్మిగ్రేషన్ సర్వీసెస్ (USCIS) స్పష్టం చేసింది. ఈ నూతన విధానం వల్ల గ్రీన్ కార్డ్ దరఖాస్తుదారుల ఆర్థిక పునాది, కుటుంబ పరిస్థితి, వారు పొందిన ప్రభుత్వ సంక్షేమ ఫలాలపై అధికారులు సునిశితంగా దర్యాప్తు చేయనున్నారు.

రోడ్డెక్కిన పాలిటెక్నిక్ విద్యార్థులు.. రాష్ట్ర వ్యాప్త నిరసనలు!తెలంగాణSwechaa19 Aug 2026, 01:17 PM

రోడ్డెక్కిన పాలిటెక్నిక్ విద్యార్థులు.. రాష్ట్ర వ్యాప్త నిరసనలు!

రాష్ట్రంలోని పాలిటెక్నిక్ కళాశాలలను యంగ్ ఇండియా స్కిల్ యూనివర్సిటీలో విలీనంచేస్తూ రేవంత్‌రెడ్డి ప్రభుత్వం తీసుకొచ్చిన 'శక్తి' స్కీమ్, జీవో నంబర్ 97కు వ్యతిరేకంగా పాలిటెక్నిక్ విద్యార్థుల నిరసనలు ఉధృతమవుతున్నాయి. పాలిటెక్నిక్ డిప్లొమా విద్యావ్యవస్థ ప్రాధాన్యతను తగ్గించి, తమను కేవలం శ్రామిక శిక్షణ (లేబర్)కే పరిమితం చేసేలా ఈ నిర్ణయం ఉందంటూ విద్యార్థులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వం వెంటనే స్పందించి జీవో-97ను రద్దు చేయకపోతే పోరాటాన్ని మరింత తీవ్రతరం చేస్తామని హెచ్చరించారు.

మహేష్ వారణాసి సినిమాలో సాంగ్స్ లేవా? ఫ్యాన్స్ ఒప్పుకోరుగా!సినిమాSwechaa19 Aug 2026, 01:04 PM

మహేష్ వారణాసి సినిమాలో సాంగ్స్ లేవా? ఫ్యాన్స్ ఒప్పుకోరుగా!

Varanasi: కీరవాణి తాజాగా ఇచ్చిన ఇంటర్వ్యూలో వారణాసి సినిమా బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ సెప్టెంబర్ నెల నుంచి మొదలు పెట్టి, జనవరి వరకూ కంప్లీట్ చేస్తామని చెప్పాడు. అలాగే, ఇందులో మొత్తం 6 పాటలున్నాయని, వాటిలో 4 పాటలు ఇప్పటికే పూర్తయ్యాయి.. ఇంకో 2 పాటలను కంపోజ్ చేయాల్సి ఉందని క్లారిటీ ఇచ్చాడు. మొత్తానికి, వారణాసి సినిమా సాంగ్ కి సంబందించి వచ్చిన రూమర్స్ కి కీరవాణి ఫుల్ క్లారిటీ ఇచ్చాడు. ఇక, ఈ సినిమాను 120 దేశాలలో మొత్తం 20 భాషలలో రిలీజ్ చేయనున్నారు. ఈ సినిమాకి ఆస్కార్ అవార్డ్ విన్నింగ్ డైరెక్టర్ ఎ.ఎస్.రాజమౌళి.

ఏపీలో కొత్త పొలిటికల్ పార్టీ.. రీఎంట్రీపై విజయసాయి‌రెడ్డి సంచలన ప్రకటన!ఏపీSwechaa19 Aug 2026, 01:02 PM

ఏపీలో కొత్త పొలిటికల్ పార్టీ.. రీఎంట్రీపై విజయసాయి‌రెడ్డి సంచలన ప్రకటన!

వైఎస్సార్‌సీపీ మాజీ ఎంపీ విజయసాయి రెడ్డి తన రాజకీయ భవిష్యత్తుపై నడుస్తున్న ఊహాగానాలకు తెర దించారు. తిరుమల శ్రీవారిని దర్శించుకున్న అనంతరం మీడియాతో ఆయన మీడియాతో మాట్లాడుతూ సంచలన విషయాన్ని ప్రకటించారు.  వైఎస్సార్‌సీపీలోకి మళ్లీ వెళ్తారంటూ జరుగుతున్న ప్రచారాన్ని పటాపంచలు చేశారు. సరికొత్త రాజకీయ అధ్యాయానికి శ్రీకారం చుడుతూ సొంతంగా కొత్త రాజకీయ పార్టీని ఏర్పాటు చేయనున్నట్లు స్పష్టం చేశారు. చట్టసభల్లో ప్రజల తరఫున నిజాయితీగల గొంతుకగా నిలిచేందుకే ఈ నిర్ణయం తీసుకున్నానని, శ్రీవారి ఆశీస్సులతో ప్రజా సేవలోకి పునఃప్రవేశిస్తున్నానని విజయసాయిరెడ్డి స్పష్టం చేశారు.

మౌనంగా భరించొద్దు.. గొంతెత్తితేనే అన్యాయానికి ముగింపు!క్రైమ్Swechaa19 Aug 2026, 12:51 PM

మౌనంగా భరించొద్దు.. గొంతెత్తితేనే అన్యాయానికి ముగింపు!

ఎంత పెద్ద సమస్య ఎదురైనా.. ఎంతటి ఒత్తిడి వచ్చినా.. మనసులోనే దాచుకుని ఒంటరిగా భరించడం పరిస్థితిని మరింత విషమం చేయొచ్చు. సమస్య మొదలైనప్పుడే కుటుంబ సభ్యులతో చెప్పాలి. నమ్మకమైన స్నేహితులతో మాట్లాడాలి. అవసరమైతే పోలీసులను ఆశ్రయించాలి.

రోడ్డు నిధుల ఆలస్యం.. ఆమరణ దీక్షకు సిద్ధమన్న కాంగ్రెస్ ఎమ్మెల్యే!తెలంగాణSwechaa19 Aug 2026, 12:31 PM

రోడ్డు నిధుల ఆలస్యం.. ఆమరణ దీక్షకు సిద్ధమన్న కాంగ్రెస్ ఎమ్మెల్యే!

తెలంగాణలోని మానకొండూరు నియోజకవర్గ పరిధిలోని గుండ్లపల్లె నుంచి పొత్తూరు వరకు నిర్మించాల్సిన డబుల్ రోడ్డు పనులు తీవ్రంగా ఆలస్యం కావడంపై స్థానిక కాంగ్రెస్ ఎమ్మెల్యే కవ్వంపల్లి సత్యనారాయణ అసహనాన్ని వ్యక్తం చేశారు. రోడ్డు నిర్మాణానికి సంబంధించిన నిధుల విడుదల కోసం తాను చాలా రోజులుగా ఎదురుచూస్తున్నానని తెలిపారు. ప్రభుత్వం వెంటనే స్పందించి నిధులు మంజూరు చేయకపోతే తన నియోజకవర్గ ప్రజల రవాణా కష్టాలను తీర్చేందుకు ఆమరణ నిరాహార దీక్షకు దిగుతానని హెచ్చరించారు. రోడ్డు నిర్మాణ కాంట్రాక్టర్‌కు గతంలో చేసిన పనులకు సంబంధించిన పాత బకాయిలు రాకపోవడంతోనే నూతన పనులను ప్రారంభించేందుకు నిరాకరిస్తున్నట్లు ఎమ్మెల్యే వెల్లడించారు.

కోకాపేట్ నివాసంలో హరీశ్‌రావు ముందస్తు హౌస్ అరెస్ట్!తెలంగాణSwechaa19 Aug 2026, 12:22 PM

కోకాపేట్ నివాసంలో హరీశ్‌రావు ముందస్తు హౌస్ అరెస్ట్!

హైదరాబాద్ సనత్‌నగర్‌లోని టిమ్స్(TIMS) ఆసుపత్రిని పరిశీలనకు సిద్ధమైన మాజీ మంత్రి, సిద్దిపేట బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీశ్ రావును పోలీసులు కోకాపేట్‌లోని ఆయన నివాసంలో ముందస్తు జాగ్రత్త చర్యగా హౌస్ అరెస్ట్ చేశారు. ఆస్పత్రి వద్ద అక్కడ ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా, శాంతిభద్రతల సమస్యలు తలెత్తకుండా అరికట్టేందుకే ఈ నిర్ణయం తీసుకున్నట్లు పోలీసు యంత్రాంగం వెల్లడించింది. హరీశ్ రావు పర్యటన పిలుపు నేపథ్యంలో తెల్లవారుజాము నుంచే కోకాపేట్‌లోని ఆయన నివాస పరిసర ప్రాంతాల్లో పోలీసులు భారీగా మోహరించారు.

నిర్మాతగా నందమూరి తారకరామారావు!సినిమాSwechaa19 Aug 2026, 11:55 AM

నిర్మాతగా నందమూరి తారకరామారావు!

Jr.NTR: తాజాగా ఫిల్మ్ సర్కిల్స్‌లో వినిపిస్తున్న దాని ప్రకారం ఎన్టీఆర్ కూడా సొంతగా ఓ నిర్మాణ సంస్థను ప్రారంభించే ఆలోచనలో ఉన్నాడట. అంతేకాదు, దీనికి ఓ వెరైటీ పేరును కూడా పెట్టినట్టు తెలుస్తోంది. తారక్ పేరునే ఎంటర్టైన్మెంట్ (NTRTAIN) ఎంటర్టైన్ గా ఈ బ్యానర్ కి పెట్టినట్టు సమాచారం. చూడాలి, మరి దీనిపై మరిన్ని డీటెయిల్స్ త్వరలోనే రానున్నాయని తెలుస్తోంది. నిర్మాతగా తారక్ నుంచి ఎలాంటి కంటెంట్ ఉండే సినిమాలు వస్తాయో.

22A Controversy: ధరణి, భూ భారతి, 22ఏ దోపిడీ.. ముందే హెచ్చరించిన ‘స్వేచ్ఛ’!స్వేచ్ఛ ఛైర్మన్ డెస్క్Swechaa19 Aug 2026, 11:12 AM

22A Controversy: ధరణి, భూ భారతి, 22ఏ దోపిడీ.. ముందే హెచ్చరించిన ‘స్వేచ్ఛ’!

 తెలంగాణలో భూ సమస్యలు, 22ఏ నిషేధిత జాబితా ముసుగులో జరుగుతున్న అన్యాయాలపై 'స్వేచ్ఛ దినపత్రిక' మొదటి నుంచి చేస్తున్న హెచ్చరికలు అక్షరాలా నిజమవుతున్నాయి. డిజిటలైజేషన్ పేరిట సామాన్యుల ఆస్తులను హరించేందుకు సాగుతున్న మహా కుట్రను ‘స్వేచ్ఛ’ ముందే ఊహించి బయటపెట్టగా, తాజాగా తెలంగాణ సమాఖ్య ఆధ్వర్యంలో జరిగిన సదస్సులో భూ నిపుణులు, విశ్రాంత అధికారులు, భూ బాధితులు అదే విషయాన్ని స్పష్టం చేశారు. భూమిని ఒక వ్యాపార వస్తువుగా మార్చి డిజిటల్ రికార్డుల మానిప్యులేషన్‌తో సామాన్యులను ముంచెత్తుతున్న తీరుపై నిపుణులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.

రికార్డు స్థాయిలో తిరుమల శ్రీవారి హుండీ ఆదాయం!ఏపీSwechaa19 Aug 2026, 11:08 AM

రికార్డు స్థాయిలో తిరుమల శ్రీవారి హుండీ ఆదాయం!

తిరుమల శ్రీవారిని దర్శించుకునే వారి సంఖ్య ఏమాత్రం తగ్గడం లేదు. నిత్యం భక్తుల రద్దీతో కళకళలాడుతున్న తిరుమలకు.. వీకెండ్ వస్తే చాలు భక్తులు పోటెత్తుతున్నారు. ఈ క్రమంలో రోజు సుమారుగా 60వేల నుంచి లక్ష వరకు భక్తులు స్వామిని దర్శించుకుంటున్నారని ఆలయ అధికారులు చెబుతున్నారు. ఇక తిరుమలలో రద్దీ పెరగడంతో తిరుమల శ్రీవారి హుండీ ఆదాయంలో సరికొత్త రికార్డు క్రియేట్ అయ్యింది. మంగళవారం ఆదాయం రూ.6 కోట్ల మార్క్ దాటేసింది. నిన్న ఒక్కరోజే రూ.6.12 కోట్ల ఆదాయం వచ్చింది.

BC రిజర్వేషన్‌తో చంద్రబాబు మాస్టర్ ప్లాన్? ఏపీ రాజకీయాల్లో కొత్త లెక్కలుఏపీSwechaa19 Aug 2026, 11:00 AM

BC రిజర్వేషన్‌తో చంద్రబాబు మాస్టర్ ప్లాన్? ఏపీ రాజకీయాల్లో కొత్త లెక్కలు

ఏపీలో BC రిజర్వేషన్ పెంపు కేవలం స్థానిక ఎన్నికల లెక్కలను మాత్రమే మార్చుతుందా? లేక 2029 అసెంబ్లీ ఎన్నికల వరకు ప్రభావం చూపే కొత్త రాజకీయ సమీకరణాలకు బీజం వేస్తుందా? అన్నదే ఇప్పుడు ఏపీ రాజకీయాల్లో ప్రధాన చర్చగా మారింది.

Telangana: తెలంగాణ భూములపై 22A పెద్ద కుట్ర!..తెలంగాణSwechaa19 Aug 2026, 10:25 AM

Telangana: తెలంగాణ భూములపై 22A పెద్ద కుట్ర!..

హైదరాబాద్ బషీర్‌బాగ్ ప్రెస్‌క్లబ్‌లో ధరణి, భూ భారతి, 22ఏ సృష్టించిన సమస్యలపై చర్చిద్దాం, ప్రభుత్వాన్ని నిలదీద్దాం, పరిష్కార మార్గాలు చూపుదాం పేరుతో ప్రత్యేక సమావేశం జరిగింది. తెలంగాణ సమాఖ్య ఆధ్వర్యంలో జరిగిన ఈ సమావేశంలో భూ నిపుణులు, రిటైర్డ్ ఆఫీసర్లు, 30 మంది వరకు భూ బాధితులు పాల్గొన్నారు. ధరణి, భూ భారతి, 22ఏ భూ బాధితులు తమ సమస్యలను విన్నవించుకున్నారు. తమ భూములకు రక్షణ లేకుండా పోయిందని ఆవేదన వ్యక్తం చేశారు. రేవంత్ సర్కార్‌పై నిపుణులు ధ్వజమెత్తారు. చట్టాల మాటున భూములు లాక్కునే ప్రయత్నం చేస్తున్నారని ఆరోపించారు. ప్రజా పాలన అంటూనే సీఎం రేవంత్ రెడ్డి ప్రజలను మానసిక క్షోభకు గురి చేస్తున్నారని మండిపడ్డారు. ఇప్పటికైనా ప్రజలు మేల్కోవాలని ప్రభుత్వంపై ఒత్తిడి తెచ్చేలా పోరాటాలు చేయాలని పిలుపునిచ్చారు.

చిన్న చిప్‌.. పెద్ద గేమ్! చైనా ఆధిపత్యానికి భార‌త్ చెక్!వ్యాపారంSwechaa19 Aug 2026, 10:04 AM

చిన్న చిప్‌.. పెద్ద గేమ్! చైనా ఆధిపత్యానికి భార‌త్ చెక్!

ఈరోజు మన చేతిలో కనిపించేది కొన్ని మిల్లీమీటర్ల పరిమాణంలో ఉన్న ఒక చిన్న చిప్‌ మాత్రమే కావచ్చు. కానీ ఆ చిన్న చిప్‌ వెనుక జరుగుతున్న పోటీ మాత్రం.. రేపటి ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో భారత్‌ స్థాయిని నిర్ణయించేంత పెద్దది. ఈ నేపథ్యంలో ప్రభుత్వం తీసుకొస్తున్న సెమీకండక్టర్‌ మిషన్‌ 2.0 కూడా కీలకంగా మారుతోంది.

ఆగస్టు 29 డెడ్‌లైన్‌.. డిమాండ్లు పరిష్కరించకపోతే దేశవ్యాప్తంగా రైతు ఉద్యమం!..NationalSwechaa19 Aug 2026, 09:57 AM

ఆగస్టు 29 డెడ్‌లైన్‌.. డిమాండ్లు పరిష్కరించకపోతే దేశవ్యాప్తంగా రైతు ఉద్యమం!..

భారత్‌-అమెరికా వాణిజ్య ఒప్పందాన్ని వ్యతిరేకిస్తూ, తమ డిమాండ్లపై కేంద్ర ప్రభుత్వం తిరిగి చర్చలు ప్రారంభించాలని కోరుతూ రైతులు చేపట్టిన నిరసనలు మంగళవారం నాటికి మూడో రోజుకు చేరాయి. ఢిల్లీకి పాదయాత్రగా వెళ్లేందుకు అనుమతించాలని, తమ డిమాండ్లను పరిష్కరించాలని రైతు సంఘాల నేతలు కేంద్రాన్ని డిమాండ్‌ చేస్తున్నారు. తమ డిమాండ్లను ఆగస్టు 29లోగా పరిష్కరించకపోతే దేశవ్యాప్తంగా నిరసనలు చేపడతామని రైతు సంఘాల నేతలు హెచ్చరించారు. అవసరమైతే మహా పంచాయత్‌ నిర్వహించి ఉద్యమాన్ని మరింత ఉధృతం చేస్తామని స్పష్టం చేశారు.

Husharu Pittalu: టైటిలే ఛాండాలం..సినిమా ఇంకా?సినిమాSwechaa19 Aug 2026, 09:55 AM

Husharu Pittalu: టైటిలే ఛాండాలం..సినిమా ఇంకా?

Husharu Pittalu: Husharu Pittalu: మనం సమాజానికి మంచి చేయకపోయినా పర్లేదు గాని, చెడు మాత్రం చేయకూడదు. ఇప్పటి తరం యూత్ అత్యధికంగా అడిక్ట్ అవుతుంది కొన్ని అడల్ట్ కంటెంట్ సినిమాలకి. ప్రజల మీద, ప్రేక్షకుల మీద, సినీ ప్రేమికుల మీద, అభిమానుల మీద ఎక్కువగా ప్రభావం చూపేది సినిమా. అత్యంత పవర్ ఫుల్ మాధ్యమం సినిమా. అలాంటి సినిమా వల్ల కోట్లు సంపాదించడమే లక్ష్యంగా కొందరు బూతు సినిమాలను తీసి యువతను పక్కదోవ పట్టిస్తున్నారు అనడానికి ఇటీవల వచ్చిన హుషారు పిట్టలు సినిమానే ఉదాహరణ.

RBI new rules: ఆర్బీఐ కొత్త రూల్స్.. హోమ్ లోన్ ఈఎంఐలపై డబుల్ ఎఫెక్ట్!వ్యాపారంSwechaa19 Aug 2026, 09:51 AM

RBI new rules: ఆర్బీఐ కొత్త రూల్స్.. హోమ్ లోన్ ఈఎంఐలపై డబుల్ ఎఫెక్ట్!

హోమ్ లోన్ తీసుకున్న వారికి రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) తీపితో పాటు చేదు లాంటి ఒక వార్త చెప్పింది. ఫ్లోటింగ్ వడ్డీ రేట్లపై రుణాలు తీసుకున్న వారి కోసం ఆర్బీఐ కొత్త నిబంధనల ముసాయిదాను సిద్ధం చేసింది. దీని ప్రకారం, బ్యాంకులు ఇకపై ప్రతి మూడు నెలలకోసారి వడ్డీ రేట్లను తప్పనిసరిగా రీసెట్ చేయాల్సి ఉంటుంది. మరి ఈ కొత్త మార్పు వల్ల మీ నెలవారీ ఈఎంఐ పెరుగుతుందా? లేక తగ్గుతుందా? సాధారణ వినియోగదారులపై దీని ప్రభావం ఎలా ఉండబోతోందో ఇప్పుడు చూద్దాం.

‘టాక్సిక్’కి ఏపీలో టికెట్ రేట్ పెంచుకోవచ్చా? అదెట్లా!సినిమాSwechaa19 Aug 2026, 09:30 AM

‘టాక్సిక్’కి ఏపీలో టికెట్ రేట్ పెంచుకోవచ్చా? అదెట్లా!

Yash-Toxic: కోలీవుడ్ అగ్ర నిర్మాణ సంస్థ కేవీఎన్ ప్రొడక్షన్స్ తో మాన్‌స్టర్ మైండ్ క్రియేషన్స్, ఎల్‌ఎల్‌పి బ్యానర్స్ కలిసి ‘టాక్సిక్’ ని భారీ బడ్జెట్‌తో నిర్మించారు. కోనంకి వెంకట నారాయణ అలాగే హీరో యష్ కలిసి నిర్మాతలు . కియారా అద్వానీ, హ్యూమ ఖురేషి, తారా సుతారియా, రుక్మిణి వసంత్, నయనతార ఇతర కీలక పాత్రల్లో నటించారు. ఆగస్టు 26న పాన్ ఇండియా లెవల్‌లో ఈ సినిమా రిలీజ్ కాబోతున్న నేపథ్యంలో రెండు తెలుగు రాష్ట్రాలలో టికెట్ రేట్లను పెంచనున్నట్టుగా ప్రచారం జరుగుతోంది.

వనపర్తి కాంగ్రెస్‌లో ముదిరిన పంచాయితీ.. నేతల మధ్య వివాదంపై అధిష్టానం ఫోకస్!..తెలంగాణSwechaa19 Aug 2026, 09:14 AM

వనపర్తి కాంగ్రెస్‌లో ముదిరిన పంచాయితీ.. నేతల మధ్య వివాదంపై అధిష్టానం ఫోకస్!..

వనపర్తి కాంగ్రెస్‌లో ముదిరిన అంతర్గత విభేదాలు ఇప్పుడు అధిష్టానం ముందుకు చేరాయి. ఎమ్మెల్యే మెగా రెడ్డి, రాష్ట్ర ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షుడు చిన్నారెడ్డి మధ్య కొంతకాలంగా కొనసాగుతున్న మాటల యుద్ధం.. తాజాగా ఫిర్యాదు దశకు చేరింది. కాంగ్రెస్, ఎమ్మెల్యే టికెట్ కేటాయింపుపై చిన్నారెడ్డి చేసిన వ్యాఖ్యలను తప్పుబట్టిన మెగా రెడ్డి.. పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్‌కు ఫిర్యాదు చేశారు. ఈ వ్యవహారంపై ఏఐసీసీ ఇన్‌చార్జ్ మీనాక్షి నటరాజ్ కూడా ఆరా తీశారు. చిన్నారెడ్డి వ్యాఖ్యల వీడియోలను పరిశీలిస్తున్నట్టు అధిష్టానం తెలిపింది.

Iran Response: హర్మూజ్ తమదని ట్రంప్ సంచలన పోస్ట్.. తీవ్రంగా ఖండించిన ఇరాన్!InternationalSwechaa19 Aug 2026, 09:11 AM

Iran Response: హర్మూజ్ తమదని ట్రంప్ సంచలన పోస్ట్.. తీవ్రంగా ఖండించిన ఇరాన్!

అంతర్జాతీయంగా అత్యంత కీలకమైన సముద్ర మార్గమైన హర్మూజ్ జలసంధిని ‘అమెరికా నూతన భూభాగం’ (NEW U.S. Territory) అని అభివర్ణిస్తూ అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తన ట్రూత్ సోషల్ మీడియా ఖాతాలో ఓ మ్యాప్‌ను పోస్ట్ చేయడం ప్రపంచవ్యాప్తంగా తీవ్ర కలకలం రేపింది. ఇరాన్‌తో కుదిరిన 60రోజుల అవగాహన ఒప్పందం గడువు ముగిసిన మరుసటి రోజే ఈ కీలక పరిణామం చోటుచేసుకుంది. జలసంధిలో సముద్ర గర్భంలో అమర్చిన మైన్‌లన్నింటినీ తొలగించామని లేదా నిర్వీర్యం చేశామని, నౌకా రవాణా కార్యకలాపాలను యథావిధిగా పునరుద్ధరించామని ట్రంప్ తన సందేశంలో పేర్కొన్నారు.

శ్రీ రాముడిలో వున్న ఈ గొప్పతనం ఎందరికి తెలుసు!..SpiritualitySwechaa19 Aug 2026, 08:51 AM

శ్రీ రాముడిలో వున్న ఈ గొప్పతనం ఎందరికి తెలుసు!..

శ్రీరాముడు అనగానే మనకు గుర్తుకొచ్చేది ధర్మానికి నిలువెత్తు ప్రతిరూపం!.. జీవితంలో ఎన్ని కష్టాలు ఎదురైనా... పరిస్థితులు ఎంత ప్రతికూలంగా మారినా... ఇచ్చిన మాటను, ధర్మాన్ని, సత్యాన్ని విడిచిపెట్టని మహోన్నత వ్యక్తిత్వం ఆ రామయ్యది.. అందుకే శ్రీరాముడిని మర్యాదా పురుషోత్తముడిగా, ధర్మమూర్తిగా భారతీయులు ఆరాధిస్తారు. లోకమంతా ఆయననే ఎందుకు ఆదర్శంగా తీసుకుంటుందంటే దానికి కారణం..ఆయన ధర్మాన్ని సంపూర్ణంగా ఆచరించాడు. ధర్మానికి రూపునిస్తే రాముడి రూపం వస్తుందన్నంత పవిత్రంగా జీవించాడు. చేతికి అందివచ్చిన సింహాసనం దక్కక పోయినా, స్వయంగా భరతుడే వచ్చి రాజ్యానికి రమ్మని అడిగినా, ప్రాణం కన్న మిన్నగా ప్రేమించిన సీతను రావణుడు అపహరించినా, సందర్భమేదైనా కానీ.. ధర్మాన్ని విడిచిపెట్టలేదు. అందుకే రామయ్య ధర్మమూర్తి అయ్యాడు. లోకానికి ఒకే ఒక్కడుగా నిలిచాడు...

నిజమైన స్నేహితులను ఈ సంకేతాలతో గుర్తించండి!..అభిప్రాయంSwechaa19 Aug 2026, 08:41 AM

నిజమైన స్నేహితులను ఈ సంకేతాలతో గుర్తించండి!..

స్నేహం అంటే బాల్యం, కౌమారం, యవ్వనంలో కలిసే బంధాలు కాదు.. కొందరి జీవితాల్లో ఈ దశలో కలిగిన పరిచయాలు కూడా బలంగా మారవచ్చు.. అయితే ప్రత్యేకంగా 40 ఏళ్లు దాటిన తర్వాత స్నేహం అర్థం పూర్తిగా మారిపోతుందని మానసిక నిపుణులు చెబుతున్నారు.. చిన్నప్పుడు ఎక్కువ మంది స్నేహితులు ఉండటం ఆనందంగా అనిపిస్తుంది. కానీ వయసు పెరిగేకొద్దీ పరిచయాలు పెరగడం కంటే.. మనసును అర్థం చేసుకునే మనుషులు ఉండటం ముఖ్యం అవుతుంది. మరోవైపు 40 వయస్సుకు జీవితంలో బాధ్యతలు పెరుగుతాయి. కుటుంబం, ఉద్యోగం, పిల్లలు, ఆర్థిక పరిస్థితులు, ఆరోగ్యం.. ఇలా ప్రతి ఒక్కరి జీవితంలో ఎన్నో మార్పులు చోటు చేసుకుంటాయి. ఈ మార్పుల మధ్య కూడా మనసులో మన స్థానాన్ని మార్చుకోని కొందరు ఉంటారు. వాళ్లే నిజమైన స్నేహితులుగా పేర్కొంటారు.

నమస్కారంలో దాగి ఉన్న ఆథ్యాత్మిక రహస్యం మీకు తెలుసా?SpiritualitySwechaa19 Aug 2026, 08:28 AM

నమస్కారంలో దాగి ఉన్న ఆథ్యాత్మిక రహస్యం మీకు తెలుసా?

ఆధ్యాత్మిక దృష్టితో చూస్తే నమస్కారం అనేది కేవలం ఒక శారీరక చర్య కాదు. అది మనిషిలోని అహంకారాన్ని కరిగించే సాధన. తనను తాను భగవంతుని చైతన్యానికి సమర్పించుకునే పవిత్రమైన ప్రక్రియ. మనిషి తన శిరస్సును వంచినప్పుడు వంగేది కేవలం శరీరం కాదు.. తనలోని నేను అనే అహంకారం. చేతులు జోడించినప్పుడు రెండు చేతులు మాత్రమే కలవకూడదు.. మనస్సు కూడా భాగ్యవంతునితో ఏకమవ్వాలి. అప్పుడే నమస్కారానికి నిజమైన అర్థం లభిస్తుందని చెబుతారు. నమః అంటే శరణాగతి.. సమర్పణ.. అహంకార త్యాగం.. నేనే చేశాను.. నాకే అన్నీ తెలుసు.. నాదే గొప్ప అనే భావనకు బదులుగా.. నీవే కర్త.. నీవే రక్షకుడు.. నీవే నా ఆధారం.. నేను నీ శరణాగతుడను అనే భావన కలగాలి. అప్పుడే నమస్కారం ఒక శారీరక చర్య నుంచి ఆధ్యాత్మిక సాధనగా మారుతుందని పండితులు చెబుతారు.

22A Lands Row: 22ఏ వివాదం.. ఆందోళన వద్దు.. నెలాఖరు వరకు పరిష్కరిస్తాంతెలంగాణSwechaa19 Aug 2026, 12:05 AM

22A Lands Row: 22ఏ వివాదం.. ఆందోళన వద్దు.. నెలాఖరు వరకు పరిష్కరిస్తాం

22A Lands Row: 22 ఏ నిషేదిత జాబితా అప్ డేట్ లో అధికారుల పొరపాటుతో ఇబ్బందులు వచ్చాయని రాష్ట్ర రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస రెడ్డి చెప్పారు. ఇప్పటికే 22 ఏ రిజిస్ట్రేషన్ సమస్యను పరిష్కరిస్తున్నామని వెల్లడించారు. నిన్న దాదాపు 5కు పైగా 22ఏ జాబితా రిజిస్ట్రేషన్లు జరిగాయని తెలిపారు. గ్రేటర్ పరిధిలో ఉన్న పలు సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాలను సందర్శిస్తానని మీడియాతో చిట్ చాట్ లో మంత్రి పొంగులేటి వెల్లడించారు.

విదేశీ పర్యటనకు సీఎం రేవంత్.. 11 రోజులు అక్కడే..తెలంగాణSwechaa18 Aug 2026, 11:52 PM

విదేశీ పర్యటనకు సీఎం రేవంత్.. 11 రోజులు అక్కడే..

తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి విదేశాల్లో పర్యటించనున్నారు. ముందుగా యూకే వెళ్లనున్నారు. ఆ తర్వాత అమెరికాలో పర్యటిస్తారు. మంగళవారం రాత్రి ఢిల్లీకి బయలుదేరి వెళ్లారు. బుధవారం జరిగే కాంగ్రెస్ పార్టీ వర్కింగ్ కమిటీ సమావేశంలో ‌పాల్గొననున్నారు. తెలంగాణ రాష్ట్రం నుండి సీఎం సహా పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్, మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి, దామోదర రాజనర్సింహ, వంశీచందర్ రెడ్డిలు ఈ మీటింగ్ లో పాల్గొంటారు.

2రోజుల్లో రిజిస్ట్రేషన్.. 22ఏ భూముల వివాదంలో సీఎం రేవంత్ కీలక ఆదేశాలుతెలంగాణSwechaa18 Aug 2026, 11:32 PM

2రోజుల్లో రిజిస్ట్రేషన్.. 22ఏ భూముల వివాదంలో సీఎం రేవంత్ కీలక ఆదేశాలు

22-ఏ నిషేధిత భూముల రిజిస్ట్రేష‌న్ల అంశంపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి, ఉన్నతాధికారుల‌తో స‌మీక్ష నిర్వహించారు. ప్రజల ఆస్తి హక్కుల పరిరక్షణకు తమ ప్రభుత్వం కృత నిశ్చయంతో ఉందని స్పష్టం చేశారు. ఆస్తులు కలిగిన వారు రిజిస్ట్రేషన్ చేసుకోవడానికి ఎటువంటి ఆటంకాలు ఉండ‌కుండా ప్రభుత్వం చర్యలు చేపడుతుందని చెప్పారు.

భూములమ్మి 10లక్షల కోట్లు సంపాదించాలని కుట్రతెలంగాణSwechaa18 Aug 2026, 11:29 PM

భూములమ్మి 10లక్షల కోట్లు సంపాదించాలని కుట్ర

తెలంగాణ రాష్ట్రంలో పారదర్శకమైన భూ చట్టం వస్తుంది అనుకున్నామని కానీ అందుకు భిన్నంగా జరిగిందని బీజేపీ ఎంపీ ఈటల రాజేందర్ అన్నారు. కేసీఆర్ తీసుకొచ్చిన ధరణితో.. కొండనాలుకకు మందు వేస్తే ఉన్న నాలుక పోయినట్టు అయ్యిందన్నారు. పేదలకు భూములపై హక్కులను కాలరాశారని, ఎన్నో ఏళ్లుగా సాగు చేసుకుంటున్న వాళ్ల నోట్లో మట్టికొట్టారని మండిపడ్డారు. ధరణిని రద్దు చేస్తాం, బంగాళాఖాతంలో వేస్తామని ఎన్నికలప్పుడు రేవంత్ రెడ్డి హామీ ఇచ్చారు.. రద్దు దేవుడెరుగు.. ఇప్పుడు తెచ్చిన భూభారతి పేదలను నిండా ముంచిందని ధ్వజమెత్తారు.

Harish Rao:22ఏ ముసుగులో మీ కబ్జా భూములు రెగులరైజ్ చేస్తే ఖబర్దార్తెలంగాణSwechaa18 Aug 2026, 11:08 PM

Harish Rao:22ఏ ముసుగులో మీ కబ్జా భూములు రెగులరైజ్ చేస్తే ఖబర్దార్

“22A ముసుగులో ఆక్రమించిన లేదా వివాదాస్పద భూములను తొలగిస్తే మాత్రం బీఆర్‌ఎస్ ఊరుకోదు” అని రేవంత్ సర్కార్ ను హెచ్చరించారు హరీశ్ రావు. “అధికారుల్లారా.. తప్పులు మంత్రులు చేస్తారు.. నెపం మాత్రం మీ మీదకు నెడతారు. ముఖ్యమంత్రి, మంత్రుల ఆదేశాలు లేకుండా రాష్ట్రవ్యాప్తంగా ఇంత పెద్ద ఎత్తున జాబితాలు మార్చడం సాధ్యమా? మీరు చెప్పినట్లు తప్పులు చేస్తే చివరకు మీరు ఇరుక్కుంటారు. మీరు బాధపడాల్సి వస్తుంది. ముక్కుసూటిగా పనిచేయండి. తప్పు చేయకండి.. బలికాకండి” అని అధికారులకు సూచించారు.

‘#Mega158’: మెగాస్టార్ చిరంజీవి-బాబీ సినిమా నుంచి క్రేజీ అప్‌డేట్సినిమాSwechaa18 Aug 2026, 10:46 PM

‘#Mega158’: మెగాస్టార్ చిరంజీవి-బాబీ సినిమా నుంచి క్రేజీ అప్‌డేట్

‘#Mega158’: చిరంజీవికి ఇంతకముందు వాల్తేరు వీరయ లాంటి సాలీడ్ కమర్షియల్ హిట్ ఇచ్చిన దర్శకుడు బాబీ రూపొందిస్తున్న సినిమా మెగా 158. ఈ సినిమా టైటిల్ కూడా ఇటీవల మెగాస్టార్ రివీల్ చేశాడు. కదిరి తో మొదలవుతుంది. కదిరి లేదా కదిరి నరసింహా రెడ్డి..ఈ రెండిట్లో ఒకటి ఫిక్స్ అని కూడా చెప్పుకుంటున్నారు. ఇక, తాజాగా మెగా 158 షూటింగ్ లో 40 రోజుల టాకీ పార్ట్ పూర్తైంది. ఈ విషయాన్ని మేకర్స్ అధికారికంగా ప్రకటించారు.