స్వేచ్ఛ షార్ట్స్ — తాజా తెలుగు వార్తలు

‘#Mega158’: మెగాస్టార్ చిరంజీవి-బాబీ సినిమా నుంచి క్రేజీ అప్‌డేట్సినిమాSwechaa18 Aug 2026, 10:46 PM

‘#Mega158’: మెగాస్టార్ చిరంజీవి-బాబీ సినిమా నుంచి క్రేజీ అప్‌డేట్

‘#Mega158’: చిరంజీవికి ఇంతకముందు వాల్తేరు వీరయ లాంటి సాలీడ్ కమర్షియల్ హిట్ ఇచ్చిన దర్శకుడు బాబీ రూపొందిస్తున్న సినిమా మెగా 158. ఈ సినిమా టైటిల్ కూడా ఇటీవల మెగాస్టార్ రివీల్ చేశాడు. కదిరి తో మొదలవుతుంది. కదిరి లేదా కదిరి నరసింహా రెడ్డి..ఈ రెండిట్లో ఒకటి ఫిక్స్ అని కూడా చెప్పుకుంటున్నారు. ఇక, తాజాగా మెగా 158 షూటింగ్ లో 40 రోజుల టాకీ పార్ట్ పూర్తైంది. ఈ విషయాన్ని మేకర్స్ అధికారికంగా ప్రకటించారు.

Land Issues: 22-ఏ భూ బాధితుల సమావేశం.. భూ సమస్యలకు నిపుణులు సూచించిన పరిష్కారాలుఅభిప్రాయంSwechaa18 Aug 2026, 09:56 PM

Land Issues: 22-ఏ భూ బాధితుల సమావేశం.. భూ సమస్యలకు నిపుణులు సూచించిన పరిష్కారాలు

22-ఏ: హైదరాబాద్ బషీర్‌బాగ్ ప్రెస్‌క్లబ్‌లో ధరణి, భూ భారతి, 22ఏ సృష్టించిన సమస్యలపై.. చర్చిద్దాం, ప్రభుత్వాన్ని నిలదీద్దాం, పరిష్కార మార్గాలు చూపుదాం పేరుతో ప్రత్యేక సమావేశం జరిగింది. తెలంగాణ సమాఖ్య ఆధ్వర్యంలో జరిగిన ఈ సమావేశంలో భూ నిపుణులు, రిటైర్డ్ ఆఫీసర్లు, 30 మంది వరకు భూ బాధితులు పాల్గొన్నారు. ప్రభుత్వాలు చేస్తున్న తప్పులు ఏంటి? అసలు భూ సమస్యలు ఎందుకు వస్తున్నాయి? భూ సమస్యలకు పరిష్కారాలు ఏంటి? అనేది నిపుణులు వివరించడంతో పాటు పరిష్కారాలు సైతం సూచించారు.

NTR-TRIVIKRAM: గాడ్ ఆఫ్ వార్ కాదు మరో టైటిల్ ఫిక్సైందిగా..సినిమాSwechaa18 Aug 2026, 08:14 PM

NTR-TRIVIKRAM: గాడ్ ఆఫ్ వార్ కాదు మరో టైటిల్ ఫిక్సైందిగా..

NTR-TRIVIKRAM: గాడ్ఎన్టీఆర్-త్రివిక్రమ్ కాంబినేషన్‌లో ఓ ప్రతిష్టాత్మకమైన చిత్రం రూపొందనుంది. ఇప్పటికే, ఈ ప్రాజెక్ట్ ని అధికారికంగానూ ప్రకటించారు. ఇన్నాళ్ళు ఎన్టీఆర్-త్రివిక్రమ్ ల సినిమాకి టైటిల్ 'గాడ్ ఆఫ్ వార్' అని వార్తలు వచ్చాయి. దాదాపుగా అదే టైటిల్ కన్‌ఫర్మ్ అని అనుకున్నారు. కానీ, తాజాగా ఫిల్మ్ చాంబర్ లో మరో టైటిల్ ని కూడా రిజిస్టర్ చేయించారట. అదే, 'దేవసేనాపతి'. ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న డ్రాగన్ టైటిల్ కి ఈ టైటిల్ కి పూర్తి భిన్నంగా మేకర్స్ కథకి తగ్గ టైటిల్ పెట్టాలని దేవసేనాపతి అనే టైటిల్ కూడా రిజిస్టర్ చేయించారట.

22ఏ భూ బాధితుల సమావేశం.. ప్రధానంగా 4 తీర్మానాలు ప్రతిపాదనతెలంగాణSwechaa18 Aug 2026, 07:39 PM

22ఏ భూ బాధితుల సమావేశం.. ప్రధానంగా 4 తీర్మానాలు ప్రతిపాదన

22A Lands: హైదరాబాద్ బషీర్‌బాగ్ ప్రెస్‌క్లబ్‌లో ధరణి, భూ భారతి, 22ఏ సృష్టించిన సమస్యలపై.. చర్చిద్దాం, ప్రభుత్వాన్ని నిలదీద్దాం, పరిష్కార మార్గాలు చూపుదాం పేరుతో ప్రత్యేక సమావేశం జరిగింది. తెలంగాణ సమాఖ్య ఆధ్వర్యంలో జరిగిన ఈ సమావేశంలో భూ నిపుణులు, రిటైర్డ్ ఆఫీసర్లు, 30 మంది వరకు భూ బాధితులు పాల్గొన్నారు. ధరణి, భూ భారతి బాధితుల సమావేశం విజయవంతమైంది. ధరణి, భూ భారతి, 22ఏ భూ బాధితులు తమ సమస్యలను విన్నవించుకున్నారు. ఈ సమావేశంలో ప్రధానంగా 4 తీర్మానాలను ప్రతిపాదించారు. ఈ తీర్మానాలను స్వేచ్ఛ చైర్మన్ దేవేందర్ రెడ్డి చింతకుంట్ల తెలియజేశారు.

Naga Chaithanya: బ్లాక్ బస్టర్ దర్శకుడికి గ్రీన్ సిగ్నల్?సినిమాSwechaa18 Aug 2026, 06:28 PM

Naga Chaithanya: బ్లాక్ బస్టర్ దర్శకుడికి గ్రీన్ సిగ్నల్?

Naga Chaithanya: నాగ చైతన్య ఇప్పుడు తన 25వ సినిమాను వెంకీ అట్లూరో చేయడానికి ఆసక్తిగా ఉన్నాడట. తన ల్యాండ్ మార్క్ మూవీకి బ్లాక్ బస్టర్ డైరెక్టర్‌కి గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టుగా తెలుస్తోంది. చైతూ కూడా లవ్ స్టోరీ, తండేల్ సినిమాలతో వరుస హిట్స్ అందుకొని మంచి ఫాంలో ఉన్నాడు. తనకి కూడా ల్యాండ్ మార్క్ మూవీ చాలా ప్రత్యేకం. అక్కినేని నాగ చైతన్య ప్రస్తుతం వృష కర్మ అనే సినిమాను చేస్తున్న సంగతి తెలిసిందే. యంగ్ డైరెక్టర్ కార్తీక్ దండు దర్శకత్వంలో ఈ సినిమా రూపొందుతోంది. మీనాక్షి చౌదరి హీరోయిన్‌గా నటిస్తోంది.

బంగాళాఖాతంలో అల్పపీడనం.. ఈ ప్రాంత ప్రజలు అలర్ట్!..NationalSwechaa18 Aug 2026, 05:44 PM

బంగాళాఖాతంలో అల్పపీడనం.. ఈ ప్రాంత ప్రజలు అలర్ట్!..

బంగాళాఖాతంలో వాతావరణ పరిస్థితులు ఒక్కసారిగా మారిపోయాయి. వాయువ్య బంగాళాఖాతం, దానికి ఆనుకుని ఉన్న ఉత్తర ఒడిశా, పశ్చిమ బెంగాల్ తీర ప్రాంతాల్లో ఏర్పడిన అల్పపీడనం మరింత బలపడి తీవ్ర అల్పపీడనంగా మారింది. రాబోయే 24 గంటల్లో ఇది వాయువ్య దిశగా పయనిస్తూ వాయుగుండంగా బలపడే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ (ఐఎండీ) తెలిపింది. తుఫానుగా మారే అవకాశాలను కూడా ఉన్నాయని అధికారులు పేర్కొంటున్నారు.

ఈ ప్రభావంతో తూర్పు, మధ్య రాష్ట్రాలతో పాటు తెలుగు రాష్ట్రాల్లోనూ వాతావరణ పరిస్థితుల్లో మార్పులు చోటుచేసుకున్నాయి. ముఖ్యంగా ఉత్తర కోస్తాంధ్రపై ఈ ప్రభావం స్పష్టంగా కనిపించే అవకాశం ఉంది.

22A జాబితాపై సమగ్ర విచారణ.. బాధ్యులపై కఠిన చర్యలు!..తెలంగాణSwechaa18 Aug 2026, 05:13 PM

22A జాబితాపై సమగ్ర విచారణ.. బాధ్యులపై కఠిన చర్యలు!..

తెలంగాణలో 22A నిషేధిత భూముల జాబితా వ్యవహారం ఇప్పుడు సంచలనంగా మారింది. వరుసగా స్వేచ్ఛ న్యూస్లో వెలువడుతున్న కథనాలతో ఈ అంశంపై ప్రభుత్వం కూడా స్పందిస్తోంది. ఇప్పటికే పలువురు మంత్రులు 22A భూముల వ్యవహారంపై కీలక వ్యాఖ్యలు చేయగా.. తాజాగా మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. 22A జాబితాపై సమగ్ర విచారణ చేపడతామని.. బాధ్యులు ఎవరైనా కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. అసలు 22A జాబితాలో ఏం జరిగింది? దీని వెనుక ఎవరి పాత్ర ఉంది? త్వరలో శ్వేతపత్రం విడుదల చేస్తామన్న మంత్రి వ్యాఖ్యలు ఇప్పుడు చర్చనీయాంశంగా మారాయి.

Irumudi: సెన్సార్ పూర్తి (U/A)..ఇంత తక్కువ రన్‌టైమ్ అంటే బ్లాక్ బస్టర్ ఖాయంసినిమాSwechaa18 Aug 2026, 04:17 PM

Irumudi: సెన్సార్ పూర్తి (U/A)..ఇంత తక్కువ రన్‌టైమ్ అంటే బ్లాక్ బస్టర్ ఖాయం

Irumudi: మాస్ మహారాజ్ రవితేజ నటించిన లేటెస్ట్ మూవీ 'ఇరుముడి'. ఆగస్టు 21న రిలీజ్ కాబోతున్న నేపథ్యంలో ఒకవైపు సెన్సార్ కార్యక్రమాలు, ఇంకోవైపు రిలీజ్ కి సంబందించిన పనులను పూర్తి చేస్తున్నారు. దీనిలో భాగంగా 'ఇరుముడి' సినిమా సెన్సార్ పూర్తి చేసుకుంది. యు/ఎ సర్టిఫికెట్‌ని జారీ చేశారు. అంతేకాదు, ఈ సినిమా 2 గంటల 25 నిమిషాల షాకింగ్ రన్‌టైమ్ తో రిలీజ్ కాబోతోంది. ఇటీవల కాలంలో ఓ పెద్ద హీరో సినిమా ఇంత తక్కువ రన్‌టైమ్ తో వచ్చింది లేదు.

22-A పెద్ద కుట్ర.. మంత్రి పొంగులేటి రాజీనామా చేయాలి- తెలంగాణ సమాఖ్య డిమాండ్తెలంగాణSwechaa18 Aug 2026, 04:04 PM

22-A పెద్ద కుట్ర.. మంత్రి పొంగులేటి రాజీనామా చేయాలి- తెలంగాణ సమాఖ్య డిమాండ్

22ఏ పెద్ద కుట్ర అని తెలంగాణ సమాఖ్య ఆరోపించింది. మంత్రి పొంగులేటి శ్రీనివాస రెడ్డి క్షమాపణలు చెప్పడం కాదు రాజీనామా చేయాలని డిమాండ్ చేసింది. తప్పు చేసిన ఆఫీసర్లందరినీ వెంటనే సస్పెండ్ చేయాలంది. భూ యజమానులకు ఇచ్చిన 22ఏ నోటీసులు అన్నింటిని వెంటనే రద్దు చేయాలంది. భూ బాధితులు టోల్ ఫ్రీ నెంబర్ కు కాల్ చేసి బకరాలు కావొద్దని సూచించింది. పౌర సమాజం మేల్కోవాలని, ప్రభుత్వంపై ఒత్తిడి తేవాలని తెలంగాణ సమాఖ్య విజ్ఞప్తి చేసింది.

NBK 111: గోపీచంద్ మలినేనికి బాలయ్య ఫోన్!సినిమాSwechaa18 Aug 2026, 03:51 PM

NBK 111: గోపీచంద్ మలినేనికి బాలయ్య ఫోన్!

NBK 111: గోపీచంద్ మలినేనికి స్వయంగా బాలయ్య ఫోన్ చేసి వచ్చే నెల నుంచి షెడ్యూల్‌లో జాయిన్ అవుతానని చెప్పాడట. అందుకు, తగ్గట్టుగా షెడ్యూల్స్ ప్లాన్ చేయమని, సెప్టెంబర్ చివరికల్లా షూటింగ్ కంప్లీట్ చేసి వెంటనే పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ ని స్టార్ట్ చేద్దామని చెప్పాడట. వీలైనంత త్వరగా బాలయ్య పాల్గొనే సీన్స్ అలాగే, డబ్బింగ్ ని పూర్తి చేస్తానని చెప్పాడట.

2025 జాతీయ క్రీడా పురస్కారాల ప్రకటన.. 17 మందికి అర్జున అవార్డులు!క్రీడలుSwechaa18 Aug 2026, 03:10 PM

2025 జాతీయ క్రీడా పురస్కారాల ప్రకటన.. 17 మందికి అర్జున అవార్డులు!

కేంద్ర క్రీడల మంత్రిత్వ శాఖ 2025 ఏడాదికి సంబంధించిన ప్రతిష్ఠాత్మక జాతీయ క్రీడా పురస్కారాలను వెల్లడించింది. ప్రతిభావంతులైన 17మంది క్రీడాకారులను ఈసారి 'అర్జున' పురస్కారం వరించింది. చెస్ ప్రపంచకప్ విజేత దివ్యా దేశ్‌ముఖ్, డెకాథ్లాన్ ప్లేయర్ తేజస్విన్ శంకర్, బ్యాడ్మింటన్ స్టార్ గాయత్రి గోపీచంద్‌లతో పాటు గ్రాండ్‌మాస్టర్ విదిత్ గుజరాతీ, షట్లర్ ట్రెస్సా జోలీ, బాక్సర్ నరేందర్ బెర్వాల్, రైఫిల్ షూటర్ ధనుష్ శ్రీకాంత్ ఈ పురస్కారాల జాబితాలో నిలిచారు.

చట్టం ముసుగులో 'మహా దోపిడీ'!తెలంగాణSwechaa18 Aug 2026, 03:02 PM

చట్టం ముసుగులో 'మహా దోపిడీ'!

తెలంగాణలో 22ఏ నిషేధిత భూముల జాబితా వ్యవహారం అర్బన్ ల్యాండ్ సీలింగ్ కాదని, ఇది అక్షరాలా 'అర్బన్ పీపుల్స్ లూటింగ్' అని బీఆర్ఎస్ ఎమ్మెల్సీ దాసోజు శ్రవణ్ కుమార్ తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. ఎక్స్(X) వేదికగా ప్రభుత్వంపై ఆయన సంచలన ఆరోపణలు చేశారు. లైసెన్స్‌డ్ లూట్‌గా మారిన ఈ వ్యవస్థ వెనుక నాలుగు దశల మహాదోపిడీ కుట్ర దాగి ఉందని ధ్వజమెత్తారు. దశాబ్దాల కిందట కష్టపడి కొనుక్కున్న ప్లాట్లను, 30ఏళ్ల క్రితం రిజిస్ట్రేషన్ అయిన పట్టా భూములను రాత్రికి రాత్రే కంప్యూటర్లలో ఒక్క క్లిక్‌తో '22A నిషేధిత జాబితా'లోకి నెట్టేస్తూ ప్రజల్లో కృత్రిమ భయాందోళనలు సృష్టిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.

శక్తి స్కీం మాకొద్దు.. రేవంత్ ఎవరిని అడిగి తెచ్చారు? : పాలిటెక్నిక్ విద్యార్థులుతెలంగాణSwechaa18 Aug 2026, 02:28 PM

శక్తి స్కీం మాకొద్దు.. రేవంత్ ఎవరిని అడిగి తెచ్చారు? : పాలిటెక్నిక్ విద్యార్థులు

రేవంత్ సర్కార్ ఇటీవల తీసుకొచ్చిన శక్తి స్కీం పట్ల పాలిటెక్నిక్ విద్యార్థులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. సోమవారం రాష్ట్రవ్యాప్తంగా విద్యార్థినీవిద్యార్థులు రోడ్డెక్కి నిరసన ప్రదర్శనలు చేపట్టారు. సీఎం రేవంత్ తీసుకొచ్చిన శక్తి స్కీం వలన మూడు సంవత్సరాల సమయం వృథా అవుతోందని ఆవేదన వ్యక్తం చేశారు. పాలిటెక్నిక్ చేసిన తాము ఇంజినీరింగ్ చేయాలంటే మళ్లీ ఇంటర్ చేసి రావాలని నిబంధనం పెట్టడం సరికాదని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇదిలాఉండగా, యంగ్ ఇండియా స్కిల్ యూనివర్సిటీ పేరుతో GO 97ని తీసుకొచ్చి డిప్లొమా కోర్సులను ఐటీఐ, ఏటీసీలతో అనుసంధానం చేయడం వల్ల డిప్లొమా విద్య ప్రాధాన్యత తగ్గుతుందని విద్యార్థులు ఆందోళన చెందుతున్నారు. జీవో నెంబర్ 97ను వెంటనే రద్దు చేయాలని వికారాబాద్ పట్టణంలోని పాలిటెక్నిక్ విద్యార్థులు ఆందోళనకు దిగారు.

విద్యార్థినులతో లెక్చరర్ అసభ్య ప్రవర్తన.. చితకబాదిన స్టూడెంట్స్తెలంగాణSwechaa18 Aug 2026, 02:10 PM

విద్యార్థినులతో లెక్చరర్ అసభ్య ప్రవర్తన.. చితకబాదిన స్టూడెంట్స్

మంచి చెడులు బోధించాల్సిన ఉపాధ్యాయులే విలువలు మర్చిపోతున్నారు.తల్లిదండ్రుల తర్వాత గురువులకే అంతటి ప్రాధాన్యం ఇవ్వాలని స్కూల్లో పాఠాలు బోధించే కొందరు గురువుల బుద్ధి గతి తప్పుతోంది. ఫలితంగా ఉపాధ్యాయ వృత్తికి వారు కళంకం తీసుకొస్తున్నారు. ఓ లెక్చరర్ విద్యార్థినులతో అసభ్యంగా ప్రవర్తించడంతో విద్యార్థి సంఘాల నాయకులు, విద్యార్థినులు అతనికి గట్టిగా బుద్ధి చెప్పారు.నల్లగొండ జిల్లా దేవరకొండ ప్రభుత్వ జూనియర్ బాలికల కాలేజీలో ఈ ఘటన సోమవారం ఉదయం వెలుగుచూసింది. తెలుగు ఉపాధ్యాయుడు భాస్కర్ గత కొంతకాలంగా విద్యార్థినుల పట్ల అసభ్యంగా ప్రవర్తిస్తున్నాడని ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఈ క్రమంలోనే విద్యార్థి సంఘాల నాయకులు ఇవాళ ఉదయం కళాశాల ఎదుట ధర్నా నిర్వహించారు. అదే సమయంలో అక్కడకు వచ్చిన ఉపాధ్యాయుడు భాస్కర్‌పై విద్యార్థినులు, విద్యార్థి సంఘాల నేతలు దాడికి పాల్పడ్డారు. కళాశాల వద్ద ఒక్కసారిగా తీవ్ర ఉద్రిక్త వాతావరణం చోటుచేసుకుంది.

VenkeyAnil5: అనిల్ మల్టీస్టారర్ టైటిల్ ఫిక్స్..ఈసారి ఫ్యాక్షన్‌తో ఫన్!సినిమాSwechaa18 Aug 2026, 02:06 PM

VenkeyAnil5: అనిల్ మల్టీస్టారర్ టైటిల్ ఫిక్స్..ఈసారి ఫ్యాక్షన్‌తో ఫన్!

VenkeyAnil5: అనిల్ రావిపూడి, విక్టరీ వెంకటేష్‌ల కాంబినేషన్‌లో 5వ సినిమాను రూపొందిస్తున్న సంగతి తెలిసిందే. నందమూరి కళ్యాణ్ రామ్ మరో హీరోగా నటిస్తున్నాడు. ఈ సినిమాకి ఓ ఆసక్తికరమైన టైటిల్‌ను రిజిస్టర్ చేయించారట. ప్రస్తుతం ఫిల్మ్ సర్కిల్స్‌లో వినిపిస్తున్న దాని ప్రకారం ‘బాల్రెడ్డి బామ్మర్ది’ అనే వెరైటీ టైటిల్‌ని పెట్టబోతున్నారట. ఇది, వినడానికి ఫన్‌గా ఉంది.

తిరుమలలో వాహనాల పార్కింగ్ కొరత.. భక్తులకు తప్పని తిప్పలు!ఏపీSwechaa18 Aug 2026, 01:55 PM

తిరుమలలో వాహనాల పార్కింగ్ కొరత.. భక్తులకు తప్పని తిప్పలు!

తిరుమల కొండపై కొత్త సమస్య ఆందోళన కలిగిస్తోంది. రోజూ వేలాది సంఖ్యలో తరలివచ్చే భక్తుల తాకిడితో పాటు, అదే స్థాయిలో చేరుతున్న ప్రైవేట్ వాహనాలతో ఏడుకొండలు కిటకిటలాడుతున్నాయి. సొంత వాహనాల్లో వచ్చే భక్తుల సంఖ్య రెట్టింపు కావడంతో పార్కింగ్ కొరత ఏర్పడుతోంది. అంతేకాకుండా పర్యావరణ కాలుష్యం, ఘాట్ రోడ్డు ప్రమాదాలు టీటీడీ పరిపాలనా యంత్రాంగానికి పెను సవాళ్లుగా మారుతున్నాయి. ప్రస్తుతం తిరుమలలో ఉన్న 16పార్కింగ్ కేంద్రాల్లో కేవలం 6వేల నుంచి 7వేల వాహనాలను మాత్రమే నిలిపేందుకు వీలుంది.

Mega 158: ఆగస్టు 22న నేరుగా థియేటర్స్‌కే వచ్చేస్తున్న మెగాస్టార్!సినిమాSwechaa18 Aug 2026, 01:50 PM

Mega 158: ఆగస్టు 22న నేరుగా థియేటర్స్‌కే వచ్చేస్తున్న మెగాస్టార్!

Mega 158: మెగాస్టార్ పుట్టిన రోజు సందర్భంగా మెగా 158 (కరిది-అనుకుంటున్న టైటిల్) సినిమా నుంచి ఆగస్టు 22న, టైటిల్ టీజర్‌ను రిలీజ్ చేయడానికి అంతా రెడీ అయింది. ఆల్రెడీ చిరు, టీజర్ అండ్ టైటిల్ గురించి లీక్ చేసిన సంగతి తెలిసిందే. బాబీ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాను కేవీఎన్ ప్రొడక్షన్స్ నిర్మిస్తోంది. అయితే, తాజాగా అందుతున్న సమాచారం మేరకు మెగా 158 టైటిల్ టీజర్‌ను ఏపీ, తెలంగాణాలలో నేరుగా థియేటర్స్‌లో రిలీజ్ చేయనున్నారట.

రూ.111 కోట్లతో  లీజుకు కొత్త హెలికాప్టర్.. సీఎం రేవంత్ తీరుపై విమర్శలుతెలంగాణSwechaa18 Aug 2026, 01:45 PM

రూ.111 కోట్లతో లీజుకు కొత్త హెలికాప్టర్.. సీఎం రేవంత్ తీరుపై విమర్శలు

22 ఏ నిషేధిత భూముల విషయంలో బద్నాం అయ్యామని అధికార కాంగ్రెస్ పార్టీలో జోరుగా చర్చ జరుగుతున్న వేళ మరో కొత్త అంశం తెరమీదకు వచ్చింది. ఇటీవల జిల్లాల పర్యటనలో భాగంగా సీఎం రేవంత్ కొత్త హెలికాప్టర్‌లో సంచరించిన విషయం తెలిసిందే. ప్రస్తుతం దాని మీద కొత్త చర్చ జరుగుతోంది. ఇప్పుడున్న హెలికాప్టర్‌ను కాదని ట్విన్ ఇంజిన్స్ ఉన్న హెలికాప్టర్ కోసం సీఎం రేవంత్ రెండేండ్లకు గాను రూ. 111 కోట్లు చెల్లించేందుకు సిద్ధమయ్యారని పెద్దఎత్తున విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.

సంక్షేమ పథకాలు, అభివృద్ధి పనులు, పెండింగ్ ప్రాజెక్టులు పూర్తి చేసేందుకు నిధులు లేవని, గత బీఆర్ఎస్ ప్రభుత్వం రాష్ట్రాన్ని అప్పుల కుప్పగా మార్చిందని.. తనను కోసిన డబ్బులు రావని సీఎం మాట్లాడిన మాటలను బీఆర్ఎస్ శ్రేణులు ప్రస్తుతం గుర్తుచేస్తున్నారు. ఖజానాలో డబ్బులు లేకపోతే రూ.111 కోట్లు పెట్టి కొత్త హెలికాప్టర్ లీజుకు తీసుకుకోవడం ఏంటని ప్రశ్నలు సంధిస్తున్నారు.

డిజిటల్ మీడియాకు కొత్త లుక్.. వెబ్‌సైట్ డిజైన్లలో నయా ట్రెండ్!ప్రపంచంSwechaa18 Aug 2026, 01:20 PM

డిజిటల్ మీడియాకు కొత్త లుక్.. వెబ్‌సైట్ డిజైన్లలో నయా ట్రెండ్!

డిజిటల్ మీడియా రంగం రోజురోజుకూ కొత్త రూపాన్ని సంతరించుకుంటోంది. వెబ్‌సైట్లు ఇప్పుడు పాఠకుడి అనుభవానికి పెద్దపీట వేస్తున్నాయి. అందుకు అనుగుణంగా డిజైన్లలోనూ భారీ మార్పులు కనిపిస్తున్నాయి. మొబైల్‌ ఫోన్ల వినియోగం పెరగడంతో మొబైల్‌ ఫ్రెండ్లీ డిజైన్లకు ప్రాధాన్యం పెరిగింది. తక్కువ సమయంలో ఎక్కువ సమాచారాన్ని అందించేలా క్లీన్‌ లేఅవుట్, స్పష్టమైన ఫాంట్లు, ఆకర్షణీయమైన విజువల్స్‌, షార్ట్‌ వీడియోలు, ఫోటో గ్యాలరీలకు వెబ్‌సైట్లు ప్రాధాన్యం ఇస్తున్నాయి. అలాగే పాఠకుడు వెబ్‌సైట్‌లోకి వచ్చిన వెంటనే తనకు కావాల్సిన సమాచారాన్ని సులభంగా గుర్తించేలా నావిగేషన్‌ వ్యవస్థను కూడా మారుస్తున్నారు. ట్రెండింగ్‌ న్యూస్‌, బ్రేకింగ్‌ న్యూస్‌, లోకల్‌ న్యూస్‌, వీడియోలు, స్పెషల్‌ స్టోరీలను ప్రత్యేకంగా చూపించే విధంగా హోమ్‌పేజీలను డిజైన్‌ చేస్తున్నారు.

Nidhhi Agerwal: నిధి కొత్త మూవీ ప్రారంభం..ఈసారి హీరో లేడుసినిమాSwechaa18 Aug 2026, 01:16 PM

Nidhhi Agerwal: నిధి కొత్త మూవీ ప్రారంభం..ఈసారి హీరో లేడు

Nidhhi Agerwal: ఇస్మార్ట్ బ్యూటీకి సినిమా ఛాన్సులు రావని అందరూ భావించారు. కానీ, అనూహ్యంగా ఓ ఆసక్తికరమైన మైథాలజీ థ్రిల్లర్‌ మూవీలో తానే మేయిన్ లీడ్ రోల్ చేసే అవకాశం దక్కించుకుంది. కాగా, ఈ చిత్ర ప్రారంభోత్సవ కార్యక్రమంలో పి.అశోక్‌, పి.రేణుక కెమెరా స్విచ్ఛాన్‌ చేయగా.. హుర్మత్‌ సర్నా క్లాప్‌ కొట్టారు. అనంతరం, విడుదల చేసిన నిధి అగర్వాల్‌ అనౌన్స్‌మెంట్‌ ఫస్ట్ లుక్ పోస్టర్‌ సినిమాపై ఆసక్తి పెరిగేలా చేసింది.

అయోధ్య విరాళాల చోరీ కేసు.. ట్రస్ట్ సభ్యులకు ‘సిట్’ క్లీన్‌చిట్!NationalSwechaa18 Aug 2026, 01:13 PM

అయోధ్య విరాళాల చోరీ కేసు.. ట్రస్ట్ సభ్యులకు ‘సిట్’ క్లీన్‌చిట్!

అయోధ్య రామ మందిరం విరాళాల చోరీ కేసులో ఆలయ ట్రస్టు సభ్యులకు ఊరట లభించింది. ట్రస్ట్ ప్రధాన కార్యదర్శి చంపత్ రాయ్, ట్రస్ట్ సభ్యుడు డాక్టర్ అనిల్ మిశ్రాలకు SIT క్లీన్‌చిట్ ఇచ్చింది. విరాళాల చోరీ విషయం దేశవ్యాప్తంగా సంచలనంగా మారిన విషయం తెలిసిందే. సుప్రీంకోర్టు వరకు ఈ విషయం వెళ్లింది. యూపీ ప్రభుత్వం ఈ కేసు విచారణ కోసం ‘సిట్’ను ఏర్పాటు చేయగా.. ఆలయంలో హుండీ డబ్బులు లెక్కించే సిబ్బంది చేతివాటం ఉన్నట్టు అధికారులు విచారణలో తేల్చారు. ఇందులో ఆలయ ట్రస్టు సభ్యుల ప్రమేయం ఎంతమేరకు ఉందని సిట్ మరింత లోతుగా దర్యాప్తు చేయగా.. తాజాగా కీలక ప్రకటన చేసింది. ఈ కేసులో ట్రస్ట్ ప్రధాన కార్యదర్శి చంపత్ రాయ్, ట్రస్ట్ సభ్యుడు డాక్టర్ అనిల్ మిశ్రాలకు SIT క్లీన్‌చిట్ ఇచ్చింది. విరాళాల చోరీ ఘటనలో వీరిద్దరి ప్రమేయం ఉన్నట్టు ఎలాంటి ఆధారాలు లభించలేదని ‘సిట్’ తన దర్యాప్తు నివేదికలో పేర్కొంది.

యూనివర్సిటీలో పీహెచ్‌డీ విద్యార్థి అమానుషం!..NationalSwechaa18 Aug 2026, 01:02 PM

యూనివర్సిటీలో పీహెచ్‌డీ విద్యార్థి అమానుషం!..

ఢిల్లీ యూనివర్సిటీలో జరిగిన ఘటన తీవ్ర సంచలనం సృష్టించింది. డీయూ లా ఫ్యాకల్టీలో పీహెచ్‌డీ చేస్తున్న శుభమ్ సింగ్.. ఉమంగ్ భవన్ ప్రవేశ ద్వారం వద్ద వేచి ఉండి.. అక్కడికి వచ్చిన లా ఫ్యాకల్టీ సీనియర్ ప్రొఫెసర్ అనుపమ్ ఝాపై అకస్మాత్తుగా దాడికి దిగినట్లు ఆరోపణలు ఉన్నాయి. అడ్డుకునేందుకు ఇతర విద్యార్థులు ప్రయత్నించినప్పటికీ.. ప్రొఫెసర్‌పై పలుమార్లు దాడి చేసినట్లు తెలుస్తోంది. ఈ ఘటనకు సంబంధించిన దృశ్యాలు క్యాంపస్ సీసీటీవీ కెమెరాల్లో రికార్డయ్యాయి.

చిన్నారెడ్డిని సస్పెండ్ చేయకపోతే గాంధీభవన్ ముట్టడిస్తా:  మేఘారెడ్డితెలంగాణSwechaa18 Aug 2026, 12:49 PM

చిన్నారెడ్డిని సస్పెండ్ చేయకపోతే గాంధీభవన్ ముట్టడిస్తా: మేఘారెడ్డి

కాంగ్రెస్ పార్టీలో రోజుకో వివాదం ముదురుతోంది. పదవులు వచ్చిన వాళ్లు ఇతర పనుల్లో బిజీగా ఉంటే రాని వారు మాత్రం పార్టీని, అధిష్టానం పెద్దలపై తీవ్ర విమర్శలు గుప్పిస్తున్నారు.ఈ క్రమంలోనే వనపర్తి జిల్లాలో ప్రణాళికసంఘం ఉపాధ్యక్షుడు చిన్నారెడ్డి, స్థానిక అధికార పార్టీ ఎమ్మెల్యే మేఘా రెడ్డి మధ్య కొత్తగా మాటల యుద్ధం నెలకొంది.డబ్బులు ఇచ్చి ఎమ్మెల్యే టికెట్ కొనుక్కున్నాడని చిన్నారెడ్డి చేసినవ్యాఖ్యలపై ఎమ్మెల్యే మేఘారెడ్డి ఫైర్ అయ్యారు. ఈ క్రమంలోనే కాంగ్రెస్ పార్టీకి డెడ్‌లైన్ పెట్టినట్టు తెలుస్తోంది. చిన్నారెడ్డిని పార్టీ నుంచి సస్పెండ్ చేయాలి లేదంటే గాంధీ భవన్‌ను ముట్టడిస్తా అని హెచ్చరించినట్టు తెలిసింది. దీంతో వనపర్తిలో కాంగ్రెస్ నాయకుల మధ్య అంతర్గత పోరు రచ్చకెక్కుతున్నదని ప్రచారం జరుగుతోంది.

మీనాక్షి నటరాజన్‌కు షాకిచ్చిన కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డితెలంగాణSwechaa18 Aug 2026, 12:30 PM

మీనాక్షి నటరాజన్‌కు షాకిచ్చిన కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి

కాంగ్రెస్ పార్టీ మీద ధిక్కార స్వరం వినిపిస్తున్న మనుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి మరోసారి ఆ పార్టీలో కొత్త చర్చకు తెరతీశారు. మంగళవారం యాదాద్రి భువనగిరి, నల్గొండ, సూర్యాపేట జిల్లాల ముఖ్య నేతలతో మీనాక్షి నటరాజన్ నిర్వహించిన పీఏసీ మీటింగ్‌కు ఆయన హాజరుకాలేదని తెలుస్తోంది. దీంతో మీనాక్షి నటరాజన్ మునుగోడు ఎమ్మెల్యే మీద గుర్రుగా ఉన్నట్టు సమాచారం. ప్రస్తుతం ఈ విషయం ఉమ్మడి నల్గొండ జిల్లా వ్యాప్తంగానే కాకుండా కాంగ్రెస్ పార్టీలో మరోసారి చర్చకు దారి తీసింది.

వికెట్ల వెనుక పంత్ అల్లరి.. రహానె ఇంట్రెస్టింగ్ కామెంట్స్!క్రీడలుSwechaa18 Aug 2026, 12:26 PM

వికెట్ల వెనుక పంత్ అల్లరి.. రహానె ఇంట్రెస్టింగ్ కామెంట్స్!

భారత వికెట్ కీపర్ రిషభ్ పంత్ వికెట్ల వెనుక చేసే సందడి, చమత్కార సంభాషణల గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ప్రతీ బంతికీ ఏదో ఒక వ్యాఖ్య చేస్తూ ప్రత్యర్థి బ్యాటర్లను ఒత్తిడికి గురిచేయడం, బౌలర్లలో ఉత్సాహం నింపడం పంత్‌కు అలవాటు. శ్రీలంకతో జరుగుతున్న తొలి టెస్టు మ్యాచ్‌లోనూ పంత్ తన మార్క్ డైలాగులతో విపరీతంగా అల్లరి చేశాడు. అయితే, పంత్ వ్యవహారంపై భారత మాజీ క్రికెటర్ అజింక్య రహానె ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశాడు.

'నోర్ముయ్.. నువ్వు ఫేక్ రిపోర్టర్‌..'  మహిళా జర్నలిస్ట్‌పై ట్రంప్ ఆగ్రహం!InternationalSwechaa18 Aug 2026, 12:13 PM

'నోర్ముయ్.. నువ్వు ఫేక్ రిపోర్టర్‌..'  మహిళా జర్నలిస్ట్‌పై ట్రంప్ ఆగ్రహం!

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మరోసారి అంతర్జాతీయ మీడియాపై తన తీవ్ర అసహనాన్ని, ఆగ్రహాన్ని బహిరంగంగా వెళ్లగక్కారు. వైట్‌హౌస్‌లోని ఓవల్ ఆఫీసులో జరిగిన ఒక అధికారిక కార్యక్రమంలో ప్రముఖ అంతర్జాతీయ వార్తా సంస్థ సీఎన్ఎన్ (CNN) మహిళా విలేకరిపై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. ఆమెను ఉద్దేశించి ‘నోర్ముయ్, నువ్వు ఒక ఫేక్ రిపోర్టర్, మీ వార్తలే ఫేక్ న్యూస్’ అంటూ ఘాటు వ్యాఖ్యలు చేశారు. సోమవారం చోటుచేసుకున్న ఈ సంచలన ఘటనకు సంబంధించిన పూర్తి వీడియో ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా నెట్టింట వైరల్‌గా మారి తీవ్ర చర్చకు దారితీసింది.

మంత్రి పొంగులేటి రాజీనామా చేయాలి : హరీశ్‌రావుతెలంగాణSwechaa18 Aug 2026, 12:09 PM

మంత్రి పొంగులేటి రాజీనామా చేయాలి : హరీశ్‌రావు

22ఏ నిషేధిత భూముల తప్పిదంలో నైతిక బాధ్యత వహించి తన మంత్రి పదవికి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి రాజీనామా చేయాలని మాజీ మంత్రి హరీశ్ రావు డిమాండ్ చేశారు. ముఖ్యమంత్రి, మంత్రులు కలిసి చేసిన తప్పును అధికారుల మీదకు నెట్టడం సరికాదని, ఎలాంటి దరఖాస్తు లేకుండా, బాధితులు ఆఫీసుల చుట్టూ తిరిగే అవసరం లేకుండా భూములు తొలగించాలన్నారు. జాబితాలో ప్రజల భూములు ఎవరు పెట్టారు? ఎవరు పెట్టించారు? వాస్తవం బయట పడాలని కోరారు. నిషేధిత భూముల తొలగింపు పేరుతో మీ కబ్జా భూములు రెగ్యులరైజ్ చేస్తే బీఆర్‌ఎస్ పార్టీ చూస్తూ ఊరుకోదన్నారు. పొంగులేటి చెప్పిన ‘టోల్ ఫ్రీ నంబర్’ పని చేయడం లేదని.. కానీ, జనతా గ్యారేజ్ తెలంగాణ భవన్ ఎల్లప్పుడూ తలుపులు తెరిచే ఉంటుందన్నారు.

'నువ్వు అద్దంలో చూసుకుంటావ్'.. మైక్ ముందే కొట్టుకున్న మాజీ క్రికెటర్లు!క్రీడలుSwechaa18 Aug 2026, 11:50 AM

'నువ్వు అద్దంలో చూసుకుంటావ్'.. మైక్ ముందే కొట్టుకున్న మాజీ క్రికెటర్లు!

భారత్-శ్రీలంక జట్ల మధ్య జరుగుతున్న తొలి టెస్టు మ్యాచ్ సందర్భంగా లైవ్ కామెంట్‌రీ బాక్స్, స్టూడియోల మధ్య ఆసక్తికర సన్నివేశం చోటుచేసుకుంది. రెండు ప్రాంతాల నుంచి విశ్లేషణ అందిస్తున్న భారత మాజీ క్రికెటర్లు సంజయ్ మంజ్రేకర్, మురళీ కార్తిక్ మధ్య జరిగిన సంభాషణ ఆన్-ఎయిర్‌లోనే వాడివేడిగా మారిపోయింది. సరదాగా ప్రారంభమైన ఈ మాటల యుద్ధం ఒక్కసారిగా సీరియస్ రూపు దాల్చడంతో క్రికెట్ అభిమానులు ఆశ్చర్యానికి గురయ్యారు. ప్రస్తుతం ఈ ఘటనకు సంబంధించిన వీడియో క్లిప్పింగులు సోషల్ మీడియాలో విపరీతంగా ట్రెండ్ అవుతున్నాయి.

ఒంగోలులో సీబీఐ ఆకస్మిక తనిఖీలు..ఏం జరుగుతోంది?ఏపీSwechaa18 Aug 2026, 11:20 AM

ఒంగోలులో సీబీఐ ఆకస్మిక తనిఖీలు..ఏం జరుగుతోంది?

ఏపీలోని సీబీఐ అధికారులు రంగ ప్రవేశం వేశారు. ఒంగోలు అద్దంకి బస్టాండ్ K.B రెస్టారెంట్‌లో అధికారుల ఆకస్మిక సోదాలు జరుపుతున్నట్టు సమాచారం. చీమకుర్తి గ్రానైట్ క్వారీ ప్రమాదాల కేసులో పలువురిని రహస్యంగా విచారిస్తున్నట్టు తెలుస్తోంది. ఎందుకంటే ఈ క్వారీలో ఇటీవలి కాలంలో వరుసగా ప్రమాదాలు జరుగుతుండటమే కారణం. ఈ మధ్యే క్వారీలో జరిగిన ప్రమాదంలో ఓ కార్మికుడు మృతి చెందగా.. ప్రభుత్వం మరోసారి దీనిపై ఫోకస్ పెట్టింది. ఇప్పటికే ఈ క్వారీ విషయంలో విజిలెన్స్ అధికారులు విచారణ జరుపుతున్నట్టు సమాచారం. గత వైసీపీ ప్రభుత్వంలో అడ్డగోలుగా తమకు నచ్చిన వారికి మైనింగ్ కాంట్రాక్టులు అప్పజెప్పిందని, ఏమాత్రం భద్రతా ప్రమాణాలు పాటించకుండా గెలాక్సీ స్టోన్ మైనింగ్ నడుస్తోందని అధికార కూటమి నేతలు ఆరోపిస్తున్నారు. ఇదిలాఉండగా, క్వారీ సేఫ్టీ మెజర్స్ పరిశీలించి అనుమతులు ఇవ్వాల్సిన మైన్స్ సేఫ్టీ అధికారి (DDMS) రవిశంకర్ ఇటీవల రూ.2 లక్షల లంచం తీసుకుంటూ రెడ్ హ్యాండెడ్‌గా దొరికిపోయాడు.

సూర్యాపేట కలెక్టర్ సంతకం ఫోర్జరీ.. బ్యాంకు మేనేజర్ అరెస్టుతెలంగాణSwechaa18 Aug 2026, 11:01 AM

సూర్యాపేట కలెక్టర్ సంతకం ఫోర్జరీ.. బ్యాంకు మేనేజర్ అరెస్టు

కలెక్టర్ సంతకం ఫోర్జరీకి పాల్పడి ఆర్థిక అవకతవకలకు తెరలేపిన బ్యాంకు మేనేజర్‌ను పోలీసులు అరెస్టు చేశారు. ఈ ఘటన సూర్యాపేట జిల్లాలో ఆలస్యంగా వెలుగుచూసింది.కొందరు అధికారులు కాసులకు కక్కుర్తి పడి ఇలాంటి వ్యవహారాలకు పాల్పడుతున్నట్టు తెలుస్తోంది. ఏకంగా జిల్లా పాలనాధికారి సంతకం ఫోర్జరీ చేయడం అంటే మాములు విషయం కాదు. జిల్లా మొత్తానికి ఆయన జవాబుదారి. జిల్లాలో చేపట్టాల్సిన అభివృద్ధి పనుల కోసం ప్రభుత్వం మంజూరు చేసే నిధులు ఆయన సంతకం ద్వారానే విడుదల అవుతాయి. అలాంటిది ఆయన సంతకం ఫోర్జరీ కావడంతో కలెక్టర్ ఫిర్యాదు మేరకు పోలీసులు రంగంలోకి దిగి విచారణ చేపట్టారు. ఈ ఘటన ఈనెల 15 జరగగా..ఆలస్యంగా వెలుగుచూసింది. వివరాల్లోకివెళితే.. సూర్యాపేట జిల్లా కలెక్టర్ తేజస్ నందలాల్ పవర్ సంతకాన్ని కోటక్ మహీంద్రా బ్యాంక్ మేనేజర్ కోడూరు రఘు ప్రసాద్ ఫోర్జరీ చేసినట్టు తెలిసింది.