స్వేచ్ఛ షార్ట్స్ — తాజా తెలుగు వార్తలు

బీజేపీలో బిగ్ ఛేంజ్.. కొత్త కార్యవర్గంలో తెలంగాణకు నో ఛాన్స్!..NationalSwechaa17 Aug 2026, 03:58 PM

బీజేపీలో బిగ్ ఛేంజ్.. కొత్త కార్యవర్గంలో తెలంగాణకు నో ఛాన్స్!..

బీజేపీ కొత్త జాతీయ కార్యవర్గాన్ని అధ్యక్షుడు నితిన్ నబీన్ ప్రకటించారు. రాబోయే ఎన్నికలు, పార్టీ బలోపేతమే లక్ష్యంగా కొత్త టీమ్‌ను ఏర్పాటు చేశారు. 13 మంది జాతీయ ఉపాధ్యక్షుల్లో ఆంధ్రప్రదేశ్ నుంచి దగ్గుబాటి పురందేశ్వరికి చోటు దక్కింది. అయితే తెలంగాణ నేతలకు మాత్రం జాతీయ కార్యవర్గంలో స్థానం లభించలేదు. జాతీయ ప్రధాన కార్యదర్శులుగా స్మృతి ఇరానీ, వినోద్ తావ్డే, సునీల్ బన్సల్ తదితరులకు బాధ్యతలు అప్పగించారు. కేంద్ర మంత్రి పీయూష్ గోయల్ జాతీయ కోశాధికారిగా నియమితులయ్యారు. మీడియా, సోషల్ మీడియా, వివిధ మోర్చాలకు కూడా అభ్యర్థులను ప్రకటించారు.

Yash: "రామాయణ" కోసం ఇగోను పక్కన పెట్టాంసినిమాSwechaa17 Aug 2026, 03:49 PM

Yash: "రామాయణ" కోసం ఇగోను పక్కన పెట్టాం

Yash: యష్ నటిస్తున్న మరో గొప్ప చిత్రం బాలీవుడ్‌లో రూపొందుతున్న రామాయణ. తాజాగా, యష్ ఈ సినిమా గురించి ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశాడు. ఇందులో, రావణాసుడి పాత్రను ఎందుకు ఎంచుకున్నాడో చెప్పాడు. హీరో బలంగా ఉండాలంటే విలన్ అంతకన్నా బలంగా ఉండాలి. రాముడు మంచితనాన్ని, గుణగణాలను చూపించాలంటే రావణుడిగా నేను బాగా నటించాలి. విలన్ పాత్రలు చేసినా నావంతు బాగా నటించడానికే కృషి చేస్తాను. రామాయణ కోసం మేమంతా ఇగోను పక్కన పెట్టాము.. అని అన్నాడు.

జన్వాడలో మట్టి మాఫియా? ఉస్మాన్ సాగర్ పరిధిలో అక్రమ తవ్వకాలపై అధికారుల మౌనంతెలంగాణSwechaa17 Aug 2026, 03:18 PM

జన్వాడలో మట్టి మాఫియా? ఉస్మాన్ సాగర్ పరిధిలో అక్రమ తవ్వకాలపై అధికారుల మౌనం

జన్వాడ గ్రామంలో జరుగుతున్నట్లు ఆరోపణలు వస్తున్న భారీ మట్టి తవ్వకాలు ఇప్పుడు ఉస్మాన్ సాగర్ భద్రత, ప్రభుత్వ శాఖల పర్యవేక్షణ, రాజకీయ పలుకుబడిపై తీవ్రమైన ప్రశ్నలను లేవనెత్తుతున్నాయి. స్థానికుల ఆరోపణల ప్రకారం ఏకంగా 10 ఎకరాల విస్తీర్ణంలో దాదాపు 15 అడుగుల లోతు వరకు తవ్వకాలు జరుగుతున్నాయి. భారీ యంత్రాలతో మట్టిని తవ్వి, పెద్ద సంఖ్యలో టిప్పర్ల ద్వారా తరలిస్తున్నారని చెబుతున్నారు.

E20 పెట్రోల్‌ వెనుక అసలు కథ.. లాభ నష్టాలు ఎవరికంటే?..NationalSwechaa17 Aug 2026, 03:16 PM

E20 పెట్రోల్‌ వెనుక అసలు కథ.. లాభ నష్టాలు ఎవరికంటే?..

దేశవ్యాప్తంగా ప్రస్తుతం తీవ్ర చర్చకు దారితీస్తున్న అంశాల్లో ఇథనాల్‌ కలిపిన పెట్రోల్‌ ఒకటి. ముఖ్యంగా 20 శాతం ఇథనాల్‌ మిశ్రమంతో వస్తున్న E20 పెట్రోల్‌పై వాహనదారుల్లో ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి. ఇథనాల్‌ బ్లెండెడ్‌ పెట్రోల్‌ వల్ల ఎదురవుతున్న సమస్యలపై ఆటోమొబైల్‌ కంపెనీలు సైతం కేంద్ర ప్రభుత్వానికి పలు సూచనలు చేసినట్లు చర్చ జరుగుతోంది. అయితే ఈ విధానం వల్ల అసలు లాభపడేది ఎవరు? భారం పడేది ఎవరిపై? సామాన్య వాహనదారులకు దీని ప్రభావం ఎంత? అనే ప్రశ్నలు ఇప్పుడు రాజకీయ, ఆర్థిక వర్గాల్లో హాట్‌టాపిక్‌గా మారాయి.

Kaveri Issue: కావేరీ జలాల వివాదం.. సుప్రీంకోర్టులో కర్ణాటకకు ఎదురుదెబ్బ!NationalSwechaa17 Aug 2026, 03:14 PM

Kaveri Issue: కావేరీ జలాల వివాదం.. సుప్రీంకోర్టులో కర్ణాటకకు ఎదురుదెబ్బ!

కావేరీ నదీ జలాల పంపకాల వివాదంలో సర్వోన్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది. తమిళనాడు రాష్ట్రానికి కావేరీ నీటిని వెంటనే విడుదల చేయాలంటూ కావేరీ వాటర్ మేనేజ్‌మెంట్ అథారిటీ (CWMA) ఇచ్చిన ఉత్తర్వులను కచ్చితంగా పాటించాల్సిందేనని కర్ణాటక ప్రభుత్వానికి స్పష్టం చేసింది. అథారిటీ జారీ చేసిన ఆదేశాలను విస్మరించడం సరికాదని వ్యాఖ్యానించడంతో, ఈ సుదీర్ఘ వివాదంలో తమిళనాడు రాష్ట్రానికి ఊరట లభించినట్లయింది.

నీళ్ల కోసం ఎస్సై కాళ్లు పట్టుకున్న అన్నదాత.. వీడియో వైరల్!తెలంగాణSwechaa17 Aug 2026, 03:04 PM

నీళ్ల కోసం ఎస్సై కాళ్లు పట్టుకున్న అన్నదాత.. వీడియో వైరల్!

రాష్ట్రంలో వర్షాలు లేక మరో వైపు సాగుకు ప్రభుత్వం నీళ్లు ఇవ్వకపోవడంతో రైతులు అల్లాడుతున్నారు. తమను ఆదుకోవాలని ప్రభుత్వాన్ని వేడుకుంటున్నారు. అయితే, ఎల్ నిన్ ఎఫెక్ట్ కారణంగా వర్షాకాలం అయినా వానలు పడటంలేదు. రైతులు ఏమో వరి వేసేందుకు సిద్ధం అవుతుండగా..ప్రభుత్వం మాత్రం పంట మార్పిడి చేయాలని, వర్షాలు లేనందున ఆరు తడి పంటలు మాత్రమే వేయాలని చెబుతోంది. రైతులకు నీళ్లివ్వాలని ప్రతిపక్ష బీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వాన్ని డిమాండ్ చేయడంతో పాటు కాళేశ్వరం నుంచి నీటిని ఎత్తిపోయాలని కోరుతోంది. ఇదిలాఉండగా, ఖమ్మం జిల్లాలో సాగు నీటి కోసం రైతులు రోడ్డెక్కారు. వైరా రిజర్వాయర్ నుంచి సాగునీరు విడుదల చేయాలని ఐబీ కార్యాలయం ముందు సోమవారం ఉదయం రైతులు నిరసన ప్రదర్శన చేపట్టారు. రిజర్వాయర్‌లో 17 అడుగుల నీరు ఉన్నప్పటికీ ఈ ప్రభుత్వం విడుదల చేయడం లేదని అన్నదాతలు ఆగ్రహం వ్యక్తంచేశారు. నిరసనను అడ్డుకోవడానికి వచ్చిన ఎస్సై కాళ్లపై పడిన ఓ రైతు.. నీటిని విడుదల చేయించాలని వేడుకున్నాడు.

సీఎం, మంత్రి ఆదేశాలు బేఖాతర్.. ‘రెవెన్యూ’లో ఏం జరుగుతోంది?తెలంగాణSwechaa17 Aug 2026, 03:02 PM

సీఎం, మంత్రి ఆదేశాలు బేఖాతర్.. ‘రెవెన్యూ’లో ఏం జరుగుతోంది?

రాష్ట్రంలో రెవెన్యూ శాఖలో అధికారులు ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారని ఆరోపణలు వస్తున్నాయి. ప్రస్తుతం రాష్ట్రవ్యాప్తంగా 22ఏ నిషేధితా జాబితా భూముల గురించి చర్చ జరుగుతున్న సందర్భంలో ఓ వైపు సీఎం రేవంత్, మరోవైపు సంబంధిత రెవెన్యూ శాఖ మంత్రి బాధితులకు న్యాయం చేస్తామని చెబుతున్నా..క్షేత్రస్థాయిలో మాత్రం పనులు జరగడం లేదని సమాచారం. తమ పట్టా భూములను 22ఏ నిషేధితా జాబితాలో పెట్టారంటూ ప్రభుత్వం నుంచి ప్రయివేటు ఉద్యోగుల వరకు..రాజకీయ నాయకులు సైతం ఆరోపణలు చేస్తున్నారు. రిజస్ట్రార్, సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాల చుట్టూ తిరుగుతున్నా పనులు కావడం లేదని బాధితులు వాపోతున్నారు. తాజాగా తెలంగాణ రియల్టర్స్ అసోసియేషన్ స్టేట్ ప్రెసిడెంట్ నారగోని ప్రవీణ్ కుమార్.. రెవెన్యూ శాఖలో జరుగుతున్న వ్యవహారాన్ని బట్టబయలు చేశారు.

రాష్ట్రంలో డీఐజీ స్థాయి అధికారిపై సీఐడీ విచారణ?తెలంగాణSwechaa17 Aug 2026, 02:52 PM

రాష్ట్రంలో డీఐజీ స్థాయి అధికారిపై సీఐడీ విచారణ?

రాష్ట్రంలో మరో సంచలనం చోటుచేసుకుంది. ఓ డీఐజీ అధికారిపై సీఐడీ విచారణకు రాష్ట్ర డీజేపీ సీవీ ఆనంద్ ఆదేశించినట్టు సమాచారం.సదరు అధికారి.. అధికార దుర్వినియోగంతో పాటు భారీగా అక్రమాస్తులు కూడబెట్టినట్టు ఆరోపణలు వినిపిస్తున్నాయి.అతని ఆస్తులకు సంబంధించి వరుస ఫిర్యాదులు అందడంతో సీఐడీ విచారణకు ఉన్నతాధికారుల ఆదేశించినట్టు సమాచారం. లంగాణలో ప్రస్తుతమున్న 11 మంది డీఐజీలలో కేంద్ర సర్వీసులో ఉన్న ఇద్దరిని మినహాయిస్తే, మిగతా 9 మందిలో ఒకరైన డీఐజీ పెద్ద ఎత్తున అక్రమాలకు పాల్పడుతున్నాడని ఉన్నతాధికారులకు ఫిర్యాదు అందినట్టు సమాచారం. సదరు డీఐజీ దక్షిణ తెలంగాణలోని ఓ జిల్లాలో 20 ఎకరాలు కొనుగోలు చేశాడని, ప్రస్తుతం నిర్మిస్తున్న ఇంటి కోసం పెద్ద ఎత్తున వసూళ్లకు పాల్పడుతున్నాడని ఆరోపణలు రావడంతో ఉన్నతాధికారులు రంగంలోకి దిగారు.

YS jagan comments on CBN: ‘నీడను చూసినా భయపడే స్థాయికి చంద్రబాబు..’ టీచర్ల సస్పెన్షన్‌పై జగన్ ఫైర్!ఏపీSwechaa17 Aug 2026, 02:24 PM

YS jagan comments on CBN: ‘నీడను చూసినా భయపడే స్థాయికి చంద్రబాబు..’ టీచర్ల సస్పెన్షన్‌పై జగన్ ఫైర్!

సొంత నీడను చూసినా భయపడే స్థాయికి సీఎం చంద్రబాబు దిగజారారని వైసీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్‌రెడ్డి ఎద్దేవా చేశారు. ఉపాధ్యాయ అర్హత పరీక్ష (టెట్) నిబంధనల నుంచి మినహాయింపు కోరుతూ కేంద్ర ప్రభుత్వ ప్రతినిధులను కలిసిన ఐదుగురు ఉపాధ్యాయులను సస్పెండ్ చేయడంపై ఆయన తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. వైఎస్సార్ కడప, అనంతపురం, శ్రీ సత్యసాయి జిల్లాలకు చెందిన ఉపాధ్యాయులపై చంద్రబాబు ప్రభుత్వం కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతోందని సోషల్ మీడియా వేదికగా ధ్వజమెత్తారు.

మరో చపాతీ అడిగాడని విద్యార్థికి వాతలు.. గురుకులాల్లో ఆగని వేధింపులు!తెలంగాణSwechaa17 Aug 2026, 02:13 PM

మరో చపాతీ అడిగాడని విద్యార్థికి వాతలు.. గురుకులాల్లో ఆగని వేధింపులు!

రాష్ట్రంలోని గురుకులాల్లో విద్యార్థులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ప్రతిరోజూ ఏదో ఒక సమస్య వారిని వేధిస్తున్నది. ఫుడ్ పాయిజన్ ఘటనలు మరువక ముందే తాజాగా తోటి సీనియర్ విద్యార్థులు జూనియర్ల పట్ల కఠినంగా వ్యవహరిస్తున్నారని కొందరు విద్యార్థులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పట్టించుకోవాల్సిన వార్డెన్, ఉపాధ్యాయులు మాత్రం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నట్టు సమాచారం. ఇటీవలి కాలంలో గురుకుల పాఠశాలల్లో వరుస ర్యాగింగ్ ఘటనలు కలకలం రేపుతున్నాయి. తాజాగా మరో ఘటన వెలుగుచూసింది. అదనపు చపాతీ అడిగాడని 8వ తరగతి విద్యార్థికి సీనియర్లు పెనంతో వాతలు పెట్టారు. వికారాబాద్ జిల్లా తాండూరులోని బాలుర సోషల్ వెల్ఫేర్ గురుకుల పాఠశాలలో ఈ ఘటన సోమవారం ఆలస్యంగా వెలుగుచూసింది.

పల్లెవాసులకు శుభవార్త.. బస్సుల నైట్‌హాల్ట్‌కు రైట్ రైట్తెలంగాణSwechaa17 Aug 2026, 01:32 PM

పల్లెవాసులకు శుభవార్త.. బస్సుల నైట్‌హాల్ట్‌కు రైట్ రైట్

రాష్ట్ర ప్రజలకు తెలంగాణ ప్రభుత్వం మరో శుభవార్త చెప్పింది. మెరుగైన రవాణా సేవలు కల్పించేందుకు కీలక నిర్ణయం తీసుకుంది. ఒకప్పుడు పల్లెల్లో రాత్రి ఆర్టీసీ బస్సులు బస చేసేవి. ఉదయాన్నే మరల గమ్యస్థానానికి చేరేవి. ప్రయాణికులకు సురక్షితంగా వారి వారి గమ్యస్థానాలకు చేర్చివి. దశాబ్దకాలం పాటు ఈ సేవలు నిలిచిపోగా.. మరోసారి ఆ సేవలను పునరుద్ధరించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. గ్రేటర్ హైదరాబాద్ మినహా రాష్ట్రంలోని ఉమ్మడి పది జిల్లాల్లోని మారుమూల పల్లెల్లో ఈ బస్సు సర్వీసులు అందుబాటులోకి రానున్నాయి. డిపోల నుంచి బయలు దేరిన బస్సులు తమకు కేటాయించిన పల్లెల్లోని ప్రధాన చౌరస్తా లేదా పాయింట్ వద్ద రాత్రి బస చేయాల్సి ఉంటుంది. ఉదయాన్నే ప్రయాణికులతో మరల సంబంధింత జిల్లా, పట్టణ బస్ స్టేషన్లకు చేరుకోవాల్సి ఉంటుంది. పల్లెల నుంచి ఉద్యోగాలు, చదువుకోవడానికి వెళ్లే విద్యార్థులకు ఈ సర్వీసులు ఎంతోగానో ఉపయోగపడతాయి.

సిద్ధిపేటలో లేడీ కిల్లర్స్.. డబ్బుల కోసం దారుణ హత్యలు?క్రైమ్Swechaa17 Aug 2026, 01:20 PM

సిద్ధిపేటలో లేడీ కిల్లర్స్.. డబ్బుల కోసం దారుణ హత్యలు?

సులువుగా డబ్బులు సంపాదించేందుకు కొందరు మహిళలు అక్రమ మార్గాలను ఎంచుకుంటున్నారు. తాజాగా సిద్ధిపేటలో ఇద్దరు మహిళలు ఈజీ మనీ కోసం ఏకంగా దారుణాలకు పాల్పడ్డారు. ఓ మహిళల తన భర్త బీమా డబ్బుల కోసం అతన్ని హతమారిస్తే... మరో మహిళ ఏకంగా తన మైనర్ కొడుకు సాయంతో ఒంటరి మహిళలను టార్గెట్ చేసి హతమార్చడం చేసింది. ఈ ఘటనలు ఒక్కసారిగా సిద్ధిపేట ప్రజలను తీవ్ర భయాందోళనకు గురిచేశాయి.ఈ రెండు ఘటనలు ఆలస్యంగా వెలుగులోకి రావడంతో జిల్లా వ్యాప్తంగా సంచలనంగా మారాయి.

గిల్ మ్యాజిక్ క్యాచ్.. క్రికెట్ అభిమానుల ఫిదా!క్రీడలుSwechaa17 Aug 2026, 01:19 PM

గిల్ మ్యాజిక్ క్యాచ్.. క్రికెట్ అభిమానుల ఫిదా!

మైదానంలో గ్రావిటీకి కూడా దొరక్కుండా ప్లేయర్లు గాల్లోకి ఎగిరే క్షణాలు చూస్తే ఎవరికైనా మైండ్ బ్లాక్ అవ్వాల్సిందే. బంతి నేలను తాకేలోపు పక్షిలా ఎగిరి దాన్ని క్యాచ్ పట్టే ఆ మెరుపు విన్యాసాలు చూసి ఫ్యాన్స్ నోరెళ్లబెడతారు. రెప్పపాటులో జరిగే ఆ మ్యాజిక్, మ్యాచ్ చూసే ప్రతి ఒక్కరినీ సీటు అంచున కూర్చోబెట్టడమే కాదు.. సోషల్ మీడియాను కూడా షేక్ చేస్తుంది. తాజాగా శ్రీలంకతో గాలే వేదికగా జరుగుతున్న తొలి టెస్టు మూడో రోజు ఆటలో టీమిండియా కెప్టెన్‌ శుభ్‌మన్ గిల్ తన అద్భుతమైన ఫీల్డింగ్‌ నైపుణ్యంతో అభిమానులను మంత్రముగ్ధులను చేశాడు.

Kisan Credit Card: రైతన్నలకు కేంద్రం గుడ్‌న్యూస్.. కిసాన్ క్రెడిట్ కార్డ్‌పై బంపర్ ఆఫర్!NationalSwechaa17 Aug 2026, 12:57 PM

Kisan Credit Card: రైతన్నలకు కేంద్రం గుడ్‌న్యూస్.. కిసాన్ క్రెడిట్ కార్డ్‌పై బంపర్ ఆఫర్!

దేశవ్యాప్తంగా ఉన్న రైతాంగానికి మద్దతుగా నిలిచేందుకు కేంద్ర ప్రభుత్వం మరో కీలక నిర్ణయానికి శ్రీకారం చుడుతోంది. సాగు ఖర్చుల కోసం రైతన్నలకు తక్కువ వడ్డీకే రుణాలను అందించే ప్రతిష్టాత్మక ‘కిసాన్ క్రెడిట్ కార్డ్’ (KCC) పథకాన్ని 2031-32 ఆర్థిక సంవత్సరం వరకు పొడిగించేందుకు మోదీ ప్రభుత్వం కసరత్తు చేస్తోంది. ఎలాంటి పూచీకత్తు (గ్యారెంటీ) లేకపోయినా అర్హులైన రైతులకు సులభంగా లోన్లు అందించడమే లక్ష్యంగా ఈ కీలక నిర్ణయం తీసుకోబోతున్నట్లు అధికారిక వర్గాల ద్వారా సమాచారం అందుతోంది.

సినీ నటి అనసూయపై కేసు నమోదు.. బోరబండ పీఎస్‌లో బీజేపీ నేతల ఫిర్యాదు!సినిమాSwechaa17 Aug 2026, 12:14 PM

సినీ నటి అనసూయపై కేసు నమోదు.. బోరబండ పీఎస్‌లో బీజేపీ నేతల ఫిర్యాదు!

ప్రముఖ సినీ నటి, యాంకర్ అనసూయ భరద్వాజ్ ఇటీవల చేసిన వ్యాఖ్యలు తెలంగాణ రాజకీయాల్లో, సోషల్ మీడియాలో తీవ్ర కలకలం రేపాయి. సనాతన ధర్మం, ‘జై శ్రీరామ్’ నినాదాన్ని అడ్డుపెట్టుకుని కొందరు అసాంఘిక దాడులు, అభ్యంతరకర వ్యాఖ్యలకు పాల్పడుతున్నారంటూ ఆమె చేసిన వ్యాఖ్యలపై తీవ్ర దుమారమే రేగింది. ఈ వ్యాఖ్యలు హిందువుల మనోభావాలను దెబ్బతీసేలా ఉన్నాయని ఆరోపిస్తూ హైదరాబాద్‌లోని బోరబండ పోలీస్ స్టేషన్‌లో బీజేపీ నాయకులు ఫిర్యాదు చేశారు.

పగలు సోలార్ ప‌వ‌ర్ ఓకే.. రాత్రి కరెంట్‌కు టెన్షన్! ఎల్‌నినోతో భారత్‌కు కొత్త సవాల్!NationalSwechaa17 Aug 2026, 12:08 PM

పగలు సోలార్ ప‌వ‌ర్ ఓకే.. రాత్రి కరెంట్‌కు టెన్షన్! ఎల్‌నినోతో భారత్‌కు కొత్త సవాల్!

పగలు సోలార్‌ విద్యుత్‌ అందుబాటులో ఉంటుంది. కానీ రాత్రి సూర్యుడు ఉండడు. భారతదేశంలో వేసవి సమయంలో రాత్రి 8 గంటల ప్రాంతంలో పీక్ నెట్ లోడ్ సాధారణంగా కనిపిస్తోంది. తెల్లవారుజామున 4 గంటలకు కూడా డిమాండ్‌ రాత్రి పీక్‌ కంటే సగటున కేవలం 10 శాతం మాత్రమే తక్కువగా ఉంటోంది. అంటే రాత్రి కరెంట్‌ అవసరం తగ్గిపోవడం లేదు.

మెగాస్టార్ లుక్ విషయంలో నెగిటివ్ కామెంట్స్..అయినా తగ్గడంలేదుసినిమాSwechaa17 Aug 2026, 11:45 AM

మెగాస్టార్ లుక్ విషయంలో నెగిటివ్ కామెంట్స్..అయినా తగ్గడంలేదు

Chiranjeevi: మెగాస్టార్ చిరంజీవి హీరోగా దర్శకుడు బాబీ తెరకెక్కిస్తున్న మెగా 158 ప్రస్తుతం శరవేగంగా షూటింగ్ జరుపుకుంటోంది. హీరోయిన్‌గా ప్రియమణి, కీలక పాత్రలో అనస్వర రాజన్, మురళీ శర్మ నటిస్తున్నారు. వచ్చేవారం నుంచి చిరంజీవిపై సాంగ్ ప్లాన్ చేశాడట బాబీ. దీనికోసం మెగాస్టార్ లుక్ మొత్తం మార్చినట్టుగా తెలుస్తోంది. వింటేజ్ మెగాస్టార్ కనిపిస్తాడట. ఇందుకు చిరు ప్రత్యేకంగా తయారవుతున్నాడట.

Nagababu: ‘మెగా’ బ్రదర్, ఎమ్మెల్సీ నాగబాబుకు మరో కీలక పదవి!ఏపీSwechaa17 Aug 2026, 11:39 AM

Nagababu: ‘మెగా’ బ్రదర్, ఎమ్మెల్సీ నాగబాబుకు మరో కీలక పదవి!

ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో మరో ముఖ్య పరిణామం చోటుచేసుకుంది. జనసేన ముఖ్య నాయకుడు, ఎమ్మెల్సీ కొణిదెల నాగబాబుకు కూటమి ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యత కలిగిన బాధ్యతలను కేటాయించింది. రాష్ట్ర పర్యావరణ, అటవీ శాఖ పరిధిలోకి వచ్చే 'గ్రీన్ కార్యనిర్వాహక కమిటీ' ఛైర్మన్‌గా ఆయనను నియమిస్తూ ప్రభుత్వం అధికారికంగా ఉత్తర్వులు విడుదల చేసింది. ఈ నియామకంతో పాటు ఆయనకు నేరుగా క్యాబినెట్ ర్యాంక్ హోదాను కల్పించడం గమనార్హం.

తెలంగాణలో 51% డిగ్రీ సీట్లు ఖాళీ.. అసలు కారణమేంటి?తెలంగాణSwechaa17 Aug 2026, 11:31 AM

తెలంగాణలో 51% డిగ్రీ సీట్లు ఖాళీ.. అసలు కారణమేంటి?

డిగ్రీ విద్య అనేది ఒకప్పుడు తెలంగాణలో లక్షలాది మంది విద్యార్థులకు సహజమైన ఉన్నత విద్యా మార్గంగా ఉండేది. ఇంటర్‌ తర్వాత BA, B.Com, B.Sc వంటి కోర్సుల్లో చేరడం సాధారణంగా కనిపించేది. కానీ ఇప్పుడు విద్యార్థుల ఆలోచనా విధానంలో స్పష్టమైన మార్పు కనిపిస్తోంది.

Swechaa Effect: 22-A భూతంగా చూపిస్తే సహించేది లేదు: మంత్రి పొంగులేటిస్వేచ్ఛ ఛైర్మన్ డెస్క్Swechaa17 Aug 2026, 11:22 AM

Swechaa Effect: 22-A భూతంగా చూపిస్తే సహించేది లేదు: మంత్రి పొంగులేటి

నిషేధిత భూముల (Section 22-A) పేరిట సామాన్య ప్రజలను ఇబ్బందులకు గురిచేస్తున్న తీరుపై ‘స్వేచ్ఛ’ దినపత్రిక ప్రచురించిన వరుస కథనాలకు రాష్ట్ర ప్రభుత్వం తీవ్రంగా స్పందించింది. ప్రజా సమస్యలను వెలుగులోకి తెస్తూ ప్రచురించిన కథనాలపై రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి తక్షణమే సమీక్షకు ఆదేశించారు. ఈ మేరకు సచివాలయంలో రంగారెడ్డి, మేడ్చల్-మల్కాజిగిరి, సంగారెడ్డి, హైదరాబాద్ జిల్లాల కలెక్టర్లు, అడిషనల్ కలెక్టర్లు, ఆర్డీఓలు, సబ్ రిజిస్ట్రార్లతో ఆయన ఉన్నత స్థాయి సమీక్షా సమావేశం నిర్వహించారు.

నేడు ‘టిమ్స్’ ఆస్పత్రిని ప్రారంభించనున్న సీఎం రేవంత్..తెలంగాణSwechaa17 Aug 2026, 11:19 AM

నేడు ‘టిమ్స్’ ఆస్పత్రిని ప్రారంభించనున్న సీఎం రేవంత్..

హైదరాబాద్ మహానగరంలో రాష్ట్ర ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్మించిన సనత్ నగర్‘టిమ్స్’ ఆస్పత్రిని సీఎం రేవంత్ రెడ్డి నేడు ప్రారంభించనున్నారు. ఆయన వెంట ఆరోగ్యశాఖ మంత్రి దామోదర రాజనరసింహా, ఇతర మంత్రులు, ముఖ్య అధికారులు సైతం పాల్గొంటారని సమాచారం. టిమ్స్ ఆస్పత్రి నిర్మాణం పూర్తయి చాలా రోజులు గడుస్తున్నా ప్రారంభం మాత్రం కొంతకాలంగా వాయిదా పడుతూ వస్తున్న విషయం తెలిసిందే.

Uber : మరో 100 సిటీల్లో ‘ఉబెర్’ సేవలు.. ఆ ఏజ్ వారే టార్గెట్!వ్యాపారంSwechaa17 Aug 2026, 11:01 AM

Uber : మరో 100 సిటీల్లో ‘ఉబెర్’ సేవలు.. ఆ ఏజ్ వారే టార్గెట్!

రవాణా సేవల విభాగంలో కీలకపాత్ర పోషిస్తున్న ఉబెర్..మరిన్ని నగరాల్లో తమ సేవలు విస్తరించేందుకు నిర్ణయించింది.ప్రస్తుతం మెట్రోసిటీస్, రద్దీగా ఉండే నగరాల్లో ఉబెర్ సేవలు అందుబాటులో ఉన్నాయి.ఇక మీద సెమీ సిటీస్‌లోనూ పెరుగుతున్న జనాభాకు అనుగుణంగా సేవలను మరింత వ్యాప్తి చేయాలని కసరత్తు చేస్తున్నట్టు సమాచారం. ప్రధానంగా టైర్-2, టైర్-3 మార్కెట్లలో సత్తా చాటేందుకు ఉబెర్ యోచన చేస్తున్నట్టు తెలిసింది. ఈ క్రమంలోనే దేశవ్యాప్తంగా మరో 100 నగరాలకు ఉబెర్ తన టూవీలర్ (బైక్) సేవలను విస్తరించింది. మొత్తంగా 18 రాష్ట్రాలు, ఒక కేంద్రపాలిత ప్రాంతం పరిధిలోని మొత్తం 220కు పైగా నగరాల్లో ఉబెర్ రవాణా సేవలు అందుబాటులోకి వచ్చాయి.

Srinidhi Shetty: ఆదర్శ కుంటుంబమే ఆఖరి సినిమానా?సినిమాSwechaa17 Aug 2026, 10:54 AM

Srinidhi Shetty: ఆదర్శ కుంటుంబమే ఆఖరి సినిమానా?

Srinidhi Shetty: ప్రస్తుతం శ్రీనిధి పరిస్థితి చూస్తుంటే చేతిలో ఉన్న ఈ ఆదర్శ కుంటుంబం చిత్రమే ఆఖరి సినిమాలా కనిపిస్తోంది. కేజీఎఫ్ సిరీస్‌తో పాన్ ఇండియా వైడ్‌గా పాపులారిటీని అందుకొని, క్రేజ్ తెచ్చుకుంది ఈ కన్నడ భామ. వాస్తవానికి, కేజీఎఫ్ పార్ట్ 1 భారీ హిట్ తర్వాత వరుసగా అరడజను సినిమాలలో ఆఫర్స్ వచ్చాయని, హ్యూజ్ రెమ్యునరేషన్ డిమాండ్ చేసి వాటిని వదులుకుందని అప్పట్లో ప్రచారం జరిగింది.

హైదరాబాద్‌లో ఘోరం.. గోనె సంచిలో యువతి బాడీ!క్రైమ్Swechaa17 Aug 2026, 10:34 AM

హైదరాబాద్‌లో ఘోరం.. గోనె సంచిలో యువతి బాడీ!

హైదరాబాద్ మహానగరంలో మరో భయానక ఘటన వెలుగుచూసింది. ఓ ఇంట్లోని గోనె సంచిలో యువతి మృతదేహం లభ్యమైంది. పక్కింట్లో నుంచి దుర్వాసన రావడంతో స్థానికులు వెళ్లి చూడగా.. సంచి మూటకట్టి ఉండటాన్ని గమనించారు. దాని మీద రక్తపు మరకలు ఉండటంతో వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. వారు అక్కడకు చేరుకుని పరిశీలించగా.. గోనె సంచిలో యువతి మృతదేహం కనిపించడంతో అంతా షాక్ అయ్యారు. పెళ్లి చేసుకోవాలని ఒత్తిడి చేయడంతో ప్రియురాలిని ప్రియుడే దారుణంగా హత్య చసి గోనె సంచిలో మూటగట్టి అక్కడి నుంచి పరార్ అయినట్టు సమాచారం.

నేను మరో జీవన్ రెడ్డిని అవుతా.. కానీ! : చిన్నారెడ్డిరాజకీయాలుSwechaa17 Aug 2026, 10:22 AM

నేను మరో జీవన్ రెడ్డిని అవుతా.. కానీ! : చిన్నారెడ్డి

రాష్ట్రంలోని అధికార కాంగ్రెస్ పార్టీలో అసమ్మతి సెగలు నానాటికీ పెరుగుతున్నాయి. సీనియర్లు ఒకరి తర్వాత ఒకరు సర్కారు, పార్టీమీద ధిక్కార స్వరం వినిపిస్తున్నారు. ముందు నుంచి పార్టీలో పనిచేసే వారికి కాకుండా మధ్యలో వచ్చిన వారికి, డబ్బులు ఇచ్చిన వారికే పదవులు కట్టబెడుతున్నారని, పార్టీలో వారి పెత్తనమే నడుస్తోందని పలువురు సీనియర్లు వాపోతున్నారు. ఇప్పటికే మునుగోడు ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి, ఎమ్మెల్యే అనిరుధ్ రెడ్డి ధిక్కార స్వరం వినిపిస్తున్నారు. తాజాగా ఈ జాబితాలోకి కాంగ్రెస్ సీనియర్ నాయకుడు, రాష్ట్ర ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షుడు జి.చిన్నారెడ్డి వచ్చి చేరారు. నిన్న ఓ కార్యక్రమంలో మాట్లాడుతూ.. సీఎం రేవంత్ రెడ్డి మీద కాంగ్రెస్ పార్టీ మీద తీవ్ర విమర్శలు చేశారు. తాను కూడా జీవన్ రెడ్డిలా తిరగబడాలని అనుకుంటున్నట్టు పేర్కొన్నారు. వనపర్తి ఎమ్మెల్యే మేఘారెడ్డిపైనా చిన్నారెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు.

చిత్రం లేదు
InternationalSwechaa17 Aug 2026, 10:12 AM

Donald Trump: కిమ్‌తో దోస్తీకి సిద్ధంగా ట్రంప్.. సౌత్ కొరియాకు భారీ షాక్!

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఎప్పుడు ఎలాంటి నిర్ణయం తీసుకుంటాడో ఎవరికీ అంతుచిక్కదు. తాజాగా ఆయన మరో సంచలన నిర్ణయంతో అంతర్జాతీయ రాజకీయాల్లో తీవ్ర చర్చకు తెరతీశారు. దక్షిణ కొరియాతో కలిసి ఏటా నిర్వహించే ఉమ్మడి సైనిక విన్యాసాల పరిమాణాన్ని గణనీయంగా తగ్గించాలని డిసైడ్ అయ్యాడు. ఈ మేరకు పెంటగాన్ చీఫ్ పీట్ హెగ్‌సెత్‌ను ఆదేశించారు. ఈ మిలిటరీ డ్రిల్స్ అత్యంత ఖర్చుతో కూడుకున్నవని ట్రంప్ పేర్కొన్నాడు.

నిరుద్యోగులకు గుడ్‌న్యూస్.. టీచర్ పోస్టులకు నోటిఫికేషన్.. అర్హతలు ఇవే!తెలంగాణSwechaa17 Aug 2026, 10:09 AM

నిరుద్యోగులకు గుడ్‌న్యూస్.. టీచర్ పోస్టులకు నోటిఫికేషన్.. అర్హతలు ఇవే!

నల్గొండ, సూర్యాపేట జిల్లాల పరిధిలోని గిరిజన గురుకుల పాఠశాలలు, కళాశాలల్లో పార్ట్‌టైమ్ ఉద్యోగాల భర్తీకి అర్హులైన అభ్యర్థుల నుంచి దరఖాస్తులను ఆహ్వానిస్తున్నట్లు రీజినల్ కోఆర్డినేటర్ శ్రీనివాస్‌రావు ఒక ప్రకటనలో తెలిపారు. అర్హత కలిగిన అభ్యర్థులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని ఆయన సూచించారు.. ఈ నేపథ్యంలో నల్గొండ జిల్లాలో డిగ్రీ లెక్చరర్లు, జూనియర్ లెక్చరర్లు, పీజీటీ, టీజీటీ విభాగాల్లో మొత్తం 19 పోస్టులను భర్తీ చేయనున్నట్లు వెల్లడించారు. ఆసక్తి కలిగిన వారు ఈనెల 22 న సాయంత్రం 5 గంటల వరకు నల్గొండలోని మహిళా సమాఖ్య భవన్​లో ఉన్న ప్రాంతీయ సమన్వయాధికారి కార్యాలయంలో దరఖాస్తు చేసుకోవాలని తెలిపారు.

TG: కేజీబీవీలో ఫుడ్ పాయిజన్.. 18మంది విద్యార్థినులకు అస్వస్థత!తెలంగాణSwechaa17 Aug 2026, 09:43 AM

TG: కేజీబీవీలో ఫుడ్ పాయిజన్.. 18మంది విద్యార్థినులకు అస్వస్థత!

సిద్దిపేట జిల్లా మద్దూరు మండల కేంద్రంలోని కస్తూర్బా గాంధీ బాలికల విద్యాలయం (కేజీబీవీ) గురుకుల పాఠశాలలో ఫుడ్ పాయిజన్ కావడం తీవ్ర కలకలం రేపింది. పాఠశాలలో రాత్రి భోజనం చేసిన అనంతరం విద్యార్థినులు ఒక్కసారిగా కడుపునొప్పి, వాంతులతో అస్వస్థతకు గురయ్యారు. ఒకేసారి 18 మంది బాలికలు తీవ్ర తీవ్ర అస్వస్థతకు లోను కావడంతో పాఠశాల ప్రాంగణంలో భయాందోళనలు నెలకొన్నాయి. ఘటనను గమనించిన పాఠశాల సిబ్బంది, ఉపాధ్యాయులు వెంటనే స్పందించి అస్వస్థతకు గురైన విద్యార్థినులను స్థానిక ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.

ప్రముఖ ఆలయంలో విషాదం.. భక్తుల ప్రాణాలు తీసిన తొక్కిసలాట!..క్రైమ్Swechaa17 Aug 2026, 09:33 AM

ప్రముఖ ఆలయంలో విషాదం.. భక్తుల ప్రాణాలు తీసిన తొక్కిసలాట!..

బిహార్‌లోని లఖీసరాయ్ జిల్లాలో ప్రముఖ అశోక్‌ధామ్ ఆలయంలో సోమవారం ఉదయం తీవ్ర విషాదం చోటుచేసుకుంది. శ్రావణమాసం సోమవారం కావడంతో శివుడి దర్శనం కోసం వేలాది మంది భక్తులు ఆలయానికి తరలివచ్చారు. దర్శనం కోసం క్యూ లైన్లలో వేచి ఉన్న సమయంలో ఒక్కసారిగా విద్యుత్ తీగ తెగిపడటంతో భక్తుల్లో భయాందోళనలు నెలకొన్నాయి. విద్యుత్‌ షాక్‌ తగులుతుందనే భయంతో వారంతా బయటకు పరుగులు తీయడంతో తొక్కిసలాట చోటు చేసుకుంది.. ఉదయం సుమారు 6:45 గంటల సమయంలో జరిగిన ఈ ఘటనలో ఏడుగురు భక్తులు ప్రాణాలు కోల్పోయినట్లు ప్రాథమిక సమాచారం. మరో 12 మందికి పైగా గాయపడినట్లు తెలుస్తోంది. వీరిలో కొందరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం.

Bhogapuram: భోగాపురం ఎయిర్‌పోర్ట్‌లో తొలి విమానం ల్యాండ్!ఏపీSwechaa17 Aug 2026, 09:23 AM

Bhogapuram: భోగాపురం ఎయిర్‌పోర్ట్‌లో తొలి విమానం ల్యాండ్!

విజయనగరం జిల్లా భోగాపురంలో అత్యంత ఆధునిక సదుపాయాలతో నిర్మించిన 'అల్లూరి సీతారామరాజు అంతర్జాతీయ విమానాశ్రయం' నుంచి వాణిజ్య విమాన సర్వీసులు నేడు(సోమవారం) అధికారికంగా ప్రారంభమయ్యాయి. హైదరాబాద్ నుంచి బయలుదేరిన ఇండిగో (6E6408) విమానం ఉదయం 6:45 గంటలకు భోగాపురం రన్‌వేపై విజయవంతంగా ల్యాండ్ అవ్వడంతో ఈ నూతన ఎయిర్‌పోర్ట్ కార్యకలాపాలు లాంఛనంగా మొదలయ్యాయి. నూతన విమానాశ్రయానికి చేరుకున్న తొలి విమానానికి, ప్రయాణికులకు జీఎంఆర్ ఎయిర్‌పోర్ట్స్, పౌర విమానయాన శాఖ అధికారులు అత్యంత ఘనంగా స్వాగతం పలికారు.