స్వేచ్ఛ షార్ట్స్ — తాజా తెలుగు వార్తలు

బీఆర్ఎస్‌ది దొంగ ప్రేమ: మంత్రి తుమ్మల నాగేశ్వరరావు!తెలంగాణSwechaa18 Aug 2026, 11:01 AM

బీఆర్ఎస్‌ది దొంగ ప్రేమ: మంత్రి తుమ్మల నాగేశ్వరరావు!

రైతు రుణమాఫీ అంశంపై ప్రతిపక్ష బీఆర్ఎస్ నాయకులు చేస్తున్న విమర్శలపై రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. రుణమాఫీ గురించి మాట్లాడే నైతిక హక్కు బీఆర్ఎస్ పార్టీకి ఎంతమాత్రం లేదని మండిపడ్డారు. పదేళ్ల పాలనలో రైతాంగాన్ని పూర్తిగా నిర్లక్ష్యం చేసిన ఆ పార్టీ నేతలు, ప్రస్తుతం కేవలం రాజకీయ ప్రయోజనాల కోసమే ప్రభుత్వంపై నిరాధారమైన ఆరోపణలు చేస్తూ కపట ప్రేమ నటిస్తున్నారని ఎద్దేవా చేశారు.

1500 మంది పోలీసుల పహారాతో పెద్ది సుదర్శన్ విగ్రహం కూల్చివేత!తెలంగాణSwechaa18 Aug 2026, 10:43 AM

1500 మంది పోలీసుల పహారాతో పెద్ది సుదర్శన్ విగ్రహం కూల్చివేత!

నర్సంపేట బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే, దివంగత పెద్ది సుదర్శన్ రెడ్డి విగ్రహాన్ని నిన్న అర్ధరాత్రి కూల్చివేశారు. భారీ బందోబస్తు నడుమ ఈ కూల్చివేత కొనసాగినట్టు తెలుస్తోంది. నర్సంపేట పట్టణంలోని మెడికల్ కాలేజీ సమీపంలో బీఆర్ఎస్ నేతలు పెద్ది సుదర్శన్ రెడ్డి విగ్రహాన్ని ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే. దాన్ని అక్రమంగా ఎటువంటి అనుమతులు లేకుండా ఏర్పాటు చేశారని మున్సిపల్ అధికారులు ఆరోపిస్తున్నారు. అయితే,పెద్ది విగ్రహం విషయంలో కాంగ్రెస్ ప్రభుత్వం కావాలనే కుట్ర పూరితంగా వ్యవహరిస్తోందని, ఇప్పటికే సిటీలో చాలా వరకు అనుమతులు లేకుండా ఏర్పాటు చేసిన విగ్రహాలు ఉన్నాయని, మరి వాటిమీద ఎందుకు చర్యలు తీసుకోవడం లేదని బీఆర్ఎస్ నేతలు ప్రశ్నిస్తున్నారు. అయితే, నిన్నరాత్రి సుమారు 1500 మంది పోలీసుల భద్రత నడుమ పెద్ది సుదర్శన్ రెడ్డి విగ్రహాన్ని తొలగించినట్టు సమాచారం.

ఓటర్ల లిస్టులో పేరు లేదా? మళ్లీ ఓటు హక్కు పొందడం ఎలా అంటే!తెలంగాణSwechaa18 Aug 2026, 10:28 AM

ఓటర్ల లిస్టులో పేరు లేదా? మళ్లీ ఓటు హక్కు పొందడం ఎలా అంటే!

తెలంగాణలో ఇటీవల ముగిసిన ప్రత్యేక ముసాయిదా సేకరణ (SIR) ప్రక్రియ అనంతరం ఎన్నికల సంఘం ముసాయిదా ఓటర్ల జాబితాను విడుదల చేసింది. మొత్తం 3.38 కోట్ల మంది ఓటర్లలో 2.64 కోట్ల మంది నమోదు పత్రాలు డిజిటలైజ్ కాగా, దాదాపు 1.71 కోట్ల మంది ఓటర్ల పేర్లు ఎలాంటి అభ్యంతరాలు లేకుండా నమోదయ్యాయి. కాగా 92.87 లక్షల మందికి తగిన ఆధారాలు నిర్ధారించుకోవడానికి ఈసీ నోటీసులు జారీ చేయనుండగా, ఇప్పటికే దాదాపు 73.39 లక్షల ఓట్లను వివిధ కారణాలతో తొలగించారు.

Ram Charan: ఇరుముడి లో మెగా పవర్ స్టార్..అందుకే, ఈ న్యూస్ వైరల్!సినిమాSwechaa18 Aug 2026, 10:26 AM

Ram Charan: ఇరుముడి లో మెగా పవర్ స్టార్..అందుకే, ఈ న్యూస్ వైరల్!

Ram Charan: మాస్ మహారాజ్ రవితేజ నటించిన ఇరుముడి సినిమా ఈ ఆగస్టు 21న భారీ స్థాయిలో ప్రేక్షకుల ముందుకు వస్తోంది. ఇప్పటికే, ఈ సినిమా నుంచి వచ్చిన సాంగ్స్, టీజర్, ట్రైలర్స్‌కి మంచి బజ్ క్రియేట్ అయి సినిమా బ్లాక్ బస్టర్ అనే టాక్ వచ్చింది. అయితే, ఇటీవల వచ్చిన మల్లెపూల పల్లకి సాంగ్ ఇప్పుడు యూట్యూబ్‌లో బాగా ట్రెండ్ అవుతుండగా, ఈ సాంగ్‌లో చరణ్ కనిపించనున్నట్టుగా ప్రచారం జరుగుతోంది. నిజంగా చరణ్ ఉన్నాడా లేదా అనేది ఇరుముడి సినిమా రిలీజ్ అయ్యాకే తెలుస్తుంది.

నీరు నిండినా దండగే.. ముందుచూపు లేని పాలనపై రైతుల ఆందోళన!తెలంగాణSwechaa18 Aug 2026, 10:18 AM

నీరు నిండినా దండగే.. ముందుచూపు లేని పాలనపై రైతుల ఆందోళన!

నిర్మల్ జిల్లాలోని కడెం ప్రాజెక్టు పరిస్థితి ఇప్పుడు ప్రభుత్వ ముందుచూపుపై ప్రశ్నలు లేవనెత్తుతోంది. ప్రాజెక్టు పూర్తి సామర్థ్యం ఏడు టీఎంసీలు. కానీ భారీగా పూడిక పేరుకుపోవడంతో ప్రస్తుతం నిల్వ చేసుకోగలిగేది సుమారు మూడున్నర టీఎంసీల నీరే. ఫలితంగా భారీ వరద వచ్చినా ఆ నీటిని పూర్తిస్థాయిలో నిల్వ చేసుకునే పరిస్థితి లేకుండా పోయింది. ఇటీవల కడెం ప్రాజెక్టులోకి ఏకంగా లక్షల క్యూసెక్కుల వరద చేరింది. 16 గేట్లు ఎత్తి నీటిని దిగువకు విడుదల చేయాల్సి వచ్చింది. అంటే ప్రాజెక్టు నిండినా నీరు మిగలని పరిస్థితి నెలకొంది. మరోవైపు ప్రాజెక్ట్ ల్లో వాటర్ నిండకుంటే ఇబ్బందులు వస్తాయని ఆందోళన చెందుతున్న ప్రభుత్వం.. నీరు ఉన్నప్పుడే దాన్ని నిల్వ చేసుకునే సామర్థ్యాన్ని పెంచడంలో ఎందుకు చర్యలు చేపట్టలేకపోయింది అనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి.

మంత్రి వ్యాఖ్యల కలకలం.. అసెంబ్లీలో క్షమాపణ చెప్పిన సీఎం విజయ్!రాజకీయాలుSwechaa18 Aug 2026, 09:53 AM

మంత్రి వ్యాఖ్యల కలకలం.. అసెంబ్లీలో క్షమాపణ చెప్పిన సీఎం విజయ్!

తమిళనాడు శాసనసభ సమావేశాల్లో తీవ్ర దుమారం రేపిన ఓ వివాదానికి ముఖ్యమంత్రి సమయస్ఫూర్తితో తెరపడింది. అసెంబ్లీలో పద్దులపై చర్చ సందర్భంగా డీఎంకే దివంగత నేత, మాజీ ముఖ్యమంత్రి ఎం. కరుణానిధిని గౌరవసూచకమైన బిరుదులు లేకుండా నేరుగా పేరుతో ప్రస్తావించిన అటవీశాఖ మంత్రి ఆర్.వి. రంజిత్ కుమార్ వ్యాఖ్యలపై ప్రతిపక్షాలు తీవ్ర నిరసన వ్యక్తం చేశాయి. అయితే పరిస్థితి తీవ్రతను గమనించిన ముఖ్యమంత్రి సి. జోసెఫ్ విజయ్ వెంటనే జోక్యం చేసుకుని, సదరు మంత్రి తరఫున సభకు క్షమాపణలు చెప్పడంతో సభలో శాంతియుత వాతావరణం నెలకొంది.

ఒక్క ఫోన్ కాల్.. 1.5 కోట్లు మాయం!..క్రైమ్Swechaa18 Aug 2026, 09:52 AM

ఒక్క ఫోన్ కాల్.. 1.5 కోట్లు మాయం!..

విశాఖలో భారీ సైబర్ మోసం వెలుగులోకి వచ్చింది. ‘డిజిటల్ అరెస్ట్’ పేరుతో 76 ఏళ్ల విశ్రాంత ఉద్యోగి దంపతులను భయపెట్టి.. వారి జీవితకాల పొదుపు సుమారు రూ.1.5 కోట్లకు పైగా కాజేశారు సైబర్ నేరగాళ్లు. పోలీస్, సీబీఐ, ఈడీ అధికారులమంటూ ఫోన్ చేసి.. ఆర్బీఐ ఫండ్ వెరిఫికేషన్ పేరుతో డబ్బును వివిధ ఖాతాలకు బదిలీ చేయించారు. ఈ కేసులో కేరళకు చెందిన కమీషన్ ఏజెంట్ షబ్బీర్‌ను పోలీసులు అరెస్టు చేశారు.

తెలంగాణ భూములపై రాజకీయ నాయకుల డ్రామాలు!..స్వేచ్ఛ ఛైర్మన్ డెస్క్Swechaa18 Aug 2026, 09:28 AM

తెలంగాణ భూములపై రాజకీయ నాయకుల డ్రామాలు!..

ప్రపంచంలో ఏ యుద్ధం అయినా భూమి కోసమే జరిగింది. భూ సరిహద్దుల కోసమే రాజ్యాలు కూలిపోయాయి. నిలబడ్డాయి. భూమిని ఎవరు ఎలా అనుభవించాలో కాలానుకూలంగా చట్టాలు తయారు చేశారు. తెలివితో చంద్ర మండలంపై కూడా ప్లాట్లు అమ్మే ఈ రోజుల్లో జీవితాంతం కష్టపడుతూ ఈఎంఐలు కట్టుకుంటూ సొంతిల్లు కొనుగోలు చేసుకున్నా కనీసం అది అమ్ముకునే హక్కు కూడా లేదని చెబితే ఎలా అని ప్రశ్నించే స్థితి వచ్చింది. ఇదంతా ఒక్క రోజులో జరిగింది కాదు. నాయకులకు తెలిసే జరిగిన వ్యవహారమేనన్న ఆరోపణలు ఉన్నాయి. కావాలనే భూస్వాములు, పెత్తందారులు కొత్త చట్టాల్లోని లొసుగులను గుర్తించి ఎలా పైకి వచ్చారో.. గత ఆరేళ్ల క్రితం ధరణి పేరుతో పుట్టుకొచ్చిన పుత్రిక కూడా పేదల జీవితాల్లో, వారి కష్టార్జిత భూముల్లో చీకటి రోజులను తీసుకొచ్చిందనే విమర్శలు ఉన్నాయి.

నేటి బంగారం, వెండి ధరలు ఇవే!వ్యాపారంSwechaa18 Aug 2026, 09:26 AM

నేటి బంగారం, వెండి ధరలు ఇవే!

దేశీయ మార్కెట్‌లో మంగళవారం బంగారం ధరలు స్వల్పంగా పుంజుకోగా, వెండి ధరల్లో స్వల్ప ఉపశమనం కనిపించింది. పసిడి కొనుగోలుదారులకు ధరల పెరుగుదల కొంత భారంగా మారినప్పటికీ, వెండి ప్రియులకు మాత్రం స్వల్పంగా తగ్గిన రేట్లు ఊరట కలిగించాయి. అంతర్జాతీయ మార్కెట్లలో చోటుచేసుకుంటున్న ఆర్థిక పరిణామాలే ఈ ధరల హెచ్చుతగ్గులకు ప్రధాన కారణమని మార్కెట్ నిపుణులు విశ్లేషిస్తున్నారు.

స్వేచ్ఛ ఎఫెక్ట్..  తప్పు ఒప్పుకున్న మంత్రి పొంగులేటితెలంగాణSwechaa18 Aug 2026, 09:24 AM

స్వేచ్ఛ ఎఫెక్ట్.. తప్పు ఒప్పుకున్న మంత్రి పొంగులేటి

నిషేధిత భూముల జాబితా అంశంలో పొరపాటు జరిగినట్లు రాష్ట్ర రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి తప్పు ఒప్పుకున్నారు. 22ఏ భూముల జాబితా వివాదంపై గత కొన్ని రోజులుగా స్వేచ్ఛ న్యూస్ అనేక కథనాలు రాసింది. ప్రైవేట్ ఆస్తులను కూడా నిషేధిత జాబితాలో చేర్చిన వైనాన్ని వెలుగులోకి తెచ్చింది. భూ బాధితులకు అండగా నిలబడింది. వారి వాయిస్‌ను బలంగా వినిపించింది. నిషేధిత భూముల జాబితా అప్ డేట్‌లో పొరపాట్లు జరిగాయని వరుసగా కథనాలు ఇచ్చింది. స్వేచ్ఛ న్యూస్ ఛైర్మన్ దేవేందర్ రెడ్డి చింతకుంట్ల 22ఏ పై బీబీసీకి కూడా వివరాలు ఇచ్చారు.

తెలంగాణ పోలీసుల్లో AI ఎంట్రీ.. Dial 112కి కాల్ చేస్తే ఏం జ‌రుగుతుందో తెలుసా..?తెలంగాణSwechaa18 Aug 2026, 09:16 AM

తెలంగాణ పోలీసుల్లో AI ఎంట్రీ.. Dial 112కి కాల్ చేస్తే ఏం జ‌రుగుతుందో తెలుసా..?

తెలంగాణ పోలీసులు AI ఆధారిత Next-Generation Dial 112 వ్యవస్థను ప్రారంభించారు. అత్యవసర కాల్స్‌ను AI ఎలా విశ్లేషిస్తుంది? లొకేషన్ గుర్తింపు, వేగవంతమైన డిస్పాచ్, డ్రోన్లు, T-SPARKతో పోలీసింగ్ ఎలా మారనుంది?

పితృ కార్యాలు అంటే ఏమిటి? వాటిలో ఉన్నఆథ్యాత్మిక రహస్యం ఏంటి?..SpiritualitySwechaa18 Aug 2026, 08:31 AM

పితృ కార్యాలు అంటే ఏమిటి? వాటిలో ఉన్నఆథ్యాత్మిక రహస్యం ఏంటి?..

పితృ కార్యాలు అంటే మనకు జన్మనిచ్చిన పూర్వీకులకు సమర్పించే కృతజ్ఞతా పూర్వక నివేదన. భౌతిక శరీరం నశించినా ఆత్మ ప్రయాణం కొనసాగుతుందని, మన రక్తంలో వారి జన్యువులు ఉంటాయని మన శాస్త్రాలు చెబుతున్నాయి. శ్రాద్ధ కర్మల్లో ఇచ్చే తిల తర్పణాలు, పిండ ప్రదానం మరియు అన్నదానం వల్ల సూక్ష్మ రూపంలో ఉన్న పితృ దేవతలకు శక్తి, తృప్తి లభిస్తాయి. పితృ కార్యాలు చేయడం వల్ల పితృ దోషాలు తొలగి, కుటుంబంలో ప్రశాంతత, వంశాభివృద్ధి కలుగుతాయి. మన మూలాలను గౌరవించడమే ఈ సనాతన ధర్మ కర్మల అసలైన ఆధ్యాత్మిక రహస్యం అని పండితులు చెబుతారు.

ఆధ్యాత్మిక సాధనలో ఉన్నత స్థానాన్ని చేరుకోవాలంటే ఎలా?..SpiritualitySwechaa18 Aug 2026, 08:07 AM

ఆధ్యాత్మిక సాధనలో ఉన్నత స్థానాన్ని చేరుకోవాలంటే ఎలా?..

ఆధ్యాత్మిక సాధన అంటే కేవలం ధ్యానం చేయడం, పూజలు నిర్వహించడం లేదా ఆధ్యాత్మిక గ్రంథాలను చదవడం మాత్రమే కాదు. మనిషి తనలోని అశాంతిని, అహంకారాన్ని, కోరికలను, భయాలను దాటి తన అసలైన స్వరూపాన్ని తెలుసుకునే అంతర్గత ప్రయాణమే నిజమైన ఆధ్యాత్మిక సాధన. భారతీయ తత్వశాస్త్రంలో ఈ ప్రయాణానికి ఆత్మవిచారణ, ధ్యానం, సదాచారం, జ్ఞానం, భక్తి, సేవ వంటి మార్గాలను సూచించారు.

ఈ సాధనలో మొదటి మెట్టు మనస్సుపై నియంత్రణ. భగవద్గీతలో శ్రీకృష్ణుడు మనస్సే మనిషికి మిత్రుడిగా, శత్రువుగా మారగలదని వివరిస్తాడు. అందుకే ప్రతిరోజూ కొంత సమయం నిశ్శబ్దంగా కూర్చొని శ్వాసను గమనించడం, ఆలోచనలను పరిశీలించడం ద్వారా మనస్సును క్రమంగా స్థిరపరచుకోవాలి. ధ్యానం లక్ష్యం.. ఆలోచనలను బలవంతంగా ఆపడం కాదు.. వాటికి బానిస కాకుండా గమనించడం.

కాంగ్రెస్‌లో మళ్లీ విభేదాల సెగ.. చిన్నారెడ్డి వర్సెస్ మేఘారెడ్డి!..తెలంగాణSwechaa18 Aug 2026, 08:01 AM

కాంగ్రెస్‌లో మళ్లీ విభేదాల సెగ.. చిన్నారెడ్డి వర్సెస్ మేఘారెడ్డి!..

వనపర్తి కాంగ్రెస్‌లో మరోసారి అంతర్గత విభేదాలు బయటపడ్డాయి. రాష్ట్ర ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షుడు చిన్నారెడ్డి చేసిన భావోద్వేగ వ్యాఖ్యలు.. రాజకీయంగా చర్చకు దారితీశాయి. తన 48 ఏళ్ల కాంగ్రెస్ ప్రస్థానంలో ఎన్నో కష్టాలను ఎదుర్కొన్నానని, పార్టీలో జరుగుతున్న పరిణామాలను భరిస్తూనే ముందుకు సాగుతున్నానని చిన్నారెడ్డి అన్నారు. గోపాల్‌పేట మండల కాంగ్రెస్ పార్టీ కార్యాలయ ప్రారంభోత్సవం సందర్భంగా మాట్లాడిన ఆయన.. పార్టీలో కొంతకాలంగా తప్పులు జరుగుతున్నాయని ఆరోపించారు. తప్పులు చేస్తున్న వారిని బయటకు పంపించే రోజు వస్తుందని, తాము పార్టీని వీడేది లేదని స్పష్టం చేశారు. స్వార్థపరుల కారణంగా కాంగ్రెస్ పార్టీకి నష్టం జరిగిందని ఆవేదన వ్యక్తం చేశారు. వనపర్తి అభివృద్ధి తప్ప ఎలాంటి అక్రమాలు, అవినీతికి పాల్పడలేదని చిన్నారెడ్డి పేర్కొన్నారు.

తెలంగాణలో ఓటర్ లిస్ట్‌పై అసలు గేమ్ స్టార్ట్.. కాంగ్రెస్‌కు SIR టెన్షన్.. BRS, BJP వ్యూహమేంటి?తెలంగాణSwechaa17 Aug 2026, 11:52 PM

తెలంగాణలో ఓటర్ లిస్ట్‌పై అసలు గేమ్ స్టార్ట్.. కాంగ్రెస్‌కు SIR టెన్షన్.. BRS, BJP వ్యూహమేంటి?

SIRకు ముందు తెలంగాణలో 3.38 కోట్ల మందికిపైగా ఓటర్లు ఉండగా.. దాదాపు 73.39 లక్షల ఎలక్టర్లకు సంబంధించిన ఎన్యుమరేషన్ ఫారాలు ‘అన్‌కలెక్టబుల్‌’గా గుర్తించారు. ఇందులో చనిపోయిన వారు, ఇతర ప్రాంతాలకు తరలిపోయిన వారు, అందుబాటులో లేని వారు, డూప్లికేట్ ఓటర్లు వంటి విభాగాలు ఉన్నాయి.

Harish Rao: కొత్త బీమా పథకంతో 13లక్షల మంది రైతులకు అన్యాయం- హరీశ్ రావుతెలంగాణSwechaa17 Aug 2026, 11:30 PM

Harish Rao: కొత్త బీమా పథకంతో 13లక్షల మంది రైతులకు అన్యాయం- హరీశ్ రావు

నాడు కేసీఆర్ ప్రవేశపెట్టిన రైతు బీమా పథకం ప్రపంచానికే ఆదర్శంగా నిలిచిందని హరీశ్ రావు అన్నారు. రాష్ట్రంలో 42 లక్షల 15 వేల మందికి ఈ పథకం ఒక భరోసా ఇచ్చిందని తెలిపారు. కానీ, ఆగస్టు 13 నుంచి ఈ రైతు బీమా పథకాన్ని ప్రభుత్వం కుట్రపూరితంగా ఆపేసిందని ఆరోపించారు. కేసీఆర్ తెచ్చిన మంచి పథకాలను ఒక్కొక్కటిగా తీసేయడమే ఈ కాంగ్రెస్ ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుందని ధ్వజమెత్తారు. ఈ ప్రభుత్వం కొత్తగా తెచ్చే బీమా పథకం వల్ల ఏకంగా 13 లక్షల మంది రైతులు బీమాకు దూరం అవుతున్నారని ఆరోపించారు.

అందుకే నో చెప్పలేకపోయాను..!సినిమాSwechaa17 Aug 2026, 11:21 PM

అందుకే నో చెప్పలేకపోయాను..!

Samantha: సమంత హోస్ట్‌గా తమిళంలో మాస్టర్ ఛెఫ్ కార్యక్రమం ప్రారంభం కాబోతుంది. దీనికి, సమంత హోస్ట్‌గా వ్యవహరిస్తున్నారు. ఇటీవల దీనికి సంబందించిన వార్తలు వచ్చాయి. ఇప్పుడు అధికారికంగా వెల్లడైంది. సోనీ పిక్చర్స్ నెట్‌వర్క్స్ ఇండియా తాజాగా ప్రకటించిన ఈ పాపులర్ కుకింగ్ షోను సోనీ విజా, సోనీ లివ్‌లలో ప్రసారం చేయనున్నారు. దీనికి సంబందించిన పోస్టర్ కూడా వదిలారు.

Shiva Nirvana: రెండు హిట్లు రెండు ఫ్లాపులు..ఇరుముడితో హిట్టా ఫ్లాపా?సినిమాSwechaa17 Aug 2026, 10:47 PM

Shiva Nirvana: రెండు హిట్లు రెండు ఫ్లాపులు..ఇరుముడితో హిట్టా ఫ్లాపా?

Shiva Nirvana: శివ నిర్వాణ దర్శకత్వంలో వచ్చిన మొదటి సినిమా నిన్ను కోరి. నాని, నివేదా థామస్, ఆది పినిశెట్టి నటించారు. ఈ సినిమా మంచి హిట్ సినిమాగా నిలిచింది. 50 కోట్లకి పైగా వసూలు చేసింది నిన్ను కోరి. ఆ తర్వాత సమంత, నాగ చైతన్య, దివ్యాంశ కౌశిక్ ప్రధాన పాత్రల్లో మజిలీ వచ్చింది. ఈ సినిమా 70 కోట్లకి పైగా వసూళ్ళు రాబట్టి అందరికీ మంచి లాభాలను తెచ్చిపెట్టింది. కానీ, విజయ్ దేవరకొండ-సమంతలతో చేసిన ఖుషి, నానితో చేసిన టక్ జగదీష్ బాగా డిసప్పాయింట్ చేశాయి. మళ్ళీ, ఇప్పుడు ఇరుముడి సినిమాతో వస్తున్నాడు.

Dancer Shrasti Verma: బీజేపీలోకి శ్రష్ఠి వర్మ..ఇప్పుడే అవసరమా?సినిమాSwechaa17 Aug 2026, 09:50 PM

Dancer Shrasti Verma: బీజేపీలోకి శ్రష్ఠి వర్మ..ఇప్పుడే అవసరమా?

Dancer Shrasti Verma: శ్రష్ఠి వర్మ ఆగస్టు 17వ తేదీన హైదరాబాద్‌లోని తెలంగాణ బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో జరిగిన కార్యక్రమంలో పాల్గొని, అధికారికంగా బీజేపీలో చేరారు. బీజేపీ పార్టీ నేత రామచందర్‌రావు శ్రష్ఠి వర్మకి కాషాయ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఇక, నేడు శ్రష్టి వర్మతో పాటు కాస్టింగ్ డైరెక్టర్, నటుడు కిరణ్ సహా పలువురు యువతీయువకులు, సినీ పరిశ్రమకి చెందిన కళాకారులు కూడా బీజేపీ సభ్యత్వం తీసుకున్నారు.

పక్కా కుట్ర.. కల్యాణ లక్ష్మి పథకంపై హరీశ్ సంచలన వ్యాఖ్యలుతెలంగాణSwechaa17 Aug 2026, 09:33 PM

పక్కా కుట్ర.. కల్యాణ లక్ష్మి పథకంపై హరీశ్ సంచలన వ్యాఖ్యలు

పేదింటి ఆడబిడ్డల పెళ్లిళ్ల కోసం బీఆర్ఎస్ సర్కార్ తెచ్చిన కల్యాణ లక్ష్మి పథకాన్ని కాంగ్రెస్ ప్రభుత్వం పక్కా కుట్రతో, ఉద్దేశపూర్వకంగా నీరుగార్చి ఖతం చేసిందని హరీశ్ రావు ఆరోపించారు. కోర్టు స్టే ఇచ్చింది కాబట్టి ఆపేశాం అని ఇప్పుడు డ్రామాలు ఆడుతున్నారు. కానీ.. కోర్టు స్టే రాకముందే ఈ పథకాన్ని కాంగ్రెస్ సర్కారు పాతాళంలో బొంద పెట్టిందని ధ్వజమెత్తారు.

RAPO23: డే అండ్ నైట్ కష్టపడుతున్న ఎనర్జిటిక్ హీరో!సినిమాSwechaa17 Aug 2026, 09:19 PM

RAPO23: డే అండ్ నైట్ కష్టపడుతున్న ఎనర్జిటిక్ హీరో!

RAPO23: రామ్ పోతినేని తన 23వ సినిమాకి హీరోగా నటిస్తూనే దర్శకత్వం కూడా వహిస్తున్నాడు. అంతేకాదు, ఈ సినిమా కోసం రెండు షిఫ్టుల్లో పనిచేస్తూ యూనిట్ సభ్యులకే షాకిస్తున్నాడు. డే అండ్ నైట్ షూట్స్‌లో చాలా బిజీగా ఉన్నాడు. ఈ మూవీ కోసం పాండిచ్చేరిలో భారీ సెట్ వేసి షూటింగ్ జరిపారు. అయితే, 9 రోజుల షూటింగ్ మాత్రమే పూర్తైంది. రామ్ కమిట్‌మెంట్ చూసి ప్రతీ ఒక్కరూ ఆశ్చర్యపోవడమే కాదు, ప్రశంసలు కురిపిస్తున్నారట. చూడాలి, రామ్ మొదటి డైరెక్టోరియల్ మూవీ ఎలాంటి సక్సెస్ సాధిస్తుందో చూడాలి.

22ఏ వివాదం.. ఫిర్యాదుల కోసం టోల్ ఫ్రీ నెంబర్తెలంగాణSwechaa17 Aug 2026, 09:11 PM

22ఏ వివాదం.. ఫిర్యాదుల కోసం టోల్ ఫ్రీ నెంబర్

Toll Free Number: 22ఏ నిషేధిత భూముల అంశం తీవ్ర వివాదాస్పదం కావడంతో ప్రభుత్వం స్పందించింది. దిద్దుబాటు చర్యలు చేపట్టింది. రాష్ట్ర రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస రెడ్డి సచివాలయంలో కీలక సమీక్ష నిర్వహించారు. అనంతరం ఒక టోల్ ఫ్రీ నెంబర్ ప్రకటించారు. నిషేధిత భూముల అంశంలో ఏవైనా సమస్యలు ఉంటే టోల్ ఫ్రీ నెంబర్ 1800 599 4788 కాల్ చేసి ఫిర్యాదు చేయొచ్చని మంత్రి పొంగులేటి తెలిపారు.

22A.. 30శాతం కమీషన్ కోసమే- హరీశ్ రావు సంచలనంతెలంగాణSwechaa17 Aug 2026, 06:46 PM

22A.. 30శాతం కమీషన్ కోసమే- హరీశ్ రావు సంచలనం

దేశవ్యాప్తంగా 1999లోనే అర్బన్ ల్యాండ్ సీలింగ్ చట్టాన్ని రద్దు చేశారని, మన రాష్ట్రంలో 2008లో అప్పటి ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి ఆ చట్టాన్ని పూర్తిగా ఎత్తేశారని హరీశ్ గుర్తు చేశారు. కానీ ఆనాడు సీలింగ్ పరిధి నుంచి బయటపడి, క్లియర్ అయిన భూములను కూడా ఈ ప్రభుత్వం ఇప్పుడు మళ్లీ తీసుకొచ్చి సీలింగ్ యాక్ట్ కింద 22A లో పెట్టడం ఏ రకమైన న్యాయం అని ప్రశ్నించారు. ఈ ప్రభుత్వానికి కనీస అవగాహన, పాలనపై పట్టు లేదనడానికి ఇదే నిదర్శనం అని విమర్శించారు. ఏకంగా ఎయిర్‌పోర్ట్, ఔటర్ రింగ్ రోడ్డు లాంటి ప్రభుత్వ భూములను కూడా 22A నిషేధిత జాబితాలో పెట్టారంటే ఈ అధికారుల పనితీరు ఎంత దారుణంగా ఉందో అర్థం చేసుకోవచ్చన్నారు.

సైలెంట్‌గా కానిచ్చేస్తున్న క్రిష్..సినిమాSwechaa17 Aug 2026, 06:40 PM

సైలెంట్‌గా కానిచ్చేస్తున్న క్రిష్..

Krish: క్రిష్ దర్శకత్వంలో అంతా కొత్త వాళ్ళలో సినిమా రూపొందుతోంది. ‘జెంజ్ బ్యాచ్’ అనే వెరైటీ టైటిల్‌తో వస్తోన్న ఈ సినిమాకి సంబందించిన డబ్బింగ్ కార్యక్రమాలు ప్రస్తుతం హైదరాబాద్‌లోని ప్రసాద్స్ ల్యాబ్‌లో జరుగుతున్నాయి. కానీ, ఇప్పటి వరకూ ఈ సినిమా నుంచి ఎలాంటి అప్‌డేట్ కూడా వదలకుండా చాలా సీక్రెట్‌గా ఈ మూవీని కంప్లీట్ చేస్తున్నాడు. మరికొన్ని రోజుల్లో ఫస్ట్ కాపీ రానుంది. మరి, ఈ సినిమాతోనైనా హిట్ కొట్టి క్రిష్ ఫాంలోకి వస్తాడా లేదా చూడాలి.

ఫోర్ బ్రదర్స్ పాలనగా మారిన తెలంగాణ.. రేవంత్ సర్కార్ పై హరీష్ రావు సంచలన వ్యాఖ్యలు!..తెలంగాణSwechaa17 Aug 2026, 06:39 PM

ఫోర్ బ్రదర్స్ పాలనగా మారిన తెలంగాణ.. రేవంత్ సర్కార్ పై హరీష్ రావు సంచలన వ్యాఖ్యలు!..

తెలంగాణ ఫోర్ బ్రదర్స్ పాలనగా మారిపోయిందంటూ రేవంత్ సర్కార్‌పై హరీశ్ రావు సంచలన వ్యాఖ్యలు చేశారు. సంక్షేమ పథకాలు, రేషన్ కార్డులు, EHS, ఆరోగ్యశ్రీ విషయంలో ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని ఆరోపించారు. దళితులు, గిరిజనులు, బీసీల కోసం బడ్జెట్‌లో నిధులు కేటాయించి, వాటిని ఖర్చు చేయడం లేదని విమర్శించారు. తనపై రాజకీయ కక్షతో తప్పుడు ప్రచారాలు చేస్తున్నారని మండిపడ్డారు. దేవుడి దర్శనానికి వెళ్లడాన్ని కూడా రాజకీయం చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. తెలంగాణ ఉద్యమంలో తనపై 370 కేసులు ఉన్నాయని, ఎన్నో త్యాగాలు చేశానని గుర్తుచేస్తూ.. తన గురించి, తెలంగాణ ఉద్యమం గురించి మాట్లాడే నైతిక అర్హత రేవంత్ రెడ్డికి లేదని హరీశ్ రావు ఘాటు వ్యాఖ్యలు చేశారు.

ట్రైనీ ఐపీఎస్ ఉదయ్ కృష్ణారెడ్డి కేసులో మరో కీలక మలుపు!..తెలంగాణSwechaa17 Aug 2026, 05:40 PM

ట్రైనీ ఐపీఎస్ ఉదయ్ కృష్ణారెడ్డి కేసులో మరో కీలక మలుపు!..

ట్రైనీ ఐపీఎస్ అధికారి ఉదయ్ కృష్ణారెడ్డి కేసులో మరో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఇప్పటికే అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించిన ఉదయ్ కృష్ణారెడ్డిని మరోసారి పోలీస్ కస్టడీకి అప్పగిస్తూ ఉప్పరపల్లి కోర్టు ఆదేశాలు జారీ చేసింది. కోర్టు ఆదేశాల ప్రకారం.. ఈ నెల 18, 19 తేదీల్లో ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 4 గంటల 30 నిమిషాల వరకు పోలీసులు అతడిని విచారించనున్నారు. కేసులో కీలక అంశాలపై మరింత సమాచారం రాబట్టేందుకు ఈ కస్టడీని పోలీసులు కోరినట్లు తెలుస్తోంది. ఇక ఈ దర్యాప్తులో భాగంగా ఉదయ్ కృష్ణారెడ్డికి స్పెర్మ్ టెస్ట్ నిర్వహించేందుకు కూడా కోర్టు అనుమతి ఇచ్చింది. దీంతో ఈ కేసు దర్యాప్తు మరింత కీలక దశకు చేరుకున్నట్టైంది.

సంచలనంగా మారిన జోగి కుటుంబ వ్యవహారం.. వైరల్ అవుతున్న రాజీవ్ వ్యాఖ్యలు!..క్రైమ్Swechaa17 Aug 2026, 05:24 PM

సంచలనంగా మారిన జోగి కుటుంబ వ్యవహారం.. వైరల్ అవుతున్న రాజీవ్ వ్యాఖ్యలు!..

తెలుగు రాష్ట్రాల్లో ఇప్పుడు జోగి కుటుంబానికి సంబంధించిన ఓ వ్యవహారం తీవ్ర చర్చనీయాంశంగా మారింది. సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఆడియోలో రాజీవ్ చేసిన వ్యాఖ్యలు సంచలనంగా మారాయి. తన పెళ్లి విషయంలో తనకు ఇష్టం లేకపోయినా కుటుంబ సభ్యులు ఒత్తిడి చేశారని రాజీవ్ ఆరోపించినట్లు తెలుస్తోంది. అమ్మాయి ఫొటో చూసినప్పుడే తనకు ఎలాంటి భావన కలగలేదని.. పెళ్లి తర్వాత పరిస్థితి మారుతుందేమోనని భావించినా.. చివరకు తాను దాంపత్య జీవితాన్ని కొనసాగించలేకపోయానని ఆయన వ్యాఖ్యలు చేసినట్లు సమాచారం. తనకు లైంగిక పరమైన సమస్య ఉందని ముందే చెప్పినా.. కుటుంబ సభ్యులు తన మాట వినకుండా బ్రెయిన్‌వాష్ చేసి పెళ్లికి ఒప్పించారని రాజీవ్ ఆరోపణలు చేసినట్లు వైరల్ అవుతున్న ఆడియోలో వినిపిస్తుంది.

22A Lands: స్వేచ్ఛ ఎఫెక్ట్.. తప్పు ఒప్పుకున్న మంత్రి పొంగులేటితెలంగాణSwechaa17 Aug 2026, 05:22 PM

22A Lands: స్వేచ్ఛ ఎఫెక్ట్.. తప్పు ఒప్పుకున్న మంత్రి పొంగులేటి

22A Lands: నిషేధిత భూముల (Section 22-A) అంశంలో రాష్ట్ర రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి తప్పు ఒప్పుకున్నారు. 22ఏ భూముల వివాదంపై గత వారం రోజులుగా స్వేచ్ఛ అనేక కథనాలు రాసింది. 22ఏ పై స్వేచ్ఛ ఛైర్మన్ దేవేందర్ రెడ్డి చింతకుంట్ల బీబీసీకి కూడా ఆర్టికల్ ఇచ్చారు. ఈ కథనాలతో రెవెన్యూ యంత్రాంగంలో కదలిక వచ్చింది. స్వయంగా మంత్రి పొంగులేటి రంగంలోకి దిగారు. 22-A భూముల అంశంపై ఉదయం నుంచి సచివాలయంలో సమీక్షలు నిర్వహించారు. అనంతరం తప్పు జరిగినట్లు ప్రెస్ మీట్‌లో ఆయన ఒప్పుకున్నారు.

వాహనదారులకు అలర్ట్.. ఈ రూట్ లో రెండేళ్ల పాటు తప్పని తిప్పలు!..తెలంగాణSwechaa17 Aug 2026, 04:43 PM

వాహనదారులకు అలర్ట్.. ఈ రూట్ లో రెండేళ్ల పాటు తప్పని తిప్పలు!..

హైదరాబాద్‌లో కీలకమైన మార్గంలో ట్రాఫిక్ మార్పుకు రంగం సిద్ధమైంది. కేబీఆర్ పార్క్ చుట్టూ ఆగస్టు 18 నుంచి వన్‌వే ట్రాఫిక్ విధానం అమల్లోకి రానుంది. ట్రాఫిక్ రద్దీని నియంత్రించడం, వాహనాల రాకపోకలను సులభతరం చేయడం లక్ష్యంగా అధికారులు ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. ప్రయాణికులకు ఇబ్బందులు తలెత్తకుండా కేబీఆర్ పార్క్ పరిసరాల్లో 13 లేన్ ఛేంజర్లు, 10 ఎగ్జిట్లు ఏర్పాటు చేశారు. కీలక ప్రాంతాల్లో రోడ్ మార్కింగ్‌తో పాటు స్పష్టమైన సైన్‌బోర్డులను కూడా ఏర్పాటు చేశారు. ట్రాఫిక్‌ క్రమబద్ధీకరణను మరింత సమర్థంగా నిర్వహించేందుకు సీసీ కెమెరాలు, డ్రోన్లు, హైరైజ్ కెమెరాలతో వాహనాల రాకపోకలను నిరంతరం పర్యవేక్షించనున్నారు. మరోవైపు కేబీఆర్ పార్క్‌కు వచ్చే వాకర్స్, విజిటర్స్ కోసం ప్రత్యేక పార్కింగ్ సౌకర్యాన్ని కూడా అందుబాటులోకి తీసుకొచ్చారు.

DC Movie: డీసీ మూవీపై బన్నీ, మహేష్ రియాక్షన్సినిమాSwechaa17 Aug 2026, 04:15 PM

DC Movie: డీసీ మూవీపై బన్నీ, మహేష్ రియాక్షన్

DC Movie: ఇటీవల వచ్చిన తమిళ సినిమా డీసీ. తమిళ టాలెంటెడ్ డైరెక్టర్ లోకేష్ కనగరాజ్ ఈ సినిమాతో హీరోగా మారాడు. మొదటి సినిమాతోనే లోకేష్‌కి హీరోగా విపరీతమైన పేరొచ్చింది. ఈ మూవీలో తన నటనకి విమర్శకుల ప్రశంసలు మాత్రమే కాదు, మన టాలీవుడ్ స్టార్స్ అల్లు అర్జున్, సూపర్ స్టార్ మహేష్ బాబు లాంటి వాళ్ళు పొగడ్తలతో ట్వీట్స్ పెట్టారు.