స్వేచ్ఛ షార్ట్స్ — తాజా తెలుగు వార్తలు

కొడంగల్ లిఫ్ట్ ఇరిగేషన్‌లో భారీ స్కాం : కేటీఆర్రాజకీయాలుSwechaa07 Nov 2026, 12:34 PM

కొడంగల్ లిఫ్ట్ ఇరిగేషన్‌లో భారీ స్కాం : కేటీఆర్

కాంగ్రెస్ ప్రభుత్వంలో భారీగా నిధుల దుర్వినియోగం జరుగుతోందని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సంచలన ఆరోపణలు చేశారు. ‘కొడంగల్-నారాయణపేట-మక్తల్’ ఎత్తిపోతల పథకం టెండర్ల కేటాయింపు ప్రక్రియలో భారీ ఎత్తున నిధుల గోల్‌మాల్ జరిగిందని, టెండర్ల అలాట్ మెంట్ ప్రక్రియ అంతా ఏకపక్షంగా సాగుతోందని ఆరోపించారు. ఈ మేరకు శనివారం సోషల్ మీడియా ‘ఎక్స్’ వేదికగా కేటీఆర్ కీలక పోస్టు పెట్టారు. ‘కొడంగల్-నారాయణపేట-మక్తల్’ లిఫ్ట్ ఇరిగేషన్ టెండర్ల వ్యవహారంలో రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డికి చెందిన కంపెనీ కీలకంగా వ్యవహరిస్తోందని అన్నారు. కేవలం మంత్రి కంపెనీ మాత్రమే దరఖాస్తు చేసుకుందని, పోటీలో ఉన్న మిగిలిన సంస్థలన్నీ కేవలం కాగితాలకే పరిమితమైన "డమ్మీ కంపెనీలు" అని విమర్శించారు.

హైడ్రా రంగనాథ్ ప్రత్యక్షంగా హాజరుకావాల్సిందే : హైకోర్టుతెలంగాణSwechaa07 Nov 2026, 12:15 PM

హైడ్రా రంగనాథ్ ప్రత్యక్షంగా హాజరుకావాల్సిందే : హైకోర్టు

హైడ్రా కమిషనర్ రంగనాథ్‌కు మరో బిగ్ షాక్ తగిలింది. గతంలో కోర్టు ఇచ్చిన ఉత్తర్వులను లెక్క చేయకుండా కూల్చివేతలకు పాల్పడినందుకు హైకోర్టు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. ఈ ఘటనలో మీపై ఎందుకు చర్యలు తీసుకోకూడదో సమాధానం చెప్పాలని కోరింది. ఈ విషయంలో రంగనాథ్ ప్రత్యక్షంగా కోర్టుకు హాజరై సమాధానం చెప్పాలని ఆదేశించింది. మరోసారి రంగనాథ్ మీద కోర్టు ధిక్కరణ చర్యలకు సంబంధించిన పిటిషన్ దాఖలు కావడం ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది. వివరాల్లోకివెళితే.. సంగారెడ్డి జిల్లా అమీన్‌పూర్ మండలం ఐలాపూర్ గ్రామంలో సర్వే నంబర్ 173 (పార్ట్), 175 (పార్ట్) తదితర సర్వే నంబర్లలోని 36.37 ఎకరాల భూమి ప్రైవేటు వ్యక్తులకు చెందిందని, అందులో కూల్చివేతలు చేపట్టకూడదని 2024లో తెలంగాణ హైకోర్టు కీలక ఉత్తర్వులు జారీ చేసింది. అయితే, కోర్టు ఉత్తర్వులు లెక్కచేయకుండా కూల్చివేతలు చేపట్టడమే కాకుండా, ప్రభుత్వ భూమిని కాపాడినట్టు హైడ్రా తప్పుడు ప్రచారం చేసుకుంటుందని బాధిత వ్యక్తి న్యాయస్థానంలో కోర్టు ధిక్కరణ పిటిషన్ దాఖలు చేశారు.

Viral: 60రోజులు నిద్రపోయే పోటీలు.. రూ.9.6లక్షలు గెలుచుకున్న మహిళ!వైరల్ న్యూస్Swechaa07 Nov 2026, 12:03 PM

Viral: 60రోజులు నిద్రపోయే పోటీలు.. రూ.9.6లక్షలు గెలుచుకున్న మహిళ!

 సాధారణంగా ఉద్యోగం అనగానే రోజువారీ ఆఫీస్ పనులు, కష్టపడి చెమటోడ్చడాలే గుర్తొస్తాయి. అయితే కేవలం హాయిగా నిద్రపోతూ లక్షల రూపాయల సంపాదనను సొంతం చేసుకోవచ్చని ముంబైకి చెందిన జినియా ఛటర్జీ అనే మహిళ నిరూపించింది. ప్రముఖ నిద్ర పరికరాల ఉత్పత్తుల తయారీ సంస్థ 'వేక్‌ఫిట్' (Wakefit) వినూత్నంగా నిర్వహించిన 60రోజుల 'స్లీప్ ఇంటర్న్‌షిప్' (Wakefit Sleep Internship) పోటీ ఐదో సీజన్‌లో ఆమె విజేతగా నిలిచారు. సుదీర్ఘంగా రెండు నెలల పాటు రోజువారీ నిద్ర నాణ్యతను మెరుగుపరుచుకుంటూ ఈ సవాలును విజయవంతంగా పూర్తి చేసినందుకు గానూ ఆమె ఏకంగా రూ.9.6 లక్షల భారీ నగదు బహుమతిని దక్కించుకున్నారు.

ఉపగ్రహాలకే టోకరా.. రైతుల తెలివికి సలాం!NationalSwechaa07 Nov 2026, 11:53 AM

ఉపగ్రహాలకే టోకరా.. రైతుల తెలివికి సలాం!

పోఖ్రాన్‌లో అబ్దుల్ కలాం చూపిన వ్యూహం గుర్తుందా? ఇప్పుడు పంజాబ్ రైతులదీ అదే స్టైల్.. శాటిలైట్ల నిఘాను అర్థం చేసుకుని కొత్త ఎత్తుగడ! ఇంతకీ రైతులు ఏం చేస్తున్నారో తెలుసా..? అది తెలిస్తే మీరు షాకవుతారు.

TG : ధరణి అక్రమాలపై సీఐడీ కేసు.. రాష్ట్ర వ్యాప్తంగా సోదాలుతెలంగాణSwechaa07 Nov 2026, 11:44 AM

TG : ధరణి అక్రమాలపై సీఐడీ కేసు.. రాష్ట్ర వ్యాప్తంగా సోదాలు

గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో డిజిటల్ ల్యాండ్ రికార్డ్స్ కోసం తెచ్చిన ‘ధరణి’ పోర్టల్‌లో భారీ అక్రమాలు వెలుగుచూసిన విషయం తెలిసిందే.అందులోని లొసుగులను అడ్డుపెట్టుకుని కొందరు అక్రమార్కులు పేదలు, ప్రభుత్వ భూములను కాజేయాలని చూశారు.వేల ఎకరాల భూముల ఓనర్ షిప్ రాత్రికి రాత్రే మారిపోయినట్టు ఆరోపణలు ఉన్నాయి.ఈ వ్యవహారంలో తాజాగా సీఐడీ దూకుడు పెంచింది. గతంలో ధరణిని అడ్డుపెట్టుకుని భూ అక్రమాలు, దోపిడీకి పాల్పడిన వారిపై చర్యలకు ఉపక్రమించింది. శనివారం ఉదయం ధరణి పోర్టల్ భూ రికార్డుల అక్రమాల వ్యవహారంపై సీఐడీ (CID) విభాగం రాష్ట్రవ్యాప్తంగా మెరుపు దాడులు నిర్వహించింది. పోర్టల్ నిర్వహణ బాధ్యతలు చూసిన IL&FS టెక్నాలజీ లిమిటెడ్, TerraCIS టెక్నాలజీ లిమిటెడ్ సంస్థల పాత్రతో పాటు, అనధికారిక లాగిన్‌లు, రికార్డుల ట్యాంపరింగ్‌కు పాల్పడిన వారిని లక్ష్యంగా చేసుకుని ఈ ఆపరేషన్ చేపట్టినట్టు సమాచారం. సీఐడీ అధికారులు 15 ప్రత్యేక బృందాలుగా విడిపోయి ఏకకాలంలో హైదరాబాద్, రంగారెడ్డి, మేడ్చల్, భువనగిరి, గజ్వేల్ తదితర కీలక ప్రాంతాల్లో విస్తృత తనిఖీలు చేపట్టారు.

17ఏళ్ల సుదీర్ఘ నిరీక్షణకు తెర.. కూకట్‌పల్లి వివాదాస్పద ఫ్లాట్లపై సుప్రీంకోర్టు కీలక తీర్పు!తెలంగాణSwechaa07 Nov 2026, 11:16 AM

17ఏళ్ల సుదీర్ఘ నిరీక్షణకు తెర.. కూకట్‌పల్లి వివాదాస్పద ఫ్లాట్లపై సుప్రీంకోర్టు కీలక తీర్పు!

 హైదరాబాద్‌లోని కూకట్‌పల్లి హౌసింగ్ బోర్డు (KPHB) ఫేజ్-15 పరిధిలో ఇళ్ల కొనుగోలుదారులకు 17ఏళ్ల సుదీర్ఘ న్యాయపోరాటం తర్వాత సుప్రీంకోర్టులో భారీ ఊరట లభించింది. వివాదంలో ఉన్న 101ఫ్లాట్లను ఈనెల 23వ తేదీలోగా సంబంధిత బాధితుల పేరిట తక్షణమే రిజిస్ట్రేషన్ పూర్తి చేయాలని తెలంగాణ హౌసింగ్ బోర్డును సర్వోన్నత న్యాయస్థానం ఆదేశించింది. ఈ మేరకు సుప్రీంకోర్టు న్యాయమూర్తులు జస్టిస్ కేవీ విశ్వనాథన్, జస్టిస్ అరుణ్ పల్లిలతో కూడిన ధర్మాసనం సంచలన తుది ఉత్తర్వులు జారీ చేసింది.  వాయిదాల చెల్లింపుల్లో జాప్యం జరిగిందనే కారణంతో కొనుగోలుదారుల నుంచి 14శాతం వడ్డీ వసూలు చేయాలా? వద్దా? అనే ప్రధాన అంశంపై హైకోర్టు తేల్చే వరకు వేచి చూడాలని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది.

బీజేపీ కార్పొరేటర్ వేధింపులు..దివ్యాంగుడి ఆత్మహత్యాయత్నంక్రైమ్Swechaa07 Nov 2026, 11:15 AM

బీజేపీ కార్పొరేటర్ వేధింపులు..దివ్యాంగుడి ఆత్మహత్యాయత్నం

రాష్ట్రంలో మరో దారుణ ఘటన చోటుచేసుకుంది. ఓ కార్పొరేటర్ వేధింపులు భరించలేక దివ్యాంగుడు ఆత్మహత్యాయత్నం చేశాడు. ఈ విషాదకర ఘటన కరీంనగర్ జిల్లాలో చోటుచేసుకోగా ఆలస్యంగా వెలుగుచూసింది. పొలిటికల్ కారణాలకు తనను బాధ్యుడిని చేస్తూ వేధింపులకు గురిచేశాడని,అందుకే చనిపోతున్నట్టు ఆత్మహత్యాయత్నం చేయడానికి ముందు బాధితుడు సెల్ఫీ వీడియోలో మాట్లాడారు.అది కాస్త సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. వివరాల్లోకివెళితే.. కరీంనగర్ జిల్లాకు చెందిన దివ్యాంగుడు కళ్లేపల్లి శివ కిసాన్‌నగర్‌లో ఉంటున్నాడు. గత కొంతకాలంగా బీజేపీ కార్పొరేటర్ తనను తీవ్రంగా వేధింపులకు గురిచేస్తున్నాడని ఆరోపిస్తూ దివ్యాంగుడు ఆత్మహత్యాయత్నం చేశాడు. ఈ ఘటన స్థానికంగా కలకలం రేపింది.దోమలను చంపేందుకు వినియోగించే ‘ఆల్‌అవుట్’ మందు తాగి శివ సెల్ఫీ వీడియో రికార్డ్ చేసినట్టు సమాచారం.

నా మాట ఎవరూ వినడం లేదు.. ఏఐసీసీకి పీసీసీ చీఫ్ ఫిర్యాదుతెలంగాణSwechaa07 Nov 2026, 10:58 AM

నా మాట ఎవరూ వినడం లేదు.. ఏఐసీసీకి పీసీసీ చీఫ్ ఫిర్యాదు

మంత్రి దామోదర రాజనరసింహ, జుక్కల్ ఎమ్మెల్యే తోట లక్ష్మికాంతారావు మధ్య నెలకొన్న వివాదంలో పీసీసీ చీఫ్ మహేశ్ కుమార్ గౌడ్ చేతులెత్తేసినట్టు తెలుస్తోంది. ‘నా మాటే వినకపోతే.. నేనెందుకు?’ అని పీసీసీ చీఫ్ అసహనం వ్యక్తం చేసినట్టు తెలిసింది. ఈ క్రమంలోనే ఆయన ఏఐసీసీకి ఫిర్యాదు చేసినట్టు సమాచారం. మంత్రులు, ఎమ్మెల్యేలు, పార్టీ నేతల మధ్య వివాదాలు కొనసాగుతున్న తరుణంలో ఆయన తీసుకున్న నిర్ణయం చర్చనీయాంశంగా మారింది. తప్పు చేసిన వారిని వివరణ కోరితే.. ‘నీ కంటే మేము సీనియర్లం’ అంటూ ఎదురు సమాధానాలు చెబుతున్నారని, ఇలా అయితే పార్టీ వ్యవహారాలు నడపడం కష్టమంటూ ఆవేదన వ్యక్తం చేసినట్టు సమాచారం. రాష్ట్ర కాంగ్రెస్‌ నేతల మధ్య గొడవలను మీరే పరిష్కరించాలంటూ ఏఐసీసీ కార్యదర్శి కేసీ వేణుగోపాల్‌కు పీసీసీ చీఫ్ లేఖ రాసినట్టు తెలిసింది. అందులో మంత్రి దామోదర రాజనర్సింహ, ఎమ్మెల్యే తోట లక్ష్మీకాంతారావు మధ్య ఢిల్లీలోని శాంగ్రిలా హోటల్‌లో జరిగిన వివాదాన్ని ప్రస్తావించినట్టు సమాచారం.

అమెరికా సంచలన ఆఫర్.. ఇరాన్ అణు రహస్యాలు చెబితే రూ.166కోట్ల రివార్డు!InternationalSwechaa07 Nov 2026, 10:53 AM

అమెరికా సంచలన ఆఫర్.. ఇరాన్ అణు రహస్యాలు చెబితే రూ.166కోట్ల రివార్డు!

ఇరాన్ చేపడుతున్న అణు కార్యక్రమంపై అత్యంత కీలకమైన, విశ్వసనీయమైన సమాచారాన్ని అందించిన వారికి ఏకంగా 20మిలియన్ డాలర్ల (దాదాపు రూ.166కోట్లు) వరకు భారీ బహుమతిని అందజేస్తామని అమెరికా సైనిక విభాగం యూఎస్ సెంట్రల్ కమాండ్ (CENTCOM) ప్రకటించింది. అమెరికా విదేశాంగ శాఖకు చెందిన 'రివార్డ్స్ ఫర్ జస్టిస్' (Rewards for Justice) ప్రత్యేక కార్యక్రమం కింద ఈ సంచలన ఆఫర్‌ను సామాజిక మాధ్యమ వేదిక 'ఎక్స్' ద్వారా విడుదల చేసింది. సమాచారం అందించిన వ్యక్తులకు ఉదారంగా నజరానాతో పాటు అవసరమైతే వేరే సురక్షిత ప్రాంతాలకు పునరావాసం కూడా కల్పిస్తామని స్పష్టం చేసింది.

అమ్మిన భూమినే మళ్లీ అమ్మి  కోర్టు ధిక్కరణ అంటూ హల్‌చల్?స్వేచ్ఛ ఛైర్మన్ డెస్క్Swechaa07 Nov 2026, 10:08 AM

అమ్మిన భూమినే మళ్లీ అమ్మి కోర్టు ధిక్కరణ అంటూ హల్‌చల్?

బాచుపల్లిలోని సర్వే నెంబర్ 140లో హైకోర్టు సీసీ నెం.522/2025 కేసులో సబ్ రిజిస్ట్రార్‌కు రిజిస్ట్రేషన్ చేయవద్దు అని చెప్పినా ఎందుకు చేస్తున్నారు. అందుకు ఆ సబ్ రిజిస్ట్రార్‌కు 6 నెలల జైలు శిక్ష లేదా రూ.2 వేల పైన్ అంటూ హైకోర్టు ఆదేశాలు ఇచ్చింది. ఇలా రోజుకు ప్రైవేట్ భూముల్లో లేదా కేసుల్లో రోజుకు వివిధ జిల్లాల కేసుల్లో 10కి తక్కువ కాకుండా ఆర్డర్స్ వస్తూన్నా ఉన్నాయి. గత సీఎస్ సోమేశ్ కుమార్‌పై 280కి పైగా ఇలాంటి ఆర్డర్స్ కేసులు ఉండేవి. రంగనాథ్‌పై 100కి పైగానే ఉన్నాయి. ఇలా అన్ని వ్యవస్థలపై కోర్టు ధిక్కరణ కేసులు కామన్. అప్పీల్‌లో ఎందుకు చేయలేకపోయామో వివరిస్తే కొట్టి వేస్తారు. జైలుకు వెళ్లిన సందర్భాలు అస్సులు కనిపించవు. కానీ, అధికారులు సరిగ్గా పని చేయాలని హైకోర్టు ఆదేశాలు ఉంటాయి.

ట్రంప్ చెప్పినట్టు మోదీ వింటున్నారా..? రాహుల్ విమర్శలతో పొలిటికల్ హీట్!NationalSwechaa07 Nov 2026, 10:05 AM

ట్రంప్ చెప్పినట్టు మోదీ వింటున్నారా..? రాహుల్ విమర్శలతో పొలిటికల్ హీట్!

ఢిల్లీలో ఇండి కూటమి ర్యాలీ తర్వాత దేశ రాజకీయాలు వేడెక్కాయి. సర్ వ్యతిరేక ఉద్యమంతో వచ్చిన ఊపును ఎక్కడా తగ్గకుండా చూడాలనే వ్యూహంలో ఉంది కాంగ్రెస్. రాహుల్ ఒక అడుగు ముందుకేస్తే.. షా రెండు అడుగులు ముందుకేస్తున్నారు.

Tollywood: రాధిక ఆప్టే కూడా పూజాలా క్షమాపణలు చెప్పాల్సిందే!సినిమాSwechaa07 Nov 2026, 09:58 AM

Tollywood: రాధిక ఆప్టే కూడా పూజాలా క్షమాపణలు చెప్పాల్సిందే!

Tollywood: రాధిక ఆప్టే కూడా పూజాలా క్షమాపణలు చెప్పాల్సిందేనా అంటే! అవుననే అంటున్నాయి ఇండస్ట్రీ వర్గాలు. మన టాలీవుడ్ ఫిల్మ్ మేకర్స్ అవకాశం ఇచ్చి అందళమెక్కిస్తే, ఇప్పుడు ఏకంగా తలనే తన్నేస్తున్నారు కొందరు హీరోయిన్స్. అలాంటి వారిలో అప్పట్లో తాప్సీ, పూజా హెగ్డేలు హాట్ టాపిక్‌గా నిలిస్తే, ఇప్పుడు అడల్ట్ సినిమాలు చేసిన రాధిక ఆప్టే వార్తల్లో నిలిచింది. నందమూరి అభిమానులు ఈ హాట్ బ్యూటీ చేసిన కామెంట్స్‌కి ఏకిపారేస్తున్నారు.

ఉపయోగం లేని ట్రాఫిక్ అంబరిల్లాతో కోట్లల్లో దందా!స్వేచ్ఛ ఛైర్మన్ డెస్క్Swechaa07 Nov 2026, 09:54 AM

ఉపయోగం లేని ట్రాఫిక్ అంబరిల్లాతో కోట్లల్లో దందా!

హైదరాబాద్ ట్రాఫిక్ అనగానే పొల్యూషన్.. యూటర్న్.. సిగ్నల్స్.. పోలీసులు.. బాటసారుల తిప్పలు.. వాహనదారుల అవస్థలు.. ఇలా అన్నీ గుర్తుకొస్తాయి. కానీ, దీని వెనుక ఏటా రూ.300 కోట్ల మాఫియా దందా ఉందని మీకు తెలుసా?. అంతేకాదు ఉన్నతాధికారులు, పోలీసులతో కుమ్మక్కు అయి అడ్వటైజింగ్ మాఫియా రూ.కోట్లకు కోట్లు సంపాదిస్తోంది. ప్రభుత్వ ఖజానాను సైతం దోచేస్తోంది.

ట్రాఫిక్ పోలీస్ పేరుతో దోపిడీ..

మీరు రోడ్డుపై వెళ్తున్నప్పుడు ఏదైనా జంక్షన్ దగ్గర ట్రాఫిక్ పోలీస్ ఉండేందుకు అంబరిల్లాలు కనిపిస్తాయి. కొన్నిచోట్ల ఇవి మధ్యలో ఉంటాయి. ఇంకొన్ని చోట్ల ఏదో ఒక సైడ్‌కు కనిపిస్తాయి. అయితే, సిటీలో ఇప్పుడు ఎక్కడ చూసినా వన్ వే, లాంగ్ యూటర్న్స్ అయిపోయాయి. ట్రాఫిక్ పోలీస్ అంబరిల్లాలను వాడుతున్నది అంతంతమాత్రమే. కానీ, అడ్వటైజింగ్ మాఫియా మాత్రం గట్టిగా వాడేస్తోంది. ఇష్టం వచ్చినట్లు యాడ్స్ వేసుకుంటూ కోట్లు వెనకేసుకుంటోంది. ట్రాఫిక్ పేరుతో గత ఐదేళ్లుగా ఏడాదికి రూ.60 కోట్ల వరకు ఇల్లీగల్‌గా సంపాదిస్తోంది. ట్రాఫిక్ పోలీస్ పేరుతో ఏర్పాటు చేసిన అంబరిల్లాలను అడ్వటైజింగ్ మాఫియా యథేచ్ఛగా ఆదాయ వనరుగా మార్చేసింది.

టెస్ట్ క్రికెట్‌కు మహమ్మద్ షమీ వీడ్కోలు: 13 ఏళ్ల ప్రస్థానానికి భావోద్వేగ ముగింపు!క్రీడలుSwechaa07 Nov 2026, 09:18 AM

టెస్ట్ క్రికెట్‌కు మహమ్మద్ షమీ వీడ్కోలు: 13 ఏళ్ల ప్రస్థానానికి భావోద్వేగ ముగింపు!

 భారత సీనియర్ స్టార్ ఫాస్ట్ బౌలర్ మహమ్మద్ షమీ సుదీర్ఘ ఫార్మాట్ టెస్ట్ క్రికెట్‌కు రిటైర్మెంట్ ప్రకటిస్తూ సంచలన నిర్ణయం తీసుకున్నాడు. రెడ్ బాల్ క్రికెట్ లోకి అడుగుపెట్టి సరిగ్గా 13ఏళ్లు పూర్తయిన సందర్భాన్ని పురస్కరించుకుని ఆయన ఈ నిర్ణయాన్ని వెల్లడించాడు. 2013 నవంబర్ 6న కోల్‌కతాలోని చారిత్రాత్మక ఈడెన్ గార్డెన్స్ వేదికగా వెస్టిండీస్‌పై టెస్టుల్లో అరంగేట్రం చేసిన షమీ, సరిగ్గా అదే రోజున వీడ్కోలు పలకడం విశేషం. అయితే పరిమిత ఓవర్ల ఫార్మాట్లు అయిన వన్డేలు, టీ20లతో పాటు ఇండియన్ ప్రీమియర్ లీగ్ (IPL) లో దేశం కోసం ఆటను కొనసాగిస్తానని ఆయన స్పష్టం చేశాడు.

నేటి పంచాంగం - 07 నవంబర్ 2026 | కార్తిక కృష్ణ త్రయోదశి (శని త్రయోదశిSpiritualitySwechaa07 Nov 2026, 08:49 AM

నేటి పంచాంగం - 07 నవంబర్ 2026 | కార్తిక కృష్ణ త్రయోదశి (శని త్రయోదశి

వివరాలు:

  • తేదీ: 07 నవంబరు 2026, శనివారం

  • సంవత్సరం: శ్రీ పరాభవ నామ సంవత్సరం

  • అయనం & ఋతువు: దక్షిణాయనం, శరత్ఋతువు

  • మాసం & పక్షం: కార్తిక మాసం, కృష్ణ పక్షం

  • తిథి: త్రయోదశి (రాత్రి 11:45 వరకు, తదుపరి చతుర్దశి)

  • వారం: శనివారం (స్థిరవాసరే)

  • నక్షత్రం: చిత్త (సాయంత్రం 04:32 వరకు, తదుపరి స్వాతి)

  • యోగం: ప్రీతి (ఉదయం 11:20 వరకు, తదుపరి ఆయుష్మాన్)

  • కరణం: తైతుల (మధ్యాహ్నం 12:40 వరకు), తదుపరి గరజ (రాత్రి 11:45 వరకు)

శుభ / అశుభ సమయాలు:

  • రాహుకాలం: ఉదయం 09:00 - 10:30 వరకు

  • యమగండం: మధ్యాహ్నం 01:30 - 03:00 వరకు

  • అమృతకాలం: ఉదయం 09:12 - 10:45 వరకు

  • దుర్ముహూర్తము: ఉదయం 06:21 - 07:07 వరకు మరియు ఉదయం 07:07 - 07:53 వరకు

  • వర్జ్యం: రాత్రి 10:22 - 11:55 వరకు

గ్రహస్థితులు:

  • సూర్యరాశి: తుల

  • చంద్రరాశి: కన్య (ఉదయం 05:40 వరకు), తదుపరి తుల

  • సూర్యోదయం: ఉదయం 06:21

  • సూర్యాస్తమయం: సాయంత్రం 05:37

హైదరాబాద్‌లో ఏందీ.. వన్‌వేల లొల్లి..? రోడ్లన్నీ వన్‌వే చేస్తే ట్రాఫిక్ తగ్గుతుందా?తెలంగాణSwechaa06 Nov 2026, 11:28 PM

హైదరాబాద్‌లో ఏందీ.. వన్‌వేల లొల్లి..? రోడ్లన్నీ వన్‌వే చేస్తే ట్రాఫిక్ తగ్గుతుందా?

హైదరాబాద్ లో ఇప్పుడు ఎక్కడ చూసినా వన్‌వే చర్చే. ఇప్పటికే కేబీఆర్ పార్క్ చుట్టూ వన్‌వే విధానం అమల్లోకి వచ్చింది. ఐటీ కారిడార్‌లో ఐకియా దగ్గర మరో వన్‌వే లూప్ ప్రతిపాదన తెరపైకి వచ్చింది. ఇప్పుడు లక్డీకాపూల్‌లోనూ వన్‌వే దిశగా ట్రాఫిక్ పోలీసులు అడుగులు వేస్తున్నారు.

PF Withdrawal: అప్లై చేయక్కర్లేదు.. వారి అకౌంట్లోకి నేరుగా పీఎఫ్ డబ్బులుదునియాSwechaa06 Nov 2026, 10:10 PM

PF Withdrawal: అప్లై చేయక్కర్లేదు.. వారి అకౌంట్లోకి నేరుగా పీఎఫ్ డబ్బులు

ఉద్యోగాలు మారినప్పుడు పాత పీఎఫ్ ఖాతాల్లో మిగిలిపోయిన చిన్న చిన్న మొత్తాలను క్లెయిమ్ చేసుకోవడం మర్చిపోయారా? అలాంటి ఉద్యోగుల కోసం ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్ (ఈపీఎఫ్‌వో) ఒక వినూత్న నిర్ణయం తీసుకుంది. ఇకపై ఎలాంటి క్లెయిమ్ ఫారాలు అప్లికేషన్స్‌తో పని లేకుండానే.. పాత అకౌంట్లలో మూలుగుతున్న సొమ్మును నేరుగా మీ బ్యాంక్ ఖాతాల్లోకే జమ చేసే సరికొత్త ‘ఆటో సెటిల్మెంట్’ విధానాన్ని అందుబాటులోకి తెచ్చింది.

Rice Prices: బియ్యం ధరలను తగ్గించేందుకు కేంద్రం మాస్టర్ ప్లాన్ ..NationalSwechaa06 Nov 2026, 09:36 PM

Rice Prices: బియ్యం ధరలను తగ్గించేందుకు కేంద్రం మాస్టర్ ప్లాన్ ..

Rice Prices: నిన్న మొన్నటి వరకు రూ.1,200 నుంచి రూ.1,500కే దొరికిన 25 కిలోల బియ్యం బస్తా.. ఇప్పుడు మార్కెట్‌లో ఏకంగా రూ.2,000 దాటి పరుగులు తీస్తోంది. కిలో రూ.50 ఉండే సాధారణ బియ్యం కూడా రూ.80 నుంచి రూ.100 దాకా చేరడంతో సామాన్య, మధ్యతరగతి కుటుంబాల నెలవారీ బడ్జెట్ తలకిందులవుతోంది. మరోవైపు ఎల్‌నినో ఎఫెక్ట్‌తో వర్షాలు 13 శాతం తగ్గి, గత 20 ఏళ్లలో ఎన్నడూ లేనంతగా వరి దిగుబడి పడిపోయే ప్రమాదముందన్న వార్తలు మరింత కలవరం రేపాయి. పరిస్థితి చేయి దాటితే ధరలు మరింత ఆకాశాన్నంటుతాయని గ్రహించిన కేంద్ర ప్రభుత్వం.. బియ్యం ధరలకు కళ్లెం వేసేందుకు ఒక పక్కా మాస్టర్ ప్లాన్‌తో రంగంలోకి దిగింది.మార్కెట్‌లో కొరత రాకుండా చూడటంతో పాటు కృత్రిమంగా ధరలు పెంచే వ్యాపారుల ఎత్తులకు చెక్ పెట్టేందుకు కేంద్రం ఓపెన్ మార్కెట్ సేల్ స్కీమ్ అస్త్రాన్ని ప్రయోగించింది. ఈ పథకం కింద ప్రైవేట్ వ్యాపారులకు విక్రయించే బియ్యం కోటాను ఏకంగా రెట్టింపు చేసింది. గత ఏడాది కేవలం 11 లక్షల మెట్రిక్ టన్నులు అమ్మగా.. 2026-27 ఆర్థిక సంవత్సరానికి గాను ఏకంగా 50 లక్షల మెట్రిక్ టన్నుల బియ్యాన్ని మార్కెట్లోకి విడుదల చేయాలని నిర్ణయించింది. ఇప్పటికే 25 లక్షల టన్నులు అమ్ముడవ్వగా, తాజా పెంపుతో భారీ ఎత్తున బియ్యం అందుబాటులోకి వచ్చి కొరత తీరనుంది.

TG: లక్డీకాపూల్‌లో కొత్త వన్‌వే? రూట్లను పరిశీలించిన సీపీ సజ్జనార్‌..తెలంగాణSwechaa06 Nov 2026, 08:59 PM

TG: లక్డీకాపూల్‌లో కొత్త వన్‌వే? రూట్లను పరిశీలించిన సీపీ సజ్జనార్‌..

హైదరాబాద్ నగరంలో నిత్యం రద్దీగా ఉండే లక్డీకాపూల్ పరిసరాల్లో ట్రాఫిక్ సమస్యలకు చెక్ పెట్టేందుకు ట్రాఫిక్ పోలీసులు సిద్ధమయ్యారు. కేబీఆర్ పార్క్ వద్ద అమలు చేస్తున్న 'వన్ వే' విధానం మంచి ఫలితాలు ఇవ్వడంతో, అదే తరహాలో లక్డీకాపూల్‌లోనూ కొత్త వన్ వే విధానాన్ని ప్రవేశపెట్టేందుకు కసరత్తు చేస్తున్నారు. ఇందులో భాగంగా హైదరాబాద్ పోలీస్ కమిషనర్ వీసీ సజ్జనార్‌, ట్రాఫిక్ జాయింట్ సీపీ జోయెల్ డేవిస్ ఇతర అధికారులతో కలిసి స్వయంగా బైక్‌పై క్షేత్రస్థాయిలో పర్యటించి పరిశీలించారు.

Kajal Aggarwal: కాజల్ "రామాయణ" చేయడం అనవసరమా?సినిమాSwechaa06 Nov 2026, 08:54 PM

Kajal Aggarwal: కాజల్ "రామాయణ" చేయడం అనవసరమా?

Kajal Aggarwal: కాజల్ రామాయణ చేయడం అనవసరమా? తాజాగా ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ ఇతిహాసం ఆధారంగా వచ్చిన మైథలాజికల్ మూవీ రామాయణ చూశాక కాజల్ అభిమానులకి కలుగుతున్న సందేహం ఇది. సినిమా ఇండస్ట్రీలో అందం, అభినయం, మంచి గుర్తింపు ఉన్నప్పటికీ కొంతమంది హీరోయిన్లకు తమ ప్రతిభను పూర్తిస్థాయిలో చూపించే పాత్రలు దక్కవు. అలాంటి పరిస్థితినే కాజల్ అగర్వాల్ ఎదుర్కొంటోంది.

Gold Hallmark Charges: 1, 2 గ్రాముల బంగారం కొంటున్నారా.. ఇవి తెలుసుకోకపోతే మోసపోతారుతెలంగాణSwechaa06 Nov 2026, 08:25 PM

Gold Hallmark Charges: 1, 2 గ్రాముల బంగారం కొంటున్నారా.. ఇవి తెలుసుకోకపోతే మోసపోతారు

ధంతేరస్ పండుగ వేళ బంగారం కొనడం ఆనవాయితీగా వస్తోంది. అయితే కొండంత పెరిగిన ధరల వల్ల లక్షలు వెచ్చించి పెద్ద పెద్ద ఆభరణాలు కొనలేని సామాన్యులు.. ఒక గ్రాము, రెండు గ్రాముల బంగారు నాణేలు, చిన్న చిన్న ఉంగరాలు లేదా అరగ్రాము వస్తువుల వైపు మొగ్గు చూపుతున్నారు. అయితే ఇలా తక్కువ పరిమాణంలో గోల్డ్ కొనుగోలు చేసే వారి అమాయకత్వాన్ని కొందరు వ్యాపారులు క్యాష్ చేసుకుంటున్నారు. రూల్స్‌పై అవగాహన లేకపోతే ఈ చిన్న కొనుగోళ్లపైనే వినియోగదారులు అడ్డంగా మోసపోయే ప్రమాదముంది.

India Fuel Rates: సామాన్యుడికి ఊరట లభిస్తుందా.. దేశంలో పెట్రోల్, డీజిల్ రేట్లు తగ్గనున్నాయా?NationalSwechaa06 Nov 2026, 07:37 PM

India Fuel Rates: సామాన్యుడికి ఊరట లభిస్తుందా.. దేశంలో పెట్రోల్, డీజిల్ రేట్లు తగ్గనున్నాయా?

ndia Fuel Rates: నిత్యం పెరుగుతున్న ఖర్చులతో సతమతమవుతున్న సామాన్యుడికి త్వరలోనే పెట్రోల్, డీజిల్ ధరల రూపంలో తీపి కబురు అందే అవకాశాలు కనిపిస్తున్నాయి. అంతర్జాతీయ మార్కెట్లో క్రూడ్ ఆయిల్ ధరలు అనూహ్యంగా దిగిరావడమే ఇందుకు ప్రధాన కారణం. అమెరికా మధ్యంతర ఎన్నికల్లో డొనాల్డ్ ట్రంప్‌కు చెందిన రిపబ్లికన్ పార్టీ ఎదురుదెబ్బ తినడం, ఫలితంగా ఇరాన్‌తో యుద్ధ వాతావరణం ముగిసి శాంతి నెలకొంటుందన్న సంకేతాలు రావడంతో గ్లోబల్ మార్కెట్లో చమురు మంటలు ఒక్కసారిగా చల్లారాయి.గత అక్టోబర్ తర్వాత తొలిసారిగా అంతర్జాతీయ మార్కెట్లో బ్రెంట్ క్రూడ్ ఆయిల్ ధర 100 డాలర్ల మార్క్ కంటే కిందకు పడిపోయింది. ప్రస్తుతం బ్రెంట్ క్రూడ్ 4.7 శాతం తగ్గి బ్యారెల్‌కు 98.76 డాలర్ల వద్ద, డబ్ల్యూటీఐ 91.73 డాలర్ల వద్ద ట్రేడవుతున్నాయి. ఇరాన్‌తో యుద్ధమే తమ పార్టీ ఓటమికి కారణమని ట్రంప్ అంగీకరించడం, ప్రస్తుతానికి తక్షణ దాడుల ప్రణాళికలు ఏవీ లేవని ప్రకటించడంతో మార్కెట్లలో ఆందోళన తగ్గింది.

కాంగ్రెస్ పాలనలో రైతులు కన్నీళ్లు పెట్టుకుంటున్నారుతెలంగాణSwechaa06 Nov 2026, 07:22 PM

కాంగ్రెస్ పాలనలో రైతులు కన్నీళ్లు పెట్టుకుంటున్నారు

Harish Rao: కాంగ్రెస్ ప్రభుత్వంపై నిప్పులు చెరిగారు మాజీమంత్రి హరీశ్ రావు. కాంగ్రెస్ పాలనలో రైతులు కన్నీళ్లు పెడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. రైతులను ఆదుకోవాల్సిన ప్రభుత్వం.. రైతుల పాలిట శాపంగా మారిందని ధ్వజమెత్తారు. రేవంత్ సర్కార్ రైతులపై కక్ష కట్టిందన్నారు. కృష్ణా, గోదావరి నదుల్లో నీళ్లు ఉన్నా ఎత్తలేదని.. ఉన్న మంజీరాను ఖాళీ చేసి.. రైతులపై పగబట్టినట్లు రేవంత్ సర్కార్ వ్యవహరిస్తోందన్నారు. మహారాష్ట్ర ప్రభుత్వంతో అపాయింట్ మెంట్ కే రేవంత్ కు మూడేళ్లు పట్టిందని.. వాళ్లు అనుమతి ఇచ్చేది ఎప్పుడు, మీరు తమ్మిడిహట్టి కట్టేది ఎప్పుడు? అని హరీశ్ రావు ప్రశ్నించారు.

Keerthy Suresh: తల్లిపై కీర్తి సురేష్ వివాదాస్పద వ్యాఖ్యలు..సినిమాSwechaa06 Nov 2026, 06:50 PM

Keerthy Suresh: తల్లిపై కీర్తి సురేష్ వివాదాస్పద వ్యాఖ్యలు..

Keerthy Suresh: తల్లిపై స్టార్ హీరోయిన్ కీర్తి సురేష్ వివాదాస్పద వ్యాఖ్యలు చేయడం ఫిలిం సర్కిల్స్‌లో హాట్ టాపిక్‌గా మారింది. దీంతో, ఆమె మరోసారి వార్తల్లో నిలిచారు. తన తల్లి, సీనియర్ నటి మేనక గురించి ఆమె చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు సోషల్ మీడియాలో చర్చనీయాంశంగా మారాయి. తన వ్యక్తిగత జీవితానికి సంబంధించిన ఓ ఆసక్తికరమైన విషయాన్ని తాజాగా ఓ ఇంటర్వ్యూలో వెల్లడించిన కీర్తి.. తన తల్లి తన డైరీని చదవడమే కాకుండా, దానిని కాల్చేసి ఉంటుందని కూడా అనుమానాలను వ్యక్తం చేశారు.

TG : హౌసింగ్ బోర్డు ఇళ్లపై సుప్రీంకోర్టు కీలక ఆదేశాలు..తెలంగాణSwechaa06 Nov 2026, 06:43 PM

TG : హౌసింగ్ బోర్డు ఇళ్లపై సుప్రీంకోర్టు కీలక ఆదేశాలు..

తెలంగాణ హౌసింగ్‌ బోర్డు ఇళ్ల రిజిస్ట్రేషన్ల వివాదంపై దేశ అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది. ఏళ్ల తరబడి పెండింగ్‌లో ఉన్న లబ్ధిదారుల ఇళ్ల రిజిస్ట్రేషన్ ప్రక్రియను తక్షణమే పూర్తి చేయాలని హౌసింగ్ బోర్డుకు స్పష్టం చేసింది. ఇకపై ఏమాత్రం కాలయాపన చేయడానికి వీల్లేదని హెచ్చరిస్తూ.. ఈ నెల 23వ తేదీ లోపే రిజిస్ట్రేషన్ల వ్యవహారాన్ని కొలిక్కి తేవాలని కచ్చితమైన డెడ్‌లైన్ విధించింది.

Ramayana: సీతగా సాయి పల్లవి, శూర్పణఖగా రకుల్ ఊహించని ఫీడ్ బ్యాక్!సినిమాSwechaa06 Nov 2026, 06:26 PM

Ramayana: సీతగా సాయి పల్లవి, శూర్పణఖగా రకుల్ ఊహించని ఫీడ్ బ్యాక్!

Ramayana: ఇప్పటి వరకూ ఫక్తు కమర్షియల్ సినిమాలలో నటించిన ఇద్దరు స్టార్ హీరోయిన్స్ ఇతిహాసం ఆధారంగా రూపొందిన రామాయణలో నటించే అవకాశం దక్కడం నిజంగా గొప్ప విషయం. అయితే, ఇలాంటి సినిమాలలో పాత్రలను పోషించేటప్పుడు ఎన్నో సవాళ్లను, విమర్శలను ఎదుర్కోవాల్సి ఉంటుంది. వాటన్నిటిని దాటుకొని సీతగా సాయి పల్లవి, శూర్పణఖ పాత్రలో రకుల్ మెప్పించి విమర్శకుల ప్రశంసలు అందుకుంటున్నారు.

Project Baata: మేడిగడ్డ సాక్షిగా కేటీఆర్ ‘ప్రాజెక్ట్ బాట’.. కాంగ్రెస్‌కు చెక్ పెట్టేలా గులాబీ పార్టీ బిగ్ స్కెచ్!తెలంగాణSwechaa06 Nov 2026, 06:05 PM

Project Baata: మేడిగడ్డ సాక్షిగా కేటీఆర్ ‘ప్రాజెక్ట్ బాట’.. కాంగ్రెస్‌కు చెక్ పెట్టేలా గులాబీ పార్టీ బిగ్ స్కెచ్!

Project Baata: తెలంగాణ రాజకీయ రణక్షేత్రంలో మరోసారి 'కాళేశ్వరం' సెంట్రిక్ వార్ మొదలుకాబోతోంది. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన నాటి నుంచి కాళేశ్వరం ప్రాజెక్టు వైఫల్యాలు, మేడిగడ్డ పిల్లర్ల కుంగుబాటును ప్రధాన అస్త్రంగా మార్చుకుని బీఆర్ఎస్‌ను ఇరుకున పెడుతూ వస్తోంది. అయితే, ఈ ఆరోపణలను ఇకపై కేవలం ప్రెస్‌మీట్లతోనో, సోషల్ మీడియా ట్వీట్లతోనో తిప్పికొట్టడం సరిపోదని గులాబీ పార్టీ డిసైడ్ అయింది. తమ మానసపుత్రికగా చెప్పుకునే ప్రాజెక్టు వేదికగానే కాంగ్రెస్ సర్కార్‌కు చెక్ పెట్టేందుకు సరికొత్త పొలిటికల్ మాస్టర్ ప్లాన్‌ను సిద్ధం చేసిందికాంగ్రెస్ విమర్శల తీవ్రతను తిప్పికొట్టేందుకు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ స్వయంగా రంగంలోకి దిగుతున్నారు. ‘ప్రాజెక్ట్ బాట’ పేరిట ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో భారీ బస్సు యాత్ర చేపట్టేందుకు రంగం సిద్ధమైంది. మేడిగడ్డ బ్యారేజ్ నుంచి మొదలయ్యే ఈ బస్సు యాత్ర.. మిడ్ మానేరు లేదా లోయర్ మానేరు డ్యామ్ వరకు 2 నుంచి 3 రోజుల పాటు సాగనుంది. మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల బ్యారేజీలతో పాటు కాళేశ్వరం పంప్‌హౌస్‌లు, టన్నెళ్లను కేటీఆర్ స్వయంగా పరిశీలిస్తారు.

మా భూముల జోలికి వస్తే.. బంగ్లాదేశ్ ప్రధానికి పట్టిన గతే పడుతుందితెలంగాణSwechaa06 Nov 2026, 05:53 PM

మా భూముల జోలికి వస్తే.. బంగ్లాదేశ్ ప్రధానికి పట్టిన గతే పడుతుంది

Kukatpally Lands: కూకట్‌పల్లిలో ప్రభుత్వ భూముల విక్రయంపై బీఆర్ఎస్ ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు ఫైర్ అయ్యారు. భూముల వేలం ఆలోచన మానుకోవాలని కాంగ్రెస్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారాయన. కేపీహెచ్ బీ భూములను తన నియోజకవర్గంలోని ప్రజల అవసరాల కోసమే కేటాయించాలన్నారు. కూకట్ పల్లి భూముల జోలికి వస్తే.. బంగ్లాదేశ్ ప్రధానికి పట్టిన గతే మీకూ పడుతుందని సీఎం రేవంత్ ను హెచ్చరించారు ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు.

2వేల కోట్ల విలువైన భూముల విక్రయం

కూకట్ పల్లి, మూసాపేట ప్రాంతాల్లో ప్రభుత్వ భూముల వేలం, విక్రయాలకు వ్యతిరేకంగా జరిగిన నిరసన ర్యాలీలో ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు పాల్గొన్నారు. సీఎం రేవంత్ రెడ్డి, మంత్రి పొంగులేటి శ్రీనివాస రెడ్డి కలిసి పేదల భూములు అమ్ముకుంటున్నారని మండిపడ్డారు. కూకట్ పల్లిలో ఇప్పటికే దాదాపు 2వేల కోట్ల విలువైన భూములు అమ్ముకున్నారని ఆరోపించారు. కాంగ్రెస్ ప్రభుత్వం హైదరాబాద్ ప్రజలకు శాపంగా మారిందని ధ్వజమెత్తారు.

Trump Impeachment: ట్రంప్‌కు డెమోక్రాట్ల ‘చెక్’.. మూడోసారి అభిశంసన తప్పదా?InternationalSwechaa06 Nov 2026, 05:00 PM

Trump Impeachment: ట్రంప్‌కు డెమోక్రాట్ల ‘చెక్’.. మూడోసారి అభిశంసన తప్పదా?

Trump Impeachment: మిడ్‌టర్మ్ ఎన్నికల్లో తగిలిన ఊహించని ఎదురుదెబ్బ మరువకముందే.. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌కు మరో రాజకీయ సంక్షోభం ముంచుకొస్తోంది. ఇన్నాళ్లూ వివాదాస్పద నిర్ణయాలతో పాలన సాగించిన ట్రంప్‌కు ఈసారి ఎలాగైనా బ్రేకులు వేయాలని డెమోక్రాట్లు డిసైడ్ అయ్యారు. చట్టసభల్లో సాధించిన పూర్తి మెజారిటీని ఆయుధంగా మలచుకుని, ట్రంప్ పీఠానికే ఎసరు పెట్టేలా ‘మూడో అభిశంసన’ అస్త్రాన్ని సిద్ధం చేస్తున్నారు. గతంలో ట్రంప్ తన మొదటి పదవీకాలంలో రెండుసార్లు అభిశంసన తీర్మానాలను ఎదుర్కొన్నారు. అయితే అప్పట్లో సెనెట్‌లో రిపబ్లికన్లకు సంఖ్యాబలం ఉండటంతో అవి వీగిపోయి ట్రంప్ బయటపడ్డారు. కానీ ప్రస్తుత సమీకరణాలు పూర్తిగా మారిపోయాయి. చట్టసభల్లో డెమోక్రాట్ల ఆధిపత్యం పెరగడంతో ఈసారి ఆయన్ను అధ్యక్ష పదవి నుంచి తప్పించేలా పూర్తిస్థాయి అభిశంసన ప్రక్రియకు గ్రౌండ్‌వర్క్ మొదలుపెట్టారు.

AP Local Elections: బ్యాలెట్ బాక్సుల్లో పల్లె తీర్పు.. నవంబర్ 7పై సర్వత్రా ఉత్కంఠ!ఏపీSwechaa06 Nov 2026, 03:36 PM

AP Local Elections: బ్యాలెట్ బాక్సుల్లో పల్లె తీర్పు.. నవంబర్ 7పై సర్వత్రా ఉత్కంఠ!

AP Local Elections: ఆంధ్రప్రదేశ్‌లో స్థానిక సమరం ముగిసింది. గ్రామీణ ప్రాంతాల్లో అధికారం ఎవరిదో తేల్చే కీలకమైన ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికల పోలింగ్ ప్రక్రియ గురువారం ముగియడంతో అభ్యర్థుల భవితవ్యం బ్యాలెట్ బాక్సుల్లో నిక్షిప్తమైంది. కొన్నిచోట్ల ఉద్రిక్తతలు మినహా రాష్ట్రవ్యాప్తంగా పోలింగ్ విజయవంతంగా ముగియగా, ఇప్పుడు అందరి కళ్లూ నవంబర్ 7న జరగనున్న కౌంటింగ్‌పైనే ఉన్నాయి. పల్లె ఓటరు నాడి ఎటువైపు ఉందో తేలనుండటంతో ప్రధాన పార్టీల్లో టెన్షన్ మొదలైంది.రాష్ట్రవ్యాప్తంగా ఏర్పాటు చేసిన 30,994 పోలింగ్ కేంద్రాల్లో ఉదయం నుంచే పల్లె ఓటర్లు బారులు తీరారు. వర్షాన్ని సైతం లెక్కచేయకుండా ఓటు హక్కును వినియోగించుకున్నారు. సాయంత్రం 5 గంటల వరకు దాదాపు 67.24% పోలింగ్ నమోదైంది. క్యూలైన్లలో ఉన్నవారిని కూడా అనుమతించడంతో తుది పోలింగ్ శాతం మరింత పెరిగే అవకాశం ఉంది.