స్వేచ్ఛ షార్ట్స్ — తాజా తెలుగు వార్తలు

ప్రముఖ ఆలయంలో విషాదం.. భక్తుల ప్రాణాలు తీసిన తొక్కిసలాట!..క్రైమ్Swechaa17 Aug 2026, 09:33 AM

ప్రముఖ ఆలయంలో విషాదం.. భక్తుల ప్రాణాలు తీసిన తొక్కిసలాట!..

బిహార్‌లోని లఖీసరాయ్ జిల్లాలో ప్రముఖ అశోక్‌ధామ్ ఆలయంలో సోమవారం ఉదయం తీవ్ర విషాదం చోటుచేసుకుంది. శ్రావణమాసం సోమవారం కావడంతో శివుడి దర్శనం కోసం వేలాది మంది భక్తులు ఆలయానికి తరలివచ్చారు. దర్శనం కోసం క్యూ లైన్లలో వేచి ఉన్న సమయంలో ఒక్కసారిగా విద్యుత్ తీగ తెగిపడటంతో భక్తుల్లో భయాందోళనలు నెలకొన్నాయి. విద్యుత్‌ షాక్‌ తగులుతుందనే భయంతో వారంతా బయటకు పరుగులు తీయడంతో తొక్కిసలాట చోటు చేసుకుంది.. ఉదయం సుమారు 6:45 గంటల సమయంలో జరిగిన ఈ ఘటనలో ఏడుగురు భక్తులు ప్రాణాలు కోల్పోయినట్లు ప్రాథమిక సమాచారం. మరో 12 మందికి పైగా గాయపడినట్లు తెలుస్తోంది. వీరిలో కొందరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం.

Bhogapuram: భోగాపురం ఎయిర్‌పోర్ట్‌లో తొలి విమానం ల్యాండ్!ఏపీSwechaa17 Aug 2026, 09:23 AM

Bhogapuram: భోగాపురం ఎయిర్‌పోర్ట్‌లో తొలి విమానం ల్యాండ్!

విజయనగరం జిల్లా భోగాపురంలో అత్యంత ఆధునిక సదుపాయాలతో నిర్మించిన 'అల్లూరి సీతారామరాజు అంతర్జాతీయ విమానాశ్రయం' నుంచి వాణిజ్య విమాన సర్వీసులు నేడు(సోమవారం) అధికారికంగా ప్రారంభమయ్యాయి. హైదరాబాద్ నుంచి బయలుదేరిన ఇండిగో (6E6408) విమానం ఉదయం 6:45 గంటలకు భోగాపురం రన్‌వేపై విజయవంతంగా ల్యాండ్ అవ్వడంతో ఈ నూతన ఎయిర్‌పోర్ట్ కార్యకలాపాలు లాంఛనంగా మొదలయ్యాయి. నూతన విమానాశ్రయానికి చేరుకున్న తొలి విమానానికి, ప్రయాణికులకు జీఎంఆర్ ఎయిర్‌పోర్ట్స్, పౌర విమానయాన శాఖ అధికారులు అత్యంత ఘనంగా స్వాగతం పలికారు.

South vs North India Movements: సౌత్‌లో ఉద్యమాలు తగ్గాయా?స్వేచ్ఛ ఛైర్మన్ డెస్క్Swechaa17 Aug 2026, 09:21 AM

South vs North India Movements: సౌత్‌లో ఉద్యమాలు తగ్గాయా?

నిరుద్యోగ సమస్య ఉందని మొత్తుకుంటున్నరు కానీ ఏ పని చేయడానికి మనోళ్లు సిద్ధంగా లేరంటూ శాసనమండలి చైర్మన్​ గుత్తా సుఖేందర్​ రెడ్డి చేసిన వ్యాఖ్యలు చర్చనీయాంశం అయ్యాయి. ‘‘దావత్​లు ఎక్కువ అవుతున్నాయి. పనికి వెళ్లినా ఫోన్​తో ఎక్కువగా గడుపుతున్నారు. చిన్న పని చేయాలన్నా ఇతర రాష్ట్రాల వాళ్లే చేస్తున్నారు’’ అని గుత్తా అన్నారు. బిహార్​, ఉత్తరప్రదేశ్​ రాష్ట్రాల నుంచి కూలీలు రాకుంటే వడ్ల కొనుగోళ్లు ఆగిపోతున్నాయని, మనవాళ్లు 40 కిలోల బస్తాలను కూడా మోయలేకపోతున్నారని వాపోయారు.

20:20 ఫైనల్‌కు శంఖారావమా?..తెలంగాణSwechaa17 Aug 2026, 09:06 AM

20:20 ఫైనల్‌కు శంఖారావమా?..

గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో కాంగ్రెస్‌కు గతంలో కొన్ని స్థానాల్లో మాత్రమే అనుకూల ఫలితాలు రావడంతో.. ఈసారి ఎన్నికలు సీఎంకు సవాలుగా మారే అవకాశం కనిపిస్తోంది. మరోవైపు అభివృద్ధిని ప్రధాన అస్త్రంగా చేసుకుని సిటీ ఓటర్లను తనవైపు తిప్పుకునే వ్యూహంలో ప్రభుత్వం ఉన్నట్లు సమాచారం. ఇందులో భాగంగా గ్రేటర్ హైదరాబాద్ పరిధిలోని మూడు మున్సిపల్ కార్పొరేషన్లతో పాటు వరంగల్, ఖమ్మం కార్పొరేషన్లపై కూడా అధికార పార్టీ ప్రత్యేకంగా ఫోకస్ పెట్టినట్లు తెలుస్తోంది. ఈ కార్పొరేషన్ ఎన్నికలను ప్రతిపక్షాలపై రాజకీయ పోరుకు వేదికగా మార్చేందుకు ఇప్పటి నుంచే వ్యూహాలు సిద్ధం చేస్తున్నట్లు తెలుస్తుంది.

Ananya Raj: 27ఏళ్లకే నటి మృతి.. నెలరోజులకు వెలుగులోకి..!సినిమాSwechaa17 Aug 2026, 08:56 AM

Ananya Raj: 27ఏళ్లకే నటి మృతి.. నెలరోజులకు వెలుగులోకి..!

తెలుగుతో పాటు బాలీవుడ్‌లోనూ తనదైన ముద్ర వేసిన యువ నటి, ప్రముఖ మోడల్ అనన్య రాజ్(27) అకాల మరణం సినీ పరిశ్రమను తీవ్ర దిగ్భ్రాంతికి గురిచేసింది. గత ఏడాది కాలంగా తీవ్రమైన శారీరక, మానసిక ఆరోగ్య సమస్యలతో బాధపడుతున్న ఆమె జులై 15వ తేదీ తెల్లవారుజామున నిద్రలోనే కన్నుమూశారు. అయితే, ఈ విషాద వార్తను కుటుంబ సభ్యులు దాదాపు నెల రోజుల తర్వాత (ఆగస్టు 16న) సోషల్ మీడియా ద్వారా అధికారికంగా వెల్లడించారు. అనన్య రాజ్ ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో ఆమె కుటుంబ సభ్యులు ఒక సుదీర్ఘమైన, భావోద్వేగ ప్రకటనను పోస్ట్ చేశారు.

మనిషి జీవితాన్ని నడిపించే మార్గదర్శి భగవద్గీత.. నేటి సమాజానికి బోధించే జ్ఞానం ఏమిటి!..SpiritualitySwechaa17 Aug 2026, 08:41 AM

మనిషి జీవితాన్ని నడిపించే మార్గదర్శి భగవద్గీత.. నేటి సమాజానికి బోధించే జ్ఞానం ఏమిటి!..

మనిషి జీవితం ఎప్పుడూ ఒకేలా ఉండదు. సంతోషం, బాధ, విజయం, అపజయం, కోపం, ఆందోళన... ఇలా ఎన్నో అనుభవాల మధ్య మనిషి తన ప్రయాణాన్ని కొనసాగిస్తూనే ఉంటాడు. కానీ ఈ ప్రయాణంలో మనసుకు ప్రశాంతతను, జీవితానికి సరైన దిశను చూపించే జ్ఞానం భగవద్గీతలో దొరుకుతుంది.. వేదాలు, శాస్త్రాలను అధ్యయనం చేసిన పండితులు చెబుతున్న సమాధానం ఇదే.. కురుక్షేత్ర యుద్ధభూమిలో అర్జునుడి మనసులో కలిగిన సందేహం కేవలం అతనిదే కాదు. నేటి మనిషి ఎదుర్కొంటున్న అనేక ప్రశ్నలకు కూడా అది ప్రతిబింబమే. ఏది చేయాలి? ఏది చేయకూడదు? విజయం రాకపోతే? మనం అనుకున్నది జరగకపోతే? ఇలాంటి సందేహాల మధ్య శ్రీకృష్ణుడు అర్జునుడికి అందించిన జ్ఞానమే ఈ గీత.

భూ భారతి - ధరణి  బిడ్డనే!..తెలంగాణSwechaa17 Aug 2026, 08:32 AM

భూ భారతి - ధరణి బిడ్డనే!..

కాంగ్రెస్ ఇచ్చిన హామీ మేరకు ధరణి సాఫ్ట్‌వేర్‌ను రద్దు చేయకుండా, భూ భారతి పేరుతో కొత్త సమస్యలు సృష్టిస్తున్నారని ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. అధికారుల అండతో రాజకీయ నాయకుల భూ దందాలు, సామాన్యుల భూ సమస్యలపై ప్రతిపక్షాల మౌనంపై చర్చించేందుకు భూ బాధితుల సమావేశం నిర్వహిస్తున్నారు. ఆగస్టు 18న హైదరాబాద్ బషీర్‌బాగ్ ప్రెస్ క్లబ్‌లో ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు సమావేశం జరగనుంది.

ఇట్లు

కరుణాకర్ దేశాయి

కన్వీనర్ : తెలంగాణ సమాఖ్య

ఫోన్ : 9849436246

విగ్రహ ప్రతిష్టాపనతో రాయి దేవునిగా ఎలా మారుతుంది!..SpiritualitySwechaa17 Aug 2026, 08:12 AM

విగ్రహ ప్రతిష్టాపనతో రాయి దేవునిగా ఎలా మారుతుంది!..

విగ్రహ ప్రతిష్టాపన అనేది ఒక శిలకు రూపం ఇవ్వడం కాదు... భక్తికి దైవచైతన్యాన్ని అందించే పవిత్ర ప్రక్రియగా శాస్త్రాలు చెబుతాయి. అయితే, కేవలం రూపం సిద్ధించినంత మాత్రాన ఆ రాయి దేవుడు అయిపోడు. ఆ రూపానికి దైవత్వాన్ని ఆవహింపజేసే మహత్తర ఘట్టమే ప్రతిష్టాపన. వేద మంత్రోచ్ఛారణలు, హోమాలు, జలాధివాస, ధాన్యాధివాసాలు, మూలికా సమర్పణల ద్వారా ఆ రాయిలో ఉన్న ప్రతి పరమాణువును శుద్ధి చేస్తారు. అప్పటి వరకు అది కేవలం శిల మాత్రమే. కానీ అదే శిల దేవాలయంలో ప్రతిష్ఠించబడిన తర్వాత భక్తుల కళ్లకు సాక్షాత్తూ దైవస్వరూపంగా కనిపిస్తుంది.

ఆ హీరోయిన్స్ ముగ్గురు అడ్రస్ లేకుండా పోయారే?సినిమాSwechaa16 Aug 2026, 11:31 PM

ఆ హీరోయిన్స్ ముగ్గురు అడ్రస్ లేకుండా పోయారే?

Tollywood: కొందరు హీరోయిన్స్ కొత్తగా ఇండస్ట్రీకొచ్చే ముందు ఎన్నో కలలు కంటారు. కానీ, కొందరికి అవన్నీ కలలుగానే మిగిలిపోతాయి. కొందరు పక్క రాష్ట్రం నుంచి వచ్చి టాలీవుడ్‌లో అదృష్టం పరీక్షించుకుంటారు. ఇలాంటి వారిలో కొందరు టాప్ హీరోయిన్ అయితే కొందరు మాత్రం మళ్ళీ సినిమా అవకాశం రాక అడ్రస్ లేకుండా పోతారు. ది రాజాసాబ్ సినిమాలో నటించిన ముగ్గురు హీరోయిన్స్ పరిస్థితి కూడా ఇలాగే ఉంది.

కేసీఆర్‌కు సీఎం రేవంత్ బిగ్ ఛాలెంజ్.. సెప్టెంబర్‌లో తెలంగాణ పాలిటిక్స్ హీట్!తెలంగాణSwechaa16 Aug 2026, 11:03 PM

కేసీఆర్‌కు సీఎం రేవంత్ బిగ్ ఛాలెంజ్.. సెప్టెంబర్‌లో తెలంగాణ పాలిటిక్స్ హీట్!

అసెంబ్లీ స‌మావేశాల్లో కాంగ్రెస్ గత ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తే.. బీఆర్‌ఎస్ ప్రస్తుత ప్రభుత్వ హామీలు, అమలు తీరుపై ప్రశ్నలు సంధించే అవకాశం ఉంది. అక్కడే అసలు రాజకీయ సమరం మొదలయ్యే అవకాశం ఉంది.

Irumudi: మల్లెపూల పల్లకి.. వచ్చేసింది..ఈ ఒక్కపాట చాలు సినిమా హిట్సినిమాSwechaa16 Aug 2026, 10:16 PM

Irumudi: మల్లెపూల పల్లకి.. వచ్చేసింది..ఈ ఒక్కపాట చాలు సినిమా హిట్

Irumudi: కొ 'ఇరుముడి' సినిమా నుంచి వచ్చిన సాంగ్స్, టీజర్, ట్రైలర్ సహా ఇతర ప్రమోషనల్ కంటెంట్ మంచి బజ్ ని క్రియేట్ చేయగా, తాజాగా జరిగిన ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో అందరూ ఎంతో ఆతృతగా ఎదురుచూస్తున్న 'మల్లెపూల పల్లకి' లిరికల్ వీడియో సాంగ్ విడుదలైంది. ఇలా సాంగ్ రిలీజైందో లేదో అలా యూట్యూబ్‌లో ట్రెండ్ అవుతోంది. జీవీ ప్రకాష్ కుమార్ అందించిన సంగీతం, ఒరిజినల్ సాంగ్ పాడిన డప్పు శ్రీనుతో ఈ పాట పాడించడం బాగా ప్లస్ అయింది.

Trisha: టాలీవుడ్‌పై పెట్టుకున్న ఆశలన్నీ గల్లంతేనా?సినిమాSwechaa16 Aug 2026, 07:28 PM

Trisha: టాలీవుడ్‌పై పెట్టుకున్న ఆశలన్నీ గల్లంతేనా?

Trisha Krishnan: మెగాస్టార్ చిరంజీవి హీరోగా రూపొందుతున్న సోషియో ఫాంటసీ మూవీ 'విశ్వంభర'లో నటిస్తోంది. మల్లిడి వశిష్ఠ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాతో గ్రాండ్ గా రీ ఎంట్రీ ఇస్తున్న త్రిష, చాలా నమ్మకాలు పెట్టుకుంది. కానీ, ఈ సినిమా ఎప్పటికప్పుడు రిలీజ్ వాయిదా పడుతూ వస్తోంది. దసరా పండుగ సందర్భంగా రిలీజ్ అంటున్నారు. 'విశ్వంభర' రిలీజై హిట్ సాధిస్తే టాలీవుడ్ నుంచి మరిన్ని ఛాన్సులు వస్తాయని ఆశపడింది. కానీ, ఆ ఆశలన్నీ, గల్లంతైయ్యేలా పరిస్థితి కనిపిస్తోంది. దీనికి, కారణం 'విశ్వంభర'పై కాస్త నెగిటివిటీ ఉండటమే. ఈ సినిమా అవుట్‌పుట్ చిరంజీవికే తృప్తిగా అనిపించలేదట.

Anupama Parameswaran: నేను డల్‌గా ఉంటే ఆయన నుంచి మెసేజ్ వస్తుంది!సినిమాSwechaa16 Aug 2026, 06:52 PM

Anupama Parameswaran: నేను డల్‌గా ఉంటే ఆయన నుంచి మెసేజ్ వస్తుంది!

Anupama Parameswaran: తనకి ఇద్దరు హీరోలు అండగా ఉంటారని చెప్పిన అనుపమ..ఆ ఇద్దరు దుల్కర్ సల్మాన్, టాలీవుడ్ ఎనర్జిటిక్ హీరో రామ్ పోతినేని అని ఓపెన్‌గా రివీల్ అయింది. తను కాస్త డల్‌గా ఉన్నా ఎలా తెలుస్తుందో గానీ, దుల్కర్ నుంచి మెసేజ్ వస్తుందని..అలా, బాధలో ఉన్నప్పుడు దుల్కర్ చాలా సపోర్ట్ చేస్తాడని చెప్పుకొచ్చింది. అలాగే, రామ్ కూడా నాకు ఎప్పుడు ఎలాంటి ఇబ్బందుల్లో ఉన్న ఆదుకుంటాడని తెలిపింది. వీరితో కలిసి అనుపమ జతగా సినిమాలు చేసింది. దుల్కర్ తో చేసిన 'ఐయామ్ గేమ్' సినిమా సెప్టెంబర్ లో రిలీజ్ కబోతోంది.

ఆల్మట్టికి జలకళ.. నిండుతున్న రిజర్వాయర్!..తెలంగాణSwechaa16 Aug 2026, 06:34 PM

ఆల్మట్టికి జలకళ.. నిండుతున్న రిజర్వాయర్!..

ఎగువ ప్రాంతాల్లో కురుస్తున్న వర్షాలతో ప్రధాన జలాశయాలకు వరద ప్రవాహం కొనసాగుతోంది. ఆల్మట్టికి 32 వేల క్యూసెక్కుల ఇన్‌ఫ్లో వస్తుండగా.. 26 వేల క్యూసెక్కులను దిగువకు విడుదల చేస్తున్నారు. తుంగభద్రకు 21 వేల క్యూసెక్కుల వరద వస్తుండగా.. 5,800 క్యూసెక్కుల నీరు వదులుతున్నారు. ఇక జూరాలకు 24 వేల క్యూసెక్కుల నీరు చేరుతుండగా.. 20,705 క్యూసెక్కులు దిగువకు విడుదల చేస్తున్నారు. కాగా మూడు ప్రాజెక్టుల్లోనూ భారీగా నీటి నిల్వలు కొనసాగుతున్నాయి.

Trivikram: సూర్యతో సినిమా ఉంటుంది కానీ!సినిమాSwechaa16 Aug 2026, 06:22 PM

Trivikram: సూర్యతో సినిమా ఉంటుంది కానీ!

Trivikram: త్రివిక్రమ్ సూర్యతో ఒక సినిమా అనుకున్నాను. కానీ, కుదరలేదు. గ్యారెంటీగా ఆయనతో ఓ సినిమాను చేస్తాను అంటూ వీరి కాంబో మూవీపై హింట్ ఇచ్చాడు. దీన్ని బట్టి చూస్తే గాడ్ ఆఫ్ వార్ గనక ఆలస్యం అయితే, సూర్య రెడీగా ఉన్నాడు కాబట్టి ఆయనతో త్రివిక్రమ్ నెక్స్ట్ సినిమాను చేయడానికి ప్లాన్ చేస్తున్నటుగా తెలుస్తోంది. ఏదేమైనా, కాస్త ఆలస్యం అయినా త్రివిక్రమ్, సూర్యల కలయికలో సినిమా కన్‌ఫర్మ్.

సమస్యల పరిష్కారమే లక్ష్యంగా.. రేపటి నుండి మండల స్థాయిలో ప్రజావాణి!..తెలంగాణSwechaa16 Aug 2026, 06:07 PM

సమస్యల పరిష్కారమే లక్ష్యంగా.. రేపటి నుండి మండల స్థాయిలో ప్రజావాణి!..

సమస్యల పరిష్కారం కోసం కలెక్టర్ ఆఫీసుకు వెళ్ళకుండా ఈ నెల 17వ తేదీ నుంచి మండల స్థాయిలోనూ ప్రజావాణి కార్యక్రమం ప్రారంభం కానుంది. ప్రతి సోమవారం ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు మండల పరిషత్ కార్యాలయాల్లో ప్రజావాణి నిర్వహిస్తారు. ఎంపీడీవోలు నోడల్ అధికారులుగా, అన్ని శాఖల మండల అధికారులు ఇందులో పాల్గొంటారు. ప్రజలు తమ సమస్యలపై నేరుగా ఆర్జీలు సమర్పించవచ్చు. ఫిర్యాదులను సంబంధిత అధికారులు నిర్ణీత సమయంలో పరిష్కరించనున్నారు. ప్రజలు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కలెక్టర్లు సూచించారు.

గాడి తప్పుతున్న నేటి యువతకు కారణం ఎవరు?అభిప్రాయంSwechaa16 Aug 2026, 05:16 PM

గాడి తప్పుతున్న నేటి యువతకు కారణం ఎవరు?

గాడి తప్పుతున్న నేటి యువతకు కారణం ఎవరు? సోషల్ మీడియా ప్రభావమా? కుటుంబంలో తగ్గుతున్న సంభాషణా? చదువు, ఉద్యోగాల ఒత్తిడా? లేక మారుతున్న జీవనశైలినా? యువతను తప్పుపట్టడం సులభమే.. కానీ వారి సమస్యలను అర్థం చేసుకోవడం చాలా కష్టం. సరైన మార్గనిర్దేశం, కుటుంబం నుంచి ప్రోత్సాహం, సమాజం నుంచి సహకారం అందితే.. యువత దేశ భవిష్యత్తును మార్చగల శక్తిగా నిలుస్తుంది.

Venky Atluri: చిరును డైరెక్ట్ చేసే అనుభవం ఇంకా రాలేదా?సినిమాSwechaa16 Aug 2026, 04:51 PM

Venky Atluri: చిరును డైరెక్ట్ చేసే అనుభవం ఇంకా రాలేదా?

Venky Atluri: యువ దర్శకుడు వెంకీ అట్లూరికి ఇంతకముందే మెగాస్టార్‌ని డైరెక్ట్ చేసే ఛాన్స్ వచ్చిందట. కానీ, ఆయన వెనకడుగు వేసినట్టుగా వెల్లడించారు. గతంలో, వెంకీ అట్లూరికి చిరు ఛాన్స్ ఇచ్చినట్టుగా వార్తలు వచ్చాయి. తర్వాత, దీని ఊసే లేకుండా పోయింది. అయితే, తాజాగా సూర్యతో వెంకీ తీసిన విశ్వనాథ్ అండ్ సన్స్ మూవీ ప్రమోషన్స్‌లో ఈ విషయాన్ని వెల్లడించాడు.

Vishwanath And Sons: సూర్య మాస్ రాంపేజ్ 2 రోజుల్లో 100 కోట్ల కలెక్షన్స్సినిమాSwechaa16 Aug 2026, 04:27 PM

Vishwanath And Sons: సూర్య మాస్ రాంపేజ్ 2 రోజుల్లో 100 కోట్ల కలెక్షన్స్

Vishwanath And Sons: సూర్య, టాలీవుడ్ డైరెక్టర్ వెంకీ అట్లూరి దర్శకత్వంలో విశ్వనాథ్ అండ్ సన్స్ అనే సినిమాను చేశాడు. ఈ సినిమాను సూర్య దేవర నాగవంశీ సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్‌పై నిర్మించాడు. మమిత బైజు హీరోయిన్‌గా నటించింది. ఈ సినిమా రిలీజైన 2 రోజుల్లోనే 100 కోట్ల మార్క్‌ను చేరుకొని సెన్షేషనల్ హిట్‌గా నిలిచింది.

వందేమాతరంపై పార్టీల వార్.. సోనియా క్షమాపణకు అమిత్ షా డిమాండ్!.. అస‌లేం జ‌రిగింది?NationalSwechaa16 Aug 2026, 04:16 PM

వందేమాతరంపై పార్టీల వార్.. సోనియా క్షమాపణకు అమిత్ షా డిమాండ్!.. అస‌లేం జ‌రిగింది?

వందేమాతరంపై రాజకీయ వివాదం కొత్తది కాదు. అయితే ఈసారి ప్రత్యేకత ఏమిటంటే.. స్వాతంత్ర దినోత్సవం రోజున కాంగ్రెస్ కార్యాలయంలోనే పూర్తి వందేమాతరం ఆలపన సందర్భంగా వివాదం చెలరేగడం కొత్త చ‌ర్చ‌కు దారి తీసింది. అంతేకాదు, పార్లమెంట్ వందేమాతరానికి సంబంధించిన కొత్త చట్టాన్ని ఆమోదించిన నేపథ్యంలో ఈ వివాదం మరింత ప్రాధాన్యం సంతరించుకుంది

Viral : రూ.16కే డ్రెస్ మెటీరియల్, ఆఫర్ 16 నిమిషాలే.. చివర్లో బిగ్ ట్విస్ట్!వైరల్ న్యూస్Swechaa16 Aug 2026, 02:46 PM

Viral : రూ.16కే డ్రెస్ మెటీరియల్, ఆఫర్ 16 నిమిషాలే.. చివర్లో బిగ్ ట్విస్ట్!

పండుగలు, జాతీయ సెలవు దినోత్సవం సందర్భంగా షాపింగ్ మాల్స్ యాజమానులు ఆఫర్స్ ప్రకటించడం కామన్.నిన్న స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకుని ఓ బట్టల దుకాణ యాజమాని వింతైన ఆఫర్ ప్రకటించాడు. ఏ రకమైన డ్రెస్ మెటీరియల్ కొనుగోలు చేసినా రూ.16 మాత్రమే అని.. ఆ ఆఫర్ కూడా కేవలం రూ.16 నిమిషాలు మాత్రమే ఉంటుందని ప్రకటించడంతో ఒక్కసారిగా జనాలు ఎగబడ్డారు. ఆ షాపునకు వెళ్లే దారంతా జనాలు నిండిపోయారు. వారంతా పరుగులు తీయడంతో సామాన్యులు, వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. ఈ ఘటన ఉత్తరప్రదేశ్‌లోని కాన్పూర్‌లో ఆలస్యంగా వెలుగుచూసింది. దీనికి సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

దోచుకుందామని వెళ్లి ఫుల్లుగా తాగేసి..ఏం చేశారంటే? (వీడియో)క్రైమ్Swechaa16 Aug 2026, 02:29 PM

దోచుకుందామని వెళ్లి ఫుల్లుగా తాగేసి..ఏం చేశారంటే? (వీడియో)

దొంగతనానికి వెళ్లిన దొంగలు దోచిన సొత్తును తీసుకోని వెళ్లిపోవడం కామన్. కానీ, ఇటీవల కొందరు దొంగలు దోచుకున్న చోటే కడుపు నింపుకుంటున్నారు.అదే ఇంట్లో తినడంతో పాటు తాగేసి అక్కడే తొంగుంటున్నారు. ఇదే వారిని ఊచలు లెక్కబెట్టేలా చేస్తున్నది. తాజాగా ఇలాంటి ఘటనే రాష్ట్రంలోని ఖమ్మం జిల్లాలో వెలుగుచూసింది.వివరాల్లోకివెళితే.. ఖమ్మం జిల్లాలోని రెడ్డిపల్లిలో అర్థరాత్రి సమయంలో ఓ దాబాలో ఐదుగురు దుండగులు దొంగతనానికి వెళ్లారు.మొదట విలువైన సామగ్రి దోచుకుని పారిపోయిన దొంగలు.. మరల మిగిలిన సొమ్ము కోసం మళ్లీ అదే దాబాకి తిరిగొచ్చారు. అదే క్రమంలో వారికి ఈసారి అక్కడ మద్యం కనిపించింది. దీంతో మందు తాగేసి సొమ్ము దోచుకెళ్దామని దుండగులు అనుకున్నారు.కక్కుర్తి పడి మద్యం ఎక్కువగా తాగేయడంతో మత్తెక్కి దాబా ప్రాంగణంలోనే దొంగలు నిద్రపోయారు.

ప్రోటోకాల్ రగడ.. సూర్యాపేటలో  మాజీ మంత్రి వర్సెస్ మంత్రి!తెలంగాణSwechaa16 Aug 2026, 02:17 PM

ప్రోటోకాల్ రగడ.. సూర్యాపేటలో మాజీ మంత్రి వర్సెస్ మంత్రి!

రాష్ట్రంలో మరోసారి ప్రోటోకాల్ వివాదం రాజుకుంది. అధికారపార్టీ ఏదైనా ఒక నియోజకవర్గంలో ప్రభుత్వ కార్యక్రమం చేపడితే సదరు నియోజకవర్గ ఎమ్మెల్యే మనోడైనా, కాకపోయినా ఇన్విటేషన్ ఇవ్వాల్సి ఉంటుంది. దీనికి తోడు అక్కడ ఏర్పాటు చేసిన శంకుస్థాపన బోర్డు, శిలాఫలకంలో సదరు ఎమ్మెల్యే పేరు ఏర్పాటు చేయాల్సి ఉంటుంది. కానీ, సూర్యాపేట నియోజకవర్గంలో కొత్తగా ఏర్పాటు సెల్యూట్ బేస్ శిలాఫలకంపై మాజీ మంత్రి, బీఆర్ఎస్ ఎమ్మెల్యే జగదీశ్ రెడ్డి పేరు వేయలేదని సమాచారం.దీంతో బీఆర్ఎస్ నేతలు భగ్గుమంటున్నారు. అధికార పార్టీ నేతలు కావాలనే తమను కించపరుస్తున్నారని ఆరోపణలు చేస్తున్నారు.

కూరగాయలు కొంటున్నారా.. లేక పురుగుమందులా? తెలంగాణలో షాకింగ్ రిపోర్ట్!తెలంగాణSwechaa16 Aug 2026, 02:15 PM

కూరగాయలు కొంటున్నారా.. లేక పురుగుమందులా? తెలంగాణలో షాకింగ్ రిపోర్ట్!

దేశంలో అత్యధిక సంఖ్యలో పరిమితికి మించిన నమూనాలు నమోదైన రాష్ట్రంగా తెలంగాణ నిలిచింది. రాష్ట్రంలో పరీక్షించిన 8,198 నమూనాల్లో 486 నమూనాలు అనుమతించిన పరిమితిని మించాయి. ఇది దాదాపు 5.9 శాతం. సంఖ్య పరంగా చూస్తే దేశంలోనే తెలంగాణ మొదటి స్థానంలో ఉంది.

రాజసమా? రాజకీయమా? హాట్ టాపిక్ గా కోమటిరెడ్డి రాజగోపాలరెడ్డి వ్యవహారం!..తెలంగాణSwechaa16 Aug 2026, 02:09 PM

రాజసమా? రాజకీయమా? హాట్ టాపిక్ గా కోమటిరెడ్డి రాజగోపాలరెడ్డి వ్యవహారం!..

తెలంగాణ కాంగ్రెస్‌లో కోమటిరెడ్డి రాజగోపాలరెడ్డి వ్యవహారం రోజురోజుకూ హాట్‌టాపిక్‌గా మారుతోంది. పార్టీ నాయకత్వం తీరుపై ఆయన బహిరంగంగా ప్రశ్నలు సంధించడం.. పోచారం, దానం వంటి నేతల చేరికలను టార్గెట్ చేయడం చర్చనీయాంశంగా మారింది. దీంతో ఆయన నేరుగా రేవంత్‌రెడ్డి నాయకత్వాన్నే సవాల్ చేస్తున్నారా? అన్న ప్రశ్నలు వినిపిస్తున్నాయి. గతంలో బీజేపీలోకి వెళ్లి తిరిగి కాంగ్రెస్‌లోకి వచ్చిన రాజగోపాలరెడ్డి.. ఇప్పుడు మరోసారి పార్టీ మారుతారా? బీజేపీ వైపు చూస్తారా? కొత్త రాజకీయ వేదిక పెడతారా? లేక కాంగ్రెస్‌లోనే ఉంటూ పోరాడతారా? అన్నదే సస్పెన్స్. ఇదంతా జరుగుతున్నా హైకమాండ్ మౌనం ఎందుకు? ఇదే ఇప్పుడు తెలంగాణ రాజకీయాల్లో ఆసక్తికరమైన అంశంగా మారింది.

GRMB : గోదావరి జలాల వివాదంపై హై టెన్షన్.. జీఆర్ఎంబీ సమావేశం వాయిదాతెలంగాణSwechaa16 Aug 2026, 02:02 PM

GRMB : గోదావరి జలాల వివాదంపై హై టెన్షన్.. జీఆర్ఎంబీ సమావేశం వాయిదా

తెలుగు రాష్ట్రాల నడుమ మరోసారి జలవివాదం ముదిరిన విషయం తెలిసిందే. కృష్ణా, గోదావరి నదీ జలాల వాడకంలో తమకు అన్యాయం జరుగుతోందని ఓ వైపు తెలంగాణ ఆరోపిస్తుంటే..లేదు లేదు తమకే అన్యాయం జరుగుతోందని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వాదిస్తోంది. ఎగువన తెలంగాణ ఇష్టానుసారంగా ప్రాజెక్టులు కడుతూ తమకు న్యాయంగా రావాల్సిన వాటాను వాడుకోకుండా చేస్తున్నదని ఏపీ వాదిస్తుంటే.. కృష్ణా జలాల్లో దక్షిణ తెలంగాణకు నష్టం వాటిల్లే విధంగా ఏపీ వ్యవహరిస్తోందని తెలంగాణ ప్రభుత్వం ఆరోపిస్తున్నది. ఈ నేపథ్యంలోనే తెలుగు రాష్ట్రాల మధ్య ఎల్లుండి జరగాల్సిన గోదావరి రివర్ మేనేజ్‌మెంట్ బోర్డు (GRMB) సమావేశం వాయిదా పడినట్టు తెలిసింది. ఏపీ అసెంబ్లీ సమావేశాలు జరుగుతున్నందున జీఆర్ఎంబీ బోర్డు సమావేశం వాయిదా వేస్తున్నట్టు అధికారులు తెలిపారు. తదుపరి తేదీని త్వరలోనే ప్రకటించనున్నట్టు గోదావరి రివర్ బోర్డు తెలిపింది. మరోవైపు కృష్ణా రివర్ మేనేజ్‌మెంట్ బోర్డు (KRMB) త్రిసభ్య కమిటీ భేటీ రేపు యథాతథంగా జరగనుంది.

Anil Ravipudi: ఆ నలుగురికీ ఆదివారాలు, సెలవులు లేవు!సినిమాSwechaa16 Aug 2026, 01:45 PM

Anil Ravipudi: ఆ నలుగురికీ ఆదివారాలు, సెలవులు లేవు!

Anil Ravipudi: విక్టరీ వెంకటేష్, నందమూరి కళ్యాణ్ రామ్ హీరోలుగా ఈ మల్టీస్టారర్ తెరకెక్కుతోంది. ఇందులో, వెంకీ సరసన కీర్తి సురేష్, కళ్యాణ్ రామ్ సరసన కృతీ శెట్టి హీరోయిన్‌గా నటిస్తోంది. అయితే, సంక్రాంతి పండుగను టార్గెట్‌గా పెట్టుకొని అనిల్ రావిపూడి ఈ నలుగురికి అసలు సెలవులే ఇవ్వడం లేదట.

హద్దు మీరిన అధికారులు.. త్రివర్ణపతాకం ముందే నీచమైన డ్యాన్సులు!ఏపీSwechaa16 Aug 2026, 01:45 PM

హద్దు మీరిన అధికారులు.. త్రివర్ణపతాకం ముందే నీచమైన డ్యాన్సులు!

స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా కొందరు జాతీయ జెండాను అవమానపరిచే విధంగా వ్యవహారించారని సోషల్ మీడియాలో పెద్దఎత్తున విమర్శలు వ్యక్తం అవుతున్నాయి. కొన్ని చోట్ల త్రివర్ణ పతాకాన్ని ఆవిష్కరించే క్రమంలో తప్పులు దొర్లడం, మరికొందరు జతీయగీతం ఆలాపన సందర్భంగా కనీస మర్యాద పాటించకుండా వ్యహరించారని, కేవలం మౌనంగా నిలబడ్డారని, ఆలాపించడం లేదని విమర్శలు వెల్లువెత్తున్నాయి. ఈ క్రమంలోనే ఏపీలోని అల్లూరి జిల్లా చింతపల్లిలోని APFDC కార్యాలయంలో స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల్లో అధికారులు వింతగా ప్రవర్తించారు. జాతీయ జెండా ఎగురవేసిన అనంతరం దేశభక్తి గీతాలకు బదులుగా ‘రాను బొంబాయికి రాను’ వంటి సినిమా, జానపద పాటలకు అధికారులు స్టెప్పులు వేశారు. మువ్వన్నెల జెండా నీడన వినోద నృత్యాలు చేయడంపై స్థానికులు, నెటిజన్లు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

చిత్రం లేదు
క్రీడలుSwechaa16 Aug 2026, 01:40 PM

బంగ్లా చేతిలో ఆసిస్ ఘోర పరాజయం.. !

క్రికెట్ ప్రపంచంలో బంగ్లాదేశ్ జట్టు సరికొత్త చరిత్ర సృష్టించింది. డార్విన్ వేదికగా ఆస్ట్రేలియాతో జరిగిన తొలి టెస్టు మ్యాచ్‌లో 9 వికెట్ల తేడాతో పటిష్టమైన ఆసీస్ జట్టును మట్టికరిపించింది. 23 ఏళ్ల సుదీర్ఘ విరామం తర్వాత ఆస్ట్రేలియా గడ్డపై టెస్టు మ్యాచ్ ఆడుతున్న బంగ్లాదేశ్, ఆతిథ్య జట్టుకు ఊహించని షాక్ ఇచ్చి తమ టెస్టు చరిత్రలోనే అత్యంత చిరస్మరణీయమైన విజయాన్ని నమోదు చేసుకుంది. తొలి ఇన్నింగ్స్‌లో ఆస్ట్రేలియాను 198 పరుగులకే కట్టడి చేసిన బంగ్లాదేశ్, తన మొదటి ఇన్నింగ్స్‌లో 426 పరుగుల భారీ స్కోరు సాధించింది.

Vijay DevarakonDa: విలేజ్ బ్యాక్‌డ్రాప్‌లో 'రౌడీ జనార్ధన'సినిమాSwechaa16 Aug 2026, 01:20 PM

Vijay DevarakonDa: విలేజ్ బ్యాక్‌డ్రాప్‌లో 'రౌడీ జనార్ధన'

Vijay DevarakonDa:విజయ్ దేవరకొండ హీరోగా నటిస్తున్న సినిమా 'రౌడీ జనార్ధన'. ఇందులో, హీరోయిన్‌గా కీర్తి సురేష్ నటిస్తోంది. రవి కిరణ్ కోలా దర్శకత్వం వహిస్తున్నాడు. టాలీవుడ్ అగ్ర నిర్మాణ సంస్థ శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ పతాకంపై దిల్ రాజు-శిరీష్ నిర్మిస్తున్నారు. 'రౌడీ జనార్ధన' సినిమాకి విలేజ్ బ్యాక్ డ్రాప్ ప్రధానమైన బలం అని, భారీ యాక్షన్ సీన్స్, విజయ్ పర్ఫార్మెన్స్ హైలెట్‌గా నిలుస్తాయని చెప్తున్నారు.