స్వేచ్ఛ షార్ట్స్ — తాజా తెలుగు వార్తలు

Vijay DevarakonDa: విలేజ్ బ్యాక్‌డ్రాప్‌లో 'రౌడీ జనార్ధన'సినిమాSwechaa16 Aug 2026, 01:20 PM

Vijay DevarakonDa: విలేజ్ బ్యాక్‌డ్రాప్‌లో 'రౌడీ జనార్ధన'

Vijay DevarakonDa:విజయ్ దేవరకొండ హీరోగా నటిస్తున్న సినిమా 'రౌడీ జనార్ధన'. ఇందులో, హీరోయిన్‌గా కీర్తి సురేష్ నటిస్తోంది. రవి కిరణ్ కోలా దర్శకత్వం వహిస్తున్నాడు. టాలీవుడ్ అగ్ర నిర్మాణ సంస్థ శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ పతాకంపై దిల్ రాజు-శిరీష్ నిర్మిస్తున్నారు. 'రౌడీ జనార్ధన' సినిమాకి విలేజ్ బ్యాక్ డ్రాప్ ప్రధానమైన బలం అని, భారీ యాక్షన్ సీన్స్, విజయ్ పర్ఫార్మెన్స్ హైలెట్‌గా నిలుస్తాయని చెప్తున్నారు.

Fariya Abdulla : బోనమెత్తినందుకు ట్రోలింగ్.. వెక్కివెక్కి ఏడ్చిన హీరోయిన్  (వీడియో)తెలంగాణSwechaa16 Aug 2026, 12:56 PM

Fariya Abdulla : బోనమెత్తినందుకు ట్రోలింగ్.. వెక్కివెక్కి ఏడ్చిన హీరోయిన్ (వీడియో)

జాతిరత్నాలు మూవీ ఫేమ్ ‘ఫరియా అబ్దుల్లా’ తనపై జరుగుతున్న ట్రోలింగ్‌కు సంబంధించి ఏడుస్తూ నెట్టింట్ ఓ వీడియోను షేర్ చేశారు. ఇటీవల ఆమె తెలంగాణ పండుగ బోనాల ఉత్సవాల్లో పాల్గొన్న విషయం తెలిసిందే. రాష్ట్ర సంస్కృతి, సాంప్రదాయాలలో భాగమైన బోనాల వేడుకల్లో పాల్గొనడంతో పాటు అమ్మవారి బోనం ఎత్తారు.ఆ దృశ్యాలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అయ్యాయి. అయితే, ఫరియా బోనాల వేడుకల్లో పాల్గొనడంపై కొందరు సోషల్ మీడియా వేదికగా మతం పేరిట వ్యక్తిగత దూషణలకు పాల్పడుతున్నారని ఆమె కన్నీటి పర్యంతం అయ్యారు. తెలంగాణ సంస్కృతిని గౌరవిస్తూ ఉత్సవాల్లో పాల్గొంటే దానికి మతరంగు పులిమి ద్వేషాన్ని వ్యాప్తి చేయడంపై ఆమె ఆవేదనకు లోనయ్యారు.

శంషాబాద్‌ ఎయిర్‌పోర్టులో కలకలం.. తనిఖీల్లో నకిలీ టికెట్, బుల్లెట్లు స్వాధీనం!క్రైమ్Swechaa16 Aug 2026, 12:49 PM

శంషాబాద్‌ ఎయిర్‌పోర్టులో కలకలం.. తనిఖీల్లో నకిలీ టికెట్, బుల్లెట్లు స్వాధీనం!

శంషాబాద్‌లోని రాజీవ్‌గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయంలో వరుసగా చోటుచేసుకున్న రెండు వేర్వేరు ఘటనలు తీవ్ర కలకలం రేపాయి. విమానాశ్రయంలో నిర్వహించిన నిత్య తనిఖీల్లో ఒక ప్రయాణికుడి వద్ద నకిలీ విమాన టికెట్‌ను, మరొక ప్రయాణికుడి లగేజీలో సజీవ బుల్లెట్లను సీఐఎస్ఎఫ్ (CISF) భద్రతా సిబ్బంది గుర్తించారు. రెండు వేర్వేరు మార్గాల్లో ప్రయాణించాల్సిన ఈ ప్రయాణికులను అధికారులు తక్షణమే అదుపులోకి తీసుకుని దర్యాప్తు ప్రారంభించారు. సౌదీ అరేబియాలోని జెద్దా నగరం వెళ్లేందుకు విమానాశ్రయానికి వచ్చిన ఒక ప్రయాణికుడి టికెట్‌ను పరిశీలించగా సెక్యూరిటీ అధికారులకు తీవ్ర అనుమానం వచ్చింది.

సీజేఐ సీరియస్.. నల్సార్ విద్యార్థులకు బీసీఐ చైర్మన్  క్షమాపణలుNationalSwechaa16 Aug 2026, 12:35 PM

సీజేఐ సీరియస్.. నల్సార్ విద్యార్థులకు బీసీఐ చైర్మన్ క్షమాపణలు

హైదరాబాద్‌లోని నల్సార్ యూనివర్సిటీ ఆఫ్ లా విద్యార్థులకు బార్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా(బీసీఐ) చైర్మన్ మనన్ కుమార్ మిశ్రా క్షమాపణలు చెప్పారు. సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ సూర్యకాంత్ ఆగ్రహం వ్యక్తం చేయడంతో బీసీఐ చైర్మన్ ఈ మేరకు నల్సార్ స్టూడెంట్స్‌కు క్షమాపణలు చెప్పినట్టు సమాచారం. ‘నా మాటలు బాధించి ఉంటే క్షమాపణలు కోరుతున్నా’ అని ఓ లేఖ విడుదల చేశారు. ఇదిలాఉండగా, సుప్రీంకోర్టు సీజేఐ సూర్యకాంత్‌‌ను చీఫ్ గెస్టుగా పిలువొద్దని, ఆయన చేతుల మీదగా డిగ్రీ పట్టాలు అందుకోబోమని నల్సార్ లా వర్సిటీ విద్యార్థులు ఆందోళనలు నిర్వహించిన విషయం తెలిసిందే.

సంచలనం.. టాప్ టెర్రరిస్ట్ ఇంట్లో మువ్వన్నెల జెండా రెపరెపలు!NationalSwechaa16 Aug 2026, 12:18 PM

సంచలనం.. టాప్ టెర్రరిస్ట్ ఇంట్లో మువ్వన్నెల జెండా రెపరెపలు!

జమ్మూ కశ్మీర్‌లో 80వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల సందర్భంగా ఓ అరుదైన, ఆసక్తికరమైన దృశ్యం అందరి దృష్టిని ఆకర్షించింది. భద్రతా దళాల మోస్ట్-వాంటెడ్ లిస్ట్‌లో ఉన్న లష్కరే తోయిబా టాప్ కమాండర్ అబిద్ రంజాన్ షేక్ తల్లిదండ్రులు తమ నివాసంపై త్రివర్ణ పతాకాన్ని ఎగరేసి దేశభక్తిని చాటుకున్నారు. షాపియాన్‌లోని తమ ఇంట్లో తల్లి, తండ్రి ఇద్దరూ కలిసి మువ్వన్నెల జెండాను ఆవిష్కరించడం స్థానికంగా తీవ్ర చర్చనీయాంశంగా మారింది. పాక్ ఆక్రమిత కశ్మీర్ (పీఓకే) నుంచి కార్యకలాపాలు సాగిస్తున్న అబిద్ రంజాన్ షేక్, లోయలో జరిగిన అనేక ఉగ్రవాద దాడుల్లో కీలక సూత్రధారిగా వ్యవహరిస్తున్నాడు.

Birthday Twist: ఊరుకో అక్కా.. ఎన్నెన్నో అనుకుంటాం.. అన్నీ జరుగుతాయా ఏంటి?వైరల్ న్యూస్Swechaa16 Aug 2026, 11:51 AM

Birthday Twist: ఊరుకో అక్కా.. ఎన్నెన్నో అనుకుంటాం.. అన్నీ జరుగుతాయా ఏంటి?

పుట్టినరోజున భర్త ఇచ్చే బహుమతి కోసం ఏ భార్య అయినా చాలా ఆశగా ఎదురుచూస్తుంది. అందులోనూ ఆ బహుమతి కాస్త పెద్ద సైజులో ఉంటే ఆ ఆనందమే వేరు..! సరిగ్గా అలాంటి ఒక సంఘటనే ఇప్పుడు సోషల్ మీడియాను ఊపేస్తోంది. ఓ భార్య తన పుట్టినరోజు సందర్భంగా భర్త నుంచి ఖరీదైన కారు గిఫ్ట్‌గా వస్తుందని కొండంత ఆశ పెట్టుకుంది. తీరా బహుమతి చూశాక ఆమె మైండ్ బ్లాంక్ అయిపోయింది. భార్య బర్త్‌డే రోజు రానే వచ్చింది.. ఇంటి ముందు కారు ఆకారంలో, నీట్‌గా ప్యాక్ చేసి ఉన్న ఒక పెద్ద గిఫ్ట్ ప్రత్యక్షమైంది. దాన్ని చూడగానే ఆ భార్య సంతోషానికి హద్దులు లేకుండా పోయాయి. తనకు నిజంగానే కారు కొనిచ్చాడని, భర్త ప్రేమను చూసి ఎంతో మురిసిపోయింది. "అబ్బా.. ఎంత మంచి భర్త!" అనుకుంటూ, ఎంతో ఆత్రుతగా ఆ గిఫ్ట్ కవర్‌ను తొలగించడం ప్రారంభించింది.

‘ఇన్నర్ వేర్’ డెలివరీ ఆలస్యం.. ఇంట్లో బంధించి టార్చర్!వైరల్ న్యూస్Swechaa16 Aug 2026, 11:46 AM

‘ఇన్నర్ వేర్’ డెలివరీ ఆలస్యం.. ఇంట్లో బంధించి టార్చర్!

ఓ ఆర్డర్ డెలివరీ ఆలస్యం అయ్యిందని ఓ వ్యక్తి రెచ్చిపోయాడు. బాయ్‌ను ఇంట్లో బంధించి టార్చర్ చేశాడు. ఈ ఘటన యూపీలో మీరట్‌లో చోటుచేసుకోగా.. తోటి గిగ్ వర్కర్లు ఆగ్రహం వ్యక్తం చేయడంతో పాటు రోడ్డెక్కారు. దాడి చేసిన వ్యక్తిని అరెస్టు చేయడంతో పాటు క్షమాపణ చెప్పించాలని డిమాండ్ చేస్తున్నారు.వివరాల్లోకివెళితే.. నిన్న రాత్రి 9 గంటల సమయంలో.. యమన్(34) అనే వ్యక్తి అండర్‌వేర్, చిప్స్ ప్యాకెట్‌ ఆన్‌లైన్‌లో ఆర్డర్ చేశాడు. స్టోర్ వాళ్లు అండర్‌వేర్ తీసుకురావడంలో ఆలస్యం చేయడంతో.. డెలివరీ బాయ్ అమిత్‌ 5 నిమిషాలు ఆలస్యంగా ఆర్డర్ డెలివర్ చేశాడు.దాంతో 5 నిమిషాలు ఆలస్యం ఎందుకు అయ్యిందంటూ అమిత్‌పై యమన్ చెయ్యి చేసుకున్నాడు. ఆపై అతడ్ని ఇంట్లోకి తీసుకెళ్లి.. కొద్దిసేపు బంధించి.. దుర్భాషలాడుతూ దాడి చేశాడని బాధితుడు పేర్కొన్నాడు.

TGPSC: నిరుద్యోగులకు గుడ్‌న్యూస్.. వారంలో టీజీపీఎస్సీ వరుస నోటిఫికేషన్లు!తెలంగాణSwechaa16 Aug 2026, 11:34 AM

TGPSC: నిరుద్యోగులకు గుడ్‌న్యూస్.. వారంలో టీజీపీఎస్సీ వరుస నోటిఫికేషన్లు!

తెలంగాణలోని నిరుద్యోగ యువతకు కాంగ్రెస్ ప్రభుత్వం భారీ ఊరటనిస్తూ కీలక ప్రకటన చేసింది. నియామక ప్రక్రియను మరింత వేగవంతం చేస్తూ వచ్చే వారం నుంచి వివిధ శాఖల్లోని ఖాళీల భర్తీకి వరుసగా నోటిఫికేషన్లు విడుదల చేయనున్నట్లు తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (TGPSC) వెల్లడించింది. దీనికి అదనంగా, ప్రభుత్వ శాఖల్లో ఏర్పడే ఖాళీలను ఎప్పటికప్పుడు భర్తీ చేసేందుకు ప్రతి ఆరు నెలలకు ఒకసారి పోటీ పరీక్షలు నిర్వహిస్తామని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి హామీ ఇవ్వడంతో నిరుద్యోగుల్లో సరికొత్త ఉత్సాహం నెలకొంది. స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా టీజీపీఎస్సీ కార్యాలయంలో జాతీయ పతాకాన్ని ఆవిష్కరించిన అనంతరం కమిషన్ ఛైర్మన్ బుర్రా వెంకటేశం మాట్లాడారు.

నాగార్జున సాగర్ బ్యాక్ వాటర్ టూర్‌లో తీవ్ర విషాదంక్రైమ్Swechaa16 Aug 2026, 11:16 AM

నాగార్జున సాగర్ బ్యాక్ వాటర్ టూర్‌లో తీవ్ర విషాదం

సాగర్ బ్యాక్ వాటర్‌లో విహారం కోసం వచ్చిన ఓ పర్యాటకుడు గల్లంతైనట్టు సమాచారం. నల్లగొండ జిల్లాలోని నాగార్జునసాగర్ బ్యాక్‌వాటర్‌లో టూరిజంలో తీవ్ర విషాద ఘటన చోటుచేసుకోగా ఆలస్యంగా వెలుగుచూసింది. వివరాల్లోకివెళితే.. వైజాగ్ కాలనీలోని నాగార్జున సాగర్ బ్యాక్‌ వాటర్‌లో విహారం కోసం ఓ మిత్రబృందం వెళ్లింది. ఈ క్రమంలోనే అందులో ఈత కొడుతూ ప్రమాదవశాత్తు కృష్ణా నదిలో ఓ యువకుడు మునిగిపోయాడు. సదరు యువకుడి ఆచూకీ కోసం దాదాపు రెండు గంటల పాటు రెస్క్యూ బృందాలు గాలింపు చర్యలు చేపట్టాయి. చివరకు యువకుడి బాడీని గుర్తించాయి. మరణించిన వ్యక్తిని దుర్గం తిరుమలేష్‌గా గుర్తించారు.

జర్మనీతో రూ.70,000 కోట్ల ఒప్పందం.. భారత నౌకాదళంలోకి 6 అత్యాధునిక జలాంతర్గాములు!InternationalSwechaa16 Aug 2026, 11:09 AM

జర్మనీతో రూ.70,000 కోట్ల ఒప్పందం.. భారత నౌకాదళంలోకి 6 అత్యాధునిక జలాంతర్గాములు!

భారత నౌకాదళాన్ని మరింత సమర్థవంతంగా, బలోపేతం చేసేందుకు కేంద్ర ప్రభుత్వం కీలక రక్షణ ఒప్పందానికి సిద్ధమవుతోంది. ప్రాజెక్ట్-75(ఐ) కింద జర్మనీ సహకారంతో ఆరు అత్యాధునిక సంప్రదాయ జలాంతర్గాములను నిర్మించనుంది. ఈ మేరకు రూ.70,000 కోట్ల భారీ ప్రతిపాదన త్వరలోనే కేంద్ర కేబినెట్ భద్రతా వ్యవహారాల కమిటీ (CCS) ముందుకు రానుంది. మేక్ ఇన్ ఇండియా చొరవలో భాగంగా ఈ జలాంతర్గాములను భారత్‌లోనే నిర్మించేలా ప్రణాళికను సిద్ధం చేసింది. ఇక ఆమోద ముద్ర వేయడానికి సన్నాహాలు వేగవంతం చేస్తున్నారు. ఈ ప్రతిష్టాత్మక ప్రాజెక్టును భారతదేశానికి చెందిన మజగావ్ డాక్ షిప్‌బిల్డర్స్ (MDL), జర్మనీకి చెందిన ప్రముఖ సంస్థ థైసెన్‌క్రుప్ మెరైన్ సిస్టమ్స్ (TKMS) సంయుక్తంగా చేపట్టనున్నాయి.

రేషన్ బియ్యం అక్రమ రవాణాపై కొరవడిన అధికారుల నిఘా!.. వైరాలో భారీ దందా..తెలంగాణSwechaa16 Aug 2026, 11:08 AM

రేషన్ బియ్యం అక్రమ రవాణాపై కొరవడిన అధికారుల నిఘా!.. వైరాలో భారీ దందా..

పేదల కడుపు నింపాల్సిన రేషన్ సన్నబియ్యం.. అక్రమ వ్యాపారుల జేబులు నింపుతోంది.. వైరా, తల్లాడ, కొణిజర్ల మండలాల్లో రేషన్ బియ్యం అక్రమ కొనుగోళ్లు, రవాణా జరుగుతున్నాయనే ఆరోపణలు కలకలం రేపుతున్నాయి. ముఖ్యంగా గన్నవరం, పెద్దమునగాల కేంద్రాలుగా బియ్యాన్ని సేకరించి, వాహనాల్లో ఇతర ప్రాంతాలకు తరలిస్తున్నారని స్థానికులు చెబుతున్నారు. పగలు, రాత్రి తేడా లేకుండా రవాణా జరుగుతున్నా అధికారులు పట్టించుకోవడం లేదనే విమర్శలు ఉన్నాయి. ఈ బియ్యం పక్కదారి పట్టకుండా.. అక్రమ దందాపై అధికారులు కఠిన చర్యలు తీసుకోవాలని స్థానికులు కోరుతున్నారు.

కాంగ్రెస్‌లో కయ్యం.. ఎమ్మెల్సీ మల్లన్నకు  బీర్ల ఐలయ్య వార్నింగ్రాజకీయాలుSwechaa16 Aug 2026, 10:53 AM

కాంగ్రెస్‌లో కయ్యం.. ఎమ్మెల్సీ మల్లన్నకు బీర్ల ఐలయ్య వార్నింగ్

కాంగ్రెస్ పార్టీలో నేతల మధ్య కయ్యాలు, వివాదాలు సర్దుమనగడం లేదు. పదవులు రాని వారంతా సొంత పార్టీ, ఏకంగా సీఎం రేవంత్, మంత్రులను కార్నర్ చేస్తూ తీవ్ర విమర్శలు చేస్తున్నారు. కొందరైతే పేర్లు మెన్షన్ చేయకుండా పరోక్షంగా విమర్శలు చేస్తూ వస్తున్నారు. ఈ క్రమంలోనే తాజాగా గ్రాడ్యుయెట్ ఎమ్మెల్సీ మల్లన్న, ప్రభుత్వ విప్ బీర్ల ఐలయ్య నడుమ వివాదం నెలకొంది. ఒకరిపై మరొకరు తీవ్ర విమర్శలు చేసుకున్నారు. ఓ కులాన్ని టార్గెట్ చేస్తూ మల్లన్న మాట్లాడటంపై ప్రభుత్వ విప్ బీర్ల ఐలయ్య తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. మల్లన్న ఒక బీసీ ద్రోహి అంటూ మండిపడ్డారు.‘బీసీ ద్రోహి మల్లన్న, నీ నడ్డి విరుగుడు ఖాయం. మొగోనివైతే నీ పార్టీ బీ ఫామ్ మీద పోటీ చేయ్. నీకు డిపాజిట్ వస్తే నేను ఆలేరులో పోటీ చేయను’ అంటూ ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్నకు ప్రభుత్వ విప్ బీర్ల ఐలయ్య సవాల్ విసిరారు.

ఎఫ్‌డీఏ సీరియస్.. ముగ్గురు స్టార్ హీరోలకు బిగ్ షాక్!..సినిమాSwechaa16 Aug 2026, 10:40 AM

ఎఫ్‌డీఏ సీరియస్.. ముగ్గురు స్టార్ హీరోలకు బిగ్ షాక్!..

హీరోలు అంటే కేవలం సినిమాల్లో కనిపించే తారలు కాదు.. సమాజాన్ని ప్రభావితం చేసే సెలబ్రిటీలు. అలాంటి హీరోలు డబ్బు కోసం ప్రజల ఆరోగ్యానికి హానికరమైన ఉత్పత్తులను పరోక్షంగా ప్రమోట్ చేస్తే.. బాధ్యత ఎవరిది? నిషేధిత పాన్ మసాలా బ్రాండ్‌ను పరోక్షంగా ప్రచారం చేశారన్న ఆరోపణలతో బాలీవుడ్ స్టార్స్ షారూఖ్ ఖాన్, అజయ్ దేవగణ్, టైగర్ ష్రాఫ్‌లకు మహారాష్ట్ర ఎఫ్‌డీఏ షోకాజ్ నోటీసులు జారీ చేసింది. నిబంధనలు ఉల్లంఘించినట్లు తేలితే రూ.10 లక్షల వరకు జరిమానా పడే అవకాశం ఉన్నట్టు తెలుస్తుంది.

politics :  చిక్కుల్లో ‘దీదీ’.. టీఎంసీ ఆఫీసులో మాజీ డిప్యూటీ స్పీకర్ ఆత్మహత్యNationalSwechaa16 Aug 2026, 10:28 AM

politics : చిక్కుల్లో ‘దీదీ’.. టీఎంసీ ఆఫీసులో మాజీ డిప్యూటీ స్పీకర్ ఆత్మహత్య

పశ్చిమబెంగాల్ మాజీ సీఎం, టీఎంసీ అధినేత్రి మమతా బెనర్జీ చిక్కుల్లో పడినట్టు తెలుస్తోంది. ఎవరైతే ఆమెకు నమ్మకస్తులుగా ఉన్నారో వారిమీద కేసులు ఫైల్ అవ్వడం, జైలు వెళ్లడం జరుగుతోంది. బెంగాల్లో బీజేపీ ప్రభుత్వం రావడంతో గత ప్రభుత్వంలో అవినీతి, అక్రమాలకు పాల్పడిన వారిపై పోలీసులు కఠినంగా వ్యవహరిస్తున్నారు. నేరచరిత్ర కలిగిన వారిపై చార్జ్‌షీట్ తెరిచి లోపల వేస్తున్నారు. అయితే, గత ప్రభుత్వంలో మాజీ మంత్రి,డిప్యూటీ స్పీకర్‌గా పనిచేసిన టీఎంసీ నేత ఆశిశ్ బెనర్జీ ఆత్మహత్య చేసుకోవడం కలకలం రేపింది.ఈ ఘటన బెంగాల్ రాష్ట్రంలోని బీర్భూమ్ జిల్లా రాంపూర్ హాట్‌లో వెలుగుచూసింది.

TG: రైతులకు బిగ్ అప్డేట్.. ఆ 7 రకాల సన్న వడ్లకే రూ.500బోనస్!తెలంగాణSwechaa16 Aug 2026, 10:16 AM

TG: రైతులకు బిగ్ అప్డేట్.. ఆ 7 రకాల సన్న వడ్లకే రూ.500బోనస్!

తెలంగాణలో సన్న బియ్యం సాగును మరింత ప్రోత్సహించేందుకు కాంగ్రెస్ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. మార్కెట్‌లో మంచి డిమాండ్ ఉన్న ఏడు విశిష్టమైన సన్న వరి రకాలను ప్రభుత్వం గుర్తించి, వాటికి మాత్రమే మద్దతు ధరతో పాటు క్వింటాకు రూ.500 బోనస్ అందించనున్నట్లు ప్రకటించింది. ఇటీవల జరిగిన మంత్రివర్గ సమావేశంలో ఈ విధివిధానాలకు ఆమోదం లభించడంతో ఈ నిర్ణయం తక్షణమే అమల్లోకి రానుంది. రైతులు తాము పండించిన పంటకు బోనస్ పొందాలంటే ఈ-క్రాప్ (e-Crop) పోర్టల్‌లో నమోదు చేసుకోవడం తప్పనిసరి.

Tirumala: భక్తులకు అలర్ట్.. శ్రీవారి ఆర్జిత సేవల ఆన్‌లైన్ కోటా షెడ్యూల్ విడుదల!ఏపీSwechaa16 Aug 2026, 09:51 AM

Tirumala: భక్తులకు అలర్ట్.. శ్రీవారి ఆర్జిత సేవల ఆన్‌లైన్ కోటా షెడ్యూల్ విడుదల!

తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) 2026 నవంబర్ నెలకు సంబంధించిన శ్రీవారి ఆర్జిత సేవా టికెట్లు, దర్శన టోకెన్లు మరియు వసతి గదుల ఆన్‌లైన్ విడుదల షెడ్యూల్‌ను అధికారికంగా ప్రకటించింది. శ్రీవారిని దర్శించుకోవాలనుకునే భక్తులు ఈ తేదీలను గమనించి, టీటీడీ అధికారిక వెబ్‌సైట్ ద్వారా ముందస్తుగా బుకింగ్స్ పూర్తి చేసుకోవాలని అధికారులు సూచించారు. ఎంతో డిమాండ్ ఉండే సుప్రభాతం, తోమాల, అర్చన, అష్టదళ పాదపద్మారాధన సేవల కోసం ఎలక్ట్రానిక్ డిప్ (లక్కీ డిప్) విధానాన్ని అమలు చేస్తున్నారు. ఇందుకోసం భక్తులు ఆగస్టు 18 ఉదయం 10 గంటల నుంచి ఆగస్టు 20 ఉదయం 10 గంటల వరకు ఆన్‌లైన్‌లో నమోదు చేసుకోవచ్చు. లక్కీ డిప్‌లో టికెట్లు పొందినవారు ఆగస్టు 22 మధ్యాహ్నంలోగా సొమ్ము చెల్లించి టికెట్లను ఖరారు చేసుకోవాల్సి ఉంటుంది.

ఇరాన్ పైలట్లు మా కస్టడీలో లేరు..  ఖతార్ రక్షణ శాఖ క్లారిటీInternationalSwechaa16 Aug 2026, 09:32 AM

ఇరాన్ పైలట్లు మా కస్టడీలో లేరు.. ఖతార్ రక్షణ శాఖ క్లారిటీ

ఈ ఏడాది మార్చిలో గల్ఫ్ జలాల్లో జరిగిన ఇరాన్ సైనిక విమాన ప్రమాద ఘటనపై ఖతార్ ప్రభుత్వం కీలక ప్రకటన విడుదల చేసింది. ఇరాన్‌కు చెందిన ముగ్గురు ఫైటర్ పైలట్లు తమ కస్టడీలోనే ఉన్నారంటూ అంతర్జాతీయ మీడియాతో పాటు సోషల్ మీడియాలో జరుగుతున్న ప్రచారాన్ని ఖతార్ రక్షణ మంత్రిత్వ శాఖ తీవ్రంగా ఖండించింది. ఈ ప్రమాద ఘటనలో కేవలం ఒకే ఒక పైలట్ మృతదేహం మాత్రమే సముద్రంలో లభించిందని, దానిని దౌత్య నిబంధనల ప్రకారం ఇరాన్ అధికారులకు అప్పగించామని స్పష్టం చేసింది. విమాన ప్రమాదం జరిగిన వెంటనే గల్ఫ్ జలాల్లో పెద్ద ఎత్తున గాలింపు చర్యలు చేపట్టినట్లు ఖతార్ ప్రకటించింది.

రైతు బీమాకు బ్రేక్.. ఇక వారికి మాత్రమే ప్రభుత్వ సాయం!తెలంగాణSwechaa16 Aug 2026, 09:16 AM

రైతు బీమాకు బ్రేక్.. ఇక వారికి మాత్రమే ప్రభుత్వ సాయం!

తెలంగాణ రైతులకు కీలక సమాచారం.. రైతు బీమా పథకం గడువు ఆగస్టు 13 అర్ధరాత్రితో ముగిసింది. దీంతో ఆగస్టు 13న లేదా అంతకంటే ముందు మరణించిన అర్హులైన రైతుల క్లెయిమ్‌లను మాత్రమే అధికారులు నమోదు చేయనున్నారు. అయితే, ఆగస్టు 13 తర్వాత జరిగిన మరణాలకు ఎలాంటి క్లెయిమ్‌లు స్వీకరించవద్దని వ్యవసాయ శాఖ స్పష్టం చేసింది. క్లెయిమ్ నమోదు చేసే ముందు రైతు మరణించిన తేదీని ధ్రువీకరణ పత్రాలు, ప్రభుత్వ రికార్డుల ద్వారా అధికారులు కచ్చితంగా పరిశీలించనున్నారు.

హైదరాబాద్-అమరావతి మధ్య కొత్త ప్రాజెక్ట్!తెలంగాణSwechaa16 Aug 2026, 09:13 AM

హైదరాబాద్-అమరావతి మధ్య కొత్త ప్రాజెక్ట్!

తెలుగు రాష్ట్రాల మధ్య రవాణా వ్యవస్థను సరికొత్త శిఖరాలకు తీసుకెళ్లేందుకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు భారీ ప్రాజెక్టులకు శ్రీకారం చుట్టాయి. హైదరాబాద్‌లోని ఫ్యూచర్ సిటీ నుంచి ఆంధ్రప్రదేశ్‌లోని అమరావతి, మచిలీపట్నం (బందరు) పోర్టుల మధ్య అనుసంధానాన్ని బలోపేతం చేస్తూ ఒకే కారిడార్‌లో హైస్పీడ్ రైల్వే లైన్, 12లేన్ల గ్రీన్‌ఫీల్డ్ ఎక్స్‌ప్రెస్‌వేలను పక్కపక్కనే నిర్మించేందుకు ప్రణాళికలు సిద్ధం చేశారు. ప్రస్తుత హైదరాబాద్-విజయవాడ జాతీయ రహదారికి ఒకవైపు ఎక్స్‌ప్రెస్‌వే, మరోవైపు రైలు మార్గం ఉండేలా ప్రాథమిక అలైన్‌మెంట్ ఖరారైంది. మొత్తం 760 కిలోమీటర్ల పొడవుతో ప్రతిపాదించిన హైదరాబాద్-అమరావతి-చెన్నై హైస్పీడ్ రైలు కారిడార్ నిర్మాణ వ్యయం సుమారు రూ.2.24 లక్షల కోట్లుగా అంచనా వేశారు.

చికెన్ ప్రియులకు గుడ్‌న్యూస్.. శ్రావణమాసంలో భారీగా తగ్గిన ధరలు!తెలంగాణSwechaa16 Aug 2026, 08:53 AM

చికెన్ ప్రియులకు గుడ్‌న్యూస్.. శ్రావణమాసంలో భారీగా తగ్గిన ధరలు!

తెలుగు రాష్ట్రాల్లో చికెన్ ధరలు భారీగా తగ్గాయి. శ్రావణమాసం ప్రారంభంతో చాలామంది నాన్‌వెజ్‌కు దూరంగా ఉండటంతో చికెన్‌కు డిమాండ్ పడిపోయింది. పది రోజుల క్రితం కిలో స్కిన్‌లెస్ చికెన్ రూ.280 నుంచి రూ.310 వరకు ఉండగా.. ప్రస్తుతం ఏపీలో రూ.220 నుంచి రూ.240, తెలంగాణలో రూ.230 నుంచి రూ.250 మధ్యకు చేరింది. అంటే కిలోపై దాదాపు రూ.70 నుంచి రూ.90 వరకు తగ్గుదల కనిపిస్తోంది. గిరాకీ లేకపోవడంతో ధరలు తగ్గించాల్సి వస్తోందని వ్యాపారులు చెబుతున్నారు. దీంతో ధరలు తగ్గడంతో చికెన్ ప్రియులు కొనుగోళ్లకు ఆసక్తి చూపుతున్నారు.

గుడిలో సాష్టాంగ నమస్కారం ఎలా చేయాలి?..SpiritualitySwechaa16 Aug 2026, 08:29 AM

గుడిలో సాష్టాంగ నమస్కారం ఎలా చేయాలి?..

భగవంతుని అనుగ్రహం కోసం, పూర్ణ శరణాగతిని ప్రకటిస్తూ చేసే అత్యున్నత పవిత్ర ప్రక్రియే సాష్టాంగ నమస్కారం. శరీరంలోని ఎనిమిది అంగాలను నేలకు తాకిస్తూ, స్వామివారిని కళ్లతో ధ్యానిస్తూ, మనస్సుతో ఆయన రూపాన్ని స్మరిస్తూ, వాక్కుతో దైవనామాన్ని జపిస్తూ ఈ నమస్కారాన్ని ఆచరిస్తారు. అహంకారాన్ని, వికారాలను భగవంతుని పాదాల చెంత సమర్పించి, మన ఉనికిని పూర్తిగా దైవానికి అర్పించడమే దీని అంతరార్థం..

నాగపంచమి రోజు పూజ ఎలా చేయాలి?..SpiritualitySwechaa16 Aug 2026, 08:18 AM

నాగపంచమి రోజు పూజ ఎలా చేయాలి?..

నాగపంచమి రోజు ఉదయాన్నే అభ్యంగన స్నానం చేసి, ఈశాన్య మూలలో అష్టదళ పద్మ ముగ్గు వేసి నాగదేవత విగ్రహాన్ని ప్రతిష్ఠించాలి. పాలు, శుద్ధజలం, తేనెతో అభిషేకం చేసి, పసుపు, కుంకుమ, గంధంతో అలంకరించాలి. తెల్లటి పుష్పాలు, గరిక సమర్పించి.. పాలు, చలిమిడి, వడపప్పు, బెల్లం, నువ్వుల పిండివంటలను నైవేద్యంగా పెట్టాలి. దీపారాధన, ధూపం అనంతరం నవనాగ స్తోత్రాన్ని జపించి కర్పూర హారతి ఇవ్వాలి. భక్తిశ్రద్ధలతో నాగదేవతను ఆరాధిస్తే ఆధ్యాత్మిక శాంతి, మానసిక ధైర్యం కలుగుతాయని పండితులు చెబుతున్నారు.

నిరూపించకపోతే కోర్టుకీడుస్తా..తెలంగాణSwechaa15 Aug 2026, 10:47 PM

నిరూపించకపోతే కోర్టుకీడుస్తా..

సీఎం రేవంత్ రెడ్డి చేసిన అఘోర పూజల ఆరోపణలపై మాజీ మంత్రి హరీశ్ రావు తీవ్రంగా స్పందించారు. తనపై చేసిన ఆరోపణలకు ఆధారాలు బయటపెట్టాలని డిమాండ్ చేశారు. లేదంటే పరువు నష్టం దావా వేసి కోర్టుకు లాగుతానని హెచ్చరించారు. ''అబద్దాన్ని పదే పదే చెప్పి ప్రజలను నమ్మించాలని రేవంత్ రెడ్డి చూస్తున్నారు. ఒకసారి అంటే మోసం చేయొచ్చు. కానీ ప్రతిసారి మీ అబద్దాలతో ప్రజలను మోసం చేయలేరు. ప్రజలు మనకంటే తెలివైన వాళ్లు.

స్వాతంత్ర్య దినోత్సవం నాడు పచ్చి అబద్ధాలు, 420 మాటలు..తెలంగాణSwechaa15 Aug 2026, 10:24 PM

స్వాతంత్ర్య దినోత్సవం నాడు పచ్చి అబద్ధాలు, 420 మాటలు..

సంగారెడ్డి సభలో ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి చేసిన వ్యాఖ్యలపై మాజీ మంత్రి, బీఆర్ఎస్ డిప్యూటీ ఫ్లోర్ లీడర్ హరీశ్‌రావు తీవ్రస్థాయిలో మండిపడ్డారు. స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా రాష్ట్ర అభివృద్ధి, సంక్షేమం, ప్రజా సమస్యలపై మాట్లాడాల్సిన ముఖ్యమంత్రి చిల్లర రాజకీయాలకు దిగుతూ పచ్చి అబద్ధాలు చెప్పారని ధ్వజమెత్తారు. శనివారం సిద్ధిపేట ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన రేవంత్‌రెడ్డి ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు చేశారు.

Prabhas-Fauzi: కొత్త పోస్టర్‌లో రక్తపాతం..ఇదో కొత్త ఛాప్టర్!సినిమాSwechaa15 Aug 2026, 08:00 PM

Prabhas-Fauzi: కొత్త పోస్టర్‌లో రక్తపాతం..ఇదో కొత్త ఛాప్టర్!

Prabhas-Fauzi: Prabhas-Fauzi: నేడు (ఆగస్టు 15) స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా ప్రభాస్ నటిస్తున్న లేటెస్ట్ సినిమా ఫౌజీ నుంచి సరికొత్త పోస్టర్‌ను వదిలింది టీమ్. ఈ పోస్టర్‌లో ప్రభాస్ మొత్తం రక్తంతో తడిసి ఉన్నాడు. దీంతో, సినిమాలో హింస, రక్తపాతం మోతాదుకి మించి ఉండబోతుందని మేకర్స్ హింట్ ఇచ్చారని అర్థమవుతోంది. మొత్తానికి, తాజా పోస్టర్ సోషల్ మీడియాలో డార్లింగ్ ఫ్యాన్స్ బాగా వైరల్ చేస్తున్నారు.

సీఎం రేవంత్ రెడ్డికి- హరీష్ రావు సవాల్!..తెలంగాణSwechaa15 Aug 2026, 07:46 PM

సీఎం రేవంత్ రెడ్డికి- హరీష్ రావు సవాల్!..

స్మార్ట్ రేషన్ కార్డుల పంపిణీ కార్యక్రమం.. తెలంగాణలో మరోసారి పొలిటికల్ వార్‌కు వేదికగా మారింది. సీఎం రేవంత్ రెడ్డి బీఆర్ఎస్‌పై చేసిన విమర్శలకు.. మాజీ మంత్రి, సిద్ధిపేట ఎమ్మెల్యే హరీష్ రావు అదే స్థాయిలో కౌంటర్ ఇచ్చారు. రేవంత్ వ్యాఖ్యలను టార్గెట్ చేస్తూ.. ఉద్యోగాలు, రేషన్ కార్డులు, ఫీజు రీయింబర్స్‌మెంట్, రైతుబంధు, రుణమాఫీ వరకు ఒక్కో అంశాన్ని ప్రస్తావిస్తూ ప్రభుత్వాన్ని నిలదీశారు. ఒకప్పుడు రాష్ట్ర ప్రజలకు 420 హామీలు ఇచ్చిన రేవంత్ రెడ్డి.. ఇప్పుడు సంగారెడ్డి సభలో 420 మాటలు మాట్లాడారని హరీష్ రావు ఎద్దేవా చేశారు. స్వాతంత్ర్య దినోత్సవం రోజున ఇలాంటి రాజకీయ విమర్శలు చేయడం తనకు ఇబ్బందిగా ఉన్నా.. సీఎం చేసిన వ్యాఖ్యలకు స్పందించక తప్పడం లేదన్నారు. దీంతో రేవంత్ చేసిన విమర్శలకు.. హరీష్ రావు ఇచ్చిన కౌంటర్ తెలంగాణ రాజకీయాల్లో హాట్ టాపిక్‌గా మారింది.

బీజేపీ బీఆర్‌ఎస్‌ నాణానికి బొమ్మ-బొరుసు.. వారి మాయలో పడొద్దు..తెలంగాణSwechaa15 Aug 2026, 07:33 PM

బీజేపీ బీఆర్‌ఎస్‌ నాణానికి బొమ్మ-బొరుసు.. వారి మాయలో పడొద్దు..

బీజేపీ-బీఆర్‌ఎస్‌ నాణానికి బొమ్మ-బొరుసు లాంటివని.. వారి మాయలో ప్రజలు పడొద్దని సీఎం రేవంత్ రెడ్డి హెచ్చరించారు. ''కేసీఆర్‌ అసెంబ్లీకి రా.. మాట్లాడుదాం” అంటూ సవాల్ విసిరారు. కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి తెలంగాణలో నంబర్‌వన్ నాయకుడు అని, ఆయనను కాపాడుకునే బాధ్యత మీది అని రేవంత్ అన్నారు. జగ్గారెడ్డి ఎక్కడి నుంచి పోటీ చేయాలో రాహుల్‌గాంధీ నిర్ణయిస్తారని స్పష్టం చేశారు. స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా శనివారం సంగారెడ్డిలో నిర్వహించిన భారీ సభలో ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ప్రతిపక్ష బీఆర్‌ఎస్‌, బీజేపీలపై తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించారు. అదే సమయంలో కాంగ్రెస్‌ ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు, రైతు సంక్షేమ కార్యక్రమాలు, ఉద్యోగాల భర్తీ, ఇందిరమ్మ ఇళ్లపై సుదీర్ఘంగా మాట్లాడారు.

కెప్టెన్ కుర్చీ అంత ఈజీ కాదు..చాలా హీటుంటుంది..సినిమాSwechaa15 Aug 2026, 07:00 PM

కెప్టెన్ కుర్చీ అంత ఈజీ కాదు..చాలా హీటుంటుంది..

Tollywood: Tollywood: కెప్టెన్ కుర్చీ అంత ఈజీ కాదు..చాలా హీటుంటుంది..అవును. దర్శకుడి పని ఎంత ఒత్తిడితో కూడుకున్నదో అది ఆ కుర్చీలో కూర్చున్న వాళ్ళకే తెలుస్తుంది. అందుకే, అందరూ హీరోలు డైరెక్షన్ చేయడానికి సాహసించరు. అందరు దర్శకులూ హీరోలా మారడానికి డేర్ చేయరు. ఇలా, చేయడం వల్ల కొన్ని లాభాలుంటే, కొన్ని నష్టాలు కూడా ఉన్నాయి.

రేషన్ కార్డు ప్లాస్టిక్ వస్తువు కాదు, పేదల ఆకలి తీర్చే ఆత్మగౌరవంతెలంగాణSwechaa15 Aug 2026, 06:45 PM

రేషన్ కార్డు ప్లాస్టిక్ వస్తువు కాదు, పేదల ఆకలి తీర్చే ఆత్మగౌరవం

రేషన్ కార్డు కేవలం ప్లాస్టిక్ వస్తువు కాదు, ఉచితంగా బియ్యం తెచ్చి పెట్టే సాధనం కాదు.. పేదల ఆకలి తీర్చే ఆత్మగౌరవం అని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. పేదలు ఎవరి ముందు చెయ్యి చాచి నిలబడాల్సిన అవసరం లేదన్నారు. ఇందిరమ్మ రాజ్యంలో ఏ పేదవాడు కూడా ఆకలితో పస్తులు ఉండకూడదనే సంకల్పంతో.. దేశంలో పేదలకు నిత్యవసర వస్తువులు పంచేందుకు రేషన్ షాపులు కనిపెట్టిందే కాంగ్రెస్ పార్టీ అని చెప్పారు. సంగారెడ్డిలో స్మార్ట్‌ రేషన్‌ కార్డుల పంపిణీ ప్రారంభోత్సవ కార్యక్రమంలో ముఖ్యమంత్రి రేవంత్ మాట్లాడారు.

Chiru-Nag-Venkey-Balayya: సీనియర్ల సేఫ్ గేమ్..ఆడినంతవరకూ బాగానే ఉంటుంది!సినిమాSwechaa15 Aug 2026, 05:33 PM

Chiru-Nag-Venkey-Balayya: సీనియర్ల సేఫ్ గేమ్..ఆడినంతవరకూ బాగానే ఉంటుంది!

Chiru-Nag-Venkey-Balayya: Chiru-Nag-Venkey-Balayya: యంగ్ హీరోలు చేస్తున్నన్ని సాహసాలు మన సీనియర్ స్టార్ హీరోలు చేయడానికి కాస్త ఆలోచిస్తున్నట్టే కనిపిస్తోంది. ఇప్పుడున్న పరిస్థితుల్లో ఒక్క సినిమా ఫ్లాపైతే, ఆ ప్రభావం తర్వాత సినిమాపై గట్టిగానే ఉంటోంది. మళ్ళీ, కథ ఎంచుకోవాలంటే ఒకవైపు అభిమానులను.. ఇంకోవైపు నిర్మాతలను దృష్టిలో పెట్టుకొని ఓకే చెప్పాలి.