స్వేచ్ఛ షార్ట్స్ — తాజా తెలుగు వార్తలు

Pawan Kalyan-Ram Charan: నవంబర్ నుంచి సెట్స్‌పైకి పవర్ స్టార్-మెగా పవర్ స్టార్!సినిమాSwechaa15 Aug 2026, 04:49 PM

Pawan Kalyan-Ram Charan: నవంబర్ నుంచి సెట్స్‌పైకి పవర్ స్టార్-మెగా పవర్ స్టార్!

Pawan Kalyan-Ram Charan: సెప్టెంబర్ లో పవన్ కళ్యాణ్ పుట్టిన రోజు సందర్భగా 'ఓజీ 2' షూటింగ్ అప్‌డేట్ ఉండబోతోంది. అయితే, ఫిల్మ్ సర్కిల్స్ నుంచి వినిపిస్తున్నదాని ప్రకారం నవంబర్ నుంచి 'ఓజీ 2' షూటింగ్ మొదలవనుందట. నవంబర్‌లో ఒక్క 'ఓజీ 2' మాత్రమే కాకుండా మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ నటించబోతున్న 'ఆర్సీ 17' కూడా ఘనంగా పూజా కార్యక్రమాలతో మొదలై, వెంటనే చిత్రీకరణ కూడా ప్రారంభించేందుకు సుకుమార్ అండ్ టీమ్ రెడీ అవుతున్నట్టుగా తెలుస్తోంది.

రాజగోపాల్ రెడ్డి మండే అగ్నిపర్వతం.. కోపం వస్తే..తెలంగాణSwechaa15 Aug 2026, 04:46 PM

రాజగోపాల్ రెడ్డి మండే అగ్నిపర్వతం.. కోపం వస్తే..

జడ్చర్ల ఎమ్మెల్యే అనిరుధ్ రెడ్డి.. కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డికి మద్దతుగా నిలిచారు. కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి చేసిన వ్యాఖ్యల్లో తప్పేమీ లేదన్నారు. రాజగోపాల్ రెడ్డి ఎవరికీ వ్యతిరేకంగా మాటాడలేదన్నారు. అవినీతి పైనే మాట్లాడారని చెప్పారు. పార్టీ బాగుండాలన్నదే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి తాపత్రయం అని అనిరుధ్ రెడ్డి వ్యాఖ్యానించారు. రాజగోపాల్ రెడ్డి ఒక అగ్నిపర్వతం లాంటి వారని, ఆయనకు కోపం వస్తే అగ్నిపర్వతంలా బరస్ట్ అవుతారని అన్నారు.

భవిష్యత్తు బాగుండాలంటే సరైన నాయకత్వాన్ని ప్రజలు ఎన్నుకోవాలి-కేటీఆర్తెలంగాణSwechaa15 Aug 2026, 04:21 PM

భవిష్యత్తు బాగుండాలంటే సరైన నాయకత్వాన్ని ప్రజలు ఎన్నుకోవాలి-కేటీఆర్

Ktr: దేశ పరిస్థితులు చూస్తుంటే బాధేస్తోందని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ వాపోయారు. పాలకులకు దేశంపై సరైన అవగాహన లేదని విమర్శించారు. మతం మత్తులో పడి దేశం వెనక్కి వెళ్తోందని ఆవేదన వ్యక్తం చేశారు. దేశంలో నాయకత్వ లోపం స్పష్టంగా కనిపిస్తోందన్నారు. ఎన్నికల్లో గెలుపోటములు సహజం అన్న కేటీఆర్.. దేశం శాశ్వతం, రాష్ట్రం శాశ్వతం అని చెప్పారు. మన పిల్లలకు భవిష్యత్తు ఉండాలన్నారు. వారికి భవిష్యత్తు ఉండాలంటే సరైన నాయకత్వాన్ని ప్రజలు ఎన్నుకోవాలని సూచించారు.

Arunachal Pradesh: భారీ వర్షాలతో అరుణాచల్ అతలాకుతలం.. గల్లంతైన ఆర్మీ సిబ్బంది!..NationalSwechaa15 Aug 2026, 04:18 PM

Arunachal Pradesh: భారీ వర్షాలతో అరుణాచల్ అతలాకుతలం.. గల్లంతైన ఆర్మీ సిబ్బంది!..

అరుణాచల్‌ప్రదేశ్‌ను భారీ వర్షాలు ముంచెత్తుతున్నాయి. ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలకు కొండచరియలు విరిగిపడటంతో పాటు ఆకస్మిక వరదలు బీభత్సం సృష్టిస్తున్నాయి. ఈ ప్రకృతి విపత్తు ఇప్పటికే నలుగురి ప్రాణాలను బలితీసుకోగా.. మరోవైపు ఐదుగురు ఆర్మీ సిబ్బంది గల్లంతవడం తీవ్ర ఆందోళనకు గురిచేస్తోంది. ఎగువ సుబన్‌సిరి జిల్లాలో భారీ వర్షాల కారణంగా కొండచరియలు విరిగిపడ్డాయి. ఈ ఘటనలో నలుగురు మృతి చెందినట్లు అధికారులు వెల్లడించారు. కొండచరియల కింద ఎవరైనా చిక్కుకుపోయారా అనే అనుమానంతో సహాయక బృందాలు రంగంలోకి దిగాయి. అయితే భారీ వర్షాలు, ప్రతికూల వాతావరణం కారణంగా సహాయక చర్యలకు తీవ్ర ఆటంకాలు ఎదురవుతున్నట్టు అధికారులు పేర్కొంటున్నారు..

తుమ్మితే ఊడిపోయే ప్రభుత్వం కాంగ్రెస్.. బండి సంజయ్ తీవ్ర విమర్శలు!తెలంగాణSwechaa15 Aug 2026, 03:01 PM

తుమ్మితే ఊడిపోయే ప్రభుత్వం కాంగ్రెస్.. బండి సంజయ్ తీవ్ర విమర్శలు!

తుమ్మితే ఊడిపోయే ప్రభుత్వం కాంగ్రెస్ అని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ విమర్శించారు. హైదరాబాద్ నాంపల్లిలోని భారతీయ జనతా పార్టీ (బీజేపీ) రాష్ట్ర కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వంపై తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. రాష్ట్రంలోని భూముల నిర్వహణపై బండి సంజయ్ పలు ప్రశ్నలు గుప్పించారు. కొత్తగా పంపిణీ చేయనున్న స్మార్ట్ రేషన్ కార్డులపై ముఖ్యమంత్రి ఫోటో వేసుకుంటూ, అసలు బియ్యం ఇస్తున్న ప్రధాని నరేంద్ర మోదీ ఫోటోను ఎందుకు పెట్టలేదని బండి సంజయ్ ప్రశ్నించారు. కేవలం ఒక తుమ్ముకే ఊడిపోయేంత బలహీనమైన పరిస్థితిలో ఈ కాంగ్రెస్ ప్రభుత్వం ఉందంటూ ఎద్దేవా చేశారు.

AI Skill Training: యువతకు మోదీ గుడ్‌న్యూస్.. కోటి మందికి ఫ్రీ..!!NationalSwechaa15 Aug 2026, 02:40 PM

AI Skill Training: యువతకు మోదీ గుడ్‌న్యూస్.. కోటి మందికి ఫ్రీ..!!

భారత 80వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల సందర్భంగా దేశ రాజధాని ఢిల్లీలోని చారిత్రాత్మక ఎర్రకోట వేదికగా ప్రధాని నరేంద్ర మోదీ దేశ యువతకు పలు కీలక ప్రకటనలు చేశారు. వికసిత్ భారత్ లక్ష్య సాధనలో యువశక్తియే అత్యంత కీలకమైన చోదక శక్తి అని అభివర్ణించిన ఆయన, రాబోయే ఏడాది కాలంలో దేశవ్యాప్తంగా ఏఐ స్కిల్ డెవలప్‌మెంట్ ప్రోగ్రామ్ ద్వారా కోటి మంది యువతకు కృత్రిమ మేధ (AI)లో ప్రత్యేక శిక్షణ అందించనున్నట్లు వెల్లడించారు. దీనివల్ల ఏఐ రంగంలో ప్రపంచానికే నాయకత్వం వహించే సామర్థ్యం భారతీయ యువతకు లభిస్తుందని ధీమా వ్యక్తం చేశారు.

గ్యాస్ వినియోగదారులకు అలర్ట్.. ఈ-కేవైసీ పూర్తి చేసేందుకు దగ్గరపడుతున్న డెడ్‌లైన్!..NationalSwechaa15 Aug 2026, 02:32 PM

గ్యాస్ వినియోగదారులకు అలర్ట్.. ఈ-కేవైసీ పూర్తి చేసేందుకు దగ్గరపడుతున్న డెడ్‌లైన్!..

గ్యాస్ వినియోగదారులకు అలర్ట్.. ఈ-కేవైసీ పూర్తి చేసేందుకు డెడ్‌లైన్ దగ్గరపడుతోంది. ఎల్‌పీజీ గ్యాస్ కనెక్షన్లలో నకిలీ, బోగస్ కనెక్షన్లను గుర్తించడంతో పాటు అక్రమాలను అరికట్టేందుకు కేంద్ర ప్రభుత్వం 2023లో ఈ-కేవైసీ ప్రక్రియను తీసుకొచ్చింది. అయితే ఇప్పటికీ చాలామంది వినియోగదారులు ఈ ప్రక్రియను పూర్తి చేయలేదు. దీంతో ఆగస్టు 16లోపు ఈ-కేవైసీ పూర్తి చేయాలని పౌరసరఫరాల శాఖ ఆదేశాలు జారీ చేసింది. అయితే ఇందుకోసం గ్యాస్ ఏజెన్సీకి వెళ్లాల్సిన అవసరం లేదు. మొబైల్‌లో యాప్ ద్వారా ఇంటి నుంచే ఈ-కేవైసీ పూర్తి చేసుకోవచ్చు. ఆధార్ అనుసంధానంతో పాటు ముఖ గుర్తింపు, వేలిముద్ర లేదా ఐరిస్ ద్వారా ప్రక్రియను పూర్తి చేసే అవకాశం ఉంది.

22A Land Issue: అందరూ 22 A బాధితులే.. రండి చర్చిద్దాం.. నిలదీద్దాం!!స్వేచ్ఛ ఛైర్మన్ డెస్క్Swechaa15 Aug 2026, 01:15 PM

22A Land Issue: అందరూ 22 A బాధితులే.. రండి చర్చిద్దాం.. నిలదీద్దాం!!

హైదరాబాద్ మహానగరంలో అర్బన్ ల్యాండ్ సీలింగ్ (ULC) చట్టం పేరిట ప్రభుత్వం ఇష్టారాజ్యంగా జారీ చేసిన 22A నిషేధిత భూముల ఉత్తర్వులపై భూ బాధితుల నుంచి తీవ్ర నిరసన వ్యక్తమవుతోంది. ఎలాంటి ముందస్తు విచక్షణ లేకుండా గుట్టలబేగంపేట రెవెన్యూ పరిధిలోని సర్వే నంబర్ల మొత్తాన్ని నిషేధిత జాబితాలో చేర్చడంపై స్థానిక ప్రజలు, కాలనీవాసులు మండిపడుతున్నారు. కాకతీయ హిల్స్, సైబర్ హిల్స్, ప్రిస్టన్ విల్లాస్ వంటి ప్రధాన కాలనీల నివాసితులకు ప్రభుత్వం నుంచి నోటీసులు అందడంతో కాకతీయ హిల్స్ పార్క్‌లో మార్నింగ్ వాక్‌కు వచ్చిన బాధితులంతా ప్రభుత్వ తీరుపై అగ్గిమీద గుగ్గిలమవుతున్నారు.

ప్రపంచ యూత్ ఆర్చరీలో అదరగొట్టిన భారత అమ్మాయిలు.. పసిడి కైవసం!క్రీడలుSwechaa15 Aug 2026, 01:13 PM

ప్రపంచ యూత్ ఆర్చరీలో అదరగొట్టిన భారత అమ్మాయిలు.. పసిడి కైవసం!

అంతర్జాతీయ క్రీడా వేదికపై భారత యువ ఆర్చర్లు సరికొత్త చరిత్ర సృష్టించారు. దక్షిణ కొరియాలోని ఇంచియాన్ నగరం వేదికగా అత్యంత వైభవంగా జరిగిన 'ప్రపంచ ఆర్చరీ కేఏఏ యూత్ ఇన్విటేషనల్ 2024' టోర్నమెంట్‌లో భారత రికర్వ్ బాలికల జట్టు అద్భుత ప్రదర్శనతో స్వర్ణ పతకాన్ని ముద్దాడింది. ఆగస్టు 10 నుంచి 14వరకు ఐదు రోజుల పాటు ఎంతో ఉత్కంఠభరితంగా సాగిన ఈ పోటీల్లో భారత క్రీడాకారిణులు ప్రారంభం నుంచే పూర్తి ఆధిపత్యం ప్రదర్శించారు. ప్రత్యర్థులకు ఏమాత్రం అవకాశం ఇవ్వకుండా తమ లక్ష్యాలను పక్కాగా ఛేదిస్తూ పసిడి విజేతలుగా నిలిచి జాతీయ పతాకాన్ని సగర్వంగా ఎగురవేశారు.

cm chandrababu: ‘స్వర్ణాంధ్ర-2047’ లక్ష్యంతో ముందుకు..సీఎంఏపీSwechaa15 Aug 2026, 01:12 PM

cm chandrababu: ‘స్వర్ణాంధ్ర-2047’ లక్ష్యంతో ముందుకు..సీఎం

ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రంలో 80వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు నవ్యాంధ్ర రాజధాని అమరావతిలో అత్యంత వైభవంగా, పండుగ వాతావరణంలో జరిగాయి. రాష్ట్ర చరిత్రలోనే తొలిసారిగా అమరావతిని ప్రధాన వేదికగా చేసుకుని ప్రభుత్వం అధికారికంగా ఈ వేడుకలను నిర్వహించింది. రాయపూడిలోని పరేడ్ గ్రౌండ్‌లో ఏర్పాటు చేసిన "స్వర్ణాంధ్ర-2047" ప్రధాన ఇతివృత్తం (Theme) ఆధారంగా వేడుకలు నిర్వహించారు. సీడ్ యాక్సెస్ రోడ్డు మీదుగా ప్రత్యేక బుల్లెట్ ఎస్కార్ట్ కాన్వాయ్‌లో వేదిక వద్దకు చేరుకున్న ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడికి డీజీపీ హరీశ్ కుమార్ గుప్తా, ఇతర ఉన్నతాధికారులు సాదర స్వాగతం పలికారు.

సీఎం విజయ్ పేరెంట్స్‌తో త్రిష.. వీడియో వైరల్‌!వైరల్ న్యూస్Swechaa15 Aug 2026, 01:09 PM

సీఎం విజయ్ పేరెంట్స్‌తో త్రిష.. వీడియో వైరల్‌!

తమిళ సినీ ప్రపంచంతో పాటు రాజకీయ వర్గాల్లోనూ నటుడు, తమిళనాడు ముఖ్యమంత్రి విజయ్, ప్రముఖ నటి త్రిష కృష్ణన్ జంట ఎప్పుడూ చర్చనీయాంశంగానే ఉంటోంది. వీరిద్దరి మధ్య ప్రేమాయణం సాగుతోందంటూ సుదీర్ఘకాలంగా వస్తున్న ఊహాగానాలకు బలాన్నిచ్చేలా చెన్నైలో మరో ఆసక్తికరమైన సంఘటన చోటుచేసుకుంది. 80వ స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకుని చెన్నైలోని చారిత్రాత్మక 'ఫోర్ట్ సెయింట్ జార్జ్' ఆవరణలో తమిళనాడు ప్రభుత్వం అధికారిక వేడుకలను నిర్వహించింది. ఈ కార్యక్రమానికి ముఖ్యమంత్రి హోదాలో హాజరైన విజయ్ జాతీయ పతాకాన్ని ఆవిష్కరించగా, ఈ వేడుకకు ప్రత్యేక అతిథిగా నటి త్రిష హాజరవడం అందరి దృష్టిని ఆకర్షించింది.

తెలంగాణలో రూ. 1,100 కోట్ల PF మిస్టరీ.. అసలు డబ్బెక్కడ?తెలంగాణSwechaa15 Aug 2026, 12:51 PM

తెలంగాణలో రూ. 1,100 కోట్ల PF మిస్టరీ.. అసలు డబ్బెక్కడ?

ప్రభుత్వం ముందున్న అతిపెద్ద సవాల్.. డబ్బు ఎక్కడికి వెళ్లింది అనేది గుర్తించడం. ఏ ఏజెన్సీ ఎంత మొత్తాన్ని తీసుకుంది? ఎంత PF జమ చేసింది? ఎంత మొత్తం బకాయిగా ఉంది? ఏ ఉద్యోగుల ఖాతాల్లో PF జమ కాలేదు? ఇంకా.. ఈ వ్యవహారాన్ని పర్యవేక్షించాల్సిన అధికారుల పాత్ర ఏంటి? అనే అంశాలపై దర్యాప్తు జరగాల్సి ఉంది.

స్వాతంత్య్ర వేడుకల్లో ఊహించని ట్విస్ట్.. పెట్రోల్‌తో మహిళ హల్‌చల్!..తెలంగాణSwechaa15 Aug 2026, 12:48 PM

స్వాతంత్య్ర వేడుకల్లో ఊహించని ట్విస్ట్.. పెట్రోల్‌తో మహిళ హల్‌చల్!..

కోదాడ మున్సిపాలిటీ కార్యాలయం ఎదుట స్వాతంత్య్ర దినోత్సవ వేడుకల సందర్భంగా ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. ఓ మహిళ తమ జీవనాధారమైన ఉద్యోగాలను కోల్పోయామని ఆవేదన వ్యక్తం చేస్తూ పెట్రోల్ తాగేందుకు ప్రయత్నించడంతో కలకలం రేగింది. తల్లి సమస్యకు న్యాయం చేయాలంటూ ఆమె కూతురు కూడా మున్సిపల్ కార్యాలయం ఎదుట నిరసనకు దిగారు. ఎమ్మెల్యే పద్మావతి రెడ్డి కోదాడ మున్సిపాలిటీలో స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలకు హాజరైన సమయంలో ఈ ఘటన చోటుచేసుకుంది. పులి రత్తమ్మ తన ఉద్యోగ సమస్యను ఎమ్మెల్యే దృష్టికి తీసుకెళ్లేందుకు వినతిపత్రం సమర్పించారు. తమకు ఉద్యోగాలు కల్పించిన తర్వాత తొలగించారని, తిరిగి విధుల్లోకి తీసుకోవాలని ఆమె కోరారు. అయితే సమస్యపై వెంటనే స్పష్టమైన పరిష్కారం లభించకపోవడంతో తీవ్ర మనస్తాపానికి గురైన రత్తమ్మ పెట్రోల్ తాగేందుకు ప్రయత్నించారు.

ప్రధాని కోటు కర్చీఫ్‌ రంగుల అమరికపై రచ్చ.. విపక్షాల ఘాటు విమర్శలు!NationalSwechaa15 Aug 2026, 12:37 PM

ప్రధాని కోటు కర్చీఫ్‌ రంగుల అమరికపై రచ్చ.. విపక్షాల ఘాటు విమర్శలు!

భారత 80వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల సందర్భంగా దేశ రాజధాని ఢిల్లీలోని ఎర్రకోటపై ప్రధాని నరేంద్ర మోదీ ధరించిన దుస్తులు, వాటి రంగుల అమరిక ప్రస్తుతం సామాజిక మాధ్యమాల్లోనూ, రాజకీయ వర్గాల్లోనూ సరికొత్త వివాదానికి దారితీసింది. వేడుకల ప్రాంగణంలో ప్రధాని మోదీ ధరించిన కోటు పాకెట్ కర్చీఫ్‌లో త్రివర్ణ రంగులు తలకిందులుగా అమర్చబడి ఉన్నాయంటూ కాంగ్రెస్ సీనియర్ నాయకుడు పవన్ ఖేరా చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపుతున్నాయి. ఎర్రకోట వేదికపై నుంచి ప్రధాని ప్రసంగిస్తున్న సమయంలో ఆయన జేబులో ఉంచిన కర్చీఫ్‌ రంగుల వరసను గమనిస్తే.. ఎడమ నుంచి కుడికి ఆకుపచ్చ (గ్రీన్), తెలుపు (వైట్), కాషాయం (ఆరెంజ్) రంగులు కనిపిస్తున్నాయి.

Mrunal Thakur: రణవీర్ సింగ్ వల్లే హీరోయిన్ అయ్యాసినిమాSwechaa15 Aug 2026, 12:25 PM

Mrunal Thakur: రణవీర్ సింగ్ వల్లే హీరోయిన్ అయ్యా

Mrunal Thakur: Mrunal Thakur: బాలీవుడ్ స్టార్ హీరో రణవీర్ సింగ్ వల్లే నేను ఈ స్థాయిలో ఉన్నానని చెప్పింది గ్లామర్ బ్యూటీ మృణాల్ ఠాకూర్. ఇటీవల ఓ పాడ్ కాస్ట్ ఇంటర్వ్యూలో ఈ ఆసక్తికరమైన విషయాన్ని బయట పెట్టింది. రణవీర్ సింగ్ తో కలిసి మృణాల్ ఒక కమర్షియల్ యాడ్ ఫిల్మ్ చేసింది. అది, బాగా పాపులర్ అయింది. ఆ తర్వాత చాలామంది మేకర్స్ మృణాల్ గురించి ఆరా తీశారు. ఇందులో, భాగంగానే రణవీర్ సింగ్ ని కూడా అడిగారు. ఆయన పాజిటివ్‌గా చెప్పడంతో హీరోయిన్‌గా మారింది మృణాల్.

ఏపీలో మున్సిపల్‌ ఎన్నికలకు బిగ్‌ బెల్‌.. ఓటర్ల లెక్కే కీలకం?ఏపీSwechaa15 Aug 2026, 12:19 PM

ఏపీలో మున్సిపల్‌ ఎన్నికలకు బిగ్‌ బెల్‌.. ఓటర్ల లెక్కే కీలకం?

మున్సిపల్‌ ఎన్నికలకు ముందు ఓటర్ల జాబితా ఎందుకంత కీలకం? ఏ వార్డులో ఎంత మంది ఓటర్లు ఉన్నారు? కొత్తగా ఎంతమంది చేరారు? ఎవరైనా ఓటర్ల జాబితా నుంచి తొలగిపోయారా? ఒక ప్రాంతం నుంచి మరో ప్రాంతానికి ఓటర్ల మార్పులు ఎంతవరకు జరిగాయి? ఇవన్నీ ఇప్పుడు రాజకీయ పార్టీలకు కీలకంగా మారబోతున్నాయి.

ఇండోనేషియాను వణికిస్తున్న ప్రకృతి.. భూకంపాలతో పాటు సునామీ!..NationalSwechaa15 Aug 2026, 12:13 PM

ఇండోనేషియాను వణికిస్తున్న ప్రకృతి.. భూకంపాలతో పాటు సునామీ!..

ఇండోనేషియాలోని ఫ్లోరెస్ తీర ప్రాంతంలో భారీ భూకంపం సంభవించింది. రిక్టర్ స్కేలుపై 7.7 తీవ్రతతో నమోదైన ఈ ప్రకంపనలు తీర ప్రాంతాలను వణికించాయి. ఫ్లోరెస్‌లోని ఎండే నగరానికి సుమారు 68 కిలోమీటర్ల దూరంలో, సముద్ర గర్భంలో 10 కిలోమీటర్ల లోతులో భూకంప కేంద్రం నమోదైనట్లు అంతర్జాతీయ భూకంప పరిశీలనా సంస్థలు వెల్లడించాయి. ప్రధాన ప్రకంపన తర్వాత నిమిషాల వ్యవధిలోనే వరుసగా ప్రకంపనలు, ఆఫ్టర్‌షాక్‌లు సంభవించినట్లు సమాచారం. భూకంపం ధాటికి ఫ్లోరెస్ తీర ప్రాంతంతో పాటు పరిసర పట్టణాల్లో భవనాలు తీవ్రంగా ఊగిపోయాయి. దీంతో భయాందోళనకు గురైన ప్రజలు ఇళ్ల నుంచి బయటకు పరుగులు తీశారు.

కులగణనపై కేంద్రం కొత్త ఫార్మాట్‌.. తెలంగాణ మోడల్‌తోనే ముందుకెళ్లాల‌ని నిర్ణ‌యం!NationalSwechaa15 Aug 2026, 11:57 AM

కులగణనపై కేంద్రం కొత్త ఫార్మాట్‌.. తెలంగాణ మోడల్‌తోనే ముందుకెళ్లాల‌ని నిర్ణ‌యం!

తెలంగాణ ఇప్పటికే కుల, సామాజిక-ఆర్థిక సర్వే నిర్వహించిన రాష్ట్రంగా ఉండటంతో.. ఇప్పుడు జాతీయ స్థాయిలో ఈ రాష్ట్ర విధానం మరోసారి చర్చకు వస్తోంది. కాంగ్రెస్‌ అయితే తెలంగాణ మోడల్‌ను కేంద్రం పరిగణనలోకి తీసుకోవాలని స్పష్టంగా చెబుతోంది.

Priyamani: ఉత్తమ నటికి మెగా 158 కలిసొచ్చేనా?సినిమాSwechaa15 Aug 2026, 11:50 AM

Priyamani: ఉత్తమ నటికి మెగా 158 కలిసొచ్చేనా?

Priyamani: ప్రియమణి తమిళ హీరో విజయ్ నటించిన జన నాయగన్ సినిమాలో కీలక పాత్ర పోషించింది. అదేమంత పేరు తెచ్చింది లేదు. అయితే, మెగా 158 మూవీలో ప్రియమణి చిరుకి జంటగా నటించనుంది. అధికారికంగా ప్రకటించలేదు గానీ, ఇది కన్‌ఫర్మ్ న్యూసే. నారప్ప, విరాటపర్వం తర్వాత మళ్ళీ తెలుగులో కనిపించలేదు. వాస్తవానికి, ప్రియమణి మన సీనియర్ హీరోలకి మంచి జోడీ. అందాల విందులోనూ వెనకాడదు. కానీ, ఎవరి కన్నూ ఈ డస్కీ బ్యూటీపై పడటం లేదు ఎందుకో.

32 నెలల మార్కు.. రికార్డుల దిశగా తెలంగాణ: సీఎం రేవంత్ బిగ్ స్టేట్‌మెంట్!తెలంగాణSwechaa15 Aug 2026, 11:29 AM

32 నెలల మార్కు.. రికార్డుల దిశగా తెలంగాణ: సీఎం రేవంత్ బిగ్ స్టేట్‌మెంట్!

తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా 80వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు అత్యంత వైభవంగా జరిగాయి. హైదరాబాద్‌లోని చారిత్రాత్మక గోల్కొండ కోటలో నిర్వహించిన అధికారిక ఉత్సవాల్లో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పాల్గొన్నారు. పోలీసుల నుంచి గౌరవ వందనం స్వీకరించిన అనంతరం ఆయన జాతీయ పతాకాన్ని ఆవిష్కరించి, శుభాకాంక్షలు తెలిపారు. మాజీ ప్రధాని జవహర్‌లాల్ నెహ్రూ ప్రాజెక్టులను ఆధునిక దేవాలయాలుగా అభివర్ణించారని గుర్తుచేసిన సీఎం, ఆయన దూరదృష్టితో నెలకొల్పిన ప్రాజెక్టుల ఫలాలను నేటికీ దేశ ప్రజలు అనుభవిస్తున్నారని కొనియాడారు.

స్వాతంత్ర్య వేడుకలకు రాహుల్, ఖర్గే దూరం.. కారణం అదేనా?NationalSwechaa15 Aug 2026, 11:18 AM

స్వాతంత్ర్య వేడుకలకు రాహుల్, ఖర్గే దూరం.. కారణం అదేనా?

రాజధాని ఢిల్లీలోని చారిత్రాత్మక ఎర్రకోట మైదానంలో అత్యంత వైభవంగా జరిగిన 80వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలకు కాంగ్రెస్ పార్టీ అగ్ర నాయకత్వం దూరంగా ఉండటం రాజకీయ వర్గాల్లో తీవ్ర చర్చనీయాంశంగా మారింది. ప్రధాని నరేంద్ర మోదీ నేతృత్వంలో నిర్వహించిన ఈ అధికారిక వేడుకలకు కాంగ్రెస్ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గేతో పాటు లోక్‌సభ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ గైర్హాజరయ్యారు. వీరు ఎర్రకోట వేడుకలకు హాజరుకాకపోవడం వరుసగా ఇది రెండో ఏడాది కావడంతో, ప్రతిపక్షాల ఈ నిర్ణయంపై కేంద్ర అధికార పక్షం, రాజకీయ విశ్లేషకులలో భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.

ఓవర్ కాన్‌ఫిడెన్స్‌తో దెబ్బైపోతున్న స్టార్ డైరెక్టర్స్సినిమాSwechaa15 Aug 2026, 11:14 AM

ఓవర్ కాన్‌ఫిడెన్స్‌తో దెబ్బైపోతున్న స్టార్ డైరెక్టర్స్

Tollywood: బాక్సాఫీస్ వద్ద ఒక సినిమా హిట్ సాధించినా, ఫ్లాప్ మూటగట్టుకున్నా చివరికి ఆ క్రెడిట్ మోయాల్సింది దర్శకుడే. సినిమా హిట్, ఫ్లాప్ గురించి ఎవరూ అంచనా వేయలేరు. పూరి జగన్నాధ్ లాంటి వాళ్ళు చెప్పినట్టుగా ఏ సినిమా ఎందుకు హిట్టౌవుతుందో ఎవరికీ తెలీదు. ఇండస్ట్రీ హిట్ లాంటి పోకిరి కూడా ఎందుకు అంత పెద్ద హిట్టైందో తెలియదన్నాడు పూరి.

హర్మూజ్‌పై అమెరికా జెండా.. ట్రంప్‌ సంచలన ప్రకటనతో ఉద్రిక్తతలు!InternationalSwechaa15 Aug 2026, 11:12 AM

హర్మూజ్‌పై అమెరికా జెండా.. ట్రంప్‌ సంచలన ప్రకటనతో ఉద్రిక్తతలు!

అగ్రరాజ్యం అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మరోసారి అంతర్జాతీయ రాజకీయాల్లో తీవ్ర అలజడి సృష్టించే ప్రకటన చేశారు. పశ్చిమాసియాలో సుదీర్ఘకాలంగా కొనసాగుతున్న ఇరాన్-అమెరికా మిలిటరీ ఘర్షణల నేపథ్యంలో, ప్రపంచంలోనే అత్యంత కీలకమైన 'హర్మూజ్ జలసంధి' (Strait of Hormuz) ని అమెరికా భూభాగంగా ప్రకటిస్తానని ఆయన వ్యాఖ్యానించారు. న్యూయార్క్‌లోని గార్డెన్ సిటీలో నిర్వహించిన ఒక కార్యక్రమంలో మాట్లాడిన ట్రంప్, ఇరాన్‌పై అమెరికా పూర్తి విజయం సాధించిన వెంటనే ఈ వ్యూహాత్మక జలమార్గాన్ని యూఎస్ భూభాగంగా మారుస్తామని సంచలన వ్యాఖ్యలు చేశారు.

చారిత్రక ఘట్టం.. ఎర్రకోటపై తొలిసారి పూర్తి 'వందేమాతరం'!NationalSwechaa15 Aug 2026, 11:01 AM

చారిత్రక ఘట్టం.. ఎర్రకోటపై తొలిసారి పూర్తి 'వందేమాతరం'!

భారత 80వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల్లో అపూర్వ, చారిత్రాత్మక ఘట్టం ఆవిష్కృతమైంది. దేశ చరిత్రలోనే మొదటిసారిగా ఎర్రకోట వేదికగా జరిగిన అధికారిక వేడుకల్లో జాతీయ గేయం 'వందేమాతరం' పూర్తి గీతాన్ని అత్యంత వైభవంగా ఆలపించారు. ప్రధాని నరేంద్ర మోదీ నేతృత్వంలో జరిగిన ఈ ఉత్సవాల్లో ఆర్మీ బ్యాండ్ బృందం వందేమాతరం గీతాన్ని స్వరపరిచగా, ఆ తర్వాత యథావిధిగా జాతీయ గీతం 'జన గణ మన'ను ఆలపించారు. జాతీయ గేయం 'వందేమాతరం' రూపుదిద్దుకుని ఈ ఏడాదికి 150 వసంతాలు పూర్తి కావడం ఈ సందర్భానికి మరింత చారిత్రక ప్రాధాన్యాన్ని సంతరించిపెట్టింది.

ఆగస్టులో భోగి లేనట్టే..రానట్టే!సినిమాSwechaa15 Aug 2026, 10:07 AM

ఆగస్టులో భోగి లేనట్టే..రానట్టే!

Sharwanand: సంపత్ నంది దర్శకత్వంలో శర్వానంద్ హీరోగా నటిస్తున్న భోగి సినిమా రిలీజ్ విషయంలో మాత్రం ఇంతవరకూ క్లారిటీ లేదు. ఈ సినిమా మొదలై కూడా చాలా నెలలవుతోంది. అనుపమ పరమేశ్వరన్, డింపుల్ హయాతి హీరోయిన్స్‌గా నటిస్తున్నారు. వాస్తవానికి, భోగి సినిమాను ఈ ఆగస్టు 28న రిలీజ్ చేస్తామని అధికారికంగా కూడా ప్రకటించారు.

శామీర్ పేట్‌లో కదం తొక్కిన కిసాన్!..స్వేచ్ఛ ఛైర్మన్ డెస్క్Swechaa15 Aug 2026, 09:30 AM

శామీర్ పేట్‌లో కదం తొక్కిన కిసాన్!..

బొమ్మరాసిపేట్‌లో వెయ్యి ఎకరాల భూముల పాస్‌బుక్‌ల బదిలీ వ్యవహారం రైతుల్లో ఆగ్రహం రేపుతోంది. 2021 హైకోర్టు తీర్పు పేరుతో పాత రికార్డులు, క్షేత్రస్థాయి పరిస్థితులు పరిశీలించకుండానే భూములు బదిలీ చేస్తారా అంటూ రైతులు ప్రశ్నిస్తున్నారు. ఈ వ్యవహారంపై ఈటల రాజేందర్, మల్లారెడ్డి, ఆర్‌ఎస్ ప్రవీణ్‌కుమార్ తీవ్ర ఆరోపణలు చేశారు. మరోవైపు, తమ సమస్యను కేసీఆర్‌కు చెప్పేందుకు ప్రయత్నించిన రైతులపై పోలీసులు కేసులు పెట్టేందుకు ప్రయత్నిస్తున్నారని రైతులు ఆరోపిస్తున్నారు. తమ భూములను కాపాడుకునే వరకు పోరాటం కొనసాగిస్తామని రైతులు స్పష్టం చేస్తున్నారు.

Rayadurgam: కళ్లన్నీ రాయదుర్గం పైనే?స్వేచ్ఛ ఛైర్మన్ డెస్క్Swechaa15 Aug 2026, 09:20 AM

Rayadurgam: కళ్లన్నీ రాయదుర్గం పైనే?

 దేశ వ్యాప్తంగా రియల్ ఎస్టెట్ మార్కెట్ దివాలా తీసినా హైదరాబాద్ రాయదుర్గంలో మాత్రం ఆసియా ఖండంలోనే అత్యధిక ధర పలికే ఇండస్ట్రియల్ ప్రాంతంగా ఉంది. నాలెడ్జ్ పార్క్ హబ్‌కు చుట్టూ మైండ్ స్పేస్‌తో పాటు మరెన్నో సాప్ట్‌వేర్ కంపెనీలు, ఓల్డ్, న్యూ హైదరాబాద్‌తో పాటు ఓఆర్ఆర్ కనెక్టివిటీ ఉన్నాయి. లేక్ , హిల్ వ్యూ ఉండటంతో ఈ భూముల పైనే అందరి కళ్లు పడ్డాయి. గౌర వెంచర్స్ వాళ్లు రూ.237 కోట్లకు ఎకరం కొనుగోలు చేశారు. అది ఎస్బీఐది అని తేలింది. వాళ్లు కోర్టును ఆశ్రయించడంతో సీఎం రేవంత్ సీరియస్‌గా తీసుకున్నారు. దీంతో రాజీకొచ్చారు. మూడు వారాలు స్టే దొరికింది.

2047 నాటికి వికసిత భారత్.. ఎర్రకోట వేదికగా ప్రధాని మోదీ సరికొత్త శపథం!NationalSwechaa15 Aug 2026, 09:13 AM

2047 నాటికి వికసిత భారత్.. ఎర్రకోట వేదికగా ప్రధాని మోదీ సరికొత్త శపథం!

దేశ 80వ స్వాతంత్య్ర దినోత్సవ శుభవేళ భారత ప్రధాని నరేంద్ర మోదీ ఎర్రకోట ప్రాకారాల నుంచి జాతిని ఉద్దేశించి ప్రసంగించారు. భారత్‌కు స్వాతంత్య్రం సిద్ధించి వంద ఏళ్లు పూర్తయ్యే 2047 నాటికి దేశాన్ని పూర్తిస్థాయి 'అభివృద్ధి చెందిన దేశంగా' (వికసిత భారత్) తీర్చిదిద్దడమే తమ ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని ఆయన ఉద్ఘాటించారు. దేశం సరికొత్త ఆత్మవిశ్వాసంతో, అపూర్వమైన వేగంతో ముందుకు సాగుతోందని పేర్కొన్నారు. మహనీయులకు, స్వాతంత్య్ర సమరయోధులకు, మహాత్మా గాంధీకి ఈ సందర్భంగా ఘన నివాళులర్పించారు.

Tollywood: దేశ భక్తి ప్రధానంగా వచ్చిన సినిమాలు..ఎప్పటికీ అద్భుతాలేసినిమాSwechaa15 Aug 2026, 08:57 AM

Tollywood: దేశ భక్తి ప్రధానంగా వచ్చిన సినిమాలు..ఎప్పటికీ అద్భుతాలే

Tollywood: మన తెలుగు సినిమా ఇండస్ట్రీలో దేశ భక్తి ప్రధానంగా వచ్చిన సినిమాలు ఎప్పటికీ ఎవర్‌గ్రీన్‌గా నిలిచిపోతాయి. కమర్షియల్ అంశాలను జోడించి హీరో పాత్రను, లేదా కథను దేశ భక్తికి మిళితం చేసిన మన దర్శకులు తీస్న సినిమాలు బాక్సాఫీస్ వద్ద అద్భుతమైన విజయాలను అందుకున్నాయి.

జలుబు-దగ్గు ఉందా.. వీటికి దూరంగా ఉండాల్సిందే!..HealthSwechaa15 Aug 2026, 08:48 AM

జలుబు-దగ్గు ఉందా.. వీటికి దూరంగా ఉండాల్సిందే!..

దగ్గు, జలుబు ఉన్నప్పుడు ఆహారం విషయంలో జాగ్రత్త అవసరం. చల్లటి నీరు, ఐస్‌క్రీమ్‌లు, చల్లని పానీయాలతో పాటు ఎక్కువ చక్కెర, సోడాలు, సమోసాలు, బజ్జీలు, జంక్‌ఫుడ్‌కు దూరంగా ఉండటం మంచిదని నిపుణులు సూచిస్తున్నారు. ఇవి గొంతు చికాకును పెంచే అవకాశం ఉంది. పాలు కఫాన్ని కొత్తగా పెంచవు కానీ గొంతులో శ్లేష్మం చిక్కబడేలా చేయొచ్చు. తీవ్ర గొంతు నొప్పి ఉంటే పుల్లటి పండ్లను తగ్గించడం మంచిది. కాఫీ, టీకి బదులుగా గోరువెచ్చని నీరు, అల్లం టీ, వేడి సూప్‌లు తీసుకుంటూ తగినంత విశ్రాంతి తీసుకుంటే త్వరగా కోలుకోవచ్చని ఆరోగ్య నిపుణులు పేర్కొంటున్నారు..