స్వేచ్ఛ షార్ట్స్ — తాజా తెలుగు వార్తలు

NBK 112: బాలయ్యతో కొరటాల శివ సినిమా లేనట్టేనా? కారణం!సినిమాSwechaa13 Aug 2026, 10:41 PM

NBK 112: బాలయ్యతో కొరటాల శివ సినిమా లేనట్టేనా? కారణం!

NBK 112: కొరటాల శివ దర్శకత్వంలో బాలయ్య తన 112వ సినిమాను చేయనున్న సంగతి తెలిసిందే. ఇంతకముందే, ఈ సినిమా ప్రారంభోత్సవం ఘనంగా జరిగింది. వాస్తవానికి, ఈ నెలలో షూటింగ్ కూడా మొదలవ్వాల్సింది. కానీ, తాజా సమాచారం మేరకు, ఇప్పుడీ సినిమా క్యాన్సిల్ అయినట్టుగా తెలుస్తోంది. దీనికి, కారణం ఈ ప్రాజెక్ట్ కంప్లీట్ అవ్వాలంటే రెమ్యునరేషన్ కాకుండానే 150 కోట్ల వరకూ బడ్జెట్ అవుతుందట. ఈ బడ్జెట్ పెట్టొద్దనే బాలయ్య ఆపేయమన్నట్టుగా టాక్ వినిపిస్తోంది.

22A Lands: మీ భూమి ఎక్కడికీ పోదు- 22ఏ భూములపై సీఎం రేవంత్ కీలక వ్యాఖ్యలుతెలంగాణSwechaa13 Aug 2026, 09:46 PM

22A Lands: మీ భూమి ఎక్కడికీ పోదు- 22ఏ భూములపై సీఎం రేవంత్ కీలక వ్యాఖ్యలు

22A Lands: 22ఏ భూముల అంశంలో ప్రజల్లో అనేక అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. తమ భూముల గురించి ప్రజలు ఆందోళన చెందుతున్నారు. ఈ క్రమంలో 22ఏ భూములపై సీఎం రేవంత్ స్పందించారు. కీలక వ్యాఖ్యలు చేశారు. ప్రజలు కొనుగోలు చేసిన భూమి ఎక్కడికీ పోదన్నారు. అందుకు నాదీ భరోసా అని చెప్పారు. 22ఏ విషయంలో మీ సొంత భూములు కోల్పోకుండా చూసే బాధ్యత మాది అని రేవంత్ తేల్చి చెప్పారు. అధికారులతో మాట్లాడి రిజిస్ట్రేషన్లకు ఆదేశాలు ఇస్తానన్నారు.

Eagle Force: ఈగల్  ఫోర్స్ మీదకు కుక్కలు..క్రైమ్Swechaa13 Aug 2026, 09:27 PM

Eagle Force: ఈగల్ ఫోర్స్ మీదకు కుక్కలు..

బాలానగర్ లో కిరణ్ ఇంట్లో సోదాల కోసం వెళ్లిన సమయంలో గంజాయి స్మగ్లర్లు ఈగల్ టీమ్ పైకి కుక్కలను వదిలారని చెప్పారు. ఆ కుక్కలు చూడటానికే భయంకరంగా ఉన్నాయన్నారు. వాటిని అడ్డం పెట్టుకుని పారిపోయేందుకు స్మగ్లర్లు ప్రయత్నం చేశారని అన్నారు. ఒక వ్యక్తి నాలుగో అంతస్తు పైనుంచి దూకి పారిపోయే ప్రయత్నం చేశాడని తెలిపారు. తమ ఇన్ స్పెక్టర్ పై కత్తితో దాడి చేశారని, ఈ దాడిలో చేతికి గాయమైందని వెల్లడించారు.

Yash-Toxic: టాక్సిక్ సెన్సార్ పూర్తి..పెద్దవాళ్ళకి మాత్రమేసినిమాSwechaa13 Aug 2026, 09:25 PM

Yash-Toxic: టాక్సిక్ సెన్సార్ పూర్తి..పెద్దవాళ్ళకి మాత్రమే

Yash-Toxic: యష్ డ్యూయల్ రోల్ లో నటించిన లేటెస్ట్ సినిమా టాక్సిక్. ఈ సినిమాకి తాజాగా సెన్సార్ కార్యక్రమాలు పూర్తయ్యాయి. గీతూ మోహన్ దాస్ దర్శకత్వం వహించారు. ఆగస్టు 26న ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ కాబోతున్న ఈ సినిమాకి సెన్సార్ బోర్డ్ 'A' సర్టిఫికెట్‌ను జారీ చేసింది. ఇందులో ఎక్కువగా మాఫీయా బ్యాగ్‌డ్రాప్, హెవీ యాక్షన్ సీన్స్, ఘాటైన రొమాన్స్ తదితర అంశాలున్నాయి. అందుకే, 'A' సర్టిఫికెట్‌తో ఈ సినిమా రాబోతోంది.

Rajinikanth: ‘జైలర్ 2’ డిజిటల్ రైట్స్‌ కి ఊహించని ఆఫర్!సినిమాSwechaa13 Aug 2026, 08:55 PM

Rajinikanth: ‘జైలర్ 2’ డిజిటల్ రైట్స్‌ కి ఊహించని ఆఫర్!

Rajinikanth: జైలర్ 2 రూపొందుతోంది. ఈ సినిమాలో రజినీకాంత్ తో పాటు రమ్యకృష్ణ, యోగిబాబు, ఎస్.జె. సూర్య, మిథూన్ చక్రవర్తి కీలక పాత్రల్లో కనిపించబోతున్నారు. ఇక, రజినీ టైగర్ ముత్తువేల్ పాండ్యన్‌గా విశ్వరూపం చూపించబోతున్నాడు. అయితే, తాజా సమాచారం మేరకు, జైలర్ 2 డిజిటల్ రైట్స్‌కు భారీ ఆఫర్ వచ్చిందట. ప్రముఖ ఓటీటీ సంస్థ అమెజాన్ ప్రైమ్ వీడియో 160 కోట్లకి జైలర్ 2 డిజిటల్ రైట్స్‌ ని దక్కించుకున్నట్టుగా కోలీవుడ్ మీడియా ద్వారా అందుతున్న సమాచారం.

Revanth Reddy: జాగ్రత్త.. చేతబడి తిరగబడితే అష్టదిగ్బంధనమే..!తెలంగాణSwechaa13 Aug 2026, 08:13 PM

Revanth Reddy: జాగ్రత్త.. చేతబడి తిరగబడితే అష్టదిగ్బంధనమే..!

రాష్ట్రంలో కరవు రావాలని కొంతమంది అఘోరా పూజలు చేశారని సీఎం రేవంత్ రెడ్డి సంచలన ఆరోపణలు చేశారు. పక్క రాష్ట్రాలకు వెళ్లి చేతబడి పూజలు చేస్తున్నారని అన్నారు. పదేళ్లు అధికారంలో ఉన్న వాళ్లు చేసే పని ఇదేనా? అని రేవంత్ ప్రశ్నించారు. చేతబడి పూజలు తిరగబడితే ఏమవుతుందో తెలుసు కదా అన్న సీఎం రేవంత్.. మీరు చేసిన చేతబడి మీపైనే తిరగబడి అష్టదిగ్బంధనం చేస్తుందని హెచ్చరించారు. పక్క రాష్ట్రాలకు వెళ్లి వాళ్లు అఘోరా పూజలు చేసినా దేవుడు మనతోనే ఉన్నాడని రేవంత్ అన్నారు. 10 మందికి మేలు చేయాలన్న ఆలోచన తనకుందన్నారు. రాష్ట్రం బాగు కోసం నా సంకల్పం, అందుకే వర్షాలు పడుతున్నాయని ముఖ్యమంత్రి రేవంత్ వ్యాఖ్యానించారు.

Jr.NTR: సర్జరీ తర్వాత డాక్టర్స్‌తో ఎన్టీఆర్ పిక్ వైరల్సినిమాSwechaa13 Aug 2026, 07:40 PM

Jr.NTR: సర్జరీ తర్వాత డాక్టర్స్‌తో ఎన్టీఆర్ పిక్ వైరల్

Jr.NTR: Jr.NTR: ఎన్టీఆర్ భుజానికి గాయం అయిన నేపథ్యంలో సర్జరీ జరిగింది. ఈ సర్జరీ విజయవంతం అయిన నేపథ్యంలో సికింద్రాబాద్‌లోని కిమ్స్ హాస్పిటల్ నుంచి ఎన్టీఆర్ గురువారం డిశ్చార్జ్ అయ్యాడు. డ్రాగన్ సినిమా షూటింగ్ సమయంలో గత నెల 27న తారక్ భుజానికి గాయం అయిన సంగతి తెలిసిందే. దీంతో, షూటింగ్ మధ్యలో నుంచే ఆయన హైదరాబాద్ వచ్చాడు.

హిందూ, ముస్లింలు మాకు రెండు కళ్లు..తెలంగాణSwechaa13 Aug 2026, 07:28 PM

హిందూ, ముస్లింలు మాకు రెండు కళ్లు..

Cm Revanth Reddy: హిందూ, ముస్లింలు కాంగ్రెస్ కు రెండు కళ్ల లాంటి వాళ్లు అని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. కాంగ్రెస్ నిజమైన సెక్యులర్ పార్టీ అన్న ముఖ్యమంత్రి రేవంత్.. మైనారిటీలకు కాంగ్రెస్ అండగా ఉంటుందని హామీ ఇచ్చారు. సోనియా గాంధీ నేతృత్వంలో మైనార్టీల సంక్షేమానికి కాంగ్రెస్ కృషి చేసిందన్నారు. మైనారిటీలకు 4శాతం రిజర్వేషన్లు కల్పించిన ఘనత కాంగ్రెస్ దేనని చెప్పారు.

ఓటర్లకు ఎన్నికల సంఘం హెచ్చరిక.. ఈ మెసేజ్‌లు వస్తే జాగ్రత్త!..క్రైమ్Swechaa13 Aug 2026, 07:21 PM

ఓటర్లకు ఎన్నికల సంఘం హెచ్చరిక.. ఈ మెసేజ్‌లు వస్తే జాగ్రత్త!..

ఓటర్లను లక్ష్యంగా చేసుకుని సైబర్ నేరగాళ్లు కొత్త మోసాలకు తెరతీస్తున్నారు. ఎన్యుమరేషన్ ఫారం లేదా ఎన్నికల గుర్తింపు కార్డు రిజెక్ట్ అయినట్లు కొందరికి నకిలీ మెసేజ్‌లు పంపుతున్నారు. ఫారంలో వివరాలు తప్పుగా ఉన్నాయని, వాట్సాప్‌లో పంపిన లింక్ ద్వారా మళ్లీ ఫారం పూర్తి చేయాలని సూచిస్తున్నారు. అనంతరం నెట్ బ్యాంకింగ్ లేదా క్రెడిట్, డెబిట్ కార్డు ద్వారా రూ.5 చెల్లించాలంటూ మోసానికి పాల్పడుతున్నారు. ఈ క్రమంలో లాగిన్ వివరాలు, పాస్‌వర్డ్, సీవీవీ, ఏటీఎం పిన్, బ్యాంక్ ఖాతా వివరాలను సేకరించే ప్రయత్నం చేస్తున్నారు. ఇలాంటి మోసపూరిత కాల్స్, మెసేజ్‌ల పట్ల ఓటర్లు అప్రమత్తంగా ఉండాలని ఎన్నికల అధికారులు సూచిస్తున్నారు. ఎన్నికల సంఘం పేరుతో వచ్చే అనుమానాస్పద లింకులను క్లిక్ చేయవద్దని, వ్యక్తిగత లేదా బ్యాంకింగ్ వివరాలను ఎట్టి పరిస్థితుల్లోనూ షేర్ చేయవద్దని హెచ్చరిస్తున్నారు.

Ram Charan: RC 17 లో రామ్ చరణ్ డ్యూయల్ రోల్..సుకుమార్ ప్లాన్ మారిందా?సినిమాSwechaa13 Aug 2026, 06:50 PM

Ram Charan: RC 17 లో రామ్ చరణ్ డ్యూయల్ రోల్..సుకుమార్ ప్లాన్ మారిందా?

Ram Charan:Ram Charan:మెగా పవర్ స్టార్ రామ్ చరణ్, సుకుమార్ కాంబినేషన్‌లో ఓ భారీ చిత్రాన్ని ప్లాన్ చేస్తున్న సంగతి తెలిసిందే. అగ్ర నిర్మాణ సంస్థ మైత్రీ మూవీ మేకర్స్ ఈ సినిమాను నిర్మిస్తోంది. సుకుమార్ రైటింగ్స్ కూడా నిర్మాణంలో భాగస్వామ్యం కానుంది. అయితే, తాజా సమాచారం మేరకు, ఈ సినిమాలో రామ్ చరణ్ డ్యూయల్ రోల్ లో నటించబోతున్నట్టుగా ఓ లేటెస్ట్ న్యూస్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

Pensions: మహిళలకు శుభవార్త.. 16న కొత్త పెన్షన్ల స్కీమ్ ప్రారంభం- మంత్రి సీతక్కతెలంగాణSwechaa13 Aug 2026, 06:38 PM

Pensions: మహిళలకు శుభవార్త.. 16న కొత్త పెన్షన్ల స్కీమ్ ప్రారంభం- మంత్రి సీతక్క

Pensions: పెన్షన్లకు సంబంధించి మంత్రి సీతక్క మహిళలకు గుడ్ న్యూస్ చెప్పారు. వితంతు, ఒంటరి మహిళలకు కొత్తగా మంజూరైన పెన్షన్ల పంపిణీ కార్యక్రమాన్ని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఈ నెల 16న ప్రారంభిస్తారని మంత్రి సీతక్క తెలిపారు. 16వ తేదీన మధ్యాహ్నం 12 గంటలకు హెలికాప్టర్ లో మంత్రులతో కలిసి సీఎం రేవంత్ మేడారం చేరుకుంటారని చెప్పారు.

Sampath Nandi: టాలెంటెడ్ డైరెక్టర్ నుంచి మరో క్రేజీ ప్రాజెక్ట్ కన్‌ఫర్మ్సినిమాSwechaa13 Aug 2026, 05:53 PM

Sampath Nandi: టాలెంటెడ్ డైరెక్టర్ నుంచి మరో క్రేజీ ప్రాజెక్ట్ కన్‌ఫర్మ్

Sampath Nandi: సంపత్ నంది దర్శకత్వంలో కొత్త సినిమా ఈ నెల 14న మధ్యాహ్నం 1 గంట నుంచి హైదరాబాద్ రామానాయుడు స్టూడియోలో ప్రారంభం కానుంది. ఎస్‌డిఎల్‌పి అధికారిక నిర్మాణ సంస్థతో కలసి సంపత్ నంది ఈ సినిమాను చేయబోతున్నాడు. వీరి కాంబోలో రాబోతున్న రెండవ సినిమా కావడం విశేషం. ఇక, ఈ ప్రాజెక్ట్ ఓపెనింగ్ రోజు ఇందులో నటించే హీరోహీరోయిన్స్, ఇతర టెక్నీషియన్స్ తో పాటు షూటింగ్ అప్‌డేట్స్ కూడా తెలపబోతున్నారు.

అంబులెన్స్‌కు కొత్త రూల్స్ విధించిన ఎన్‌హెచ్‌ఏఐ!..NationalSwechaa13 Aug 2026, 05:35 PM

అంబులెన్స్‌కు కొత్త రూల్స్ విధించిన ఎన్‌హెచ్‌ఏఐ!..

భారత జాతీయ రహదారుల సంస్థ కీలక నిర్ణయం తీసుకుంది. నేషనల్ హైవే లపై జరిగే రోడ్డు ప్రమాదాల్లో బాధితులకు త్వరితగతిన అత్యవసర వైద్యం అందించేందుకు ఏర్పాటు చేసిన అంబులెన్స్‌ల విషయంలో నియమాలను కఠినతరం చేసింది. ప్రమాద వార్త తెలిసిన 10 నిమిషాల్లో ఘటనా స్థలానికి చేరుకోవాలని గడువు విధించింది. ప్రమాద స్థలం అంబులెన్స్‌ పరిధిలోని 10 కిలోమీటర్లలో ఉంటే, తాజా నిబంధనల ప్రకారం 10 నిమిషాల్లోపు అంబులెన్స్‌ అక్కడికి చేరుకోవాలి. 10 కిలోమీటర్లకు మించి దూరం ఉంటే, అందుకు అనుగుణంగా అదనపు సమయం కేటాయిస్తారు.

అంబులెన్స్‌ చేరుకున్న సమయం, ప్రయాణ వివరాలను GPS డేటా, NHAI Care Dashboard ద్వారా నిరంతరం పర్యవేక్షిస్తారు. ప్రమాదానికి సంబంధించిన కాల్‌ అందిన సమయం నుంచి గంటలోపు బాధితులను సమీప ఆసుపత్రికి తరలించాలి. ఈ విషయంలో ఆలస్యం జరిగితే రూ.10 వేల జరిమానా విధిస్తారు. అదేవిధంగా అత్యవసర కాల్‌ను అంబులెన్స్‌ సిబ్బంది తిరస్కరించినా, అంబులెన్స్‌లో తప్పనిసరిగా ఉండాల్సిన వైద్య పరికరాలు, మందులు లేదా సిబ్బంది అందుబాటులో లేకపోయినా రూ.10 వేల పెనాల్టీ విధించేలా నిబంధనలు రూపొందించారు.

Thief Asleep: వార్నీ..! చోరీకి వెళ్లిన ఇంట్లోనే గురకపెట్టి నిద్రపోయిన దొంగ.. వీడియో వైరల్వైరల్ న్యూస్Swechaa13 Aug 2026, 05:11 PM

Thief Asleep: వార్నీ..! చోరీకి వెళ్లిన ఇంట్లోనే గురకపెట్టి నిద్రపోయిన దొంగ.. వీడియో వైరల్

కొందరు దొంగలు చేసే పనులు చిత్రవిచిత్రంగా ఉంటాయి. చోరీలకు వెళ్లిన సమయంలో వారు చేసే విన్యాసాలు విస్తుపోయేలా చేస్తాయి. కొన్ని సందర్భాల్లో నవ్వులు పూయిస్తాయి. చోరీకి వెళ్లిన ఇంట్లోనే తినడం, తాగడం చేస్తుంటారు. మరికొందరు ఎంచక్కా బెడ్ రూమ్ లోకి వెళ్లి పడక మీద హాయిగా నిద్రపోవడమూ చూశాం. తాజాగా అలాంటి విచిత్రమైన ఘటన ఒకటి హైదరాబాద్ పాతబస్తీలో చోటు చేసుకుంది. దొంగతనం చేసేందుకు ఇంట్లోకి దూరిన దొంగ.. ఆ ఇంట్లోనే గురక పెట్టి మరీ నిద్రపోయాడు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

ఊహించని మలుపు తిరిగిన ఓటుకు నోటు కేసు!..తెలంగాణSwechaa13 Aug 2026, 05:06 PM

ఊహించని మలుపు తిరిగిన ఓటుకు నోటు కేసు!..

ఒకప్పుడు రెండు తెలుగు రాష్ట్రాల రాజకీయాలను కుదిపేసిన ఓటుకు నోటు కేసు.. మరోసారి తెరపైకి వచ్చింది. పదేళ్ల క్రితం తీవ్ర రాజకీయ ప్రకంపనలు సృష్టించిన ఈ కేసులో సుప్రీంకోర్టు ప్రస్తుతం కీలక నిర్ణయం తీసుకుంది.. 2015లో ఎమ్మెల్సీ ఎన్నికల సమయంలో.. ఓటు కోసం డబ్బు ఇవ్వజూపారన్న ఆరోపణలతో అప్పుడు రేవంత్ రెడ్డి అరెస్టయ్యారు. ఈ వ్యవహారంలోనాటి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పాత్రపైనా ఆరోపణలు వచ్చాయి. కాగా గతంలో ఈ కేసును విచారించిన ధర్మాసనంలోని న్యాయమూర్తులు పదవీ విరమణ చేసిన కారణంగా..న్యాయ ప్రక్రియ నిబంధనల ప్రకారం.. పాత బెంచ్‌లో విన్న వాదనలను కొత్త ధర్మాసనం నేరుగా పరిగణనలోకి తీసుకోలేదని భారత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సూర్యకాంత్ స్పష్టం చేసినట్లు తెలుస్తోంది. దీంతో కొత్త ధర్మాసనం మళ్లీ మొదటి నుంచి ఓటుకు నోటు కేసును విచారించాల్సిన పరిస్థితి ఏర్పడింది.

Allu Arjun-Raaka: హీరోయిన్స్ రోల్స్ పై బాలీవుడ్ లో టాక్ ఇదేనా?సినిమాSwechaa13 Aug 2026, 03:59 PM

Allu Arjun-Raaka: హీరోయిన్స్ రోల్స్ పై బాలీవుడ్ లో టాక్ ఇదేనా?

Allu Arjun-Raaka: ఐఅల్లు అర్జు, దీపిక పడుకొణ్ జంటగా రూపొందుతుంది రాకా. ఈ సినిమాలో జాన్వీ కపూర్, రష్మిక మందన్న, మృణాల్ ఠాకూర్ కీలక పాత్రల్లో కనిపించబోతున్నారని ముందు నుంచి వార్తలు వస్తున్నాయి. అయితే, తాజాగా జాన్వీ కపూర్ ఈ సినిమాలో ఓ శక్తివంతమైన 'గిరిజన రాణి' పాత్రలో అలరించబోతోందట. అంతేకాదు, 'రాకా' కథా ప్రపంచంలో జాన్వీ రోల్ ఎంతో ముఖ్యమైనదని, కథను మలుపు తిప్పేలా ఈ పాత్రని డిజైన్ చేసినట్టుగా సినీ వర్గాలలో టాక్ వినిపిస్తోంది.

Sukhbir Singh Badal: మాజీ డిప్యూటీ సీఎంపై పదునైన ఆయుధంతో దాడి.. ఆసుపత్రికి తరలింపుNationalSwechaa13 Aug 2026, 03:25 PM

Sukhbir Singh Badal: మాజీ డిప్యూటీ సీఎంపై పదునైన ఆయుధంతో దాడి.. ఆసుపత్రికి తరలింపు

Sukhbir Singh Badal: పంజాబ్ మాజీ డిప్యూటీ సీఎం, అకాలీదళ్ చీఫ్ సుఖ్ బీర్ సింగ్ బాదల్ పై దాడి జరిగింది. దుండగుడు పదునైన ఆయుధంతో బాదల్ పై దాడికి తెగబడ్డాడు. మహారాష్ట్రలోని నాందేడ్ లో ఈ ఘటన జరిగింది. సుఖ్ బీర్ సింగ్ బాదల్ మాతా సాహిబ్ గురుద్వార దర్శనానికి వెళ్లారు. ఆ సమయంలో గుర్తు తెలియని వ్యక్తి బాదల్ పై అటాక్ చేశాడు. ఈ దాడిలో బాదల్ చేతికి గాయాలయ్యాయి. దుండగుడిని అడ్డుకునే ప్రయత్నంలో భద్రతా సిబ్బందికి కూడా గాయాలైనట్లు తెలుస్తోంది. నిందితుడిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.

బాక్సింగ్ ఛాలెంజ్‌పై భజ్జీ కూల్ రెస్పాన్స్..శ్రీశాంత్‌తో గొడవలకు స్వస్తి?క్రీడలుSwechaa13 Aug 2026, 03:16 PM

బాక్సింగ్ ఛాలెంజ్‌పై భజ్జీ కూల్ రెస్పాన్స్..శ్రీశాంత్‌తో గొడవలకు స్వస్తి?

భారత క్రికెట్ చరిత్రలో తీవ్ర సంచలనం సృష్టించిన హర్భజన్ సింగ్, శ్రీశాంత్‌ల వివాదం మరోసారి క్రీడా వర్గాల్లో హాట్ టాపిక్‌గా మారింది. 2008 ఐపీఎల్ ప్రారంభ సీజన్‌లో చోటుచేసుకున్న ప్రముఖ 'స్లాప్‌గేట్' ఘటన నుంచి మొదలైన వీరి విభేదాలు, ఇటీవల శ్రీశాంత్ విసిరిన బాక్సింగ్ రింగ్ సవాలు వరకు మళ్లీ రచ్చకెక్కాయి. ఈ క్రమంలోనే ప్రముఖ వార్తా సంస్థ పీటీఐ (PTI) ప్రతినిధులతో మాట్లాడిన భజ్జీ, ఈ వ్యవహారంపై అత్యంత ఆసక్తికరమైన మరియు ఎవరూ ఊహించని వ్యాఖ్యలు చేశారు. తనకు ఎవరైనా భారత మాజీ క్రీడాకారుడిని గది భాగస్వామిగా (రూమ్‌మేట్) ఎంచుకునే వెసులుబాటు దక్కితే, తాను నిస్సందేహంగా శ్రీశాంత్‌నే ఎంపిక చేసుకుంటానని హర్భజన్ బహిరంగంగా వెల్లడించారు.

భూ కేటాయింపులపై బీఆర్ఎస్ డ్రామాలు.. ఢిల్లీ వేదికగా ఎంపీ చామల ఫైర్!తెలంగాణSwechaa13 Aug 2026, 02:32 PM

భూ కేటాయింపులపై బీఆర్ఎస్ డ్రామాలు.. ఢిల్లీ వేదికగా ఎంపీ చామల ఫైర్!

హైదరాబాద్ సమీపంలోని ఫ్యూచర్ సిటీలో టెస్సరాక్ట్‌ (Tesseract) సంస్థకు సేకరించిన భూముల కేటాయింపు ప్రక్రియపై ప్రతిపక్ష బీఆర్‌ఎస్ అనవసర రాజకీయం చేస్తోందని భువనగిరి కాంగ్రెస్ ఎంపీ చామల కిరణ్‌కుమార్‌రెడ్డి తీవ్రంగా మండిపడ్డారు. న్యూఢిల్లీలో గురువారం నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడినప్పటి నుంచి పారదర్శకమైన పాలన అందిస్తోందని తెలిపారు.  పెట్టుబడులను ఆకర్షించేందుకు నిబంధనలకు కట్టుబడి మాత్రమే భూ కేటాయింపులు జరుపుతోందని ఆయన స్పష్టం చేశారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వంతో పోల్చుతూ ఎంపీ చామల కిరణ్‌కుమార్‌రెడ్డి పక్కా గణాంకాలతో ఆరోపణలను తిప్పికొట్టారు.

మహిళను ఢీకొట్టిన కారు..  మా డ్రైవర్‌ను చంపుకోండి..  పైసలిచ్చేదిలేదంటున్న సినీ నిర్మాత!క్రైమ్Swechaa13 Aug 2026, 02:30 PM

మహిళను ఢీకొట్టిన కారు.. మా డ్రైవర్‌ను చంపుకోండి.. పైసలిచ్చేదిలేదంటున్న సినీ నిర్మాత!

హైదరాబాద్ మహానగరంలోని నిత్యం రద్దీగా ఉండే అబిడ్స్‌ ఏరియాలో ఘోర ప్రమాదం జరిగింది. ఓ ప్రముఖ సినీ నిర్మాత కారు రోడ్డు మీద నడుచుకుంటూ వెళ్తున్న మహిళను వెనుకనుంచి బలంగా ఢీకొట్టింది. దీంతో బాధితురాలు ఒక్కసారిగా దూరంగా ఎగిరిపడినట్టు సమాచారం. వెంటనే బాధితురాలని స్థానిక ఆస్పత్రికి తరలించి చికిత్స అందించగా.. ఈ ప్రమాదంలో సదరు మహిళ కాలు ఫ్రాక్చర్ అయినట్టు తెలుస్తోంది. అయితే, హాస్పిటల్ ట్రీట్మెంట్ కోసం డబ్బులు చెల్లించాలని సదరు నిర్మాతను కుటుంబ సభ్యులు అడుగగా.. డబ్బులు ఇవ్వనని తెగేసి చెప్పినట్టు సమాచారం. ప్రమాదం చేసింది తాను కాదని, తన డ్రైవర్ అని.. కావాలంటే అతన్నిచంపుకోండని.. పైసలు మాత్రం ఇచ్చేదిలేదని తేల్చి చెప్పినట్టు సమాచారం. సదరు నిర్మాతను బొమ్మకు మురళిగా గుర్తించారు.

CBN Emotional: గ్రాఫిక్స్ అన్నవాళ్లు ఇక్కడికి వచ్చి చూడండి.. చంద్రబాబు భావోద్వేగం!ఏపీSwechaa13 Aug 2026, 02:05 PM

CBN Emotional: గ్రాఫిక్స్ అన్నవాళ్లు ఇక్కడికి వచ్చి చూడండి.. చంద్రబాబు భావోద్వేగం!

ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి నిర్మాణంలో మరో సువర్ణాధ్యాయం ఆవిష్కృతమైంది. రాజధాని రవాణా వ్యవస్థకు ప్రధాన వెన్నెముకగా నిలిచే ఈ-3 సీడ్ యాక్సెస్ రోడ్డు రెండవ దశతో పాటు, విజయవాడ-మంగళగిరి రహదారిని అనుసంధానిస్తూ బకింగ్‌హామ్ కెనాల్‌పై రూ.82కోట్లతో అత్యంత ఆధునికంగా నిర్మించిన నూతన స్టీల్ వంతెనను సీఎం నారా చంద్రబాబు నాయుడు అధికారికంగా ప్రారంభించారు. ఉండవల్లి సమీపంలో ప్రత్యేక శిలాఫలకాన్ని ఆవిష్కరించిన అనంతరం సీఎం స్వయంగా కాలినడకన వంతెనను, నూతన రహదారి నిర్మాణాలను పరిశీలించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన  భారీ బహిరంగ సభలో చంద్రబాబునాయుడు తీవ్ర భావోద్వేగానికి లోనయ్యారు.

Ravi Teja: 'ఇరుముడి' టైటిల్ వివాదం..రిలీజ్ ముందు మార్చేస్తారా?సినిమాSwechaa13 Aug 2026, 02:05 PM

Ravi Teja: 'ఇరుముడి' టైటిల్ వివాదం..రిలీజ్ ముందు మార్చేస్తారా?

Ravi Teja: ఇరుముడి సినిమా నుంచి థియేట్రికల్ ట్రైలర్ తాజాగా విడుదలైంది. అయితే, ఇందులో ఉన్న యాక్షన్ సీన్స్, మర్డర్ మిస్టరీ సీన్స్ చూసి ఇప్పుడు టైటిల్ విషయంలో కొత్తగా అభ్యంతరాలు వ్యక్తమవుతున్నాయి. సోషల్ మీడియాలో టైటిల్ ఎందుకు ఇరుముడి పెట్టారు. త్రిముడి అని పెట్టుకోవచ్చు కదా అంటూ కామెట్స్ చేస్తున్నారు. అయ్యప్ప దీక్ష తీసుకున్నా కూడా కొన్ని సన్నివేశాలు చూసేందుకు అభ్యంతరంగా ఉన్నాయనే మాట వినిపిస్తోంది. మరి, విడుదల ముందు టైటిల్ మార్చేస్తారా అనేది తెలియాల్సి ఉంది.

US : భారతీయులకు షాకిచ్చిన ట్రంప్.. గర్భిణీల వీసాలు రద్దు!ప్రపంచంSwechaa13 Aug 2026, 02:03 PM

US : భారతీయులకు షాకిచ్చిన ట్రంప్.. గర్భిణీల వీసాలు రద్దు!

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మరోసారి భారతీయులకు షాక్ ఇచ్చారు. ఇండియా నుంచి పెద్దఎత్తున వలసలు కొనసాగుతున్నాయని మొదటి నుంచి ఆరోపిస్తున్న ట్రంప్..ఇటీవలి కాలంలో అక్రమంగా అమెరికాలో ఉంటున్న ఇండియన్స్‌ చేతులకు సంకెళ్లు వేయించి మరీ స్వదేశానికి తిప్పి పంపిన విషయం తెలిసిందే. దీనికి తోడు స్థానిక సిటిజన్స్ ఉద్యోగాలను భారతీయులు కొట్టేస్తున్నారని ఆరోపించారు. తాజాగా అమెరికాలో ఎవరైన విదేశీ మహిళలు బిడ్డలకు జన్మనిస్తే వారికి పుట్టుకతో వచ్చే సిటిజన్ షిప్ రాకుండా కీలక చర్యలు చేపట్టారు. కేవలం పిల్లలను కనేందుకే ‘బర్త్ టూరిజం’ పేరిట వస్తున్నారని గుర్తించిన ట్రంప్ సర్కార్.. జులై 9 నుంచి ఇప్పటివరకు 600 మంది గర్భిణీల వీసాలు రద్దు చేసినట్టు తెలిసింది. బర్త్ టూరిజం నిరోధక టాస్క్‌ఫోర్స్ ఆధ్వర్యంలో వీసాలను పరిశీలించి రద్దు చేసినట్టు యూఎస్ విదేశాంగశాఖ మంత్రి మార్కో రుబియో తెలిపారు. ఇందులో భారతీయ మహిళలు కూడా ఉన్నట్టు సమాచారం.

పనిచేసే వారికే పట్టం.. త్వరలోనే భారీగా ఐఏఎస్‌ల బదిలీలు?తెలంగాణSwechaa13 Aug 2026, 01:39 PM

పనిచేసే వారికే పట్టం.. త్వరలోనే భారీగా ఐఏఎస్‌ల బదిలీలు?

కాంగ్రెస్ ప్రభుత్వం మరోసారి పరిపాలనా విభాగంలో భారీ మార్పులు చేయాలని చూస్తున్నట్టు సమాచారం. ఎందుకంటే మంత్రులు, అధికారుల మధ్య సమన్వయం కొరవడటం, అధికారుల నిర్లక్ష్యం, అలసత్వం కారణంగా ప్రభుత్వానికి చెడ్డ పేరు వస్తోందని సీఎం రేవంత్ రెడ్డి భావిస్తున్నట్టు తెలిసింది. ఇదివరకే పలువురు ఐఏఎస్ అధికారులను బదిలీ చేసిన ప్రభుత్వం.. మరోసారి కీలక అధికారులకు స్థానచలనం కల్పించాలని చూస్తున్నట్టు తెలుస్తోంది. ఇటీవలి కాలంలో కొందరు సీనియర్ ఐఏఎస్ అధికారులు మంత్రుల మాటను కూడా లెక్కచేయడం లేదని తెలుస్తోంది. కీలక శాఖలకు చెందిన ఫైల్స్‌ను పెండింగులో పెట్టడం, మంత్రుల సిఫారసు ఉన్నా వాటి మీద కొర్రీలు పెట్టి తిప్పిపంపడం, లేదా అప్రూవల్ ఇవ్వడంలో జాప్యం చేయడం చేస్తున్నట్టు అధికార పార్టీ ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఎమ్మెల్సీలు, ప్రజాప్రతినిధులు వరుసగా మంత్రులకు ఫిర్యాదు చేస్తున్నట్టు తెలిసింది.

Cab Driver Tip Rules: క్యాబ్‌ బుక్‌ చేస్తున్నారా? అయితే ఇకపై ఈ పని చేయొద్దు!!టాప్ న్యూస్Swechaa13 Aug 2026, 01:36 PM

Cab Driver Tip Rules: క్యాబ్‌ బుక్‌ చేస్తున్నారా? అయితే ఇకపై ఈ పని చేయొద్దు!!

దేశంలో ఓలా, ఉబర్ వంటి ప్రముఖ క్యాబ్ అగ్రిగేటర్ సంస్థలు ప్రయాణికుల నుంచి వసూలు చేస్తున్న ముందస్తు అదనపు బాదుడుకు కేంద్ర ప్రభుత్వం కట్టడి దిశగా ముకుతాడు వేసింది. క్యాబ్ బుకింగ్ చేసుకునే సమయంలో ప్రయాణానికి ముందే ‘టిప్ ఇస్తారా?’ అని అడిగే ప్రక్రియను తక్షణమే నిలిపివేయాలని కేంద్ర రోడ్డు రవాణా, రహదారుల మంత్రిత్వ శాఖ అన్ని అగ్రిగేటర్ సంస్థలకు ఆదేశాలు జారీ చేసింది. డిజిటల్ ప్లాట్‌ఫామ్‌లలో యాప్‌లను వెంటనే సమీక్షించి, ప్రయాణికులకు కనిపించే ముందస్తు టిప్పింగ్ ఆప్షన్లు, ప్రాంప్ట్‌లను శాశ్వతంగా తొలగించాలని స్పష్టం చేసింది.

బీఆర్ఎస్‌లో విషాదం..కేసీఆర్ బావమరిది మృతి!..తెలంగాణSwechaa13 Aug 2026, 01:35 PM

బీఆర్ఎస్‌లో విషాదం..కేసీఆర్ బావమరిది మృతి!..

బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ బావమరిది, మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావుకు సమీప బంధువైన జోగినపల్లి శ్రీనివాస్ రావు అనారోగ్యంతో కన్నుమూశారు. కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన.. హైదరాబాద్ సికింద్రాబాద్‌లోని యశోద ఆస్పత్రిలో చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచారు.

శ్రీనివాస్ రావు మరణంతో బీఆర్ఎస్ వర్గాల్లో విషాదం నెలకొంది. ఆయన కేటీఆర్‌కు స్వయానా మేనమామ కావడంతో.. ఈ విషాద వార్త తెలిసిన వెంటనే కేటీఆర్ తన కార్యక్రమాలను రద్దు చేసుకున్నారు. అలాగే మాజీ మంత్రి హరీశ్ రావు కూడా తన కార్యక్రమాలను వాయిదా వేసుకుని యశోద ఆస్పత్రికి బయలుదేరారు.

ఈసీ అబద్ధాలు ఆడుతోంది.. నా దగ్గర అన్ని ఆధారాలున్నాయి : ప్రకాశ్ రాజ్NationalSwechaa13 Aug 2026, 01:19 PM

ఈసీ అబద్ధాలు ఆడుతోంది.. నా దగ్గర అన్ని ఆధారాలున్నాయి : ప్రకాశ్ రాజ్

సీనియర్ నటుడు ప్రకాశ్ రాజ్ మరోసారి కేంద్ర ప్రభుత్వం, ఎన్నికల సంఘం మీద తీవ్ర విమర్శలు చేశారు. తన ఓటు హక్కు తొలగించినందుకు ఆయన ఈసీ, కేంద్రంలోని మోడీ సర్కారును తప్పుబట్టిన విషయం తెలిసిందే. తన ఓటును తొలగించినంత మాత్రాన ఏమీ కాదని, త్వరలోనే మిమ్మల్ని గద్దెదింపుతామని ప్రధాని మోడీని ఉద్దేశించి కామెంట్స్ చేశారు. తాజాగా మరోసారి సోషల్ మీడియా వేదికగా ఓ వీడియోను పోస్టు చేశారు. అయితే, ప్రకాశ్ రాజ్ ఓటు తొలగించలేదని మరల ఈసీ క్లారిటీ ఇచ్చింది. దీనిపై మండిపడిన ఆయన తాజాగా కీలక వ్యాఖ్యలు చేశారు.‘ఈసీ అధికారులు పచ్చి అబద్ధాలు చెప్తున్నారు. తన ఓటు తొలగించలేదని ఈసీ అధికారులు చేసిన ప్రకటనపై అబద్ధం. నా ఓటు తొలగించారని వీడియో చేశాక.. నాకు ఫోన్ చేసి పొరపాటు జరిగిందని అధికారులు చెప్పారు. ఆ కాల్ రికార్డింగ్స్ కూడా ఉన్నాయి.

Harishrao Letter to CM: ‘సీఎంవా.. లేక రియలెస్టేట్ ఏజెంటువా?’ రేవంత్ రెడ్డికి హరీశ్‌రావు సంచలన లేఖ!తెలంగాణSwechaa13 Aug 2026, 01:04 PM

Harishrao Letter to CM: ‘సీఎంవా.. లేక రియలెస్టేట్ ఏజెంటువా?’ రేవంత్ రెడ్డికి హరీశ్‌రావు సంచలన లేఖ!

సీఎం రేవంత్ రెడ్డి తీరుపై మాజీ మంత్రి, బీఆర్ఎస్ డిప్యూటీ ఫ్లోర్ లీడర్ తన్నీరు హరీశ్ రావు తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. ‘రేవంత్ రెడ్డి.. నువ్వు ముఖ్యమంత్రివా.. లేక రియలెస్టేట్ ఏజెంటువా?’ అని ప్రశ్నిస్తూ ఆయన సీఎంకు ఓ బహిరంగ లేఖ రాశారు. రాష్ట్రంలో ఎక్కడ ఖాళీ ప్రభుత్వ భూములు కనిపిస్తే అక్కడ వేలం వేస్తూ అమ్మకానికి పెట్టడాన్ని హరీశ్‌రావు తీవ్రంగా ఖండించారు. నాడు భూములను జాతి సంపదగా అభివర్ణించిన రేవంత్ రెడ్డి.. అధికారంలోకి వచ్చాక మాట మార్చి అడ్డగోలుగా వేలానికి పెడుతున్నారని మండిపడ్డారు. రాయదుర్గ్ పన్మక్త గ్రామంలోని సర్వే నంబర్ 83/1లో ఉన్న 10.63ఎకరాల విలువైన హెరిటేజ్ భూమిని ఈ నెల ఆగస్టు 17, 21తేదీల్లో వేలం వేయడానికి టీజీఐఐసీ(TGIIC) సిద్ధం కావడాన్ని హరీశ్ రావు ఆక్షేపించారు.

రెస్ట్ రూంలో విద్యార్థిని చితకబాదిన తోటి స్టూడెంట్స్.. ఎందుకంటే?తెలంగాణSwechaa13 Aug 2026, 01:00 PM

రెస్ట్ రూంలో విద్యార్థిని చితకబాదిన తోటి స్టూడెంట్స్.. ఎందుకంటే?

ఉప్పల్‌లోని ఓ డిగ్రీ కాలేజీలో చదువుతున్న విద్యార్థిపై తోటి విద్యార్థులు దాడి చేసి తీవ్రంగా గాయపరిచినట్టు సమాచారం. బాత్రూంలోకి తీసుకెళ్లి మరి దాడికి పాల్పడటం తీవ్ర కలకలం రేపింది. నాగోల్‌కు చెందిన భువన్ మోహిత్.. ఉప్పల్‌లోని లిటిల్ ఫ్లవర్ డిగ్రీ కళాశాలలో బీబీఏ థర్డ్ ఇయర్ చదువుతున్నాడు.ఈ నెల 3న అదే కాలేజీకి చెందిన తోటి విద్యార్థులు ఛత్రీస్, యశ్వంత్, వినయ్ అతడిని మాట్లాడుకుందామని రెస్టు రూంకు తీసుకెళ్లినట్టు సమాచారం. అక్కడ యశ్వంత్, వినయ్‌లు భువన్ మోహిత్‌ను గట్టిగా అదిమి పట్టుకోగా.. ఛత్రీస్ అతనిపై దాడి చేసి గాయపరిచినట్టు బాధితుడు ఆరోపించారు. అంతేకాకుండా భువన్.. మొబైల్‌ను సైతం గుంజుకుని కిందకు విసిరేయడంతో ఫోన్ పగిలిపోయినట్టు తెలుస్తోంది.

ఆడబిడ్డలు కాదు అరాచక శక్తులు? ఇద్దరూ ఇద్దరే!రాజకీయాలుSwechaa13 Aug 2026, 12:49 PM

ఆడబిడ్డలు కాదు అరాచక శక్తులు? ఇద్దరూ ఇద్దరే!

ఇంటి ఆడబిడ్డలను తెలుగు గడ్డ ఎలాంటి కష్టం వచ్చినా కడుపులో పెట్టుకుని చూసుకుంటుంది. భర్తే సర్వస్వం అనుకుని బతికే సంస్కృతి ఉన్నా.. కూతురు సుఖంగా ఉందా? అని తాపత్రయపడటం మాత్రం ప్రతి తండ్రికీ సహజమే. అలాంటి తెలుగు రాష్ట్రాలను ఏలిన ఓ నేత మరణించిన తర్వాత ఆయన కుటుంబంలో వాటాల పంపకం జరిగిందనే విమర్శలు వినిపించాయి. అయితే, ఆ తర్వాత ఆ బిడ్డ తన రాజకీయ ప్రయాణంలో మొదట తెలంగాణలో, ఆపై ఆంధ్రప్రదేశ్‌లో కాంగ్రెస్ పేరుతో డబ్బులు దండుకోవడమే లక్ష్యంగా పెట్టుకున్నారనే ఆరోపణలు రాజకీయ వర్గాల్లో వినిపిస్తున్నాయి. ఇక తెలంగాణ సాధించి, ఉద్యమ నేతగా ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న నాయకుడి బిడ్డ బతికుండగానే.. డబ్బు కోసం ఎంత దూరమైనా వెళ్లేందుకు సిద్ధపడుతున్నారంటూ వస్తున్న ఆరోపణలు, విమర్శలు మరింత చర్చకు దారితీస్తున్నాయి. కుటుంబం, రాజకీయ వారసత్వం, ప్రజా ప్రయోజనాల మధ్య హద్దులు చెరిగిపోతున్నాయా? అన్న ప్రశ్నలు కూడా తలెత్తుతున్నాయి.