స్వేచ్ఛ షార్ట్స్ — తాజా తెలుగు వార్తలు

TG : ఇందిరమ్మ ఇళ్ల టెన్షన్.. రోడ్డున పడ్డ 20 వేల మంది క్యాబ్ డ్రైవర్లు?టాప్ న్యూస్Swechaa13 Aug 2026, 12:33 PM

TG : ఇందిరమ్మ ఇళ్ల టెన్షన్.. రోడ్డున పడ్డ 20 వేల మంది క్యాబ్ డ్రైవర్లు?

ఇందిరమ్మ ఇళ్లులు లబ్దిదారుల పాలిట శాపంగా మారాయని ప్రచారం జరుగుతోంది. బిల్లులు రాక చాలా మంది లబ్దిదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నట్టు సమాచారం. ముఖ్యంగా క్యాబ్ డ్రైవర్లు నరకం చూస్తున్నట్టు తెలుస్తోంది. వారిని కారు ఓనర్లుగా పరిగణిస్తూ అధికారులు బిల్లులు విడుదల చేయడం లేదని సమాచారం. దీంతో కొందరు కారు అమ్ముకుని బిల్లుల కోసం అధికారుల చుట్టూ తిరుగున్నట్టు తెలిసింది. జీవనోపాధి కోసం క్యాబ్‌లు, మినీ వ్యాన్లు నడుపుతూ, ఉండేందుకు ఇళ్లు లేక ఇందిరమ్మ ఇల్లు కోసం పలువురు క్యాబ్ డ్రైవర్లు దరఖాస్తు చేసుకోగా..దరఖాస్తు సమయంలో వారిని అర్హులుగా ప్రకటించిన అధికారులు.. ఇల్లు నిర్మించుకున్నాక బిల్లు మంజూరు చేసే సమయంలో మీకు సొంత కారు ఉంది అని వారిని అనర్హులుగా గుర్తిస్తున్నట్టు తెలిసింది.

FSSAI Plastic Ban: పాన్ మసాలాపై ప్లాస్టిక్ బ్యాన్.. మరి క్యాన్సర్ సంగతేంటి?NationalSwechaa13 Aug 2026, 12:00 PM

FSSAI Plastic Ban: పాన్ మసాలాపై ప్లాస్టిక్ బ్యాన్.. మరి క్యాన్సర్ సంగతేంటి?

దేశంలో విస్తృతంగా విక్రయించే పాన్ మసాలా ప్యాకేజింగ్ విషయంలో కేంద్ర ఫుడ్ సేఫ్టీ అండ్ స్టాండర్డ్స్ అథారిటీ ఆఫ్ ఇండియా (ఎఫ్ఎస్ఎస్ఏఐ) కీలక నిర్ణయం తీసుకుంది. ఇకపై పాన్ మసాలాలను ప్లాస్టిక్, అల్యూమినియం ఫాయిల్ లేదా మెటలైజ్డ్ కవర్లలో విక్రయించకూడదని నిషేధం విధిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. పర్యావరణ పరిరక్షణ లక్ష్యంగా వీటికి బదులుగా కేవలం కాగితం, సెల్యులోజ్, టిన్ లేదా గాజు పాత్రలలో మాత్రమే ప్యాక్ చేయాలని సూచించింది. ఈ ప్రకటనతో పాన్ మసాలాపై ఎలాంటి నిషేధం లేదని స్పష్టం చేయడంతో తీవ్ర చర్చకు దారితీసింది.

తెలంగాణలో 60 లక్షల ఓటర్లకు నోటీసులా? అసలు ఏం జరుగుతోంది..?తెలంగాణSwechaa13 Aug 2026, 11:49 AM

తెలంగాణలో 60 లక్షల ఓటర్లకు నోటీసులా? అసలు ఏం జరుగుతోంది..?

తెలంగాణలో ఇప్పుడు జరుగుతున్నది సాధారణ ఓటర్ల జాబితా సవరణ కాదు. రాష్ట్రంలోని ఓటర్ల డేటాను భారీ స్థాయిలో తిరిగి పరిశీలించే ప్రక్రియ. ఒకవైపు బోగస్, డూప్లికేట్, మరణించిన లేదా శాశ్వతంగా వలస వెళ్లిన వారి పేర్లు తొలగించడం అవసరం. మరోవైపు నిజమైన ఓటరు పేరు పొరపాటున జాబితా నుంచి తొలగిపోకుండా చూడటం అంతే ముఖ్యం.

సౌకర్యాలు నిల్.. 17న సనత్ నగర్ టిమ్స్ ప్రారంభించనున్న సీఎంతెలంగాణSwechaa13 Aug 2026, 11:32 AM

సౌకర్యాలు నిల్.. 17న సనత్ నగర్ టిమ్స్ ప్రారంభించనున్న సీఎం

రాష్ట్ర ప్రజలకు మెరుగైన ఉచిత వైద్యసేవలు అందించేందుకు గత బీఆర్ఎస్ ప్రభుత్వంలో ప్రారంభమైన సనత్ టిమ్స్ హాస్పిటల్ నిర్మాణం.. ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వం చొరవతో ఎట్టకేలకు పూర్తయ్యింది.మేజర్ వర్క్స్ పూర్తవ్వగా.. ఇంటర్నల్ పనులు కొన్ని పెండింగ్‌లో ఉన్నట్టు సమాచారం.అయితే, ఇప్పటికే పలుమార్లు వాయిదా పడిన హాస్పిటల్ ప్రారంభం.. ఈ నెల 17వ తేదీన సీఎం రేవంత్ రెడ్డి చేతుల మీదుగా ఘనంగా ప్రారంభం కానుందని తెలిసింది. ప్రస్తుతం సనత్ నగర్ టిమ్స్ ఆస్పత్రిలో ఓపీ సేవలు కొనసాగుతున్నాయి.అయితే, పూర్తి స్థాయి సౌకర్యాలు అందుబాటులోకి రాకుండానే ఆస్పత్రిని ఎందుకు ప్రారంభిస్తున్నారని వైద్యు నిపుణులు ఆవేదన వ్యక్తం చేస్తున్నట్టు సమాచారం. సీఎం రేవంత్ రెడ్డి హాస్పిటల్ ప్రారంభించిన తర్వాత కూడా కేవలం ఓపీ సేవలు మాత్రమే కొనసాగుతాయని తెలుస్తోంది.

Kapil Dev: ఐపీఎల్ ఆడితే సరిపోదు.. బీసీసీఐకి కపిల్ దేవ్ హెచ్చరిక!క్రీడలుSwechaa13 Aug 2026, 11:32 AM

Kapil Dev: ఐపీఎల్ ఆడితే సరిపోదు.. బీసీసీఐకి కపిల్ దేవ్ హెచ్చరిక!

భారత క్రికెట్ జట్టు ఎంపిక విధానం, ప్రదర్శనపై టీమిండియా మాజీ కెప్టెన్, లెజెండరీ క్రికెటర్ కపిల్ దేవ్ తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. ప్రస్తుతం భారత బ్యాటర్లు స్పిన్ బౌలింగ్‌ను ఎదుర్కొవడంలో ఘోరంగా విఫలమవుతుండటంపై ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. స్వదేశంలో న్యూజిలాండ్, దక్షిణాఫ్రికా వంటి జట్లతో ఇటీవల జరిగిన టెస్టు సిరీస్‌లలో జట

నా భర్త వద్దు.. బస్ కండక్టరే కావాలంటున్న మళయాలి ఇన్ ఫ్లూయెన్సర్!వైరల్ న్యూస్Swechaa13 Aug 2026, 11:19 AM

నా భర్త వద్దు.. బస్ కండక్టరే కావాలంటున్న మళయాలి ఇన్ ఫ్లూయెన్సర్!

రెండేండ్ల కింద ప్రేమించి పెళ్లి చేసుకున్న ఓ మళయాళ సోషల్ మీడియా ఇన్ ఫ్లూ యెన్సర్ మేఘా.. తన భర్తను వదిలేసి తను స్థానికంగా ఉంటున్న ఊరిలో బస్ కండక్టర్‌తో వెళ్లిపోయింది. ముందుగా తన భార్య కనిపించడం లేదని పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేసిన భర్త అఖిల్..సీసీ ఫుటేజ్ ఆధారంగా తన భార్య బస్ కండక్టర్‌తో వెళ్లిపోయిందని సోషల్ మీడియాలో పోస్టు పెట్టాడు.మేఘా లగేజీ తీసుకుని కారులో వెళ్తున్న దృశ్యాలు అందులో రికార్డు అయ్యాయి. ప్రస్తుతం సోషల్ మీడియాలో ఈ వీడియో తెగ వైరల్ అవుతోంది. అయితే, అఖిల్ , మేఘా రెండేండ్ల కింద లవ్ మ్యారేజ్ చేసుకున్నారు. వీరిమధ్య మనస్పర్దలు వచ్చినట్టు తెలుస్తోంది.అయితే, మేఘా బస్ కండక్టర్ తో వెళ్లిపోయిన విషయాన్ని సోషల్ మీడియా వేదికగా చెడు ప్రచారం చేసిన తన భర్తకు.. మేఘా గట్టి కౌంటర్ ఇచ్చింది. ఇన్ స్టాగ్రామ్ వేదికగా ఓ పోస్టు పెట్టి వెంటనే డిలీట్ చేసినట్టు సమాచారం.

సారూ.. ఒక్క యూరియా బస్తా ఇవ్వండి.. మీ కాళ్లు మొక్కుతా!?.. ప్రజా పాలనలో రైతు ఆవేదన..తెలంగాణSwechaa13 Aug 2026, 11:14 AM

సారూ.. ఒక్క యూరియా బస్తా ఇవ్వండి.. మీ కాళ్లు మొక్కుతా!?.. ప్రజా పాలనలో రైతు ఆవేదన..

మెదక్ జిల్లా రంగంపేటలో ఒక్క యూరియా బస్తా కోసం ఓ వృద్ధ రైతు.. సొసైటీ సిబ్బంది కాళ్లు మొక్కుతూ వేడుకున్న వీడియో సోషల్ మీడియాలో చర్చనీయాంశంగా మారింది. సారూ.. ఒక్క యూరియా బస్తా ఇవ్వండి.. మీ కాళ్లు మొక్కుతా అంటూ రైతు వేడుకోవడం హృదయాలను కలచివేస్తుంది. ఇక పంట వేసిన రైతుకు నీరు, విత్తనం, ఎరువు.. ఇవన్నీ సమయానికి అందచేయడం ప్రభుత్వ బాధ్యత. కానీ క్షేత్రస్థాయిలో పరిస్థితి మాత్రం అందుకు భిన్నంగా కనిపిస్తోందనే ఆరోపణలున్నాయి.. ప్రస్తుతం యూరియా కోసం గంటల తరబడి క్యూలలో నిలబడే పరిస్థితులు తలెత్తాయని రైతులు వాపోతున్నారు. ఎరువు కోసం పొలాన్ని వదిలి సొసైటీల చుట్టూ తిరగాల్సి వస్తోందని ఆవేద వ్యక్తం చేస్తున్నారు.

వీసా కోసం ఫేక్ డిగ్రీ.. ఏపీ యువకుడిపై యూఎస్ ఎంబసీ కేసుఏపీSwechaa13 Aug 2026, 10:59 AM

వీసా కోసం ఫేక్ డిగ్రీ.. ఏపీ యువకుడిపై యూఎస్ ఎంబసీ కేసు

డాలర్ డ్రీమ్స్ కొందరిని మోసాలకు పాల్పడేలా చేస్తున్నది. ఫలితంగా కొందరు అమెరికాలో అడుగుపెట్టకుండానే చిక్కుల్లో పడుతుంటే మరికొందరు అక్కడకు వెళ్లాక ఇబ్బందులు పడాల్సి వస్తోంది.ఇటీవలి కాలంలో దొంగ పత్రాలు సమర్పించడం, ఎటువంటి సరైన పత్రాలు లేకుండా అమెరికాలో అడుగుపెట్టిన వారిని అక్కడి ప్రభుత్వం తిరిగి వారి వారి సొంత దేశాలకు డిపోర్టు చేస్తున్న విషయం తెలిసిందే. అక్రమ వలసదారులను అరికట్టేందుకు ట్రంప్ ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకుంటోంది. ఈ క్రమంలోనే తప్పుడు సర్టిఫికెట్స్ సమర్పించి అమెరికాకు వెళ్లేందుకు ప్రయత్నించిన ఏపీకి చెందిన ఓ యువకుడు చిక్కుల్లో పడ్డాడు. అతనికి డాక్యుమెంట్స్ సమకూర్చిన వ్యక్తిపైనా కేసు నమోదు అయ్యింది.

ఏపీలో డీఎస్సీ వివాదం.. లోకేశ్‌కు పొలిటిక‌ల్ టెన్షన్..?ఏపీSwechaa13 Aug 2026, 10:45 AM

ఏపీలో డీఎస్సీ వివాదం.. లోకేశ్‌కు పొలిటిక‌ల్ టెన్షన్..?

లోకేశ్ పేరు పదేపదే వినిపిస్తోంది. విద్యాశాఖ బాధ్యతలు ఆయన దగ్గర ఉండటంతో.. ఈ వ్యవహారంపై రాజకీయ బాధ్యత కూడా ఆయనపైనే పడుతోంది. ప్రభుత్వం నియామక ప్రక్రియను సమర్థిస్తే.. అభ్యర్థుల అనుమానాలకు స్పష్టమైన సమాధానాలు ఇవ్వాల్సి ఉంటుంది.

ఇద్దరిని కలిపిన డేటింగ్ యాప్‌.. ఎంగేజ్‌‌మెంట్ రద్దుచేసుకుందని..!క్రైమ్Swechaa13 Aug 2026, 10:44 AM

ఇద్దరిని కలిపిన డేటింగ్ యాప్‌.. ఎంగేజ్‌‌మెంట్ రద్దుచేసుకుందని..!

డేటింగ్ యాప్ పరిచయం కాస్త ఓ యువతిని తీవ్ర ఇబ్బందుల్లోకి నెట్టేసింది.పెళ్లివరకు వెళ్లిన ఈ బంధం కాస్త యువకుడి ప్రవర్తనతో రద్దు అయ్యింది. దీంతో సదరు వ్యక్తి యువతిని వేధించడం మొదలుపెట్టాడు. నిశ్చితార్థం రద్దు చేసుకుందనే కోపం ఇదంతా చేయడం ప్రారంభించాడు. మొహంపై యాసిడ్ పోస్టా.. లేదా చంపేస్తా.. అని బెదిరింపులు మొదలెట్టడంతో సదరు యువతి భయపడి ఇంట్లోనే ఉంటున్నట్టు సమాచారం. వివరాల్లోకివెళితే.. హైదరాబాద్–వనస్థలిపురంలో ఉంటున్న యువతి (33).. ఓ బీమా కంపెనీలో డిప్యూటీ మేనేజర్‌గా విధులు నిర్వహిస్తోంది.ఆమెకు డేటింగ్ యాప్ ద్వారా తిరుపతికి చెందిన అంబావారి వంశీ అనే యువకుడు పరిచయం అయ్యాడు. కొంతకాలం ఇద్దరూ మాట్లాడుకున్నారు. ఆ తర్వాత ఇరు కుటుంబాలను ఒప్పించుకుని పెళ్లివరకు ప్రేమ బంధాన్ని తీసుకెళ్లారు.

మెట్రో పాస్‌ల పై ఎల్‌ అండ్‌ టీ కీలక నిర్ణయం!..తెలంగాణSwechaa13 Aug 2026, 10:41 AM

మెట్రో పాస్‌ల పై ఎల్‌ అండ్‌ టీ కీలక నిర్ణయం!..

హైదరాబాద్ మెట్రో ప్రయాణికుల చిరకాల డిమాండ్‌ అయిన రోజువారీ, నెలవారీ పాస్‌లపై మరోసారి చర్చ మొదలైంది. పాస్‌లను ప్రవేశపెట్టేందుకు ఎల్‌అండ్‌టీ హైదరాబాద్ మెట్రోరైలు సంస్థ సానుకూలంగా లేకపోవడంతో.. ప్రభుత్వం ప్రత్యామ్నాయ మార్గాలపై దృష్టి సారిస్తోంది. మెట్రో, ఆర్టీసీకి ఉమ్మడి టికెట్ లేదా పాస్‌ తీసుకొచ్చే అంశంపైనా కసరత్తు జరుగుతోంది. ఈ నేపథ్యంలో నేటి హెచ్‌ఎంఆర్‌ఎల్ బోర్డు సమావేశంలో కీలక నిర్ణయం వెలువడే అవకాశం ఉంది. దీంతో ప్రయాణికుల సమస్యకు ఎలాంటి పరిష్కారం లభిస్తుందన్నది ఆసక్తికరంగా మారింది.

Geethanjali: నాగార్జున క్లాసిక్ హిట్ మళ్ళీ వస్తోందిసినిమాSwechaa13 Aug 2026, 10:15 AM

Geethanjali: నాగార్జున క్లాసిక్ హిట్ మళ్ళీ వస్తోంది

Geethanjali: Geethanjali: అక్కినేని నాగార్జున నటించిన సినిమాలలో ఎప్పటికీ చెప్పుకునే సినిమాలలో శివ, గీతాంజలి. ఈ సినిమాలను అభిమానులే కాదు, సినీ లవర్స్ కూడా లెక్కకు మించి చూస్తున్నారు. గీతాంజలి, శివ..ఈ రెండు చిత్రాల జోనర్స్ వేరే. కానీ, నాగార్జున కెరీర్‌లో వీటికి, ప్రత్యేక స్థానం ఉంటింది. అలాంటి చిత్రాల్లో గీతాంజలి మళ్ళీ మన ముందుకు రాబోంది. ఆగస్టు 28న నాగార్జున బర్త్ డే సందర్భంగా ఈ సినిమాను రీరిలీజ్ చేయబోతున్నారు.

Ladakh Earthquake: లడఖ్‌లో భూకంపం.. 5.5 తీవ్రతతో ప్రకంపనలు!NationalSwechaa13 Aug 2026, 10:11 AM

Ladakh Earthquake: లడఖ్‌లో భూకంపం.. 5.5 తీవ్రతతో ప్రకంపనలు!

కేంద్రపాలిత ప్రాంతమైన లడఖ్‌లోని లేహ్ ప్రాంతంలో గురువారం ఉదయం ఒక్కసారిగా భూమి కంపించింది. ఉదయం 6:05 గంటల ప్రాంతంలో సంభవించిన ఈ భూకంపం రిక్టర్ స్కేలుపై 5.5తీవ్రతతో నమోదైనట్లు జాతీయ భూకంప అధ్యయన కేంద్రం (ఎన్‌సీఎస్) అధికారికంగా ధ్రువీకరించింది. ఒక్కసారిగా భూమి కంపించడంతో తీవ్ర భయాందోళనకు గురైన స్థానిక ప్రజలు, ఇళ్ల నుంచి వీధుల్లోకి పరుగులు తీశారు. ఈ భూకంపం భూమి అంతర్భాగంలో కేవలం 10 కిలోమీటర్ల తక్కువ లోతులోనే కేంద్రీకృతమై చోటుచేసుకున్నట్లు శాస్త్రవేత్తలు గుర్తించారు.

పార్లమెంట్ చివరి రోజూ రచ్చేనా? ప్రభుత్వం–విపక్షం మధ్య అసలు ఫైట్ ఏంటి?NationalSwechaa13 Aug 2026, 09:57 AM

పార్లమెంట్ చివరి రోజూ రచ్చేనా? ప్రభుత్వం–విపక్షం మధ్య అసలు ఫైట్ ఏంటి?

కేంద్ర ప్రభుత్వం కూడా విద్యార్థుల అంశంపై చర్చకు సిద్ధంగా ఉన్నామని చెబుతోంది. అయితే చర్చ ఎప్పుడు, ఏ విధంగా జరగాలి? ఏ అంశాలపై ప్రభుత్వం సమాధానం చెప్పాలి? అన్న దగ్గరే ప్రభుత్వం, విపక్షాల మధ్య తేడా కనిపిస్తోంది.

BCCI: గంభీర్ కోచింగ్‌పై బీసీసీఐ క్లారిటీ.. వైఫల్యాలు ఎదురైనా హెడ్ కోచ్‌గా కొనసాగింపు!క్రీడలుSwechaa13 Aug 2026, 09:32 AM

BCCI: గంభీర్ కోచింగ్‌పై బీసీసీఐ క్లారిటీ.. వైఫల్యాలు ఎదురైనా హెడ్ కోచ్‌గా కొనసాగింపు!

టీమిండియా హెడ్ కోచ్‌గా వ్యవహరిస్తున్న మాజీ క్రికెటర్ గౌతమ్ గంభీర్ పదవికి ప్రస్తుతానికైతే ఎలాంటి ముప్పు లేదని, ఆయన తన పదవిలో సురక్షితంగానే కొనసాగుతారని భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) వర్గాల ద్వారా స్పష్టమవుతోంది. ఇటీవల ఇంగ్లాండ్, ఐర్లాండ్ పర్యటనల్లో భారత జట్టు ఆశించిన స్థాయిలో రాణించలేకపోవడం, అంతకుముందు స్వదేశంలో జరిగిన టెస్టు సిరీస్‌లలో ఘోర పరాజయాలను చవిచూడటంతో గంభీర్ కోచింగ్ శైలిపై తీవ్ర విమర్శలు వెల్లువెత్తాయి. ఆయనను వెంటనే కోచ్ బాధ్యతల నుంచి తొలగించాలంటూ పెద్ద ఎత్తున డిమాండ్లు వస్తున్నా బోర్డు మాత్రం పూర్తిగా ఆయన వెంటే నిలవాలని నిర్ణయించుకున్నట్లు తెలుస్తోంది.

US Politics: ట్రంప్ ప్రభుత్వంలో కీలక మార్పు..!InternationalSwechaa13 Aug 2026, 09:10 AM

US Politics: ట్రంప్ ప్రభుత్వంలో కీలక మార్పు..!

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ యంత్రాంగంలో ఒక కీలక పరిణామం నమోదైంది. వైట్‌హౌస్ ప్రెస్ సెక్రటరీ బాధ్యతల నుంచి కరోలిన్ లెవిట్ ఈ నెల చివర్లో వైదొలుగుతున్నట్లు ట్రంప్ సోషల్ మీడియా వేదికగా వెల్లడించారు. పదవికి దూరమైనప్పటికీ, ఆమె ట్రంప్‌కు ముఖ్యమైన సీనియర్ సలహాదారుగా సేవలు అందిస్తూ రిపబ్లికన్ పార్టీలో క్రియాశీల పాత్ర పోషిస్తారని స్పష్టం చేశారు. కేవలం 28 ఏళ్ల పిన్న వయసులోనే వైట్‌హౌస్ ప్రెస్ సెక్రటరీగా నియమితులై లెవిట్ అరుదైన రికార్డు నమోదు చేశారు. పత్రికా సమావేశాల్లో విలేకరులు అడిగే సంక్లిష్టమైన ప్రశ్నలను నేర్పుగా ఎదుర్కోవడంలో, ట్రంప్ పరిపాలనా నిర్ణయాలను పటిష్టంగా సమర్థించడంలో ఆమె తనదైన శైలితో ప్రత్యేక గుర్తింపు పొందారు.

ప్రభుత్వ బడుల్లో పాముల కలకలం!..తెలంగాణSwechaa13 Aug 2026, 08:37 AM

ప్రభుత్వ బడుల్లో పాముల కలకలం!..

ఉమ్మడి పాలమూరు జిల్లాలో పాముల సంచారం భయాందోళనకు గురిచేస్తోంది. పాఠశాలలు, గురుకులాలు, ప్రభుత్వ కార్యాలయాలు, నివాస ప్రాంతాల్లోకి విషసర్పాలు చొరబడుతున్నాయి. ఇటీవల నారాయణపేటలో పాముకాటుతో మూడో తరగతి విద్యార్థి మృతి చెందగా.. దేవరకద్ర గురుకుల విద్యార్థి విషకాటుకు గురై ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు. వర్షాలతో బొరియల్లోకి నీరు చేరడం, కప్పలు, ఇతర జీవులు పెరగడం, పాముల సంచార కాలం కావడంతో ఈ పరిస్థితి ఏర్పడుతోంది. పరిసరాల్లో నీరు నిలవకుండా, చెత్తాచెదారం, పొదలు తొలగించి.. పాఠశాలలు, ఇళ్లను సురక్షితంగా ఉంచాలని అధికారులు సూచిస్తున్నారు.

FCRA: విదేశాల నుంచి వచ్చే డబ్బుపై ఇక మరింత నిఘా? FCRA బిల్లుతో అసలు ఏం మారబోతోంది?NationalSwechaa12 Aug 2026, 11:53 PM

FCRA: విదేశాల నుంచి వచ్చే డబ్బుపై ఇక మరింత నిఘా? FCRA బిల్లుతో అసలు ఏం మారబోతోంది?

ఒక సంస్థకు విదేశాల నుంచి డబ్బు వచ్చింది. ఆ డబ్బుతో స్కూల్ నడిపించారు. మరో సంస్థ ఆసుపత్రి నిర్వహించింది. ఇంకొక సంస్థ పేదలకు సేవలు చేసింది. మరికొన్ని సంస్థలు సామాజిక కార్యక్రమాలు చేపట్టాయి. కానీ ఇకపై ఈ డబ్బు ఎక్కడి నుంచి వచ్చింది? ఎలా వచ్చింది? ఎక్కడ ఖర్చు చేశారు? ఆ సంస్థకు విదేశీ నిధులు తీసుకునే అర్హత ఉందా? అనే ప్రశ్నలపై కేంద్రం మరింత కఠినంగా దృష్టి పెట్ట‌బోతోంది. ఇందుకు కారణం.. ఫారిన్ కంట్రిబ్యూష‌న్ రెగ్యులేష‌న్ అమెండ్‌మెంట్ బిల్-2026.

FCRA సవరణ బిల్లు కొన్ని బిల్లుల్లా సాధార‌ణ బిల్లు కాదు. దేశంలోకి వచ్చే విదేశీ నిధులు, వాటి వినియోగం, ఎన్జీవోల స్వేచ్ఛ, ప్రభుత్వ నియంత్రణ, జాతీయ ప్రయోజనం.. ఈ ఐదు అంశాల మధ్య జరగబోయే పెద్ద చర్చకు ఇది నాంది.

Tata Chandrasekaran: టాటా గ్రూప్‌కి బిగ్ షాక్.. చంద్రశేఖరన్ రాజీనామా.. కారణం అతడేనా?NationalSwechaa12 Aug 2026, 10:56 PM

Tata Chandrasekaran: టాటా గ్రూప్‌కి బిగ్ షాక్.. చంద్రశేఖరన్ రాజీనామా.. కారణం అతడేనా?

Tata Chandrasekaran: టాటా సన్స్ చైర్మన్ చంద్రశేఖర్ సంచలన నిర్ణయం తీసుకున్నారు. ఆయన తన పదవికి రాజీనామా చేసేశారు. ఈ నెల 18న జనరల్ బాడీ మీటింగ్ ఉంది. దానికి ముందే చంద్రశేఖర్ తీసుకున్న రాజీనామా నిర్ణయం ఇప్పుడు సంచలనంగా మారింది. 2017లో టాటా సన్స్ చైర్మన్ గా చంద్రశేఖర్ బాధ్యతలు తీసుకున్నారు. ఆయన పదవీ కాలం 2027 ఫిబ్రవరి 20న ముగియనుంది.

కల్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ పథకాలపై హైకోర్టు స్టే.. బీఆర్ఎస్ సంచలన ఆరోపణలుతెలంగాణSwechaa12 Aug 2026, 10:33 PM

కల్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ పథకాలపై హైకోర్టు స్టే.. బీఆర్ఎస్ సంచలన ఆరోపణలు

తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న కల్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ పథకాలకు హైకోర్టు బ్రేక్ వేసింది. ఈ పథకాలపై కోర్టు స్టే విధించింది. తదుపరి విచారణ వరకు ఎలాంటి చెల్లింపులు చేయొద్దని రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించింది న్యాయస్థానం. కల్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ పథకాలపై హైకోర్టులో పిటిషన్ దాఖలైంది. చట్టసభల్లో ఎలాంటి తీర్మానం లేదా ప్రత్యేక చట్టం చేయకుండానే కేవలం ప్రభుత్వ ఉత్తర్వుల ద్వారా మాత్రమే ఈ స్కీమ్స్ అమలు చేస్తున్నారని, ఇది రాజ్యాంగబద్ధంగా చెల్లదంటూ పిటిషన్ లో పేర్కొన్నారు. దీనిపై విచారణ జరిపిన న్యాయస్థానం.. ప్రభుత్వం కౌంటర్ దాఖలు చేయకపోవడంతో స్టే విధించింది. తదుపరి విచారణను సెప్టెంబర్ 9వ తేదీకి వాయిదా వేసింది.

Nandini Mallu: వివాదంలో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క సతీమణి..తెలంగాణSwechaa12 Aug 2026, 09:31 PM

Nandini Mallu: వివాదంలో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క సతీమణి..

తెలంగాణ డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క సతీమణి నందిని వివాదంలో చిక్కుకున్నారు. ఆమెపై లంచం ఆరోపణలు వచ్చాయి. రిటైర్మెంట్ బెనిఫిట్స్ విడుదల చేయడానికి నందిని 10శాతం లంచం అడిగారని రిటైర్డ్ ప్రభుత్వ ఉద్యోగిని ఆరోపించారు. ఆ ఆరోపణల ఆధారంగా భట్టి విక్రమార్క భార్యపై విచారణ జరపాలని గవర్నర్‌కు ఫిర్యాదు చేశారు న్యాయవాది, సామాజిక కార్యకర్త కరుపోతల రేవంత్. ఉప ముఖ్యమంత్రి భట్టి భార్యపై వచ్చిన లంచం ఆరోపణలపై సమగ్రంగా, పారదర్శకంగా, కాలపరిమితితో కూడిన విచారణ జరపాలని గవర్నర్‌కు చేసిన ఫిర్యాదులో పేర్కొన్నారు. ఈ ఫిర్యాదు కాపీలను సీఎం రేవంత్ రెడ్డికి, రాష్ట్రం కాంగ్రెస్ వ్యవహారాల ఇంఛార్జ్ మీనాక్షి నటరాజన్‌లకు మెయిల్ ద్వారా పంపినట్లు న్యాయవాది తెలిపారు.

NTR: ఎన్టీఆర్‌కు శస్త్రచికిత్స విజయవంతం..హెల్త్ బులిటెన్ విడుదల..సినిమాSwechaa12 Aug 2026, 08:42 PM

NTR: ఎన్టీఆర్‌కు శస్త్రచికిత్స విజయవంతం..హెల్త్ బులిటెన్ విడుదల..

NTR: NTR: ఎన్టీఆర్‌ కి నేడు సికింద్రాబాద్ లోని కింస్ హాస్పిటల్‌లో సర్జరీ పూర్తైంది. ఆయన నటిస్తున్న లేటెస్ట్ మూవీ షూటింగ్‌లో భుజానికి గాయమైన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో డాక్టర్లు పరీక్షలు నిర్వహించి సర్జరీ అవసరమని చెప్పారు. దీనికి, సంబందించి నిన్న(ఆగస్టు 11) ప్రెస్‌నోట్ ద్వారా ఆగస్టు 12న సర్జరీ చేయించుకోనున్నట్టుగా తెలిపారు. అలాగే, ఎన్టీఆర్‌కు శస్త్రచికిత్స విజయవంతంగా పూర్తైంది. తాజాగా హెల్త్ బులిటెన్ విడుదల చేశారు. మరో, 3 నెలలపాటు తారక్ రెస్ట్ తీసుకోవాల్సి ఉందని వెల్లడించారు.

పోలీస్ శాఖలో కీలక పరిణామాలు.. డిఐజి చౌహాన్ పై  వేటు!..తెలంగాణSwechaa12 Aug 2026, 08:31 PM

పోలీస్ శాఖలో కీలక పరిణామాలు.. డిఐజి చౌహాన్ పై వేటు!..

డీజీపీ హెచ్చరికలు చేసిన 48 గంటల్లోనే పోలీస్ శాఖలో చర్యలు మొదలయ్యాయా? జోగులాంబ రేంజ్ డీఐజీ చౌహాన్‌ను డీజీపీ కార్యాలయానికి అటాచ్ చేస్తూ ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. అవినీతి ఆరోపణల నేపథ్యంలో ఈ చర్యలు తీసుకోవడం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. నలుగురు అధికారుల ప్రవర్తనలో మార్పు రావడం లేదంటూ డీజీపీ చేసిన వ్యాఖ్యల తర్వాతే ఈ పరిణామం చోటుచేసుకోవడంతో ప్రాధాన్యత సంతరించుకుంది. ఇదే సమయంలో మరో నలుగురు డీఎస్పీలపై కూడా చర్యలకు రంగం సిద్ధమవుతున్నట్లు సమాచారం.

Ysrcp: ఏపీ అసెంబ్లీ సమావేశాలు..జగన్ కీలక నిర్ణయంఏపీSwechaa12 Aug 2026, 08:22 PM

Ysrcp: ఏపీ అసెంబ్లీ సమావేశాలు..జగన్ కీలక నిర్ణయం

Ysrcp: ఏపీలో త్వరలో అసెంబ్లీ వర్షాకాల సమావేశాలు ప్రారంభం కానున్నాయి. ఈ క్రమంలో రాష్ట్ర రాజకీయం వేడెక్కింది. అసెంబ్లీ సమావేశాలకు హాజరుపై వైసీపీ కీలక నిర్ణయం తీసుకుంది. ఈ నెల 17 నుంచి ప్రారంభమయ్యే శాసనసభ సమావేశాలకు హాజరు కాకూడదని వైసీపీ నిర్ణయించింది. తాడేపల్లిలో పార్టీ చీఫ్ జగన్ అధ్యక్షతన లెజిస్లేచర్ పార్టీ సమావేశం జరిగింది. ఈ సమావేశంలో ఈ మేరకు నిర్ణయం తీసుకున్నారు.

Indiramma Housing Towers: లక్ష ఇళ్లు.. ఇందిరమ్మ ఇళ్ల టవర్స్‌కు రేపే భూమిపూజతెలంగాణSwechaa12 Aug 2026, 07:21 PM

Indiramma Housing Towers: లక్ష ఇళ్లు.. ఇందిరమ్మ ఇళ్ల టవర్స్‌కు రేపే భూమిపూజ

ఇందిరమ్మ ఇళ్ల టవర్స్ కు రేపు భూమి పూజ జరగబోతోంది. హైదరాబాద్ కేపీహెచ్ బీ కాలనీలో ఇందిరమ్మ ఇళ్ల టవర్స్ కు సీఎం రేవంత్ రెడ్డి భూమి పూజ చేయనున్నారు. హైదరాబాద్ నగర పరిధిలో మొత్తం లక్ష ఇళ్లను నిర్మించాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. పేద, మధ్య తరగతి ప్రజలకు అందుబాటు ధరల్లో ఈ ప్లాట్లను నిర్మించబోతున్నారు. క్యూర్ పరిధిలో 12వేల ప్లాట్లతో పైలట్ ప్రాజెక్ట్ చేపట్టబోతున్నారు. తొలి విడతలో 18 ప్రాంతాల్లో 7 వేల 340 ప్లాట్ల నిర్మించనున్నారు. ఇందుకోసం ఇప్పటికే రూ.807 కోట్లతో పరిపాలనా అనుమతులు మంజూరు చేసింది సర్కార్.

నీట్ పేపర్ లీక్ కేసులో సంచలన నిజాలు బయట పెట్టిన సీబీఐ!..NationalSwechaa12 Aug 2026, 07:12 PM

నీట్ పేపర్ లీక్ కేసులో సంచలన నిజాలు బయట పెట్టిన సీబీఐ!..

NEET-UG పేపర్ లీక్ కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది. సీబీఐ దాఖలు చేసిన దాదాపు 20 వేల పేజీల ఛార్జ్‌షీట్‌ను ఢిల్లీలోని రౌస్ అవెన్యూ ప్రత్యేక కోర్టు పరిగణనలోకి తీసుకుంది. ఈ కేసులో 13 మంది ప్రధాన నిందితులపై అభియోగాలు నమోదయ్యాయి. నిందితులపై ఆరోపణలను బలపరిచేందుకు 360 మంది సాక్షుల వాంగ్మూలాలు, 422 కీలక పత్రాలు, 43 డిజిటల్ ఆధారాలను సీబీఐ కోర్టు ముందు ఉంచింది. ఇక ఒక్కో ప్రశ్నాపత్రానికి రూ.10 నుంచి 15 లక్షల వరకు వసూలు చేసినట్లు ఆరోపణలు ఉన్నాయి. రేపు కోర్టులో కీలక వాదనలు జరగనుండటంతో.. ఈ కేసు విచారణపై ఉత్కంఠ నెలకొంది.

IrumuDi Trailer Review: "కూతురే అరుదైన బలహీనత"..ఇరుముడి ట్రైలర్ అదిరిందిసినిమాSwechaa12 Aug 2026, 06:56 PM

IrumuDi Trailer Review: "కూతురే అరుదైన బలహీనత"..ఇరుముడి ట్రైలర్ అదిరింది

IrumuDi Trailer Review: IrumuDi Trailer Review: మాస్ మహారాజ్ రవితేజ నటించిన లేటెస్ట్ సినిమా 'ఇరుముడి'. ఆగస్టు 21న ఈ సినిమా భారీ స్థాయిలో ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. ఈ నేపథ్యంలో ప్రమోషన్స్ మొదలు పెట్టిన ఈ సినిమా నుంచి తాజాగా థియేట్రికల్ ట్రైలర్‌ను చిత్ర బృందం విడుదల చేయగా, ఈ ట్రైలర్ అన్నీ వర్గాల ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంటోంది. ఈసారి రవితేజకి హిట్ గ్యారెంటీ అనేంత నమ్మకం కలుగుతోంది.

Danasari Seethakka: మహిళా సంఘాలకు మిల్లింగ్ బాధ్యతలు.. సీఎం రేవంత్ నిర్ణయంపై మంత్రి సీతక్క హర్షంతెలంగాణSwechaa12 Aug 2026, 06:09 PM

Danasari Seethakka: మహిళా సంఘాలకు మిల్లింగ్ బాధ్యతలు.. సీఎం రేవంత్ నిర్ణయంపై మంత్రి సీతక్క హర్షం

మహిళా సంఘాలకు రైస్ మిల్లింగ్ బాధ్యతలు అప్పగించాలని సీఎం రేవంత్ తీసుకున్న నిర్ణయంపై రాష్ట్రం పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, మహిళా శిశు సంక్షేమ శాఖల మంత్రి సీతక్క హర్షం వ్యక్తం చేశారు. మహిళా సంఘాలను ఆర్థికంగా మరింత బలోపేతం చేసేలా ఈ నిర్ణయం ఉందంటూ సీఎంకు కృతజ్ఞతలు తెలిపారామె.

ఆ మిల్లులను స్వాధీనం చేసుకోండి- సీఎం రేవంత్ కీలక ఆదేశాలుతెలంగాణSwechaa12 Aug 2026, 05:26 PM

ఆ మిల్లులను స్వాధీనం చేసుకోండి- సీఎం రేవంత్ కీలక ఆదేశాలు

Cm Revanth Reddy: రైస్ మిల్లర్ల గోల్ మాల్ వ్యవహారాలపై సీఎం రేవంత్ రెడ్డి సీరియస్ అయ్యారు. ప్రభుత్వాన్ని బ్లాక్ మెయిల్ చేస్తే సహించేది లేదని మిల్లర్లకు వార్నింగ్ ఇచ్చారు. ఉద్దేశపూర్వకంగా డీఫాల్ట్ అయిన మిల్లులను స్వాధీనం చేసుకోవాలని సీఎం రేవంత్ అధికారులను ఆదేశించారు. స్వాధీనం చేసుకున్న మిల్లులను మహిళా సంఘాలకు అప్పగించే అంశాన్ని పరిశీలించాలన్నారు.

OG 2: నవంబర్ నుంచి పవన్ కళ్యాణ్‌తో సెట్స్‌పైకిసినిమాSwechaa12 Aug 2026, 04:51 PM

OG 2: నవంబర్ నుంచి పవన్ కళ్యాణ్‌తో సెట్స్‌పైకి

OG 2: ఓజీ 2 సినిమా ఉందని పార్ట్ 1 క్లైమాక్స్‌లో దర్శకుడు సుజీత్ కన్‌ఫర్మ్ చేశాడు. అన్నట్టుగానే, ఇటీవల ఓజీ 2 కి సంబందించిన కథను నరేట్ చేసి త్వరలో సెట్స్‌పైకి తీసుకురాబోతున్నట్టుగా ప్రకటించారు. దీనికి, సంబందించి పవన్ కళ్యాణ్‌తో దర్శకుడు సుజీత్, మ్యూజిక్ డైరెక్టర్ థమన్ ఉన్న పిక్ కూడా వదిలారు. అన్నీ అనుకున్నటుగా పూర్తైతే ఈ నవంబర్ నుంచి ఓజీ 2 సెట్స్‌పైకి రానుంది.