స్వేచ్ఛ షార్ట్స్ — తాజా తెలుగు వార్తలు

డిప్యూటీ ఛైర్మన్‌ పదవికి వైఎస్సార్‌సీపీ అభ్యర్థి ఖరారు.. జగన్‌ ప్లాన్‌ ఇదేనా?..ఏపీSwechaa12 Aug 2026, 04:44 PM

డిప్యూటీ ఛైర్మన్‌ పదవికి వైఎస్సార్‌సీపీ అభ్యర్థి ఖరారు.. జగన్‌ ప్లాన్‌ ఇదేనా?..

తాడేపల్లిలోని వైఎస్సార్‌సీపీ కేంద్ర కార్యాలయంలో పార్టీ ఎమ్మెల్సీలతో జరిగిన సమావేశంలో మండలి డిప్యూటీ ఛైర్మన్‌ ఎన్నికపై జగన్‌ దిశానిర్దేశం చేశారు. మాధవరావు అభ్యర్థిత్వానికి పార్టీ ఎమ్మెల్సీలంతా పూర్తి మద్దతు ఇవ్వాలని సూచించారు. ఎన్నిక ప్రక్రియ సాఫీగా జరిగేలా ఎమ్మెల్సీలు సమన్వయంతో పనిచేయాలని జగన్‌మోహన్‌రెడ్డి స్పష్టం చేశారు. ప్రస్తుతం శాసనమండలిలో డిప్యూటీ ఛైర్మన్‌ పదవి ఖాళీగా ఉంది. త్వరలోనే ఈ పదవిని భర్తీ చేసేందుకు ఎన్నికల ప్రక్రియ ప్రారంభం కానున్న నేపథ్యంలో వైఎస్సార్‌సీపీ ముందుగానే తమ అభ్యర్థిని ప్రకటించడం రాజకీయంగా ప్రాధాన్యత సంతరించుకుంది.

Telangana RERA: కొరడా ఝళిపించిన రెరా.. ఆ 4 ప్రాజెక్టులపై భారీ జరిమానాతెలంగాణSwechaa12 Aug 2026, 04:39 PM

Telangana RERA: కొరడా ఝళిపించిన రెరా.. ఆ 4 ప్రాజెక్టులపై భారీ జరిమానా

Telangana RERA: తెలంగాణ రియల్‌ ఎస్టేట్‌ రెగ్యులేటరీ అథారిటీ (టీజీ రెరా-TG RERA రియల్ ఎస్టేట్ నియంత్రణ, అభివృద్ధి చట్టం) కొరడా ఝళిపించింది. నిబంధనలు ఉల్లంఘించిన 4 ప్రాజెక్టులపై భారీ జరిమానాలు విధించింది. రెరా రిజిస్ట్రేషన్ లేకుండా విక్రయాలు చేపట్టిన AV Infracon Pvt Ltv కు చెందిన AVs East Residency ప్రాజెక్ట్ పై 2లక్షల 83వేల 140 రూపాయల ఫైన్ వేసింది. AVs West Heights ప్రాజెక్ట్ పై రూ.14,84,184 జరిమానా విధించింది. మరోవైపు సేల్ అగ్రిమెంట్ చేయకుండా 25శాతం డబ్బులు వసూలు చేసిన అదూరి ఇన్ ఫ్రాకు రూ.6,77,966 భారీ జరిమానా విధించింది.

తెలంగాణ యువత కోసం రేవంత్ సర్కార్ కొత్త ప్లాన్.. లెఫ్టినెంట్ జనరల్ తో కీలక భేటీ!..తెలంగాణSwechaa12 Aug 2026, 04:21 PM

తెలంగాణ యువత కోసం రేవంత్ సర్కార్ కొత్త ప్లాన్.. లెఫ్టినెంట్ జనరల్ తో కీలక భేటీ!..

హైదరాబాద్‌లోని ఎంసీఆర్‌హెచ్‌ఆర్‌డీలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని భారత ఆర్మీ సదరన్ కమాండ్ జనరల్ ఆఫీసర్ కమాండింగ్-ఇన్-చీఫ్ లెఫ్టినెంట్ జనరల్ సి. రాజేష్ పుష్కర్ మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా జిల్లా కేంద్రాల్లో ఆర్మీ నియామకాలకు ముందు యువతకు ప్రత్యేక శిక్షణ కేంద్రాలు ఏర్పాటు చేయాలని సీఎం కోరారు. దీనికి ఆర్మీ సానుకూలంగా స్పందించింది. మరోవైపు వరదలు, విపత్తుల సమయంలో రెస్క్యూ, సహాయక చర్యల్లో ఆర్మీ మరింత చురుగ్గా పాల్గొనాలని సీఎం కోరగా.. ప్రత్యేక చొరవ తీసుకుంటామని లెఫ్టినెంట్ జనరల్ హామీ ఇచ్చారు. ఈ సమావేశంలో మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డితో పాటు మేజర్ జనరల్ శ్రీనివాస్ రావు, ఇతర ఆర్మీ ఉన్నతాధికారులు పాల్గొన్నారు.

డిజిటల్‌ మోసాలకు చెక్.. 3700 మొబైల్‌ యాప్స్‌పై కేంద్రం నిషేధం!..NationalSwechaa12 Aug 2026, 03:45 PM

డిజిటల్‌ మోసాలకు చెక్.. 3700 మొబైల్‌ యాప్స్‌పై కేంద్రం నిషేధం!..

డిజిటల్‌ మోసాలకు చెక్ పెట్టేందుకు కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఫేక్ లోన్ యాప్‌లతో పాటు ప్రజలను మోసం చేస్తున్న అక్రమ అప్లికేషన్లపై ఉక్కుపాదం మోపింది. ఈ ఏడాది జూన్ 30 నాటికి ఏకంగా 3,718 చట్టవిరుద్ధమైన యాప్‌లు గూగుల్ ప్లే స్టోర్ సహా ఇతర డిజిటల్ ప్లాట్‌ఫామ్‌ల నుంచి తొలగించి బ్లాక్ చేసింది. అధిక వడ్డీల పేరుతో దోపిడీ చేయడం, వ్యక్తిగత డేటాను చోరీ చేసి బ్లాక్‌మెయిల్‌కు పాల్పడుతున్న సైబర్ ముఠాలపై కఠిన చర్యలకు ప్రభుత్వం సిద్ధమైంది.

Telangana Govt: తెలంగాణలో మరో కొత్త పథకం.. మహిళలకు పూర్తిగా ఉచితం.. లక్షకు పైనేతెలంగాణSwechaa12 Aug 2026, 03:40 PM

Telangana Govt: తెలంగాణలో మరో కొత్త పథకం.. మహిళలకు పూర్తిగా ఉచితం.. లక్షకు పైనే

Telangana Govt: తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం పలు సంక్షేమ పథకాలు అమలు చేస్తోంది. అన్ని వర్గాల ప్రజలను దృష్టిలో ఉంచుకుని స్కీమ్స్ తీసుకొచ్చింది. పథకాల ద్వారా ఆర్థిక సాయం కూడా అందిస్తోంది. తాజాగా బీసీ మహిళలను ఆర్థికంగా ప్రోత్సహించేందుకు ప్రభుత్వం చర్యలు చేపట్టింది. వారి కోసం రేవంత్ ప్రభుత్వం కొత్త పథకానికి శ్రీకారం చుట్టింది. బీసీ మహిళలకు ఆటోమేటిక్ కుట్టు మిషన్లు పంపిణీ చేయనుంది. ఒక్కో నియోజకవర్గానికి వెయ్యి చొప్పున మొత్తం 1,19,000 కుట్టు మిషన్లను అందించనున్నారు. రేపు సచివాలయంలో మంత్రి పొన్నం ప్రభాకర్ ఈ పథకానికి ప్రారంభోత్సవం చేయనున్నారు. లబ్దిదారులపై ఎలాంటి ఆర్థిక భారం లేకుండా పూర్తిగా ప్రభుత్వ సబ్సిడీతో పథకం అమలు చేయనుంది సర్కార్.

జూదం ఆడుతూ మళ్లీ దొరికిన మెదక్ డీసీసీబీ చైర్మన్ ..తెలంగాణSwechaa12 Aug 2026, 02:24 PM

జూదం ఆడుతూ మళ్లీ దొరికిన మెదక్ డీసీసీబీ చైర్మన్ ..

మెదక్ డీసీసీబీ చైర్మన్ మరోసారి వివాదంలో చిక్కుకున్నారు. గత బీఆర్ఎస్ హయాంలో మెదక్ డీసీసీబీ చైర్మన్‌గా నియమితులైన చిట్టి దేవేందర్ రెడ్డి మరోసారి జూదం ఆడుతూ పోలీసులకు పట్టుబడ్డారు. బుధవారం ఉదయం కొంపల్లిలో కొందరు జూదం ఆడుతున్నట్టు పోలీసులకు సమాచారం అందింది. వెంటనే అక్కడకు వెళ్లిన పోలీసులు పేకాడుతున్న వారిని అదుపులోకి తీసుకున్నారు. తీరా చూస్తే అందులో మెదక్ డీసీసీబీ చైర్మన్ చిట్టి దేవేందర్ రెడ్డి ఉన్నట్టు గుర్తించారు.అయితే, ఆయన ఇలా పేకాటలో దొరకడం ఇది రెండోసారి అని సమాచారం. గతంలో ఆయన థాయ్ లాండ్ పర్యటనలో భాగంగా క్యాసినో ఆడుతూ దొరికారు.ఆనాడు చీకోటి ప్రవీణ్ వెంట వెళ్లి క్యాసినో ఆడుతూ దొరికిన వారిలో చిట్టి దేవేందర్ రెడ్డి కూడా ఉన్నారు. అయితే, తాను స్నేహితులను కలవాడనికి వెళ్లాలనని, అక్కడ క్యాసినో ఆడలేదని, తన నిర్దోశిత్వాన్ని నిరూపించుకుంటానని అప్పట్లో ఆయన ప్రకటించారు. ఈ ఘటన జరిగి మూడేండ్లు కావొచ్చింది.

BJP  : చర్చకు సిద్ధం.. సభకు వస్తారా? రాద్ధాంతం చేస్తారా? : అమిత్ షాNationalSwechaa12 Aug 2026, 02:00 PM

BJP : చర్చకు సిద్ధం.. సభకు వస్తారా? రాద్ధాంతం చేస్తారా? : అమిత్ షా

పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు మూడు వాయిదాలు ఆరు గందరగోళాలు అన్నట్టుగా సాగుతున్నాయి. సెషన్స్ ప్రారంభమైన నాటి నుంచి ఇంతవరకు అర్థవంతమైన చర్చ జరగలేదు. నీట్ గందరగోళం, విద్యార్థులనిరసనలు, అరెస్టులు, కేంద్రమంత్రి ధర్మేంద్రప్రధాన్ రాజీనామా తర్వాత.. కేంద్రం యాంటీ పేపర్ లీక్ తెచ్చిన విషయం తెలిసిందే.అయితే, విద్యార్థుల మీద లాఠీచార్జ్ ఎవరి ఆదేశాల మేరకు జరిగింది? దీని మీద కేంద్రహోంమంత్రి అమిత్ షా సమాధానం ఇవ్వాలని లోక్‌సభ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ పదే పదే డిమాండ్ చేస్తున్నారు. దీంతో పార్లమెంటులో బిల్లులు పెట్టకుండా, చర్చ జరగకుండా ఇండియా కూటమి ఎంపీలు అడ్డుకుంటున్నారు. ఎట్టకేలకు కేంద్ర హోంమంత్రి అమిత్ షా మీడియా ముందుకు వచ్చారు. ప్రతిపక్షాలు లేవనెత్తిన అంశాలపై చర్చకు మేం సిద్ధమని ప్రకటించారు. చర్చలకు ప్రభుత్వం పూర్తి సిద్ధంగా ఉందని, విపక్షాలు హంగామా మాని చర్చకు ముందుకు రావాలని లోక్‌సభలో స్పష్టం చేశారు.

రేవంత్ ఫ్యామిలీ సంపాదించుకుంటుంటే కేటీఆర్ ఓర్వట్లేదు : ఎంపీ చామలరాజకీయాలుSwechaa12 Aug 2026, 01:41 PM

రేవంత్ ఫ్యామిలీ సంపాదించుకుంటుంటే కేటీఆర్ ఓర్వట్లేదు : ఎంపీ చామల

బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మీద కాంగ్రెస్ పార్టీ భువనగిరి ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి తీవ్ర విమర్శలు చేశారు. ‘రేవంత్ రెడ్డి కుటుంబంలో ఎవరూ బాగుపడొద్దా? ఆయన కుటుంబం సంపాదించుకుంటుంటే ఎందుకు ఓర్వట్లేదు. ఏదో తక్కువ పెట్టుబడితో అనుముల కుటుంబ సభ్యులు పర్మిషన్ తీసుకొని చిన్న చిన్న కంపెనీలు పెట్టుకుంటే రాద్దాంతం చేస్తున్నారు. అందరికి కేటాయించినట్లే అప్లికేషన్ పెట్టుకుంటే సీఎం రేవంత్ రెడ్డి తమ్ముడు కొండల్ రెడ్డికి భూమి కేటాయించారు’ అని కాంగ్రెస్ ఎంపీ చామల ఈ మేరకు బుధవారం ఉదయం సోషల్ మీడియా వేదికగా ఓ వీడియో సందేశం పోస్టు చేశారు.

తెలంగాణలో బీజేపీ బలమెంత?.. అసెంబ్లీలో పట్టు కష్టమేనా?..తెలంగాణSwechaa12 Aug 2026, 01:28 PM

తెలంగాణలో బీజేపీ బలమెంత?.. అసెంబ్లీలో పట్టు కష్టమేనా?..

తెలంగాణలో బీజేపీ అధికారంలోకి వస్తుందా? పార్లమెంట్ ఎన్నికల్లో సత్తా చాటిన కమలం.. అదే బలాన్ని అసెంబ్లీ ఎన్నికల్లో చూపించగలదా? కాంగ్రెస్‌పై ప్రజల్లో వ్యతిరేకత పెరిగితే దాన్ని తనకు అనుకూలంగా మలుచుకునే శక్తి జాతీయ పార్టీకి ఉందా? బీజేపీలోని కొంతమంది జాతీయ నాయకుల ఇమేజ్‌తో తెలంగాణలో గెలవడం ఈ పార్టీకి సాధ్యమా? లేక గ్రామస్థాయి నుంచి బలమైన క్యాడర్, స్వంత నాయకత్వం, స్పష్టమైన ప్రత్యామ్నాయ పాలన అవసరమా? ప్రస్తుతం బీజేపీ ముందు ఇవే కీలక ప్రశ్నలు. మరి కమలం నిజంగా రాష్ట్రంలో రానిస్తుందా? లేక గాల్లో మేడలు కడుతుందా? అనే అంశం తెలంగాణ పొలిటికల్ సర్కిళ్లలో ఇప్పుడు ఆసక్తికరంగా మారింది..

Samantha: సినిమాల్లో దెబ్బలు తినడం ఫైట్స్ చేయడం బావుంది!సినిమాSwechaa12 Aug 2026, 01:19 PM

Samantha: సినిమాల్లో దెబ్బలు తినడం ఫైట్స్ చేయడం బావుంది!

Samantha: సమంత ఇచ్చిన తాజా ఇంటర్వ్యూలో, ఆమె నటించిన ది ఫ్యామిలీ మేన్ 2, సీటాడెల్; హనీ బన్నీ వెబ్ సిరీస్ గురించి.. అందులో చేసిన యాక్షన్ సీక్వెన్సెస్ గురించి చెప్పుకొచ్చింది. దెబ్బలు తింటూ ఫైట్స్ చేస్తుంటే ఎంతో ఉత్సాహంగా అనిపించిందని సమంత చెప్పింది. ప్రస్తుతం, సోషల్ మీడియాలో సమంత అన్న మాటలు బాగా వైరల్ అవుతున్నాయి. కాగా, ప్రస్తుతం మెటర్నిటీ లీవ్‌లో ఉంది. స్క్రీన్ మీద కనిపించడానికి కొద్దిగా సమయం పడుతుంది. కానీ, స్క్రీన్ వెనకాల మాత్రం నిర్మాతగా యాక్టివ్‌గానే ఉంటోంది.

మాది టీ హబ్.. రేవంత్‌ది అనుముల హబ్స్ : కేటీఆర్తెలంగాణSwechaa12 Aug 2026, 01:18 PM

మాది టీ హబ్.. రేవంత్‌ది అనుముల హబ్స్ : కేటీఆర్

కాంగ్రెస్ ప్రభుత్వం, సీఎం రేవంత్ రెడ్డి మీద బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మరోసారి సంచలన ఆరోపణలు, విమర్శలు చేశారు.ప్రస్తుతం రాష్ట్రంలో సంచలనం రేపిన భూముల కేటాయింపు విషయాన్ని ప్రస్తావించారు. సీఎం రేవంత్ తన తమ్ముడు కొండల్ రెడ్డి రూ.వందల కోట్లు విలువ చేసే భూమిని అప్పనంగా అప్పగించారని ఆరోపించారు. ఈ క్రమంలోనే బుధవారం ఎక్స్ వేదికగా ఆయన ట్వీట్ చేశారు. ‘మేము టీ-హబ్‌ను తీసుకొస్తే.. రేవంత్ రెడ్డి ‘అనుముల హబ్స్’ అనే పథకాన్ని తెచ్చాడు. జీరో ఇన్వెస్ట్‌మెంట్‌తో ‘టెస్సరాక్ట్ అడ్వాన్స్‌డ్ సిస్టమ్స్’ అనే కంపెనీని స్థాపించి, రాత్రికి రాత్రే రూ.200 కోట్ల లాభం సంపాదించిన సీఎం సోదరుడు కొండల్ రెడ్డికి ‘ఇన్నోవేటర్ ఆఫ్ ది సెంచరీ’ అవార్డు ఇవ్వాలి. . మంత్రి శ్రీధర్ బాబు గారు,సీఎం రేవంత్ రెడ్డి.. తెలంగాణలోని లక్షలాది యువతకు అలా ఎలా రూ.వందల కోట్ల విలువైన ప్రభుత్వ భూమిని ఎలా పొందాలో మ్యాజిక్ ట్రిక్ చెప్పాలి.మీరు అనుముల బ్రదర్స్‌లో ఒకరైతే, మీకు చాలా చీప్‌గా భూమి వస్తుంది, ఎలాంటి ప్రశ్నలు ఉండవు’ అని కేటీఆర్ పేర్కొన్నారు.

సీఎం విజయ్ మరో సంచలనం.. డీమిలిటేషన్‌కు వ్యతిరేకంగా తీర్మాణంNationalSwechaa12 Aug 2026, 01:07 PM

సీఎం విజయ్ మరో సంచలనం.. డీమిలిటేషన్‌కు వ్యతిరేకంగా తీర్మాణం

తమిళనాడు సీఎం జోసెఫ్ విజయ్ మరోసారి సంలచన నిర్ణయం తీసుకున్నారు. డీలిమిటేషన్ (నియోజకవర్గాల పునర్విభజన) బిల్లుకు వ్యతిరేకంగా రాష్ట్ర అసెంబ్లీలో తీర్మాణం ప్రవేశపెట్టారు. ఇప్పటికే నీట్, ఎఫ్‌సీఆర్ఏ బిల్లులకు సైతం వ్యతిరేకంగా టీవీకే సర్కార్ అసెంబ్లీలో తీర్మాణం పెట్టడమే కాకుండా ఆమోదించిన విషయం తెలిసిందే. తాజాగా డీలిమిటేషన్ మీద విజయ్ సర్కార్ నిర్ణయం సర్వత్రా చర్చకు దారి తీసింది. అయితే, డీలిటేషన్ వ్యతిరేకించడానికి గల కారణాలను ఆయన వెల్లడించారు. జనాభా నియంత్రణకు తమిళనాడులోని గత ప్రభుత్వాలు నిర్ణయం తీసుకోవడం వలన అక్కడ బర్త్ రేటు పడిపోయిందని.. ఇప్పుడు కేంద్రం జనాభా ప్రాతిపదినక నియోజకవర్గాల పునర్విభజన చేయడం వలన రాష్ట్రానికి ఎంపీ సీట్లు తగ్గిపోతాయని.. ఫలితంగా కేంద్రంలో రాష్ట్ర ప్రభావం తగ్గుతుందన్నారు. అది రాష్ట్ర ప్రజలకు నష్టం చేకూరుస్తుందని పేర్కొన్నారు.

ఎయిర్‌ఫోర్స్ వన్‌లో కాకుండా మ‌రో విమానంలో ట్రంప్..! ఇరాన్‌కు అంత భ‌య‌ప‌డుతున్నారా..?InternationalSwechaa12 Aug 2026, 01:06 PM

ఎయిర్‌ఫోర్స్ వన్‌లో కాకుండా మ‌రో విమానంలో ట్రంప్..! ఇరాన్‌కు అంత భ‌య‌ప‌డుతున్నారా..?

ప్రపంచంలోనే అత్యంత కట్టుదిట్టమైన భద్రతా వ్యవస్థలో ప్రయాణించే అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌ను.. ఎయిర్‌ఫోర్స్ వన్ నుంచి క్యాటరింగ్ వాహనం ద్వారా మరో సైనిక విమానంలోకి మార్చడం మాత్రం అసాధారణ ఘటనగానే నిలిచింది.

త్రిష చుట్టే తమిళ రాజకీయం.. అంద‌రూ ఆమెనే ఎందుకు టార్గెట్ చేస్తున్నారు..?NationalSwechaa12 Aug 2026, 12:39 PM

త్రిష చుట్టే తమిళ రాజకీయం.. అంద‌రూ ఆమెనే ఎందుకు టార్గెట్ చేస్తున్నారు..?

త్రిషకు రాజకీయాలతో సంబంధం ఏమిటన్న ప్రశ్న సహజంగానే వస్తుంది. త్రిష రాజకీయ పార్టీకి నాయకురాలు కాదు. ఎన్నికల్లో పోటీ చేస్తున్నట్టు కూడా ఎలాంటి ప్రకటన చేయలేదు. అయినప్పటికీ ఆమె పేరు మాత్రం తమిళనాడు రాజకీయాల్లో పదేపదే వినిపిస్తోంది.

Vishwambhara: విశ్వంభర విషయంలో మెగాస్టార్ ఎందుకింత మౌనం!సినిమాSwechaa12 Aug 2026, 12:26 PM

Vishwambhara: విశ్వంభర విషయంలో మెగాస్టార్ ఎందుకింత మౌనం!

Vishwambhara: మెగాస్టార్ చిరంజీవి నటిస్తున్న సినిమాలలో అత్యంత క్రేజీ ప్రాజెక్ట్ విశ్వంభర. మల్లిడి వశిష్ట దర్శకత్వం వహిస్తున్నాడు. యూవీ క్రియేషన్స్ బ్యానర్ పై వంశీ-ప్రమోద్ నిర్మిస్తున్నారు. త్రిష కృష్ణన్ హీరోయిన్‌గా, ఆషిక రంగనాథ్ కీలక పాత్రలో కనిపించబోతున్నారు. అయితే, ఇంకా ఈ సినిమా విషయంలో మెగాస్టార్‌కి స్పష్టత కరువైందని తాజా పరిణామాలు చూస్తే అర్థమవుతోంది. అందుకే, ఆయన మౌనంగా ఉన్నట్టు తెలుస్తోంది.

మృత్యువుతో పోరాటం..అమెరికాలో తెలంగాణ వ్యక్తి మృతితెలంగాణSwechaa12 Aug 2026, 12:14 PM

మృత్యువుతో పోరాటం..అమెరికాలో తెలంగాణ వ్యక్తి మృతి

అమెరికాలో జరిగిన ప్రమాదంలో గత రెండు వారాలుగా ప్రాణాలతో పోరాడిన తెలంగాణ వాసి మృతి చెందాడు. ఫ్లోరిడాలో జులై 25వ తేదీన జరిగిన అగ్నిప్రమాదంలో హన్మకొండ జిల్లా హసన్‌పర్తి మండలం గంటూర్‌పల్లికి చెందిన భరత్ చందర్ రెడ్డి అనే విద్యార్థి తీవ్రంగా గాయపడ్డాడు. 75 శాతం కాలిన గాయాలతో ఉన్న అతన్ని వెంటనే ఆసుపత్రిలో చేర్పించగా.. గత 15 రోజులుగా మృత్యువుతో పోరాడి భారత కాలమానం ప్రకారం ఇవాళ ఉదయం కన్నుమూసినట్టు తెలుస్తోంది.

మేం చేసింది  కూడా కాంగ్రెస్ చేయడం లేదు : హరీశ్ రావురాజకీయాలుSwechaa12 Aug 2026, 11:39 AM

మేం చేసింది కూడా కాంగ్రెస్ చేయడం లేదు : హరీశ్ రావు

రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి గత బీఆర్ఎస్ ప్రభుత్వం అమలు చేసిన స్కీమ్స్ కూడా అమలు కావడం లేదని శాసనసభ డిప్యూటీ ఫ్లోర్ లీడర్, మాజీ మంత్రి హరీశ్ రావు అన్నారాష్ట్రంలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి గత బీఆర్ఎస్ ప్రభుత్వం అమలు చేసిన స్కీమ్స్ కూడా అమలు కావడం లేదని శాసనసభ డిప్యూటీ ఫ్లోర్ లీడర్, మాజీ మంత్రి హరీశ్ రావు అన్నారు. ఎక్కడి సమస్యలు అక్కడే ఉన్నాయని, ప్రజలు, ఉద్యోగులు, విద్యార్థులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని ఆరోపించారు. ఎన్నికల సమయంలో కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీలను మర్చిపోయిందని విమర్శించారు.

బీఆర్ఎస్ టైంలో చాలా హామీలు నెరవేర్చామని, ఎన్నో కొత్త పథకాలు అమలు చేశామని.. కనీసం వాటిని కూడా కాంగ్రెస్ సర్కార్ కొనసాగించడం లేదని మండిపడ్డారు. బుధవారం ట్రైబల్ ఎంటర్‌ప్రెన్యూర్స్ బిజినెస్ అవేర్నెస్ కార్యక్రమంలో పాల్గొన్న మాజీ మంత్రి ఈ సందర్బంగా అధికారపార్టీపై తీవ్ర విమర్శలు గుప్పించారు. బీఆర్ఎస్ పార్టీ తరఫున ప్రధాన ప్రతిపక్షంగా అసెంబ్లీలో గిరిజనుల హక్కుల కోసం కొట్లాడతామని చెప్పారు.రు. ఎక్కడి సమస్యలు అక్కడే ఉన్నాయని, ప్రజలు, ఉద్యోగులు, విద్యార్థులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని ఆరోపించారు.

హెచ్‌‌సీయూలో ‘ఈగల్’ దాడులు.. ఇద్దరికి డ్రగ్స్ పాజిటివ్!క్రైమ్Swechaa12 Aug 2026, 11:26 AM

హెచ్‌‌సీయూలో ‘ఈగల్’ దాడులు.. ఇద్దరికి డ్రగ్స్ పాజిటివ్!

హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీలో బుధవారం ఉదయం ఈగల్ బృందాలు దాడులు నిర్వహించాయి. పోలీసులు సైతం వారి వెంట ఉన్నారు. మత్తు పదార్థాలు వాడుతున్నారని విశ్వసనీయ సమాచారం రావడంతో ఈగల్, పోలీసు బృందాలు సంయుక్తంగా దాడులు జరిపినట్టు సమాచారం.గత కొంతకాలంగా యూనివర్సిటీలో అసాంఘిక చర్యలు, కార్యక్రమాలకు కొందరు విద్యార్థులు పూనుకున్నారని తెలిసింది. దీంతో ఈగల్ బృందాలు రంగంలోకి దిగాయి. క్యాంపస్‌లో డ్రగ్స్ సేవించడం, విక్రయించడం జరుగుతోందనే పక్కా సమాచారంతో రంగంలోకి దిగిన అధికారులు అనుమానం వచ్చిన పలువురు విద్యార్థులకు పట్టుకుని వారికి డ్రగ్స్ పరీక్షలు నిర్వహించారు.ఈ తనిఖీల్లో ఇద్దరికి పాజిటివ్ రాగా.. మరో 15 మంది అనుమానితులుగా ఉన్నట్టు సమాచారం.

Crime : చిన్నారులను అనాథలుగా మార్చిన కొత్త ఇల్లు.. ఏమైందంటే?క్రైమ్Swechaa12 Aug 2026, 10:38 AM

Crime : చిన్నారులను అనాథలుగా మార్చిన కొత్త ఇల్లు.. ఏమైందంటే?

సొంతింటి కలను నెరవేర్చుకోవాలని చాలా మంది అప్పుల ఊబిలో చిక్కుకుంటున్నారు. కొనేటప్పుడు బాగానే ఉన్నా తిరిగి అప్పు చెల్లించే క్రమంలో ఇబ్బందులు పడుతున్నారు. డబ్బులు సర్దుబాటుకాక వాటిని తీర్చడానికి మరల అప్పులు చేస్తున్నారు. దీంతో అప్పులు కాస్త మెడకు ఊరితాడై వేలాడుతోంది. ముందు చూపు లేకుండా చేసిన అప్పులు తల్లిదండ్రులను బలిగొంటుంటే వారి సంతానం అనాథలుగా మారుతున్నారు. తాజాగా ఇలాంటి ఘటనే రాష్ట్రంలోని నిజామాబాద్ జిల్లాలో ఆలస్యంగా వెలుగుచూసింది. వివరాల్లోకివెళితే.. తీసుకున్న అప్పులు చెల్లించలేక దంపతులు ఆత్మహత్య చేసుకోగా.. ఇద్దరు పిల్లలు అనాథలు అయ్యారు.

Shraddha Kapoor: ప్రభాస్‌తో పోటీ ఎందుకు శ్రద్ధా?సినిమాSwechaa12 Aug 2026, 10:32 AM

Shraddha Kapoor: ప్రభాస్‌తో పోటీ ఎందుకు శ్రద్ధా?

Shraddha Kapoor: శ్రద్ధ కపూర్ హిందీలో నటించిన సినిమా ‘ఈఠ’. వాస్తవానికి, ఈ సినిమా కూడా ఆగస్టు 26న రిలీజ్ చేయాలనుకున్నారు మేకర్స్. కానీ, యష్ లాంటి పాన్ ఇండియా హీరో నటించిన టాక్సిక్ మూవీతో పోటీ ఎందుకు అనుకొని, ప్రభాస్ నటిస్తున్న ఫౌజీ సినిమాతో పోటీకి వస్తున్నారు. ఆగస్టు 26న అనుకున్న ‘ఈఠ’ చిత్రం ఫౌజీ రిలీజ్ రోజునే పోటీకి వస్తున్నారు. అంటే డిసెంబర్ 4న ఫౌజీ తో పాటు శ్రద్ధ నటించిన ‘ఈఠ’ కూడా రిలీజ్ కాబోతోంది.

HyD : శంషాబాద్ ఎయిర్ పోర్టులో హై అలర్ట్.. 31 వరకు హై సెక్యూరిటీ!తెలంగాణSwechaa12 Aug 2026, 10:24 AM

HyD : శంషాబాద్ ఎయిర్ పోర్టులో హై అలర్ట్.. 31 వరకు హై సెక్యూరిటీ!

ఆగస్టు 15 స్వాతంత్ర్య దినోత్సవం సమీపిస్తుండటంతో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అలర్ట్ అయ్యాయి.ఇండిపెండెన్స్ రోజున ఉగ్రదాడులు జరిగే ఆస్కారముందని నిఘా వర్గాల హెచ్చరికల మేరకు కేంద్రం ఆదేశాలతో రాష్ట్ర ప్రభుత్వాలు అప్రమత్తం అయ్యాయి.దీంతో దేశవ్యాప్తంగా విమానాశ్రయాలు, రైల్వే స్టేషన్లు, రద్దీప్రాంతాల్లో హైఅలర్ట్ ప్రకటించాయి. అక్కడ అధికంగా భద్రతా బలగాలను మోహరించాలని ఆదేశాలు జారీ అయ్యాయి.ఈ క్రమంలోనే హైదరాబాద్‌లోని శంషాబాద్ ఎయిర్ పోర్టులో సీఐఎస్‌ఎఫ్ బలగాలు, స్థానిక పోలీసులు భారీ భద్రతా ఏర్పాట్లు చేపట్టారు. ఆగస్టు 15 స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల నేపథ్యంలో ఎయిర్‌పోర్ట్ ప్రాంగణంలో 'హై అలర్ట్' ప్రకటించారు.

పనులు కాలేదు.. పైసలు పాయే?.. అయ్యో.. ఇరుక్కుపోయామే?..తెలంగాణSwechaa12 Aug 2026, 10:17 AM

పనులు కాలేదు.. పైసలు పాయే?.. అయ్యో.. ఇరుక్కుపోయామే?..

కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చాక పెండింగ్ రియల్ ఎస్టేట్ ఫైల్స్ క్లియర్ చేసుకునేందుకు ప్రయత్నించిన రియల్టర్లు, కొంతమంది నేతలు ఇప్పుడు ఇరుక్కుపోయారనే ప్రచారం జరుగుతోంది. అడ్వాన్సులు, అగ్రిమెంట్లతో ముందుకెళ్లిన వ్యవహారాలు చివరి దశలో ఆగిపోవడంతో డబ్బుల కోసం తిరుగుతున్నారన్న సమాచారం. మరోవైపు భూ వ్యవహారాలపై ప్రతిపక్షాలకు అంతర్గత సమాచారం చేరుతుండటం ప్రభుత్వ పెద్దలకు కొత్త తలనొప్పిగా మారుతోంది. అధికారులు రికార్డులు మార్చేందుకు వెనుకడుగు వేస్తుండటంతో పరిస్థితి మరింత క్లిష్టంగా మారిందనే చర్చ సాగుతోంది. మొత్తంగా రియల్ ఎస్టేట్‌పై ఆధారపడిన నేతలు, రియల్టర్ల భవిష్యత్ వ్యూహాలు ఇప్పుడు రాజకీయ ఒత్తిళ్ల మధ్య చిక్కుకున్నాయన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.

Varun Tej: కొరియన్ కనకరాజు సీక్వెల్..కన్‌ఫర్మ్ చేసిన చిరుసినిమాSwechaa12 Aug 2026, 10:00 AM

Varun Tej: కొరియన్ కనకరాజు సీక్వెల్..కన్‌ఫర్మ్ చేసిన చిరు

Varun Tej: మేర్లపాక గాంధీ దర్శకత్వంలో వరుణ్ తేజ్ హీరోగా వచ్చిన సినిమా కొరియన్ కనరాజు. రితిక నాయక్ హీరోయిన్‌గా, సత్య కీలక పాత్రలో నటించారు. ఆగస్టు 7వ తేదీన వచ్చిన ఈ సినిమా మూడు రోజుల్లోనే లాభాల బాట పట్టింది. విడుదలైన అన్నీ చోట్లా బ్రేకీవెన్ అయింది. ఈ సందర్భంగా నిర్వహించిన సక్సెస్ సెలబ్రేషన్స్‌లో సీక్వెల్‌ని కన్‌ఫర్మ్ చేశారు.

బొమ్మరాసిపేట్ భూములపై మంత్రి పొంగులేటి ఆరా?తెలంగాణSwechaa12 Aug 2026, 09:52 AM

బొమ్మరాసిపేట్ భూములపై మంత్రి పొంగులేటి ఆరా?

మేడ్చల్ జిల్లాలో రెవెన్యూ అధికారుల అక్రమ వ్యవహారంపై స్వేచ్ఛ న్యూస్ వార్తలు రాస్తూనే ఉంది. గతంలో బాచుపల్లిలో మైరాన్ మాల్ పేరుతో యువరాజ్ చేసిన భూ వ్యవహారం కుండబద్దలు కొట్టినట్లు రాసింది. సీలింగ్ ఫైల్ మాయం, ఎన్నో వ్యవహారాలు నడిపించినా, చివరికి నిజం ఏంటో తేలిపోయింది. టైటిల్ ఎవరికి ఉందో తెలుసుకున్నట్లు సమాచారం. తాజాగా బొమ్మరాసిపేట్ లో 60 ఏండ్లుగా జరిగిన సేల్ డీడ్స్ , ఇనాం భూముల వ్యవహారం, సీలింగ్ డిక్లరేషన్స్ ఏమీ పట్టించుకోకుండా, 60 ఎకరాల ఫేక్ డాక్యుమెంట్స్ పేరుతో వెయ్యి ఎకరాలు కొట్టేయాలని భూ కబ్జాదారులు చూస్తున్నారు.

Mega 158: పుసుక్కున టైటిల్ లీక్ చేసిన మెగాస్టార్!సినిమాSwechaa12 Aug 2026, 09:29 AM

Mega 158: పుసుక్కున టైటిల్ లీక్ చేసిన మెగాస్టార్!

Mega 158: మెగాస్టార్.. ప్రస్తుతం బాబీ దర్శకత్వంలో ఓ భారీ యాక్షన్ సినిమాను చేస్తున్నాడు. ప్రియమణి హీరోయిన్‌గా అనస్వర రాజన్, నివేదా పేతురాజ్, మురళీ శర్మ కీలక పాత్రల్లో కనిపించబోతున్నారు. ఈ సినిమాకి మ్యూజిక్ సెన్షేషన్ ఎస్.ఎస్.థమన్ సంగీతమందిస్తున్నాడు. అయితే, తాజాగా చిరంజీవి మెగా 158 టైటిల్‌ని లీక్ చేశాడు. 'కదిరి' అని మేకర్స్ టైటిల్ ని ఫిక్స్ చేశారు.

కూటమిలో సోషల్ వార్.. చంద్రబాబు, పవన్ క‌ళ్యాణ్ అలర్ట్!ఏపీSwechaa12 Aug 2026, 09:08 AM

కూటమిలో సోషల్ వార్.. చంద్రబాబు, పవన్ క‌ళ్యాణ్ అలర్ట్!

కూటమికి అసలు ప్రమాదం బయట నుంచి వచ్చే రాజకీయ విమర్శల కంటే, లోపల పెరిగే విభేదాలే. ఒంగోలులో బాలినేని–దామచర్ల మధ్య మొదలైన మాటల యుద్ధం సోషల్ మీడియాలో కూటమి పార్టీల మధ్య ‘వార్’గా మారకుండా అడ్డుకోవడమే ఇప్పుడు చంద్రబాబు, పవన్ ముందున్న తక్షణ క‌ర్త‌వ్యం.

RC 17-Sukumar: కొత్త మేకోవర్ ట్రై చేస్తున్న రామ్ చరణ్!సినిమాSwechaa12 Aug 2026, 09:04 AM

RC 17-Sukumar: కొత్త మేకోవర్ ట్రై చేస్తున్న రామ్ చరణ్!

RC 17-Sukumar: ప్రస్తుతం, రామ్ చరణ్ తన 17వ సినిమా కోసం రెడీ అవుతున్నాడు. సుకుమార్ దర్శకత్వంలో ఈ సినిమా రూపొందనుంది. అగ్ర నిర్మాణ సంస్థ మైత్రీ మూవీ మేకర్స్ భారీ బడ్జెట్‌తో ఈ చిత్రాన్ని నిర్మించబోతున్నారు. సుకుమార్, ఇప్పుడు ప్రీ ప్రొడక్షన్స్ వర్క్‌లో బిజీగా ఉన్నాడు. దాదాపు, ఈ వర్క్ పూర్తి కావచ్చింది. త్వరలో, ఘనంగా ఓపెనింగ్ నిర్వహించి రెగ్యులర్ షూటింగ్‌కి ప్లాన్ చేయనున్నారు. ఈ సినిమా కోసం చరణ్ సరికొత్త మేకోవర్‌లో కనిపించబోతున్నాడట.

ప్రభుత్వ ఆసుపత్రి నిర్వాకం.. రిస్క్ లో బాలిక జీవితం!..NationalSwechaa12 Aug 2026, 08:54 AM

ప్రభుత్వ ఆసుపత్రి నిర్వాకం.. రిస్క్ లో బాలిక జీవితం!..

కోయంబత్తూర్‌లో ఓ తండ్రి చేసిన ఆరోపణలు ఇప్పుడు ప్రభుత్వ వైద్య వ్యవస్థపై తీవ్ర ప్రశ్నలు లేవనెత్తుతున్నాయి. రక్తహీనతతో ఆస్పత్రిలో చేరిన తన కుమార్తెకు రక్తం ఎక్కించారని.. కొన్ని నెలల తర్వాత ఆమెకు హెచ్‌ఐవీ ఉన్నట్లు తేలిందని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. కుటుంబ సభ్యులందరికీ హెచ్‌ఐవీ లేదని పరీక్షల్లో తేలినట్టు చెబుతున్నారు. ప్రభుత్వ ఆస్పత్రి వర్గాల నిర్లక్ష్యం వల్ల తన బిడ్డ జీవితం ప్రమాదంలో పడిందని మండిపడ్డారు. ఆస్పత్రి సిబ్బందిపై పోలీసులకు పలుసార్లు ఫిర్యాదు చేసినా పట్టించుకోలేదన్నారు. ప్రభుత్వ ఆస్పత్రి పై విచారణ జరిపించాలని, కుమార్తెకు న్యాయం జరిగేలా చూడాలని ప్రభుత్వాన్ని కోరారు.

చిన్న వయస్సులోనే స్టార్ డమ్ అందుకొని అండర్ వరల్డ్ దెబ్బకు పారిపోయిన హీరోయిన్!..సినిమాSwechaa12 Aug 2026, 08:12 AM

చిన్న వయస్సులోనే స్టార్ డమ్ అందుకొని అండర్ వరల్డ్ దెబ్బకు పారిపోయిన హీరోయిన్!..

ఒకప్పుడు బాలీవుడ్‌లో స్టార్ హీరోయిన్‌గా ఓ వెలుగు వెలిగిన సోనమ్.. ఇప్పుడు దాదాపు మూడు దశాబ్దాల తర్వాత మళ్లీ వార్తల్లో నిలిచారు. భక్తవర్ ఖాన్ అసలు పేరుతో జన్మించిన సోనమ్.. తెలుగులో ‘సామ్రాట్’ సినిమాతో హీరోయిన్‌గా పరిచయమై, ఆ తర్వాత బాలీవుడ్‌లో అగ్ర హీరోల సరసన నటించి మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. కెరీర్ పీక్‌లో ఉండగానే దర్శకుడు రాజీవ్ రాయ్‌ను పెళ్లి చేసుకుని సినిమాలకు దూరమయ్యారు. కుటుంబ, వ్యక్తిగత కారణాలతో విదేశాల్లో గడిపిన ఆమె.. 2023లో ముంబైలో మళ్లీ కనిపించారు. ఇప్పుడు తన వయసుకు తగ్గ పాత్రలు, ఓటీటీ అవకాశాలు వస్తే నటించేందుకు సిద్ధమని చెప్పినట్లు కథనాలు వచ్చాయి.

మనిషి మరణించిన తర్వాత ఏం జరుగుతుంది?SpiritualitySwechaa12 Aug 2026, 07:50 AM

మనిషి మరణించిన తర్వాత ఏం జరుగుతుంది?

మరణం అంటే అన్నీ ముగిసిపోవడమేనా? లేక మరో ప్రయాణానికి ఆరంభమా? భారతీయ ఆధ్యాత్మిక శాస్త్రాలు చెబుతున్నదేమిటంటే.. శరీరానికి మాత్రమే మరణం.. ఆత్మకు కాదు. భగవద్గీతలో శ్రీకృష్ణుడు చెప్పినట్టు.. మనిషి పాత బట్టలు విడిచి కొత్తవి ధరించినట్లే.. ఆత్మ ఒక శరీరాన్ని విడిచి మరో శరీరాన్ని స్వీకరిస్తుంది. మన కర్మలు, ఆలోచనలు, కోరికలే తదుపరి ప్రయాణాన్ని ప్రభావితం చేస్తాయని శాస్త్రాలు చెబుతున్నాయి. అందుకే మరణానికి భయపడటం కంటే.. బతికున్నంత కాలం మంచి కర్మలు చేయడం, ఇతరులకు మేలు చేయడం, మనసును పవిత్రంగా ఉంచుకోవడమే నిజమైన ఆధ్యాత్మిక భావన అని అంటున్నారు..