స్వేచ్ఛ షార్ట్స్ — తాజా తెలుగు వార్తలు

తక్కువ ధరకే క్వాలిటీ బియ్యం.. రేవంత్ సర్కార్ కీలక నిర్ణయం!తెలంగాణSwechaa06 Nov 2026, 03:31 PM

తక్కువ ధరకే క్వాలిటీ బియ్యం.. రేవంత్ సర్కార్ కీలక నిర్ణయం!

తెలంగాణలో ఎల్‌నినో ప్రభావం మొదలుకాకముందే బియ్యం ధరలకు రెక్కలు వచ్చాయి. కొందరు బియ్యం వ్యాపారులు, డీలర్లు కుమ్మక్కై మార్కెట్లో కొరత సృష్టించి గతంలో రూ.1200 ఉన్న 26 కేజీల బ్యాగును ఇప్పుడు రూ.1800 నుంచి రూ.2500 వరకు విక్రయిస్తున్నారు. పాత స్టాక్ బియ్యపు సంచులకు సైతం కొత్త లేబుల్స్ వేసి లాభాలు దండుకుంటున్నారు. నిత్యావసర వస్తువుల ధరలు ఆకాశాన్ని తాకడంతో రాష్ట్ర ప్రభుత్వం మీద ప్రజల నుంచి తీవ్ర అసంతృప్తి కనిపించింది. దీంతో రంగంలోకి దిగిన రేవంత్ సర్కార్ బియ్యం ధరలకు కళ్లెం వేసేందుకు నడుం బిగించింది. మార్కెట్‌లో బియ్యం ధరలను నియంత్రించడంతో పాటు రాష్ట్ర ప్రజలకు తక్కువ ధరలకే నాణ్యమైన బియ్యాన్ని అందుబాటులోకి తీసుకొచ్చేందుకు సర్కార్ చర్యలు చేపట్టింది. అందుకోసం ప్రత్యేకంగా విక్రయ కేంద్రాలను ఏర్పాటు చేసింది. ఇక్కడ కిలో బియ్యాన్ని రూ.66, రూ.74, రూ.79 చొప్పున మూడు రకాల ధరలకు విక్రయించేలా ప్లాన్ చేసింది. హైదరాబాద్ నగరవ్యాప్తంగా మొత్తం 10 విక్రయ కేంద్రాలను ప్రభుత్వం ప్రారంభించింది.

ప్రభుత్వ హెలికాప్టర్‌లో ఎమ్మెల్యే భర్త షికార్లు.. పైసలెవరిస్తరు?తెలంగాణSwechaa06 Nov 2026, 03:14 PM

ప్రభుత్వ హెలికాప్టర్‌లో ఎమ్మెల్యే భర్త షికార్లు.. పైసలెవరిస్తరు?

రాష్ట్రంలో నిత్యావసర ధరలు పెరగడంతో సామాన్యులు, దిగువ మధ్యతరగతి ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ధరలు పెరగకుండా కట్టడి చేయడంలో విఫలమైన రేవంత్ సర్కార్.. కాంగ్రెస్ పార్టీ నేతల జల్సాలను మాత్రం తెగ ఎంకరేజ్ చేస్తున్నదని ఆరోపణలు ఉన్నాయి.సాధారణంగా ప్రభుత్వ హెలికాప్టర్‌ను కేవలం ముఖ్యమంత్రి, మంత్రుల స్థాయి వ్యక్తులు మాత్రమే ఉపయోగించాలి. అందుకు ప్రభుత్వం రూ.కోట్లలో అద్దె చెల్లించాల్సి ఉంటుంది. అయితే, తెలంగాణలో మాత్రం అందుకు భిన్నంగా సీఎం రేవంత్ రెడ్డి కంటే అధికంగా మంత్రులే హెలికాప్టర్‌లో చక్కర్లు కొడుతున్నారు. ఇక్కడ షాకింగ్ విషయం ఏంటంటే సీఎం రేవంత్ రెడ్డి, మంత్రులు కాకుండా ఓ ఎమ్మెల్యే భర్త హెలికాప్టర్‌లో అది కూడా ప్రభుత్వ ఖర్చుతో సంచరించడం హాట్ టాపిక్ అయ్యింది. సత్తుపల్లి కాంగ్రెస్ ఎమ్మెల్యే మట్టా రాగమయి భర్త దయానంద్ ప్రభుత్వ హెలికాప్టర్‌లో షికార్లు చేయడంపై తీవ్ర విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.

దీపావళి కానుకలతోనూ కాలుష్య ముప్పు.. సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు!NationalSwechaa06 Nov 2026, 03:10 PM

దీపావళి కానుకలతోనూ కాలుష్య ముప్పు.. సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు!

దేశ రాజధాని ఢిల్లీలో వాయు కాలుష్యం అత్యంత ప్రమాదకర స్థాయికి చేరుకుంటున్న తరుణంలో భారత అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. దీపావళి పండుగ సందర్భంలో ప్రతి ఏటా కానుకలు ఇచ్చిపుచ్చుకునే సంప్రదాయం కూడా నగరంలో వాహన కాలుష్యం తీవ్రమవడానికి ఒకానొక కారణమవుతోందని భారత ప్రధాన న్యాయమూర్తి (CJI) జస్టిస్ సూర్యకాంత్ నేతృత్వంలోని ధర్మాసనం అభిప్రాయపడింది. ప్రతి శీతాకాలంలో తీవ్రమైన కాలుష్య సమస్యను ఎదుర్కొంటున్న ఢిల్లీలో శాశ్వత మార్పులు రావాలంటే కేవలం ప్రభుత్వ నిబంధనలే కాకుండా, ప్రజల ఆలోచనా విధానంలో, జీవనశైలిలో సైతం సాంస్కృతిక మార్పులు రావాల్సిన అవసరం ఉందని కోర్టు స్పష్టం చేసింది.

Telangana Politics: అసెంబ్లీలో కాళేశ్వరం గుట్టు.. ఆ రూ.4,193 కోట్లపై రేవంత్  బిగ్ స్కెచ్!తెలంగాణSwechaa06 Nov 2026, 02:58 PM

Telangana Politics: అసెంబ్లీలో కాళేశ్వరం గుట్టు.. ఆ రూ.4,193 కోట్లపై రేవంత్  బిగ్ స్కెచ్!

Telangana Politics: తెలంగాణ రాజకీయ ముఖచిత్రంలో గత కొన్నేళ్లుగా అత్యంత చర్చనీయాంశమైన అంశం కాళేశ్వరం ప్రాజెక్టు. మేడిగడ్డ కుంగుబాటు మొదలుకుని నిధుల వరద వరకు ప్రతి అంశమూ తీవ్ర దుమారాన్నే రేపింది. అయితే, ఇన్నాళ్లూ విమర్శలు, విచారణలకే పరిమితమైన కాళేశ్వరం వ్యవహారంలో రేవంత్ రెడ్డి నేతృత్వంలోని కాంగ్రెస్ ప్రభుత్వం ఇప్పుడు దూకుడు పెంచింది. కేవలం ఆరోపణలతో సరిపెట్టకుండా, పాలనాపరంగా ప్రాజెక్టును దారిలో పెడుతూనే.. రాజకీయంగా ప్రత్యర్థులకు గట్టి కౌంటర్ ఇచ్చేలా ఒక భారీ ‘స్పెషల్ స్కెచ్’ సిద్ధం చేసింది.కాళేశ్వరం మరమ్మతుల అంశాన్ని ప్రజల్లోకి బలంగా తీసుకెళ్లేందుకు నవంబర్ నెలాఖరులో రెండు రోజుల పాటు ప్రత్యేకంగా అసెంబ్లీ సమావేశాలు నిర్వహించాలని సీఎం రేవంత్ రెడ్డి నిర్ణయించారు. సభ వేదికగా గత ప్రభుత్వ హయాంలో ప్రాజెక్టు రీడిజైనింగ్, నిర్మాణంలో జరిగిన సాంకేతిక తప్పిదాలు ఏమిటి?,

‘సిటిజన్ షిప్’ రాకుండానే సోనియా గాంధీకి ఓటు..!NationalSwechaa06 Nov 2026, 02:55 PM

‘సిటిజన్ షిప్’ రాకుండానే సోనియా గాంధీకి ఓటు..!

కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీకి మరో బిగ్ షాక్ తగలనుందా? అంటే అవుననే సమాధానాలు వినిపిస్తున్నాయి. ఇటలీ పౌరసత్వం ఉన్న ఆమె దివంగత మాజీ ప్రధాని రాజీవ్ గాంధీని వివాహం చేసుకుని ఇండియాకు వచ్చిన సమయంలో ఆమెకు పౌరసత్వం కంటే ముందే ఓటు హక్కు వచ్చిందన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి.వాస్తవానికి భారతీయ పౌరులు కాని వారు ఎవరికీ పౌరసత్వం రాకముందు ఓటు హక్కు రాకూడదు. కానీ,భారతీయ చట్టాలకు విరుద్ధంగా ఆమె ఓటు హక్కు కలిగి ఉన్నారని ఓ వ్యక్తి కోర్టును ఆశ్రయించారు. ఈ క్రమంలోనే భారత పౌరసత్వం పొందకముందే ఓటరు జాబితాలో సోనియా గాంధీ పేరును చేర్చారనే వివాదంలో ఢిల్లీలోని రౌస్ అవెన్యూ కోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది.

ఒక్క ఎకరం అమ్మినట్లు నిరూపించినా ఊడిగం చేస్తా.. ఎమ్మెల్యే సవాల్!తెలంగాణSwechaa06 Nov 2026, 02:39 PM

ఒక్క ఎకరం అమ్మినట్లు నిరూపించినా ఊడిగం చేస్తా.. ఎమ్మెల్యే సవాల్!

కూకట్‌పల్లి నియోజకవర్గ పరిధిలోని భూముల విక్రయాల వ్యవహారంపై బీఆర్ఎస్ ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు రాష్ట్ర ప్రభుత్వానికి సవాల్ విసిరారు. కూకట్‌పల్లి ప్రాంతంలో తాను గానీ తన కుటుంబసభ్యులు గానీ ఒక్క ఎకరం భూమిని అమ్ముకున్నట్లు నిరూపించినా.. ప్రభుత్వంలోని పెద్దల ఇళ్లలో ఊడిగం చేయడానికి సిద్ధమని సంచలన ప్రకటన చేశారు. తెలంగాణ ఉద్యమ సమయంలో తాము ఎంతో కష్టపడి, పోరాడి సాధించిన మియాపూర్ భూములను ప్రభుత్వం అన్యాక్రాంతం చేస్తోందన్నారు. కోర్టు ఆర్డర్ కాపీ రాకముందే ఆ భూములను వేలం వేయడానికి కాంగ్రెస్ పెద్దలు సిద్ధపడడం దారుణమని మండిపడ్డారు.

Congress :  మంత్రి దామోదర ఎపిసోడ్‌పై పీసీసీ చీఫ్ ఆగ్రహం.. ఏఐసీసీకి నివేదిక!తెలంగాణSwechaa06 Nov 2026, 02:28 PM

Congress : మంత్రి దామోదర ఎపిసోడ్‌పై పీసీసీ చీఫ్ ఆగ్రహం.. ఏఐసీసీకి నివేదిక!

మంత్రి దామోదర, ఎమ్మెల్యే కాంతారావు మధ్య నెలకొన్న వివాదంపై తేల్చేందుకు పీసీసీ చీఫ్ మహేశ్ కుమార్ గౌడ్ రంగంలోకి దిగారు. ఈ ఘటనపై విచారణ జరిపేందుకు గాంధీభవన్ రావాలని మంత్రి దామోదర రాజనరసింహ, ఎమ్మెల్యే లక్ష్మికాంతరావుకు మొన్నసాయంత్రం నోటీసులు పంపారు. అయితే, నిన్న ఉదయం 10.30 గంటలకు విచారణకు రావాల్సి ఉండగా మంత్రి దామోదర రాలేదు. మధ్యాహ్నం 2 గంటలకు ఎమ్మెల్యే కాంతారావు విచారణ ఉండగా.. మంత్రి రాలేదని ఆయన కూడా హ్యాండ్ ఇచ్చినట్టు తెలిసింది. విచారణకు రాకుండా హ్యాండ్ ఇచ్చిన వ్యవహారంపై టీపీసీసీ అధ్యక్షుడు మహేశ్ కుమార్ గౌడ్ సీరియస్‌గా ఉన్నట్టు తెలుస్తోంది.ఈ క్రమంలోనే పార్టీ సీడబ్ల్యూసీ శాశ్వత మెంబర్, మంత్రి దామోదర రాజనరసింహ, నూతనంగా ఎన్నికైన ఎమ్మెల్యే లక్ష్మికాంతారావు వ్యవహార శైలిపై కాంగ్రెస్ అధిష్టానానికి సమగ్ర నివేదికను పంపేందుకు పీసీసీ చీఫ్ సిద్దమైనట్టు తెలుస్తోంది.

రెండు టైర్లు పేలి డివైడర్‌ను ఢీకొట్టిన బస్సు.. తప్పిన ముప్పు!క్రైమ్Swechaa06 Nov 2026, 02:16 PM

రెండు టైర్లు పేలి డివైడర్‌ను ఢీకొట్టిన బస్సు.. తప్పిన ముప్పు!

 జాతీయ రహదారి 44(NH44)పై ఓ ప్రైవేట్ ట్రావెల్ బస్సుకు పెను ప్రమాదం తప్పింది. జోగులాంబ గద్వాల జిల్లా ఉండవెల్లి మండలం అలంపూర్ చౌరస్తా ఫ్లైఓవర్‌పై శుక్రవారం ఉదయం ఈ ఘటన చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళ్తే.. ప్రొద్దుటూరు నుంచి పీఆర్‌ఎల్‌ (PRL) ట్రావెల్స్ బస్సు సుమారు 36మంది ప్రయాణికులతో హైదరాబాద్‌కు బయల్దేరింది. ఈ క్రమంలో సరిగ్గా అలంపూర్ చౌరస్తా ఫ్లైఓవర్‌పైకి రాగానే బస్సు రెండు టైర్లు ఒక్కసారిగా పేలిపోయాయి.  దీంతో బస్సు అదుపుతప్పి రోడ్డు మధ్యలో ఉన్న డివైడర్‌ను వేగంగా ఢీకొట్టి, అదుపుచేయలేక అవతలి వైపు రోడ్డుపైకి దూసుకెళ్లింది.

ఆధార్ కార్డు పని ఖతం.. మోడీ సర్కార్ మరో బిగ్ బ్లాస్ట్!NationalSwechaa06 Nov 2026, 01:41 PM

ఆధార్ కార్డు పని ఖతం.. మోడీ సర్కార్ మరో బిగ్ బ్లాస్ట్!

పెద్ద నోట్ల రద్దు మాదిరిగా కేంద్రంలోని మోడీ సర్కార్ మరో సంచలన నిర్ణయం తీసుకోనుందా? అంటే అవుననే సమాధానం వినిపిస్తోంది. దేశంలో ఆధార్ వ్యవస్థలో సమూళ మార్పులకు రంగం సిద్దం చేసినట్టు తెలుస్తోంది. ప్రస్తుతం కేంద్రరాష్ట్ర ప్రభుత్వ స్కీమ్స్‌కు లబ్దిదారులను ఆధార్ కార్డు నెంబర్ ఆధారంగా ఎంపిక చేస్తున్నారు. ఆధార్ నెంబర్‌నే అన్ని పథకాలకు అటాచ్ చేయడం, ఈకేవైసీ అనుసంధానం వంటివి జరిగాయి.కానీ,ఇప్పుడు ఆధార్ స్థానంలో ఓటర్ ఐడీని తీసుకురావాలని కేంద్రం యోచిస్తున్నట్టు తెలుస్తోంది. కేంద్ర పంచాయతీరాజ్, మత్స్య, పశుసంవర్ధక శాఖ మంత్రి రాజీవ్ రంజన్ సింగ్ (లలన్ సింగ్) ఇటీవల జరిగిన 'పీపుల్స్ ప్లాన్ క్యాంపెయిన్ 2026-27 'జాతీయ వర్క్‌షాప్‌లో ఈ అంశాన్ని వెల్లడించారు. ఆధార్ కార్డులు సులభంగా అందుబాటులోకి వస్తున్నందున వెరిఫికేషన్ కోసం ఓటర్ ఐడీ నంబర్, బయోమెట్రిక్ ఉపయోగించనున్నట్లు తెలిపారు.

హైదరాబాద్‌లో నీటి కష్టాలు షురూ.. వాటర్ ట్యాంకర్లకు ఫుల్ డిమాండ్!తెలంగాణSwechaa06 Nov 2026, 01:39 PM

హైదరాబాద్‌లో నీటి కష్టాలు షురూ.. వాటర్ ట్యాంకర్లకు ఫుల్ డిమాండ్!

 గ్రేటర్ హైదరాబాద్‌లో నవంబర్ ప్రారంభంలోనే తాగునీటి ఎద్దడి తీవ్ర రూపం దాలుస్తోంది. సాధారణంగా వేసవిలో కనిపించే నీటి ఎద్దడి దృశ్యాలు, ఈసారి చలికాలం ఆరంభంలోనే నగరవాసులను ఆందోళనకు గురిచేస్తున్నాయి. ఈ ఏడాది ఎల్‌నినో (El Niño) ప్రతికూల ప్రభావంతో ఆశించిన స్థాయిలో వర్షాలు కురవకపోవడమే ఈ పరిస్థితికి ప్రధాన కారణం. వర్షాభావం వల్ల నగర పరిధిలోని భూగర్భ జలాలు వేగంగా పడిపోయాయి. పర్యవసానంగా నగరవ్యాప్తంగా బోర్లలో నీళ్లు అడుగంటిపోతున్నాయి.

రేవంత్ బినామీ?.. KLSR కన్‌స్ట్రక్షన్స్‌పై వలస కూలీల ఆగ్రహం!తెలంగాణSwechaa06 Nov 2026, 01:06 PM

రేవంత్ బినామీ?.. KLSR కన్‌స్ట్రక్షన్స్‌పై వలస కూలీల ఆగ్రహం!

సీఎం రేవంత్ రెడ్డి సొంత నియోజకవర్గంలో వలస కూలీలు ఆందోళనకు దిగారు. చేసిన పనికి వేతనం చెల్లించడం లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పండుగ సమయంలో జీతాలు చెల్లించకపోతే ఇంటికి డబ్బులు ఎలా పంపించాలని ఆందోళన చెందుతున్నారు. వికారాబాద్ జిల్లా దుద్యాల మండలం పోలేపల్లిలో నిర్మిస్తున్న ఎడ్యుకేషనల్ హబ్‌లో ఈ వలస కూలీలు పనిచేస్తున్నారు. అయితే, ఆ ప్రాజెక్టు మెయింటెన్ చేస్తున్న KLSR కన్‌స్ట్రక్షన్స్ తమకు కూలి డబ్బులు చెల్లించడం లేదంటూ ఇవాళ ఉదయం నిరసనకు దిగారు. నేడు సీఎం రేవంత్ రెడ్డి కొడంగల్ పర్యటన ఉన్న నేపథ్యంలో ఆయనకు ఫిర్యాదు చేస్తామని కూలీలు చెబుతున్నారు. గత కొంతకాలంగా కేఎల్ఎస్ఆర్ కంపెనీ కూలి డబ్బులు చెల్లించకుండా ఇబ్బందులకు గురిచేస్తోందని యూపీ, బిహార్, జార్ఖండ్ నుంచి వచ్చి పనిచేస్తున్నకూలీలు ఆరోపిస్తున్నారు.

Regina Cassandra: ధర్మ ప్రొడక్షన్స్‌పై రెజీనా ఫైర్..జాన్వీ, రాధికా ఆప్టేలకి కౌంటర్!సినిమాSwechaa06 Nov 2026, 12:45 PM

Regina Cassandra: ధర్మ ప్రొడక్షన్స్‌పై రెజీనా ఫైర్..జాన్వీ, రాధికా ఆప్టేలకి కౌంటర్!

Regina Cassandra: సినిమా ఇండస్ట్రీలో అవకాశాలు రావడం ఎంత ముఖ్యమో.. వచ్చిన అవకాశాల్లో నటీనటులకు సరైన గుర్తింపు, గౌరవం దక్కడం కూడా అంతే ముఖ్యం. తాజాగా హీరోయిన్ రెజీనా కసాండ్రా చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు అటు బాలీవుడ్‌లో ఇటు టాలీవుడ్‌లో చర్చనీయాంశంగా మారాయి. ప్రముఖ బాలీవుడ్ నిర్మాణ సంస్థ ధర్మ ప్రొడక్షన్స్‌పై రెజీనా అసంతృప్తిని వ్యక్తం చేస్తూ, తనను బాధపెట్టిన విషయాలను బయటపెట్టింది.

పోలీసుల అక్రమ నిర్బంధాలకు చెక్.. సుప్రీంకోర్టు చారిత్రాత్మక తీర్పు!NationalSwechaa06 Nov 2026, 12:20 PM

పోలీసుల అక్రమ నిర్బంధాలకు చెక్.. సుప్రీంకోర్టు చారిత్రాత్మక తీర్పు!

పోలీసుల అక్రమ నిర్బంధాలు, అరెస్టుల ప్రక్రియపై భారత అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు అత్యంత కీలకమైన, చారిత్రాత్మకమైన తీర్పును వెలువరించింది. ఒక నేరంలో అనుమానంతో లేదా విచారణ నిమిత్తం ఒక వ్యక్తిని పోలీసులు వాస్తవంగా తమ అదుపులోకి తీసుకున్న (Detained) క్షణం నుంచే 24 గంటల కాలపరిమితి లెక్క ప్రారంభమవుతుందని స్పష్టం చేసింది. రికార్డుల్లో అధికారికంగా అరెస్టు చూపించిన సమయం నుంచి కాకుండా, వ్యక్తి స్వేచ్ఛను హరించిన మొదటి క్షణం నుంచే ఈ సమయం ప్రారంభమవుతుందని తేల్చిచెప్పింది.

ఒకటే బకెట్ వాటర్.. స్నానం చేయొద్దని కండిషన్.. యువతి పోస్టు వైరల్!తెలంగాణSwechaa06 Nov 2026, 12:16 PM

ఒకటే బకెట్ వాటర్.. స్నానం చేయొద్దని కండిషన్.. యువతి పోస్టు వైరల్!

హైదరాబాద్ మహానగరంలో నీటి సమస్య ఎంతలా ఉందో తేల్చి చెప్పే ఉదంతం ఇది. సమ్మర్ రాకముందే హాస్టల్స్, ఇంటి ఓనర్స్ రెంట్‌కు ఉండే వారికి నీళ్లు ఇవ్వకుండా తీవ్ర ఇబ్బందులకు గురిచేస్తున్నారు. గట్టిగా అడిగితే నీళ్లు రాకపోతే మేం ఏం చేయాలి? అంటూ రివర్స్ అవుతున్నారని అద్దెకు ఉంటున్న వారు వాపోతున్నారు. చదువుకునే విద్యార్థులు, ఉద్యోగస్తులు ఈ పరిణామాలతో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నట్టు తెలుస్తోంది. ఎల్‌నినో ప్రభావం కారణంగా రాష్ట్రంలో ఈ ఏడాది వర్షాలు సమృద్ధిగా కురవలేదు. ఫలితంగా నగరంలోని పలు కీలక ప్రాంతాల్లో గ్రౌండ్ వాటర్ అడుగంటిపోయినట్టు జీహెచ్ఎంసీ, జలమండలి అధికారులు చెబుతున్నారు.దీంతో బోర్లలో నీరు లేక కేవలం వాటర్ ట్యాంకర్ల ద్వారా జీవనం గడుపుతున్నారు. నగరంలోని జంట జలాశాయాల్లో ఉన్న నీటిని కేవలం తాగు కోసమే వినియోగిస్తామని ప్రభుత్వం ఇప్పటికే ప్రకటించింది. ఫలితంగా రోజువారీ వినియోగానికి నీరు దొరక్క ప్రజలు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు.

Tollywood: జీరో సైజ్ అంటూ బక్కపలచగా మారుతున్న హీరోయిన్స్..మరీ అసహ్యంగా కనిపిస్తున్నారా?సినిమాSwechaa06 Nov 2026, 12:13 PM

Tollywood: జీరో సైజ్ అంటూ బక్కపలచగా మారుతున్న హీరోయిన్స్..మరీ అసహ్యంగా కనిపిస్తున్నారా?

Tollywood: మన సినిమా ఇండస్ట్రీలో హీరోయిన్లకు అందం ఎంత ముఖ్యమో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ముఖ్యంగా, సిల్వర్ స్క్రీన్ మీద అందంగా కనిపించేందుకు హీరోయిన్లు ఎన్నో జాగ్రత్తలు తీసుకుంటుంటారు. ఫిట్‌నెస్, డైట్, వర్కవుట్స్ అంటూ తమ శరీరాకృతిని ఎప్పటికప్పుడు మార్చుకుంటూ ఉంటారు. ఒకప్పుడు కొంతమంది హీరోయిన్స్ జీరో సైజ్ అంటూ బక్కపలచగా మారారు. దానివల్ల అవకాశాలను కోల్పోయారు.

పసిపాపను కబళించిన చిన్న నిర్లక్ష్యం: బోరున విలపిస్తున్న కుటుంబ సభ్యులు!క్రైమ్Swechaa06 Nov 2026, 11:47 AM

పసిపాపను కబళించిన చిన్న నిర్లక్ష్యం: బోరున విలపిస్తున్న కుటుంబ సభ్యులు!

 తల్లిదండ్రుల చిన్నపాటి నిర్లక్ష్యం, విద్యుత్ పరికరాల పట్ల అవగాహన లోపం పసికందు ప్రాణాలను బలిగొంది. ఇంట్లో చార్జింగ్‌లో ఉన్న ఎలక్ట్రిక్ కాంటాను (వేయింగ్ స్కేల్) పట్టుకోవడంతో తీవ్రమైన విద్యుత్ షాక్‌కు గురై 10 నెలల పసిపాప అక్కడికక్కడే మృతిచెందింది. ఈ హృదయ విదారక ఘటన జగిత్యాల జిల్లా ఎండపల్లి మండలం రాజారాంపల్లి గ్రామంలో చోటుచేసుకుంది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం... ఇంట్లో తల్లిదండ్రులు తమ దైనందిన పనుల్లో నిమగ్నమై ఉన్న సమయంలో, పాప నేలపై ఆడుకుంటూ పాకుతూ వెళ్లి చార్జింగ్ పెట్టి ఉన్న ఎలక్ట్రిక్ కాంటా వైర్లను పట్టుకుంది.

TG : అమెరికాలో నల్లగొండ  యువతి మిస్సింగ్!తెలంగాణSwechaa06 Nov 2026, 11:38 AM

TG : అమెరికాలో నల్లగొండ యువతి మిస్సింగ్!

తెలంగాణ రాష్ట్రానికి చెందిన ఓ యువతి అమెరికాలో కనిపించకుండా పోయింది. ఈ విషయం తెలిసి పేరెంట్స్ కన్నీరుమున్నీరవుతున్నారు. తమ కూతురు ఎక్కడ ఉన్నా కనిపెట్టి ఇవ్వాలని స్థానిక తెలంగాణ ప్రభుత్వాన్నివేడుకుంటున్నారు. వివరాల్లోకివెళితే.. అమెరికాలో నల్గొండ యువతి మిస్సింగ్ అయ్యింది. బోస్టన్‌లో చదువుకుంటున్న జిల్లా యువతి శ్రీజ (23) అకస్మాత్తుగా అదృశ్యం అయ్యింది. ఉన్నత చదువుల కోసం ఏడాది కిందట శ్రీజ అమెరికాకు వెళ్లినట్టు తెలిసింది. చదువుకుంటూనే అక్కడ పార్ట్‌టైం ఉద్యోగం చేస్తున్నట్టు సమాచారం. నవంబర్ 2న సాయంత్రం వాకింగ్‌కు వెళ్లిన యువతి.. మరల తిరిగి తన స్టేయింగ్ రూంకు రాలేదు. ఆమె స్నేహితుల ఫిర్యాదుతో రంగంలోకి దిగిన అమెరికా పోలీసులు.. గాలింపు చర్యలు చేపట్టారు. సమీపంలోని బీచ్ ప్రాంతంలో సెల్‌ఫోన్ లొకేషన్‌ను గుర్తించినట్టు సమాచారం.ఇప్పటికీ శ్రీజ ఆచూకీ లభించలేదని తెలిసింది.

డెమోక్రాట్ల విజయం..  ట్రంప్‌ను అధ్యక్ష పదవి నుంచి దించేస్తారా?InternationalSwechaa06 Nov 2026, 11:27 AM

డెమోక్రాట్ల విజయం.. ట్రంప్‌ను అధ్యక్ష పదవి నుంచి దించేస్తారా?

అమెరికాలో ఇటీవల జరిగిన మిడ్‌టర్మ్ ఎన్నికల్లో ప్రతినిధుల సభ (హౌస్ ఆఫ్ రిప్రజెంటేటివ్స్), సెనేట్ స్థానాల్లో డెమోక్రాటిక్ పార్టీ అఖండ విజయం సాధించడంతో అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌ రాజకీయ భవిష్యత్తుపై దేశవ్యాప్తంగా తీవ్ర చర్చ జరుగుతోంది. ఇన్నాళ్లూ తన మాటే శాసనంగా చెలరేగిన ట్రంప్‌నకు ఈ ఎన్నికల ఫలితాలు గట్టి ఎదురుదెబ్బగా మారింది. అయితే ఈ ఓటమి ట్రంప్‌ను అమెరికా అధ్యక్ష పదవి నుంచి దించేస్తుందా? అనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి. అయితే కేవలం ఎన్నికల్లో గెలిచినంత మాత్రాన ఆయనను అధ్యక్ష పీఠం నుంచి వెంటనే సాగనంపడం రాజ్యాంగపరంగా అంత సులభమైన విషయం కాదని రాజకీయ విశ్లేషకులు స్పష్టం చేస్తున్నారు.

South Cinema: తెలుగులో ‘సీన్’, ‘మహాశక్తి’ సినిమాలకు కనిపించని క్రేజ్!సినిమాSwechaa06 Nov 2026, 11:27 AM

South Cinema: తెలుగులో ‘సీన్’, ‘మహాశక్తి’ సినిమాలకు కనిపించని క్రేజ్!

South Cinema: తెలుగు సినిమా ప్రేక్షకులు ఎప్పుడూ స్టార్ హీరోల సినిమాలకే ప్రాధాన్యత ఇస్తారని అనుకోవడం పొరపాటే. కంటెంట్ ఆసక్తికరంగా ఉంటే, కొత్తదనం కనిపిస్తే చిన్న సినిమాలపైనా, తమిళ, మయాళ, కన్నడ డబ్బింగ్ సినిమాలపైనా ప్రేక్షకులు ప్రత్యేకమైన ఆసక్తి చూపిస్తారు. ఇప్పుడు ‘సీన్’, ‘మహాశక్తి’ సినిమాల విషయంలోనూ ఇదే తరహా చర్చ కనిపిస్తోంది.

దీపావళి కానుక.. ఆర్టీసీ, మెట్రో కామన్ పాస్ ధరలు భారీగా తగ్గింపు!తెలంగాణSwechaa06 Nov 2026, 11:18 AM

దీపావళి కానుక.. ఆర్టీసీ, మెట్రో కామన్ పాస్ ధరలు భారీగా తగ్గింపు!

 హైదరాబాద్‌లోని రోజూవారీ ప్రయాణికుల రవాణా భారాన్ని తగ్గించే లక్ష్యంతో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం సరికొత్త నిర్ణయం తీసుకుంది. నగరంలో ఆర్టీసీ (TGSRTC) బస్సులు, హైదరాబాద్ మెట్రో రైళ్లలో ఉమ్మడిగా ప్రయాణించేందుకు వీలుగా తీసుకొచ్చిన 'ఆర్టీసీ-మెట్రో కామన్ పాస్' (RTC-Metro Common Pass) ధరలను ప్రభుత్వం భారీగా కుదించింది. గతంలో నిర్ణయించిన పాస్ ధరలు సామాన్య, మధ్యతరగతి ఉద్యోగులకు ఆర్థికంగా భారంగా మారాయన్న విమర్శలు, ప్రజా విజ్ఞప్తులపై సీఎం రేవంత్ రెడ్డి తక్షణమే స్పందించారు.

తెలంగాణ నీటి కష్టాలకు కారణం ఎవరు? బీఆర్ఎస్ వర్సెస్ కాంగ్రెస్.. కాళేశ్వరం అసలు కథేంటి..?తెలంగాణSwechaa06 Nov 2026, 11:06 AM

తెలంగాణ నీటి కష్టాలకు కారణం ఎవరు? బీఆర్ఎస్ వర్సెస్ కాంగ్రెస్.. కాళేశ్వరం అసలు కథేంటి..?

కాళేశ్వరం నిర్మించిన అప్పటి బీఆర్ఎస్ ప్రభుత్వానిది తప్పా..? లేక ఆ నీటిని పొలాలకు పారించలేకపోతున్న కాంగ్రెస్ సర్కారుది తప్పా..? ఇదే ఇప్పడు తెలంగాణ ప్రజల ముందున్న బిగ్ క్వశ్చన్. తెలంగాణలో నీటి సంక్షోభం రాజకీయ యుద్ధానికి దారితీస్తోంది. అసలు కాళేశ్వరం ప్రాజెక్టులో ఏం జరిగింది?

Tollywood: మహాకాళితో మరో డివోషనల్ మూవీ..రామాయణకి పోటీ!సినిమాSwechaa06 Nov 2026, 10:25 AM

Tollywood: మహాకాళితో మరో డివోషనల్ మూవీ..రామాయణకి పోటీ!

Tollywood: దర్శకుడు ప్రశాంత్ వర్మ సినిమాటిక్ యూనివర్స్ (PVCU) నుంచి వస్తున్న మరో ప్రతిష్టాత్మకమైన సినిమా మహాకాళి. భూమి శెట్టి, అక్షయ్ ఖన్నా, శ్రియా రెడ్డి, రోహిత్ సరాఫ్ కీలక పాత్రల్లో నటిస్తున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే, ఈ సినిమాపై ప్రేక్షకుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. ముఖ్యంగా, మూవీ నుంచి వచ్చిన నటీనటుల ఫస్ట్ లుక్, గ్లింప్స్‌తో సినిమాపై అంచనాలను తారా స్థాయిలో ఉంచాయి. తాజాగా, మహాకాళి సినిమా జర్నీ స్టార్ట్ అయింది.

ఏఐ ఎఫెక్ట్.. స్మార్ట్‌ఫోన్ల ధరలు పైపైకి.. సామాన్యులపై పెనుభారం!వ్యాపారంSwechaa06 Nov 2026, 10:20 AM

ఏఐ ఎఫెక్ట్.. స్మార్ట్‌ఫోన్ల ధరలు పైపైకి.. సామాన్యులపై పెనుభారం!

ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) సాంకేతికత విశ్వవ్యాప్తంగా విస్తరిస్తున్న కొద్దీ దాని ప్రభావం ప్రతికూలంగా సామాన్య స్మార్ట్‌ఫోన్ వినియోగదారుల జేబులపై పడనుంది. గ్లోబల్ రీసెర్చ్, ఇన్వెస్ట్‌మెంట్ సంస్థ 'జెఫరీస్' (Jefferies) విడుదల చేసిన తాజా నివేదిక ప్రకారం, రాబోయే రోజుల్లో కొత్తగా లభించే బడ్జెట్ ఆండ్రాయిడ్ స్మార్ట్‌ఫోన్ల ధరలు ఏకంగా 30శాతం వరకు పెరగనున్నాయి. జెమిని, చాట్‌జీపీటీ వంటి ఏఐ మోడళ్లను నడిపించేందుకు టెక్ దిగ్గజాలు పెద్ద ఎత్తున డేటా సెంటర్లను నిర్మిస్తుండటం, ఫలితంగా మెమరీ చిప్‌లకు (DRAM & NAND Flash) భారీ కొరత ఏర్పడటమే దీనికి ప్రధాన కారణమని విశ్లేషకులు స్పష్టం చేస్తున్నారు.

మామ జైపాల్ రెడ్డి పేరిట కొత్త జిల్లా.. సీఎం కీలక నిర్ణయం!తెలంగాణSwechaa06 Nov 2026, 10:15 AM

మామ జైపాల్ రెడ్డి పేరిట కొత్త జిల్లా.. సీఎం కీలక నిర్ణయం!

రాష్ట్రంలో మరో కొత్త జిల్లా రాబోతుందంటూ వార్త వైరల్ అవుతోంది. ఇప్పటికే తెలంగాణలో 33 జిల్లాలు ఉండగా మరో జిల్లా వస్తుందని తెలుస్తోంది. గత కేసీఆర్ ప్రభుత్వం తెలంగాణలోని ఉమ్మడి 10 జిల్లాలను విడతల వారీగా 33 జిల్లాలుగా తీర్చిదిద్దిన విషయం తెలిసిందే. పరిపాలన సౌలభ్యం, వేగవంతమైన అభివృద్ధి జరుగుతుందని పేర్కొంటూ జిల్లాలను విభజించారు. ఇప్పటికే కొన్ని జిల్లాలకు సమీకృత కలెక్టరేట్ భవనాల నిర్మాణం కూడా జరిగింది. తాజాగా సీఎం రేవంత్ రెడ్డి మరో జిల్లాలను ఏర్పాటు చేయాలని భావిస్తున్నట్టు కథనాలు వస్తున్నాయి. అయితే, కొత్తగా ఏర్పాటు చేయబోయే జిల్లాకు తన మామ జైపాల్ రెడ్డి పేరు పెడతారని టాక్ వినిపిస్తోంది. తన భార్య కోరిక మేరకు కొత్తగా నిర్మించబోయే ఫ్యూచర్ సిటీలో ఈ జిల్లా ఏర్పాటు కానుందని సమాచారం. ఫ్యూచర్ సిటీ కేంద్రంగా కొత్త జిల్లా ఏర్పాటుకు ఇప్పటికే రంగం సిద్ధం అయ్యిందని కూడా ప్రచారం జరుగుతోంది.

Varanasi: వారణాసి కోసం రాజమౌళి ఎప్పుడు ఇలా చేయలేదు!సినిమాSwechaa06 Nov 2026, 10:02 AM

Varanasi: వారణాసి కోసం రాజమౌళి ఎప్పుడు ఇలా చేయలేదు!

Varanasi: మన టాలీవుడ్ దర్శకుడు ఎస్‌.ఎస్‌. రాజమౌళి, సూపర్‌స్టార్ మహేష్ బాబు కాంబినేషన్‌లో రూపొందుతోన్న భారీ మైథలాజికల్ యాక్షన్ అడ్వెంచర్ ‘వారణాసి’. ఈ సినిమా కోసం రాజమౌళి గతంలో ఏ పాన్ ఇండియా సినిమాకి చేయని ప్లాన్స్ చేస్తున్నారు. నిజంగా, ఇది కేవలం ఒక్క రాజమౌళికి మాత్రమే సాధ్యమయ్యే విషయమని చెప్పాలి. డిజిటల్ రైట్స్ రూపంలోనే సగం బడ్జెట్ రికవరీ చేయాలని గట్టి ప్రయత్నాలు చేస్తున్నారు రాజమౌళి.

'ప్రళయ్' క్షిపణి ప్రయోగం విజయవంతం.. ఒడిశా తీరంలో స్వదేశీ రక్షణ సామర్థ్యాలకు సరికొత్త మైలురాయి!NationalSwechaa06 Nov 2026, 09:47 AM

'ప్రళయ్' క్షిపణి ప్రయోగం విజయవంతం.. ఒడిశా తీరంలో స్వదేశీ రక్షణ సామర్థ్యాలకు సరికొత్త మైలురాయి!

 భారత రక్షణ పరిశోధన, అభివృద్ధి సంస్థ (DRDO) స్వదేశీ సాంకేతికతతో అభివృద్ధి చేసిన 'ప్రళయ్' (Pralay) క్షిపణి ప్రయోగాన్ని విజయవంతంగా నిర్వహించింది. ఒడిశా తీరంలోని డాక్టర్ ఏపీజే అబ్దుల్ కలామ్ ద్వీపం వద్ద నిర్వహించిన ఈ వినియోగదారుల మూల్యాంకన పరీక్షల్లో (User Evaluation Trials) క్షిపణి నిర్దేశించిన అన్ని లక్ష్యాలను కచ్చితత్వంతో ఛేదించింది. ఈ ప్రయోగం పూర్తి విజయవంతమైనట్లు కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ సామాజిక మాధ్యమ వేదిక 'ఎక్స్' (X) ద్వారా వెల్లడించారు.

నేటి పంచాంగం - 06 నవంబర్ 2026 | కార్తిక కృష్ణ ద్వాదశి (గోవత్స ద్వాదశి)SpiritualitySwechaa06 Nov 2026, 08:48 AM

నేటి పంచాంగం - 06 నవంబర్ 2026 | కార్తిక కృష్ణ ద్వాదశి (గోవత్స ద్వాదశి)

వివరాలు:

  • తేదీ: 06 నవంబరు 2026, శుక్రవారం

  • సంవత్సరం: శ్రీ పరాభవ నామ సంవత్సరం

  • అయనం & ఋతువు: దక్షిణాయనం, శరత్ఋతువు

  • మాసం & పక్షం: కార్తిక మాసం, కృష్ణ పక్షం

  • తిథి: ద్వాదశి (రాత్రి 01:42 వరకు, తదుపరి త్రయోదశి)

  • వారం: శుక్రవారం (భార్గవవాసరే)

  • నక్షత్రం: హస్త (సాయంత్రం 06:48 వరకు, తదుపరి చిత్త)

  • యోగం: విష్కంభ (మధ్యాహ్నం 02:45 వరకు, తదుపరి ప్రీతి)

  • కరణం: కౌలవ (మధ్యాహ్నం 02:28 వరకు), తదుపరి తైతుల (రాత్రి 01:42 వరకు)

శుభ / అశుభ సమయాలు:

  • రాహుకాలం: ఉదయం 10:30 - 12:00 వరకు

  • యమగండం: మధ్యాహ్నం 03:00 - 04:30 వరకు

  • అమృతకాలం: ఉదయం 11:38 - మధ్యాహ్నం 01:12 వరకు

  • దుర్ముహూర్తము: ఉదయం 08:33 - 09:19 వరకు మరియు మధ్యాహ్నం 12:22 - 01:08 వరకు

  • వర్జ్యం: తెల్లవారుజామున 03:15 - 04:48 వరకు

గ్రహస్థితులు:

  • సూర్యరాశి: తుల

  • చంద్రరాశి: కన్య

  • సూర్యోదయం: ఉదయం 06:21

  • సూర్యాస్తమయం: సాయంత్రం 05:38

వ్యాపారులు వర్సెస్ కాంగ్రెస్! దేశ రాజకీయాల్లో సరికొత్త వివాదంNationalSwechaa06 Nov 2026, 12:08 AM

వ్యాపారులు వర్సెస్ కాంగ్రెస్! దేశ రాజకీయాల్లో సరికొత్త వివాదం

సర్ కు వ్యతిరేకంగా ఓ వైపు కాంగ్రెస్ నిరసనలు.. మరోవైపు బీజేపీ ఎదురుదాడి. దేశాన్ని షేక్ చేస్తున్న ఈ పోరాటంలోకి తాజాగా మరో గ్రూప్ చేరింది. అదే అఖిల భారత వ్యాపారుల సమాఖ్య (CAIT). తాజాగా ఈ సంఘం తీసుకున్న ఓ నిర్ణయం దేశవ్యాప్తంగా సంచలనంగా మారింది. అసలేంటా నిర్ణయం..?

Instagram Reels Job Offer: ఇన్‌స్టా రీల్స్ చూస్తే నెల నెలా జీతం.. దిమ్మతిరిగే ఆఫర్.. కానీ!వైరల్ న్యూస్Swechaa05 Nov 2026, 10:19 PM

Instagram Reels Job Offer: ఇన్‌స్టా రీల్స్ చూస్తే నెల నెలా జీతం.. దిమ్మతిరిగే ఆఫర్.. కానీ!

Instagram Reels Job Offer: పొద్దున లేచింది మొదలు పడుకునే వరకు స్మార్ట్‌ఫోన్‌లో ఇన్‌స్టాగ్రామ్ రీల్స్ స్క్రోల్ చేయడమే మీ పనా? ఇంట్లో వాళ్లు “రోజంతా ఆ ఫోన్ పట్టుకుని కూర్చుంటే పైసలేమైనా రాలుతాయా?” అని తిడుతున్నారా? అయితే మీలాంటి సోషల్ మీడియా పిచ్చి ఉన్నవారి కోసమే కళ్లు చెదిరే ఉద్యోగావకాశం మార్కెట్లోకి వచ్చింది. రోజంతా హాయిగా కూర్చుని ఇన్‌స్టాగ్రామ్ రీల్స్ చూస్తూ ఎంజాయ్ చేస్తే చాలు.. నెలనెలా మీ అకౌంట్‌లో జీతం పడిపోతుంది. దీపావళి వేళ ఒక కంపెనీ ఇచ్చిన ఈ జాబ్ ఆఫర్ విని నెటిజన్లు ఆనందంతో ఎగిరిపడుతున్నారు. కానీ, ఈ సూపర్ ఆఫర్ వెనుక కంపెనీ పెట్టిన ఒక చిన్న ట్విస్ట్ తెలిస్తే మాత్రం షాక్ అవ్వాల్సిందే.

TG: టూరిస్ట్‌ స్పాట్లు, ఎడ్యుకేషన్ ప్రతిబింబించాలి.. ‘గ్లోబల్ సమ్మిట్’పై సీఎం రేవంత్ కీలక ఆదేశాలుతెలంగాణSwechaa05 Nov 2026, 10:12 PM

TG: టూరిస్ట్‌ స్పాట్లు, ఎడ్యుకేషన్ ప్రతిబింబించాలి.. ‘గ్లోబల్ సమ్మిట్’పై సీఎం రేవంత్ కీలక ఆదేశాలు

TG: టూరిస్ట్‌ స్పాట్లు, ఎడ్యుకేషన్‌ ప్రతిబింబించాలి.. గ్లోబల్‌ సమ్మిట్‌పై సీఎం రేవంత్ ఆదేశాలుతెలంగాణ ఖ్యాతిని ప్రపంచ పటంలో సగర్వంగా నిలబెట్టేలా ప్రతిష్టాత్మక ‘ఇన్వెస్ట్ తెలంగాణ గ్లోబల్ సమ్మిట్’ను నిర్వహించాలని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి అధికార యంత్రాంగానికి స్పష్టమైన దిశానిర్దేశం చేశారు. రాష్ట్రంలో పెట్టుబడుల ఆకర్షణతో పాటు ఇక్కడి చారిత్రక, పర్యాటక సంపదను, విద్యారంగంలో సాధిస్తున్న విప్లవాత్మక మార్పులను అంతర్జాతీయ వేదికపై ఘనంగా ఆవిష్కరించాలని ఆదేశించారు. సచివాలయంలో సీఎం అధ్యక్షతన జరిగిన మంత్రివర్గ సమావేశంలో డిసెంబర్ 7, 8, 9 తేదీల్లో ఫ్యూచర్ సిటీ వేదికగా అట్టహాసంగా జరగనున్న గ్లోబల్ సదస్సు ఏర్పాట్లపై కూలంకషంగా చర్చించి కీలక నిర్ణయాలు తీసుకున్నారు.