స్వేచ్ఛ షార్ట్స్ — తాజా తెలుగు వార్తలు

Karti 30: తమిళంలో మీనూకి క్రేజీ ఆఫర్!సినిమాSwechaa11 Aug 2026, 04:09 PM

Karti 30: తమిళంలో మీనూకి క్రేజీ ఆఫర్!

Karti 30: తమిళ హీరో కార్తి నటిస్తున్న తన 30వ సినిమాలో సోలో హీరోయిన్‌గా మీనాక్షి ఎంపికైంది. ఇది గనక హిట్ అయితే, అక్కడ గుడి కట్టేయడం ఖాయం. తెలుగులో మీనాక్షికి మరో క్రేజీ ఆఫర్స్ వచ్చినట్టు, తాజాగా ఫిల్మ్ సర్కిల్స్‌లో వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. మెగాస్టార్ చిరంజీవి, బాబి కాంబోలో రూపొందుతున్న మెగా 158లో మీనాక్షి ఓ ఇంపార్టెంట్ రోల్ చేయడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చిందట. చిరంజీవి సినిమా అంటే గ్యారెంటీగా మీనాక్షికి మచి రోల్ పడుతుంది. కాబట్టి, మెగా 158 కూడా కన్‌ఫర్మ్ అయితే, అటు తమిళ సినిమా, ఇటు తెలుగులో రెండు సినిమాలతో అలరించడానికి మీనూ రెడీ అవుతున్నట్టే.

మహిళలకు పెళ్లి ఓ ట్రామా.. మాజీ ఐపీఎస్ కిరణ్ బేడీ సంచలన వ్యాఖ్యలు!NationalSwechaa11 Aug 2026, 03:57 PM

మహిళలకు పెళ్లి ఓ ట్రామా.. మాజీ ఐపీఎస్ కిరణ్ బేడీ సంచలన వ్యాఖ్యలు!

భారతీయ వివాహ వ్యవస్థలో మహిళలు ఎదుర్కొంటున్న మానసిక ఒత్తిళ్లు, సామాజిక అంచనాలపై పుదుచ్చేరి మాజీ లెఫ్టినెంట్ గవర్నర్, రిటైర్డ్ ఐపీఎస్ అధికారిణి డాక్టర్ కిరణ్ బేడీ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇటీవల ఒక పాడ్‌కాస్ట్ సంభాషణలో పాల్గొన్న ఆమె... పెళ్లి అనేది మహిళల జీవితంలో కేవలం ఒక సంబరం కాదని, అదొక పెద్ద మానసిక వేదన అని పేర్కొన్నారు. పైకి కంటికి ఇంపుగా, కోలాహలంగా కనిపించే వేడుకల వెనుక... ఏళ్లుగా పెరిగిన సొంత ఇంటిని, కన్నవారిని వదిలి గుర్తుతెలియని కొత్త వాతావరణంలోకి అడుగుపెట్టే సమయంలో స్త్రీలు పొందే భావోద్వేగ సంఘర్షణ చాలా తీవ్రంగా ఉంటుందని ఆమె వ్యాఖ్యానించారు. అత్తవారింటికి కోడలిగా వెళ్లిన మరుక్షణమే ఆ మహిళపై సమాజం అపరిమితమైన నిబంధనలు, అంచనాలను రుద్దుతుందని కిరణ్ బేడీ ఆవేదన వ్యక్తం చేశారు.

మెగా బర్త్ డే గిఫ్ట్ ‘ముఠా మేస్త్రి’ మళ్ళీ వస్తున్నాడు..సినిమాSwechaa11 Aug 2026, 03:52 PM

మెగా బర్త్ డే గిఫ్ట్ ‘ముఠా మేస్త్రి’ మళ్ళీ వస్తున్నాడు..

Chiranjeevi: మెగాస్టార్ చిరంజీవి నటించిన సినిమాలలో ‘ముఠా మేస్త్రి’ చిత్రానికి చాలా ప్రత్యేకత ఉంది. ఆయన రాజకీయాలలోకి వస్తారనే విషయాన్ని ఇలాంటి సినిమాల ద్వారానే ముందుగా ప్రేక్షకుల్లోకి, అభిమానుల్లోకి చొప్పించారు. ఈ సినిమాలో చిరంజీవి పర్ఫార్మెన్స్ ప్రతీ ఒక్కరినీ ఆకట్టుకుంది. మాస్ ఫాలోయింగ్ ఉన్న హీరోలలో మెగాస్టార్ రేంజ్ వే

Polymer Banknotes: ప్లాస్టిక్ కరెన్సీ నోట్లకు కేంద్రం ఆమోదం.. తొలుత 100 కోట్లు విడుదలNationalSwechaa11 Aug 2026, 03:49 PM

Polymer Banknotes: ప్లాస్టిక్ కరెన్సీ నోట్లకు కేంద్రం ఆమోదం.. తొలుత 100 కోట్లు విడుదల

Polymer Banknotes: దేశంలో ప్లాస్టిక్/పాలిమర్ కరెన్సీ నోట్లు తీసుకొచ్చే అంశానికి సంబంధించి కేంద్రం కీలక నిర్ణయం తీసుకుంది. ప్లాస్టిక్ నోట్లు ప్రవేశపెట్టేందుకు కేంద్రం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా చేసిన ప్రతిపాదన మేరకు ప్లాస్టిక్ నోట్ల ముద్రణకు ఆమోదం తెలిపింది. తొలుత ప్రయోగాత్మక పరిశీలన కోసం అత్యధికంగా చెలామణిలో ఉన్న, తక్కువ విలువ కలిగిన 10 రూపాయలు, 20 రూపాయల నోట్ల ముద్రణకు కేంద్రం ఓకే చెప్పింది.

Supremcourt : బెంగాల్లో భారీగా ఓట్లు డిలీట్.. సుప్రీంకోర్టు కీలక ఆదేశాలు!NationalSwechaa11 Aug 2026, 02:43 PM

Supremcourt : బెంగాల్లో భారీగా ఓట్లు డిలీట్.. సుప్రీంకోర్టు కీలక ఆదేశాలు!

పశ్చిమ బెంగాల్లో ఇటీవల నిర్వహించిన ఓటరు జాబితా సమగ్ర సవరణ (SIR)పై దాఖలైన పిటిషన్లపై విచారణ జరిపిన సుప్రీంకోర్టు తాజాగా కీలక ఆదేశాలు జారీచేసింది. ఈ ప్రక్రియలో ఓటరు జాబితా నుంచి పేర్లు తొలగించబడిన వ్యక్తులు దాఖలు చేసిన అప్పీళ్ల పరిష్కారంపై స్పందించిన సుప్రీంకోర్టు.. విచారణ సందర్భంగా ఎవరైతే పిటిషన్లు దాఖలు చేశారో వారి వివరాలు ఇవ్వాలని కేంద్ర ఎన్నికల సంఘం (ECI)ను న్యాయస్థానం కోరింది. చీఫ్ జస్టిస్ సూర్యకాంత్ నేతృత్వంలోని ధర్మాసనం దీనిపై విచారణ జరిపింది. ఓటర్ల తొలగింపుపై వచ్చిన ఫిర్యాదులు, అప్పీళ్లను ఎంతమేర పరిష్కరించారో స్పష్టమైన సమాచారాన్ని నివేదిక రూపంలో కోర్టుకు సమర్పించాలని ఎన్నికల సంఘాన్ని ఆదేశించింది.

తెలంగాణలో 73 లక్షల ఓట్లు డిలీట్.. ఈసీ అధికారిక ప్రకటన!తెలంగాణSwechaa11 Aug 2026, 02:23 PM

తెలంగాణలో 73 లక్షల ఓట్లు డిలీట్.. ఈసీ అధికారిక ప్రకటన!

ఓటరు జాబితా సమగ్ర సవరణ(ఎస్ఐఆర్) ప్రక్రియ రాష్ట్రంలో ఎట్టకేలకు పూర్తయ్యింది. రెండు నెలలకు పైగా ఈ ప్రక్రియ కొనసాగింది. ఎన్యూమరేషన్ ఫారమ్స్ అందజేయడంలో బీఎల్‌వోలు నిర్లక్ష్యం వహించడం, ఫారమ్స్ అందలేదని పలు ఫిర్యాదులు అందడంతో ఎన్నికల సంఘం రెండు సార్లు గడువు పొడగించగా.. నిన్నటితో తుది గడువు ముగిసింది.అయినప్పటికీ రాష్ట్రంలోని పలు జిల్లాల్లో ఎన్యూమరేషన్ ఫారమ్స్ చాలా చోట్ల అందలేదని ఓటర్లు, తీసుకున్న వారు వివరాలు సరిగా నింపలేదని బీఎల్‌వోలు ఆరోపిస్తున్నారు.హైదరాబాద్ మహానగరంలోనూ చాలా చోట్ల ఎన్యూమరేషన్ ఫారమ్స్ తమకు అందలేదని ఫిర్యాదులు ఎన్నికల సంఘానికి అందాయి. ఇక ఫారమ్స్ అందుకున్న వారు తిరిగి బీఎల్‌వోలకు అందజేయలేదని ప్రచారం జరుగుతోంది.ఈ క్రమంలోనే ఎస్ఐఆర్‌ ప్రక్రియ పూర్తయినట్టు అధికారిక లెక్కలను ఎన్నికల సంఘం ప్రకటించింది.దీని ప్రకారం రాష్ట్రంలో సుమారు 73 లక్షలకు పైగా ఓట్లు గల్లంతు అయ్యాయి.

నీట్ పై తమిళనాడు తీర్మానం.. మిగతా రాష్ట్రాలదీ అదే దారా..?NationalSwechaa11 Aug 2026, 02:04 PM

నీట్ పై తమిళనాడు తీర్మానం.. మిగతా రాష్ట్రాలదీ అదే దారా..?

NEET కారణంగా స్కూల్ చదువు కంటే కోచింగ్‌కు ప్రాధాన్యం పెరుగుతోందని తమిళనాడు ప్రభుత్వం ఆరోపిస్తోంది. భారీ ఫీజులు వసూలు చేసే కోచింగ్ సెంటర్లు పెరగడంతో ఆర్థికంగా బలమైన కుటుంబాల పిల్లలకు ఎక్కువ అవకాశాలు లభిస్తున్నాయని, 12 ఏళ్ల స్కూల్ విద్య తర్వాత ఒకే పరీక్ష విద్యార్థి భవిష్యత్తును నిర్ణయించడం సరైన విధానం కాదని..

Operation Alert: స్వాతంత్ర్య దినోత్సవం వేళ ఐఎస్ఐ విధ్వంస కుట్ర.. సరిహద్దుల్లో 'ఆపరేషన్ అలర్ట్'!NationalSwechaa11 Aug 2026, 01:54 PM

Operation Alert: స్వాతంత్ర్య దినోత్సవం వేళ ఐఎస్ఐ విధ్వంస కుట్ర.. సరిహద్దుల్లో 'ఆపరేషన్ అలర్ట్'!

ఆగస్టు 15 స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల వేళ దేశంలో అలజడి సృష్టించేందుకు పాకిస్థాన్ గూఢచార సంస్థ ఐఎస్ఐ (ISI) కుట్ర పన్నినట్లు నిఘా వర్గాలు హెచ్చరించాయి. వేడుకల సందర్భంగా భద్రతా బలగాల దృష్టి ప్రధాన నగరాలపై ఉన్న సమయాన్ని ఆసరాగా చేసుకుని, సరిహద్దులగుండా ఉగ్రవాదులను చొరబెట్టేందుకు యత్నిస్తున్నట్లు ఇంటెలిజెన్స్ బ్యూరో (IB) పక్

ప్రేమపెళ్లికి  గ్రీన్‌సిగ్నల్.. కాలువలో దూకి ప్రేమికుల ఆత్మహత్యాయత్నంఏపీSwechaa11 Aug 2026, 01:51 PM

ప్రేమపెళ్లికి గ్రీన్‌సిగ్నల్.. కాలువలో దూకి ప్రేమికుల ఆత్మహత్యాయత్నం

సాధారణంగా ప్రేమ పెళ్లికి పెద్దలు అంగీకరంచలేదని ప్రేమికులు ఆత్మహత్యయత్నం చేయడం కామన్. చాలా సందర్భాల్లో ఇలాంటి ఘటనలు చోటుచేసుకున్నాయి. కానీ, ప్రేమ పెళ్లికి పెద్దలు అంగీకరించినా లవర్స్ ఆత్మహత్యాయత్నం చేశారు. ఈ ఘటనలో అమ్మాయి మృతి చెందగా.. అబ్బాయి ప్రాణాలతో బయటపడ్డాడు. ఈ విషాదకర ఘటన ఏపీలోని పశ్చిమగోదావరి జిల్లాలో వెలుగుచూసింది. వివరాల్లోకివెళితే.. ఏపీలోని పశ్చిమగోదావరి పాలకోడేరు మండలం కుముదవల్లికి చెందిన సందీప్ కుమార్ (22) భీమవరంకు చెందిన లలితాంబికలుగా(20)లు ప్రేమించుకున్నారు. వివాహాం చేసుకోవాలని నిశ్చయించుకున్నారు. ఇదే విషయాన్ని సందీప్ వారి ఇంట్లో చెప్పగా.. పెద్దలు అంగీకరించారు. అమ్మాయికి పేరెంట్స్ లేకపోవడంతో తన పెద్దమ్మ వద్దే పెరుగుతోంది. ఆమె సైతం వీరి పెళ్లికి అంగీకరించింది.

Vishal: విజయ్ పాలిటిక్స్‌లో సక్సెస్ అవ్వడానికి కారణం అదే.. విశాల్ ఆసక్తికర వ్యాఖ్యలు!రాజకీయాలుSwechaa11 Aug 2026, 01:33 PM

Vishal: విజయ్ పాలిటిక్స్‌లో సక్సెస్ అవ్వడానికి కారణం అదే.. విశాల్ ఆసక్తికర వ్యాఖ్యలు!

తమిళనాడు ముఖ్యమంత్రి, సూపర్‌స్టార్ విజయ్ రాజకీయాల్లో సాధించిన అపూర్వ విజయంపై ప్రముఖ నటుడు విశాల్ పలు ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు. గతంలో అనేకమంది సినీ ప్రముఖులు రాజకీయాల్లోకి వచ్చి విఫలమైనప్పటికీ, విజయ్ మాత్రం తక్కువ సమయంలోనే సీఎం పీఠాన్ని ఎలా అధిరోహించగలిగారనే దానిపై ఓ ఇంటర్వ్యూలో తన అభిప్రాయాలను స్పష్టంగా పంచుకున్నారు. సినిమా నటులందరూ రాజకీయాల్లో రాణించలేరని పేర్కొన్న విశాల్... గతంలో శివాజీ గణేశన్, కే భాగ్యరాజ్ వంటి దిగ్గజ నటులు సొంత పార్టీలు పెట్టినా విజయం సాధించలేకపోయారని గుర్తుచేశారు.

YouTube : కంటెంట్ క్రియెటర్ల ఆదాయానికి గండి.. షాకిచ్చిన యూట్యూబ్!వ్యాపారంSwechaa11 Aug 2026, 01:20 PM

YouTube : కంటెంట్ క్రియెటర్ల ఆదాయానికి గండి.. షాకిచ్చిన యూట్యూబ్!

కంటెంట్ క్రియేటర్లకు యూట్యూబ్ షాక్ ఇచ్చింది.ఓ చానెల్ క్రియేట్ చేసి వివిధ రకాల కంటెంట్ చేస్తూ డబ్బులు సంపాదించాలనుకునే వారికి యూట్యూబ్ బిగ్‌షాక్ ఇచ్చింది. యూట్యూబ్ పార్ట్‌నర్ ప్రోగ్రామ్ (YPP) రూల్స్‌ను కఠినతరం చేస్తూ కొత్తగా మార్గదర్శకాలను విడుదల చేసింది. 2018 తర్వాత నిబంధనలు మార్చడం ఇదే తొలిసారి. ప్రతిరోజూ యూట్యూబ్‌ షార్ట్స్ వ్యూస్ 200 బిలియన్లు దాటడం, టీవీల్లో వ్యూస్ సమయం బిలియన్ గంటలకు పైగా పెరుగుతుండటంతో ఈ నిర్ణయం తీసుకుంటున్నట్టు సంస్థ ప్రకటించడం గమనార్హం.

Cm Vijay : ‘నీట్, ఎఫ్‌సీఆర్‌ఏ’కు వ్యతిరేకం.. విజయ్ సర్కార్ సంచలన నిర్ణయంNationalSwechaa11 Aug 2026, 01:03 PM

Cm Vijay : ‘నీట్, ఎఫ్‌సీఆర్‌ఏ’కు వ్యతిరేకం.. విజయ్ సర్కార్ సంచలన నిర్ణయం

తమిళనాడు సీఎం విజయ్ సంచలన నిర్ణయం తీసుకున్నారు. నీట్, ఎఫ్‌సీఆర్‌ఏ సవరణ బిల్లు-2026కు వ్యతిరేకంగా రాష్ట్ర అసెంబ్లీలో తీర్మాణం ప్రవేశపెట్టగా ఆమోదం లభించింది. ప్రతిపక్ష డీఎంకే సైతం మద్దతు తెలిపింది.'నీట్' విధానం వద్దని, 12వ తరగతి (ఇంటర్మీడియట్) మార్కుల ఆధారంగానే వైద్య విద్య కోర్సుల్లో ప్రవేశాలు కల్పించాలని విజయ్ ప్రభుత్వం డిమాండ్ చేసింది. నీట్ వలన గ్రామీణ, ఆర్థికంగా వెనుకబడిన పేద విద్యార్థులకు తీవ్ర అన్యాయం జరుగుతోందని, ఖరీదైన కోచింగ్ సెంటర్ల వల్ల విద్యార్థులు, వారి తల్లిదండ్రుల మీద ఆర్థిక భారం పడుతోందని విజయ్ సర్కార్ ఆరోపించింది.

ఎస్ఐఆర్ ఎఫెక్ట్.. నటుడు ప్రకాశ్ రాజ్ ఓటు గల్లంతు!NationalSwechaa11 Aug 2026, 12:40 PM

ఎస్ఐఆర్ ఎఫెక్ట్.. నటుడు ప్రకాశ్ రాజ్ ఓటు గల్లంతు!

ఓటరు జాబితా సమగ్ర సవరణ (ఎస్ఐఆర్) ప్రక్రియలో భాగంగా ప్రముఖ నటుడు, రాజకీయ విమర్శకుడు ప్రకాశ్ రాజ్ ఓటు తొలగించినట్టు సమాచారం.ఆయనకు నాలుగు ఓట్లు ఉన్నట్టు ఆరోపణలు రావడంతో బెంగళూరులో తన ఓటును ఎన్నికల సంఘం అధికారులు తొలగించినట్టు తెలిసింది. ఈ విషయాన్ని స్వయంగా ప్రకాశ్ రాజ్ సోషల్ మీడియా ‘ఎక్స్’ వేదికగా ప్రకటించారు. తన ఓటును ఎన్నికల సంఘం తొలగించడంపై ప్రకాష్ రాజ్ తీవ్ర అసంతృప్తి వ్యక్తంచేశారు. ఎస్ఐఆర్‌లో భాగంగా బెంగళూరు సెగ్మెంటులోదాదాపు 65 లక్షల మంది ఓటర్ల పేర్లను తొలగించారని, అందులో తన పేరు కూడా ఉందంటూ ట్వీట్ చేశారు.తాను బెంగళూరులో పుట్టి, అక్కడే పెరిగి, విద్యాభ్యాసంతో పాటు థియేటర్ ప్రయాణం కూడా సాగించానని పేర్కొన్నారు.

తగ్గిన నిరుద్యోగం.. పీరియాడికల్ లేబర్ ఫోర్స్ సర్వే రిపోర్టు వైరల్టాప్ న్యూస్Swechaa11 Aug 2026, 12:22 PM

తగ్గిన నిరుద్యోగం.. పీరియాడికల్ లేబర్ ఫోర్స్ సర్వే రిపోర్టు వైరల్

దేశంలో నిరుద్యోగం తగ్గినట్టు తెలుస్తోంది.ఈ విషయాన్ని కేంద్రం గణాంకాల సంస్థ తాజాగా ప్రకటించింది. దేశంలోని ఉపాధి, నిరుద్యోగ పరిస్థితులపై జాతీయ గణాంకాల కార్యాలయం (ఎన్ఎస్ఓ), పీరియాడికల్ లేబర్ ఫోర్స్ సర్వే (పీఎల్ఎఫ్ఎస్)-2026 త్రైమాసిక రిపోర్టును సోమవారం విడుదల చేసింది. దేశంలోని ఉపాధి రంగం పలు సానుకూల అంశాలతో స్థిరమైన, మెరుగైన ప్రగతిని ప్రదర్శించింది.తాజా అంచనాల ప్రకారం దేశవ్యాప్తంగా 15 ఏండ్లు అంతకంటే ఎక్కువ వయసు ఉన్ను వారిలో సగటున 56.6 కోట్ల మంది ఉపాధి పొందుతున్నారు.

Khadgam: ఆగస్టు 15, 2026న కృష్ణ వంశీ ఖడ్గం రీ రిలీజ్సినిమాSwechaa11 Aug 2026, 12:06 PM

Khadgam: ఆగస్టు 15, 2026న కృష్ణ వంశీ ఖడ్గం రీ రిలీజ్

Khadgam: ఆగస్టు 15, 2026న కృష్ణ వంశీ దర్శకత్వంలో ఎంతో ప్రతిష్టాత్మకంగా రూపొందిన ఖడ్గం సినిమా రిలీజ్ కాబోతోంది. ఈ సినిమాలో శ్రీకాంత్, సోనాలి బింద్రే, ప్రకాష్ రాజ్, శివాజీ రాజా, రవితేజ, బ్రహ్మాజీ, సంగీత తదితరులు ప్రధాన పాత్రల్లో నటించారు. దేవి శ్రీ ప్రసాద్ సంగీతం అందించాడు. మ్యూజికల్‌గా కూడా ఈ సినిమా పెద్ద హిట్. ఇంతవరకూ ప్రతీసారి స్మాల్ స్క్రీన్ మీద వచ్చే ఖడ్గం, ఈసారి థియేటర్స్‌లో రిలీజ్ కాబోతుందని దర్శకుడు కృష్ణ వంశీ తెలిపాడు.

‘రేవంత్ రెడ్డి మళ్లీ గెలిస్తే సచ్చిపోతా..’ కాంగ్రెస్ పాలనపై రైతు ఆవేదన!వైరల్ న్యూస్Swechaa11 Aug 2026, 11:53 AM

‘రేవంత్ రెడ్డి మళ్లీ గెలిస్తే సచ్చిపోతా..’ కాంగ్రెస్ పాలనపై రైతు ఆవేదన!

 తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పాలనా తీరుపై ఓ సాధారణ పౌరుడు తీవ్రస్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేసిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతోంది. ఎన్నికల సమయంలో ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేర్చడంలో ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని సదరు వ్యక్తి సంచలన ఆరోపణలు చేశారు. ‘రేవంత్ రెడ్డి మళ్లీ ఎన్నికల్లో గెలిస్తే నేను సచ్చిపోతా..’  అంటూ కాంగ్రెస్ పాలనా తీరుపై తన ఆవేదనను వెల్లగక్కాడు. సదరు రైతు మాట్లాడుతూ.. ప్రభుత్వం ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలు ఏ ఒక్కటీ సరైన విధంగా అమలు కావడంలేదని తేల్చిచెప్పాడు. కాంగ్రెస్ ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీల్లో ఒక్కటి కూడా పక్కాగా అమలు కావడం లేదని మండిపడ్డాడు.

తిరుమలలో భారీగా భక్తుల రద్దీ.. దర్శనానికి ఎంత టైం పడుతుందంటే?ఏపీSwechaa11 Aug 2026, 11:10 AM

తిరుమలలో భారీగా భక్తుల రద్దీ.. దర్శనానికి ఎంత టైం పడుతుందంటే?

తిరుమలలో భక్తుల రద్దీ యథావిధిగా కొనసాగుతోంది.తెలంగాణలో వరుసగా మూడు రోజులు సెలవులు రావడం, వర్షాలు తగ్గుముఖం పట్టడం, పెళ్లిళ్ల సీజన్ ప్రారంభం కావొస్తుండటంతో స్వామివారికి మొక్కులు తీర్చుకునేందుకు భక్తులు పెద్దఎత్తున తిరుమలకు క్యూ కడుతున్నట్టు సమాచారం. ప్రస్తుతం తిరుమల కొండ మీద భక్తుల రద్దీ సాధారణం కంటే అధికంగా ఉన్నట్టు టీటీడీ అధికారులు వెల్లడించారు. రూములు దొరకడం లేదని, సత్రాలు అన్ని నిండిపోయినట్టు సమాచారం. రోజురోజుకూ భక్తుల తాకిడి పెరుగుతుండటంతో ప్రస్తుతం వైకుంఠం క్యూ కాంప్లెక్స్‌లోని అన్ని కంపార్ట్‌మెంట్లు నిండిపోయినట్టు తెలిసింది. భక్తులు వెలుపల ఉన్న క్యూలైన్లలో శ్రీ వేంకటేశ్వర స్వామి వారి దర్శనం కోసం గంటల తరబడి వేచి చూస్తున్నట్టు అధికారులు తెలిపారు.

AP : సింగర్ రాహుల్ సిప్లిగంజ్ సహా మరో 16 మందిపై కేసు..!ఏపీSwechaa11 Aug 2026, 10:58 AM

AP : సింగర్ రాహుల్ సిప్లిగంజ్ సహా మరో 16 మందిపై కేసు..!

బిగ్‌బాస్ విజేత,టాలీవుడ్ సింగర్ రాహుల్ సిప్లిగంజ్ మీద కేసు నమోదు అయ్యింది. ఆయనతో పాటు మరో 16 మందిపై ఆంధప్రదేశ్ ఆర్థిక రాజధాని విశాఖపట్నంలో ఎఫ్ఐఆర్ నమోదు అయినట్టు సమాచారం. ప్రస్తుతం రాహుల్ పలు సినిమాల్లో పాటలు పాడుతూ.. యూట్యూబ్ సాంగ్స్ చేస్తూ బిజీగా ఉన్న విషయం తెలిసిందే. గతంలోనూ ఓ పబ్బులో ఆయన మీద దాడి జరిగిన విషయం సంచలనం రేపింది. తాజాగా కేసు నమోదు కావడం రెండు తెలుగు రాష్ట్రాల్లో తీవ్ర చర్చనీయాంశంగా మారింది. అయితే, రాహుల్ సిప్లిగంజ్ బావమరిది రాహుల్ రెడ్డి తనను చేసుకుంటానని నమ్మించి మోసం చేశాడని ఓ యువతి విశాఖ పోలీసులకు ఫిర్యాదు చేసింది.

Sambarala Yeti Gattu: సంక్రాంతి బరిలో సుప్రీమ్ హీరో..సినిమాSwechaa11 Aug 2026, 10:43 AM

Sambarala Yeti Gattu: సంక్రాంతి బరిలో సుప్రీమ్ హీరో..

Sambarala Yeti Gattu: సుప్రీమ్ హీరో సాయి ధరమ్ తేజ్ నటిస్తున్న పీరియడ్ యాక్షన్ డ్రామా ‘సంబరాల ఏటి గట్టు’. రోహిత్ కేపీ దర్శకత్వంలో తెరకెక్కిస్తున్న ఈ సినిమాను ప్రైమ్‌షో ఎంటర్‌టైన్‌మెంట్ బ్యానర్ పై దాదాపు రూ. 120 కోట్ల భారీ బడ్జెట్‌తో కే నిరంజన్ రెడ్డి నిర్మిస్తున్నాడు. ఈ సినిమాను కూడా 2027, జనవరి 12వ తేదీన పాన్ ఇండియా వైడ్‌గా తెలుగు, తమిళ, హిందీ, కన్నడ, మలయాళ భాషల్లో విడుదల చేసేందుకు మేకర్స్ రెడీ అవుతున్నారు.

Murder case: హత్యాయత్నం కేసు.. బండి సంజయ్ ముఖ్య అనుచరుడి అరెస్ట్!క్రైమ్Swechaa11 Aug 2026, 10:22 AM

Murder case: హత్యాయత్నం కేసు.. బండి సంజయ్ ముఖ్య అనుచరుడి అరెస్ట్!

కరీంనగర్‌లో ఘోర ఉదంతం వెలుగు చూసింది. కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి బండి సంజయ్ ముఖ్య అనుచరుడు, 29వ డివిజన్ బీజేపీ కార్పొరేటర్ సోమిడి వేణుప్రసాద్‌తో పాటు అతని అనుచరులు తీవ్రమైన హత్యాయత్నం కేసులో చిక్కుకున్నారు. కరీంనగర్ 3 టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలోని కిసాన్ నగర్ ప్రాంతంలో నివాసముంటున్న శ్రీకాంత్ అనే యువకుడితో పాటు అతని సోదరుడిపై కార్పొరేటర్ , అతని వర్గీయులు దారణంగా కత్తులు, బీర్ సీసాలతో విరుచుకుపడ్డారు. ఈ క్రమంలో శ్రీకాంత్ కడుపులో బీర్ సీసాతో తీవ్రంగా పొడిచి, దాడికి పాల్పడిన రౌడీ మూక అక్కడి నుంచి పరారైంది.

ఈజీ లోన్‌తో బిగ్‌ రిస్క్‌! అప్పుల ఊబిలోకి నెడుతున్న డిజిటల్‌ రుణాలుటాప్ న్యూస్Swechaa11 Aug 2026, 10:05 AM

ఈజీ లోన్‌తో బిగ్‌ రిస్క్‌! అప్పుల ఊబిలోకి నెడుతున్న డిజిటల్‌ రుణాలు

నిమిషాల్లో లోన్‌ అకౌంట్‌లో పడిపోతుంది. రూ.7 వేలు కావాలా? వస్తాయి. రూ.15 వేలు కావాలా? వస్తాయి. అవసరం కొద్దిగా ఉన్నా.. డబ్బు మాత్రం క్షణాల్లో అందుబాటులోకి వస్తోంది. కానీ ఈ సౌలభ్యం వెనుక దాగి ఉన్న అసలు సమస్య.. ఆ డబ్బును తిరిగి చెల్లించే ప్రయాణం.

Gold price today: హైదరాబాద్‌లో పసిడి తగ్గుముఖం.. స్వల్పంగా పైకి పుంజుకున్న వెండి!వ్యాపారంSwechaa11 Aug 2026, 10:01 AM

Gold price today: హైదరాబాద్‌లో పసిడి తగ్గుముఖం.. స్వల్పంగా పైకి పుంజుకున్న వెండి!

హైదరాబాద్‌లోని బులియన్ మార్కెట్‌లో ఆగస్టు 11న పసిడి ప్రియులకు కొద్దిపాటి ఊరట లభించగా, వెండి ప్రియులకు మాత్రం స్వల్ప షాక్ తగిలింది. నిన్నటితో పోలిస్తే బంగారం ధరల్లో స్వల్ప తగ్గుదల చోటుచేసుకోగా, వెండి ధర స్వల్పంగా పైకి పుంజుకుంది. పసిడి ప్రేమికులు, ఆభరణాల కొనుగోలుదారులు మార్కెట్‌లోకి వెళ్లేముందు ఈ రోజు స్థానిక సూచిక ధరలను తెలుసుకోవడం ఎంతో అవసరం. ఈ రోజు నమోదైన వివరాల ప్రకారం.. హైదరాబాద్ మార్కెట్‌లో 24 క్యారెట్ల మేలిమి బంగారం 10 గ్రాముల ధర రూ.1,51,960గా నమోదైంది (గ్రాము రూ.15,196). గత రోజున ఇదే 24 క్యారెట్ల బంగారం 10 గ్రాములకు రూ.1,51,970గా ఉండగా, నేడు గ్రాముపై రూపాయి చొప్పున పడిపోయింది.

USVisaCancellation: ట్రంప్ సంచలన నిర్ణయం.. 1.75లక్షల విదేశీ వీసాలు రద్దు!InternationalSwechaa11 Aug 2026, 09:47 AM

USVisaCancellation: ట్రంప్ సంచలన నిర్ణయం.. 1.75లక్షల విదేశీ వీసాలు రద్దు!

విదేశీయుల ఇమ్మిగ్రేషన్ నిబంధనల విషయంలో డోనాల్డ్ ట్రంప్ నేతృత్వంలోని అమెరికా ప్రభుత్వం అత్యంత కఠినమైన సంచలన నిర్ణయాన్ని ప్రకటించింది. జాతీయ భద్రతకు ముప్పు కలిగించడం, తీవ్రమైన నేరపూరిత కార్యకలాపాల్లో పాల్గొనడం, ఇమ్మిగ్రేషన్ చట్టాలను ఉల్లంఘించడం వంటి తీవ్రమైన కారణాలను చూపుతూ దాదాపు 1,75,000కు పైగా విదేశీ వీసాలను రద్దు చేస్తున్నట్లు అధికారికంగా వెల్లడించింది. తమ ప్రభుత్వం చేపడుతున్న నిరంతర సమీక్షా ప్రక్రియలో భాగంగానే ఈ విస్తృత స్థాయి చర్యలు తీసుకున్నట్లు అమెరికా విదేశాంగ శాఖ ఒక ఫ్యాక్ట్ షీట్ ద్వారా నివేదించింది.

కొలంబియాలో 7.4 తీవ్రతతో భారీ భూకంపం.. 100 మందికి పైగా మృతి!InternationalSwechaa11 Aug 2026, 09:30 AM

కొలంబియాలో 7.4 తీవ్రతతో భారీ భూకంపం.. 100 మందికి పైగా మృతి!

దక్షిణ అమెరికా దేశమైన పశ్చిమ కొలంబియాలో సంభవించిన అత్యంత తీవ్రమైన భూకంపం ఆ ప్రాంతాన్ని కోలుకోలేని దెబ్బ తీసింది. రిక్టర్ స్కేలుపై 7.4తీవ్రతతో నమోదైన ఈ మహా విపత్తు కారణంగా ఇప్పటివరకు 100మందికి పైగా పౌరులు ప్రాణాలు కోల్పోగా, వందలాది మంది తీవ్రంగా గాయపడ్డారు. భూకంప ధాటికి అనేక బహుళ అంతస్తుల భవనాలు, నివాస గృహాలు పేకమేడల్లా కూలిపోయాయి. శిథిలాల కింద ఇంకా చాలామంది చిక్కుకుని ఉండే అవకాశం ఉందని, దాంతో మృతుల సంఖ్య మరింతగా పెరిగే ప్రమాదం ఉందని స్థానిక అధికారులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. యునైటెడ్ స్టేట్స్ జియోలాజికల్ సర్వే (USGS) నివేదిక ప్రకారం, చోకో ప్రాంతంలోని శాన్ జోస్ డెల్ పల్మార్ పట్టణానికి సమీపంలో భూమికి సుమారు 107 కిలోమీటర్ల లోతున ఈ భూకంప కేంద్రం కేంద్రీకృతమైంది.

2016లో శామీర్ పేట ఎస్ఆర్ఓ వద్ద  రూ.25 కోట్ల మనీ ల్యాండరింగ్స్వేచ్ఛ ఛైర్మన్ డెస్క్Swechaa11 Aug 2026, 09:13 AM

2016లో శామీర్ పేట ఎస్ఆర్ఓ వద్ద రూ.25 కోట్ల మనీ ల్యాండరింగ్

1965న ఈస్ట్ హైదరాబాద్, మల్కాజిగిరి తాలుకాలో 1,049 ఎకరాలను విజయవాడకు చెందిన నేత కొనుగోలు చేయాలని అనుకుంటారు. బంధువులు, వారసుల పేర్లతో భూములు కొనుగోలు చేశారు. సొంత కొడుకు, కూతురు, దగ్గరి బంధువుల నుంచి భూములు అధికారికంగా కొనుగోలు చేయకుండానే రిజిస్ట్రర్ జీపీఏ 83/1965 తో పాటు 13/1965, 56/65 తో అన్ని క్రయ, విక్రయ హక్కులు ఉంటాయని 21 మందితో 4 జీపీఏలు ఉన్నాయి. ఆ తర్వాత రెండు సేల్ డీడ్స్ ద్వారా పట్టాదారుడు అయిన రెహ్మత్ అలీ, ఇతరుల నుంచి డాక్యుమెంట్ నెం. 436/1965, 437/1965 తో 1,049 ఎకరాలు రిజిస్ట్రేషన్ చేసుకున్నారు.

Rajinikanth-Dharman: నేటి నుంచి సూపర్ స్టార్ సినిమా ప్రారంభంసినిమాSwechaa11 Aug 2026, 09:09 AM

Rajinikanth-Dharman: నేటి నుంచి సూపర్ స్టార్ సినిమా ప్రారంభం

Rajinikanth-Dharman: తమిళ సీనియర్ హీరోలలో దూకుడు మీదున్నాడు సూపర్ స్టార్ రజినీకాంత్. ఆయన హీరోగా "ధర్మన్" అనే చిత్రం నేటి నుంచి చిత్రీకరణ ప్రారంభం అయింది. ఈ మధ్యనే "ధర్మన్" నుంచి రజినీ ఫస్ట్ లుక్ విడుదలైంది. దీనికి పెట్టిన ‘ది డెడ్లీ డాక్టర్’ అనే ట్యాగ్‌లైన్‌ ప్రేక్షకుల్లో విపరీతమైన ఆసక్తిని పెంచింది. ఈ సినిమాలో రజినీకాంత్ డాక్టర్ గా నటిస్తున్నాడు. కీలక పాత్రలో రాశీ ఖన్నా కనిపించబోతోంది. అశ్విత్ మారిముత్తు దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాను 2027 సంక్రాంతికి రిలీజ్ చేసే విధంగా నాన్ స్టాప్ షెడ్యూల్స్ ప్లాన్ చేస్తున్నారు.

TCS Data Leak: డేటా లీక్ ఆరోపణలను ఖండించిన టీసీఎస్!వ్యాపారంSwechaa11 Aug 2026, 09:08 AM

TCS Data Leak: డేటా లీక్ ఆరోపణలను ఖండించిన టీసీఎస్!

భారతీయ ఐటీ రంగానికి చెందిన ప్రముఖ దిగ్గజ సంస్థ టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ (టీసీఎస్) తమ కంపెనీ అంతర్గత వ్యవస్థల్లో డేటా ఉల్లంఘన లేదా లీకేజీ జరిగినట్లు వస్తున్న ఆరోపణలను తీవ్రంగా తోసిపుచ్చింది. తమ సిస్టమ్స్‌లో గానీ, కస్టమర్ల డేటాకు సంబంధించి గానీ ఎలాంటి అనధికారిక చొరబాటు లేదా భద్రతా లోపాలు సంభవించినట్లు ఎలాంటి ఆధారాలు లేవని సంస్థ సోమవారం సాయంత్రం బొంబాయి స్టాక్ ఎక్స్ఛేంజ్, నేషనల్ స్టాక్ ఎక్స్ఛేంజీలకు సమర్పించిన అధికారిక నివేదికలో స్పష్టంగా వెల్లడించింది.

పాలిటిక్స్‌లో స్టార్టప్‌లు.. పాత పార్టీలకు కొత్త టెన్షన్!NationalSwechaa11 Aug 2026, 12:03 AM

పాలిటిక్స్‌లో స్టార్టప్‌లు.. పాత పార్టీలకు కొత్త టెన్షన్!

బీజేపీ, కాంగ్రెస్, DMK, AIADMK, టీడీపీ, బీఆర్ఎస్, వైసీపీ వంటి పార్టీలకు దశాబ్దాలుగా ఏర్పడిన క్యాడర్, సంస్థాగత వ్యవస్థ, నాయకత్వ నిర్మాణం ఉన్నాయి. కొత్త రాజకీయ పార్టీలకు అవి ఉండవు. కానీ కొత్తవాళ్లకు మరో బలం ఉంది. వాళ్లకు పాత రాజకీయాల భారముండదు.

డిపార్ట్‌మెంట్‌లో ఆ..నలుగురి..పై డీజీపీ సీరియస్..! చర్యలు తప్పవా..! ఎవరా నలుగురు?తెలంగాణSwechaa10 Aug 2026, 11:16 PM

డిపార్ట్‌మెంట్‌లో ఆ..నలుగురి..పై డీజీపీ సీరియస్..! చర్యలు తప్పవా..! ఎవరా నలుగురు?

DGP CV Anand: తెలంగాణ పోలీస్ డిపార్ట్ మెంట్ కు చెందిన నలుగురిపై డీజీపీ సీవీ ఆనంద్ సీరియస్ అయ్యారు. డిపార్ట్ మెంట్ లో నలుగురు అధికారులను ఉద్దేశించి ఆయన సంచలన వ్యాఖ్యలు చేశారు. ఎంత చెప్పినా ఆ నలుగురు అధికారులు తమ పనితీరును మార్చుకోవడం లేదని డీజీపీ సీవీ ఆనంద్ సీరియస్ అయ్యారు. వీడియో కాన్ఫరెన్స్ లో వారికి చాలాసార్లు చెప్పి చూశామన్నారు. అధికారులు తమ పద్ధతి మార్చుకోకపోతే తదుపరి చర్యలు తప్పవని వార్నింగ్ ఇచ్చారు. ఆ నలుగురు అంటూ డీజీపీ చేసిన వ్యాఖ్యలు డిపార్ట్ మెంట్ లో కలకలం రేపుతున్నాయి. డీజీపీ చెప్పిన ఆ నలుగురు అధికారులు ఎవరు? అనే దానిపై డిపార్ట్ మెంట్ లో తీవ్రమైన చర్చ జరుగుతోంది.

Slum Dog - Tabu: "మా ఓల్డ్ సిటీలో ఫస్ట్ కాలుస్తాం.. తర్వాత మాట్లాడతాం"సినిమాSwechaa10 Aug 2026, 09:40 PM

Slum Dog - Tabu: "మా ఓల్డ్ సిటీలో ఫస్ట్ కాలుస్తాం.. తర్వాత మాట్లాడతాం"

Slum Dog - Tabu: స్లమ్ డాగ్ 33 టెంపుల్ రోడ్ మూవీలో టబు కీలక పాత్రలో నటించింది. చాలాకాలం తర్వాత త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో రూపొందిన అల వైకుంఠపురములో సినిమాతో తెలుగులో రీ ఎంట్రీ ఇచ్చింది టబు. ఆ తర్వాత మళ్ళీ, ఇదే సినిమా చేసింది. ఇందులో, టబు పాత్ర చాలా పవర్‌ఫుల్‌గా ఉంది. టబు కోసమే పూరి పవర్ ఫుల్ డైలాగ్స్ రాశారు. "మా ఓల్డ్ సిటీలో ఫస్ట్ కాలుస్తాం.. తర్వాత మాట్లాడతాం" అనే డైలాగ్ హైలెట్ గా ఉంది. స్టేషన్‌లో విజయ్ సేతుపతి మెడపై లాఠీ పెట్టి బెదిరించే సీన్ హై నెక్స్ట్ లెవల్.