స్వేచ్ఛ షార్ట్స్ — తాజా తెలుగు వార్తలు

DGP CV Anand: మావోయిస్టు స్థావరం నుంచి పర్యాటక కేంద్రంగా కర్రెగుట్ట- డీజీపీ సీవీ ఆనంద్తెలంగాణSwechaa10 Aug 2026, 09:16 PM

DGP CV Anand: మావోయిస్టు స్థావరం నుంచి పర్యాటక కేంద్రంగా కర్రెగుట్ట- డీజీపీ సీవీ ఆనంద్

ఒకప్పుడు మావోయిస్టుల కార్యకలాపాలకు ప్రధాన కేంద్రంగా ఉన్న తెలంగాణ-ఛత్తీస్‌గఢ్-ఒడిశా సరిహద్దులోని కర్రెగుట్టలో 50 ఏళ్ల తర్వాత ఇప్పుడు శాంతి నెలకొందని తెలంగాణ డీజీపీ సీవీ ఆనంద్ తెలిపారు. ఈ ప్రాంతాన్ని పర్యాటక కేంద్రంగా డెవలప్ చేస్తామన్నారు. కర్రెగుట్టలో అభివృద్ధి, పర్యాటక మౌలిక వసతుల కల్పనకు ప్రభుత్వం ప్రణాళికలు సిద్ధం చేస్తోందని వెల్లడించారు. సోమవారం ములుగు జిల్లా కర్రెగుట్టల అటవీ ప్రాంతంలో డీజీపీ సీవీ ఆనంద్ పర్యటించారు. జాతీయ జెండాను ఆవిష్కరించి, శాంతికి ప్రతీకగా పావురాలను ఎగురవేశారు. ఆ తర్వాత ఆ ప్రాంతంలో జరుగుతున్న రోడ్డు నిర్మాణ పనులను ఆయన పరిశీలించారు.

Deepika Padukone: "రాకా" కోసం 8 నెలల గర్భంతో సాహసం చేస్తున్న దీపికసినిమాSwechaa10 Aug 2026, 09:03 PM

Deepika Padukone: "రాకా" కోసం 8 నెలల గర్భంతో సాహసం చేస్తున్న దీపిక

Deepika Padukone: Deepika Padukone: రాకా కోసం 8 నెలల గర్భంతో సాహసం చేస్తున్న దీపిక పడుకొణ్. అవును, ఇప్పుడు ఇదే అటు బాలీవుడ్ ఇండస్ట్రీలో ఇటి సౌత్ సినిమా ఇండస్ట్రీలలో హాట్ టాపిక్ గా మారింది. ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ నటిస్తున్న పాన్ వరల్డ్ సినిమా ఇది. తమిళ టాలెంటెడ్ డైరెక్టర్ అట్లీ కుమార్ అత్యంత ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిస్తున్నాడు. సన్ పిక్చర్స్ దాదాపు 700 కోట్ల రూపాయల భారీ బడ్జె్‌తో నిర్మిస్తోంది.

పూర్ణాహుతితో పరిసమాప్తమైన మహా వరుణ యాగం.. వేదఘోషతో మార్మోగిన కృష్ణాతీరం!..తెలంగాణSwechaa10 Aug 2026, 08:53 PM

పూర్ణాహుతితో పరిసమాప్తమైన మహా వరుణ యాగం.. వేదఘోషతో మార్మోగిన కృష్ణాతీరం!..

తెలంగాణలో సమృద్ధిగా వర్షాలు కురవాలని.. కృష్ణా, గోదావరి నదులు జలకళతో ఉప్పొంగాలని.. ప్రాజెక్టులు, జలాశయాలు, చెరువులు నిండుకుండల్లా మారాలని.. రైతుల పంటలు పచ్చగా కళకళలాడాలని ఆకాంక్షిస్తూ నిర్వహించిన మహా వరుణ యాగం పూర్ణాహుతితో ముగిసింది.

నాగార్జునసాగర్‌లోని విజయ్ విహార్ వద్ద కృష్ణానది తీరంలో సోమవారం తెల్లవారుజామున ప్రారంభమైన ఈ యాగం.. రోజంతా వేద క్రతువులు, ప్రత్యేక పూజలు, హోమాలతో కొనసాగింది. సాయంత్రం జరిగిన పూర్ణాహుతి కార్యక్రమంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ఆయన సతీమణి గీతా రెడ్డి పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించారు.

Ration Rice Mafia: రేషన్ ‘బినామీ’ దందా.. పేదల బియ్యం పెద్దల జేబుల్లోకి! జోగుళాంబ గద్వాల జిల్లాలో గాడి తప్పిన ప్రజా పంపిణీ వ్యవస్థతెలంగాణSwechaa10 Aug 2026, 08:26 PM

Ration Rice Mafia: రేషన్ ‘బినామీ’ దందా.. పేదల బియ్యం పెద్దల జేబుల్లోకి! జోగుళాంబ గద్వాల జిల్లాలో గాడి తప్పిన ప్రజా పంపిణీ వ్యవస్థ

పేదవాడి ఆకలి తీర్చాల్సిన ఉచిత రేషన్ బియ్యం.. అక్రమార్కుల జేబులు నింపుతోంది. జోగుళాంబ గద్వాల జిల్లాలో ప్రజా పంపిణీ వ్యవస్థ (PDS) పూర్తిగా పక్కదారి పట్టింది. పేరుకేమో ప్రభుత్వం కేటాయించిన అసలు డీలర్లు.. క్షేత్రస్థాయిలో మాత్రం అంతా బినామీల హవా! రెవెన్యూ, పౌరసరఫరాల శాఖల అధికారుల కళ్ల ముందే ఈ దందా సాగుతున్నా పట్టించుకునే నాథుడే కరువయ్యాడు.

నేటితో సర్ ప్రక్రియ పూర్తి.. ఎన్ని ఓట్లు తొలగించారంటే?..తెలంగాణSwechaa10 Aug 2026, 08:18 PM

నేటితో సర్ ప్రక్రియ పూర్తి.. ఎన్ని ఓట్లు తొలగించారంటే?..

తెలంగాణలో స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ (SIR) ఎన్యూమరేషన్ ప్రక్రియ ముగిసింది. రాష్ట్రంలో మొత్తం 3,38,26,448 మంది ఓటర్లు ఉన్నట్లు అధికారులు తేల్చారు. తెలంగాణలో 73,95,954 మంది ఓటర్లను తొలగించినట్లు సమాచారం. ఇప్పటివరకు 2,64,30,494 ఎన్యూమరేషన్ ఫారాల డిజిటలైజేషన్ ప్రక్రియ పూర్తయ్యింది. దీంతో రాష్ట్రవ్యాప్తంగా 78.14 శాతం డిజిటలైజేషన్ నమోదైంది.

Fishermen Insurance: రూ.5లక్షలు.. మత్స్యకారులకు ప్రభుత్వం శుభవార్త.. ప్రమాద బీమా పథకంతెలంగాణSwechaa10 Aug 2026, 07:12 PM

Fishermen Insurance: రూ.5లక్షలు.. మత్స్యకారులకు ప్రభుత్వం శుభవార్త.. ప్రమాద బీమా పథకం

తెలంగాణలోని మత్స్యకారులకు ప్రభుత్వం శుభవార్త చెప్పింది. మత్స్యకార కుటుంబాలకు ఆర్థిక భరోసా కల్పిస్తూ గ్రూప్ ప్రమాద బీమా పథకం తీసుకొచ్చింది. ఈ మేరకు రాష్ట్ర పశుసంవర్ధక శాఖ మంత్రి వాకిటి శ్రీహరి తెలిపారు. మత్స్యకారుల సంక్షేమానికి ప్రభుత్వం ప్రాధాన్యత ఇస్తోందని ఆయన తెలిపారు. ప్రమాదవశాత్తు మరణం లేదా శాశ్వత వైకల్యానికి గురైన మత్స్యకారుల కుటుంబాలకు ఆర్థిక భరోసా కల్పించాలనే ఉద్దేశంతో ఈ గ్రూప్ ప్రమాద బీమా స్కీమ్ అమలు చేయనున్నట్లు వివరించారు.

చేపల వేటకు వెళ్లిన సమయంలో లేదా ప్రమాదవశాత్తు మరణించినా, పూర్తి వైకల్యానికి గురైనా ఆ కుటుంబానికి రూ.5లక్షలు పరిహారం లభిస్తుంది. ప్రమాదాల వల్ల పాక్షిక వైకల్యం ఏర్పడితే రూ.2.50 లక్షల వరకు పరిహారం అందుతుంది. ఆసుపత్రిలో చికిత్స కోసం రూ.25వేల వరకు అందిస్తారు.

సీఎం రేవంత్ రెడ్డి ఎదుగుదలకు కారణం మా నాన్నే!..తెలంగాణSwechaa10 Aug 2026, 07:04 PM

సీఎం రేవంత్ రెడ్డి ఎదుగుదలకు కారణం మా నాన్నే!..

తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిపై నిజామాబాద్ బీజేపీ ఎంపీ ధర్మపురి అరవింద్ తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. ఢిల్లీలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. సీఎం అధికార దుర్వినియోగానికి పాల్పడుతున్నారని ఆరోపించారు. తన సోదరుడు కొండల్ రెడ్డికి చెందిన షెల్ కంపెనీకి కోట్ల రూపాయల విలువైన ప్రభుత్వ భూములను అడ్డగోలుగా కేటాయించారని విమర్శించారు. ఈ వ్యవహారంపై నైతిక బాధ్యత వహిస్తూ సీఎం రేవంత్ రెడ్డి వెంటనే తన పదవికి రాజీనామా చేయాలని అరవింద్ డిమాండ్ చేశారు.

వరుణ యాగంలో పాల్గొన్న సీఎం రేవంత్‌ దంపతులుSwechaa10 Aug 2026, 06:03 PM

వరుణ యాగంలో పాల్గొన్న సీఎం రేవంత్‌ దంపతులు

Varuna Yagam: నల్గొండ జిల్లాలోని నాగార్జునసాగర్‌ విజయ్ విహార్ టూరిజం గెస్ట్‌హౌస్‌ ప్రాంగణంలో వరుణ యాగం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి దంపతులు హాజరయ్యారు. పూర్ణాహుతి కార్యక్రమంలో వారు పాల్గొన్నారు. పూర్ణాహుతి సామాగ్రిని హోమగుండంలో సమర్పించారు ముఖ్యమంత్రి రేవంత్ దంపతులు.

రాష్ట్రంలో విస్తారంగా వర్షాలు కురిసి, జలశయాలు నిండి, పాడి పంటలు సమృద్ధిగా పండాలని కాంక్షిస్తూ తెలంగాణ ప్రభుత్వం నాగార్జునసాగర్ తీరంలో అత్యంత వైభవంగా ఈ వరుణయాగాన్ని చేపట్టింది. సాగర్ ప్రాజెక్టు పరిధిలోని విజయ విహార్ గెస్ట్ హౌస్ ప్రాంగణంలో సోమవారం తెల్లవారుజామున 4 గంటలకు ఆది పూజలతో ఈ మహా క్రతువు ప్రారంభమైంది. నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి నేతృత్వంలో యాదగిరిగుట్ట దేవస్థాన అర్చకులు, వేద పండితుల ఆధ్వర్యంలో 108 మంది రుత్వికులు 11 హోమ గుండాలతో వరుణ దేవుడిని ప్రసన్నం చేసుకునేందుకు ప్రత్యేక పూజలు నిర్వహించారు.

కృష్ణా, గోదావరి పరీవాహక ప్రాంతంలో సమృద్ధిగా వానలు కురవాలని మంత్రి ఉత్తమ్ దంపతులు యాగాన్ని ప్రారంభించగా.. పూర్ణాహుతి కార్యక్రమంలో సీఎం రేవంత్ దంపతులు పాల్గొన్నారు.

NIMS: హైదరాబాద్ నిమ్స్‌లో ఉచిత హార్ట్ సర్జరీలు.. ఈ నెల 13 నుంచి..తెలంగాణSwechaa10 Aug 2026, 05:50 PM

NIMS: హైదరాబాద్ నిమ్స్‌లో ఉచిత హార్ట్ సర్జరీలు.. ఈ నెల 13 నుంచి..

NIMS: హైదరాబాద్ నిమ్స్ లో (నిజామ్స్ ఇన్ స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్) చిన్నారులకు ఉచితంగా హార్ట్ సర్జరీలు చేయనున్నారు. ఆగస్టు 13వ తేదీ నుండి పిల్లల కోసం ఉచిత గుండె శస్త్రచికిత్సల కార్యక్రమాన్ని ప్రారంభించనున్నారు. లండన్‌కు చెందిన డాక్టర్, పీడియాట్రిక్ కార్డియాక్ సర్జన్ డాక్టర్ రమణ తన్నాషునేని, సాంకేతిక నిపుణుల బృందంతో కలిసి ఆసుపత్రిలోని సి.టి. (CT) సర్జరీ విభాగం ఈ ప్రత్యేక గుండె శస్త్రచికిత్సలను నిర్వహిస్తుంది.

ముందుగా వాకిన్ (అపాయింట్ మెంట్ అవసరం లేదు) విధానంలో చిన్నారులను పరిశీలిస్తారు. అవసరమైన వైద్య పరీక్షలు చేస్తారు. తర్వాత అవసరమైన వారికి ఆపరేషన్ చేస్తారు. పాత టెస్ట్ రిపోర్టులతో సోమవారం నుంచి శనివారం వరకు ఉదయం 8 గంటల నుంచి మధ్యాహ్నం 2 గంటల మధ్య నిమ్స్ ఓల్డ్ బ్లాక్ లో నేరుగా వచ్చి సంప్రదించవచ్చిన నిమ్స్ డైరెక్టర్ రాహుల్ దేవరాజ్ తెలిపారు. ఐదేళ్లుగా ఉచిత సర్జరీలు చేస్తున్నట్లు ఆయన వెల్లడించారు.

Harish Rao: కాంగ్రెస్ ప్రభుత్వం భయపెట్టినా, ప్రలోభ పెట్టినా తలొగ్గని నాయకుడు పెద్ది- హరీశ్ రావుSwechaa10 Aug 2026, 04:27 PM

Harish Rao: కాంగ్రెస్ ప్రభుత్వం భయపెట్టినా, ప్రలోభ పెట్టినా తలొగ్గని నాయకుడు పెద్ది- హరీశ్ రావు

Harish Rao: వరంగల్‌లో మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి సంస్మరణ సభలో మాజీ మంత్రి హరీశ్ రావు పాల్గొన్నారు. పెద్ది సుదర్శన్ రెడ్డితో తనకున్న అనుబంధాన్ని గుర్తు చేసుకుంటూ ఎమోషనల్ అయ్యారు. ప్రతి ఉద్యమంలో పెద్ది సుదర్శన్ రెడ్డి పాత్ర చాలా కీలకం అని చెప్పారు. పెద్దితో నేను పాల్గొన్న పురాతన దేవాలయం చివరి కార్యక్రమం అని, అదే చివరిది అవుతుందని అనుకోలేదని వాపోయారు. సాధారణ జీవితం గడిపిన నాయకుడు పెద్ది సుదర్శన్ రెడ్డి అని కొనియాడారు. కాంగ్రెస్ ప్రభుత్వం భయపెట్టినా, ప్రలోభ పెట్టినా తలొగ్గని నాయకుడు పెద్ది అని కీర్తించారు. పెద్దిని బతికించడం కోసం కేసీఆర్ చేసిన ప్రయత్నం అంతా ఇంతా కాదన్నారు. పెద్ది కుటుంబానికి బీఆర్ఎస్ పార్టీ అండగా ఉంటుందన్నారు హరీశ్ రావు.

మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి సంస్మరణ సభలో పాల్గొన్న మాజీ మంత్రి కేటీఆర్.. కీలక వ్యాఖ్యలు చేశారు. రెండేళ్లలో కేసీఆర్ తిరిగి ముఖ్యమంత్రి అవుతారని ఆయన ధీమా వ్యక్తం చేశారు. ఏ మెడికల్ కాలేజీ కోసం పెద్ది తాపత్రపడ్డారో... ఆ మెడికల్ కాలేజీకి పెద్ది పేరు పెడుతామన్నారు. నర్సంపేట చరిత్రలో పెద్ది సుదర్శన్ రెడ్డి పేరు చిరస్థాయిగా నిలిచేలా చేస్తామన్నారు కేటీఆర్. పెద్ది సుదర్శన్ రెడ్డి గొప్ప అభ్యుదయ వాది కీర్తించారు. పెద్ది కుటుంబాన్ని కంటికి రెప్పలా కాపాడుకునే బాధ్యత బీఆర్ఎస్ పార్టీది అని తేల్చి చెప్పారు. భవిష్యత్తులో కూడా పెద్ది కుటుంబం వెంట బీఆర్ఎస్ పార్టీ ఉంటుందన్నారు కేటీఆర్. సూర్యచంద్రులు ఉన్నంతకాలం నర్సంపేటలో పెద్ది సుదర్శన్ రెడ్డి పేరు చిరస్థాయిగా ఉంటుందని వ్యాఖ్యానించారు.

US Iran War: హర్మూజ్‌లో హైటెన్షన్.. 20కిపైగా యుద్ధ నౌకలు మోహరింపు.. అమెరికా ఏం చేయబోతోంది?ప్రపంచంSwechaa10 Aug 2026, 04:16 PM

US Iran War: హర్మూజ్‌లో హైటెన్షన్.. 20కిపైగా యుద్ధ నౌకలు మోహరింపు.. అమెరికా ఏం చేయబోతోంది?

ప్రపంచ చమురు రవాణకు అత్యంత కీలకమైన హర్మూజ్ జలసంధిలో హైటెన్షన్ నెలకొంది. అక్కడ అమెరికా 20కి పైగా యుద్ధ నౌకలను మోహరించింది. దీంతో ఎప్పుడు ఏం జరుగుతుందో అనే టెన్షన్ నెలకొంది. తమ డిమాండ్లను నెరవేరిస్తేనే హర్మూజ్ జలసంధిని తెరుస్తామని ఇరాన్ పట్టుబడుతోంది. ఈ క్రమంలో అగ్రరాజ్యం అమెరికా కీలక నిర్ణయం తీసుకుంది. హర్మూజ్ జలసంధిలో యుద్ధ నౌకలను మోహరించింది. నేవీ డెస్ట్రాయర్ సహా 20కి పైగా వార్ షిప్స్ ను మోహరించినట్లు అమెరికా సెంట్రల్ కమాండ్ వెల్లడించింది. అమెరికా చర్య ఇప్పుడు ఉత్కంఠగా మారింది. అమెరికా ఏం చేయబోతోంది? ఈ చర్య దాడి చేసేందుకా లేక భయపెట్టేందుకా అన్న చర్చ నడుస్తోంది.

మళ్ళీ ఎన్నికల్లో బీఆర్ఎస్ గెలవడం-కేసీఆర్ సీఎం అవ్వడం ఖాయం!..తెలంగాణSwechaa10 Aug 2026, 04:03 PM

మళ్ళీ ఎన్నికల్లో బీఆర్ఎస్ గెలవడం-కేసీఆర్ సీఎం అవ్వడం ఖాయం!..

నర్సంపేట మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి సంస్మరణ సభలో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ భావోద్వేగానికి లోనయ్యారు. ప్రజా సేవే ధ్యేయంగా పనిచేసిన గొప్ప నాయకుడిని కోల్పోవడం తీరని లోటని పేర్కొన్నారు. నర్సంపేటకు మెడికల్ కాలేజీ కోసం ఆయన చేసిన కృషిని గుర్తుచేసుకుంటూ, ఆ కాలేజీకి పెద్ది సుదర్శన్ రెడ్డి పేరు పెట్టే బాధ్యత తీసుకుంటామని హామీ ఇచ్చారు. ఆయన కుటుంబానికి బీఆర్ఎస్ పార్టీ ఎల్లప్పుడూ అండగా ఉంటుందని స్పష్టం చేసిన కేటీఆర్.. రాబోయే రెండేళ్లలో కేసీఆర్ మళ్లీ తెలంగాణ ముఖ్యమంత్రి అవుతారని ధీమా వ్యక్తం చేశారు.

Rahul Gandhi: ‘వాళ్లు దోషులైనా లేదా అసమర్థులైనా అయివుండాలి’.. కేంద్రంపై రాహుల్ గాంధీ ఫైర్!NationalSwechaa10 Aug 2026, 03:46 PM

Rahul Gandhi: ‘వాళ్లు దోషులైనా లేదా అసమర్థులైనా అయివుండాలి’.. కేంద్రంపై రాహుల్ గాంధీ ఫైర్!

పార్లమెంటు భవనం వైపు శాంతియుతంగా ర్యాలీగా వెళ్తున్న విద్యార్థులపై పోలీసులు సాగించిన బలప్రయోగాన్ని కాంగ్రెస్ అగ్రనేత, ఎంపీ రాహుల్ గాంధీ తీవ్రస్థాయిలో నిరసించారు. ఈ ఘటనపై కేంద్ర ప్రభుత్వ తీరును తప్పుబడుతూ, పాలకులు దోషులైనా అయ్యుండాలి లేదా తీవ్ర అసమర్థులైనా అయ్యుండాలంటూ ఘాటు వ్యాఖ్యలు చేశారు.

విద్యార్థుల ఆందోళనపై అమిత్‌ షా ఏం చెప్పబోతున్నారు?NationalSwechaa10 Aug 2026, 03:35 PM

విద్యార్థుల ఆందోళనపై అమిత్‌ షా ఏం చెప్పబోతున్నారు?

అమిత్‌ షా మొదటగా విద్యార్థుల నిరసనలపై ప్రభుత్వ వైఖరిని స్పష్టం చేసే అవకాశం ఉంది. నిరసన చేసే హక్కు ప్రతి ఒక్కరికీ ఉందని చెబుతూనే.. చట్టం, శాంతిభద్రతల పరిధిని దాటితే పోలీసులు ఎందుకు జోక్యం చేసుకోవాల్సి వచ్చిందో వివరించే అవకాశం ఉంది.

Fire Incident: ఘోర అగ్నిప్రమాదం.. 16 మంది కార్మికులు సజీవ దహనంక్రైమ్Swechaa10 Aug 2026, 03:06 PM

Fire Incident: ఘోర అగ్నిప్రమాదం.. 16 మంది కార్మికులు సజీవ దహనం

Fire Incident: సౌదీ అరేబియా రాజధాని రియాద్ లో ఘోర అగ్నిప్రమాదం జరిగింది. ఈ దుర్ఘటనలో 16 మంది చనిపోయారు. రియాద్ లోని ఓ సోఫా మ్యానుఫ్యాక్చరింగ్ ఫ్యాక్టరీలో అగ్ని ప్రమాదం జరిగింది. మృతులంతా అక్కడ పని చేసే కార్మికులు. వారంతా బంగ్లాదేశ్ నుంచి వలస వచ్చిన వారు. మంటల్లో వారంతా సజీవ దహనం అయ్యారు. కాగా, సౌదీలో దాదాపు 35 లక్షల మంది బంగ్లాదేశీయులు పని చేస్తున్నారు.

ఊహించని పని చేసిన ఏఐ.. నియమాలను ఉల్లంఘించి!..InternationalSwechaa10 Aug 2026, 02:32 PM

ఊహించని పని చేసిన ఏఐ.. నియమాలను ఉల్లంఘించి!..

ఒక్క జిమ్ క్లాస్ బుక్ చేసుకోవడానికి ఏఐని ఉపయోగిస్తే.. అది ఏకంగా మరో వ్యక్తి రిజర్వేషన్‌నే క్యాన్సిల్ చేసింది! మెల్‌బోర్న్‌కు చెందిన ఆండ్రూ తన పర్సనల్ ఏఐ అసిస్టెంట్‌తో జిమ్ క్లాస్ బుక్ చేయించాడు. అయితే ఏఐ జిమ్ APIలోని భద్రతా లోపాన్ని గుర్తించి, ముందుగానే బుకింగ్ చేయడంతో పాటు.. వెయిటింగ్ లిస్ట్‌లో తనకంటే ముందున్న వ్యక్తి రిజర్వేషన్‌ను రద్దు చేసింది. దీంతో ఆండ్రూ నాలుగో స్థానం నుంచి మూడో స్థానానికి చేరాడు. అసలు ఆ వ్యక్తిని తొలగించమని ఆండ్రూ చెప్పకపోవడం మరింత ఆందోళన కలిగిస్తోంది. ఏఐ తప్పు చేస్తే బాధ్యత ఎవరిది? అనే ప్రశ్న ఇప్పుడు తెరపైకి వచ్చింది.

మంత్రి ఉత్తమ్‌కు హరీశ్ రావు సంచలన లేఖరాజకీయాలుSwechaa10 Aug 2026, 02:09 PM

మంత్రి ఉత్తమ్‌కు హరీశ్ రావు సంచలన లేఖ

రాష్ట్ర నీటిపారుదలశాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డికి బీఆర్ఎస్ సీనియర్ నేత, మాజీ మంత్రి హరీశ్ రావు సోమవారం లేఖ రాశారు.రాష్ట్రంలో రైతులు పడుతున్న ఇబ్బందులను దృష్టిలో ఉంచుకుని తక్షణమే కాళేశ్వరం మోటార్లు ఆన్‌చేయాలని అందులో పేర్కొన్నారు.రిజర్వాయర్లలో నీటిని సకాలంలో నింపకపోవడం వల్ల పంటలు సాగు కాక రైతులు తీవ్ర ఆందోళనలో ఉన్నారని తెలిపారు. కాళేశ్వరం ప్రాజెక్టు పరిధిలో వివిధ జిల్లాల్లో ఉన్న అన్నపూర్ణ, రంగనాయక సాగర్, మల్లన్న సాగర్, కొండపోచమ్మ సాగర్, బస్వాపూర్ రిజర్వాయర్లను నింపి, సుమారు 4 లక్షల ఎకరాల ఆయకట్టుకు నీరు అందించాలని కోరారు. దాని కోసం కాళేశ్వరం ప్రాజెక్టులో భాగంగా మిడ్ మానేరు నుంచి మోటార్లను ఆన్ చేసి నీటి పంపింగ్ చేయాలని లేఖలో డిమాండ్ చేశారు.

మహిళల వస్త్రధారణపై ఐఏఎస్ స్మితా సబర్వాల్ ఆసక్తికర వ్యాఖ్యలు!అభిప్రాయంSwechaa10 Aug 2026, 02:06 PM

మహిళల వస్త్రధారణపై ఐఏఎస్ స్మితా సబర్వాల్ ఆసక్తికర వ్యాఖ్యలు!

ప్రముఖ ఐఏఎస్ అధికారిణి స్మితా సబర్వాల్ ఇటీవల ఇచ్చిన ఒక ఇంటర్వ్యూలో తన వృత్తి, వ్యక్తిగత జీవిత విశేషాలను పంచుకున్నారు. తెలంగాణ రాష్ట్ర సాధనలో ప్రాణాలర్పించిన అమరుల త్యాగాలను స్మరించుకున్నప్పుడు తాను తీవ్ర భావోద్వేగానికి లోనయ్యానని ఆమె తెలిపారు. అమరులైన కుమారుల త్యాగాలను తలచుకుంటూ ఆ తల్లులు వ్యక్తపరిచిన ఆవేదన ఒక తల్లిగా తనను లోతుగా ప్రభావితం చేసిందని, అలాంటి సందర్భాల్లో కన్నీళ్లు ఆపుకోవడం ఎవరికైనా సాధ్యం కాదని అన్నారు. సమాజంలో మహిళల వస్త్రధారణపై ఉండే అభిప్రాయాలపై స్మితా సబర్వాల్ స్పందిస్తూ.. ఏ దుస్తులు ధరించాలనేది పూర్తిగా మహిళల వ్యక్తిగత సౌకర్యం, ఎంపికకు సంబంధించిన అంశమని స్పష్టం చేశారు.

paper leak : జార్ఖండ్‌లో హై టెన్షన్..  సీఎం సోరెన్ ఇంటి ముట్టడికి యత్నం!NationalSwechaa10 Aug 2026, 02:00 PM

paper leak : జార్ఖండ్‌లో హై టెన్షన్.. సీఎం సోరెన్ ఇంటి ముట్టడికి యత్నం!

జార్ఖండ్‌లో ప్రభుత్వ ఉద్యోగ నియామకాల్లో పేపర్ లీకేజీలపై అక్కడి విద్యార్థులు, అభ్యర్థులు ఒక్కసారిగా ఆగ్రహించారు. పేపర్ లీకేజీకి పాల్పడిన వారిని కఠినంగా శిక్షించడంతో పాటు ఆ నియామకాలు రద్దు చేసి కొత్తగా పరీక్షలు నిర్వహించాలని డిమాండ్ చేస్తున్నారు. ఈ మేరకు చేపట్టిన నిరసనప్రదర్శనలు శాంతియుతంగా కొనసాగుతున్నాయి. రెండ్రోజుల కిందట జార్ఖండ్ రాజధాని రాంచీలో విద్యార్థుల ఆందోళన తీవ్రరూపం దాల్చింది. పలు విద్యార్థి సంఘాల నాయకత్వంలో వేలాది మంది విద్యార్థులు పోలీసు బారికేడ్లను తొసుకుని అసెంబ్లీ ముట్టడికి యత్నించారు. పలు జిల్లాల నుంచి వేలాది మంది విద్యార్థులు రైళ్లు, బస్సులు, సొంత వాహనాల్లో ఉదయం రాంచీకి చేరుకున్న విద్యార్థులు తమ డిమాండ్లను ప్రభుత్వం విని, తగిన సమాధానం చెప్పాలని డిమాడ్ చేశారు. ఇదిలాఉండగా, సోమవారం ఉదయం సీఎం హేమంత్ సోరెన్ నివాసాన్ని విద్యార్థులు ముట్టడికి యత్నించారు.

పాపాలు ఎక్కువైతే వరదల్లో కొట్టుకుపోతారు.. మాతంగి అనురాధ భవిష్యవాణి!తెలంగాణSwechaa10 Aug 2026, 01:46 PM

పాపాలు ఎక్కువైతే వరదల్లో కొట్టుకుపోతారు.. మాతంగి అనురాధ భవిష్యవాణి!

ఆషాఢమాసం చివరివారం కావడంతో హైదరాబాద్ మహానగరంలో బోనాలు ఘనంగా జరుగుతున్నాయి. నిన్న లాల్ దర్వాజా బోనాలు వైభవంగా జరగగా.. మంత్రులు, కీలక నేతలు,సినీ ప్రముఖులు సైతం అమ్మవార్లను దర్శించుకుని సందడి చేశారు.భక్తులు అమ్మవార్లకు బోనం సమర్పించి మొక్కులు తీర్చుకున్నారు. గల్లీగల్లీల్లో అమ్మవార్ల ఘటాల ఊరేగింపు ఘనంగా కొనసాగుతున్నాయి.ఇదిలాఉండగా, సోమవారం ఉప్పుగూడలో బోనాలు వైభవోపేతంగా జరుగుతున్నాయి. అయితే, ఉప్పుగూడలోని శ్రీ మహంకాళి అమ్మవారి ఆలయంలో బోనాల ఉత్సవాల సందర్భంగా నిర్వహించిన రంగం కార్యక్రమంలో మాతంగి అనురాధ పచ్చి కుండపై నిలబడి భవిష్యవాణి వినిపించారు. సమాజంలో పుణ్యం తగ్గి, పాపం ఎక్కువైపోతోందని అన్నారు. తప్పులు సరిదిద్దుకోకపోతే పాపాలు ఎక్కువై కుండపోత వర్షాలు వచ్చి కొట్టుకుపోయే ప్రమాదం ఉందని హెచ్చరించారు.

తెలంగాణలో మరో స్కామ్.. వెలుగులోకి నకిలీ సదరం సర్టిఫికెట్ల భాగోతం!..తెలంగాణSwechaa10 Aug 2026, 01:41 PM

తెలంగాణలో మరో స్కామ్.. వెలుగులోకి నకిలీ సదరం సర్టిఫికెట్ల భాగోతం!..

కామారెడ్డి జిల్లాలో నకిలీ సదరం సర్టిఫికెట్లతో ఉద్యోగాలు పొందిన ఘటన చర్చనీయాంశంగా మారింది. నకిలీ సర్టిఫికెట్లతో దివ్యాంగుల కోటా కింద 18 మంది ఎంపికైనట్లు అధికారులు గుర్తించారు.. వీరు టీఎస్పీఎస్సీ ద్వారా జరిగిన ఎంపిక పరీక్షలో ఉద్యోగాలు పొందినట్లు తెలిపారు.. కాగా మెడికల్ బోర్డు వైద్య పరీక్షల్లో ఈ భాగోతం వెలుగులోకి వచ్చింది. ఈ ఘటనపై అధికారులు విచారణ ప్రారంభించారు.

రూ.100 కోట్లకుపైగా భూమిని రూ.7 కోట్లకే కట్టబెట్టిన రేవంత్ : క్రిశాంక్రాజకీయాలుSwechaa10 Aug 2026, 01:08 PM

రూ.100 కోట్లకుపైగా భూమిని రూ.7 కోట్లకే కట్టబెట్టిన రేవంత్ : క్రిశాంక్

సీఎం రేవంత్ రెడ్డి మీద బీఆర్ఎస్ కీలక నేత మన్నె క్రిశాంక్ మరోసారి సంచలన ఆరోపణలు చేశారు. సీఎం తన తమ్ముడు కొండల్ రెడ్డికి చెందిన కంపెనీకి రావిర్యాలలోని ఫోర్త్ సిటీలో రూ.100 కోట్లకు పైగా విలువైన 5 ఎకరాల భూమిని కేవలం రూ.7 కోట్లకు కట్టబెట్టారని ఆరోపించారు. కొండల్ రెడ్డి సూట్ వెయ్యగానే ఏరోస్పేస్ అండ్ డిఫెన్స్ ఎక్స్‌పర్ట్ అయిపోయారా? అంటూ ప్రశ్నించారు. సోమవారం బీఆర్ఎస్ భవన్‌లో మీడియాతో మాట్లాడిన క్రిశాంక్.. పలు అంశాలను ఈ సందర్బంగా ప్రస్తావించారు. రేవంత్ సోదరుడు అనుముల కొండల్ రెడ్డికి చెందిన ‘టెస్సెరాక్ట్ అడ్వాన్స్‌డ్ సిస్టమ్స్ ప్రైవేట్ లిమిటెడ్’ కంపెనీ బాగోతాన్ని మన్నె క్రిశాంక్ బయటపెట్టారు. ఈ డొల్ల షెల్ కంపెనీని అడ్డం పెట్టుకొని సీఎం సోదరుడు కొండల్ రెడ్డి అమెరికా వాళ్లను కూడా మోసం చేస్తున్నారని, వాళ్లతో సమావేశం పెడుతున్నారని ఆరోపించారు.

కామన్వెల్త్ విజేతలతో ప్రధాని మోదీ: శతాబ్ది గేమ్స్‌కు భారత్ గ్రాండ్ వెల్‌కమ్!క్రీడలుSwechaa10 Aug 2026, 01:06 PM

కామన్వెల్త్ విజేతలతో ప్రధాని మోదీ: శతాబ్ది గేమ్స్‌కు భారత్ గ్రాండ్ వెల్‌కమ్!

స్కాట్లాండ్‌లోని గ్లాస్గో నగరంలో ఇటీవల ముగిసిన ప్రతిష్టాత్మక కామన్వెల్త్ క్రీడలు-2026 లో భారత అథ్లెట్లు అసాధారణ ప్రతిభను కనబరిచారు. కొన్ని క్రీడా విభాగాలను తొలగించినప్పటికీ లభించిన అవకాశాలను సద్వినియోగం చేసుకుంటూ భారత్ మొత్తం 39 పతకాలను (13 స్వర్ణాలు, 17 రజతాలు, 9 కాంస్యాలు) కొల్లగొట్టి పతకాల పట్టికలో నాలుగో స్థానాన్ని ఆక్రమించింది. ముఖ్యంగా బాక్సింగ్ విభాగంలో 10 పతకాలు రాగా, అందులో ఐదు స్వర్ణాలను మహిళా బాక్సర్లే సాధించడం విశేషం. వెయిట్‌లిఫ్టింగ్‌లో మీరాబాయి చాను హ్యాట్రిక్ పసిడితో సరికొత్త చరిత్ర సృష్టించగా, జూడో, అథ్లెటిక్స్, పారా-అథ్లెటిక్స్ విభాగాల్లోనూ మన క్రీడాకారులు విశేషంగా రాణించారు.

పెద్ది ‘గద్దె’ను కూల్చడం దుర్మార్గం..ముమ్మాటికీ కాంగ్రెస్ కుట్రే : ఎర్రబెల్లితెలంగాణSwechaa10 Aug 2026, 12:43 PM

పెద్ది ‘గద్దె’ను కూల్చడం దుర్మార్గం..ముమ్మాటికీ కాంగ్రెస్ కుట్రే : ఎర్రబెల్లి

దివంగత నేత, బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి విగ్రహ ఏర్పాటు కోసం నిర్మించిన ‘గద్దె’ను రాత్రికి రాత్రే కూల్చేశారు. నర్సంపేట ప్రభుత్వ మెడికల్ కాలేజీ ఎదురుగా పెద్ది సుదర్శన్ రెడ్డి విగ్రహా ఏర్పాటుకు బీఆర్ఎస్ నేతలు సంకల్పించగా.. అనుమతి లేదంటూ మున్సిపాలిటీ అధికారులు కూల్చివేశారు. ప్రైవేట్ స్థలంలో విగ్రహాన్ని ఏర్పాటు చేస్తున్నా అనుమతి లేదంటూ రాత్రి వేళ అక్రమంగా అధికారులు కూల్చేయడంపై మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు మండిపడ్డారు.

చెన్నైలో ఏఆర్ రెహమాన్ కుమారుడికి ప్రమాదం.. తప్పిన ముప్పు!సినిమాSwechaa10 Aug 2026, 12:41 PM

చెన్నైలో ఏఆర్ రెహమాన్ కుమారుడికి ప్రమాదం.. తప్పిన ముప్పు!

ప్రముఖ సంగీత దర్శకుడు, ఆస్కార్ అవార్డు గ్రహీత ఏఆర్‌ రెహమాన్ కుమారుడు ఏఆర్‌ అమీన్ చెన్నైలో జరిగిన రోడ్డు ప్రమాదం నుంచి స్వల్ప గాయాలతో సురక్షితంగా బయటపడ్డారు. చెన్నైలోని ఒలింపియా టెక్ పార్క్ సమీపంలో సోమవారం తెల్లవారుజామున ఆయన ప్రయాణిస్తున్న లగ్జరీ కారు మరొక క్యాబ్‌ను ఢీకొనడంతో ఈ ఘటన చోటుచేసుకుంది.

రేణుకాస్వామి హత్యలో కీలక మలుపు.. మరోసారి చిక్కుల్లో హీరో దర్శన్టాప్ న్యూస్Swechaa10 Aug 2026, 12:13 PM

రేణుకాస్వామి హత్యలో కీలక మలుపు.. మరోసారి చిక్కుల్లో హీరో దర్శన్

కన్నడ హీరో దర్శన్ మరోసారి చిక్కుల్లో పడ్డారు. తన అభిమాని రేణుకాస్వామి హత్య కేసులో అరెస్టు అయ్యి జైలులో ఉన్న ఆయనకు కఠిన శిక్ష తప్పేలా లేదని తెలుస్తోంది. ఎందుకంటే రేణుకాస్వామి హత్యకేసులో ఏ-14గా ఉన్న నిందితుడు అప్రూవర్‌గా మారినట్టు తెలిసింది.దీంతో విచారణలో భాగంగా పోలీసులకు అసలు నిజాలను వెల్లడించినట్టు సమాచారం. రేణుకాస్వామి హత్య కేసులో A-14గా దర్శన్ అనుచరుడు ప్రదోష్ ఉన్నాడు. విచారణలో ఆయన వెల్లడించిన నిజాలు ఇలా ఉన్నాయి. ‘పవిత్ర గౌడకు మెసే‌జ్‌లు పంపిన రేణుకాస్వామిని దర్శన్ బూతులతో దూషిస్తూ, తల నుంచి రక్తం వచ్చేలా కొట్టాడు.బట్టలూడదీసి దొస్తులతో కారుకు వేలాడదీసి దారుణంగా కొట్టాడు. ఆ తర్వాత దర్శన్ కాల్ చేయగా.. ఘటనా స్థలానికి వెళ్లి రేణుకాస్వామిని పవిత్ర గౌడ చెప్పుతో కొట్టింది. అనంతరం రేణుకాస్వామిని అండర్‌వేర్ మీద టాటా ఏస్‌కు వేలాడదీసి నైలాన్ తాడుతో విచక్షణా రహితంగా దాడి చేశారు.

పెరగనున్న నిత్యావసరాల ధరలు.. సెప్టెంబర్‌లో మరో బాదుడుకు కంపెనీల సిద్ధం!వ్యాపారంSwechaa10 Aug 2026, 12:12 PM

పెరగనున్న నిత్యావసరాల ధరలు.. సెప్టెంబర్‌లో మరో బాదుడుకు కంపెనీల సిద్ధం!

భారతీయ వినియోగదారులకు రాబోయే రోజుల్లో మరోసారి ద్రవ్యోల్బణం వేడి తగలనుంది. రోజువారీ జీవితంలో వినియోగించే సబ్బులు, బిస్కెట్లు, ఇతర ఎఫ్‌ఎమ్‌సీజీ (FMCG) ఉత్పత్తుల ధరలను పెంచేందుకు ప్రముఖ తయారీ సంస్థలు వేగంగా సన్నాహాలు చేస్తున్నాయి. ఇరాన్ యుద్దంతో పాటు అంతర్జాతీయంగా నెలకొన్న ఉద్రిక్తతల వల్ల ముడిసరుకుల వ్యయం విపరీతంగా పెరిగిపోవడమే ఇందుకు ప్రధాన కారణంగా నిలుస్తోంది. తమ లాభాల మార్జిన్లను కాపాడుకునేందుకు గాను సెప్టెంబర్‌తో ముగిసే త్రైమాసికంలో ధరల సవరణ తప్పదని దిగ్గజ కంపెనీలు సంకేతాలు ఇచ్చాయి.

శ్రీ చైతన్యలో ర్యాగింగ్ కలకలం.. విద్యార్థిని కర్రలతో కొట్టి, బూట్లతో తొక్కి!తెలంగాణSwechaa10 Aug 2026, 12:01 PM

శ్రీ చైతన్యలో ర్యాగింగ్ కలకలం.. విద్యార్థిని కర్రలతో కొట్టి, బూట్లతో తొక్కి!

హైదరాబాద్ మహానగరంలో మరోసారి ర్యాగింగ్ కలకలం రేపింది. ప్రైవేటు విద్యాసంస్థ అయిన శ్రీచైతన్య స్కూల్లో ఓ విద్యార్థిని పట్ల సీనియర్ విద్యార్థులు అత్యంత క్రూరంగా ప్రవర్తించారు. చిత్రహింసలు చేయడంతో పాటు తీవ్రంగా దాడి చేశారు. ఈ ఘటన మేడ్చల్–మల్కాజిగిరి జిల్లా దమ్మాయిగూడలోని శ్రీ చైతన్య హైస్కూల్లో వెలుగుచూసింది. వివరాల్లోకివెళితే.. కామారెడ్డికి చెందిన అభిషేక్ అనే విద్యార్థి దమ్మాయిగూడలోని శ్రీ చైతన్య హైస్కూల్లో పదో తరగతి చదువుతున్నాడు.అయితే, సీనియర్ విద్యార్థులు అతన్ని దారుణంగా కొట్టినట్టు తెలిసింది. కర్రలతో కొట్టడంతో పాటు బూట్లతో ముఖంపై తొక్కారని తెలిసింది. రాత్రి సమయంలో హాస్టల్లో ఉన్న అభిషేక్‌ను సీనియర్ విద్యార్థులు 12 మంది కర్రలు,ప్లేట్లతో తీవ్రంగా దాడి చేయడంతో పాటు బూట్లతో ముఖంపై తొక్కారని బాధిత విద్యార్థి ఆవేదన వ్యక్తం చేశాడు.

కాంగ్రెస్ నేతల దౌర్జన్యం.. వేధింపులు తాళలేక రైతు ఆత్మహత్యాయత్నం!తెలంగాణSwechaa10 Aug 2026, 11:53 AM

కాంగ్రెస్ నేతల దౌర్జన్యం.. వేధింపులు తాళలేక రైతు ఆత్మహత్యాయత్నం!

మధిర నియోజకవర్గంలో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క అనుచరుల వేధింపులు తాళలేక ఒక సామాన్య రైతు ఆత్మహత్యాయత్నానికి ఒడిగట్టిన ఘటన స్థానికంగా తీవ్ర కలకలం రేపింది. ఖమ్మం జిల్లా చింతకాని మండలం నాగులవంచ గ్రామానికి చెందిన జొన్నలగడ్డ మల్లికార్జున రావు అనే రైతు తన స్వంత భూమిని కాపాడుకునే క్రమంలో కాంగ్రెస్ స్థానిక నాయకుల చేతిలో నిత్యం వేధింపులకు గురయ్యాడు. తీవ్ర మనస్తాపానికి గురైన మల్లికార్జునరావు పురుగుల మందు తాగి ప్రాణాపాయ స్థితికి చేరుకోవడంతో కుటుంబ సభ్యులు హుటాహుటిన ఆస్పత్రికి తరలించారు. బాధితుడు తెలిపిన వివరాల ప్రకారం.. గ్రామంలో రోడ్డు నిర్మాణం పేరిట కాంగ్రెస్ మండల అధ్యక్షుడు, మార్కెట్ కమిటీ చైర్మన్ అంబటి వెంకటేశ్వరరావు, అతని వర్గీయులు ఉద్దేశపూర్వకంగానే తన భూమిని మాత్రమే లాక్కోవాలని చూస్తున్నారు.

Alert : ఉచిత వైఫై వాడేవారికి అలర్ట్.. మైక్రోసాఫ్ట్  థ్రెట్ హెచ్చరికప్రపంచంSwechaa10 Aug 2026, 11:42 AM

Alert : ఉచిత వైఫై వాడేవారికి అలర్ట్.. మైక్రోసాఫ్ట్ థ్రెట్ హెచ్చరిక

మొబైల్ యూజర్లు ఎవరైతే హోటల్స్‌, పబ్లిక్ ప్రదేశాల్లో ఉచిత ఇంటర్ నెట్ (వైఫై) వినియోగించేవారికి మైక్రోసాఫ్ట్ థ్రెట్ హెచ్చరికలు జారీచేసింది.ఇలాంటి వారిని టార్గెట్ చేసుకుని సైబర్ మోసగాళ్లు దాడులు చేస్తున్నారని ముందస్తు వార్నింగ్ ఇచ్చింది. పబ్లిక్, హోటల్ వైఫై నెట్‌వర్క్‌ల ద్వారా జరుగుతున్న ఈ దాడులను 'క్యాప్టివ్‌క్రంచ్'గా అభివర్ణించింది. దీని వెనుక రష్యాకు చెందిన ఓ ముఠా హస్తం ఉన్నట్టు మైక్రోసాఫ్ట్ థ్రెట్ ఇంటెలిజెన్స్ బృందం హెచ్చరించింది. హ్యాకింగ్ గ్రూప్ 'మిడ్‌నైట్ బ్లిజార్డ్'గా ముఠాగా అనుమానం వ్యక్తం చేసింది.