స్వేచ్ఛ షార్ట్స్ — తాజా తెలుగు వార్తలు

మంత్రి ఉత్తమ్‌కు హరీశ్ రావు సంచలన లేఖరాజకీయాలుSwechaa10 Aug 2026, 02:09 PM

మంత్రి ఉత్తమ్‌కు హరీశ్ రావు సంచలన లేఖ

రాష్ట్ర నీటిపారుదలశాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డికి బీఆర్ఎస్ సీనియర్ నేత, మాజీ మంత్రి హరీశ్ రావు సోమవారం లేఖ రాశారు.రాష్ట్రంలో రైతులు పడుతున్న ఇబ్బందులను దృష్టిలో ఉంచుకుని తక్షణమే కాళేశ్వరం మోటార్లు ఆన్‌చేయాలని అందులో పేర్కొన్నారు.రిజర్వాయర్లలో నీటిని సకాలంలో నింపకపోవడం వల్ల పంటలు సాగు కాక రైతులు తీవ్ర ఆందోళనలో ఉన్నారని తెలిపారు. కాళేశ్వరం ప్రాజెక్టు పరిధిలో వివిధ జిల్లాల్లో ఉన్న అన్నపూర్ణ, రంగనాయక సాగర్, మల్లన్న సాగర్, కొండపోచమ్మ సాగర్, బస్వాపూర్ రిజర్వాయర్లను నింపి, సుమారు 4 లక్షల ఎకరాల ఆయకట్టుకు నీరు అందించాలని కోరారు. దాని కోసం కాళేశ్వరం ప్రాజెక్టులో భాగంగా మిడ్ మానేరు నుంచి మోటార్లను ఆన్ చేసి నీటి పంపింగ్ చేయాలని లేఖలో డిమాండ్ చేశారు.

మహిళల వస్త్రధారణపై ఐఏఎస్ స్మితా సబర్వాల్ ఆసక్తికర వ్యాఖ్యలు!అభిప్రాయంSwechaa10 Aug 2026, 02:06 PM

మహిళల వస్త్రధారణపై ఐఏఎస్ స్మితా సబర్వాల్ ఆసక్తికర వ్యాఖ్యలు!

ప్రముఖ ఐఏఎస్ అధికారిణి స్మితా సబర్వాల్ ఇటీవల ఇచ్చిన ఒక ఇంటర్వ్యూలో తన వృత్తి, వ్యక్తిగత జీవిత విశేషాలను పంచుకున్నారు. తెలంగాణ రాష్ట్ర సాధనలో ప్రాణాలర్పించిన అమరుల త్యాగాలను స్మరించుకున్నప్పుడు తాను తీవ్ర భావోద్వేగానికి లోనయ్యానని ఆమె తెలిపారు. అమరులైన కుమారుల త్యాగాలను తలచుకుంటూ ఆ తల్లులు వ్యక్తపరిచిన ఆవేదన ఒక తల్లిగా తనను లోతుగా ప్రభావితం చేసిందని, అలాంటి సందర్భాల్లో కన్నీళ్లు ఆపుకోవడం ఎవరికైనా సాధ్యం కాదని అన్నారు. సమాజంలో మహిళల వస్త్రధారణపై ఉండే అభిప్రాయాలపై స్మితా సబర్వాల్ స్పందిస్తూ.. ఏ దుస్తులు ధరించాలనేది పూర్తిగా మహిళల వ్యక్తిగత సౌకర్యం, ఎంపికకు సంబంధించిన అంశమని స్పష్టం చేశారు.

paper leak : జార్ఖండ్‌లో హై టెన్షన్..  సీఎం సోరెన్ ఇంటి ముట్టడికి యత్నం!NationalSwechaa10 Aug 2026, 02:00 PM

paper leak : జార్ఖండ్‌లో హై టెన్షన్.. సీఎం సోరెన్ ఇంటి ముట్టడికి యత్నం!

జార్ఖండ్‌లో ప్రభుత్వ ఉద్యోగ నియామకాల్లో పేపర్ లీకేజీలపై అక్కడి విద్యార్థులు, అభ్యర్థులు ఒక్కసారిగా ఆగ్రహించారు. పేపర్ లీకేజీకి పాల్పడిన వారిని కఠినంగా శిక్షించడంతో పాటు ఆ నియామకాలు రద్దు చేసి కొత్తగా పరీక్షలు నిర్వహించాలని డిమాండ్ చేస్తున్నారు. ఈ మేరకు చేపట్టిన నిరసనప్రదర్శనలు శాంతియుతంగా కొనసాగుతున్నాయి. రెండ్రోజుల కిందట జార్ఖండ్ రాజధాని రాంచీలో విద్యార్థుల ఆందోళన తీవ్రరూపం దాల్చింది. పలు విద్యార్థి సంఘాల నాయకత్వంలో వేలాది మంది విద్యార్థులు పోలీసు బారికేడ్లను తొసుకుని అసెంబ్లీ ముట్టడికి యత్నించారు. పలు జిల్లాల నుంచి వేలాది మంది విద్యార్థులు రైళ్లు, బస్సులు, సొంత వాహనాల్లో ఉదయం రాంచీకి చేరుకున్న విద్యార్థులు తమ డిమాండ్లను ప్రభుత్వం విని, తగిన సమాధానం చెప్పాలని డిమాడ్ చేశారు. ఇదిలాఉండగా, సోమవారం ఉదయం సీఎం హేమంత్ సోరెన్ నివాసాన్ని విద్యార్థులు ముట్టడికి యత్నించారు.

పాపాలు ఎక్కువైతే వరదల్లో కొట్టుకుపోతారు.. మాతంగి అనురాధ భవిష్యవాణి!తెలంగాణSwechaa10 Aug 2026, 01:46 PM

పాపాలు ఎక్కువైతే వరదల్లో కొట్టుకుపోతారు.. మాతంగి అనురాధ భవిష్యవాణి!

ఆషాఢమాసం చివరివారం కావడంతో హైదరాబాద్ మహానగరంలో బోనాలు ఘనంగా జరుగుతున్నాయి. నిన్న లాల్ దర్వాజా బోనాలు వైభవంగా జరగగా.. మంత్రులు, కీలక నేతలు,సినీ ప్రముఖులు సైతం అమ్మవార్లను దర్శించుకుని సందడి చేశారు.భక్తులు అమ్మవార్లకు బోనం సమర్పించి మొక్కులు తీర్చుకున్నారు. గల్లీగల్లీల్లో అమ్మవార్ల ఘటాల ఊరేగింపు ఘనంగా కొనసాగుతున్నాయి.ఇదిలాఉండగా, సోమవారం ఉప్పుగూడలో బోనాలు వైభవోపేతంగా జరుగుతున్నాయి. అయితే, ఉప్పుగూడలోని శ్రీ మహంకాళి అమ్మవారి ఆలయంలో బోనాల ఉత్సవాల సందర్భంగా నిర్వహించిన రంగం కార్యక్రమంలో మాతంగి అనురాధ పచ్చి కుండపై నిలబడి భవిష్యవాణి వినిపించారు. సమాజంలో పుణ్యం తగ్గి, పాపం ఎక్కువైపోతోందని అన్నారు. తప్పులు సరిదిద్దుకోకపోతే పాపాలు ఎక్కువై కుండపోత వర్షాలు వచ్చి కొట్టుకుపోయే ప్రమాదం ఉందని హెచ్చరించారు.

తెలంగాణలో మరో స్కామ్.. వెలుగులోకి నకిలీ సదరం సర్టిఫికెట్ల భాగోతం!..తెలంగాణSwechaa10 Aug 2026, 01:41 PM

తెలంగాణలో మరో స్కామ్.. వెలుగులోకి నకిలీ సదరం సర్టిఫికెట్ల భాగోతం!..

కామారెడ్డి జిల్లాలో నకిలీ సదరం సర్టిఫికెట్లతో ఉద్యోగాలు పొందిన ఘటన చర్చనీయాంశంగా మారింది. నకిలీ సర్టిఫికెట్లతో దివ్యాంగుల కోటా కింద 18 మంది ఎంపికైనట్లు అధికారులు గుర్తించారు.. వీరు టీఎస్పీఎస్సీ ద్వారా జరిగిన ఎంపిక పరీక్షలో ఉద్యోగాలు పొందినట్లు తెలిపారు.. కాగా మెడికల్ బోర్డు వైద్య పరీక్షల్లో ఈ భాగోతం వెలుగులోకి వచ్చింది. ఈ ఘటనపై అధికారులు విచారణ ప్రారంభించారు.

రూ.100 కోట్లకుపైగా భూమిని రూ.7 కోట్లకే కట్టబెట్టిన రేవంత్ : క్రిశాంక్రాజకీయాలుSwechaa10 Aug 2026, 01:08 PM

రూ.100 కోట్లకుపైగా భూమిని రూ.7 కోట్లకే కట్టబెట్టిన రేవంత్ : క్రిశాంక్

సీఎం రేవంత్ రెడ్డి మీద బీఆర్ఎస్ కీలక నేత మన్నె క్రిశాంక్ మరోసారి సంచలన ఆరోపణలు చేశారు. సీఎం తన తమ్ముడు కొండల్ రెడ్డికి చెందిన కంపెనీకి రావిర్యాలలోని ఫోర్త్ సిటీలో రూ.100 కోట్లకు పైగా విలువైన 5 ఎకరాల భూమిని కేవలం రూ.7 కోట్లకు కట్టబెట్టారని ఆరోపించారు. కొండల్ రెడ్డి సూట్ వెయ్యగానే ఏరోస్పేస్ అండ్ డిఫెన్స్ ఎక్స్‌పర్ట్ అయిపోయారా? అంటూ ప్రశ్నించారు. సోమవారం బీఆర్ఎస్ భవన్‌లో మీడియాతో మాట్లాడిన క్రిశాంక్.. పలు అంశాలను ఈ సందర్బంగా ప్రస్తావించారు. రేవంత్ సోదరుడు అనుముల కొండల్ రెడ్డికి చెందిన ‘టెస్సెరాక్ట్ అడ్వాన్స్‌డ్ సిస్టమ్స్ ప్రైవేట్ లిమిటెడ్’ కంపెనీ బాగోతాన్ని మన్నె క్రిశాంక్ బయటపెట్టారు. ఈ డొల్ల షెల్ కంపెనీని అడ్డం పెట్టుకొని సీఎం సోదరుడు కొండల్ రెడ్డి అమెరికా వాళ్లను కూడా మోసం చేస్తున్నారని, వాళ్లతో సమావేశం పెడుతున్నారని ఆరోపించారు.

కామన్వెల్త్ విజేతలతో ప్రధాని మోదీ: శతాబ్ది గేమ్స్‌కు భారత్ గ్రాండ్ వెల్‌కమ్!క్రీడలుSwechaa10 Aug 2026, 01:06 PM

కామన్వెల్త్ విజేతలతో ప్రధాని మోదీ: శతాబ్ది గేమ్స్‌కు భారత్ గ్రాండ్ వెల్‌కమ్!

స్కాట్లాండ్‌లోని గ్లాస్గో నగరంలో ఇటీవల ముగిసిన ప్రతిష్టాత్మక కామన్వెల్త్ క్రీడలు-2026 లో భారత అథ్లెట్లు అసాధారణ ప్రతిభను కనబరిచారు. కొన్ని క్రీడా విభాగాలను తొలగించినప్పటికీ లభించిన అవకాశాలను సద్వినియోగం చేసుకుంటూ భారత్ మొత్తం 39 పతకాలను (13 స్వర్ణాలు, 17 రజతాలు, 9 కాంస్యాలు) కొల్లగొట్టి పతకాల పట్టికలో నాలుగో స్థానాన్ని ఆక్రమించింది. ముఖ్యంగా బాక్సింగ్ విభాగంలో 10 పతకాలు రాగా, అందులో ఐదు స్వర్ణాలను మహిళా బాక్సర్లే సాధించడం విశేషం. వెయిట్‌లిఫ్టింగ్‌లో మీరాబాయి చాను హ్యాట్రిక్ పసిడితో సరికొత్త చరిత్ర సృష్టించగా, జూడో, అథ్లెటిక్స్, పారా-అథ్లెటిక్స్ విభాగాల్లోనూ మన క్రీడాకారులు విశేషంగా రాణించారు.

పెద్ది ‘గద్దె’ను కూల్చడం దుర్మార్గం..ముమ్మాటికీ కాంగ్రెస్ కుట్రే : ఎర్రబెల్లితెలంగాణSwechaa10 Aug 2026, 12:43 PM

పెద్ది ‘గద్దె’ను కూల్చడం దుర్మార్గం..ముమ్మాటికీ కాంగ్రెస్ కుట్రే : ఎర్రబెల్లి

దివంగత నేత, బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి విగ్రహ ఏర్పాటు కోసం నిర్మించిన ‘గద్దె’ను రాత్రికి రాత్రే కూల్చేశారు. నర్సంపేట ప్రభుత్వ మెడికల్ కాలేజీ ఎదురుగా పెద్ది సుదర్శన్ రెడ్డి విగ్రహా ఏర్పాటుకు బీఆర్ఎస్ నేతలు సంకల్పించగా.. అనుమతి లేదంటూ మున్సిపాలిటీ అధికారులు కూల్చివేశారు. ప్రైవేట్ స్థలంలో విగ్రహాన్ని ఏర్పాటు చేస్తున్నా అనుమతి లేదంటూ రాత్రి వేళ అక్రమంగా అధికారులు కూల్చేయడంపై మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు మండిపడ్డారు.

చెన్నైలో ఏఆర్ రెహమాన్ కుమారుడికి ప్రమాదం.. తప్పిన ముప్పు!సినిమాSwechaa10 Aug 2026, 12:41 PM

చెన్నైలో ఏఆర్ రెహమాన్ కుమారుడికి ప్రమాదం.. తప్పిన ముప్పు!

ప్రముఖ సంగీత దర్శకుడు, ఆస్కార్ అవార్డు గ్రహీత ఏఆర్‌ రెహమాన్ కుమారుడు ఏఆర్‌ అమీన్ చెన్నైలో జరిగిన రోడ్డు ప్రమాదం నుంచి స్వల్ప గాయాలతో సురక్షితంగా బయటపడ్డారు. చెన్నైలోని ఒలింపియా టెక్ పార్క్ సమీపంలో సోమవారం తెల్లవారుజామున ఆయన ప్రయాణిస్తున్న లగ్జరీ కారు మరొక క్యాబ్‌ను ఢీకొనడంతో ఈ ఘటన చోటుచేసుకుంది.

రేణుకాస్వామి హత్యలో కీలక మలుపు.. మరోసారి చిక్కుల్లో హీరో దర్శన్టాప్ న్యూస్Swechaa10 Aug 2026, 12:13 PM

రేణుకాస్వామి హత్యలో కీలక మలుపు.. మరోసారి చిక్కుల్లో హీరో దర్శన్

కన్నడ హీరో దర్శన్ మరోసారి చిక్కుల్లో పడ్డారు. తన అభిమాని రేణుకాస్వామి హత్య కేసులో అరెస్టు అయ్యి జైలులో ఉన్న ఆయనకు కఠిన శిక్ష తప్పేలా లేదని తెలుస్తోంది. ఎందుకంటే రేణుకాస్వామి హత్యకేసులో ఏ-14గా ఉన్న నిందితుడు అప్రూవర్‌గా మారినట్టు తెలిసింది.దీంతో విచారణలో భాగంగా పోలీసులకు అసలు నిజాలను వెల్లడించినట్టు సమాచారం. రేణుకాస్వామి హత్య కేసులో A-14గా దర్శన్ అనుచరుడు ప్రదోష్ ఉన్నాడు. విచారణలో ఆయన వెల్లడించిన నిజాలు ఇలా ఉన్నాయి. ‘పవిత్ర గౌడకు మెసే‌జ్‌లు పంపిన రేణుకాస్వామిని దర్శన్ బూతులతో దూషిస్తూ, తల నుంచి రక్తం వచ్చేలా కొట్టాడు.బట్టలూడదీసి దొస్తులతో కారుకు వేలాడదీసి దారుణంగా కొట్టాడు. ఆ తర్వాత దర్శన్ కాల్ చేయగా.. ఘటనా స్థలానికి వెళ్లి రేణుకాస్వామిని పవిత్ర గౌడ చెప్పుతో కొట్టింది. అనంతరం రేణుకాస్వామిని అండర్‌వేర్ మీద టాటా ఏస్‌కు వేలాడదీసి నైలాన్ తాడుతో విచక్షణా రహితంగా దాడి చేశారు.

పెరగనున్న నిత్యావసరాల ధరలు.. సెప్టెంబర్‌లో మరో బాదుడుకు కంపెనీల సిద్ధం!వ్యాపారంSwechaa10 Aug 2026, 12:12 PM

పెరగనున్న నిత్యావసరాల ధరలు.. సెప్టెంబర్‌లో మరో బాదుడుకు కంపెనీల సిద్ధం!

భారతీయ వినియోగదారులకు రాబోయే రోజుల్లో మరోసారి ద్రవ్యోల్బణం వేడి తగలనుంది. రోజువారీ జీవితంలో వినియోగించే సబ్బులు, బిస్కెట్లు, ఇతర ఎఫ్‌ఎమ్‌సీజీ (FMCG) ఉత్పత్తుల ధరలను పెంచేందుకు ప్రముఖ తయారీ సంస్థలు వేగంగా సన్నాహాలు చేస్తున్నాయి. ఇరాన్ యుద్దంతో పాటు అంతర్జాతీయంగా నెలకొన్న ఉద్రిక్తతల వల్ల ముడిసరుకుల వ్యయం విపరీతంగా పెరిగిపోవడమే ఇందుకు ప్రధాన కారణంగా నిలుస్తోంది. తమ లాభాల మార్జిన్లను కాపాడుకునేందుకు గాను సెప్టెంబర్‌తో ముగిసే త్రైమాసికంలో ధరల సవరణ తప్పదని దిగ్గజ కంపెనీలు సంకేతాలు ఇచ్చాయి.

శ్రీ చైతన్యలో ర్యాగింగ్ కలకలం.. విద్యార్థిని కర్రలతో కొట్టి, బూట్లతో తొక్కి!తెలంగాణSwechaa10 Aug 2026, 12:01 PM

శ్రీ చైతన్యలో ర్యాగింగ్ కలకలం.. విద్యార్థిని కర్రలతో కొట్టి, బూట్లతో తొక్కి!

హైదరాబాద్ మహానగరంలో మరోసారి ర్యాగింగ్ కలకలం రేపింది. ప్రైవేటు విద్యాసంస్థ అయిన శ్రీచైతన్య స్కూల్లో ఓ విద్యార్థిని పట్ల సీనియర్ విద్యార్థులు అత్యంత క్రూరంగా ప్రవర్తించారు. చిత్రహింసలు చేయడంతో పాటు తీవ్రంగా దాడి చేశారు. ఈ ఘటన మేడ్చల్–మల్కాజిగిరి జిల్లా దమ్మాయిగూడలోని శ్రీ చైతన్య హైస్కూల్లో వెలుగుచూసింది. వివరాల్లోకివెళితే.. కామారెడ్డికి చెందిన అభిషేక్ అనే విద్యార్థి దమ్మాయిగూడలోని శ్రీ చైతన్య హైస్కూల్లో పదో తరగతి చదువుతున్నాడు.అయితే, సీనియర్ విద్యార్థులు అతన్ని దారుణంగా కొట్టినట్టు తెలిసింది. కర్రలతో కొట్టడంతో పాటు బూట్లతో ముఖంపై తొక్కారని తెలిసింది. రాత్రి సమయంలో హాస్టల్లో ఉన్న అభిషేక్‌ను సీనియర్ విద్యార్థులు 12 మంది కర్రలు,ప్లేట్లతో తీవ్రంగా దాడి చేయడంతో పాటు బూట్లతో ముఖంపై తొక్కారని బాధిత విద్యార్థి ఆవేదన వ్యక్తం చేశాడు.

కాంగ్రెస్ నేతల దౌర్జన్యం.. వేధింపులు తాళలేక రైతు ఆత్మహత్యాయత్నం!తెలంగాణSwechaa10 Aug 2026, 11:53 AM

కాంగ్రెస్ నేతల దౌర్జన్యం.. వేధింపులు తాళలేక రైతు ఆత్మహత్యాయత్నం!

మధిర నియోజకవర్గంలో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క అనుచరుల వేధింపులు తాళలేక ఒక సామాన్య రైతు ఆత్మహత్యాయత్నానికి ఒడిగట్టిన ఘటన స్థానికంగా తీవ్ర కలకలం రేపింది. ఖమ్మం జిల్లా చింతకాని మండలం నాగులవంచ గ్రామానికి చెందిన జొన్నలగడ్డ మల్లికార్జున రావు అనే రైతు తన స్వంత భూమిని కాపాడుకునే క్రమంలో కాంగ్రెస్ స్థానిక నాయకుల చేతిలో నిత్యం వేధింపులకు గురయ్యాడు. తీవ్ర మనస్తాపానికి గురైన మల్లికార్జునరావు పురుగుల మందు తాగి ప్రాణాపాయ స్థితికి చేరుకోవడంతో కుటుంబ సభ్యులు హుటాహుటిన ఆస్పత్రికి తరలించారు. బాధితుడు తెలిపిన వివరాల ప్రకారం.. గ్రామంలో రోడ్డు నిర్మాణం పేరిట కాంగ్రెస్ మండల అధ్యక్షుడు, మార్కెట్ కమిటీ చైర్మన్ అంబటి వెంకటేశ్వరరావు, అతని వర్గీయులు ఉద్దేశపూర్వకంగానే తన భూమిని మాత్రమే లాక్కోవాలని చూస్తున్నారు.

Alert : ఉచిత వైఫై వాడేవారికి అలర్ట్.. మైక్రోసాఫ్ట్  థ్రెట్ హెచ్చరికప్రపంచంSwechaa10 Aug 2026, 11:42 AM

Alert : ఉచిత వైఫై వాడేవారికి అలర్ట్.. మైక్రోసాఫ్ట్ థ్రెట్ హెచ్చరిక

మొబైల్ యూజర్లు ఎవరైతే హోటల్స్‌, పబ్లిక్ ప్రదేశాల్లో ఉచిత ఇంటర్ నెట్ (వైఫై) వినియోగించేవారికి మైక్రోసాఫ్ట్ థ్రెట్ హెచ్చరికలు జారీచేసింది.ఇలాంటి వారిని టార్గెట్ చేసుకుని సైబర్ మోసగాళ్లు దాడులు చేస్తున్నారని ముందస్తు వార్నింగ్ ఇచ్చింది. పబ్లిక్, హోటల్ వైఫై నెట్‌వర్క్‌ల ద్వారా జరుగుతున్న ఈ దాడులను 'క్యాప్టివ్‌క్రంచ్'గా అభివర్ణించింది. దీని వెనుక రష్యాకు చెందిన ఓ ముఠా హస్తం ఉన్నట్టు మైక్రోసాఫ్ట్ థ్రెట్ ఇంటెలిజెన్స్ బృందం హెచ్చరించింది. హ్యాకింగ్ గ్రూప్ 'మిడ్‌నైట్ బ్లిజార్డ్'గా ముఠాగా అనుమానం వ్యక్తం చేసింది.

ఆషాఢంలో గోరింటాకు, గాజుల పండుగ.. సంప్రదాయం వెనుక ఆరోగ్య రహస్యాలు!తెలంగాణSwechaa10 Aug 2026, 11:34 AM

ఆషాఢంలో గోరింటాకు, గాజుల పండుగ.. సంప్రదాయం వెనుక ఆరోగ్య రహస్యాలు!

హిందూ సంప్రదాయంలో ఆషాఢ మాసానికి ఒక ప్రత్యేకమైన సాంస్కృతిక, ఆధ్యాత్మిక ప్రాధాన్యత ఉంది. ఈ మాసంలో వివాహాది శుభకార్యాలు నిర్వహించకపోయినప్పటికీ, లక్ష్మీదేవి, గ్రామదేవతల ఆరాధనతో పాటు 'గోరింటాకు, గాజుల పండుగ'ను మహిళలు ఎంతో కోలాహలంగా జరుపుకుంటారు. తరతరాలుగా వస్తున్న ఈ ఆచారం కేవలం ఒక పండగ లేదా బాహ్య అలంకరణ మాత్రమే కాదు. దీని వెనుక దాగి ఉన్న పురాణ నేపథ్యం, ఆయుర్వేద ఆరోగ్య రహస్యాలు, శాస్త్రీయ కారణాలు తెలుసుకుందాం..

GOlD : హమ్మయ్యా..  దిగొచ్చిన బంగారం, వెండి ధరలు!వ్యాపారంSwechaa10 Aug 2026, 11:21 AM

GOlD : హమ్మయ్యా.. దిగొచ్చిన బంగారం, వెండి ధరలు!

పసిడి ప్రియులకు ఎట్టకేలకు ఊరట లభించింది. కొద్ది రోజులుగా ధరలు పెరుగుతూ కస్టమర్లకు చుక్కలు చూపిస్తున్న బంగారం, వెండి ఎట్టకేలకు దిగొచ్చింది. నిన్నటితో పోలిస్తే సోమవారం ఉదయం పసిడి, వెండి ధరల్లో స్వల్ప తగ్గుదల నమోదు అయ్యింది.ధరలు పెరుగుతుండటంతో వినియోగదారులు తీవ్ర ఆందోళన చెందారు. తాజాగా ధరలు తగ్గడంతో పసిడి ప్రియులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.ఇవాళ హైదరాబాద్‌లో మేలిమి బంగారం (24 క్యారెట్లు) 10 గ్రాముల ధర రూ.380 తగ్గి రూ.1,51,970 పలుకుతోంది. అలాగే ఆభరణాల తయారీకి ఉపయోగించే 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.350 తగ్గగా ప్రస్తుతం రూ. 1,39,300గా ఉంది. ఇది అంతకుముందు రోజు నమోదైన రూ.1,39,650 కంటే రూ. 10 తక్కువ. ఇక వెండి సైతం పసిడి బాటలోనే నడుస్తోంది.

ట్రాఫిక్‌లోనే 200 గంటలు.. నరకం చూస్తున్న హైదరాబాదీలు!తెలంగాణSwechaa10 Aug 2026, 10:44 AM

ట్రాఫిక్‌లోనే 200 గంటలు.. నరకం చూస్తున్న హైదరాబాదీలు!

హైదరాబాద్‌లోని ట్రాఫిక్ పుణ్యమా అని వాహనదారులు తీవ్ర ఇబ్బందులను ఎదుర్కొంటున్నారు. అడుగు తీసి అడుగు వేయలేని దుస్థితికి నగరంలో ట్రాఫిక్ పెరిగింది. వర్షాకాలం వచ్చిందంటే చాలు నరకప్రాయమే. వాహనాలు ఆగిపోయాయంటే గంటల కొద్దీ వాహనదారులు, ప్రయాణికులు ట్రాఫిక్‌లో చిక్కుకోవాల్సిందే. చిన్నా పెద్దా తేడా లేకుండా ట్రాఫిక్‌లో అవస్థలు పడాల్సిందే. అయితే, సగటున ఓ మనిషి హైదరాబాద్ ట్రాఫిక్‌లో ఎన్ని గంటలు వెయిట్ చేయాల్సి వస్తుందో తెలిస్తే షాక్ అవుతారు.సగటు హైదరాబాదీ ఏడాదికి 200 గంటల విలువైన తన సమయాన్ని కేవలం రోడ్ల మీద, వాహనాల రద్దీ మధ్యే గడిపేస్తున్నాడని తాజా ట్రాఫిక్ ఇండెక్స్ సర్వే తెలిపింది. ఈ సర్వే వాస్తవాలు పలువురిని ఆందోళనకు గురిచేస్తున్నాయి.

వర్షాలు కురవాలని మొసలికి పూజలు..  (వీడియో వైరల్)తెలంగాణSwechaa10 Aug 2026, 10:28 AM

వర్షాలు కురవాలని మొసలికి పూజలు.. (వీడియో వైరల్)

వర్షాలు కురవాలని కొందరు కప్పతల్లి వేషాలు వేస్తుంటారు. వాడవాడలా ఊరేగింపులు చేస్తుంటారు.కొందరైతే గాడిదలకు పెళ్లి చేసి ఊరేగిస్తుంటారు. ఇలా చేయడం వలన వర్షాలు కురుస్తాయని వారి నమ్మకం. అయితే, ఇవన్నీ మూఢనమ్మకాలు అని మరికొందరు కొట్టిపారేస్తుంటారు. ఇలాంటి ఘటనలు ఎక్కువగా గ్రామీణ ప్రాంతాల్లోనే జరుగుతుంటాయి. మరికొందరు అమ్మవార్లకు పూజలు చేసి మొక్కులు సమర్పిస్తుంటారు.వరుణదేవుడికి సైతం మరికొందరు పూజలు చేస్తుంటారు.ఇదివరకు ఎన్నడూ చూడని విధంగా ఓ వ్యక్తి ఏకంగా మొసలికి పూజలు చేయడం కలకలం రేపింది. దాని మీద పూలు చల్లి పూజలు చేస్తున్న వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.ఈ ఘటన జోగులాంబ గద్వాల జిల్లాలోని బీచుపల్లిలో వెలుగుచూసింది. వివరాల్లోకివెళితే..ఎగువన జూరాల ప్రాజెక్టు గేట్లు ఎత్తివేయడంతో వరద నీటిలో ఒక పెద్ద మొసలి కొట్టుకొచ్చింది.

నాగార్జునసాగర్‌లో వైభవంగా వరుణయాగం.. పూర్ణాహుతిలో పాల్గొననున్న సీఎం రేవంత్ రెడ్డి!తెలంగాణSwechaa10 Aug 2026, 10:21 AM

నాగార్జునసాగర్‌లో వైభవంగా వరుణయాగం.. పూర్ణాహుతిలో పాల్గొననున్న సీఎం రేవంత్ రెడ్డి!

రాష్ట్రంలో విస్తారంగా వర్షాలు కురిసి, పాడిపంటలు సమృద్ధిగా పండాలని కాంక్షిస్తూ తెలంగాణ ప్రభుత్వం నాగార్జునసాగర్ తీరంలో అత్యంత వైభవంగా వరుణయాగాన్ని చేపట్టింది. సాగర్ ప్రాజెక్టు పరిధిలోని విజయ విహార్ గెస్ట్ హౌస్ ప్రాంగణంలో సోమవారం తెల్లవారుజామున 4 గంటలకే ఆది పూజలతో ఈ మహా క్రతువు ప్రారంభమైంది. నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి నేతృత్వంలో ప్రారంభమైన ఈ కార్యక్రమంలో యాదగిరిగుట్ట దేవస్థాన అర్చకులు, వేద పండితుల ఆధ్వర్యంలో 108 మంది రుత్వికులు 11 హోమ గుండాలతో వరుణ దేవుడిని ప్రసన్నం చేసుకునేందుకు ప్రత్యేక పూజలు నిర్వహిస్తున్నారు.

ఇందిరమ్మ సాయం బదిలీకి ఏడాది పూర్తి!..తెలంగాణSwechaa10 Aug 2026, 10:02 AM

ఇందిరమ్మ సాయం బదిలీకి ఏడాది పూర్తి!..

తెలంగాణలో ప్రజా ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న ఇందిరమ్మ ఇళ్ల పథకంలో ఆధార్ ఆధారిత నిధుల బదిలీ విధానం విజయవంతంగా కొనసాగుతూ.. ఏడాది పూర్తి చేసుకుంది. ఈ ఆధార్ బేస్డ్ పేమెంట్స్ విధానానికి గత సంవత్సరం ఆషాడ మాస బోనాల సమయంలో హౌసింగ్ కార్పొరేషన్ అధికారులు శ్రీకారం చుట్టారు. కాగా ఈ సంవత్సర కాలంలో రూ. 6,800 కోట్ల మేర ప్రభుత్వ ఆర్థిక సాయాన్ని.. దాదాపు రెండున్నర లక్షల మంది లబ్ధిదారుల బ్యాంక్ ఖాతాల్లోకి నేరుగా జమ చేసినట్టు అధికారులు తెలిపారు.

Sarfaraz Khan: టీమిండియాలోకి సర్ఫరాజ్ ఖాన్ రీఎంట్రీ.. జట్టులో కీలక మార్పు!క్రీడలుSwechaa10 Aug 2026, 09:38 AM

Sarfaraz Khan: టీమిండియాలోకి సర్ఫరాజ్ ఖాన్ రీఎంట్రీ.. జట్టులో కీలక మార్పు!

శ్రీలంకతో జరగబోయే టెస్ట్ సిరీస్‌కు ముందు భారత క్రికెట్ జట్టులో ఊహించని మార్పు చోటుచేసుకుంది. యువ ఓపెనింగ్/టాప్ ఆర్డర్ బ్యాటర్ బి. సాయి సుదర్శన్ గాయం కారణంగా సిరీస్‌ నుంచి వైదొలగడంతో, అతని స్థానంలో మిడిలార్డర్ బ్యాటర్ సర్ఫరాజ్ ఖాన్‌ను అజిత్ అగార్కర్ నేతృత్వంలోని సెలక్షన్ కమిటీ జట్టులోకి తిరిగితీసుకుంది. గతంలో పరిమిత అవకాశాల్లో అద్భుతంగా రాణించినప్పటికీ స్థానం నిలబెట్టుకోలేకపోయిన సర్ఫరాజ్‌కు ఇది మంచి అవకాశంగా మారింది. అయితే, అతని రాకతో హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్‌కు తుది జట్టు (Playing XI) ఎంపిక విషయంలో కొత్త సవాలు ఎదురవుతోంది.

ఎన్నికల ఎఫెక్ట్‌.. ఇరాన్‌ విషయంలో ట్రంప్‌ యూటర్న్‌!?..InternationalSwechaa10 Aug 2026, 09:34 AM

ఎన్నికల ఎఫెక్ట్‌.. ఇరాన్‌ విషయంలో ట్రంప్‌ యూటర్న్‌!?..

అమెరికాలో మధ్యంతర ఎన్నికలు దగ్గరపడుతున్న వేళ.. ట్రంప్‌కు ఇరాన్‌ విషయంలో కొత్త టెన్షన్ మొదలైందని సమాచారం. పశ్చిమాసియాలో సుదీర్ఘ యుద్ధం, తగ్గుతున్న ఆయుధ నిల్వలు, దేశీయంగా పెరుగుతున్న వ్యతిరేకత నేపథ్యంలో.. యుద్ధాన్ని ముగించేందుకు ట్రంప్‌ వ్యూహం మార్చుకున్నట్లు తెలుస్తోంది. అణు ఒప్పందం లేకుండానే ఇరాన్‌తో డీల్‌కు సిద్ధమన్న వార్తలు ఆసక్తి రేపుతున్నాయి. హర్మూజ్‌ జలసంధిని ఎలాంటి షరతులు లేకుండా తెరిస్తే ఒప్పందానికి సిద్ధమని ట్రంప్‌ సన్నిహితులతో చెప్పినట్లు సమాచారం. అయితే అమెరికా దిగ్బంధనాన్ని ఎత్తివేయడంతో పాటు తమ ప్రాంతం నుంచి అమెరికా దళాలు వెళ్లాలని ఇరాన్‌ డిమాండ్ చేస్తోంది. దీంతో ట్రంప్‌ యూటర్న్‌ వెనుక అసలు వ్యూహమేంటన్నది ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది..

Minister PRO: ఆ మంత్రి పీఆర్వో రూటే సపరేట్ ?స్వేచ్ఛ ఛైర్మన్ డెస్క్Swechaa10 Aug 2026, 09:27 AM

Minister PRO: ఆ మంత్రి పీఆర్వో రూటే సపరేట్ ?

ఆయన ఉత్తర తెలంగాణలో జూనియర్ మంత్రిగా చూస్తారు. గతంలో ఆయన వద్దకు ఓ సీనియర్ మంత్రి చెప్పితే ఓ కీలక పోస్టుకు ఓకే చెప్పారు. జూనియర్ మంత్రి పేషీలో సీనియర్ మంత్రి నిఘా అంటూ స్వేచ్ఛ న్యూస్ కథనాలు వ్రాయడంతో పోస్టింగ్ ఆగిపోయింది. సోషల్ వెల్ఫేర్ డిపార్మెంట్ నుంచి వచ్చిన ఆ పీఆర్వో తీరు మంత్రి వద్ద అందరినీ కలవర పెట్టిస్తుంది. ఈయన ఎక్కడ జర్నలిస్టుగా పని చేయలేదు. ఒక్క ప్రెస్ నోట్ కూడా సరిగ్గా రాయడం రాదు. ఔట్ సోర్స్ ఎంప్లాయీగా జాయిన్ అయ్యారు. ఓ ఐఎఎస్ అధికారి ఢిల్లీకి వెళ్తుండగా ఈ మంత్రి వద్దకు పంపించారు. దీంతో ఈయన ఇక్కడ పీఆర్వో ఉద్యోగం కాకుండా అన్ని పనులు చక్కబెడుతున్నారని తెలుస్తోంది.

పంచాయతీల జనరల్ ఫండ్ ఎక్కడయ్యా?స్వేచ్ఛ ఛైర్మన్ డెస్క్Swechaa10 Aug 2026, 09:22 AM

పంచాయతీల జనరల్ ఫండ్ ఎక్కడయ్యా?

తెలంగాణలో కొత్త సర్పంచ్ ల ఆర్ధిక బాధలు రోజురోజుకు పెరుగుతున్నాయి. గతంలో పనులు చేసి అప్పులయినందుకు అత్మహత్యలు చేసుకున్నారు. ఇప్పుడు ఉన్న సొంత గ్రామ సొత్తు(జనరల్ ఫండ్)ను వాడుకునేందుకు వీలు లేకపోవడంతో చిన్న చిన్న పనులకోసం సర్పంచ్ లు తమ జేబులోంచి ఇవ్వాల్సి వస్తుంది. ఇటీవల ముఖ్యమంత్రి ప్రత్యేక అకౌంట్స్ తీసి నేరుగా జమచేసుకుని, ఖర్చు చేసుకునేలా పంచాయితీ రాజ్ యాక్ట్ 2018 లో సెక్షన్ 70 (3) ని సవరిస్తామని హామి ఇచ్చారు. కాని రెండు నెలలు అయినా ఇంకా అచరణ నోచుకోలేదు. పైగా గత 2 ఏండ్లుగా గ్రామ జనరల్ ఫండ్ సుమారు 500 కోట్లు ట్రెజరీలో మూలుగుతున్నాయి. పంచాయితీ ఇవ్వాల్సిన ఖర్చులకు చెక్స్ ఇస్తే ఇప్పటికి రిలీజ్ చేయని పరిస్థితి ఉంది.

Mahesh-Sandeep Reddy: మహేష్‌తో, సందీప్ రెడ్డి వంగ "డెవిల్" కన్‌ఫర్మేషన్ ఇదుగోసినిమాSwechaa10 Aug 2026, 09:02 AM

Mahesh-Sandeep Reddy: మహేష్‌తో, సందీప్ రెడ్డి వంగ "డెవిల్" కన్‌ఫర్మేషన్ ఇదుగో

Mahesh-Sandeep Reddy: ప్రభాస్‌తో స్పిరిట్ చిత్రాన్ని చేస్తున్న సందీప్..దీని, తర్వాత సూపర్ స్టార్ మహేష్ బాబుతో 'డెవిల్' అనే సినిమాను చేస్తాడని ఇప్పుడు ప్రచారం జరుగుతోంది. మహేష్ వారణాసి పూర్తి చేసి, సందీప్ స్పిరిట్ పూర్తి చేసి ఆ తర్వాత వీరిద్దరు 'డెవిల్' సినిమా కోసం కలవబోతున్నట్టుగా సోషల్ మీడియాలో సందీప్ రెడ్డి షేర్ చేసిన వీడియోతో ఓ క్లారిటీ వచ్చింది. మహేష్ బర్త్ డే సందర్భంగా సందీప్ షేర్ చేసిన ఈ వీడియోతో వీరి ఫ్యాచర్ ప్రాజెక్ట్‌ని కన్‌ఫర్మ్ చేసినట్టుగా భావిస్తున్నారు. ఇక ఈ వీడియో ఇప్పుడు అంతటా వైరల్ అవుతోంది. గతంలో మహేష్ బాబు చేసిన ఒక కమర్షియల్ యాడ్ కి సందీప్ రెడ్డి వంగ దర్శకత్వం కూడా వహించాడు.

Trisha Krishnan: మళ్ళీ కార్తితో జంటగా..నయన్ నో అనడంతోనా?సినిమాSwechaa10 Aug 2026, 08:24 AM

Trisha Krishnan: మళ్ళీ కార్తితో జంటగా..నయన్ నో అనడంతోనా?

Trisha Krishnan: నయనతార వరుస సినిమాలతో బిజీగా ఉండటంతో కార్తి హీరోగా రూపొందబోయో సినిమాకి డేట్స్ సర్దుబాటు చేయలేకపోతుందట. దాంతో, ఆ ఛాన్స్ త్రిషకి దక్కినట్టుగా తెలుస్తోంది. గతంలో కార్తి సరసన త్రిష పొన్నియన్ సెల్వన్ మూవీలో నటించిన సంగతి తెలిసిందే. మణి రత్నం దర్శకత్వం వహించాడు. ఇందులో, కార్తి-త్రిష..వందియదేవన్-కుందవై పాత్రల్లో బాగా ఆకట్టుకున్నారు.

Mahesh Babu: "వారణాసి" నా హృదయానికి చాలా దగ్గరైన సినిమా!సినిమాSwechaa10 Aug 2026, 07:56 AM

Mahesh Babu: "వారణాసి" నా హృదయానికి చాలా దగ్గరైన సినిమా!

Mahesh Babu: మహేష్..తన పుట్టినరోజుకి అందరూ చూపించిన ప్రేమకు మహేష్ ముగ్ధుడు అయ్యాడు. మీరందరూ గర్వించదగేలా పని చేస్తానని ప్రామిస్ చేసాడు కూడా. అలాగే, నేను ఇప్పుడు చేస్తున్న ఎపిక్ వరల్డ్ సినిమా ‘వారణాసి’. ఈ సినిమా నా హృదయానికి చాలా దగ్గరైనది. ఖచ్చితంగా ఈ చిత్రం ఒక ప్రత్యేకమైనదిగా నిలుస్తుందని భావిస్తున్నాను. ఆ ఎక్స్పీరియన్స్ ని మీకు అందించడానికి ఆగలేకపోతున్నాను.. అని రాసుకొచ్చాడు. ఇప్పుడీ ప్రెస్ నోట్ అంతటా వైరల్ అవుతోంది.

Meenakshi : చిరు పాత్రలో చిన్న రోల్!సినిమాSwechaa10 Aug 2026, 07:32 AM

Meenakshi : చిరు పాత్రలో చిన్న రోల్!

Meenakshi Chaudhary: మెగాస్టార్ చిరంజీవి-బాబి కొల్లి కాంబినేషన్‌లో ఓ చిత్రం రూపుదిద్దుకుంటోంది. ప్రియమణి హీరోయిన్‌గా నటిస్తుందని తెలుస్తోంది. కీలక పాత్రలో అనస్వర రాజన్ నటిస్తోంది. ఇప్పటికే, శరవేగంగా ఈ సినిమా షూటింగ్ జరుగుతోంది. అయితే, తాజా సమాచారం మేరకు చిరు నటిస్తున్న ఈ మెగా 158లో మీనాక్షికి ఓ గెస్ట్ రోల్ చేసే అవకాశం వచ్చిందట. కథలో, మంచి ప్రాధాన్యం ఉన్న పాత్ర అని తెలుస్తోంది.

రాజకీయాల్లో ర్యాలీలు తగ్గి.. రీల్స్ ఎందుకు పెరిగాయి?రాజకీయాలుSwechaa09 Aug 2026, 11:54 PM

రాజకీయాల్లో ర్యాలీలు తగ్గి.. రీల్స్ ఎందుకు పెరిగాయి?

ముఖ్యంగా యువత రాజకీయాలను చూసే విధానం ఈ మార్పుకు ప్రధాన కారణం. ఈ రోజుల్లో ఒక యువ ఓటరు రాజకీయ నాయకుడి గంటసేపు ప్రసంగం వినకపోవచ్చు. కానీ అదే నాయకుడి 30 సెకన్ల వీడియోను రీల్‌గా చూస్తాడు. నచ్చితే షేర్ చేస్తాడు. నచ్చకపోతే కామెంట్ చేస్తాడు.

నల్సార్‌ స్నాతకోత్సవంపై వివాదం.. సీజేఐ ఆహ్వానంపై విద్యార్థుల లేఖ!తెలంగాణSwechaa09 Aug 2026, 09:09 PM

నల్సార్‌ స్నాతకోత్సవంపై వివాదం.. సీజేఐ ఆహ్వానంపై విద్యార్థుల లేఖ!

నల్సార్‌ స్నాతకోత్సవానికి భారత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ సూర్యకాంత్‌ను ముఖ్య అతిథిగా ఆహ్వానించడంపై విద్యార్థులు అభ్యంతరం వ్యక్తం చేశారు. స్నాతకోత్సవ తేదీ ఇంకా ఖరారు కాలేదని, ముఖ్య అతిథి ఎంపికపై కూడా తుది నిర్ణయం తీసుకోలేదని పేర్కొన్న విద్యార్థులు.. ముందుగానే తమ అభిప్రాయాలను విశ్వవిద్యాలయ యాజమాన్యం దృష్టికి తీసుకొచ్చారు.. 2026 జూలై 20న జంతర్‌ మంతర్‌ వద్ద జరిగిన చలో పార్లమెంట్‌ నిరసనలో పోలీసుల చర్యలపై దాఖలైన పిటిషన్‌ను అత్యవసరంగా విచారించేందుకు సుప్రీంకోర్టు నిరాకరించిన అంశాన్ని విద్యార్థులు తమ లేఖలో ప్రస్తావించారు. అప్పటి విచారణ సందర్భంగా జస్టిస్‌ సూర్యకాంత్‌ చేసినట్లు నివేదికల్లో వచ్చిన కొన్ని వ్యాఖ్యలు తమకు ఆందోళన కలిగించాయని తెలిపారు.