స్వేచ్ఛ షార్ట్స్ — తాజా తెలుగు వార్తలు

Raaka: అల్లు అర్జున్ నోటివెంట రాకా షూటింగ్ అప్‌డేట్సినిమాSwechaa09 Aug 2026, 07:28 PM

Raaka: అల్లు అర్జున్ నోటివెంట రాకా షూటింగ్ అప్‌డేట్

Raaka: ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ నటిస్తున్న లేటెస్ట్ పాన్ ఇండియా సినిమా రాకా. తాజాగా, ఈ సినిమా షూటింగ్ అప్‌డేట్‌ను స్వయంగా అల్లు అర్జున్ వెల్లడించాడు. వైజాగ్ లో కొత్త మల్టీప్లెక్స్ ఓపెనింగ్ కార్యక్రమానికి వచ్చిన అల్లు అర్జున్ ఈ అప్‌డేట్‌ను అభిమానులతో పంచుకున్నాడు. దీనితో ఫ్యాన్స్‌తో పాటు సినీ లవర్స్ కూడా ఎంతో ఎగ్జైట్ అయ్యారు.

జస్టిస్ సూర్యకాంత్‌కు విద్యార్థుల సెగ.. ఇరకాటంలో నల్సార్‌ యాజమాన్యం!..తెలంగాణSwechaa09 Aug 2026, 07:10 PM

జస్టిస్ సూర్యకాంత్‌కు విద్యార్థుల సెగ.. ఇరకాటంలో నల్సార్‌ యాజమాన్యం!..

సీజేఐ జస్టిస్ సూర్యకాంత్‌ను స్నాతకోత్సవానికి ముఖ్య అతిథిగా ఆహ్వానించవద్దంటూ నల్సార్ విద్యార్థులు డిమాండ్ చేస్తున్నారు. దాదాపు 450 మంది విద్యార్థులు యూనివర్సిటీ యాజమాన్యానికి లేఖ రాసినట్లు సమాచారం. ఢిల్లీలో నీట్ నిరసనలపై విచారణ సందర్భంగా సీజేఐ చేసిన వ్యాఖ్యలపై అభ్యంతరం వ్యక్తం చేస్తూ ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. కొందరు విద్యార్థులు ఒకపూట భోజనం మానేసి నిరసన కూడా చేపట్టారు. డిమాండ్‌ను పట్టించుకోకపోతే స్నాతకోత్సవానికి ముందు నిరసన చేపడతామని హెచ్చరించినట్లు సమాచారం. ఇటీవల టిస్ స్నాతకోత్సవం కూడా నిరసనల భయంతో వాయిదా పడిన విషయం తెలిసిందే.

Slum Dog 33 Temple Road: "గౌరీ హెగ్డే" గా టబు..క్రేజీ అప్‌డేట్ ఇచ్చిన పూరి!సినిమాSwechaa09 Aug 2026, 06:49 PM

Slum Dog 33 Temple Road: "గౌరీ హెగ్డే" గా టబు..క్రేజీ అప్‌డేట్ ఇచ్చిన పూరి!

Slum Dog 33 Temple Road: టాలీవుడ్ సినిమా ఇండస్ట్రీలో పాన్ ఇండియన్ సినిమాలతో మన తెలుగు సినిమా సత్తా ఏంటో ప్రపంచ దేశాలకి చూపించిన రాజమౌళి లాంటి వారు ఎందరున్నా..డేరింగ్ అండ్ డాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాధ్ లాంటి వారు మాత్రం ఉండరు. ఇది, ఎవరైనా ఒప్పుకోవాల్సిందే. అందుకే, బాహుబలి రైటర్, డైరెక్టర్ కూడా ఆయనకి అభిమానులే. అలాంటి, పూరి జగన్నాధ్ రూపొందిస్తున్న లేటెస్ట్ సినిమా నుంచి క్రేజీ అప్‌డేట్ ఇచ్చారు. టబు పాత్రను పరిచయం చేయనున్నారు.

బెంగాల్‌లో హైటెన్షన్.. మమతా కాన్వాయ్‌పై దాడి!..NationalSwechaa09 Aug 2026, 06:23 PM

బెంగాల్‌లో హైటెన్షన్.. మమతా కాన్వాయ్‌పై దాడి!..

పశ్చిమ బెంగాల్‌లో మరోసారి రాజకీయ ఉద్రిక్తతలు భగ్గుమన్నాయి. మాజీ సీఎం మమతా బెనర్జీ కాన్వాయ్‌పై రాళ్లు, ఇటుకలు, బురద, బాటిళ్లు, చెప్పులతో దాడి కలకలం రేపింది. పోలీసు కస్టడీలో మృతి చెందిన కార్యకర్త కుటుంబాన్ని పరామర్శించేందుకు వెళ్తుండగా ఉత్తర 24 పరగణాల జిల్లాలో ఈ ఘటన జరిగింది. తనపై రౌడీ మూకలు దాడి చేశాయని మమత ఆరోపించారు. కారు అద్దాలు మూసి లేకపోతే తన తలకు గాయమై, ప్రాణాలు పోయేవని ఆవేదన వ్యక్తం చేశారు. అయితే ఈ దాడితో బీజేపీకి ఎలాంటి సంబంధం లేదని రాష్ట్ర బీజేపీ చీఫ్ సమిక్ భట్టాచార్య స్పష్టం చేశారు. దాడికి పాల్పడిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.

Priyanka Chopra: సెల్ఫీతో మహేష్ కి బర్త్ డే విషెస్ చెప్పిన గ్లోబల్ బ్యూటీసినిమాSwechaa09 Aug 2026, 06:06 PM

Priyanka Chopra: సెల్ఫీతో మహేష్ కి బర్త్ డే విషెస్ చెప్పిన గ్లోబల్ బ్యూటీ

Priyanka Chopra: Priyanka Chopra: నేడు (ఆగస్టు 9) సూపర్ స్టార్ మహేష్ బాబు పుట్టిన రోజు. ఈ సందర్భంగా గ్లోబల్ బ్యూటీ ప్రియాంక చోప్రా ఆయనకి ప్రత్యేకంగా సోషల్ మీడియా ద్వారా బర్త్ డే విషెస్ ని తెలిపింది. దీనితో పాటు వీరిద్దరు కలిసి చేస్తున్న పాన్ వరల్డ్ సినిమా వారణాసి మూవీ ఆన్‌సెట్స్ పిక్ ని కూడా షేర్ చేసింది. ఇది, సెల్ఫీ కావడం ఆసక్తికరం. ఆఫ్రికా అడవుల్లో షూటింగ్ జరిపిన సమయంలో తీసుకున్న పిక్ ఇది.

Korean Kanakaraju: బాక్సాఫీస్ వద్ద తగ్గని జోరు, 3 రోజుల్లోనే లాభాల్లోకిసినిమాSwechaa09 Aug 2026, 05:40 PM

Korean Kanakaraju: బాక్సాఫీస్ వద్ద తగ్గని జోరు, 3 రోజుల్లోనే లాభాల్లోకి

Korean Kanakaraju:Korean Kanakaraju:మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ నటించిన లేటెస్ట్ సినిమా కొరియన్ కనకరాజు. ఈ వారం ప్రేక్షకుల ముందుకు వచ్చిన మూవీ ప్రేక్షకులను థియేటర్స్‌లో బాగా అలరిస్తోంది. మన ప్రేక్షకుల్లో కామెడీ, హర్రర్ జానర్ చిత్రాలకి బాగా అభిమానులున్నారు. ఆ ప్రేక్షకులందరికీ బాగా నచ్చుతుంది కొరియన్ కనకరాజు. డిఫరెంట్ కాన్సెప్ట్‌తో వచ్చిన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద జోరు చూపిస్తోంది. జస్ట్ మూడు రోజుల్లోనే లాభాల బాట పట్టింది.

Mamitha Baiju: అల్లు అర్జున్ కి డైహార్ట్ ఫ్యాన్..ఒక్కో సినిమా పదిసార్లు చూస్తాసినిమాSwechaa09 Aug 2026, 05:22 PM

Mamitha Baiju: అల్లు అర్జున్ కి డైహార్ట్ ఫ్యాన్..ఒక్కో సినిమా పదిసార్లు చూస్తా

Mamitha Baiju: మమిత బైజుకి, మన ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ అంటే ఎంతటి అభిమానమో మాటల్లో చెప్పలేనంటోంది. ఆయనలా డ్రసింగ్ అవడం..స్లీవ్ లెస్ టీ షర్ట్ పై షర్ట్ వేసుకుంటే అలా, మమిత కూడా డ్రస్ వేసుకొని అబ్బాయిలా తిరిగేదట. అల్లు అర్జున్ ప్రతీ సినిమాను పదేసి సార్లు చూస్తుందట. ఇండస్ట్రీకొచ్చిన అతికొద్ది కాలంలోనే మంచి క్రేజీ హీరోయిన్‌గా మారిన మమిత బైజు తాజాగా సూర్య సరసన విశ్వనాథ్ అండ్ సన్స్ మూవీతో రాబోతోంది. ఈ సినిమా ప్రమోషన్స్‌లో బన్నీపై తనకున్న గాఢమైన అభిమాన్ని తెలియజేసింది మమిత. ప్రేమలు, డ్యూడ్ సినిమాతో బాగా పాపులర్ అయింది. సౌత్ లో ఇప్పుడు మమిత ఫుల్ ఫాంలో ఉంది.

జేఎన్‌టీయూహెచ్‌లో కలకలం..కీలక ఫైళ్లు మాయం!..తెలంగాణSwechaa09 Aug 2026, 03:33 PM

జేఎన్‌టీయూహెచ్‌లో కలకలం..కీలక ఫైళ్లు మాయం!..

జేఎన్‌టీయూహెచ్‌లో కీలక ఫైళ్ల మాయం కలకలం రేపుతోంది. ఆర్థిక విభాగం అధికారి సురేందర్ దాదాపు 20 రోజులుగా విధులకు హాజరుకాలేదు. మొబైల్ స్విచ్‌ఆఫ్‌లో ఉండగా.. రెండు రోజుల క్రితం కార్యాలయానికి వచ్చి కొన్ని ముఖ్యమైన ఫైళ్లను తీసుకెళ్లినట్లు భద్రతా సిబ్బంది చెబుతున్నారు. దీంతో ఆర్థిక విభాగం కార్యాలయాన్ని అధికారులు సీల్ చేశారు. మరోవైపు.. 2023–24లో పరీక్షల విభాగం చేసిన రూ.37.62 కోట్ల ఖర్చుల్లో సుమారు రూ.30 కోట్లకు మాత్రమే రసీదులు ఉండటంపై ఆడిట్ అభ్యంతరాలు వ్యక్తమయ్యాయి. 11 మంది సిబ్బందికి రూ.10.11 లక్షలు అదనంగా చెల్లించినట్లు కూడా గుర్తించారు. ఈ వ్యవహారంపై అంతర్గత విచారణతో పాటు పోలీసు కేసు నమోదైంది. అక్రమాలు నిర్ధారణ అయితే కఠిన చర్యలు తీసుకుంటామని వీసీ స్పష్టం చేశారు.

ఉదయ్‌ కృష్ణారెడ్డి కేసులో బిగ్ ట్విస్ట్.. సీబీఐ మాజీ డైరెక్టర్ సంచలన లేఖ!అభిప్రాయంSwechaa09 Aug 2026, 03:09 PM

ఉదయ్‌ కృష్ణారెడ్డి కేసులో బిగ్ ట్విస్ట్.. సీబీఐ మాజీ డైరెక్టర్ సంచలన లేఖ!

 ఐపీఎస్ ప్రొబేషనర్ ఉదయ్ కృష్ణారెడ్డి అరెస్ట్ వ్యవహారంలో హైదరాబాద్ పోలీసుల తీరుపై సీబీఐ మాజీ డైరెక్టర్ ఎం.నాగేశ్వరరావు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. అత్తాపూర్ పోలీస్ స్టేషన్‌లో నమోదైన కేసు దర్యాప్తు నిష్పాక్షికంగా జరగడం లేదని ఆరోపిస్తూ తెలంగాణ రాష్ట్ర డెవలప్‌మెంట్ అండ్ లా అండ్ ఆర్డర్ డీజీపీకి ఓ సుదీర్ఘమైన లేఖ రాశారు. ఈకేసులో విచారణాధికారులు చట్టబద్ధమైన అరెస్ట్ నిబంధనలను పాటించలేదని, అత్యంత తొందరపాటుతో వ్యవహరించారని పేర్కొన్నారు. ఈ మొత్తం వ్యవహారాన్ని స్వతంత్ర దర్యాప్తు సంస్థతో విచారింపజేయాలని ఆయన కోరారు. లేఖలో పేర్కొన్న వివరాల ప్రకారం.. ఫిర్యాదు చేసిన మహిళా అధికారిణి (2024 బ్యాచ్ IPS), ఉదయ్ కృష్ణా రెడ్డి (2025 బ్యాచ్ IPS)ల మధ్య ఉన్నది సమ్మతితో కూడిన వ్యక్తిగత ప్రేమ సంబంధమని తెలిపారు.

మహారాష్ట్రలో భూ ప్రకంపనలు.. రోడ్లపైకి జనం పరుగులు!..NationalSwechaa09 Aug 2026, 02:55 PM

మహారాష్ట్రలో భూ ప్రకంపనలు.. రోడ్లపైకి జనం పరుగులు!..

మహారాష్ట్ర, గుజరాత్‌ సరిహద్దు ప్రాంతాల్లో 4.3 తీవ్రతతో భూకంపం సంభవించింది. నాసిక్‌, సూరత్‌, డాంగ్‌, సపుతారా సహా పలు ప్రాంతాల్లో ప్రకంపనలు కనిపించాయి. శనివారం రాత్రి భూకంపం తర్వాత.. ఆదివారం తెల్లవారుజామున 3.3 తీవ్రతతో మరోసారి భూమి కంపించింది. కొన్ని ఇళ్ల గోడలకు స్వల్ప పగుళ్లు ఏర్పడ్డాయి. అయితే ప్రాణనష్టం జరగలేదు. వరుస ప్రకంపనలతో ప్రజలు భయాందోళనకు గురవుతున్న వేళ.. అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచించారు.

జీహెచ్ఎంసీ ఎన్నికల ముందు బీజేపీకి షాకిచ్చిన జనసేన!తెలంగాణSwechaa09 Aug 2026, 02:34 PM

జీహెచ్ఎంసీ ఎన్నికల ముందు బీజేపీకి షాకిచ్చిన జనసేన!

తెలంగాణ బీజేపీకి ఎన్డీయే మిత్రపక్షమైన జనసేన పార్టీ బిగ్‌షాక్ ఇచ్చింది. జీహెచ్ఎంసీ ఎన్నికల్లో తాము ఒంటరిగానే పోటీ చేస్తామని ఇటీవల బీజేపీ స్టేట్ చీఫ్ రాంచందర్ రావు ప్రకటించిన విషయం తెలిసిందే.తాజాగా దీనికి జనసేన స్టేట్ చీఫ్ శంకర్ గౌడ్ కౌంటర్ ఇచ్చారు.జీహెచ్ఎంసీ ఎన్నికల్లో పొత్తు అంశం రాంచందర్ రావు పరిధిలోని అంశం కాదని.. జనసేన చీఫ్ పవన్ కల్యాణ్, బీజేపీ జాతీయ నాయకత్వం చూసుకుంటుందని కీలక వ్యాఖ్యలు చేశారు.దీనికి తోడు బీజేపీ నుంచి పలువురు కీలక నేతలు జనసేన పార్టీ కండువా కప్పుకోవడం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది.ఇతర పార్టీల నుంచి బీజేపీలోకి చేరికలు ఉంటాయని ఆ పార్టీ నాయకత్వం భావిస్తుంటే.. కమలం పార్టీ నేతలే ఇతర పార్టీలోకి వెళ్లడం రాష్ట్ర రాజకీయాల్లో తీవ్ర కలకలం రేపింది. వీరంతా క్షేత్రస్థాయిలో ఇంతకాలం బీజేపీ కోసం సీరియస్‌గా పనిచేసిన నేతలు అని తెలుస్తోంది.

Yadadri : బోనాల ఎఫెక్ట్..  యాదాద్రి ఆలయంలో తగ్గిన భక్తుల రద్దీతెలంగాణSwechaa09 Aug 2026, 02:04 PM

Yadadri : బోనాల ఎఫెక్ట్.. యాదాద్రి ఆలయంలో తగ్గిన భక్తుల రద్దీ

హైదరాబాద్ మహానగరంలో బోనాలు ఘనంగా జరుగుతున్నాయి. లష్కర్, లాల్ దర్వాజ, ఉజ్జయిని, బల్కంపేట బోనాలు ముగియడంతో నేడు నగరంలోని గల్లీగల్లీలో బోనాలను ఎంతో వైభవంగా ప్రజలు జరుపుకుంటున్నారు.నిన్న సాయంత్రం నుంచే గల్లీల్లోని అమ్మవారి ఆలయాలను ముస్తాబు చేశారు.ఇక ఎక్కడ చూసినా బోనాల ఫ్లెక్సీలు నగరం నలుమూలలా దర్శనమిస్తున్నాయి. పొలిటికల్ లీడర్లు సైతం తమకు దగ్గరగా ఉండే ఆలయాలకు వెళ్లి అమ్మవార్లకు బోనాలు సమర్పించుకుంటున్నారు. అయితే బోనాల ప్రభావం యాదాద్రి శ్రీ లక్ష్మీనరసింహస్వామి ఆలయంపై భారీగా పడినట్టు తెలుస్తోంది. యాదగిరి గుట్టలో భక్తుల రద్దీ తగ్గినట్టు సమాచారం.

తొలి సినిమా హిట్.. కానీ ఆటో తోలుకుంటున్న నటుడు!..సినిమాSwechaa09 Aug 2026, 02:01 PM

తొలి సినిమా హిట్.. కానీ ఆటో తోలుకుంటున్న నటుడు!..

సినిమా ఇండస్ట్రీలో ఎప్పుడు ఎవరి టైమ్ మారుతుందో చెప్పలేం. అలాంటి ఆటుపోట్లను ఎదుర్కొంటున్న నటుడు మారిముత్తు కథ ఎంతో స్ఫూర్తిదాయకం. పేద కుటుంబంలో పుట్టి, మూడో తరగతిలోనే చదువు మానేసి.. లైట్లు, మైక్ సెట్ల షాపులో పనిచేశారు. సినిమాపై ఆసక్తితో చెన్నైకి వెళ్లి, ‘సుబ్రమణ్యపురం’లో నటించే అవకాశం దక్కించుకున్నారు. సినిమా హిట్ అయినా వరుస అవకాశాలు రాలేదు. కుటుంబం కోసం రేడియో మెకానిక్‌గా, ఆ తర్వాత ఆటో డ్రైవర్‌గా పని చేస్తున్నారు. పరిస్థితులు ఎలా ఉన్నా వెనక్కి తగ్గకుండా.. మరో అవకాశం వస్తుంది అనే ఆశతో ముందుకు సాగుతున్న మారిముత్తు నిజంగా అభినందనీయుడు.

ట్రైనీ ఐపీఎస్ ఉదయ్ కృష్ణారెడ్డి కేసులో కీలక మలుపు..!టాప్ న్యూస్Swechaa09 Aug 2026, 01:55 PM

ట్రైనీ ఐపీఎస్ ఉదయ్ కృష్ణారెడ్డి కేసులో కీలక మలుపు..!

ట్రైనీ ఐపీఎస్ అధికారి ఉదయ్ కృష్ణారెడ్డి లైంగిక వేధింపుల కేసులో అరెస్టు అయిన విషయం తెలిసిందే. ప్రస్తుతం విచారణ కొనసాగుతోంది. కోర్టు అనుమతుల మేరకు కస్టడీలోకి తీసుకున్న పోలీసులు.. లోతుగా దర్యాప్తు చేస్తున్నారు. అరెస్టుకు ముందు ట్రైనీ ఐపీఎస్ రాసిన సూసైడ్ నోట్‌లో తన దగ్గర అన్ని ఆధారాలు ఉన్నాయని.. కావాలనే తన మీద తప్పుడు ఆరోపణలు చేశారని.. సాక్ష్యాలన్నీ ఐఫోన్‌లో ఉన్నాయని పేర్కొన్న ఉదయ్.. ఇప్పుడు ఆ నోట్, మొబైల్ కూడా మాయం చేసినట్టు సమాచారం.దీంతో ట్రైనీ ఐపీఎస్ ఉదయ్ కృష్ణారెడ్డి ఎపిసోడ్‌ కీలక మలుపులు తీసుకుంటున్నది.దర్యాప్తులో భాగంగా అతని రూంలో తనిఖీలు చేపట్టిన పోలీసులకు కీలక ఆధారాలైన సూసైడ్ నోట్ , ఐఫోన్ కనిపించలేదు. అవి ఎక్కడ మాయమైనట్లు పోలీసులు ఆరా తీస్తున్నారు. ఇదే విషయమై కస్టడీలో ఉన్న ఉదయ్‌ను ప్రశ్నించగా.. పొంతనలేని సమాధానాలు చెబుతున్నట్టు తెలిసింది.

ట్రంప్ కొత్త 'హెయిర్‌స్టైల్' హల్‌చల్.. సోషల్ మీడియాలో మీమ్స్ వైరల్!InternationalSwechaa09 Aug 2026, 01:44 PM

ట్రంప్ కొత్త 'హెయిర్‌స్టైల్' హల్‌చల్.. సోషల్ మీడియాలో మీమ్స్ వైరల్!

అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మరోసారి తన విభిన్నమైన శైలితో వార్తల్లో నిలిచారు. ఇటీవల లాస్ వెగాస్‌లోని రెడ్ రాక్ క్యాసినో ప్రాంగణంలో జరిగిన ఓ రాజకీయ ప్రచార కార్యక్రమంలో పాల్గొన్న ఆయన, సరికొత్త హెయిర్‌స్టైల్‌తో ప్రత్యక్షమై అందరి దృష్టిని ఆకర్షించారు. గతంతో పోలిస్తే మరింత ఒత్తుగా, ప్రకాశవంతమైన రంగుతో కనిపిస్తున్న ఆయన జుట్టును చూసి నెటిజన్లు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. కార్యక్రమంలో ఆయన ఆర్థిక విధానాలపై మాట్లాడినప్పటికీ, అందరి దృష్టి మాత్రం ఆయన జుట్టుపైనే పడింది. ట్రంప్ నూతన లుక్ చూసిన నెటిజన్లు సోషల్ మీడియాలో మీమ్స్, వ్యంగ్యాస్త్రాలతో హోరెత్తించారు. ఆయన విగ్గు ఉపయోగిస్తున్నారంటూ కొందరు హేళన చేయగా, మరికొందరు "ది న్యూ ట్రంప్ హెయిర్ సీరమ్" పేరుతో కృత్రిమ మేధ (AI) వీడియోలను రూపొందించి వైరల్ చేశారు.

‘డబుల్’ జీతం.. ఆర్థికశాఖపై ఉద్యోగ సంఘాల ఆగ్రహం!తెలంగాణSwechaa09 Aug 2026, 01:29 PM

‘డబుల్’ జీతం.. ఆర్థికశాఖపై ఉద్యోగ సంఘాల ఆగ్రహం!

దాదాపు 40 మంది ఉద్యోగులు ప్రభుత్వం నుంచి ‘డబుల్ శాలరీ’ తీసుకున్నట్టు ఆర్థికశాఖ అధికారులు గుర్తించడంతో వారి మీద చర్యలకు రంగం సిద్ధం చేస్తున్నట్టు తెలుస్తోంది. ముందుగా ఈ అంశంలో విచారణకు ఆదేశించి, డూప్లికేట్ ఆధార్ మ్యాపింగ్‌ల ద్వారా ఇంకెవరెవరు జీతాలు ఎత్తారని గుర్తించే పనిలో అధికారులు నిమగ్నం అయ్యారు.ఇదిలాఉండగా, కొందరు ఉద్యోగులు పెద్ద మొత్తంలో రెండు జీతాలు ఎత్తడం వెనుక కారణాలను ఉద్యోగ సంఘాలు వెల్లడించడంతో పాటు ఆగ్రహంవ్యక్తం చేస్తున్నాయి. పలువురు ముఖ్యనేతలు,మంత్రులు, ఉన్నతాధికారుల ఇళ్లలో పనిచేసే ఉద్యోగులకు డబుల్ జీతాల కోసం నకిలీ ఆధార్‌లతో రెండు జీతాలిస్తున్నట్టు పేర్కొన్నాయి. ప్రొటోకాల్ ఖర్చుల కోసం కూడా జీతాలు చెల్లిస్తున్నట్టు ఆరోపించాయి. ఆర్థికశాఖకు తెలిసే ఇదంతా జరుగుతోందని వెల్లడించాయి.

Chicken price Today: చికెన్ ప్రియులకు బిగ్ రిలీఫ్.. భారీగా దిగొచ్చిన ధరలు.. కిలో ఎంతంటే?తెలంగాణSwechaa09 Aug 2026, 01:09 PM

Chicken price Today: చికెన్ ప్రియులకు బిగ్ రిలీఫ్.. భారీగా దిగొచ్చిన ధరలు.. కిలో ఎంతంటే?

ఆదివారం వచ్చిందంటే చాలు మాంసాహార ప్రియులు చికెన్ షాపుల ముందు క్యూ కడుతుంటారు. గత కొన్ని వారాలుగా ఆకాశాన్నంటిన చికెన్ ధరలు ప్రస్తుతం గణనీయంగా దిగిరావడంతో తెలుగు రాష్ట్రాల్లోని చికెన్ లవర్స్‌కు భారీ ఊరట లభించింది. ముఖ్యంగా హైదరాబాద్, విజయవాడ నగరాల్లో కిలో చికెన్ ధరలు సామాన్యుడికి అందుబాటులోకి రావడంతో రిటైల్ మార్కెట్లలో కొనుగోళ్లు ఒక్కసారిగా పుంజుకున్నాయి. హైదరాబాద్ మహానగరంలో కొన్ని రోజుల క్రితం వరకు రూ.280 నుంచి రూ.300 వరకు విక్రయించిన స్కిన్‌లెస్ చికెన్ ధర ప్రస్తుతం గణనీయంగా పడిపోయింది. ప్రస్తుతం హైదరాబాద్ మార్కెట్‌లో లైవ్ బర్డ్ ధర రూ.120 నుంచి రూ.140 వరకు పలకగా, రిటైల్ షాపుల్లో విత్ స్కిన్ చికెన్ కిలో రూ.180 నుంచి రూ.200రేంజ్‌లో విక్రయిస్తున్నారు. అలాగే స్కిన్‌లెస్ చికెన్ కిలో రూ.220 నుంచి రూ.240 వద్ద కొనసాగుతోంది.

బాలికలు, యువకులే టార్గెట్.. ఫోన్‌లో 600 అసభ్యకర వీడియాలుక్రైమ్Swechaa09 Aug 2026, 01:05 PM

బాలికలు, యువకులే టార్గెట్.. ఫోన్‌లో 600 అసభ్యకర వీడియాలు

మైనర్లను టార్గెట్‌గా చేసుకుని వేధింపులకు గురిచేయడం, లైంగికదాడులకు పాల్పడటం వంటి ఘటనలకు పాల్పడుతున్న ఓ దుండగుడిని మహారాష్ట్ర పోలీసులు ఎట్టకేలకు అరెస్టు చేశారు. ముఖ్యంగా చిన్నారులను మచ్చిక చేసుకోవడం, ఆ తర్వాత అసభ్యకర వీడియోలు తీసి బ్లాక్ మెయిల్ చేసి లైంగికదాడులకు పాల్పడటమే సదరు వ్యక్తి నేర ప్రవృత్తిగా పోలీసులు గుర్తించారు. దీనికి తోడు పలువురు యువకులను సైతం నిందితుడు లైంగికంగా వేధించినట్టు తెలిసింది. వివరాల్లోకివెళితే.. చేతన్ ప్రకాశ్ కోలీ (22) మైనర్లను లక్ష్యంగా చేసుకుని లైంగిక వేధింపులకు పాల్పడుతున్నట్టు పోలీసులకు ఫిర్యాదు అందింది. అతని కోసం గాలింపు చర్యలు చేపట్టిన పోలీసులు మహారాష్ట్రలోని నందుర్బార్ పీఎస్ పరిధిలో అరెస్టు చేశారు.

Keerthy Suresh: కీర్తికి హీరోయిన్‌గా అవకాశాలు లేకపోవడంతోనేసినిమాSwechaa09 Aug 2026, 12:59 PM

Keerthy Suresh: కీర్తికి హీరోయిన్‌గా అవకాశాలు లేకపోవడంతోనే

The Paradaise: ఒక నెటిజన్..కీర్తికి హీరోయిన్‌గా అవకాశాలు లేకపోవడంతోనే నాని నటిస్తున్న కన్నడ సినిమాలో ఐటమ్ సాంగ్ ఒప్పుకుంది అని మాట్లాడింది. దీనికి, కీర్తి సీరియస్ అవలేదు. పైగా చిన్న స్మైల్ ఇచ్చి..స్మాల్ కరెక్షన్..నాని నటిస్తుంది కన్నడ సినిమా కాదు..తెలుగు సినిమా అంటూ క్లారిటీ ఇచ్చింది. దీంతో, అటు నెటిజన్ కి సమాధానమిచ్చింది..ఇటు తానూ ప్యారడైజ్ లో ఐటమ్ సాంగ్ చేసిన విషయాన్ని కన్‌ఫర్మ్ చేసింది.

Actor Ali: నాకు అన్నం పెట్టింది సినిమా! వాళ్ళు నన్ను కరివేపాకులా తీసేశారు!సినిమాSwechaa09 Aug 2026, 12:56 PM

Actor Ali: నాకు అన్నం పెట్టింది సినిమా! వాళ్ళు నన్ను కరివేపాకులా తీసేశారు!

Actor Ali : నా సినిమాలు మానుకుని మరీ వెళ్లి ఎన్నికల సమయంలో వైసీపీ పార్టీకి ఎంత ప్రచారం చేశానో ప్రజలందరికీ తెలుసు. కానీ, నాకు అక్కడ ఏ గుర్తింపు దక్కలేదు. ఇలా, ఐదేళ్లకోసారి వాడుకుని వదిలేస్తే ఎవరికైనా ఎలా ఉంటుంది? బాధ అనిపిస్తుందా లేదా? నాకు అన్నం పెట్టింది సినిమానే.. రాజకీయం, ఏ రాజకీయ నాయకుడు కాదు. సినిమాలతో పాటు, బయట కూడా నాకు మంచి గుర్తింపే ఉంది. ఇంత పేరున్న నన్ను వైసీపీ వాడుకుని, గుర్తింపు లేకుండా కరివేపాకులా తీసి పారేసింది.

నగరంలో పేలుడు.. పరుగులు తీసిన జనాలు  (వీడియో)వైరల్ న్యూస్Swechaa09 Aug 2026, 12:43 PM

నగరంలో పేలుడు.. పరుగులు తీసిన జనాలు (వీడియో)

నగరంలో రోడ్డు పక్కన బెలూన్లు అమ్మే వ్యక్తి వద్దనున్న సిలిండర్ ఒక్కసారిగా పేలింది. మియాపూర్ పీఎస్ పరిధిలోని మదీనాగూడలో ఈ ఘటన జరింది. స్థానికంగా గల జీఎస్ఎం మాల్ పక్కన బెలూన్లలో గాలి నింపి ఓ వ్యక్తి విక్రయిస్తూ ఉండేవాడు. ఎప్పటిలాగే సదరు వ్యక్తి బెలూన్లలో గాలి నింపుతుండగా.. ఒక్కసారిగా సిలిండర్ బ్లాస్ట్ అయ్యింది.ఈ ఘటనలో ముగ్గురికి గాయాలు అవ్వ్గా.. ప్రకాశ్ పాల్ అనే వ్యక్తికి సగం కాలు విరిగినట్టు సమాచారం. ఈ ఘటన అనంతరం బెలూన్లు విక్రయిస్తున్న వ్యక్తి అక్కడి నుంచి పరార్ అయినట్టు సమాచారం.

ఆదివాసీల ఆత్మగౌరవం, హక్కుల కోసం మనమంతా కలిసి నిలబడాలి : సీఎం రేవంత్తెలంగాణSwechaa09 Aug 2026, 12:26 PM

ఆదివాసీల ఆత్మగౌరవం, హక్కుల కోసం మనమంతా కలిసి నిలబడాలి : సీఎం రేవంత్

ప్రపంచ ఆదివాసీ దినోత్సవాన్ని పురస్కరించుకుని సీఎం రేవంత్ రెడ్డి ప్రత్యేకంగా శుభాకాంక్షలు తెలిపారు. ప్రపంచ నాగరికతకు మూలం, ప్రకృతితో మమేకమైన జీవన విధానం - ఆదివాసీ సంస్కృతి అని కొనియాడారు. తరతరాలుగా ప్రకృతి పరిరక్షణను తమ జీవన విధానంగా మలుచుకున్న ఆదివాసీ సమాజాల జ్ఞానం, సంస్కృతి, సంప్రదాయాలు, సమిష్టి జీవన విధానం, సాంస్కృతిక పరిరక్షణ యావత్ మానవాళికి మార్గదర్శకం అని పేర్కొన్నారు. ప్రపంచ ఆదివాసీ దినోత్సవం పురస్కరించుకుని ప్రకృతిని దైవంగా, అడవిని తల్లిగా, తమ సంస్కృతి సంప్రదాయాలను తరతరాలుగా కాపాడుకుంటున్న ఆదివాసీ సోదర సోదరీమణులకు సీఎం శుభాకాంక్షలు తెలిపారు.

డీలిమిటేషన్‌పై అకాలీద‌ళ్ యూటర్న్‌.. 2029కి ముందే గేమ్‌ మారుతోందా?NationalSwechaa09 Aug 2026, 12:18 PM

డీలిమిటేషన్‌పై అకాలీద‌ళ్ యూటర్న్‌.. 2029కి ముందే గేమ్‌ మారుతోందా?

డీలిమిటేషన్‌ ప్రక్రియ ఎప్పుడు పూర్తవుతుంది? కొత్త నియోజకవర్గాలు ఎప్పుడు అమల్లోకి వస్తాయి? మహిళా రిజర్వేషన్‌ ఎప్పటి నుంచి అమలవుతుంది? ఇవన్నీ 2029 ఎన్నికల లెక్కలతో ముడిపడి ఉన్నాయి.

కృష్ణా బేసిన్‌లో తగ్గిన వరద ఉధృతి.. మూతపడిన జూరాల గేట్లు!తెలంగాణSwechaa09 Aug 2026, 12:01 PM

కృష్ణా బేసిన్‌లో తగ్గిన వరద ఉధృతి.. మూతపడిన జూరాల గేట్లు!

తెలుగు రాష్ట్రాల్లోని ప్రధాన ప్రాజెక్టులకు ఎగువ ప్రాంతాల నుంచి వస్తున్న వరద ఉధృతి గణనీయంగా తగ్గింది. కర్ణాటక పరివాహక ప్రాంతాల్లో వర్షాలు తగ్గుముఖం పట్టడంతో ఆల్మట్టి, నారాయణపూర్ ప్రాజెక్టుల నుంచి నీటి విడుదల నిలిచిపోయింది. దీంతో దిగువన ఉన్న జూరాల ప్రాజెక్టు గేట్లను అధికారులు పూర్తిగా మూసివేశారు. కృష్ణా బేసిన్‌లో ప్రవాహం తగ్గడంతో శ్రీశైలం జలాశయానికి వరద నీటి ఇన్ ఫ్లో ఒక్కసారిగా పడిపోయింది. శ్రీశైలం ప్రాజెక్టుకు కొన్ని రోజుల క్రితం వరకు సుమారు రెండున్నర లక్షల క్యూసెక్కులుగా ఉన్న ఇన్ ఫ్లో ప్రస్తుతం 36,233 క్యూసెక్కులకు పడిపోయింది. ప్రాజెక్టు అవుట్‌ఫ్లో 38,369 క్యూసెక్కులుగా నమోదైంది. శ్రీశైలం పూర్తి నీటిమట్టం 885 అడుగులు కాగా, ప్రస్తుతం 878.10 అడుగుల వద్ద నీరు నిల్వ ఉంది. అలాగే పూర్తి నీటి నిల్వ సామర్థ్యం 215.80 టీఎంసీలకు గాను ప్రస్తుతం 178.74 టీఎంసీల నీరు ఉంది. జలాశయంలో ఉన్న నీటితో కుడి, ఎడమ గట్టు జలవిద్యుత్ కేంద్రాల్లో విద్యుత్ ఉత్పత్తిని కొనసాగిస్తున్నారు.

రీల్స్ పిచ్చి.. కొడుకు ప్రాణాలను రిస్కులో పడేసిన తల్లి!వైరల్ న్యూస్Swechaa09 Aug 2026, 11:58 AM

రీల్స్ పిచ్చి.. కొడుకు ప్రాణాలను రిస్కులో పడేసిన తల్లి!

రీల్స్ మోజులో పడిన కొందరు ప్రపంచాన్ని మైమరిచిపోతున్నారు. వ్యూస్, లైక్స్ కోసం బంధాలు, బంధుత్వాలు, వ్యక్తులను లెక్కచేయడం లేదు. రీల్స్‌లో ఫేమస్ అవ్వాలనే దానిమీద వారికి పెద్దగా ఆసక్తి ఉంటోందని నెటిజన్లు విమర్శలు చేస్తున్నారు. చుట్టుపక్కల ఏం జరుగుతోంది? ఎక్కడ ఉన్నాం? మన చేష్టల వలన ఎవరైనా ఇబ్బంది పడతున్నారా? అనే ఆలోచన సైతం వారికి రావడం లేదని సోషల్ మీడియా వేదికగా పలువురు తమ అభిప్రాయాలను వెల్లడిస్తున్నారు. తాజాగా ఓ మహిళ రీల్స్ మోజులో పడి తన కుమారుడి జీవితాన్ని రిస్కులో పడేసింది. ఈ దృశ్యం వీడియాలో స్పష్టంగా కనిపిస్తోంది. ఓ ఫ్లై ఓవర్ మీద రీల్ చేయడం కోసం వివాహిత తన కొడుకుని రోడ్డు మీద వదిలేసింది.

Varanasi: మహేష్ బర్త్ డే గిఫ్ట్ ఇచ్చిన రాజమౌళి..సినిమాSwechaa09 Aug 2026, 11:34 AM

Varanasi: మహేష్ బర్త్ డే గిఫ్ట్ ఇచ్చిన రాజమౌళి..

Varanasi: మహేష్ కి బర్త్ డే విషెస్ తెలుపుతూ వారణాసి సినిమాలోని పాత్ర గురించి ట్వీట్ ద్వారా వెల్లడించాడు జక్కన్న. “రుద్ర తన జీవితానికి మించి ఓ గొప్ప కార్యాన్ని చేయడానికి పుట్టిన ఓ కారణ జన్ముడు. తను అడగని విధిని మోస్తాడు. రుద్ర చమత్కారిగా కనిపిస్తాడు.. అలాగే సాఫ్ట్ గా కనిపిస్తాడు. అంతేకాదు, ఒక రుద్రుడిగానూ కనిపిస్తాడు. రౌద్రంగా ఎవరైనా చేస్తారు.. కానీ సున్నితత్వంతో పాటుగా చాలా తక్కువమంది కనిపిస్తారు. అలాంటి వారిలో ఒక్క మహేష్ మాత్రమే చెయ్యగలడు” అని రాజమౌళి ట్వీట్ లో రాసుకొచ్చాడు.

TTD : తిరుమలకు పోటెత్తారు.. దర్శనానికి 24 గంటల సమయంఏపీSwechaa09 Aug 2026, 11:24 AM

TTD : తిరుమలకు పోటెత్తారు.. దర్శనానికి 24 గంటల సమయం

తిరుమల తిరుపతి దేవస్థానానికి భక్తులు పోటెత్తారు. ఎక్కడ చూసినా గోవింద నామస్మరణలతో మారుమోగుతున్నాయి. వర్షాలు పెద్దగా లేకపోవడంతో భక్తులు తిరుమలకు వెళ్తున్నట్టు సమాచారం.ఇప్పటికే అన్ని కంపార్ట్‌మెంట్లు నిండిపోయినట్టు సమాచారం. విపరీతంగా భక్తులు వస్తుండటంతో అధికారులు సైతం ఏర్పాట్లు చేయలేక ఇబ్బందులు పడుతున్నట్టు తెలుస్తోంది. ఇక భక్తుల రద్దీని దృష్టిలో పెట్టుకుని వీవీఐపీ దర్శనాలకు టీటీడీ బ్రేక్ ఇచ్చినట్టు సమాచారం.

లాల్‌దర్వాజా బోనాల జాతర.. పోటెత్తిన భక్తజనం.. స్టార్ హీరో సందడి!తెలంగాణSwechaa09 Aug 2026, 11:19 AM

లాల్‌దర్వాజా బోనాల జాతర.. పోటెత్తిన భక్తజనం.. స్టార్ హీరో సందడి!

చారిత్రాత్మక హైదరాబాద్ పాతబస్తీలో లాల్‌దర్వాజా శ్రీ సింహవాహిని మహంకాళి అమ్మవారి బోనాల మహోత్సవం ఆదివారం అత్యంత వైభవంగా ప్రారంభమైంది. తెలంగాణ భక్తి భావనకూ, సాంస్కృతిక వైభవానికీ ప్రతీకగా నిలిచే ఈ జాతరతో నగరమంతా ఆధ్యాత్మిక శోభ సంతరించుకుంది. వేకువజామున 4:30 గంటలకే ఆలయ ద్వారాలు తెరిచిన అర్చకులు అమ్మవారికి ప్రత్యేక పూజలు, దివ్యాభిషేకాలు నిర్వహించి, మొదటి బోనాన్ని సమర్పించి ఉత్సవాలకు శ్రీకారం చుట్టారు. అమ్మవారి కృపాకటాక్షాల కోసం ఉదయం నుంచే వేలాది మంది భక్తులు ఆలయానికి పోటెత్తారు. సంప్రదాయ దుస్తులు ధరించిన మహిళలు, తలపై నెయ్యి దీపాలు, వేప మండలతో అలంకరించిన బోనాలను ఎత్తుకుని నిష్ఠతో క్యూలైన్లలో వేచి ఉండి అమ్మవారికి నైవేద్యాలు, ఒడిబియ్యం, చీర-సారె సమర్పించి మొక్కులు తీర్చుకుంటున్నారు.

pension : కొత్త పింఛన్ అర్హులకు శుభవార్త.. రేపటి నుంచే దరఖాస్తులు!తెలంగాణSwechaa09 Aug 2026, 11:06 AM

pension : కొత్త పింఛన్ అర్హులకు శుభవార్త.. రేపటి నుంచే దరఖాస్తులు!

కొత్తగా పింఛన్ కోసం ఎదురుచూస్తున్న వారికి తెలంగాణ ప్రభుత్వం శుభవార్త చెప్పింది. 'చేయూత'పథకం కింద కొత్త పింఛన్ల మంజూరుకు కసరత్తు ప్రారంభించింది. వీలైనంత తొందరగా అర్హులకు కొత్త పింఛన్లు మంజూరు చేయనున్నారు. ఇందుకోసం అధికారులు ప్రణాళికలు సిద్ధం చేశారు. రేపటి నుంచి ‘చేయూత’ వెబ్ పోర్టల్ పూర్తిస్థాయిలో అందుబాటులోకి రానుందని సమాచారం. అర్హులు ఈ పోర్టల్ ద్వారా దరఖాస్తులు చేసుకోవాల్సి ఉంటుంది. 2 వారాల పాటు దరఖాస్తుల స్వీకరించనున్నారు. మరో రెండు వారాలు దరఖాస్తుల పరిశీలన ఉంటుంది. పది రోజుల్లోనే రాష్ట్రవ్యాప్తంగా వచ్చిన దరఖాస్తులను అధికారులు పరిశీలించి ఆమోదించనున్నారు.

భూభారతి ఆపరేటర్ల గోడు పట్టించుకునేదెవరు?తెలంగాణSwechaa09 Aug 2026, 10:59 AM

భూభారతి ఆపరేటర్ల గోడు పట్టించుకునేదెవరు?

15 నెలలుగా జీతాలు అందక భూభారతి ఆపరేటర్లు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. భూముల రిజిస్ట్రేషన్, మ్యుటేషన్‌తో పాటు పలు రెవెన్యూ సేవల్లో కీలకంగా పనిచేస్తున్న తమకు 2025 మార్చి నుంచి ఇప్పటివరకు వేతనాలు చెల్లించలేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పలుమార్లు అధికారులు, ప్రజాప్రతినిధులకు వినతులు ఇచ్చినా ఫలితం లేదంటున్నారు. మరోవైపు ఆపరేటర్ల స్థానంలో జూనియర్ అసిస్టెంట్లను నియమించే ప్రయత్నాలు జరుగుతున్నాయని చెబుతున్నారు. పెండింగ్ వేతనాలు వెంటనే విడుదల చేసి, రెన్యువల్ ఉత్తర్వులు జారీ చేసి తమనే కొనసాగించాలని భూభారతి ఆపరేటర్లు ప్రభుత్వాన్ని కోరుతున్నారు.