స్వేచ్ఛ షార్ట్స్ — తాజా తెలుగు వార్తలు

Gold Price Prediction: 2027లో బంగారం ధర ఎంత ఉండొచ్చు?వైరల్ న్యూస్Swechaa05 Nov 2026, 09:44 PM

Gold Price Prediction: 2027లో బంగారం ధర ఎంత ఉండొచ్చు?

Gold Price Prediction: ధంతేరస్ వేళ పసిడి ధరలు భారీగా దిగిరావడంతో ఊపిరి పీల్చుకున్న కొనుగోలుదారుల్లో ఇప్పుడు సరికొత్త చర్చ మొదలైంది. ప్రస్తుతం రూ.1.45 లక్షల శ్రేణిలో ఉన్న 10 గ్రాముల బంగారం ధర.. వచ్చే 2027 నాటికి ఏ స్థాయికి చేరుతుంది? ఇప్పుడు తగ్గిన ధరల్లో పెట్టుబడి పెడితే భవిష్యత్తులో లాభాలు ఉంటాయా లేక మరింత పడిపోతుందా? అన్నది హాట్ టాపిక్‌గా మారింది. ఈ క్రమంలో ప్రముఖ బ్రోకరేజ్ సంస్థ 'యాక్సిస్ డైరెక్ట్'తో పాటు అంతర్జాతీయ మార్కెట్ నిపుణులు వెల్లడించిన అంచనాలు ఇన్వెస్టర్లలో భారీ ఆసక్తిని రేకెత్తిస్తున్నాయి.సమీప కాలంలో వడ్డీ రేట్ల ఒత్తిడి వల్ల బంగారం ధరల్లో కాస్త ఆటుపోట్లు ఉన్నప్పటికీ.. దీర్ఘకాలికంగా చూస్తే పసిడి మళ్లీ సరికొత్త రికార్డులను సృష్టించడం ఖాయంగా కనిపిస్తోంది. వచ్చే ధంతేరస్ నాటికి (2027 ముంగిట) దేశీయ మార్కెట్లో 10 గ్రాముల బంగారం ధర రూ.1.65 లక్షల నుంచి ఏకంగా రూ.1.80 లక్షల వరకు చేరే అవకాశముందని యాక్సిస్ డైరెక్ట్ నివేదిక వెల్లడించింది. అంటే ప్రస్తుత ధరల వద్ద కొనుగోలు చేసిన వారికి ఏడాదిన్నర కాలంలో 20 నుంచి 25 శాతం వరకు బంపర్ రాబడి (రిటర్న్స్) దక్కే సూచనలు కనిపిస్తున్నాయి.

Flight Mode Benefits: ఫ్లైట్ మోడ్‌తో ఇన్ని ఉపయోగాలు ఉన్నాయా.. తెలిస్తే  వదలరు!వైరల్ న్యూస్Swechaa05 Nov 2026, 09:03 PM

Flight Mode Benefits: ఫ్లైట్ మోడ్‌తో ఇన్ని ఉపయోగాలు ఉన్నాయా.. తెలిస్తే వదలరు!

Flight Mode Benefits: స్మార్ట్‌ఫోన్ వాడే ప్రతి ఒక్కరికీ స్క్రీన్ పైభాగంలో చిన్న విమానం గుర్తు కనిపించే ఉంటుంది. కానీ చాలామంది ఆలోచన ఏంటంటే.. ఇది కేవలం ఫ్లైట్ జర్నీ చేసేటప్పుడు మాత్రమే ఆన్ చేయాల్సిన ఆప్షన్ అని. నిజానికి మనం రోజూ ఎదుర్కొనే ఎన్నో మొబైల్ సమస్యలను చిటికెలో పరిష్కరించడానికి, మన ఫోన్ లైఫ్‌ను పెంచడానికి ఫ్లైట్ మోడ్ ఒక అద్భుతమైన సీక్రెట్ టూల్‌లా పనిచేస్తుంది. దీనివల్ల కలిగే అసలైన ప్రయోజనాలు తెలిస్తే రోజూ కచ్చితంగా వాడటం మొదలుపెడతారు.ఎక్కడికైనా అర్జెంట్‌గా బయల్దేరాలి.. చేతిలో కేవలం పది లేదా పదిహేను నిమిషాలే టైమ్ ఉంది.. బ్యాటరీ చూస్తే డెడ్ అయిపోయే స్థితిలో ఉంది. ఇలాంటి సమయంలో వెంటనే ఫోన్‌ను ఫ్లైట్ మోడ్‌లో పెట్టి ఛార్జింగ్ పెట్టండి. సాధారణంగా మొబైల్ వెనుక నిరంతరం నెట్‌వర్క్, సిగ్నల్ వెతికే ప్రాసెస్ బ్యాటరీని భారీగా లాగేస్తుంది. ఫ్లైట్ మోడ్ ఆన్ చేయగానే ఆ కమ్యూనికేషన్ సిస్టమ్ మొత్తం ఆగిపోయి, బ్యాటరీ రెట్టింపు వేగంతో ఫుల్ అవుతుంది.

Prabhas: బాహుబలి కంటే ఆలస్యంగా కల్కి 2 షూటింగ్.. ఎందుకింత ఆలస్యం?సినిమాSwechaa05 Nov 2026, 09:00 PM

Prabhas: బాహుబలి కంటే ఆలస్యంగా కల్కి 2 షూటింగ్.. ఎందుకింత ఆలస్యం?

Prabhas: మన టాలీవుడ్‌లో భారీ అంచనాలు ఉన్న సినిమాల్లో ప్రభాస్ నటిస్తున్న కల్కి 2898 ఏడీ 2 కూడా ఒకటి. మొదటి భాగం బాక్సాఫీస్ దగ్గర సంచలన విజయం సాధించడంతో సీక్వెల్‌పై అంచనాలు భారీగా పెరిగాయి. అయితే మొదటి భాగం విడుదలై చాలా కాలం గడుస్తున్నా రెండో భాగం షూటింగ్ మాత్రం ఆశించిన వేగంతో ముందుకు సాగడం లేదు. ఇదే ఇప్పుడు అభిమానుల్లో, ఇండస్ట్రీ వర్గాలలో చర్చనీయాంశంగా మారింది.

Smartphone Price Hike: స్మార్ట్‌ఫోన్ ప్రియులకు బ్యాడ్ న్యూస్.. 30% పెరగనున్న ధరలు!NationalSwechaa05 Nov 2026, 08:35 PM

Smartphone Price Hike: స్మార్ట్‌ఫోన్ ప్రియులకు బ్యాడ్ న్యూస్.. 30% పెరగనున్న ధరలు!

Smartphone Price Hike: కొత్త స్మార్ట్‌ఫోన్ కొందామనుకుంటున్న వాళ్లకి బ్యాడ్ న్యూస్. మార్కెట్లో మొబైల్ ఫోన్ల ధరలు భారీగా పెరగనున్నాయి. ముఖ్యంగా సామాన్యులు ఎక్కువగా కొనుగోలు చేసే బడ్జెట్ ఆండ్రాయిడ్ ఫోన్ల రేట్లు ఊహించని రీతిలో ఏకంగా 30 శాతం వరకు పైకి ఎగబాకే అవకాశముందని ప్రముఖ అంతర్జాతీయ బ్రోకరేజ్ సంస్థ 'జెఫ్రీస్' తాజా నివేదికలో హెచ్చరించింది.ప్రపంచవ్యాప్తంగా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సంస్థలు డేటా సెంటర్లు, ఏఐ నెట్‌వర్క్‌ల విస్తరణ కోసం పెద్ద ఎత్తున మెమొరీ చిప్స్‌ను కొనుగోలు చేస్తున్నాయి. మార్కెట్లో అందుబాటులో ఉన్న మెమొరీలో అత్యధిక వాటాను ఈ కంపెనీలే ఎగరేసుకుపోతుండటంతో తీవ్ర కొరత ఏర్పడింది. వచ్చే ఏడాది ప్రపంచవ్యాప్తంగా ఉండే మొత్తం చిప్ డిమాండ్‌లో 60 శాతానికి పైగా ఏఐ కంపెనీలదే ఉండనుందని అంచనా. ఈ విపరీతమైన పోటీ వల్ల ముడిసరుకు ధరలు చుక్కలనంటుతున్నాయి.

గ్లోబల్ సమ్మిట్‌.. సీఎం రేవంత్ కీలక ఆదేశాలుతెలంగాణSwechaa05 Nov 2026, 08:13 PM

గ్లోబల్ సమ్మిట్‌.. సీఎం రేవంత్ కీలక ఆదేశాలు

Global Summit: ఇన్వెస్ట్ తెలంగాణ గ్లోబల్ సమ్మిట్ 2026 ఏర్పాట్లపై సీఎం రేవంత్ రెడ్డి సెక్రటేరియట్ లో సమీక్ష నిర్వహించారు. మంత్రులు, ఉన్నతాధికారులకు కీలక ఆదేశాలు జారీ చేయడంతో పాటు పలు సూచనలు చేశారు. డిసెంబర్ 7, 8, 9 తేదీల్లో జరిగే గ్లోబల్ సమ్మిట్ కు ఇతర రాష్ట్రాల ముఖ్యమంత్రులను ఆహ్వానించాలని సూచించారు.

ప్రతి ప్రతినిధికి ఒక లైజనింగ్ ఆఫీసర్

సదస్సుకు వచ్చే ప్రతి ప్రతినిధికి ఒక లైజనింగ్ ఆఫీసర్ ను నియమించాలన్నారు. ఎయిర్ పోర్టులోనే ప్రతినిధుల రిజిస్ట్రేషన్, పాస్ ల ప్రక్రియ పూర్తి చేయాలన్నారు. సమావేశానికి ముందే పూర్తి సమాచారాన్ని ప్రతినిధులకు అందజేయాలన్నారు. ఈ సదస్సులో టూరిజానికి ప్రాధాన్యత ఇవ్వాలని సీఎం రేవంత్ ఆదేశించారు. తెలంగాణ పర్యాటక ప్రాంతాలకు ప్రపంచ స్థాయిలో గుర్తింపు వచ్చేలా సమ్మిట్ లో ప్రదర్శనలు ఏర్పాటు చేయాలని చెప్పారు.

India vs Pakistan Football: పాక్‌పై భారత్ సంచలన విజయం..NationalSwechaa05 Nov 2026, 07:22 PM

India vs Pakistan Football: పాక్‌పై భారత్ సంచలన విజయం..

India vs Pakistan Football: దక్షిణాసియా ఫుట్‌బాల్ సమాఖ్య ఛాంపియన్‌షిప్‌లో భారత్ అదిరిపోయే బోణీ కొట్టింది. తొలి మ్యాచ్‌లోనే చిరకాల ప్రత్యర్థి పాకిస్థాన్‌తో తలపడిన టీమిండియా 3-2 గోల్స్ తేడాతో దుమ్మురేపే విజయాన్ని అందుకుంది. మ్యాచ్ ఆఖరి క్షణాల్లో పాక్ అనూహ్యంగా రెండు గోల్స్ చేసి తీవ్ర ఒత్తిడి పెంచినా.. పట్టువదలని మన ఆటగాళ్లు ఆధిక్యాన్ని కాపాడుకుని విజేతగా నిలిచారు.మ్యాచ్ ప్రారంభమైన కొద్దిసేపటికే భారత ఫార్వర్డ్ సుహైల్ అహ్మద్ భట్ పాక్ డిఫెన్స్‌ను చీల్చుతూ వరుస దాడులు చేశాడు. ఆట 13వ నిమిషంలోనే మెరుపు గోల్ కొట్టి పాక్‌కు గట్టి షాకిచ్చాడు. ఆ జోరులోనే 19వ నిమిషంలో సుహైల్ మరో గోల్ సాధించి భారత్‌కు 2-0 లీడ్ అందించాడు. అనంతరం 32వ నిమిషంలో మాంగ్లెంతాంగ్ కిప్‌గెన్ మరో సూపర్ గోల్‌తో స్కోరును 3-0కి పెంచడంతో మ్యాచ్ పూర్తిగా టీమిండియా కంట్రోల్‌లోకి వచ్చేసింది. ఫస్ట్ హాఫ్ ముగిసేసరికి భారత్ తిరుగులేని స్థితిలో నిలిచింది.

కోరుట్లలో కలకలం.. వ్యవసాయ బావిలో మందులు, వైద్య వ్యర్థాలుతెలంగాణSwechaa05 Nov 2026, 07:05 PM

కోరుట్లలో కలకలం.. వ్యవసాయ బావిలో మందులు, వైద్య వ్యర్థాలు

Korutla: జగిత్యాల జిల్లా కోరుట్లలో కలకలం రేగింది. అయ్యప్ప గుట్ట శివారులోని వ్యవసాయ బావిలో ప్రభుత్వ మందులు, వైద్య వ్యర్థాలు పెద్ద ఎత్తున బయటపడ్డాయి. గుర్తు తెలియని వ్యక్తులు మెడిసిన్స్ తీసుకొచ్చి అక్కడ పారబోస్తున్నారు. ప్రభుత్వ ఆసుపత్రుల్లో రోగులకు అందించాల్సిన లక్షలాది రూపాయల విలువైన మెడిసిన్స్ ను ఇలా పారబోసి తగలబెట్టడం స్థానికంగా తీవ్ర కలకలం రేపింది.

ఆ మెడిసిన్స్ పై ప్రభుత్వ ముద్రలు ఉన్నాయి. అందులో గడువు తీరిన మందులు కూడా ఉన్నాయి. గుట్టు చప్పుడు కాకుండా తీసుకొచ్చి వ్యవసాయ బావిలో వాటిని పారవేసినట్లుగా తెలుస్తోంది. మందులతో పాటు సూదులు, గ్లౌజులు వంటి బయో వ్యర్ధాలు కూడా ఉండటం స్థానికులను భయాందోళనకు గురి చేస్తోంది. మందులను అక్కడ పారబోసి తగులబెట్టడంతో విషపూరిత పొగ వెలువడుతోందని, చుట్టు పక్కల ప్రాంతాల్లో పెద్దఎత్తున వాయు కాలుష్యం జరుగుతోందని స్థానికులు వాపోతున్నారు. వెంటనే అధికారులు స్పందించి చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు.

US Midterm Elections: ట్రంప్ వర్సెస్ డెమోక్రాట్లు.. భారత్‌పై ప్రభావం ఎంత?NationalSwechaa05 Nov 2026, 05:43 PM

US Midterm Elections: ట్రంప్ వర్సెస్ డెమోక్రాట్లు.. భారత్‌పై ప్రభావం ఎంత?

US Midterm Elections: అమెరికా మధ్యంతర ఎన్నికల ఫలితాలు వెలువడటంతో వాషింగ్టన్‌లో సరికొత్త రాజకీయ సమీకరణాలు మొదలయ్యాయి. చట్టసభలపై డెమోక్రాట్లు నియంత్రణ సాధించడంతో వైట్‌హౌస్‌లో డొనాల్డ్ ట్రంప్ ఏకపక్ష దూకుడుకు బలమైన కళ్లెం పడినట్లయింది. అయితే, తలొగ్గే ప్రసక్తే లేదని స్పష్టం చేస్తూ ట్రంప్ ‘వీటో’ క్యాప్‌తో ప్రత్యర్థులకు గట్టి హెచ్చరికలు పంపారు. ఒకవైపు దూకుడు ప్రదర్శించే ట్రంప్, మరోవైపు ఆయనకు అడ్డుకట్ట వేసే డెమోక్రాట్లు ఈ ఇద్దరి పోరు ప్రపంచ దేశాలతో పాటు భారత్‌పై ఎలాంటి ప్రభావం చూపబోతోందనేది ఇప్పుడు ఆసక్తికరమైన చర్చగా మారింది.ట్రంప్ యంత్రాంగం నిరంతరం తెరపైకి తెచ్చే కఠినమైన వలస విధానాలు అమెరికాలోని భారతీయ టెక్కీలను కలవరపెడుతూనే ఉంటాయి. అయితే, చట్టసభల్లో డెమోక్రాట్ల ఆధిపత్యం వల్ల రిపబ్లికన్ల ఏకపక్ష ఇమ్మిగ్రేషన్ ప్రతిపాదనలకు అడ్డంకి ఏర్పడుతుంది.

బీసీలకు ఇచ్చిన భూములను ప్రభుత్వం వెనక్కి తీసుకోదు-మంత్రి పొన్నంతెలంగాణSwechaa05 Nov 2026, 05:12 PM

బీసీలకు ఇచ్చిన భూములను ప్రభుత్వం వెనక్కి తీసుకోదు-మంత్రి పొన్నం

BC Lands: బీసీలకు కేటాయించిన భూములపై మంత్రి పొన్నం ప్రభాకర్ క్లారిటీ ఇచ్చారు. రాష్ట్రంలో బీసీలకు కేటాయించిన భూములను కాంగ్రెస్ ప్రభుత్వమే కాదు ఏ ప్రభుత్వం కూడా వెనక్కి తీసుకునే పరిస్థితి ఉండదని ఆయన తేల్చి చెప్పారు. బీసీలకు కేటాయించిన భూములు వెనక్కి తీసుకుంటారని జరుగుతున్న ప్రచారంలో నిజం లేదన్నారు. బీసీలకు కేటాయించిన భూముల రక్షణకు ప్రభుత్వం కట్టుబడి ఉందన్నారు. బీసీలకు కేటాయించిన భూముల్లో భవనాలు నిర్మించడమే ప్రభుత్వ సంకల్పం అని మంత్రి పొన్నం ప్రభాకర్ తెలిపారు. కుల సంఘాల ప్రతినిధులు అంతర్గత విభేదాలకు తావునివ్వకుండా ఐక్యంగా ఉండి నిర్మాణాలు పూర్తి చేసుకోవాలని ఆయన సూచించారు.

38 బీసీ కుల సంఘాల ఆత్మగౌరవ భవనాల నిర్మాణానికి ప్రభుత్వం నిధులు మంజూరు చేస్తూ విడుదల చేసిన జీవో పత్రాలను కుల సంఘాల ప్రతినిధులకు అందజేశారు మంత్రి పొన్నం ప్రభాకర్. హైదరాబాద్ మినిస్టర్ క్వార్టర్స్ లో జరిగిన ఈ కార్యక్రమంలో ప్రభుత్వ సలహాదారు వి.హనుమంతరావు, ఎంపీ సురేష్ షెట్కర్, ఎమ్మెల్యే కాలేరు వెంకటేష్, బీసీ సంక్షేమ శాఖ అధికారులు, పలువురు నేతలు పాల్గొన్నారు.

Gold Demand: బంగారంపై మోజు తగ్గిందా.. ఆరేళ్ల కనిష్టానికి పడిపోయిన పసిడి డిమాండ్!NationalSwechaa05 Nov 2026, 04:23 PM

Gold Demand: బంగారంపై మోజు తగ్గిందా.. ఆరేళ్ల కనిష్టానికి పడిపోయిన పసిడి డిమాండ్!

old Demand: భారతీయులకు బంగారానికి మధ్య ఉన్న బంధం కేవలం ఒక లోహంతో ముడిపడినది కాదు.. అది సంప్రదాయం, సెంటిమెంట్, ఆపత్కాలపు ఆస్తి. పెళ్లిళ్లు, పండుగలు, చిన్న చిన్న శుభకార్యాలొచ్చినా మెడలో నాలుగు గ్రాముల పసిడి మెరిసిపోవాల్సిందేనని ఆశపడే అతివలు మన దేశంలో కోట్లలో ఉంటారు. కానీ, ఇప్పుడు ఆ బంగారు దుకాణాల వైపు చూడాలంటేనే జనం ఒకటికి రెండుసార్లు ఆలోచిస్తున్నారు. ఎప్పుడూ రద్దీగా కనిపించే నగల షాపుల్లో సందడి తగ్గడం చూస్తుంటే.. అసలు భారతీయుల్లో బంగారంపై ఉన్న మోజు తగ్గిపోయిందా? లేక భగ్గుమంటున్న ధరలు సామాన్యుడిని ఆమడదూరంలో నిలబెట్టాయా? అనే సందేహాలు మొదలయ్యాయి.వరల్డ్ గోల్డ్ కౌన్సిల్ విడుదల చేసిన తాజా గణాంకాలు ఈ విషయాన్ని తేటతెల్లం చేస్తున్నాయి. దేశంలో పసిడి డిమాండ్ ఊహించని రీతిలో పడిపోయి ఏకంగా ఆరేళ్ల కనిష్ట స్థాయికి చేరింది. జూలై–సెప్టెంబర్ త్రైమాసికంలో దేశీయంగా బంగారానికి గిరాకీ ఏకంగా 29 శాతం క్షీణించింది.

TG : చేతులెత్తేసిన రేవంత్ సర్కార్.. ఐటీ ఉద్యోగులకు వర్క్ ఫ్రం హోం!టాప్ న్యూస్Swechaa05 Nov 2026, 03:19 PM

TG : చేతులెత్తేసిన రేవంత్ సర్కార్.. ఐటీ ఉద్యోగులకు వర్క్ ఫ్రం హోం!

రాష్ట్రంలో నీటి కొరత తీవ్రతరం అవుతున్న తరుణంలో రేవంత్ సర్కార్ చేతులెత్తేసినట్టు తెలుస్తోంది. వర్షాలు పూర్తిగా తగ్గుముఖం పట్టడం, ఎండలు పెరగడంతో ప్రాజెక్టుల్లో నీటి నిల్వలు క్రమంగా పడిపోతున్నాయి. ప్రస్తుతం నగరంలోని జంట జలాశయాలు, ఇతర ప్రాజెక్టుల్లోని నీటిని కేవలం తాగునీటి అవసరాల కోసం మాత్రమే వినియోగించాలని సర్కార్ నిర్ణయించింది.దీంతో నగరంలో వాణిజ్య అవసరాలు తీర్చడంలో ప్రభుత్వం ఘోరంగా విఫలమైందని సమాచారం. హైదరాబాద్‌లో వేసవి రాకముందే నీటి కొరత తీవ్రతరం కావడంతో ఇప్పటికే నారాయణ, శ్రీచైతన్య వంటి విద్యాసంస్థలు స్కూల్స్, కాలేజీలకు హాఫ్ డే ప్రకటించాయి. అదే బాటలో మరికొన్ని విద్యాసంస్థలు ఉన్నట్టు తెలుస్తోంది. హాస్టల్స్ నుంచి వచ్చేవారికి ముందస్తు దీపావళి సెలవుల పేరిట హాలిడేస్ ప్రకటించాయి.ఈ క్రమంలోనే ప్రభుత్వం మీద ఒత్తిడి పెరుగుతుండటంతో ఐటీ ఉద్యోగులకు వర్క్ ఫ్రమ్ హోం ఇవ్వాలని సంస్థలకు ఆదేశాలు ఇచ్చే ఆలోచనలో కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నట్టు తెలుస్తోంది.

సీజేపీకి పాకిస్తాన్, అమెరికా నుంచి నిధులు: కేంద్ర మంత్రి జితేంద్ర సింగ్ ఆరోపణలు!NationalSwechaa05 Nov 2026, 03:02 PM

సీజేపీకి పాకిస్తాన్, అమెరికా నుంచి నిధులు: కేంద్ర మంత్రి జితేంద్ర సింగ్ ఆరోపణలు!

 కేంద్ర ప్రభుత్వ విధానాలకు వ్యతిరేకంగా ఆందోళనలు చేపడుతున్న కాక్రోచ్ జనతా పార్టీ (CJP) పై కేంద్ర సహాయ మంత్రి జితేంద్ర సింగ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. సీజేపీ నాయకులకు విదేశాల నుంచి అక్రమంగా నిధులు అందుతున్నాయని, ఈ సంస్థకు చెందిన కీలక నేతలకు పాకిస్తాన్ రాజకీయ నాయకులతో ప్రత్యక్ష సంబంధాలు ఉన్నాయని ఆయన ఆరోపించారు. దేశంలో అల్లర్లు సృష్టించడానికి, ప్రభుత్వంపై అబద్ధాలు ప్రచారం చేయడానికి భారత్ వ్యతిరేక విదేశీ ఎన్‌జీఓలు, శక్తుల నుంచి ఈ పార్టీకి ఆర్థిక సాయం అందుతోందని స్పష్టమైన ఆధారాలు ఉన్నాయని మంత్రి పేర్కొన్నారు.

Telangana Politics: దామోదర వర్సెస్ కాంతారావు.. హోటల్ లాబీలో అసలు ఏం జరిగింది!తెలంగాణSwechaa05 Nov 2026, 02:46 PM

Telangana Politics: దామోదర వర్సెస్ కాంతారావు.. హోటల్ లాబీలో అసలు ఏం జరిగింది!

Telangana Politics: ఢిల్లీ నడిబొడ్డున తెలంగాణ కాంగ్రెస్ కీలక నేతల మధ్య జరిగిన తీవ్ర వాగ్వాదం ఇప్పుడు రాష్ట్ర రాజకీయాల్లో హాట్ టాపిక్‌గా మారింది. కేంద్రానికి వ్యతిరేకంగా నిర్వహించిన 'ఇండియా' కూటమి ర్యాలీ కోసం పార్టీ నేతలంతా ఐక్యంగా ఢిల్లీకి వెళ్లారు. అంతా సజావుగానే సాగిందనుకుంటున్న సమయంలో.. ఓ విలాసవంతమైన స్టార్ హోటల్ లాబీ వేదికగా చోటుచేసుకున్న హైడ్రామా గాంధీ భవన్ వర్గాలను ఒక్కసారిగా ఉలిక్కిపడేలా చేసింది.ర్యాలీ ముగిసిన అనంతరం తెలంగాణకు చెందిన పలువురు ఎమ్మెల్యేలు, సీనియర్ నాయకులు హోటల్ లాబీలో కూర్చుని మాట్లాడుకుంటున్నారు. ఆ గుంపులో రంగారెడ్డి, నల్గొండ జిల్లాలకు చెందిన కాంగ్రెస్ ప్రజాప్రతినిధులు కూడా ఉన్నారు. అదే టైంలో వైద్య ఆరోగ్య శాఖ మంత్రి దామోదర రాజనరసింహ లాబీ మీదుగా నడుచుకుంటూ అటువైపు వచ్చారు.

సాస్ ఇన్‌ఫ్రా భూబాగోతం.. రూ.680 కోట్ల విలువైన స్థలం కబ్జా?Accusations Without Official ConfirmationSwechaa05 Nov 2026, 02:35 PM

సాస్ ఇన్‌ఫ్రా భూబాగోతం.. రూ.680 కోట్ల విలువైన స్థలం కబ్జా?

గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో ఖాళీ జాగా కనిపిస్తే చాలు కబ్జా పెట్టేస్తున్నారు కొందరు అక్రమార్కులు. అందులో పొలిటికల్ పార్టీలకు చెందిన వారు కొందరు ఉంటే, మరికొందరు వీఐపీలకు బినాaగ్రేటర్ హైదరాబాద్ పరిధిలో ఖాళీ జాగా కనిపిస్తే చాలు కబ్జా పెట్టేస్తున్నారు కొందరు అక్రమార్కులు. అందులో పొలిటికల్ పార్టీలకు చెందిన వారు కొందరు ఉంటే, మరికొందరు వీఐపీలకు బినామీలుగా కొనసాగుతున్నారు.తాజాగా ఓ ఇన్ ఫ్రా కంపెనీ రూ.వందల కోట్ల విలువైన స్థలాన్ని కబ్జా పెట్టినట్టు ఆరోపణలు వినిపిస్తున్నాయి.ఒకటి కాదు రెండు కాదు రూ. 680 కోట్ల విలువైన 3.17 ఎకరాల ప్రభుత్వ భూమిని సాస్‌ (SAS) ఇన్‌ఫ్రా కబ్జా చేసినట్టు ఆరోపణలు వస్తున్నాయి. ప్రభుత్వంలోని ఓ ముఖ్యనేత ప్రధాన సన్నిహితుడి అండతో ఈ భూమిని తమ పేరుపై రిజిస్టర్ చేసుకున్నట్టు సమాచారం.ఏకంగా చెరువులో నుంచి రోడ్డు వేసుకునేందుకు వీలుగా ఇరుగుపొరుగు అపార్ట్‌మెంట్‌వాసులు అడ్డుచెప్పకుండా నేరుగా హైడ్రా అధికారులు రంగంలోకి దిగి వారికి ధమ్కీ ఇచ్చినట్టు ప్రచారం జరుగుతోంది.మీలుగా కొనసాగుతున్నారు.వారి నేమ్ కార్డు, పర్సనల్ డిటేల్స్ బయటకు రాకుండా జాగ్రత్త పడుతున్నారు.

ఆర్‌ఆర్ ట్యాక్స్ మీద కేంద్రం చర్యలు ఉండవా? :కేటీఆర్తెలంగాణSwechaa05 Nov 2026, 02:10 PM

ఆర్‌ఆర్ ట్యాక్స్ మీద కేంద్రం చర్యలు ఉండవా? :కేటీఆర్

తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి రియల్ ఎస్టేట్ వ్యాపారుల నుంచి సీఎం రేవంత్ రెడ్డి ‘ఆర్ఆర్’ ట్యాక్స్ వసూలు చేస్తున్నారని, దీనిపై కేంద్రంలోని మోడీ సర్కార్ ఎందుకు చర్యలు తీసుకోవడం లేదని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మరోసారి ప్రశ్నించారు. ఆర్ఆర్ ట్యాక్స్ అంశంలో బడా భాయ్ మోడీ, ఏబీవీపీ చోటా భాయ్ రేవంత్‌ రెడ్డిపై ఎప్పటికీ చర్యలు తీసుకోరని విమర్శలు గుప్పించారు. హైదరాబాద్‌లో ఏ బిల్డర్‌, డెవలపర్‌ను అడిగినా ‘ఆర్ఆర్’ ట్యాక్స్ వాస్తవమేనని చెబుతారని, చదరపు అడుగుకు రూ.200 చొప్పున వసూలు చేస్తున్నారనే విషయం అందరికీ తెలుసు అని అన్నారు. రియల్ ఎస్టేట్ రంగంలో అందరికీ తెలిసిన ఈ విషయంపై నేటికీ చర్యలు ఎందుకు తీసుకోవడం లేదని ప్రశ్నించారు.

బలూచిస్థాన్‌లో దాడులు.. 25 నిమిషాల్లో 40 మంది పాకిస్థాన్ సైనికులు హతం!InternationalSwechaa05 Nov 2026, 02:00 PM

బలూచిస్థాన్‌లో దాడులు.. 25 నిమిషాల్లో 40 మంది పాకిస్థాన్ సైనికులు హతం!

పాకిస్థాన్ బలగాలే లక్ష్యంగా బలూచిస్థాన్ విముక్తి సైన్యం (Baloch Liberation Army - BLA) ఒక్కసారిగా విరుచుకుపడింది. బలూచిస్థాన్ ప్రావిన్స్ వ్యాప్తంగా గత కొద్ది రోజులుగా జరిపిన 25 వేర్వేరు నిరోధక దాడుల్లో కనీసం 40 మంది పాకిస్థానీ భద్రతా సిబ్బంది ప్రాణాలు కోల్పోగా, పదుల సంఖ్యలో గాయపడినట్లు బిఎల్‌ఎ ప్రతినిధి జీయంద్ బలూచ్ గురువారం (నవంబర్ 5, 2026) ప్రకటించారు. అక్టోబర్ 26 నుంచి నవంబర్ 3 మధ్య కాలంలో పాక్ మిలిటరీ స్థావరాలు, ఇంటెలిజెన్స్ వాహనాలు, సైనిక కాన్వాయ్‌లపై వ్యూహాత్మకంగా దాడులు నిర్వహించినట్లు సంస్థ తెలిపింది.

Kamal Haasan: క్రేజీ లైనప్.. నిర్మాతగా మూడు, హీరోగా మూడు!సినిమాSwechaa05 Nov 2026, 01:58 PM

Kamal Haasan: క్రేజీ లైనప్.. నిర్మాతగా మూడు, హీరోగా మూడు!

Kamal Haasan: సౌత్ సినిమా ఇండస్ట్రీలలో లోకనాయకుడు కమల్ హాసన్ రూటే సెపరేటు. నటుడిగా ఎన్నో ప్రయోగాలు చేసి తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న ఆయన.. ఇప్పుడు నిర్మాతగానూ భారీ ప్రాజెక్టులను లైన్‌లో పెడుతున్నారు. ఒకవైపు హీరోగా వరుస సినిమాలు చేస్తూనే, మరోవైపు తన సొంత నిర్మాణ సంస్థ రాజ్ కమల్ ఫిల్మ్స్ ఇంటర్నేషనల్ బ్యానర్‌పై కొత్తగా భారీ బడ్జెట్ చిత్రాలను నిర్మించేందుకు సిద్ధమవుతున్నారు. ప్రస్తుతం కమల్ హాసన్ కెరీర్‌లో ఆరు క్రేజీ ప్రాజెక్టులు ఉండటం విశేషం.

పీసీసీ విచారణకు మంత్రి దామోదర డుమ్మా!రాజకీయాలుSwechaa05 Nov 2026, 01:46 PM

పీసీసీ విచారణకు మంత్రి దామోదర డుమ్మా!

కాంగ్రెస్ పార్టీలో నేతల మధ్య నెలకొన్న వివాదాలు ప్రతిపక్షాలకు ఆయుధంగా మారుతున్నా వారి తీరులో మాత్రం ఎటువంటి మార్పు కనిపించడం లేదు. ఎవరు ఏమనుకుంటే మాకేంది? అన్న ధోరణిలో మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు ఉన్నట్టు తెలుస్తోంది. ఇటీవల రాహుల్ గాంధీ పిలుపుమేరకు రాష్ట్రం నుంచి తెలంగాణ మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎంపీలు ఢిల్లీలోని రాంలీలా మైదానంలో తలపెట్టిన ర్యాలీలో పాల్గొన్న విషయం తెలిసిందే. అదే సమయంలో ఆరోగ్యశాఖ మంత్రి దామోదర రాజనరసింహ, జుక్కల్ ఎమ్మెల్యే లక్ష్మీ కాంతారావు మధ్య మాటల యుద్ధం నెలకొంది.డీసీసీ పదవుల నియామకంలో వీరిద్దరి మధ్య వివాదం తలెత్తినట్టు సమాచారం.ఈ క్రమంలోనే మంత్రి దామోదర ఢిల్లీలోని శాంగ్రిలా హోటల్ లాబీలోని గదిలో తీవ్ర అసభ్య పదజాలంతో లక్ష్మీకాంతరావును దూషించినట్టు తెలిసింది. అంతేకాకుండా ఇద్దరి మధ్య మాటలు ముదరడంతో వ్యక్తిగతంగా దాడులు చేసుకునే వరకు పరిస్థితి వెళ్లినట్టు సమాచారం. ఆ సమయంలో మల్‌రెడ్డి రంగారెడ్డి,పలువురు నేతలు ఉన్నట్టు తెలిసింది.

ప్రభుత్వ ఉద్యోగులు జవాబుదారీతనంగా ఉండాలి: సుప్రీం కోర్టు కీలక వ్యాఖ్యలు!NationalSwechaa05 Nov 2026, 01:41 PM

ప్రభుత్వ ఉద్యోగులు జవాబుదారీతనంగా ఉండాలి: సుప్రీం కోర్టు కీలక వ్యాఖ్యలు!

ప్రభుత్వ ఉద్యోగులకు లభిస్తున్న విశేషాధికారాలు, డీఏ బకాయిలు, వారి పనితీరుపై సుప్రీంకోర్టు అత్యంత కీలకమైన వ్యాఖ్యలు చేసింది. కార్పొరేట్ లేదా అసంఘటిత రంగాలతో పోలిస్తే ప్రభుత్వ ఉద్యోగులు ప్రత్యేక హక్కులు కలిగిన వర్గమని, వారికి వేతనాలతో పాటు డీఏ, అలవెన్సులు, పెన్షన్ వంటి సదుపాయాలు శాశ్వతంగా అందుతాయని కోర్టు గుర్తుచేసింది. ఉద్యోగి మరణానంతరం కూడా వారి కుటుంబ సభ్యులకు పెన్షన్ లభిస్తున్నప్పటికీ, సమాజం పట్ల వారి నుంచి రావాల్సిన బాధ్యత మరియు జవాబుదారీతనం ఏ స్థాయిలో ఉందనేది ఆత్మపరిశీలన చేసుకోవాలని ధర్మాసనం అభిప్రాయపడింది.

Tollywood: శ్రీకాంత్ కూతురు మేధా మేక కి వరుస ఆఫర్స్..కానీ అన్నీ ఒప్పుకోవద్దు!సినిమాSwechaa05 Nov 2026, 01:40 PM

Tollywood: శ్రీకాంత్ కూతురు మేధా మేక కి వరుస ఆఫర్స్..కానీ అన్నీ ఒప్పుకోవద్దు!

Tollywood: సీనియర్ నటీనటులు శ్రీకాంత్-ఊహల ముద్దుల కూతురు మేధా మేక హీరోయిన్‌గా టాలీవుడ్‌లో ఎంట్రీ ఇవ్వబోతోంది. అంతేకాదు, అగ్ర నిర్మాణ సంస్థలలో అవకాశాలను అందుకుంటోంది. వరుస ప్రాజెక్ట్స్‌కి సైన్ చేస్తూ సినీ ప్రముఖులను షాకయ్యేలా చేస్తోంది. అయితే, ఇలా వచ్చిన ప్రతీ అవకాశాన్ని ఒడిసి పట్టుకోకుండా ఒక్కో ప్రాజెక్ట్‌ను తన కెరీర్‌కి మంచి టర్నింగ్ పాయింట్ అయ్యేలా ఎంచుకోమని ప్రముఖులు సలహాలిస్తున్నారు.

పార్టీల మధ్య బౌన్సర్ల లొల్లి! బీఆర్ఎస్, బీజేపీ, కాంగ్రెస్ మాటల యుద్ధంతెలంగాణSwechaa05 Nov 2026, 01:28 PM

పార్టీల మధ్య బౌన్సర్ల లొల్లి! బీఆర్ఎస్, బీజేపీ, కాంగ్రెస్ మాటల యుద్ధం

తెలంగాణ రాజకీయాల్లో ఇప్పుడు నాయకుల కంటే వారి వెనక ఉండే వాళ్లే ఎక్కువగా వార్తల్లోకి వస్తున్నారు. ఒకరు బౌన్సర్ అంటారు. ఇంకొకరు మేనేజ్‌మెంట్ కోటా అంటారు. మరొకరేమో ఢిల్లీకి బ్యాగులు మోస్తున్నారని, చెప్పులు మోస్తున్నారని సెటైర్లు వేస్తారు. ఏంటీ కథ..?

అయ్యప్ప సొసైటీలో సీఎం రేవంత్ సోదరుల అక్రమ దందా : కవితతెలంగాణSwechaa05 Nov 2026, 01:13 PM

అయ్యప్ప సొసైటీలో సీఎం రేవంత్ సోదరుల అక్రమ దందా : కవిత

సీఎం రేవంత్ రెడ్డి కుటుంబం మీద తెలంగాణ రక్షణ సమితి (TRS) అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత మరోసారి సంచలన అవినీతి ఆరోపణలు చేశారు. నగరంలోని అయ్యప్ప సొసైటీ భూములను సీఎం, ఆయన ఫ్యామిలీ మెంబర్స్ కామధేనువుగా వాడుకుంటూ అక్రమార్జనకు పాల్పడుతున్నారని ఆరోపించారు. హైదరాబాద్ మహానగరంలో మౌలిక వసతుల కల్పనను గాలికొదిలేసి కేవలం అక్రమార్జన మీదనే దృష్టి సారించాలని మండిపడ్డారు. గురువారం బంజారాహిల్స్‌లోని టీఆర్ఎస్ పార్టీ ఆఫీసులో ఆమె మీడియాతో మాట్లాడారు. నెలరోజుల్లో అయ్యప్ప సొసైటీలోని అక్రమ భవనాలపై చర్యలు తీసుకోవాలని, లేదంటే స్వయంగా వెళ్లి అక్రమ భవనాలకు 'రెడ్ మార్క్' వేస్తామని హెచ్చరించారు.

Tollywood: రాధిక ఆప్టేపై పాయల్ రాజ్‌పుత్ కౌంటర్!ఇదీ కృతజ్ఞత అంటే..సినిమాSwechaa05 Nov 2026, 01:09 PM

Tollywood: రాధిక ఆప్టేపై పాయల్ రాజ్‌పుత్ కౌంటర్!ఇదీ కృతజ్ఞత అంటే..

Tollywood: మన తెలుగు సినిమా ఇండస్ట్రీలో ప్రస్తుతం రాధికా ఆప్టే చేసిన వ్యాఖ్యలు హాట్ టాపిక్‌గా మారాయి. ముఖ్యంగా, తెలుగు చిత్ర పరిశ్రమ, దక్షిణాది సినిమాలపై ఆమె చేసిన వ్యాఖ్యలు టాలీవుడ్‌లో చర్చకు దారితీశాయి. ఇప్పటికే పలువురు సినీ ప్రముఖులు ఆమె వ్యాఖ్యలపై స్పందించి గట్టిగానే సమాధామిచ్చారు. ఈ క్రమంలోనే, తాజాగా హీరోయిన్ పాయల్ రాజ్‌పుత్ కూడా రంగంలోకి దిగారు. రాధికా ఆప్టే వ్యాఖ్యలకు తనదైన శైలిలో గట్టి కౌంటర్ ఇచ్చారు.

Ram Charan-RC 17: సుకుమార్, చరణ్‌ల ఆర్సీ 17 బడ్జెట్ రూ.400 కోట్లా?సినిమాSwechaa05 Nov 2026, 12:55 PM

Ram Charan-RC 17: సుకుమార్, చరణ్‌ల ఆర్సీ 17 బడ్జెట్ రూ.400 కోట్లా?

Ram Charan-RC 17: ఇటీవల ఓపెనింగ్ జరిగినప్పటి నుంచి ఆర్సీ 17 సినిమా మీద రక రకాల చర్చలు సోషల్ మీడియాలోనూ, ఫిల్మ్ సర్కిల్స్‌లోనూ జరుగుతున్నాయి. రగస్థలం లాంటి సినిమా తర్వాత సుకుమార్, చరణ్ కాంబినేషన్‌లో మళ్ళీ సినిమా అంటే ఓపెనింగ్ ముందు వరకూ అందరూ ఊహించుకున్నది ఒకటి. కానీ, సుకుమార్ సాలీడ్ షాకిచ్చాడు. ఇదిలా ఉంటే, తాజాగా ఆర్సీ 17 ప్రాజెక్ట్ బడ్జెట్ విషయంలో ఓ షాకింగ్ న్యూస్ వైరల్ అవుతోంది.

ఢిల్లీలో విషాదం: పాఠశాల తరగతి గదిలో కుప్పకూలి మూడో తరగతి విద్యార్థిని మృతి!వైరల్ న్యూస్Swechaa05 Nov 2026, 12:52 PM

ఢిల్లీలో విషాదం: పాఠశాల తరగతి గదిలో కుప్పకూలి మూడో తరగతి విద్యార్థిని మృతి!

 ఢిల్లీలోని మయూర్ విహార్ (Mayur Vihar) ప్రాంతంలోని ఓ ప్రైవేట్ పాఠశాలలో చోటుచేసుకున్న అకస్మిక ఘటన తీవ్ర విషాదాన్ని నింపింది. మూడో తరగతి చదువుతున్న తొమ్మిదేళ్ల బాలిక తరగతి గదిలో అకస్మాత్తుగా కుప్పకూలి ప్రాణాలు కోల్పోయింది. పీటీ(PT) క్లాస్ ముగిసిన తర్వాత విద్యార్థులు తిరిగి తరగతి గదికి వచ్చారు. ఆ సమయంలో ఈ ఘటన చోటుచేసుకుంది. సీసీటీవీ ఫుటేజ్ ప్రకారం.. చిన్నారి గదిలోకి నడుచుకుంటూ వచ్చి, కొద్దిసేపటి తర్వాత కుప్పకూలిపోయినట్లు గుర్తించారు.

పులివెందులలో హైటెన్షన్.. వైసీపీ, టీడీపీ నేతల హోరాహోరీ దాడులుఏపీSwechaa05 Nov 2026, 12:44 PM

పులివెందులలో హైటెన్షన్.. వైసీపీ, టీడీపీ నేతల హోరాహోరీ దాడులు

ఏపీలో ఎంపీటీసీ, జెడ్పీటీసీ స్థానాలకు పోలింగ్ జరుగుతోంది. అయితే, పలు పోలింగ్ కేంద్రాల వద్ద తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. కొందరు వైసీపీ గూండాలు పోలింగ్ కేంద్రాల వద్దకు చేరుకోగా స్థానికులు, తెలుగుదేశం పార్టీ నేతల మధ్య దాడులు చోటుచేసుకున్నాయి. పోలింగ్ కేంద్రాల వద్ద కర్రలు, రాళ్లతో పాటు పెట్రోల్ బాంబు దాడులు జరిగినట్టు సమాచారం. తిరుపతి జిల్లా పెనగలూరు మండలం నల్లపురెడ్డిపల్లెలో బందోబస్తు నిర్వహిస్తున్న పోలీసుల కళ్లెదురు గానే కొందరు పెట్రోల్ బాంబులతో దాడులకు తెగబడ్డారు. ఈ ఘటనలో స్థానికులు తీవ్ర భయాందోళనకు గురయ్యారు. కడప జిల్లా పులివెందుల మండలం ఎర్రిపల్లి పోలింగ్ బూత్ వద్ద కూడా పెట్రోల్ బాంబులు విసరడంతో భారీగా మంటలు చెలరేగాయి. సమాచారం అందుకున్న వెంటనే ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు పరిస్థితిని అదుపులోకి తెచ్చేందుకు తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నారు.

ఎన్నికల్లో ట్రంప్‌‌నకు గట్టి ఎదురుదెబ్బ.. డెమోక్రాట్ల క్లీన్ స్వీప్!InternationalSwechaa05 Nov 2026, 12:42 PM

ఎన్నికల్లో ట్రంప్‌‌నకు గట్టి ఎదురుదెబ్బ.. డెమోక్రాట్ల క్లీన్ స్వీప్!

 అమెరికాలో అధ్యక్షుడిగా డొనాల్డ్ ట్రంప్ నాయకత్వంలోని రిపబ్లికన్ పార్టీకి మిడ్‌టర్మ్ ఎన్నికల ఫలితాలు ఊహించని షాక్ ఇచ్చాయి. యూఎస్ కాంగ్రెస్‌లోని ప్రతినిధుల సభ (హౌస్ ఆఫ్ రిప్రజెంటేటివ్స్), సెనేట్ రెండింటిలోనూ డెమోక్రటిక్ పార్టీ అఖండ విజయం సాధించి స్పష్టమైన మెజారిటీని సొంతం చేసుకుంది. ఈ పరిణామంతో వాషింగ్టన్ రాజకీయాల్లో సమీకరణాలు పూర్తిగా మారిపోగా, వైట్ హౌస్‌లో ఓటమికి బాధ్యత ఎవరిదనే అంశంపై అంతర్గత విభేదాలు భగ్గుమన్నాయి.

సీఎం రేవంత్ రెడ్డికి హైకోర్టులో మరో ఎదురుదెబ్బ!తెలంగాణSwechaa05 Nov 2026, 12:29 PM

సీఎం రేవంత్ రెడ్డికి హైకోర్టులో మరో ఎదురుదెబ్బ!

తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డికి హైకోర్టులో మరో ఎదురుదెబ్బ తగిలింది. మాజీ ఎమ్మెల్సీ స్టీఫెన్‌సన్ భూములను నిషేధిత జాబితాలో చేర్చేందుకు జీవో 134ను ముఖ్యమంత్రి ఉపయోగించారని, దానిని నిలిపివేయాలని స్టీఫెన్ సన్ వేసిన పిటిషన్‌ను తెలంగాణ హైకోర్టు ఇవాళ విచారించింది. గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో ‘ఓటుకు నోటు’ కేసులో రేవంత్ రెడ్డిపై ఫిర్యాదు చేశాననే పగతో సికింద్రాబాద్ బోయిగూడలో తనకున్న 1936 చదరపు గజాల స్థలాన్ని జీవో 134ను అడ్డం పెట్టుకుని నిషేధిత జాబితాలో చేర్చేందుకు కుట్ర చేస్తున్నారని హైకోర్టులో స్టీఫెన్ సన్ వాదనలు వినిపించారు.ఈ కేసును విచారణ అనంతరం జీవో 134ను నిలిపివేస్తూ న్యాయమూర్తి ఉత్తర్వులు జారీ చేశారు. ఈ తీర్పు కేవలం స్టీఫెన్‌సన్ భూములకు మాత్రమే వర్తిస్తుందని హైకోర్టు న్యాయమూర్తి స్పష్టంచేశారు.

హ్యాపీ బర్త్ డే 'కింగ్ కోహ్లీ'.. 15వేల పైచిలుకు పరుగులతో నీకు నువ్వే సాటి!క్రీడలుSwechaa05 Nov 2026, 12:00 PM

హ్యాపీ బర్త్ డే 'కింగ్ కోహ్లీ'.. 15వేల పైచిలుకు పరుగులతో నీకు నువ్వే సాటి!

భారత క్రికెట్ దిగ్గజం, రికార్డుల రారాజు విరాట్ కోహ్లీ గురువారం (నవంబర్ 5, 2026) తన 38వ పుట్టినరోజును జరుపుకుంటున్నారు. ఢిల్లీ వేదికగా గల్లీ క్రికెట్‌తో ప్రయాణం ప్రారంభించి, అంతర్జాతీయ మైదానంలో అత్యంత స్థిరమైన ప్రదర్శనతో ప్రపంచ స్థాయి బ్యాటర్‌గా ఎదిగిన కోహ్లీ కెరీర్ అనేక ఘనతలు, ప్రపంచ రికార్డులతో నిండి ఉంది. సచిన్ టెండూల్కర్ రికార్డులను అధిగమించడం నుంచి టీమిండియాను అత్యంత విజయవంతమైన టెస్ట్ కెప్టెన్‌గా నడిపించడం వరకు విరాట్ మైలురాళ్లు కింగ్ కోహ్లీ సొంతం.

ట్రంప్‌కు షాక్.. మార్కెట్లకు జోష్.. బంగారానికి మళ్లీ రెక్కలు!వ్యాపారంSwechaa05 Nov 2026, 11:50 AM

ట్రంప్‌కు షాక్.. మార్కెట్లకు జోష్.. బంగారానికి మళ్లీ రెక్కలు!

అమెరికా రాజకీయాల్లో అనూహ్య పరిణామం చోటు చేసుకుంది. మిడ్ టర్మ్ ఎన్నికల్లో డొనాల్డ్ ట్రంప్ పార్టీకి భారీ ఎదురుదెబ్బ తగిలింది. ఈ ప్రభావం ప్రపంచ మార్కెట్లపై పడింది. అమెరికా షేర్ మార్కెట్లు దూసుకెళ్లాయి. కొంతకాలంగా భారీ ఒడిదుడుకులు ఎదుర్కొన్న బంగారం ధరలు కూడా మళ్లీ పుంజుకుంటున్నాయి.