స్వేచ్ఛ షార్ట్స్ — తాజా తెలుగు వార్తలు

Cm Revanth - Hydraa: హైదరాబాద్ చెరువులకు జీవం పోస్తోంది- హైడ్రాపై సీఎం రేవంత్ ప్రశంసలుతెలంగాణSwechaa01 Aug 2026, 08:03 PM

Cm Revanth - Hydraa: హైదరాబాద్ చెరువులకు జీవం పోస్తోంది- హైడ్రాపై సీఎం రేవంత్ ప్రశంసలు

హైడ్రా పని తీరుపై సీఎం రేవంత్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. హైదరాబాద్ పరిధిలోని చెరువులకు హైడ్రా జీవం పోస్తోందని సీఎం రేవంత్ అన్నారు. ఉప్పల్ నల్ల చెరువు జలకళను సంతరించుకున్నట్లు హైడ్రా షేర్ చేసిన వీడియోను సీఎం రేవంత్ ట్వీట్ చేశారు. నల్ల చెరువు పునరుజ్జీవానికి అహర్నిశలు శ్రమించిన హైడ్రా అధికారులు, సిబ్బందికి హృదయపూర్వక అభినందనలు తెలిపారు.

Arvind Kejriwal: E20 పెట్రోల్ పై ఇక సమరమే.. ప్రధాని ఇంటికి.. కేజ్రీవాల్ కీలక ప్రకటనNationalSwechaa01 Aug 2026, 07:44 PM

Arvind Kejriwal: E20 పెట్రోల్ పై ఇక సమరమే.. ప్రధాని ఇంటికి.. కేజ్రీవాల్ కీలక ప్రకటన

కేంద్రం ప్రభుత్వం తీసుకొచ్చిన E20 పెట్రోల్ పాలనీ క్రమ క్రమంగా రాజకీయ వేడి పెంచుతోంది. E20 ఇంధన విధానంపై ఆమ్ ఆద్మీ పార్టీ జాతీయ కన్వీనర్, మాజీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ పోరుబాట పట్టారు. పెట్రోల్ బంకుల్లో వాహనదారులకు సాధారణ పెట్రోల్ లేద 20 శాతం ఇథనాల్ కలిపిన E20 పెట్రోల్ ఎంచుకునే వెసులుబాటు కల్పించాలని ఆయన డిమాండ్ చేస్తున్నారు. ఇందులో భాగంగా కేంద్రంపై ఒత్తిడి తెచ్చేందుకు ఆగస్టు 4న ప్రధాని నివాసానికి పాదయాత్ర చేపట్టనున్నట్లు కేజ్రీవాల్ ప్రకటించారు.

ఇంజినీరింగ్ సీట్ల‌లో బై వ‌న్ గెట్ వ‌న్ ఆఫ‌ర్లు.. ఈ సంక్షోభానికి కార‌ణాలేంటి?తెలంగాణSwechaa01 Aug 2026, 07:29 PM

ఇంజినీరింగ్ సీట్ల‌లో బై వ‌న్ గెట్ వ‌న్ ఆఫ‌ర్లు.. ఈ సంక్షోభానికి కార‌ణాలేంటి?

బై వ‌న్ గెట్ వ‌న్ అంటే ఏ బ‌ట్ట‌ల దుకాణంలోనో, ఎల‌క్ట్రానిక్స్ షోరూమ్‌లోనో అనుకునేరు. ఇప్పుడు ఈ ఆఫ‌ర్లు ఇంజినీరింగ్ కాలేజీల నుంచి వినిపిస్తున్నాయి. సీట్లు భర్తీ చేసుకునేందుకు కొన్ని కాలేజీలు అనుసరిస్తున్న విధానాలు మరింత ఆసక్తికరంగా మారాయి.

Dharani Portal: వారిని వదిలేది లేదు, ధరణి అక్ర‌మాల బ‌ట్ట‌బ‌య‌లుకు ఫాస్ట్‌ట్రాక్ విచారణ- మంత్రి పొంగులేటితెలంగాణSwechaa01 Aug 2026, 06:40 PM

Dharani Portal: వారిని వదిలేది లేదు, ధరణి అక్ర‌మాల బ‌ట్ట‌బ‌య‌లుకు ఫాస్ట్‌ట్రాక్ విచారణ- మంత్రి పొంగులేటి

ధరణి పోర్టల్‌ను అడ్డుపెట్టుకుని పేదల భూములు, ప్రభుత్వ భూములను అక్రమంగా కాజేసిన వారిపై ప్రభుత్వం ఉక్కుపాదం మోపుతుందని రాష్ట్ర రెవెన్యూ, హౌసింగ్, సమాచార పౌరసంబంధాల శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి స్పష్టం చేశారు. ధరణి నుంచి భూభారతి వరకు జరిగిన ప్రతి భూ లావాదేవీని ఫాస్ట్‌ట్రాక్ విధానంలో విచారిస్తున్నామన్నారు.

Vatpalli Police Station: సంగారెడ్డి వట్‌పల్లి పోలీస్ స్టేషన్‌పై దాడి.. తీవ్ర ఉద్రిక్తతక్రైమ్Swechaa01 Aug 2026, 06:19 PM

Vatpalli Police Station: సంగారెడ్డి వట్‌పల్లి పోలీస్ స్టేషన్‌పై దాడి.. తీవ్ర ఉద్రిక్తత

సంగారెడ్డి వట్ పల్లి పోలీస్ స్టేషన్ పై దాడి జరిగింది. దరఖాస్తుపల్లి గ్రామస్తులు పోలీస్ స్టేషన్ పై దాడి చేశారు. పీఎస్ లోని అద్దాలు, ఫర్నీచర్ ను ధ్వంసం చేశారు. బీరప్ప (22) అనే వ్యక్తి చెట్టుకి ఉరేసుకుని అనుమానాస్పద స్థితిలో చనిపోయాడు. అయితే, కుటుంబసభ్యులకు సమాచారం ఇవ్వకుండానే మృతదేహాన్ని కిందకు దించడంపై గ్రామస్తులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

Real Estate Fraud: 17కోట్ల రియల్ ఎస్టేట్ మోసం.. DNC ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ ఎండీ దిరిశాల నరేష్ చౌదరిపై కేసుక్రైమ్Swechaa01 Aug 2026, 06:14 PM

Real Estate Fraud: 17కోట్ల రియల్ ఎస్టేట్ మోసం.. DNC ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ ఎండీ దిరిశాల నరేష్ చౌదరిపై కేసు

హైదరాబాద్ లో మరో రియల్ ఎస్టేట్ మోసం వెలుగుచూసింది. రూ.17.10 కోట్ల రియల్ ఎస్టేట్ లావాదేవీలో మోసం జరిగిందంటూ బంజారాహిల్స్‌కు చెందిన వ్యాపారవేత్త వేముల సత్యమూర్తి ఫిర్యాదుపై సీసీఎస్ పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ కేసులో డీఎన్సీ (DNC) ఇన్ ఫ్రాస్ట్రక్చర్ ప్రైవేట్ లిమిటెడ్ ఎండీ దిరిశాల నరేశ్ చౌదరిపై కేసు నమోదైంది.

‘మోదీని విమర్శిస్తుంటే బాధపడ్డా’.. భోగాపురం వేదికగా డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ భావోద్వేగం!ఏపీSwechaa01 Aug 2026, 03:07 PM

‘మోదీని విమర్శిస్తుంటే బాధపడ్డా’.. భోగాపురం వేదికగా డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ భావోద్వేగం!

ఉత్తరాంధ్ర సమగ్రాభివృద్ధిలో భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయం ఒక విప్లవాత్మకమైన సరికొత్త అధ్యాయాన్ని లిఖించబోతోందని ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ ధీమా వ్యక్తం చేశారు. అనుభవజ్ఞుడైన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సమర్థవంతమైన మార్గదర్శకత్వంలో ఏపీ త్వరలోనే దేశంలోనే అగ్రగామి రాష్ట్రంగా నిలవబోతోందని ఆశాభావం వ్యక్తం చేశారు.

Neeraj Chopra: 'ప్రతి త్రో ముందు భయంతో వణికిపోయా'.. నీరజ్ చోప్రా భావోద్వేగం!క్రీడలుSwechaa01 Aug 2026, 01:56 PM

Neeraj Chopra: 'ప్రతి త్రో ముందు భయంతో వణికిపోయా'.. నీరజ్ చోప్రా భావోద్వేగం!

సుదీర్ఘ విరామం, గాయం నుంచి కోలుకున్న తర్వాత మళ్లీ అంతర్జాతీయ పతకాల వేదికపై మెరిసిన భారత జావెలిన్ స్టార్ అథ్లెట్ నీరజ్ చోప్రా తన భావోద్వేగాలను పంచుకున్నాడు. 2026 కామన్వెల్త్ గేమ్స్‌లో రజత పతకం సాధించిన అనంతరం మాట్లాడిన అతడు, పోటీ సమయంలో ప్రతీ త్రో విసిరే ముందు ఎక్కడ పాత గాయం తిరగబెడుతుందోనన్న తీవ్ర భయం తనను వెంటాడిందని వెల్లడించాడు.

‘ఇదీ మన ఉత్తరాంధ్ర దెబ్బ.. అర్థమైందా రాజా!..’ నారా లోకేశ్ ఘాటు వ్యాఖ్యలు!ఏపీSwechaa01 Aug 2026, 01:20 PM

‘ఇదీ మన ఉత్తరాంధ్ర దెబ్బ.. అర్థమైందా రాజా!..’ నారా లోకేశ్ ఘాటు వ్యాఖ్యలు!

గతంలో ఉత్తరాంధ్ర ప్రాంతాన్ని, ఇక్కడి ప్రజల సామర్థ్యాన్ని తక్కువ చేసి మాట్లాడిన వారికి భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయం ఒక బలమైన సమాధానమని ఆంధ్రప్రదేశ్ ఐటీ, విద్యాశాఖ మంత్రి నారా లోకేశ్ ఘాటుగా వ్యాఖ్యానించారు. ఒకప్పుడు ఈ ప్రాంతంలో ఎర్ర బస్సు కూడా సరిగా రాదని, అలాంటి చోట భారీ ఎయిర్‌పోర్టు అవసరమా? అని ఎగతాళి చేసిన నాయకులకు ఈ విమానాశ్రయం ప్రారంభోత్సవమే దిమ్మతిరిగే జవాబు అని పేర్కొన్నారు.

'భోగాపురం భోగం ఎవరిది?': మాజీ ఐపీఎస్ ఏబీ వెంకటేశ్వరరావు సంచలన వ్యాఖ్యలు!ఏపీSwechaa01 Aug 2026, 12:34 PM

'భోగాపురం భోగం ఎవరిది?': మాజీ ఐపీఎస్ ఏబీ వెంకటేశ్వరరావు సంచలన వ్యాఖ్యలు!

భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయం క్రెడిట్‌పై తెలుగుదేశం, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీల మధ్య రాజకీయం వేడెక్కిన వేళ, సీనియర్ ఐపీఎస్ అధికారి ఏబీ వెంకటేశ్వరరావు (ఏబీవీ) చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపుతున్నాయి.

మైదానంలో వెల్లివిరిసిన క్రీడాస్ఫూర్తి.. పాక్ ప్లేయర్‌ను ఆలింగనం చేసుకున్న జెమీమా!క్రీడలుSwechaa01 Aug 2026, 12:17 PM

మైదానంలో వెల్లివిరిసిన క్రీడాస్ఫూర్తి.. పాక్ ప్లేయర్‌ను ఆలింగనం చేసుకున్న జెమీమా!

ఇంగ్లండ్ వేదికగా సాగుతున్న ‘ది హండ్రెడ్’ లీగ్‌లో రాజకీయ విభేదాలను పక్కనబెట్టి క్రీడాస్ఫూర్తిని చాటే అరుదైన దృశ్యం ఆవిష్కృతమైంది. మ్యాచ్ ముగిసిన అనంతరం భారత మహిళా క్రికెట్ స్టార్ జెమీమా రోడ్రిగ్స్, పాకిస్థాన్ ఆల్‌రౌండర్ ఫాతిమా సనాను ఆప్యాయంగా ఆలింగనం చేసుకున్నారు.

Deccan Kitchen Case: దగ్గుబాటి బ్రదర్స్‌కు చుక్కెదురు.. క్వాష్ పిటిషన్‌ను కొట్టివేసిన హైకోర్టు!తెలంగాణSwechaa01 Aug 2026, 11:33 AM

Deccan Kitchen Case: దగ్గుబాటి బ్రదర్స్‌కు చుక్కెదురు.. క్వాష్ పిటిషన్‌ను కొట్టివేసిన హైకోర్టు!

హైదరాబాద్‌లోని ప్రముఖ డెక్కన్ కిచెన్ హోటల్ కూల్చివేత వ్యవహారంలో సినీ ప్రముఖులు, దగ్గుబాటి సోదరులకు తెలంగాణ ఉన్నత నాయస్థానంలో తీవ్ర చుక్కెదురైంది. తమపై నమోదైన పోలీసు ఎఫ్‌ఐఆర్‌ను రద్దు చేయాలంటూ (క్వాష్) దగ్గుబాటి కుటుంబం దాఖలు చేసిన పిటిషన్‌పై విచారణ జరిపిన హైకోర్టు, దానిని తోసిపుచ్చుతూ సంచలన తీర్పు వెలువరించింది.

Commonwealth: కామన్వెల్త్‌లో భారత్‌కు పతకాల పంట.. నీరజ్ చోప్రా, యశ్‌వీర్ సింగ్ సంచలనం!క్రీడలుSwechaa01 Aug 2026, 11:08 AM

Commonwealth: కామన్వెల్త్‌లో భారత్‌కు పతకాల పంట.. నీరజ్ చోప్రా, యశ్‌వీర్ సింగ్ సంచలనం!

కామన్వెల్త్ గేమ్స్ 2026లో భారత క్రీడాకారులు ప్రత్యర్థులపై చివరి క్షణం వరకు పోరాడుతున్నారు. తమ పోరాట పటిమతో భారత సత్తా ఏంటో నిరూపిస్తున్నారు. పరాజయం అంచుల దాకా వెళ్లినా గుండె ధైర్యంతో ప్రతీ మ్యాచ్‌లోనూ పోరాటపటిమను ప్రదర్శిస్తున్నారు.

Money saving tips: నెల జీతం వచ్చిందా.. అయితే డబ్బును ఈ అమ్మాయిలా ఆదా చేయండి!వైరల్ న్యూస్Swechaa01 Aug 2026, 10:41 AM

Money saving tips: నెల జీతం వచ్చిందా.. అయితే డబ్బును ఈ అమ్మాయిలా ఆదా చేయండి!

డిజిటల్ విప్లవంతో చిన్నపాటి టీ కొట్టు నుంచి పెద్ద షాపింగ్ మాల్స్ వరకు యూపీఐ చెల్లింపులు సర్వసాధారణంగా మారాయి. అయితే, అత్యంత సులువుగా జరిగే ఈ ఆన్‌లైన్ పేమెంట్స్ వల్ల తెలియకుండానే ఎక్కువ ఖర్చవుతోందని భావించిన ఢిల్లీకి చెందిన సదాఫ్ అనే యువతి వినూత్న మార్గాన్ని ఎంచుకుంది.

కశ్మీర్‌లో ఉగ్రదాడి.. కుల్గాం దాడిలో ఇద్దరు వలస కూలీల మృతిNationalSwechaa01 Aug 2026, 10:19 AM

కశ్మీర్‌లో ఉగ్రదాడి.. కుల్గాం దాడిలో ఇద్దరు వలస కూలీల మృతి

జమ్మూకశ్మీర్‌లోని కుల్గామ్ జిల్లాలో వలస కార్మికులను లక్ష్యంగా చేసుకుని ఉగ్రవాదులు జరిపిన దాడి తీవ్ర విషాదాన్ని నింపింది. కెల్లం ప్రాంతంలోని ఓ ఇటుక బట్టీ వద్ద పనిచేస్తున్న కూలీలపై శుక్రవారం సాయంత్రం దుండగులు అకస్మాత్తుగా కాల్పులకు తెగబడ్డారు.

POKలో పాక్‌కు షాక్..! ప్రజలు ఎందుకు రోడ్డెక్కారు? ఘర్షణలు, కాల్పుల వెనుక కార‌ణాలేంటి..?InternationalSwechaa01 Aug 2026, 08:46 AM

POKలో పాక్‌కు షాక్..! ప్రజలు ఎందుకు రోడ్డెక్కారు? ఘర్షణలు, కాల్పుల వెనుక కార‌ణాలేంటి..?

PoKలో చాలాకాలంగా స్థానిక ప్రజల్లో అసంతృప్తి ఉంది. విద్యుత్‌ ధరలు, గోదుమ పిండి ధరలు, పన్నులు, ఉపాధి, ప్రభుత్వ ఖర్చులు, రాజకీయ ప్రాతినిధ్యం వంటి అంశాలపై ప్రజలు ఆగ్రహంగా ఉన్నారు. అయితే ఈసారి గొడ‌వ‌కు అసలు కార‌ణం మాత్రం ఎన్నికల వ్యవస్థ.

PM-Kisan Scheme: కేంద్ర కేబినెట్ లో కీలక నిర్ణయాలు తీసుకున్న కేంద్రం.. ఈ రంగాలకు బడ్జెట్ కేటాయింపు!..NationalSwechaa31 Jul 2026, 06:16 PM

PM-Kisan Scheme: కేంద్ర కేబినెట్ లో కీలక నిర్ణయాలు తీసుకున్న కేంద్రం.. ఈ రంగాలకు బడ్జెట్ కేటాయింపు!..

ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అధ్యక్షతన జరిగిన కేంద్ర కేబినెట్ సమావేశంలో కీలక నిర్ణయాలకు ఆమోదం లభించింది. దేశ అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలకు మొత్తం రూ.4 లక్షల 50 వేల 988 కోట్ల నిధులు విడుదల చేయాలని కేంద్రం నిర్ణయించింది. ఈ నిధులతో మౌలిక సదుపాయాలు, గ్రామీణాభివృద్ధి, రైతుల సంక్షేమం, వ్యవసాయ రంగానికి మరింత ఊతం లభిస్తుందని చెబుతున్న కేంద్ర ప్రభుత్వం.. రైతుల ఆదాయం పెంచడంతో పాటు గ్రామీణ ఆర్థిక వ్యవస్థ బలోపేతమే ఈ నిర్ణయాల ప్రధాన లక్ష్యమని పేర్కొంది.

Ruchika Singh: ప్రధాని మోదీని రాయలేని భాషలో తిట్టిన యువతికి బిగ్ షాక్.. తీవ్రంగా స్పందించిన CJPNationalSwechaa31 Jul 2026, 04:12 PM

Ruchika Singh: ప్రధాని మోదీని రాయలేని భాషలో తిట్టిన యువతికి బిగ్ షాక్.. తీవ్రంగా స్పందించిన CJP

Ruchika Singh: ఢిల్లీలో కాక్రోచ్ జనతా పార్టీ నిరసనల సమయంలో ప్రధాని మోదీపై రుచికా సింగ్ అనే యువతి రెచ్చిపోయింది. ప్రధానిపై అనుచిత వ్యాఖ్యలు చేసింది. రాయలేని భాషలో ఆమె మోదీని తిట్టారు. దీంతో రుచికా సింగ్ పై కొందరు నోయిడాలో ఫిర్యాదు చేశారు. ఫిర్యాదు అందుకున్న పోలీసులు పలు సెక్షన్ల కింద జీరో ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. ఈ ఎఫ్ఐఆర్

15లక్షల మంది మృతి, 7లక్షల మంది డూప్లికేట్ ఓటర్లు.. ఏపీలో SIR ముసాయిదా ఓటర్ జాబితా విడుదలఏపీSwechaa31 Jul 2026, 03:47 PM

15లక్షల మంది మృతి, 7లక్షల మంది డూప్లికేట్ ఓటర్లు.. ఏపీలో SIR ముసాయిదా ఓటర్ జాబితా విడుదల

AP SIR: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రత్యేక సమగ్ర సవరణ (SIR) ముసాయిదా ఓటర్ జాబితా విడుదలైంది. రాష్ట్ర ఎన్నికల సంఘం దీన్ని రిలీజ్ చేసింది. జులై 24 నాటికి 4 కోట్ల 16 లక్షల 27వేల 694 మంది ఓటర్లలో 3 కోట్ల 71 లక్షల 38 వేల 182 మంది ఎన్యూమరేషన్ ఫారాలు సమర్పించినట్లు ఎన్నికల సంఘం తెలిపింది. 15 లక్షల 22 వేల మంది లక్షల మంది ఓటర్లు

GenZ మైండ్ బ్లాకింగ్ ఐడియాలు.. డబ్బు సంపాదించడంలో మామూలోళ్లు కాదుగా!వ్యాపారంSwechaa31 Jul 2026, 02:08 PM

GenZ మైండ్ బ్లాకింగ్ ఐడియాలు.. డబ్బు సంపాదించడంలో మామూలోళ్లు కాదుగా!

నెల చివరికి వచ్చేసరికి అకౌంట్‌లో సున్నా మిగలడం.. ఎంత కష్టపడినా ‘సాలరీ డే’ కోసం కళ్లు కాయలు కాచేలా ఎదురుచూడటం.. ఇదంతా ఒకప్పటి ముచ్చట. ఇప్పటి GenZ (నేటి తరం యూత్) ఆలోచనా తీరే వేరు. డబ్బు సంపాదించడంలో నేటి యువత కొత్తదారులను అన్వేషిస్తోంది.

Flipkart pay latter: ‘ఇప్పుడైతే కొనేయండి.. డబ్బులు తర్వాత ఇవ్వొచ్చు’.. ఫ్లిప్‌కార్డ్ బంపరాఫర్!వ్యాపారంSwechaa31 Jul 2026, 12:01 PM

Flipkart pay latter: ‘ఇప్పుడైతే కొనేయండి.. డబ్బులు తర్వాత ఇవ్వొచ్చు’.. ఫ్లిప్‌కార్డ్ బంపరాఫర్!

భారత ఈ-కామర్స్ దిగ్గజం ఫ్లిప్‌కార్ట్ తమ కస్టమర్ల కోసం మరో వేగవంతమైన, సౌకర్యవంతమైన క్రెడిట్ సేవను అందుబాటులోకి తీసుకువచ్చింది. 'పేయూ ఫైనాన్స్'తో భాగస్వామ్యం కుదుర్చుకుని ‘ఫ్లిప్‌కార్ట్‌ పే లేటర్‌’ (Flipkart Pay Later) సేవలను ప్రారంభించినట్లు ప్రకటించింది.

Ration e-KYC: రేషన్ కార్డుదారులకు ఊరట.. ఈ-కేవైసీ గడువు పొడిగింపు!తెలంగాణSwechaa31 Jul 2026, 11:52 AM

Ration e-KYC: రేషన్ కార్డుదారులకు ఊరట.. ఈ-కేవైసీ గడువు పొడిగింపు!

రాష్ట్రంలో రేషన్ కార్డుదారులకు పౌరసరఫరాల శాఖ కీలక తీపి కబురు అందించింది. గతంలో నిర్ణయించిన ప్రకారం జూలై 31తో ముగియాల్సిన ఈ-కేవైసీ (e-KYC) ప్రక్రియ గడువును మరో నెల రోజుల పాటు, అంటే ఆగస్టు 31వ తేదీ వరకు పొడిగిస్తూ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది.

UK-Heatwaves: యూకేలో వడగాలుల బీభత్సం.. రెండు నెలల్లో 3వేల మంది మృతి!InternationalSwechaa31 Jul 2026, 11:17 AM

UK-Heatwaves: యూకేలో వడగాలుల బీభత్సం.. రెండు నెలల్లో 3వేల మంది మృతి!

బ్రిటన్‌లో వీస్తున్న అసాధారణ ఉష్ణగాలులు తీవ్ర వినాశనం సృష్టిస్తున్నాయి. మే, జూన్ నెలల్లో వీచిన తీవ్రమైన వడగాలుల ప్రభావంతో బ్రిటన్‌లో దాదాపు 3వేల మంది ప్రాణాలు కోల్పోయారని అక్కడి ఆరోగ్య భద్రతా సంస్థ (UKHSA) అధికారికంగా అంచనా వేసింది.

Indian-origin lawyer: అమెరికాలో భారత సంతతి న్యాయవాదికి రూ. 4 కోట్ల భారీ జరిమానా!InternationalSwechaa31 Jul 2026, 11:03 AM

Indian-origin lawyer: అమెరికాలో భారత సంతతి న్యాయవాదికి రూ. 4 కోట్ల భారీ జరిమానా!

అమెరికాలో అక్రమంగా నివాసముంటున్న వారికి తప్పుడు పత్రాలతో రాజకీయ ఆశ్రయం (అసిలమ్) కల్పించేందుకు యత్నించిన భారత సంతతి ఇమ్మిగ్రేషన్ లాయర్ సూరజ్ రాజ్ సింగ్‌పై యూఎస్ ప్రభుత్వం ఉక్కుపాదం మోపింది. వలస చట్టాలను తీవ్రంగా ఉల్లంఘిస్తూ నకిలీ ఆధారాలు సమర్పించారనే ఆరోపణలతో డిపార్ట్‌మెంట్ ఆఫ్ హోమ్‌ల్యాండ్ సెక్యూరిటీ (DHS) ఆయనకు 4,70,584 డాలర్లు (భారతీయ కరెన్సీలో దాదాపు రూ. 4 కోట్లు) సివిల్ పెనాల్టీ విధించే ప్రక్రియను అధికారికంగా ప్రారంభించింది.

Udham Singh: ఉధమ్ సింగ్ త్యాగం స్ఫూర్తిదాయకం..  అమరవీరుడికి ప్రధాని మోదీ ఘన నివాళిNationalSwechaa31 Jul 2026, 10:16 AM

Udham Singh: ఉధమ్ సింగ్ త్యాగం స్ఫూర్తిదాయకం..  అమరవీరుడికి ప్రధాని మోదీ ఘన నివాళి

జలియన్‌వాలా బాగ్ దురంతానికి ప్రతీకారం తీర్చుకుని భారత స్వాతంత్ర్య సంగ్రామంలో తన పేరును సువర్ణాక్షరాలతో లిఖించుకున్న అమరవీరుడు సర్దార్ ఉధమ్ సింగ్ వర్ధంతి (షహాదత్ దివస్) సందర్భంగా దేశవ్యాప్తంగా ఘన నివాళులర్పిస్తున్నారు.

Brain Surgery: కపాలం తెరవకుండానే మెదడు సర్జరీ.. భారత సంతతి వైద్యుడి అరుదైన రికార్డు!InternationalSwechaa31 Jul 2026, 09:59 AM

Brain Surgery: కపాలం తెరవకుండానే మెదడు సర్జరీ.. భారత సంతతి వైద్యుడి అరుదైన రికార్డు!

వైద్య చరిత్రలో ఓ వినూత్న విప్లవానికి తెరలేచింది. సాధారణంగా మెదడులోని కణితులను తొలగించాలంటే కపాలం (పుర్రె) తెరవడం తప్పనిసరి. అయితే ఎలాంటి ఓపెన్ సర్జరీ అవసరం లేకుండా, కేవలం ముక్కు మార్గం గుండానే మెదడులోని ట్యూమర్‌ను విజయవంతంగా తొలగించే సరికొత్త విధానానికి భారత సంతతికి చెందిన అమెరికన్ ఆర్మీ సర్జన్ మేజర్ జగత్‌కుమార్ పటేల్ శ్రీకారం చుట్టారు.

ICC Cricket World Cup: 2027 వన్డే ప్రపంచకప్ వేదికలు ఖరారు.. ఐసీసీ కీలక ప్రకటనక్రీడలుSwechaa31 Jul 2026, 09:28 AM

ICC Cricket World Cup: 2027 వన్డే ప్రపంచకప్ వేదికలు ఖరారు.. ఐసీసీ కీలక ప్రకటన

సుదీర్ఘమైన 24 ఏళ్ల విరామం తర్వాత పురుషుల వన్డే క్రికెట్ ప్రపంచకప్‌కు ఆఫ్రికా ఖండం మళ్లీ ఆతిథ్యం ఇవ్వబోతోంది. 2027లో జరగబోయే ఈ ప్రతిష్ఠాత్మక మెగా టోర్నమెంట్‌ను దక్షిణాఫ్రికా, జింబాబ్వే, నమీబియా దేశాలు ఉమ్మడిగా నిర్వహించనున్నాయి.

Singer Jamunarani:  ప్రముఖ సింగర్ జమునారాణి కన్నుమూత.. సినీ ఇండస్ట్రీలో విషాదం!సినిమాSwechaa31 Jul 2026, 09:15 AM

Singer Jamunarani: ప్రముఖ సింగర్ జమునారాణి కన్నుమూత.. సినీ ఇండస్ట్రీలో విషాదం!

దక్షిణ భారత సినీ సంగీత ప్రపంచంలో తన మధుర గాత్రంతో కోట్లాది మంది అభిమానులను అలరించిన ప్రముఖ నేపథ్య గాయని కె. జమునా రాణి (88) గురువారం వేకువజామున తుదిశ్వాస విడిచారు.

Bommarasipet lands: బొమ్మరాసిపేట్ భూముల్లో బినామీల దందా?స్వేచ్ఛ ఛైర్మన్ డెస్క్Swechaa31 Jul 2026, 09:04 AM

Bommarasipet lands: బొమ్మరాసిపేట్ భూముల్లో బినామీల దందా?

నా వయస్సు 78 ఏండ్లు. నాకు తెలియని మీడియా లేదు. నేనే పెద్ద మీడియా. నాకంటే పెద్ద పొలిటిషన్ ఎవడు. నేనే అందరిపై ఫైట్ చేశానని నోరు నెత్తిన పెట్టుకుని ఎప్పుడూ ఖాళీగా ఉండకుండా ఊగిపోయే వెలమ దొర చేసిన అమెరికా పర్యటనలతోనే ఈనాడు బొమ్మరాసిపేట్‌లో భూ మాఫియా పేట్రేగిపోతోందనే ఆరోపణలు ఉన్నాయి.

Asaduddin Owaisi: వందేమాతరం బిల్లు రాజ్యాంగ విరుద్ధం.. అందులో దేవుళ్లు, దేవతలు.. ఒవైసీ సంచలన వ్యాఖ్యలుNationalSwechaa30 Jul 2026, 08:25 PM

Asaduddin Owaisi: వందేమాతరం బిల్లు రాజ్యాంగ విరుద్ధం.. అందులో దేవుళ్లు, దేవతలు.. ఒవైసీ సంచలన వ్యాఖ్యలు

Asaduddin Owaisi: వందేమాతరం బిల్లు పార్లమెంట్ ఉభయ సభల ఆమోదం పొందిన సంగతి తెలిసిందే. జాతీయ గేయం వందేమాతరాన్ని అవమానించడం లేదా దాని గానానికి ఆటంకం కలిగించడాన్ని నేరంగా పరిగణించేలా ఈ కీలక బిల్లు తెచ్చింది కేంద్రం. కాగా ఈ బిల్లుపై ఎంఐఎం చీఫ్, హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ తీవ్రంగా స్పందించారు. వందేమాతరం బిల్లు రాజ్యాంగ స