స్వేచ్ఛ షార్ట్స్ — తాజా తెలుగు వార్తలు

Viral : జోగులాంబ అమ్మవారి హుండీలో సంచలన లేఖ (వైరల్)వైరల్ న్యూస్Swechaa28 Jul 2026, 11:03 AM

Viral : జోగులాంబ అమ్మవారి హుండీలో సంచలన లేఖ (వైరల్)

ఆలయ హుండీల్లో కానుకలు, మొక్కుబడి చీటీలు కనిపించడం సాధారణమే. కానీ, అలంపూర్ జోగులాంబ అమ్మవారి హుండీలో మాత్రం ఏకంగా ఒక 'బయోడేటా' కనిపించింది. లేఖలోని సారాంశం ఇలా ఉంది.. "అమ్మా జోగులాంబ.. పదో తరగతి నుంచి B.Ed వరకు ఫస్ట్ క్లాస్ తెచ్చుకున్నా. ఏళ్ల తరబడి ప్రిపేర్ అయినా ప్రభుత్వ ఉద్యోగం రావడం లేదు.ఈ సారి నువ్వే నాకు జాబ్ ఇప్పించాలి తల్లీ!" అని రాసి ఉండటం అందరిని ఆశ్చర్యానికి గురిచేసింది.

Anna Konidela: ఇకపై నన్ను అలాగే పిలవండి.. పవన్ కల్యాణ్ భార్య భావోద్వేగ పోస్ట్!వైరల్ న్యూస్Swechaa28 Jul 2026, 10:35 AM

Anna Konidela: ఇకపై నన్ను అలాగే పిలవండి.. పవన్ కల్యాణ్ భార్య భావోద్వేగ పోస్ట్!

జనసేన అధినేత, ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ సతీమణి అన్నా కొణిదెల సోషల్ మీడియా వేదికగా అభిమానులకు, మీడియాకు ఒక కీలక విజ్ఞప్తి చేశారు. తన ఇంటిపేరుపై చాలాకాలంగా తప్పుడు ప్రచారం జరుగుతోందని పేర్కొన్న ఆమె, ఇకపై తనను 'అన్నా లెజినోవా' అని కాకుండా 'అన్నా కొణిదెల' అని మాత్రమే సంబోధించాలని కోరారు. తన జన్మదిన సందర్భంగా ఈ విషయంపై స్పష్టత ఇవ్వడానికి ఇదే సరైన సమయమని భావించి ఇన్‌స్టాగ్రామ్‌లో స్పందించినట్లు తెలిపారు.

Commonwealth: 16ఏళ్ల నాటి తండ్రి కల.. కామన్వెల్త్‌లో ఏపీ కుర్రాడికి రజతంక్రీడలుSwechaa28 Jul 2026, 10:04 AM

Commonwealth: 16ఏళ్ల నాటి తండ్రి కల.. కామన్వెల్త్‌లో ఏపీ కుర్రాడికి రజతం

గ్లాస్గో వేదికగా జరుగుతున్న కామన్వెల్త్ క్రీడల్లో ఆంధ్రప్రదేశ్‌కు చెందిన యువ వెయిట్‌లిఫ్టర్ వల్లూరి అజయ్ బాబు రజత పతకంతో మెరిశాడు. పురుషుల 79 కేజీల విభాగంలో ఆఖరి నిమిషం వరకు ఉత్కంఠభరితంగా సాగిన ఈ పోటీలో అద్భుత ప్రదర్శన కనబరిచి దేశానికి గర్వకారణంగా నిలిచాడు.

నేను చేసిన తప్పు అదే:  హైడ్రా కమిషనర్ ఏవీ రంగనాథ్స్వేచ్ఛ ఛైర్మన్ డెస్క్Swechaa28 Jul 2026, 09:22 AM

నేను చేసిన తప్పు అదే: హైడ్రా కమిషనర్ ఏవీ రంగనాథ్

హైకోర్టు వ్యాఖ్యల నేపథ్యంలో హైడ్రా కమిషనర్ ఏవీ రంగనాథ్ స్పందించారు. తాను రాజ్యాంగ స్ఫూర్తితోనే ప‌ని చేస్తున్నానని తెలిపారు. చెరువులు, ప్ర‌భుత్వ ఆస్తులు కాపాడుతున్నానని వివరించారు. ఈ రెండేళ్ల కాలంలో హైడ్రా కమిషనర్ గా రాజ్యాంగ స్ఫూర్తిని అనుసరించి, రాజ్యాంగంలోని ఆర్టికల్ 21, 48ఏ ప్రకారం ప్రభుత్వ ఆస్తులు, చెరువులు, పార్కులు రక్షించడం జరిగిందన్నారు.

Pawala shyamala: ప్రముఖ నటి పావలా శ్యామల కన్నుమూతసినిమాSwechaa28 Jul 2026, 08:46 AM

Pawala shyamala: ప్రముఖ నటి పావలా శ్యామల కన్నుమూత

తెలుగు చిత్రసీమలో తనదైన నటనతో అలరించిన ప్రముఖ క్యారెక్టర్ ఆర్టిస్ట్ పావలా శ్యామల మంగళవారం తెల్లవారుజామున 1:52 గంటలకు తుదిశ్వాస విడిచారు. గత కొంతకాలంగా తీవ్ర అనారోగ్యంతో బాధపడుతున్న ఆమె, హైదరాబాద్‌లోని ఉస్మానియా ఆసుపత్రిలో చికిత్స పొందుతూ గుండెపోటుతో మరణించినట్లు వైద్యులు అధికారికంగా వెల్లడించారు.

Diya Inside Train: బాబోయ్.. ఏసీ కోచ్‌లో దీపం వెలిగించి పూజలు.. వీడియో వైరల్వైరల్ న్యూస్Swechaa27 Jul 2026, 08:20 PM

Diya Inside Train: బాబోయ్.. ఏసీ కోచ్‌లో దీపం వెలిగించి పూజలు.. వీడియో వైరల్

Diya Inside Train: ట్రైన్ లో ప్రయాణం చేసే సమయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. ప్రయాణికుల భద్రతను దృష్టిలో పెట్టుకుని రైల్వే శాఖ అధికారులు కొన్ని ప్రమాదకర వస్తువులపై నిషేధం విధించారు. క్రాకర్స్ (బాణసంచా), గ్యాస్ స్టవ్‌లు, సిలిండర్లు, పెట్రోల్, కిరోసిన్, ఆమ్లాలు (యాసిడ్స్), తీవ్రమైన వాసన వచ్చే లేదా మంటలు అంటుకునే రసాయనాలు రైల

E20 Janta Party: కాక్రోచ్ జనతా పార్టీ సూపర్ సక్సెస్.. ఇప్పుడు మరో కొత్త పార్టీ.. టార్గెట్ ఎవరంటేNationalSwechaa27 Jul 2026, 07:05 PM

E20 Janta Party: కాక్రోచ్ జనతా పార్టీ సూపర్ సక్సెస్.. ఇప్పుడు మరో కొత్త పార్టీ.. టార్గెట్ ఎవరంటే

E20 Janta Party: కాక్రోచ్ జనతా పార్టీ.. ఆన్‌లైన్‌లో పురుడుపోసుకున్న ఈ పార్టీ ఇప్పుడు దేశవ్యాప్తంగా ఎంత సంచలనమైందో తెలిసిందే. నీట్ పేపర్ లీకేజీ వ్యవహారంలో యువతకు మద్దతుగా సీజేపీ చేపట్టిన ఆందోళనలు ఏకంగా ప్రభుత్వాన్నే షేక్ చేశాయి. బొద్దింకల దెబ్బకు ప్రభుత్వం దిగిరాక తప్పలేదు. సీజేపీ రాజేసిన సెగతో ధర్మేంద్ర ప్రధాన్ తన మంత్

Vijayawada Durgamma: బెజవాడ దుర్గమ్మకు తెలంగాణ బంగారు బోనంSwechaa27 Jul 2026, 05:42 PM

Vijayawada Durgamma: బెజవాడ దుర్గమ్మకు తెలంగాణ బంగారు బోనం

Vijayawada Durgamma: విజయవాడలోని ఇంద్రకీలాద్రిపై ఆధ్యాత్మిక శోభ వెల్లవిరిసింది. ఇంద్రకీలాద్రిపై కొలువైన కనకదుర్గమ్మకు భాగ్యనగర్ శ్రీమహంకాళి జాతర బోనాల ఉత్సవాల ఉమ్మడి దేవాలయాల ఊరేగింపు కమిటీ బంగారు బోనం సమర్పించింది. ఈ కార్యక్రమంలో తెలంగాణ మాజీ మంత్రి, బీఆర్ఎస్ ఫ్లోర్ లీడర్ తలసాని శ్రీనివాస్ యాదవ్ పాల్గొన్నారు. అమ్మ వారి ప్రత్యేక దర్శనం చేసుకుని ఆశీస్సులు పొందారు.

ఆషాఢ మాసాన్ని పురస్కరించుకుని దుర్గమ్మకు బంగారు బోనాన్ని సమర్పించినట్లు హైదరాబాద్‌ ఉమ్మడి దేవాలయాల ఊరేగింపు కమిటీ ప్రతినిధులు తెలిపారు. ముందుగా విజయవాడ పాతబస్తీలోని జమ్మిదొడ్డిలో అమ్మవారికి పూజలు చేశారు. అక్కడి నుంచి డప్పులు, కోలాటాల మధ్య దుర్గమ్మ ఆలయం వరకు ఊరేగింపు సాగింది.

Telangana High Court: హైడ్రా కమిషనర్ రంగనాథ్‌ను తొలగించండి- హైకోర్టు కీలక ఆదేశాలుతెలంగాణSwechaa27 Jul 2026, 04:55 PM

Telangana High Court: హైడ్రా కమిషనర్ రంగనాథ్‌ను తొలగించండి- హైకోర్టు కీలక ఆదేశాలు

హైడ్రా కమిషనర్ రంగనాథ్ తీరుపై తెలంగాణ హైకోర్టు ఫైర్ అయ్యింది. హైడ్రా కమిషనర్ పదవి నుంచి రంగనాథ్ ను తప్పించాలని ఆదేశించింది. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శికి ఆదేశాలు జారీ చేసింది న్యాయస్థానం. లోతుకుంట ప్రైవేట్ భూముల వ్యవహారంలో హైడ్రా జోక్యాన్ని న్యాయస్థానం తీవ్రంగా తప్పుపట్టింది.

హైకోర్టుకు క్షమాపణలు చెప్పిన హైడ్రా కమిషనర్ రంగనాథ్..!తెలంగాణSwechaa27 Jul 2026, 04:00 PM

హైకోర్టుకు క్షమాపణలు చెప్పిన హైడ్రా కమిషనర్ రంగనాథ్..!

హైడ్రా కమిషనర్‌ రంగనాథ్‌ తెలంగాణ హైకోర్టుకు క్షమాపణలు చెప్పారు. ఈమేరకు ఆయన అఫిడవిట్‌ దాఖలు చేశారు. కోర్టులు, న్యాయవ్యవస్థపై ఎంతో నమ్మకముందని పేర్కొన్నారు. లోతుకుంట సర్వే నెంబర్‌ 1, 2 లోని 40 ఎకరాల్లోకి హైడ్రా వెళ్లలేదని, పిటిషనర్‌ అవాస్తవాలు చెప్పారని హైకోర్టుకు తెలిపారు. రంగనాథ్‌పై 63 కోర్టు ధిక్కరణ పిటిషన్లు ఉన్నాయని ఉన్నత న్యాయస్థానం పేర్కొంది. ఇన్ని పిటిషన్లు ఎందుకు ఉన్నాయని ఆయనను ప్రశ్నించింది.

Student Shivani: సీఎం చంద్రబాబుతో ప్రశంసలు అందుకున్న టెన్త్ విద్యార్థిని ఆత్మహత్య.. చంద్రబాబు కీలక ఆదేశాలుక్రైమ్Swechaa27 Jul 2026, 03:42 PM

Student Shivani: సీఎం చంద్రబాబుతో ప్రశంసలు అందుకున్న టెన్త్ విద్యార్థిని ఆత్మహత్య.. చంద్రబాబు కీలక ఆదేశాలు

పోలవరం జిల్లా రంపచోడవరంలో తీవ్ర విషాదం చోటు చేసుకుంది. టెన్త్ విద్యార్థిని ముర్రం శివానీ ఆత్మహత్య చేసుకుంది. రంపచోడవరం ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో పదో తరగతి చదువుతోంది శివానీ. పోలవరం జిల్లా ఇర్లపల్లిలో తన అమ్మమ్మ ఇంటి దగ్గర ఉంటుంది. ఇటీవల 24వ తేదీన పంపచోడవరంలో జరిగిన మెగా పేరెంట్స్ టీచర్స్ మీటింగ్ లో సీఎం చంద్రబాబు సమక్షంల

Human Intelligence: మానవ మేధస్సుకు గ్రహణం.. అధ్యయనాల్లో మైండ్ బ్లాంక్ అయ్యే నిజాలు!InternationalSwechaa27 Jul 2026, 02:45 PM

Human Intelligence: మానవ మేధస్సుకు గ్రహణం.. అధ్యయనాల్లో మైండ్ బ్లాంక్ అయ్యే నిజాలు!

మనుషుల తెలివితేటలు నిజంగానే తగ్గిపోతున్నాయా అంటే.. అవుననే అంటున్నాయి తాజా అంతర్జాతీయ అధ్యయనాలు. స్మార్ట్‌ఫోన్ల వాడకం ఎక్కువై, ప్రతీ చిన్నదానికి గూగుల్‌పై ఆధారపడటం మొదలుపెట్టినప్పటి నుంచి మన మేధో సామర్థ్యం (IQ) మెల్లమెల్లగా పడిపోతోందని పరిశోధకులు బాంబు పేల్చారు.

Techie : నెలకు రూ.2 లక్షల జీతం..నేనూ పేదవాడినే అంటున్న టెకీవైరల్ న్యూస్Swechaa27 Jul 2026, 02:15 PM

Techie : నెలకు రూ.2 లక్షల జీతం..నేనూ పేదవాడినే అంటున్న టెకీ

డబ్బు ఎంత ఉన్నా ఓ సామాన్యుడికి ఆనందాన్ని మాత్రం పంచలేకపోతున్నది. కారణం ద్రవ్యోల్బణం, లివింగ్ కాస్ట్..పల్లెల్లో పనులు లేక చాలా మంది పట్టణాల బాట పడుతున్నారు.ఊర్లలో సొంత ఇండ్లు ఉంటాయి. అక్కడ రూ.10వేలు వచ్చినా హ్యాపీగా బతికేయొచ్చు. కానీ, నెలకు దాదాపు రూ. 2 లక్షలు సంపాదిస్తున్నప్పటికీ, ఎలాంటి అప్పులు (ఈఎంఐలు) లేకపోయినప్పటికీ తాను ఒక పేదవాడిలాగే ఫీల్ అవుతున్నానని ఓ టెకీ వాపోయాడు. బెంగళూరుకు చెందిన సదరు సాఫ్ట్‌వేర్ పోస్టుపై నెట్టింట భిన్నాభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి.

నిరసన తెలిపినంత మాత్రాన లాఠీచార్జ్ చేయడం సరికాదు: సుప్రీంకోర్టుNationalSwechaa27 Jul 2026, 12:53 PM

నిరసన తెలిపినంత మాత్రాన లాఠీచార్జ్ చేయడం సరికాదు: సుప్రీంకోర్టు

నీట్ (NEET) పేపర్ లీక్ వ్యవహారంపై ఢిల్లీలో విద్యార్థులు చేపట్టిన నిరసన ప్రదర్శనలపై పోలీసులు బలప్రయోగం చేయడంపై సుప్రీంకోర్టు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసింది. రాజ్యాంగబద్ధంగా, శాంతియుత మార్గంలో నిరసన తెలిపే హక్కు ప్రతి పౌరుడికీ ఉందని అత్యున్నత న్యాయస్థానం స్పష్టం చేసింది.

RGV: ‘నీట్ పేపర్ లీకేజీ  కంటే ఏఐ డేంజర్..’ ఆర్జీవీ సంచలన కామెంట్స్!వైరల్ న్యూస్Swechaa27 Jul 2026, 12:18 PM

RGV: ‘నీట్ పేపర్ లీకేజీ కంటే ఏఐ డేంజర్..’ ఆర్జీవీ సంచలన కామెంట్స్!

దేశంలో నీట్ పేపర్ లీకేజీలు, పరీక్షల రద్దులు, విద్యార్థుల ఆత్మహత్యల కంటే కృత్రిమ మేధస్సు AI(ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్) వల్ల విద్యా రంగానికి ఎదురవుతున్న ముప్పే అత్యంత ప్రమాదకరమైనదని ప్రముఖ సినీ దర్శకుడు రామ్‌గోపాల్ వర్మ తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. నీట్ సమస్యల వల్ల విద్యా వ్యవస్థకు కేవలం రక్తస్రావం మాత్రమే జరుగుతుంటే, ఏఐ మాత్రం ఆ వ్యవస్థ గొంతు కోసేస్తోందని ఆయన సామాజిక మాధ్యమం 'ఎక్స్' వేదికగా సంచలన వ్యాఖ్యలు చేశారు.

RHA : రిజర్వేషన్స్ హటావో.. డిజిటల్  వేదికగా మరో విప్లవం!వైరల్ న్యూస్Swechaa27 Jul 2026, 12:07 PM

RHA : రిజర్వేషన్స్ హటావో.. డిజిటల్ వేదికగా మరో విప్లవం!

దేశంలో సోషల్ మీడియా వేదికగా సరికొత్త ఉద్యమాలు పుట్టుకొస్తున్నాయి. ఇటీవల కాక్రోచ్ పార్టీ చేసిన ఆందోళనలు దేశవ్యాప్తంగా పెద్దచర్చకు దారితీసిన విషయం తెలిసిందే.తాజాగా అదే డిజిటల్ వేదికగా ‘రిజర్వేషన్స్ హటావో ఆందోళన్’ (RHA) పేరిట కొత్త ఉద్యమం పురుడుపోసుకుంది.

AP: పిఠాపురం కుర్రాడి ఘనత.. రూ.1.06 కోట్ల ప్యాకేజీతో ఉద్యోగం!ఏపీSwechaa27 Jul 2026, 11:54 AM

AP: పిఠాపురం కుర్రాడి ఘనత.. రూ.1.06 కోట్ల ప్యాకేజీతో ఉద్యోగం!

సాధారణ కుటుంబ నేపథ్యం, ఆర్థిక ఇబ్బందులు ఏవీ అతడి ఆశయానికి అడ్డుగోడ కాలేదు. పట్టుదలే పెట్టుబడిగా శ్రమించిన ఓ గ్రామీణ ప్రాంత విద్యార్థి, ఏకంగా కోటి రూపాయలకు పైగా వార్షిక వేతనంతో కెనడా కంపెనీలో అత్యున్నత కొలువు సాధించాడు. వివరాల్లోకి వెళ్తే.. కాకినాడ జిల్లా, పిఠాపురం నియోజకవర్గానికి చెందిన మాల్తి అఖిలేశ్ అనే యువకుడు రూ.1.06 కోట్ల ప్యాకేజీని అందుకుని తన ప్రతిభతో తెలుగు రాష్ట్రాల దృష్టిని ఆకర్షించాడు.

150 ఏళ్లలో లేని కరవు.. ప్రత్యామ్నాయ పంటలే శ్రేయస్కరం: మంత్రి తుమ్మల నాగేశ్వరరావుతెలంగాణSwechaa27 Jul 2026, 11:34 AM

150 ఏళ్లలో లేని కరవు.. ప్రత్యామ్నాయ పంటలే శ్రేయస్కరం: మంత్రి తుమ్మల నాగేశ్వరరావు

ప్రపంచవ్యాప్తంగా వాతావరణంలో సంభవిస్తున్న తీవ్ర మార్పుల వల్ల గత 150 ఏళ్లలో ఎన్నడూ లేనివిధంగా తీవ్ర కరవు పరిస్థితులు నెలకొంటున్నాయని తెలంగాణ వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ఆందోళన వ్యక్తం చేశారు. పసిఫిక్ మహాసముద్రంలో ఉష్ణోగ్రతలు అనూహ్యంగా పెరగడం (ఎల్‌నినో) వల్ల నైరుతి రుతుపవనాల ప్రభావం తగ్గి, దేశంలో తీవ్ర వర్షాభావ పరిస్థితులు ఏర్పడ్డాయని తెలిపారు.

Crude Oil price: యుద్ధ విరామంతో పడిపోయిన చమురు ధరలు.. ఏకంగా 7 శాతం పతనం!InternationalSwechaa27 Jul 2026, 11:11 AM

Crude Oil price: యుద్ధ విరామంతో పడిపోయిన చమురు ధరలు.. ఏకంగా 7 శాతం పతనం!

అమెరికా-ఇరాన్ సరిహద్దుల్లో సైనిక ఘర్షణలు తాత్కాలికంగా ఆగిపోవడంతో అంతర్జాతీయ ఇంధన మార్కెట్లో క్రూడ్ ఆయిల్ ధరలు భారీగా పతనమయ్యాయి. ఇరు దేశాలు దౌత్యపరమైన చర్చలకు మొగ్గు చూపడంతో, ఒక్కరోజే ముడి చమురు ధరలు ఏకంగా 7 శాతం మేర క్షీణించి గ్లోబల్ మార్కెట్లకు గొప్ప ఊరటనిచ్చాయి. గత కొన్ని వారాలుగా ఆకాశాన్ని అంటిన పసిడి, చమురు మంటలకు ఈ తాత్కాలిక శాంతి బ్రేక్ వేసింది.

TG IPass :  టీజీ ఐపాస్‌లో లెక్కలు మాయం? ఏం జరిగింది?తెలంగాణSwechaa27 Jul 2026, 10:48 AM

TG IPass : టీజీ ఐపాస్‌లో లెక్కలు మాయం? ఏం జరిగింది?

రాష్ట్రానికి వచ్చే పెట్టుబడులు, వాటి వివరాలు.. ప్రభుత్వం ఎన్ని పెట్టుబడులను ఆమోదించింది. ఎంతమందికి ఉపాధి కల్పించారు? వంటి వివరాలు టీజీ ఐపాస్ వెబ్‌సైట్లో దర్శనమివ్వడం లేదు. ఇటువంటి కీలక అంశాలను పారదర్శకంగా అందించాల్సిన టీజీ–ఐపాస్.. అసలు వివరాలు వెబ్‌సైట్‌లో గత ఎనిమిది నెలలుగా కనిపించకుండా పోతే అధికారులు ఏం చేస్తున్నారు?

రాజకీయాల్లోకి ధనుష్?.. సోషల్ మీడియాను షేక్ చేస్తున్న సంచలన వ్యాఖ్యలు!సినిమాSwechaa27 Jul 2026, 10:31 AM

రాజకీయాల్లోకి ధనుష్?.. సోషల్ మీడియాను షేక్ చేస్తున్న సంచలన వ్యాఖ్యలు!

తమిళ ప్రముఖ కథానాయకుడు ధనుష్ తన రాజకీయ అరంగేట్రంపై మరోసారి ఊహాగానాలకు బీజం వేశారు. అభిమానులు తమ బలమైన ఐక్యతను కేవలం సినిమా వేడుకలకే పరిమితం చేయకుండా, సమాజ శ్రేయస్సు, ప్రజా సేవ కోసం ఉపయోగించాలని పిలుపునిచ్చారు. ఇటీవల నిర్వహించిన ఒక వేడుకలో ఆయన చేసిన ఈ సంచలన వ్యాఖ్యలు ప్రస్తుతం కోలీవుడ్‌తో పాటు రాజకీయ వర్గాల్లోనూ తీవ్ర చర్చనీయాంశంగా మారాయి.

USA Iran: తగ్గిన అమెరికా-ఇరాన్ ఉద్రిక్తతలు.. తెరవెనుక రాయబారాలు!InternationalSwechaa27 Jul 2026, 10:00 AM

USA Iran: తగ్గిన అమెరికా-ఇరాన్ ఉద్రిక్తతలు.. తెరవెనుక రాయబారాలు!

గత కొన్ని వారాలుగా అమెరికా, ఇరాన్‌ల మధ్య తీవ్ర స్థాయిలో కొనసాగుతున్న సైనిక ఘర్షణలకు తాత్కాలికంగా విరామం లభించింది. ఇరు దేశాలు గత మూడు రోజులుగా పరస్పరం దాడులు చేసుకోకపోవడంతో మధ్యప్రాచ్యంలో ఉద్రిక్తతలు కాస్త సడలాయి. అదే సమయంలో, మధ్యవర్తుల ద్వారా పరోక్ష దౌత్య చర్చలు జరుగుతున్నాయని ఇరాన్ సోమవారం ప్రకటించడంతో సంక్షోభ నివారణ

Amarnath Yatra: 24 రోజులు.. 4 లక్షల మంది భక్తులు: అమర్‌నాథ్ యాత్రలో సరికొత్త చరిత్ర!SpiritualitySwechaa27 Jul 2026, 09:33 AM

Amarnath Yatra: 24 రోజులు.. 4 లక్షల మంది భక్తులు: అమర్‌నాథ్ యాత్రలో సరికొత్త చరిత్ర!

పవిత్ర అమర్‌నాథ్ క్షేత్రానికి భక్తుల తాకిడి కొనసాగుతోంది. ఈ ఏడాది యాత్ర ప్రారంభమైన అతి తక్కువ సమయంలోనే భక్తుల సంఖ్య సరికొత్త రికార్డును కైవసం చేసుకుంది. జులై 3న ప్రారంభమైన ఈ ఆధ్యాత్మిక పయనంలో, కేవలం 24 రోజుల్లోనే అంటే జులై 26 నాటికి 4.14 లక్షల మందికి పైగా భక్తులు మంచులింగాన్ని దర్శించుకుని పునీతులయ్యారు.

Tirumala: తిరుమల శ్రీవారి దర్శనానికి 8గంటల సమయం.. హుండీ ఆదాయం ఎంతంటే?ఏపీSwechaa27 Jul 2026, 08:53 AM

Tirumala: తిరుమల శ్రీవారి దర్శనానికి 8గంటల సమయం.. హుండీ ఆదాయం ఎంతంటే?

కలియుగ దైవం శ్రీవెంకటేశ్వర స్వామివారి దివ్యక్షేత్రమైన తిరుమలలో భక్తుల రద్దీ సాధారణంగా కొనసాగుతోంది. ప్రస్తుతం వైకుంఠం క్యూ కాంప్లెక్స్‌లోని 23 కంపార్టుమెంట్లలో భక్తులు స్వామివారి దర్శనం కోసం వేచి ఉన్నారు. టోకెన్లు లేని సర్వదర్శనం భక్తులకు శ్రీవారి ఉచిత దర్శనానికి సుమారు 8 గంటల సమయం పడుతోందని తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) అధికారులు వెల్లడించారు.

Anna Hazare: ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామాపై అన్నా హజారే సంచలన వ్యాఖ్యలు!NationalSwechaa26 Jul 2026, 02:52 PM

Anna Hazare: ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామాపై అన్నా హజారే సంచలన వ్యాఖ్యలు!

 నీట్ పేపర్ లీకేజీల వ్యవహారంతో ఢిల్లీలో నిరసనలు, కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా నేపథ్యంలో ప్రముఖ గాంధేయవాది, సామాజిక కార్యకర్త అన్నా హజారే సంచలన వ్యాఖ్యలు చేశారు. సమస్యలను బలవంతంగా అణచివేయడం సరికాదని, కేవలం సంప్రదింపులు,  ప్రజాస్వామ్య పద్ధతుల ద్వారానే శాశ్వత పరిష్కారాలు లభిస్తాయని ఆయన స్పష్టం చేశారు. మహారాష్ట్రలోని అహిల్యానగర్‌లో ఆదివారం(నేడు) జరిగిన ఓ కార్యక్రమంలో అన్నా హజారే మాట్లాడారు.

Rahul letter to amithshah: ‘విద్యార్థులపై పెల్లెట్ తుపాకులతో దాడి చేస్తారా..?’ అమిత్‌షాకు రాహుల్ గాంధీ ఘాటు లేఖNationalSwechaa26 Jul 2026, 01:43 PM

Rahul letter to amithshah: ‘విద్యార్థులపై పెల్లెట్ తుపాకులతో దాడి చేస్తారా..?’ అమిత్‌షాకు రాహుల్ గాంధీ ఘాటు లేఖ

ఢిల్లీలో శాంతియుతంగా నిరసన తెలుపుతున్న విద్యార్థులపై పోలీసు బలగాలు విరుచుకుపడటంపై పార్లమెంట్ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ ఘటనకు సంబంధించి ఆదివారం ఉదయం 10.50గంటలకు కేంద్ర హోం మంత్రి అమిత్ షాకు ఆయన ఒక ఘాటు లేఖ రాశారు.

Cauvery Water Dispute: కావేరి వివాదం.. సరిహద్దుల్లో స్థంభించిన రవాణా!టాప్ న్యూస్Swechaa26 Jul 2026, 01:27 PM

Cauvery Water Dispute: కావేరి వివాదం.. సరిహద్దుల్లో స్థంభించిన రవాణా!

కావేరి నదీ జలాల వివాదం మరోసారి తెరపైకి వచ్చింది. కన్నడ సంఘాల ఆందోళనల నేపథ్యంలో రాజకీయాన్ని, రవాణాను తీవ్రంగా ప్రభావితం చేసింది. మేకెదాటు ప్రాజెక్టుకు వ్యతిరేకంగా చెలరేగిన నిరసనల కారణంగా తమిళనాడు నుంచి కర్ణాటక వైపు వెళ్లే బస్సు సర్వీసులను అధికారులు తాత్కాలికంగా రద్దు చేశారు.

Modi: యువశక్తిని చూసి గర్వపడుతున్నా.. 'మన్ కీ బాత్'లో ప్రధాని మోదీNationalSwechaa26 Jul 2026, 01:02 PM

Modi: యువశక్తిని చూసి గర్వపడుతున్నా.. 'మన్ కీ బాత్'లో ప్రధాని మోదీ

ప్రధానమంత్రి నరేంద్ర మోదీ దేశ యువశక్తి నైపుణ్యాలపై పసందైన ప్రశంసల వర్షం కురిపించారు. అంతరిక్ష పరిశోధనల నుంచి అంతర్జాతీయ శాస్త్ర పోటీల వరకు భారతీయ యువత సాధిస్తున్న విజయాలు దేశానికే గర్వకారణంగా నిలుస్తున్నాయని వ్యాఖ్యానించారు. తన రేడియో ప్రసంగం 'మన్ కీ బాత్' ద్వారా ప్రధాని మాట్లాడారు.

సరిహద్దులు దాటిన ప్రేమ.. స్పెయిన్ అబ్బాయిని పెళ్లాడిన తెలుగు యువతిఏపీSwechaa26 Jul 2026, 12:47 PM

సరిహద్దులు దాటిన ప్రేమ.. స్పెయిన్ అబ్బాయిని పెళ్లాడిన తెలుగు యువతి

ప్రేమకు సరిహద్దులు లేవని, హృదయాల కలయికకు సంస్కృతుల భేదం అడ్డంకి కాదని తణుకులో జరిగిన ఓ వినూత్న పెళ్లి వేడుక నిరూపించింది. పశ్చిమ గోదావరి జిల్లా తణుకు పాతవూరుకు చెందిన బొప్పనపల్లి ప్రియదర్శిని, స్పెయిన్ దేశానికి చెందిన అమిన్ అల్ రహాద్ దంపతులు తెలుగు సంప్రదాయబద్ధంగా వివాహ బంధంతో ఒక్కటయ్యారు.

Saudi Arabia: పశ్చిమాసియాలో ఉద్రిక్తత.. సౌదీ అరామ్‌కో రిఫైనరీపై హూతీల డ్రోన్ దాడి?InternationalSwechaa26 Jul 2026, 12:10 PM

Saudi Arabia: పశ్చిమాసియాలో ఉద్రిక్తత.. సౌదీ అరామ్‌కో రిఫైనరీపై హూతీల డ్రోన్ దాడి?

పశ్చిమాసియాలో ఉద్రిక్తతలు మరింత ముదురుతున్నాయి. ఒకవైపు అమెరికా–ఇరాన్ ఘర్షణలతో పరిస్థితులు ఆందోళనకరంగా మారగా.. మరోవైపు సౌదీ అరేబియా–హూతీ తిరుగుబాటుదారుల మధ్య దాడులు ప్రపంచ దేశాలను కలవరపెడుతున్నాయి. ఇరాన్ మద్దతు ఉన్న హూతీ తిరుగుబాటుదారులు సౌదీ అరేబియాలోని కీలక చమురు సంస్థలను లక్ష్యంగా చేసుకున్నట్లు ప్రకటించారు.

సౌదీ అరేబియాలోని అతిపెద్ద చమురు శుద్ధి కేంద్రాల్లో ఒకటైన రాస్ తనురా రిఫైనరీపై డ్రోన్ దాడి జరిగినట్లు సమాచారం. ఈ రిఫైనరీ సౌదీ అరామ్‌కోకు చెందిన కీలక చమురు సంస్థల్లో ఒకటి. దాడి అనంతరం రిఫైనరీ పరిసరాల్లో భారీగా మంటలు ఎగిసిపడుతున్న దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి.