స్వేచ్ఛ షార్ట్స్ — తాజా తెలుగు వార్తలు

CJP Story: అవమానమే ఆయుధంగా.. ‘బొద్దింక’ పార్టీ కథ ఇదే!NationalSwechaa26 Jul 2026, 10:58 AM

CJP Story: అవమానమే ఆయుధంగా.. ‘బొద్దింక’ పార్టీ కథ ఇదే!

రాజకీయాల్లో మాటల యుద్ధాలు, విమర్శలు సర్వసాధారణమే. కానీ వ్యవస్థలో జరుగుతున్న అన్యాయాలను ప్రశ్నించిన విద్యార్థులను ఉద్దేశించి ఒక ఉన్నతాధికారి నోటి వెంట వచ్చిన ఆ ఒక్క చిన్న పదం.. దేశం మొత్తాన్ని ఉలిక్కిపడేలా చేసింది.

HYD: నగరంలో ఘోర ప్రమాదం.. ఇద్దరు మైనర్ల మృతి!క్రైమ్Swechaa26 Jul 2026, 10:57 AM

HYD: నగరంలో ఘోర ప్రమాదం.. ఇద్దరు మైనర్ల మృతి!

హైదరాబాద్‌లోని కూకట్‌పల్లి పరిధిలో ఆదివారం తెల్లవారుజామున ఒక భయంకర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. అతివేగంగా దూసుకొచ్చిన టిప్పర్ లారీ ఒక ద్విచక్ర వాహనాన్ని బలంగా ఢీకొట్టడంతో ఇద్దరు యువకులు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు.

ప్రైవేట్ సంస్థలపై హెచ్‌ఆర్‌సీకి విచారణాధికారం లేదు.. హైకోర్టు సంచలన తీర్పు!తెలంగాణSwechaa26 Jul 2026, 09:00 AM

ప్రైవేట్ సంస్థలపై హెచ్‌ఆర్‌సీకి విచారణాధికారం లేదు.. హైకోర్టు సంచలన తీర్పు!

ప్రైవేట్ కంపెనీలు, వాటి సిబ్బందిపై వచ్చే ఫిర్యాదులను విచారించే పరిధి రాష్ట్ర మానవ హక్కుల కమిషన్ (హెచ్‌ఆర్‌సీ)కి లేదని తెలంగాణ హైకోర్టు స్పష్టం చేసింది.

అనాహత్ సంచలనం.. వరల్డ్ జూనియర్ స్క్వాష్ ఛాంపియన్‌గా రికార్డ్!క్రీడలుSwechaa26 Jul 2026, 08:48 AM

అనాహత్ సంచలనం.. వరల్డ్ జూనియర్ స్క్వాష్ ఛాంపియన్‌గా రికార్డ్!

కెనడా వేదికగా జరిగిన వరల్డ్ జూనియర్ స్క్వాష్ ఛాంపియన్‌షిప్‌లో భారత యువ సంచలనం అనాహత్ సింగ్ స్వర్ణ పతకంతో నూతన అధ్యాయాన్ని లిఖించింది.

CJP Demands: అప్పుడే అయిపోలేదు, తొలి వికెట్ పడింది- ఉద్యమంపై సీజేపీ కీలక ప్రకటనNationalSwechaa25 Jul 2026, 04:51 PM

CJP Demands: అప్పుడే అయిపోలేదు, తొలి వికెట్ పడింది- ఉద్యమంపై సీజేపీ కీలక ప్రకటన

తాము చేపట్టిన ఆందోళనల ఫలితంగా నీట్ పేపర్ లీక్ కు నైతిక బాధ్యత వహిస్తూ కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయడంతో కాక్రోచ్ జనతా పార్టీ నేతలు ఆనందం వ్యక్తం చేశారు. కేంద్ర మంత్రి రాజీనామాపై స్పందించిన సీజేపీ నేతలు కీలక వ్యాఖ్యలు చేశారు. తమ ఉద్యమం అప్పుడే అయిపోలేదని, ఇంకా కొనసాగుతుందని తేల్చి చెప్పారు. ధర్మ

Big Breaking: కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ సంచలన రాజీనామా!NationalSwechaa25 Jul 2026, 02:45 PM

Big Breaking: కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ సంచలన రాజీనామా!

దేశవ్యాప్తంగా తీవ్ర దుమారం రేపుతున్న నీట్ (NEET) ప్రశ్నాపత్రం లీకేజీ వ్యవహారంలో కీలక పరిణామం చోటుచేసుకుంది. వైద్య విద్య ప్రవేశ పరీక్షలో చోటుచేసుకున్న వరుస వివాదాలు, అక్రమాలకు నైతిక బాధ్యత వహిస్తూ కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ తన పదవికి రాజీనామా చేశారు.

రోహిత్ శర్మ రిటైర్మెంట్‌పై రూమర్లకు చెక్.. క్లారిటీ ఇచ్చిన బీసీసీఐ ఉపాధ్యక్షుడు రాజీవ్ శుక్లా!క్రీడలుSwechaa25 Jul 2026, 01:41 PM

రోహిత్ శర్మ రిటైర్మెంట్‌పై రూమర్లకు చెక్.. క్లారిటీ ఇచ్చిన బీసీసీఐ ఉపాధ్యక్షుడు రాజీవ్ శుక్లా!

టీమిండియా దిగ్గజ బ్యాటర్ రోహిత్ శర్మ అంతర్జాతీయ క్రికెట్ భవిష్యత్తు, రిటైర్మెంట్‌పై గత కొద్ది రోజులుగా సాగుతున్న ప్రచారానికి భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) స్వస్తి పలికింది. రోహిత్ వీడ్కోలుపై వస్తున్న వార్తలన్నీ కేవలం వదంతులేనని, అందులో ఎలాంటి నిజం లేదని బీసీసీఐ ఉపాధ్యక్షుడు రాజీవ్ శుక్లా తేల్చి చెప్పారు.

కయ్యాల క్లబ్‌గా మారిన  జూబ్లీహిల్స్ ఇంటర్నేషనల్ సెంటర్?స్వేచ్ఛ ఛైర్మన్ డెస్క్Swechaa25 Jul 2026, 01:08 PM

కయ్యాల క్లబ్‌గా మారిన జూబ్లీహిల్స్ ఇంటర్నేషనల్ సెంటర్?

జూబ్లీహిల్స్ క్లబ్‌లో రోజుకో వివాదం తెరపైకి వస్తోంది. సీఎం రేవంత్ రెడ్డి కూడా ఈ సొసైటీలో సభ్యుడే. రిచ్చెస్ట్ సభ్యులు ఇందులో ఎక్కువ మంది. కానీ, ఎంతో బాధ్యతగా ఉండాల్సిన కమిటీ సభ్యులు గోతులు తవ్వుకుంటూ రోజూ గొడవలు పడుతున్నారు. కుట్రలు, కుతంత్రాలు, దొరికినప్పుడు చూసుకుందాం.. అప్పటిదాకా దోచుకుందాం అనే ధ్యాస తప్ప పేరుకు తగ్గట్టు ఇంటర్నేషనల్ సెంటర్‌గా పని చేయడం లేదు.

Venuswami: వేణుస్వామి సంచలన జోస్యం.. బీజేపీకి 90శాతం నష్టమా?రాజకీయాలుSwechaa25 Jul 2026, 12:28 PM

Venuswami: వేణుస్వామి సంచలన జోస్యం.. బీజేపీకి 90శాతం నష్టమా?

దేశవ్యాప్తంగా సాగుతున్న పరీక్షల వివాదాలు, విద్యార్థుల ఆందోళనల నడుమ పుట్టుకొచ్చిన 'కాక్రోచ్ జనతా పార్టీ' (CJP)పై ప్రముఖ జ్యోతిష్కుడు వేణుస్వామి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఈ నూతన ఉద్యమ పార్టీ ఆవిర్భావం కేంద్రంలో అధికారంలో ఉన్న భారత్ జనతా పార్టీ (బీజేపీ)కి తీవ్ర రాజకీయాన్ని మిగల్చబోతోందని ఆయన అంచనా వేశారు.

Indian Army: 30 వేల మంది జవాన్ల రాజీనామా? వైరల్ వీడియోపై కేంద్రం స్పష్టత!వైరల్ న్యూస్Swechaa25 Jul 2026, 11:44 AM

Indian Army: 30 వేల మంది జవాన్ల రాజీనామా? వైరల్ వీడియోపై కేంద్రం స్పష్టత!

సోషల్ మీడియా వేదికగా భారత చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్ (CDS) జనరల్ ఎన్.ఎస్. రాజా సుబ్రమణికి సంబంధించి వైరల్ అవుతున్న ఒక వీడియోపై కేంద్ర ప్రభుత్వం తీవ్రంగా స్పందించింది. న్యూఢిల్లీలోని జంతర్‌మంతర్ వద్ద జరుగుతున్న విద్యార్థుల నిరసనలకు మద్దతుగా సుమారు 30వేల మంది భారతీయ సైనికులు తమ ఉద్యోగాలకు రాజీనామా చేశారని, ప్రభుత్వం విద్యార్థుల పట్ల సానుకూల వైఖరి వహించాలని సీడీఎస్ అన్నట్లుగా సదరు వీడియోలో ప్రచారం జరుగుతోంది.

Medchal: ఐదో అంతస్తు నుంచి దూకి పీజీ వైద్య విద్యార్థిని సూసైడ్!క్రైమ్Swechaa25 Jul 2026, 11:24 AM

Medchal: ఐదో అంతస్తు నుంచి దూకి పీజీ వైద్య విద్యార్థిని సూసైడ్!

మేడ్చల్-మల్కాజిగిరి జిల్లా కీసర పోలీస్ స్టేషన్ పరిధిలోని నాగారంలో విషాదకర ఘటన చోటుచేసుకుంది. ఉన్నత చదువులు అభ్యసించి, వైద్యురాలిగా సమాజానికి సేవ చేయాల్సిన యువతి ఆత్మహత్యకు పాల్పడటం స్థానికంగా తీవ్ర కలకలం రేపింది.

తిరుమలలో కొనసాగుతున్న భక్తుల రద్దీ.. శ్రీవారి దర్శనానికి 24 గంటల సమయం!ఏపీSwechaa25 Jul 2026, 11:12 AM

తిరుమలలో కొనసాగుతున్న భక్తుల రద్దీ.. శ్రీవారి దర్శనానికి 24 గంటల సమయం!

కలియుగ దైవం శ్రీవేంకటేశ్వర స్వామివారి దివ్యక్షేత్రమైన తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతోంది. సెలవు దినాలు,  వారాంతం కావడంతో దేశ నలుమూలల నుంచి విచ్చేసిన భక్తజనంతో సప్తగిరులు గోవింద నామస్మరణతో మారుమోగుతున్నాయి. వైకుంఠం క్యూ కాంప్లెక్స్‌లోని అన్ని కంపార్ట్‌మెంట్లు భక్తులతో పూర్తిస్థాయిలో నిండిపోయాయి.

Gold price: స్వల్పంగా దిగొచ్చిన బంగారం, వెండి ధరలు!వ్యాపారంSwechaa25 Jul 2026, 10:56 AM

Gold price: స్వల్పంగా దిగొచ్చిన బంగారం, వెండి ధరలు!

గత కొన్ని రోజులుగా వరుసగా పెరుగుతూ వినియోగదారులను భయపెట్టిన పసిడి ధరకు కాస్త బ్రేక్ పడింది. అంతర్జాతీయ మార్కెట్ ప్రభావంతో శనివారం ఉదయం దేశీయంగా బంగారం ధరలు స్వల్పంగా తగ్గుముఖం పట్టాయి. పసిడితో పాటే వెండి రేటు కూడా కొద్దిగా క్షీణించింది.

ఆరు దశాబ్దాల తర్వాత తమిళనాడు సీఎం కార్యాలయం మార్పు!రాజకీయాలుSwechaa25 Jul 2026, 10:28 AM

ఆరు దశాబ్దాల తర్వాత తమిళనాడు సీఎం కార్యాలయం మార్పు!

తమిళనాడు రాష్ట్ర సచివాలయంలో ఓ కీలక చారిత్రక పరిణామం ఆవిష్కృతం కాబోతోంది. సుమారు అరవై ఏళ్లుగా ప్రసిద్ధ 'ఫోర్ట్ సెయింట్ జార్జ్' ప్రాంగణం వేదికగా సాగుతున్న ముఖ్యమంత్రి కార్యాలయాన్ని (CMO) త్వరలోనే 'నమక్కల్ కవిజ్ఞర్ మాళిగై' భవనానికి తరలించేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయి.

ట్రంప్ ప్రభుత్వానికి బిగ్ షాక్... హెచ్-1బీ వీసా లక్ష డాలర్ల ఫీజుకు బ్రేక్!InternationalSwechaa25 Jul 2026, 10:12 AM

ట్రంప్ ప్రభుత్వానికి బిగ్ షాక్... హెచ్-1బీ వీసా లక్ష డాలర్ల ఫీజుకు బ్రేక్!

అమెరికాలో ఉద్యోగం చేయాలని భావిస్తున్న విదేశీ ఐటీ నిపుణులకు, వారిని ఉద్యోగాల్లోకి తీసుకునే అమెరికన్ టెక్ కంపెనీలకు భారీ ఉపశమనం లభించింది. కొత్తగా మంజూరు చేసే హెచ్-1బీ (H-1B) వీసాలపై లక్ష డాలర్ల (సుమారు ₹96 లక్షలు) భారీ రుసుమును వసూలు చేయాలన్న డొనాల్డ్ ట్రంప్ పరిపాలన నిర్ణయానికి అమెరికా ఫెడరల్ అప్పీల్స్ కోర్టులో ఎదురుదెబ

పోలియోను జయించి.. పేదరికాన్ని దాటి.. కూరగాయల వ్యాపారి కొడుకు అద్భుతం!క్రీడలుSwechaa25 Jul 2026, 09:54 AM

పోలియోను జయించి.. పేదరికాన్ని దాటి.. కూరగాయల వ్యాపారి కొడుకు అద్భుతం!

ఆత్మవిశ్వాసం ముందు శారీరక వైకల్యం తలవంచాల్సిందేనని, పట్టుదల ఉంటే పేదరికం విజయాన్ని ఆపలేదని మరో యువకుడు నిరూపించారు. పుట్టుకతోనే పోలియో సోకినా అధైర్యపడకుండా, జీవనోపాధి కోసం ఈ-రిక్షా నడుపుతూనే అంతర్జాతీయ క్రీడా వేదికపై దేశ పతాకాన్ని ఎగురవేశాడు.

CORONA: ఏపీలో మరో ఏడు కరోనా కేసులు నమోదు!ఏపీSwechaa25 Jul 2026, 09:29 AM

CORONA: ఏపీలో మరో ఏడు కరోనా కేసులు నమోదు!

ఏపీలో కొవిడ్ కేసులు పునరావృతమవుతుండటం ప్రజలను ఆందోళనకు గురిచేస్తోంది. గత కొద్ది రోజులుగా క్రమంగా నమోదువుతున్న కొత్త కేసులు ప్రజలను భయబ్రాంతులకు గురిచేస్తున్నాయి. ఈ క్రమంలో తాజాగా మరో ఏడు కరోనా పాజిటివ్ కేసులు నమోదైనట్లు అధికారులు వెల్లడించారు.

Amarnath-yatra: నేటి నుంచి అమర్‌నాథ్‌ యాత్ర పునఃప్రారంభంSpiritualitySwechaa25 Jul 2026, 09:13 AM

Amarnath-yatra: నేటి నుంచి అమర్‌నాథ్‌ యాత్ర పునఃప్రారంభం

ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన అమర్‌నాథ్ మంచు లింగ దర్శన యాత్ర నేటి నుంచి తిరిగి ప్రారంభమైంది. జమ్ములోని భగవతినగర్ బేస్ క్యాంప్ నుంచి భక్తుల తొలి విడత ప్రయాణం ఉత్సాహంగా మొదలైంది.

ప్రముఖ హాలీవుడ్ దర్శకుడు చక్ రస్సెల్ కన్నుమూత!సినిమాSwechaa25 Jul 2026, 08:57 AM

ప్రముఖ హాలీవుడ్ దర్శకుడు చక్ రస్సెల్ కన్నుమూత!

విశిష్టమైన చిత్రాలతో ప్రపంచవ్యాప్తంగా కోట్లాది మంది అభిమానులను సంపాదించుకున్న హాలీవుడ్ ప్రముఖ ఫిల్మ్‌మేకర్ చక్ రస్సెల్ (74) కన్నుమూశారు. కాలిఫోర్నియాలోని తన నివాసంలో ఆయన మృతి చెందినట్లు వార్తలు వెలువడటం అంతర్జాతీయ సినీ వర్గాలను తీవ్ర దిగ్భ్రాంతికి గురిచేసింది. ఆయన ఆకస్మిక మరణానికి గల కచ్చితమైన కారణాలు ఇంకా స్పష్టం కాకపోవడంతో, స్థానిక పోలీసులు ఈ ఘటనపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు వేగవంతం చేశారు.

Himachal Pradesh: హిమాచల్ ప్రదేశ్‌లో ఘోర ప్రమాదం.. 13మంది దుర్మరణంNationalSwechaa24 Jul 2026, 05:15 PM

Himachal Pradesh: హిమాచల్ ప్రదేశ్‌లో ఘోర ప్రమాదం.. 13మంది దుర్మరణం

హిమాచల్ ప్రదేశ్ లో ఘోర ప్రమాదం జరిగింది. రోడ్డు పై ప్రయాణిస్తున్న సుమోపై కొండచరియలు విరిగిపడ్డాయి. ఈ దుర్ఘటనలో 13మంది అక్కడికక్కడే చనిపోయారు. ఇద్దరు ప్రాణాలతో బయటపడినట్లు తెలుస్తోంది. లాహౌల్-స్పితి జిల్లాలో ఈ ఘోరం జరిగింది. కొండచరియలు విరిగిపడటంతో క్యాబ్ శిథిలాల కింద కూరుకుపోయింది. కుల్లు నుండి పాంగికి ప్రయాణిస్తున్న ట

KTR: మోదీపై పోరాడుతుంటే రేవంత్ రెడ్డికి కోపమెందుకు? కేటీఆర్‌ ఫైర్తెలంగాణSwechaa24 Jul 2026, 01:58 PM

KTR: మోదీపై పోరాడుతుంటే రేవంత్ రెడ్డికి కోపమెందుకు? కేటీఆర్‌ ఫైర్

నీట్ (NEET) ప్రశ్నపత్రాల లీకేజీ వ్యవహారానికి వ్యతిరేకంగా ఢిల్లీలో శాంతియుతంగా ఆందోళన చేస్తున్న విద్యార్థులపై జరిగిన లాఠీఛార్జ్, పోలీసుల దౌర్జన్యాల సెగ తెలంగాణకు పాకింది. ఢిల్లీ ఘోరకలికి నిరసనగా బీఆర్‌ఎస్ విద్యార్థి విభాగం (BRSV) ఆధ్వర్యంలో హైదరాబాద్ ఇందిరా పార్క్ ధర్నా చౌక్ వద్ద నిర్వహించిన భారీ నిరసన ప్రదర్శనలో బీఆర్‌ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ పాల్గొని మాట్లాడారు.

Breking : మోడీ జాగ్రత్త.. తరం మారింది.. స్వరమూ మారుతోంది :  కేటీఆర్తెలంగాణSwechaa24 Jul 2026, 01:55 PM

Breking : మోడీ జాగ్రత్త.. తరం మారింది.. స్వరమూ మారుతోంది : కేటీఆర్

హైదరాబాద్‌లోని ఇందిరాపార్క్ ధర్నా చౌక్ వద్ద బీఆర్ఎస్వీ ఆధ్వర్యంలో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సారథ్యంలో నీట్ పేపర్ లీకేజీకి వ్యతిరేకంగా విద్యార్థులు, విద్యార్థి సంఘాల నాయకులు పెద్దఎత్తున నిరసనలు చేస్తున్నారు. ఈ సంద్భంగా కేటీఆర్ మాట్లాడుతూ.. మోడీ జాగ్రత్త.. తరం మారింది.. స్వరమూ మారుతోంది అని కేంద్రాన్ని ఉద్దేశించి హెచ్చరికలు చేశారు.

1991 Budget India: ఆ ఒక్క బడ్జెట్ లేకపోతే మన దేశం ఏమయ్యేదో? 35 ఏళ్ల కిందట ఏం జరిగిందంటే!NationalSwechaa24 Jul 2026, 01:30 PM

1991 Budget India: ఆ ఒక్క బడ్జెట్ లేకపోతే మన దేశం ఏమయ్యేదో? 35 ఏళ్ల కిందట ఏం జరిగిందంటే!

సరిగ్గా 35 ఏళ్ల కిందట.. అంటే 1991 జూలై 24న మన దేశంలో ఓ అద్భుతం జరిగింది. అప్పట్లో భారతదేశం తీవ్రమైన డబ్బుల కొరతతో దివాలా తీసే పరిస్థితికి వచ్చింది. కనీసం విదేశాల నుంచి పెట్రోల్ కొందామన్నా.. మన దగ్గర పైసలు లేవు. దేశంలో ఉన్న బంగారాన్ని విదేశాల్లో తాకట్టు పెట్టి అప్పులు తేస్తే కానీ గడవని దారుణమైన పరిస్థితి.

Heavy Rains :  రైతులకు శుభవార్త.. ఎల్లుండి  నుంచి భారీ వర్షాలుతెలంగాణSwechaa24 Jul 2026, 01:01 PM

Heavy Rains : రైతులకు శుభవార్త.. ఎల్లుండి నుంచి భారీ వర్షాలు

తెలంగాణ రైతాంగానికి, ప్రజలకు వెదర్ మ్యాన్ బాలాజీ శుభవార్త చెప్పారు. తాజా అంచనా మేరకు తెలంగాణలో వర్షాలు మళ్లీ కురుస్తాయని అంచనా వేశారు. శనివారంతో ప్రస్తుతమున్న పొడి వాతావరణం ముగిసి ఆదివారం నుంచి రాష్ట్రంలోని పలు జిల్లాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు అంచనా వేశారు.

Mla Mallareddy: పార్టీ మార్పుపై జోరుగా ప్రచారం.. మల్లారెడ్డి క్లారిటీ!తెలంగాణSwechaa24 Jul 2026, 12:52 PM

Mla Mallareddy: పార్టీ మార్పుపై జోరుగా ప్రచారం.. మల్లారెడ్డి క్లారిటీ!

బీఆర్‌ఎస్ సీనియర్ నేత, మాజీ మంత్రి మల్లారెడ్డి తాను పార్టీ మారుతున్నట్లు జరుగుతున్న ఊహాగానాలకు స్వయంగా తెరదించారు. గత కొన్ని రోజులుగా రాజకీయ వర్గాల్లో తాను వేరే పార్టీలో చేరబోతున్నానంటూ జోరుగా ప్రచారం సాగుతుండటంతో మల్లారెడ్డి స్పందించారు. బీఆర్‌ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ జన్మదిన వేడుకల్లో ఎంతో ఉత్సాహంగా పాల్గొన్న ఆయన, తన పార్టీ మార్పుపై వస్తున్న వార్తలన్నీ కేవలం నిరాధారమైనవని, అవన్నీ అబద్ధాలంటూ కొట్టిపారేశారు.

NEET: విదేశాల పర్యటనలు ఆపి.. విద్యార్థుల బాధలు చూడండి మోదీ’.. హైదరాబాద్‌లో 'నీట్' నిరసన జ్వాలలు!తెలంగాణSwechaa24 Jul 2026, 12:38 PM

NEET: విదేశాల పర్యటనలు ఆపి.. విద్యార్థుల బాధలు చూడండి మోదీ’.. హైదరాబాద్‌లో 'నీట్' నిరసన జ్వాలలు!

ప్రజాస్వామ్య దేశంలో విద్యావ్యవస్థ బాగుపడాలని ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తే 'యాంటీ నేషనల్' అని ముద్ర వేస్తారా? అంటూ ఆవేదనతో విద్యార్థి లోకం గళమెత్తింది. నేషనల్ ఎలిజిబిలిటీ కమ్ ఎంట్రన్స్ టెస్ట్ (NEET) నిర్వహణలో జరిగిన అక్రమాలు, కేంద్ర ప్రభుత్వ నిర్లక్ష్యానికి వ్యతిరేకంగా హైదరాబాద్‌లోని ఇందిరా పార్క్ ధర్నాచౌక్ వద్ద విద్యార్థులు, బాధితులు భారీ నిరసన చేపట్టారు.

India vs Zimbabwe T20: సచిన్ 37 ఏళ్ల రికార్డు బద్దలు.. చెలరేగిన వైభవ్ సూర్యవంశీ!క్రీడలుSwechaa24 Jul 2026, 11:59 AM

India vs Zimbabwe T20: సచిన్ 37 ఏళ్ల రికార్డు బద్దలు.. చెలరేగిన వైభవ్ సూర్యవంశీ!

భారత క్రికెట్ యువ సంచలనం వైభవ్ సూర్యవంశీ మైదానంలో పరుగుల తుపాను సృష్టించాడు. కేవలం 15 ఏళ్ల 118 రోజులకే అంతర్జాతీయ అరంగేట్రం చేసిన వైభవ్, హరారే వేదికగా జింబాబ్వేతో జరిగిన తొలి టీ20 మ్యాచ్‌లో సిక్సర్లు, ఫోర్ల వర్షం కురిపించాడు.

కుంకీ ఏనుగులకు పవన్ కల్యాణ్ గ్రాండ్ వెల్కమ్.. క్యాంప్ ఆఫీస్ వద్ద ప్రత్యేక పూజలు!ఏపీSwechaa24 Jul 2026, 11:40 AM

కుంకీ ఏనుగులకు పవన్ కల్యాణ్ గ్రాండ్ వెల్కమ్.. క్యాంప్ ఆఫీస్ వద్ద ప్రత్యేక పూజలు!

విజయనగరం, పార్వతీపురం మన్యం జిల్లాల్లో పంటలను ధ్వంసం చేస్తూ, ప్రజలను భయాందోళనలకు గురిచేస్తున్న అడవి ఏనుగుల గుంపును దారికి తెచ్చేందుకు అటవీశాఖ చర్యలు వేగవంతం చేసింది.

Adani Airports: విమానయాన రంగంలోకి అదానీ? ఊహాగానాలపై స్పష్టత!వ్యాపారంSwechaa24 Jul 2026, 11:04 AM

Adani Airports: విమానయాన రంగంలోకి అదానీ? ఊహాగానాలపై స్పష్టత!

భారత విమానయాన రంగంలోకి అదానీ గ్రూప్ స్వయంగా ఎయిర్‌లైన్ సేవలతో అడుగుపెట్టబోతోందంటూ గత కొన్ని రోజులుగా వస్తున్న వార్తలపై అదానీ ఎంటర్‌ప్రైజెస్ ఎట్టకేలకు నోరు విప్పింది. ఈ తరహా ప్రచారాలు, కథనాలు ముమ్మాటికీ నిరాధారమైనవని, విమానయాన వ్యాపారంలోకి ప్రవేశించే ఆలోచన తమకు అసలు లేదని సంస్థ అధికారిక ప్రకటన ద్వారా ఖండించింది.

హెచ్ఎండీఏ.. ఏం మారలేదు  ఎవరి వాటాలు వారివే?స్వేచ్ఛ ఛైర్మన్ డెస్క్Swechaa24 Jul 2026, 10:53 AM

హెచ్ఎండీఏ.. ఏం మారలేదు ఎవరి వాటాలు వారివే?

అవినీతికి కేరాఫ్ అడ్రస్ హెచ్‌ఎండీఏ అని గత దశబ్దాలుగా ఆరోపణలు వస్తూనే ఉన్నాయి. మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ అండ్ అర్బన్ డెవలప్‌మెంట్(ఎంఏయూడీ)కి ఇది గుండెకాయ లాంటిది. అలాంటి ముఖ్యమైన కార్యాలయాల్లో తెలంగాణ వచ్చినప్పటి నుంచి అధికారుల వాటాలు భారీగా పెరిగిపోయాయి అనడానికి అరవింద్ కుమార్‌పై ఈనాటి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేసిన ఆరోపణలే నిదర్శనం. ప్రజెంట్ ఆ శాఖను రేవంత్ రెడ్డి తన వద్దే ఉంచుకున్నారు. కానీ అక్రమాలు ఎక్కడా తగ్గడం లేదు.