స్వేచ్ఛ షార్ట్స్ — తాజా తెలుగు వార్తలు

రాత్రి 10 గంటల వరకే బాణసంచా కాల్చాలి.. దీపావళి నిబంధనలివే!తెలంగాణSwechaa05 Nov 2026, 11:34 AM

రాత్రి 10 గంటల వరకే బాణసంచా కాల్చాలి.. దీపావళి నిబంధనలివే!

 దీపావళి పండుగ సందర్భంగా శబ్ద, వాయు కాలుష్య నివారణే లక్ష్యంగా సుప్రీంకోర్టు విధించిన మార్గదర్శకాలను పటిష్టంగా అమలు చేయనున్నట్లు పోలీసు వర్గాలు తెలిపాయి. దీపావళి రోజున ప్రజలందరూ రాత్రి 10:00 గంటల వరకు మాత్రమే బాణసంచా కాల్చాలి. ఆ సమయం దాటిన తర్వాత నిబంధనలు ఉల్లంఘించి క్రాకర్స్ కాలిస్తే చట్టపరమైన చర్యలు తప్పవని హెచ్చరించారు. నిబంధనలు అతిక్రమించిన వారిపై కేసులు నమోదు చేస్తామని స్పష్టం చేశారు.

దీపావళి ఆఫర్.. 149 నుంచే ఆన్‌లిమిటెడ్ ప్యాక్‌లు!వ్యాపారంSwechaa05 Nov 2026, 11:23 AM

దీపావళి ఆఫర్.. 149 నుంచే ఆన్‌లిమిటెడ్ ప్యాక్‌లు!

దేశంలోని మొబైల్ వినియోగదారులకు ఈ పండుగ వేళ ప్రముఖ టెలికాం సంస్థలైన రిలయన్స్ జియో, భారతీ ఎయిర్‌టెల్, వొడాఫోన్ ఐడియా, బీఎస్‌ఎన్‌ఎల్‌లు సరికొత్త వార్తను అందించాయి. టెలికాం నియంత్రణ సంస్థ, డాట్ (DoT) ఆదేశాల మేరకు కేవలం వాయిస్ కాల్స్ మాత్రమే కోరుకునే వినియోగదారుల కోసం ప్రత్యేకంగా 'వాయిస్ ఓన్లీ' (Voice Only) రీఛార్జ్ ప్లాన్లను రూ.200 లకే అందుబాటులోకి తీసుకొచ్చాయి. డేటా అవసరం లేని సాధారణ ఫోన్ వినియోగదారులు, కేవలం ఇన్ కమింగ్, అవుట్ గోయింగ్ సేవలు మాత్రమే కోరుకునే ద్వితీయ సిమ్ (Second SIM) యూజర్లు, ఇళ్ల వద్ద వైఫై వినియోగించే వారికి ఈ తక్కువ ధర రీఛార్జ్ ప్లాన్లు ఎంతో ఆర్థిక ఊరటనివ్వనున్నాయి.

నేడు తెలంగాణ కేబినెట్ భేటీ.. నిరుద్యోగులకు శుభవార్త?తెలంగాణSwechaa05 Nov 2026, 11:16 AM

నేడు తెలంగాణ కేబినెట్ భేటీ.. నిరుద్యోగులకు శుభవార్త?

నేడు తెలంగాణ మంత్రి వర్గం సమావేశం కానుంది. సీఎం రేవంత్ రెడ్డి అధ్యక్షతన కేబినెట్ భేటీ ఉండనుంది. సాయంత్రం 4 గంటల సమయంలో ఈ సమావేశం ప్రారంభం కానుండగా, అంతకంటే ముందు మధ్యాహ్నం 3 గంటల ప్రాంతంలో మంత్రులతో సీఎం అనధికారికంగా సమావేశమై పలు అంశాలపై చర్చించనున్నారు. ఇదిలాఉండగా, కేబినెట్ సమావేశంలో చర్చించే అంశాలపై సీఎస్ సంజయ్ జాజు ముందస్తు కసరత్తు చేసినట్టు తెలుస్తోంది. సచివాలయంలో ఉన్నతాధికారులతో నిన్న ఆయన ప్రత్యేక సమీక్ష నిర్వహించారు.వివిధ ప్రభుత్వ శాఖల నుంచి వచ్చిన ప్రధాన అజెండా ప్రతులు, చర్చించాల్సిన ముఖ్యాంశాలు, ప్రతిపాదిత బిల్లులను పరిశీలించారు. వాటిని కేబినెట్ సమావేశంలో చర్చించడానికి గల అవసరమైన అన్ని ఏర్పాట్లను పూర్తి చేసినట్టు తెలిసింది.

డోర్లు మూశాకే బస్సులు కదలాలి.. ఆర్టీసీ సంచలన నిర్ణయంతెలంగాణSwechaa05 Nov 2026, 10:57 AM

డోర్లు మూశాకే బస్సులు కదలాలి.. ఆర్టీసీ సంచలన నిర్ణయం

ఆర్టీసీ బస్సులకు డోర్లు అమర్చాలని రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. మహిళా కండక్టర్ ప్రవళిక మృతితో ఈ మేరకు నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తోంది. తెలంగాణ ఆర్టీసీ ఆధ్వర్యంలో నడిచే అన్ని బస్సుల్లో ఈ నిర్ణయాన్ని అమలు చేయనున్నారు. ఈ మేరకు ఉత్వర్వులు వెలువడ్డాయి. తలుపులు మూశాకే బస్సులు ముందుకు కదలాలని ఆదేశాలు సైతం జారీ అయ్యాయి. ఇది అన్ని రకాల బస్సులకు వర్తిస్తుందని టీజీఎస్ ఆర్టీసీ స్పష్టంచేసింది. ముందుగా రాష్ట్రంలో డోర్లు లేని బస్సులను గుర్తించి వెంటనే అమర్చాలని ఆర్టీసీ అధికారులను ఆదేశించింది. ఇదిలాఉండగా, రాష్ట్రంలో ప్రస్తుతం ఎలక్ట్రిక్ ఎక్స్ ప్రెస్, సూపర్ లగ్జరీ, డీలక్స్ బస్సులకు మాత్రమే డోర్లు ఉన్నాయి. పల్లెవెలుగు, ఎక్స్‌ప్రెస్ బస్సులు, నగరంలో నడిచే సిటీ బస్సులకు డోర్లు అసలే లేవు. సిటీ బస్సుల్లో ముందు, వెనుక నుంచి ఎక్కే సదుపాయం ఉన్నందున రెండు వైపులా డోర్లు అమర్చాల్సి ఉంటుంది.

రాప్తాడు బాలికకు సర్జరీ విజయవంతం: నారా లోకేశ్ఏపీSwechaa05 Nov 2026, 10:32 AM

రాప్తాడు బాలికకు సర్జరీ విజయవంతం: నారా లోకేశ్

 అనంతపురం జిల్లా రాప్తాడు జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో ఉన్మాది దాడికి గురై తీవ్రంగా గాయపడిన పదో తరగతి విద్యార్థిని ఆరోగ్య పరిస్థితిపై ప్రభుత్వం మరో కీలక సమాచారాన్ని వెల్లడించింది. బెంగళూరులోని మణిపాల్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న ఆ చిన్నారికి వైద్యుల బృందం ఆర్థోపెడిక్ శస్త్రచికిత్సను (Orthopedic Surgery) అత్యంత విజయవంతంగా పూర్తి చేసింది. ఈ విషయాన్ని రాష్ట్ర విద్యా, ఐటీ, మానవ వనరుల అభివృద్ధి శాఖ మంత్రి నారా లోకేశ్ సామాజిక మాధ్యమం 'ఎక్స్' (X) వేదికగా పంచుకున్నారు. బాధిత బాలికకు సంపూర్ణ ఆరోగ్యం చేకూరేలా ప్రపంచ స్థాయి వైద్యం అందించడంలో ఏపీ ప్రభుత్వం అన్ని విధాలా అండగా నిలుస్తోందని ఆయన స్పష్టం చేశారు.

రిపబ్లికన్ల ఓటమి.. వైస్ ప్రెసిడెంట్ జేడీ వాన్స్ సంచలన ట్వీట్InternationalSwechaa05 Nov 2026, 10:28 AM

రిపబ్లికన్ల ఓటమి.. వైస్ ప్రెసిడెంట్ జేడీ వాన్స్ సంచలన ట్వీట్

అమెరికాలో జరిగిన మధ్యంతర ఎన్నికల్లో అధికార రిపబ్లికన్ పార్టీ అభ్యర్థులు కాంగ్రెస్, సెనెట్‌లో ఓటమి పాలవ్వడంపై ఆ దేశ వైస్ ప్రెసిడెంట్ జేడీ వాన్స్ సంచలన కామెంట్స్ చేశారు. ఈ మేరకు నిన్న రాత్రి సోషల్ మీడియా ‘ఎక్స్’ వేదికగా ట్వీట్ చేశారు. మిడ్ టర్మ్ ఎన్నికల్లో రిపబ్లికన్లు ఓడిపోవడానికి ఇరాన్‌తో యుద్ధమే కారణమని బాంబ్ పేల్చారు. తమ పార్టీ మద్దతుదారులు ఎన్నికల్లో పెద్ద ఎత్తున పోలింగ్‌కు హాజరైనా 2024లో ట్రంప్‌కు ఓటు వేసిన చాలామంది ఈసారి డెమొక్రాట్లకు ఓటు వేశారని, అందుకే ఓటమి పాలయ్యామని స్పష్టంచేశారు.

సీఎంలే తెలంగాణ భూ దోపిడీదారులు?స్వేచ్ఛ ఛైర్మన్ డెస్క్Swechaa05 Nov 2026, 09:54 AM

సీఎంలే తెలంగాణ భూ దోపిడీదారులు?

ఓఆర్ఆర్ లోపల ఎక్కడ ఖాళీగా భూములు ఉన్నా అవి ప్రభుత్వ భూములేనా? క్లియర్ టైటిల్ అయితే రింగ్ రోడ్డు అవతల కూడా రూ.50 వేలకు గజం జాగా అమ్ముకుంటూ, చుట్టూ అపార్ట్‌మెంట్స్, విల్లాలు నిర్మిస్తుంటే ఇక్కడ మాత్రం దశాబ్దాల కాలంగా ఎందుకు నిర్మాణాలు జరగడం లేదు. ప్రైవేట్ భూములు అయితే ఒకే చోట వందల ఎకరాలు ఉండవు.

కోర్ ఏరియా అయినా అర్బన్ సీలింగ్ ఏరియా అయినా 1000 గజాల కంటే ఎక్కువ ఉండదు. కానీ, చట్టాలు అమల్లో ఉన్నా 30 ఏండ్ల తర్వాత వాళ్లకు అనుకూలంగా పేపర్స్ సృష్టించుకుని వేల కోట్ల భూములను కొట్టేస్తున్నారు. ఆనాటి సర్వే నెంబర్ భూములు, ఇప్పటికీ మినిస్టర్ క్వార్టర్స్ అని చెప్పుకుని క్లైం చేసుకున్న మంత్రి వివేక్ ఫ్యామిలీ, 403 మొత్తం ప్రభుత్వ భూమి పట్టా భూమి అయితే అర్బన్ సీలింగ్ యాక్ట్‌లో ఎందుకు డిక్లేర్ చేయలేదు. మున్సిపల్ నెంబర్స్ ఇచ్చినా ఇంకా మిగులు భూమి ప్రభుత్వ భూమియే అని అమ్ముకుంటూ వేల కోట్లు సంపాదించారు.

Tollywood: వరుసగా తమిళ సినిమాల్లో ఛాన్స్.. శ్రీలీల క్రేజ్ తగ్గనట్టే!సినిమాSwechaa05 Nov 2026, 09:29 AM

Tollywood: వరుసగా తమిళ సినిమాల్లో ఛాన్స్.. శ్రీలీల క్రేజ్ తగ్గనట్టే!

Tollywood: డాన్సింగ్ క్వీన్ శ్రీలీలకి ప్రస్తుతం తెలుగులో కొత్త ప్రాజెక్ట్స్ ఏవీ కన్‌ఫర్మ్ కాలేదు. కానీ, కోలీవుడ్‌లో మాత్రం దూసుకుపోతోంది. బ్యాక్ టు బ్యాక్ కొత్త చిత్రాల్లో అవకాశాలు అందుకుంటుందోంది. అది కూడా ఊహించని కాంబినేషన్స్‌లో. ఒకప్పుడు టాలీవుడ్‌లో వరుస సినిమాలతో దూసుకుపోయిన శ్రీలీలకు ఇటీవల కాలంలో ఆశించిన స్థాయిలో అవకాశాలు రావడం లేదు. దీనికి, కారణం ఇక్కడ వరుసగా వచ్చిన ఫ్లాపులే.

చరిత్రలో ఈ రోజు (05 నవంబర్)InternationalSwechaa05 Nov 2026, 09:14 AM

చరిత్రలో ఈ రోజు (05 నవంబర్)

📌 నేటి ముఖ్యాంశాలు (Today's Highlights)

  • 2013: భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ (ISRO) చారిత్రాత్మక మంగళయాన్ (Mars Orbiter Mission - MOM) ఉపగ్రహాన్ని అంతరిక్షంలోకి విజయవంతంగా ప్రయోగించింది.

  • 1556: రెండవ పానీపట్ యుద్ధంలో (Second Battle of Panipat) మొఘల్ సేనాని బైరామ్ ఖాన్ నాయకత్వంలో హెమూను ఓడించి అక్బర్ విజయం సాధించాడు.

  • 1988: భారత క్రికెట్ జట్టు మాజీ కెప్టెన్, స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ జననం.

🌐 అంతర్జాతీయ సంఘటనలు

  • 1605: బ్రిటన్‌లో 'గన్‌పౌడర్ ప్లాట్' (Gunpowder Plot) విఫలమైంది — లండన్ పార్లమెంట్ భవనాన్ని పేల్చివేయడానికి ప్లాన్ చేసిన గై ఫాక్స్ (Guy Fawkes) అరెస్ట్ అయ్యాడు (దీనిని ఇంగ్లాండ్‌లో 'గై ఫాక్స్ నైట్'గా జరుపుకుంటారు).

  • 1914: మొదటి ప్రపంచ యుద్ధంలో బ్రిటన్, ఫ్రాన్స్ ఒట్టోమన్ సామ్రాజ్యంపై యుద్ధం ప్రకటించాయి.

  • 2006: ఇరాక్ మాజీ అధ్యక్షుడు సద్దాం హుస్సేన్‌కు మానవత్వానికి వ్యతిరేకంగా చేసిన నేరాలకుగానూ మరణశిక్ష విధించబడింది.

🚀 సైన్స్ & అడ్వెంచర్

  • 2013: ఇస్రో ఆంధ్రప్రదేశ్‌లోని శ్రీహరికోట సతీష్ ధావన్ స్పేస్ సెంటర్ నుంచి PSLV-C25 రాకెట్ ద్వారా మంగళయాన్‌ను అంగారకుడి వైపు విజయవంతంగా పంపింది.

  • 2007: చైనా తన మొట్టమొదటి చంద్ర శోధక ఉపగ్రహం 'చాంగ్ ఇ-1' (Chang'e 1) ని చంద్రుని కక్ష్యలో ప్రవేశపెట్టింది.

👤 ప్రముఖుల జననాలు & వర్ధంతులు

  • 1988 (జననం): విరాట్ కోహ్లీ — అంతర్జాతీయ క్రికెట్‌లో రికార్డుల రారాజు, భారత స్టార్ క్రికెటర్.

  • 1917 (జననం): బనారసీ దాస్ గుప్తా — హర్యానా మాజీ ముఖ్యమంత్రి, స్వాతంత్ర్య సమరయోధుడు.

  • 2011 (మరణం): భూపేన్ హజారికా — భారతరత్న పురస్కార గ్రహీత, ప్రసిద్ధ అస్సామీ గాయకుడు, సంగీత దర్శకుడు.

నేటి పంచాంగం - 05 నవంబర్ 2026 | కార్తిక కృష్ణ ఏకాదశి (రమా ఏకాదశి), శుభ సమయాలు & వివరాలుSpiritualitySwechaa05 Nov 2026, 08:53 AM

నేటి పంచాంగం - 05 నవంబర్ 2026 | కార్తిక కృష్ణ ఏకాదశి (రమా ఏకాదశి), శుభ సమయాలు & వివరాలు

వివరాలు:

  • తేదీ: 05 నవంబరు 2026, గురువారం

  • సంవత్సరం: శ్రీ పరాభవ నామ సంవత్సరం

  • అయనం & ఋతువు: దక్షిణాయనం, శరత్ఋతువు

  • మాసం & పక్షం: కార్తిక మాసం, కృష్ణ పక్షం

  • తిథి: ఏకాదశి (తెల్లవారుజామున 03:22 వరకు, తదుపరి ద్వాదశి)

  • వారం: గురువారం (బృహస్పతివాసరే)

  • నక్షత్రం: ఉత్తరఫల్గుణి (రాత్రి 08:35 వరకు, తదుపరి హస్త)

  • యోగం: వైధృతి (సాయంత్రం 05:40 వరకు, తదుపరి విష్కంభ)

  • కరణం: బవ (మధ్యాహ్నం 03:15 వరకు), తదుపరి బాలవ (తెల్లవారుజామున 03:22 వరకు)

శుభ / అశుభ సమయాలు:

  • రాహుకాలం: మధ్యాహ్నం 01:30 - 03:00 వరకు

  • యమగండం: ఉదయం 06:00 - 07:30 వరకు

  • అమృతకాలం: మధ్యాహ్నం 01:12 - 02:48 వరకు

  • దుర్ముహూర్తము: ఉదయం 10:02 - 10:48 వరకు మరియు మధ్యాహ్నం 02:40 - 03:26 వరకు

  • వర్జ్యం: ఉదయం 07:40 - 09:15 వరకు

గ్రహస్థితులు:

  • సూర్యరాశి: తుల

  • చంద్రరాశి: కన్య

  • సూర్యోదయం: ఉదయం 06:20

  • సూర్యాస్తమయం: సాయంత్రం 05:38

AI ప్రపంచంలో మహా యుద్ధం.. టెక్నాలజీ ఎవరి చేతుల్లోకి..?వ్యాపారంSwechaa05 Nov 2026, 12:01 AM

AI ప్రపంచంలో మహా యుద్ధం.. టెక్నాలజీ ఎవరి చేతుల్లోకి..?

ప్రపంచాన్ని మార్చేస్తుందని భావిస్తున్న ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్.. ఇప్పుడు మరో యుద్ధానికి వేదికగా మారింది. ఈ యుద్ధంలో ఆయుధాలు లేవు. సైన్యాలు లేవు. కానీ ప్రపంచంలోని అతిపెద్ద టెక్నాలజీ కంపెనీలు రెండు వర్గాలుగా విడిపోతున్నాయి. ఈ కంపెనీల మధ్య అసలు గొడవ ఏంటి?

నవంబర్‌లోనే నీటి కరువు.. ఇక వేసవిలో బతికేదెలా? ప్రభుత్వం ఏం చేస్తోంది..?తెలంగాణSwechaa04 Nov 2026, 11:24 PM

నవంబర్‌లోనే నీటి కరువు.. ఇక వేసవిలో బతికేదెలా? ప్రభుత్వం ఏం చేస్తోంది..?

హైదరాబాద్‌కు ఏమైంది? అసలు ఈ నగరం ఎటు వెళ్తోంది? దేశంలోనే వేగంగా అభివృద్ధి చెందుతున్న నగరాల్లో ఒకటిగా చెప్పుకునే హైదరాబాద్‌లో ఇప్పుడు గుక్కెడు నీటి కోసం ఎదురుచూడాల్సిన పరిస్థితి వచ్చిందా..?

TG: ఖమ్మంలో జాలర్లను కాపాడబోయి.. 10 మంది రెస్క్యూ సిబ్బంది గల్లంతు!తెలంగాణSwechaa04 Nov 2026, 09:30 PM

TG: ఖమ్మంలో జాలర్లను కాపాడబోయి.. 10 మంది రెస్క్యూ సిబ్బంది గల్లంతు!

G: వరదల్లో చిక్కుకున్న జాలర్లను ప్రాణాలకు తెగించి కాపాడేందుకు వెళ్లిన రెస్క్యూ టీమ్‌కే ముప్పు వాటిల్లింది. ఖమ్మం జిల్లా సత్తుపల్లి మండలం బేతుపల్లి వద్ద అత్యంత విషాదకర సంఘటన వెలుగుచూసింది. చెరువులో చిక్కుకున్న మత్స్యకారులను కాపాడేందుకు రంగంలోకి దిగిన రెండు ఎస్‌డీఆర్‌ఎఫ్, అగ్నిమాపక శాఖ బోట్లు వరద నీటి ఉధృతికి కొట్టుకుపోయాయి. ఈ ప్రమాద సమయంలో ఆ రెండు బోట్లలో కలిపి మొత్తం 10 మంది సిబ్బంది ఉన్నట్లు సమాచారం అందడంతో తీవ్ర కలకలం రేగుతోంది.వివరాల్లోకి వెళ్తే.. బేతుపల్లి చెరువులో వరద నీరు ఒక్కసారిగా పెరిగిపోవడంతో ఐదుగురు జాలర్లు ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని నీటి మధ్యలోనే చిక్కుకుపోయారు. ఈ విషయం తెలుసుకున్న ఎస్‌డీఆర్‌ఎఫ్, ఫైర్ రెస్క్యూ సిబ్బంది వెంటనే రంగంలోకి దిగారు.

హైదరాబాద్‌లో వెయ్యి కోట్ల ల్యాండ్ స్కామ్- కాంగ్రెస్ ఎంపీ పై సంచలన ఆరోపణలుతెలంగాణSwechaa04 Nov 2026, 08:45 PM

హైదరాబాద్‌లో వెయ్యి కోట్ల ల్యాండ్ స్కామ్- కాంగ్రెస్ ఎంపీ పై సంచలన ఆరోపణలు

Land Grab: బీఆర్ఎస్ జనరల్ సెక్రటరీ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ కాంగ్రెస్ ఎంపీ బలరాం నాయక్ పై సంచలన ఆరోపణలు చేశారు. గచ్చిబౌలిలో గుడిసెలు వేసి.. ఎంపీ బలరాం నాయక్ వెయ్యి కోట్ల ల్యాండ్ స్కామ్ కు పాల్పడ్డారని ఆరోపించారు. ప్రభుత్వ భూములు కాపాడుతున్నామని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గొప్పలు చెప్పుకుంటున్నారు.. కానీ ఆయన పార్టీ ఎంపీ పోరిక బలరాం నాయక్, మంత్రి అడ్లూరి లక్ష్మణ్ హైదరాబాద్ నడి ఒడ్డున శేరిలింగంపల్లిలోని 4.13 ఎకరాల ఎస్సీలకు చెందిన భూమిని కబ్జా చేస్తున్నారని ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ మండిపడ్డారు.

భూమి విలువ వెయ్యి కోట్లు

ఈ ప్రభుత్వ భూమి విలువ అక్షరాలా 1000 కోట్లు ఉంటుందని ఆయన తెలిపారు. ఎట్టి పరిస్థితుల్లో రేవంత్ రెడ్డికి తెలియకుండా ఈ కబ్జా జరగదన్నారు. ఎందుకంటే హైడ్రా, రెవెన్యూ, మున్సిపాలిటీ, పోలీసు శాఖలన్నీ రేవంత్ దగ్గరే ఉన్నాయన్నారు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్.

TG: హైడ్రా రంగనాథ్ మార్క్ డీల్.. వాటర్ ట్యాంకర్ల సమ్మె క్లోజ్!తెలంగాణSwechaa04 Nov 2026, 08:41 PM

TG: హైడ్రా రంగనాథ్ మార్క్ డీల్.. వాటర్ ట్యాంకర్ల సమ్మె క్లోజ్!

TG: గ్రేటర్ హైదరాబాద్ వాసులను రెండు రోజులుగా ముచ్చెమటలు పట్టించిన వాటర్ ట్యాంకర్ల సమ్మెకు హైడ్రా కమిషనర్ ఏవీ రంగనాథ్ తనదైన మార్క్ వ్యూహంతో ఫుల్‌స్టాప్ పెట్టారు. బెట్టు వీడని ట్యాంకర్ల యజమానులతో నేరుగా చర్చలు జరిపి, అటు ప్రజలకు ఇబ్బంది కలగకుండా, ఇటు వాణిజ్య అవసరాలకు అంతరాయం లేకుండా ఆయన చూపించిన ప్రత్యామ్నాయ పరిష్కారం బాగా పనిచేసింది. కమిషనర్ ప్రతిపాదించిన మార్గానికి యజమానులు ఒప్పుకోవడంతో సమ్మె తక్షణమే ముగిసింది. నగరవ్యాప్తంగా నీటి సరఫరా పునరుద్ధరణకు గ్రీన్ సిగ్నల్ పడింది.హైదరాబాద్ జిల్లా ఇన్‌ఛార్జ్ మంత్రి పొన్నం ప్రభాకర్ సూచనలతో వాటర్ ట్యాంకర్ల సంఘం అధ్యక్షుడు చంద్రశేఖర్ నేతృత్వంలోని బృందం బుధవారం హైడ్రా కార్యాలయానికి చేరుకుంది. ఈ భేటీలో కమిషనర్ రంగనాథ్ అసలు వాస్తవాలను టేబుల్‌పై పెట్టి లెక్కలతో సహా నిలదీశారు.

US: ట్రంప్‌నకు ‘ఇండియన్ అమెరికన్ల’ బిగ్ షాక్.. డెమోక్రాట్ల వైపే ఏకపక్ష మొగ్గు!InternationalSwechaa04 Nov 2026, 08:33 PM

US: ట్రంప్‌నకు ‘ఇండియన్ అమెరికన్ల’ బిగ్ షాక్.. డెమోక్రాట్ల వైపే ఏకపక్ష మొగ్గు!

US: అమెరికా మధ్యంతర ఎన్నికల వేళ రిపబ్లికన్ పార్టీ అధినేత డొనాల్డ్ ట్రంప్‌నకు భారత సంతతి ఓటర్లు గట్టి షాక్ ఇచ్చారు. యూఎస్ రాజకీయాల్లో అత్యంత కీలకంగా మారిన ఇండియన్ అమెరికన్లు ఈసారి స్పష్టంగా డెమోక్రాట్ల వైపే నిలబడినట్లు తాజా లెక్కలు తేల్చాయి. ఎన్నికల వేళ యూగవ్‌తో కలిసి ప్రతిష్టాత్మక కార్నెగీ సంస్థ నిర్వహించిన ‘ఇండియన్ అమెరికన్ యాటిట్యూడ్స్ సర్వే’లో వెల్లడైన సంచలన విషయాలు ట్రంప్ శిబిరానికి మింగుడుపడటం లేదు.సర్వే వివరాల ప్రకారం.. భారతీయ అమెరికన్లలో ఏకంగా 62 శాతం మంది తమ కాంగ్రెషనల్ డిస్ట్రిక్ట్‌లలో డెమోక్రటిక్ పార్టీ అభ్యర్థులకే పట్టం కట్టేందుకు మొగ్గు చూపారు. ట్రంప్‌నకు, రిపబ్లికన్లకు మద్దతుగా నిలిచింది కేవలం 19 శాతం మంది మాత్రమే.

Hormuz: హర్మూజ్‌లో భారత నౌకలకు ఇరాన్ స్పెషల్ పర్మిషన్!NationalSwechaa04 Nov 2026, 07:39 PM

Hormuz: హర్మూజ్‌లో భారత నౌకలకు ఇరాన్ స్పెషల్ పర్మిషన్!

Hormuz: ప్రపంచ చమురు రవాణాలో కీలకమైన హర్మూజ్ జలసంధిలో భారత వాణిజ్య నౌకలకు ఇరాన్ ప్రభుత్వం భారీ ఊరట కల్పించింది. అంతర్జాతీయంగా తీవ్ర ఉద్రిక్తతలు నడుస్తున్న వేళ.. తమ మిత్రదేశాల నౌకలపై ఉన్న ఆంక్షలను ఎత్తేస్తూ కీలక నిర్ణయం తీసుకుంది. ఇకపై భారత్‌తో పాటు చైనా, ఇరాక్, ఖతార్ దేశాలకు చెందిన వాణిజ్య నౌకలు ఎలాంటి అడ్డంకులు లేకుండా హర్మూజ్ జలసంధి గుండా స్వేచ్ఛగా రాకపోకలు సాగించవచ్చని తేల్చి చెప్పింది.ఈ నిర్ణయంపై ఇరాన్ విదేశాంగ విధాన కమిటీ డిప్యూటీ ఛైర్మన్ అమీర్ హయత్ మాట్లాడుతూ సంచలన విషయాలు వెల్లడించారు. "ప్రస్తుతం హర్మూజ్‌లో విధించిన రవాణా ఆంక్షల నుంచి భారత్, చైనా, ఇరాక్, ఖతార్‌లకు పూర్తి మినహాయింపు ఇచ్చాం. ఇకపై ఈ దేశాల నౌకలు జలసంధిలో ఫ్రీగా ప్రయాణించవచ్చు.

RC 17: ఆర్సీ 17 కోసం రామ్ చరణ్ కి తగ్గ హీరోయిన్ దొరకడం లేదా?సినిమాSwechaa04 Nov 2026, 07:31 PM

RC 17: ఆర్సీ 17 కోసం రామ్ చరణ్ కి తగ్గ హీరోయిన్ దొరకడం లేదా?

RC 17: మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ హీరోగా క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ దర్శకత్వంలో తెరకెక్కనున్న సినిమాపై ఇప్పటికే భారీ అంచనాలు నెలకొన్నాయి. రంగస్థలం వంటి బ్లాక్‌బస్టర్ తర్వాత వీరిద్దరి కాంబినేషన్‌లో వస్తున్న సినిమా కావడంతో అభిమానుల్లో ఆసక్తి రెట్టింపైంది. అయితే, ఈ సినిమాకు సంబంధించి ఇప్పుడు హీరోయిన్ ఎంపిక ఆసక్తికరమైన చర్చలు జరుగుతున్నాయి. రామ్ చరణ్ పక్కన నటించే హీరోయిన్ ఎవరు?

Telangana Congress: దామోదర రాజనర్సింహ అంతర్మథనం వెనుక అసలు కథేంటి?తెలంగాణSwechaa04 Nov 2026, 07:11 PM

Telangana Congress: దామోదర రాజనర్సింహ అంతర్మథనం వెనుక అసలు కథేంటి?

Telangana Congress: తెలంగాణ కాంగ్రెస్‌లో నివురుగప్పిన నిప్పులాంటి అసంతృప్తి మరోసారి భగ్గుమంది. పార్టీలో అత్యంత సీనియర్ నేత, రాష్ట్ర ఆరోగ్య శాఖ మంత్రి దామోదర రాజనర్సింహ రీసెంట్‌గా చేసిన కామెంట్స్ ఇప్పుడు అధికార పార్టీలో గుబులు రేపుతున్నాయి. సాధారణంగా వివాదాలకు దూరంగా, కామ్‌గా తన పని తాను చేసుకుపోయే ఈ సీనియర్ నేత నోటి నుంచి "రాజకీయాల్లో నమ్మకంతో నడిచే రోజులు పోయాయి.. పదవులు ఎవరికీ శాశ్వతం కాదు" అనే మాటలు రావడం వెనుక ఏదో బలమైన కారణమే ఉందన్న చర్చ జోరుగా నడుస్తోంది. మీడియాతో చిట్‌చాట్‌లో ఆయన వెళ్లగక్కిన ఈ ఆవేదన ఎవరిని ఉద్దేశించి? సొంత పార్టీ నేతల వ్యవహారశైలే ఆయన్ను ఇంతలా బాధించిందా? అసలేం జరిగింది.

అన్ని కార్పొరేషన్లలో ఇందిరమ్మ టవర్లు- మంత్రి పొంగులేటితెలంగాణSwechaa04 Nov 2026, 06:56 PM

అన్ని కార్పొరేషన్లలో ఇందిరమ్మ టవర్లు- మంత్రి పొంగులేటి

Indiramma Towers: ఇందిరమ్మ ఇళ్లకు సంబంధించి తెలంగాణ ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. హైదరాబాద్ తరహాలోనే కార్పొరేషన్లుగా ఉన్న పట్టణాల్లోనూ అల్పాదాయ కుటుంబాలకు G+5 ఇందిరమ్మ టవర్లు నిర్మిస్తామని రాష్ట్ర గృహ నిర్మాణ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస రెడ్డి తెలిపారు. తొలి విడతలో నాలుగు నగరాల్లో ఇందిరమ్మ టవర్లు నిర్మించనున్నట్లు ఆయన వెల్లడించారు.

నిజామాబాద్, వరంగల్, నల్గొండ, కరీంనగర్ కార్పొరేషన్ల పరిధిలో ఇందిరమ్మ టవర్ల నిర్మాణం చేపడతామన్నారు. ఇందుకు సంబంధించి రెండు మూడు రోజుల్లో నోటిఫికేషన్ ఇస్తామన్నారు. మేడ్చల్ జిల్లా కలెక్టర్ కార్యాలయంలో ఉమ్మడి రంగారెడ్డి జిల్లా ప్రజా ప్రతినిధులతో మంత్రులు శ్రీధర్ బాబు, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి సమీక్ష జరిపారు. ఇక, రాష్ట్రవ్యాప్తంగా గృహ ప్రవేశాలు జరిగిన ఇందిరమ్మ ఇళ్లలో 'మా ఇందిరమ్మ ఇంట్లో దీపావళి' కాన్సెప్ట్‌తో దీపావళి వేడుకలు జరపాలని మంత్రి పొంగులేటి పిలుపునిచ్చారు.

Bloody Romeo: బ్లడీ రోమియోతో నాని హిట్ కొట్టాలిందే!సినిమాSwechaa04 Nov 2026, 06:39 PM

Bloody Romeo: బ్లడీ రోమియోతో నాని హిట్ కొట్టాలిందే!

నాని కెరీర్‌లో ఎన్నో బ్లాక్ బస్టర్స్ ఉన్నాయి. అయితే ప్రతి సినిమాతోనూ తన మార్కెట్‌ను మరింత పెంచుకోవాలంటే సరైన కథలను ఎంచుకోవడం చాలా ముఖ్యం. బ్లడీ రోమియో విషయంలో నాని, సుజీత్ ఇద్దరూ కొత్త ప్రయత్నం చేస్తున్నారు. ముఖ్యంగా, అభిమానులు కోరుకునేది ఒక్కటే. ఈ మధ్య సరైన హిట్ లేదు గనక నాని నుంచి సాలీడ్ హిట్ రావాలి. అది కూడా థియేటర్లలో ప్రేక్షకులను కట్టిపడేసే సినిమా కావాలి. బ్లడీ రోమియోతో నాని తన సక్సెస్ ట్రాక్‌లోకి తిరిగి వస్తారా? సుజీత్ తన స్టైలిష్ టేకింగ్‌తో నానికి బ్లాక్‌బస్టర్ అందిస్తారా? అనేది ఆసక్తికరంగా మారింది.

US Elections: ఈసీ లేని అమెరికా ఎన్నికలు.. ఇండియా మోడల్ వైపు ట్రంప్ చూపు!NationalSwechaa04 Nov 2026, 06:10 PM

US Elections: ఈసీ లేని అమెరికా ఎన్నికలు.. ఇండియా మోడల్ వైపు ట్రంప్ చూపు!

US Elections: ప్రపంచంలోనే అతిపెద్ద ప్రజాస్వామ్యం మన భారతదేశం అయితే, అత్యంత పురాతన ప్రజాస్వామ్యం అమెరికా. కానీ ఈ రెండు దేశాల్లో ఎన్నికలు జరిగే తీరు చూస్తే మాత్రం నక్కకి నాగలోకానికి ఉన్నంత తేడా కనిపిస్తుంది. మన దేశంలో కాశ్మీర్ నుంచి కన్యాకుమారి దాకా ఎన్నికలు జరగాలంటే ఒకటే కేంద్ర ఎన్నికల సంఘం (ఈసీ) ఉంటుంది. వాళ్లు గీసిన గీతే రూల్. ఓటర్ లిస్ట్ దగ్గరి నుంచి పోలింగ్, కౌంటింగ్, రిజల్ట్స్ దాకా అంతా ఒకే పద్ధతిలో నడుస్తుంది. కానీ అగ్రరాజ్యం అమెరికాలో అసలు కేంద్ర స్థాయిలో ఎన్నికల సంఘం అనే మాటే ఉండదు. అక్కడ మొత్తం 50 రాష్ట్రాలుంటే.. 50 రకాల చట్టాలు, 50 రకాల రూల్స్ నడుస్తాయి. ప్రెసిడెంట్ ఎన్నికలైనా సరే, ఆయా రాష్ట్రాలే తమకు నచ్చినట్లు ఓటింగ్ పెట్టుకుంటాయి. ఈ మొత్తం తలనొప్పిని చూసి మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్.. "మాకు కూడా ఇండియా లాంటి సెంట్రలైజ్డ్ ఎలక్షన్ సిస్టమ్ కావాలి" అంటూ పట్టుబడుతుండటంతో ఇప్పుడు అమెరికాలో పెద్ద రచ్చ మొదలైంది.

రాష్ట్రవ్యాప్తంగా ‘మా ఇందిరమ్మ ఇంట్లో దీపావళి’ వేడుకలుతెలంగాణSwechaa04 Nov 2026, 05:42 PM

రాష్ట్రవ్యాప్తంగా ‘మా ఇందిరమ్మ ఇంట్లో దీపావళి’ వేడుకలు

ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వంలో ప్రజా ప్రభుత్వం ఎన్ని ఆర్థిక అవరోధాలు ఎదురైనా పేదల ఆత్మగౌరవానికి చిహ్నమైన ఇందిరమ్మ ఇళ్లను నిర్మించాలన్న సంకల్పంతో తొలి విడతలో 4.50 లక్షల ఇళ్లను మంజూరు చేసిందని రాష్ట్ర గృహ నిర్మాణ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస రెడ్డి తెలిపారు. ఇప్పటివరకు 2,21,500 ఇళ్లలో గృహప్రవేశాలు పూర్తయ్యాయని, మరో 1.90 లక్షల ఇళ్లు వివిధ నిర్మాణ దశల్లో ఉన్నాయని వెల్లడించారు. ఈ దీపావళి పండుగను పురస్కరించుకుని ముఖ్యమంత్రి సూచన మేరకు ‘మా ఇందిరమ్మ ఇంట్లో దీపావళి’ కార్యక్రమాన్ని నిర్వహించాలని నిర్ణయించామన్నారు.

AP Cyclones: డబుల్ సైక్లోన్ దెబ్బకు ఏపీ విలవిల.. 'అర్ణబ్' అతలాకులం.. ముంచేసిన 'మురుసు'ఏపీSwechaa04 Nov 2026, 04:35 PM

AP Cyclones: డబుల్ సైక్లోన్ దెబ్బకు ఏపీ విలవిల.. 'అర్ణబ్' అతలాకులం.. ముంచేసిన 'మురుసు'

AP Cyclones: తీర ప్రాంత ప్రజలు ఒక గండం గడిచిందని ఊపిరి పీల్చుకునే లోపే మరో పెను ముప్పు వచ్చి పడింది. మొన్నటికి మొన్న 'అర్నబ్' తుఫాను సృష్టించిన బీభత్సం నుంచి కోలుకోకముందే.. ఇప్పుడు 'మురుసు' రూపంలో ఇంకో తుఫాను విరుచుకుపడింది. ఇలా ఒకదాని వెంట ఒకటి రోజుల వ్యవధిలోనే రెండు తుఫాన్లు దాడి చేయడంతో కోస్తాంధ్ర అల్లాడిపోతోంది. అటు అన్నదాతల కష్టాలు, ఇటు ప్రభుత్వ ఖజానా పరిస్థితి.. రెండూ అగమ్యగోచరంగా మారాయి.అర్నబ్ తుఫాను కారణంగానే దాదాపు 4,563 కోట్ల రూపాయల నష్టం జరిగిందని ప్రాథమికంగా లెక్క తేల్చారు. ఆ దెబ్బ నుంచి ఇంకా తేరుకోకముందే మురుసు తుఫాను ఒంగోలు దగ్గర తీరం దాటింది. 100 నుంచి 120 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు, దంచికొట్టిన వానలతో జనం వణికిపోయారు. గుంటూరు, బాపట్ల, పొన్నూరు ప్రాంతాల్లో కుండపోత వానలు పడ్డాయి.

Naga Vamshi: ‘ఓం: చాప్టర్ 1’ తో మళ్ళీ సితార లాభాల్లోకి వచ్చేనా?సినిమాSwechaa04 Nov 2026, 04:22 PM

Naga Vamshi: ‘ఓం: చాప్టర్ 1’ తో మళ్ళీ సితార లాభాల్లోకి వచ్చేనా?

Naga Vamshi: కోలీవుడ్ స్టార్ హీరో ధనుష్ నటిస్తున్న మరో ప్రతిష్టాత్మక చిత్రం ‘ఓం: చాప్టర్ 1’పై టాలీవుడ్‌లోనూ అంచనాలు బాగానే ఉన్నాయి. దీంతో, ఈ సినిమా తెలుగు రాష్ట్రాల పంపిణీ హక్కులను ప్రముఖ నిర్మాణ సంస్థ సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ సొంతం చేసుకుంది. ఈ నేపథ్యంలోనే తెలుగులో కూడా ‘ఓం: చాప్టర్ 1’ సినిమాను భారీ స్థాయిలో విడుదల చేసేందుకు మేకర్స్ ప్లాన్ చేసుకుంటున్నారు.

ఆదిలాబాద్‌ రిమ్స్‌లో పట్టపగలే చోరీ.. రూ.30లక్షల విలువైన వెంటిలేటర్లు అపహరణక్రైమ్Swechaa04 Nov 2026, 03:58 PM

ఆదిలాబాద్‌ రిమ్స్‌లో పట్టపగలే చోరీ.. రూ.30లక్షల విలువైన వెంటిలేటర్లు అపహరణ

RIMS: ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలోని రిమ్స్ హాస్పిటల్ లో చోరీ జరిగింది. పట్టపగలే దుండగులు బరితెగించారు. వెంటిలేటర్లు ఎత్తుకెళ్లారు. రోగులకు అత్యవసర పరిస్థితుల్లో ఉపయోగించే 4 వెంటిలేటర్స్ ను ఇద్దరు వ్యక్తులు ఎత్తుకెళ్లిపోయారు. ఈ వెంటిటేర్ల విలువ 30లక్షల రూపాయలు ఉంటుంది. గత నెల 30న రిమ్స్ రెండో అంతస్తులోని RICU విభాగంలో ఈ ఘటన జరిగింది. ఇద్దరు వ్యక్తులు నాలుగు వెంటిలేటర్స్ ని సంచిలో పెట్టుకొని దర్జాగా తీసుకెళ్తున్న దృశ్యాలు సీసీ కెమెరాలో రికార్డ్ అయ్యాయి. ఈ చోరీ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. దీనిపై రిమ్స్ డైరెక్టర్ పోలీసులకు ఫిర్యాదు చేశారు.

Shraddha Kapoor: స్త్రీ 2 తర్వాత శ్రద్దా కపూర్ సినిమాల ఎంపికలో చాలా మార్పులు..సినిమాSwechaa04 Nov 2026, 03:38 PM

Shraddha Kapoor: స్త్రీ 2 తర్వాత శ్రద్దా కపూర్ సినిమాల ఎంపికలో చాలా మార్పులు..

Shraddha Kapoor: ఆషికీ 2తో అటు బాలీవుడ్ ఇటు సౌత్‌లో బాగా గుర్తింపు తెచ్చుకుంది శ్రద్ధా కపూర్. ఆ గుర్తింపుతోనే తెలుగులో సాహో లాంటి పాన్ ఇండియా సినిమాతో ఎంట్రీ ఇచ్చింది. ఈ సినిమా ఫలితం ఎలా ఉన్నా..మనవాళ్ళకి మాత్రం బాగానే నచ్చింది. కానీ, ఇక్కడున్న సక్సెస్ సెంటిమెంట్ వల్ల మళ్ళీ టాలీవుడ్ నుంచి అవకాశాలను అందుకోలేకపోయింది. అంతేకాదు, స్త్రీ 2 లాంటి భారీ హిట్ తర్వాత కెరీర్‌ను చాలా జాగ్రత్తగా ప్లాన్ చేసుకుంటోంది శ్రద్ధా.

AP Municipal Elections: విటమిన్ 'ఎం' దెబ్బకు ఫ్యాన్ గిలగిలా!ఏపీSwechaa04 Nov 2026, 03:06 PM

AP Municipal Elections: విటమిన్ 'ఎం' దెబ్బకు ఫ్యాన్ గిలగిలా!

మున్సిపల్ ఎన్నికల నగారా మోగినప్పుడు తాడేపల్లి ప్యాలెస్ నుంచి ఒక్కటే హుకుం జారీ అయింది. "కూటమికి ఒక్క సీటు కూడా ఏకగ్రీవం కావడానికి వీల్లేదు.. ఎవడైనా ఏకగ్రీవం చేస్తే వచ్చే అసెంబ్లీలో టికెట్ ఇచ్చే ప్రసక్తే లేదు" అని పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి తన నియోజకవర్గ ఇంచార్జీలకు తేల్చి చెప్పారు. కానీ రిజల్ట్స్ వచ్చాక చూస్తే.. ఏకంగా 25 మున్సిపాలిటీలు కూటమి ఖాతాలోకి వెళ్లిపోయాయి. జగన్ అంత సీరియస్ వార్నింగ్ ఇచ్చినా క్షేత్రస్థాయిలో లీడర్లు ఎందుకు సైలెంట్ అయిపోయారు? కార్యకర్తలు కొట్లాడటానికి సిద్ధంగా ఉన్నా, సేనాపతులే ఎందుకు కాడి పారేశారు? దీని వెనుక ఉన్న అసలు మతలబు రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్‌గా మారిన ‘విటమిన్ ఎం’ (డబ్బు) పంచాయితీనే కారణం అనే వాదనలు బలంగా వినిపిస్తున్నాయి.

రేపే ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికలు.. కానీ!ఏపీSwechaa04 Nov 2026, 02:38 PM

రేపే ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికలు.. కానీ!

ఆంధ్రప్రదేశ్‌లో ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికలు నిర్వహించేందుకు రాష్ట్ర ఎన్నికల సంఘం సిద్దమైంది. ముందస్తు షెడ్యూల్ ప్రకారం రేపు (గురువారం) పోలింగ్ జరగనుంది. రాష్ట్రంలో మురసు తుపాను నేపథ్యంలో ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికల నిర్వహణపై ఎస్ఈసీ అనిల్ చంద్ర పునేఠా జిల్లా కలెక్టర్లతో బుధవారం వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. వర్షాలు, తుపాను ప్రభావిత ప్రాంతాల్లో తాజా పరిస్థితులపై ఆరా తీశారు. తుపాన్ తీరం దాటడంతో చాలా చోట్ల వర్షాలు తగ్గాయని జిల్లా కలెక్టర్లు వివరించడంతో ఎన్నికల నిర్వహణకు ఎస్‌ఈసీ సిద్ధమయ్యారు.వర్షప్రభావం ఇంకా కొన్ని మండలాల్లో ఉన్నందున అవి మినహా మిగిలిన చోట్ల పోలింగ్ నిర్వహించేందుకు రెడీగా ఉండాలని ఆదేశించారు.

దామోదర, కాంతారావు ఎపిసోడ్‌పై టీపీసీసీ ఆగ్రహం!రాజకీయాలుSwechaa04 Nov 2026, 02:08 PM

దామోదర, కాంతారావు ఎపిసోడ్‌పై టీపీసీసీ ఆగ్రహం!

కాంగ్రెస్ పార్టీలో నేతల మధ్య అంతర్గత కుమ్ములాటలు ఇటీవలి కాలంలో కామన్ అయిపోయాయి. పదవులు దక్కలేదని కొందరు లాబీయింగ్ చేస్తుండగా.. మరికొందరు నేరుగా పార్టీ పెద్దలపై తీవ్ర విమర్శలు గుప్పిస్తున్నారు.అది కాస్త అధిష్టానం పెద్దలకు తీవ్ర తలనొప్పిగా మారింది. రెండ్రోజుల కిందట మంత్రి దామోదర రాజనర్సింహ, ఎమ్మెల్యే లక్ష్మి కాంతారావు మధ్య మాటల యుద్ధం జరిగింది. ఈ క్రమంలోనే మంత్రి దామోదర.. ఎమ్మెల్యే కాంతారావును దూషించినట్టు తెలిసింది.తాజాగా ఈ ఎపిసోడ్‌పై టీపీసీసీ ఆగ్రహం వ్యక్తం చేసినట్టు తెలిసింది. నేతల మధ్య ఫైటింగ్ విషయం జనాల్లోకి వెళితే వచ్చే ఎన్నికల్లో పార్టీకి నష్టం జరుగుతుందని భావించిన అధిష్టానం నష్టనివారణ చర్యలకు సిద్ధమైనట్లు తెలుస్తోంది. ఇందులో భాగంగా రేపు(గురువారం) గాంధీ భవన్ కు రావాల్సిందిగా మంత్రి దామోదర రాజనర్సింహా, ఎమ్మెల్యే లక్ష్మీ కాంత రావ్‍కు టీపీసీసీ చీఫ్ మహేశ్ కుమార్ గౌడ్ సూచించారు.