స్వేచ్ఛ షార్ట్స్ — తాజా తెలుగు వార్తలు

ఒక్క ఇంచు కొన్నా వదిలిపెట్టం.. వెనక్కి తీసుకుంటాం-పారిశ్రామికవేత్తలకు కేటీఆర్ వార్నింగ్తెలంగాణSwechaa04 Nov 2026, 01:30 PM

ఒక్క ఇంచు కొన్నా వదిలిపెట్టం.. వెనక్కి తీసుకుంటాం-పారిశ్రామికవేత్తలకు కేటీఆర్ వార్నింగ్

బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మరోసారి కాంగ్రెస్ ప్రభుత్వం పాలన తీరు, సీఎం రేవంత్ రెడ్డి మీద తీవ్ర విమర్శలు గుప్పించారు. రేవంత్ పాలనలో అమ్ముకోవడమే తప్పా రాష్ట్రానికి ఒరిగిన ప్రయోజనం ఏమీ లేదని పరోక్షంగా సెటైర్లు వేశారు. బుధవారం ఉదయం శేరిలింగంపల్లి నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీ నుంచి పలువురు నేతలు బీఆర్ఎస్ పార్టీ కండువా కప్పుకున్నారు. హైదర్‌నగర్ డివిజన్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు దామోదర్ రెడ్డి, మరికొంతమంది నేతలు కారు ఎక్కగా.. వారికి గులాబీ కండువా కప్పి కేటీఆర్ పార్టీలోకి ఆహ్వానించారు.ఈ సందర్భంగా కేటీఆర్ రేవంత్ ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు చేశారు. ‘అడవులు నరికే వీరప్పన్‌ను అటవీశాఖ మంత్రిని చేస్తే ఎలా ఉంటదో.. భూములు అమ్మే బ్రోకర్ రేవంత్ రెడ్డిని సీఎం చేస్తే అలానే ఉంది’ అంటూ ఎద్దేవాచేశారు. ఎందుకంటే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రస్తుతం రాష్ట్రంలో ఇష్టానుసారంగా ప్రభుత్వ భూములను అమ్ముతున్నారని గుర్తుచేశారు.

ఏపీపీఎస్సీ గ్రూప్-1  మూల్యాంకనం కేసు.. ఈడీ ఆకస్మిక సోదాలుఏపీSwechaa04 Nov 2026, 01:09 PM

ఏపీపీఎస్సీ గ్రూప్-1 మూల్యాంకనం కేసు.. ఈడీ ఆకస్మిక సోదాలు

ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (APPSC) గ్రూప్-1 పరీక్షల మూల్యాంకనంలో చోటుచేసుకున్న అక్రమాల కేసులో ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ED) అధికారులు ఆకస్మిక సోదాలు చేపట్టారు. బుధవారం ఉదయం తెలంగాణ, ఏపీలోని మొత్తం ఏడు ప్రాంతాల్లో సోదాలు చేపట్టారు. గత వైసీపీ ప్రభుత్వ హయాంలో జరిగిన గ్రూప్-1 మూల్యాంకన వ్యవహారంపై మనీలాండరింగ్ ఏమైనా జరిగిందా? అన్నకోణంలో ఈడీ అధికారులు దర్యాప్తును ముమ్మరం చేశారు.హైదరాబాద్ పరిధిలోని కాశీమ్ బౌలిలో ఏపీపీఎస్సీ మాజీ కార్యదర్శి, ఈ కేసులో ప్రధాన నిందితుడిగా ఆరోపణలు ఎదుర్కొంటున్న పీఎస్‌ఆర్ ఆంజనేయులు నివాసంలో అధికారులు సోదాలు జరుపుతున్నారు. నగరంలోని పంచవటి కాలనీ, పంజాగుట్ట, నేరేడ్‌మెట్ ప్రాంతాల్లోనూ తనిఖీలు చేస్తున్నారు. సికింద్రాబాద్‌లోని ట్రూ గ్రేడర్ సంస్థతో పాటు అల్వాల్‌లోని వెంకటాపురంలోనూ ఈడీ అధికారులు సోదాలు చేపడుతున్నారు. ఏపీలోని మంగళగిరి సమీపంలోని హాయ్‌ల్యాండ్‌లో ఉన్న ఆవాస రిసార్ట్‌లోనూ తనిఖీలు చేపట్టినట్టు తెలుస్తోంది.

Tollywood: పాన్ ఇండియా కథ @ విజయేంద్రప్రసాద్సినిమాSwechaa04 Nov 2026, 12:56 PM

Tollywood: పాన్ ఇండియా కథ @ విజయేంద్రప్రసాద్

Tollywood: ఇప్పుడు మనకున్న గొప్ప రచయితల్లో విజయేంద్రప్రసాద్ గురించి ఎంతో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం ఎంతైనా ఉంది. సినిమాకి కథలు రాయడం ఒక ఎత్తయితే.. ప్రేక్షకుల ఊహకు అందని విధంగా ఆ కథను నడిపించడం మరో ఎత్తు. ఈ విషయంలో ప్రముఖ రచయిత కె. విజయేంద్ర ప్రసాద్ కి ప్రత్యేకమైన శైలి ఉంది. ఆయన నుంచి వచ్చిన కథలు కేవలం వినోదాన్ని మాత్రమే అందించకుండా.. ప్రేక్షకులను మరో ప్రపంచంలోకి తీసుకెళ్తాయి.

Kollywood: రజినీ-కమల్ సినిమాలో డాన్సింగ్ క్వీన్..సినిమాSwechaa04 Nov 2026, 12:32 PM

Kollywood: రజినీ-కమల్ సినిమాలో డాన్సింగ్ క్వీన్..

Kollywood: టాలీవుడ్ యంగ్ సెన్సేషన్, డాన్సింగ్ క్వీన్ శ్రీలీలకు మరో గొప్ప అవకాశం దక్కింది. సూపర్ స్టార్ రజినీకాంత్ హీరోగా, లోకనాయకుడు కమల్ హాసన్ నిర్మాణంలో తెరకెక్కుతున్న భారీ చిత్రంలో శ్రీలీల ప్రధాన పాత్రను పోషించనుంది. ఇప్పటికే, ఈ సినిమాపై భారీ అంచనాలు ఉండగా.. తాజాగా శ్రీలీల ఎంట్రీతో ప్రాజెక్ట్‌పై మరింత ఆసక్తి పెరిగింది. మేకర్స్ ప్రత్యేక గ్లింప్స్ విడుదల చేసి శ్రీలీల నటిస్తున్న విషయాన్ని అధికారికంగా ప్రకటించారు.

Nonveg : భారీగా పెరగనున్న చికెన్ ధరలు!టాప్ న్యూస్Swechaa04 Nov 2026, 12:15 PM

Nonveg : భారీగా పెరగనున్న చికెన్ ధరలు!

త్వరలోనే చికెన్ ధరలు భారీగా పెరగనున్నట్టు తెలుస్తోంది. నెల కిందట కిలో చికెన్ రూ.240 నుంచి 260 మధ్యలో ఉండేది. అయితే, అది కాస్త ప్రస్తుతం కేజీ రూ.280 నుంచి 300లకు పైగా పలుకుతోంది. అయితే, మున్ముందు మరింత ధరలు పెరిగే చాన్స్ ఉందని సమాచారం. అందుకు కారణంగా కోళ్లకు వేసే దాణా ధరలు ప్రియం కావడమే అని పౌల్ట్రీవర్గాలు వెల్లడించాయి.ఈ ఏడాది దాణా ధరలు పెరగడంతో కోళ్ల ఉత్పత్తి వ్యయం పెరిగిందని తెలుస్తోంది.ఈ క్రమంలోనే కోళ్ల పెంపకం నుంచి మార్కెటింగ్‌ వరకు ఎదురయ్యే సమస్యలకు పరిష్కారం చూపేందుకు దేశవ్యాప్తంగా ఉన్న పౌల్ట్రీ సంఘాలు ఒక్కతాటిపైకి వచ్చాయి. చికెన్‌ ధరల్లో హెచ్చుతగ్గులు, దాణా ధరలు పెరగడంతో పౌల్ట్రీ పరిశ్రమపై తీవ్ర ఒత్తిడి ఏర్పడుతోంది. ఈ క్రమంలోనే ధరల స్థిరీకరణకు పౌల్ట్రీ సంఘాలు కార్యాచరణ చేపట్టాయి.ఇందులో భాగంగానే లైవ్‌ చికెన్‌ కిలోకు కనీసం రూ.110 ధరను ప్రామాణికంగా నిర్ణయించాలని ఒక నిర్ణయానికి వచ్చినట్టు తెలుస్తోంది.

US హౌస్ డెమొక్రాట్ల చేతికి! ట్రంప్ కి షాక్.. వీటో పేరుతో ప్రెసిడెంట్ వార్నింగ్!InternationalSwechaa04 Nov 2026, 11:59 AM

US హౌస్ డెమొక్రాట్ల చేతికి! ట్రంప్ కి షాక్.. వీటో పేరుతో ప్రెసిడెంట్ వార్నింగ్!

అమెరికా రాజకీయాల్లో కీలక మలుపు. అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌కు రాజకీయ సవాల్ ఎదురైంది. ప్రతినిధుల సభ డెమొక్రాట్ల చేతుల్లోకి వెళ్లడంతో వాషింగ్టన్‌లో సమీకరణాలు మారిపోయాయి. ఐతే తన వద్ద వీటో ఉంది కదా అంటున్నారు ట్రంప్.

కామారెడ్డి మెడికల్ కాలేజీలో ర్యాగింగ్.. 14 మంది సస్పెన్షన్తెలంగాణSwechaa04 Nov 2026, 11:58 AM

కామారెడ్డి మెడికల్ కాలేజీలో ర్యాగింగ్.. 14 మంది సస్పెన్షన్

విద్యా సంస్థల్లో ర్యాగింగ్ భూతాన్ని నియంత్రించడానికి ప్రభుత్వం, విద్యాశాఖ అధికారులు ఎన్ని చర్యలు చేపట్టినా మళ్లీ ఏదో ఒక చోట వెలుగుచూస్తునే ఉంది.జూనియర్ విద్యార్థులను సీనియర్లు ర్యాగింగ్ చేయడం వలన గతంలో పలువురు బలవన్మరణాలకు పాల్పడిన విషయం తెలిసిందే. తెలుగు రాష్ట్రాల్లో చాలా ఘటనలు చోటుచేసుకున్నాయి. ఇటీవలి కాలంలో ర్యాగింగ్ ఘటనలు చాలా అరుదు. తగ్గుముఖం పట్టాయని భావిస్తున్న వేళ తాజాగా కామారెడ్డి మెడికల్ కాలేజీలో ర్యాగింగ్ ఘటన కలకలం రేపింది.కామారెడ్డి మెడికల్ కాలేజీలో తాజాగా ర్యాగింగ్ కలకలం రేపింది. కొందరు సీనియర్లు జూనియర్ విద్యార్థులను ర్యాగింగ్ పేరిట వేధించినట్టు సమాచారం.వారిని ఇబ్బందులకు గురిచేయడంతో పాటు బెదిరింపులకు దిగినట్టు తెలుస్తోంది. ఈ క్రమంలోనే 14 మంది సీనియర్లపై కాలేజ్ మేనెజ్మెంట్ చర్యలకు ఉపక్రమించింది. జూనియర్ విద్యార్థులను వేధించిన 14 మంది సీనియర్లను సస్పెండ్ చేస్తూ కాలేజీ అధికారులు చర్యలు తీసుకున్నారు.

యూట్యూబ్‌లో చూసి నకిలీ కరెన్సీ ముద్రణ.. 6.78 కోట్లు సీజ్క్రైమ్Swechaa04 Nov 2026, 11:02 AM

యూట్యూబ్‌లో చూసి నకిలీ కరెన్సీ ముద్రణ.. 6.78 కోట్లు సీజ్

హైదరాబాద్ మహానగరంలో మరో ఘరానా మోసగాళ్ల ముఠాను పోలీసులు పట్టుకున్నారు. ఫేక్ కరెన్సీని సొంతంగా ముద్రించి చెలామణి చేసేందుకు సదరు నిందితులు స్కెచ్ వేసినట్టు తెలిసింది. అందుకోసం ఏకంగా యూట్యూబ్‌లో చూసి దొంగనోట్లు ఎలా ముద్రించాలో నైపుణ్యం పొందినట్టు సమాచారం. అందుకోసం ముద్రణ సామగ్రిని సైతం సమకూర్చుకుని భారీ ఎత్తున ఫేక్ కరెన్సీని ముద్రించినట్టు తెలిసింది.విశ్వసనీయ సమాచారం అందుకున్న పోలీసులు నిందితుల ముఠాను అదుపులోకి తీసుకున్నారు. వివరాల్లోకివెళితే.. రంగారెడ్డి జిల్లా అబ్దుల్లాపూర్‌మెట్ మండలంలోని కుంట్లూరు కేంద్రంగా కొందరు అక్రమార్కులు నకిలీ నోట్లను తయారీ చేసి మార్కెట్లో చెలామణికి వ్యూహ రచన చేశారు. యూట్యూబ్‌లో వీడియోలు చూసి రూ.6.78 కోట్ల నకిలీ నోట్లను తయారు చేశారు.రామోజీ ఫిల్మ్‌సిటీ సమీపంలో కారులో వెళ్తుండగా పోలీసుల తనిఖీలు నిర్వహిస్తుండగా.. రూ.8 లక్షల నకిలీ నోట్లు స్వాధీనం చేసుకున్నారు. ఈ ఘటనలో నలుగురు నిందితులను ఫ్యూచర్ సిటీ కమిషనరేట్ పోలీసులు అరెస్ట్ చేసి విచారించారు.

Tollywood: కింగ్ 100 నుంచి టబు పాత్ర రివీల్.. అదిరిపోయిన గ్లింప్స్!సినిమాSwechaa04 Nov 2026, 10:48 AM

Tollywood: కింగ్ 100 నుంచి టబు పాత్ర రివీల్.. అదిరిపోయిన గ్లింప్స్!

Tollywood: అక్కినేని నాగార్జున కెరీర్‌లో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కుతున్న 100వ సినిమా కింగ్ 100 నుంచి మరో క్రేజీ అప్‌డేట్ వచ్చేసింది. ప్రాజెక్ట్ మొదలైనప్పటి నుంచి సస్పెన్స్‌గా ఉంచిన టబు పాత్రకు సంబంధించిన స్పెషల్ గ్లింప్స్‌ను మేకర్స్ తాజాగా విడుదల చేశారు. ఈ గ్లింప్స్‌తో సినిమాపై అంచనాలు మరింత పెరిగాయి. ముఖ్యంగా నాగార్జున, టబు కాంబినేషన్ మరోసారి తెరపైకి రావడం అభిమానుల్లో ప్రత్యేక ఆసక్తిని కలిగిస్తోంది.

చిల్లర చిచ్చు.. చికిత్స పొందుతూ మహిళ కండక్టర్ మృతితెలంగాణSwechaa04 Nov 2026, 10:36 AM

చిల్లర చిచ్చు.. చికిత్స పొందుతూ మహిళ కండక్టర్ మృతి

ఆర్టీసీ బస్సులో చిల్లర పంచాయితీ కాస్త ఓ మహిళ ఉద్యోగి ప్రాణం మీదకు తెచ్చిన విషయం తెలిసిందే.గత వారం కింద చోటుచేసుకున్న ఈ ఘటనలో తీవ్రంగా గాయపడిన సదరు మహిళా ఉద్యోగి ఆస్పత్రిలో చికిత్స పొందుతూ ప్రాణాలతో పోరాడి చివరకు కన్నుమూసింది. ఈ ఘటనతో ఆర్టీసీ సంఘాలు ఒక్కసారిగా భగ్గుమన్నాయి. ఇవాళ ఉమ్మడి ఖమ్మం జిల్లా వ్యాప్తంగా ఆర్టీసీ బస్సుల బంద్‌కు పిలుపునిచ్చాయి.వివరాల్లోకివెళితే.. ఆర్టీసీ బస్సు ఎక్కిన ఓ ప్రయాణికురాలితో మహిళ కండక్టర్‌కు చిల్లర వివాదం తలెత్తింది. ఈ సమయంలో ఇద్దరి మధ్య వాగ్వాదం చోటుచేసుకుంది. ఈ క్రమంలోనే సదరు ప్రయాణికురాలు నెట్టేయడంతో మహిళా కండక్టర్ ప్రవళిక రోడ్డుపై పడిపోయింది. అదే సమయంలో బస్సు వెనుక టైర్లు ఆమె కాళ్ల మీద నుంచి వెళ్లాయి. గత నెల 25న మణుగూరు – భద్రాచలం మార్గంలో అశ్వాపురం మండలం మిట్టగూడెం స్టాప్ వద్ద ఈ ప్రమాదం చోటుచేసుకుంది.

Today panchamgam November -4th : ఆశ్వయుజ మాసం - బహుళ పక్షం (శుభసమయం వేళలు)Communal IssuesSwechaa04 Nov 2026, 09:21 AM

Today panchamgam November -4th : ఆశ్వయుజ మాసం - బహుళ పక్షం (శుభసమయం వేళలు)

నవంబర్ 4వ తేదీన పంచాంగం తిథి, శుభ సమయం వేళలు.. స్వస్తి శ్రీ పరాభవ నామ సంవత్సరం -దక్షిణాయనం - శరదృతువు ఆశ్వయుజ మాసం - బహుళ పక్షం ఎవరికి కలిసి వస్తుంది? ఎవరికి కలిసి రాదు.. ఏ సమయం బాగుంది.. ఈ వివరాలు మీకోసమే..

🌷 సౌమ్యవారం🌷 04నవంబర్26

స్వస్తి శ్రీ పరాభవ నామ సంవత్సరం

దక్షిణాయనం - శరదృతువు

ఆశ్వయుజ మాసం - బహుళ పక్షం

తిథి : దశమి ఉ 11.03 వరకు ఉపరి ఏకాదశి

వారం : బుధవారం

నక్షత్రం  : పుబ్బ రా 03.30 వరకు ఉపరి ఉత్తరఫల్గుణి ( ఉత్తర )

సాధారణ శుభ సమయాలు :

ఉ 09.00 - 10.00 సా 04.00 - 05.00

అమృత కాలం  : రా 09.05 - 10.41

వర్జ్యం   : ఉ 11.27 - 01.04

దుర్ముహూర్తం : ఉ 11.28 - 12.14

రాహు కాలం   : ఉ 11.51 - 01.17

యమగండం    : ఉ 07.32 - 08.58

సూర్యోదయం : ఉ 06.16

సూర్యాస్తమయం : సా 05.43

ప్రయాణశూల   : ఉత్తర దిక్కుకు పనికిరాదు

బ్రాహ్మీ ముహూర్తం :  తె 04.26 - 05.16

Today in history November 4th- చరిత్రలో ఈరోజు ఏం జరిగిందంటే?అభిప్రాయంSwechaa04 Nov 2026, 09:10 AM

Today in history November 4th- చరిత్రలో ఈరోజు ఏం జరిగిందంటే?

నవంబర్ -4న చరిత్రలో ఈ రోజు ప్రముఖుల జనన, మరణాలు సంభవించాయి. పలువురు గొప్ప వ్యక్తులు అవార్డులు అందుకున్నారు. అందుకు సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి. ఒక్కసారి మనం చరిత్రలోకి వెళ్లి ఈ రోజున ఏం జరిగిందో తెలుసుకుందాం..

సంఘటనలు

1869: నేచర్ (పత్రిక) అనేది ఒక బ్రిటీష్ వైజ్ఞానిక పత్రిక. ఇది 1869 నవంబర్ 4న మొదటిసారి ప్రచురించబడింది. ప్రపంచంలో అత్యంత ప్రసిద్ధిగాంచిన బహుళ శాస్త్రీయ విభాగాల పత్రికగా ఇది పరిగణించబడుతుంది.

2004: ఆంధ్ర ప్రదేశ్ గవర్నర్గా సుశీల్‌ కుమార్‌ షిండే నియమితుడయ్యాడు.

1947: భారతదేశపు మొట్టమొదటి పరమ వీరచక్ర పురస్కారాన్ని మేజర్ సోమనాథ్ శర్మకు మరణానంతరం ప్రదానం చేసారు. ఆయన కాశ్మీరు పోరాటంలో మరణించాడు.

అమెరికాలో రెండేళ్లకే ఎన్నికలెందుకు? ట్రంప్‌కు మిడ్ టర్మ్ సెగ.. ఓడిపోతే పదవి పోతుందా?InternationalSwechaa04 Nov 2026, 12:06 AM

అమెరికాలో రెండేళ్లకే ఎన్నికలెందుకు? ట్రంప్‌కు మిడ్ టర్మ్ సెగ.. ఓడిపోతే పదవి పోతుందా?

అమెరికాలో అధ్యక్షుడిని ఎన్నుకోవడానికి నాలుగేళ్లకు ఒకసారి ఎన్నికలు జరుగుతాయి కదా? మరి మధ్యలో రెండేళ్లకే మళ్లీ ఎన్నికలెందుకు? ఈ ఎన్నికల్లో ట్రంప్ పార్టీ ఓడిపోతే ఆయన అధ్యక్ష పదవికి రాజీనామా చేయాలా?

మున్సిపోల్స్ లో అధికార పక్షానిదే హవానా..? ఏపీ- తెలంగాణ ఫలితాలు ఏం చెబుతున్నాయి..?తెలంగాణSwechaa03 Nov 2026, 11:26 PM

మున్సిపోల్స్ లో అధికార పక్షానిదే హవానా..? ఏపీ- తెలంగాణ ఫలితాలు ఏం చెబుతున్నాయి..?

ఒకే తెలుగు నేల.. ఒకే తరహా ఎన్నికలు.. కానీ ప్రజల తీర్పు మాత్రం పూర్తిగా భిన్నం. అదే మున్సిపల్ ఎన్నికల చిత్రం. ఆంధ్రప్రదేశ్‌లో అధికార కూటమి దూకుడుకు వైసీపీ తట్టుకోలేకపోయింది. తెలంగాణ మున్సిపల్ ఎన్నికల్లో మాత్రం బీఆర్ఎస్ బలమైన పోటీ ఇచ్చింది. రెండు రాష్ట్రాల మధ్య తేడా ఏంటి..?

HCAలో రాజ్యాంగబద్ధమైన వ్యవస్థను పునరుద్ధరించాలి- TCA డిమాండ్తెలంగాణSwechaa03 Nov 2026, 10:50 PM

HCAలో రాజ్యాంగబద్ధమైన వ్యవస్థను పునరుద్ధరించాలి- TCA డిమాండ్

TCA: హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ (HCA)లో రాజ్యాంగబద్ధమైన పాలనను పునరుద్ధరించాలని, జవాబుదారీతనాన్ని అమలు చేయాలని, అలాగే ఏకపక్ష పొడిగింపులు, ఆర్థిక అవకతవకలు, పరిపాలనాపరమైన అవకతవకల వంటి సంస్కృతికి ముగింపు పలకాలని తెలంగాణ క్రికెట్ అసోసియేషన్ (TCA).. కోర్టు నియమించిన ఏకసభ్య కమిటీ (SMC)ని కోరింది. HCA పరిధిని హైదరాబాద్ నగరానికే పరిమితం చేస్తూ, తెలంగాణలోని మిగిలిన జిల్లాల్లో క్రికెట్ అభివృద్ధిలో TCA చట్టబద్ధమైన పాత్రను గుర్తించడం ద్వారా న్యాయపరమైన ఆదేశాలను SMC కచ్చితంగా పాటించాలంది.

జూన్ నాటికి కూసుమంచి 100 పడకల ఆసుపత్రిని సిద్ధం చేయాలి- మంత్రి పొంగులేటితెలంగాణSwechaa03 Nov 2026, 09:00 PM

జూన్ నాటికి కూసుమంచి 100 పడకల ఆసుపత్రిని సిద్ధం చేయాలి- మంత్రి పొంగులేటి

Khammam: ఖమ్మం జిల్లా పాలేరు నియోజకవర్గం పర్యటనలో భాగంగా ఏదులాపురం మున్సిపాలిటీ, కూసుమంచి, తిరుమలాయపాలెం మండలాల్లో పర్యటించారు రాష్ట్ర రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస రెడ్డి. పలు అభివృద్ది పనులకు శంకుస్థాపనలు చేశారు. రెండో విడత ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారులకు మంజూరు పత్రాలను అందజేశారు.

కూసుమంచి మండల కేంద్ర సమీపంలోని గంగ బండ తండా వద్ద రూ.45 కోట్లతో నిర్మిస్తున్న 100 పడకల ఏరియా ఆసుపత్రి పనులను మంత్రి పరిశీలించారు. నిర్దిష్ట గడువు మేరకు జూన్ నెల నాటికి శరవేగంగా పనులు పూర్తి చేసి ఆసుపత్రిని అందుబాటులోకి తేవాలని అధికారులను, కాంట్రాక్టర్ ను ఆదేశించారు. ఆ తర్వాత సుమారు రూ.3.20 కోట్ల అంచనా వ్యయంతో ఏదులాపురం మున్సిపాలిటీ 14,15,16 వార్డుల్లో చేపట్టిన అంతర్గత సీసీ రోడ్ల నిర్మాణానికి శంకుస్థాపన చేశారు.

మెడికల్ కాలేజీ సీటు పేరుతో భారీ మోసం..నెక్సస్ కన్సల్టెన్సీ ప్రతినిధులపై చీటింగ్ కేసుక్రైమ్Swechaa03 Nov 2026, 08:37 PM

మెడికల్ కాలేజీ సీటు పేరుతో భారీ మోసం..నెక్సస్ కన్సల్టెన్సీ ప్రతినిధులపై చీటింగ్ కేసు

Cheating: మెడికల్ కాలేజీ సీటు పేరుతో భారీ మోసానికి పాల్పడిన వ్యవహారం వెలుగులోకి వచ్చింది. నెక్సస్ కన్సల్టెన్సీ ప్రతినిధులపై పోలీసులు చీటింగ్ కేసు నమోదు చేశారు. మెడికల్ సీటు ఇప్పిస్తామని నమ్మించి భారీ మొత్తం వసూలు చేసినట్లు గుర్తించారు. ఇదే తరహాలో పలువురిని మోసం చేసినట్లు ఆరోపణలు ఉన్నాయి. ఈ వ్యవహారంలో నవీన్ రెడ్డి, సుబ్బారెడ్డిపై పంజాగుట్ట పోలీస్ స్టేషన్ లో కేసు నమోదైంది. నెక్సస్ కన్సల్టెన్సీ మోసాలపై పోలీసుల విచారణ జరుపుతున్నారు.

Fire Accident: గాంధీ ఆస్పత్రిలో అగ్నిప్రమాదంతెలంగాణSwechaa03 Nov 2026, 08:28 PM

Fire Accident: గాంధీ ఆస్పత్రిలో అగ్నిప్రమాదం

Fire Accident: సికింద్రాబాద్ లోని గాంధీ ఆసుపత్రిలో అగ్నిప్రమాదం చోటు చేసుకుంది. రికార్డ్ సెక్షన్ రూమ్ లో మంటలు చెలరేగాయి. ఈ ప్రమాదంలో విలువైన ఫైల్స్ దగ్ధమైనట్లు సమాచారం. అగ్నిప్రమాదం గురించి సమాచారం అందుకున్న వెంటనే అగ్నిమాపక సిబ్బంది రంగంలోకి దిగింది. ఫైర్ ఇంజిన్ల సాయంతో మంటలను ఆర్పివేశారు.

Sai Pallavi: సాయి పల్లవి మాటలను తప్పుగా అర్థం చేసుకుంటున్నారా?సినిమాSwechaa03 Nov 2026, 07:24 PM

Sai Pallavi: సాయి పల్లవి మాటలను తప్పుగా అర్థం చేసుకుంటున్నారా?

Sai Pallavi: నేచురల్ పర్ఫార్మెన్స్‌తో పాటు, అద్భుతమైన అభినయానికి కేరాఫ్ అడ్రస్‌గా నిలిచిన సాయి పల్లవి.. ఇప్పుడు పదే పదే తన మాటలతో వార్తల్లో నిలుస్తున్నారు. సినిమాల విషయంలో ఎంతో ఆచితూచి అడుగులు వేస్తున్న ఈ నేచురల్ బ్యూటీ.. బయట మాట్లాడే మాటల వల్ల మాత్రం వివాదాలను ఎదుర్కొంటున్నారు.

ఒకే పంటపై ఆధారపడొద్దు- రైతులకు మంత్రి తుమ్మల కీలక సూచనతెలంగాణSwechaa03 Nov 2026, 06:48 PM

ఒకే పంటపై ఆధారపడొద్దు- రైతులకు మంత్రి తుమ్మల కీలక సూచన

Telangana: తెలంగాణ రాష్ట్రంలోని రైతులకు కీలక సూచన చేశారు వ్యవసాయశాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు. రైతులు ఒకే పంటపై ఆధారపడొద్దని మంత్రి సూచించారు. పంటల వైవిధ్యంతో పాటు వ్యవసాయ అనుబంధ రంగాలపై దృష్టి పెట్టాలన్నారు. పాడి పరిశ్రమ, చేపల పెంపకం, కోళ్ల పెంపకం వంటి రంగాలను వ్యవసాయంతో అనుసంధానం చేసుకుంటే ప్రతిరోజు ఆదాయం పొందవచ్చన్నారు. రైతు నేస్తం 113వ ఎపిసోడ్ లో పాల్గొన్న మంత్రి తుమ్మల వాతావరణ మార్పులు, ఎల్ నినో ప్రభావాన్ని దృష్టిలో పెట్టుకుని ముందస్తు ప్రణాళికతో సాగు చేపట్టాలని సూచించారు.

వందల కోట్ల విలువైన భూములు.. ఇందిరమ్మ ఇళ్ల టవర్లకు కేటాయింపు- మంత్రి పొన్నం ప్రభాకర్తెలంగాణSwechaa03 Nov 2026, 05:32 PM

వందల కోట్ల విలువైన భూములు.. ఇందిరమ్మ ఇళ్ల టవర్లకు కేటాయింపు- మంత్రి పొన్నం ప్రభాకర్

Indiramma Illu: ఇందిరమ్మ ఇళ్ల టవర్స్ కు సంబంధించి మంత్రి పొన్నం ప్రభాకర్ కీలక వ్యాఖ్యలు చేశారు. హైదరాబాద్ క్యూర్ పరిధిలో వందల కోట్ల రూపాయల విలువైన స్థలాలను ఇందిరమ్మ ఇళ్ల టవర్స్ కోసం కాంగ్రెస్ ప్రభుత్వం కేటాయిస్తోందని ఆయన తెలిపారు. మంగళవారం నాంపల్లి గృహకల్ప కార్యాలయంలో క్యూర్ పరిధిలోని 4 నియోజకవర్గాల్లో ఇందిరమ్మ ఇళ్ల కేటాయింపుల కోసం ఈ-లాటరీని మంత్రి పొన్నం ప్రారంభించారు. గోశామహల్, చాంద్రాయణగుట్ట, ఎల్బీ నగర్, ముషీరాబాద్ నియోజకవర్గాలకు సంబంధించి ఇందిరమ్మ ఇళ్ల లబ్దిదారులను ఎంపిక చేశారు.

లంచం తీసుకుంటూ ఏసీబీకి చిక్కిన సదాశివపేట మండల వ్యవసాయ అధికారితెలంగాణSwechaa03 Nov 2026, 04:13 PM

లంచం తీసుకుంటూ ఏసీబీకి చిక్కిన సదాశివపేట మండల వ్యవసాయ అధికారి

ACB: అవినీతి నిరోధక శాఖ (ఏసీబీ) అధికారులకు మరో అవినీతి ప్రభుత్వ అధికారి పట్టుబడ్డాడు. సంగారెడ్డి జిల్లా సదాశివపేట మండల వ్యవసాయ అధికారి రమేష్ లంచం తీసుకుంటూ రెడ్ హ్యాండెడ్ గా దొరికిపోయాడు. 20 వేల రూపాయల లంచం తీసుకుంటుండగా ఏసీబీ అధికారులు రమేష్ ను పట్టుకున్నారు. లంచం గురించి సమాచారం అందడంతో ఏసీబీ అధికారులు మండల వ్యవసాయ కార్యాలయంలో మెరుపు దాడి చేశారు. ఏవో రమేష్‌ను అదుపులోకి తీసుకున్నారు.

నేహాబోరా వివాదాస్పద వ్యాఖ్యలు అస్త్రంగా.. బీజేపీ రాజకీయం!NationalSwechaa03 Nov 2026, 02:46 PM

నేహాబోరా వివాదాస్పద వ్యాఖ్యలు అస్త్రంగా.. బీజేపీ రాజకీయం!

 విద్యార్థి కార్యకర్త నేహా బోరా ఇటీవల చేసిన వ్యాఖ్యలు జాతీయ రాజకీయాల్లో తీవ్ర దుమారం రేపుతున్నాయి. ‘బ్రాహ్మణీయ వ్యవస్థ’ నుంచి మహిళలకు రక్షణ కల్పించాలని, ఆలయాల్లో పూజారులు లైంగికదాడులకు పాల్పడుతున్నారంటూ నేహా బోరా చేసిన ఓ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది. అయితే ఈ వ్యాఖ్యలను భారతీయ జనతా పార్టీ(BJP) తమకు అనుకూలంగా మార్చుకుని రాజకీయం చేస్తోందనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి. నేహా బోరా వ్యాఖ్యలపై బీజేపీ జాతీయ అధికార ప్రతినిధి ప్రదీప్ భండారీ చేసిన విమర్శలు ఇందుకు నిదర్శనంగా కనిపిస్తున్నాయి.

స్థానిక పోరులో కూటమిదే హవా.. కుప్పంలో తీవ్ర ఉద్రిక్తతఏపీSwechaa03 Nov 2026, 02:17 PM

స్థానిక పోరులో కూటమిదే హవా.. కుప్పంలో తీవ్ర ఉద్రిక్తత

ఏపీలో జరిగిన స్థానిక ఎన్నికల్లో కూటమి సర్కార్ హవా కొనసాగుతోంది. మొత్తం 13 మున్సిపల్ కార్పొరేషన్లలో ఎన్నికల కౌంటింగ్ ప్రక్రియ కొనసాగుతోంది. ముందుగా పోస్టల్ బ్యాలెట్లను అధికారులు లెక్కించారు. అయితే, మొత్తం పదమూడింటిలో 8 కార్పొరేషన్లలో కూటమి అభ్యర్థులు ముందంజలో కొనసాగుతున్నారు. విశాఖ, విజయనగరం, తిరుపతి, చిత్తూరు, నెల్లూరు, ఒంగోలు, విజయవాడ, కడప కార్పొరేషన్లలో కూటమి క్యాండిడేట్స్ ముందంజలో ఉండగా.. 6 స్థానాల్లో టీడీపీ, 2 స్థానాల్లో జనసేన ఆధిక్యంలో ఉన్నాయి. మరో రెండు స్థానాల్లో వైసీపీ అభ్యర్థులు ఆధిక్యంలో కొనసాగుతున్నారు. మరోవైపు పుంగనూరు మున్సిపాలిటీలో టీడీపీ జయకేతనం ఎగురవేసింది.మున్సిపాలిటీలోని 30 వార్డుల్లో టీడీపీ అభ్యర్థులు విజయం సాధించగా.. జనసేన 2, బీజేపీ 2 స్థానాల్లో, సీపీఐ 1, ఇతరులు ఒక చోట విజయం సాధించారు. మొత్తం 36 వార్డుల్లో 32 ఏకగ్రీవం అవ్వగా.. 4 వార్డులకు పోలింగ్ జరిగింది. కాగా, పోలింగ్ జరిగిన స్థానాల్లోనూ టీడీపీ నేతలు ఆధిక్యంలో ఉన్నట్టు సమాచారం.

బాలీవుడ్ నటుడికి బెదిరింపు కాల్.. లారెన్స్ బిష్ణోయ్ గ్యాంగ్ పేరిట రూ.5కోట్లు డిమాండ్!క్రైమ్Swechaa03 Nov 2026, 01:57 PM

బాలీవుడ్ నటుడికి బెదిరింపు కాల్.. లారెన్స్ బిష్ణోయ్ గ్యాంగ్ పేరిట రూ.5కోట్లు డిమాండ్!

 బాలీవుడ్ ప్రముఖ నటుడు, నిర్మాత తుషార్ కపూర్‌కు రూ.5కోట్లు ఇవ్వాలంటూ గ్యాంగ్‌స్టర్ లారెన్స్ బిష్ణోయ్ గ్యాంగ్ పేరుతో బెదిరింపు ఫోన్ కాల్ రావడం చిత్రపరిశ్రమతో పాటు ముంబై నగరంలో తీవ్ర అలజడి సృష్టించింది. తాను లారెన్స్ బిష్ణోయ్ ముఠాకు చెందిన కీలక సభ్యుడు 'హ్యారీ బాక్సర్' అని పరిచయం చేసుకున్న ఒక ఆగంతుకుడు, అడిగినంత మొత్తం ఇవ్వకపోతే తీవ్ర పరిణామాలు ఉంటాయని హెచ్చరించాడు.  అయితే ఈ ఘటనపై తక్షణమే రెస్పాండ్ అయిన ముంబై క్రైమ్ బ్రాంచ్ (Mumbai Crime Branch), యాంటీ ఎక్స్టార్షన్ సెల్ విచారణ చేపట్టి, ఇది బిష్ణోయ్ గ్యాంగ్ పేరును వాడుకుని డబ్బు గుంజడానికి చేసిన ఫేక్ (నకిలీ) కాల్ అయి ఉండవచ్చని ప్రాథమిక నిర్ధారణకు వచ్చాయి.

పండగల సందడి.. పాఠశాల విద్యార్థులకు 13 రోజుల సెలవులు!తెలంగాణSwechaa03 Nov 2026, 01:30 PM

పండగల సందడి.. పాఠశాల విద్యార్థులకు 13 రోజుల సెలవులు!

 విద్యార్థులకు నవంబర్ నెల అత్యంత పండుగ సందడిని, ఆనందాన్ని మోసుకొస్తోంది. ఈ నెలలో వరుసగా రానున్న దీపావళి, గోవర్ధన్ పూజ, భాయ్ దూజ్, ఛత్ పూజ, గురునానక్ జయంతి పండగలతో పాటు సాధారణ ఆదివారాలు కూడా కలిసి రావడంతో వివిధ రాష్ట్రాల్లోని పాఠశాలలకు 8 నుంచి గరిష్ఠంగా 13 రోజుల వరకు సెలవులు లభించే అవకాశం ఉంది. అయితే దేశవ్యాప్తంగా ఉన్న పాఠశాలలన్నింటికీ ఈ సెలవుల సంఖ్య ఒకే విధంగా ఉండదని, ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు, విద్యాశాఖలు జారీ చేసే అధికారిక ఉత్తర్వుల ఆధారంగానే పండగ సెలవుల క్యాలెండర్ మారుతుందని అధికారులు వెల్లడించారు.

రాష్ట్రంలో 2.55 లక్షల మంది కొత్త ఓటర్లకు బిగ్ షాక్!తెలంగాణSwechaa03 Nov 2026, 01:28 PM

రాష్ట్రంలో 2.55 లక్షల మంది కొత్త ఓటర్లకు బిగ్ షాక్!

రాష్ట్రంలోని కొత్త ఓటర్లకు బిగ్ షాక్ తగిలింది. కొత్తగా ఓటు కోసం నమోదు చేసుకున్న వారిలో చాలా వరకు దరఖాస్తులు తిరస్కరణకు గురైనట్టు తెలుస్తోంది. తెలంగాణలో 2.55 లక్షల మంది కొత్త ఓటర్ల దరఖాస్తులు తిరస్కరణకు గురైనట్టు సమాచారం. రాష్ట్రవ్యాప్తంగా 10.92 లక్షల ఫామ్‌-6 దరఖాస్తులు రాగా, ఇప్పటివరకు 7,16,436 దరఖాస్తులకు ఆమోదం లభించినట్టు తెలిసింది. ఈ క్రమంలోనే ఏకంగా 2,55,421 దరఖాస్తులు తిరస్కరణకు గురైనట్టు తెలుస్తోంది.మరో 1,20,963 దరఖాస్తులు పెండింగ్‌లోనే ఉన్నట్టు సమాచారం. దరఖాస్తు చేసుకున్న ప్రతి పది మందిలో దాదాపు నలుగురికి ఓటు హక్కు ఇంకా ఖరారు కాని పరిస్థితి నెలకొంది. యువతలో ఓటు వేసేందుకు ఆసక్తి పెరుగుతున్నా రాష్ట్ర ఎన్నికల సంఘం దరఖాస్తులను తిరస్కరించడంపై ఆందోళనలు వ్యక్తం అవుతున్నాయి. అసలు ఏ కారణాలతో దరఖాస్తులు తిరస్కరించారంటూ యువ ఓటర్ల ప్రశ్నిస్తున్నారు.

ఢిల్లీలో గ్రీన్ టపాసుల ముసుగులో దందా.. సుప్రీంకోర్టు తీవ్ర ఆగ్రహం!NationalSwechaa03 Nov 2026, 01:11 PM

ఢిల్లీలో గ్రీన్ టపాసుల ముసుగులో దందా.. సుప్రీంకోర్టు తీవ్ర ఆగ్రహం!

దేశ రాజధాని ఢిల్లీ-ఎన్‌సీఆర్ (Delhi-NCR) ప్రాంతంలో వాయు కాలుష్యం (Air Pollution) తీవ్ర స్థాయిలో విజృంభిస్తున్న తరుణంలో బాణసంచా విక్రయాలపై విధించిన ఆంక్షలు తుంగలో తొక్కడం పట్ల సుప్రీంకోర్టు తీవ్ర ఆగ్రహం, ఆందోళన వ్యక్తం చేసింది. పర్యావరణ అనుకూల 'గ్రీన్ క్రాకర్స్' (Green Crackers) విక్రయాల ముసుగులో నిషేధిత సాధారణ, అత్యంత కాలుష్యకారక టపాసులను బహిరంగంగా విక్రయిస్తున్నారంటూ మీడియాలో వచ్చిన కథనాలను సర్వోన్నత న్యాయస్థానం మంగళవారం (నవంబర్ 3, 2026) తీవ్రంగా పరిగణించింది.

కాంగ్రెస్‌లో మంత్రులు వర్సెస్  ఎంపీ, ఎమ్మెల్యే!టాప్ న్యూస్Swechaa03 Nov 2026, 12:58 PM

కాంగ్రెస్‌లో మంత్రులు వర్సెస్ ఎంపీ, ఎమ్మెల్యే!

అధికార కాంగ్రెస్ పార్టీలో మరోసారి నేతల మధ్య విభేదాలు భగ్గుమన్నాయి. ‘నువ్వెంత అంటే నువ్వెంత’ అనే స్థాయిలో సీనియర్, జూనియర్ లీడర్ల మధ్య కోల్డ్ వార్ నడుస్తున్నట్టు తెలుస్తోంది. విషయం బయటకు రాకుండా సీనియర్లు జాగ్రత్త పడితే జూనియర్లు మాత్రం చేయని తప్పుకు తామేందుకు శిక్ష అనుభవించాలని అసలు విషయాన్ని బయట పెట్టినట్టు తెలిసింది. రాష్ట్రంలో పార్టీ అధికారంలోకి వచ్చి మూడేండ్లు పూర్తయింది. అయినప్పటికీ నేతల మధ్య వివాదాలు మాత్రం సద్దుమణగడం లేదు. పదవులు, హోదాల కోసం, పార్టీలో పైచేయి సాధించేందుకు కొందరు జూనియర్లు ప్రయత్నిస్తుంటే సీనియర్లు అడ్డుపడుతున్నట్టు ప్రచారం జరుగుతోంది.

Bollywood: "సంక్రాంతికి వస్తున్నాం" హిందీ రీమేక్..అసలు సౌండే లేదు!సినిమాSwechaa03 Nov 2026, 12:48 PM

Bollywood: "సంక్రాంతికి వస్తున్నాం" హిందీ రీమేక్..అసలు సౌండే లేదు!

Bollywood: టాలీవుడ్‌లో భారీ విజయాన్ని అందుకున్న సినిమాలను ఇతర భాషల్లో రీమేక్ చేయడం కొత్తేమీ కాదు. పోకిరి, విక్రమార్కుడు లాంటి సినిమాలు దీనికి ఉదాహరణ. ముఖ్యంగా తెలుగు సినిమాలకు హిందీ మార్కెట్‌లో మంచి డిమాండ్ ఉండటంతో బాలీవుడ్ మేకర్స్ కూడా మన సినిమాలపై ఆసక్తి చూపిస్తున్నారు. అయితే, ఒక సినిమా రీమేక్ హక్కులు కొనడం వేరు.