స్వేచ్ఛ షార్ట్స్ — తాజా తెలుగు వార్తలు

హైదరాబాద్‌లో 36గంటల పాటు నీటి సరఫరాకు బ్రేక్.. జలమండలి ప్రకటన!తెలంగాణSwechaa03 Nov 2026, 12:32 PM

హైదరాబాద్‌లో 36గంటల పాటు నీటి సరఫరాకు బ్రేక్.. జలమండలి ప్రకటన!

 హైదరాబాద్ మహానగరంలోని పలు కీలక ప్రాంతాల ప్రజలకు హైదరాబాద్ నీటి సరఫరా, మురుగునీటి పారుదల మండలి (HMWS&SB - జలమండలి) అత్యవసర హెచ్చరిక జారీ చేసింది. నగరానికి తాగునీటిని అందించే వందేళ్ల పురాతనమైన గండిపేట (ఉస్మాన్‌సాగర్) కాండ్యూట్ మార్గంలో తీవ్ర లీకేజీలను గుర్తించిన అధికారులు, వాటికి అత్యవసర మరమ్మతులు చేపడుతున్నారు. ఈ నేపథ్యంలో నవంబర్ 3వ తేదీ మంగళవారం(నేడు) ఉదయం 6:00 గంటల నుంచి నవంబర్ 4వ తేదీ బుధవారం సాయంత్రం 6:00 గంటల వరకు (మొత్తం 36 గంటల పాటు) పలు ప్రధాన ప్రాంతాల్లో తాగునీటి సరఫరా పూర్తిగా నిలిపివేస్తున్నట్లు వెల్లడించారు.

Tollywood: ఆకాష్ పూరికి బయట నిర్మాతలు కూడా లేరా.రారా!సినిమాSwechaa03 Nov 2026, 12:30 PM

Tollywood: ఆకాష్ పూరికి బయట నిర్మాతలు కూడా లేరా.రారా!

Tollywood: టాలీవుడ్‌లో హీరోగా తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపును, పాపులారిటీని తెచ్చుకోవాలని ప్రయత్నిస్తున్న యంగ్ హీరో ఆకాష్ పూరి. స్టార్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ తనయుడిగా ఇండస్ట్రీలోకి వచ్చినప్పటికీ, హీరోగా మాత్రం తనకంటూ ప్రత్యేకమైన ఇమేజ్ సంపాదించుకోలేకపోయాడు. ఇండస్ట్రీకొచ్చి చాలా ఏళ్ళవుతున్నా..ఇప్పటివరకు ఆశించిన స్థాయిలో విజయాలు మాత్రం దక్కలేదు.

చిత్రం లేదు
ఏపీSwechaa03 Nov 2026, 12:17 PM

ఓట్ల లెక్కింపు వేళ.. స్ట్రాంగ్ రూమ్ తాళం చెవి మిస్సింగ్.. చివరికి ఎలా తెరిచారంటే?!

ఏపీలో మున్సిపల్ ఎన్నికల వేళ అనూహ్య పరిణామం చోటుచేసుకుంది. పార్వతీపురం మన్యం జిల్లా పార్వతీపురం మున్సిపాలిటీ పరిధిలో ఓట్ల లెక్కింపును ప్రారంభించే సమయంలో బ్యాలెట్ పెట్టెలు భద్రపరిచిన స్ట్రాంగ్ రూమ్ (Strong Room) తాళం చెవి కనిపించకుండా పోవడం కేంద్రం వద్ద తీవ్ర కలకలం రేపింది. ఎంత వెతికినా తాళం చెవి ఆచూకీ లభించలేదు. ఎన్నికల అధికారులు చివరకు లాక్‌ను బద్దలు కొట్టించి స్ట్రాంగ్ రూమ్‌ను తెరిపించాల్సి వచ్చింది. ఈ నాటకీయ పరిణామాల వల్ల నిర్ణీత సమయానికి ప్రారంభం కావాల్సిన ఓట్ల లెక్కింపు ప్రక్రియలో తీవ్ర జాప్యం చోటుచేసుకుంది.

జీహెచ్ఎంసీ అసిస్టెంట్ డైరెక్టర్ ఇంట్లో ఏసీబీ దాడులుతెలంగాణSwechaa03 Nov 2026, 12:13 PM

జీహెచ్ఎంసీ అసిస్టెంట్ డైరెక్టర్ ఇంట్లో ఏసీబీ దాడులు

రాష్ట్రంలో మరోసారి ఏసీబీ దాడులు కలకలం సృష్టించాయి. జీహెచ్ఎంసీ అసిస్టెంట్ డైరెక్టర్ అక్రమంగా ఆస్తులు కూడబెట్టారని విశ్వసనీయ సమాచారం అందడంతో ఇవాళ ఉదయం అవినీతి నిరోధక శాఖ (ACB) అధికారులు రంగంలోకి దిగి సోదాలు చేపట్టారు. జీహెచ్‌ఎంసీ (GHMC) అసిస్టెంట్ డైరెక్టర్ నల్లబోతు యాదగిరి ఇళ్లు, కార్యాలయాలపై ఏసీబీ అధికారులు ఏకకాలంలో దాడులు చేస్తున్నారు. నగరంలోని ఎల్‌బీనగర్‌లో ఆయన ఉంటున్న నివాసంతో పాటు సూర్యాపేటలో సాయిబాబా ఆలయం సమీపంలో ఉన్న ఆయన స్వగృహం, ఇతర ముఖ్యమైన ప్రదేశాల్లో ఏసీబీ బృందాలు విస్తృతంగా సోదాలు చేపడుతున్నాయి.ఏడీ యాదగిరికి చెందిన స్థిర, చరాస్తులు, బ్యాంకు ఖాతాలు, బంగారు ఆభరణాలు, ఆర్థిక లావాదేవీలకు సంబంధించిన కీలక పత్రాలను అధికారులు నిశితంగా పరిశీలిస్తున్నారు. అక్రమాస్తుల గురించి విశ్వసనీయ సమాచారం రావడంతోనే ఏసీబీ అధికారులు సోదాలు చేస్తున్నట్టు తెలిసింది.

తెలంగాణలో కేబినెట్ విస్తరణ ఉంటుందా? ఉండదా?తెలంగాణSwechaa03 Nov 2026, 11:56 AM

తెలంగాణలో కేబినెట్ విస్తరణ ఉంటుందా? ఉండదా?

రేవంత్ ప్రభుత్వానికి రాజకీయంగా మిగిలింది కీలకమైన రెండేళ్లు మాత్రమే. ఇలాంటి సమయంలో మంత్రివర్గ విస్తరణపై మళ్లీ చర్చ మొదలైంది. మరి ఆయన కేబినెట్‌ను విస్తరిస్తారా? లేక ఇప్పుడున్న మంత్రులతోనే ఎన్నికల వరకు జర్నీ చేస్తారా..? రాజగోపాల్ రెడ్డి పరిస్థితి ఏంటి..?

Tollywood: నార్త్ హీరోయిన్స్‌కి అవకాశాలివ్వడమే తప్పా?సినిమాSwechaa03 Nov 2026, 11:51 AM

Tollywood: నార్త్ హీరోయిన్స్‌కి అవకాశాలివ్వడమే తప్పా?

Tollywood: నార్త్ హీరోయిన్స్‌కి అవకాశాలివ్వడమే తప్పా? అవును..తాజాగా బోల్డ్ బ్యూటీ రాధిక ఆప్టే చేసిన కామెంట్స్ చూస్తుంటే..అసలు మనవాళ్ళకి కాస్తైనా ఆలోచన ఉండాలనిపిస్తోంది. పట్టుపట్టి, పనిగట్టుకొని మరీ తీసుకొచ్చి ఇక్కడ అవకాశాలిచ్చి..స్టార్ హీరోయిన్స్‌ని చేస్తే..వాళ్ళే తర్వాత మన తెలుగు ఇండస్ట్రీ మీద తెలుగు హీరోల మీద దర్శకుల మీద తప్పుడు వ్యాఖ్యలు చేస్తున్నారు.

బోర్డర్‌లో అలజడి..  ముగ్గురు ఆర్మీ జవాన్లపై మూక దాడి!NationalSwechaa03 Nov 2026, 11:49 AM

బోర్డర్‌లో అలజడి.. ముగ్గురు ఆర్మీ జవాన్లపై మూక దాడి!

నిరంతరం దేశ సరిహద్దుల్లో పహారా కాసే భద్రతా బలగాలపై ఓ మూక దాడి చేయడం సంచలనంగా మారింది. కొందరు ప్లాన్ ప్రకారమే ఆర్మీ జవాన్లు వెళ్తున్న వాహానాన్ని అడ్డుకుని కర్రలతో దాడులకు పాల్పడినట్టు తెలిసింది. బంగ్లాదేశ్, చైనాకు సమీపంలో ఉండే త్రిపుర రాష్ట్రంలోని సిపాహిజాల జిల్లా బోక్సానగర్ పరిధిలోని ఆశా బారి సరిహద్దు ప్రాంతంలో ఈ ఘటన చోటుచేసుకుంది. సరిహద్దు భద్రతా దళం(బీఎస్ఎఫ్) జవాన్లపై దాడులకు పాల్పడిన వారిని స్మగ్లర్లుగా గుర్తించారు. నిందితులు కర్రలు, మారణాయుధాలతో విచక్షణారహితంగా దాడికి పాల్పడ్డారు. భారత్-బంగ్లాదేశ్ సరిహద్దు సమీపంలో గస్తీ కాస్తున్న బలగాలే లక్ష్యంగా జరిగిన ఈ దాడిలో ముగ్గురు బీఎస్‌ఎఫ్ జవాన్లు తీవ్రంగా గాయపడినట్టు సమాచారం. ఓ వైపు దాడికి పాల్పడుతూనే నిందితులు జవాన్ల వద్ద ఉన్న ఆయుధాలను లాక్కునేందుకు ప్రయత్నించారు. ప్రభుత్వ వాహనాన్ని కూడా ధ్వంసం చేశారు.

ఎవరెస్ట్ సమీపంలో ఢీకొన్న రెండు హెలికాప్టర్లు.. భారత పర్యాటకుడు మృతి!NationalSwechaa03 Nov 2026, 11:39 AM

ఎవరెస్ట్ సమీపంలో ఢీకొన్న రెండు హెలికాప్టర్లు.. భారత పర్యాటకుడు మృతి!

ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన పర్వతం మౌంట్ ఎవరెస్ట్‌ సమీపంలో ఘోర ప్రమాదం చోటుచేసుకుంది. నేపాల్‌లోని ఎవరెస్ట్‌ బేస్‌ క్యాంప్‌ ప్రాంతానికి సమీపంలో ఫెరిచే (Pheriche) వద్ద రెండు హెలికాప్టర్లు ఒకదానికొకటి పరస్పరం ఢీకొన్నాయి. ఈ తీవ్ర ప్రమాదంలో ఒక భారతీయ పర్యాటకుడు ప్రాణాలు కోల్పోగా, మరో విదేశీ పర్యాటకుడు తీవ్రంగా గాయపడ్డారు. పర్వత శ్రేణుల వద్ద హెలికాప్టర్లు ఒకే హెలిప్యాడ్‌పై ల్యాండ్ అయ్యే క్రమంలో ఈ దుర్ఘటన చోటుచేసుకుంది. ప్రమాదానికి సంబంధించిన భయాందోళన కలిగించే వీడియో దృశ్యాలు ప్రస్తుతం సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతున్నాయి.

అంతర్జాతీయ క్రికెట్‌కు ఆస్ట్రేలియా దిగ్గజం గుడ్ బై..క్రీడలుSwechaa03 Nov 2026, 10:55 AM

అంతర్జాతీయ క్రికెట్‌కు ఆస్ట్రేలియా దిగ్గజం గుడ్ బై..

ఆస్ట్రేలియా క్రికెట్ చరిత్రలో మరో శఖం ముగిసింది. ఆసీస్ విధ్వంసకర ఆల్‌రౌండర్ ‘గ్లెన్ మ్యాక్స్‌వెల్’ అంతర్జాతీయ క్రికెట్‌ కెరీర్‌కు గుడ్ బై చెప్పారు. 14 ఏళ్ల పాటు కొనసాగిన సుదీర్ఘ ఇంటర్నేషనల్ క్రికెట్ ప్రయాణానికి ముగింపు పలుకుతున్నట్లు అధికారికంగా ప్రకటించారు. వన్డేలు, టెస్టుల నుంచి ఇప్పటికే వైదొలిగిన మ్యాక్స్ వెల్ తాజాగా అంతర్జాతీయ ఫార్మాట్లకు రిటైర్మెంట్ ప్రకటించారు. అయితే, బిగ్ బాష్ లీగ్ (BBL), టీ20 లీగ్‌లలో ఫ్రాంచైజీల తరఫున ఆటగాడిగా కొనసాగుతానని చెప్పారు. 2012లో అంతర్జాతీయ కెరీర్ ప్రారంభించిన మ్యాక్స్‌వెల్ జట్టు కోసం ఎన్నో కీలక ఇన్నింగ్స్ ఆడారు. ఆస్ట్రేలియా టీం సాధించిన చారిత్రక విజయాల్లో కీలక పాత్ర పోషించారు. 2015, 2023 వన్డే ప్రపంచకప్‌లతో పాటు 2021లో టీ20 ప్రపంచ కప్ ఆస్ట్రేలియా నెగ్గడానికి తన వంతు పాత్ర పోషించారు.

సోషల్ మీడియా పవర్.. మూడేళ్ల చిన్నారి ఆవేదనకు జగిత్యాల కలెక్టర్ స్పందన!వైరల్ న్యూస్Swechaa03 Nov 2026, 10:45 AM

సోషల్ మీడియా పవర్.. మూడేళ్ల చిన్నారి ఆవేదనకు జగిత్యాల కలెక్టర్ స్పందన!

తల్లిదండ్రులకు దూరమై శిశు సంక్షేమ గృహంలో ఆవేదన అనుభవించిన ఓ మూడేళ్ల చిన్నారి(బాబు) కన్నీటి గాథ తెలుగు రాష్ట్రాల ప్రజల మనస్సులను తీవ్రంగా చలించిపోయేలా చేసింది. మూడేళ్లుగా అల్లారుముద్దుగా పెంచుకున్న బిడ్డను దత్తత వివాదం పేరిట అధికారులు వేరు చేయడంతో, దాదాపు రెండు నెలలుగా ఆ తల్లిదండ్రులు తీవ్ర నిరీక్షణ అనుభవించారు. ఈ క్రమంలో బిడ్డను పరామర్శించేందుకు వచ్చిన తల్లిదండ్రులను చూసి, ‘అమ్మా.. భయమేస్తోంది.. నన్ను తీసుకెళ్లు’ అంటూ ఆ చిన్నారి ఏడ్చిన దృశ్యాలు సామాజిక మాధ్యమాల్లో (Social Media) విపరీతంగా వైరల్ అయ్యాయి.

ఆస్తి కోసం కిరాతకం.. తమ్ముడి భార్యను హతమార్చిన అన్నలుక్రైమ్Swechaa03 Nov 2026, 10:35 AM

ఆస్తి కోసం కిరాతకం.. తమ్ముడి భార్యను హతమార్చిన అన్నలు

రాష్ట్రంలో దారుణ ఘటన చోటుచేసుకుంది. ఆస్తి కోసం సొంత తమ్ముడి భార్యను అన్నలు కిరాతకంగా హతమార్చారు.ఈ ఘటన ప్రస్తుతం రాష్ట్ర వ్యాప్తంగా సంచలనంగా మారింది. తమ్ముడు ఊర్లో లేని సమయంలో అత్యంత కిరాతకంగా మరదలిని హతమార్చడంతో మృతురాలి తండ్రి ఫిర్యాదు మేరకు పోలీసులు రంగంలోకి దిగారు. ఈ ఘటన మహబూబ్‌నగర్ జిల్లా కోయిలకొండ మండలం చింతల్‌తండాలో చోటుచేసుకోగా ఆలస్యంగా వెలుగుచూసింది. వివరాల్లోకివెళితే.. 12 ఏళ్ల కిందట బలరాం అనే వ్యక్తితో సునీత(28)కు వివాహం జరిగింది. ఈ దంపతులకు ఇద్దరు కుమార్తెలు. బలరాంకు మతిస్థిమితం సరిగ్గా లేకపోవడంతో ఏడాది క్రితం పంచాయితీ పెట్టి భార్య సునీత పేరిట ఎకరంన్నర భూమిని పట్టా చేయించారు. ఇది బలరాం అన్నలు పాండునాయక్, మన్యానాయక్‌కు నచ్చలేదు. ఎలాగైనా ఆ భూమిని స్వాధీనం చేసుకోవాలని ప్లాన్ వేశారు.

మాజీ సీఎం  వైఎస్ జగన్‌ మోహన్ రెడ్డిపై కేసు..ఏపీSwechaa03 Nov 2026, 10:12 AM

మాజీ సీఎం వైఎస్ జగన్‌ మోహన్ రెడ్డిపై కేసు..

ఏపీలో జరిగిన స్థానిక సంస్థల ఎన్నికల ఫలితాలకు కౌంటింగ్ కొనసాగుతోంది. ఈ క్రమంలోనే వైఎస్సార్ కాంగ్రెస్ అధినేత, ఏపీ మాజీ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి మీద కడప జిల్లా పులివెందుల అర్బన్ పోలీస్‌స్టేషన్‌లో కేసు నమోదు అయ్యింది. స్థానిక సంస్థల ఎన్నికలకు పోలింగ్ జరుగుతున్న సందర్భంగా ఎన్నికల ప్రవర్తనా నియమావళిని ఉల్లంఘించడంతో పాటు అధికారుల విధులకు ఆటంకం కలిగించారనే ఆరోపణల మీద పోలీసులు కేసు ఫైల్ చేశారు. పులివెందులలోని స్థానిక పోలింగ్ కేంద్రం వద్ద రిటర్నింగ్ అధికారి ఆఫీసు ఎదుట చోటు చేసుకున్న రాజకీయ నిరసనలు, ప్రభుత్వ నిబంధనల ఉల్లంఘనపై ఎన్నికల అధికారులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు వివిధ సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. ఈ మేరకు దర్యాప్తు ప్రారంభించినట్టు సమాచారం. ఈ ఘటనలో వైఎస్ జగన్‌తో పాటు ఎంపీ అవినాష్ రెడ్డి పైనా కేసు నమోదు చేసినట్టు తెలిసింది.

రాప్తాడు దాడి కేసులో బిగ్ అప్‌డేట్.. ఉన్మాది హేమంత్ కుడి కాలు తొలగింపు!క్రైమ్Swechaa03 Nov 2026, 10:00 AM

రాప్తాడు దాడి కేసులో బిగ్ అప్‌డేట్.. ఉన్మాది హేమంత్ కుడి కాలు తొలగింపు!

 ఏపీలోని అనంతపురం జిల్లా రాప్తాడు పాఠశాలలో పదో తరగతి విద్యార్థినిపై రంపంతో దారుణంగా దాడి చేసిన కేసులో విచారణాధికారులు, వైద్యులు సంచలన బిగ్ అప్‌డేట్ వెల్లడించారు. పారిపోయే క్రమంలో పోలీసులు జరిపిన ఆత్మరక్షణ కాల్పుల్లో తీవ్రంగా గాయపడిన నిందితుడు హేమంత్ కుడి కాలిని శస్త్రచికిత్స చేసి పూర్తిగా తొలగించారు. నిందితుడిని అరెస్ట్ చేసేందుకు యత్నించిన సమయంలో పోలీసులపై కత్తితో దాడికి తెగబడటంతో పోలీసులు కాల్పులు జరిపిన విషయం తెలిసిందే.

Kollywood: నయన్-శింబు..ఇది నిజమేనా?సినిమాSwechaa03 Nov 2026, 09:50 AM

Kollywood: నయన్-శింబు..ఇది నిజమేనా?

Kollywood: కోలీవుడ్ హాట్ కాంబో శింబు, నయనతార మళ్లీ కలిసి నటించబోతున్నారనే వార్త ప్రస్తుతం అటు కోలీవుడ్‌లో ఇటు టాలీవుడ్‌లో హాట్ టాపిక్‌గా మారింది. అయితే, ఈ ప్రాజెక్ట్ కి సంబందించి ఇంకా అధికారికంగా ఎలాంటి కన్‌ఫర్మేషన్ లేదు. ఒకవేళ, నయన్-శింబుల సినిమా అఫీషియల్‌గా ప్రకటిస్తే మాత్రం పదేళ్ళ ఈ హాట్ కాంబోను మళ్ళీ సిల్వర్ స్క్రీన్ మీద చూడొచ్చు.

రాప్తాడు ఉన్మాది హేమంత్‌ కేసు.. సెక్షన్లు, శిక్షలు ఇవే!క్రైమ్Swechaa03 Nov 2026, 09:34 AM

రాప్తాడు ఉన్మాది హేమంత్‌ కేసు.. సెక్షన్లు, శిక్షలు ఇవే!

 ఆంధ్రప్రదేశ్‌లోని అనంతపురం జిల్లా రాప్తాడు పాఠశాలలో పదో తరగతి విద్యార్థినులపై రంపంతో అత్యంత భయానక దాడి ఘటన రాష్ట్ర వ్యాప్తంగా సంచలనంగా మారిన విషయం తెలిసిందే. ఈ ఘోర ఉదంతంపై తీవ్రంగా స్పందించిన అనంతపురం జిల్లా పోలీసులు నిందితుడిపై చట్టంలోని అత్యంత కఠినమైన క్రిమినల్ సెక్షన్ల కింద కేసులు నమోదు చేశారు. దాడి నుంచి తన స్నేహితురాలిని కాపాడేందుకు ప్రయత్నించి తీవ్రంగా గాయపడిన మరో విద్యార్థిని లక్ష్మి ఇచ్చిన ఫిర్యాదు ఆధారంగా పోలీసులు హత్యాయత్నం సహా అనేక కీలక సెక్షన్లను ఎఫ్‌ఐఆర్‌ (FIR) లో చేర్చారు.

తీరం దాటిన మురాసు.. తెలంగాణలోని ఈ జిల్లాల్లో భారీవర్షాలుతెలంగాణSwechaa03 Nov 2026, 09:33 AM

తీరం దాటిన మురాసు.. తెలంగాణలోని ఈ జిల్లాల్లో భారీవర్షాలు

నేడు తెలంగాణలో భారీ వర్షాలు కురవనున్నట్టు వాతావరణ శాఖ వెల్లడించింది. బంగాళాఖాతంలో ఏర్పడిన ‘మురాసు’ తుఫాను ఒంగోలు వద్ద తీరం దాటిన విషయం తెలిసిందే. ఈ తుఫాను ప్రభావం తెలంగాణ రాష్ట్రంపై స్పష్టంగా కనిపిస్తోంది. ఖమ్మం, సూర్యాపేట, భద్రాద్రి-కొత్తగూడెం, మహబూబాబాద్ జిల్లాలో నేటి సాయంత్రం నుంచి రేపు ఉదయం వరకు ఉరుములు, మెరుపులతో కూడిన భారీ వర్షాలు కురుస్తాయని సమాచారం. మరికొన్ని చోట్ల భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశముందని వాతావరణ శాఖ తెలిపింది.కొన్ని ప్రాంతాల్లో ఏకంగా 120 నుంచి 150 మిల్లీమీటర్ల కంటే ఎక్కువ వర్షపాతం నమోదయ్యే సూచనలు ఉన్నట్లు వెదర్ ఎక్స్‌పర్ట్స్ అంచనా వేశారు. మరోవైపు నల్గొండ, యాదాద్రి-భువనగిరి, నాగర్‌కర్నూల్, జనగాం, వరంగల్, హన్మకొండ, ములుగు జిల్లాలో ఇవాళ మధ్యాహ్నం నుంచి రాత్రి వరకు మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నది.

Tollywood: పవన్-దిల్ రాజుల ప్రాజెక్ట్ ఓకే గానీ, ఆ రెండే మైనస్!సినిమాSwechaa03 Nov 2026, 09:31 AM

Tollywood: పవన్-దిల్ రాజుల ప్రాజెక్ట్ ఓకే గానీ, ఆ రెండే మైనస్!

Tollywood: పవర్ స్టార్ పవన్ కళ్యాణ్‌కు ఉన్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. పాన్ ఇండియా రేంజ్‌లో ఓజీ సాధించిన సక్సెస్, కలెక్షన్స్ ఇండస్ట్రీ వర్గాలను షాకయ్యేలా చేశాయి. పవర్ స్టార్ సినిమా వస్తుందంటే బాక్సాఫీస్ దగ్గర అంచనాలు భారీగా ఉంటాయి. వరుసగా సినిమాలు ఫాలైనా కూడా, కొత్త సినిమాకి మాత్రం అసలు ఆ ప్రభావమే కనిపించదు. ఇక, నిర్మాత దిల్ రాజుకు కూడా సినిమాల విషయంలో మంచి జడ్జిమెంట్ ఉంది.

today-in-history-november-3: చరిత్రలో ఈ రోజు (03 నవంబర్)InternationalSwechaa03 Nov 2026, 09:24 AM

today-in-history-november-3: చరిత్రలో ఈ రోజు (03 నవంబర్)

నేటి ముఖ్యాంశాలు (Today's Highlights)

  • 1957: సోవియట్ యూనియన్ మానవాళి చరిత్రలో మొట్టమొదటిసారిగా 'లైకా' (Laika) అనే కుక్కను 'స్పుత్నిక్-2' రోదసి నౌకలో అంతరిక్షంలోకి పంపింది.

  • 1933: ప్రముఖ భారతీయ అర్థశాస్త్రవేత్త, నోబెల్ పురస్కార గ్రహీత అమర్త్య సేన్ జననం.

  • 1911: ప్రముఖ కార్ల తయారీ సంస్థ షివర్లే (Chevrolet) అధికారికంగా స్థాపించబడింది.

🌐 అంతర్జాతీయ సంఘటనలు

  • 1903: పనామా కొలంబియా నుండి విడిపోయి స్వతంత్ర దేశంగా అవతరించింది (అమెరికా మద్దతుతో).

  • 1936: అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో ఫ్రాంక్లిన్ డి. రూజ్‌వెల్ట్ వరుసగా రెండోసారి భారీ మెజారిటీతో విజయం సాధించారు.

  • 1978: డొమినికా దేశం యునైటెడ్ కింగ్‌డమ్ నుండి స్వాతంత్ర్యం పొందింది.

🚀 సైన్స్ & అడ్వెంచర్

  • 1957: వ్యోమనౌకలో భూకక్ష్యలోకి ప్రవేశించిన మొదటి జీవిగా 'లైకా' చరిత్రకెక్కింది (సోవియట్ అంతరిక్ష కార్యక్రమం - Sputnik 2).

  • 1973: నాసా అంగారకుడు మరియు శుక్ర గ్రహాల వైపు పరిశోధనల కోసం 'మారినర్ 10' (Mariner 10) ఉపగ్రహాన్ని ప్రయోగించింది.

👤 ప్రముఖుల జననాలు & వర్ధంతులు

  • 1933 (జననం): అమర్త్య సేన్ — భారతరత్న, ఆర్థిక శాస్త్రంలో నోబెల్ బహుమతి గ్రహీత.

  • 1618 (జననం): ఔరంగజేబ్ — 6వ మొఘల్ చక్రవర్తి.

  • 1906 (జననం): పృథ్వీరాజ్ కపూర్ — ప్రముఖ భారతీయ నాటక, సినీ నటుడు, దాదాసాహెబ్ ఫాల్కే పురస్కార గ్రహీత.

  • 1976 (జననం): నవదీప్ సైని లేదా ఇతర భారతీయ క్రీడాకారులు / చారిత్రక వ్యక్తులు.

నేటి పంచాంగం - 03 నవంబర్ 2026 | కార్తిక కృష్ణ నవమి, మఘ నక్షత్రం & నేటి శుభ సమయాలుSpiritualitySwechaa03 Nov 2026, 09:04 AM

నేటి పంచాంగం - 03 నవంబర్ 2026 | కార్తిక కృష్ణ నవమి, మఘ నక్షత్రం & నేటి శుభ సమయాలు

వివరాలు:

  • తేదీ: 03 నవంబరు 2026, మంగళవారం

  • సంవత్సరం: శ్రీ పరాభవ నామ సంవత్సరం

  • అయనం & ఋతువు: దక్షిణాయనం, శరత్ఋతువు

  • మాసం & పక్షం: కార్తిక మాసం, కృష్ణ పక్షం

  • తిథి: నవమి (ఉదయం 10:25 వరకు, తదుపరి దశమి)

  • వారం: మంగళవారం (భౌమవాసరే)

  • నక్షత్రం: మఘ (రాత్రి 01:12 వరకు, తదుపరి పూర్వఫల్గుణి)

  • యోగం: శుక్ల (ఉదయం 09:18 వరకు, తదుపరి బ్రహ్మ)

  • కరణం: తైతుల (ఉదయం 10:25 వరకు), తదుపరి గరజ (రాత్రి 09:34 వరకు)

శుభ / అశుభ సమయాలు:

  • రాహుకాలం: మధ్యాహ్నం 03:00 - 04:30 వరకు

  • యమగండం: ఉదయం 09:00 - 10:30 వరకు

  • అమృతకాలం: సాయంత్రం 06:18 - 07:49 వరకు

  • దుర్ముహూర్తము: ఉదయం 08:33 - 09:19 వరకు మరియు రాత్రి 10:44 - 11:34 వరకు

  • వర్జ్యం: ఉదయం 08:02 - 09:35 వరకు

గ్రహస్థితులు:

  • సూర్యరాశి: తుల

  • చంద్రరాశి: సింహం

  • సూర్యోదయం: ఉదయం 06:19

  • సూర్యాస్తమయం: సాయంత్రం 05:39

Aadarsha Kutumbam: వెంకీ – త్రివిక్రమ్ కాంబోకు ఇది గుణపాఠమా?సినిమాSwechaa03 Nov 2026, 07:50 AM

Aadarsha Kutumbam: వెంకీ – త్రివిక్రమ్ కాంబోకు ఇది గుణపాఠమా?

Aadarsha Kutumbam: టాలీవుడ్‌ సీనియర్ హీరో విక్టరీ వెంకటేష్, మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ కాంబినేషన్‌కు ప్రత్యేకమైన క్రేజ్ ఉంది. గతంలో వచ్చిన నువ్వు నాకు నచ్చావ్, మల్లీశ్వరి చిత్రాల విజయమే దీనికి కారణం. ఇక, తాజాగా వీరిద్దరి కలయికలో వచ్చిన ‘ఆదర్శ కుటుంబం – హౌస్ నంబర్ 47’ సినిమాపై కూడా భారీ అంచనాలు ఏర్పడ్డాయి. కానీ, ఈ సినిమా విడుదలైన తర్వాత డివైడ్ టాక్ రావడం, మరోవైపు భారీ బడ్జెట్ వార్తలు బయటకు రావడంతో ఇప్పుడు ‘ఆదర్శ కుటుంబం’ సినిమా ఆర్థిక లెక్కలపై చర్చ మొదలైంది. బడ్జెట్ ఫెల్యూవర్ గా పరిగణిస్తున్నారు.

అమెరికా ఎన్నికల వేళ.. ట్రంప్‌కు అసలైన పరీక్ష!InternationalSwechaa02 Nov 2026, 11:47 PM

అమెరికా ఎన్నికల వేళ.. ట్రంప్‌కు అసలైన పరీక్ష!

మరికొద్ది గంటల్లో అమెరికాలో ఎన్నికల సమరం మొదలుకాబోతోంది. దేశవ్యాప్తంగా కోట్లాది మంది ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకోబోతున్నారు. కానీ ఈసారి అమెరికా ఎన్నికలు సాధారణ రాజకీయ పోరులా లేవు. అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌కు ఇది అత్యంత కీలకమైన పరీక్షగా మారింది.

హైదరాబాద్ వేదికగా బీజేపీ మాస్టర్ ప్లాన్! అమిత్ షా ఎంట్రీ వెనుక అంత కథ ఉందా..?తెలంగాణSwechaa02 Nov 2026, 11:14 PM

హైదరాబాద్ వేదికగా బీజేపీ మాస్టర్ ప్లాన్! అమిత్ షా ఎంట్రీ వెనుక అంత కథ ఉందా..?

ఢిల్లీ ర్యాలీకి కౌంటర్‌గా హైదరాబాద్‌లో బీజేపీ బలప్రదర్శన చేయడం వెనుక వ్యూహమేంటి? అమిత్ షా స్వయంగా రంగంలోకి దిగాల్సిన అవసరం ఏమొచ్చింది? తెలంగాణలో బీజేపీ కొత్త రాజకీయ ఆట మొదలుపెట్టిందా? ఇదే ఇప్పుడు తెలంగాణ రాజకీయాల్లో హాట్ టాపిక్.

TG: దేశాన్ని 'అదానీ'కి కట్టబెడుతున్నారు.. బీజేపీ తీరుపై పొన్నం ఫైర్!తెలంగాణSwechaa02 Nov 2026, 09:59 PM

TG: దేశాన్ని 'అదానీ'కి కట్టబెడుతున్నారు.. బీజేపీ తీరుపై పొన్నం ఫైర్!

TG: కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్‌ షా తెలంగాణ పర్యటన లక్ష్యంగా మంత్రి పొన్నం ప్రభాకర్‌ తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ ప్రభుత్వం దేశ సంపదనంతా అదానీ గ్రూప్‌కే ధారాదత్తం చేస్తోందని, యావత్ భారతదేశాన్ని ‘అదానీకరణ’ చేసే కుట్ర జరుగుతోందని సంచలన ఆరోపణలు చేశారు. అమిత్ షా పర్యటన కేవలం కాంగ్రెస్ పార్టీని విమర్శించడానికే పరిమితమైందని, తెలంగాణ ప్రయోజనాలపై ఆయనకు ఏమాత్రం చిత్తశుద్ధి లేదని మండిపడ్డారు.హైదరాబాద్‌లో మీడియాతో మాట్లాడిన మంత్రి పొన్నం, కేంద్ర ప్రభుత్వ కార్పొరేట్ అనుకూల విధానాలను సూటిగా ఎండగట్టారు. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ, కేంద్ర మంత్రి అమిత్ షా కేవలం ఆ ముగ్గురు గుజరాతీయుల కోసమే పనిచేస్తున్నారని ఆరోపించారు.

సీఎం రేవంత్‌కు సెలవు చెప్పే సమయం వచ్చేసిందితెలంగాణSwechaa02 Nov 2026, 09:39 PM

సీఎం రేవంత్‌కు సెలవు చెప్పే సమయం వచ్చేసింది

Harish Rao: సీఎం రేవంత్ కు సెలవు చెప్పే రోజు వచ్చేసిందన్నారు మాజీమంత్రి హరీశ్ రావు. కరెంటుకు సెలవు, నీళ్లకు సెలవు, పంటలకు సెలవు అంటున్న రేవంత్ రెడ్డికి మనందరం కలిసి సెలవు ప్రకటించొద్దా? అని అన్నారు. మీ చేతకాని పాలన ఇక చాలు అని మనందరం కలిసి రేవంత్ రెడ్డికి సెలవు చెప్పే రోజులు వచ్చాయన్నారు. ఆయనకు కూడా సెలవు చెప్పాల్సిందేనని హరీశ్ రావు వ్యాఖ్యానించారు. వనపర్తి జిల్లా పెద్దమందడి మండలం అల్వాల గ్రామంలో పర్యటించిన హరీశ్ రావు సాగునీరు అందక ఎండిపోయిన పంటపొలాలను పరిశీలించారు. ఈ సందర్భంగా ప్రభుత్వంపై విమర్శలు గుప్పించారు.

Amit Shah: అమిత్‌ షాతో చిరంజీవి, రామ్ చరణ్‌ భేటీ.. సడెన్‌గా ఎందుకు కలిశారు?సినిమాSwechaa02 Nov 2026, 09:34 PM

Amit Shah: అమిత్‌ షాతో చిరంజీవి, రామ్ చరణ్‌ భేటీ.. సడెన్‌గా ఎందుకు కలిశారు?

Amit Shah: కేంద్ర హోంమంత్రి అమిత్‌ షా హైదరాబాద్‌కు రావడం.. ఆయన బస చేసిన హోటల్‌కు వెళ్లి మెగాస్టార్ చిరంజీవి, రామ్ చరణ్ కలవడం ఒక్కసారిగా పెద్ద టాపిక్‌గా మారింది. వీళ్లు కలవగానే.. తెరవెనుక ఏదో రాజకీయ వ్యూహం నడుస్తోందని, ఏదో పెద్ద ప్లానే ఉందని చాలామంది అనుకున్నారు. కానీ, అసలు విషయం బయటకు వచ్చాక అందరికీ క్లారిటీ వచ్చింది. ఈ భేటీ వెనుక ఎలాంటి పాలిటిక్స్ లేవని.. కేవలం సినిమా ఇండస్ట్రీలోని ఆర్టిస్టులను వేధిస్తున్న ఒక పెద్ద సమస్య గురించే చిరంజీవి నేరుగా అమిత్ షా దగ్గర మాట్లాడారు. అదే.. ఏఐ, డీప్‌ఫేక్ టెక్నాలజీతో సెలబ్రిటీల పరువు తీస్తున్న సైబర్ కేటుగాళ్ల వ్యవహారం.ఈ మధ్యకాలంలో హీరోయిన్లు, ప్రముఖుల ముఖాలను డీప్‌ఫేక్ టెక్నాలజీతో మార్చేసి, అసభ్యకరమైన వీడియోలు, ఫొటోలు సోషల్ మీడియాలో వదులుతున్న సంగతి తెలిసిందే. దీనిపై మొన్నామధ్య చిరంజీవి ‘ఎక్స్’లో చాలా ఘాటుగా స్పందించారు.

TG: MRP స్టిక్కర్లు మార్చి బియ్యం దోపిడీ.. 11 మందిపై కేసులు!తెలంగాణSwechaa02 Nov 2026, 08:39 PM

TG: MRP స్టిక్కర్లు మార్చి బియ్యం దోపిడీ.. 11 మందిపై కేసులు!

TG: నిత్యావసర సరుకైన బియ్యం అమ్మకాల్లో అక్రమాలకు తెరలేపి, సామాన్యుల జేబులకు చిల్లు పెడుతున్న కేటుగాళ్ల గుట్టు రట్టయింది. కంపెనీలు ముద్రించిన అసలు ఎంఆర్‌పీ ధరలను గోల్‌మాల్ చేసి, అధిక రేట్లతో కూడిన నకిలీ స్టిక్కర్లు అతికిస్తూ వినియోగదారులను మోసం చేస్తున్న వ్యాపారులపై తెలంగాణ పౌరసరఫరాల శాఖ కొరడా ఝళిపించింది. హైదరాబాద్, రంగారెడ్డి జిల్లాల్లో ఎన్‌ఫోర్స్‌మెంట్ టాస్క్‌ఫోర్స్, లీగల్ మెట్రాలజీ అధికారులు సంయుక్తంగా నిర్వహించిన మెరుపు తనిఖీల్లో ఈ దారుణ మోసం వెలుగుచూసింది. నిబంధనల ఉల్లంఘనలకు పాల్పడిన 11 మంది వ్యాపారులపై క్రిమినల్ కేసులు నమోదు చేశారు.పౌరసరఫరాల శాఖ కమిషనర్ ఎం. స్టీఫెన్ రవీంద్ర ఆదేశాలతో అధికారులు హోల్‌సేల్, రిటైల్ మార్కెట్లలో ఆకస్మిక తనిఖీలు చేపట్టారు. ఈ సందర్భంగా వ్యాపారులు వినియోగదారులను దోచుకుంటున్న తీరు చూసి అధికారులు విస్మయానికి గురయ్యారు. బియ్యం మిల్లులు, బ్రాండెడ్ కంపెనీలు బస్తాలపై ముద్రించిన అసలు ధరను చెరిపేయడం లేదా తొలగించడం చేస్తున్నారు.

Dhanunjay: ధనుంజయ్‌పై నటి ఫిర్యాదు.. వెనకేసుకొచ్చిన బిగ్‌బాస్ సెలబ్రిటీలు!సినిమాSwechaa02 Nov 2026, 08:33 PM

Dhanunjay: ధనుంజయ్‌పై నటి ఫిర్యాదు.. వెనకేసుకొచ్చిన బిగ్‌బాస్ సెలబ్రిటీలు!

Dhanunjay: అమెజాన్ ప్రైమ్ రియాలిటీ షో 'ది ట్రైటర్స్' ఫేమ్, నటుడు ధనుంజయ్‌పై నటి శ్రీదేవి పోలీసులకు ఫిర్యాదు చేయడం ఇండస్ట్రీలో హాట్ టాపిక్‌గా మారిన వేళ.. ఈ వ్యవహారంలో ఊహించని ట్విస్ట్ చోటుచేసుకుంది. ఒకవైపు సోషల్ మీడియాలో తనను అసభ్యకరంగా ట్రోల్ చేస్తూ వేధిస్తున్నారంటూ బాధితురాలు కేసు పెట్టగా, మరోవైపు ధనుంజయ్‌కు బిగ్‌బాస్ సెలబ్రిటీలు బాహాటంగా మద్దతు తెలపడం తీవ్ర చర్చనీయాంశమైంది. బాధితురాలి ఫిర్యాదు ప్రకారం.. తనను ఉద్దేశపూర్వకంగా టార్గెట్ చేస్తూ ధనుంజయ్ అసభ్యకరమైన కామెంట్లు పెడుతున్నారని, కించపరిచేలా మీమ్స్ క్రియేట్ చేసి ప్రచారం చేస్తున్నారని పేర్కొన్నారు. కేవలం ధనుంజయ్ మాత్రమే కాకుండా, అతని ఫాలోవర్లు కూడా ఆన్‌లైన్‌లో తనను మానసిక క్షోభకు గురిచేస్తున్నారని ఆరోపించారు:

Egg Donation Mafia: హైదరాబాద్‌లో అండాల మాఫియా.. చీకటి దందా వెనక వణికించే నిజాలు!తెలంగాణSwechaa02 Nov 2026, 07:46 PM

Egg Donation Mafia: హైదరాబాద్‌లో అండాల మాఫియా.. చీకటి దందా వెనక వణికించే నిజాలు!

Egg Donation Mafia: వెండితెరపై చూసే మెడికల్ మాఫియా కథలను తలదన్నేలా హైదరాబాద్ నడిబొడ్డున ఒక భయానక చీకటి రాజ్యం నడిచింది. పేదరికాన్ని ఆసరాగా చేసుకుని, అమాయక మహిళల శరీరాలను ఏటీఎం మిషన్లుగా మార్చేసిన ఒక కిరాతక ఎగ్ డొనేషన్ నెట్‌వర్క్‌ను సిటీ పోలీసులు గుట్టురట్టు చేశారు. వైద్య నిబంధనలను చెత్తబుట్టలో వేసి, ప్రాణాలకే ప్రమాదమని తెలిసినా ఒక్కో మహిళ నుంచి పదే పదే అండాలు తీసి కోట్లు కొల్లగొట్టిన ఈ ముఠా అకృత్యాలు బయటకు రావడంతో యావత్ సమాజం ఉలిక్కిపడింది.సాధారణంగా ఐవీఎఫ్ రూల్స్ ప్రకారం ఒక మహిళ జీవితకాలంలో పరిమితంగా మాత్రమే అండాల సేకరణ జరగాలి. అది కూడా పూర్తి ఆరోగ్య పరీక్షలు, చట్టబద్ధమైన గైడ్‌లైన్స్ ప్రకారమే సాగాలి. కానీ ఈ ముఠా దృష్టిలో మహిళలు కేవలం లాభాలు తెచ్చిపెట్టే సరుకులు మాత్రమే. ప్రమాదకర హార్మోన్ ఇంజెక్షన్లను విచ్చలవిడిగా గుచ్చి, శరీరం తట్టుకోలేక విలవిల్లాడుతున్నా పట్టించుకోకుండా ఒక్కో మహిళ నుంచి ఏకంగా 10 సార్లు అండాలు బయటకు లాగేశారు.

Keerthy Suresh: కీర్తికి ఏదీ కలిసి రావడం లేదు.."అక్క" కూడా అక్కడే ఆగిపోయిందా!సినిమాSwechaa02 Nov 2026, 07:32 PM

Keerthy Suresh: కీర్తికి ఏదీ కలిసి రావడం లేదు.."అక్క" కూడా అక్కడే ఆగిపోయిందా!

Keerthy Suresh: అటు కోలీవుడ్ ఇటు టాలీవుడ్‌లో వరుస హిట్స్ తో స్టార్ హీరోయిన్‌గా గుర్తింపు తెచ్చుకున్న కీర్తి సురేష్‌కు ఇప్పుడు ఏ సినిమా చేసినా పెద్దగా కలిసి రావడం లేదు. మహానటి సినిమాతో జాతీయ స్థాయిలో గుర్తింపు తెచ్చుకున్న ఈమె ఆ తర్వాత చేసిన సినిమాలతో మాత్రం అదే స్థాయి విజయాలు దక్కడం లేదు. తెలుగు, తమిళంతో పాటు బాలీవుడ్‌లోనూ అదృష్టాన్ని పరీక్షించుకుంటున్న కీర్తికి ఆశించిన సక్సెస్ రావడం లేదు.

నిమ్స్‌లో అక్రమాలపై కొనసాగుతున్న ఏసీబీ తనిఖీలుతెలంగాణSwechaa02 Nov 2026, 07:20 PM

నిమ్స్‌లో అక్రమాలపై కొనసాగుతున్న ఏసీబీ తనిఖీలు

NIMS: హైదరాబాద్ నిమ్స్ ఆసుపత్రిలో అక్రమాలకు సంబంధించి ఏసీబీ అధికారుల దర్యాఫ్తు కొనసాగుతోంది. 15మంది ఏసీబీ అధికారులు బృందాలుగా ఏర్పడి నిమ్స్ లో తనిఖీలు నిర్వహిస్తున్నారు. పలు ఆపరేషన్ థియేటర్లు, మెడికల్ సోర్ట్స్ రికార్డ్స్ ని పరిశీలించారు. నిమ్స్ లో కొన్నేళ్లుగా జరిగిన అక్రమాలపై అధికారులు దృష్టి పెట్టారు. 3 రోజులుగా నిమ్స్ ఆసుపత్రిలో పలు విభాగాల్లో సోదాలు చేస్తున్నారు.