స్వేచ్ఛ షార్ట్స్ — తాజా తెలుగు వార్తలు

CPI: రైతులకు తక్షణమే కరువు సాయం అందించాలి- పల్లా వెంకటరెడ్డి డిమాండ్తెలంగాణSwechaa02 Nov 2026, 06:47 PM

CPI: రైతులకు తక్షణమే కరువు సాయం అందించాలి- పల్లా వెంకటరెడ్డి డిమాండ్

CPI: మునుగోడు మండలంలోని చల్మడ గ్రామంలో సీపీఐ పార్టీ కరువు యాత్రను నిర్వహించింది. ఈ కార్యక్రమంలో సీపీఐ జాతీయ కార్యదర్శి పల్లా వెంకటరెడ్డి, సీపీఐ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు, ఎమ్మెల్సీ నెల్లికంటి సత్యం పాల్గొన్నారు. పంటలను పరిశీలించారు. రైతులతో మాట్లాడారు. అక్కడ నెలకొన్న కరువు పరిస్థితులు, నష్టాల గురించి అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా పత్తి, వరి సాగు చేసిన రైతులకు అపార నష్టం కలిగినట్లు గుర్తించారు. రైతుల గోడు విని తీవ్ర ఆవేదన చెందారు పల్లా వెంకటరెడ్డి. పంట నష్టపోయిన రైతులకు తక్షణమే కరువు సాయం అందించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.

TG: ఫారెస్ట్‌ భూముల సర్వేను దగ్గరుండి నేనే చూస్తా.. మంత్రి పొంగులేటి కామెంట్స్ వైరల్!తెలంగాణSwechaa02 Nov 2026, 06:39 PM

TG: ఫారెస్ట్‌ భూముల సర్వేను దగ్గరుండి నేనే చూస్తా.. మంత్రి పొంగులేటి కామెంట్స్ వైరల్!

TG: తెలంగాణలో దశాబ్దాలుగా రైతులను, సామాన్య ప్రజలను కలవరపెడుతున్న అటవీ, రెవెన్యూ భూ సరిహద్దు వివాదాలకు ముగింపు పలికేందుకు ప్రభుత్వం గట్టి నిర్ణయం తీసుకుంది. రెండు శాఖల మధ్య సమన్వయ లోపంతో నలుగుతున్న ఈ సమస్యలపై మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి స్వయంగా రంగంలోకి దిగారు. క్షేత్రస్థాయిలో నిర్వహించే జాయింట్ సర్వే ప్రక్రియను తానే స్వయంగా దగ్గరుండి పర్యవేక్షిస్తానని మంత్రి చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు అధికార వర్గాల్లో తీవ్ర చర్చనీయాంశంగా మారాయి. డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ సచివాలయంలో రెవెన్యూ, అటవీ శాఖలు, సర్వే అండ్ సెటిల్‌మెంట్ అధికారులతో సోమవారం నిర్వహించిన ఉన్నత స్థాయి సమీక్షలో మంత్రి పొంగులేటి మాట్లాడారు.

GVMC Elections: వైజాగైట్స్ ఏంట్రా ఇది? ఓటు వేయడానికి ఇంత బద్ధకమా..!ఏపీSwechaa02 Nov 2026, 06:02 PM

GVMC Elections: వైజాగైట్స్ ఏంట్రా ఇది? ఓటు వేయడానికి ఇంత బద్ధకమా..!

GVMC Elections: సోషల్ మీడియాలో చూస్తే చాలు.. సిటీ రోడ్లు బాగోలేవు, ఇన్ఫ్రాస్ట్రక్చర్ లేదు, అది మారాలి ఇది మారాలి అని పొద్దస్తమానం గొంతు చించుకుని పోస్టులు పెట్టే మనోళ్లు తీరా ఓటింగ్‌ రోజు మాత్రం సైలెంట్ అయిపోయారు. ప్రజాస్వామ్యంలో మన వాయిస్‌ని బలంగా వినిపించే బిగ్గెస్ట్ పవర్ ‘ఓటు’. అలాంటి ఓటును వేయడానికి ఏపీలోనే బిగ్గెస్ట్ సిటీ అయిన వైజాగ్‌ పీపుల్ అసలు పెద్దగా ఇంట్రెస్ట్ చూపించలేదు. పోలింగ్ డే సండే రావడంతో.. హ్యాపీగా ఇంట్లో ఏసీ ఆన్ చేసుకుని పడుకోవడం, ఆఫ్టర్‌నూన్ నుంచి టీవీ ముందు కూర్చుని క్రికెట్ మ్యాచ్ చూస్తూ రిలాక్స్ అవ్వడానికే ఎక్కువ ప్రిఫరెన్స్ ఇచ్చారు.

Bollywood: హిందీలో రవిబాబు డెబ్యూ..కంగనా-రానాల "స్కేరీ పిక్చర్స్"..సినిమాSwechaa02 Nov 2026, 05:41 PM

Bollywood: హిందీలో రవిబాబు డెబ్యూ..కంగనా-రానాల "స్కేరీ పిక్చర్స్"..

Bollywood: మన టాలీవుడ్‌ సినిమా ఇండస్ట్రీలో తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకున్న నటుడు, దర్శకుడు రవిబాబు ఇప్పుడు బాలీవుడ్‌లోకి అడుగుపెడుతున్నారు. విభిన్నమైన కథలు, ప్రయోగాత్మక సినిమాలతో ప్రేక్షకులను ఆకట్టుకున్న ఆయన తొలిసారి హిందీలో ఓ హారర్ సినిమాను తెరకెక్కించబోతున్నారు. ఈ ప్రాజెక్ట్‌లో బాలీవుడ్ ఫైర్ బ్రాండ్ కంగనా రనౌత్ హీరోయిన్‌గా నటిస్తుండటం విశేషం.

క్లీన్, ట్రాఫిక్ ఫ్రీ సిటీగా హైదరాబాద్- సీఎం రేవంత్ రెడ్డి కీలక ఆదేశాలుతెలంగాణSwechaa02 Nov 2026, 05:01 PM

క్లీన్, ట్రాఫిక్ ఫ్రీ సిటీగా హైదరాబాద్- సీఎం రేవంత్ రెడ్డి కీలక ఆదేశాలు

Cm Revanth: హైదరాబాద్ మహానగరాన్ని క్లీన్ సిటీగా, ట్రాఫిక్ ఫ్రీ సిటీగా తీర్చిదిద్దాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధికారులను ఆదేశించారు. సోమవారం జూబ్లీహిల్స్ నివాసంలో మున్సిపల్ అధికారులతో వివిధ అంశాలపై సీఎం సమీక్ష నిర్వహించారు. నగరంలో ఎక్కడా చెత్త కనిపించకూడదని, చెత్త సేకరణపై నిరంతర పర్యవేక్షణ ఉండాలని అధికారులకు సూచించారు. ప్రతిరోజూ ఇంటింటికీ చెత్త సేకరణ జరిగేలా అవసరమైన చర్యలు తీసుకోవాలన్నారు. నిర్లక్ష్యం వహించిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలన్నారు. నిర్మాణ వ్యర్థాల తరలింపునకు ప్రత్యేక ఏర్పాట్లు చేయాలన్నారు. మున్సిపల్ పరిధిలోని వివిధ ఇండస్ట్రియల్ ఏరియాల్లో చెత్త సేకరణకు అధికారులతో సమన్వయం చేసుకోవాలని సూచించారు.

నాగార్జునసాగర్‌లో విష రసాయనాల కలకలం..తెలంగాణSwechaa02 Nov 2026, 04:55 PM

నాగార్జునసాగర్‌లో విష రసాయనాల కలకలం..

Chemical Mafia: నల్లగొండ జిల్లాలో ప్రమాదకరమైన వ్యర్ధ రసాయనాల మాఫియా రెచ్చిపోతోంది. కెమికల్ కంపెనీల నుంచి వ్యర్ధ రసాయనాలను ట్రీట్ మెంట్ ప్లాంట్లకు తరలించకుండా నిబంధనలకు విరుద్ధంగా యధేచ్చగా ఎక్కడపడితే అక్కడ పారబోస్తున్నారు. చర్యలు తీసుకోవాల్సిన పొల్యూషన్ కంట్రోల్ బోర్డు అధికారులు మామూళ్ల మత్తులో చోద్యం చూస్తున్నారన్న ఆరోపణలు ఉన్నాయి. కంపెనీ నుంచి రసాయనాల ట్యాంకర్ బయలుదేరిన దగ్గర నుంచి ట్రీట్ మెంట్ ప్లాంట్ వరకు పొల్యూషన్ బోర్డు అధికారులు ట్రాక్ చేయాల్సి ఉంటుంది. కానీ, పీసీబీ అధికారులు అదేమీ పట్టించుకోవడం లేదు.

Murasu: దూసుకొస్తున్న 'మురసు' తుపాన్.. ఆ జిల్లాల ప్రజలు జాగ్రత్త!ఏపీSwechaa02 Nov 2026, 04:20 PM

Murasu: దూసుకొస్తున్న 'మురసు' తుపాన్.. ఆ జిల్లాల ప్రజలు జాగ్రత్త!

Murasu: అర్నబ్ తుపాన్ సృష్టించిన విధ్వంసాన్ని మర్చిపోకముందే బంగాళాఖాతం మరోసారి అల్లకల్లోలంగా మారింది. సముద్ర గర్భంలో బలపడిన ‘మురసు’ తీవ్ర తుపాన్ ఇప్పుడు కోస్తా తీరం వైపు అత్యంత వేగంగా దూసుకొస్తోంది. గడిచిన ఆరు గంటల్లో గంటకు 25 కిలోమీటర్ల వేగంతో కదులుతూ దక్షిణ కోస్తా వైపు నేరుగా గురిపెట్టింది. ప్రస్తుతం చెన్నైకి 200 కిలోమీటర్లు, నెల్లూరుకు 210, కావలికి 220, ఒంగోలుకు 260, మచిలీపట్నానికి 270 కిలోమీటర్ల దూరంలో కేంద్రీకృతమైన ఈ తీవ్ర తుపాన్.. రానున్న కొన్ని గంటల్లో మరింత ప్రమాదకరంగా మారబోతోంది. సరిగ్గా అర్ధరాత్రి దాటిన తర్వాత ఒంగోలు పరిసరాల్లో తీరం దాటే అవకాశం ఉందని వాతావరణ శాఖ అత్యవసర హెచ్చరికలు జారీ చేసింది.

చౌటుప్పల్‌లో జోగిని హత్య కేసును ఛేదించిన పోలీసులు.. నగలు నగదు కోసమే మర్డర్క్రైమ్Swechaa02 Nov 2026, 04:14 PM

చౌటుప్పల్‌లో జోగిని హత్య కేసును ఛేదించిన పోలీసులు.. నగలు నగదు కోసమే మర్డర్

Jogini Sudhakar: చౌటుప్పల్ లో నిన్న జరిగిన జోగిని సుధాకర్ హత్య కేసులో మిస్టరీని పోలీసులు ఛేదించారు. హత్య జరిగిన 24 గంటల్లోపే నిందితులను అరెస్ట్ చేశారు. నగలు, నగదు కోసమే జోగిని సుధాకర్ ను హత్య చేసినట్టు నిర్ధారించారు. హత్య కేసులో ముగ్గురు నిందితులను అదుపులోకి తీసుకున్నారు. నిందితుల నుంచి 130 తులాల 600 గ్రాముల బంగారం, రూ 9 లక్షల నగదు, ఒక కారు, హత్యకు ఉపయోగించిన కత్తి స్వాధీనం చేసుకున్నారు.

RC 17: సర్‌ప్రైజ్ ఇచ్చారు..చాలా విషయాలలో క్లారిటీ ఇవ్వలేదు!సినిమాSwechaa02 Nov 2026, 04:11 PM

RC 17: సర్‌ప్రైజ్ ఇచ్చారు..చాలా విషయాలలో క్లారిటీ ఇవ్వలేదు!

RC 17: టాలీవుడ్‌లో మరోసారి క్రేజీ కాంబినేషన్ సెట్స్ మీదకి రాబోతోంది. మెగా పవర్ స్టార్ రామ్ చరణ్, క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ కలిసి మళ్ళీ సినిమా చేయబోతున్నారనే వార్త గత కొంతకాలంగా అభిమానుల్లో ఆసక్తిని పెంచుతోంది. ఎట్టకేలకు ఈ క్రేజీ ప్రాజెక్ట్‌కు అధికారికంగా మొదలైంది. 2027, నవంబర్ 1న హైదరాబాద్‌లో ఘనంగా పూజా కార్యక్రమాలతో RC 17 ప్రారంభమైంది.

హైదరాబాద్‌లో ‘ఇందిరమ్మ ఇళ్ల టవర్స్’ అప్‌డేట్.. మరోసారి ఈ-లాటరీ!తెలంగాణSwechaa02 Nov 2026, 03:40 PM

హైదరాబాద్‌లో ‘ఇందిరమ్మ ఇళ్ల టవర్స్’ అప్‌డేట్.. మరోసారి ఈ-లాటరీ!

గ్రేటర్ హైదరాబాద్ పరిధిలోని కోర్ అర్బన్ రీజియన్‌లో తెలంగాణ ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా చేపట్టిన 'ఇందిరమ్మ ఇండ్ల టవర్స్' పథకానికి సంబంధించి అర్హులైన లబ్ధిదారుల ఎంపిక ప్రక్రియ వేగవంతమైంది. తొలి విడతలో ఫ్లాట్లు కేటాయించినప్పటికీ, లబ్ధిదారులు ఆర్థిక ఇబ్బందుల కారణంగా తొలి వాయిదా చెల్లించలేకపోవడం, స్థానికంగా నివసించకపోవడం, ఇప్పటికే సొంత ఇళ్లు కలిగి ఉండటం లేదా దరఖాస్తుల్లో చిరునామాలు తప్పుగా నమోదు కావడం వంటి వివిధ కారణాలతో పలు ఫ్లాట్లు ఖాళీగా మిగిలిపోయాయి. ఈ నేపథ్యంలో మిగిలిన ఫ్లాట్లను పారదర్శకంగా భర్తీ చేసేందుకు నవంబర్ 3 మరియు 4 తేదీలలో ఆన్‌లైన్ ద్వారా ప్రత్యేక ఈ-లాటరీ (E-Lottery) నిర్వహించనున్నట్లు హౌసింగ్ బోర్డు వైస్ చైర్మన్ వీపీ గౌతమ్ అధికారికంగా ప్రకటించారు.

నవంబర్ కోటా రేషన్ బియ్యం పంపిణీ ప్రారంభం!తెలంగాణSwechaa02 Nov 2026, 03:33 PM

నవంబర్ కోటా రేషన్ బియ్యం పంపిణీ ప్రారంభం!

 తెలంగాణ రాష్ట్రంలోని పేద, మధ్యతరగతి రేషన్ కార్డుదారులకు రేవంత్ రెడ్డి ప్రభుత్వం అత్యంత తీపి కబురు అందించింది. సాంకేతిక, రవాణా కారణాల వల్ల మూడునెలలుగా నిలిచిపోయిన ఉచిత సన్నబియ్యం పంపిణీని పునఃప్రారంభించేందుకు పౌరసరఫరాల శాఖ అన్ని ఏర్పాట్లు పూర్తి చేసింది. ఈ నవంబర్ నెలకు సంబంధించిన రేషన్ బియ్యం కోటాను సోమవారం (నవంబర్ 2) నుంచి రాష్ట్రవ్యాప్తంగా ఉన్న రేషన్ దుకాణాల ద్వారా లబ్ధిదారులకు అందించడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది.

AP: రాప్తాడు  రాక్షసుడి మోకాళ్లలో  కాల్చడం వెనక అసలు కారణం ఇదే.. హ్యాట్సాఫ్‌ అనాల్సిందేఏపీSwechaa02 Nov 2026, 03:18 PM

AP: రాప్తాడు రాక్షసుడి మోకాళ్లలో కాల్చడం వెనక అసలు కారణం ఇదే.. హ్యాట్సాఫ్‌ అనాల్సిందే

రాప్తాడు ప్రభుత్వ పాఠశాలలో విద్యార్థినిపై ఎలక్ట్రిక్ రంపంతో కిరాతక దాడికి పాల్పడిన ఉన్మాది కేసు అనూహ్య మలుపు తిరిగింది. ఆదివారం ఆత్మకూరు అడవుల్లో జరిగిన పోలీస్ ఫైరింగ్ వ్యవహారం ఇప్పుడు తెలుగు రాష్ట్రాల్లో తీవ్ర చర్చనీయాంశంగా మారింది. పట్టుకునే క్రమంలో నిందితుడు సీఐపై కత్తితో దాడి చేయబోయాడని, ఆత్మరక్షణ కోసమే ఆరు రౌండ్ల కాల్పులు జరిపామని పోలీసులు చెబుతున్నారు. అయితే, ఈ మొత్తం ఘటన వెనుక అసలు వాస్తవాలేంటి? ఇది సాధారణ అరెస్ట్ ఆపరేషనా లేక తెలంగాణలో సంచలనం సృష్టించిన ‘దిశ’ తరహా యాక్షనా అన్న అనుమానాలు ప్రజల్లో, సోషల్ మీడియాలో వెల్లువెత్తుతున్నాయి.

MiyapurLandScam: మియాపూర్ భూములను వదలని మాఫియా!స్వేచ్ఛ ఛైర్మన్ డెస్క్Swechaa02 Nov 2026, 02:51 PM

MiyapurLandScam: మియాపూర్ భూములను వదలని మాఫియా!

హైదరాబాద్‌ నగర శివార్లలోని మియాపూర్‌ భూముల వ్యవహారం మరోసారి రాష్ట్రవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. శేరిలింగంపల్లి మండలం మియాపూర్‌ గ్రామ పరిధిలోని సర్వే నంబర్లు 100, 101లో ఉన్న 550 ఎకరాల 39 గుంటల భూమిపై తెలంగాణ ప్రభుత్వానికే యాజమాన్య హక్కులు ఉన్నాయని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. బండారి రామచందర్‌ తదితరులు వర్సెస్‌ మైత్రి కోఆపరేటివ్‌ హౌసింగ్‌ సొసైటీ తదితరుల మధ్య సాగిన సివిల్‌ అప్పీళ్లను అక్టోబర్‌ 29, 2026న కొట్టివేస్తూ, 2003లో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌ హైకోర్టు ఇచ్చిన తీర్పును సమర్థించింది. ఈ భూమి విలువ సుమారు రూ.55,000 కోట్లుగా అంచనా వేస్తున్నారు.

నిధుల కోసం ప్రతిపక్ష ఎమ్మెల్యేలా కొట్లాడుతున్నా: రాజగోపాల్ రెడ్డితెలంగాణSwechaa02 Nov 2026, 12:50 PM

నిధుల కోసం ప్రతిపక్ష ఎమ్మెల్యేలా కొట్లాడుతున్నా: రాజగోపాల్ రెడ్డి

 రాష్ట్రంలో అధికార కాంగ్రెస్ పార్టీకి చెందిన మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి సొంత ప్రభుత్వం, అగ్రనేతల పనితీరుపై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడినప్పటికీ నియోజకవర్గాల అభివృద్ధికి నిధులు కేటాయించడంలో తీవ్ర వివక్ష చూపిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. తానేమీ ప్రతిపక్ష ఎమ్మెల్యేను కాకపోయినా, స్వపక్షంలో ఉంటూ కూడా నియోజకవర్గ నిధుల కోసం ప్రతిపక్ష నాయకుడిలా ప్రభుత్వంతో నిత్యం కొట్లాడాల్సి వస్తోందని ఆయన వ్యాఖ్యానించారు.

అలర్ట్.. హైదరాబాద్‌లో నేడు ట్రాఫిక్ ఆంక్షలు!తెలంగాణSwechaa02 Nov 2026, 12:20 PM

అలర్ట్.. హైదరాబాద్‌లో నేడు ట్రాఫిక్ ఆంక్షలు!

 హైదరాబాద్ నగరంలో నేడు (సోమవారం) భారతీయ జనతా పార్టీ (BJP) ఆధ్వర్యంలో 'లోక్‌తంత్ర బచావో - అరాచకతా హటావో' పేరుతో నిర్వహించనున్న భారీ పాదయాత్ర సందర్భంగా ట్రాఫిక్ పోలీసులు ప్రత్యేక ఆంక్షలు, దారి మళ్లింపులను అమల్లోకి తెచ్చారు. కేంద్ర హోం మంత్రి అమిత్ షా, కేంద్ర మంత్రులు జి.కిషన్ రెడ్డి, బండి సంజయ్ కుమార్ తదితర అగ్రనేతలు పాల్గొననున్న ఈ పాదయాత్ర నిజాం కాలేజ్ ఎదుట ఉన్న బీజేఆర్ (బాబూ జగ్జీవన్ రామ్) విగ్రహం నుంచి ప్రారంభమై అబిడ్స్ మీదుగా ఎంజే మార్కెట్ వరకు సాగనుంది.

ఉద్యమకారులకు మళ్లీ పెద్దపీట.. కేసీఆర్ వ్యూహం ఇదేనా?తెలంగాణSwechaa02 Nov 2026, 11:57 AM

ఉద్యమకారులకు మళ్లీ పెద్దపీట.. కేసీఆర్ వ్యూహం ఇదేనా?

రెండు గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ స్థానాల ఎన్నికలపై బీఆర్ఎస్ ప్రత్యేకంగా దృష్టి పెట్టింది. అభ్యర్థుల ఎంపిక విషయంలోనూ ఆచితూచి వ్యవహరించాలని కేసీఆర్ భావిస్తున్నట్లు తెలుస్తోంది. సామాజిక సమీకరణాలు, పార్టీకి చేసిన సేవలు, ఉద్యమ నేపథ్యం వంటి అంశాలను పరిగణనలోకి తీసుకుంటున్నట్లు ప్రచారం జరుగుతోంది.

రాప్తాడు ఘటనపై మంచు మనోజ్‌ భావోద్వేగం!ఏపీSwechaa02 Nov 2026, 11:55 AM

రాప్తాడు ఘటనపై మంచు మనోజ్‌ భావోద్వేగం!

 అనంతపురం జిల్లా రాప్తాడులో పదో తరగతి చదువుతున్న విద్యార్థినులపై జరిగిన ఘోర దాడి సంఘటనపై ప్రముఖ సినీ నటుడు మంచు మనోజ్ స్పందించారు. ఈ దారుణ ఘటన తనను తీవ్రంగా కలచివేసిందని, ఒక తండ్రిగా ఈ వార్త విన్నప్పుడు తన మనసు ఎంతో గాయపడిందని ఆయన తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. తీవ్రంగా గాయపడి ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న బాధిత బాలికలు త్వరగా కోలుకోవాలని భగవంతుడిని ప్రార్థిస్తున్నట్లు తన ఇన్‌స్టాగ్రామ్ వేదికగా ఒక భావోద్వేగ పోస్ట్‌ను పంచుకున్నారు.

చిత్రం లేదు
ఏపీSwechaa02 Nov 2026, 11:14 AM

ఏపీకి ‘మురసు’ ముప్పు.. 5 జిల్లాలకు రెడ్ అలర్ట్!

 బంగాళాఖాతంలో ఏర్పడిన 'మురసు' (Murasu) తుపాను తీవ్రరూపం దాలుస్తూ ఆంధ్రప్రదేశ్ తీరం దిశగా వేగంగా దూసుకొస్తోంది. ఇది నేటి (సోమవారం) అర్ధరాత్రి నుంచి రేపు (నవంబర్ 3వ తేదీ) తెల్లవారుజాము లోపు దక్షిణ కోస్తాంధ్రలోని నెల్లూరు - నర్సాపురం మధ్య, ప్రధానంగా ఒంగోలు సమీపంలో తీవ్ర రూపంతో తీరం దాటే అవకాశం ఉందని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ (APSDMA) అధికారికంగా వెల్లడించింది. తుపాను ముప్పు ముంచుకొస్తుండటంతో కోస్తాంధ్ర వ్యాప్తంగా అత్యవసర పరిస్థితులు నెలకొన్నాయి.

బాచుపల్లిలో 50 ఎకరాల 'నిమ్మగడ్డ' భూముల వివాదంస్వేచ్ఛ ఛైర్మన్ డెస్క్Swechaa02 Nov 2026, 10:48 AM

బాచుపల్లిలో 50 ఎకరాల 'నిమ్మగడ్డ' భూముల వివాదం

మేడ్చల్-మల్కాజిగిరి జిల్లా పరిధిలోని బాచుపల్లి గ్రామంలో శ్రీ నిమ్మగడ్డ శ్రీరామనాథంకు చెందిన దాదాపు 50 ఎకరాల విలువైన భూముల వ్యవహారం తీవ్ర వివాదాస్పదంగా మారింది. దశాబ్దాలుగా ఉన్న రిజిస్టర్డ్ రికార్డులు, రెవెన్యూ ఆధారాలు ఒకవైపు ఉంటే.. దొంగచాటుగా వెలిసిన పలు అన్రిజిస్టర్డ్ సేల్ డీడ్లు, జీపీఏల ఆధారంగా జరుగుతున్న ఆక్రమణలపై భూ బాధితులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఈ భారీ భూ కుంభకోణం వెనుక ఉన్న అసలు సూత్రధారులను తేల్చేందుకు సీఐడీ లేదా ఉన్నత స్థాయి రెవెన్యూ అధికారులతో సమగ్ర విచారణ జరిపించాలని డిమాండ్ చేస్తున్నారు.

చరిత్రలో ఈ రోజు (02 నవంబర్)InternationalSwechaa02 Nov 2026, 09:14 AM

చరిత్రలో ఈ రోజు (02 నవంబర్)

📌 నేటి ముఖ్యాంశాలు (Today's Highlights)

  • 1917: పాలస్తీనాలో యూదుల స్వతంత్ర హోదాకు మద్దతు తెలుపుతూ బ్రిటన్ 'బాల్ఫోర్ డిక్లరేషన్' (Balfour Declaration) జారీ చేసింది.

  • 1965: భారతీయ చిత్ర పరిశ్రమ బాలీవుడ్ సూపర్‌స్టార్, 'కింగ్ ఖాన్' షారుఖ్ ఖాన్ జననం.

  • 2000: అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రానికి (ISS) చేరుకున్న మొట్టమొదటి మానవ సిబ్బంది ప్రయాణం విజయవంతమైంది.

🌐 అంతర్జాతీయ సంఘటనలు

  • 1917: బ్రిటిష్ ఫారిన్ సెక్రటరీ ఆర్థర్ బాల్ఫోర్ చారిత్రక 'బాల్ఫోర్ ప్రకటన'ను జారీ చేశారు.

  • 1930: ఇథియోపియా చక్రవర్తిగా హైలే సెలాసీ I (Haile Selassie I) సింహాసనాన్ని అధిష్ఠించారు.

  • 1983: అమెరికా అధ్యక్షుడు రోనాల్డ్ రీగన్ ప్రతి ఏటా జనవరి 3వ సోమవారాన్ని 'మార్టిన్ లూథర్ కింగ్ జూనియర్ డే'గా జాతీయ సెలవు దినంగా ప్రకటిస్తూ బిల్లుపై సంతకం చేశారు.

🚀 సైన్స్ & అడ్వెంచర్

  • 2000: అంతరిక్ష చరిత్రలో కీలక ఘట్టం — అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రంలో (ISS) నివసించడానికి మొదటి వ్యోమగాముల బృందం (Expedition 1) సురక్షితంగా చేరుకుంది.

  • 1936: కెనడియన్ బ్రాడ్‌కాస్టింగ్ కార్పొరేషన్ (CBC) అధికారికంగా స్థాపించబడింది.

👤 ప్రముఖుల జననాలు & వర్ధంతులు

  • 1965 (జననం): షారుఖ్ ఖాన్ — ప్రముఖ భారతీయ సినీ నటుడు, 'బాద్‌షా ఆఫ్ బాలీవుడ్'.

  • 1755 (జననం): మేరీ ఆంటోయినెట్ — ఫ్రాన్స్ చివరి రాణి.

  • 1795 (జననం): జేమ్స్ కె. పోల్క్ — అమెరికా 11వ అధ్యక్షుడు.

  • 1877 (జననం): ఆగా ఖాన్ III — ఆల్ ఇండియా ముస్లిం లీగ్ వ్యవస్థాపకులలో ఒకరు.

  • 1950 (మరణం): జార్జ్ బెర్నార్డ్ షా — ప్రసిద్ధ ఐరిష్ రచయిత, నోబెల్ పురస్కార గ్రహీత.

నేటి పంచాంగం - 02 నవంబర్ 2026 | కార్తిక కృష్ణ అష్టమి, ఆశ్లేష నక్షత్రం & నేటి శుభ ఘడియలుSpiritualitySwechaa02 Nov 2026, 08:54 AM

నేటి పంచాంగం - 02 నవంబర్ 2026 | కార్తిక కృష్ణ అష్టమి, ఆశ్లేష నక్షత్రం & నేటి శుభ ఘడియలు

వివరాలు:

  • తేదీ: 02 నవంబరు 2026, సోమవారం

  • సంవత్సరం: శ్రీ పరాభవ నామ సంవత్సరం

  • అయనం & ఋతువు: దక్షిణాయనం, శరత్ఋతువు

  • మాసం & పక్షం: కార్తిక మాసం, కృష్ణ పక్షం

  • తిథి: అష్టమి (మధ్యాహ్నం 01:10 వరకు, తదుపరి నవమి)

  • వారం: సోమవారం (ఇందువాసరే)

  • నక్షత్రం: ఆశ్లేష (రాత్రి 03:45 వరకు, తదుపరి మఘ)

  • యోగం: శుభ (మధ్యాహ్నం 12:05 వరకు, తదుపరి శుక్ల)

  • కరణం: కౌలవ (మధ్యాహ్నం 01:10 వరకు), తదుపరి తైతుల (తెల్లవారుజామున 12:29 వరకు)

శుభ / అశుభ సమయాలు:

  • రాహుకాలం: ఉదయం 07:42 - 09:08 వరకు

  • యమగండం: ఉదయం 10:34 - మధ్యాహ్నం 12:00 వరకు

  • అమృతకాలం: రాత్రి 02:13 - 03:46 వరకు (తెల్లవారుజామున)

  • దుర్ముహూర్తము: మధ్యాహ్నం 12:22 - 01:08 వరకు మరియు మధ్యాహ్నం 02:39 - 03:25 వరకు

  • వర్జ్యం: సాయంత్రం 04:30 - 06:05 వరకు

గ్రహస్థితులు:

  • సూర్యరాశి: తుల

  • చంద్రరాశి: కర్కాటకం

  • సూర్యోదయం: ఉదయం 06:19

  • సూర్యాస్తమయం: సాయంత్రం 05:40

మనుషులు ఎందుకిలా మారుతున్నారు? తప్పు వ్యవస్థదా.. తల్లిదండ్రులదా?క్రైమ్Swechaa01 Nov 2026, 10:31 PM

మనుషులు ఎందుకిలా మారుతున్నారు? తప్పు వ్యవస్థదా.. తల్లిదండ్రులదా?

ఒక ఎనిమిదేళ్ల బాలుడు.. ఆరేళ్ల చిన్నారిపై దాడి చేశాడు. కిందపడేసి తన్నాడు. రాళ్లు, ఇటుకలు, పూలకుండీతో విచక్షణారహితంగా కొట్టాడు. పదో తరగతి చదువుతున్న బాలికపై 21 ఏళ్ల యువకుడు ఎలక్ట్రిక్ రంపంతో దాడి చేశాడు. తరగతి గదిలో పాఠం జరుగుతున్న సమయంలోనే దాడికి పాల్పడ్డాడు. ఇలాంటి ఘటనలు ఎందుకు జరుగుతున్నాయి..?

TG: కేసీఆర్ వర్సెస్ రేవంత్.. నిత్యావసర ధరల బాదుడుపై కౌశిక్ రెడ్డి ఫైర్!తెలంగాణSwechaa01 Nov 2026, 10:09 PM

TG: కేసీఆర్ వర్సెస్ రేవంత్.. నిత్యావసర ధరల బాదుడుపై కౌశిక్ రెడ్డి ఫైర్!

TG: తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత నిత్యావసర వస్తువుల ధరలు విపరీతంగా పెరిగిపోయాయని, ఇది కాంగ్రెస్ సృష్టించిన కృత్రిమ కరువు ఫలితమేనంటూ బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. తెలంగాణ భవన్‌లో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. 2023లో కేసీఆర్ హయాంలో ఉన్న ధరలకు, ప్రస్తుతం రేవంత్ రెడ్డి పాలనలో పెరిగిన రేట్లకు సంబంధించిన వివరాలను కంపేర్ చేస్తూ నిలదీశారు. గత ప్రభుత్వ హయాంలో రూ.1,150గా ఉన్న 25 కిలోల సన్నబియ్యం బస్తా ధర నేడు ఏకంగా 87 శాతం పెరిగి రూ.2,250కి చేరిందని, సన్‌ఫ్లవర్ నూనె రూ.110 నుంచి రూ.189కి, గ్యాస్ సిలిండర్ రూ.870 నుంచి రూ.1,300కి చేరి సామాన్యుడి వంటింట్లో మంటలు పుట్టిస్తోందని ఆయన ఆరోపించారు.

AP: సంచలనం.. రాప్తాడు నిందితుడిపై కాల్పులు.. పరిస్థితి విషమం..ఏపీSwechaa01 Nov 2026, 09:38 PM

AP: సంచలనం.. రాప్తాడు నిందితుడిపై కాల్పులు.. పరిస్థితి విషమం..

AP: అనంతపురం జిల్లా రాప్తాడు స్కూల్లో టెన్త్ క్లాస్ స్టూడెంట్‌పై ఎలక్ట్రిక్ రంపంతో ఎటాక్ చేసి పారిపోయిన ఉన్మాది హేమంత్ సీన్ ఎట్టకేలకు క్లోజ్ అయింది. క్రైమ్ చేసిన వెంటనే ఆత్మకూరు ఫారెస్ట్ ఏరియాలోకి ఎస్కేప్ అయిన నిందితుడిని పోలీసులు గంటల వ్యవధిలోనే గుర్తించారు.నిందితుడు ఆత్మకూరు అడవుల్లో దాక్కున్నట్లు లోకల్ ఇన్ఫర్మేషన్ రావడంతో పోలీస్ టీమ్స్ వెంటనే ఆ ఏరియాను కార్డన్ ఆఫ్ చేశాయి. సరెండర్ అవ్వాలని పోలీసులు గట్టిగా వార్నింగ్ ఇచ్చినా, వినకుండా తప్పించుకుని పారిపోయేందుకు నిందితుడు ట్రై చేశాడు. దీంతో పోలీసులు ఏమాత్రం లేట్ చేయకుండా నిందితుడిపై వరుసగా ఆరు రౌండ్లు కాల్పులు జరిపారు. బుల్లెట్లు తగలడంతో తీవ్రంగా గాయపడిన హేమంత్‌ను అదుపులోకి తీసుకుని, వెంటనే అనంతపురం హాస్పిటల్‌కు షిఫ్ట్ చేసి ట్రీట్మెంట్ అందిస్తున్నారు.

2029 యుద్ధానికి ఢిల్లీ ర్యాలీ నుంచే కాంగ్రెస్ స్కెచ్NationalSwechaa01 Nov 2026, 09:26 PM

2029 యుద్ధానికి ఢిల్లీ ర్యాలీ నుంచే కాంగ్రెస్ స్కెచ్

2029 ఎన్నికలకు ఇంకా రెండున్నరేళ్ల సమయం ఉంది. కానీ దేశ రాజకీయాల్లో ఎన్నికల వేడి ఇప్పుడే మొదలైందా? మోదీ ప్రభుత్వాన్ని గద్దె దించాలంటే ముందుగా ఎన్నికల వ్యవస్థపైనే పోరాటం చేయాలన్నది కాంగ్రెస్ కొత్త వ్యూహమా? రాహుల్ గాంధీ నేతృత్వంలో ఢిల్లీలో జరిగిన INDIA కూటమి ర్యాలీ వెనుక ఉన్న అసలు లక్ష్యం ఇదేనా?

Airline Fare Rules: ఎయిర్‌లైన్స్ దోపిడీకి చెక్.. త్వరలోనే అమల్లోకి కొత్త రూల్స్!NationalSwechaa01 Nov 2026, 09:06 PM

Airline Fare Rules: ఎయిర్‌లైన్స్ దోపిడీకి చెక్.. త్వరలోనే అమల్లోకి కొత్త రూల్స్!

Airline Fare Rules: ఫెస్టివల్స్, సమ్మర్ హాలిడేస్ వచ్చాయంటే చాలు.. ఊళ్లకు వెళ్లాలనుకునే వాళ్ల జేబులు ఖాళీ చేసే ఎయిర్‌లైన్స్ కంపెనీల ఆగడాలకు త్వరలోనే ఫుల్‌స్టాప్ పడబోతోంది. 'డైనమిక్ ప్రైసింగ్' పేరు చెప్పి ఫ్లైట్ టికెట్ రేట్లను ఆకాశానికి పెంచేసే ప్రైవేట్ కంపెనీల ఆటలు ఇకపై సాగేలా లేవు. ప్యాసింజర్స్ ఇబ్బందులను దృష్టిలో పెట్టుకుని సెంట్రల్ గవర్నమెంట్ కొత్త ఎయిర్‌ఫేర్ రూల్స్‌ను ఫైనల్ చేసింది. సుప్రీంకోర్టు సీరియస్ అవ్వడంతో సివిల్ ఏవియేషన్ మినిస్ట్రీ ఈ కొత్త గైడ్‌లైన్స్‌ను రెడీ చేసింది. త్వరలోనే అఫిషియల్ గెజిట్ నోటిఫికేషన్‌తో ఇవి అమల్లోకి రానున్నాయి.డిమాండ్ పేరుతో ప్రైవేట్ ఎయిర్‌లైన్స్ కామన్ మ్యాన్‌ను ఎలా లూటీ చేస్తున్నాయో వివరిస్తూ సోషల్ యాక్టివిస్ట్ ఎస్.లక్ష్మీనారాయణ సుప్రీంకోర్టులో పిల్ వేశారు. దీనిపై విచారణ జరిపిన కోర్టు.. ఎయిర్‌లైన్స్ కంపెనీల తీరుపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. టికెట్ ధరలను కంట్రోల్ చేసేందుకు పక్కా రూల్స్ తీసుకురావాలని ఆర్డర్ వేయడంతో గవర్నమెంట్ దిగొచ్చి ఈ కొత్త పాలసీని తీసుకొచ్చింది.

AP: "ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేస్తే మళ్లీ మావోయిస్టులు పుడతారు".. జగన్ సంచలన వ్యాఖ్యలు!ఏపీSwechaa01 Nov 2026, 08:09 PM

AP: "ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేస్తే మళ్లీ మావోయిస్టులు పుడతారు".. జగన్ సంచలన వ్యాఖ్యలు!

AP: ఏపీ మున్సిపల్ ఎన్నికల పోలింగ్ తీవ్ర ఉద్రిక్తతలకు దారితీసింది. కూటమి ప్రభుత్వ హయాంలో పోలీసులు దగ్గరుండి మరీ ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేస్తున్నారని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత, మాజీ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. న్యాయం జరగనప్పుడు ప్రజల్లో అసంతృప్తి కట్టలు తెంచుకుంటుందని హెచ్చరించిన ఆయన.. "ప్రజాస్వామ్య వ్యవస్థలను నాశనం చేసినప్పుడే సమాజంలో కాక్రోచ్‌లు, మావోయిస్టులు లాంటి విప్లవ పరిణామాలు పుట్టుకొస్తాయి" అంటూ చేసిన సంచలన కామెంట్స్ ఇప్పుడు రాష్ట్ర రాజకీయాల్లో పెను సంచనలం సృష్టిస్తున్నాయి.తన సొంత ఇలాకా అయిన పులివెందులలో జరుగుతున్న అరాచకాలే ఇందుకు నిదర్శనమని జగన్ నిప్పులు చెరిగారు. పులివెందుల మున్సిపాలిటీ పరిధిలో మొత్తం 80 పోలింగ్ బూతులు ఉంటే, ఏకంగా 70 బూతుల్లో వైఎస్సార్‌సీపీ ఏజెంట్లను లోపలికి రానివ్వకుండా అడ్డుకున్నారని మండిపడ్డారు.

TG: ‘మురాసు’ తుపాను ఎఫెక్ట్.. తెలంగాణకు రెడ్ అలర్ట్!తెలంగాణSwechaa01 Nov 2026, 07:24 PM

TG: ‘మురాసు’ తుపాను ఎఫెక్ట్.. తెలంగాణకు రెడ్ అలర్ట్!

TG: బంగాళాఖాతంలో దూసుకొస్తున్న ‘మురాసు’ తుపాను ప్రభావంతో తెలంగాణపై వరుణుడు పంజా విసరనున్నాడు. రానున్న మూడు నాలుగు రోజుల పాటు రాష్ట్రవ్యాప్తంగా విస్తారంగా వర్షాలు కురుస్తాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం హెచ్చరికలు జారీ చేసింది. పలు ప్రాంతాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు, కొన్ని జిల్లాల్లో అత్యంత భారీ వర్షాలు కురిసే ప్రమాదం ఉండటంతో అధికార యంత్రాంగం అప్రమత్తమైంది.ఈ తుపాను ప్రభావం నవంబర్ 3న పీక్ స్టేజ్‌కు చేరనుందని వాతావరణ శాఖ స్పష్టం చేసింది. ముఖ్యంగా ఖమ్మం, సూర్యాపేట, మహబూబాబాద్ జిల్లాల్లో అత్యంత భారీ వర్షాలు ముంచెత్తే అవకాశముండటంతో ఈ జిల్లాలకు ‘రెడ్ అలర్ట్’ ప్రకటించారు. ఇదే సమయంలో భద్రాద్రి కొత్తగూడెం, వరంగల్, హనుమకొండ జిల్లాల్లో అతి భారీ వర్షాలు కురిసే సూచనలు ఉండటంతో ‘ఆరెంజ్ అలర్ట్’ ఇచ్చారు. సిరిసిల్ల, కరీంనగర్, పెద్దపల్లి, భూపాలపల్లి, ములుగు, జనగాం, సిద్దిపేట, భువనగిరి జిల్లాల్లోనూ భారీ వర్షాలు పడనున్నాయి.

TG: రైతుల బతుకులతో రేవంత్ ఆటలు.. 24 గంటల కరెంట్ ఏదని ప్రశ్నించిన కేటీఆర్!తెలంగాణSwechaa01 Nov 2026, 07:09 PM

TG: రైతుల బతుకులతో రేవంత్ ఆటలు.. 24 గంటల కరెంట్ ఏదని ప్రశ్నించిన కేటీఆర్!

TG: కాంగ్రెస్ ప్రభుత్వం అన్నదాతల జీవితాలతో చెలగాటమాడుతోందని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ నిప్పులు చెరిగారు. ఎన్నికల ముందు ఇచ్చిన 24 గంటల ఉచిత విద్యుత్ హామీని గాలికొదిలేసి రైతులను నట్టేట ముంచారని సీఎం రేవంత్ రెడ్డిపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆదిలాబాద్‌లో ఏర్పాటు చేసిన 'రైతు గర్జన' సభకు వెళ్తున్న క్రమంలో ముఖరా (కే) రోడ్డు వద్ద మాజీ సర్పంచ్ గాడ్గే మీనాక్షి, మాజీ ఎంపీటీసీ గాడ్గే సుభాష్‌లతో పాటు పలువురు రైతులు ఆయనను కలిసి తమ గోడును వెళ్లబోసుకున్నారు.నీరు, కరెంట్ సక్రమంగా అందక నిలువునా ఎండిపోయిన పత్తి పంటలను కేటీఆర్‌కు చూపించి రైతులు కన్నీటిపర్యంతమయ్యారు. దీనిపై స్పందించిన కేటీఆర్.. కాంగ్రెస్ పాలనలో రైతుల దుస్థితిని చూసి ఆవేదన వ్యక్తం చేశారు. "రైతులకు 24 గంటల కరెంట్ ఇస్తామని చెప్పి అధికారంలోకి వచ్చిన రేవంత్ రెడ్డి.. ఇప్పుడేమో సాగునీరు అందించక, విద్యుత్ సరఫరా చేయక చేతులెత్తేశారు.

Trivikram: చిక్కుల్లో ఆదర్శకుటుంబం..నిర్మాతకి గట్టి షాక్?సినిమాSwechaa01 Nov 2026, 06:58 PM

Trivikram: చిక్కుల్లో ఆదర్శకుటుంబం..నిర్మాతకి గట్టి షాక్?

Trivikram: తాజాగా ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఆదర్శకుటుంబం చిత్రానికి కాపీ సెగ గట్టిగా తగిలింది. ఈ సినిమాలోని ఓ పాటను కాపీ చేశారంటూ మేకర్స్ మీద కేసు పెట్టినట్టుగా తెలుస్తోంది. ఈ మధ్యకాలంలో ఇలాంటి వ్యవహారాలు టాలీవుడ్‌లో బాగా సంచలనం అవుతున్నాయి. మొన్నటికిమొన్న ఆర్పీ పట్నాయక్ మీద ఒకావిడ తన పాటలను తీసుకున్నాడంటూ సోషల్ మీడియాలో రచ్చ చేసింది. ఇప్పుడు, వెంకటేష్ నటించిన ఆదర్శకుటుంబం సినిమా మేకర్స్ మీద కంప్లైంట్ చేయడం చర్చనీయాంశంగా మారింది.