స్వేచ్ఛ షార్ట్స్ — తాజా తెలుగు వార్తలు

TG: ‘మురాసు’ తుపాను ఎఫెక్ట్.. తెలంగాణకు రెడ్ అలర్ట్!తెలంగాణSwechaa01 Nov 2026, 07:24 PM

TG: ‘మురాసు’ తుపాను ఎఫెక్ట్.. తెలంగాణకు రెడ్ అలర్ట్!

TG: బంగాళాఖాతంలో దూసుకొస్తున్న ‘మురాసు’ తుపాను ప్రభావంతో తెలంగాణపై వరుణుడు పంజా విసరనున్నాడు. రానున్న మూడు నాలుగు రోజుల పాటు రాష్ట్రవ్యాప్తంగా విస్తారంగా వర్షాలు కురుస్తాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం హెచ్చరికలు జారీ చేసింది. పలు ప్రాంతాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు, కొన్ని జిల్లాల్లో అత్యంత భారీ వర్షాలు కురిసే ప్రమాదం ఉండటంతో అధికార యంత్రాంగం అప్రమత్తమైంది.ఈ తుపాను ప్రభావం నవంబర్ 3న పీక్ స్టేజ్‌కు చేరనుందని వాతావరణ శాఖ స్పష్టం చేసింది. ముఖ్యంగా ఖమ్మం, సూర్యాపేట, మహబూబాబాద్ జిల్లాల్లో అత్యంత భారీ వర్షాలు ముంచెత్తే అవకాశముండటంతో ఈ జిల్లాలకు ‘రెడ్ అలర్ట్’ ప్రకటించారు. ఇదే సమయంలో భద్రాద్రి కొత్తగూడెం, వరంగల్, హనుమకొండ జిల్లాల్లో అతి భారీ వర్షాలు కురిసే సూచనలు ఉండటంతో ‘ఆరెంజ్ అలర్ట్’ ఇచ్చారు. సిరిసిల్ల, కరీంనగర్, పెద్దపల్లి, భూపాలపల్లి, ములుగు, జనగాం, సిద్దిపేట, భువనగిరి జిల్లాల్లోనూ భారీ వర్షాలు పడనున్నాయి.

TG: రైతుల బతుకులతో రేవంత్ ఆటలు.. 24 గంటల కరెంట్ ఏదని ప్రశ్నించిన కేటీఆర్!తెలంగాణSwechaa01 Nov 2026, 07:09 PM

TG: రైతుల బతుకులతో రేవంత్ ఆటలు.. 24 గంటల కరెంట్ ఏదని ప్రశ్నించిన కేటీఆర్!

TG: కాంగ్రెస్ ప్రభుత్వం అన్నదాతల జీవితాలతో చెలగాటమాడుతోందని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ నిప్పులు చెరిగారు. ఎన్నికల ముందు ఇచ్చిన 24 గంటల ఉచిత విద్యుత్ హామీని గాలికొదిలేసి రైతులను నట్టేట ముంచారని సీఎం రేవంత్ రెడ్డిపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆదిలాబాద్‌లో ఏర్పాటు చేసిన 'రైతు గర్జన' సభకు వెళ్తున్న క్రమంలో ముఖరా (కే) రోడ్డు వద్ద మాజీ సర్పంచ్ గాడ్గే మీనాక్షి, మాజీ ఎంపీటీసీ గాడ్గే సుభాష్‌లతో పాటు పలువురు రైతులు ఆయనను కలిసి తమ గోడును వెళ్లబోసుకున్నారు.నీరు, కరెంట్ సక్రమంగా అందక నిలువునా ఎండిపోయిన పత్తి పంటలను కేటీఆర్‌కు చూపించి రైతులు కన్నీటిపర్యంతమయ్యారు. దీనిపై స్పందించిన కేటీఆర్.. కాంగ్రెస్ పాలనలో రైతుల దుస్థితిని చూసి ఆవేదన వ్యక్తం చేశారు. "రైతులకు 24 గంటల కరెంట్ ఇస్తామని చెప్పి అధికారంలోకి వచ్చిన రేవంత్ రెడ్డి.. ఇప్పుడేమో సాగునీరు అందించక, విద్యుత్ సరఫరా చేయక చేతులెత్తేశారు.

Trivikram: చిక్కుల్లో ఆదర్శకుటుంబం..నిర్మాతకి గట్టి షాక్?సినిమాSwechaa01 Nov 2026, 06:58 PM

Trivikram: చిక్కుల్లో ఆదర్శకుటుంబం..నిర్మాతకి గట్టి షాక్?

Trivikram: తాజాగా ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఆదర్శకుటుంబం చిత్రానికి కాపీ సెగ గట్టిగా తగిలింది. ఈ సినిమాలోని ఓ పాటను కాపీ చేశారంటూ మేకర్స్ మీద కేసు పెట్టినట్టుగా తెలుస్తోంది. ఈ మధ్యకాలంలో ఇలాంటి వ్యవహారాలు టాలీవుడ్‌లో బాగా సంచలనం అవుతున్నాయి. మొన్నటికిమొన్న ఆర్పీ పట్నాయక్ మీద ఒకావిడ తన పాటలను తీసుకున్నాడంటూ సోషల్ మీడియాలో రచ్చ చేసింది. ఇప్పుడు, వెంకటేష్ నటించిన ఆదర్శకుటుంబం సినిమా మేకర్స్ మీద కంప్లైంట్ చేయడం చర్చనీయాంశంగా మారింది.

Telangana Politics: ఒకే దెబ్బకు రెండు పిట్టలు.. కేటీఆర్ 'బాబు భజన' వెనుక అసలు కథ ఇదేనా!తెలంగాణSwechaa01 Nov 2026, 05:54 PM

Telangana Politics: ఒకే దెబ్బకు రెండు పిట్టలు.. కేటీఆర్ 'బాబు భజన' వెనుక అసలు కథ ఇదేనా!

Telangana Politics: రాజకీయాల్లో శాశ్వత మిత్రులు, శాశ్వత శత్రువులు ఉండరన్నది నానుడి. కానీ ఉప్పు-నిప్పులా ఉండే బద్ధ రాజకీయ ప్రత్యర్థిని నిండు సభలో ఉన్నట్టుండి ఆకాశానికి ఎత్తేస్తే? అదీ తెలంగాణ గులాబీ పార్టీ టాప్ లీడర్ కేటీఆర్, ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడును ‘దమ్మున్న నేత.. విజనరీ లీడర్’ అంటూ కితాబులిస్తే? ఇప్పుడు ఉభయ తెలుగు రాష్ట్రాల రాజకీయ వర్గాల్లో ఇదే హాట్ టాపిక్. నిన్నటి దాకా వైఎస్ జగన్‌కు అనుకూలంగా మాట్లాడుతూ బాబుపై విమర్శలు గుప్పించిన బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్.. ఉన్నపళంగా బాబు భజన మొదలుపెట్టడం వెనుక కేవలం ప్రశంస మాత్రమే ఉందా, లేక లోతైన రాజకీయ వ్యూహం దాగి ఉందా అన్న చర్చ పీక్స్‌కు చేరింది.

Women Safety: సైకోల గుండెల్లో ‘చావు భయం’ పుట్టాల్సిందే..తెలంగాణSwechaa01 Nov 2026, 05:43 PM

Women Safety: సైకోల గుండెల్లో ‘చావు భయం’ పుట్టాల్సిందే..

Women Safety: "ఆడపిల్లపై చెయ్యేస్తే వాడు ఇక సమాజంలో బతకడానికి వీల్లేదు.. ఉండడు కూడా!"— రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మహిళల భద్రతపై గట్టి హెచ్చరికలు జారీ చేస్తూనే ఉన్నారు. కానీ క్షేత్రస్థాయిలో ఉన్మాదులు, సైకోల తీరు చూస్తుంటే ప్రభుత్వ హెచ్చరికలన్నా, పోలీసులన్నా కనీస భయం కనిపించడం లేదు. పాలకుల హెచ్చరికలు కాగితాలకే పరిమితమవుతున్నాయా? వీధుల్లో దొరుకుతున్న గంజాయి, దగ్గు మందులు, వైట్నర్ల మత్తులో యువత విచక్షణ కోల్పోతోందా? అసలు ఇలాంటి నరరూప రాక్షసుల వెన్నులో చట్టం ఎందుకు వణుకు పుట్టించలేకపోతోంది?

US Politics: వైట్‌హౌస్‌పై అసంతృప్తి తుఫాను.. మిడ్‌టర్మ్స్‌లో ట్రంప్‌కు గట్టి ఎదురుదెబ్బ తప్పదా?NationalSwechaa01 Nov 2026, 04:34 PM

US Politics: వైట్‌హౌస్‌పై అసంతృప్తి తుఫాను.. మిడ్‌టర్మ్స్‌లో ట్రంప్‌కు గట్టి ఎదురుదెబ్బ తప్పదా?

US Politics: అమెరికా రాజకీయాల్లో మధ్యంతర ఎన్నికల వేడి తారాస్థాయికి చేరింది. అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ నాయకత్వంలోని రిపబ్లికన్ పార్టీకి ఈ ఎన్నికల్లో భారీ ఎదురుదెబ్బ తప్పదని తాజా సర్వేలు హెచ్చరిస్తున్నాయి. రెండోసారి పగ్గాలు చేపట్టిన నాటి నుంచి ఆయన తీసుకుంటున్న దూకుడు నిర్ణయాలు, వివాదాస్పద విధానాల వల్ల ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతోందని, ఆయన ప్రజాదరణ ఏకంగా 38 శాతానికి పడిపోయిందని తేలడం సంచలనం రేపుతోంది.ఈ మిడ్‌టర్మ్స్‌ ఎన్నికలు ట్రంప్ పాలనకు ప్రజా రెఫరెండంగా మారగా, యూఎస్ ప్రతినిధుల సభపై రిపబ్లికన్లు పట్టు కోల్పోవడం దాదాపు ఖాయంగా కనిపిస్తోంది. ప్రముఖ విశ్లేషక సంస్థ ‘రియల్ క్లియర్ పాలిటిక్స్’ అంచనా ప్రకారం డెమోక్రాట్లు 227 సీట్లు గెలుచుకుని సభపై పట్టు సాధించనున్నారు. అటు ‘సీబీఎస్ న్యూస్’ సర్వే డెమోక్రాట్లకు 229 సీట్లు దక్కుతాయని స్పష్టం చేయగా, ‘కుక్ పొలిటికల్ రిపోర్ట్’ సైతం వారికి కనీసం 220 స్థానాలు ఖాయమని తేల్చింది. అయితే ఎగువ సభ అయిన సెనెట్‌లో మాత్రం ఇరు పార్టీల మధ్య హోరాహోరీ పోరు తప్పేలా లేదు.

Tollywood: అప్పుడు రవీనా..ఇప్పుడు కాజోల్!సినిమాSwechaa01 Nov 2026, 04:25 PM

Tollywood: అప్పుడు రవీనా..ఇప్పుడు కాజోల్!

Tollywood: ఒకప్పుడు రవీనా టాండన్ తెలుగు సినిమాలలో నటించి మంచి హిట్స్ అనుకుంది. చేసింది తక్కువ సినిమాలే అయినా, ఆ సినిమాలతో తెలుగు ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంది. హిందీలో మాత్రం ఒకదశలో క్రేజీ హీరోయిన్‌గా గోవింద, అమితాబ్ బచ్చన్ లాంటి స్టార్స్ పక్కన నటించి స్టార్ హీరోయిన్‌గా వెలిగింది. చాలా ఏళ్ళ లాంగ్ గ్యాప్ తర్వాత మళ్ళీ కేజీఎఫ్ ఛాప్టర్ 2తో సౌత్‌లో ఎంట్రీ ఇచ్చింది.

కేంద్ర ఖజానాకు రూ.2.31లక్షల కోట్లు.. జీఎస్టీ వసూళ్లతో రికార్డు!NationalSwechaa01 Nov 2026, 03:33 PM

కేంద్ర ఖజానాకు రూ.2.31లక్షల కోట్లు.. జీఎస్టీ వసూళ్లతో రికార్డు!

 దేశంలో వస్తు, సేవల పన్ను (GST) వసూళ్లతో కేంద్ర ప్రభుత్వం రికార్డు సృష్టించింది. దేశీయ ఆర్థిక కార్యకలాపాలు ఊపందుకోవడం, పండుగ సీజన్ డిమాండ్ పుంజుకోవడంతో పాటు దిగుమతులపై పన్ను రాబడి భారీగా పెరగడం వల్ల అక్టోబర్‌లో జీఎస్టీ వసూళ్లు ఆకాశాన్నంటాయి. గతేడాది ఇదే నెలతో పోలిస్తే ఏకంగా 22.9 శాతం (సుమారు 23 శాతం) అద్భుతమైన వృద్ధి నమోదైంది. దీనితో అక్టోబర్ నెల స్థూల జీఎస్టీ వసూళ్లు రూ.2.31 లక్షల కోట్ల మార్కును చేరుకున్నట్లు కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖ ఆదివారం విడుదల చేసిన అధికారిక గణాంకాలు వెల్లడించాయి.

ఏపీకి 'మురసు' తుపాను గండం.. నెల్లూరుకు 630 కిలోమీటర్ల దూరంలో కేంద్రీకృతం!ఏపీSwechaa01 Nov 2026, 03:19 PM

ఏపీకి 'మురసు' తుపాను గండం.. నెల్లూరుకు 630 కిలోమీటర్ల దూరంలో కేంద్రీకృతం!

 బంగాళాఖాతంలో ఏర్పడిన తీవ్ర వాయుగుండం మరింత బలపడి 'మురసు' (Murasu) తుపానుగా రూపాంతరం చెందింది. ప్రస్తుతం ఇది తీవ్ర రూపం దాల్చి ఆంధ్రప్రదేశ్ తీరం వైపు అత్యంత వేగంగా దూసుకొస్తుండటంతో, భారత వాతావరణ శాఖ (IMD) దక్షిణ కోస్తాంధ్రతో పాటు ఉత్తర తమిళనాడు తీర ప్రాంతాలకు అత్యవసర హెచ్చరికలు జారీ చేసింది. ఈ తుపాను తీవ్రత వల్ల ఏపీలోని పలు జిల్లాల్లో భారీ నుంచి అత్యంత భారీ వర్షాలతో పాటు గంటకు 120 కిలోమీటర్ల వేగంతో భీకర ఈదురుగాలులు వీచే అవకాశం ఉందని అధికారులు అప్రమత్తం చేస్తున్నారు.

Congress Party: గాంధీభవన్‌లో ‘సైలెంట్’ వార్.. ఢిల్లీకి పీసీసీ ఫిర్యాదుల చిట్టా!తెలంగాణSwechaa01 Nov 2026, 03:12 PM

Congress Party: గాంధీభవన్‌లో ‘సైలెంట్’ వార్.. ఢిల్లీకి పీసీసీ ఫిర్యాదుల చిట్టా!

Congress Party: తెలంగాణలో అధికార పగ్గాలు చేపట్టి జోరుమీదున్న కాంగ్రెస్ పార్టీకి సొంత నేతల అలకలు, అంతర్గత కుమ్ములాటలు పెద్ద తలనొప్పిగా మారాయి. ముఖ్యంగా అత్యంత ప్రతిష్టాత్మకంగా మారిన పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల వేళ పార్టీలోని అంతర్గత విభేదాలు ఒక్కసారిగా రచ్చకెక్కాయి. ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు పార్టీ అభ్యర్థుల గెలుపు బాధ్యతను భుజానికెత్తుకోవాల్సిన ఇద్దరు ‘సూపర్ సీనియర్’ మంత్రులు.. ఎన్నికలను ఏమాత్రం పట్టించుకోకుండా ‘లైట్’ తీసుకోవడం ఇప్పుడు గాంధీభవన్‌తో పాటు ఏఐసీసీ వర్గాల్లోనూ తీవ్ర దుమారం రేపుతోంది. వారి వైఖరితో విసిగిపోయిన పీసీసీ నాయకత్వం.. చివరకు అధిష్టానానికే లిఖితపూర్వకంగా ఫిర్యాదు చేసినట్లు తెలుస్తోంది.

జలమండలి కీలక ప్రకటన.. ట్యాంకర్లలో శుద్ధి చేసిన నీటి సరఫరా.. ధరలివే!తెలంగాణSwechaa01 Nov 2026, 03:06 PM

జలమండలి కీలక ప్రకటన.. ట్యాంకర్లలో శుద్ధి చేసిన నీటి సరఫరా.. ధరలివే!

 హైదరాబాద్ నగరంలో తాగునీటిపై పెరుగుతున్న తీవ్ర ఒత్తిడిని తగ్గించడానికి హైదరాబాద్ మహానగర తాగునీటి సరఫరా, మురుగునీటి పారుదల మండలి (HMWSSB) ఒక వినూత్న నిర్ణయం తీసుకుంది. తాగునీటి సేవలతో పాటు మురుగునీటి శుద్ధి కేంద్రాల (STP) ద్వారా శుద్ధి చేసిన నీటిని (Treated Water) మానవేతర అవసరాలకు సరఫరా చేసేందుకు ప్రత్యేక కార్యాచరణను ప్రారంభించింది. ముఖ్యంగా నగరంలోని నిర్మాణాలు, కార్ వాషింగ్ కేంద్రాలు, గార్డెనింగ్, పార్కులు, స్విమ్మింగ్ పూల్స్ వంటి వ్యాపార, పారిశ్రామిక అవసరాలకు గ్రీన్ ట్యాంకర్ల ద్వారా ఈ శుద్ధి చేసిన నీటిని అందించనున్నారు.

‘కాంగ్రెస్ ద్వంద్వ నీతి..’ ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ ఆగ్రహం!తెలంగాణSwechaa01 Nov 2026, 01:31 PM

‘కాంగ్రెస్ ద్వంద్వ నీతి..’ ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ ఆగ్రహం!

 స్పెషల్ ఇంటెలిజెన్స్ రివిజన్ (SIR / ప్రత్యేక ఓటర్ల సర్వే) అంశంలో కాంగ్రెస్ పార్టీ అవలంభిస్తున్న విరుద్ధ వైఖరిపై ఆల్ ఇండియా మజ్లిస్-ఎ-ఇత్తెహాదుల్ ముస్లిమీన్ (AIMIM) అధినేత, హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. కర్ణాటకలోని బీదర్ నగరంలో నిర్వహించిన ఒక బహిరంగ సభలో ఆయన ప్రసంగిస్తూ కాంగ్రెస్ అగ్రనాయకత్వంపై నిప్పులు చెరిగారు. రాజకీయ లబ్ధి కోసం కాంగ్రెస్ నేతలు నగరాల వారీగా వేర్వేరు మాటలు మాట్లాడుతుండటాన్ని ఆయన ఉదాహరణలతో సహా ఎత్తిచూపారు.

తెలంగాణకు రూ. 2,370 కోట్లు.. దేశ వ్యాప్తంగా రూ.1.09లక్షల కోట్ల నిధుల విడుదల!NationalSwechaa01 Nov 2026, 12:39 PM

తెలంగాణకు రూ. 2,370 కోట్లు.. దేశ వ్యాప్తంగా రూ.1.09లక్షల కోట్ల నిధుల విడుదల!

 తెలంగాణ రాష్ట్ర ఆర్థిక వ్యవస్థకు ఊతమిచ్చేలా కేంద్ర ప్రభుత్వం అత్యంత కీలకమైన ప్రకటన చేసింది. పండుగ సీజన్ సందర్భాన్ని పురస్కరించుకుని రాష్ట్రాల ఆర్థిక బలాన్ని, ద్రవ్య లభ్యతను పెంచే లక్ష్యంతో తెలంగాణ సహా పలు రాష్ట్రాలకు అదనపు పన్నుల వాటాను విడుదల చేస్తున్నట్లు కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖ వెల్లడించింది. కేంద్రం తీసుకున్న ఈ సంచలన నిర్ణయంతో నిధుల కొరతతో ఇబ్బంది పడుతున్న అనేక రాష్ట్ర ప్రభుత్వాలకు పెద్ద ఎత్తున ఆర్థిక ఊరట లభించినట్లయింది. సాధారణంగా కేంద్ర ప్రభుత్వం ప్రతి నెలా క్రమం తప్పకుండా నిర్వహించే సాధారణ పన్నుల పంపిణీకి అదనంగా మరో ముందస్తు విడతను (Additional Tax Devolution Instalment) విడుదల చేయాలని నిర్ణయించింది.

Tollywood: విలన్ పాత్రలకి బెస్ట్ ఆప్షన్‌గా మంచు హీరోలు!సినిమాSwechaa01 Nov 2026, 12:31 PM

Tollywood: విలన్ పాత్రలకి బెస్ట్ ఆప్షన్‌గా మంచు హీరోలు!

Tollywood: ప్రస్తుతం, మన తెలుగు సినిమా ఇండస్ట్రీలో విలన్ పాత్రలకి ఇక్కడి సీనియర్ హీరోలను, నటులనే తీసుకుంటున్నారు. ఒకరకంగా, ఇది చాలామంచి పరిణామం అని చెప్పాలి. ఇంతకముందు వరకూ ఎక్కువగా బాలీవుడ్ సహా ఇతర సౌత్ భాషలలోని వారిని మన తెలుగు సినిమాలలో క్యారెక్టర్స్ కోసం, విలన్ రోల్స్ కోసం తీసుకునేవారు. కానీ, ఈ మధ్య మన మేకర్స్ ఆలోచనలో మార్పులొచ్చాయి. తెలుగులో నటించినవారికే అవకాశం ఇస్తున్నారు.

అండాల దందా గుట్టురట్టు.. 43 మంది మహిళలకు విముక్తి!క్రైమ్Swechaa01 Nov 2026, 12:18 PM

అండాల దందా గుట్టురట్టు.. 43 మంది మహిళలకు విముక్తి!

 హైదరాబాద్ నగరంలో దారుణంగా సాగుతున్న అంతర్రాష్ట్ర అండాల (Egg Donation) అక్రమ సేకరణ రాకెట్‌ను పోలీసులు ఛేదించారు. ఇతర రాష్ట్రాలకు చెందిన పేద మహిళలను లక్ష్యంగా చేసుకుని, వారి అమాయకత్వాన్ని ఆసరాగా చేసుకుని అండాలను అక్రమంగా సేకరిస్తూ ఐవీఎఫ్ (IVF), ఫెర్టిలిటీ సెంటర్లకు విక్రయిస్తున్న అంతర్రాష్ట్ర ముఠా గుట్టును రట్టు చేశారు. మల్కాజ్‌గిరి పోలీస్ కమిషనర్ బి. సుమతి పర్యవేక్షణలో బేగంపేట్, సరూర్‌నగర్ పోలీసులు, మల్కాజ్‌గిరి స్పెషల్ ఆపరేషన్స్ టీమ్ (SOT) సంయుక్తంగా నిర్వహించిన ఈ దాడులలో 43 మంది మహిళలను నిందితుల చెర నుంచి విడిపించారు.

తెలంగాణ ప్రజలకు భారీ ఊరట.. సన్న బియ్యం ధరలకు చెక్!తెలంగాణSwechaa01 Nov 2026, 10:14 AM

తెలంగాణ ప్రజలకు భారీ ఊరట.. సన్న బియ్యం ధరలకు చెక్!

 రాష్ట్రంలో నాణ్యమైన సన్న బియ్యం ధరల విచ్చలవిడి పెరుగుదలకు రేవంత్ రెడ్డి ప్రభుత్వం గట్టి అడ్డుకట్ట వేసింది. రైస్ మిల్లర్లు, హోల్‌సేల్ వ్యాపారులు కృత్రిమ కొరత సృష్టించి, అక్రమ నిల్వల ద్వారా బ్లాక్ మార్కెటింగ్‌కు పాల్పడుతూ ధరలు పెంచుతున్నారనే ఫిర్యాదులపై పౌరసరఫరాల శాఖ తీవ్రంగా స్పందించింది. వినియోగదారులపై పడుతున్న అదనపు భారాన్ని తగ్గించేందుకు గాను వివిధ రకాల సన్న బియ్యం గరిష్ఠ చిల్లర ధరలను (MRP) ఖరారు చేస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది.  మిల్లర్లు, ప్రధాన వ్యాపారులతో నిర్వహించిన ఉన్నత స్థాయి సమీక్షా సమావేశంలో ఈ ధరల పరిమితిని అధికారికంగా నిర్ణయించారు.

ధనుష్ మాస్టర్ ప్లాన్.. తమిళనాట 3,000 మంది లాయర్లతో కొత్త వ్యూహం!NationalSwechaa01 Nov 2026, 09:32 AM

ధనుష్ మాస్టర్ ప్లాన్.. తమిళనాట 3,000 మంది లాయర్లతో కొత్త వ్యూహం!

 తమిళ సినీ పరిశ్రమ నుంచి మరో ప్రముఖ కథానాయకుడు రాజకీయాల్లోకి అడుగుపెట్టబోతున్నారా? అంటే అవుననే సమాధానమే వినిపిస్తోంది. ప్రముఖ నటుడు ధనుష్ రాజకీయ అరంగేట్రంపై గత కొంతకాలంగా సాగుతున్న ప్రచారానికి బలం చేకూరుస్తూ ఆయన అభిమాన సంఘం సంచలన వ్యూహాలను అమలు చేస్తోంది. ఇటీవల తన అభిమాన సంఘాన్ని ‘ధనుష్ నర్పణి ఇయక్కం’ (ధనుష్ సంక్షేమ ఉద్యమం)గా మార్చి కొత్త జెండాను ఆవిష్కరించిన ఆయన, తాజాగా తమిళనాడంతటా 3,000 మంది న్యాయ సలహాదారులను నియమించేందుకు భారీ ప్రణాళికలు రచిస్తున్నట్లు తమిళ మీడియాలో వార్తలు హల్‌చల్ చేస్తున్నాయి.

నేడు ఉమ్మడి ఆదిలాబాద్‌లో బీఆర్ఎస్ 'రైతు గర్జన'.. కేటీఆర్ సుడిగాలి పర్యటన!తెలంగాణSwechaa01 Nov 2026, 09:22 AM

నేడు ఉమ్మడి ఆదిలాబాద్‌లో బీఆర్ఎస్ 'రైతు గర్జన'.. కేటీఆర్ సుడిగాలి పర్యటన!

 మాజీ మంత్రి, బీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ నేడు (ఆదివారం) ఆదిలాబాద్ జిల్లాలో బిజీ బిజీగా పర్యటించనున్నారు. రేవంత్ రెడ్డి నేతృత్వంలోని కాంగ్రెస్ ప్రభుత్వం చేపడుతున్న రైతు వ్యతిరేక విధానాలను నిరసిస్తూ ఉమ్మడి ఉత్తర తెలంగాణ వ్యాప్తంగా బీఆర్ఎస్ తలపెట్టిన ‘రైతు గర్జన’ సభలకు శ్రీకారం చుట్టనున్నారు. ఇందులో భాగంగా హైదరాబాద్‌లోని నార్సింగి నివాసం నుంచి ఉదయం 9:30 గంటలకు బయలుదేరి రోడ్డు మార్గాన ఆదిలాబాద్ జిల్లా పర్యటనకు ఆయన పయనమయ్యారు. ఈ పర్యటనలో భాగంగా కేటీఆర్ మధ్యాహ్నం 1 గంటకు ఆర్మూర్ మాజీ ఎమ్మెల్యే జీవన్ రెడ్డి నివాసానికి చేరుకుని అక్కడ భోజనం చేయనున్నారు.

Today in History November 1: చరిత్రలో ఈరోజుNationalSwechaa01 Nov 2026, 09:09 AM

Today in History November 1: చరిత్రలో ఈరోజు

📌 నేటి ముఖ్యాంశాలు (Today's Highlights)

  • 1956: ఆంధ్రప్రదేశ్ సహా పలు భారతీయ రాష్ట్రాల ఆవిర్భావం (ఆంధ్రప్రదేశ్ అవతరణ దినోత్సవం / AP Formation Day).

  • 1973: మైసూర్ రాష్ట్రం పేరు అధికారికంగా కర్ణాటకగా మార్చబడింది.

  • 1913: అమెరికాలోని శాన్ ఫ్రాన్సిస్కోలో లాలా హర్‌దయాళ్ 'గదర్ పార్టీ' (Ghadar Party)ని స్థాపించారు.

🌐 అంతర్జాతీయ సంఘటనలు

  • 1952: మార్షల్ ఐలాండ్స్‌లో అమెరికా ప్రపంచంలోనే మొట్టమొదటి థర్మోన్యూక్లియర్ హైడ్రోజన్ బాంబు 'ఐవీ మైక్' (Ivy Mike)ను విజయవంతంగా పరీక్షించింది.

  • 1993: ప్రసిద్ధ 'మాస్ట్రిచ్ట్ ఒప్పందం' (Maastricht Treaty) అమలులోకి రావడంతో యూరోపియన్ యూనియన్ (EU) అధికారికంగా ఏర్పడింది.

  • 1981: యాంటిగ్వా మరియు బార్బుడా దేశం యునైటెడ్ కింగ్‌డమ్ నుండి స్వాతంత్ర్యం పొందింది.

🚀 సైన్స్ & అడ్వెంచర్

  • 1962: సోవియట్ యూనియన్ అంగారక గ్రహం (Mars) వైపు పరిశోధనల కోసం 'మార్స్ 1' (Mars 1) అంతరిక్ష నౌకను ప్రయోగించింది.

👤 ప్రముఖుల జననాలు & వర్ధంతులు

  • 1973 (జననం): ఐశ్వర్య రాయ్ బచ్చన్ — ప్రముఖ భారతీయ నటి, ప్రపంచ సుందరి (Miss World 1994).

  • 1960 (జననం): టీమ్ కుక్ (Tim Cook) — యాపిల్ (Apple Inc.) సంస్థ సీఈఓ.

  • 1950 (జననం): ముత్తయ్య మురళీధరన్ దినోత్సవాలు / ఇతర క్రీడా మైలురాళ్ళు.

  • 1915 (జననం): నవల్ పరిఖ్ లేదా ఇతర స్వాతంత్ర్య సమరయోధుల స్మరణలు.

Tollywood: సింగిల్ కార్డ్ కొరియోగ్రాఫర్‌గా భాను మాస్టర్!సినిమాSwechaa01 Nov 2026, 08:43 AM

Tollywood: సింగిల్ కార్డ్ కొరియోగ్రాఫర్‌గా భాను మాస్టర్!

Tollywood: టాలీవుడ్ సినిమా ఇండస్ట్రీలో కొరియోగ్రాఫర్‌గా ఎదగడం చాలాకష్టం. ఇక్కడున్న పోటీని తట్టుకొని ఒక పాటకు డాన్స్ కొరియోగ్రఫీ అందించే అవకాశం అందుకోవాలంటే ఎన్నో ఏళ్ళ శ్రమ..పట్టుదల..నిజాయితీ..అన్నిటికీ మించి ఐడెంటిటీ చాలా ముఖ్యం. ఇవన్నీ ఉన్న ఈతరం కొరియోగ్రాఫర్ భాను మాస్టర్. సైలెంట్‌గా సాంగ్స్ చేస్తూ..ఒక్కో సాంగ్‌ను అద్భుతంగా తెరకెక్కించి ఇండస్ట్రీలో పలువురి ప్రముఖుల నుంచి ప్రశంసలు అందుకుంటున్నారు.

నేటి పంచాంగం - 01 నవంబర్ 2026 | కార్తిక కృష్ణ సప్తమిSpiritualitySwechaa01 Nov 2026, 08:40 AM

నేటి పంచాంగం - 01 నవంబర్ 2026 | కార్తిక కృష్ణ సప్తమి

వివరాలు:

  • తేదీ: 01 నవంబరు 2026, ఆదివారం

  • సంవత్సరం: శ్రీ పరాభవ నామ సంవత్సరం

  • అయనం & ఋతువు: దక్షిణాయనం, శరత్ఋతువు

  • మాసం & పక్షం: కార్తిక మాసం, కృష్ణ పక్షం

  • తిథి: సప్తమి (సాయంత్రం 04:18 వరకు, తదుపరి అష్టమి)

  • వారం: ఆదివారం (భానువాసరే)

  • నక్షత్రం: పుష్యమి (ఉదయం 08:52 వరకు, తదుపరి ఆశ్లేష)

  • యోగం: సాధ్య (ఉదయం 11:34 వరకు, తదుపరి శోభన)

  • కరణం: విష్టి/భద్ర (ఉదయం 05:25 వరకు), తదుపరి బవ (సాయంత్రం 04:18 వరకు), తదుపరి బాలవ (తెల్లవారుజామున 03:22 వరకు)

శుభ / అశుభ సమయాలు:

  • రాహుకాలం: సాయంత్రం 04:30 - 06:00 వరకు

  • యమగండం: మధ్యాహ్నం 12:00 - 01:30 వరకు

  • అమృతకాలం: రాత్రి 11:15 - 12:50 వరకు

  • దుర్ముహూర్తము: సాయంత్రం 04:12 - 04:57 వరకు

  • వర్జ్యం: మధ్యాహ్నం 01:28 - 03:02 వరకు

గ్రహస్థితులు:

  • సూర్యరాశి: తుల

  • చంద్రరాశి: కర్కాటకం

  • సూర్యోదయం: ఉదయం 06:19

  • సూర్యాస్తమయం: సాయంత్రం 05:40

ఓటుకు నోటు చోర్‌ను ప‌క్క‌న పెట్టుకుని నిరసనా? కేటీఆర్ సెటైర్తెలంగాణSwechaa31 Oct 2026, 11:23 PM

ఓటుకు నోటు చోర్‌ను ప‌క్క‌న పెట్టుకుని నిరసనా? కేటీఆర్ సెటైర్

KTR: ఎస్ఐఆర్ కు వ్యతిరేకంగా కాంగ్రెస్ పార్టీ దేశవ్యాప్తంగా ఆందోళనలు చేస్తోంది. ఇందులో భాగంగా న‌వంబ‌ర్ 1న ఢిల్లీలో భారీ నిరసన కార్య‌క్ర‌మం తలపెట్టింది కాంగ్రెస్. దీనిపై బీఆర్ఎస్ వ‌ర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ స్పందిస్తూ సెటైర్లు వేశారు. ఓటుకు నోటు చోర్‌ను ప‌క్క‌న పెట్టుకుని ధర్నా చేయడమా? ఇది చాలా హ్యాస్యాస్పదంగా ఉంది అంటూ.. కాంగ్రెస్ నిరసన కార్యక్రమంపై ఆయన వ్యంగ్యాస్త్రాలు సంధించారు.

ఏపీకి మరో తుపాను ముప్పు.. భారీ నుంచి అతి భారీ వర్షాలుఏపీSwechaa31 Oct 2026, 11:03 PM

ఏపీకి మరో తుపాను ముప్పు.. భారీ నుంచి అతి భారీ వర్షాలు

AP Rains: అర్నబ్ తుపాను సృష్టించిన విధ్వంసం నుంచి కోలుకోకముందే.. ఏపీకి మరో తుపాను ముప్పు పొంచి ఉంది. మళ్లీ భారీ వర్షాలు ముంచెత్తనున్నాయి. రెండు రోజులు వానలు కుమ్మేయనున్నాయి. ఆగ్నేయ బంగాళాఖాతంలో వాయుగుండం రానున్న 24 గంటల్లో తుపానుగా మారే అవకాశం ఉందని వాతావరణ కేంద్రం తెలిపింది. రాష్ట్రంలో ఉన్న అన్ని ప్రధాన పోర్టులకు 1వ నెంబర్ ప్రమాద హెచ్చరిక జారీ చేశారు.

సీఎం రేవంత్ క్రెడిట్ చోరీకి పాల్పడుతున్నారు- రేవంత్ రెడ్డితెలంగాణSwechaa31 Oct 2026, 10:51 PM

సీఎం రేవంత్ క్రెడిట్ చోరీకి పాల్పడుతున్నారు- రేవంత్ రెడ్డి

అబద్ధాలకు ఆస్కార్ అవార్డు ఉంటే అది ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికే వస్తుందని మాజీమంత్రి హరీశ్ రావు అన్నారు. అబద్ధానికి అంగీ లాగు తొడిగితే అచ్చం రేవంత్ రెడ్డి లెక్కే ఉంటుందన్నారు. వంటంతా మేము వండితే, చివర్లో గంట తిప్పి నేనే వండినా అంటున్నారు అని సీఎం రేవంత్ పై ధ్వజమెత్తారు. ఇది ఓట్ చోరీ కాదు, పక్కా క్రెడిట్ చోరీ అంటూ సీఎం రేవంత్ పై విరుచుకుపడ్డారు. జడ్జిమెంట్ కాపీ చేతికి రాకముందే మియాపూర్ భూములు అమ్మమని కలెక్టర్‌ను సీఎం రేవంత్ పరుగులు పెట్టిస్తున్నారని చెప్పారు. ఎవరి దగ్గర అడ్వాన్సులు తీసుకున్నారు? అంటూ రేవంత్ రెడ్డిని ప్రశ్నించారు హరీశ్ రావు.

TG: హైదరాబాద్‌లో రేపటి నుంచే ‘గ్రీన్ ట్యాంకర్లు’.. వివరాలివే!తెలంగాణSwechaa31 Oct 2026, 10:29 PM

TG: హైదరాబాద్‌లో రేపటి నుంచే ‘గ్రీన్ ట్యాంకర్లు’.. వివరాలివే!

TG: హైదరాబాద్ నగరంలో తాగునీటి ఇబ్బందులు రాకుండా ఉండేందుకు తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. కోర్ అర్బన్ పరిధిలో నీటి వృథాను అరికట్టేందుకు రేపటి నుంచే (నవంబర్ 1) సరికొత్తగా ‘గ్రీన్ ట్యాంకర్లు’ అందుబాటులోకి రానున్నాయి. సచివాలయంలో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సంజయ్ జాజు ఉన్నతాధికారులతో నిర్వహించిన ఉన్నత స్థాయి సమీక్షలో ఈ కీలక మార్పులను వెల్లడించారు.భవన నిర్మాణ పనులు, ల్యాండ్‌స్కేపింగ్, క్లీనింగ్ వంటి తాగునీటితో సంబంధం లేని ఇతర అవసరాలకు ఇకపై స్వచ్ఛమైన తాగునీటిని వాడటానికి వీల్లేదని సీఎస్ స్పష్టం చేశారు. ఇలాంటి పనుల కోసం మురుగునీటి శుద్ధి కేంద్రాల (STPలు) ద్వారా వచ్చిన శుద్ధి చేసిన నీటినే అన్ని ప్రభుత్వ శాఖలు, ప్రైవేట్ సంస్థలు యూజ్ చేయాలని ఆదేశించారు.

PM Modi: దేశాన్ని ముక్కలు చేసే వాళ్లంతా ఒక్కటయ్యారు.. ప్రధాని మోడీ ఆరోపణలు!NationalSwechaa31 Oct 2026, 10:14 PM

PM Modi: దేశాన్ని ముక్కలు చేసే వాళ్లంతా ఒక్కటయ్యారు.. ప్రధాని మోడీ ఆరోపణలు!

PM Modi: భారతదేశ సార్వభౌమత్వాన్ని, సమగ్రతను దెబ్బతీయాలని చూస్తున్న శక్తులన్నీ ఇప్పుడు ఒకే తాటిపైకి వచ్చాయని ప్రధానమంత్రి నరేంద్ర మోడీ సంచలన కామెంట్స్ చేశారు. దేశాన్ని ముక్కలు చేయాలనే దురుద్దేశంతో భారత వ్యతిరేక శక్తులు ఏకమై కుట్రలు పన్నుతున్నాయని తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. గుజరాత్‌లోని ఏక్తానగర్‌లో సర్దార్ వల్లభాయ్ పటేల్ 151వ జయంతి సందర్భంగా నిర్వహించిన 'రాష్ట్రీయ ఏకతా దివస్' వేడుకల్లో పాల్గొన్న ప్రధాని, విపక్షాలు, విభజన శక్తులపై నిప్పులు చెరిగారు.దేశాన్ని అంతర్గతంగా బలహీనపరిచేందుకు 'దిమాగీ నక్సల్స్' (మేధో నక్సలైట్లు) సిద్ధమయ్యారని, ఇలాంటి విచ్ఛిన్నకర శక్తుల పట్ల ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలని ప్రధాని హెచ్చరించారు. "భారత వ్యతిరేక శక్తులన్నీ ఏకమై దేశంలో చీలికలు తేవాలని చూస్తున్నాయి. సోషల్ మీడియాను అడ్డం పెట్టుకుని పచ్చి అబద్ధాలు, విషపూరిత వదంతులు వ్యాప్తి చేస్తూ దేశంలో అశాంతిని, అస్థిరతను సృష్టించే కుట్రలో మునిగిపోయాయి. స్వార్థ రాజకీయాల కోసం మాతృభూమి బిడ్డల మధ్య గొడవలు పెడుతున్నారు" అంటూ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.

Indian Railways: రైల్వే ప్రయాణికులకు అలర్ట్.. నవంబర్ 1 నుంచి 60 రోజుల ముందే బుకింగ్‌కి ఛాన్స్!NationalSwechaa31 Oct 2026, 09:45 PM

Indian Railways: రైల్వే ప్రయాణికులకు అలర్ట్.. నవంబర్ 1 నుంచి 60 రోజుల ముందే బుకింగ్‌కి ఛాన్స్!

Indian Railways: రైలు ప్రయాణం ప్లాన్ చేసుకునేవారికి రైల్వే శాఖ నుంచి అత్యంత కీలకమైన సమాచారం అందింది. ఇప్పటివరకు ఉన్న ముందస్తు రిజర్వేషన్ రూల్స్‌లో పెద్ద మార్పు చోటుచేసుకుంది. ప్రయాణ తేదీకి 120 రోజుల ముందే టికెట్లు బుక్ చేసుకునే పాత పద్ధతికి స్వస్తి పలుకుతూ, ఆ గడువును 60 రోజులకు కుదించారు. ఈ సరికొత్త నిబంధన నవంబర్ 1 నుంచే దేశవ్యాప్తంగా అమల్లోకి వస్తోంది. గతంలో నాలుగు నెలల ముందే బుకింగ్స్ ఓపెన్ అవ్వడం వల్ల ప్రైవేట్ ఏజెంట్లు, దళారులు రద్దీ రూట్లలోని టికెట్లను గుత్తగా బ్లాక్ చేసేవారు. తీరా ప్రయాణ సమయానికి భారీగా క్యాన్సిలేషన్లు జరగడం, లేదా బ్లాక్‌లో టికెట్లను ఎక్కువ ధరకు అమ్ముకోవడం వంటి సమస్యలు వచ్చేవి. దీనివల్ల సాధారణ ప్రయాణికులకు సీట్లు దొరకడం కష్టంగా మారేది. వీటన్నింటికీ అడ్డుకట్ట వేసి, నిజమైన ప్రయాణికులకు కన్ఫర్మ్ బెర్తులు దక్కేలా చూడటానికే రైల్వే బోర్డు ఈ నిర్ణయం తీసుకుందని చెబుతున్నారు.

Telangana:ఆ మాటలు సీఎం చేతకానితనానికి పరాకాష్ఠ.. బీజేపీ ఎంపీ డీకే అరుణ!..తెలంగాణSwechaa31 Oct 2026, 09:30 PM

Telangana:ఆ మాటలు సీఎం చేతకానితనానికి పరాకాష్ఠ.. బీజేపీ ఎంపీ డీకే అరుణ!..

తెలంగాణలో వివాదాస్పద మియాపూర్ భూములపై సుప్రీంకోర్టు తీర్పు వెలువడిన అనంతరం, ప్రభుత్వ భూముల అమ్మకంపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు రాష్ట్ర రాజకీయాల్లో తీవ్ర చర్చకు దారితీశాయి.. ఈ అంశంపై బీజేపీ, బీఆర్ఎస్ నేతలు విమర్శలు గుప్పిస్తున్నారు.. ఈ క్రమంలో కాంగ్రెస్ ప్రభుత్వం వ్యవహరిస్తున్న తీరుపై బీజేపీ ఎంపీ డీకే అరుణ తీవ్రస్థాయిలో ఫైర్ అయ్యారు..

TG: అలర్ట్.. నవంబర్ 3న ఇందిరమ్మ ఇండ్లకు లాటరీతెలంగాణSwechaa31 Oct 2026, 09:21 PM

TG: అలర్ట్.. నవంబర్ 3న ఇందిరమ్మ ఇండ్లకు లాటరీ

TG: హైదరాబాద్ నగరంలో సొంతింటి కోసం ఎదురుచూస్తున్న వారికి ప్రభుత్వం నుంచి కీలక అప్‌డేట్ వచ్చింది. నగర పరిధిలోని నాలుగు నియోజకవర్గాల్లో నిర్మించిన ఇందిరమ్మ ఎల్‌ఐజీ ఫ్లాట్లకు నవంబరు 3న లాటరీ తీయనున్నారు. ఈ మేరకు తెలంగాణ హౌసింగ్ బోర్డు ఏర్పాట్లు పూర్తి చేసింది.గ్రేటర్ హైదరాబాద్ పరిధిలోని ముషీరాబాద్, ఎల్బీనగర్, చాంద్రాయణగుట్ట, గోషామహల్ నియోజకవర్గాల్లోని ఇందిరమ్మ టవర్లలో ఉన్న ఫ్లాట్లకు నవంబరు 3న డ్రా తీయనున్నట్లు హౌసింగ్ బోర్డు వైస్ ఛైర్మన్ గౌతమ్ తెలిపారు. ఈ ప్రాంతాల పరిధిలో దరఖాస్తు చేసుకున్న లబ్ధిదారులకు ఈ డ్రా ద్వారా ఫ్లాట్లు కేటాయించనున్నారు.

Tollywood: బోర్ కొట్టిన హర్రర్ సినిమాలు..అందుకే ఫ్లాపవుతున్నాయా!సినిమాSwechaa31 Oct 2026, 08:31 PM

Tollywood: బోర్ కొట్టిన హర్రర్ సినిమాలు..అందుకే ఫ్లాపవుతున్నాయా!

Tollywood: ఒకప్పుడు, హర్రర్..సస్పెన్స్ థ్రిల్లర్..క్రైమ్ కామెడీ సినిమాలు ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకునేవి. ఒక దశాబ్దం మొత్తం ఎక్కువగా ఈ జానర్ సినిమాలే వచ్చాయి. తక్కువ బడ్జెట్‌తో నిర్మించిన ఈ సినిమాలు నిర్మాతలకి భారీ లాభాలను తెచ్చాయి. అయితే, ఈ మధ్య కాలంలో వచ్చిన హర్రర్ సినిమాలను జనాలు ఏమాత్రం పట్టించుకోవడం లేదు. దీనికి కారణం..వాటిని ఆసక్తికరంగా తీయకపోవడమే అని చెప్పుకుంటున్నారు.