స్వేచ్ఛ షార్ట్స్ — తాజా తెలుగు వార్తలు

డీలిమిటేషన్‌పై మరో యుద్ధం.. డిసెంబర్‌లో బిల్లు తెచ్చేందుకు కేంద్రం వ్యూహం!NationalSwechaa15 Nov 2026, 08:02 PM

డీలిమిటేషన్‌పై మరో యుద్ధం.. డిసెంబర్‌లో బిల్లు తెచ్చేందుకు కేంద్రం వ్యూహం!

డీలిమిటేషన్‌పై కేంద్రం మరోసారి పావులు కదుపుతోందా? డిసెంబర్‌లో పార్లమెంట్ ముందుకు కీలక బిల్లు తీసుకొచ్చేందుకు వ్యూహం సిద్ధం చేస్తోందా? 50 శాతం సీట్ల పెంపు ఫార్ములాతో విపక్షాలను దారిలోకి తెచ్చే ప్రయత్నంతో దక్షిణాది రాజకీయాలు మరోసారి వేడెక్కుతున్నాయి.

TG: సజ్జనార్‌పై సీబీఐ విచారణ జరిపించండి.. సీఎంకు రాజాసింగ్‌ సంచలన లేఖతెలంగాణSwechaa15 Nov 2026, 06:35 PM

TG: సజ్జనార్‌పై సీబీఐ విచారణ జరిపించండి.. సీఎంకు రాజాసింగ్‌ సంచలన లేఖ

TG: హైదరాబాద్ మాజీ పోలీస్ కమిషనర్ సజ్జనార్ హయాంలో జరిగిన పలు వ్యవహారాలు, అవకతవకలపై సీబీఐ విచారణ జరిపించాలని గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్ డిమాండ్ చేశారు. ఈ మేరకు ఆయన తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి ఒక సంచలన లేఖ రాశారు. సజ్జనార్ పనితీరుపై పలు అనుమానాలు వ్యక్తం చేసిన ఎమ్మెల్యే, ఈ వ్యవహారాలన్నింటిపై సీబీఐతో గానీ లేదా జ్యుడీషియల్ విచారణతో గానీ నిగ్గు తేల్చాలని ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు.తన లేఖలో ప్రధానంగా రెండు సంచలన కేసుల దర్యాప్తు తీరుపై ఎమ్మెల్యే రాజాసింగ్ తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. మాజీ సీపీ సజ్జనార్ హయాంలో నమోదైన 'గోల్డ్ తెఫ్ట్' కేసులో ఇప్పటివరకు ఎలాంటి పురోగతి కనిపించడం లేదని ఆయన ఆరోపించారు.

TG: ప్రాజెక్టుల పర్మిషన్ల విషయంలో ప్రధాని చొరవ కోరాం: ఉత్తమ్తెలంగాణSwechaa15 Nov 2026, 05:58 PM

TG: ప్రాజెక్టుల పర్మిషన్ల విషయంలో ప్రధాని చొరవ కోరాం: ఉత్తమ్

TG: తెలంగాణలో నిలిచిపోయిన సాగునీటి ప్రాజెక్టులకు పర్యావరణ పర్మిషన్లు ఇప్పించే విషయంలో చొరవ తీసుకోవాలని ప్రధానమంత్రి నరేంద్ర మోడీని కోరినట్లు రాష్ట్ర నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి తెలిపారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో పాటు మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి, వాకిటి శ్రీహరి, రాష్ట్ర ఉన్నతాధికారుల బృందం ఢిల్లీలో ప్రధాని మోడీతో ప్రత్యేకంగా భేటీ అయ్యింది. ఈ సమావేశం ముగిసిన అనంతరం మంత్రి ఉత్తమ్ మీడియాతో మాట్లాడుతూ కీలక వివరాలను వెల్లడించారు.రాష్ట్రంలోని సాగునీటి ప్రాజెక్టులకు సంబంధించిన సమస్యలపై ప్రధానితో సుదీర్ఘంగా చర్చించినట్లు చెప్పారు. ముఖ్యంగా పర్యావరణ పర్మిషన్లు రాకపోవడం వల్ల ఎంతో ముఖ్యమైన ప్రాజెక్టుల పనులు మధ్యలోనే ఆగిపోయాయని ప్రధాని దృష్టికి తీసుకెళ్లామన్నారు. కేంద్ర పర్యావరణ మంత్రిత్వ శాఖ అనుమతులు ఇవ్వడంలో చాలా లేట్ చేస్తోందని, దీనివల్ల రాష్ట్ర ప్రయోజనాలు దెబ్బతింటున్నాయని ఆయనకు వివరించినట్లు తెలిపారు.

Aditi Rao Hydari: ఇష్టం లేని కథలను అసలు ఒప్పుకోను..సినిమాSwechaa15 Nov 2026, 05:57 PM

Aditi Rao Hydari: ఇష్టం లేని కథలను అసలు ఒప్పుకోను..

Aditi Rao Hydari: ఇష్టం లేని కథలను అసలు ఒప్పుకోను..అంటోంది హీరోయిన్ అదిరావు హైదరి. అవ్ను..కథ, దర్శకుడే నా ప్రాధాన్యత. అంతే తప్ప ఇష్టం లేకుండా ఇప్పటి వరకూ ఏ కథను ఒప్పుకోలేదు..ఇకపై కూడా ఒప్పుకోను అంటూ ఇంట్రెస్టింగ్ విషయాలను చెప్పుకొచ్చింది అదితి రావు హైదరి. బాలీవుడ్, టాలీవుడ్ సినిమా ఇండస్ట్రీస్‌లో మంచి కథా బలమున్న సినిమాలను చేసింది.

Satvika Veeravalli: ఒక సినిమా కోసం వస్తే ఇంకో సినిమాలో ఛాన్స్..మళ్ళీ వెళ్ళాలనిపించలేదు!సినిమాSwechaa15 Nov 2026, 05:26 PM

Satvika Veeravalli: ఒక సినిమా కోసం వస్తే ఇంకో సినిమాలో ఛాన్స్..మళ్ళీ వెళ్ళాలనిపించలేదు!

Satvika Veeravalli: ప్రస్తుతం, మన తెలుగుతో పాటు తమిళ సినిమా ఇండస్ట్రీలలో వినిపిస్తున్న పేరు సాత్విక వీరవల్లి. యూఎస్‌లో పుట్టి పెరిగిన ఈ మిక్స్డ్ బ్రీడ్ ఐటీ జాబ్ వదిలేసి సినిమాలలోకి వచ్చేసింది. ఒక్క సినిమా చేసి తిరిగి అమెరికా వెళ్లిపోవాలనుకున్న సాత్విక..వరుస అవకాశాలు వస్తుండటంతో.. ఇక, ఆ జాబ్‌కి గుడ్‌బై చెప్పి తెలుగు, తమిళ సినిమాలకి సైన్ చేస్తోంది.

TG: గాంధీ కుటుంబానికి బాడీగార్డుగా మారిన సీఎం రేవంత్‌.. కేటీఆర్‌ సెటైర్లుతెలంగాణSwechaa15 Nov 2026, 05:16 PM

TG: గాంధీ కుటుంబానికి బాడీగార్డుగా మారిన సీఎం రేవంత్‌.. కేటీఆర్‌ సెటైర్లు

TG: తెలంగాణలో కాంగ్రెస్, బీజేపీ నాయకుల తీరుపై బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. శుక్రవారం హైదరాబాద్‌లో జరిగిన గిగ్ వర్కర్ల ర్యాలీలో కనిపించిన దృశ్యాలపై ఆయన 'ఎక్స్' వేదికగా స్పందించారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గాంధీ కుటుంబానికి బాడీగార్డుగా మారిపోయారని కేటీఆర్ విమర్శించారు.హైదరాబాద్ పర్యటనకు వచ్చిన రాహుల్ గాంధీ బైక్ వెనక, రాష్ట్ర మంత్రులు, పీసీసీ అధ్యక్షుడు పరుగులు తీయడం ఏంటని కేటీఆర్ ప్రశ్నించారు. బాధ్యతాయుతమైన పదవుల్లో ఉన్న నేతలు ఇలా అధిష్ఠానం నేతల వెంట పరుగులు తీయడం చూస్తుంటే, వారికి తమ పదవుల పట్ల ఏమాత్రం గౌరవం లేదనిపిస్తోందని ఆయన రాసుకొచ్చారు.

Tollywood: విడిపోయినా కలిసే ఉంటున్నారా..రమ్యకృష్ణ బయటపెట్టిన ఆసక్తికరమైన విషయాలుసినిమాSwechaa15 Nov 2026, 04:56 PM

Tollywood: విడిపోయినా కలిసే ఉంటున్నారా..రమ్యకృష్ణ బయటపెట్టిన ఆసక్తికరమైన విషయాలు

Tollywood: టాలీవుడ్‌లో ఒకప్పుడు స్టార్ హీరోయిన్‌గా వెలిగిన రమ్యకృష్ణ.. ఇప్పటికీ తనదైన నటనతో ప్రేక్షకులను ఆకట్టుకుంటోంది. ముఖ్యంగా, రమ్యకృష్ణ 'బాహుబలి'లో చేసిన శివగామి పాత్రతో మరోసారి దేశవ్యాప్తంగా గుర్తింపు తెచ్చుకున్నారు. అయితే, సినిమాల కంటే కొన్నిసార్లు ఆమె వ్యక్తిగత జీవితం పరంగా కూడా వార్తల్లో నిలుస్తుంటుంది. ముఖ్యంగా, దర్శకుడు కృష్ణవంశీతో ఆమె విడిపోయారంటూ చాలాకాలంగా అంతటా ప్రచారం జరుగుతోంది.

Telangana Politics: పరువు తీసుకుంటున్న సీఎం రేవంత్.. పదవి కోసం మరీ ఇంత దిగజారాలా?తెలంగాణSwechaa15 Nov 2026, 04:38 PM

Telangana Politics: పరువు తీసుకుంటున్న సీఎం రేవంత్.. పదవి కోసం మరీ ఇంత దిగజారాలా?

Telangana Politics: తెలంగాణ రాజకీయాల్లో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వ్యవహారశైలి మరోసారి హాట్ టాపిక్‌గా మారింది. హైదరాబాద్‌లో జరిగిన 'భారత్ సమ్మిట్', గిగ్ వర్కర్ల ర్యాలీ, సభలో ఆయన ప్రవర్తించిన తీరుపై సోషల్ మీడియాలో విపరీతమైన ట్రోల్స్, విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఈ కార్యక్రమాలకు హాజరైన కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ వెంట సీఎం రేవంత్ రెడ్డి చేసిన హడావిడిపై నెటిజన్లు భిన్న రకాలుగా స్పందిస్తున్నారు. ర్యాలీ, సభ ఆద్యంతం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, రాహుల్ గాంధీ చుట్టూ తిరుగుతూ కనిపించారు. అంతేకాకుండా, ఎవరినీ రాహుల్ గాంధీ దగ్గరకు రానీయకుండా "దూరం జరగండి.. దూరం జరగండి" అంటూ స్వయంగా సీఎం అడ్డుకోవడం ఆ దృశ్యాలలో స్పష్టంగా కనిపించింది.

Diwali Gold Shopping: ఇండియాలో బంగారం పిచ్చి మామూలుగా లేదుగా.. దీపావళికి ఎన్ని టన్నుల పసిడి కొన్నారంటే?NationalSwechaa15 Nov 2026, 03:59 PM

Diwali Gold Shopping: ఇండియాలో బంగారం పిచ్చి మామూలుగా లేదుగా.. దీపావళికి ఎన్ని టన్నుల పసిడి కొన్నారంటే?

Diwali Gold Shopping: భారతీయులకు బంగారం అంటే కేవలం ఒక లోహం మాత్రమే కాదు, అది తరతరాల సెంటిమెంట్, కష్టకాలంలో ఆదుకునే నమ్మకమైన ఆస్తి. పండుగ వచ్చిందంటే చాలు.. కొత్త బట్టలు, పిండివంటల సందడితో పాటు ప్రతి ఇంటా వినిపించే మరో ప్రధాన మాట 'పసిడి'. తాజాగా ముగిసిన దీపావళి, ధంతేరాస్ వేడుకల్లో మనవాళ్ల బంగారం క్రేజ్ మరోసారి రికార్డులను తిరగరాసింది. దేశవ్యాప్తంగా జనం ఏకంగా 52 టన్నుల (అంటే 52,000 కిలోలు) బంగారాన్ని కొనుగోలు చేశారంటే, ఇండియాలో పసిడి మోజు ఏ స్థాయిలో ఉందో ఇట్టే అర్థం చేసుకోవచ్చు. కేవలం కొన్ని రోజుల వ్యవధిలోనే సుమారు రూ. 72 వేల కోట్ల విలువైన వ్యాపారం జరగడం మార్కెట్ వర్గాలను సైతం విస్మయానికి గురిచేస్తోంది.

ఇండిగో విమానానికి తప్పిన పెను ప్రమాదం.. మొరాయించిన ల్యాండింగ్ గేర్!NationalSwechaa15 Nov 2026, 03:17 PM

ఇండిగో విమానానికి తప్పిన పెను ప్రమాదం.. మొరాయించిన ల్యాండింగ్ గేర్!

 మహారాష్ట్రలోని పూణే అంతర్జాతీయ విమానాశ్రయంలో ఆదివారం ఉదయం తీవ్ర ఉత్కంఠ నెలకొంది. పూణే నుంచి అసోంలోని గౌహతికి బయలుదేరిన ఇండిగో విమానంలో (ఫ్లైట్ నంబర్ 6E 0623) గాలిలోకి ఎగిరిన కొద్దిసేపటికే సాంకేతిక లోపం తలెత్తింది. టేకాఫ్ అయిన తర్వాత విమానం ల్యాండింగ్ గేర్ (చక్రాలు) లోపలికి వెళ్లకుండా మొరాయించడంతో పైలట్లు అప్రమత్తమయ్యారు. తక్షణమే ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్ (ATC) అధికారులకు సమాచారం అందించి, విమానాన్ని తిరిగి పూణే విమానాశ్రయానికే మళ్లించి అత్యవసరంగా ల్యాండింగ్ చేయడంతో విమానంలోని 192 మంది ప్రయాణికులు, సిబ్బంది సురక్షితంగా బయటపడ్డారు.

Hyderabad Traffic: హైదరాబాద్‌లో ఫ్లైఓవర్లు కడుతున్నా.. ట్రాఫిక్ కష్టాలు ఎందుకు తీరట్లేదు?తెలంగాణSwechaa15 Nov 2026, 02:48 PM

Hyderabad Traffic: హైదరాబాద్‌లో ఫ్లైఓవర్లు కడుతున్నా.. ట్రాఫిక్ కష్టాలు ఎందుకు తీరట్లేదు?

Hyderabad Traffic: భాగ్యనగరంలో ఎటు చూసినా కొత్త ఫ్లైఓవర్లు, అండర్ పాస్‌లు, విశాలమైన వంతెనలు కనిపిస్తున్నాయి. కోట్లాది రూపాయలు ఖర్చు చేసి వరుసగా వంతెనలు నిర్మిస్తున్నా, వాహనదారులకు మాత్రం ట్రాఫిక్ నరకం తప్పడం లేదు. ఒక జంక్షన్ దాటేసరికి మరో జంక్షన్ వద్ద కిలోమీటర్ల కొద్దీ వాహనాలు నిలిచిపోతున్నాయి. అసలు ఇన్ని ఫ్లైఓవర్లు అందుబాటులోకి వస్తున్నా, హైదరాబాద్ రోడ్లపై రద్దీ ఎందుకు తగ్గడం లేదు? క్షేత్రస్థాయిలో అసలు లోపం ఎక్కడుంది?ఫ్లైఓవర్లు నిర్మించడం వల్ల ఆ ఒక్క కూడలి వద్ద సిగ్నల్ లేకుండా వాహనాలు వేగంగా ముందుకు వెళ్తున్నాయి. కానీ, ఫ్లైఓవర్ దిగగానే ముందుకు వెళ్లే రోడ్డు ఇరుకుగా ఉండటం లేదా అక్కడ మరో సిగ్నల్ ఉండటంతో మళ్లీ వాహనాలన్నీ ఒకేచోట గుమిగూడుతున్నాయి.

పిల్లల పెంపకం కేవలం తల్లి బాధ్యత మాత్రమే కాదు: కొణిదెల ఉపాసనసినిమాSwechaa15 Nov 2026, 02:31 PM

పిల్లల పెంపకం కేవలం తల్లి బాధ్యత మాత్రమే కాదు: కొణిదెల ఉపాసన

 పిల్లల ఆలనాపాలనా, పెంపకం విషయంలో మన సమాజంలో తరతరాలుగా పాతుకుపోయిన పాత ఆలోచనా విధానంలో కచ్చితంగా మార్పు రావాల్సిన అవసరం ఉందని ప్రముఖ వ్యాపారవేత్త, గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ సతీమణి ఉపాసన కొణిదెల స్పష్టం చేశారు. సంతాన సంరక్షణలో తల్లిదండ్రుల పాత్రను సమాజం వేర్వేరు కోణాల్లో చూస్తున్న తీరును, అందులో దాగి ఉన్న లింగ అసమానతలను ఆమె ఎంతో సూటిగా ఎత్తిచూపారు. పిల్లల పెంపకం అనేది కేవలం అమ్మకు మాత్రమే పరిమితమైన పని కాదని, తల్లిదండ్రులిద్దరి సమాన భాగస్వామ్యంతోనే అది పరిపూర్ణమవుతుందని ఆమె అభిప్రాయపడ్డారు.

ప్రధాని మోదీతో సీఎం రేవంత్ రెడ్డి భేటీ.. రాష్ట్రానికి రూ.30వేల కోట్ల నిధులు?తెలంగాణSwechaa15 Nov 2026, 02:01 PM

ప్రధాని మోదీతో సీఎం రేవంత్ రెడ్డి భేటీ.. రాష్ట్రానికి రూ.30వేల కోట్ల నిధులు?

తెలంగాణ ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డి ఆదివారం దేశ రాజధాని ఢిల్లీలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీతో అధికారికంగా సమావేశమయ్యారు. ఈ కీలక భేటీలో సీఎం వెంట నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి, మంత్రి వాకిటి శ్రీహరి తదితరులు పాల్గొన్నారు. రాష్ట్రంలో నెలకొన్న కరువు పరిస్థితులు, ఎల్-నినో ప్రభావం, సాగునీటి ప్రాజెక్టుల పెండింగ్ అనుమతులు తదితర అంశాలపై ప్రధానితో చర్చించిన ముఖ్యమంత్రి బృందం, రాష్ట్ర అభివృద్ధి కోసం కేంద్రం నుంచి ప్రత్యేక సహకారాన్ని కోరింది. ఈ సమావేశంలో ప్రస్తావించిన ప్రధానాంశాలు గమనిస్తే.. రాష్ట్రంలో వర్షాభావ పరిస్థితుల కారణంగా ఏర్పడిన లోటు వర్షపాతం, కరువు పరిస్థితులను ప్రధానికి వివరించిన సీఎం రేవంత్ రెడ్డి, సుమారు 365 మండలాలను కరువు మండలాలుగా ప్రకటించినట్లు తెలిపారు. ఈ విపత్కర పరిస్థితిని ఎదుర్కొనేందుకు కేంద్రం తరఫున రూ.30వేల కోట్ల ఆర్థిక ప్యాకేజీని తక్షణమే విడుదల చేయాలని విజ్ఞప్తి చేశారు.

ఫలించిన పాలిటెక్నిక్ విద్యార్థుల పోరాటం.. జీవో 97పై వెనక్కి తగ్గిన ప్రభుత్వం!తెలంగాణSwechaa15 Nov 2026, 01:28 PM

ఫలించిన పాలిటెక్నిక్ విద్యార్థుల పోరాటం.. జీవో 97పై వెనక్కి తగ్గిన ప్రభుత్వం!

 తెలంగాణలో కొంతకాలంగా ఉత్కంఠ రేకెత్తించిన పాలిటెక్నిక్ విద్యార్థుల ఆందోళనలకు ప్రభుత్వం ముగింపు పలికింది. పాలిటెక్నిక్ కళాశాలలను కార్మిక, ఉపాధి శాఖ (శక్తి విభాగం) పరిధిలోకి మారుస్తూ గతంలో జారీ చేసిన వివాదాస్పద జీవో నంబర్ 97 (G.O. Ms. No. 97) పై రేవంత్ రెడ్డి ప్రభుత్వం వెనక్కి తగ్గింది. విద్యార్థులు, అధ్యాపకుల అభ్యర్థనలు, ఉన్నత స్థాయి కమిటీ సిఫార్సుల మేరకు ఆ జీవోను సవరిస్తూ తాజాగా జీవో నంబర్ 157 (G.O. Ms. No. 157) ను ప్రభుత్వం అధికారికంగా విడుదల చేసింది.

అంతరిక్ష రంగంలో అద్భుతం.. గాల్లోనే స్టార్‌షిప్‌ను పట్టుకున్న స్పేస్‌ఎక్స్ 'చాప్‌స్టిక్స్'!InternationalSwechaa15 Nov 2026, 01:01 PM

అంతరిక్ష రంగంలో అద్భుతం.. గాల్లోనే స్టార్‌షిప్‌ను పట్టుకున్న స్పేస్‌ఎక్స్ 'చాప్‌స్టిక్స్'!

 ప్రపంచ కుబేరుడు ఎలాన్ మస్క్ సారథ్యంలోని ప్రముఖ అంతరిక్ష పరిశోధన సంస్థ 'స్పేస్‌ఎక్స్' (SpaceX) మరో అసాధ్యమైన ప్రయోగాన్ని సుసాధ్యం చేసి చరిత్ర సృష్టించింది. అంతరిక్షంలోకి వెళ్లి భూమి కక్ష్యను చుట్టివచ్చిన భారీ 'స్టార్‌షిప్' (Starship) అంతరిక్ష నౌకను ఎలాంటి నష్టం వాటిల్లకుండా సరిగ్గా గాల్లోనే 'స్టార్‌బేస్' లాంచ్ టవర్ మెకానికల్ హ్యాండ్స్ పట్టుకున్నాయి. అమెరికాలోని టెక్సాస్ రాష్ట్రం బోకా చికాలోని 'స్టార్‌బేస్' ప్రయోగ కేంద్రంలో చోటుచేసుకున్న ఈ అద్భుత ఘట్టం అంతరిక్ష చరిత్రలో చిరస్థాయిగా నిలిచిపోనుంది.

జపాన్ మాస్టర్స్ పోరు.. భారత షట్లర్ లక్ష్యసేన్ చారిత్రాత్మక విజయం!క్రీడలుSwechaa15 Nov 2026, 12:43 PM

జపాన్ మాస్టర్స్ పోరు.. భారత షట్లర్ లక్ష్యసేన్ చారిత్రాత్మక విజయం!

 భారత స్టార్ షట్లర్ లక్ష్యసేన్ జపాన్ గడ్డపై అద్భుత ప్రదర్శనతో చరిత్రాత్మక విజయాన్ని నమోదు చేశాడు. జపాన్ లోని కుమామోటోలో జరిగిన ప్రతిష్టాత్మక 'జపాన్ మాస్టర్స్-2026' సూపర్ 500 టోర్నీలో పురుషుల సింగిల్స్ టైటిల్‌ను సొంతం చేసుకున్నాడు. ఈ ఘనత సాధించిన తొలి భారతీయ పురుష సింగిల్స్ ఆటగాడిగా లక్ష్యసేన్ అరుదైన రికార్డు సృష్టించాడు. ఆదివారం ఉత్కంఠభరితంగా సాగిన ఫైనల్ పోరులో స్థానిక జపాన్ ఆటగాడు కోకి వతనాబేపై 13-21, 21-18, 21-14 తేడాతో అద్భుతమైన విజయం సాధించి ట్రోఫీని ముద్దాడాడు.

మెటాకు దిమ్మతిరిగే షాకిచ్చిన ఇటలీ.. ఏకంగా రూ.7,400కోట్ల భారీ జరిమానా!వ్యాపారంSwechaa15 Nov 2026, 11:49 AM

మెటాకు దిమ్మతిరిగే షాకిచ్చిన ఇటలీ.. ఏకంగా రూ.7,400కోట్ల భారీ జరిమానా!

 సోషల్ మీడియా దిగ్గజం మెటా (Meta) సంస్థకు ఇటలీలో ఊహించని రీతిలో భారీ ఎదురుదెబ్బ తగిలింది. వినియోగదారుల ప్రత్యేక అనుమతి లేకుండా వారి స్మార్ట్‌ఫోన్ గ్యాలరీలోని వ్యక్తిగత ఫొటోలు, వీడియోలను యాక్సెస్ చేసినట్లు రుజువు కావడంతో ఇటలీ డేటా పరిరక్షణ నియంత్రణ సంస్థ మెటాపై కొరడా ఝళిపించింది. యూరోపియన్ గోప్యతా చట్టాలను ఉల్లంఘించినందుకు గాను మెటాకు ఏకంగా 805 మిలియన్ యూరోలు.. అంటే భారత కరెన్సీలో సుమారు రూ.7,400కోట్ల భారీ జరిమానా విధిస్తూ సంచలన ఆదేశాలు జారీ చేసింది.

మైక్ కట్ చేశారని కాంగ్రెస్ ఎమ్మెల్యే విధ్వంసం.. సౌండ్ ఆపరేటర్లపై దాడి!NationalSwechaa15 Nov 2026, 11:41 AM

మైక్ కట్ చేశారని కాంగ్రెస్ ఎమ్మెల్యే విధ్వంసం.. సౌండ్ ఆపరేటర్లపై దాడి!

ప్రసంగం మధ్యలో తన మైక్ కట్ చేశారని ఓ కాంగ్రెస్ ఎమ్మెల్యే స్టేజీ మీద రచ్చ రచ్చ చేశారు.అంతేకాకుండా కుర్చీలతో సౌండ్ ఆపరేటర్ మీద దాడికి ప్రయత్నించారు.ఈ ఘటన ఉత్తరాఖండ్‌లోని పితోర్‌గఢ్ జిల్లాలో జరిగింది. నిన్న ఉదయం ఉత్తరాఖండ్ ముఖ్యమంత్రి పుష్కర్ సింగ్ ధామి జౌల్జీ బీ జాతరను ప్రారంభించి, తన ప్రసంగం అనంతరం వేదికపై నుంచి వెళ్లిపోయారు. ఆ తర్వాత స్థానిక ధార్చులా నియోజకవర్గ కాంగ్రెస్ ఎమ్మెల్యే హరీష్ ధామి మాట్లాడేందుకు వేదికపైకి వచ్చారు.సీఎం పుష్కర్ సింగ్ తన ప్రసంగం వినకుండానే వెళ్లిపోయారని హరీష్ ధామి విమర్శలు ప్రారంభించారు. ఆ వెంటనే మైక్ అకస్మాత్తుగా ఆగిపోయింది. దీంతో తనను మాట్లాడకుండా అడ్డుకునేందుకే కావాలని మైక్ ఆపేశారని కాంగ్రెస్ ఎమ్మెల్యే ఆరోపించారు.

National : డీజే సౌండ్స్‌కు 20 రోజుల పసికందు మృతిNationalSwechaa15 Nov 2026, 11:12 AM

National : డీజే సౌండ్స్‌కు 20 రోజుల పసికందు మృతి

డీజే సౌండ్ దెబ్బకు ఓ చిన్నారి నిద్రలోనే ప్రాణాలు కోల్పోయింది. ఈ తీవ్ర విషాద ఘటన ఉత్తరప్రదేశ్‌లోని బలియా జిల్లా ముడియారీ గ్రామం మనియార్ పీఎస్ పరిధిలో చోటుచేసుకుంది. వివరాల్లోకివెళితే.. లక్ష్మీ విగ్రహం నిమజ్జన ఊరేగింపులో భాగంగా డీజే సిస్టమ్ అమర్చిన ట్రక్కు ఓ ఇంటి ముందు ఆగింది.భారీ శబ్దంతో డీజే ప్లే చేస్తుండగా ఇంట్లో 20 రోజుల పసికందు ఉందని, శబ్దం తగ్గించాలని తల్లి రీమా దేవి వేడుకుంది. కనీసం వాహనాన్ని అయినా ముందుకు తీసుకెళ్లాలని వేడుకున్నా నిర్వాహకులు పట్టించుకోలేదు. అయితే, భారీ శబ్దాలకు గాను పసికందు గుండె ఆగిపోయి కన్నుమూసింది.కళ్ల ముందే పసికందు విగతజీవిగా మారడంతో కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరయ్యారు.

రెండేళ్ల క్రితం తప్పిపోయిన భార్య.. భర్త చెంతకు చేర్చిన చాట్‌జీపీటీ!వైరల్ న్యూస్Swechaa15 Nov 2026, 11:02 AM

రెండేళ్ల క్రితం తప్పిపోయిన భార్య.. భర్త చెంతకు చేర్చిన చాట్‌జీపీటీ!

 ఏఐ(AI) (ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్) సాంకేతికతకు మానవత్వం తోడైతే అద్భుతాలు సృష్టించవచ్చని మహారాష్ట్రలో జరిగిన ఒక హృదయస్పర్శి ఘటన నిరూపించింది. మానసిక అస్వస్థత కారణంగా రెండేళ్లన్నర క్రితం ఇంటి నుంచి తప్పిపోయిన ఒక వివాహిత, గూగుల్ సెర్చ్, చాట్‌జీపీటీ (ChatGPT) వంటి డిజిటల్ సాధనాల సహాయంతో తిరిగి తన కుటుంబ సభ్యుల చెంతకు చేరుకున్నారు. సాంకేతిక పరిజ్ఞానాన్ని సేవాభావంతో మేళవించి ఓ స్వచ్ఛంద సంస్థ ఈ అసాధ్యాన్ని సుసాధ్యం చేయడం సర్వత్రా ప్రశంసలు అందుకుంటోంది.

Rains : ముంచుకొస్తున్న అక్వాన్.. తెలంగాణలో భారీ వర్షాలు!తెలంగాణSwechaa15 Nov 2026, 10:54 AM

Rains : ముంచుకొస్తున్న అక్వాన్.. తెలంగాణలో భారీ వర్షాలు!

మురసు తుఫాన్ విధ్వంసం నుంచి ఇప్పుడిప్పుడే కోలుకుంటున్న ఆంధ్రప్రదేశ్‌కు మరో గండం పొంచి ఉన్నది. బంగాళాఖాతంలో ‘అక్వాన్’ తుఫాన్ క్రమంగా బలపడుతున్నట్టు సమాచారం. దీని ప్రభావం తెలుగు రాష్ట్రాలపై బలంగా ఉంటుందని, ఏపీతో పాటు తెలంగాణలోనూ భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వెదర్ మ్యాన్ బాలాజీ కీలక సూచనలు చేశారు. ఈ నెల 20న అక్వాన్ తుఫాను ఉత్తర కోస్తాంధ్ర తీరాన్ని దాటే అవకాశం ఉందని అంచనా వేశారు. ఫలితంగా తెలంగాణలోని పలు జిల్లాల్లో వాతావరణం పూర్తిగా మారిపోనుందని పేర్కొన్నారు.

Crime : పబ్ జీలో ఇద్దరు యువతులతో ప్రేమాయణం.. చివరకు!క్రైమ్Swechaa15 Nov 2026, 10:33 AM

Crime : పబ్ జీలో ఇద్దరు యువతులతో ప్రేమాయణం.. చివరకు!

పబ్ జీ గేమ్ ఎంతో మంది యువత జీవితాలను నాశనం చేసింది. ఈ గేమ్‌కు దేశంలోని యువతీయువకులు, విద్యార్థులు అడిక్ట్ అవుతున్నారని తెలిసి కేంద్రప్రభుత్వం కొంతకాలం బ్యాన్ చేసిన విషయం తెలిసిందే. ఆ తర్వాత కొన్ని కఠిన ఆంక్షలు విధించి మరల అనుమతి ఇచ్చింది. అయితే, పబ్ జీ గేమ్ తాజాగా ఓ హత్యకు కారణమైంది. ఈ గేమ్ ఆడుతుండగా ఓ వ్యక్తికి ఇద్దరు యువతులు పరిచయం అయ్యారు. ఇద్దరితో ప్రేమాయణం సాగించిన సదరు వ్యక్తి ఒకరు బ్రేకప్ చెప్పడంతో కోపం పెంచుకున్నాడు.అనంతరం ప్లాన్ ప్రకారం ఆమెను అంతమొందించాడు.ఈ ఘటన పశ్చిమబెంగాల్లో చోటుచేసుకుంది.

తుది దశకు ‘ఫోన్ ట్యాపింగ్’ కేసు.. కేసీఆర్, కేటీఆర్‌లకు బిగుస్తున్న ఉచ్చు?తెలంగాణSwechaa15 Nov 2026, 10:17 AM

తుది దశకు ‘ఫోన్ ట్యాపింగ్’ కేసు.. కేసీఆర్, కేటీఆర్‌లకు బిగుస్తున్న ఉచ్చు?

 తెలంగాణ రాజకీయాల్లో పెను ప్రకంపనలు సృష్టించిన ‘ఫోన్ ట్యాపింగ్’ కేసు దర్యాప్తు అత్యంత కీలకమైన తుది దశకు చేరుకుంది. విశ్వసనీయ వర్గాల సమాచారం ప్రకారం.. ఈ కేసులో మాజీ సీఎం, బీఆర్ఎస్ అధినేత కేసీఆర్(KCR)ను ప్రధాన నిందితుడిగా (A1), ఆయన కుమారుడు, మాజీ మంత్రి కేటీఆర్‌(KTR)ను రెండో నిందితుడిగా (A2) పేర్కొంటూ ప్రత్యేక దర్యాప్తు బృందం (SIT) తుది ఛార్జ్‌షీట్ దాఖలు చేసేందుకు రంగం సిద్ధం చేస్తోంది.  నిబంధనలకు విరుద్ధమని తెలిసినప్పటికీ ఫోన్ ట్యాపింగ్‌కు అనుమతులు ఇవ్వడంతో పాటు, తమకు అనుకూలంగా ఉండే అధికారులను ఇంటెలిజెన్స్, స్పెషల్ ఇంటెలిజెన్స్ బ్యూరో (SIB) వంటి కీలక విభాగాల్లో నియమించి ఈ అక్రమాలకు పాల్పడ్డారని సిట్ అధికారులు భావిస్తున్నట్లు సమాచారం.

Nonveg :  భారీగా తగ్గిన చికెన్ ధరలు.. కేజీ ఎంతంటే?తెలంగాణSwechaa15 Nov 2026, 10:05 AM

Nonveg : భారీగా తగ్గిన చికెన్ ధరలు.. కేజీ ఎంతంటే?

చికెన్ ధరలు సామాన్యుడికి అందుబాటులోకి వచ్చాయి. మొన్నటివరకు కేజీకి రూ.300 నుంచి 320 వరకు పలికిన చికెన్.. కార్తీకమాసం ప్రారంభం కావడంతో ఒక్కసారిగా ధరలు పడిపోయాయి. ఈ మాసంలో చాలా మంది నాన్ వెజ్‌కు దూరంగా ఉంటారు. దీంతో డిమాండ్ పడిపోవడంతో సప్లయ్ పెరిగి ధరలు తగ్గుముఖం పట్టినట్టు తెలుస్తోంది. కార్తీకమాసంలో తొలి ఆదివారం(నేడు) కిలో చికెన్‌పై ఏకంగా రూ. 50 నుంచి రూ. 80 వరకు ధర తగ్గింది. రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ ఇదే పరిస్థితి కొనసాగుతున్నట్టు సమాచారం. డిమాండ్ పడిపోవడంతో పౌల్ట్రీ వ్యాపారులు ధరలను తగ్గించక తప్పలేదని తెలుస్తోంది. గత ఆదివారం రూ.300పైగా పలికిన స్కిన్‌లెస్ చికెన్ ధరలు నేడు చాలా ప్రాంతాల్లో రూ.260లోపే విక్రయిస్తున్నారు. తెలంగాణలోని ప్రధాన నగరాలు, హైదరాబాద్‌లో కేజీ స్కిన్‌లెస్ చికెన్ రూ.260 నుంచి రూ. 270 వరకు అమ్ముతున్నారు.వరంగల్‌లో రూ.250 నుంచి రూ.260, కామారెడ్డిలో రూ.260, నిజామాబాద్‌లో రూ.200 నుంచి రూ.260 మధ్య విక్రయిస్తున్నట్టు తెలిసింది.

Tollywood: జనవరి మొదటివారంలో విశ్వంభర రిలీజ్..ఇది కూడా రూమరా?సినిమాSwechaa15 Nov 2026, 10:01 AM

Tollywood: జనవరి మొదటివారంలో విశ్వంభర రిలీజ్..ఇది కూడా రూమరా?

Tollywood: జనవరి మొదటివారంలో విశ్వంభర రిలీజ్..ఇది కూడా రూమరా? అవును..దాదాపు ఏడాదికి పైగా వాయిదాల పర్వం నడుస్తోంది మెగాస్టార్ చిరంజీవి నటిస్తున్న వివంభర సినిమా. త్రిష కృష్ణన్ హీరోయిన్‌గా ఆషిక రంగనాథ్ కీలక పాత్రలో కనిపించబోతోంది. అయితే, వీఎఫ్ఎక్స్ వర్క్ వల్ల బాగా ఆలస్యం అవుతూ వస్తోంది. అసలు, ఈ సినిమా విడుదల కాకుండా పక్కన పెట్టారనే రూమర్స్ నుంచి మళ్ళీ ఊపందుకుంది.

ప్రశ్నిస్తే బ్లేమ్ చేస్తేస్తారా?  అభిప్రాయం చెప్పే హక్కులేదా? : నటి చాందినిఏపీSwechaa15 Nov 2026, 09:50 AM

ప్రశ్నిస్తే బ్లేమ్ చేస్తేస్తారా? అభిప్రాయం చెప్పే హక్కులేదా? : నటి చాందిని

ఏపీలో జరుగుతున్న ప్రకృతి విధ్వంసంపై ప్రశ్నించిన సినిమా యాక్టర్ చాందిని చౌదరిపై ట్రోల్స్ మొదలవ్వడంపై ఆమె మరోసారి స్పందించారు. ‘ప్రశ్నిస్తే బ్లేమ్ చేస్తారా..? అభిప్రాయం చెప్పే హక్కు లేదా?’ అంటూ ఫైర్ అయ్యారు. గత కొంతకాలంగా విశాఖలో కొండల అక్రమ తవ్వకాలు జరుగుతున్నాయి. ఈ విషయంపై స్పందించిన ఆమె ప్రకృతిని నాశనం చేస్తున్నారంటూ ఆవేదన వ్యక్తం చేశారు. ‘కొండల్ని ధ్వంసం చేస్తుంటే గుండె తరుక్కుపోతోంది’అంటూ ఇన్‌స్టాగ్రామ్ మాధ్యమంగా హీరోయిన్ చాందిని చౌదరీ పోస్టు పెట్టారు.అభివృద్ధి, అర్బనైజేషన్ పేరిట విశాఖపట్నం పరిసరాల్లోని కొండల్ని ఏపీలోని కూటమి సర్కార్ ధ్వంసం చేస్తున్నదని పరోక్షంగా స్పందించారు. ఈ దృశ్యాలు చూస్తుంటే గుండె బరువెక్కుతోందని, ప్రకృతి అందాలు నాశనమవుతుంటే తన మనసు కలత చెందుతోందంటూ చాందిని చౌదరీ వాపోయారు.

VCSajjanarControversy: ఊహించిందే బాస్?స్వేచ్ఛ ఛైర్మన్ డెస్క్Swechaa15 Nov 2026, 09:33 AM

VCSajjanarControversy: ఊహించిందే బాస్?

తెలంగాణలో ఐపీఎస్ సజ్జనార్ తెలియని వారుండరు. ఎక్కడ పని చేసినా తనదైన మార్క్ చూపించుకుంటూ వచ్చారు. ఇన్నాళ్లు ఎంతో గొప్ప పేరు సంపాదించుకున్నారు. గత కొద్ది సంవత్సరాలుగా ఆయన తెర వెనుక వ్యవహారశైలిని సైతం తెలంగాణ ప్రజలు గమనిస్తూ వచ్చారు. ఎంత ప్రచారం జరిగితే అంత ఫోకస్ ఉంటుంది. అలాంటి అధికారిపై అనేక ఆరోపణలు వస్తుంటే సమాజానికి తెలియజేయాల్సిన బాధ్యత ఇన్వెస్టిగేషన్ జర్నలిస్టుగా నాపై ఉంటుంది. తప్పు అయితే నా వార్తతో మీ ఉద్యోగం పోదు. అదే ఆరోపణలో 40శాతం నిజం అయినా మీ అత్మ ప్రశ్నిస్తుంది. బ్యూరో క్రాట్స్ చేసే తప్పిదాలను ఎత్తి చూపకపోతే ఒక్కరిని చూసి మరో అధికారి బరితెగించి అవినీతికి, అక్రమాలకు పాల్పడుతారని జనం వాపోతున్నారు. అందుకే తెలంగాణలో అక్రమాలను తగ్గించేందుకు మీ కంటే ఎక్కవ రాత్రింబవళ్లు కష్టపడి ప్రభుత్వ భూములను, వ్యవస్థలో ఉండే కొంతమంది కళాకారులను గుర్తించి వాళ్ల అసలు రూపాన్ని బయటపెడుతున్నా.

Tollywood: అదుర్స్ లాంటి కథతో అనిల్-ఎన్టీఆర్..!సినిమాSwechaa15 Nov 2026, 09:29 AM

Tollywood: అదుర్స్ లాంటి కథతో అనిల్-ఎన్టీఆర్..!

Tollywood: మన టాలీవుడ్‌ సినిమా ఇండస్ట్రీలో కొన్ని కాంబినేషన్లను ప్రకటించిన వెంటనే అంచనాలు ఆకాశాన్ని అంటుకుంటాయి. ఇప్పుడు అలాంటి క్రేజీ కాంబినేషనే ఎన్టీఆర్, అనిల్ రావిపూడిలది కావడం విశేషం. ఇప్పటివరకు.. యాక్షన్, మాస్ సినిమాలతో పాన్ ఇండియా స్థాయిలో మార్కెట్ సాధించుకున్న ఎన్టీఆర్.. ఇప్పుడు మళ్లీ తనలోని కామెడీ టైమింగ్‌ను బయటకు తీసేందుకు అనిల్ రావిపూడి సినిమాకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు. అనిల్ రావిపూడి లాంటి ఎంటర్‌టైన్‌మెంట్ డైరెక్టర్ తోడవడంతో ఈ మూవీపై ఆసక్తి మరింత పెరిగింది.

Today in History: చరిత్రలో ఈ రోజు (15 నవంబర్)InternationalSwechaa15 Nov 2026, 08:57 AM

Today in History: చరిత్రలో ఈ రోజు (15 నవంబర్)

  • 1875: బ్రిటిష్ పాలనకు వ్యతిరేకంగా పోరాడిన గిరిజన స్వాతంత్ర్య సమరయోధుడు బిర్సా ముండా (Birsa Munda) జననం — ఈ రోజును 'జనజాతీయ గౌరవ్ దివస్' (Janjatiya Gaurav Divas) గా జరుపుకుంటారు.

  • 2000: బిహార్ రాష్ట్రం నుంచి విడిపోయి భారతదేశపు 28వ రాష్ట్రంగా జార్ఖండ్ (Jharkhand) అవతరించింది (బిర్సా ముండా జయంతి రోజున).

  • 1989: భారత క్రికెట్ దిగ్గజం సచిన్ టెండూల్కర్ తన 16వ ఏట పాకిస్థాన్‌పై కరాచీ వేదికగా తొలి అంతర్జాతీయ టెస్ట్ మ్యాచ్‌లో అరంగేట్రం చేశారు.

  • 1889: బ్రెజిల్‌లో సైనిక తిరుగుబాటుతో చక్రవర్తి డోమ్ పెడ్రో II పదవీచ్యుతుడై, బ్రెజిల్ ఒక రిపబ్లిక్ దేశంగా అవతరించింది.

  • 1971: టెక్నాలజీ చరిత్రలో విప్లవం — ప్రముఖ చిప్ తయారీ సంస్థ ఇంటెల్ (Intel) ప్రపంచంలోనే మొట్టమొదటి కమర్షియల్ సింగిల్-చిప్ మైక్రోప్రాసెసర్ 'ఇంటెల్ 4004' (Intel 4004) ను మార్కెట్లోకి విడుదల చేసింది.

  • 1988: సోవియట్ యూనియన్ మానవరహిత స్పేస్ షటిల్ 'బురాన్' (Buran) తన తొలి మరియు ఏకైక అంతరిక్ష ప్రయాణాన్ని విజయవంతంగా పూర్తి చేసుకుని భూమిపైకి తిరిగి వచ్చింది.

  • 1875 (జననం): బిర్సా ముండా — మహాన్ గిరిజన నాయకుడు, స్వాతంత్ర్య సమరయోధుడు ('ధర్తీ ఆబా').

  • 1986 (జననం): సానియా మీర్జా — భారత టెన్నిస్ స్టార్, ఆరు గ్రాండ్ స్లామ్ టైటిళ్ల విజేత, పద్మభూషణ్ గ్రహీత.

  • 1949 (మరణం): నాథూరామ్ గాడ్సే — మహాత్మా గాంధీ హత్య కేసులో ఉరితీయబడ్డారు.

  • 1982 (మరణం): ఆచార్య వినోబా భావే — భారతరత్న, భూదానోద్యమ పితామహుడు, గాంధేయవాది.

నేటి పంచాంగం - 15 నవంబర్ 2026 | కార్తిక శుద్ధ షష్ఠి, ఆదివారంSpiritualitySwechaa15 Nov 2026, 08:44 AM

నేటి పంచాంగం - 15 నవంబర్ 2026 | కార్తిక శుద్ధ షష్ఠి, ఆదివారం

  • తేదీ: 15 నవంబరు 2026, ఆదివారం

  • సంవత్సరం: శ్రీ పరాభవ నామ సంవత్సరం

  • అయనం & ఋతువు: దక్షిణాయనం, శరత్ఋతువు

  • మాసం & పక్షం: కార్తిక మాసం, శుక్ల పక్షం

  • తిథి: షష్ఠి (ఉదయం 08:18 వరకు, తదుపరి సప్తమి)

  • వారం: ఆదివారం (భానువాసరే)

  • నక్షత్రం: ఉత్తరాషాఢ (ఉదయం 05:58 వరకు), తదుపరి శ్రవణం (తెల్లవారుజామున 05:24 వరకు)

  • యోగం: గండ (సాయంత్రం 06:02 వరకు, తదుపరి వృద్ధి)

  • కరణం: తైతుల (ఉదయం 08:18 వరకు), తదుపరి గరజ (రాత్రి 07:35 వరకు)

శుభ / అశుభ సమయాలు:

  • రాహుకాలం: సాయంత్రం 04:30 - 06:00 వరకు

  • యమగండం: మధ్యాహ్నం 12:00 - 01:30 వరకు

  • అమృతకాలం: మధ్యాహ్నం 02:18 - 03:52 వరకు

  • దుర్ముహూర్తము: సాయంత్రం 04:08 - 04:53 వరకు

  • వర్జ్యం: సాయంత్రం 05:10 - 06:44 వరకు

గ్రహస్థితులు:

  • సూర్యరాశి: తుల (రాత్రి 08:42 వరకు, తదుపరి వృశ్చికం - వృశ్చిక సంక్రమణం)

  • చంద్రరాశి: మకరం

  • సూర్యోదయం: ఉదయం 06:24

  • సూర్యాస్తమయం: సాయంత్రం 05:36