స్వేచ్ఛ షార్ట్స్ — తాజా తెలుగు వార్తలు

Tollywood: వారణాసి, ధర్మన్ సినిమాలపై వస్తున్నవన్నీ రూమర్సేనా?సినిమాSwechaa15 Nov 2026, 08:04 AM

Tollywood: వారణాసి, ధర్మన్ సినిమాలపై వస్తున్నవన్నీ రూమర్సేనా?

Tollywood: ఒకటి పాన్ వరల్డ్ సినిమా..ఇంకోటి పాన్ ఇండియా వైడ్‌గా క్రేజ్ ఉన్న సినిమా. ఈ రెండు సినిమాల విషయంలో తాజాగా ఓ ప్రచారం ఊపందుకుంది. అదేమిటంటే, అనూహ్యంగా ఈ రెండు సినిమాలు విడుదల వాయిదా పడబోతున్నాయి అని. ఇంతకీ, ఆ సినిమాలేవంటే సూపర్ స్టార్ మహేష్ బబౌ నటిస్తిన్న వారణాసి..కోలీవుడ్ సూపర్ స్టార్ నటిస్తున్న ధర్మన్. ఈ రెండు సినిమాలు రిలీజ్ పోస్ట్ పోన్ కానున్నాయని సమాచారం.

Tollywood: కామెంట్స్ చేసిన కిరణ్ అబ్బవరమే.. ఇప్పుడు చాలా బిజీ..సినిమాSwechaa15 Nov 2026, 07:29 AM

Tollywood: కామెంట్స్ చేసిన కిరణ్ అబ్బవరమే.. ఇప్పుడు చాలా బిజీ..

Tollywood: ఒకప్పుడు మన టాలీవుడ్ యంగ్ హీరోలలో కిరణ్ అబ్బవరం మంచి ఫాంలోనే కొనసాగాడు. మరి, బ్లాక్ బస్టర్స్ అందుకోలేకపోయినా, కొన్ని సినిమాలు హీరోగా మంచి గుర్తింపును తెచ్చాయి. కానీ, ఇండస్ట్రీలో స్టార్స్ తనకి సపోర్ట్ చేయడం లేదని, తన సినిమాలపై నెగిటివ్‌గా ప్రచారం చేస్తున్నారని బాగా ఫీలైయ్యాడు..ఈవెంట్‌లో ఎమోషల్ అయ్యాడు కూడా. అలా, బాధపడిన కిరణ్ అబ్బవరం ఇప్పుడు చాలా బిజీగా మారిపోయాడు.

Dhanush: ఓం సినిమా కథ లీక్..ఆల్రెడీ వచ్చిన కథే ఇది!సినిమాSwechaa15 Nov 2026, 07:08 AM

Dhanush: ఓం సినిమా కథ లీక్..ఆల్రెడీ వచ్చిన కథే ఇది!

Dhanush: తమిళ స్టార్ హీరో ధనుష్ నటించిన లేటెస్ట్ సినిమా 'ఓం'. ఇందులో మలయాళ మెగాస్టార్ మమ్ముట్టి మరో ప్రధాన పాత్రలో నటించాడు. ఫిదా బ్యూటీ సాయి పల్లవి ఇందులో పోలీస్ ఆఫీసర్‌గా నటించింది. అయితే, రిలీజ్ సమయం దగ్గరపడుతున్న నేపథ్యంలో మేకర్స్ ఇటీవలే ప్రమోషన్స్‌లో భాగంగా ట్రైలర్‌ను విడుదల చేశారు. ఈ ట్రైలర్ చూశాక ఆల్రెడీ అందరికీ తెలిసిన కథనే మళ్ళీ తమిళంలో చేస్తున్నారు..ఇది ఆడే సినిమా కాదంటూ ప్రచారం జరుగుతోంది.

మూడేళ్లలో నలుగురు ఇన్‌ఛార్జ్‌లు.. అసలు తెలంగాణ కాంగ్రెస్‌లో ఏం జరుగుతోంది?తెలంగాణSwechaa15 Nov 2026, 12:30 AM

మూడేళ్లలో నలుగురు ఇన్‌ఛార్జ్‌లు.. అసలు తెలంగాణ కాంగ్రెస్‌లో ఏం జరుగుతోంది?

మూడేళ్లలో నలుగురు ఇన్‌ఛార్జ్‌లు.. తెలంగాణ కాంగ్రెస్‌లో అసలేం జరుగుతోంది? అధికారంలో ఉన్న పార్టీలో ఎందుకిలాంటి మార్పులు..? ఇప్పుడు కొత్త ఇన్‌ఛార్జ్‌గా బి.ఎం. సందీప్ ఎంట్రీ ఇచ్చారు. మరి ఆయన రాకతో తెలంగాణ కాంగ్రెస్‌లో పరిస్థితులు మారతాయా?

భారత్ సమ్మిట్‌లో రాజకీయ కురుక్షేత్రం.. కాంగ్రెస్ వర్సెస్ బీజేపీ వర్సెస్ బీఆర్ఎస్!తెలంగాణSwechaa14 Nov 2026, 11:55 PM

భారత్ సమ్మిట్‌లో రాజకీయ కురుక్షేత్రం.. కాంగ్రెస్ వర్సెస్ బీజేపీ వర్సెస్ బీఆర్ఎస్!

పెట్టుబడుల కోసం నిర్వహించిన భారత్ సమ్మిట్.. రాజకీయ పార్టీల మధ్య పవర్ ఫైట్‌కు వేదికగా మారిందా? రాహుల్ గాంధీ మోదీపై విమర్శలతో దాడి చేస్తే.. బీజేపీ, బీఆర్ఎస్ ఎదురుదాడికి దిగాయి. అసలు సమ్మిట్ చుట్టూ ఇంత రాజకీయ రచ్చ ఎందుకు?

Varanasi: పృథ్వి రాజ్ సుకుమారన్‌కి జంటగా శ్రుతి హాసన్!సినిమాSwechaa14 Nov 2026, 11:08 PM

Varanasi: పృథ్వి రాజ్ సుకుమారన్‌కి జంటగా శ్రుతి హాసన్!

Varanasi: వారణాసి సినిమా గురించి ఇప్పటి వరకూ చాలా విషయాలు బయటకి వచ్చాయి. వాటిలో కొన్ని స్వయంగా దర్శకుడు రాజమౌళీనే హాలీవుడ్ పాడ్ కాస్ట్‌లలో రివీల్ చేశాడు. కానీ, ఇప్పటి వరకూ ఒక్క విషయం ఎక్కడా రివీల్ కాలేదు. అదే హీరోయిన్ శ్రుతి హాసన్ గురించి. తాజా సమాచారం మేరకు వారణాసి సినిమలో శ్రుతి కీలక పాత్రను పోషించినట్టుగా తెలుస్తోంది.

SBI Credit Card: ఎస్‌బీఐ క్రెడిట్ కార్డు వాడుతున్నారా? డిసెంబర్ 1 నుంచి కొత్త బాదుడు!NationalSwechaa14 Nov 2026, 10:19 PM

SBI Credit Card: ఎస్‌బీఐ క్రెడిట్ కార్డు వాడుతున్నారా? డిసెంబర్ 1 నుంచి కొత్త బాదుడు!

SBI Credit Card: స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా క్రెడిట్ కార్డు యూజర్స్‌కి బిగ్ షాక్ తగలనుంది. మరో 15 రోజుల్లో అంటే డిసెంబర్ 1వ తేదీ నుంచి ఎస్‌బీఐ కార్డ్స్ రూల్స్‌లో భారీ మార్పులు రాబోతున్నాయి. ముఖ్యంగా ప్రయాణాలు, ఇంధన కొనుగోళ్లపై అదనపు ఛార్జీల బాదుడుకు ఎస్‌బీఐ సిద్ధమైంది. ఈ కొత్త రూల్స్ అన్ని కేటగిరీల ఎస్‌బీఐ క్రెడిట్ కార్డులకు వర్తించనున్నాయి. కాబట్టి ఈ నిబంధనలపై అవగాహన లేకపోతే డిసెంబర్ 1 నుంచి మీ జేబుకు అదనపు చిల్లు పడటం ఖాయం.కొత్త నిబంధనల ప్రకారం.. ట్రావెల్ సంబంధిత లావాదేవీలపై ఎస్‌బీఐ 1 శాతం అదనపు సర్‌ఛార్జీ వసూలు చేయనుంది. టోల్ ఛార్జీలు, వివిధ రకాల ట్రావెల్ బుకింగ్స్ ఇందులోకి వస్తాయి.

TG: కొండగట్టు అంజన్న భక్తులకు అలర్ట్.. ఈ 6 రోజులు మూలవిరాట్టు దర్శనం ఉండదు!తెలంగాణSwechaa14 Nov 2026, 10:08 PM

TG: కొండగట్టు అంజన్న భక్తులకు అలర్ట్.. ఈ 6 రోజులు మూలవిరాట్టు దర్శనం ఉండదు!

TG: జగిత్యాల జిల్లాలోని ప్రముఖ పుణ్యక్షేత్రం కొండగట్టు శ్రీ ఆంజనేయస్వామి ఆలయానికి వెళ్లే భక్తులకు దేవస్థానం అధికారులు ముఖ్య గమనిక జారీ చేశారు. ఆలయంలో అత్యంత వైభవంగా నిర్వహించనున్న 'చందనోత్సవం - మహా సంప్రోక్షణ' వేడుకల నేపథ్యంలో, ఈ నెల 15 నుంచి 20వ తేదీ వరకు ఆరు రోజుల పాటు స్వామివారి మూలవిరాట్టు దర్శనం భక్తులకు అందుబాటులో ఉండదని స్పష్టం చేశారు. ఈ మేరకు భక్తులు తమ యాత్రలను ప్లాన్ చేసుకోవాలని అధికారులు సూచించారు.చందనోత్సవం, మహా సంప్రోక్షణ వైదిక క్రతువుల దృష్ట్యా గర్భాలయంలోని మూలవిరాట్టు దర్శనాలను తాత్కాలికంగా నిలిపివేశారు. అయితే, దూర ప్రాంతాల నుంచి వచ్చే భక్తులకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా ఆలయ ప్రాంగణంలో ప్రత్యేకంగా 'బాలాలయం' ఏర్పాటు చేసి, అక్కడ స్వామివారి దర్శన సౌకర్యం కల్పిస్తున్నట్లు అధికారులు వివరించారు.

గిగ్ వ‌ర్క‌ర్లు దేశానికి పునాదులు.. సామాజిక భద్రత, రక్షణ కల్పిస్తాంతెలంగాణSwechaa14 Nov 2026, 09:34 PM

గిగ్ వ‌ర్క‌ర్లు దేశానికి పునాదులు.. సామాజిక భద్రత, రక్షణ కల్పిస్తాం

Gig Workers: 21వ శతాబ్దం డేటా శతాబ్దం అని లోక్‌స‌భ‌లో విప‌క్ష నేత రాహుల్ గాంధీ అన్నారు. ప్రపంచవ్యాప్తంగా డేటాపైనే చర్చ సాగుతోందని.. డేటా సెంట‌ర్లు నిర్మిస్తున్నారని తెలిపారు. గూగుల్, ఫేస్‌బుక్, వాట్సాప్, ఉబర్ వంటి కంపెనీలు డేటా ఆధారంగానే నడుస్తున్నాయన్నారు. కానీ భారత దేశంలో గిగ్ వర్కర్లకు వారి డేటా నేటికీ అందుబాటులో లేదని విచారం వ్యక్తం చేశారు.

తెలంగాణ ప్రభుత్వం తెచ్చిన‌ చట్టంతో డేటాపై హక్కు

గిగ్ వర్కర్ తన డేటాను తానే చూసుకోలేడన్నారు. వారు ఏం పని చేశారు, ఎన్ని డెలివరీలు చేశారు, ఎంత సమయం పట్టింది, ఎంత డబ్బు వచ్చింది, ఎప్పుడు వచ్చింది? ఈ సమాచారం వారికి అందేది కాదన్నారు. కష్టం వారిదే, కానీ వారి డేటాను వారే చూసుకోలేకపోయేవారని అన్నారు. కానీ, ఇప్పుడు తెలంగాణ ప్రభుత్వం తెచ్చిన‌ చట్టం డేటాపై వారికి హక్కును కల్పించబోతోందని తెలిపారు. వారు చేసే పని, పూర్తి చేసే రైడ్లు, డెలివరీలు, ప్రతి రైడ్ లేదా లావాదేవీకి ఎంత డబ్బు చెల్లిస్తున్నారో పూర్తి సమాచారం వారి చేతిలో ఉంటుందని వెల్లడించారు.

కలిసి పోరాడదాం, దేశాన్ని కాపాడుకుందాం- భారత్ సమ్మిట్‌లో సీఎం రేవంత్ రెడ్డితెలంగాణSwechaa14 Nov 2026, 09:19 PM

కలిసి పోరాడదాం, దేశాన్ని కాపాడుకుందాం- భారత్ సమ్మిట్‌లో సీఎం రేవంత్ రెడ్డి

Bharat Summit: ప్రపంచవ్యాప్తంగా ఒకే ఆలోచనా ధోరణి కలిగిన వ్యక్తులను, ప్రభావశీలురను ఒకే వేదికపైకి తీసుకురావడానికి భారత్ సమ్మిట్ గొప్ప వేదిక అని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. 70 దేశాల నుంచి వెయ్యి మందికి పైగా ప్రతినిధులను ఆహ్వానించామని తెలిపారు. అయితే కేంద్ర ప్రభుత్వం వారిలో చాలామందికి వీసాలను రద్దు చేసిందన్నారు. అయినప్పటికీ, ప్రపంచవ్యాప్తంగా ఉన్న వారు మనల్ని గమనిస్తున్నారని తాను నమ్ముతున్నానని రేవంత్ అన్నారు.

దేశంలో రాజ్యాంగబద్ధ ప్రజాస్వామ్య వ్యవస్థ బలోపేతం కావడానికి నెహ్రూ దార్శనికత ఎంతో దోహదపడిందన్నారు. ప్రపంచవ్యాప్తంగా ప్రస్తుతం రెండు శక్తుల మధ్య పోరాటం జరుగుతోందని.. ఒక శక్తి ప్రజాస్వామ్యాన్ని కోరుకుంటుంటే, మరో శక్తి ప్రజాస్వామ్యాన్ని నాశనం చేయాలని చూస్తోందని రేవంత్ రెడ్డి ఆరోపించారు. హైదరాబాద్ హెచ్ఐసీసీలో భారత్ సమ్మిట్-2026 ముగింపు సమావేశంలో డెలివరింగ్ గ్లోబల్ జస్టిస్ అంశంపై సీఎం రేవంత్ మాట్లాడారు.

సమరశంఖం పూరించిన సీపీఎస్ ఉద్యోగులు.. నవంబర్ 17న సామూహిక సెలవుతెలంగాణSwechaa14 Nov 2026, 09:00 PM

సమరశంఖం పూరించిన సీపీఎస్ ఉద్యోగులు.. నవంబర్ 17న సామూహిక సెలవు

CPS Employs: రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగ, ఉపాధ్యాయ వర్గాల్లో అత్యధిక సంఖ్యలో ఉన్న కాంట్రిబ్యూటరీ పెన్షన్ స్కీమ్ (CPS) ఉద్యోగులు తమ చిరకాల ఆకాంక్ష అయిన పాత పెన్షన్ విధానం (OPS) పునరుద్ధరణ కోసం మరోసారి సమరశంఖం పూరించారు. రాష్ట్రంలోని మొత్తం 3.6 లక్షల మంది ప్రభుత్వ ఉద్యోగుల్లో మెజారిటీగా ఉన్న సుమారు 2.6 లక్షల నుంచి 2.80 లక్షల మంది సీపీఎస్ ఉద్యోగ, ఉపాధ్యాయులు గత 22 ఏళ్లుగా పెన్షన్ భద్రత లేక తీవ్ర ఆందోళనలో కొట్టుమిట్టాడుతున్నారు. సెప్టెంబర్ 1, 2004 తర్వాత నియమితులైన ఉద్యోగులకు పాత పెన్షన్ విధానాన్ని రద్దు చేసి సీపీఎస్‌ను అమలులోకి తెచ్చిన నాటి నుంచి సామాజిక భద్రత ప్రశ్నార్థకంగా మారింది.

TG: విద్యాశాఖలోనే పాలిటెక్నిక్ కాలేజీలు.. ప్రభుత్వం జీవోతెలంగాణSwechaa14 Nov 2026, 08:56 PM

TG: విద్యాశాఖలోనే పాలిటెక్నిక్ కాలేజీలు.. ప్రభుత్వం జీవో

TG: రాష్ట్రంలోని ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాలల నిర్వహణపై తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. పాలిటెక్నిక్ కాలేజీలను కార్మిక శాఖ (శక్తి విభాగం) పరిధిలోకి తీసుకొచ్చే ప్రతిపాదనను పూర్తిగా ఉపసంహరించుకుంటున్నట్లు ప్రకటించింది. ఇకపై పాలిటెక్నిక్ కళాశాలలన్నీ యథావిధిగా విద్యాశాఖ పరిధిలోనే కొనసాగుతాయని స్పష్టం చేస్తూ తాజాగా జీవో నంబర్ 157 ను జారీ చేసింది. గతంలో జులై 3న విడుదల చేసిన జీవో 97ను సవరిస్తూ ప్రభుత్వం ఈ ఉత్తర్వులు ఇచ్చింది.కొత్తగా జారీ చేసిన ఉత్తర్వుల ప్రకారం.. పాలిటెక్నిక్ విద్యను 'యంగ్ ఇండియా స్కిల్ యూనివర్సిటీ'లో విలీనం చేయడం గానీ, కార్మిక శాఖకు బదిలీ చేయడం గానీ జరగదని ప్రభుత్వం తేల్చి చెప్పింది. అంతేకాకుండా యంగ్ ఇండియా స్కిల్ యూనివర్సిటీ కూడా విద్యాశాఖ కిందే ఉంటుందని జీవోలో స్పష్టతనిచ్చింది. అయితే, రాష్ట్రంలోని ఐటీఐలు, అడ్వాన్స్‌డ్ టెక్నాలజీ సెంటర్లు మాత్రం కార్మిక, ఉపాధి, శిక్షణ శాఖ (శక్తి విభాగం) పరిధిలోకి వెళ్లాయి.

Tollywood: ఇది ఊహించని కాంబో.. 2028 సంక్రాంతికి ఎన్టీఆర్ - అనిల్ రావిపూడి సినిమా కన్‌ఫర్మ్!సినిమాSwechaa14 Nov 2026, 08:13 PM

Tollywood: ఇది ఊహించని కాంబో.. 2028 సంక్రాంతికి ఎన్టీఆర్ - అనిల్ రావిపూడి సినిమా కన్‌ఫర్మ్!

Tollywood: అసలు ఏ ఒక్కరు ఊహించని కాంబో తాజాగా ప్రకటించారు. ఆ కాంబో ఎన్టీఆర్ - అనిల్ రావిపూడిలది. ఈ సినిమా కన్‌ఫర్మ్ చేస్తూ స్వయంగా ఎన్టీఆర్ ప్రకటించడం విశేషం. దిల్ రాజు నిర్మాతగా అనిల్ రావిపూడి దర్శకత్వంలో పవన్ కళ్యాణ్‌తో సినిమా ఉండబోతుందని గత కొన్ని గంటల క్రితమే వార్త వచ్చి వైరల్ అయింది. ఇది, కనీసం పవన్ అభిమానులు ఆనందపడేలోపే తారక్ బిగ్ షాకిచ్చాడు. నెక్స్ట్ సినిమాను హిట్ మిషన్ అనిల్ రావిపూడితో చేస్తున్నట్టుగా ప్రకటించాడు.

ఇది భారత్ సమ్మిట్ కాదు.. భారత్ వ్యతిరేక సమ్మిట్తెలంగాణSwechaa14 Nov 2026, 07:47 PM

ఇది భారత్ సమ్మిట్ కాదు.. భారత్ వ్యతిరేక సమ్మిట్

Kishan Reddy: హైదరాబాద్ వేదికగా తెలంగాణ ప్రభుత్వం నిర్వహించిన భారత్ సమ్మిట్ పై కేంద్రమంత్రి కిషన్ రెడ్డి ఫైర్ అయ్యారు. తీవ్ర ఆరోపణలు చేశారు. ఇది భారత్ సమ్మిట్ కాదు భారత్ వ్యతిరేక సమ్మిట్ అంటూ విరుచుకుపడ్డారు. దేశ వ్యతిరేక శక్తులను భారత్ సమ్మిట్ కు కు పిలిచారని ఆయన ఆరోపించారు. దేశాన్ని ముక్కలు చేస్తామన్న తుక్ డే తుక్ డే గ్యాంగులను తీసుకొచ్చారని చెప్పారు. భారత్ సమ్మిట్ తో తెలంగాణకు ఎలాంటి ప్రయోజనం లభించిందని సీఎం రేవంత్ రెడ్డిని ప్రశ్నించారు. దేశాన్ని విమర్శించేందుకే సమ్మిట్ ఏర్పాటు చేశారా? అని ముఖ్యమంత్రి రేవంత్ ను నిలదీశారు. దేశ వ్యతిరేక శక్తులను ఈ సమ్మిట్‌కు ఎలా ఆహ్వానిస్తారు? అని కిషన్ రెడ్డి మండిపడ్డారు. హైదరాబాద్ నాంపల్లిలోని బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో కిషన్ రెడ్డి మీడియాతో మాట్లాడారు.

TG:తెలంగాణ కాంగ్రెస్ కొత్త ఇంచార్జిగా బీఎం సందీప్తెలంగాణSwechaa14 Nov 2026, 07:44 PM

TG:తెలంగాణ కాంగ్రెస్ కొత్త ఇంచార్జిగా బీఎం సందీప్

TG: తెలంగాణ కాంగ్రెస్ పార్టీలో అధిష్ఠానం అనూహ్య మార్పులు చేస్తూ కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్ర కాంగ్రెస్ వ్యవహారాల ఇన్‌ఛార్జ్‌ను మారుస్తూ ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే తాజాగా ఉత్తర్వులు జారీ చేసినట్లు పార్టీ ప్రధాన కార్యదర్శి కె.సి. వేణుగోపాల్ ఒక అధికారిక ప్రకటనలో వెల్లడించారు. ఇప్పటివరకు తెలంగాణ ఇన్‌ఛార్జ్‌గా కొనసాగిన మీనాక్షి నటరాజన్ స్థానంలో, రాష్ట్ర కాంగ్రెస్ కొత్త బాస్‌గా బి.ఎం.సందీప్‌ను నియమించారు. ఈ నియామకం తక్షణమే అమల్లోకి వస్తుందని అధిష్ఠానం స్పష్టం చేసింది.తెలంగాణలో పార్టీ సంస్థాగత వ్యవహారాలను పర్యవేక్షించే బాధ్యతలను బి.ఎం.సందీప్ తక్షణమే స్వీకరించనున్నారు. రాష్ట్రంలో పార్టీని మరింత బలోపేతం చేయడంతో పాటు, ప్రభుత్వ, పార్టీ కార్యక్రమాల మధ్య సమన్వయాన్ని పెంచే దిశగా అధిష్ఠానం ఈ నిర్ణయం తీసుకున్నట్లు రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతోంది.

CanadaVisa: కెనడా వెళ్లాలనుకునే విద్యార్థులకు బిగ్ షాక్.. కొత్త వీసా లెక్కలివే!InternationalSwechaa14 Nov 2026, 06:50 PM

CanadaVisa: కెనడా వెళ్లాలనుకునే విద్యార్థులకు బిగ్ షాక్.. కొత్త వీసా లెక్కలివే!

CanadaVisa: ఉన్నత చదువులు, ఉపాధి కోసం కెనడా వెళ్లాలని కలలు కంటున్న విదేశీ విద్యార్థులకు అక్కడి ప్రభుత్వం గట్టి షాక్ ఇచ్చింది. పెరిగిపోతున్న వలసల ఒత్తిడిని తగ్గించుకునేందుకు తాత్కాలిక వలసలపై కఠిన ఆంక్షలు విధిస్తూ సంచలన నిర్ణయం తీసుకుంది. ఇకపై ఏటా కేవలం 1.5 లక్షల మంది విదేశీ విద్యార్థులను మాత్రమే తమ దేశంలోకి అనుమతించనున్నట్లు ప్రకటించింది. కెనడా ప్రభుత్వం విడుదల చేసిన ఈ కొత్త వీసా లెక్కలతో వేలాది మంది భారతీయ విద్యార్థుల ఆశలపై నీళ్లు చల్లినట్లయింది.రెఫ్యూజీస్ అండ్ సిటిజన్‌షిప్ కెనడా వెల్లడించిన వివరాల ప్రకారం.. 2027 నుంచి 2029 వరకు ఏటా గరిష్టంగా 3.7 లక్షల మంది తాత్కాలిక వలసదారులకు మాత్రమే పర్మిషన్ లభించనుంది.

TG: దేశంలో నియంతృత్వంతో ప్రజాస్వామ్యం పోరాడుతోంది.. మోడీపై సీఎం రేవంత్‌ విమర్శలుతెలంగాణSwechaa14 Nov 2026, 06:31 PM

TG: దేశంలో నియంతృత్వంతో ప్రజాస్వామ్యం పోరాడుతోంది.. మోడీపై సీఎం రేవంత్‌ విమర్శలు

TG: ప్రపంచవ్యాప్తంగా ప్రస్తుతం ప్రజాస్వామ్యం, నియంతృత్వం అనే రెండు శక్తుల మధ్య తీవ్ర పోరాటం కొనసాగుతోందని తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వ్యాఖ్యానించారు. రాజ్యాంగ వ్యవస్థలను బలహీనపరిచి, అధికారాన్ని కేవలం ఒకే వ్యక్తి లేదా ఒకే పార్టీ చేతుల్లో కేంద్రీకరించేందుకు కొన్ని శక్తులు ప్రయత్నిస్తున్నాయని ఆయన ఆరోపించారు. తాము రాజ్యాంగం, చట్టబద్ధ పాలన, ప్రజాస్వామ్య విలువల పరిరక్షణ కోసం పోరాడుతున్నామని సీఎం స్పష్టం చేశారు.ప్రభుత్వాలు కొద్దిమంది బడా పారిశ్రామికవేత్తలు, బిలియనీర్ల ప్రయోజనాల కోసం కాకుండా కోట్లాది మంది సామాన్య ప్రజల సంక్షేమం కోసం పనిచేయాలని రేవంత్ రెడ్డి అభిప్రాయపడ్డారు. పేదలు, రైతులు, మహిళలు, మైనారిటీల హక్కులను కాపాడటంతో పాటు సామాజిక న్యాయం, సమాన అవకాశాల కల్పనే తమ ప్రధాన లక్ష్యమని ఆయన పేర్కొన్నారు.

Tollywood: "మెగావర్స్‌"లో ప్రభాస్ – సందీప్ రెడ్డి వంగా!సినిమాSwechaa14 Nov 2026, 06:29 PM

Tollywood: "మెగావర్స్‌"లో ప్రభాస్ – సందీప్ రెడ్డి వంగా!

Tollywood: దిగ్గజ ఓటీ కోసం మెగాస్టార్ చిరంజీవి హోస్ట్‌గా వ్యవహరిస్తున్న ‘మెగావర్స్’ మెగా టాక్ షోపై రోజురోజుకూ అంచనాలు, ఆసక్తి పెరుగుతోంది. నెట్‌ఫ్లిక్స్ వేదికగా స్ట్రీమింగ్ కానున్న ఈ షోకు టాలీవుడ్‌తో పాటు ఇతర సినీ ఇండస్ట్రీలకు చెందిన ప్రముఖులు భాగం కానున్నారు. ఇప్పటికే, బ్రహ్మానందం, అక్కినేని హీరోతో పాటు పలువురు స్టార్ హీరోల పేర్లు వినిపిస్తుండగా.. ఇప్పుడు పాన్ ఇండియా స్టార్ ప్రభాస్, దర్శకుడు సందీప్ రెడ్డి వంగా కూడా ఒకే ఎపిసోడ్‌లో సందడి చేయబోతున్నారనే వార్త ఇండస్ట్రీలో హాట్ టాపిక్‌గా మారింది.

Bollywood: డెడ్లీ కాంబో..ఆర్జీవి కథతో మోహిత్ సూరి సినిమా.!సినిమాSwechaa14 Nov 2026, 06:07 PM

Bollywood: డెడ్లీ కాంబో..ఆర్జీవి కథతో మోహిత్ సూరి సినిమా.!

Bollywood: ఇటు టాలీవుడ్ సినిమా ఇండస్ట్రీలో గానీ అటు బాలీవుడ్ సినిమా ఇండస్ట్రీలో గానీ కొన్ని కాంబినేషన్లు వినగానే ప్రేక్షకుల్లో ఆసక్తి మొదలవుతుంది. అలాంటి క్రేజీ డెడ్లీ కాంబినేషన్‌గా ఆర్జీ-మోహిత్ సూరిలది నిలవబోతోంది. ఇప్పుడు ఆర్జీవి కథ, మోహిత్ సూరి దర్శకత్వం అనే వార్త బాలీవుడ్, టాలీవుడ్ ఆడియన్స్‌లో విపరీతమైన ఆసక్తిని పెంచుతోంది. ఒకవైపు సంచలన కథలకు, విభిన్నమైన ఆలోచనలకు కేరాఫ్ అడ్రస్‌గా నిలిచిన రామ్ గోపాల్ వర్మ.. మరోవైపు ప్రేమకథల్లోనూ, ఇంటెన్స్ ఎమోషన్స్‌లోనూ తనదైన ముద్ర వేసిన బాలీవుడ్ దర్శకుడు మోహిత్ సూరి. ఈ ఇద్దరి క్రియేటివిటీ కలిస్తే తెరపై ఎలాంటి మ్యాజిక్ క్రియేట్ అవుతుందో అన్నే చర్చ మొదలైంది.

TRS అంటే తెలంగాణ రేవంత్ సైన్యంతెలంగాణSwechaa14 Nov 2026, 05:31 PM

TRS అంటే తెలంగాణ రేవంత్ సైన్యం

RS Praveen Kumar: టీఆర్ఎస్ చీఫ్ కవితపై బీఆర్ఎస్ నేత ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ విరుచుకుపడ్డారు. కవిత టార్గెట్ గా నిప్పులు చెరిగారు. కవిత, ఆమె పార్టీని ఉద్దేశించి సంచలన వ్యాఖ్యలు చేశారు. టీఆర్ఎస్ అంటే తెలంగాణ రక్షణ సేన కాదు.. తెలంగాణ రేవంత్ సైన్యం అని ధ్వజమెత్తారు. కాంగ్రెస్ పార్టీకి NSUI, యూత్ కాంగ్రెస్, మహిళా కాంగ్రెస్ ఇలా అనేక అనుబంధ సంఘాలు ఉంటాయన్న ప్రవీణ్ కుమార్.. TRS కూడా అలాంటి అనుబంధ సంస్థనే అని ఆరోపించారు.

కవిత TRS పార్టీకి కొత్త నిర్వచనం చెప్పారాయన. టీఆర్ఎస్ అంటే తెలంగాణ రక్షణ సేన కాదు.. తెలంగాణ రేవంత్ సైన్యం అని విమర్శించారు. కవిత ఎవరి పక్షమో చెప్పాలని ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ నిలదీశారు. మీరు ఉద్యోగస్తులా పక్షమా? రేవంత్ రెడ్డి పక్షమా? అంటూ కవితను ప్రశ్నించారాయన.

Naxal Movement: 'మావోయిస్టు ముక్త భారత్' ఒట్టి మాటేనా? నిఘా వర్గాల రిపోర్టులో సంచలన నిజాలు!NationalSwechaa14 Nov 2026, 05:21 PM

Naxal Movement: 'మావోయిస్టు ముక్త భారత్' ఒట్టి మాటేనా? నిఘా వర్గాల రిపోర్టులో సంచలన నిజాలు!

Naxal Movement: దేశంలో మావోయిస్టుల ఉనికిని పూర్తిగా తుడిచిపెట్టేశామని కేంద్ర ప్రభుత్వం ఎంతో ధీమాగా ప్రకటించింది. వరుస ఎన్‌కౌంటర్లు, భారీ లొంగుబాట్లతో మావోయిస్టు పార్టీ నడ్డి విరిచేశామని, 'మావోయిస్టు ముక్త భారత్' లక్ష్యాన్ని చేరుకున్నామని సాక్షాత్తు కేంద్ర హోంమంత్రి అమిత్ షా గత మార్చి నెలలో స్పష్టం చేశారు. కానీ, క్షేత్రస్థాయిలో జరుగుతున్న పరిణామాలు మాత్రం ఈ ప్రకటనలకు పూర్తి భిన్నంగా ఉన్నాయి. "మావోయిస్టుల అంతం" అనేది కేవలం కాగితాలకే పరిమితమైందా? నిషేధిత నక్సల్స్ మళ్లీ తమ కార్యకలాపాలను ముమ్మరం చేస్తున్నారా? అనే ప్రశ్నలు ఇప్పుడు భద్రతా దళాలను ఉలిక్కిపడేలా చేస్తున్నాయి.

Tollywood: శర్వానంద్ ‘జార్జ్ క్రిష్’..సంక్రాంతి టార్గెట్ మిస్సయ్యేదే లేదా?సినిమాSwechaa14 Nov 2026, 04:36 PM

Tollywood: శర్వానంద్ ‘జార్జ్ క్రిష్’..సంక్రాంతి టార్గెట్ మిస్సయ్యేదే లేదా?

Tollywood: శర్వానంద్ ‘జార్జ్ క్రిష్’ సంక్రాంతి టార్గెట్ మిస్సయ్యేదే లేదా? అంటే ఎట్టి పరిస్థితుల్లో లేదనే అర్థమవుతోంది. ఈ సినిమా షూటింగ్ పూర్తైనంత త్వరగా, ఈ మధ్య కాలంలో మరో ఏ సినిమా పూర్తి కాలేదు. శ్రీను వైట్ల దర్శకత్వంలో శర్వానంద్ డ్యూయల్ రోల్‌లో నటిస్తున్న సినిమా ఇది. మానస వారణాసి హీరోయిన్‌గా నటిస్తోంది. తాజాగా, ఈ సినిమా డబ్బింగ్ వర్క్ స్టార్ట్ అయినట్టుగా నిర్మాణ సంస్థ ఎక్స్ ద్వారా ప్రకటించింది.

Giribabu: సీనియర్ నటుడు గిరిబాబు కన్నుమూత..సినిమాSwechaa14 Nov 2026, 04:33 PM

Giribabu: సీనియర్ నటుడు గిరిబాబు కన్నుమూత..

Giribabu: తెలుగు చిత్ర పరిశ్రమలో తీవ్ర విషాదం నెలకొంది. తన విలక్షణ నటనతో నాలుగు దశాబ్దాలకు పైగా సినీ ప్రియులను అలరించిన సీనియర్ నటుడు గిరిబాబు (83) కన్నుమూశారు. గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన, ఒక ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచారు.1943 జూన్ 8న ప్రకాశం జిల్లా రావినూతలలో జన్మించిన గిరిబాబు, నటనపై ఉన్న అమితమైన ఇష్టంతో సినిమా రంగంలోకి ప్రవేశించారు. ఎటువంటి సినీ నేపథ్యం లేకపోయినా, స్వయంకృషితో ఎదుగుతూ తన సుదీర్ఘ ప్రయాణంలో 600కు పైగా చిత్రాల్లో నటించి తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు.

TG : పీకల దాకా తాగి యాక్సిడెంట్ చేసిన పోలీసులు..!క్రైమ్Swechaa14 Nov 2026, 04:06 PM

TG : పీకల దాకా తాగి యాక్సిడెంట్ చేసిన పోలీసులు..!

శాంతి భద్రతలను కాపాడాల్సిన పోలీసులే అర్ధరాత్రి న్యూసెన్స్ క్రియేట్ చేయడం ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది. దీనికి తోడు పీకల దాకా మద్యం సేవించి కారు వేగంగా నడుపుతూ యాక్సిడెంట్ చేసినట్టు సమాచారం. ఈ ఘటన మంచిర్యాల జిల్లా కాసిపేట మండల కేంద్రంలో వెలుగుచూసింది. వివరాల్లోకివెళితే.. దేవాపూర్ పోలీస్ స్టేషన్‌కు చెందిన ఇద్దరు కానిస్టేబుళ్లు, ఒక హోంగార్డు మద్యం మత్తులో కారు వేగంగా నడుపుతూ అదుపుతప్పి రోడ్డు పక్కన నిలిపి ఉంచిన ట్రాలీని ఢీకొట్టినట్టు తెలిసింది.ఈ ప్రమాదంలో ట్రాలీతో పాటు కారు ముందు భాగం తీవ్రంగా ధ్వంసమైంది. బుధవారం అర్ధరాత్రి సమయంలో ఈ ఘటన చోటుచేసుకోగా ఆలస్యంగా వెలుగుచూసింది.ప్రమాదం జరిగిన వెంటనే కారులోని ఎయిర్‌బ్యాగులు తెరుచుకోవడంతో అందులో ప్రయాణిస్తున్న పోలీసు సిబ్బందికి ఎలాంటి గాయాలు కాలేదు. ట్రాలీలో కూడా ఎవరూ లేకపోవడంతో పెను ప్రమాదం తప్పింది.

BJP Telangana: గోషామహల్ కోటలో కమలం 'ఆపరేషన్'.. రాజాసింగ్ రాజకీయ భవిష్యత్తు ఏంటి?తెలంగాణSwechaa14 Nov 2026, 03:57 PM

BJP Telangana: గోషామహల్ కోటలో కమలం 'ఆపరేషన్'.. రాజాసింగ్ రాజకీయ భవిష్యత్తు ఏంటి?

BJP Telangana: వచ్చే 2028 అసెంబ్లీ ఎన్నికల్లో తెలంగాణ గద్దెనెక్కాలనే లక్ష్యంతో ఉన్న భారతీయ జనతా పార్టీ, ఇప్పుడు క్షేత్రస్థాయిలో 'ఆపరేషన్ ప్రక్షాళన' మొదలుపెట్టింది. ముఖ్యంగా పార్టీకి దూరంగా ఉంటున్న నేతలు, రాజీనామా చేసిన ప్రజాప్రతినిధుల నియోజకవర్గాల్లో రాజకీయ అనిశ్చితికి తెరదించుతూ.. ప్రత్యామ్నాయ నాయకత్వాన్ని తయారు చేసే పనిలో కమలనాథులు నిమగ్నమయ్యారు. ఈ క్రమంలోనే హైదరాబాద్‌లోని అత్యంత కీలకమైన గోషామహల్ నియోజకవర్గంపై బీజేపీ అధిష్టానం ఫోకస్ పెట్టడం, ఇటీవల కేంద్ర హోంమంత్రి అమిత్ షా హైదరాబాద్ పర్యటనతో అక్కడి రాజకీయ లెక్కలన్నీ ఒక్కసారిగా తేలిపోవడం ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారింది.

AP : 19 నుంచి ఏపీలో మరోసారి ఎన్నికలు : ఈసీఏపీSwechaa14 Nov 2026, 03:13 PM

AP : 19 నుంచి ఏపీలో మరోసారి ఎన్నికలు : ఈసీ

ఆంధ్రప్రదేశ్‌లో మరోసారి ఎన్నికలు నిర్వహించనున్నట్టు ఆ రాష్ట్ర ఎన్నికల అధికారి అనిల్ చంద్ర పునేఠా కీలక ప్రకటన చేశారు. ఎన్నికల నిర్వహణకు సంబంధించి ఇప్పటికే అన్ని ఏర్పాట్లు పూర్తి చేశామని చెప్పారు. శనివారం తిరుపతి కలెక్టరేట్‌లో గ్రామ పంచాయతీలు, పెండింగ్‌లో ఉన్న పట్టణ స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణపై ఆయన పోలీసు, జిల్లా ఉన్నతాధికారులతో కలిసి రివ్యూ నిర్వహించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. ఎన్నికల ఏర్పాట్లు, భద్రతా చర్యలపై కీలక విషయాలను వెల్లడించారు. రాష్ట్రంలో మున్సిపాలిటీ, కార్పొరేషన్, ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికలను అత్యంత సమర్థవంతంగా నిర్వహించినట్టు పేర్కొన్నారు. ఫలితాలు కూడా ఇప్పటికే వెల్లడయ్యాయని చెప్పారు.

Telangana Congress: కాంగ్రెస్‌లో 'మూడు గ్రూపులు.. ఆరు వర్గాలు'! అధిష్టానం మౌనం వెనుక మతలబేంటి?తెలంగాణSwechaa14 Nov 2026, 03:05 PM

Telangana Congress: కాంగ్రెస్‌లో 'మూడు గ్రూపులు.. ఆరు వర్గాలు'! అధిష్టానం మౌనం వెనుక మతలబేంటి?

Telangana Congress: తెలంగాణలో అధికారంలో ఉన్న హస్తం పార్టీకి ఇప్పుడు ప్రతిపక్షాల కంటే సొంత నేతల అంతర్గత కుమ్ములాటలే పెను సవాలుగా మారుతున్నాయనే చర్చ రాజకీయ వర్గాల్లో జోరుగా సాగుతోంది. ముఖ్యంగా ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా కాంగ్రెస్‌లో పరిస్థితి 'మూడు గ్రూపులు.. ఆరు వర్గాలు' అన్న చందంగా తయారైంది. నేతల మధ్య ఆధిపత్య పోరు తారాస్థాయికి చేరి, కేసులు, అరెస్టుల దాకా వెళ్తున్నా టీపీసీసీ అధిష్టానం మాత్రం కనీసం స్పందించకపోవడం ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారింది. అసలు రాష్ట్ర నాయకత్వం ఈ విషయంలో మౌనం వహించడం వెనుక ఉన్న మతలబేంటి? అనే ప్రశ్నలు పార్టీ వర్గాల్లోనే వినిపిస్తున్నాయి.

ఉబర్‌లో డేటా లీక్ కలకలం.. వేలాది మంది డ్రైవర్ల లైసెన్స్ వివరాలు బహిర్గతం!వ్యాపారంSwechaa14 Nov 2026, 02:56 PM

ఉబర్‌లో డేటా లీక్ కలకలం.. వేలాది మంది డ్రైవర్ల లైసెన్స్ వివరాలు బహిర్గతం!

 ప్రముఖ రైడ్-హెయిలింగ్ దిగ్గజం ఉబర్ టెక్నాలజీస్ (Uber Technologies) మరోసారి భారీ డేటా బ్రీచ్ వివాదంలో చిక్కుకుంది. తమ థర్డ్ పార్టీ సాంకేతిక భాగస్వామ్య సంస్థ అయిన 'ఫైర్‌వర్క్స్ ఏఐ' (Fireworks AI) భద్రతా వైఫల్యం కారణంగా వేలాది మంది డ్రైవర్లకు చెందిన అత్యంత కీలకమైన వ్యక్తిగత సమాచారం హ్యాకర్ల చేతికి చిక్కినట్లు ఉబర్ అధికారికంగా వెల్లడించింది. ఈ సైబర్ దాడిలో డ్రైవర్ల డ్రైవింగ్ లైసెన్స్ వివరాలతో పాటు ఇతర సున్నితమైన రికార్డులు బహిర్గతం కావడం సాంకేతిక వర్గాల్లో, డ్రైవర్లలో తీవ్ర ఆందోళన రేకెత్తిస్తోంది.

గిగ్ వర్కర్లను బానిసలుగా మారుద్దామనుకుంటే చూస్తూ ఊరుకోం : రాహుల్ గాంధీNationalSwechaa14 Nov 2026, 02:50 PM

గిగ్ వర్కర్లను బానిసలుగా మారుద్దామనుకుంటే చూస్తూ ఊరుకోం : రాహుల్ గాంధీ

పాలసీని ఆవిష్కరించారు. ఈ సందర్భంగా రాహుల్ గాంధీ మాట్లాడుతూ..కేంద్రంలోని మోడీ ప్రభుత్వ విధానాలు కేవలం కార్పొరేట్ కంపెనీలకు మాత్రమే లబ్ధి చేకూర్చేలా ఉన్నాయని ఆరోపించారు. గిగ్ వర్కర్స్‌ను వెట్టిచాకిరీ కార్మికులుగా మార్చాలని ప్రధాని మోడీ, ఆర్ఎస్ఎస్ ప్రయత్నిస్తోందన్నారు. గిగ్ వర్కర్లను బానిసలుగా మార్చాలని, దోపిడీ చేయాలని చూస్తే ఎప్పటికీ సహించేది లేదన్నారు. మిమ్మల్ని సేవకులుగా కాదు.. అభివృద్ధిలో భాగస్వాములుగా తీర్చిదిద్దుతామని స్పష్టం చేశారు. గిగ్ వర్కర్లకు రక్షణ కల్పించాలన్నదే తమ పార్టీ ప్రధాన ఆలోచన అని గిగ్ వర్కర్లకు కాంగ్రెస్ ఎల్లప్పుడూ పూర్తి అండగా నిలుస్తుందని భరోసా కల్పించారు. ప్రతి ఒక్క డెలివరీలో ఒక శాతం డబ్బు గిగ్ వర్కర్ల బ్యాంకు ఖాతాలో జమ చేస్తామన్నారు. ఈ కొత్త చట్టం ద్వారా గిగ్ వర్కర్ల సమాచార వివరాలను ఈజీగా పొందవచ్చని రాహుల్ గాంధీ తెలిపారు. డెలివరీ, శ్రమ, ప్రతిఫలానికి సంబంధించి సమస్త వివరాలు ఇకపై నేరుగా గిగ్ వర్కర్ల మొబైల్ ఫోన్లకే వస్తాయన్నారు. గిగ్ వర్కర్ల కోసం వైఫై సౌకర్యంతో ప్రత్యేక విశ్రాంత భవనాలను సైతం అందుబాటులోకి తెస్తామన్నారు.

ఇందిరా, రాజీవ్ అని పేర్లు పెడితే చాలదు.. పథకాల అమలేది? : హరీశ్ రావుతెలంగాణSwechaa14 Nov 2026, 02:16 PM

ఇందిరా, రాజీవ్ అని పేర్లు పెడితే చాలదు.. పథకాల అమలేది? : హరీశ్ రావు

ప్రభుత్వ పథకాలకు మాజీ ప్రధానులు ఇందిరాగాంధీ, రాజీవ్ గాంధీ అని పేర్లు పెడితే చాలదని, వాటిని అమలు చేయాలని బీఆర్ఎస్ డిప్యూటీ ఫ్లోర్ లీడర్ హరీశ్ రావు అన్నారు. ఆ హామీలను నెరవేర్చినప్పుడే వారికి నిజమైన గౌరవమని పేర్కొన్నారు. హైదరాబాద్ పర్యటనకు వచ్చిన రాహుల్.. రేవంత్ సర్కార్ మూడు బడ్జెట్ల వైఫల్యాలపై సమీక్ష నిర్వహించి లెక్క అడగాలని డిమాండ్ చేశారు.ఈ మేరకు శనివారం ‘ఎక్స్’ వేదికగా సంచలన పోస్టు పెట్టారు. నిరుపేద కూలీలు,నిరుద్యోగ యువతను కాంగ్రెస్ ప్రభుత్వం మోసం చేస్తుందన్నారు. అమలుకు నోచుకోని పథకాలకు ఆ మహనీయుల పేర్లు పెట్టి ప్రజలను మోసం చేయడం వారిని అవమానించడమే అవుతుందన్నారు. రేవంత్ రెడ్డి ప్రభుత్వ మూడు బడ్జెట్ల ఫార్ములా చాలా సింపుల్ గా ఉందని, హామీలు ప్రకటించడం, పాత ప్రకటనలనే మళ్లీ కొత్త బడ్జెట్‌లో తిరగబోయడం అని చెప్పారు. చివరకు పైసా ఇవ్వకుండా ఎగ్గొట్టడం బాగా అలవాటు అయ్యిందన్నారు.