స్వేచ్ఛ షార్ట్స్ — తాజా తెలుగు వార్తలు

National : ప్రతీకారం తీర్చుకున్న ఆర్మీ.. ఇద్దరు టెర్రరిస్టులు హతంNationalSwechaa16 Nov 2026, 03:44 PM

National : ప్రతీకారం తీర్చుకున్న ఆర్మీ.. ఇద్దరు టెర్రరిస్టులు హతం

జమ్మూకశ్మీర్‌ రాష్ట్రంలోని కుల్గామ్ జిల్లాలో భద్రతా బలగాలు నిర్వహించిన ఎన్‌కౌంటర్‌లో లష్కరే తోయిబా (LeT) సంస్థకు చెందిన ఇద్దరు ఉగ్రవాదులు హతమయ్యారు. గత వారం సీఆర్‌పీఎఫ్ క్యాంపుపై జరిగిన ఉగ్రదాడికి ప్రతీకారంగా భద్రతా బలగాలు స్థానిక పోలీసులతో కలిసి జాయింట్ ఆపరేషన్ నిర్వహించినట్టు సమాచారం. కుల్గామ్ జిల్లాలో ఉగ్రవాదులు నక్కి ఉన్నారన్న పక్కా సమాచారంతో సోమవారం ఉదయం ఆర్మీ, పోలీసులు, సీఆర్‌పీఎఫ్ సంయుక్తంగా గాలింపు చర్యలు చేపట్టాయి. ఈ క్రమంలో ఉగ్రవాదులు కాల్పులకు తెగబడ్డారు. వెంటనే అప్రమత్తమైన భద్రతా బలగాలు ఎదురుకాల్పులు జరిపి ఇద్దరు ఉగ్రవాదులను మట్టుబెట్టాయి.

Viral : సింహాన్ని వెంబడించి జాబ్స్ కోల్పోయారు!వైరల్ న్యూస్Swechaa16 Nov 2026, 03:30 PM

Viral : సింహాన్ని వెంబడించి జాబ్స్ కోల్పోయారు!

సింహాన్ని చూస్తే చాలు కొందరిలో వణుకు పుడుతుంది. ఎక్కడ అటాక్ చేసి చంపేస్తుందో అని ప్రాణభయంతో దగ్గిరికి వెళ్లాలంటేనే భయపడుతుంటారు. సింహం గర్జన వింటేనే మరికొందరికి గుండెలు ఆగుతాయి. జంతువులను వేటాడే సింహానికి ఎదురుగా వెళ్లేందుకు ఎవరూ సహసించరు. ఒక్కసారిగా పంజా విసిరింది అంటే పైకి లేవడం కూడా చాలా కష్టం. అలాంటిది ఫారెస్ట్ సర్వీస్ ఉద్యోగులు సింహాన్ని వెంబడించారు. అది కూడా ద్విచక్ర వాహనాలపై సింహానికి సమీపంగా వెళ్లి పరిగెత్తించారు.దీంతో వారిపై ఉన్నతాధికారులు చర్యలు చేపట్టారు. ఈ ఘటన గుజరాత్‌లోని అమ్రేలీ జిల్లా, ధారి గిర్ ఈస్ట్ డివిజన్‌లో ఉన్న అంబర్డి సఫారీ పార్కులో వెలుగుచూసింది.

Kollywood: విజయ్ ‘మెర్సల్’ కథనే సూర్యతో జ్ఞానవేల్ తీస్తున్నాడా?సినిమాSwechaa16 Nov 2026, 03:24 PM

Kollywood: విజయ్ ‘మెర్సల్’ కథనే సూర్యతో జ్ఞానవేల్ తీస్తున్నాడా?

Kollywood: థలపతి విజయ్ కెరీర్‌లోనే ఎంతో ప్రత్యేకమైన చిత్రాల్లో ఒకటిగా నిలిచింది ‘మెర్సల్’. అట్లీ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ మూవీ బాక్సాఫీస్ వద్ద మంచి కమర్షియల్ సక్సెస్‌ను అందుకోవడమే కాకుండా, కథా నేపథ్యం, విజయ్ పోషించిన మూడు విభిన్న పాత్రలు, సామాజిక అంశాలతో ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకుంది. అయితే, ఇప్పుడు ఇదే తరహా కథతో సూర్య హీరోగా దర్శకుడు టీజే జ్ఞానవేల్ సినిమా చేస్తున్నారని తాజా సమాచారం.

Adani Group: మరో చిక్కుల్లో అదానీ.. మహారాష్ట్ర ప్రాజెక్ట్ లెక్కల్లో ఏం జరిగింది?NationalSwechaa16 Nov 2026, 03:19 PM

Adani Group: మరో చిక్కుల్లో అదానీ.. మహారాష్ట్ర ప్రాజెక్ట్ లెక్కల్లో ఏం జరిగింది?

Adani Group: వ్యాపార దిగ్గజం అదానీ గ్రూప్‌ను మరో కొత్త వివాదం చుట్టుముట్టింది. మహారాష్ట్రలో చేపట్టబోయే ఒక భారీ విద్యుత్ ప్రాజెక్ట్ ఖర్చును ఏకంగా వంద రెట్లు తగ్గించి చూపించారన్న ఆరోపణలు ఇప్పుడు దేశవ్యాప్తంగా కలకలం రేపుతున్నాయి. పర్యావరణ నిబంధనల కింద చెల్లించాల్సిన వందల కోట్ల రూపాయల సొమ్మును ఎగ్గొట్టేందుకే ఇలా లెక్కలు మార్చారన్న విమర్శలు రావడంతో, అటు మహారాష్ట్ర ప్రభుత్వం, ఇటు కేంద్ర పర్యావరణ శాఖ విచారణకు ఆదేశించాయి.మహారాష్ట్రలోని సతారా జిల్లాలో 'తారాలి పంప్డ్ స్టోరేజ్ ప్రాజెక్ట్'ను అదానీ గ్రీన్ ఎనర్జీ చేపడుతోంది. 2025 ఫిబ్రవరి 11న ఈ ప్రాజెక్ట్‌కు కేంద్ర పర్యావరణ శాఖ ఇచ్చిన అనుమతుల లేఖలో మొత్తం వ్యయం రూ. 5,675 కోట్లు అని స్పష్టంగా రాసి ఉంది.

‘బతికిపోయాం’.. ఎక్స్‌లో అమితాబ్ పోస్ట్.. బాంబు బెదిరింపులపైనేనా?సినిమాSwechaa16 Nov 2026, 03:13 PM

‘బతికిపోయాం’.. ఎక్స్‌లో అమితాబ్ పోస్ట్.. బాంబు బెదిరింపులపైనేనా?

 బాలీవుడ్ మెగాస్టార్, అమితాబ్ బచ్చన్ చేసిన ఒక చిన్న సోషల్‌ మీడియా పోస్ట్ ప్రస్తుతం సినీ వర్గాల్లోనూ, దేశవ్యాప్తంగానూ తీవ్ర చర్చనీయాంశంగా మారింది. దేశవ్యాప్తంగా ప్రముఖులపై వరుస బాంబు బెదిరింపులు కలకలం రేపుతున్న తరుణంలో, అలాగే ముంబైలోని ఆయన నివాసం 'జల్సా' వెలుపల కాల్పులకు కుట్ర పన్నారనే వార్తల మధ్య అమితాబ్ స్పందించడం ప్రాధాన్యత సంతరించుకుంది. నవంబర్ 15-16 మధ్య రాత్రి ఆయన తన ఎక్స్ (ట్విట్టర్) వేదికగా 'బచ్‌ గయే' (బతికిపోయాం) అని మాత్రమే రాసుకొచ్చారు.

BRS : పాడి కౌశిక్ రెడ్డికి హైకోర్టులో భారీ ఎదురుదెబ్బ!తెలంగాణSwechaa16 Nov 2026, 03:06 PM

BRS : పాడి కౌశిక్ రెడ్డికి హైకోర్టులో భారీ ఎదురుదెబ్బ!

హుజూరాబాద్ బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డికి తెలంగాణ హైకోర్టులో భారీ షాక్ తగిలింది.తన వాయిస్ శాంపిల్ ఇవ్వాలంటూ పోలీసులు జారీ చేసిన నోటీసులను సవాల్ చేస్తూ కౌశిక్ రెడ్డి దాఖలు చేసిన పిటిషన్‌ను న్యాయస్థానం కొట్టేసింది. 2026 ప్రారంభంలో నాటి కరీంనగర్ పోలీస్ కమిషనర్‌ గౌస్ ఆలంను మతపరంగా దూషించారన్న ఫిర్యాదు మేరకు వీణవంక పీఎస్‌లో ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి మీద కేసు నమోదు అయిన విషయం తెలిసిందే. ఈ కేసు విచారణలో భాగంగా ఆడియో ఆధారాలను ధృవీకరించేందుకు వాయిస్ శాంపిల్ ఇవ్వాలని పోలీసులు కౌశిక్ రెడ్డికి నోటీసులు జారీ చేశారు. అయితే, దానిని సవాల్ చేస్తూ కౌశిక్ రెడ్డి హైకోర్టును ఆశ్రయించారు. విచారణ జరిపిన న్యాయస్థానం.. నేర దర్యాప్తులో భాగంగా పోలీసులు వాయిస్ శాంపిల్స్ కోరడం, సేకరించడం సహజమేనని న్యాయస్థానం అభిప్రాయపడింది.

అమెరికా మరో యుద్ధానికి సిద్ధమైందా? ట్రంప్ ఆ వీడియో ఎందుకు షేర్ చేశారు?InternationalSwechaa16 Nov 2026, 03:03 PM

అమెరికా మరో యుద్ధానికి సిద్ధమైందా? ట్రంప్ ఆ వీడియో ఎందుకు షేర్ చేశారు?

 అమెరికా మరోసారి యుద్ధానికి సమాయత్తమవుతోందా? ఇరాన్‌పై తదుపరి భారీ సైనిక చర్యకు రంగం సిద్ధం చేస్తున్నారా? అనే ప్రశ్నలు ప్రస్తుతం అంతర్జాతీయ రాజకీయ వర్గాల్లో తీవ్ర చర్చనీయాంశంగా మారాయి. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తన 'ట్రూత్ సోషల్' (Truth Social) ఖాతాలో షేర్ చేసిన ఓ సోషల్ మీడియా వీడియో ఇందుకు ప్రధాన కారణమైంది. ఆ వీడియోలో అమెరికన్ సైనికులు భారీ సైనిక రవాణా విమానాలైన సి-17 గ్లోబ్‌మాస్టర్ (C-17 Globemaster) విమానాల సమీపంలో మోకాళ్లపై కూర్చుని ప్రార్థనలు చేస్తున్న దృశ్యాలు ఉండటంతో, అమెరికా సైనిక కదలికలు, వ్యూహాలపై సర్వత్రా ఊహాగానాలు వ్యక్తమవుతున్నాయి.

National :  భారత సైన్యానికి భారీ ముప్పు : ఎయిర్ ఫోర్స్ చీఫ్ అశుతోష్NationalSwechaa16 Nov 2026, 02:46 PM

National : భారత సైన్యానికి భారీ ముప్పు : ఎయిర్ ఫోర్స్ చీఫ్ అశుతోష్

భారత దేశానికి సమీప భవిష్యత్‌లో భారీ ముప్పు పొంచి ఉందని ఇండియన్ ఎయిర్ ఫోర్స్ చీఫ్ మార్షల్ అశుతోష్ దీక్షిత్ సంచలన వ్యాఖ్యలు చేశారు. దేశ రహస్యల కోసం విదేశీ శక్తులు హానీ ట్రాప్ వలలు విసురుతున్న నేపథ్యంలో ఆయన కీలక వ్యాఖ్యలు చేశారు. అయితే, హనీట్రాప్ కంటే సైబర్ గూఢచర్యం నుంచే మరింత ముప్పు ఉందన్నారు. హనీ ట్రాప్‌ విసరడం శత్రుదేశాల గూఢచర్య వ్యూహంలో చిన్న భాగం మాత్రమేనని తెలిపారు. దీనివెనుక సైబర్ వార్‌ఫేర్, ఆర్థిక మోసాలతో కూడిన పెద్ద స్పై ఆపరేషన్ ఉందని స్పష్టంచేశారు. సోమవారం ఢిల్లీలో జరిగిన 'ఏఎన్ఐ నేషనల్ సెక్యూరిటీ సమ్మిట్ 3.0'లో ఎయిర్ ఫోర్స్ చీఫ్ మార్షల్ మాట్లాడుతూ.. దేశ రక్షణ రంగమే లక్ష్యంగా విదేశీ గూఢచర్య సంస్థలు పన్నుతున్న కుట్రలను తిప్పికొట్టాలన్నారు. అందుకు సైన్యం, రక్షణ పరిశోధన సంస్థలు పటిష్టమైన సాంకేతిక, సంస్థాగత రక్షణ కవచాలను ఏర్పాటు చేశాయని పేర్కొన్నారు.

Ap : ఏపీలో  ప్రధాని మోడీ తల్లి పేరిట ఆలయం..!ఏపీSwechaa16 Nov 2026, 02:27 PM

Ap : ఏపీలో ప్రధాని మోడీ తల్లి పేరిట ఆలయం..!

ఏపీలో ప్రధాని నరేంద్రమోడీ తల్లి హీరాబెన్ పేరిట ఆలయం నిర్మిస్తున్నట్టు తెలుస్తోంది. కర్నూలు జిల్లాలో ఆలయ నిర్మాణానికి భూమి పూజ కూడా చేశారు. జిల్లాలోని ఎమ్మిగనూరు మండలం గుడికల్ (గుండికల్) గ్రామంలో ఈ ఆలయాన్ని నిర్మిస్తున్నారు. నవంబర్ 15న దీనికి సంబంధించిన శంకుస్థాపన కార్యక్రమం జరిగింది. మాతా శ్రీ మందిరం చారిటబుల్ ట్రస్ట్ సొసైటీ ఆధ్వర్యంలో హీరాబెన్ మోడీ స్మారకార్థం ఈ మందిరాన్ని నిర్మిస్తున్నారు. అంతేకాకుండా, ఆలయ ప్రాంగణంలో శివుడు, దక్షిణమూర్తి, రాముడు, వినాయక ఆలయాలు, అనాథ శరణాలయం, గోశాలను సైతం నిర్మించనున్నట్టు తెలుస్తోంది. ఆలయ నిర్మాణ పనుల సమయంలో ఆదోని బీజేపీ ఎమ్మెల్యే పార్థసారథి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. బీజేపీ నేతలతో పాటు జనసేన, వైసీపీ నాయకులు, గ్రామస్తులు పార్టీలకు అతీతంగా హాజరై మద్దతు తెలిపారు.త్వరలోనే నిర్మాణ పనులను పూర్తి చేసి భక్తులకు, సందర్శకులకు అందుబాటులోకి తీసుకురావాలని ట్రస్ట్ నిర్వాహకులు యోచిస్తున్నారు.

కొత్త సీపీ రాకతో పోలీసుల్లో టెన్షన్‌.. బదిలీల ప్రకంపనలు తప్పవా?తెలంగాణSwechaa16 Nov 2026, 01:21 PM

కొత్త సీపీ రాకతో పోలీసుల్లో టెన్షన్‌.. బదిలీల ప్రకంపనలు తప్పవా?

 నగరంలో పోలీస్‌ బాస్‌ మారడంతో హైదరాబాద్‌ కమిషనరేట్‌ వర్గాల్లో తీవ్ర ఉత్కంఠ నెలకొంది. ఇటీవలే సజ్జనార్‌ను బదిలీ చేస్తూ కొత్త పోలీసు కమిషనర్‌గా మహేశ్‌ భగవత్‌ బాధ్యతలు స్వీకరించిన విషయం తెలిసిందే. ఈ తరుణంలో, ఎప్పుడు ఎలాంటి బదిలీ ఉత్తర్వులు వెలువడతాయోనన్న భయం అధికారులను వేధిస్తోంది. ముఖ్యంగా కీలక జోన్లలో విధులు నిర్వర్తిస్తున్న కొందరు ఇన్‌స్పెక్టర్లు, ఏసీపీల్లో ఈ ఆందోళన స్పష్టంగా కనిపిస్తోంది. ఏడాది కాలంలోనే పలుమార్లు స్టేషన్లు మారాల్సి వస్తోందని, ఒక ప్రాంతంలో పూర్తిస్థాయిలో పట్టు సాధించేలోపే బదిలీలు కావడం వల్ల విధులకు పూర్తిస్థాయిలో న్యాయం చేయలేకపోతున్నామని కొందరు అధికారులు మదనపడుతున్నారు.

Viral: బతికుండగానే పెద్దకర్మ.. 900మందికి విందు ఏర్పాటు చేసిన 80ఏళ్ల వృద్ధుడు!వైరల్ న్యూస్Swechaa16 Nov 2026, 12:42 PM

Viral: బతికుండగానే పెద్దకర్మ.. 900మందికి విందు ఏర్పాటు చేసిన 80ఏళ్ల వృద్ధుడు!

 సాధారణంగా ఎవరైనా మృతిచెందాకే వారి ఆత్మశాంతి కోసం కుటుంబ సభ్యులు 13వ రోజున పెద్దకర్మ నిర్వహించడం భారతీయ సమాజంలో అనాదిగా వస్తున్న సంప్రదాయం. అయితే, ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని బాగ్‌పత్ జిల్లాలో ఒక 80ఏళ్ల వృద్ధుడు తరతరాల ఆచారాలకు భిన్నంగా వ్యవహరించి అందరినీ ఆశ్చర్యపరిచారు. జోరి గ్రామానికి చెందిన చౌదరి బాల్జోర్ సింగ్ అనే వృద్ధుడు తాను బతికుండగానే స్వయంగా తన 'పెద్దకర్మ' వేడుకను అత్యంత వైభవంగా నిర్వహించుకున్నారు. ఆదివారం జరిగిన ఈ వినూత్న కార్యక్రమానికి సుమారు 900 మంది బంధువులు, గ్రామస్తులు, ప్రముఖులు హాజరై సామూహిక విందులో పాల్గొనడం స్థానికంగా చర్చనీయాంశమైంది.

Chiranjeevi : కేంద్రమంత్రి  కిషన్ రెడ్డితో  మెగాస్టార్ చిరంజీవి కీలక భేటీ..తెలంగాణSwechaa16 Nov 2026, 12:36 PM

Chiranjeevi : కేంద్రమంత్రి కిషన్ రెడ్డితో మెగాస్టార్ చిరంజీవి కీలక భేటీ..

మెగాస్టార్ చిరంజీవి కేంద్రమంత్రి కిషన్ రెడ్డితో తాజాగా సమావేశం అయ్యారు. ప్రస్తుతం వీరిద్దరి భేటీ గురించి ప్రత్యేక చర్చ జరుగుతోంది.ఏపీలో బీజేపీతో చిరంజీవి తమ్ముడు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పొత్తుపెట్టుకున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే రానున్న ఎన్నికల్లో తెలంగాణలో గెలుపుకోసం బీజేపీ పార్టీ మెగాస్టార్ చిరంజీవి సాయం కోరనుందా? అనే చర్చ మొదలైంది. ఇటీవల చిరంజీవి,ఆయన తనయుడు మెగా పవర్ స్టార్ రాంచరణ్ తేజ్ కేంద్రహోంమంత్రి అమిత్ షాతో భేటీ అయిన విషయం తెలిసిందే. తాజాగా కేంద్రమంత్రి కిషన్ రెడ్డితో భేటీ కావడం వెనుక గల కారణాన్ని మెగాస్టార్ చిరంజీవి వెల్లడించారు. కృత్రిమ మేధ (AI) దుర్వినియోగం, డీప్‌ఫేక్ వీడియోలు, డిజిటల్ ఇంపర్సనేషన్ వంటి సమస్యల నుంచి సినీ కళాకారులు, కార్మికులు, సామాన్య పౌరులకు రక్షణ కల్పించాలని కేంద్రప్రభుత్వాన్ని కోరినట్టు వెల్లడించారు. ఈ మేరకు కేంద్రమంత్రి కిషన్ రెడ్డిని కలిసి ఓ వినతి పత్రాన్ని సమర్పించారు.

చీప్ డ్రోన్లతో పాక్‌ పన్నాగం.. భారత్‌ హై అలర్ట్‌! అసలేంటీ.. FPV డ్రోన్లు?InternationalSwechaa16 Nov 2026, 12:30 PM

చీప్ డ్రోన్లతో పాక్‌ పన్నాగం.. భారత్‌ హై అలర్ట్‌! అసలేంటీ.. FPV డ్రోన్లు?

ఆపరేషన్‌ సిందూర్‌లో భారత్‌ దెబ్బకు వెనక్కి తగ్గిన పాకిస్థాన్‌.. ఇప్పుడు లక్ష చౌక డ్రోన్లతో కొత్త వ్యూహానికి తెరతీస్తోందా? తుర్కియేతో భారీ ఒప్పందం వెనుక అసలు పన్నాగం ఏంటి? సరిహద్దుల్లో డ్రోన్ల ముప్పు పెరిగితే భారత్‌ ఎలా ఎదుర్కోబోతోంది?

Karthika masam: కార్తీక దీపారాధన.. ఉసిరిక దీపం ప్రాముఖ్యత తెలుసా?SpiritualitySwechaa16 Nov 2026, 12:20 PM

Karthika masam: కార్తీక దీపారాధన.. ఉసిరిక దీపం ప్రాముఖ్యత తెలుసా?

 భారతీయ సనాతన ధర్మంలో ప్రతీ నెలకు ఒక ప్రత్యేకమైన ఆధ్యాత్మిక ప్రాధాన్యత ఉంటుంది. ముఖ్యంగా శివారాధన, విష్ణుభక్తి, దీపారాధన, తులసీ పూజ, ఉపవాసాలు, దానధర్మాలకు అత్యంత విశిష్టమైన నెల కార్తీక మాసం. కృత్తిక నక్షత్రంతో కూడిన పౌర్ణమి వచ్చే మాసం కావడంతో దీనికి కార్తీక మాసం అనే పేరు స్థిరపడింది. కృత్తిక నక్షత్రానికి అగ్నితో విడదీయరాని సంబంధం ఉండటంతో, ఈ నెలలో దీపారాధనకు అత్యున్నత స్థానం కల్పించారు.  ఉదయం, సాయంత్రం వేళల్లో ఇంటి పూజా మందిరంలో, తులసి కోట దగ్గర, ఆలయాల్లో ఆవు నెయ్యి లేదా నువ్వుల నూనెతో దీపాలు వెలిగించడం సంప్రదాయంగా వస్తోంది.

SPORTS : ఐసీసీ చైర్మన్‌గా జై షా..  రెండోసారి ఏకగ్రీవంక్రీడలుSwechaa16 Nov 2026, 12:08 PM

SPORTS : ఐసీసీ చైర్మన్‌గా జై షా.. రెండోసారి ఏకగ్రీవం

ఇంటర్నేషనల్ క్రికెట్ కౌన్సిల్ (ICC) ఛైర్మన్‌గా జై షా (Jai Shah) మరోసారి ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఇండోనేషియా దేశంలోని బాలిలో సోమవారం నిర్వహించిన ఐసీసీ బోర్డు సమావేశాల్లో డైరెక్టర్లు జై షా పేరును ప్రతిపాదించగా, ఎటువంటి పోటీ లేకుండా ఆయనను రెండోసారి ఛైర్మన్‌గా బోర్డు ఎంపిక చేసింది. క్రికెట్‌ను అంతర్జాతీయంగా ప్రమోట్ చేయడం, గేమ్‌కు అభిమానుల నుంచి ఆదరణ పెంచడం, వాణిజ్యపరమైన వృద్ధిని సాధించే కీలక సమయంలో జై షా లీడర్ షిప్ ఎంతో అవసరమని ఐసీసీ బోర్డు భావించినట్టు తెలిసింది. రెండోసారి ఐసీసీ చైర్మన్‌గా ఎన్నిక కావడంపై జై షా స్పందించారు. తనపై ఐసీసీ బోర్డు ఉంచిన నమ్మకానికి, డైరెక్టర్ల నిరంతర మద్దతుకు కృతజ్ఞతలు తెలియజేశారు. ‘ఐసీసీ ఛైర్మన్‌గా సేవలందించడం ఒక గౌరవంతో పాటు పెద్ద బాధ్యత. అంతర్జాతీయంగా క్రికెట్‌ను ముందుకు తీసుకెళ్లడానికి సభ్య దేశాలతో కలిసి పనిచేయడానికి నేను కట్టుబడి ఉన్నా. ఆటగాళ్లు, అభిమానులు, వాణిజ్య భాగస్వాముల ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకుని క్రికెట్‌కు బలమైన, సుస్థిరమైన భవిష్యత్‌ను నిర్మిస్తాం’ అని పేర్కొన్నారు.

Congress : అలాగైతే వచ్చే ఎన్నికల్లో పోటీ చేయను : మంత్రి తుమ్మల!రాజకీయాలుSwechaa16 Nov 2026, 11:50 AM

Congress : అలాగైతే వచ్చే ఎన్నికల్లో పోటీ చేయను : మంత్రి తుమ్మల!

రాష్ట్రంలో కరువు ఛాయలు క్రమంగా బలపడుతుండటంతో అధికార పార్టీకి చెందిన నేతలకు భయం పట్టుకున్నట్టు తెలుస్తోంది. వచ్చే ఏడాది ప్రారంభంలో గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికలు, అనంతరం జీహెచ్ఎంసీ ఎన్నికలు, ఎంపీటీసీ, జెట్పీటీసీ ఎన్నికలు సైతం జరగాల్సి ఉన్నది. అన్నదాతలకు సాగు నీరు ఇవ్వలేని పరిస్థితుల్లో ప్రభుత్వం ఉన్నది. మున్ముందు తాగు నీటికి కూడా కొరత ఏర్పడుతుందని అధికారులు అంచనా వేస్తున్నారు. దీంతో ప్రభుత్వంపై తీవ్ర వ్యతిరేకత ఏర్పడుతుందని, క్షేత్రస్థాయిలో ఇప్పటికే పరిస్థితులు దారుణంగా ఉన్నాయని కాంగ్రెస్ పార్టీలో చర్చ జరుగుతున్నట్టు సమాచారం.ఈ క్రమంలోనే అధికార పార్టీకి చెందిన వ్యవసాయశాఖ మంత్రి తుమ్మల నాగేశ్వర్ రావు సంచలన కామెంట్స్ చేసినట్టు సమాచారం.

తిరుమల వెళ్లే వారికి బిగ్ అలర్ట్.. టీటీడీ కీలక సూచనలు!ఏపీSwechaa16 Nov 2026, 11:47 AM

తిరుమల వెళ్లే వారికి బిగ్ అలర్ట్.. టీటీడీ కీలక సూచనలు!

 కలియుగ ప్రత్యక్ష దైవం తిరుమల వేంకటేశ్వర స్వామివారి దర్శనానికి వెళ్లే భక్తులకు ప్రస్తుతం కొండపై తీవ్ర ఇబ్బందులు ఎదురవుతున్నాయి. ఒకవైపు శీతాకాలం ప్రభావంతో తిరుమల కొండపై ఉష్ణోగ్రతలు భారీగా పడిపోతుండగా, మరోవైపు భక్తుల రద్దీ అనూహ్యంగా పెరిగింది. వసతి గదులు దొరక్కపోవడంతో చాలామంది భక్తులు గజగజ వణికించే చలిలోనే ఆరుబయట రాత్రంతా గడపాల్సిన పరిస్థితి నెలకొంది. ముఖ్యంగా చిన్నపిల్లలు, వృద్ధులతో కలిసి దర్శనానికి వచ్చిన కుటుంబాలు చలి తీవ్రతను తట్టుకోలేక నానా అవస్థలు పడుతున్నాయి.

TG : నీటి కటకట.. శ్రీశైలం ప్రాజెక్టులో భారీగా తగ్గిన నీటి నిల్వలుతెలంగాణSwechaa16 Nov 2026, 11:27 AM

TG : నీటి కటకట.. శ్రీశైలం ప్రాజెక్టులో భారీగా తగ్గిన నీటి నిల్వలు

రాష్ట్రంలో ఎల్ నినో ప్రభావం కారణంగా ప్రాజెక్టుల్లో నీటి నిల్వలు క్రమంగా పడిపోతున్నాయి. ఇప్పటికే చాలా ప్రాజెక్టులు డెడ్ స్టోరేజీకి చేరుకున్నాయి. పరిస్థితి ఇలాగే కొనసాగితే మున్ముందు సాగుతో పాటు తాగు నీటి సమస్యలు కూడా ఎదురయ్యే అవకాశాలు ఉన్నాయని తెలుస్తోంది. ఈ విషయంలో ప్రభుత్వం ఇప్పటికే సీరియస్‌గా దృష్టి సారించినట్టు తెలుస్తోంది. వేసవిలో తాగు నీటి కష్టాలు రాకుండా ప్రత్యామ్నాయ మార్గాల కోసం అన్వేషిస్తున్నట్టు సమాచారం. ఇదిలాఉండగా, శ్రీ శైలం ప్రాజెక్టులో నీటి నిల్వలు భారీగా తగ్గినట్టు తెలుస్తోంది. 215.80 టీఎంసీల పూర్తి సామర్థ్యానికి గానూ ప్రస్తుతం 48.57 టీఎంసీల నీరు మాత్రమే ఉన్నట్టు సమాచారం. 885 అడుగుల పూర్తి స్థాయి నీటిమట్టానికి ప్రస్తుతం 829.10 అడుగులు ఉన్నట్టు తెలిసింది.కేవలం 9 రోజుల్లో 3.03 టీఎంసీల మేర నీటి నిల్వలు తగ్గినట్టు అధికారులు అంచనా వేశారు. రోజుకు సగటున 0.33 టీఎంసీల నీటి తగ్గుదల నమోదు అయినట్టు తేల్చారు.

దేశాన్ని విచ్ఛిన్నం చేసేందుకు కుట్రలు.. మోహన్ భగవత్ సంచలన వ్యాఖ్యలు!NationalSwechaa16 Nov 2026, 11:16 AM

దేశాన్ని విచ్ఛిన్నం చేసేందుకు కుట్రలు.. మోహన్ భగవత్ సంచలన వ్యాఖ్యలు!

 నేటి ఆధునిక సమాజంలో విపరీతంగా పెరుగుతున్న సామాజిక మాధ్యమాల వినియోగంపై రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ (RSS) అధినేత మోహన్ భగవత్ తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్ వంటి సోషల్ మీడియా వేదికలు కూడా ఒకరకమైన వ్యసనమేనని, అన్ని రకాల వ్యసనాల మాదిరిగానే ఇది కూడా వ్యక్తిగత, సామాజిక చైతన్యాన్ని దెబ్బతీస్తుందని ఆయన హెచ్చరించారు. రాజస్థాన్‌లోని జోధ్‌పూర్ సమీపం షికార్‌పురాలోని శ్రీ రాజారామ్ ఆశ్రమంలో నిర్వహించిన 'మారు నినాద్-2026' ఘోష్ శివిర్ ముగింపు వేడుకల్లో ఆదివారం ఆయన ప్రసంగిస్తూ ఈ కీలక వ్యాఖ్యలు చేశారు.

TG : తెలంగాణలో మరో ఇద్దరు రైతుల ఆత్మహత్యతెలంగాణSwechaa16 Nov 2026, 10:54 AM

TG : తెలంగాణలో మరో ఇద్దరు రైతుల ఆత్మహత్య

రాష్ట్రంలో అన్నదాతల ఆత్మహత్యలు కొనసాగుతూనే ఉన్నాయి. ఓ వైపు ఎల్ నినో ప్రభావం మరోవైపు సాగు నీరు లేక కోత దశకు వచ్చిన పంటలు ఎండిపోతుండటంతో రైతులు తీవ్ర ఆందోళనకు గురవుతున్నారు. పంటలు ఎండిపోవడంతో పెట్టుబడి ఖర్చులు కూడా వచ్చే పరిస్థితి లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.పెట్టుబడి కోసం తెచ్చిన అప్పులకు వడ్డీల భారం మరింత పెరుగుతుండటంతో ఏం చేయాలో దిక్కుతోచని పరిస్థితుల్లో ఉన్నారు. ఈ క్రమంలోనే అప్పులు తిరిగి చెల్లించలేక రైతులు చావే మార్గంగా ఎంచుకుంటున్నారు.తాజాగా అప్పుల బాధతో ఇద్దరు రైతులు ఆత్మహత్య చేసుకున్నారు. ఆదిలాబాద్ జిల్లా తలమడుగులో అప్పులు తీర్చే మార్గం లేక రైలు కింద పడి కౌలురైతు ఆశన్న (43) ఆత్మహత్యకు పాల్పడ్డారు. 17 ఎకరాలు కౌలుకు తీసుకుని పత్తి, కంది సాగు చేసిన ఆశన్న .. ఆశించిన దిగుబడి రాక, ఇదివరకు చేసిన అప్పుల భారం పెరిగిపోవడంతో అవి తీర్చలేక ప్రాణాలు తీసుకున్నాడు.

నిర్వహణ పేరుతో బాదుడు.. రెట్టింపు కానున్న పార్కుల ఎంట్రీ టికెట్ ధరలు!తెలంగాణSwechaa16 Nov 2026, 10:41 AM

నిర్వహణ పేరుతో బాదుడు.. రెట్టింపు కానున్న పార్కుల ఎంట్రీ టికెట్ ధరలు!

 భాగ్యనగర వాసులకు రాష్ట్ర ప్రభుత్వం, జీహెచ్‌ఎంసీ అధికారులు ఊహించని రీతిలో షాక్ ఇచ్చారు. ఉదయం, సాయంత్రం వేళల్లో ఆహ్లాదం కోసం, వ్యాయామం కోసం పార్కులకు వెళ్లే సామాన్యులపై భారం మోపుతూ హైదరాబాద్ నగరంలోని పార్కుల ప్రవేశ (ఎంట్రీ) టికెట్ ధరలను భారీగా పెంచుతూ నిర్ణయం తీసుకున్నారు. పార్కుల నిర్వహణ వ్యయం పెరిగిందన్న కారణంతో ప్రభుత్వం ఈ టికెట్ ధరల పెంపును అమల్లోకి తీసుకువస్తుండటంతో నగరవాసులు తీవ్ర అసహనం వ్యక్తం చేస్తున్నారు. కొత్త నిబంధనల ప్రకారం.. ఇప్పటివరకు పెద్దలకు రూ.10గా ఉన్న ఎంట్రీ టికెట్ ధర ఏకంగా రెట్టింపై రూ.20కి చేరుకోనుంది. అదేవిధంగా చిన్నపిల్లలకు రూ.2గా ఉన్న ప్రవేశ రుసుమును రూ.5కు పెంచుతూ అధికారులు ఉత్తర్వులు సిద్ధం చేశారు.

అంతరిక్షంలో అమెజాన్‌కు ఎదురుదెబ్బ: యూఎల్‌ఏ వల్కన్ రాకెట్ ప్రయోగం విఫలం!InternationalSwechaa16 Nov 2026, 10:25 AM

అంతరిక్షంలో అమెజాన్‌కు ఎదురుదెబ్బ: యూఎల్‌ఏ వల్కన్ రాకెట్ ప్రయోగం విఫలం!

 అంతరిక్ష ప్రయోగాల రంగంలో ప్రఖ్యాతి గాంచిన యునైటెడ్ లాంచ్ అలయన్స్ (ULA) సంస్థకు ఊహించని రీతిలో భారీ ఎదురుదెబ్బ తగిలింది. దిగ్గజ ఈ-కామర్స్ సంస్థ అమెజాన్‌కు చెందిన 40లియో బ్రాడ్‌బ్యాండ్ ఉపగ్రహాలను అంతరిక్ష కక్ష్యలోకి మోసుకెళ్తున్న 'వల్కన్' రాకెట్ ప్రయోగం విఫలమైంది. రెండు దశాబ్దాల యూఎల్‌ఏ సుదీర్ఘ చరిత్రలో ఇదే తొలి సంపూర్ణ ప్రయోగ వైఫల్యం కావడం అంతరిక్ష రంగ నిపుణులను ఆశ్చర్యానికి గురిచేస్తోంది. ఈ దుర్ఘటనలో అమెజాన్‌కు చెందిన 40 శాటిలైట్లు పూర్తిగా ధ్వంసం కావడంతో ఆ సంస్థ ప్రతిష్టాత్మక బ్రాడ్‌బ్యాండ్ ప్రాజెక్టుకు గట్టి షాక్ తగిలింది.

తెలంగాణలో పెరిగిన చలి తీవ్రత.. 11.4 డిగ్రీల కనిష్ట ఉష్ణోగ్రత నమోదు!తెలంగాణSwechaa16 Nov 2026, 09:45 AM

తెలంగాణలో పెరిగిన చలి తీవ్రత.. 11.4 డిగ్రీల కనిష్ట ఉష్ణోగ్రత నమోదు!

 తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా చలి తీవ్రత ఒక్కసారిగా పెరిగి ప్రజలను గజగజ వణికిస్తోంది. ఉత్తర, ఈశాన్య దిశల నుంచి వీస్తున్న చల్లని పొడి గాలుల ప్రభావంతో ఆదివారం రాత్రి ఉష్ణోగ్రతలు సాధారణం కంటే భారీగా పడిపోయాయి. రాష్ట్రంలోనే అత్యల్పంగా కుమురం భీం ఆసిఫాబాద్ జిల్లా సిర్పూర్(యు) మండలంలో 11.4 డిగ్రీల సెల్సియస్ కనిష్ట ఉష్ణోగ్రత నమోదైంది. హైదరాబాద్‌లోని పలు ప్రాంతాల్లో ఉష్ణోగ్రతలు 13.4 డిగ్రీలకు చేరడంతో నగరవాసులు చలికి వణికిపోతున్నారు.

Today in History November 16: చరిత్రలో ఈ రోజు (16 నవంబర్)InternationalSwechaa16 Nov 2026, 09:11 AM

Today in History November 16: చరిత్రలో ఈ రోజు (16 నవంబర్)

  • 1945: ప్రపంచవ్యాప్తంగా విద్య, విజ్ఞానం, సాంస్కృతిక పరిరక్షణ కోసం ఐక్యరాజ్యసమితి అనుబంధ సంస్థ యునెస్కో (UNESCO) స్థాపించబడింది.

  • 1966: ప్రెస్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా (PCI) j ప్రారంభం. 'జాతీయ పత్రికా దినోత్సవం' (National Press Day).

  • 1973: భారత బ్యాడ్మింటన్ దిగ్గజం, ద్రోణాచార్య పురస్కార గ్రహీత పుల్లెల గోపీచంద్ జననం.

  • 1933: అమెరికా, సోవియట్ యూనియన్ (USSR) దేశాలు మొదటిసారిగా అధికారిక దౌత్య సంబంధాలను నెలకొల్పుకున్నాయి.

  • 1996: నవంబర్ 16వ తేదీని 'అంతర్జాతీయ సహన దినోత్సవం' (International Day for Tolerance) గా ఐక్యరాజ్యసమితి ప్రకటించింది.

  • 1974: అంతరిక్షంలో గ్రహాంతరవాసులకు సందేశం పంపే ప్రయత్నంలో భాగంగా ప్యూర్టో రికోలోని అరేసిబో రేడియో టెలిస్కోప్ నుంచి అత్యంత శక్తివంతమైన 'అరేసిబో మెసేజ్' (Arecibo Message) ను అంతరిక్షంలోకి ప్రసారం చేశారు.

  • 2022: నాసా తన ప్రతిష్ఠాత్మక చంద్రయాత్ర కార్యక్రమం 'ఆర్టెమిస్ 1' (Artemis 1) మిషన్‌ను కెన్నెడీ స్పేస్ సెంటర్ నుంచి విజయవంతంగా ప్రయోగించింది.

  • 1973 (జననం): పుల్లెల గోపీచంద్ — ఆల్ ఇంగ్లాండ్ ఓపెన్ బ్యాడ్మింటన్ ఛాంపియన్, భారత జాతీయ బ్యాడ్మింటన్ కోచ్, పద్మభూషణ్ గ్రహీత.

  • 1908 (జననం): బి.ఎన్. రెడ్డి (బొమ్మిరెడ్డి నరసింహారెడ్డి) — దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు అందుకున్న తొలి దక్షిణ భారతీయ చలనచిత్ర దర్శకుడు.

  • 2022 (మరణం): కృష్ణ (ఘట్టమనేని శివరామకృష్ణమూర్తి) — తెలుగు చలనచిత్ర 'సూపర్ స్టార్' (నవంబర్ 15 తెల్లవారుజామున మరణించి, 16న అంత్యక్రియలు జరిగాయి; ఆయన స్మృతులు నేటికీ సజీవం).

నేటి పంచాంగం - 16 నవంబర్ 2026 | కార్తిక శుద్ధ సప్తమి (భాను సప్తమి)SpiritualitySwechaa16 Nov 2026, 08:53 AM

నేటి పంచాంగం - 16 నవంబర్ 2026 | కార్తిక శుద్ధ సప్తమి (భాను సప్తమి)

  • తేదీ: 16 నవంబరు 2026, సోమవారం

  • సంవత్సరం: శ్రీ పరాభవ నామ సంవత్సరం

  • అయనం & ఋతువు: దక్షిణాయనం, శరత్ఋతువు

  • మాసం & పక్షం: కార్తిక మాసం, శుక్ల పక్షం

  • తిథి: సప్తమి (ఉదయం 06:48 వరకు), తదుపరి అష్టమి (తెల్లవారుజామున 05:32 వరకు)

  • వారం: సోమవారం (ఇందువాసరే)

  • నక్షత్రం: ధనిష్ఠ (తెల్లవారుజామున 04:42 వరకు, తదుపరి శతభిషం)

  • యోగం: వృద్ధి (సాయంత్రం 04:15 వరకు, తదుపరి ధ్రువ)

  • కరణం: వణిజ (ఉదయం 06:48 వరకు), తదుపరి భద్ర/విష్టి (సాయంత్రం 06:10 వరకు)

శుభ / అశుభ సమయాలు:

  • రాహుకాలం: ఉదయం 07:45 - 09:10 వరకు

  • యమగండం: ఉదయం 10:35 - మధ్యాహ్నం 12:00 వరకు

  • అమృతకాలం: రాత్రి 08:12 - 09:45 వరకు

  • దుర్ముహూర్తము: మధ్యాహ్నం 12:22 - 01:07 వరకు మరియు మధ్యాహ్నం 02:38 - 03:23 వరకు

  • వర్జ్యం: ఉదయం 10:42 - మధ్యాహ్నం 12:15 వరకు

గ్రహస్థితులు:

  • సూర్యరాశి: వృశ్చికం (కార్తిక సోమవారం & వృశ్చిక సంక్రమణ పుణ్యకాలం)

  • చంద్రరాశి: మకరం (సాయంత్రం 05:05 వరకు, తదుపరి కుంభం)

  • సూర్యోదయం: ఉదయం 06:25

  • సూర్యాస్తమయం: సాయంత్రం 05:36

Tollywood: మెగాస్టార్ 'కాకా' మూవీలో రితికా సింగ్!ఆ విషయంలో అరుపులే..సినిమాSwechaa15 Nov 2026, 10:34 PM

Tollywood: మెగాస్టార్ 'కాకా' మూవీలో రితికా సింగ్!ఆ విషయంలో అరుపులే..

Tollywood: ఈ మధ్య మెగాస్టార్ చిరంజీవి నటిస్తున్న సినిమాల్లో వరుసగా కొత్త హీరోయిన్లకు అవకాశాలు దక్కుతున్నాయి. ఇప్పటికే, కాకా మూవీలో అనస్వర రాజన్ చిరుకి కూతురు పాత్రలో నటిస్తుండగా, ఇప్పుడు ఇదే, సినిమాకు సంబంధించి రితికా సింగ్ పేరు తెరపైకి రావడం ఆసక్తికరంగా మారింది. ఇప్పటికే గురు లాంటి సినిమాలలో తన నటనతో ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న రితికా.. చిరంజీవి సినిమాలో కనిపిస్తే ఈ కాంబినేషన్ ప్రేక్షకుల్లో ఎలాంటి ఆసక్తిని క్రియేట్ చేస్తుందనేది అందరిలోనూ మంచి క్యూరియాసిటీని పెంచేస్తుంది.

TG: తెలంగాణ సాయుధ పోరాటానికి మతం రంగు పులిమితే ఊరుకోం: బృందా కారత్ వార్నింగ్తెలంగాణSwechaa15 Nov 2026, 10:04 PM

TG: తెలంగాణ సాయుధ పోరాటానికి మతం రంగు పులిమితే ఊరుకోం: బృందా కారత్ వార్నింగ్

TG: తెలంగాణ సాయుధ పోరాటానికి అడ్డా అయిన నల్గొండ గడ్డపై సీపీఎం సీనియర్ నేత, మాజీ ఎంపీ బృందా కారత్ గర్జించారు. నల్గొండలోని ఎన్జీ కళాశాల గ్రౌండ్స్‌లో జరిగిన 36వ అఖిల భారత కిసాన్ సభ మహాసభల బహిరంగ సభలో ముఖ్య అతిథిగా పాల్గొన్న ఆమె, అటు కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వంపైనా, ఇటు రాష్ట్రంలోని రేవంత్ రెడ్డి ప్రభుత్వంపైనా ఘాటైన విమర్శలు గుప్పించారు. ముఖ్యంగా చారిత్రాత్మక తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటాన్ని హిందూ-ముస్లింల గొడవగా మార్చేందుకు బీజేపీ, ఆర్‌ఎస్‌ఎస్ ప్రయత్నిస్తున్నాయంటూ ఆమె చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు రాజకీయంగా పెను దుమారం రేపుతున్నాయి.

Ashu Reddy: సుధీర్ తో పెళ్లి.. మొత్తానికి బయట పెట్టిన అషురెడ్డిసినిమాSwechaa15 Nov 2026, 08:53 PM

Ashu Reddy: సుధీర్ తో పెళ్లి.. మొత్తానికి బయట పెట్టిన అషురెడ్డి

Ashu Reddy: బుల్లితెర స్టార్ కమెడియన్, యాంకర్ సుడిగాలి సుధీర్ పెళ్లి గురించి సోషల్ మీడియాలో ఎప్పుడూ ఏదో ఒక వార్త వైరల్ అవుతూనే ఉంటుంది. గతంలో యాంకర్ రష్మితో ఆన్‌స్క్రీన్ లవ్ ట్రాక్‌తో విపరీతమైన క్రేజ్ సంపాదించుకున్న సుధీర్, ఆ తర్వాత ఛానల్ మారి బిగ్ బాస్ బ్యూటీ అషురెడ్డితో కలిసి చేసిన సందడి హాట్ టాపిక్‌గా మారింది. ముఖ్యంగా 'ఫ్యామిలీ స్టార్స్' షోలో అషురెడ్డి ఆప్యాయంగా సుధీర్‌ను 'బావ' అని పిలిచినప్పటి నుంచి, వీరిద్దరి మధ్య నిజంగానే ప్రేమాయణం నడుస్తోందంటూ ప్రచారం మొదలైంది. ఏకంగా వీరిద్దరూ పెళ్లి చేసుకోబోతున్నారనే వార్తలు కూడా చక్కర్లు కొట్టాయి. తాజాగా ఈ రూమర్స్‌పై అషురెడ్డి స్పందిస్తూ అసలు నిజాన్ని బయటపెట్టింది.

AP: కోస్తాంధ్రకు పెను ముప్పు.. అతి తీవ్ర తుపానుగా తీరం దాటే ఛాన్స్!ఏపీSwechaa15 Nov 2026, 08:41 PM

AP: కోస్తాంధ్రకు పెను ముప్పు.. అతి తీవ్ర తుపానుగా తీరం దాటే ఛాన్స్!

AP: ఆంధ్రప్రదేశ్ తీర ప్రాంతాలకు, ముఖ్యంగా కోస్తాంధ్రకు పెను తుపాను గండం పొంచి ఉంది. ఆగ్నేయ, నైరుతి బంగాళాఖాతంలో కేంద్రీకృతమై ఉన్న వాయుగుండం వేగంగా బలపడుతూ ముందుకు కదులుతోంది. ప్రస్తుతం ఇది చెన్నైకి 840 కిలోమీటర్లు, విశాఖపట్నానికి 1,010 కిలోమీటర్ల దూరంలో ఉందని వాతావరణ శాఖ అధికారులు వెల్లడించారు. గంటకు 10 కిలోమీటర్ల వేగంతో ఉత్తర దిశగా పయనిస్తున్న ఈ వాయుగుండం, రానున్న రోజుల్లో మరింత తీవ్రరూపం దాల్చి కోస్తాంధ్రపై విరుచుకుపడే ప్రమాదం కనిపిస్తోందని చెబుతున్నారు.వాతావరణ కేంద్రం హెచ్చరికల ప్రకారం.. ఉత్తర-వాయవ్య దిశగా కదులుతున్న ఈ వాయుగుండం రేపు తెల్లవారుజామున దక్షిణ, మధ్య పశ్చిమ బంగాళాఖాతంలో తుపానుగా మారనుంది.

Keerthy Suresh: ధనుష్, దుల్కర్‌లతో కీర్తికి పోటీ అవసరమా?సినిమాSwechaa15 Nov 2026, 08:40 PM

Keerthy Suresh: ధనుష్, దుల్కర్‌లతో కీర్తికి పోటీ అవసరమా?

Keerthy Suresh: ఇద్దరు స్టార్ హీరోలతో మహానటి కీర్తి సురేష్ ఈ నవంబర్ 20న పోటీ పడబోతోంది. ఆ సినిమా సత్యవాన్ సావిత్రి..ఆ హీరోలు కోలీవుడ్ స్టార్ ధనుష్..మాలీవుడ్ దుల్కర్ సల్మాన్. వీరి సినిమాలు ఓం, ఆకాశంలో ఒక తార చిత్రాలు. ఈ మూడు సినిమాలు ఒకే రోజు బాక్సాఫీస్ వద్ద పోటీ పడబోతున్నాయి. కానీ, ఇది కీర్తికి అవసరమా! అంటూ కొందరు సినీ విశ్లేషకులు చర్చించుకుంటున్నారు.