స్వేచ్ఛ షార్ట్స్ — తాజా తెలుగు వార్తలు

VIRAL: భార్య రోడ్డుపై పడిపోయినా.. బైక్ ఆపకుండా పారిపోయిన భర్త!వైరల్ న్యూస్Swechaa18 Oct 2026, 10:05 AM

VIRAL: భార్య రోడ్డుపై పడిపోయినా.. బైక్ ఆపకుండా పారిపోయిన భర్త!

 పోలీసుల తనిఖీల నుంచి తప్పించుకునే తొందరలో ఓ భర్త తన భార్యను నడిరోడ్డుపైనే పడేసి పరారయ్యాడు. బైక్‌ను ఒక్కసారిగా వేగంగా మలుపు తిప్పడంతో వెనుక కూర్చున్న అతని భార్య బ్యాలెన్స్ కోల్పోయి కిందపడిపోయింది. అయినప్పటికీ, ఆ వ్యక్తి ఏమాత్రం కనికరం చూపకుండా, భార్యను పట్టించుకోకుండా బైక్‌ను అలాగే పోనిచ్చి అక్కడి నుంచి పరారయ్యాడు. ఈ ఘటనకు సంబంధించిన దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్ కావడంతో నెటిజన్లు ఆ భర్త తీరుపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

దుర్గా పూజలో తొక్కిసలాట.. 17 మంది దుర్మరణం!NationalSwechaa18 Oct 2026, 09:52 AM

దుర్గా పూజలో తొక్కిసలాట.. 17 మంది దుర్మరణం!

పశ్చిమ బెంగాల్ రాష్ట్రంలో నవరాత్రుల సందర్భంగా తీవ్ర విషాదం చోటుచేసుకుంది. నార్త్ కోల్‌కతాలోని ప్రసిద్ధ చోర్‌బాగన్ సార్వజనీన్ దుర్గాపూజా పండల్ వద్ద శనివారం రాత్రి అనుకోకుండా తొక్కిసలాట నెలకొంది. ఈ ప్రమాదంలో కనీసం 17 మంది భక్తులు ప్రాణాలు కోల్పోయినట్లు సమాచారం. మరో 25 మందికి పైగా భక్తులు తీవ్రంగా గాయపడినట్టు తెలుస్తోంది. దుర్గమాత దర్శనం కోసం వేలాది మంది భక్తులు పోటెత్తిన సమయంలో అకస్మికంగా భారీ వర్షం కురిసింది. దీంతో ప్రజలు తలదాచుకునేందుకు ఒక్కసారిగా పరుగులు తీశారు. ఈ క్రమంలోనే అక్కడ తీవ్ర తోపులాట జరిగినట్టు సమాచారం. తోపులాట కారణంగా కొందరు మహిళలు, చిన్నపిల్లలు, వృద్ధులు కిందపడిపోయినట్టు తెలిసింది. అదే సమయంలో చాలా మంది పరుగులు తీయగా కింద పడిపోయిన వారిని తొక్కుకుంటూ జనాలు ముందుకు వెళ్లడంతో ఈ ప్రమాదం సంభవించింది.

తెలుగు రాష్ట్రాలకు చల్లని కబురు.. రెండు రోజులు భారీ వర్షాలు!తెలంగాణSwechaa18 Oct 2026, 09:48 AM

తెలుగు రాష్ట్రాలకు చల్లని కబురు.. రెండు రోజులు భారీ వర్షాలు!

ఎల్‌నినో ప్రభావంతో తీవ్ర వర్షాభావ పరిస్థితుల మధ్య వాతావరణ శాఖ చల్లని కబురుచెప్పింది. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో రాగల రెండు రోజుల పాటు (ఆదివారం, సోమవారం) వర్షాలు కురిసే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ (IMD), రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ కీలక అప్‌డేట్ ఇచ్చాయి. ఉత్తర తమిళనాడు, దక్షిణ కోస్తాంధ్ర ప్రాంతాలపై ఉపరితల ఆవర్తనం చురుకుగా కొనసాగుతుండటంతో పాటు, దక్షిణ కోస్తాంధ్ర నుంచి వాయవ్య బంగాళాఖాతం వరకు ఉపరితల ద్రోణి విస్తరించింది.

ఖానామెట్  కబ్జారాయుళ్లు వీళ్లేనా?స్వేచ్ఛ ఛైర్మన్ డెస్క్Swechaa18 Oct 2026, 09:40 AM

ఖానామెట్ కబ్జారాయుళ్లు వీళ్లేనా?

చరిత్ర అందరికి తెలిసిందే.. ఇప్పుడు జరుగుతున్న కబ్జాలపై అప్రమత్తత అవసరం. ఖానామెట్‌లో 41 సర్వే నంబర్ ఏ.252.24 గుంటల వివాదాస్పద సమాచారం గూగుల్‌లో వెతికినా దొరుకుతుంది. అలాంటి లిటిగేషన్ భూముల్లో ఫేక్ పేపర్స్ సృష్టించి, నాయకుల అండదండలతో కబ్జాలకు పాల్పడుతున్నారు. దశాబ్దాల క్రితం రిజిస్ట్రేషన్ చేసి కొనుగోలు చేసుకున్న వారికి మీ పొజిషన్ ఇక్కడ కాదు, అక్కడ అంటూ వేరే చోటకు వెళ్లి అక్కడ చుట్టూ బౌండరీలు కట్టేసుకుంటూ, నాలుగు ఐదు ముఠాలు తిరుగుతున్నాయి.ఏడాదిగా సీఎం రేవంత్ రెడ్డి బ్రదర్స్ పేర్లు చెప్పుకుంటూ ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారు. మూడు నెలల క్రితం మాదాపూర్ పోలీస్ స్టేషన్‌లో కేసులు నమోదు అయితే, ఖైరతాబాద్ బీజీపీ నేత పల్లపు గోవర్ధన్‌తో పాటు గోపాలకృష్ణ వర్మరాజు, మక్బూల్ హమ్మద్, రవి నాయక్‌లపై కేసులు నమోదు అయ్యాయి.

దసరా మామూళ్ల వేధింపులు.. డిప్యూటీ తహసీల్దార్ బలవన్మరణం!క్రైమ్Swechaa18 Oct 2026, 09:18 AM

దసరా మామూళ్ల వేధింపులు.. డిప్యూటీ తహసీల్దార్ బలవన్మరణం!

 దసరా పండుగ వేళ భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో సంచలన ఘటన చోటుచేసుకుంది. కొవ్వూరు డిప్యూటీ తహసీల్దార్‌గా విధులు నిర్వహిస్తున్న లక్ష్మీనారాయణ (Deputy Tahsildar Laxminarayana) భద్రాచలంలోని ఒక ప్రైవేట్ లాడ్జిలో ఉరేసుకుని బలవన్మరణానికి పాల్పడ్డారు. పండుగ మామూళ్ల పేరుతో పలువురు విలేకరులు, ఒక కంప్యూటర్ ఆపరేటర్ తీవ్రంగా వేధించడం వల్లే తాను ఈ తీవ్ర నిర్ణయం తీసుకుంటున్నట్లు ఆయన రాసిన సూసైడ్ నోట్ లభించడంతో రెవెన్యూ వర్గాల్లో, స్థానికంగా తీవ్ర కలకలం రేగింది. పోలీసులు స్వాధీనం చేసుకున్న సూసైడ్ నోట్‌లో సంచలన విషయాలు వెలుగులోకి వచ్చాయి.

NTR-TRIVIKRAM: "గాడ్ ఆఫ్ వార్" గాలి వార్తేనా?సినిమాSwechaa17 Oct 2026, 10:49 PM

NTR-TRIVIKRAM: "గాడ్ ఆఫ్ వార్" గాలి వార్తేనా?

NTR-TRIVIKRAM: టాలీవుడ్‌లో మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్‌కు ముందు నుంచి ఉన్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఇక, రాజమౌళి దర్శకత్వంలో వచ్చిన ఆర్ఆర్ఆర్ తర్వాత గ్లోబల్ వైడ్‌గా మార్కెట్ విపరీతంగా పెరిగింది. ప్రస్తుతం తారక్.. ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో సినిమాను చేస్తున్న విషయం తెలిసిందే. అలాగే, అరవింద సమేత తర్వా మళ్ళీ ఇన్నేళ్ళకి మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో ఓ పవర్ ఫుల్ మూవీ చేయనున్నాడు.

Telangana: తెలంగాణ పై కేంద్రం వరాల జల్లు.. 5 కొత్త రోప్‌వేలకు ఆమోదం!..తెలంగాణSwechaa17 Oct 2026, 10:43 PM

Telangana: తెలంగాణ పై కేంద్రం వరాల జల్లు.. 5 కొత్త రోప్‌వేలకు ఆమోదం!..

తెలంగాణలో పర్యాటక, ఆధ్యాత్మిక, చారిత్రక ప్రాంతాల అభివృద్ధి పై కేంద్ర ప్రభుత్వం తీపి కబురు అందించింది.. నేషనల్ రోప్‌వేస్ డెవలప్‌మెంట్ ప్రోగ్రామ్ కింద రాష్ట్రంలోని ఐదు కొత్త రోప్‌వేల నిర్మాణానికి అధికారిక అనుమతి ఇచ్చింది. ఈ ప్రాజెక్టులకు సుమారు రూ.1,230 కోట్ల వ్యయం అవుతుందని భావిస్తున్నారు.. కేంద్రం నిర్ణయంతో కొండ ప్రాంతాల్లో ప్రయాణం సులభతరం అవడమే కాకుండా.. పర్యాటక రంగం మరింత అభివృద్ధి చెందుతుంది.

Neha Sharma: డీప్‌ఫేక్ క్రియేటర్లకు నేహా శర్మ వార్నింగ్.. వెంటనే డిలీట్ చేయకపోతే జైలుకే!NationalSwechaa17 Oct 2026, 10:17 PM

Neha Sharma: డీప్‌ఫేక్ క్రియేటర్లకు నేహా శర్మ వార్నింగ్.. వెంటనే డిలీట్ చేయకపోతే జైలుకే!

Neha Sharma: సినిమా తారలను తీవ్ర ఆందోళనకు గురిచేస్తున్న ఏఐ (ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్) డీప్‌ఫేక్ వీడియోల బెడద రోజురోజుకూ మరింత శృతిమించుతోంది. ప్రముఖుల ముఖాలను మార్ఫ్ చేస్తూ అసభ్యకర కంటెంట్‌ను నెట్టింట వైరల్ చేస్తున్న ముఠాలపై ప్రముఖ హీరోయిన్ నేహా శర్మ తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు.

ప్రియగోల్డ్‌ బిస్కెట్లలో పశువుల దాణా.. దొడ్ల పాలలో డిటర్జెంట్ : FSSAIతెలంగాణSwechaa17 Oct 2026, 09:48 PM

ప్రియగోల్డ్‌ బిస్కెట్లలో పశువుల దాణా.. దొడ్ల పాలలో డిటర్జెంట్ : FSSAI

FSSAI: మనం మార్కెట్లో పేరున్న బ్రాండ్లు అని నమ్మి కొనే ఆహార పదార్థాల్లో ఎలాంటి కల్తీ జరుగుతోందో తెలిస్తే ఎవరైనా నివ్వెరపోవాల్సిందే. ప్రముఖ కంపెనీలైన ప్రియగోల్డ్ బిస్కెట్లు, దొడ్ల పాలల్లో విస్తుపోయే నిజాలు బయటపడ్డాయి. ప్రియగోల్డ్ బిస్కెట్ల తయారీలో ఏకంగా పశువుల దాణాను వాడుతుండగా, దొడ్ల పాలలో విషపూరిత డిటర్జెంట్ అవశేషాలు ఉన్నట్లు భారత ఆహార భద్రత, ప్రమాణాల ప్రాధికార సంస్థ (FSSAI) గుర్తించింది. రూల్స్ బేఖాతరు చేస్తూ ప్రజల ఆరోగ్యంతో చెలగాటమాడుతున్న సూర్య ఫుడ్ అండ్ ఆగ్రో (ప్రియగోల్డ్), దొడ్ల డెయిరీ, యూఈఐఆర్ ఆర్గానిక్ ఫుడ్స్ సంస్థలపై చట్టపరమైన ప్రాసిక్యూషన్‌ను ప్రారంభించినట్లు అధికారులు వెల్లడించారు.

జాగ్రత్తగా ఉండండి.. పొదుపు పాటించండి- భట్టి విక్రమార్క కీలక విజ్ఞప్తితెలంగాణSwechaa17 Oct 2026, 09:31 PM

జాగ్రత్తగా ఉండండి.. పొదుపు పాటించండి- భట్టి విక్రమార్క కీలక విజ్ఞప్తి

Elnino: తెలంగాణకు ప్రజలకు కీలక విజ్ఞప్తి చేశారు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క. ఎల్ నినో ప్రభావం రాష్ట్రంపై తీవ్రంగా ఉందన్న ఆయన.. ప్రజలంతా నీటిని, విద్యుత్ ను అత్యంత పొదుపుగా వినిగించుకోవాలని విజ్ఞప్తి చేశారు. మారుతున్న వాతావరణ పరిస్థితులకు అనుగుణంగా సహజ వనరులను బాధ్యతాయుతంగా వాడుకోవాలన్నారు. హైదరాబాద్ శిల్పకళా వేదికలో నిర్వహించిన ‘బతుకమ్మ యంగ్ ఫిల్మ్ మేకర్ ఛాలెంజ్ అవార్డ్స్ 2026’ కార్యక్రమానికి భట్టి విక్రమార్క ముఖ్య అతిథిగా హాజరయ్యారు. విజేతలకు పురస్కారాలు అందజేశారు.

Telangana: హీట్ ఎక్కిస్తున్న తెలంగాణ రాజకీయాలు.. నెక్స్ట్ సీఎం ఆయనేనా?? సర్వేలో సంచలనాలు!!తెలంగాణSwechaa17 Oct 2026, 09:06 PM

Telangana: హీట్ ఎక్కిస్తున్న తెలంగాణ రాజకీయాలు.. నెక్స్ట్ సీఎం ఆయనేనా?? సర్వేలో సంచలనాలు!!

రాజకీయాల్లో శాశ్వత మిత్రులు ఉండరు, శాశ్వత శత్రువులు ఉండరు.. అంతకంటే ముఖ్యంగా, అధికారం ఎవరికీ శాశ్వతం కాదు.. ఒకనాడు గల్లీ నుంచి ఢిల్లీ దాకా హవా నడిపించుకున్న ఎందరో నాయకులు.. కాలక్రమంలో తమ ఉనికిని కోల్పోయారు.. ఇక ఒక రాష్ట్రానికి ముఖ్యమంత్రి అంటే ఆ రాష్ట్ర ప్రజల ఆశలు, ఆకాంక్షలకు ప్రతిరూపం. కానీ నేటి రాజకీయాలు ఇందుకు భిన్నంగా ఉన్నాయనే ఆరోపణలు ఉన్నాయి.. అయితే బీఆర్ఎస్ పై అసంతృప్తితో కాంగ్రెస్ కు అధికారాన్ని కట్టబెట్టిన ప్రజలు.. ఇప్పుడు మళ్ళీ బీఆర్ఎస్ కు పట్టం కట్టాలనే ఆలోచనలో ఉన్నట్టు ఆర్ఆర్ అనే ఒక ప్రముఖ సంస్థ నిర్వహించిన సర్వేలో తెలినట్టు కథనాలు వస్తున్నాయి..

తెలంగాణలో 315 మండలాల్లో కరువు.. వెంటనే సాయం చేయండితెలంగాణSwechaa17 Oct 2026, 08:56 PM

తెలంగాణలో 315 మండలాల్లో కరువు.. వెంటనే సాయం చేయండి

Drought: తెలంగాణ కరువు పరిస్థితులను కేంద్రం దృష్టికి తీసుకెళ్లారు రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు. రాష్ట్రంలో 315 మండలాల్లో కరువు పరిస్థితులు ఉన్నాయని, వ్యవసాయ రంగంపై తీవ్రమైన ప్రభావం పడుతోందని తెలిపారు. రాష్ట్రానికి తక్షణ సాయం చేయాలని కేంద్రాన్ని కోరారు. రైతులకు ఉపశమనం కల్పించేందుకు సూక్ష్మ సేద్యానికి, మధ్యంతర పంటల విత్తనాల పంపిణీకి వెంటనే ఆర్థిక సాయం అందించాలని విజ్ఞప్తి చేశారు. ఖేత్‌ బచావో అభియాన్‌పై కేంద్రమంత్రి శివరాజ్‌సింగ్‌ నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్‌ లో మంత్రి తుమ్మల పాల్గొన్నారు.

Tollywood: హీరోగా నటిస్తే..మ్యూజిక్ డైరెక్టర్‌గా సినిమాలివ్వరా?సినిమాSwechaa17 Oct 2026, 08:25 PM

Tollywood: హీరోగా నటిస్తే..మ్యూజిక్ డైరెక్టర్‌గా సినిమాలివ్వరా?

Tollywood: హీరో మాత్రమే సినిమాలు చెయ్యాలా..దర్శకుడు హీరో కాకూడదా? సంగీత దర్శకుడు హీరో కాకూడదా? ఈ ప్రశ్న తలెత్తితే..నిజమే కదా..టాలెంట్ ఉంటే ఎవరు ఎలాంటి విభాగంలోనైనా సత్తా చాటొచ్చు. కానీ, నటనపై ఆసక్తి ఉండటంతో సక్సెస్ ఫుల్‌గా సాగుతున్న విభాగం నుంచి అవకాశాలను కోల్పోవాల్సి వస్తుంది. ఇది, ఎంత వరకూ కరెక్ట్..సినీ ప్రముఖులు ఆలోచించాల్సిన అవసరం ఉంది.

Dasara Shopping Dull: దసరా వేళ వెలవెలబోతున్న మార్కెట్లు.. జనాల జేబులకు ఏమైంది?తెలంగాణSwechaa17 Oct 2026, 07:57 PM

Dasara Shopping Dull: దసరా వేళ వెలవెలబోతున్న మార్కెట్లు.. జనాల జేబులకు ఏమైంది?

Dasara Shopping Dull: పండుగ వచ్చిందంటే చాలు బట్టల దుకాణాలు, ఎలక్ట్రానిక్ షోరూమ్‌లు, బైక్, కార్ల షోరూమ్‌లు కిటకిటలాడాలి. ముఖ్యంగా తెలంగాణలో అతిపెద్ద పండుగైన దసరా సమయంలో ప్రతి కుటుంబం షాపింగ్‌లతో సందడిగా కనిపించేది. కానీ ఈసారి సీన్ పూర్తిగా రివర్స్ అయింది. ఎన్నడూ లేనంతగా మార్కెట్లు వెలవెలబోతున్నాయి. షాపుల్లో బ్రహ్మాండమైన ఆఫర్లు, భారీ డిస్కౌంట్లు, కలర్‌ఫుల్ డెకరేషన్లు పెట్టి పిలుస్తున్నా జనం మాత్రం కొనుగోళ్లు చేయడానికి జంకుతున్నారు. చేతిలో పైసలు లేక, బడ్జెట్ అదుపు తప్పుతుందన్న భయంతో సామాన్యుడి నుంచి మధ్యతరగతి వరకు ప్రతి ఒక్కరూ ఆచితూచి అడుగులేస్తున్నారు.

TBJP: ఎమ్మెల్సీ బరిలో బీజేపీ బిగ్ ట్విస్ట్.. 25 మంది ఆశలు ఆవిరి!తెలంగాణSwechaa17 Oct 2026, 07:50 PM

TBJP: ఎమ్మెల్సీ బరిలో బీజేపీ బిగ్ ట్విస్ట్.. 25 మంది ఆశలు ఆవిరి!

TBJP: తెలంగాణలో త్వరలో జరగబోయే రెండు గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ స్థానాల ఎన్నికలు రాజకీయంగా తీవ్ర ఉత్కంఠను రేపుతున్నాయి. ఉమ్మడి హైదరాబాద్–రంగారెడ్డి–మహబూబ్‌నగర్ నియోజకవర్గంతో పాటు ఉమ్మడి నల్గొండ–వరంగల్–ఖమ్మం స్థానాలకు నగారా మోగనుంది. ఈ రెండు స్థానాల పరిధిలో ఏకంగా 60కి పైగా అసెంబ్లీ సెగ్మెంట్లు ఉండటంతో, ఇక్కడ పట్టు సాధిస్తే రాబోయే సార్వత్రిక ఎన్నికల్లో తిరుగుండదని భావించిన కమలదళం వీటిని అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. అయితే క్షేత్రస్థాయిలో పార్టీకి సానుకూల పవనాలు ఉన్నాయన్న ప్రచారంతో టికెట్ కోసం పోటీ పడ్డ దాదాపు 25 మందికి పైగా ఆశావహులకు బీజేపీ హైకమాండ్ దిమ్మతిరిగే షాక్ ఇచ్చినట్లు తెలుస్తోంది.

TG: తెలంగాణ ప్రజలకు బతుకమ్మ శుభాకాంక్షలు : సీఎం రేవంత్తెలంగాణSwechaa17 Oct 2026, 07:31 PM

TG: తెలంగాణ ప్రజలకు బతుకమ్మ శుభాకాంక్షలు : సీఎం రేవంత్

TG: సద్దుల బతుకమ్మ పండగ వేళ తెలంగాణ ప్రజలకు, ముఖ్యంగా రాష్ట్రంలోని ఆడబిడ్డలందరికీ ముఖ్యమంత్రి ఎ.రేవంత్ రెడ్డి మనస్ఫూర్తిగా శుభాకాంక్షలు చెప్పారు. మన తెలంగాణ సంస్కృతిని, సంప్రదాయాలను ప్రపంచానికి చాటిచెప్పే గొప్ప పండుగ బతుకమ్మ అని, ప్రకృతిని ప్రేమిస్తూ ఆడపడుచులను గౌరవించుకునే అద్భుతమైన వేడుక ఇదని కొనియాడారు.చెట్లు, చేమలు, పూలను పూజించే ఇంతటి గొప్ప సంస్కృతి మన తెలంగాణకే సొంతమని సీఎం అన్నారు. రంగురంగుల పూలతో పేర్చిన బతుకమ్మల చుట్టూ చేరి ఆడబిడ్డలంతా ఆటపాటలతో సద్దుల బతుకమ్మ సంబురాలను ఘనంగా జరుపుకోవాలని ఆకాంక్షించారు. ఈ పూల పండుగ ప్రతి ఇంటా సంతోషాల పూలవాన కురిపించాలని, అందరి ఇళ్లలో సిరిసంపదలు, సుఖశాంతులు నిండాలని, మన సంస్కృతి తరతరాలు ఇలాగే వర్ధిల్లాలని మనసారా కోరుకున్నారు.

US: అమెరికాలో భారతీయుల కొలువు ఊడినట్లేనా? 540 రోజుల వర్క్ పర్మిట్ రూల్ క్లోజ్!NationalSwechaa17 Oct 2026, 07:27 PM

US: అమెరికాలో భారతీయుల కొలువు ఊడినట్లేనా? 540 రోజుల వర్క్ పర్మిట్ రూల్ క్లోజ్!

US: అగ్రరాజ్యం అమెరికాలో ఉద్యోగాలు చేసుకుంటున్న లక్షలాది మంది భారతీయులకు ట్రంప్ సర్కార్ భారీ షాకిచ్చింది. వర్క్ పర్మిట్ రెన్యువల్ కోసం ఎదురుచూసే టైంలో ఉద్యోగం పోకుండా అండగా నిలిచే 540 రోజుల ఆటోమేటిక్ పొడిగింపు రూల్స్‌ని యూఎస్ సిటిజెన్‌షిప్ అండ్ ఇమ్మిగ్రేషన్ సర్వీసెస్ అధికారికంగా ఎత్తేసింది. గతంలో తాత్కాలిక ఊరటగా తీసుకొచ్చిన ఈ నిబంధనను ఇప్పుడు శాశ్వతంగా రద్దు చేస్తూ తుది నిర్ణయం తీసుకోవడంతో ప్రవాసుల గుండెల్లో రైళ్లు పరిగెడుతున్నాయి.ఈ తాజా దెబ్బతో ముఖ్యంగా హెచ్-4 వీసాలపై ఉంటూ ఉద్యోగాలు చేస్తున్న భారతీయ జీవిత భాగస్వాములు తీవ్ర సంక్షోభంలో పడనున్నారు. హెచ్-1బీ వీసాదారుల భార్యలు లేదా భర్తలు అక్కడి కంపెనీల్లో పని చేయడానికి ఈ వర్క్ పర్మిట్ మాత్రమే ఆధారం. గతంలో రెన్యువల్ దరఖాస్తులు పెండింగ్‌లో ఉన్నా 540 రోజుల పాటు ఉద్యోగం చేసుకునే వెసులుబాటు ఉండేది.

మూడు దశల్లో సమగ్ర భూసర్వే- మంత్రి పొంగులేటితెలంగాణSwechaa17 Oct 2026, 07:21 PM

మూడు దశల్లో సమగ్ర భూసర్వే- మంత్రి పొంగులేటి

Land Resurvey: రాష్ట్రంలో భూ సమస్యలు, భూ వివాదాలకు శాశ్వత పరిష్కారం చూపుతూ ప్రతి భూకమతానికి కచ్చితమైన హద్దులు నిర్ణయించి, భూ యాజమాన్య హక్కులపై స్పష్టత కల్పించడమే లక్ష్యంగా చేపట్టిన సమగ్ర భూ రీసర్వేను మూడు దశల్లో పూర్తి చేస్తామని రెవెన్యూ, గృహ నిర్మాణ, సమాచార పౌర సంబంధాల శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి వెల్లడించారు.

ఇప్పటికే 285 రెవెన్యూ గ్రామాల్లో సర్వే పూర్తి చేసి భూ యజమానుల నుంచి అభ్యంతరాల స్వీకరణకు నోటీసులు జారీ చేసినట్లు తెలిపారు. సర్వే ప్రక్రియను మరింత వేగవంతం చేసేందుకు ఇప్ప‌టికే ఉన్న 411 రోవ‌ర్ల‌కు అద‌నంగా మరో 400 రోవర్ల కొనుగోలుకు టెండర్లు ఖరారయ్యాయని పేర్కొన్నారు. భూ సర్వేలో ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా, వారి సంతృప్తే ప్రాధాన్యంగా పారదర్శకంగా వ్యవహరించాలని అధికారులకు స్పష్టం చేశారు.

Neha Bhora: ఢిల్లీని వణికిస్తున్న 29 ఏళ్ల రీసెర్చ్ స్కాలర్.. ఎవరీ నేహా బోరా?NationalSwechaa17 Oct 2026, 07:02 PM

Neha Bhora: ఢిల్లీని వణికిస్తున్న 29 ఏళ్ల రీసెర్చ్ స్కాలర్.. ఎవరీ నేహా బోరా?

Neha Bhora: దేశ రాజధాని ఢిల్లీ వేదికగా జరుగుతున్న ఆందోళనల్లో ఇప్పుడు ఒకే ఒక్క పేరు మారుమోగిపోతోంది. ఎన్నికల సంఘం తీరుపై, ఓటర్ల జాబితా సవరణలోని అవకతవకలపై కాక్రోచ్ జనతా పార్టీ (సీజేపీ) జంతర్ మంతర్ వద్ద చేపట్టిన నిరసనల తర్వాత దేశం మొత్తం దృష్టిని ఆకర్షించిన యువ ఉద్యమ నేత నేహా బోరా. రాహుల్ గాంధీ లాంటి అగ్ర నాయకులు సైతం ఆమెను ముందుపెట్టి ఆందోళనలు చేసే స్థాయికి ఆమె క్రేజ్ పెరిగిపోయింది. జంతర్ మంతర్ నుంచి పోలీస్ కస్టడీ వరకు.. పోలీసులు పదే పదే అదుపులోకి తీసుకుంటున్నా ఏమాత్రం బెదరకుండా నినదిస్తున్న ఈ 29 ఏళ్ల విద్యార్థి నాయకురాలి వీడియోలు ఇప్పుడు ఇంటర్నెట్‌ను షేక్ చేస్తున్నాయి.

Nag-Chiru: కథ కోసం వెతుకుతున్నారా?సినిమాSwechaa17 Oct 2026, 06:40 PM

Nag-Chiru: కథ కోసం వెతుకుతున్నారా?

Nag-Chiru: మన సీనియర్ స్టార్ హీరోలు కూడా ఇప్పుడు కలిసి మల్టీస్టారర్ సినిమాను చేసేందుకు ఆసక్తి చూపిస్తున్నారు. గతంలో మన స్టార్స్ ఇద్దరు కలిసి నటించిన సినిమాలు ఒకేరోజు బక్సాఫీస్ వద్ద రిలీజైతే గొడవలు, కొట్లాటలు జరిగేవి. మా హీరో గొప్ప, మా హీరో గొప్ప అని.. నానా రచ్చా చేసేవాళ్ళు. కానీ, ఇప్పుడు అలాంటి వాటికి స్థానం లేదు. అందుకే, సీనియర్స్ కూడా కలిసి సినిమాకి గ్రీన్ సిగ్నల్ ఇస్తున్నారు. తాజాగా, నాగ్ కూడా చిరుతో సినిమా చేయడానికి రెడీ అని క్లారిటీ ఇచ్చాడు.

తెలంగాణ హక్కులకు మరణశాసనం.. చంద్రబాబు, రేవంత్‌ పై హరీశ్‌రావు ఆగ్రహం!తెలంగాణSwechaa17 Oct 2026, 06:38 PM

తెలంగాణ హక్కులకు మరణశాసనం.. చంద్రబాబు, రేవంత్‌ పై హరీశ్‌రావు ఆగ్రహం!

ఏపీ సీఎం చంద్రబాబు తెలంగాణ హక్కులకు మరణ శాసనం రాస్తున్నారని బీఆర్ఎస్ సీనియర్ నేత, మాజీ మంత్రి హరీష్ రావు సంచలన ఆరోపణలు చేశారు. ఆయన శనివారం మీడియాతో మాట్లాడుతూ సంచలన ఆరోపణలు చేశారు. రేవంత్ రెడ్డి మద్దతుతో చంద్రబాబు గోదావరి నదిని కబళించేందుకు కుట్ర పన్నుతున్నారంటూ తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. గోదావరి-కావేరి నదుల అనుసంధాన ప్రాజెక్టును సమ్మక్క సాగర్ (తుపాకులగూడెం) బదులుగా 'పోలవరం' వద్దే చేపట్టాలని కోరుతూ చంద్రబాబు కేంద్ర ప్రభుత్వానికి లేఖ రాశారని, దీనికి రేవంత్ రెడ్డి సర్కార్ లోపాయికారి మద్దతు ఇస్తోందని ఆయన ఆరోపించారు.

కర్ణాటక ప్రభుత్వంతో చంద్రబాబు రహస్య ఒప్పందాలుతెలంగాణSwechaa17 Oct 2026, 06:35 PM

కర్ణాటక ప్రభుత్వంతో చంద్రబాబు రహస్య ఒప్పందాలు

ఏపీ సీఎం చంద్రబాబు కర్ణాటక సీఎం డీకే శివకుమార్ తో రహస్య ఒప్పందం కుదుర్చుకున్నారని మాజీ మంత్రి, బీఆర్ఎస్ఎల్పీ డిప్యూటీ ఫ్లోర్ లీడర్ హరీశ్ రావు ఆరోపించారు. ఆయన శనివారం మీడియా సమావేశంలో మాట్లాడుతూ.. ‘మేము దిగువన పోలవరం వద్ద గోదావరి నీళ్లను మళ్లించుకుంటాం.. మీరు ఎగువన ఆల్మట్టి డ్యామ్‌లో 16 టీఎంసీల కృష్ణా నీళ్లను నిలుపుకోండి, కానీ పోలవరం లింకు ప్రాజెక్టుకు మాత్రం మద్దతు ఇవ్వండి’ అంటూ చంద్రబాబు కర్ణాటక నేతలకు ఆఫర్ ఇచ్చారని మండిపడ్డారు. దీనివల్ల శ్రీశైలం, నాగార్జునసాగర్‌లకు నీటి ప్రవాహం తగ్గి, ఉమ్మడి మహబూబ్‌నగర్ (పాలమూరు) జిల్లా సాగునీటి ప్రాజెక్టులకు, తెలంగాణ తాగునీటికి తీవ్ర విఘాతం కలుగుతుందని ఆందోళన వ్యక్తం చేశారు.

నిరుద్యోగ యువతను రేవంత్ సర్కార్ మోసం చేసిందితెలంగాణSwechaa17 Oct 2026, 06:30 PM

నిరుద్యోగ యువతను రేవంత్ సర్కార్ మోసం చేసింది

Harish Rao: కాంగ్రెస్ ప్రభుత్వంపై మాజీ మంత్రి హరీశ్ రావు మండిపడ్డారు. నిరుద్యోగ యువతను రేవంత్ సర్కార్ మోసం చేసిందని ఆరోపించారు. రాష్ట్రంలో 25వేల పోలీసు ఉద్యోగాలు ఖాళీగా ఉంటే.. కేవలం 7వేల పోస్టులకే నోటిఫికేషన్ ఇవ్వడం నిరుద్యోగ యువతను వంచించడమే అని మండిపడ్డారు. శనివారం పోలీస్ ఉద్యోగ అభ్యర్థులు, నిరుద్యోగులు హరీశ్ రావుని ఆయన నివాసంలో కలిసి వినతిపత్రం అందజేశారు.

ఉద్యోగాల జాతర అంటూ ఓట్లు వేయించుకున్నారు

కాంగ్రెస్ ప్రభుత్వం తమను నిలువునా ముంచిందని, తమ ఆశలపై నీళ్లు చల్లిందని పోలీసు ఉద్యోగాల కోసం సిద్ధమవుతున్న లక్షలాది మంది నిరుద్యోగ యువత ఆవేదన వ్యక్తం చేస్తుంటే, ఈ ప్రభుత్వానికి కనీసం చలనం లేకపోవడం సిగ్గుచేటు అని హరీశ్ రావు ధ్వజమెత్తారు. ఎన్నికలకు ముందు ఉద్యోగాల జాతర అంటూ నిరుద్యోగుల్లో ఆశలు రేపి, ఓట్లు వేయించుకుని, ఇప్పుడు నామమాత్రంగా పోస్టులు ప్రకటించడం అంటే యువతకు ద్రోహం చేయడమే అని వ్యాఖ్యానించారు.

NTR-Allu Arjun: ఈ కాంబినేషన్‌లో సినిమా చాలా కష్టం..!సినిమాSwechaa17 Oct 2026, 05:48 PM

NTR-Allu Arjun: ఈ కాంబినేషన్‌లో సినిమా చాలా కష్టం..!

NTR-Allu Arjun: బాలీవుడ్ సినిమా ఇండస్ట్రీలో మల్టీస్టారర్ సినిమాలు ఎన్నో ఏళ్ళుగా వస్తున్నాయి. భారీ విజయాలను అందుకుంటున్నాయి. అయితే, బాహుబలి తర్వాత అలాంటి భారీ మల్టీస్టారర్ సినిమాలు మన సౌత్ నుంచే వస్తున్నాయి..భారీ సక్సెస్‌ను సాధిస్తున్నాయి. ఈ నేపథ్యంలో, ఇప్పుడు ఓ క్రేజీ కాంబినేషన్‌లో మల్టీస్టారర్ చిత్రానికి ప్లాన్ చేస్తున్నట్టుగా అటు తమిళం ఇటు తెలుగు సినీ పరిశ్రమలలో వార్తలు వస్తున్నాయి. ఆ కాంబినేషనే మాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్ –ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ లతో చేసే మల్టీస్టారర్.

గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికలు.. గెలుపే లక్ష్యంగా కాంగ్రెస్ కసరత్తుతెలంగాణSwechaa17 Oct 2026, 05:32 PM

గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికలు.. గెలుపే లక్ష్యంగా కాంగ్రెస్ కసరత్తు

Mlc Elections: గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికలను అధికార పార్టీ ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. ఈ ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా వ్యూహాలు రచిస్తోంది. ఇందులో భాగంగా పలువురు నాయకులను కలిసి మద్దతు కోరుతోంది. ఇప్పటికే సీపీఎం నేతలను కలిసిన కాంగ్రెస్ నాయకులు.. రాష్ట్రంలో త్వరలో జరగనున్న గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థులకు మద్దతు ఇవ్వాలని కోరారు.

తాజాగా తెలంగాణ జనసమితి అధ్యక్షుడు కోదాండరామ్ తో టీపీసీసీ చీఫ్ మహేశ్ కుమార్ గౌడ్ నేతృత్వంలో కాంగ్రెస్ నేతలు భేటీ అయ్యారు. గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థులకు మద్దతివ్వాలని కోదండరామ్ ను కోరారు. కాంగ్రెస్ అభ్యర్థనపై కోదండరామ్ సానుకూలంగా స్పందించినట్లు తెలుస్తోంది. పార్టీలో చర్చించిన తర్వాత తమ నిర్ణయాన్ని వెల్లడిస్తామని టీజేఎస్ అధ్యక్షుడు కోదండరామ్ తెలిపారు.

చిత్రం లేదు
తెలంగాణSwechaa17 Oct 2026, 05:24 PM

TG: జనంలోకి మాజీ మావోయిస్టులు.. ప్రజా పోరాటాల్లో ‘జన తెలంగాణ’!

TG: తెలంగాణ ఉద్యమ ఆశలు, ఏళ్ల తరబడి సాగిన ప్రజాపోరాటాల ఆలోచనలే పునాదిగా రాష్ట్ర రాజకీయాల్లోకి సరికొత్త గొంతు రాబోతోంది. దాదాపు యాభై ఏళ్ల పాటు విప్లవ బాటలో నడిచి, ఆ తర్వాత సాధారణ జీవితంలోకి వచ్చిన మాజీ మావోయిస్టులే కీలకంగా నిలబడి ‘జన తెలంగాణ పార్టీ’ పేరిట ప్రజల్లోకి అడుగుపెడుతున్నారు. తుపాకీ వదిలేసి ప్రజాస్వామ్య దారిని ఎంచుకున్న వీరు, ఇప్పుడు నేరుగా జనం సమస్యలపై మైదానంలోకి దిగి కొట్లాడటానికి నడుం కట్టారు.ఈ కొత్త ప్రయాణంలో విప్లవోద్యమాల్లో పనిచేసిన సీనియర్లు లంకా పాపిరెడ్డి (లచ్చన్న), న్యాయవాది బల్ల రవీంద్రనాథ్, గురిజాల రవీందర్‌రావు ముందంజలో ఉన్నారు. వీరితో పాటు కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీలకు చెందిన అభ్యుదయవాదులు, ప్రజాహక్కుల కోసం పనిచేసే కార్యకర్తలు చేయి కలిపారు. అయితే, ఆపరేషన్ కగార్ తర్వాత బయటకొచ్చిన దేవ్‌జీ-సంగ్రామ్ వర్గం గానీ, సోనూ-ఆశన్న వర్గం గానీ ఈ పార్టీలో చేరడం లేదని స్పష్టమైంది.

Vidya Balan: డర్టీలైఫ్ నుంచి డర్టీ పిక్చర్ వరకూ బాలన్‌కి ఎన్నో అవమానాలు!సినిమాSwechaa17 Oct 2026, 05:18 PM

Vidya Balan: డర్టీలైఫ్ నుంచి డర్టీ పిక్చర్ వరకూ బాలన్‌కి ఎన్నో అవమానాలు!

Vidya Balan: హీరోయిన్ అంటే అందరూ ఏమనుకుంటారంటే..లగ్జరీ లైఫ్..ఖరీదైన కార్లు..బంగళాలు..ఇలా ఎన్నో ఊహించుకుంటారు. కానీ, కొందరి జీవితం ఎంత దారుణంగా ఉంటుందో మాటల్లో చెప్పలేము. చేతికందిన ముద్ద నోటి వరకూ వచ్చి పడిపోయినట్టుగా వచ్చిన అవకాశం వచ్చినట్టే వచ్చి చేజారిపోతుంది. అలాంటి, జీవితాన్ని అనుభవించింది బాలీవుడ్ నటి విద్యాబాలన్. ఎన్నో అవమానాల మధ్య స్టార్ స్టేటస్ దక్కించుకుంది..ఇప్పుడు అగ్ర కథానాయికల్లో ఒకతిగా నిలబడింది.

పర్యావరణ పరిరక్షణకు ప్రతి ఒక్కరు బాధ్యత తీసుకోవాలి- జోగినపల్లి సంతోష్తెలంగాణSwechaa17 Oct 2026, 04:30 PM

పర్యావరణ పరిరక్షణకు ప్రతి ఒక్కరు బాధ్యత తీసుకోవాలి- జోగినపల్లి సంతోష్

Trees: హనుమకొండలోని పద్మాక్షి గుట్ట వద్ద గ్రీన్ ఇండియా ఛాలెంజ్‌లో భాగంగా ఓరుగల్లు వైల్డ్ లైఫ్ సొసైటీ, వన సేవ సొసైటీ వారి ఆధ్వర్యంలో మొక్కలు నాటే కార్యక్రమం నిర్వహించారు. గ్రీన్ ఇండియా ఛాలెంజ్ వ్యవస్థాపకుడు, మాజీ రాజ్యసభ సభ్యుడు జోగినపల్లి సంతోష్, ప్రభుత్వ మాజీ చీఫ్ విప్, మాజీ శాసనసభ్యుడు దాస్యం వినయ్ భాస్కర్, శాసనమండలి సభ్యుడు పోచంపల్లి శ్రీనివాస్ రెడ్డి ఈ కార్యక్రమంలో పాల్గొని మొక్కలు నాటారు.

ప్రకృతి పరిరక్షణ, పర్యావరణ సమతుల్యత, పచ్చదనం పెంపొందించడం వంటి అంశాలపై ప్రాధాన్యతను నాయకులు చాటి చెప్పారు. నేటి కాలంలో పెరుగుతున్న కాలుష్యం, వాతావరణ మార్పులు, పచ్చని చెట్ల నరికివేత వంటి సమస్యలను అధిగమించాలంటే ప్రతి ఒక్కరు మొక్కలు నాటడమే కాకుండా, వాటిని సంరక్షించే బాధ్యతను కూడా స్వీకరించాలని పిలుపునిచ్చారు.

TSNPDCL: దేశంలోనే ఫస్ట్ టైమ్.. విద్యుత్ సేవల్లో ఎన్పీడీసీఎల్ సంచలనం!తెలంగాణSwechaa17 Oct 2026, 04:25 PM

TSNPDCL: దేశంలోనే ఫస్ట్ టైమ్.. విద్యుత్ సేవల్లో ఎన్పీడీసీఎల్ సంచలనం!

TSNPDCL, Telangana, Northern Power Distribution Company of Telangana, Artificial Intelligence,33 కేవీ, 11 కేవీ లైన్లలో 'ఫాల్ట్ ప్యాసేజ్ ఇండికేటర్లను' అమర్చి, ఏఐ సాంకేతికతతో కంట్రోల్ రూమ్‌కు అనుసంధానించారు. దీంతో ఎక్కడ లైన్ బ్రేక్ డౌన్ అయినా క్షణాల వ్యవధిలోనే కంట్రోల్ రూమ్‌కు సమాచారం చేరిపోతుంది. సిబ్బంది నేరుగా అదే ప్రాంతానికి వెళ్లి నిమిషాల వ్యవధిలోనే సరఫరాను పునరుద్ధరిస్తున్నారు.వినియోగదారులు, రైతుల కోసం ప్రత్యేకంగా ‘కన్స్యూమర్ ఏఐ వాట్సాప్ బాట్’ సేవలను ప్రారంభించారు. కరెంట్ పోయినా లేదా బిల్లుల్లో తేడాలు వచ్చినా.. వినియోగదారుడు వాట్సాప్‌లో మెసేజ్ పంపితే చాలు.

Supreme Court: పెన్ను పట్టుకున్న ప్రతి ఒక్కరూ జర్నలిస్టులేనా : సుప్రీంకోర్టుNationalSwechaa17 Oct 2026, 03:41 PM

Supreme Court: పెన్ను పట్టుకున్న ప్రతి ఒక్కరూ జర్నలిస్టులేనా : సుప్రీంకోర్టు

Supreme Court: చేతిలో పెన్ను, కాగితం ఉంటే చాలు.. సోషల్ మీడియాలో ఓ ఖాతా తెరిచి ‘మేమూ జర్నలిస్టులమే’ అంటూ చెలామణి అయ్యే ధోరణిపై దేశ అత్యున్నత న్యాయస్థానం తీవ్రస్థాయిలో విరుచుకుపడింది. పెన్ను పట్టుకుని నాలుగు ముక్కలు రాసిన ప్రతి ఒక్కరూ తమను తాము జర్నలిస్టులుగా ప్రకటించుకుంటూ పోతే అది సమాజానికే పెను ముప్పుగా మారుతుందని భారత ప్రధాన న్యాయమూర్తి (సీజేఐ) జస్టిస్ సూర్యకాంత్ అత్యంత ఘాటుగా వ్యాఖ్యానించారు. ఇది కేవలం మీడియా రంగానికే కాకుండా, యావత్ ప్రజాస్వామ్య వ్యవస్థకే కొత్త సమస్యలను తెచ్చిపెడుతుందని హెచ్చరించారు.ధర్మాసనంలోని మరో న్యాయమూర్తి జస్టిస్ జోయ్‌మాల్యా బాగ్చి ఈ అంశంపై మరింత లోతైన ప్రశ్నను లేవనెత్తారు. రాజ్యాంగంలోని ఆర్టికల్ 19 పౌరులందరికీ భావ ప్రకటన స్వేచ్ఛను ప్రసాదించిన మాట వాస్తవమే. అయితే ఆ స్వేచ్ఛను అడ్డం పెట్టుకుని, సమాజంలో కనిపించిన ప్రతి ఒక్కరూ తమను తాము జర్నలిస్టులుగా చెప్పుకోవడానికి రాజ్యాంగం అనుమతిస్తోందా? అన్న విషయాన్ని సమగ్రంగా పరిశీలించాల్సిన సమయం ఆసన్నమైందని ఆయన స్పష్టం చేశారు. బాధ్యత లేని రాతలు, హద్దులు దాటిన ప్రవర్తన అసలైన జర్నలిజం విలువలను సైతం మంటగలుపుతున్నాయని న్యాయస్థానం పరోక్షంగా అభిప్రాయపడింది.